Districts Archives - https://navatelangana.com/category/districts/ Wed, 16 Apr 2025 07:06:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Districts Archives - https://navatelangana.com/category/districts/ 32 32 తెలుగు విశ్వవిద్యాలయంలో మహేశ్వరం సరితకు పీహెచ్డీ సీటు https://navatelangana.com/maheshwaram-sarita-at-telugu-university-phd-seat/ Wed, 16 Apr 2025 07:06:48 +0000 https://navatelangana.com/?p=547283
Maheshwaram Saritha gets PhD seat at Telugu Universityనవతెలంగాణ – చండూరు
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేటకు చెందిన మహేశ్వరం సరితకు తెలుగు విశ్వవిద్యాలయం లో పి హెచ్ డీ సీటు రావడం పట్ల చండూరు సాహితీ మేఖల సభ్యులు అభినందనలు తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం మంగళవారం రాత్రి ఎంపికైన పిహెచ్డి విద్యార్థుల వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేసింది. కవిరత్న సాహిత్య శిల్ప సమీక్ష అనే అంశంపై చండూరు సాహితీ మేఖల వ్యవస్థాపకులైన కవిరత్న అంబటిపూడి వెంకటరత్నం జీవితము రచనలపై పరిశోధన చేయనున్నారు. పరిశోధకురాలు మహేశ్వరం సరిత హైదరాబాద్ లోని తెలుగు అకాడమీ ఉద్యోగిని. గతంలో డాక్టరేటు పొందిన ఇడికుడ సచ్చిదానందం కుటుంబంలో ఇదివరకే ఆయన సోదరి, సోదరులు నలుగురు డాక్టరేట్లు పొందగా ఇప్పుడు ఆయన భార్య సరితకు పీహెచ్డీ సీటు లభించడం విశేషం. అభినందనలు తెలిపిన వారిలో చండూరు సాహితీ మేఖల అధ్యక్షులు అంబటిపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి, ప్రధాన కార్యదర్శి పున్న అంజయ్య, ప్రధాన వ్యవహర్త మంచుకొండ చిన బిక్షమయ్య, సభ్యులు మద్దోజు సుధీర్ బాబు డా.నిర్మలానంద, డా.చిదానంద, ఎస్.కె మజీద్, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసచారి, సభ్యులు ఉన్నారు.
]]>
108 అంబులెన్స్ లో గర్భిణి ప్రసవం https://navatelangana.com/pregnant-childbirth-in-108-ambulance/ Wed, 16 Apr 2025 06:28:11 +0000 https://navatelangana.com/?p=547267
Pregnant woman gives birth in 108 ambulance– చాకచక్యంగా వ్యవహరించిన 108 సిబ్బంది

నవతెలంగాణ – బెజ్జంకి
పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని మంగళవారం అర్థరాత్రి సమయంలో ఆస్పత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్ యందు ప్రసవించింది. మండల పరిధిలోని పెరుకబండ గ్రామానికి చెందిన వసంతకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ సిబ్బందికి సభాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పురిటి నొప్పులు అధికమయ్యాయి. వాహనాన్ని పక్కన నిలిపివేసి ఈఎంటీ రాజేంద్ర ప్రసాద్, పైలెట్ ఎర్రవెళ్లి పర్శరాములు చాకచక్యంగా వ్యవహరించి గర్భిణికి వైద్య చికిత్స అందించగా ప్రసవించింది. ఆమెకు మగబిడ్డ జన్మించిందని.. తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు.
]]>
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. https://navatelangana.com/the-brs-government-is-coming-again/ Tue, 15 Apr 2025 14:50:23 +0000 https://navatelangana.com/?p=546893
The BRS government will come again.– మాజీ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి
– విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో పాదయాత్రను ప్రారంభించిన మంత్రి..
నవతెలంగాణ – భువనగిరి
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రజోత్సవ మహాసభ జయప్రదం కావాలని కోరుతూ వలిగొండ మండలం మస్తగిరిగుట్ట వద్ద నుంచి యాదగిరిగుట్ట వరకు టిఆర్ఎస్ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పాదయాత్రను జగదీష్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఆనాడు స్వరాష్ట్రం కోసం కెసిఆర్ చర్చలో తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ముందుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే అన్నదాత వెన్ను విరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు.  కాంగ్రెస్ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని, దీంతో ప్రజలు  నమ్మి మోసపోయారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో విసుగు చెందిన తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు.  విద్యార్థి యువజన విభాగం టిఆర్ఎస్ రజతోత్సవాల సమయంలో పండు వేసవిని లెక్కచేయకుండా  పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. వారికి కెసిఆర్ మీద బిఆర్ఎస్ మీద ఉన్న ప్రేమ మనకు అర్థమవుతుందన్నారు.
ఇదే తరహాలో రాష్ట్రస్థాయిలో బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈనెల 27న వరంగల్లో జరిగే టిఆర్ఎస్ రజోత్సవ సభను చరిత్రలో నిలిచేలా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు   పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పొయ్యారన్నారు . రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ లంగా దొంగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొరడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజావ్యతిరేక విధానాల అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండబెట్టడానికి యువత ముందుకు రావాలని కోరారు. ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలోటిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బూడిద బిక్షమయ్యగౌడ్,  రాష్ట్ర నాయకులు నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, క్యామ మల్లేష్, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, వనమల కృష్ణ, తుమ్మల వెంక రెడ్డి, బూరుగు నవీన్ గౌడ్, మట్ట ధనంజయ గౌడ్, రమేష్, మొగోల్ల శ్రీనివాస్, కొమురెల్లి సంజీవరెడ్డి, పడమటి మమత, మంజుల, పలుసం రాజు, ఎండి అప్రోచ్, ప్రశాంత్, అవినాష్  పాల్గొన్నారు.
పాదయాత్రకు అడుగడుగున స్వాగతం..
బి ఆర్ ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో టిఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావాలని వలిగొండ మండలం మత్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వరకు నిర్వహిస్తున్న పాదయాత్రకు  అడుగు అడుగున ప్రజలు బిఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకుతున్నారు. మస్తగిరి దేవాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర ముందు డోల్ వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాదయాత్ర సభ్యులకు పూలమాలలు వేసి బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాదయాత్రకు నిర్వహిస్తున్న యువతతో పాటు బిఆర్ఎస్ శ్రేణులు వారితో నడిచారు.
]]>
చిరుధాన్యాలతో స్వచ్ఛమైన ఆహారం.. https://navatelangana.com/pure-food-with-cereals/ Tue, 15 Apr 2025 14:33:36 +0000 https://navatelangana.com/?p=546879
Clean food with grains..నవతెలంగాణ – తొగుట
చిరుధాన్యాలతో స్వచ్ఛమైన ఆహారం లభిస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ అంతూల్ అన్నారు. మంగళవారం వెంకట్రావుపేట సెక్టార్ పరిధిలోని మూడో అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ.. గర్భవతు లకు, బాలింతలకు, చిన్న పిల్లలకు చిరుధాన్యాలు మంచి ఆహారంగా ఉప యోగపడతాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చిరుధాన్యాలు హార పదార్థా లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషకాహార్ పదార్థా లతో అనేక రకాలైన లాభాలు ఉంటాయని తెలి పారు. అయోడిన్ ఉప్పు వాడుకోవాలని, చెక్కరి తక్కువ వాడుకొని బెల్లం ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్, అంగన్వాడి టీచర్లు పి. వీణా, జే. స్వప్న, ఎస్. జ్యోతి, ఆయాలు వి. భాగ్యలక్ష్మి, వి. వాణిశ్రీ, కవిత, ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి, యాదమ్మ, వినోద, పిల్లల తల్లిదండ్రులు, గర్భవతు లు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
]]>
ఉష్ క్రీడాకారుడిని అభినందించిన కమిషనర్ https://navatelangana.com/commissioner-who-congratulates-the-player/ Tue, 15 Apr 2025 14:22:52 +0000 https://navatelangana.com/?p=546854
Commissioner congratulates Ush playerనవతెలంగాణ – కంఠేశ్వర్ 
జాతీయస్థాయిలో 24 మార్చ్ నుండి 28 మార్చ్ 2025 వరకు జాతియ స్థాయిలో చత్తీస్ గడ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఉష్ క్రీడోత్సవాలలో నిర్వహించడం జరిగింది. ఈ ఉష్ క్రీడల యందు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లా కు చెందినటువంటి ఎండి. తజ్ ముల్ హైమద్ ఏ. ఆర్. ఎస్. ఐ  కుమారుడు ఎం.డి యాసిర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ క్రీడలలో యాసిర్ అహ్మద్ కి బ్రాంజ్ మెడల్ , ప్రశంసా పత్రం లభ్యం అయింది. ఈ బ్రాంజ్ మెడల్, ప్రశంసా పత్రం మంగళవారం నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, చేతుల ద్వారా ప్రధానం చేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రం పేరు నిలబెట్టడం ఎంతో సంతోషకరమైందని ఇదేవిధంగా భవిష్యత్తులో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా భారత దేశం నుండి ప్రాతినిధ్యం వంచి ఎన్నో మెడల్స్ సాధించి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క సిబ్బంది ఇదే స్ఫూర్తితో తమ పిల్లలను క్రీడలలో ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
]]>
వాల్ రైటింగ్ రాసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి https://navatelangana.com/wall-writing-mla-vemula-prashant-reddy/ Tue, 15 Apr 2025 11:15:42 +0000 https://navatelangana.com/?p=546694
MLA Vemula Prashanth Reddy wrote the wall writingనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో ఈ నెల 27 న వరంగల్ లో జరగబోయే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ పలుచోట్ల గోడలపై రాస్తున్న వాల్ రైటింగ్ వద్ద కాసేపు ఆగి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. గోడలపై రంగురంగుల కలర్లతో వాల్ రైటింగ్ ను చూసి పెయింటర్ ను అభినందించారు. పెయింటర్ చేతుల నుండి బ్రష్ తీసుకొని కొద్దిసేపు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయంగా వాల్ రైటింగ్ రాశారు. వాల్ రేటింగ్ వద్ద నిలబడి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభకు నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివెళ్తామన్నారు. సభకు స్వచ్ఛదంగా తరలి రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.ఉద్యమ పథాన ఉరిమిన చరిత..స్వరాష్ట్ర ప్రగతిలో చెరపలేని ఘనత బిఆర్ఎస్ పార్టీది అన్నారు. రాబోవు తరానికి బీఆర్ఎస్సే భవిత అని 25 ఏండ్ల పండగకు మనమంతా కదలాలని పిలుపునిచ్చారు.స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేసి సంక్షేమ పాలనను అందించిన మన ఇంటి పార్టీకి ఏప్రిల్ 27న రజతోత్సవం అని, బహిరంగ సభను  విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఉందన్నారు.
]]>
అగ్నివీర్ గా ఎంపికైన యువకునికి సన్మానం https://navatelangana.com/food-to-a-young-man-who-was-selected-as-agnivir/ Tue, 15 Apr 2025 11:13:02 +0000 https://navatelangana.com/?p=546688 Honor given to the young man selected as Agniveerనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రానికి చెందిన చింతకుంట రవి అగ్నివీర్ గా ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మంగళవారం  మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో అగ్నివీర్ గా ఎంపికైన చింతకుంట రవిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవిని శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి అగ్నివీర్ గా  ఎంపిక ఇవ్వడం గ్రామస్తులందరికీ గర్వ కారణమని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, పాలెపు చిన్న గంగారం, సింగిరెడ్డి శేఖర్, పూజారి శేఖర్, సుంకేట శ్రీనివాస్, వేములవాడ జగదీష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
]]>
గ్రామ అభివృద్ధి కమిటీలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి  https://navatelangana.com/legislative-measures-should-be-taken-on-village-development-committees/ Tue, 15 Apr 2025 10:28:12 +0000 https://navatelangana.com/?p=546630
Legal action should be taken against village development committees.– సీపీఐ(ఎం) డిమాండ్

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
గ్రామ అభివృద్ధి కమిటీలపై నిషేధం ప్రకటించి చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలనిసీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నిజామాబాద్ ఆర్డిఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా సమాంతర పరిపాలనను కొనసాగిస్తూ.. జిల్లాలో తమ ఆధిపత్యం నిలపెట్టుకోవటానికి బడుగు బలహీన వర్గాల ప్రజలను, దళితులను తమ మాట వినని యెడల సామాజిక బహిష్కరణలు, జరిమానాలు విధిస్తూ ప్రజల్లో ఒక బయోత్పాత వాతావరణంలో కొనసాగిస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. అందువల్ల గ్రామ అభివృద్ధి కమిటీలను నిషేధించి ప్రభుత్వం వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటికే ఒక 60- 70 సంఘటనలకు పైగా ఆయా గ్రామాల్లో జరిగాయని అధికారులు, పోలీసు యంత్రాంగం గ్రామ అభివృద్ధి కమిటీల పెద్దలపట్ల ఉదాసీనంగా ఉండటం వల్లనే ఈ దుశ్చర్యలు కొనసాగుతున్నాయని వారు విమర్శించారు. ప్రధానంగా చేతివృత్తిదారులు, దళితులు, బలహీన వర్గాల పట్ల మీరు కఠినంగా వ్యవహరిస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. సౌమ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా వీరు లెక్కచేయకుండా తమ నిర్ణయమే అమలు కావాలని ధోరణితో ఉన్నారని ఆయన విమర్శించారు. అందువల్ల వీరి పైన నిషేధం ప్రకటించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, జక్రాన్ పల్లి గ్రామంలో రజకుల పైన సంవత్సరం పైగా సాంఘిక బహిష్కరణకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్. నగర కార్యదర్శి సుజాత, నగర్ కార్యవర్గ సభ్యులు కటారి రాములు మరియు నగర కార్యకర్తలు కృష్ణ, రఫిక్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
]]>
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు https://navatelangana.com/awareness-seminar-under-the-aegis-of-the-fire-department/ Tue, 15 Apr 2025 10:16:52 +0000 https://navatelangana.com/?p=546613 Awareness seminar under the auspices of the Fire Departmentనవతెలంగాణ – కంఠేశ్వర్
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్, రైల్వే స్టేషన్, రిలయన్స్ మార్ట్ నియర్ అశోక్ టాకీస్ లలో అగ్నిమాపక అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. సదస్సులో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అదేవిధంగా అన్ని ప్రాంతాలలో అక్కడ పనిచేసే సిబ్బందికి అవగాహన కల్పిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్ రావు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితులలో అగ్ని ప్రమాదాలు జరిగితే 101 నెంబర్ కు ఫోన్ ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలో క్షుణ్ణంగా వివరించారు.

]]>
పెన్షనర్స్ సీనియర్ సిటిజన్స్ భవన్ ప్రారంభం https://navatelangana.com/pensioners-senior-citizens-bhavan-start/ Tue, 15 Apr 2025 10:08:03 +0000 https://navatelangana.com/?p=546607
Pensioners' Senior Citizens Bhavan inauguratedనవతెలంగాణ – కంఠేశ్వర్ 

తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్మించిన పెన్షనర్స్& సీనియర్ సిటిజన్స్ భవనమును ఏప్రిల్ 17 (గురువారం) ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే శ్రీ పి సుదర్శన్ రెడ్డి భవనాన్ని ప్రారంభిస్తారని, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అధ్యక్షత వహిస్తారని, నిజాంబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్యఅతిథిగా హాజరు కానునట్లు వారు తెలిపారు. నూడా చైర్మన్  కేశ వేణు అడిషనల్ కలెక్టర్ ఎస్. కిరణ్ కుమార్, ట్రెజరరీ అధికారి దశరథ్, స్త్రీ అండ్ శిశు సంక్షేమ, వృద్ధుల శాఖ అధికారి రసూల్ బి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. కృష్ణమూర్తి తదితరులు హాజరుకానట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ నిజామాబాద్ అధ్యక్షులు శిరప హనుమాన్లు. జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ హమీదుద్దీన్, కోశాధికారీ ఈవీఎల్ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్, అశోక్, సిరప్ప లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
]]>
తాటి ముంజలకు భలే గిరాకీ.. https://navatelangana.com/bhale-demand-for-palm-trees/ Tue, 15 Apr 2025 09:27:21 +0000 https://navatelangana.com/?p=546572 There is a great demand for palm fronds..నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో తాటి ముంజలకు డిమాండ్ ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాల నుండి చిరు వ్యాపారులు తాటి ముంజలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. డజను ధర రూ.100 నుండి రూ.120 వరకు పలుకుతోంది. ప్రస్తుతం ఎండలు కూడా ఎక్కువగా ఉండటంతో తాటి ముంజల విక్రయాలు పెరిగాయని చిరు వ్యాపారులు తెలిపారు. తాటి ముంజలలో పోషకాలు ఉన్నాయని, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.

]]>
చలివేంద్రం ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ జవాన్ లక్ష్యా నాయక్ https://navatelangana.com/crpf-jawan-lakshya-nayak-set-up-by-chalivendra/ Mon, 14 Apr 2025 07:53:11 +0000 https://navatelangana.com/?p=545773 CRPF jawan Lakshya Naik, who set up the Chali Vendramనవతెలంగాణ – పెద్దవూర
తిరుమలగిరి మండలం జమ్మంకోట తండాకు చెందిన రమావత్ లక్ష్యానాయక్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్ గా దేశ రక్షణ విభాగంలో పనిచేస్తున్నారు. చెన్నై శిక్షణా కేంద్రంలో ఉత్తమ కమాండెడ్ గా కమాండెంట్ విజయ్ కుమార్ చేతుల మీదుగా బెస్ట్ ఫీజికల్ ఇన్స్ట్రక్టర్ కమాండెన్స్ అవార్డుతోపాటు సర్టిఫికెట్ అందుకున్న రమావత్ లక్ష్యానాయక్ సోమవారం అంబేద్కర్ జయంతి సందర్బంగా సొంత ఖర్చులతో జమ్మన కోట గ్రామ రహదారి పై చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆర్మీ జవాన్ మాట్లాడుతూ.. 40 డిగ్రీల ఏండ కారణంగా ఎటు చూసిన నీళ్లు లేకపోవడం వల్ల, కొత్త బ్రిడ్జి నుంచి జమ్మనకోట వెళ్ళే రహదారి కావడంతో గ్రామం వాళ్ళే గాక జమ్మన కోట,చింతలపాలెం, నాయకుని తండా, సపవత్ తండా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని జమ్మనకోట వద్ద చలి వేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రమావత్ పులియా, రమావత్ హరి కృష్ణ, తాతరావు,లక్ష్మి, రాంబాబు,బాలోజీ,బుజ్జి, చిట్టి, సిరి,తదితరులు పాల్గొన్నారు.

]]>