Darwaja Archives - https://navatelangana.com/category/darwaja/ Sun, 05 May 2024 16:55:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Darwaja Archives - https://navatelangana.com/category/darwaja/ 32 32 రేపటి సమాజానికి నేటి భరోసా https://navatelangana.com/todays-assurance-for-tomorrows-society/ Sun, 05 May 2024 16:54:54 +0000 https://navatelangana.com/?p=284205 For tomorrow's society Today's assuranceమహాకవి శ్రీశ్రీ 114వ జయంతిని, కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని తెలంగాణ సాహితి ఏప్రిల్‌ 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన శ్రామిక కవి సమ్మేళనం వర్తమానంలోని మతోన్మాద చర్యలను నిరసిస్తూ, ప్రజలు కలలుకంటున్న ప్రజాతంత్ర సమాజాన్ని హామీ ఇచ్చింది. మనుషులను మనుషులుగా కాకుండా కులాలుగా, మతాలుగా చూసే రోజు వచ్చిందని విచారం వ్యక్తం చేశారు అధ్యక్షత వహించిన ఏబూషి నర్సింహ. ”చీమలకు చక్కర వేసి – పాములకు పాలుపోసిన దయగల దేశం మనదేనా!? మరి మూకదాడులతో హింసోన్మాదం సష్టిస్తున్నం ఎందుకనీ? ఎందుకనీ?? పిల్లలూ దేవుడూ చల్లని వారని పాట పాడుకున్నోళ్ళం – మరి పిల్లల తల్లుల చెరిపి చంపుతె చూసి మాట్లాడ వెందుకనీ !? ఎందుకనీ!??” అంటూ వారు రాసి పాడిన పాట మతోన్మాద శక్తులను గల్లాపట్టి ప్రశ్నించింది.
”రెండు రెళ్ళు నాలుగన్నందుకు/ గుండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో/ క్షేమం అవిభాజ్యం అంటే/ జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో నే మనం ఇంకా ఉన్నాం” అంటూ – మనం నిజాలు మాట్లాడుతుంటే మన మీద నిప్పుల వర్షం కురిపిస్తున్న ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా మనం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉందంటూ ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కవి యాకూబ్‌ పిలుపు నిచ్చారు. మన చుట్టూ ఉన్న మనుషులను మనం మనుషులుగా కాకుండా వారి వేషధారణను బట్టి అనుమానించే రోజులు రావడం మన భారత రాజ్యాంగాన్ని అవహేళన చేయడమేనని నిరసించారు. ఈ సభకు విశిష్ట అతిథిగా వచ్చిన మహెజబీన్‌ ‘పౌరసత్వం అపహాస్యం చేయబడుతున్న వేళ/ ఖీబఅసaఎవఅ్‌aశ్రీ తీఱస్త్రష్ట్ర్‌ర ఏం చేసుకోను?’ ప్రశ్నే దేశ ద్రోహమవుతున్న వేళ నేను అస్తిత్వ వేదనా కెరటమై ఎగిసిపడక తప్పదంటూ మన పాలకుల అప్రజాస్వామిక ధోరణిపై ఆగ్రహ కవిత్వమై పోయారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఆనందాచారి మాట్లాడుతూ.. మార్క్స్‌ చెప్పిన సారాంశాన్నే శ్రీశ్రీ కవిత్వంగా అందించారని తెలిపారు. ఫాసిజం ప్రపంచమంతా, ముఖ్యంగా మన దేశంలో విస్తరించేందుకు యత్నిస్తున్న తరుణంలో శ్రీశ్రీ కవిత్వం మరింత అవసరమని అన్నారు. మనుషులను విభజిస్తున్న ఈ పరిస్థితిలో వర్గ సంఘర్షణతోనే మనిషి మనిషిగా మారతాడని తెలిపారు. హిందూ ముస్లీం ఘర్షణ జరిగిన ముజఫర్‌నగర్‌లో రైతు ఉద్యమంతో వర్గ సంఘర్షణ వారిని కలిపిందని చెప్పారు. అలాంటి సంఘ ర్షణకు ఉత్సాహమిచ్చే కవిత్వం రావాలని ఆకాంక్షించారు. సంపద సష్టికర్తలు శ్రామికులేననే విషయాన్ని జగమంతా చెప్పాలని పిలుపునిచ్చారు.
సుమారు 30 మంది కవులు పాల్గొన్న ఈ సమ్మేళనం దేశంలోని అసమానత్వాన్ని ప్రశ్నించింది. భారత రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పింది. మనుషుల మధ్య ఉండాల్సిన స్నేహ సంబంధాలు మతం ఎగదోస్తున్న మంటల్లో సజీవంగా ఆహుతి అవుతున్న దుఃఖ సమయానికి విచారం వ్యక్తం చేసింది. కార్మికుల, కర్షకుల స్వేద దరహాసాన్ని ఆవిష్కరించింది. ఏప్రిల్‌ 28న కాకతీయ యూనివర్సిటీలో సమూహ సమావేశంపై జరిగిన దాడిని సమ్మేళనం తీవ్రంగా ఖండించింది.
”ముళ్ళ మధ్య గులాబి పువ్వులాంటి సున్నితత్వం కార్మికుల నైపుణ్యం” అంటూ ఆలోచించదగిన కవిత వినిపించారు హనీఫ్‌. ”స్వదం అంటని పద్యాలకు పాదాలుండవు రెక్కలు తప్ప” అంటూ కోట్ల వెంకటేశ్వరరెడ్డి తన కవితలో ఉదయాస్తమయాల ఉనికిని ఎరుక చెప్పారు. ”పని పొగరు నా నెత్తిమీద రుమాలుకు నెమలీక రంగులద్ది నాట్యమాడుతది” అంటూ డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌ రాసిన కవితలో ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల కన్నా పని చేసుకొని బతకడమే మాకు గౌరవంగా ఉందంటూ శ్రమ జీవుల అంతరంగాన్ని ఆవిష్కరించారు. ”ప్రపంచీకరణ చంపుడు పందెంలో కుల వత్తుల ఉనికే తీరని ప్రశ్న” అంటూ మండల స్వామి రాసిన కవిత పనిముట్లకు పదునెక్కించిన వత్తి కార్మికుల ధైన్య స్థితికి అద్దం పట్టింది. ”ఎర్రటి ఎండల్లో నక్షత్రాల్లా మెరుస్తున్నారు కార్మికులు” అంటూ భాగ్య మంచి కవిత వినిపించారు.
”అవును. అతను మళ్ళీ ఈ దారిలోనే వస్తాడు. అతనికి స్వాగతం చెప్పేందుకు కొన్ని కొత్త పిడికిళ్ళను పోగేయాలి” అంటూ రేపటికి భరోసా కలిగించే కవిత్వం డా.చెమన్‌ వినిపించారు. ”అందమయిన వికత ముఖ చిత్రం” ఎలా ఉందో జ్వలిత వినిపిస్తూ సమాజం కారుస్తున్న మొసలి కన్నీటిని బట్టబయలు చేశారు. ”రాతి గోడలు, ముళ్ళ పొదల్లోని నిగూఢ రహస్యాలను, నిషేధించిన స్వప్నాలను” సి.హెచ్‌. ఉషారాణి తన కవితలో వినిపించారు. ”మానవ సంబంధాలకు వ్యాపారపు రంగుపూసి/ దుఃఖపు వాకిలిలో చేరగిలపడ్డామ” అంటూ ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ మలినమైన మానవ సంబంధాల మడత పేచీని విప్పి చెప్పారు. ”ప్రజాస్వామ్యం అంతా చిందర వందర గందరగోళమై శునకాలు చింపిన విస్తరి అయ్యింది” అంటూ మహేష్‌ దుర్గే తన కవితలో ఆవేదన వ్యక్తం చేశారు.
”మంచి మాటల నీతులు/ సమసమాజ నిర్మాణ రీతులు/ నీ కవితా జలపాతాలు/ కవీ, నీ గీతాలు” అంటూ డా. రాపోలు సుదర్శన్‌ శ్రీ శ్రీ పై కవిత వినిపిస్తే… ”నీ వెప్పుడూ/ నిప్పులు కక్కుతూ/ నింగికి ఎగిరే వాడివే/ నిప్పు కణికవై నిత్యం మాలో ప్రవహించే వాడివే” అంటూ నస్రీన్‌ ఖాన్‌ శ్రీశ్రీ ని మరోకోణంలో స్మరించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూసి కవి ఎంత బలంగా ప్రభావితం అవుతాడో చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాంటి వారిలో శ్రీశ్రీ కూడా అందుకు మినహాయింపు కాదు. అలాంటి కవి అవసరం నేడే ఎక్కువగా ఉంది. నేడు దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను అర్ధం చేసుకొని ప్రభావవంతమైన కవిత్వం రాయడం, తద్వారా సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం వర్తమాన కవులపై, మరి ముఖ్యంగా యువతపై ఉందని ఈ సమ్మేళనం అభిప్రాయపడింది. ఇంకా ఈ సమ్మేళనంలో కందుకూరి శ్రీరాములు, నాంపల్లి సుజాత, దాసరి మోహన్‌, కుడికాల వంశీధర్‌, ఉప్పల పద్మ, కొండా రవీంద్ర, ముజాహిద్‌, అశోక్‌ దుర్గం వారి వారి కవితలను వినిపించారు.
– ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌
98490 82693

]]>
ఒక ఉద్యకారుడి ముచ్చట https://navatelangana.com/an-entrepreneurs-passion/ Sun, 05 May 2024 16:53:42 +0000 https://navatelangana.com/?p=284202 An entrepreneur's passionభారత విప్లవ చరిత్రలో రైతాంగ పోరాటాలతో పాటుగా కార్మిక పోరాటాలకు కూడా మహౌన్నతమైన స్థానం ఉన్నది. అలాంటి చారిత్రక ఘటనల్లో తెలుగు నేల మీద తనదంటూ ఒక పోరాటాన్ని, ధిక్కారాన్ని చరిత్రలో బదిలీపరచుకున్నది సింగరేణి.
ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలో విస్తరించిన సింగరేణి బొగ్గుగనులోని కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉండేవి కనీస హక్కులు అమలు కానీ అలాంటి యాజమాన్య నియంతత్వం నుండి కార్మికులను విముక్తి చేసే దిశగా జరిగిన పోరాటాలు చెప్పుకోదగ్గవి.
సింగరేణి కార్మికుల పోరాటం కేవలం కార్మికుల హక్కుల కోసం, హక్కుల సాధన కోసం మాత్రమే జరిగిన పోరాటంగా కాక భారతదేశ ఆర్థిక విధానాల పైన సామాజిక రుగ్మతల పైన పోరాడినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకు ఉన్నది.
సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగిగా చేసి కార్మికుల హక్కుల కోసం పోరుబాటను ఎంచుకొని లాకప్పులు, పోలీసు చిత్రహింసలను, జైలు జీవితాన్ని, అజ్ఞాత జీవితాన్ని అనుభవించి ఆనాటి కాలానికి, పోరాట ఘట్టాలకు సాక్షి భూతమైన ఒక ఉద్యమకారుడు రాసిన తన స్వీయ జీవితమే ”బొగ్గు రవ్వలు” పుస్తకం.
ప్రపంచ పోరాటాల చరిత్రలో ఉద్యమకారుడే స్వయంగా రచయితగా మారి రాసిన అనుభవాలను పుస్తకంగా తెచ్చిన వారు చాలా తక్కువగా కనిపిస్తారు. అలాంటి బహు అరుదైన ఉద్యమ రచయితలలో గురి జాల రవీందర్‌ ఒకరు. ఇక్కడ విశేషమేమంటే రవీందర్‌ మొదటి నుండి రచయిత కాదు. గతంలో ఎలాంటి పుస్తకాలను ఆయన రాయలేదు. కానీ తాను చూసిన తాను భాగస్వామ్యమైన ప్రజా పోరాట కాలాన్ని అక్షరబద్ధం చేయడానికి ఆయన రచయితగా మారవలసిన అనివార్య స్థితిలోంచి ఈ పుస్తకాన్ని రాసాడు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పేరుకుపోయిన వెట్టి చాకిరి, భూస్వాముల దౌర్జన్యాలు, రైతు కూలీల సమస్యలపై విప్లవోద్యమం ప్రజలను చైతన్యపరచడంలో పూర్తి విజయాన్ని సాధించింది. ప్రజల కోసం జరుగుతున్న ఈ పోరాటం విద్యార్థులను కూడా ప్రభావితం చేసింది. దానితో అనేక మంది విద్యార్థులు పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచే బాధ్యతను తీసుకున్నారు. అదే సమయంలో తెలంగాణ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కార్మికులను కూడా ఈ పోరాటాలు ప్రభావితం చేసాయి. సింగరేణి ఉద్యోగులందరూ ఇదే జిల్లాల లోని గ్రామీణ ప్రాంతాల్లో నుండి వచ్చిన వారు కావడం వల్ల, రైతు కూలీ కుటుంబాల నుండి వచ్చిన వారైనందువలన ఈ పోరాటాలు సింగరేణి కార్మికులను సహజంగానే ప్రభావితం చేయగలిగాయి. గ్రామాల్లోని భూస్వామ్య సమస్యలు లాంటివే సింగరేణిలో ఉండటం వలన సింగరేణి యాజమాన్యం నియంతత్వాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసం సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.
ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా మందమర్రి బెల్లంపల్లి ప్రాంతాల్లో ప్రజలను యువకులను చైతన్య పరుస్తున్న క్రమంలో రవీందర్‌ గంగారాంకు పరిచయమయ్యాడు. సమాజ స్థితిగతులు ప్రజల బాధలు అవి మార్చవలసిన అవసరాన్ని గురించి గంగారం ఆలోచనలు రవీందర్‌ ను బాగా ప్రభావితం చేశాయి. అలా ప్రజల కోసం పనిచేయాలనే రవీందర్‌ ఆలోచన ఆయనను ఉద్యమంలో భాగస్వామ్యం చేసింది. ప్రభుత్వం పోలీసులు ఉద్యమకారులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, పరస్పర దాడులు.. దానితో ఉద్యమకారులు అజ్ఞాతంలోకి వెళ్లడం రవీందర్‌ ఆయన శ్రీమతి సరళా కూడా పోలీసులకు దొరకకుండా రహస్య జీవితంలోకి వెళ్లడం ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న నిర్బంధాలు, కష్టాలు పుస్తకంలో మనకు ఒక సినిమా లాగా కనిపిస్తాయి. పుస్తకం మొదటి నుండి చివరి వరకు కూడా వదిలిపెట్టకుండా చదివించే విధానంలో రవీందర్‌ తన మొదటి పుస్తకం తోనే విజయం సాధించాడు. సాధారణంగా మనం కాల్పనిక కథల్లో అలాంటిది చూస్తాం. కానీ పూర్తిగా యదార్ధ జీవిత సంఘటనలను మాత్రమే చెప్పిన రవీందర్‌ – సరళ ల ఉద్యమ జీవిత కథ అంతే ఏకబిగిన చదివించే విధంగా ఉండడం తో పాఠకుణ్ణి పూర్తిగా తనతో పాటుగా తీసుకెళుతూ ఆ సంఘటనల దశ్యాల్లో లీనం చేయడం గొప్ప విషయం. డేవిడ్‌ గిల్బర్ట్‌ రాసిన ‘లవ్‌ అండ్‌ స్ట్రగుల్‌’ స్వీయ కథలాగా రవీందర్‌ తన విప్లవ జీవితాన్ని మన పక్కన కూర్చొని చెబుతున్నట్టుగా ఉంటుంది. మరింత మెరుగైన సమాజం కోసం, స్వేచ్ఛకోసం, ఉదారమైన ప్రపంచం కోసం గిల్బర్ట్‌ కలలు కన్నాడు. తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొని జైలు జీవితంతో ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు. రవీందర్‌ జీవితంలో కూడా జైలు జీవితం ఒక ప్రత్యేకమైన ఘట్టం. జైలు అనగానే మన అందరి దష్టిలో ఉండే ఒక నేరపూరిత వ్యక్తులు ఉండే చోటుగా కాకుండా ఒక భిన్నమైన ఆలోచనత్మకమైన, మేధోపరమైన చర్చలతో కొనసాగే వ్యక్తులు మనకు జైలులో కనిపిస్తారు. ఎవరో అన్నట్టు జైల్లో ఉండవలసిన వారు బయట ఉన్నారు బయట ఉండవలసిన వారు జైల్లో ఉన్నారని అనిపిస్తుంది మనకు ఈ పుస్తకం చదివితే. రవీందర్‌ – సరళలు ఉద్యమం కోసం పనిచేసే క్రమంలో వేరువేరు చోట్ల ఉండాల్సి రావడం ప్రజల కోసం పనిచేసే క్రమంలో అజ్ఞాతంగా పోలీసులకు దొరకకుండా సరళ నెలల చంటి పిల్లతో ఊరూరు తిరగడం, దగ్గర వారు కూడా వాళ్ళ ఇళ్లలో ఉంచుకోవడానికి వెనకడుగు వేయడం అన్ని సంఘటనలు మన కళ్ళ ముందు రీళ్ళు రీళ్లుగా కదులుతుంటాయి. నిజానికి అజ్ఞాత విప్లవ మహిళా జీవితాల గురించిన సాహిత్యం గాని స్వీయ చరిత్రలు గాని మనకు బహు అరుదుగా కనిపిస్తాయి.
రవీందర్‌ పుస్తకంలో రాసిన ఆనాటి సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. భార్యాభర్తలిద్దరు ఉద్యమంలో పనిచేయడానికి వీలు లేకపోవటంతో ఉద్యమాన్ని వీడి బయటికి రావాలని నిర్ణయించుకోవడం, ఆ తర్వాత కోర్టులో లొంగిపోవడం వరకు పాఠకుడు ఎక్కడ ఆగకుండా చదివించే సన్నివేశాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. చాలావరకు విప్లవ సంఘాల్లో పని చేసేవారు విప్లవనిబద్ధతను, నిర్బంధాలను తట్టుకోలేక విప్లవ పార్టీల నుండి దూరం అవ్వడం మనం చూస్తుంటాం. కానీ పనిచేయడానికి సరైన అవకాశం పార్టీ ఇవ్వలేదని పార్టీ నుండి బయటికి వచ్చిన రవీందర్‌ – సరళ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. విప్లవ కార్యచరణలోని నిర్బంధాలతో పాటుగా మనుషులు నిత్య చైతన్యమవడం మనకు ఈ పుస్తకంలో చూస్తాం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ కాలంలో జరిగిన అనేక సంఘటనలు పత్రికలో మనం చదివిన కొన్ని సంఘటనలు, కొంతమంది వ్యక్తుల పేర్లు, ప్రాంతాలు మనకు తారసపడతాయి. తాను రచయితను కాను అని ముందే చెప్పుకున్న గురిజాల రవీందర్‌ తన స్వీయ విప్లవ జీవితాన్ని మనకు చెప్పిన ఒక సంభాషణగానే భావించాడు. కానీ ఈ పుస్తకం ఒక మంచి రచన కిందనే పరిగణించవచ్చు. ఉద్యమకారుడే రచయితగా మారి రాసిన బహు అరుదైన ఒక కీలక ప్రక్రియను మనకు ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ఒక మంచి రచయితగా మారే అనేక లక్షణాలు రవీందర్‌ లో ఉన్నాయనే విషయాన్ని ఈ పుస్తకం మనకు చెప్పకనే చెబుతుంది.సామాజిక అంశాలు ఎత్తి చూపే పుస్తకాలను ప్రచురించే పర్స్పెక్టివ్‌ ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

– చెమన్‌ , 9440385563

]]>
లౌకిక దేవాలయం కోసం https://navatelangana.com/for-a-secular-temple/ Sun, 05 May 2024 16:52:23 +0000 https://navatelangana.com/?p=284200 For a secular templeకూలి పోయిన గోడల మధ్య
నేనూ, ప్రజాస్వామ్యం నివాసముంటున్నాం
నెత్తిన ఆకాశమే పైకప్పు
సముద్రం ఆటుపోట్ల మధ్య
తూట్లు పడ్డ పడవలో మా ఉనికి
ఒకే బోనులో పులిని, మేకను కట్టేసినట్లుంది
ఈదురు గాలులు, వడగాడ్పుల మధ్య
మేం కాపురంలో వున్నాం చీకిపోయిన నూలుపోగులతో
సమాన హక్కుల శాలువా నేయబడుతూనే వుంది
చిరుగులపై అతుకులు, చింపుతూ నేస్తూనే వున్నారు
అతుకుల బొంతగా మార్చే ప్రయత్నం ఆగటం లేదు
శిధిలాల మధ్య మా కాపురం!
దీపం రెపరెపల మధ్య నిండు జీవితాలు
ప్రజాస్వామ్య ఉనికి మినుకు, మినుకు మంటుంది
నిందలు, అపనిందలు వీడి
ఆరోపణ, ప్రత్యారోపణలకు స్వస్తిపలికి
వెలుగు చీకట్ల మద్యైనా సరే రా నేస్తం
మానవ హారంగా ఓ వంతెనను నిర్మిద్దాం
అటునుంచి నువ్వు, ఇటు నుంచి నేను కదిలి
భారతీయ ఆత్మను మన కలయిక చిహ్నంగా
లౌకిక దేవాలయం నిర్మిద్దాం
– హనీఫ్‌, 9247580946

]]>
నెలపొడుపును తుంచటమే https://navatelangana.com/menstruation-is-interrupted/ Sun, 05 May 2024 16:51:12 +0000 https://navatelangana.com/?p=284198 చెట్టు పుట్ట గట్టులా
మందిర్‌ మసీదు చర్చీలు
చెలిమెలు నదులు సముద్రాలలా
రంగురంగుల పూలసమ్మేళనంలా భిన్నత్వంలో ఏకత్వం
ఆలయాలు మతప్రబోధకులెందరున్నా
అన్నం పెట్టేది రైతన్నలే గాయమైతే అమ్మనే తలిచేది
ఓదార్చేది అమ్మనే బతుకు దారి చూపేది నాన్ననే!
లేని జన్మల కోసం పాకులాడి
స్వర్గంకోసమని చెడ్డదారులకు సున్నమేయకు
సహదయంతో హరితగీతమై ప్రతిధ్వనించు
చేతులుంటే అశోకుడులా చెట్లు నాటు
నిందితుడు నవ్వడం కాదు
సామాన్యుడు నక్షత్రమై మెరువాలి
దేవుడు ఊరేగడము కాదు
మానవుడు మహాత్ముడై నడువాలి
దారిదప్పిన ఆలోచనలకు చరమగీతమై
సామాజిక ధర్మధ్వజం ఎగురవేరు
ద్వేషంతో అవమానించకు
భారతప్రజల చెమటతడుల సమ్మేళనమే భారత రాజ్యాంగం
అమ్మనాన్నలు కలిసి రాసిన రాజ్యపత్రం
నిచ్చెనకెన్ని మెట్లో అన్ని అవమానాలు
భూమికెన్నీ గాయాలో అన్ని అణచివేతలు
పీడితుల కన్ని దుఃఖాలు
సమతను తలపాగగా మనవత్వాన్ని శిఖరం చేశాడు
ప్రజాస్వామ్యాన్ని ఆకాశంగా స్వేచ్ఛను
హిమాలయం చేశాడు
ఓటు సకలజనుల హక్కుగా
సామాజిక న్యాయపు బావుటాగా
అస్తిత్వ చైతన్యపు జెండను ఎగరేసినందుకేనా రాజ్యాంగంపై బుద్దిలేని కూతలు
పెట్టుబడుల గారడీలతో అడుగడుగు విద్వేషపు కత్తులై ఊపిరినలిపె అరాచకాలు
భూగోళం వంటినిండా కురుపులు
గోవుమాంసపు యజమానులతో
ఎలక్టోరల్‌ బాండ్ల స్వైరవిహారాలు
సరిహద్దుల్లో నెత్తురు పండుగకాదు
సర్వప్రాణులపై ప్రేమను పంచు
నీ ఆశయం సూర్యుడైతే దారులన్ని వెలుగుచెరు
పవిత్ర భూమి ుణ్యనదులు
అద్భుత స్వయంభూ ఆలయాలు
రుషితుల్యులు త్యాగ ధనులు నడయాడిన నేలన రక్తాభిషేకాలేమిటి
పంట రాశుల సంకల్పాలు చెదలుపట్టి
డిల్లీలో రైతుల తండ్లాటలేమిటి
భక్తి ప్రబోధాలన్నీ బండల పాలా
మణిపూర్‌ ను మంట పెట్టడం
చందమామను కాల్చుకు తినటమే
సెక్యులరిజాన్ని చెరిపేయటం
నెలపొడుపును తుంచటమే
లౌకిక వాదమే ఈ దేశ తిలకం
భారత రాజ్యాంగమే ఈ దేశపు గుండె
– వనపట్ల సుబ్బయ్య, 9492765358

]]>
రంగు https://navatelangana.com/the-color/ Sun, 05 May 2024 16:50:06 +0000 https://navatelangana.com/?p=284195 రంగుఅతడు ..కురుక్షేత్ర నాటకంలో
శ్రీకృష్ణ పాత్ర వేసేడు గుర్తు పట్టేను
హరిశ్చంద్రలో నక్షత్రక పాత్ర వేసేడు గుర్తుపట్టేను
గయోపాఖ్యానంలో గయుడు పాత్ర వేసేడు గుర్తు పట్టేను!
యిలా.. అతడు ముఖానికి రంగేసుకున్నప్పుడల్లా పోల్చుకున్నాను!
యివాల.. బతుకు నాటకంలో.. అతడు యే రంగూ వేసుకోలేదు
అయినా.. పోల్చుకోలేక పోతున్నాను !
బహుశ .. ముఖానికి బదులు మనసుకు రంగేసుకున్నట్లున్నాడు !!
– సిరికి స్వామి నాయుడు

]]>
తర్జుమా తరంగిణి https://navatelangana.com/tarjuma-tarangini-3/ Sun, 05 May 2024 16:49:00 +0000 https://navatelangana.com/?p=284193 ముందుకా, వెనుకకా?

నేను ముందుకు కదిలానా,
లేక వెనుకనే ఉండిపోయానా? చెప్పడం కష్టం!
మనుషుల ప్రధాన స్రవంతిలోంచి
విడివడ్డానని మాత్రమే తెలుసు నాకు
నేను ముందు ఉన్నానా ేక వెనుక ఉన్నానా అనేదాన్ని
పైనుంచి చూస్తున్న వ్యక్తి చెప్పగలడు బహుశా
ఒకవేళ అతనూ నేనూ కలుసుకుంటే.
ఎప్పుడో ఒకసారి నేనక్కడికి చేరుకుంటానేమో,
అప్పుడు ఇక్కడి దృశ్యం కనిపించవచ్చు
నేను ముందు ఉన్నానా వెనుక ఉన్నానా
అనేదాన్ని నిర్ధారించుకునే అవసరముండదు అప్పుడు
మరాఠీ మూలం: ప్రఫుల్‌ శిలేదార్‌
ఆంగ్లానువాదం: మాయా పండిట్‌
తెలుగు సేత: ఎలనాగ

]]>
సాహితీ వార్తలు https://navatelangana.com/literary-news-31/ Sun, 05 May 2024 16:47:55 +0000 https://navatelangana.com/?p=284192 ఆహ్వానం
ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదారబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముప్పవరపు వెంకయ్య నాయుడు స్వగృహంలో చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక విశిష్టాద్వైత జాతీయ సాహిత్య పురస్కార సభ జరుగుతుంది. ఇందులో ముప్పవరపు వెంకయ్య నాయుడు, రేవూరి అనంత పద్మనాభరావు, శ్రీదేవి మురళీధర్‌, డా||వైష్ణవ వేంకటరమణమూర్తి, గార రంగనాథం పాల్గొంటారు.
పెందోట సాహిత్య పురస్కారాలు
పెందోట సాహిత్య పురస్కారాలకై 2023 సంవత్సరములు ముద్రితమైన 1. పద్య కావ్యాలు, 2. వచన కవిత సంపుటాలు 3. కథా సంపుటాలు 4. బాలకథ సంపుటాలు, 5 బాలగేయ సంపుటాలు, 6. బాల కవిత,గేయ, కథా సంకలనాలను రెండు ప్రతులను ఈ నెల 15వ తేదీలోపు ‘ఇంటి నంబరు 17-128/3, శ్రీనగర్‌ కాలనీ, సిద్దిపేట-502103’ చిరునామాకు పంపాలి. జూన్‌ నెలలో శ్రీ వాణి సాహిత్య పరిషత్‌ పదవ వార్షికోత్సవ సభలో నగదు బహుమతి, శాలువా, ప్రశంసా పత్రం ఇవ్వబడును
– పెందోట వెంకటేశ్వర్లు, 9440524546
గీతమ్‌ పురస్కారం కొరకు…
గీతమ్‌ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ కవితా సంపుటాల పోటీ నిర్వహిస్తున్నారు. అత్యుత్తమ సంపుటికి 10116/- రూపాయలు, జ్ఞాపికతో పురస్కారం వుంటుంది. 2016 నుండి 2024 మధ్య కాలంలో విడుదలైన సంపుటాల 3 కాపీలు ‘అధ్యక్షులు, గీతమ్‌ సాహితీ సంస్థ, పిఠాపురం – 533450’ చిరనామాకు జూన్‌ నెలలోపు పంపాలి. వివరాలకు : 9848398240.

]]>
గోర్‌ బంజారాల జీవితాలకు దర్పణం https://navatelangana.com/gor-is-a-mirror-to-the-lives-of-the-banjaras/ Sun, 28 Apr 2024 17:16:24 +0000 https://navatelangana.com/?p=279460 గోర్‌ బంజారాల జీవితాలకు దర్పణంగిరిజన సంచార తెగలు జాతిపరంగాను, భాషాపరంగాను, సంస్కతి సాంప్రదాయాలపరంగాను అందరికీ భిన్నంగా వుంటూనే ఆధునిక సమాజంలోని ప్రధాన స్రవంతిలో కలిసిపోయి జీవితాన్ని గడుపుతున్నారు. బంజారాల జీవన శైలి వేరు, ఆహార్యం వేరు, సాంప్రదాయాలు వేరు. వారి ఈ ప్రయాణంలో అనేక అవరోధాలు, కష్టాలు, కన్నీళ్లు వున్నాయి. నాగరికత అనుకునే సమాజంలో గిరిజనుల శ్రమ దోపిడి ఒక వైపైతే గిరిజన మహిళలపై లైంగిక పీడన మరో వైపు ఇంకా కనపడుతూనే వుంది. అలా గిరిజన తెగలకు చెందిన గోర్‌ బంజారా జీవితాలలోని పలు పార్శ్వాలను కథల ద్వారా వెలుగులోకి తెచ్చిన ఒక చైతన్యవంతమైన ప్రయత్నం ‘కేసులా’.

‘కేసులా’ శీర్షికతో, ‘గోర్‌ బంజారా’ ఉపశీర్షికతో కథల సంపుటిని ప్రొ||సూర్యా ధనంజరు, రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ సంపాదకత్వంలో తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించింది. ప్రధాన సంపాదకుడిగా జూలూరు గౌరీశంకర్‌ వ్యవహరించారు. సాధారణంగా మనం పిలుచుకునే మోదుగు పూలను గిరిజన భాషలో ‘కేసులా’గా వ్యవహరిస్తారు. ‘కేసులా’ గిరిజన సంస్కతికి, శ్రమ శక్తికి, శ్రమ సౌందర్యానికి ప్రతీక. వీరు అడవి తల్లితో మమేకమవుతారు, ప్రకతితో కలిసిపోతారు. సాధారణంగా కొండ గుట్టలు, అడవి ప్రాంతాలలో జీవనం సాగించే వీరు మైదాన ప్రాంతాలలో కూడా ఉంటూ చిన్నపాటి వ్యవసాయపు పనులు చూసుకుంటారు. ‘గోర్‌ మాటి’ పదబంధం లోని ‘గోర్‌’ పదం బంజారా సముదాయంలోని ‘స్వంత తెగకు చెందిన వ్యక్తుల’ను ఉద్దేశించినది. అనగా ఆ సముదాయానికి చెందిన వారేనని అర్ధం. బంజారా సముదాయానికి చెందని బయటి వ్యక్తులను ‘కోర్‌’ అని సంబోధిస్తారు. ‘కేసులా’ శీర్షికతో వచ్చిన సూర్యాధనంజరు కథలో హరిసింగ్‌ చదువుకున్నవాడు, నిరుద్యోగి కావడంతో తాగుడుకు బానిసై భార్యను హింసించడం, చివరికి తాగుడు వల్ల చనిపోతాడు. ఫలితంగా భార్య సోని ఒంటరిదవుతుంది. కష్టకాలంలో మోదుగు చెట్టులా నిబ్బరంగా ఉండాలి అని చనిపోయిన భర్త చెప్పినట్లు ఆమెకు భ్రమ కలుగుతుంది. ఈ కథలో స్త్రీని (సోని) మోదుగు చెట్టుతో పోల్చి చూపే ప్రయత్నం చేస్తుంది రచయిత్రి. సోని పరిస్థితికి కారణం ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వానిదా? మరో మార్గంలో కష్టించి జీవనోపాధిని చూసుకోలేక తాగుడుకు బానిసై బతుకును నాశనం చేసుకున్న హరిసింగ్‌ బలహీనతా? కానీ, ఆ స్త్రీ కష్టాలకు కారణం ఎవరా? అని ఆలోచించాల్సిన అవసరం పాఠకులకు కలుగచేస్తుంది. దేవేంద్ర కథ ‘పిడుగు’ అనే గిరిజన మహిళపై కిష్టయ్య పటేల్‌ కన్నుపడటం, తన ద్వారా లైంగికంగా కలిసి సంతానాన్ని కనివ్వమని అడగటం, సమయం చూసుకొని మేఘి భర్త భూక్యాని అంగడికి పంపించి ఒంటరిగా వున్న మేఘిని తన గుడిసెలోకి రప్పించుకోవడం, బయట వాన, లోపల అలజడి, అనుకోకుండానే కిష్టయ్య మీద పిడుగు పడి చనిపోవడం, నిస్సహాయురాలై వున్న తనను ప్రకతియే కాపాడిందని మేఘి భావించడంతో కథ ముగుస్తుంది. ముగింపు కాస్త సినిమాటిక్‌గా ఉందన్న భావన పాఠకుడికి కలగవచ్చు. తండా ప్రజల ఎదురుదాడి లేదా మరో విధంగానైనా వ్యక్తుల ప్రమేయంతో కిష్టయ్య లాంటి వారికి బుద్ధి చెప్పినట్లు చూపిస్తే బాగుండేది. సుజాత రచన ‘మౌనం ఖరీదు’ కథలో కావేరి పాత్ర గుండెను నులిమేస్తుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం వలన ఎంత నష్టం జరుగుతుందో, పంచాయతీలలో మధ్య పెద్ద మనుషుల్లా వ్యవహరించే వారి ద్వారా జరిగే అన్యాయం ఎలాంటిదో ఈ కథలో మనం చూడవచ్చు. సిల్మా నాయక్‌ కథ ‘అడ్డ కూలీలు’. ఇందులో మేఘ్లి పాత్ర, మౌనాన్ని దాటి మేస్త్రీ వల్ల పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి ముందు జాగ్రత్తలు తీసుకొని ఒక ‘ఖచ్చితమైన వైఖరి’ ని ప్రదర్శించి మోసానికి గురికాకుండా బయట పడుతుంది. కానీ మేఘ్లి తల్లి కేస్లీ, మేస్త్రీకి లొంగిపోయి చివరికి మోసానికి గురై ముంబాయి రెడ్‌లైట్‌ ఏరియాలోAIDS రోగంతో మత్యువాత పడుతుంది. జ్వలిత కథ ‘సంకల్పం’. ఊర్ల పంచాయతీ పనుల కోసమో మరో పనికోసమో వచ్చే పెద్ద మనుషులకు, అధికార్లకు వంట చేసిపెట్టే జానమ్మకు ఆ ఊరి మోతుబరి లచ్చునాయక్‌ చేసే రంకాటలు అన్నీ తెలుసు. ఊరి పరిస్థితులు, మహిళలు లైంగికంగా పీడించబడటం, బంజారాల్లోని అపరిశుభ్రత అలవాట్లు అన్నీ తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత జానమ్మది. ఇలా పల్లె పరిస్థితులను, సంచార జాతుల జీవనశైలిని, బంజారా మహిళలు ఏ విధంగా లైంగికంగా ఊరి మోతుబరి, సర్పంచ్‌ల చేతుల్లో పీడించబడుతారన్న విషయాలను కథలో చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది కథకురాలు. తన చిన్ననాటి స్నేహితురాలు ధ్వాళి బాగా చదువుకొని కలెక్టర్‌ కావడం, మరుగుదొడ్లు కట్టించడం అన్నీ తెలుసుకొని మురిసిపోతుంది జానమ్మ. ఇది ప్రభుత్వం అమలు చేసే స్వచ్ఛ్‌భారత్‌ లాంటి కార్యక్రమాలను గుర్తుకు తెస్తుంది. బంజారా జాతికి చెందిన ధ్వాళి, వారి జాతి మనుషులు మరుగుదొడ్లనే కాదు నీళ్లను కూడా వాడక ఆకులు వాడటం జానమ్మకు వింతగా తోస్తుంది. సంచారజాతుల అలవాట్లు తెలుసుకొని ఆశ్చర్య పోతుంది. ఈ కథ పరిశుభ్రత గురించి, ప్రభుత్వ లక్ష్యాలను, ఉన్నతాధికారుల బాధ్యతల విషయాలపై ఎరుకను కలుగజేస్తుంది. రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ కథ ‘దావ్లో,’ బంజారాల్లో పెళ్ళితంతు కార్యక్రమానికి సంబంధించిన కథా వస్తువుతో నడుస్తుంది. కథ చాలావరకు బంజారా భాషలో ఉంటూ వారి పద్ధతులు, సాంప్రదాయాలు కొంత వరకైనా కథ ద్వారా పాఠకులకు అందజేయాలనే తపన కథకుడిలో కనిపిస్తుంది. కథ శీర్షిక ‘దావ్లో’ పెళ్లి వీడ్కోలు సమయంలో పాడే పాట/ విలాప గీతం కావచ్చు. దుఃఖ స్వరంతో పాడుకుంటారు. మంగ్లీ వివాహ సందర్భంలోని దశ్యం ఈ కథా వస్తువు. బంజారా మహిళల ప్రత్యేక దుస్తులు, నగలు బంజారా భాషలో ప్రత్యేకమైన పేర్లతో ఉంటాయి. పెళ్ళైన స్త్రీల ఆభరణాలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ ఈ కథలో చూడవచ్చు. బండారు విజయ ‘జుమ్రీ’ కథలో బంజారాల్లో మగపిల్లాడు పుట్టే వరకు స్త్రీ కనాల్సిందేనన్న పంతం పెద్దలకుంటుందని, అలా జరగకపోతే మారు మనువుకు కూడా వెనకాడరన్న సంగతి తెలుస్తుంది. రాందాసుకు నలుగురు ఆడపిల్లలు. దాంతో సమస్య తలెత్తుతుంది. కానీ రాందాసు ధైర్యంగా తాను ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో వారి సలహా, సహాయం తీసుకుంటాడు. దానికి విధిత తమ దగ్గర డ్రైవర్‌గా పని చేసే రాందాసు పిల్లలను చేరదీస్తుంది. రాందాసు కూతురు జుమ్రీతో మరో సమస్య రావడం, విదిత ఆ సమస్యనెలా పరిష్కరిస్తుందన్నది ఈ కథలోని సారాంశం. 55 కథల సమాహారంగా వచ్చిన ఈ కథా సంపుటిలో లబ్ద ప్రతిష్టులైన రచయిత్రులు, రచయితలతో బాటు వర్ధమాన రచయిత్రులు, రచయితలూ వున్నారు. బంజార తెగకు చెందిన కథకులు, బంజారేతర కథకులు వున్నారు. అందరి కథలు సహజత్వానికి దగ్గరగా ఉండటం ‘కేసులా’ కథల విశేషం. గిరిజన జీవితాల గురించి, వారి జీవన శైలి, భాష, సాంప్రదాయలపై అవగాహన రావాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. ఇలాంటి మంచి కథల సంపుటిని వెలుగులోకి తెచ్చిన తెలంగాణ సాహిత్య అకాడమి కషి, సంపాదకుల శ్రమ ప్రశంసించదగినది.
– డా|| రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌,
99088 40196

]]>
వృద్ధుడు https://navatelangana.com/old-man/ Sun, 28 Apr 2024 17:12:50 +0000 https://navatelangana.com/?p=279457 old manఅర్ధరాత్రి
టేబుల్‌ ల్యాంప్‌ వెలుగులో చదువుకుంటున్న వద్ధుడితో
ఓ యువతి అంది
”తాతయ్యా! నీ ఆరోగ్యం సున్నితమయింది
నీ కంటి చూపు మందగించింది
ఇప్పటికే ఆర్ద్రరాత్రి అయింది నువిక పడుకోవాలి”
వృద్ధుడు తాను చదువుతున్న పుస్తకాన్ని మూసేసి
ఫ్రేం లేని కళ్ళద్దాల్ని తీసేసి నవ్వుతూ అన్నాడు
”ఓ పక్క తనను చంపడానికి
విషం తయారవుతూ వుంటే
సోక్రటీసు ఏమి చేస్తున్నాడో తెలుసా
తన పిల్లనగ్రోవిలో
కొత్త రాగం నేర్చుకుంటున్నాడు”
ఆంగ్ల మూలం : మోహన్‌ కుమార్‌
తెలుగు : వారాల ఆనంద్‌

]]>
ఆజాదీ హై కిస్కా https://navatelangana.com/azadi-hai-kiska/ Sun, 28 Apr 2024 17:09:26 +0000 https://navatelangana.com/?p=279455 Azadi Hai Kiskaప్రపంచజనుల బాధ తనబాధగా రాసాడని శ్రీశ్రీని, తన బాధను ప్రపంచబాధ చేసాడని కృష్ణశాస్త్రిని వ్యాఖ్యానిస్తుంటారు సాహిత్యకారులు. కాని, కవులంతా రుఢాలీలే అంటాడొక కవి. రుఢాలీలు కిరాయికి ఎవరి చావుకో, కర్మకాండలకో ఏడుస్తుంటారు. కొందరు సంపన్న వర్గాలవారు తమ దు:ఖాన్ని కూడా దు:ఖించలేరు. తనది కాని దు:ఖాన్ని తన దు:ఖంగా గీతించే వాగ్గేయకారుడు కవి. ఎవరివో వెక్కిళ్లు తన గొంతులో, ఎందరి వేదనలో తన కవిత్వంలో, సముద్రమై తాను, కెరటాలై తన కవితలు… నిరంతర ఘోష తన కవిత్వమై కవి నిత్య నూతనంగా… కరిపె రాజ్‌కుమార్‌ ‘ఆజాదీ’ కవితా సంకలనమౌతాడు.
‘వేట కొడవలి గాయాల…
పరిహాసపు పరంపరాగత వెక్కిళ్లు’ కవి గొంతులో,
‘అర్థనగ శరీరాలతో/ అక్షరశాలకెళితే/ ముక్కులు మూసుకునే/ కస్తూరీతిలకులు/ అపరాహ్న భోజనానికి/ సత్తుగిన్నెల్లోనే సద్దివడ్డింపులు/ అయినవారికి ఆకుల్లో/ కానివారికి కంచాల్లో’… (వెక్కిళ్ళు)
నిన్నమొన్నటిదాకా విశ్వవిద్యాలయాల్లోనూ ఎవరి ‘బంతి’వారిదే. కాకా హోటల్లో ఇప్పటికీ మా గ్లాసులు మావే. ఇదేం సమాజం. ఇదేం వేర్పాటు. వేలయేండ్ల అంటరానితనం ఇంకా.. ఎన్నెన్ని రూపాల్లో… ఎప్పటిదాక ఈ బాధ కవి గుండెల్ని తొలుస్తూనే వుంది. తండ్లాడిన గొంతుల్లో తడి ఆరని నినాదాలు.
గోవుకు, కుక్కకు, పిల్లులకున్న గౌరవం లేదా సాటి మనిషంటే. ఎందుకు వీళ్ల శాస్త్రాలు, చదువులు తగులబెట్టక.
‘దంతాలున్న ఒక పిచ్చి ఏనుగు/ దానిపై చెదలుపట్టిన అంబారీ/ చోద్యాలు చూసే మావటీలు’
మదపిచ్చి దంతాల ఏనుగు ధ్వంసరచన, హింసరచన చేసే విధ్వంసకారులకు ప్రతీక. దాని మీద చెదలుపట్టిన అంబారీ పురాతన సనాతనత్వానికి పీఠం. దీన్నంతా తమాషాగా చూసే మావటీలు మన ఏలికల ప్రతిబింబాలు. ధ్వంసరచనలతోనే వారికి గద్దెలు దక్కుతాయి. వాళ్ళ చర్యలు దంతమదగజ ధ్వంసనమే.
‘మూతులు కుట్టేసి, చేతులు కట్టేసి/ విద్వేషాగ్నులను రగిలించడం ఎంతసేపు?’…
వారికదో వినోదం. కుల, మత, జాతి, ప్రాంత విద్వేషాలను రెచ్చగొట్టి, మంటలు పెట్టడానికి ఎంతసేపు? సంయమన సాధన ఏముండదు. దొంగమాటలు తప్ప. వైవిధ్యాలను వైరుధ్యాలుగా మార్చి వివాదాలు పుట్టించేది వాళ్లే. వాళ్ళది అధికార మతం. నేటి సామాజిక పరిణామాల మీద గొప్ప సెటైర్‌ ఈ ‘పిచ్చి ఏనుగులు’ కవిత.
రోడ్ల విస్తరణ, ప్రాజెక్టుల ముంపులు ఎందరి జీవితాలను అస్తవ్యస్తం చేస్తాయి. కండ్ల ముందర తాతలనాటి ఇండ్లు, పొలాలు, తర తరాల చరిత్రలు కూలిపోతారు, మునిగిపోతారు. మనుష్యులు వలసపోవాలె. అధికార గారడీవాండ్ల చేతుల్లో గుంజకు కట్టిన అంగట్ల ముంగిసలై అల్లల్లాడుతారు ప్రజలు. నీళ్ల ముంపులో కొట్టుకుపోయిన గ్రామాల ప్రజలు త్యాగధనులుగా మిగిలిపోయారు.
‘ఆజాదీ’ కరిపె రాజ్‌ కుమార్‌ నాలుగవ కవితా సంపుటి. వైవిధ్యవస్తు సంపన్నమైన వచనకవితాకావ్యం. తనదొక ప్రత్యేక అభివ్యక్తిశైలి. తన కవితల నిండా తనదైన పదసంపద. భావంలో నవ్యత, భాషలో నవ్యత. కొత్త పదబంధకల్పన చేసాడీ కవి.
మీనాల మీసాలను/ అవలీలగా పట్టేయగలడు.
మార్కెట్‌ మాయలో పడని వినియోగదారుడు లేడు. ఎన్ని మాయాజలతారులు విసిరి జనాలను వెర్రివాళ్ళను చేస్తుంది అంగడి.
“Come buy, come buy” was still their cry./ Laura stared but did not stir,/ Long’d but had no money:/ The whisk-tail’d merchant bade her taste/ In tones as smooth as honey,/ The cat-faced purr’d,/ The rat-faced spoke a word/ Of welcome, / and the snail-paced even was heard;/ One parrot-voiced and jolly/ Criedw “Pretty Goblin” still for “Pretty Polly”—/ ‘One whistled like a bird.
ఎన్ని దొంగ ముఖాలతో వ్యాపారానికి దిగుతారో రాస్తుంది.
దేశమంతటా మొన్నటి భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరిగాయి. స్వేచ్ఛ ఎవరికి దక్కింది. ప్రజాస్వామ్యం ఎంత మిగిలింది?
విముక్తి పోరాటాలలో/ విగతజీవులైన వీరులెందరు?/ కార్మిక కర్షక ఉద్యమాలలో/ అస్తమించిన అమరులెవ్వరు?/ తాడోపేడో తేల్చుకునే సన్నద్ధతలో/ తలలు తెగిన తారకలెన్ని?/ జైళ్ళలో మగ్గి జీవచ్ఛవాలైన/ జాగృత వసంత కోకిలలెన్ని?
కవి రాజ్‌ కుమార్‌ వేస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానమెవరిస్తారు? బూటకపు ప్రజాస్వామ్య నాటకం ఎన్నినాళ్లు సాగిస్తారు ఏలికలు?
‘1947లో ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలిపోయారు/ ఇపుడు మనదేశం ఆజాదే/ దేశవాసులంతా ఇదే అంటారు కాని,/ నిజంగా మనం ఆజాదీలమేనా?/ మనం ఆజాదీలం కాదు, అదంతా మన భ్రమ/ నీలాకాశంలో ఎగిరే పిట్టలు ఆజాదీలు/ కాని, మనం మన ఇండ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడతాం/ రోడ్లమీద ఏ హంతకుడో మనకోసం కాచుకొని కూచున్నాడని/ మనం ఆజాదీలం కాదు, అదంతా మన భ్రమ!’ అంటుంది రీతి అనే కవయిత్రి… ఇదీ మన భారతం
రైతుల గురించి కవులందరు రాస్తారు కవితలు. కాని, రైతుజీవితాన్ని, రైతును ప్రజంట్‌ చేయడంలో వైవిధ్యముంటుంది. అన్నదాత రైతు ‘సేద్యగంధాల సైరికుడు,/ సేద్యబంధాల సైనికుడు’ అంటాడు కవి రాజ్‌ కుమార్‌. ‘లోకుల ఆకలి తీర్చడమే/ తన పరమావధిగా తలుస్తాడు / పదవీ విరమణ ఎరుగని పాంథుడు/ వ్యవసాయాన్ని వ్యసనంగా భావించిన వాడు’ అని రైతుని కవి వర్ణించాడు.
భారత్‌లోని మొత్తం సంపదలో 40 శాతం కేవలం ఒకశాతం ధనవంతుల దగ్గరే ఉందని, అట్టడుగున ఉన్న సగం జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని ప్రముఖ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ‘సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌’ పేరిట భారత్‌లోని ఆర్థిక అసమానతలపై సోమవారం నివేదిక తెలియచేసింది.
అదేమాట కవి కరిపె రాజ్‌ కుమార్‌ ‘జ్వాలాలేఖిని’ అనే కవితలో…
‘అధికాదాయ/ అల్పజన సమూహాలు/ అల్పాదాయ/ అధిక జనసందోహాలను అధికధరలతో ఆటలాడించవచ్చు, అప్రకటిత కుట్రలతో క్రీడించి ఓడించనూవచ్చు’ అంటాడు.
ఈనాడు దేశమంతటా వివక్షలు పెచ్చరిల్లాయి. మనుపెన్నడు లేని కుల, మత, జాతి, ప్రాంత వివక్షలు మనిషికి, మనిషికి మధ్య అంతరాలెక్కువై పోయాయి. మనుషులంతా ఒక్కటే అనే నినాదం చెల్లనిదైపోయింది… వసుధైక కుటుంబకమ్‌ అక్కరకు రాని హితవు.
‘నానా నాగరికతా పాయల నడుమ/ అనాగరిక కలుపుమొక్కగా అంకురించి/ విస్తరిల్లిన ఓ వివక్షతా విషవృక్షమా! మానవతను ఎన్నాళ్లు ఓడిస్తావ్‌?’ అని నిగ్గదీసి అడుగుతున్నాడు తన అగ్గిపదాలతో.
ఆజాదీ కవితాసంకలనం కవి ప్రాపంచిక దృక్పథానికి నిదర్శనం. కరిపె రాజ్‌ కుమార్‌ తానున్న సమాజాన్ని విశ్లేషించాడు. విషాల్ని గుర్తించాడు. విరుగుడుల్ని వివరించాడు. తనది మానవతావాదం. తన కవిత్వం సమస్తదుర్మార్గాల మీద సత్యాగ్రహం.

]]>
ఎవరు దోషి? https://navatelangana.com/who-is-guilty-2/ Sun, 28 Apr 2024 17:04:00 +0000 https://navatelangana.com/?p=279454 అతను నిర్దోషి అని నాకే కాదు నీకూ తెలుసు
నీది కేవలం ఉన్మాదం కాదని
నీకే కాదు నాకూ తెలుసు
నీ మాయల మాంత్రిక
డిజిటల్‌ భూతపు నోట్ల కత్తిరింపులైనా
మేము బీళ్ళు దున్నుతున్నప్పుడు
నువ్వు నాగళ్ళ మొనలు విరవడమైనా
తలాపున మొలిచిన హత్రాస్‌ గుడిలో
పదేండ్ల పసిపాప గర్భాల్ని చీల్చడమైనా
అసహాయుల గుండెల మీద
నీ బుల్‌డోజర్‌ విషనాగుల విధ్వంస నత్యమైనా
ఎదుట కనిపించే దశ్యం ఒక్కటే నిజం కాదని
కనిపించని యవనికల మాటున దాచిన
కుట్రల కత్తులు వేరొకటని
నాకు తెలుసనే విషయం నీకు తెలవడం లేదు…
ఈ మట్టి బిడ్డలను మా నేలనుంచి పరాయీకరించే
నీ ‘కా’ వు కావు అరుపులు
కేవలం కాషాయీకరణ మాత్రమే కాదనీ
కాశ్మీర్‌ ను విడగొట్టి పడగొట్టే నీ పెట్టుబడి కుట్ర
గోముఖ వ్యాఘ్ర శ్యాముని అర్జీకి
నువ్వు సమర్పించే వాగ్థాన సంరంభ
ప్రసాదం మాత్రమే కాదనీ
రామరాజ్య ప్రేలాపనలో
రామ్‌ లల్లా ప్రతిష్ఠాపనలో
మూర్తీభవించిన మతవాద మూఢత్వం మాత్రమే కాదనీ
నాకు తెలుసనే విషయం నీకు తెలవడం లేదు
ఈ పది హేమంతాల ఉన్మాదపు మండే ఎండలకు
హిందూ సంద్రపు హదయంలో మానవత ఆవిరయ్యింది
నీ దేవుడి సాక్షిగా చీల్చబడ్డ కతువా మానాల గాయాలకు
భీతిల్లిన వక్షాలు పుష్పవతులవ్వడం మానేసినయి
నీ రాకాసి మూకల దాడులకు గుండె పగిలిన
నా లక్షల హెక్టార్ల ఛాతీ మీది పర్వతశ్రేణులు
వుట్టి రాతి కుప్పలైనవి
అమత్‌ భారత్‌, అచ్ఛేదిన్‌, సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌
మేడిపండు విప్పినందుకు
మా విజ్ఞులు కల్బుర్గిలైనరు, గౌరీ లంకేష్‌ లైనరు
డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ లైనరు…
అయినా, మా సమూహ గానం ఆగదు
మా సామాజిక చేతన ఆగదు
ఎప్పటికైనా నాటకానికి తెరపడుతుంది
నీ ఏకపాత్రాభినయం ముగుస్తుంది
– డా|| కాసుల లింగారెడ్డి

]]>
ఒకే ఆకాశం కింద…. https://navatelangana.com/under-the-same-sky/ Sun, 28 Apr 2024 17:02:04 +0000 https://navatelangana.com/?p=279451 ఒకే నేల ఒకే ఆకాశం
ఒకే గాలి ఒకే నీరు
ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు
మనసు పొరల్లో పేలడానికి
సిద్ధంగా ఉన్న భూకంపాలు వేరు
తుకతుక ఉడుకుతున్న అగ్నిపర్వతాలు భిన్నం
ఒక చోట నీరు జీవధార అయితే
మరోచోట ఉప్పెనై బతుకు తీర సారాన్ని ముంచెత్తుతుంది
ఓకే మనిషి ఓకే మనసు
ఒకే ప్రపంచం ఒకే జీవజాలం
ఒకే కాంతి ఒకే వెన్నెల
పక్కా రహదారి అడుగులో కనిపించని
కాలిబాట అడుగుజాడలు వైవిధ్యం
కలగని దూరబారాన్ని చింతిస్తుంది
ఒక్క దగ్గర అనుభవం పాఠం అయితే
మరొక దగ్గర గుణపాఠమై
లోకాన్ని గొప్ప మలుపు తిప్పుతుంది
ఒకే వాంఛ ఒకే ఐక్యం
ఒకే ఇంట ఒకే జంట
ఒకే ప్రాణం ఒకే గానం
ఒక్క చోట నిలువని కాలం
మరో చోట నీడను కోల్పోయిన ఆకారం
మన్నూ మిన్నులా నిన్నూ నన్ను కలిపింది
ఒకే ఆకాశం కింద ఉదయంలా
కన్ను తెరిచిన స్వప్నం
నిజం ఉద్వేగంగా మొగ్గ తొడిగి
ఉసూరుమని ఉడిగిపోయిన
కలవర జీవన ప్రయాణం
– జూకంటి జగన్నాథం

]]>