Darwaja Archives - https://navatelangana.com/category/darwaja/ Sun, 13 Apr 2025 17:47:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Darwaja Archives - https://navatelangana.com/category/darwaja/ 32 32 బతుకును పూయించిన కథలు.. https://navatelangana.com/stories-of-batuku/ Sun, 13 Apr 2025 17:47:12 +0000 https://navatelangana.com/?p=545499 Stories that enrich life..‘బాహుదా’ కథల గురించి మాట్లాడాలి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ముందుగా బూదూరి సుదర్శన్‌ రచన శైలి గురించి మాట్లాడుకోవాలి. ఈ కథలు చదువుతున్నంతసేపు మనం చదువుతున్నట్టు గాక ఆ పాత్రలతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మనం కూడా పూర్తిగా రాయలసీమలో పుట్టి పెరిగినోళ్ల లాగానే అక్కడ వాళ్ళం అయిపోతాం. ఈ కథలు చదివాక పూర్తిగా మీకు కూడా రాయలసీమ యాస అలవాటు అయిపోతుంది. అంతలా ఇందులోని పాత్రలన్నీ మనలో మమేకమైపోతాయి. రాయలసీమ అనగానే ఫ్యాక్షన్‌, మీసాలు తిప్పడం, తొడలు కొట్టుకోవడమే కాకుండా అక్కడి లోతైన జీవితాలను, అక్కడ ఇంకిపోతున్న బాహుద నది లాగానే దాని చుట్టుపక్కల్లో ఇంకిపోతున్న బతుకులను మనకి పరిచయం చేస్తాడు రచయిత.
ఈ కథలతో మనకు సాహిత్యాన్ని అందించడమే కాకుండా సమాజంలోని రుగ్మతలను వేలెత్తి చూపుతాడు. సామాజిక స్పహని తట్టి లేపుతాడు. వీటిని కథలుగా మనం చూడటం కంటే ఒక మనిషి జీవితంలో పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు సాగే ప్రయాణం అనుకోవచ్చు. పుట్టుక నుండి చావు దాకా ఎదుర్కొనే ప్రతి అనుభవాన్ని ఒక్కచోట పేర్చినట్టు అనిపిస్తుంది.
హద్దులు అనేటివి తెలియని వయసులో స్నేహానికి కూడా గీతలు గీసే పెద్దవాళ్ల మధ్య మురారిగాని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. మనిషికి మనిషికి మధ్య కులం అనే గీతలను గీసుకొని తేడాలతో బతుకుతున్న ఈ సమాజంలో చదువు ఒక్కటే సమానత్వాన్ని తీసుకొస్తుంది అని మురారిగాని కథతో ముచ్చటించాడు రచయిత.
ఆచారాలు, సాంప్రదాయాలనుకుంటూ అభం శుభం తెలియని వయసులో ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా ఒకరి జీవితాన్ని మరొకరి జీవితంతో ముడి పెట్టడానికి బాల్య వివాహం అని పేరు పెట్టడాన్ని గోపిగాన్ని కలచివేసిన తీరు, వానిలో ప్రశ్నలు వర్షాన్ని కురిపించాడు రచయిత. ఇది చదువుతున్నంతసేపు పాఠకుల్లో కూడా ప్రశ్నలు మొలకెత్తడం సహజమే. అంత సహజంగా రచయిత కథలను ముందుకు తీసుకుపోయాడు.
బాల్య వివాహానికి బందీ అయిపోయి జీవితంలో తనకంటూ ఉన్న ఆశలను ఆశయాలను తనలోనే దాచేసుకుని, ఎలాగైనా మధ్యలో వదిలేసిన తన చదువును కొనసాగించాలని, ఫెయిల్‌ అయిన హిందీ పరీక్షను పాస్‌ అవ్వాలని బిందు చేసిన కషి, కేవలం చదువులోనే కాదు తన జీవితంలోనూ ఫెయిల్‌ అవ్వకుండా తనకొచ్చిన సమస్యను ఎదుర్కొని తన జీవిత పరీక్షను కూడా పాస్‌ అవుతుంది.
పంచాయితీలు, రచ్చబండల పేరుతో తెల్ల గడ్డం కప్పుకున్న పెద్దమనుషులు చేసే రచ్చ అంతా కాదు. వాళ్ళు ఇచ్చే తీర్పులన్నీ న్యాయానికి ఆమడ దూరంలో ఉంటాయి. అప్పట్లో పంచాయితీ తీర్పులంటే పెద్దకులపోల్ల పెంపుడు జంతువులె..!! ఎటు జెపుతే గటే పోతుండే తీర్పు. న్యాయాన్యాయాలకు చోటెక్కడిది ఇగ. ఎవరు ఎక్కువ దుడ్డు (పైసలు) ఇస్తే న్యాయం అటుంటది. రచ్చబండ ఎనుక ఎవడు కడుపు నింపితే వాడే నిర్దోషి. గిదే పంచాయితీ అంటే. కారణం ఎక్కువమందికి చదువు లేకపోవడం. అందరికీ విద్య అందినప్పుడే సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాలకు మనిషి స్పందించగలడు. వ్యతిరేకించగలడు. తనకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించగలడు. ఈ పెద్ద మనుషుల కథలో అలాంటి అడ్డుగీతల్లో దాయబడ్డ మురారి గాడు చదువుతో గీతలను జరుపుకుంటూ వచ్చిన తీరు పాఠకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.
చివరి కథల్లో మనిషి జ్ఞాపకాలకు మించిన ఆస్తి లేదని చెప్పడం, చనిపోయాక తీసుకుపోవడానికి ఏమీ ఉండదు మనం చేసిన మంచి తప్ప అని చెప్పిన తీరు పాఠకులని సైతం జీవితం మొత్తం చూసేశామా..? అనే సందిగ్ధంలోకి తీసుకెళ్తాయి. జీవితపు అనుభవాల అనుభూతులను అందిస్తాయి.
ఇవి నిజమైన బతుకు కథలు. ఇంకిన కన్నీళ్ళతో బతుకును తడుపుకున్న కథలు. పొడిచే పొద్దును తొడుక్కున్న కథలు. మనసుకు మనసుకు మధ్య వికసించిన కథలు. ఇవి బతుకును పూయించిన కథలు.
– మూల వేణు (అధ్వాతి), 8106226506

]]>
స్వాతంత్య్రానికి పూర్వం మాదిగ జీవితం https://navatelangana.com/ere/ Sun, 13 Apr 2025 17:40:13 +0000 https://navatelangana.com/?p=545483 Our life before independenceతరాలు మారుతున్నాయి. అంతరాలు మారుతున్నాయి. అందరూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతా సమానమే అంటున్నారు. కులం లేనే లేదంటున్నారు. కానీ కులం ఎక్కడికి పోలేదు. ఏదో ఒక రూపంలో అది సమాజాన్ని వెంటాడుతూనే ఉంది. ఈ విషయాన్ని సాధికారికంగా చిత్రించిన నవల జక్కులు. దళితుల జీవన విధానం వివక్ష దశాబ్దాల కింద ఎలా ఉందో, అటు ఇటుగా ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ విషయాన్ని మనకు నొక్కి చెపుతున్న నవల జక్కులు. ఇది మంథని శంకర్‌ రాసాడు. తను తన పూర్వికులు చూసిన అనుభవించిన జీవితమే ఈ నవల అనిపిస్తుంది. ఒక రకంగా ఇన్‌ సైడెర్‌ ఈ నవల శంకర్‌ భయోగ్రఫీ అనికూడా అనుకోవచ్చు. దళితుల జీవిత పార్శ్వాలను లోతుగా చిత్రించినది జక్కులు నవల.
ఈ నవల కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని మంథని ప్రాంతమందు 1946కు ముందు కాలంలో జరిగిన మాదిగల జీవితాన్ని ప్రతిబింబించింది. నవలా నాయకుడు జక్కులు. అతను పుట్టింది మొదలు పెరిగిన జీవితాన్ని, జీవితంతో పాటు అప్పటి సమాజాన్ని, సామాజిక చలనాన్ని వర్ణించినది ఈ నవల. అంతర్లీనంగా ఉన్న అప్పటి కుల వివక్ష. అంతే కాకుండా పల్లెటూరులో బడుగు బలహీన వర్గాలు జరుపుకునే పండగలు. అందరినీ కలుపుకుని జరుపుకునే పీరీల పండుగ. దళితులను దూరంగా ఉంచి జరుపుకునే బతుకమ్మ పండుగ దాకా నవలలో చిత్రించబడినది. దళిత జీవనంతో పెనవేసుకున్న పండుగలను, ముస్లిం సమాజం మాదిగల సమాజం కలిసిపోయిన తీరును వర్ణించింది.
ఈ నవలలో రజాకార్ల ఆగడాల నుంచి కమ్యూనిస్టుల పోరాటం దాకా ఎన్నో చారిత్రక సంఘటనలు తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల ప్రస్తావన ఉంది. ఆ కాలంలో భూస్వాముల దోపిడి భూమి కోసం చేసే పోరాటాలు ఎదురు తిరిగితే పడే తీవ్రమైన శిక్షలు ఇందులో కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తాడు రచయిత. అది రజాకార్ల కాలం. ఆ కాలంలో దొరలు భూస్వాములకు రజాకార్లు ఎలా వంత పలికే వారో వారికి ఎలా సహకరించేవారు సోమయదొర ఆదిరెడ్డి లాంటి పాత్రలతో మనకు రచయిత విశదపరుసాడు.
గుర్రపు స్వారీ మరియు దప్పు కొట్టడం లాంటి కొన్ని విద్యలు దళితులు తమంతట తామే అధ్యయనం చేయడం ద్వారా నేర్చుకుంటారన్న వాస్తవం ఈ నవల చెబుతుంది.ఆ కాలంలో మాదిగల జీవితం ఎలా ఉండేది వాళ్ల చేత సభ్య సమాజం ఎలాంటి పనులు చేయించేది. వాళ్ళు ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారు. చాలా హద్యంగా వాస్తవంగా వివరిస్తుందీ నవల. దొరలు, భూస్వాముల ఆగడాలు, దళితులను వాళ్ళు ఎలా అవహేళనగా చూసారు, కేవలం తిండి గింజల కోసం దళితులు పడే ఆరాటం రచయిత ఇందులో వాస్తవంగా చిత్రీకరించాడు రచయిత.
నవలలో ప్రధాన పాత్ర అయిన జక్కులు తన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి అందరిలా ఊరుకోకుండా భరించకుండా దాని పరిష్కారం కోసం ఆలోచిస్తుంటాడు. కానీ తమకు కీడు చేసె దొరలు భూస్వాములకు కూడా మేలు చేయడం, వాళ్ళ మేలుని కోరడం దళితుల యొక్క కల్లాకపటం తెలియని మనస్తత్వాన్ని సూచిస్తుంది.
గ్రామంలో భూమిని అంత తమ ఆధీనంలో పెట్టుకున్నది దొరలు. కాని వాళ్ళ భూములను పండించేది మాత్రం మాదిగలు. వాళ్ళ పంటకు రోగాలు వస్తే గ్రామదేవతల కొలువులు చేయాల్సింది మాదిగలే. వర్షాలు బాగా కురిసి చెరువు తేగే పరిస్థితి వస్తే మైసమ్మ జాతర చేయాల్సింది కూడా దళిత బహుజనులే. ఇవన్నింటికి ముందుండి నడిచే దళితులకు చివరికి ఉనికి ఉండదు. అంటే తమ ఊరిలోనే దళిత బహుజనులకు తమదైన జీవితం అంటూ ఉండదు. దొరల ఆధిపత్య వర్గాల అవసరాలు తీర్చడమే ఊరి శ్రామిక కులాల జీవితం. కనీసం వీరికి ఏదైనా విలువైన ప్రతిఫలం ఉంటుందంటే అదీ ఉండదు. కనీసం మర్యాద అనే మాట కూడా ఉండదు. కడుపునిండా తిండి ఉండదు. ఆర్థిక ప్రతిఫలం కూడా ఉండదు. ఇలాంటి వాస్తవిక సంఘటనలతో నవల సాగుతుంది.
రచయిత జక్కులును ఒక విచిత్రమైన నాయకుడుగా తీర్చి దిద్దాడు. అతడు ఒక శ్రామికుడు. అన్నింటికి మించి మంచి డప్పు కళాకారుడు. అతడి డప్పు నైపుణ్యం చూసి పెద్ద కులానికి చెందిన భారతి ఆకర్షితురాలు అవుతుంది. అలాగే నర్సు కూడా ఆకర్శితురాలవుతుంది. అయినా యవ్వనంలో ఉన్న జక్కులు ఎక్కడ బలహీనతకు లోను కాడు. శ్రామికులకు ఉండే తాగుడు అలవాటు కూడా అతనికి లేదు. చాలా నిగ్రహంగా ఉంటాడు. నిక్కచ్చి వ్యక్తిత్వంతో ఉంటాడు. తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడే జక్కులు తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు.
భర్త చనిపోయిన రంగిని తిరుపతి దొర కొడుకు రమేష్‌ అనుభవించి కడుపు చేస్తే కాన్పు కాగానే బిడ్డకు నోట్లో వడ్ల గింజలు వేసి చంపేస్తుంది. కానీ ఆ అన్యాయాన్ని ఎదిరించి అడగని అసహాయత రంగిది.పై కులాల అమ్మాయిలు కింది కులాల అబ్బాయిలను కవ్వించినా చివరికి బూతులు వినాల్సింది, దెబ్బలు తినాల్సింది పేద కులాల యువకులే. ఈ నవలలో ఈ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.
ఈ కులతత్వం, అస్పశ్యత, సమాజంలో లోతుగా ఎలా నాటుకు పోయింది, ఒక డక్కలి స్త్రీ అడుక్కుంటుండగా ఒక మాదిగ పిల్లవాడు ఆమెను తాకినప్పుడు జరిగిన పరస్థితులు అప్పటి సమాజ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు మనకు చూపిస్తాడు రచయిత. పంటల కాలంలో తిరుపతిరెడ్డి పొలంలో జక్కులు వరికట్టలు ఎక్కువ కట్టాడని రమేష్‌ రెడ్డి అతన్ని తంతాడు. మారన్న జక్కులను ఓదార్చి రమేష్‌ రెడ్డి మీద తిరగబడతాడు. తనని కొట్టడం భరించలేక జక్కులు రమేష్‌ రెడ్డిని కొడతాడు. దీని మీద ఆది రెడ్డి దగ్గర పంచాయతీ. జక్కులు తన వాళ్ళని సమీకరించి ఆదిరెడ్డి దగ్గర మట్లాడిన తీరు దీంతో గ్రామం రెండు పాయలుగా చీలిపోతుంది. ఒక సందర్భంలో ఊరిలో శాలోళ్ళు మాదిగలు ఘర్షణ పడుతుంటే ఆదిరెడ్డి లేచి వెళ్ళిపోతారు. శాలోల్లతో కలిసి మాదిగల మీద దాడి చేస్తారు. ఆ సమయంలో రమేశ్‌ రెడ్డితో బాధలను అనుభవించి ఉన్న రంగి అతని కంట్లో కారం కొడుతుంది. అతని మెడ మీద కాలు పెట్టి నలిపింది. రంగి ఈవిధంగా పగను తీర్చుకున్న సంఘటన ఎంతో తీవ్రతను చిత్రించిన నవల ఇది. పరిశీలన అధ్యయనం ఉంటే తప్ప ఇలా లోతైన జీవితాలను చిత్రించడం కుదరదు.
నవలలో అనేక పర్యాయములు యువతీ యువకుల మధ్య కులాతీతంగా పుట్టే ఆకర్షణ ఉంది. జక్కులు ఎర్ర పోసు. జక్కులు నర్సు, జక్కులు భారతి, అఫ్టల్‌ పద్మ, ఇలా ఈ ఆకర్షణతో మనకు ఏమి తెలుస్తుందంటే మానవ సంబంధాలు ప్రేమలు సహజంగా ఏర్పడతాయని వాటికి కులమత ఆర్థిక బేధాలు ఉండవని తెలుస్తుంది.
ఈ దేశంలో ఇంకా ఊరుకు దళిత వాడకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఈ తేడాను చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడే శక్తులు కూడా ఉంటాయి. శంకర్‌ జీవితాన్ని అనుభవించి అధ్యయనం చేసి పలవరించి రాసిన నవల ఇది. నవల రాయడం లో ఆయన ప్రదర్శించిన నైపుణ్యం, నవల నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్త నవల కోసం చేసిన అధ్యయనం రచయితగా అతడిని ఒక మెట్టు పైన నిలబెడుతుంది.
కథానాయకుడు జక్కులు అందరికీ ప్రేమాస్పదుడు. ఆత్మ సౌందర్యం ఉన్నవాడు. మనుషులంటే అపారమైన ప్రేమ ఉన్నవాడు. సాహస వంతుడు. మడుగును చూసి అందరు భయపడుతుంటే దాన్ని ఒంటిచేత్తో ఈదిన మొనగాడు.అందుకే అతడు అంటే యువతులకు మోహం. ఇంకా యవ్వనంలో ప్రవేశించక ముందే నర్సు జక్కులను కావాలంటుంది. మనస్పూర్తిగా అతనితో ఏకం కావాలనుకుంటుంది. ఆ ఊరి రెడ్డి కూతురుకు కూడా జక్కులంటే తనివి తీరని ప్రేమ. గాఢంగా ప్రేమించింది. తన ప్రేమ తెలిస్తే ఎక్కడ జక్కులుకు ఆపద కలుపుతుందేమోనని భయపడింది. అతడు యోగక్షేమాలు కోరుకుంది. నవలలో భారతి పాత్ర రచయిత ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. అగ్రకులాలకు మాదిగలకు మధ్య జరిగిన ఘర్షణ నవలలో అక్కడక్కడా చిత్రించినా అనాటి సామాజిక వైరుద్యాన్ని అంటరానితనపు తీవ్రతను దళితుల పట్ల సమాజపు చిన్న చూపును వాస్తవానికి దగ్గరగా చిత్రించాడు.
మాదిగ యువకులలో వస్తున్న చైతన్యాన్ని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోలేక దొంగ చాటుగా దాడులు చేయించి తనకి ఏమీ తెలియనట్లు ఉండే వాడు ఆదిరెడ్డి. మాదిగలతో తన అవసరాలను తీర్చుకుంటుండేవాడు. దొరల ఆధీనంలో ఉన్న భూములన్నీ మాదిగలవేనని వారి పేరు మీద తహసీల్‌ ఆఫీస్‌ లో కాగితాలు ఉన్నాయని అఫ్టల్‌ ద్వారా మాదిగలకు తెలుస్తోంది. మాదిగల నుంచి ఆ కాగితాలను తీసుకోవాలని సోమయ్య మాదిగల అందరిని బంధిస్తాడు. ఈ మొత్తం దౌర్జన్యానికి ఆదిరెడ్డి సహకరిస్తాడు. చివరికి జక్కులు తండ్రి మాదిగ మారన్ని చంపేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావించిన ఆదిరెడ్డి చెరువు కట్ట దగ్గర ఉన్న మైసమ్మ పండుగకు ఏర్పాటు చేస్తాడు. ఆ పండుగలో దున్నను బలిచ్చే సమయంలో పాడైన మొండి కత్తిని మారయ్య చేతికిచ్చి అతని అక్కడే చంపించాలని సోమయ్య దొర ఆదిరెడ్డి ఇద్దరు కుట్ర చేస్తారు. కానీ విషయం తెలిసిన జక్కులు తన తండ్రి మారయ్యను రక్షించుకోవడం కోసం గుర్రం మీద జోరుగా కురుస్తున్న వర్షంలో వెళ్ళి మైసమ్మకు దున్నను బలిస్తాడు. ఇది నవలలో ఉత్కంటతను కలిగించే సంఘటన.
ఇప్పటి తరానికి తెలియని ఎన్నో చారిత్రక అంశాలను చర్చకు పెట్టింది ఈ జక్కులు నవల. చిందు డక్కలి కులాలు మాదిగలను తప్ప ఇంకే కులాలను ఆశ్రయించరు. మాదిగలే సమాజంలో అట్టడుగున ఉంటారంటే వారి కన్నా ఇంకా దీనంగా వారినే అడుక్కునే కులాల జీవితాలను ఒకసారి ఊహించకుంటే అప్పటి సామాజిక అసమానతలు మనకు ఈ నవల ద్వారా అవగతమవుతాయి. సంవత్సరానికి ఒకసారి జాంబవ పురాణం కథను మాదిగలకు చెప్పేవారు చిందు వాళ్ళు. మాదిగల నుంచి త్యాగం తీసుకుంటారు. మాదిగలలో పెద్ద మాదిగ వీరికి ఆశ్రయం ఇస్తారు. ఇలా ఉపకులాలను సాకడానికి ఆ రోజుల్లో మాన్యం భూములు ఉండేవి. వాటి మీద వచ్చిన పంటను వీళ్ళకి బరణంగా ఇచ్చేవారు. పంటతో పాటు ఇంటికి ఇంత అని కొన్ని గింజలు పెట్టేవాళ్ళు. చిందువాళ్ళు ఆటలు పాటలు వారి సాంస్కతిక విశేషాలను జక్కులు నవలలో విస్తారంగా చూడవచ్చు. మొత్తంగా ఒక మంథని లాంటి అగ్రహారం పరిసరాలల్లో స్వాతంత్రానికి పూర్వం దళితుల జీవణ చిత్రణను సాధికారకంగా చిత్రించిన నవల జక్కులు. శైలి శిల్పపరంగా ఒక కొత్త ఒరవడిని సష్టించిన నవల కూడా ఇదే. ఈ నవల రచయిత మంథనిశంకర్కు అభినందనలు.
– పెద్దింటి అశోక్‌ కుమార్‌
సినీ రచయిత

]]>
రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌కు ‘ది మ్యూస్‌ ఇండియా యంగ్‌ రైటర్‌ అవార్డ్‌’ https://navatelangana.com/ramesh-karthik-nayaks-the-muse-india-young-writer-award/ Sun, 13 Apr 2025 17:31:31 +0000 https://navatelangana.com/?p=545492 Ramesh Karthik Nayak wins 'The Muse India Young Writer Award'తాను పుట్టి పెరిగిన తండాలో గిరిజనుల శ్రమైక జీవనం, వారి బతుకు వెతలు, సంస్కతీ సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాల సునిశిత పరిశీలన అతడి మనసును తట్టిలేపింది. గిరిజనుల జీవితాలపై అతడి రచనలు అనతి కాలంలోనే పుస్తకాలుగా ప్రచురితమై జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందాయి. పాతికేండ్ల ప్రాయంలోనే ఎవరూ సాధించలేని ఘనతను సాధించిపెట్టాయి. రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌ రచనలు ఒక్కోటి ఒక్కో ప్రాధాన్యతతో ప్రజాదరణ పొందాయి. మొదటి కవితా సంపుటికి రమేశ్‌ 2014లోనే శ్రీకారం చుట్టాడు. తాను చూసిన సంఘటనలు, మనుషులు, సేకరించిన పుస్తకాల్లో ఉన్న అనేక విషయాలను తెలుసుకుని తొలి రచన పూర్తి చేశాడు. గిరిజన బతుకులు, వెతలనే కవితలు, కథలుగా చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలో రమేశ్‌ రాసిన ‘బల్దేర్‌ బండి’ కవితా సంపుటి 2018లో ప్రచురితం కాగా, 2019 జనవరిలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ భాషా, సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వచన కవితా సంపుటి సాహితీప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇంగ్లిష్‌, హిందీ, కన్నడ, మలయాళం, బంగ్లా భాషల్లోకీ అనువాదమైంది. 2021లో ‘డావ్లో’ పేరుతో తీసుకొచ్చిన కథల సంపుటిలో గోర్‌ బంజారా కథలను అద్భుతంగా అక్షరీకరించాడు. ఈ సంకలనంలోని ‘పురుడు’ కథ ఆంగ్లంలోకి అనువాదమై ‘ఎక్సేంజెస్‌’ సాహిత్యానువాద జర్నల్‌లోనూ ప్రచురితమైంది. 2022లో ఆచార్య సూర్యధనుంజయతో కలిసి సహ సంపాదకీయంలో ‘కేసులా’ పేరుతో తొలి గోర్‌ బంజారా కథలు రాశాడు. 2023లో ‘చక్మక్‌’ అనే ఇంగ్లిష్‌ కవితా సంపుటి రచించాడు. తాజాగా ఈ ఆంగ్ల కవితా సంపుటికి ప్రతిష్టాత్మక మ్యూస్‌ ఇండియా పత్రిక సంస్థ నెలకొల్పిన ‘ది మ్యూస్‌ ఇండియా యంగ్‌ రైటర్‌ అవార్డ’కు ఎంపికైంది. జాతీయ స్థాయిలో ఆంగ్లంలో ప్రచురించిన ఉత్తమ రచనలకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందిస్తారు. ఇందులో భాగంగా 2024వ సంవత్సరానికి కవిత్వ విభాగంలో ఈసారి కేంద్రసామిత్య అకాడమీ పురస్కార గ్రహిత రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌.. తన తొలి ఆంగ్ల కవిత్వ సంపుటి ‘చక్మక్‌’ తో అంబికా అనంత్‌ పొయెట్రీ ప్రైజ్‌ ను అందుకొనున్న నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌ పల్లి తండాకు చెందిన యువ రచయితకు దర్వాజ తరపున అభినందనలు.

]]>
చందమామ https://navatelangana.com/chandamama/ Sun, 13 Apr 2025 17:28:12 +0000 https://navatelangana.com/?p=545489 Chandamamaఎక్కడో ఆకాశం లో వుండే
చంద్రుడు
నాకు మామేట్లా అవుతాడు
మా అమ్మకు తోడబుట్టిన వాడా
నాకు పిల్లనిచ్చిన వాడా
బైరూపులోడు
రోజుకోతీరు కనిపిస్తాడు
చంద్రవంకలా ఒక రోజుంటే
చంద్రబింబమై మరొక రోజుంటాడు
ఒకరోజు పాపం
మామను అమావాస్య కమ్మేస్తే
మరో పూట పున్నమి వికసింప చేస్తుంది
మా మామా అల్లుండ్లది
రక్త సంబధమో ఆత్మ సంబంధమో
ఆకాశంలోంచి చందమామ
నా కంటి చూపును వెలిగిస్తాడు
దేహమంతా వ్యాపిస్తాడు
మనసంతా వెన్నెల పరిచేస్తాడు
– వారాల ఆనంద్‌

]]>
భీమ రక్ష https://navatelangana.com/bhima-raksha/ Sun, 13 Apr 2025 17:24:11 +0000 https://navatelangana.com/?p=545481 Bhima's protectionనా నాల్క మీద
నాట్యమాడు జ్ఞాన అచ్చరాలే అంబేద్కర్‌
నా చేతి వేళ్ళ సందున
మారుతున్న మకిలిరాత
తరతరాల వెలివేతను
కూల్చే వెలుగు పూత అంబేద్కర్‌
నా అడుగుల బడిమెట్లకు
ముండ్లు తగలని
తంగేడు పూల దారే అంబేద్కర్‌
నా మదిలో చిగురించే స్వేచ్ఛా ఆలోచనలకు
మోదుగుచెట్ల ఆయువు పట్టే అంబేద్కర్‌
హక్కుల దండోరా
నా ఒగ్గుడోలు గుండెచప్పుడు
డిల్లెం పల్లెమే అంబేద్కర్‌
నా కూటికుండలో
నా కోసం మిగులుతున్న
నాలుగు మెతుకులే అంబేద్కర్‌
అసమానపు సెగలు కక్కే
అహంకారపు సిగలు పట్టే సమాజానికీ
సల్లని సమతోడు నీడనిచ్చే
రావి చెట్టే అంబేద్కర్‌
ఆ మనువు కుక్క చేసిన గాయాలను
మాన్పే మందే అంబేద్కర్‌
ఎట్టిజనులను ఏకం చేసి
శోకం బాపిన మట్టి మనిషే అంబేద్కర్‌
నాయినకు కన్ను –
అమ్మకు మన్ను
నాకు పెన్ను –
దేశానికి వెన్ను
ముమ్మాటికీ అంబేద్కర్‌
నా ఎదల మీద ఎగురుతున్న
ఆత్మ గౌరవ జెండా
నల్ల గొంగడే అంబేద్కర్‌
పుట్టమన్ను గద్దెల మీద
ఆది వీరనాగు చరితకు
స్వేద నాదమే అంబేద్కర్‌
నాకు, నా ఎలకోటి మందకు
భీమరక్షే అంబేద్కర్‌
అంబేద్కర్‌, అంబేద్కర్‌,
అంబేద్కర్‌
– చిక్కొండ్ర రవి

]]>
ఏమాటకామాటే https://navatelangana.com/whatever/ Sun, 13 Apr 2025 17:15:28 +0000 https://navatelangana.com/?p=545476 అది ఆకాశం తానెక్కడా లేకుండానే
అంతటా ఉన్నాననే ఊహాసుందరి
ఇంత దూరం పిలిపించుకొని ఎందుకొచ్చావంటారు
ఇంతగా గాయపరిచి వింతగా లేపనం అద్దుతుంటారు
అవును! ఒద్దన్న వాళ్లంతా చుట్టూ మూగుతుంటారు
అవసరమైన వాళ్ళు అసలే దొరకరు
ఆ మాటకు కన్నీళ్లు ఉబికినై
వేదిక మీద ఎలా అనుకొని కాబోలు గుడ్ల చుట్టూ ఆగినై
శిఖరం పూర్తయ్యాక మాత్రమే, దేశభక్తి
ఇక పునాది గురించి రేపు ఆలోచిద్దామంటుంది
బెల్లం ఇగిరిపోయినట్టుంది
ఈగలు ఎగిరిపోతున్నాయి
ఎక్కడ చూసినా గుడులే, దేవుళ్లే
కొందరు మనుషులు కూడా ఉంటే బాగుండేది
కులపు రక్తపు బొట్టు కడదాక తాగేను
అందలం ఎక్కాలనుకున్నది అతనొక్కడే
ఆధార్‌ కు తప్ప దేనికి ఉపయోగం లేని వయస్సు
మనసు యవ్వనం కాళ్లు కడుక్కున్న కొబ్బరినీరు
కుక్క కరిస్తే మందుంటుంది
మతం కరిస్తే అన్ని కుక్కలను అందుకుంటుంది
ఒరేరు నా కొడకల్లారా అన్న ఆడ ఎస్‌ఐ
పురుషాహంకారాన్ని మోస్తున్న యూనిఫారం
ఫేస్‌ బుక్‌ పొదుగు వెంటనే సేపదు
లైక్‌ ల పాలబొట్లు నిరంతరం రాలవు
ముజే కలెక్టర్‌ బనాదియే మేరే దోస్త్‌
షాయద్‌, షాయర్‌ బన్‌ సక్తా సమస్త్‌
– ఏనుగు నరసింహారెడ్డి, 8978869183

]]>
సాహితీ వార్తలు https://navatelangana.com/literary-news-56/ Sun, 13 Apr 2025 17:14:33 +0000 https://navatelangana.com/?p=545479 ‘బిరుదురాజు శతజయంతి’ సమాలోచన
తెలుగుజాతి జానపద విజ్ఞాన రంగంలో విశేషమైన కృషి చేసిన ఆచార్య బిరుదురాజు రామరాజు పరిశోధకుడిగా, పండితుడిగా, ఆచార్యుడిగా స్పురసిద్ధులు.ఆయన శతజయంతి సందర్భంగా ‘ఆచార్య బిరుదురాజు రామరాజు శతజయంతి సదస్సు’ను తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో ఏప్రిల్‌ 16న ఖమ్మం ఎస్‌.ఆర్‌.బి.జి.ఎన్‌.ఆర్‌. ప్రభుత్వ ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల తెలుగు విభాగం ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో డా||నామోజు బాలాచారి, ఆచార్య బన్న అయిలయ్య, డా|| గన్నమరాజు గిరిజా మనోహర్‌బాబు, డా||యాకూబ, డా|| బి.రాములు, కపిలభారతి, డా||మంధని శంకర్‌, డా||వాహెద్‌, డా||మహ్మద్‌ జాకీరుల్లా, డా||సీతారాం తదితరులు పాల్గొంటారు. సదస్సులో పరిశోధనా పత్రాల సమర్పణ, రామరాజు సాహిత్య సేవపై స్రసంగాలు వుంటాయి.
– డా||పి.రవికుమార్‌

]]>
నన్ను మరింత దృఢంగా మలిచిన నవల https://navatelangana.com/a-novel-that-has-more-firmly-dumped-me/ Sun, 06 Apr 2025 16:44:01 +0000 https://navatelangana.com/?p=540810 The novel that made me strongerవార్తా పత్రికల్లో ప్రచురితం అయ్యే చిన్న చిన్న కథలు, కవితలు, సామాజిక, రాజకీయ వ్యాసాలు చదవడం ద్వారా నాకు సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడింది. డిగ్రీ వరకు తెలుగు సాహిత్యాన్ని ఆసక్తిగా చదవుకున్న నాపై హిందీ సాహిత్య ప్రభావం పడింది. సామాజిక స్పహను, సామాజిక దోపిడీ, భూస్వామ్య పెత్తందారి రుగ్మతలను ప్రేమ్‌ చంద్‌ తన నవలల ద్వారా ప్రతిబింప జేసిన విధానం ఆకట్టుకొని, నన్ను మొత్తం హిందీ సాహిత్యం వైపు ఆకర్షించేలా చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పిజీ చేస్తున్నప్పుడు హిందీలో ఉత్తమ రచనల వెతుకులాటలో దొరికిన అరుదైన పుస్తకం ‘ఓం ప్రకాష్‌ వాల్మికి’ రాసిన ‘జూఠన్‌’ ఒక అంటరాని వాని ఆత్మకథ. ఇది ఓంప్రకాష్‌ జీవితచరిత్ర, దళిత సమాజం తాలుకు సమస్యలకు సంబంధించినది. సమాజంలో మనుషుల్లా ఉంటూ జంతుజీవితాలను జీవిస్తున్న అభాగ్యుల జీవుల చిత్రణ ఈ నవల. జూఠన్‌ అంటే ‘ఎంగిలి’ అని అర్థం.
ఇది నన్ను నేను పోల్చి చూసుకునేలా, ఓదార్చుకునేలా, నన్ను నేను మరింత దఢంగా మలచుకోవడానికి ఎంతగానో ప్రభావితం చేసిన ఆత్మకథ. దుఃఖం, బాధ, వేదనాభరితమైన పీడనతో నిండిన ప్రపంచం ఈ ఆత్మకథలో విస్తరించి ఉంది. వీటన్నింటినీ దాటుకుని ఓం ప్రకాశ్‌ వాల్మీకి ఎలా పెరిగాడు, ఎలా జీవించాడు, తనను తాను ఓ దఢమైన తిరుగుబాటు శక్తిగా ఎలా వద్ది చేసుకున్నాడనేది ఈ ఆత్మకథ. ఇది కేవలం ఒక వ్యక్తి ఆత్మకథ మాత్రమే కాదు. మొత్తం దళిత సమాజం తాలూకు దుఃఖం, బాధ, పోరాటం, సామాజిక సమస్యలను వ్యక్తపరచే ఓ గొప్ప రచన. డా. జీవి. రత్నాకర్‌ తెలుగు అనువాదానికి జి. కళ్యాణ్‌ రావు తన ముందుమాటలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
తన కొడుకు బాగా చదువుకుని పెద్దవాడై ఈ నరక జీవితం నుంచి విముక్తి పొందాలని, కులాన్ని సంస్కరించాలని, మొత్తం దళిత సమాజాన్ని బాగు చేయాలనే తండ్రి కోరిక. అందుకోసం తండ్రి, కొడుకులు చేసిన తిరుగుబాటు చరిత్రే ఈ జూఠన్‌. అయితే ఈ ప్రయాణంలో తానూ అనుభవించిన నరకయాతను చిత్రీకరించిన తీరు మనల్ని కలచివేస్తుంది. జూఠన్‌ తన పాఠశాల రోజుల్లో ఎదురుకున్న అనేక సంఘటనల గురించి ప్రస్తావిస్తూ ”మిగతా వారి నుండి నేను చాలా దూరంగా నేలపైన కూర్చుండేవాడిని. నేను కూర్చున్న చోటు వరకు చాప ఉండేది కాదు. కొన్ని సమయాల్లో అందరికంటే వెనక కూర్చోవలసి వచ్చేది. చాలాసార్లు నన్ను అకారణంగా కొట్టేవారు. ఒకసారి ఓంప్రకాశ్‌ 4వ తరగతిలో ఉన్నప్పుడు ప్రధానోపాధ్యాయుడు అతడిని పాఠశాల, ఆటస్థలం శుభ్రపరచమని హుకుం జారీ చేసేవాడు. నిండా పదేండ్లు లేని ఆ పిల్లవాడ్ని ఆ పని తీవ్రమైన వెన్ను నొప్పితో బాధించేది. నీళ్లు తాగడానికి కూడా అనుమతించేవాడు కాదు. అలా ఓం ప్రకాశ్‌తో పాఠశాలను, మైదానాన్ని అనేక సార్లు ఊడ్పిస్తారు. ఇదంతా గమనించిన ఓంప్రకాశ్‌ తండ్రి తన కొడుకు చేయి పట్టుకొని వెళ్ళిపోతూ ఉపాధ్యాయులందరితో ”మీరు ఉపాధ్యాయులు… కాబట్టి వదిలి వేస్తున్నాను… కాని మీరు ఒక విషయం గుర్తుంచుకోండి… ఇతడు ఇక్కడే… ఈ పాఠశాలలోనే చదువుతాడు. వీడు ఒక్కడే కాదు, వీడి తర్వాత కూడా చాలామంది చదువుకుంటారు. ఒరేరు మా పిల్లవాడు రెండు అక్షరాలు నేర్చుకుంటే నీదేం పోయింది. నిన్ను ఎందుకు బ్రతిమిలాడాలి” అని హెచ్చరిస్తాడు. ఈ ఘటన ద్వారా దళితులకు విద్యను దూరం చేయడానికి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేశారో అవగతమవుతుంది. జూఠన్‌ ఆత్మకథ అమితంగా నన్ను ఆకట్టుకోవడానికి నా స్వీయానుభూతులే కారణం. అవన్నీ ఈ ఆత్మకథను చదువుతున్నంతసేపూ నేమరేసుకున్నాను. కండ్ల నీళ్ళను అదుపు చేసుకున్నాను. ఈ వేధింపుల వల్ల చదువుకు దూరమైన నా మిత్రుల ఘోషను మళ్లీ ఒక సారి స్మరించుకున్నాను. అకారణంగా ఎస్సీ హాస్టల్‌ విద్యార్థులను కొట్టినప్పుడు, ఒళ్ళంతా వాతలతో వాచిపోయిన తీరు గుర్తొస్తే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతోంది.
అప్పుడు ఓంప్రకాష్‌ వాల్మీకి పాఠశాలలో హింసకు, చీత్కారానికి గురి కాబడ్డా, పాయకానాలు కడిగించడం లాంటివి చేపిస్తూ మీకు చదువు ఎందుకు అన్న మాటలు టీచర్లచేత అనేక సార్లు విని, బెత్తంతో తీవ్రంగా దెబ్బలు తిని విద్యకు దూరం చేయబడినా, నాలాంటి వాళ్ళు అకారణంగా దెబ్బలు తిన్నా, గాయాలపాలైనా కారణం ఒక్కటే కులం. అదే విషయాన్ని ‘జూఠన్‌’ నవల స్పష్టం చేస్తోంది.
– సిలపాక వెంకటాద్రి, 9133495362

]]>
‘కనికట్టు’ కథలు https://navatelangana.com/memorative-stories/ Sun, 06 Apr 2025 16:42:10 +0000 https://navatelangana.com/?p=540807 'Kanikattu' storiesఇవి కథలు మాత్రమే కావు. గ్రామజీవన దశ్యాలు. ప్రకతిని తమలో ఇంకించుకున్న ప్రజల అంతరంగ చిత్రణలు. కవి హదయాన్ని ఇముడ్చుకున్న కథకుడి మనోహర  అభివ్యక్తులు. పాఠకుడిని తన వెంట తీసుకువెళ్లే నాదస్వరాలు.

నందిని సిధారెడ్డి వీటి రచయితేకానీ, ఇవి అతను కల్పించిన కథలు కావు. అతను పుట్టిన చోటు, అక్కడి సంస్కతి, ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, అనుబంధాలే కథలయ్యాయి. ఈ కథలు రాయడానికి కథకుడికి అవసరమైందల్లా పాత జ్ఞాపకాలను తలచుకున్నపుడల్లా మళ్లీ అనుభవించగలగడం. తన అనుభవాలు, అనుభూతులను సార్వజనీనం చేయడానికి ప్రయత్నించడం. ఇది ఇటీవల కథారచనలో నడుస్తున్న ధోరణే. అటువంటి కథల జాబితాకు ఈ సంకలనం మరో చక్కని చేర్పు.
బందారం కథల్లో అక్కడి భౌగోళిక పరిస్థితి, జనజీవనం ఉంటుంది. అక్కడి వత్తులు, కళాకారులు ఉంటారు. అక్కడి ప్రకతి, వర్గ, కుల, లింగ స్వభావాలు, వత్తి కళాకారులే ఇందులోని పాత్రలు. అయితే వీటన్నిటినీ ఏకరువు పెడితే అది డాక్యుమెంటరీ అవుతుంది. వ్యాసమవుతుంది. ప్రాపంచిక దక్పథం, రచనాశిల్పం, పాత్ర చిత్రణానైపుణ్యం అనే ముడిసరుకు సిధారెడ్డి వద్ద వున్నాయి. ఇవి మూడూ ఉన్నాయి కనకనే ఇవి మంచి కథలు.
ఈ కథల్లో వస్తువేమిటి? అని ప్రశ్నించుకున్నపుడు తరతరాలుగా ఉన్న విశ్వాసాలు (చినికి చినికి వాన మరికొన్ని), బాధ్యతారాహిత్యం, స్వార్థం మూర్తీభవించిన మగవాళ్లు (జంజాటం, కుంజీలు), స్వంత వ్యక్తిత్వం కలిగిన స్త్రీలు (యశోద వెంట, జాయిజాద్‌, మనసు పాడుగాను), వత్తి కళాకారుల జీవితాలు మొదలైనవి. ఇందులో వస్తువులన్నీ తెలుగు కథకు కొత్తవి కావు. కానీ రచన మాత్రం ప్రత్యేకమే. అలాగే కొన్ని ప్రత్యేకమైన కథలు ఈ సంకలనాన్ని ప్రత్యేక రచనగా నిలబెడతాయి. అవి ఇక్కడ సంస్కతికి సంబంధించినవి. పాటలు, నత్యాలు, ఆచారాలు, వత్తినైపుణ్యాలు, నమ్మకాలు కలగలిసినవి. బందారం జానపద సంస్కతిని కళ్లకు కట్టించేవి. అక్కడి జీవన శకలాలను, అక్కడి జన జీవితంలోని అతిచిన్న విషయాలను కూడా రూపుకట్టించేవి.
అలాంటి మంచి కథల్లో ఒకటి ఋణానుబంధాలు. తనకు ఐశ్వర్యం తెచ్చిపెట్టిన ఆవు చనిపోతే ఊరి షావుకారు చాలా బాధపడతాడు. దానికి శాస్త్రోక్తంగా, మనిషికి చేయించినట్లుగా దహనకాండ జరిపిస్తాడు. ఆ క్రమం మొత్తం కళ్లకు కట్టినట్టు చిత్రిస్తాడు రచయిత. దాన్ని ఊరేగింపుగా తీసికెళ్లి దహనం చేసేవరకూ కుంటుకుంటూ అందరి వెంటా నడుచుకుంటూ వచ్చిన ముసలమ్మను చూసి జనం నవ్వుకుంటారు. నిజానికి ఆ ఆవు తల్లి ఈ ముసలమ్మదే. తన నాన్నమ్మను బతికించుకోడానికి డబ్బులేక, ఈ ఆవుతల్లిని ఈ ఆవు గర్భంలో ఉండగా, ముసలమ్మ షావుకారికి అమ్మేసింది. అదే ఆవుకు ఇప్పుడు వైభవంగా దహనకాండ జరిగింది. అప్పుడు తన నాన్నమ్మ దిక్కులేక మరణించింది. ఇప్పుడు ఈ ఆవుకు ఘనంగా దహనకాండ జరుగుతోంది. ఈ వైరుధ్యాన్ని చక్కని ఐరనీతో చెప్తాడు రచయిత.
ధ్వనిగర్భితమైన మరోకథే శానతనం. కొమరయ్యను ఊళ్లో అందరూ తక్కువగానే చూస్తారు. ఇంట్లో కూడ గారాం చేసేవాళ్లు, ఖాతరు చేసేవాళ్లు లేరు. తనను ఏ దుకాణదారుడూ కూర్చోనివ్వడు. ఎక్కడా ఆదరం లేదు. చివరకు చింతమొద్దు మీద కూర్చున్నా తరిమికొడతారు. కానీ.. పీర్ల పండగరోజు నిప్పులు రాజేస్తున్నప్పుడు, కట్టెలు తక్కువయ్యాయని పెద్దలంటారు. కొమరయ్య కట్టెలు వెతికి తెచ్చేందుకు సిద్ధపడతాడు. పరిగెత్తుకు వెళ్లి, తనను కూర్చోనివ్వని చింతమొద్దును తెచ్చి కాష్టంలో వేస్తాడు. అది చక్కగా రాజుకుని కాలి బూడిదవుతుంది. తనను కూర్చోనివ్వని చింతమొద్దును తగలబెట్టిన ఆనందం. ఎక్కడా వాచ్యం చెయ్యకుండా చివరి వాక్యంతో కొమరయ్య పగతీర్చుకున్నాడని పాఠకుడికి ధ్వనింపజేస్తాడు రచయిత.
వాచ్యత లేకపోవడమన్నది సిధారెడ్డి కథల్లో సామాన్య లక్షణం. రచయితగా ఎప్పుడూ తెరవెనక ఉండిపోవడమే అతనికిష్టం. ఒక ఘట్టాన్ని లేదా పాత్రను మనముందుంచి, తను తెర వెనక్కి తప్పుకోవడం ఈ రచయిత అలవాటు. ఆ పాత్రను గురించి రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు? కథ ద్వారా అందించాల్సిన సందేశం లేదా అవగాహన ఏమిటి? ఇవేవీ మనకు స్పష్టం కాని కథలున్నాయి. అలాంటి విలక్షణమైన కథే బంగారు గురిగి.
కానీ అన్ని కథల్లోనూ ఈరకమైన వ్యూహం లేదు. సమగ్రచిత్రణకు నోచుకున్న పాత్రలూ ఉన్నాయి. ఉదాహరణకు ‘కుంజీలు’ లో కమల, ‘యశోద వెంట’ లో యశోద, గడీలవాడులో హనుమంతరావు, ‘జాయిజాద్‌’లో జానమ్మ. అన్నిటికంటె చక్కని చిత్రణకు నోచుకున్నది ఏ వ్యక్తీ కాదు. బందారమనే ఆ ఊరే. ఈ కథల్లో ప్రధాన పాత్ర. ఊరు మానవీకరణ చెందిందనుకుంటే అది ఎలాంటి మనిషి? ఎల్లప్పుడూ ఉదాత్తంగా ఉంటుందా? హీరోయిజం ప్రదర్శిస్తుందా? న్యాయం పక్షం వహిస్తుందా? లేదు. ఆ గ్యారంటీ లేదు. బీభత్సం ప్రధానమైన ‘చెడ్డ గడియ’ కథలో ఊరు ప్రేక్షకపాత్రే వహిస్తుందంటాడు రచయిత. క్రియాశీలకంగా ఉండాలన్న నియమం ఊరికి లేదు. ఘోరాలు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటుంది. బాకీ’ కథలో ఊరంతటికీ ప్రమాదం వచ్చినపుడు ఎక్కడలేని ఐకమత్యం వచ్చేసి, ఆ ప్రమాదఘడియ దాటగానే ‘షరా మామూలే’. ప్రవత్తి తలెత్తడం సర్వసాధారణమని చూపిస్తాడు రచయిత (ఈ కథ చదివితే అమరావతి కథల్లో ‘వరద’ కథ గుర్తుకొస్తుంది). ఇది 1979 లో స్కైలాబ్‌ కిందపడి అందరూ చనిపోతారని భారతదేశంలో విస్తరించిన వదంతి ఆధారంగా రాసింది. ఊళ్లో అందరూ అప్పులూ, సొప్పులూ లేకుండా కలిసిపోయి, చివరి దినం తాగుతూ, తింటూ ఆనందంగా గడపడం, వైషమ్యాలు మరిచిపోవడం చక్కగా చిత్రిస్తాడు రచయిత. రాత్రికి స్కైలాబ్‌ తునకలు సముద్రంలో పడిపోయాయి కనక ఊరికి భయం లేదని రేడియోలో చెప్పాక, మళ్లీ మామూలే. అందరి గొడవలూ యథాతథం.
అపుడపుడూ ఊరు సాక్షిగానే ఉన్నా, చాలాసార్లు ఊరు మంచికి కూడా పూనుకుంటుంది. ‘నన్నెజీవులు’లో అల్లుడిని వేధించుకు తింటున్న కుటుంబానికి బుద్ధిచెప్పి, అతన్ని బతికించింది ఊరు. ‘తడిసి మోపెడు’లో యువతలోని పౌరుషాన్ని రోషాన్ని అభినందించింది ఊరు. ‘ఉన్నదీ లేనిదీ’లో ఊరు వదిలి వెళ్లిపోవడంలో ఇమిడిన విషాదాన్ని వ్యాఖ్యానించింది ఊరు.
కళ కన్నీళ్లు కథ జానపద వత్తిగాయకులైన శారదకండ్ర కథ. తమ కళ ద్వారా పదిమందినీ ఏడ్పించే వీరికి జీవితంలో మిగిలేవి కన్నీళ్లే. వారి కట్టమైసమ్మ కథాగానం నేపథ్యంలో చాలా అందంగా అల్లిన కథ ఇది. ఇంతకూ వాళ్లకు కళే బ్రతుకా? బ్రతకడం ఒక కళా? రెండూనూ.
కథలలో పాటను ఇంత విరివిగా, సందర్భోచితంగా వాడుకున్న రచయితలు చాలా అరుదు, బహుశా లేరేమో. వాన రావాలని వర్షదేవుణ్ణి కోరుతూ పిల్లలు పాడే పాట దగ్గర్నుంచీ, కట్టమైసమ్మ వీరగాథను చెప్పిన శారదకాండ్రవరకూ ఈ కథలన్నిటా పాటలు అలరిస్తాయి. మౌలికంగా కవి అయిన సిధారెడ్డి ఏ వస్తువునైనా, వాతావరణాన్నయినా, వ్యక్తినైనా చక్కగా వర్ణించగలడు. బందారం కథల్లో భాషలోని సొగసు ఈ వర్ణనలను మించి కథనానికి కథలకూ వన్నె తెచ్చింది.
ఈ కథల మర్మం మొదటి కథలోనే సూచిస్తాడు రచయిత. ‘మావూరు తీరు’ అంటూ. బందారం కనికట్టుకు ప్రసిద్ధమైన వూరట. కనకే ఈ రచనలో కథ, కథనం, పాత్రలు- అన్నిటిలోనూ మార్మికత ఉంటుంది, గుట్టుచప్పుడు ఉంటుంది. పొరలుంటాయి. ఆ పొరలను విప్పుకుంటూ వెళ్లాలనే ఉత్సాహం, ఉద్వేగం కల్పించే శైలివుంటుంది. అందుకే ఇవి మంచి కథలు, చదవదగ్గ కథలు, చదివి తీరాల్సిన కథలు.
– మణాళిని

]]>
మూఢనమ్మకాలను ఛేదించే మంత్రదండం https://navatelangana.com/the-wand-that-solves-superstitions/ Sun, 06 Apr 2025 16:40:04 +0000 https://navatelangana.com/?p=540805 A magic wand that breaks superstitionsనేటి బాలలే రేపటి పౌరులు… ఆధునిక భవిష్యత్‌ పౌర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి. తల్లిదండ్రులు, గురువులు, బాల సాహితీవేత్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలి. కథలు కవిత్వం సాహిత్యంలోని వివిధ ప్రక్రియల ద్వారా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలి. చిన్న వయసులోనే పిల్లల్లో దిద్దుబాటు జరిగితే అది భావి జీవితానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆ భారం బాధ్యత ఎక్కువగా మోయాల్సింది బాల సాహితీవేత్తలే. ఇలా ఎందుకు అంటున్నానంటే ఇంకా తల్లిదండ్రులలో నిరక్షరాస్యులు ఎక్కువే! అక్షరాస్యులైన తల్లిదండ్రులలో తీరిక ఉన్నవారు బహు తక్కువ. వీరంతా తమ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని మంచి చెడులు నేర్పడం అంటే అంత తేలిక కాదు.
ఇకపోతే మనకు మిగిలిన మార్గదర్శకులు గురువులే! అయితే వీరు సిలబస్‌ను అనుసరించి బోధించవలసి ఉంటుంది. పూర్తి స్వేచ్ఛ వీరికి ఉండదు. పరీక్షలు మార్కులు, ర్యాంకుల కోసం, చదవడం అలవాటైన విద్యార్థులు సైతం సిలబస్‌లోని విషయపరిజ్ఞానాన్ని తేలికగా వదిలేస్తున్నారు. అలా కాకుండా నేటి బాలబాలికలు భావి జీవితంలో మంచి పౌరులుగా ఎదగడానికి ఎలాంటి భావజాలం అవసరమనేది ఉపాధ్యాయులుగా స్థిరపడిన సాహితీవేత్తలు. గుర్తించగలిగే అవకాశాలు వారికి మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయురాలిగా ఉత్తమ సేవలు అందిస్తూ, విద్యార్థులను సజనాత్మకంగా అభివద్ధిలోకి తీసుకురావాలనే సదుద్దేశంతో డాక్టర్‌ ఉప్పల పద్మ తన విద్యార్థుల చేత కథలు రాయించారు. తానే, సంపాదకులుగా ‘మంత్రదండం’ అనే కథల పుస్తకం తీసుకువచ్చారు. గుండ్రాంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, విద్యార్థినీ విద్యార్థులు రాసిన కథలివి. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో, పల్లె ప్రజల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాలను, పిల్లల్లో నాటుకుపోయిన అపనమ్మకాలను, తొలగించడానికి వివిధ ఇతివత్తాలను విద్యార్థులకు ఇచ్చి కథలు రాయించారు. ఇందులో మొత్తం 19 కథలు ఉన్నాయి. పదునెనిమిది కథలు విద్యార్థులు రాయగా చివరి కథను సంపాదకులు రాశారు.
సాధారణంగా బాలల కథా సాహిత్యాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. పెద్దలు పిల్లల కోసం రాసే కథలు ఒక రకం కాగా, పిల్లలు రాసే కథలు మరోరకం మంత్రదండం కథా సంపుటిలోని కథలు రెండో రకం కథలు. పిల్లల్లో శాస్త్రీయ దక్పథాన్ని తీసుకురావాలనే సత్సంకల్పంతో సంపాదకులు చేసిన ప్రయత్నం సీరియస్‌ గానే కనిపించింది. ‘సైన్స్‌లోని మ్యాజిక్కును ఆలంబనగా చేసుకుని (సున్నపు నీళ్లలో పసుపు కలవడం ద్వారా ఎరుపు ఎక్కటం) ఒక మంత్రగాడు రామాపురం గ్రామ ప్రజలను మోసం చేయబోగా అదే ఊరిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అడ్డుకుంటాడు. ఇది బయటపడ్డం నిజం కథలోని సారాంశం. 9వ తరగతి చదువుతున్న రిత్విక్‌ గౌడ్‌ రాసిన ఈ కథ మంత్రదండం కథా సంపుటిలో మొదటిది. చదువుకుంటే శాస్త్రీయమైన దక్పథాన్ని ఎలా పెంపొందించుకోవచ్చునో తెలియజేస్తుంది. నాలుగు తోవలు కలిసిన దారిలో తిప్పేసిన నిమ్మకాయలను తొక్కడం ద్వారా ఇద్దరు స్నేహితులు కలవరపడతారు. అందులో ఒకరికి జ్వరం రావడంతో అతడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్తాడు. వారు స్వామీజీ దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకున్న తరుణంలో డాక్టర్‌ ఇంటికి వచ్చి మందులు ఇస్తాడు. దాంతో జ్వరం తగ్గిపోతుంది. ‘నిమ్మకాయలకు జ్వరం రాదు’ ఈ కథలోని సారాంశం. ఈ కథ ఆరవ తరగతి విద్యార్థిని జి అక్షిత రాశారు. మూడవిశ్వాసాలను విపరీతంగా నమ్మే మల్లమ్మ సంఘయ్య దంపతులు స్వామీజీ నుండి తమ కూతురిని ఎలా కాపాడుకున్నారో తెలియజేసే కథ ఉపాయం. (రచన- కే. శ్రీవల్లి పదవతరగతి)
అమావాస్య రోజు బయటకు వెళ్ళొద్దని మంత్రాలు చేసి తిప్పేసుకుంటారని పెద్దలు పిల్లలకి భయాన్ని నూరి పోస్తుంటారు. కానీ బి అక్షిత ‘భయం లేదు గియం లేదు’ కథలో ఒక ముసలమ్మ పాత్ర ద్వారా ఇవన్నీ వట్టి పిచ్చి నమ్మకాలని చెప్పిస్తుంది. చిన్ననాటి నుండే నాయనమ్మ చెప్పిన మాటలు విని మూఢనమ్మకాలని తలకెక్కించుకున్న మోక్షిత ఎలా ఉద్యోగం పోగొట్టుకుందో తెలియజేస్తుంది ‘తుమ్మా ఉద్యోగమా?’ కథ.
ఈ కథా సంపుటిలో సీమా అక్షిత రాసిన ‘బూతం లేదు గీతం లేదు’, జి రిషిక రాసిన ‘అత్త కోడళ్ళు’, బి. అలకనంద రాసిన ‘మంచి టీచర్‌’, మె హైక్‌ రాసిన ‘సాహసం’, ఖాజా రాసిన ‘తెలివైన బాలుడు మూఢనమ్మకాల నాయనమ్మ’, ఎస్‌ అక్షిత రాసిన ‘చిల్లుల సంచి’, బి. శివరాం రాసిన ‘మంత్రగాడి మోసం’, సీమ హన్సిక రాసిన ‘మంత్రగత్తె మోసం’, కె. భావన రాసిన ‘మోక్షాన్ని ఇచ్చే బండరాళ్లు’, ఎన్‌ క్షితిజ రాసిన ‘స్వామీజీ మంత్రాలు’. ఈ కథలన్నీ చదవదగినవే. ఇక ఈ కథా సంపుటిలో చివరిది సంపాదకులు డాక్టర్‌ ఉప్పల పద్మ రాసిన మంత్రదండం కథ.
ఒకవైపు దేశం, ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ముందడుగు వేస్తున్నప్పటికీ, మరోవైపు సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబాలు మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలలో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి.
ఈ మంత్రదండం కథా సంపుటిలోని కథలన్నీ ప్రజలలో విద్యార్థుల్లో, శాస్త్రీయ ఆలోచనని కలిగించడానికి చేసిన ప్రయత్నంగా చెప్పవచ్చు. పౌర్ణమి అమావాస్య, మంత్రగాళ్లు, చేతబడులు, దయ్యాలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు కుంకుమలు, తిప్పి వేయడాలు, నాలుగు తోవలు, మూడు తోవలు ఈ అంశాల పట్ల సమాజంలో నెలకొని ఉన్న భయాలు, ఇంకా గుడ్డి నమ్మకాలు, అమాయకమైన ప్రజలను మోసం చేసే మంత్రగాళ్ల వేషాలు, స్వామీజీలు వంటి విషయాలు మనకు కనిపిస్తాయి.
ఎవరైతే తమ పిల్లల్ని ఉత్తమ గుణాలు కలవారుగా మంచి సంస్కారం అబ్బేలా తీర్చి దిద్దుతారో అలాంటి వారే సరైన తల్లిదండ్రులు. ఏ సమాజంలోనైనా సరే పిల్లలు ధర్మంగా నడిచేలా తీర్చిదిద్దే తల్లిదండ్రులు ఆ సమాజపు అసలైన ఆస్తి. కుటుంబాలు ఫెయిలైతే సమాజం కూడా ఫెయిలవుతుంది. మంచి ప్రవర్తన అనే భవంతికి మంచి ఆలోచనలు పునాది రాళ్లు. పునాది బలంగా ఉంటే భవంతి కూడా స్థిరంగా ఉంటుంది.
– డాక్టర్‌ గన్నవరం వెంకటేశ్వర్లు, 9550384498

]]>
వాగ్దానం https://navatelangana.com/promise/ Sun, 06 Apr 2025 16:37:35 +0000 https://navatelangana.com/?p=540802 ఈ కంటికి చీకట్లో ఎక్కడినుండి ఎక్కడికో
నడిచీ నడిచీ అలసిపోయి
ఎక్కడో విశ్రమించాను
కళ్లు తెరిచి చూస్తే
మెడకు పాములు చుట్టుకొని
బుస కొడుతున్నాయి
భుజాల మీద వాలిన నెమళ్లు
ముక్కుతో గీరుతున్నాయి
ఛాతీ మీద తాబేలొకటి కన్నీళ్లతో రోదిస్తోంది
కడుపు మీద తలపెట్టిన జింకలు
ఆకలిని చప్పరిస్తున్నాయి
వాటి గుండెల్లో ఏదో సొద ఉంది
లేచి చూడలేను గాని
సకల జీవరాశి నా పాదాల మీద పడి ఉంది
నేనేం చేయగలను
నేనో పనికిమాలిన ఓటరును
గుట్టలను తొవ్వినా అడవులను నరికినా..
భూములను అమ్ముకున్నా..
ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దోచుకున్నా..
ఆ కీచకులను చూస్తూ
మౌనం పాటించే దారిన పోయే దానయ్యను
ఇప్పుడు ప్రశ్న నుదుటి మీద
తుపాకీ పెట్టబడి ఉంది
ఇప్పుడు ఉరిమే గొంతు మీద
కత్తి పెట్టబడి ఉంది
ఇప్పుడు అక్షరం చుట్టూ
ఊచల కంచెలు మొలుచుకొస్తున్నాయి
ఏం చేయమంటారు
కదిలితే ప్రాణం పోతుంది
ఇంతకుముందే చెప్పానుగా
మెడ చుట్టూ సర్పాల ఉచ్చు
బిగుసుకొని ఉంది
మూగజీవులారా మీరేం బాధపడకండి
ఎంతకాలమైనా సరే
ఈ అరణ్యాన్ని గాలిస్తాను
శిథిలమైపోతున్న ఒక అమరవీరుడి
స్థూపాన్ని కనుక్కుంటాను
వెలిసిపోయిన జెండాకు నెత్తురు పులుమి
కొత్త పొద్దుగా ఎగరేస్తాను.
(హెచ్‌.సి.యు విధ్వంసాన్ని చూసి)
– మౌనశ్రీ మల్లిక్‌, 8919338546

]]>
నగరం పునాది కింద https://navatelangana.com/under-the-city-foundation/ Sun, 06 Apr 2025 16:36:02 +0000 https://navatelangana.com/?p=540798 ఈ నగరం పునాది
ఎన్ని పచ్చని చెట్లను పెకిలించిందో కదా
నా తల గడ కింద
వన్నెల నెమళ్లు నాట్యం ఆడేవి కావచ్చు
కిర్రు మంటున్న ఆరాం కుర్చీ కింద
ఆకులు స రాగాలు కురిపించేవి
అందమ్కెన దశ్యాలన్నింటినీ ఆర్‌ సి సి
అస్తమయం చేసి అభివద్ది నంగనాచి మాటలు
సెలయేరు సవ్వడి చేసే చోట
మెషిన్‌ లు మోతాదు మించిన మోతలు
అందమ్కెన ఆకతుల రాళ్లను
క్రష్‌ ర్లు కంకర రాళ్లను చేశాయి
గుట్టలు గల్లంతు అయి పోయాయి
పశు పక్షాదులకు పరమాత్ముని వరంగా
దాహం తీర్చిన తాడి చెట్టు లోతు చెరువులు
లే అవుట్‌ కుట్ర లకు తాంబూలాలు గా
నీడను ఫలాల ను
ప్రసాదించిన వక్ష రాజులు గతించి
పక్షి కూడా వాలని మొక్కలు
పలు వరుసలుగా వెక్కిరిస్తున్నాయి
హౌర్డింగ్‌ బోర్డులు గాలిని బంధించాయి
చౌరస్తా దిక్కు తోచని కూడలి
రోడ్డు మీద నీడ కరువు అయి
ఎలెక్ట్రికల్‌ పోల్‌ కింద ఎతకాలిసిన రోజులు
పొలాల్లో రియల్‌ ఎస్టేట్‌ జెండాలు వెలిసి
కాసులు కూడ బెట్టు కోవడం కొత్త విద్య
NALA చట్టం నల్ల రేగడి నేలలను సైతం
నాగల్ల కు దూరం చేసి ఎండ పెట్టారు
తొవ్వ కు తోరణములు గా ద్రాక్ష తోటలు
పాత జ్ఞాపకాలు గా మిగిలి పాయె
పాడి పంటలు వదులుకుని రైతులు
ATM ముందు సెక్యూరిటీ గార్డులుగా నాగరికత అంతా ఇప్పుడు
అనుమతి లేని దిగుమతి సరుకు
మనిషి కోరికలను సమూలంగా కూల్చితేనె
చెట్టు చేమ కు తిరిగి న్యాయం చేకూర్చు
చల్లని గాలి కోసం తనువు తపస్సు
ఎయిర్‌ కండీషన్స్‌ ఎక్కువయి ఓజోన్‌ తుస్సు
నగరం పునాది కింద
లిఖించలేని విచ్చిత్తి పూడ్చ లేనంతగా ….
– దాసరి మోహన్‌, 9985309080

]]>