Deepika Archives - https://navatelangana.com/category/deepika/ Fri, 07 Mar 2025 08:50:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Deepika Archives - https://navatelangana.com/category/deepika/ 32 32 నారిని గౌరవించాలి .. https://navatelangana.com/nari-should-be-respected/ Fri, 07 Mar 2025 08:50:49 +0000 https://navatelangana.com/?p=518217
Women should be respected..– నిజామాబాద్ బి డబ్ల్యు ఓ రసూల్ బీ

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మహిళలు ఇంటికి పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలి. మహిళ అంటే ఒక కుటుంబానికి సెక్యూరిటీ. కుటుంబం బాగుండాలని కోరుకునేవారు. మానసికంగా సపోర్టు చేయాలి. తల్లిని పిల్లలు గౌరవించాలి. ప్రతి దాంట్లో చిన్న పిల్లలు, మహిళలపై ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. చిన్ననాటి నుండే పిల్లలకు మహిళల చట్టాలపై అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలకు హద్దులను నేర్పించాలి. మంచి చెడు చెప్పాలి. పనిచేయడం నేర్పించాలి. మహిళలకు స్వయంకృషి ఉండాలన్నారు.మహిళల రక్షణకు కేవలం చట్టాలే సరిపోవని అభిప్రాయపడ్డారు. మహిళల పట్ల కుటుంబ వ్యవస్థలోనే మార్పులు జరగాలని అన్నారు. స్వయంకషితో ప్రస్తుత సమాజంలో ఎదగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకని గుణంగా ప్రభుత్వం సైతం స్వయంకృషిగా ఎదిగేందుకు మహిళలకు అన్ని విధాల కృషి చేస్తుంది. తల్లిదండ్రులు చిన్నతనం నుండే చిన్నపిల్లలు బాలుడైన, బాలిక అయిన ఇద్దరినీ ఒకేలా చూడాలి. వారిద్దరి మధ్య వ్యత్యాసం చూపడం వల్లే ఇంట్లో నుండి బయటకు వెళ్లిన బాలురు కూడా బయటవారితో అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి చిన్నతనం నుంచి మంచి అలవాట్లు మంచి గుణాలు నేర్పించాలి.
]]>
రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి.. https://navatelangana.com/we-should-move-forward-in-the-spirit-of-the-constitution/ Sun, 26 Jan 2025 10:35:09 +0000 https://navatelangana.com/?p=490890
We should move forward with the spirit of the Constitution.. బార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల లో బహుమతుల ప్రధానం

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ అనేక మందికి మహనీయుల త్యాగాలతో భారత దేశ స్వతంత్రం సాధించిందని వారి త్యాగాలు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించిందని రాజ్యాంగ ప్ స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు గణతంత్ర వారసత్వాన్ని కొనసాగించాలని అన్నారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అతిథిగా జిల్లాకోర్టు ప్రాంగణంలోని పిపి గంగారెడ్డి మెమోరియల్ హల్ లో బహుమతులు ప్రధానం చేసినట్లు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. క్రీడలలో గణతంత్ర స్ఫూర్తిని నింపి వివిధ రకాల క్రీడలను నిర్వహించినట్లు తెలియజేశారు. జిల్లాజడ్జి సునీత మాట్లాడుతూ ఆటలు అందరిని ఆలరించాయని అన్నారు. బహుమతులు మరింత క్రీడల పురోగతికి పురికొల్పాలని ఆమె ఆకాంక్షించారు.న్యాయమూర్తులకు,న్యాయవాదులకు,పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కు,న్యాయసిబ్బందికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జిలు కనకదుర్గ,శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జిలు పద్మావతి, శ్రీకాంత్ బాబు జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భు ఉపాధ్యాయ్, గోపికృష్ణ, చైతన్య, హరి కుమార్,శ్రీనివాసరావు, బార్ ఉపాధ్యక్షుడు రాజు,ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కార్యదర్శి దొన్పల్ సురేష్,కోశాధికారి దీపక్ తదితరులు పాల్గొన్నారు.
]]>
విద్యుత్‌ బల్బుల్లో ఉండే వాయువు ఏది? https://navatelangana.com/what-is-the-gas-in-electric-bulbs/ Sat, 19 Oct 2024 17:20:34 +0000 https://navatelangana.com/?p=420396 What is the gas in electric bulbs?1. భారాత్మకంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌లో సగభాగం నీటితో కలిపితే ముద్దగా మారి కొంత కాలం తర్వాత గట్టి పదార్థంగా మారుతుంది. దీన్నే ‘సెట్టింగ్‌’ అని అంటారు. ఈ ప్రక్రియలో ఘనపరిమాణం పెరగడంతో పాటు?
ఎ. కార్బొనేషన్‌ జరుగుతుంది బి. నిర్జలీకరణం (డీహైడ్రేషన్‌) చోటు చేసుకుంటుంది.
సి. హైడ్రేషన్‌ జరుగుతుంది డి. హైడ్రోజనీకరణం సంభవిస్తుంది.
2. విరిగిన ఎముకలు సరైన స్థానాల్లో సెట్‌ చేయడానికి సిమెంట్‌ పట్టిగా దేన్ని ఉపయోగిస్తారు?
ఎ. జిప్సం బి. సున్నం
సి. సిమెంట్‌ డి. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌
3. ఒక భాగం తడి సున్నం, మూడు భాగాల ఇసుక, నీరు బాగా కలిసి ఉన్న మిశ్రమాన్ని ఏమంటారు?
ఎ. లైమ్‌ మోర్టార్‌ బి. లైమ్‌ సిమెంట్‌
సి. రేయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ డి. ఏదీ కాదు
4. గాజు అనేది కింది వాటి మిశ్రమం?
1.సోడియం సిలికేట్‌ 2. కాల్షియం సిలికేట్‌ 3. సిలికా
ఎ. 1,2 మాత్రమే బి. 2,3 మాత్రమే
సి. 1,2,3 డి. 1,3 మాత్రమే
5. గాజును నెమ్మదిగా చల్లార్చడాన్ని మందశీతలీకరణం అంటారు. దీని వల్ల గాజుకు?
ఎ.పెలుసుదనం వస్తుంది బి. అధిక బలం లభిస్తుంది
సి. మందం ఎక్కువ అవుతుంది డి. ఏదీకాదు
6. గాజుకు ముఖ్యమైన ముడి పదార్థం అయిన ఇసుక రసాయన నామం?
ఎ. సిలికాన్‌ బి. సిలికా సి. అల్యూమినా డి. మార్బుల్‌
7. రసాయనికంగా క్వార్ట్జ్‌ అనేది వీటిలో ఏది?
ఎ. కాల్షియం సిలికేట్‌ బి. సిలికాన్‌ ఆక్సైడ్‌ సి. సోడియం సల్ఫేట్‌ డి. కాల్షియం సల్ఫేట్‌
8. టాల్క్‌లో ఉండే రసాయనం?
ఎ. మెగ్నీషియం ఆక్సైడ్‌ బి.మెగ్నీషియం
సి. మెగ్నీషియం డై ఆక్సైడ్‌ డి. కాల్షియం కార్బొనేట్‌
9. మనం తినే పాన్‌ను చేసేటప్పుడు తమలపాకుపై రాసే సున్నపు తేట రసాయన నామం?
ఎ. కాల్షియం కార్బొనేట్‌ బి. కాల్షియం హైడ్రాక్సైడ్‌
సి. కాల్షియం ఆక్సైడ్‌ డి. కాల్షియం సల్ఫేట్‌
10. సున్నపు తేటను పాలవలె మార్చే వాయువు?
ఎ. బొగ్గు పులుసు వాయువు (కార్బన్‌ డై ఆక్సైడ్‌) బి. కార్బన్‌ మోనాక్సైడ్‌
సి. నైట్రోజన్‌ డి. సల్ఫర్‌ డై ఆక్సైడ్‌
11. బ్లీచింగ్‌ పౌడర్‌ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?
ఎ. క్లోరిన్‌ బి. ఆక్సిజన్‌ సి. ఫ్లోరిన్‌ డి. అయొడీన్‌
12. మామిడి కాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బైడ్‌ ముద్దలను ఉపయోగిస్తారు. తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది?
ఎ. ఇథిలీన్‌ బి. ఎసిటలీన్‌ సి. క్లోరోఫాం డి.హైడ్రోజన్‌
13. సిమెంటు తయారీకి కావాల్సిన ప్రధాన ముడి పదార్థం?
ఎ. ఇసుక బి.సున్నపురాయి డి.సోడాయాష్‌ డి.ఏదీకాదు బి
14. కింది వాటిలో సిమెంటు పరిశ్రమకు అవసరమైంది?
ఎ.సున్నపురాయి బి.బంకమన్ను సి.బొగ్గు డి.అన్నీ
15. సిమెంట్‌ తయారీలో చిట్ట చివర కలిపే పదార్థం?
ఎ.బంకమన్ను బి.సిలికా డి.సున్నపురాయి డి.జిప్సం
16. గాజు వస్తువుల బ్లోయింగ్‌కు ఉపయోగించే మంట?
ఎ.ఆక్సిజన్‌-ఎసిటలీన్‌ టార్చి బి.హైడ్రోజన్‌ టార్చి
సి.కోక్‌ మంట డి.కట్టెల మంట
17. ఫేస్‌ పౌడర్‌కు అవసరం లేని గుణం?
ఎ.అపారదర్శకత బి.జారుడు గుణం
సి.శోషణం డి.గరుకుదనం
18. పౌడర్‌లో అపార దర్శకత (కప్పి ఉండే సామర్థ్యం) కోసం దేన్ని ఉపయోగిస్తారు?
ఎ. టైటానియం డై ఆక్సైడ్‌ బి. సిలికాన్‌ డై ఆక్సైడ్‌
సి.బంకమన్ను డి.సుద్ద
19. సున్నపు తేటను గోడలకు వెల్ల వేసినప్పుడు అది గాలిలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ పీల్చుకుని తెల్లగా మారుతుంది. ఇందులో చివరగా ఏర్పడే పదార్థం?
ఎ.కాల్షియం కార్బొనేట్‌ బి.కాల్షియం సల్ఫేట్‌
సి.కాల్షియం కార్బైడ్‌ డి.కాల్షియం ఫాస్ఫేట్‌
20. మున్సిపల్‌ వాటర్‌ను శుద్ధి చేసే ప్రక్రియ?
ఎ. ఆక్సీజినేషన్‌ బి. క్లోరినేషన్‌ సి.అయొడినేషన్‌ డి.హైడ్రేషన్‌
21. చాకలి సోడా రసాయన నామం?
ఎ.సోడియం కార్బొనేట్‌ బి.సోడియం బై కార్బొనేట్‌
సి.సోడియం క్లోరైడ్‌ డి.సుక్రోజ్‌
22. సాధారణ ఉప్పు(టేబుల్‌ సాల్ట్‌) రసాయన నామం?
ఎ.సోడియం సల్ఫేట్‌ బి.సోడియం క్లోరైడ్‌
సి.సోడియం హైడ్రాక్సైడ్‌ డి.సోడియం ఫాస్ఫేట్‌
23. రాళ్లలో, ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో ఉండే మూలకం?
ఎ.సిలికాన్‌ బి.కార్బన్‌ సి.ఐరన్‌ డి.అల్యూమినియం
24. క్యాన్సర్‌ చికిత్సకోసం ఉపయోగించే మలాము(ఆయింట్‌మెంట్‌) లో వాడేది?
ఎ.అయోడిన్‌ బి.బ్రోమిన్‌
సి.రేడాన్‌ డి.రేడియం
25. ఏక పరమాణుక వాయువు ఏది?
ఎ.హైడ్రోజన్‌ బి.ఆక్సిజన్‌
సి.నైట్రోజన్‌ డి.హీలియం
26. గాల్లోని జడవాయువుల్లో గరిష్టంగా ఉండేది?
ఎ.హీలియం బి.నియాన్‌ సి.ఆర్గాన్‌ డి.క్రిష్టాన్‌
27. విద్యుత్‌ బల్బుల్లో ఉండే వాయువు ఏది?
ఎ.ఆక్సిజన్‌ బి.కార్బన్‌ డై ఆక్సైడ్‌ సి.ఆర్గాన్‌ డి.నైట్రోజన్‌
28. సముద్రపు లోతుల్లోకి వెళ్లే ఈతగాళ్ల శ్వాసక్రియకు సహాయపడేందుకు ఆక్వాలంగ్‌ పరికరాలను వాడతారు. వీటిలో ఉండే వాయు మిశ్రమం ఏది?
ఎ.10శాతం ఆక్సిజన్‌, 90శాతం నైట్రోజన్‌
బి.20శాతం ఆక్సిజన్‌, 80శాతం నైట్రోజన్‌
సి.20శాతం హీలియం, 80శాతం ఆక్సిజన్‌
డి.20శాతం ఆక్సిజన్‌, 80శాతం హీలియం
29. సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియ?
ఎ.హైడ్రోజన్‌ సంలీనం బి.రేడియం సంలీనం
సి.హీలియం సంలీనం డి.నైట్రోజన్‌ సంలీనం
30. బొగ్గుగని కార్మికుల టోపీలైట్లలో వాడే వాయువు?
ఎ.క్రిస్టాన్‌ బి.హీలియం సి.నియాన్‌ డి.ఆక్సిజన్‌
31. జతపర్చండి?
ముడిపదార్థం ఉత్పాదితం
1. లైమ్‌స్టోన్‌ ఎ.పోర్సిలీన్‌
2. జిప్సం బి.గ్లాస్‌
3. సిలికా ఇసుక బి.ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌
4. మట్టి డి.సిమెంట్‌
ఎ. 1-ఎ 2-బి 3-సి 4-డి
బి. 1-డి 2-సి 3-బి 4-ఎ
సి. 1-ఎ 2-సి 3-డి 4-బి
డి. 1-డి 2-ఎ 3-సి 4-బి

సమాధానాలు
1.సి 2.డి 3.ఎ 4.సి 5.బి 6.బి 7.బి 8.బి 9.బి 10.ఎ 11.ఎ 12.బి 13.బి 14.డి 15.డి 16.ఎ 17.డి 18.ఎ 19.ఎ 20.బి 21.ఎ 22.బి 23.ఎ 24.సి 25.ఎ 26.సి 27.సి 28.డి 29.ఎ 30.ఎ 31.బి

]]>
జలచక్రం అంటే ఏమిటి? https://navatelangana.com/what-is-water-cycle/ Sat, 19 Oct 2024 17:17:11 +0000 https://navatelangana.com/?p=420386 What is water cycle?పర్యావరణంతో శతాబ్దానికి పైగా మనిషి ఆడుతున్న ప్రమాదకరమైన ఆట పెను విపత్తుగా పరిణమిస్తోంది. దీని తాలూకు విపరిణామాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, మితిమీరిన వాతావరణ కాలుష్యం తదితరాల దెబ్బకు చివరికి భూమిపై జీవకోటి మనుగడకు అత్యవసరమైన జలచక్రం కూడా గతి తప్పింది. అంతర్జాతీయ నిపుణుల సమూహమైన గ్లోబల్‌ కమిషన్‌ ఆన్‌ ద ఎకనామిక్స్‌ ఆఫ్‌ వాటర్‌ చేపట్టిన అధ్యయనం ఈ మేరకు తేల్చింది.
‘చరిత్ర పొడవునా అత్యంత భారీ వాతావరణ మార్పులనెన్నింటినో తట్టుకుని నిలిచిన జలచక్రం ఇలా సంతులనం కోల్పోవడం మానవాళి చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి అతి త్వరలోనే పరాకాష్టకు ఖాయం’ అని అక్టోబర్‌17వ తేదీ విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మనిషి నిర్వాకం వల్ల చోటు చేసుకుంటున్న పర్యావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమంటూ కుండబద్దలు కొట్టింది. ‘దీనివల్ల ఆహార సంక్షోభం మొదలుకుని పలు రకాల విపరిణామాలు తలెత్తనున్నాయి. వీటి దెబ్బకు త్వరలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం కావడం ఖాయం’ అని జోస్యం చెప్పింది.
ఏమిటి జలచక్రం?
జలచక్రం భూమిపై నీటి కదలికలకు సంబంధించిన సంక్షిష్టమైన వ్యవస్థ. చెరువులు, నదులు ముఖ్యంగా సముద్రంలోని నీరు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరిగా వాతావరణంలోకి చేరుతుంది. భారీ నీటి ఆవిరి మేఘాలుగా మారి సుదూరాలకు పయనిస్తుంది. శీతల వాతావరణం ప్రభావంతో చల్లబడి వానగా, మంచుగా తిరిగి నేలపైకి చేరుతుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి జలచక్రంగా పేర్కొంటారు. మనిషి చేతులారా చేస్తూ వస్తున్న పర్యావరణ విధ్వంసం ధాటికి దీనిపై కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరగని స్థాయిలో ఒత్తిడి పడుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అది భరించలేని స్థాయికి చేరిందని అధ్యయనం వెల్లడించింది. దశాబ్దాల తరబడి భూమిని విచ్చలవిడిగా విధ్వంసకర విధానాలకు వాడేయడం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు నీటి నిర్వహణలో కనబరుస్తున్న లెక్కలేనితనం దాకా జలచక్రం గతి తప్పేందుకు దారి తీసిన పలు కారణాలను నివేదిక ఏకరువు పెట్టింది.
గతి తప్పితే అంతే…
జలచక్రం గతి తప్పితే జరిగే చేటును తాజా నివేదిక కళ్లకు కట్టింది.
– కేవలం నీటి ఎద్దడి దెబ్బకు 2050 నాటికి దాదాపుగా అన్ని దేశాల జీడీపీ కనీసం 8శాతం, అంతకుమించి తగ్గిపోతుందని అంచనా. అల్పాదాయ దేశాల జీడీపీలో 15 శాతానికి పైగా క్షీణత నమోదు కావచ్చు.
– దీని ప్రభావంతో ఏకంగా 300 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా దేశాల్లో పంటలూ నేల చూపులు చూస్తున్నాయి. భారీ భవనాలు తదితరాల తాలూకు ఓపలేని భారానికి తోడు భూగర్భ జల వనరులూ నిండుకుంటుండటంతో నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత వేగంగా భూమిలోకి కూరుకుపోతున్నాయి.
– నీటి సంక్షోభం ఇప్పటికే ప్రపంచ ఆహారోత్పత్తిని 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తోంది.
హరిత జలం అతి కీలకం
చెరువులు, నదుల వంటి జలాశయాల్లోని నీటిని బ్లూ వాటర్‌ అంటారు. మట్టి, మొక్కల్లో నిల్వ ఉండే తేమను హరిత జలం అని పేర్కొంటారు. మనం ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఈ నీటి వనరును జలచక్రంలో అతి కీలకమైన పొరగా నివేదిక ఆభివర్ణించింది. ‘ప్రపంచ వర్షపాతంలో ఏకంగా సగానికి పైగా దీనివల్లే సంభవిస్తోంది. భూమిని వేడెక్కించే కర్బన్‌ ఉద్గారాలను చాలా వరకు శోషించుకునేది ఈ హరితజలమే’ అని తేల్చింది. కానీ ‘ఏ దేశంలో చూసిన చిత్తడి నేలలను నాశనం చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు అడవులనూ విచ్చలవడిగా నరికేస్తున్నారు. దాంతో కర్బన ఉద్గారాలు నేరుగా వాతావరణంలోకి విడుదలైపోతున్నాయి. ఫలితంగా గ్లోబల్‌ వార్మింగ్‌ ఊహాతీత వేగంతో పెరిగిపోతోంది. మట్టిలో, చెట్లలో ఉండే తేమ హరించుకుపోతోంది. ఇదో విషవలయం. దీని దెబ్బకు కార్చిచ్చుల ముప్పు కూడా నానాటికి పెరుగుతోంది’ అని నివేదిక హెచ్చరించింది.

]]>
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడే జానాభా శాతం? https://navatelangana.com/percentage-of-population-dependent-on-agriculture-in-telangana-state/ Sat, 05 Oct 2024 17:27:39 +0000 https://navatelangana.com/?p=411279 Percentage of population dependent on agriculture in Telangana state?1. ఈ క్రింది వాటిని సరిగా జతపర్చుము (2016-17 ప్రకారం).
1. నికరసాగు విస్తీర్ణం ఎ.5.42%
2. బంజరు భూములు బి.2.67%
3. శాశ్వత గడ్డి భూములు సి.7.60%
4. వ్యవసాయేతర ప్రయోజనాలకు
అట్టిపెట్టిన భూములు డి.42.59%
1.1-ఎ,2-బి,3-సి,4-డి 2.1-డి,2-ఎ,3-బి,4-సి
3.1-సి,2-డి,3-ఎ,4-బి 4.1-బి,2-సి,3-డి,4-ఎ
2. ఈ క్రింది వాటిని సరిగా జతపర్చుము.
1. అటవీ విస్తీర్ణం ఎ.24.07%
2. ప్రస్తుత బీడు భూములు బి.5.97%
3. ఇతర బీడు భూలులు సి.1.62%
4. సాగుకు పనికి వచ్చే వ్యర్ధ భూములు డి.9.06%
1.1-ఎ,2-డి,3-బి,4-సి 2.1-డి,2-సి,3-బి,4-ఎ
3.1-డి,2-బి,3-సి,4-ఎ 4.1-బి,2-ఎ,3-డి,4-సి
3. తెలంగాణలో సాధారణ వర్షపాతం ఎంత (2017-18)?
1.903.5 మి.మీ 2. 904.5 మి.మీ
3.906.6 మి.మీ 4. 906.7 మి.మీ
4. 2016-17లో నైరుతి నమోదయింది రుతుపవనాలవల్ల వర్షపాతం ఎంత నమోదయింది?
1.611.2 మి.మీ 2. 755.2 మి.మీ
3. 905.3 మి.మీ 4. 912 మి.మీ
5. 2010-11 నాటికి తెలంగాణ రాష్ట్రంలో సగటు భూకమతం పరిమాణం ఎంత?
1. 1.30 హెక్టార్లు 2. 1.15 హెక్టార్లు
3. 1.12 హెక్టార్లు 4. 1.11 హెక్టార్లు
6. కమతాల సంఖ్య 2005-06లో 48.28 లక్షలు ఉండగా 2010-11 నాటికి ఎన్ని లక్షలకు పెరిగింది?
1. 54.55 లక్షలు 2. 55.54 లక్షలు
3. 55.59 లక్షలు 4. 57.56 లక్షలు
7. తెలంగాణలో సన్న కమతాలు ఎంత శాతం ఉన్నాయి?
1. 60% 2. 62%
3. 80% 4. 89%
8. ఈ క్రిందివాటిని సరిగా జతపర్చుము.
1. చిన్న కమతాలు ఎ. 23.9%
2. దిగువ మధ్య కమతాలు బి. 10.8%
3. మధ్య కమతాలు సి. 3%
4. భారీ కమతాలు డి. 0.3%
1.1-ఎ,2-బి,3-సి,4-డి 2.1-డి,2-బి,3-సి,4-ఎ
3.1-సి,2-డి,3-బి,4-ఎ 4.1-బి,2-సి,3-డి,4-ఎ
9. 2017-18లో ప్రస్తుత ధరలవద్ద (ముందస్తు అంచనాల ప్రకారం) భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ యొక్క భాగం?
1) 4.37% 2) 4.11%
3) 4.06% 4) 4.28%
10. 2005-06లో రాష్ట్రంలో సగటు భూకమతం 1.30 హెక్టార్లుండగా 2010-11 నాటికి ఎంతకి పడిపోయింది?
1) 1.9 2) 1.12
3) 1.45 4) 1.0
11. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల వల్ల నమోదయ్యే సాధారణ వర్షపాతం (మి.మీ.) ఎంత?
1) 713.5 మి.మీ 2) 600 మి.మీ
3) 500 మి.మీ 4) 800 మి.మీ
12. 2016-17 వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాలకు ఎంత శాతం కేటాయించారు?
1) 32% 2) 10%
3) 20% 4) 40%
13. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడే జానాభా శాతం?
1) 55.49% 2) 56%
3)57.28% 4) 56.17%
14. 2017-18 సంవత్సరంలో రంగాలవారీగా జిఎస్‌విఎ స్థూల విలువ చేర్పులో ప్రస్తుత ధరల ప్రకారం తృతీయ రంగం వాటా?
1)65.4% 2)62.4%
3)54.4% 4) 67.4%
15. 2017-18 సంవత్సరంలోలో జిఎస్‌విఎ స్థూల విలువ చేర్పులో స్థిరధరల ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాల వాటా?
1) 14.8% 2) 12.8%
3)13.8% 4) 12.8%
16. జతపర్చుము :
1) ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ ఎ) పాలెం మండలం
2) దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ బి) పొలస మండలం
3) మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ సి) చింతపల్లి మండలం
4) ఎక్కువ ఎత్తులో వ్యవసాయ వాతావరణ మండలం డి) వరంగల్‌
1) 1-బి,2-డి,3-ఎ,4-సి 2) 1-బి,2-ఎ,3-డి,4-సి
3) 1-బి,2-సి,3-డి,4-ఎ 4) 1-బి,2-ఎ,3-సి,4-డి
17. తెలంగాణలో కమతాల సంఖ్య
1) 55.62 లక్షలు 2) 55.54 లక్షలు
3) 55.64 లక్షలు 4) 55.58 లక్షలు
18. సన్న కమతాలు, చిన్న కమతాలు కలిపి మొత్తంగా ఎంతశాతం కలవు?
1)86% 2) 88%
3)80% 4) 84%
19. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పంటల సాంద్రత గల జిల్లా ఏది?
1) కామారెడ్డి 2) కరీంనగర్‌
3) నిర్మల్‌ 4) నిజామాబాద్‌
20. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప పంటల సాంద్రత గల జిల్లా ఏది?
1) పెద్దపల్లి 2) ఆదిలాబాద్‌
3) కొమురం భీం ఆసిఫాబాద్‌ 4) జగిత్యాల
21. రబీ కాలం ప్రధానంగా వేసే పంట ఏది?
1) ప్రత్తి 2) వరి
3) గోధుమ 4) మొక్క జొన్న
22. సెంట్రల్‌ రైస్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఎక్కడ కలదు?
1) కోల్‌కత్తా 2) భోపాల్‌
3) ముంబాయి 4) కటక్‌
23. మొక్కజొన్న ప్రధానంగా పండించే జిల్లాలు ఏవి?
1) కరీంనగర్‌, పెద్దపల్లి 2) నిజామాబాద్‌, కామారెడ్డి
3) మహబూబ్‌నగర్‌, గద్వాల 4) పైవన్నీ
24. వరిసాగు విస్తీర్ణంలోనూ, ఉత్పత్తిలోనూ అగ్రస్థానంలో ఉన్న జిల్లా?
1) నల్గొండ 2) సూర్యాపేట
3) పెద్దపల్లి 4) నిజామాబాద్‌
25. ఈ క్రింది వాటిలో గోధుమను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్‌ 2) నిజామాబాద్‌
3) మెదక్‌ 4) ఖమ్మం
26. జొన్న అధిక విస్తీర్ణంలో సాగుచేయబడుతున్న జిల్లా ఏది?
1) మహబూబ్‌నగర్‌ 2) ఆదిలాబాద్‌
3) కరీంనగర్‌ 4) మెదక్‌
27. పెసర అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
1) సూర్యాపేట 2) మెదక్‌
3) నల్గొండ 4) సంగారెడ్డి
28. సోయాబీన్‌ ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) నిజామాబాద్‌ 2) కామారెడ్డి
3) సంగారెడ్డి 4) మెదక్‌
29. మినుముల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) మెదక్‌ 2) సిద్ధిపేట
3) సంగారెడ్డి 4) నల్గొండ
30. శనగల ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) నిజామాబాద్‌ 2) కామారెడ్డి
3) సంగారెడ్డి 4) మెదక్‌
31. నూనె గింజల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) వనపర్తి 2) నాగర్‌ కర్నూల్‌
3) జోగులాంబ గద్వాల్‌ 4) మహబూబ్‌నగర్‌
32. ప్రత్తి ఉత్పత్తి మరియు విస్తీర్ణంలోను అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) నిర్మల్‌ 2) మహబూబాబాద్‌
3) ఆదిలాబాద్‌ 4) వరంగల్‌
33. మిరప ఉత్పత్తిలోనూ, విస్తీర్ణంలోనూ అగ్రస్థానంలో ఉన్న జిల్లా?
1) మహబూబాబాద్‌ 2) ఖమ్మం
3) వరంగల్‌ 4) భద్రాద్రి కొత్తగూడెం
34. ద్రాక్షను అత్యధికంగా పండించే జిల్లలు ఏవి?
1) రంగారెడ్డి 2) మహబూబ్‌నగర్‌
3) పై రెండు 4) ఏదీకాదు
35. ఏ జిల్లాలో జామను అధికంగా పండిస్తున్నారు?
1) వనపర్తి 2) మహబూబ్‌నగర్‌
3) జోగులాంబ గద్వాల్‌ 4) రంగారెడ్డి
36. టమాట ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో కలదు?
1)4 2) 3
3) 2 4) 1
37. జీడిపప్పు అధికంగా సాగుచేస్తున్న జిల్లా ఏది?
1) భద్రాద్రి కొత్తగూడెం 2) వరంగల్‌ రూరల్‌
3) ఖమ్మం 4) మహబూబాబాద్‌
38. దేశంలో పసుపు అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం?
1) గుజరాత్‌ 2) ఆంధ్రప్రదేశ్‌
3) మహారాష్ట్ర 4) తెలంగాణ
39. ఉల్లి విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
1) వనపర్తి 2) జోగులాంబ గద్వాల్‌
3) మెదక్‌ 4) మహబూబాబాద్‌
40. అరటిని ఎక్కువగా పండించే జిల్లాలు?
1) ఖమ్మం 2) మెదక్‌
3) నిజామాబాద్‌ 4) పైవన్నీ
41. 2012 పశుగణన ప్రకారం దేశంలో పశువుల జనాభాలో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో కలదు?
1) 12 2) 10
3) 14 4) 16
42. దేశంలో గొర్రెల జనాభాలో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో కలదు?
1)4 2) 3
3)2 4) 1
43. ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి:
ఎ. 2016-17 వార్షిక ఋణ ప్రణాళికలో వ్యవసాయ అనుబంధ
రంగాలకు 3% కేటాయించారు.
బి. 2016-17 వార్షిక ఋణ ప్రణాళిక కాలానికి అప్రాధాన్యత
రంగానికి 33% కేటాయించారు
సి. 2016-17 వార్షిక ఋణ ప్రణాళిక కాలానికి పంట ఋణాలు
32% కేటాయించారు.
డి. 2016-17 వార్షిక ఋణ ప్రణాళికలో వ్యవసాయ ఋణాలు
10% కేటాయించారు
1) ఎ,బి,సి,డి 2) బి,సి,డి
3) ఎ,సి,డి 4) ఎ,బి,సి
44. 2016-17 నాటికి పంట తీవ్రత ఎంత?
1) 1.25 2) 1.27
3) 1.04 4) 1.35
45. తెలంగాణ రాష్ట్రంకు జాతీయ స్థాయిలో పాల ఉత్పత్తిలో గల స్థానం?
1)13 2) 12
3) 14 4) 15
సమాధానాలు
1.2 2.1 3.3 4.4 5.2
6.2 7.1 8.1 9.1 10.2
11.1 12.1 13.1 14.1 15.1
16.2 17.2 18.1 19.4 20.3
21.3 22.4 23.4 24.1 25.1
26.1 27.3 28.2 29.3 30.1
31.4 32.3 33.1 34.3 35.4
36.1 37.3 38.4 38.2 40.4
41.2 42.3 43.1 44.1 45.1

]]>
కరెంట్‌ అఫైర్స్‌ https://navatelangana.com/current-affairs-30/ Sat, 28 Sep 2024 16:55:43 +0000 https://navatelangana.com/?p=406287 Current Affairsభారత్‌, ఉజ్జెకిస్తాన్‌ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం
భారత్‌, ఉజ్జెకిస్తాన్‌ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT)పై సెప్టెంబర్‌ 27వ తేదీన సంతకం చేశాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, ఆర్థిక సహకారాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందంపై భారత ఆర్థికమంత్రి నిర్మిల సీతారామన, ఉజ్జెకిస్తాన్‌ ఉపప్రధాని ఖోజాయెన్‌ జమ్షిద్‌ అబ్దుఖాకిమోవిచ్‌ తాష్కెంట్‌లో సంతకం చేశారు. ఒప్పంద నిబంధనల ప్రకారం పెట్టుబడులు వసూలు (expropriation) నుంచి రక్షణ పొందుతాయి. ఈ ఒప్పందం పెట్టుబడి కార్యకలాపాల్లో స్వచ్ఛతను ప్రోత్సహించడానికి, నష్టాలకు పరిహారం విధానాలను నిర్దేశించడానికి దోహదం చేస్తుంది. పెట్టుబడులను రక్షించడం ద్వారా, ఒప్పందం రాష్ట్రానికి నియమించుకునే హక్కులను కాపాడుతుంది. అందువల్ల కరెక్ట్‌ విధానాలకు అవకాశం కల్పిస్తుంది.

దీపక్‌ మెహతాకు ఐసీసీ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
దీపక్‌ నైట్రైట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపక్‌ సి.మెహతా ఇటీవల 59వ ఇండియన్‌ కెమికల్‌ కౌన్సిల్‌ (ICC`) వార్షిక అవార్డుల కార్యక్రమంలో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. దీపక్‌ మెహతా రసాయన పరిశ్రమలో ఒక విప్లవాత్మక నాయకుడిగా గుర్తించబడ్డారు. ఆయన మాజీ ఇండియన్‌ కెమికల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా, భారత ప్రభుత్వ రసాయన పరిశ్రమ టాస్క్‌ ఫోర్స్‌లో ముఖ్య సభ్యుడిగా, భారత దేశాన్ని ప్రపంచ రసాయన తయారీ శక్తిగా మారుస్తున్న ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ఫిక్కీలో నేషనల్‌ కెమికల్స్‌ కమిటీ, సెక్టార్‌ స్కిల్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఇది ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన అంకితభావాన్ని చూపిస్తుంది.

రొబోటిక్‌ మ్యూల్స్‌ను ప్రవేశపెట్టిన భారత సైన్యం…
భారతసైన్యం ఇటీవల తన ఆర్థిక, ఆపరేషనల్‌ సామర్థ్యాలను పెంచేందుకు రొబోటిక్‌ మ్యూల్స్‌ను ప్రవేశపెట్టింది. రొబోటిక్‌ మ్యూల్‌ అనేది కుక్క ఆకారంలో రూపొందించిన రొబోట్‌, ఇది కఠినమైన భూముల్లో పర్యవేక్షణ, తేలికపాటి బరువులను రవాణా చేయడానికి సహాయపడుతుంది. 100 రొబోటిక్‌ మల్టీ-యుటిలిటీ లెగ్డ్‌ ఎక్విప్‌మెంట్‌ (వీఖూజు) లను ముందుడుగు (యుద్ధ) ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలలో వినయోగానికి భారత సైన్యం ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ రోబోట్లు మెట్లు, వాలు కొండలు ఎక్కి, -40 నుంచి +55 డిగ్రీల సెల్సియస్‌ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలలో పని చేయగలవు. అలాగే 15కేజీల బరువును మోయగలవు. అదే విధంగా ఎత్తయిన ప్రాంతాలలో మద్దుతు, రవాణాను మెరుగుపరచడానికి లాజిస్టిక్స్‌ డ్రోన్‌లు పరీక్షించబడుతున్నాయి. రోబోటిక్‌ ముల్‌ అన్ని రకాల వాతావరణాలకు రూపొందించబడిన ఒక మన్నికైన, చురుకైన భూమి రోబోట్‌, వస్తువులను గుర్తించడానికి ఎలక్ట్రో-ఆప్టిక్స్‌, ఇన్ఫ్రారెడ్‌ టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది. ఇది నదుల గుండా, లోపల కదిలే సామర్థ్యం కలిగి ఉంటుంది.

చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం
ఒక్కసారే దాదాపు 10 అణ్వాయుధ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీఎం)ని చైనా విజయవంతంగా పరీక్షించింది. హైనన్‌ ద్వీపం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుమారు 12వేల కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్‌ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లోకి పడినట్లు తెలుసుస్తోంది. ఇది డీఎషన-31 లేదా డీఎఫ్‌-41 రకానికి చెందినది కావొచ్చని భావిస్తున్నారు. దీనికి 12 వేల నుంచి 15 వేల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంది. ప్రస్తుత క్షిపణి అమెరికాలోని ప్రధాన నగరాలను సునాయాసంగా ఢకొీట్టగలదు. నలువైపుల నుండి రక్షణ కల్పించేలా తేలికపాటి తూటా రక్షణ కవచాలను (బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను) ఐఐటీ-ఢిల్లీతో కలిసి ‘రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ’ (డీఆర్‌డీవో) తీర్చిదిద్దింది. 360 డిగ్రీల కోణంలో ఎటు నుంచి ముప్పు ఎదురైనా ఇది అడ్డుకుంటుందని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సాంకేతికతను మన దేశంలోని కొన్ని పరిశ్రమలకు బదలాయిస్తారు. వీటికి ‘అభేద్‌’ (అడ్వాన్స్‌డ్‌ బాలిస్టిక్స్‌ ఫర్‌ హై ఎనర్జీ డిఫీట్‌) అని పేరు పెట్టారు. వివిధ బీఐఎన్‌ ప్రమాణాల మేరకు వీటిని 8.2 కేజీలు, 9.9 కేజీల కనీస బరువుతో రూపొందించారు. పాలిమర్లు, దేశీయ బోరాన్‌ కార్బైడ్‌ సిరామిక్‌ పదార్థాలు ఉపయోగించి ఈ జాకెట్లను తయారు చేశారు.

]]>
నాడు తెలుగు ప్రాంతాల్లో ఆధునిక నాటక ప్రదర్శనకు ప్రేరణ ఇచ్చిన నాటక సమాజం? https://navatelangana.com/nadu-was-a-theater-society-that-inspired-modern-drama-performances-in-the-telugu-regions/ Sat, 28 Sep 2024 16:52:00 +0000 https://navatelangana.com/?p=406294 The theater society that inspired modern drama performance in Telugu regions?1. దశవిధ రూపకములను గూర్చి చెప్పిన గ్రంథం?
ఎ. భరతుని-నాట్యశాస్త్రం బి.దండి-కావ్యాదర్శము
సి. ధనుంజయుడి-దశరూపకం డి.భోజుడి-సరస్వతీ కంఠాభరణము.
2. ప్రాచీనాలంకారికుల దృష్ట్యా నాటకంలో ఎన్ని అంకాలుండాలి? మరియు నాయకుడు ఎలా ఉండాలి?
ఎ. 2-5 అంకములు-ధీర శాంతుడైన నాయకుడు
బి. 5-10 అంకములు-ధీరోదాత్తుడైన నాయకుడు
సి. 10-15 అంకమకులు – ధీర శాంతడైన నాయకుడు
డి. 1-4 అంకములు-ధీరోద్దతుడైన నాయకుడు
3. ‘కావ్వేషు నాటకం రమ్యం’ (కావ్యాలలో ‘నాటకం’ రమ్యమైంది) అన్న ఆలంకారికుడు.
ఎ. భరతుడు బి. దండి సి. ధనుంజయుడు డి. కాళిదాసు
4. కావ్యం శ్రవ్యకావ్యం, దృశ్యకావ్యం అని రెండు విధాలు. అయితే దృశ్యకావ్యాలంటే?
ఎ. నాటకాది దశరూపకములు బి. భారత, రామాయణాలు
సి. శ్రవణేంద్రియాలతో పాటు నేత్రేంద్రియాలకు ప్రీతి కల్గించేవి
డి. ఎ మరియు సి
5. ‘దశ రూపకములు’ ఏవి?
ఎ. నాటకం, ప్రకరణం, బాణం బి. వ్యామోగం, సమవాకారం, డిమం
సి. అంకం, వీధి, ప్రహాసనం, ఈహమృగం
డి. ఎ,బి మరియు సి
6. ప్రాచీన అలంకారికులు చెప్పిన నాటక లక్షణాలు?
ఎ. నాంది-ప్రస్తావన-విష్కంభం-పంచసంధులు-భరతవాక్యం
మున్నగునవి నాటక ప్రధానాంగాలు.
బి. వీర, శృంగార రసములలో ఏదో ఒకటి ప్రధాన రసం కావాలి.
సి. నాయిక వధ ఉండరాదు. నాయకుడు ఒకవేళ మరణించినా
పునరుజ్జీవితున్ని చేయాలి.
డి. పైవన్నీ
7. ”పంచ సంధులు (ముఖ, ప్రతిముఖ, గర్భ, అవమర్శ, నిర్వహణ సంధులు) చెడిన నాటకము కీళ్లు సడలిన బొమ్మ” – అన్నవారు?
ఎ. శ్రీపింగళి లక్ష్మీకాంతం
బి. డా|| పోణంగి శ్రీరామ అప్పారావు
సి. డా|| దివాకర్ల వేంకటావధాని
డి. విశ్వనాథ సత్యనారాయణ
8. సంస్కృత లక్షణాల ప్రకారం తెలుగులో ‘వీధి’ లక్షణాలతో రాయబడి, ‘వినుకొండ వల్లభరాయుడి’ పేరు కనిపిస్తున్న క్రీడాభిరామం’ అనే రూపక కర్త ఎవరు? ఎ. నన్నయ బి. పాల్కురికి సోమన
సి. శ్రీనాథుడు డి. పోతన
9. నాడు తెలుగు ప్రాంతాల్లో ఆధునిక నాటక ప్రదర్శనకు ప్రేరణ ఇచ్చిన నాటక సమాజం?
ఎ. జగన్నాథ విలాసినీ నాటక సమాజం బి. ధార్వాడ నాటక సమాజం
సి. విద్యార్థి నాటక సమాజం
డి. ఆంధ్ర భాషాభిమాన సమాజం
10. తెలుగులో సంస్కృత నాటకాల అనువాదాలు/స్వతంత్ర తెలుగు నాటకాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? ఎ. 1893 తర్వాత బి. 1885 తర్వాత
సి. 1860 తర్వాత
డి. పూర్వకాలం నుండి
11. తొలి తెలుగు స్వతంత్ర నాటకం ఏది? ఎ. శ్రీకోరాడ రామచంద్ర శాస్త్రి-మంజరీ మధుకరీయం
బి. కొక్కొండ వేకంటరత్నం-నరకాసుర విజయవ్యామోహం
సి. వాలిలాల వాసుదేవ శాస్త్రి-నందక రాజ్యం
డి. కందుకూరి వీరేశలింగం పంతులు-రాజశేఖర చరిత్ర
12. ‘ప్రతాపరుద్రీయం’ నాటకం రాసినవారు? ఎ. కొక్కొండ వేంకటరత్నం బి. విద్యానాథుడు
సి. కందుకూరి వీరేశలింగం
డి. వేదం వెంకటరాయశాస్త్రి
13. ధర్మవరం రామ కృష్ణమాచార్యుల నాటకాలు గుర్తించుము? ఎ. చిత్రనళీయం, విషాద సారంగధర, పాదుకా పట్టాభిషేకం
బి. ప్రమీలార్జునీయం, ప్రహ్లాదనాటకం, అజామీళ, చంద్రహాస
సి. ఎ మరియు బి
డి. గమోపాఖ్యానం, ప్రసన్నయాదవం, సీతాకళ్యాణం
14. క్రింది వానిలో సరికానిది? ఎ. సరసవినోదినీ సభ-ధర్మవరము రామకృష్ణమాచార్యులు
బి. ధార్వాడ నాటక సమాజం-కందుకూరి విరేశలింగం
సి. సుమనోరమా సభ-కోలాచలం శ్రీనివాసరావు
డి. హిందూ సమాజం-శ్రీ ఇమ్మనేని హనుమంతరావు
15. ‘బొబ్బిలి యుద్ధం’ విషాదాంత చారిత్రక నాటకరక్త? ఎ. శ్రీపాదకృష్ణమూర్తి బి. పానుగంటి లక్ష్మీనరసింహారావు
సి. చిలకమర్తి లక్ష్మీనరసింహం డి. బలిజేపల్లి లక్ష్మీకాంతం
16. తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర సాంఘిక నాటకం? ఎ. హరిశ్చంద్ర బి.చింతామణి
సి. ప్రతాపరుద్రీయం
డి. కన్యాశుల్కం
17. సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన నాటకాలు? ఎ. తప్పెవరిది, గాలివాన
బి. చలిచీమలు, వెంటాడే నీడలు
సి. ఉచ్చల విషాదం, భక్తతుకారం
డి. చింతామణి, రోషనార
18. ‘ఆంధ్రనాటక పితామహుడు’గా ప్రసిద్దిగాంచిన వారు? ఎ. గురజాడ అప్పారావు బి. ధర్మవరం కృష్ణమాచార్యులు
సి. వేదం వేంకటరామశాస్త్రి
డి. చిలకవర్తి లక్ష్మీనరసింహా
19. ‘నాటక శిల్పం’ అనే విమర్శనాత్మక గ్రంథం ఎవరిది? ఎ. మొదలి నాగభూషణ శర్మ బి. పి.ఎస్‌.ఆర్‌.అప్పారావు
సి. సర్దేశాయి తిరుమలరావు
డి. పింగళి లక్ష్మీకాంతం
20. ‘తెలుగు నాటక వికాసకం’ అనే గ్రంథం రాసి, నాటక ప్రక్రియపై పరిశోధన చేసిన వారు? ఎ. డా|| పోణంగి శ్రీరామ అప్పారావు
బి. మొదలి నాగభూష శర్మ
సి. బలిజేపల్లి లక్ష్మీకాంతం
డి. వాలిలాల వాసుదేవ శాస్త్రి
21. ‘ప్రోలోగు, ఎపిలోగు’-లాంటి ప్రాశ్చత్య సంప్రదాయాలు తెలుగు ఏ ప్రక్రియలో కనిపిస్తాయి?
ఎ. నవల
బి. నాటకం
సి. కథ
డి. నాటిక
22. ‘దురాశాభంగము’ అనే నామాంతరం గల ‘సునందినీ పరిణయము’ అనే నాటకం రాసినవారు?
ఎ. శ్రీ కందుకూరి వీరేశలింగం
బి. కాళ్లకూరి నారాయణరావు
సి. శ్రీకోలాచలం శ్రీనివాసరావు
డి. బళ్ళారి రాఘవా
23. సుల్తానా చాందు బీబీ, చంద్రగిర్యభ్యుదయం, ప్రతాపాక్బరీయం, మైసూరు రాజ్యం-లాంటి చారిత్రక నాటకాలు రాసి, ‘ఆంధ్ర చారిత్రనాటక పితామహులని’ ప్రసిద్ధిగాంచిన వారు? ఎ. కాళ్లకూరి నారాయణరావు
బి. ధర్మవరం కృష్ణమాచార్యులు
సి. బలిజేపల్లి లక్ష్మీకాంతం
డి. కోలాచలం శ్రీనివాసరావు
24. ‘ప్రతాపరుద్రీయము’ అనే ప్రసిద్ధ నాటకం రాసినవారు?
ఎ. వేదం వేంకటరామ శాస్త్రి
బి. కోలాచలం శ్రీనివాసరావు
సి. కందుకూరి వీరేశలింగం
డి. వావిలాల వాసుదేవ శాస్త్రి
25. ఆంధ్ర షేక్సి ్పయర్‌ శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహం గారు రాసిన నాటకాలు/నాటకం
ఎ. పాదుకాపట్టాభిషేకం
బి. రాధాకృష్ణ, విప్రనారాయణ
సి. కంఠాభరణం
డి. పైవన్నీ
సమాధానాలు
1.సి 2.బి 3.ఎ 4.డి 5.డి
6.డి 7.ఎ 8.సి 9.బి 10.సి
11.ఎ 12.డి 13.సి 14.బి 15.ఎ
16.డి 17.సి 18.బి 19.ఎ 20.ఎ
21.బి 22.సి 23.డి 24.ఎ 25.డి
నానాపురం నర్సింహులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా.
9030057994

]]>
సాగునీటి ప్రాజెక్టులు https://navatelangana.com/irrigation-projects/ Sat, 21 Sep 2024 16:38:57 +0000 https://navatelangana.com/?p=400569 Irrigation projectsరాష్ట్రంలో నీటిపారుదల రంగం వివరాలు
– తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతదేశంలోనే ప్రాముఖ్యతను కలిగి ఉన్న 2 ముఖ్య నదులయిన గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉంది.
నీటిపారుదల ప్రాజెక్టుల వర్గీకరణ
– నీటిపారుదల ప్రాజెక్టులను ఆయా ప్రాజెక్టుల కింద ఉండే ఆయకట్టు ప్రాంత పరిమాణం ఆధారంగా వర్గీకరిస్తారు.
– రాష్ట్రంలో ఉన్న మొత్తం నీటిపారుదల ప్రాజెక్టులను కింది విధంగా 3 రకాలుగా విభజించవచ్చు. అవి:
1) భారీ ప్రాజెక్టులు : 25000 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు గలవి (లేదా >10,000 హెక్టార్లు)
2) మధ్యతరహా ప్రాజెక్టులు : 5000 ఎకరాల కంటే ఎక్కువ మరియు 25,000 ఎకరాలకు తక్కువ ఆయకట్టు కలవి (2000-10,000 హెక్టార్లు)
భారీ నీటి పారుదల ప్రాజెక్టులు
– నదీ జలాలను వినియోగించుకోవడం కోసం ప్రభుత్వం 36 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. వీటిలో 21 భారీ సాగునీటి ప్రాజెక్టులు, 12 మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు.
– ఈ సాగునీటి ప్రాజెక్టులతో 72 లక్షల ఎకరాల సాగునీటి సామర్థ్యం కల్పించాలని నిర్ణయించడం జరిగింది
తెలంగాణలో పూర్తి అయిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు:
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు
– నాగార్జున సాగర్‌కి మరొక పేరు నందికొండ ప్రాజెక్ట్‌
– నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఎత్తైన రాతికట్టడం, ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ప్రాజెక్ట్‌ ఇది ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు.
– ఇది ఒక బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌ (408 టి.ఎమ్‌.సి), స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 816 మె.వా.
– నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద భోస్లా కమిటి సూచనల మేరకు 1956 డిసెంబర్‌ 10న శంఖుస్థాపన చేశారు. 1967 అగస్టు 4న ఈ ప్రాజెక్టును ఇందిరాగాంధీ ప్రారంభించారు.
– ఈ ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంతం 216 లక్షల చ.కి.మీ. (ద్యాం పొడవు 1550 మీ. 124 మీ. ఎత్తు)
– ఈ నాగార్జున సాగర్‌ డ్యాం వలన నాగార్జున కొండ చుట్టూ కృత్రిమ సరస్సు ఏర్పడినది. ఇక్కడ ద్వీపంలో మ్యూజియం కలదు.
– ఈ రిజర్వాయర్‌ గట్టుపై ప్రాచీన బౌద్ధవాసాన్ని పునర్నిర్మించారు. ఇక్కడ బౌద్ధ విశ్వవిద్యాలయం, బౌద్ధ స్థూపాలు, విహారాలు, బిలిపీఠం కలవు.
– ఈ ప్రాజెక్టు వలన 10లక్షల ఎకరాలకు పైగా సాగవుతుంది.
– ఈ ప్రాజెక్టు నిర్మాణ ఇంజినీర్‌- కె. ఎల్‌. రావ్‌. దీని మొదటి చీఫ్‌ ఇంజినీర్‌- జాఫర్‌ అలీ
ఆయకట్టు:
1) కుడి ప్రధాన కాలువ (జవహర్‌ కాలువ) – 10 నుండి 11 లక్షల ఎకరాలు (గుంటూరు, ప్రకాశం),
2) ఎడమ ప్రధాన కాలువ (లాల్‌ బహదూర్‌ కాలువ) – 8.5 నుండి 9.6 లక్షల ఎకరాలు (నల్గొండ, ఖమ్మం, ప్రకాశం)
మూసీ ప్రాజెక్టు
– కేతేపల్లి మండలంలో మూసీనదిపై 1954లో ప్రారంభించి 1961లో పూర్తిచేశారు. ప్రధాన కాలువ 64కిలోమీటర్ల పొడువు ఉంది.
– టేకుమట్ల వంతెన వరకు ప్రవహిస్తుంది. కుడి కాల్వ 31కి.మీ. ఎడమ కాలున 34కి.మీ. సాగి 61 గ్రామాలలోని పొలాలకు నీరందిస్తుంది. దాదాపు 30 వేల ఎకరాలు సస్యశ్యామలమవుతున్నాయి.
ఆలీ సాగర్‌ ఎత్తిపోతల పథకం
– జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించిన తొలి ఎత్తిపోతల పథకం ఆలీ సాగర్‌.
– నిజామాబాద్‌ జిల్లాలో ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన పథకం.
– గోదావరి నదిపై ఉన్న శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నీటిని (720 క్యూసెక్కులు) ఎత్తిపోతల ద్వారా తరలించడం.
– ఈ ప్రాజెక్టు ఆయకట్టు 53,793 ఎకరాలు.
– లబ్ధి పొందే మండలాలు ఆరు. 1) నవీపేట్‌ 2) రేంజల్‌ 3) యెడపల్లి 4) నిజామాబాద్‌ 5) బీచ్‌పల్లి 6) మాక్లూర్‌.
– నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం కోస్లి గ్రామం వద్ద గోదావరి నదిపై ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌ హౌస్‌ నిర్మించారు. రెండో పంప్‌ హౌస్‌ రెంజల్‌ మండలం తాడ్‌బిలోలిలో, మూడో పంప్‌ హౌస్‌ ఎడపల్లి మండలం జాన్కంపేట్‌లో నిర్మించారు.
– జాన్కంపేట్‌ నుంచి ఎత్తిపోతల నీటిని కాల్వల ద్వారా తీసుకువచ్చి నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో కలిపారు.
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు:
– నిజామాబాద్‌ జిల్లాలో పోచంపాడు వద్ద గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌ను నిర్మించారు. స్థానికంగా శ్రీ కోదండరామ స్వామి ఆలయం ఉండడంతో ఈ ప్రాజెక్టు శ్రీరాంసాగర్‌గా పేరు పొందింది.
– ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా జీవనాధారమైంది.
– నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట, ఆర్మూర్‌, నవీపేట, బాల్కొండ మండలాలతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలోని లోకేశ్వరం, దిలావల్‌పూర్‌, నిర్మల్‌ మండలాల్లో పలు గ్రామాల ప్రజలు సర్వస్వం త్యాగం చేయగా రూపుదాల్సిన ఈ ప్రాజెక్టుకు 1963లో నాటి ప్రధాని జవహర్లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేశారు. గోదావరి నదికి అడ్డంగా ఆనకట్ట నిర్మించారు.
– 1978లో నిర్మాణం పూర్తయి అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. మొత్తం 18 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఖరీఫ్‌కు 9.5 లక్షల ఎకరాలు, రబీలో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తోంది. దీని యొక్క కాలువలు కాకతీయ, సరస్వతీ, లక్ష్మి,
అర్గుల రాజారాం ఎత్తిపోతల పథకం (గుత్ప)
– గోదావరి నది పైన శ్రీరామసాగర్‌ నీటి ద్వారా ఆయకట్టు స్థిరీకరణ.
– ఈ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 38,792 ఎకరాలు.
– నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ వద్ద గోదావరి నదిపై మొదటి పంప్‌ హౌస్‌ నిర్మాణం జరిగింది.
– రెండో పంప్‌ హౌసు మోర్తాండ్‌ మండలం ధర్మోరం గ్రామం వద్ద నిర్మించారు.
– జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించిన రెండో పథకం గుత్ప ఎత్తిపోతల పథకం.
నిజాం సాగర్‌
– కామారెడ్డి జిల్లా, అచ్చంపేట వద్ద మంజీర నదిపై నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మితమైంది. 1923లో అప్పటి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నేతృత్వంలో బంజపల్లి వద్ద పరిసర 40 గ్రామాలను ఖాళీ చేసి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టును 29.72 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించారు. కాని 1972లో నిర్వహించిన హైడ్రోలాజికల్‌ సర్వే ప్రకారం ఈ రిజర్వాయర్‌ సామర్థ్యం కేవలం 11.79 టిఎంసీలు మాత్రమే. వాస్తవంగా 17.91 టీఎంసీల మేర మేట పేరుకుపోయింది.
– దీని యొక్క కాలువలు రెండు. అవి: 1) మహబూబ్‌నగర్‌ కుడికాలువ 2) ఫతేనహర్‌ ఎడమ కాలువ
– లబ్దిపొందే మండలాలు – నిజాంసాగర్‌, కోట్‌గిరి, ఎడ్‌పల్లి, మక్లూర్‌, జాక్రీన్‌పల్లి, బాన్సువాడ, వర్సి, నిజామాబాద్‌, పెంజల్‌, వెల్పూర్‌, బిరకూర్‌, బోధన్‌, డిచ్‌పల్లి, నందిపేట, బాల్కొండ (నిజామాబాద్‌ జిల్లా)
– మంజీర నది వద్ద సింగూరు మిగులు జలాలను ఆధారంగా చేసుకొని ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. మూడు కిలోమీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఆనకట్ట నిర్మించారు.
– నవాబ్‌ అలీ సహజంగ్‌ బహదూర్‌ పర్యవేక్షణలో 1931లో నిర్మాణం పూర్తయింది.
– 2.75 లక్షల ఎకరాలకు నీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం 2,31 లక్షల ఎకరాలకు అందించగలుగుతోంది. నిజాం పాలనలో కట్టించినందుకు ఈ ప్రాజెక్టును నిజాం సాగర్‌గా నామకరణం చేశారు.
– ప్రాజెక్టులో బోటింగ్‌ సౌకర్యంతోబాటు పర్యాటకులను అలరించే ఆహ్లాదకరమైన సుందరమైన వనం ఉంది.
జూరాల ప్రాజెక్టు
– కృష్ణా నదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు.
– ఈ ప్రాజెక్టును 11.94 టిఎంసీల సామర్థ్యంతో 1984లో నిర్మించారు.
– ఈ ప్రాజెక్టు ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని రేవులపల్లి గ్రామం వద్ద కలదు.
– ఈ ప్రాజెక్టు పూర్తి పేరు – ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.
– ఈ ప్రాజెక్టు ద్వారా 221.40 ఎమ్‌.డబ్ల్యు. జలవిద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.
– ఈ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 1.02 లక్షల హెక్టార్లు.
– ఈ ప్రాజెక్టు ద్వారా (ఎన్‌.టి.ఆర్‌. కాలువ) ఎడమ కాలువ కింద 26,103 హెక్టార్లు (నల్ల సోమాద్రి కాలువ) కుడి కాలువ క్రింద 15,257 హెక్టార్లకు నీటి పారుదల అవసరాలను తీరుస్తుంది. (41,360 హెక్టార్లు)
– దేశంలోనే అత్యధిక బ్లాకులు ఉన్న ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (బ్లాకులు – 84).
రాజోలి బండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌)
– ఈ ప్రాజెక్టు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు.
– ఈ ప్రాజెక్టును తుంగభద్ర నదిపై కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా మన్ని తాలుకాలోని రాజోలిబండ గ్రామం వద్ద నిర్మించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 87,500 ఎకరాలకు నీటిని అందించడం జరుగుతుంది.
– ఈ ప్రాజెక్టు నిర్మాణం నిజాంల పాలన కాలంలో క్రీ.శ. 1946లో ప్రారంభించగా 1958లో పూర్తి అయినది.
– ఈ ప్రాజెక్టులు నీటిని 143 కి.మీ.లు ఆర్‌డిఎస్‌ కాలువ ద్వారా గద్వాల మండలంలోని 8 గ్రామాలకు, అలంపూర్‌ మండలంలోని 67 గ్రామాలకు అందించడం జరుగుతుంది.
కడెం రిజర్వాయర్‌
– నిర్మల్‌ జిల్లాలోని కడెం మండలం పెద్దూర్‌ గ్రామ సమీపంలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్ట్‌ నీటి వినియోగం – 13.243 టీ.ఎమ్‌.సి
– లబ్ది పొందె మండలాలు- కడెం, జన్నారం, దండెపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల.
లోయర్‌ మానేర్‌ రిజర్వాయర్‌
– కరీంనగర్‌ జిల్లాలోని గోదావరి ఉపనది అయిన మానేర్‌ నదిపైన ఈ జలాశయాన్ని నిర్మించారు. 1985లో ఇది పూర్తయింది. దాదాపు 27 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆనకట్ట అనందాన్ని ఇవ్వడమే కాకుండా కరీంనగర్‌ వాసులకు ట్యాంక్‌బండ్‌ అనుభూతి కలుగుతుంది.
సింగూరు ప్రాజెక్టు
హైదరాబాద్‌ మరియు సికింద్రాబాద్‌ నగరాలకు త్రాగు నీరు అందించడం కోసం మంజీర నదిపై సింగూర్‌ ప్రాజెక్టును సంగారెడ్డి జిల్లా, కుల్కర్‌ మండలం, సింగూర్‌ గ్రామం వద్ద నిర్మించారు.
– ఇది బహుళార్ధ సాధక ప్రాజెక్టు (30 టిఎంసీలు)
– ఈ ప్రాజెక్టు ఆయకట్టు – 40,000 ఎకరాలు. (2 టిఎంసీల నీటిని సంగారెడ్డి, ఆందోల్‌లకు పంపిణి చేస్తారు)
– ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి 15 మెగావాట్లు.
– సింగూర్‌ ప్రాజెక్టుకు మరొక పేరు – మొగిలిగుండ్ల బాగా రెడ్డి సింగూర్‌ ప్రాజెక్టు.

తెలంగాణలోని భారీనీటి పారుదల ప్రాజెక్టుల వివరాలు
తెలంగాణలోని భారీ ప్రాజెక్టులు

1. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు
2. నిజామ్‌సాగర్‌ ప్రాజెక్టు
3. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు- స్టేజ్‌-1
4. అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం
5. అరుగుల రాజారాం-గుత్ప ఎత్తిపోతల పథకం
6. లోయర్‌ మానేరు డ్యామ్‌
7. ఎం. బాగారెడ్డి సింగూర్‌ ప్రాజెక్టు
8. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌
9. మూసి ప్రాజెక్టు
10. మైలారం బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌
11. బయ్యన్నవాగు బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌
12. ప్రియదర్శిని (జూరాల) ప్రాజెక్టు
13. రాజోలి బండ డైవర్షన్‌ స్కీం
నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు
14. ప్రాణహిత-చేవెళ్ల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం
15. FFC From SRSP
16. శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం
17. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌
18. మధ్య మానేరు జలాశయం
19. బాగారెడ్డి సింగూర్‌ ప్రాజెక్టు కాలువలు
20. JCR GLIS
21. ఇందిరా సాగర్‌-రుద్రం కోట
22. రాజీవ్‌ సాగర్‌-దమ్ముగూడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌
23. దమ్ముగూడెం నాగార్జున సాగర్‌ టేల్పాండ్‌
24. ఏఎంఆర్‌ ప్రాజెక్టు(SLSBC)సొరంగమార్గం సహా)
25. రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకం
26. మహాత్మగాంధీ-కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
27. జవహర్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
28. కోయిల్సాగర్‌ ఎత్తిపోతల పథకం
29. సిని నరసింహరావు -కంతాలపల్లి సుజల స్రవంతి
30. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు స్టేజ్‌-11
భారీ ప్రాజెక్టులు
ప్రణాళిక దశలో ఉన్నవి
31. దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు
32. ఇచంపల్లి ప్రాజెక్టు
33.మున్నేరు రిజర్వాయర్‌
34. డిండి ఎత్తిపోతల పథకం
35. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
36. కాళేశ్వరం ప్రాజెక్టు
తెలంగాణలోని మధ్యతరహా
నీటిపారుదల ప్రాజెక్టుల వివరాలు
1.స్వర్ణ ప్రాజెక్టు
2. వట్టివాగు ప్రాజెక్టు
3. సత్నాల ప్రాజెక్టు
4. చెల్మెలవాగు (ఎన్టీఆర్‌ సాగర్‌)
5. పిపి రావు ప్రాజెక్టు (ఎర్రవాగు)
6. గడ్డెన్న – సుద్దవాగు ప్రాజెక్టు
7. ఖానాపూర్‌ కాలువ (సదర్మత్‌)
8. రాలీవాగు ప్రాజెక్టు
9. మత్తడి వాగు ప్రాజెక్టు
10. పోచారం ప్రాజెక్టు
11. రామడుగు ప్రాజెక్టు
12. కౌలాస్‌ నాలా ప్రాజెక్టు
13. శనిగరం ప్రాజెక్టు
14. బొగ్గులవాగు ప్రాజెక్టు
15. ఎగువ మానేరు ప్రాజెక్టు
16. నల్లవాగు ప్రాజెక్టు
17. ఘన్పూర్‌ ఆనకట్ట
18. రామప్ప చెరువు
19. మల్లూరువాగు ప్రాజెక్టు
20. పాకాల చెరువు
21. చలివాగు ప్రాజెక్టు
22. లక్నవరం ప్రాజెక్టు
23. వైరా ప్రాజెక్టు
24. లంకా సాగర్‌ ప్రాజెక్టు
25. పెద్దవాగు ప్రాజెక్టు
26. బయ్యారం ప్రాజెక్టు
27. తాళి పేరు ప్రాజెక్టు
28. గుండ్లవాగు ప్రాజెక్టు
29. పాలేరు ప్రాజెక్టు
30. కోటిపల్లి ప్రాజెక్టు
31. జుట్‌పల్లి ప్రాజెక్టు
32. లక్నపూర్‌ ప్రాజెక్టు
33. దిండి ప్రాజెక్టు
34. ఆసిఫ్‌ నహర్‌ ప్రాజెక్టు
35. ఉత్కూర్‌ మారేపల్లి ప్రాజెక్టు
36. సరళ సాగర్‌ ప్రాజెక్టు
37. కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు
మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులు – నిర్మాణ దశలో ఉన్నవి
38. పెద్దవాగు ప్రాజెక్టు (కోమ్రంభీం)
39. పెద్దవాగు ప్రాజెక్టు (జగన్నాధపూర్‌)
40. గొల్లవాగు ప్రాజెక్టు
41. పెద్దవాగు ప్రాజెక్టు (నీల్వాయి)
42. చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం
43. లెండి
44. మోడికుంటవాగు ప్రాజెక్టు
45. పాలెంవాగు ప్రాజెక్టు
46. కిన్నెరసాని డ్యామ్‌ కాలువ

]]>
తెలంగాణలో తామ్ర శాసనాలు వేయించిన రాజవంశం ఏది? https://navatelangana.com/which-dynasty-inscribed-copper-inscriptions-in-telangana/ Sat, 14 Sep 2024 17:47:18 +0000 https://navatelangana.com/?p=394811 Which dynasty inscribed copper inscriptions in Telangana?1. తెలంగాణకు సంబంధించినంత వరకు చారిత్రక యుగం ఎప్పటి నుండి ప్రారంభమైందని చెప్పవచ్చు?
1. క్రీ.పూ.6వ శతాబ్దం 2. క్రీ.పూ.7వ శతాబ్దం
3. క్రీ.పూ. 8వ శతాబ్దం 4. క్రీ.పూ.9వ శతాబ్దం
2. కింది వాటిలో దక్షిణాపథాన్ని మొదటిసారిగా నిర్ధిష్ట భూభాగార్థంలో విస్తృతంగా ఉపయోగించనవి ఏవి?
1. బోధాయన ధర్మ సూత్రాలు 2. బౌద్ధమత సుత్తనిపాతం
3. వినయ పీఠకం 4. పైవన్నీ
3. క్రీ.శ.1వ శతాబ్దంలో తన రచనల్లో దక్కన్‌ గురించి స్పష్టంగా పేర్కొన్న విదేశీయుడు ఎవరు?
1. ప్లీనీ 2. మార్కోపోలో
3. న్యూనిజ్‌ 4. నికోలోకాంటి
4. 1వ శతాబ్దపు తెలుగుదేశాన్ని ‘టెలింగాన్‌’ అని పేర్కొన్న విదేశీ రచయిత ఎవరు?
1. అరిస్టాటిల్‌ 2. కొపర్నికస్‌
3. టాలమీ 4. కెప్లర్‌
5. కింది వాటిలో ఏది క్రీ.శ.6వ శతాబ్దంలో భారతదేశంలోని షోడశ(16) జనపదాలలో ఒకటిగా ఉండేది?
1. అవంతి 2. గాంధార
3. పాంచాల 4. పైవన్నీ
6. భారతదేశంలో 6వ శతాబ్దంలో షోడశ పజనపదాలుండేవని పేర్కొన్న గ్రంథం ఏది?
1. మహాభారతం 2. రామాయణం
3. అంగుత్తర నికాయ 4. అభిదమ్మ పీఠిక
7. సుత్తనిపాత వ్యాఖ్యానంలో గోదావరి నదికి ఉభయ పార్శ్వములలో అంధక రాష్ట్రములని చెప్పబడినవి క్రింటివాటిలో ఏవి?
1. అశ్మక, అవంతి 2. అశ్మక, గాంధార
3. అశ్మక, కాంభోజ 4. అశ్మక, ములక
8. వాయు పురాణంలో పేర్కొనబడిన అశ్మక రాజధాని పోదన్‌ను ప్రస్తుత తెలంగాణలోని ఏ పట్టణంగా చరిత్రకారులు భావిస్తున్నారు?
1. నిర్మల్‌ 2. బోధన్‌
3. పెద్దపల్లి 4. నల్లగొండ
9. బోధన్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడని జైన గ్రంథాలు తెలుపుతున్న ఋషభనాథుని కుమారుడు ఎవరు?
1. వర్థమాన మహావీరుడు 2. విక్రమేంద్రుడు
3. శీతలనాథుడు 4. బాహుబలి
10. కోసలరాజు. కుల గురువైన భావరి అనే బ్రాహ్మణాచార్యుడు అస్సక జనపదంలో స్థిరపడి ఆశ్రమం నిర్మించుకొని విద్యాబోధన చేసేవాడని ఏ గ్రంథంలో పేర్కొనబడి ఉంది?
1. అంగుత్తరనికాయ 2. సుత్తనిపాత
3. వినయపీఠిక 4. అభిదమ్మ పీఠిక
11. 19వ శతాబ్దంలో రాబర్ట్‌ బ్రూస్‌పుట్‌ బృహత్‌ శిలాయుగపు సమాధులు కనుగొన్న వలిగొండ ఏ జిల్లాలో ఉంది?
1. ఖమ్మం 2. నల్గొండ
3. సూర్యాపేట 4. యాదాద్రి
12. వాయు బ్రాహ్మండాది పురాణాల్లో ఆంధ్రులకు పొరుగువారిగా ప్రస్తావించబడిన పారదులను దక్షిణాత్యులని ఎవరి శాసనాలు తర్వాత కాలంలో పేర్కొన్నాయి?
1. అశోకుడు 2. కనిష్కుడు
3. జయసింహ వల్లభుడు 4. అజాతశత్రువు
13. కిందివారిలో ఆంధ్రులు ఆర్య దండయాత్రల వల్ల మధ్య ఆసియా నుండి దక్షిణాపథానికి వచ్చేటప్పటికి ప్రస్తుత ఆంధ్రదేశంలో విస్తరించి ఉన్న జాతి?
1. నాగులు 2. మహిషకులు
3. అశ్మకులు 4. పైవారందరూ
14. కింది ఏ ప్రాంతాల్లో మహిషకులు ఉండినట్లు పురావస్తు ఆధారాల వల్ల తెలుస్తుంది?
1. మెదక్‌ జిల్లా 2. నల్లగొండ జిల్లా
3. ధార్వాడ్‌ జిల్లా (కర్ణాటక) 4. పైవన్నీ
15. కిందివాటిలో కళింగ పదానికి సరైన అర్థం ఏది?
1. జలమయం 2. వరిధాన్యం తినేవారు
3. తీర ప్రాంతంలో నివసించేవారు 4. పైవన్నీ
16. క్రీ.శ. 12వ శతాబ్దమునకు చెందిన ఏ శాసనంలో ‘తెలుంగ’ అనే పదం ఉన్నది?
1. కుర్గోడు 2. మస్కీ
3. రాజులమందగిరి 4. పైవన్నీ
17. గాంగ వంశస్థుడైన ఇంద్రవర్మ వేయించిన పుర్లి శాసనంలో లభ్యమైన పదం ఏది?
1. టిలింగాన్‌ 2. తెలుంగ
3. తెనుగు 4. తిలింగ
18. టాలమీ తన గ్రంథమైన ‘జాగ్రఫీ’లో మధ్య కళింగను ఏమని వ్యవహరించి ఉంటాడని చరిత్రకారులు భావించారు?
1. తెన్‌ కళింగ్‌ 2. మెడోకళింగ్‌
3. లోకళింగ్‌ 4. పైవన్నీ
19. కింది ఏ వ్యాకరణ గ్రంథంలో ‘తెలుంగం’ అని భాషాపరంగా తెలుగు కనిపిస్తుంది?
1. అష్టాధ్యాయి 2. తోల్‌కప్పియం
3. శిలప్పాధికారం 4. అగత్తియం
20. కిందివాటిలో తెలుగు తామ్ర శాసనాలలో మొట్టమొదటిగా చరిత్రకారులు భావించిన శాసనం ఏది?
1. విలస శాసనం 2. తిరుమల శాసనం
3. అనుమకొండ శాసనం 4. మద్రాస్‌ మ్యూజియం తామ్ర శాసనం
21. ఆంధ్రదేశంలో మొట్టమొదటి తెలుగు శాసనంగా పరిగణించ బడుతున్న కళ్లమళ్ల శాసనం వేయించినవారు ఎవరు?
1. ధనుంజయుడు 2. జయసింహ వల్లభుడు
3. కుబ్జ విష్ణువర్ధనుడు 4. బల్లియచోళుడు
22. కింది ఏ శాసనంలో సగం తెలుగు, సగం సంస్కృత పదాలున్నాయి?
1. కళ్లమళ్ల శాసనం 2. విప్పర్ల శాసనం
3. ఎర్రరుడిపాడు శాసనం 4. చేజర్ల శాసనం
23. కిందివాటిలో శ్రీకృష్ణదేవరాయలు వేయించిన ఏ శాసనంలో ‘తెలుంగాణ’ శబ్దం కనిపిస్తుంది?
1. చిన్నకంచి శాసనం (తమిళనాడు)
2. తిరుమల శాసనం (చిత్తూరు జిల్లా)
3. పైరెండూ 4. పైవేవీకావు
24. కిందివాటిలో ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని ఏ ప్రాంతంలో బయల్పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం పేర్కొనబడింది?
1. లింగంపల్లి 2. తుఫ్రాన్‌
3. వర్గల్‌ 4. తెల్లాపూర్‌
25. గోదావరికి ఇరువైపులా అళక (ఆశ్మక) ములక (నాందేడ్‌, ఔరంగాబాద్‌ జిల్లాలు) రాజ్యాలున్నాయని అవి అందకరార్ధలుగా పేర్కొన్నది?
1. భావరి వృత్తాంతం 2. అంగుత్తరనికాయ
2. ఇండికా 4. మాళవికాగ్నిమిత్ర
26. మౌర్యుల్లో చివరివాడైన బృహద్రుడిని అతని సేనాని పుష్యమిత్రశుంగుడు హత్యచేసి క్రీ.పూ.187లో అధికారంలోకి వచ్చాడని ఈ కుట్రను వ్యతిరేకించి ఆంధ్రులు తిరుగుబాటు చేయగా వారిని శంగులు ఓడించారని తెల్పుతున్న నాటకం ఏది?
1. ధర్మామృతం 2. సుత్తనిపాదం
3. మాళవికాగ్నిమిత్రం 4. క్రీడాభిరామం
27. అశోకుడు ఎన్నవ శాసనంలో తన రాజ్యానికి దక్షిణంగా కళింగ, ఆంధ్ర, భోజక, రఠిక రాజ్యాలున్నట్లు వారు ధర్మాన్ని పాటిస్తున్నట్లు పేర్కొన్నాడు?
1. 4వ శిలాశాసనం 2. 8వ శిలాశాసనం
3. 13వ శిలాశాసనం 4. 10వ శిలాశాసనం
28. శాతవాహనులకు పూర్వం క్రీ.పూ. 1, 2 శతాబ్దాల్లో స్థానిక రాజులు చిన్న చిన్న రాజ్యాలను పాలించారు కాగా వడ్డెమాను శాసనంలో పేర్కొన్న రాజులు ఎవరు?
1. కుభీరకుడు 2. సోమకుడు
3. సరిసద 4. నారన
29. ఈ కింది వానిలో సరికాని జతను గుర్తించండి?
1. వడ్డెమాను శాసనం-రాజు సోమకుడు, జంటుపల్లిల ప్రస్తావన
2. వేల్పూరు శాసనం – సరిసద, అశోక సదల ప్రస్తావన
3. కోటిలింగాల- గోపద, సమగోప, కంవాయసిరిల నాణేల లభ్యం
4. వీరాపురం-నిగమసభ, గోష్టిల ప్రస్తావన
30. శివమహస్తిన్‌, శివస్కందహస్తిన్‌ అనే శాతవాహన పూర్వరాజుల నాణేలు లభించిన ప్రాంతం ఏది?
1. వడ్డెమాను కొండ 2. వెల్పూరు
3. కోటిలింగాల 4. వీరాపురం
31. తెలంగాణలో తామ్ర శాసనాలు వేయించిన రాజవంశం ఏది?
1. శాతవాహనులు 2. ఇక్ష్వాకులు
3. విష్ణుకుండినులు 4. కాకతీయులు
32. కిందివాటిలో కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలను గూర్చి వివరించే మొదటి శాసనం ఏది?
1. మాగల్లు శాసనం 2. చందుపట్ల శాసనం
3. ఖండవల్లి శాసనం 4.హనుమకొండ శాసనం
33. కిందివాటిలో ప్రోలయ శాసనం ఏది? నాయకుని ఘనకార్యాలను తెలిపే శాసనం ఏది?
1. ద్రాక్షారామ శాసనం 2. కలువచేరు శాసనం
3. కురవగట్టు శాసనం 4. విలాస తామ్ర శాసనం
34. కింది ఎవరి కాలంలో తెలుగు రాజభాషగా, శాసన భాషగా అధికార ప్రతిపత్తి పొందింది?
1. రాష్ట్రకూటులు 2. రేనాటి చోళులు
3. కాకతీయులు 4. ఇక్ష్వాకులు
35. కిందివాటిలో విష్ణుకుండినులకు సంబంధించిన శాసనం ఏది?
1. గోరంట్ల తామ్ర శాసనం 2. పాలమూరు శాసనం
3. తుమ్మలగూడెం శాసనం 4. పైవన్నీ
36. కింది వాటిలో శాతవాహనుల కాలంనాటి నాణేలు లభ్యమైన ప్రదేశం?
1. కోటిలింగాల 2. కొండాపురం
3. పెద్దబంకూరు 4. పైవన్నీ
37. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఏ రాజవంశ ప్రాకృత శాసనం హైదరాబాద్‌లోని చైతన్యపురిలో మూసీనది తీరంలో లభించింది?
1. శాతవాహనులు 2. ఇక్ష్వాకులు
3. విష్ణుకుండినులు 4. కాకతీయులు
38. తెలంగాణలో తొలి తెలుగు గద్య శాసనంగా ప్రసిద్ధి చెందిన కొరవి శాసనం కింది ఏ రాజవంశానికి చెందినది?
1. బాదామి చాళుక్యులు 2. కళ్యాణి చాళుక్యులు
3. వేములవాడ చాళుక్యులు 4. రాష్ట్రకూటులు
39. కిందివాటిలో తెలంగాణలో లభించిన ఏ సంస్కృత శాసనంలో తెలుగు పదాలున్నట్లు గుర్తించారు?
1. గద్వాల శాసనం 2. పాలంపేట శాసనం
3. పానగల్లు శాసనం 4. కలువచేరు శాసనం
40. ప్రాచీన స్థానిక చరిత్రలగు కైఫీయత్తులను ప్రప్రథమంగా సేకరించిన వారు ఎవరు?
1. కల్నన్‌ మెకంజీ 2. లార్డ్‌ రిప్పన్‌
3. లార్డ్‌ మేయో 4. సి.పి.బ్రౌన్‌
41. కిందివాటిలో కాకతీయ యుగాన్ని గూర్చి తెలుసు కోవడానికి ఉపయోగపడు వాన్మయం?
1. క్రీడాభిరామం 2. ప్రతాపరుద్ర యశోభూషణం
3. నిర్వచనోత్తర రామాయణం 4. పైవన్నీ
42. కిందివాటిలో గణపతిదేవుడు సముద్ర వ్యాపారానికి రక్షణ కల్పిస్తూ వేసిన అభయ శాసనం ఏది?
1. బయ్యారం శాసనం 2. పిల్లలమర్రి శాసనం
3. చందుపట్ల శాసనం 4. మోటుపల్లి శాసనం
43. కిందివాటిలో వేములవాడ చాళుక్యుల శాసనం ఏది?
1. పర్భని శాసనం 2. కుర్క్యాల శాసనం
3. చెన్నూరి శాసనం 4. పైవన్నీ
44. కిందివాటిలో రేచర్ల పద్మనాయకుల శాసనం ఏది?
1. వాడపల్లి శాసనం 2. సోమవరం శాసనం
3. పిల్లలమర్రి శాసనం 4. పైవన్నీ
45. కిందివాటిలో అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ కాకతీయ రాజ్యంపై చేసిన దండయాత్రలను గూర్చి వివరించే గ్రంథం ఏది?
1. తారిఖ్‌-ఇ-ఖిల్జీ 2. తారిఖ్‌-ఇ-అహ్మద్‌
3. తారిఖ్‌-ఇ-ఆలమ్‌ 4. తారిఖ్‌-ఇ-బాబరీ
46. కిందివాటిలో తెలంగాణలో లభించిన శాసనాల్లో అచ్చ తెలుగు భాష కనిపించు శాసనం ఏది?
1. ఆగామోత్కూరు శాసనం 2. ఫణిగిరి శాసనం
3. పాలంపేట శాసనం 4. విలాస శాసనం
47. తెలంగాణలో లభించిన మొగల్‌ చెరువు శాసనం కింది ఏ వంశ పాలన గూర్చి తెలుపుతుంది?
1. వేములవాడ చాళుక్యులు 2. కళ్యాణి చాళుక్యులు
3. బాదామి చాళుక్యులు 4. ముదిగొండ చాళుక్యులు
48. కిందివాటిలో శాతవాహనుల సంస్కృతిని తెలుసుకోవడానికి ఉపయోగపడు వాన్మయం ఏది?
1. బృహత్కథ 2. గాథాసప్తశతి
3. వాత్సాయన కామసూత్రాలు 4. పైవన్నీ
49. కాకతీయుల సామంతులుగా శాసనాలు ఎవరిని పేర్కొంటున్నాయి?
1. గోన వంశం 2. నతవాడి వంశం
3. రేచర్ల పద్మనాయకులు 4. పైవారందరూ
50. తెలుగులో రాయించిన మొట్టమొదటి తామ్ర శాసనం అయిన మద్రాసు మ్యూజియం తామ్ర పట్టిక ఎవరికి చెందినదిగా భావిస్తున్నారు?
1. బల్లయ చోడుడు 2. ఉదయన చోళుడు
3. కరికాల చోళుడు 4. కుళోత్తుంగ చోళుడు

సమాధానాలు
1.1 2.4 3.1 4.3 5.4 6.3 7.4 8.2 9.4 10.2 11.4 12.1 13.4 14.4 15.4 16.1 17.4 18.2 19.4 20.4 21.1 22.4 23.3 24.4 25.1 26.3 27.3 28.2 29.4 30.4 31.3 32.1 33.4 34.2 35.4 36.4 37.3 38.4 39.1 40.1 41.4 42.4 43.4 44.4 45.3 46.1 47.4 48.4 49.4 50.1

]]>
కరెంట్‌ అఫైర్స్‌ https://navatelangana.com/current-affairs-29/ Sat, 31 Aug 2024 17:18:54 +0000 https://navatelangana.com/?p=380843 కరెంట్‌ అఫైర్స్‌– హైజంప్‌లో పూజాసింగ్‌ జాతీయ రికార్డు
భారత యువ అథ్లెట్‌ పూజా సింగ్‌ హైజంప్‌లో జాతీయ రికార్డు తిరగరాసింది. 17 ఏండ్ల పూజ 1.83 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో పూజ తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును(1.82 మీటర్లు) బద్దలు కొట్టింది. హరియాణాకు చెందిన తాపీ మేస్త్రీ కూతురైన పూజ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో తొమ్మిదో స్థానంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. సరైన సౌకర్యాలు లేకుండానే అండర్‌-14 స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్వర్ణం నెగ్గిన పూజ 2022 జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌-16, అండర్‌-18 పోటీల్లో పసిడి పతకాలు కైవసం చేసుకుంది.
యూజియా ఫార్మాకు ఫార్మెక్సిల్‌ పలాటినం స్టార్‌ అవార్డు
అరంబిందో ఫార్మాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అరంబిందో ఫార్మా అనుబంధ సంస్థ యూజియా స్పిషాలిటీస్‌ 2022-23లో ఫార్మ ఎగుమతులకు సంబంధించి ఫార్మెక్సిల్‌ ప్లాటినం స్టార్‌ అవార్డు అందుకుంది. ఫార్మా ఎగుమతుల్లో కీలకపాత్ర పోషించినందుకు గాను నోయిడాలో జరిగిన కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు. కంపెనీ సీఈవో పువ్వల యుగంధర్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ విజరు నటరాజన్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితన్‌ ప్రసాద్‌ ఈ పురస్కారాన్ని అందజేశారు.
జయశంకర్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) ఫిజిక్స్‌ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌కు రేర్‌ ఎర్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు… రేర్‌ ఎర్త్‌ పరిశోధన, అభివృద్ధి, అనువర్తనాల రంగంలో ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఇవ్వబడింది. కేరళలోని తిరువనంతపురంలో ఆగస్టు 22వ తేదీన అంతర్జాతీయ సదస్సులో ఆయనకు ఆవార్డును అందజేశారు.
అత్యంత సంపన్నుల జాబితాలో అంబానీని మళ్లీ దాటేసిన అదానీ
పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ (62) భారతదేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. మరోసారి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని(67) అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 95శాతం ఎగిసి రూ.11.6 లక్షల కోట్లకు చేరింది. హురుక్‌ ఆగస్టు 29వ తేదీ విడుదల చేసిన సంపన్నుల జాబితా-2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నివేదికలో అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ.4.74 లక్షల కోట్లకు పడిపోయింది. అప్పుడు అంబానీ సంపద రూ.8.08 లక్షల కోట్లుగా నమోదైంది. తాజాగా అంబానీ మొత్తం సంపద 25 శాతం పెరిగి రూ.10.14 లక్షల కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ాజా జాబితాలో జూలై 31 నాటి వరకు రూ.1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న భారతీయ సంపన్నులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సారి కుబేరుల సంఖ్య 220 మేర పెరిగి 1,539కి చేరింది. మొత్తం సంపద 64 శాతం వృద్ధి రూ.159 లక్షల కోట్లకు చేరింది.

]]>
గంజాయి, గందరగోళం అనేవి ఏ భాషాపదాలు..? https://navatelangana.com/what-idioms-are-cannabis-confusion/ Sat, 31 Aug 2024 17:14:27 +0000 https://navatelangana.com/?p=380848 1. గ్రాము/గ్రహము, మోము/మొగము, దాకా/తనుక లాంటి పదాల్లో జరిగిన పరిణామం…
ఎ.వర్ణవ్యత్యయం బి.తాలవ్యీకరణం
సి.లోపదీర్ఘత డి.స్వరభక్తి
2. పగలు/పవలు, నివురు/నిమురు, తెలుగు/తెనుగు, తీగ/తీగ, అదరిపడు/అదిరిపడు… లాంటి పదాల్లోని ధ్వని మార్పులు..?
ఎ. వర్ణసమీకరణం బి. వర్ణవ్యత్యయం
సి. వర్ణవినిమయం డి. విప్రకర్ష
3. ఆసర, గందరగోళం, కొరడ, గంజాయి, చవక, కిచిడి… లాంటి పదాలకు మూలం?
ఎ.ఒరియా బి. తమిళం సి.కన్నడం డి.మరాఠీ
4. మనకు లభిస్తున్న మొదటి లిఖితపదం ‘నాగబు’
ఎ. తత్సమం బి.తద్భవం
సి.దేశ్యం డి.అన్యదేశ్యం
5. ‘వంద మంది కార్మికులు’ ఇందులో అర్ధశూన్యపదాంశం?
ఎ.వంద బి.మంది సి.కార్మికులు డి.వందమంది
6. ఆగమ పదాంశాన్ని గుర్తించండి?
ఎ.బొమ్మలు, గాలివాన బి.సీతాకోకచిలుక, నాగమల్లి
సి.కులీనస్త్రీ, నందివర్ధనం డి.ఇంటికి, మంటికి
7. జతపర్చుము
1.శత్రర్థకం అ.వెళ్ళినా, అడిగినా
2.చేదర్థకం ఆ.వెళ్ళి, అడిగి
3.క్త్వార్థకం ఇ.వెళ్ళితే, అడిగితే
4.అప్యర్థకం ఈ.వెళ్తూ, అడుగుతూ
1 2 3 4
ఎ. ఇ ఈ ఆ అ
బి. అ ఇ ఆ ఈ
సి. ఈ ఆ అ ఇ
డి. ఈ ఇ ఆ అ
8. ‘ఆమె నోటితో మాట్లాడి, నొసలుతో వెక్కిరిస్తుంది’ వాక్యంలో ‘తో’ విభక్తి ప్రత్యయం ఇలా ప్రయుక్తమయ్యింది?
ఎ.రీత్యర్థంలో బి.సహార్థంలో
సి.కరణార్థంలో డి.కాలార్థంలో
9. ‘కుందేటి కొమ్ము’ – పదబంధంలోని విభక్తి ప్రత్యయం?
ఎ. అనౌప విభక్తి ప్రత్యయం బి.ఔప విభక్తి ప్రత్యయం
సి.ప్రథమ విభక్తి ప్రత్యయం డి.ఏదీలేదు
10. సంశ్లిష్టకావ్యంలో…
ఎ. రెండు క్రియరహిత వాక్యాలుండొచ్చు
బి. రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రధాన వాక్యాలుండొచ్చు
సి. రెండు సమాపక క్రియలుండొచ్చు
డి. రెండు అసమాపక క్రియలుండొచ్చు
11. క్రింది వానిలో సరియైనది?
ఎ. సామాన్య వాక్యాల్లో ఒకే ఆఖ్యాతం ఉంటుంది.
బి. ఏక పదార్థ బోధకాలైన రెండు నామాలను ఒక చోట చేరిస్తే క్రియరహిత వాక్యాలు ఏర్పడతాయి.
సి. క్రియరహిత వాక్యాల్లోని రెండు నామాల్లో మొదటిది ఉద్దేశ్యం, రెండోది విధేయం
డి. పైవన్నీ
12. సరియైన నామ్నీకరణ వాక్యాన్ని గుర్తించండి?
ఎ. ఆ అబ్బాయి ఊరికి వెళ్ళాడు – ఊరికి వెళ్ళిన అబ్బాయి
బి. వాడు సువర్ణతో వచ్చాడు – వాడు వచ్చిన సువర్ణ్ణ
సి. వాడు వాళ్ళలో మంచివాడు – వాడు మంచి వాడయిన వాళ్ళు
డి. మాకు 2006లో పెళ్ళయ్యింది – మాకు పెళ్లైన 2006
13. తిక్కన భారతంలో ప్రయోగించబడిన మాండలిక భాషా పదం?
ఎ. మోట బి. కపిల సి. మదుం డి. చిలుకు
14. ఈ క్రింది వానిలో తద్ధిత రూపాలు…?
ఎ. నేర్పరి, టక్కులాడి, ఆటకత్తే
బి. తలపోయు, మేల్కొను, నిలబడు
సి. గంపెడు, దొంగతనం, కుట్రదారు
డి. టపీమని, ఢామ్మని, పరపర ఎ. ఇ.ఈ బి. అ,ఆ సి. అ,ఇ డి. ఆ,ఈ
15. జతపర్చుము
1. పర్యాయపదాలు అ. ప్రతిమాటకు బహుళార్థకత్వం ఉండటం మాట
2. సారూప్యపదాలు ఆ.వాడుొఅతడు/శోషిల్లు, నాడుొ దినం/దేశం
3. నానార్థాలు ఇ. భవం ొ పుట్టుక, బ్రతుకు, ప్రపంచడం
4. అనేకార్థపదాలు ఈ. వ్యవసాయం, సేద్యం, కమతం, సాగు
1 2 3 4
ఎ. ఈ ఆ ఇ అ
బి. ఈ ఇ ఆ అ
సి. ఇ ఈ ఇ అ
డి. ఆ అ ఇ ఈ
16. జతపర్చుము
1. అర్థసౌమ్యత అ. కంపు, కైంకర్యం, ఛాందసుడు
2. అర్థాపకర్ష/అర్థగ్రామ్యత ఆ. సభికులు, ముహూర్తం, వైతాళికులు
3. అర్థవ్యాకోచం ఇ. కోక, ఉద్యోగం, పత్రం, వస్తాదు
4. అర్థసంకోచం ఈ. చెంబు, అవధాని, తైలం
1 2 3 4
ఎ. ఆ ఈ అ ఇ
బి. ఆ అ ఈ ఇ
సి. ఈ ఇ అ ఆ
డి. ఇ అ ఆ ఇ
17. నన్నయ ‘పొంటెన్‌’ అనే ప్రత్యమాన్ని ఏ విభక్తిలో వాడాడు?
ఎ. ద్వితీయ విభక్తి బి. తృతీయ విభక్తి
సి. చరుర్థీ విభక్తి డి. పంచమీ విభక్తి
18. తెలుగు మధ్యద్రావిడ ఉపకుటుంబానికి చెందుతుందని నిరూపించిన భాషావేత్త?
ఎ. బిషప్‌ కాల్ట్‌వెల్‌ బి. బ్లూమ్‌ ఫీల్డు
సి. పి.ఎస్‌.సుబ్రమణ్యం డి. భద్రిరాజు కృష్ణమూర్తి
19. జతపర్చుము
1. వర్గమండలికం అ. పోతుంది, కురుస్తుంది, తెలియదు
2. ప్రాంతీయ మాండలికం ఆ. రోయిణి, సుక్క, బాస, దర్మం
3. జానపద మాండలికం ఇ. దుబ్బనేల, పెండ, బునాది, కర్రు
4. శిష్ట వ్యవహారం ఈ. పాప, యెండి, నేదు, గట్టా
1 2 3 4
ఎ. ఈ ఇ ఆ అ
బి. ఈ ఇ అ ఆ
సి. ఈ ఆ ఇ అ
డి. ఇ ఆ ఈ అ
20. జతపర్చుము
1. అర్థమరిణామం(ూవఎaఅ్‌ఱష జష్ట్రaఅస్త్రవ) అ. జి.ఎన్‌.రెడ్డి
2. ఆధునిక భాష : సంగ్రహ వర్ణనం ఆ. చేకూరి రామారావు
3. ధ్వని పరిణామం ఇ. టోలొమే
4. ప్రాచీనాంధ్ర శాసనాలు ఈ. గంటి జోగి సోమయాజి
1 2 3 4
ఎ. అ ఇ ఆ ఈ
బి. అ ఆ ఇ ఈ
సి. ఈ ఇ ఆ అ
డి. ఈ ఆ ఇ అ
21. జతపర్చుము
1. అమరసింహుడు అ. త్రిలింగ లక్షణశేషం
2. ఆచార్య జి.ఎన్‌.రెడ్డి ఆ. తెలుగు వ్యాకరణం
3. బహుజనపల్లి సీతారామాచార్యులు ఇ. నామలింగాను శాసనం
4. రావిపాటి గురుమూర్తిశాస్త్రి ఈ. తెలుగు పర్యాయ పద నిఘంటువు
1 2 3 4
ఎ. ఆ ఇ అ ఈ
బి. ఆ ఈ అ ఇ
సి. ఇ ఈ అ ఆ
డి. ఇ అ ఈ ఆ
22. గ్రిమర్సన్‌ రాసిన ‘లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’లో పేర్కొన్న మాండలికాలు ఎన్ని?
ఎ. 250 బి. 300 సి. 644 డి. 544
23. ‘కైఫియత్తు’ అనునది ఏ భాషా పదం?
ఎ. హిందుస్థాని బి. తెలుగు సి.మరాఠి డి.పోర్చుగీసు
24. ‘తెలంగాణ’ ప్రాంతం ఏ మండలానికి చెందుతుంది?
ఎ. దక్షిణ మండలం బి. ఉత్తర మండలం
సి. మధ్య మండలం డి. పర్వ మండలం
25. ఆధునిక భాషాశాస్త్రవేత్తల దృష్టిలో సాధు(ర), శకట (ఱ) రేఫలు?
ఎ. సవర్ణాలు బి. సపదాంశాలు
సి. మూర్ధన్యాలు డి. ద్విత్వవర్ణాలు
26. ద్రావిడ భాషల్లో తాలవ్యీకరణం చెందని భాష?
ఎ. తమిళం బి. తెలుగు సి. కన్నడం డి. మలయాళం
27. ‘తహశీల్దారు’ ఏ భాషాపదం?
ఎ. పోర్చుగీసు బి. ఉర్ధూ
సి. డచ్చీ డి. ఇంగ్లీష్‌
సమాధానాలు
1. సి 2. సి 3. డి 4. ఎ 5. బి
6. ఎ 7. డి 8. సి 9. బి 10. డి
11. డి 12.ఎ 13.బి 14.సి 15. ఎ
16. బి 17. సి 18. డి 19. ఎ 20. బి
21. సి 22. డి 23. ఎ 24. బి 25. ఎ
26. సి 27. బి
నానాపురం నర్సింహులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా.
9030057994
నెట్‌ / సెట్‌ ప్రత్యేకం

]]>
తెలంగాణ పరిచయాంశాలు/చరిత్ర పూర్వయుగం https://navatelangana.com/introduction-to-telangana-historical-prehistory/ Sat, 24 Aug 2024 17:17:41 +0000 https://navatelangana.com/?p=374356 ఆరు దశాబ్దాల పాటు జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితం నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 8 భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం 2014, జూన్‌ 2న ఏర్పడింది. 8 ఉద్యమ చరిత్రకు స్వస్తిపలికి ఒక నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చు– తెలంగాణ పరిచయాంశాలు
– ఆరు దశాబ్దాల పాటు జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితం నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
– భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం 2014, జూన్‌ 2న ఏర్పడింది.
– ఉద్యమ చరిత్రకు స్వస్తిపలికి ఒక నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్రం.
– మాతృభాష తెలుగైనప్పటికి 1948 వరకు తెలుగు వాడుకలో లేదు.
– ప్రభుత్వ వ్యవహారాల విషయంలో గానీ పాఠశాల విద్యాభ్యాసంలో గానీ ఉర్దూ భాష వాడుకలో ఉండేది.
– గ్రామాధికారుల, భూస్వాముల మత దురహంకారుల దౌష్ట్యాన్ని ఎదురించి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకై తమ ప్రాణాలనే ఆర్పించిన ఘనత తెలంగాణ రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలకు దక్కింది.
– తెలుగు ప్రజలు ఎక్కడున్నా అందరూ ఒకే గొడుగు కిందకి రావాలనే ఆశయం తెలంగాణ ప్రజలను స్వాగతించినప్పటికి, మంత్రివర్గ పదవుల్లో, ఉద్యోగ నియామకాల్లో తమపట్ల, తమ ప్రాంతం పట్ల చూపిన వివక్షత, సమాన గౌరవ ప్రతిపక్తులు ఇవ్వలేదని ప్రజలలో, నాయకులలో గట్టిగా నాటుకోంది. దీని పర్యవసానమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారి తీసింది.
తెలంగాణ పద ఆవిర్భావం
– తెలంగాణ అనే పదం అత్యంత ప్రాచీనమైంది.
– తెలంగాణలో జీవనదైన గోదావరిని ‘తెలివాహ నది’గా పిలుస్తారు. అందువలన ఈ నది పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలను త్రిలింగులుగా పిలిచేవారు.
– కాలక్రమంగా త్రిలింగ దేశంగానూ, తెలంగాణగానూ పేరు ఏర్పడింది.
– మలి మౌర్యుల కాలంలో వచ్చిన గ్రీకు రచనలులో కూడా ఈ పేరు కన్పిస్తుంది
– రాజ శాసనాల్లో త్రిలింగ, తిలింగ, తెలంగ అనే శబ్దాలను విరివిరిగా వాడారు.
– తెలంగాణ పదాన్ని సార్ధకం చేసి స్థిరపరిచిన ఘనత కాకతీయానంతర రచయితలకు దక్కింది.
– కాకతీయుల కాలంనుండి జరిగిన ముస్లిం దండయాత్రల కారణంగా తెలంగాణ అనే పేరు వ్యవహారికంగా మారింది.
తెలంగాణ పదం – శాసన ఆధారాలు
– క్రీ.శ.1417లో తెల్లాపూర్‌ (సంగారెడ్డి జిల్లా) శాసనంలో తెలంగాణ అనే పదం కన్పిస్తుంది.
– ప్రతాప రుద్రగణపతి వెలిచర్ల శాసనంలో, శ్రీకృష్ణ దేవరాయల తిరుమల చిన్న కంచి శాసనాల్లో తెలంగాణ పదం స్పష్టంగా పేర్కొనబడింది.
– కాకతీయుల కాలంలో కొన్ని బ్రాహ్మణ శాఖలను తెలంగాణ్యులు అనే వారు అంటే తెలంగాణకు చెందిన వారిగా పిలిచేవారు.
– తెలంగాణ పదంలో ‘ఆణెము’ అంటే దేశము కాబట్టి గోలకొండ స్థాపన సమయంలో కూడా తెలంగాణ పదంలో వాడకం బాగా ప్రాచుర్యాన్ని పొందింది.
– ఈ విధంగా నేటి తెలంగాణ అనే పదం రూపురేఖలు దిద్దుకుంటూ ఆవిర్భవించింది.
తెలంగాణ చారిత్రక ప్రాముఖ్యత
– తెలంగాణ చరిత్రకు విేష ప్రాముఖ్యత ఉంది.
– చరిత్ర పూర్వ యుగం నుంచి సమకాలీన చరిత్ర వరకూ ఈ ప్రాముఖ్యత విస్తరించింది.
– పాత రాతి యుగానికి చెందిన పనిముట్లు ఆవాస స్థలాలు, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో లభ్యమయ్యాయి.
– మానవ నాగరికతా ప్రగతి పథంలో ప్రధాన భూమిక వహించిన పాత, మధ్య, నవీన శిలాయుగాల సంస్కృతులకు తెలంగాణ రాష్ట్రం ఒక కేంద్ర బిందువుగా ఉంది.
– క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఏర్పడిన జన పదాలలో ఒకటైన అస్మక జనపదం, నిజామాబాద్‌ ప్రాంతంలో ఉంది. అస్మక జనపదానికి నేటి బోధన్‌ రాజధానిగా ఉండేది.
– గౌతమ బుద్ధుని కాలంలో తెలంగాణ ప్రాంతం విశేషంగా విలసిల్లింది.
– శాతవాహనుల జన్మస్థలం నిజామాబాద్‌ ప్రాంతమని, మొదట ఇక్కడ స్థిరపడిన తర్వాతనే అమరావతి ప్రాంతాలకు వెళ్లారని ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం.
– తెలంగాణలోని కొండాపురం (కొండాపూర్‌) శాతవాహనుల టంక శాల నగరం అని మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చెప్పారు.
– వరంగల్లు సమీపంలో సాద్వవాహన పేరుతో కొన్ని నాణేలు లభ్యం అయ్యాయి.
– ఇక్ష్వాకుల వంశుస్థుడైనా శాంత మూలుడు అస్మక, ములక ప్రాంతాలను (ప్రాచీన తెలంగాణ పేర్లు) జయించాడని బి.ఎన్‌.శాస్త్రిగారు తెలిపారు.
– విష్ణుకుండినుల కాలంలో తెలంగాణ ప్రాంతం ప్రభావం పెరిగింది. వీరు రాజ్య విస్తరణలో భాగంగా తమ స్వస్థలమైన తెలంగాణను వదిలి మహబూబ్‌నగర్‌, నల్గొండ ప్రాంతాల నుంచి తూర్పు దిశగా వేంగీకి చేరుకున్నారు.
– చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన భవభూతి క్రీ.శ. 7,8 శాతాబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలోనే వర్ధిల్లాడు.
– వేములవాడ చాళుక్యులు (క్రీ.శ. 750-973) మధ్య కాలంలో బోధన్‌, వేములవాడ కేంద్రాలుగా పశ్చిమోత్తర తెలంగాణ ప్రాంతమును పరిపాలించారు. దీన్ని ‘సపాద లక్షదేశం’గా వ్యవహరించేవారు.
– గోదావరి నదికి దక్షిణాన, మంజీరా నది నుంచి మహాకాళేశ్వరం వరకూ వ్యాపించిన భూభాగాన్ని ‘పోదనపాడు’ అని వ్యవహరించేవారు.
– కళ్యాణీ చాళుక్యులు, కందూరు చోడుల కాలంలో సాంస్కృతికంగా, రాజకీయంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది.
– నల్గొండ దుర్గం, యాదాద్రి జిల్లాలోని కొనుపాక, ఖమ్మం జల్లాలోని నేలకొండపల్లి వంటి ప్రాంతాల ప్రస్తావన నాటి శాసనాల్లో విరివిగా కన్పిస్తుంది.
– తొలి కాకతీయులతో పాటు, ముదిగొండ చాళుక్యులు, పొలవాస నాయకులు, కందూరి చోడులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలను పరిపాలించారు.
– కాకతీయుల యుగం నుండి కుతుబ్‌షాహీలు, అసఫ్‌ జాహీల పరిపాలనా కాలం వరకు, జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక పరిణామాలు తెలంగాణకు తిరుగులేని చారిత్రక ఉనికి, ప్రాధాన్యతను సంతరించి పెట్టాయి.
– చరిత్ర పూర్వ యుగం నుండి ఆధునిక యుగం వరకు తెలంగాణ చరిత్ర గర్వించదగ్గ విశిష్టత ఉంది.
తెలంగాణ చరిత్ర ఆధారాలు
– చరిత్రను పునర్నించడానికి గల ఆధారాలను ప్రధానంగా లిఖిత పూర్వక ఆధారాలు, పురావస్తు ఆధారాలుగా విభజించారు.
– భాష, లిపి లేకుండా అనేక వేల సంవత్సరాలు మానవులు జీవించారు. లిపి లేని దశను చరిత్ర పూర్వ యుగంగా పిలుస్తారు.
– చరిత్ర పూర్వయుగ కాలానికి సంబంధించిన వివరాలు తెలుసు కోవడానికి పురావస్తు ఆధారాలు మాత్రమే ఉపయోగపడతాయి.
పురావస్తు ఆధారాలు
– నివాస స్థలాలకు సంబంధించిన అవశేషాలు, లేదా కట్టడాలు, శాసనాలు, నాణేలను పురావస్తు ఆధారాలుగా పరిగణిస్తారు.
సాహిత్య ఆధారాలు
– సాహిత్య లేదా లిఖిత పూర్వక ఆధారాలు ఏ ప్రాంతపు చరిత్ర తెలుసుకోవడానికైన ముఖ్యమైన ఆధారం.
– లిఖిత ఆధారాలను స్వదేశీ, విదేశీ రచనలుగా విభజించారు.
– స్వదేశీ రచనలను లౌకిక, మతపరమైన గ్రంథాలుగా వ్యవహరిస్తారు.
స్వదేశీ రచనలు
– మత గ్రంథాలలో వైదిక, బౌద్ధ, జైన గ్రంథాలు ప్రాచీన తెలంగాణ చరిత్రకు ఆధారాలు. ఉదా: ఆచార్య నాగార్జునుని రచనలు, వేములవాడ చాళుక్య రాజు రెండో అరికేసరి అస్థానకవి పంప రచించిన ప్రముఖ గ్రంథం ‘ఆది పురాణం’.
– లౌకిక గ్రంథాలు ఆనాటి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు పరిపాలనాంశాలు తెలియజేస్తాయి.
– పంప కవి రచించిన ‘విక్రమార్క విజయం’, విధ్యానాథుడు రచించిన ”ప్రతాపరుద్ర యశోభూషణం” అప్పటి సమాజ ఆర్థిక స్థితిగతులు తెలియజేస్తున్నాయి.
– కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’లోని అంశాలను సూక్ష్మంగా పరిశీలిస్తే దక్షిణాపథ వర్తక వ్యాపారాలను గూర్చి ప్రస్తావించిన ఆధ్యాయాల్లో, తెలంగాణకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులు కనిపిస్తాయి..
విదేశీ రచనలు
– క్రీ.శ. తొలి శతాబ్దంలో వచ్చిన గ్రీకు రచనలు ప్రత్యక్షంగా, పరోక్షం గాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు తెలియ చేస్తాయి.
– ఉదాహరణకు ”ఎర్ర సముద్రపు దినచర్య” అనే గ్రంథంలో తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రా కోస్తా ప్రాంతానికి ఏ విధంగా వస్తువుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నవో తెలియజేస్తుంది.
తెలంగాణ మధ్యయుగ చరిత్రకు సంబంధించిన సాహిత్యాధారాలు
– ప్రొఫెసర్‌ హెచ్‌.కె. షేర్వానీ రచించిన ‘ది కుతుబ్‌షాహీస్‌ ఆఫ్‌ గోల్కొండ’.
– డా.యన్‌.వెంకటరమణయ్య మరియు శ్రీమల్లంపల్లి సోమశేఖర శర్మ రచించిన ‘ది కాకతీయాస్‌ ఆఫ్‌ వరంగల్‌’
– యజ్ఞాని (ఎడిటెడ్‌) ‘ఎర్లీ హిస్టరీ ఆఫ్‌ ది డక్కన్‌, సంపుటి-, భాగం
– మారేమండ రామారావ్‌ ‘కాకతీయ సంచిక’.
– పి.శ్రీనివాసాచార్‌ ‘పొలిటికల్‌, సోషల్‌ అండ్‌ రెలిజియస్‌ కండిషన్స్‌ ఆఫ్‌ ది దక్కన్‌ అండర్‌ ది కాకతీయాస్‌’ ఇన్‌ ది ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది హైదరాబాద్‌ ఆర్కియోలాజికల్‌ అండ్‌ హిస్టారికల్‌ సొసైటీ, జనవరి టు ఆగస్టు 1941, మొదలైనవి మధ్యయుగానికి సంబంధించిన సాహిత్యాధారాలు.
తెలంగాణ ఆధునిక చరిత్రకు ఆధారాలు
– ఆధునిక తెలంగాణ చరిత్ర అంతా అసఫ్‌ జాహీల పాలనతో నిండి ఉంది.
– ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, పాఠశీక, అరబిక్‌ భాషల పదజాలం, ఉర్దూ భాషలో ఉండేవి.
– ఆసఫ్‌ జాహీల పాలనకు సంబంధించిన సాహిత్య ఆధారాలు చాలా ఉన్నాయి.
– సుబేదారీ రికార్డులు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, అడ్మినిస్ట్రేటివ్‌ రిపోర్ట్స్‌, అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌, ఇండ స్ట్రియల్‌ స్టాటిస్టిక్స్‌, సెన్సెస్‌ రిపోర్ట్స్‌, విలేజ్‌ లిస్ట్స్‌, స్టాటిస్టికల్‌ ఆబ్జెక్స్‌, ఎకనామిక్‌ సర్వే రిపోర్ట్స్‌ మొదలగునవి ఉన్నాయి.
– వరంగల్‌ సుబా (విభజన పూర్వపు వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలు) పైన డా.వి. రామకృష్ణారెడ్డి 1987లో ”ది ఎకనామిక్‌ డెవలప్మెంట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ స్టేట్‌” 1911-1950 అనే గ్రంథాన్ని వెలువరించారు.
– మెదక్‌ సుబా (విభజన పూర్వపు మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలు) కు సంబంధించి, ఆచార్య వి. రామకృష్ణారెడ్డి మేజర్‌ రీసెర్చి ప్రాజెక్ట్స్‌ చేపట్టి, ”సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ డైనమిక్స్‌ ఆఫ్‌ మెదక్‌ సుబా ఆఫ్‌ ఫార్మర్‌ హైదరాబాద్‌ స్టేట్‌, 1905 1950 ఎ.డి.ను అగ్రికల్చర్‌ డెవలప్మెంట్‌ ఆఫ్‌ మెదక్‌ సుబా ఆఫ్‌ ఫార్మర్‌ హైదరాబాద్‌ స్టేట్‌, 1905-1950 ఎ.డి.ను వరుసగా 2012, 2014 ల్లో ప్రాజెక్ట్‌ రిపోర్ట్స్‌ తీసుకొని వచ్చారు.
– శ్రీ.యస్‌. కేశవ అయ్యంగార్‌ ఆర్థిక సర్వేలను జరిపి ”ఎకనామిక్‌ ఇన్వెస్టిగేషన్స్‌ ఇన్‌ ది హైదరాబాద్‌ స్టేట్‌, 1929-30, రూరల్‌ ఎకనామిక్‌ ఎన్క్వరీస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ స్టేట్‌, 1949-51లను అందించడం జరిగింది.
– టెనెన్సీ కమిటీ రిపోర్ట్‌ (1940), రిపోర్ట్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌డెటెడ్‌నెస్‌ (1937), ది బ్యాంకింగ్‌ ఎన్‌క్వైరీ కమిటీ రిపోర్ట్‌ (1930), ది. అగ్రేరియన్‌ రిఫార్మ్స్‌ కమిటీ రిపోర్ట్‌ (1949), రాయల్‌ కమిషన్‌ రిపోర్ట్‌ ఆన్‌ జాగీర్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ రిఫార్మ్స్‌ (1947) వస్తాయి.
– హైదరాబాద్‌ రాష్ట్రంలో వచ్చిన ఉద్యమాలు, ప్రజా సామాజిక ఉద్యమాలు, రైతాంగ పోరాటం, స్వాతంత్య్ర పోరాటం, విలీనోద్యమాన్ని గురించి వీటిలో పాల్గొన్న నాయకులు వారి రచనలు ఆధునిక తెలంగాణకు సంబంధించిన అంశాలు తెలియ జేస్తున్నాయి.
– పోరాట నాయకులు (రచనలు చేసిన వారు) రావి నారాయణరెడ్డి, డి. వెంకటేశ్వరరావు, సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ మాడపాటి హనుమంతరావు, మందముల నర్సింగరావు, యమ్‌.బసవపున్నయ్య మొదలైన వారు రచనల ద్వారా విలువైన సమాచారాన్ని అందించారు.
– ఆధునిక తెలంగాణకు సంబంధించిన సమాచారం అందించిన పత్రికలు గోలకొండ పత్రిక, దక్కన్‌ క్రానికల్‌, మీజాన్‌, ది హిందు, రయ్యత్‌, సంచికలు : హైదరాబాద్‌ ఇన్ఫర్మేషన్‌, ది హైదరాబాద్‌ బులెటిన్‌, ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ మొదలైనవి.
– హైదరాబాద్‌ డిస్ట్రిక్స్‌ గెజిటీర్స్‌, 1931-1936, యమ్‌.వి. రాజగోపాల్‌, ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిక్స్‌ గెజిటీర్స్‌ 1976, ఇంపీరియల్‌ గెజిటీర్‌ ఆఫ్‌ ఇండియా, ప్రొవిన్షియల్‌ సిరీస్‌, హైదరాబాద్‌ స్టేట్‌, 1909.
– యన్‌. రమేషన్‌ (ఎడిటెడ్‌) ది ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌ ఇన్‌ హైదరాబాద్‌, నాలుగు సంపుటాలు, 1966, ఆధునిక తెలంగాణ చరిత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తున్నాయి.
తెలంగాణ చరిత్రకు వ్యక్తిగత రచనలు
– యస్‌.హెచ్‌. బిల్గ్రామి మరియు సి. విల్‌మోట్‌లు రచించిన ”హిస్టారికల్‌ అండ్‌ డిస్క్రిప్టివ్‌ స్కెచ్‌ ఆఫ్‌ హిజ్‌ హైనెస్‌ ది నిజామ్స్‌ డొమినియన్స్‌, 1983.
– ఎ.ఐ.ఖురేషి, ‘ది ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ సంపుటి-1, 1941.
– జె.డి.బి. గ్రిబుల్‌ ‘ఏ. హిస్టరీ ఆఫ్‌ ది దక్కన్‌ సంపుటి-1’, 1896.
– క్రిస్టఫ్‌ వాన్‌ ప్యూరర్‌ అండ్‌ హైమండార్ఫ్‌ / ది అబోరిజనల్‌ ట్రైబ్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌.
పురావస్తు ఆధారాలు
– వివిధ ప్రాంతాలలో జరిపిన తవ్వకాలలో లభించిన భౌతిక అవశేషాలను పురావస్తు ఆధారాలంటారు.
– చరిత్ర పూర్వ యుగానికి చెందిన (ప్రాచీన, నవీన శిలాయుగానికి) నివాస స్థలాలు, మృణ్మయ పాత్రలు, సమాధులు మొదలైనవి ఆధారాలుగా ఉపయోగపడతాయి.
– ప్రాచీన శిలాయుగ ఆవాసాలు తెలంగాణలో ఎక్కువగా కన్పిస్తాయి. కుమ్రంభీం జిల్లాలోని ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్‌, పెద్దపల్లి జిల్లాలోని రామగిరి, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం, నార్కెట్‌పల్లి, యాదాద్రి జిల్లాలోని వలిగొండ ంటి ప్రాంతాల్లో లభ్యమయ్యాయి.
– నవీన శిలాయుగానికి సంబంధించిన బూడిద దిబ్బలు, రాతి పనిముట్లు, కుండ పెంకులు తెలంగాణ అంతట లభ్యమయ్యాయి.
– మెగాలిథిక్‌ లేదా బృహత్‌ శిలాయుగానికి చెందిన సమాధులు హైదరాబాద్‌ (కొండాపూర్‌, బోయినపల్లి) విభజన పూర్వపు నల్గొండ, కరీంనగర్‌ ప్రాంతాలలో కన్పిస్తాయి.

]]>