Districts Archives - https://navatelangana.com/category/districts/ Mon, 06 May 2024 14:30:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Districts Archives - https://navatelangana.com/category/districts/ 32 32 బీజేపీ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయి: టీ.జ్యోతి https://navatelangana.com/attacks-on-women-have-increased-during-the-bjp-regime/ Mon, 06 May 2024 14:29:24 +0000 https://navatelangana.com/?p=284760 నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
పది సంవత్సరాల బీజేపీ పాలనలో మహిళల మీద దాడులు పెరిగిపోయి, మహిళలు సాధించుకున్న హక్కులు కాల రాయాలని కుట్ర బీజేనపీ చేస్తుందని ఈ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి, మహిళా హక్కుల రక్షణ కోసం సీపీఐ(ఎం) పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి అన్నారు. సోమవారం పంతంగి గ్రామంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ప్రచార సభలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ హయాంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల మీద దాడులు పెరిగి, నిరంతరం ఎలాంటి దారుణాలు ఎదుర్కోవలసి వస్తుందో మహిళలు భయపడుతూ బ్రతుకుతున్నారని, ప్రధానంగా దేశానికే పేరు తెచ్చే మహిళా రెజ్లర్లను అవమానపరిచిన బ్రిడ్జ్ భూషణ్ సింగ్ ను వదిలేసి, మహిళా రెజ్లర్ల ను అవమానపరిచిన ఘనత బీజేపీకే చెల్లుతుందని అన్నారు. అదేవిధంగా గుజరాత్, యూపీ ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళా హక్కులు హరించబడి కనీసం మౌలిక హక్కులు అడిగే హక్కు లేకుండా చేశారని  అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రతి ఎన్నికల్లో ప్రజలను మోసం చేసే వాగ్దానాలు ఇస్తూ ఓట్లు దండుకుంటున్నారని అన్నారు. కుంట్లగూడెం గ్రామంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న మునుగోడు నియోజకవర్గ సమస్యలను అధ్యయనం చేసిన అనేక పోరాటాలు నడిపిన సీపీఐ(ఎం) పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని, ఎర్రజెండా పోరాటాలను మరింత బలపరచాలని  పిలుపునిచ్చారు. వీరితోపాటు నాయకులు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగదేవి సైదులు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, శాఖ కార్యదర్శి అంతటి అశోక్, మండల కార్యదర్శివర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి, రాగీరు కిష్టయ్య, తడుక మోహన్, బొడిగే లింగస్వామి, గంగదేవి స్వామి, సబిత, కంచర్ల రాజు, జంగిలి కృష్ణ, జంగిలి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
]]>
ఖమ్మంలో గాలివాన బీభత్సం https://navatelangana.com/galivana-disaster-in-khammam/ Mon, 06 May 2024 06:35:04 +0000 https://navatelangana.com/?p=284421 నవతెలంగాణ ఖమ్మం: ఖమ్మంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో పట్టణంలో 50కిపైగా కరెంటు స్తంభాలు నేల కూలాయి. 9 చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లకు అంతరాయం కలిగింది. బోనకల్‌ మండలం పందిళ్లపల్లి వద్ద విద్యుత్‌ టవర్‌ కూలిపోయింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చింతకాని, నాగులవంచలో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. కూసుమంచి మండలం తురకగూడెం డబుల్ బెడ్ రూం ఇండ్లకు సమీపంలో తాడి చెట్టుపై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డబుల్ బెడ్ రూం ఇండ్లలో నివసించే వారు భయంలో పరుగులు తీశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా వర్షం కురియడంతో నెలరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో కాస్త ఊరట కలిగింది.

]]>
మోడీ మూడోసారి అధికారంలోకొస్తే దేశాన్ని అమ్మేస్తాడు: జూలకంటి రంగారెడ్డి https://navatelangana.com/julakanti-ranga-reddy-will-sell-the-country-if-modi-comes-to-power-for-the-third-time/ Sun, 05 May 2024 11:03:39 +0000 https://navatelangana.com/?p=284008
– బీజేపీని గ్రామాలలో తిరగకుండా తరిమికొట్టాలి 
– ధన బలం, ప్రజాసేవ మధ్య  జరుగుతున్న పోటీ
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి..
నవతెలంగాణ – చండూరు  
బీజేపీ అధికారంలోకి మూడోసారి వస్తే దేశాన్ని స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు హోల్ సేల్ గా అమ్మేస్తాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం గట్టుపల మండల పరిధిలోని తెరటుపల్లి లో జరిగిన సీపీఐ(ఎం) గ్రామ శాఖ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూటికి 9% ప్రజల సంపదను వాళ్ల శ్రమను దోషి కొంతమంది చేతిలో పెట్టే విధంగా బీజేపీ  ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు . గత పది సంవత్సరాలుగా బీజేపీ కార్మికులు, రైతు, పేదవాళ్లకు వ్యతిరేక విధానాలను అనుసరించడం సిగ్గుచేటని అన్నారు . ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పౌర హక్కులను కాపాడుకునేందుకు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పినప్పుడే మనుగడ ఉంటుందని అన్నారు. మోడీ మోసపూరిత మాటలతో మత, దేవుళ్ళ సెంటిమెంటు తో ప్రజలను మధ్యపెట్టి మోసగించి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు . బీజేపీ కి ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఎమర్జెన్సీ తలపించే విధంగా పాలన ఉంటుందని అన్నారు. బీజేపీ నియంతగా పాసిస్ట్ ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు.
దేశంలో ఏ పార్టీ మిగలకుండా బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన జైల్లో ఉండాలి .. ఓకే పార్టీ ఓకే మతం అనే నినాదంతో  బీజేపీ కండువా కప్పుకోకుంటే  జైల్లో ఉండాలనే ఆలోచనతో బీజేపీ వ్యవహరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలను విస్మరించి, అంకారపూరితంగా పరిపాలన కొనసాగించిందని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన డిమాండ్ చేశారు. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పూటకో పార్టీలు మార్చే నాయకులను ఓడించాలని, మునుగోడు నియోజకవర్గవెనుకబాటుకు కారణం గత పాలకులే కారణమని ఆయన అన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని పాదయాత్రలు, సాగు, త్రాగునీరు కోసం పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం లో ఇండ్ల స్థలాల కోసం, కార్మికుల కోసం, గీత కార్మికుల సమస్యల కోసం, పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడింది కమ్యూనిస్టు లేనని ఆయన అన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి, ఆ స్థానంలో మనుధర్మాన్ని తిసుకోచ్చి ఫ్యూడల్ పద్ధతులు ప్రవేశ పెట్టడం కోసం బీజేపీ కృషి చేస్తుందని, దీని ద్వారా కుల, మత, ప్రాంత విద్వేషాలు సృష్టిస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చడమే ద్యేయంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. ఇప్పటికే సిఏఏ, పౌరసత్వరద్దు, జ్యోతిష్యశాస్త్ర అమలు, విద్యా కాషాయికరణ, ఇ.డి, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరించడం, వారిని లొంగదీసుకోవడం, మేధావులను జైల్లల్లో పెట్టడం లాంటి వాటిని బలవంతంగా అమలు చేస్తుందన్నారు. బీజేపీ గత ఎన్నికల ముందు రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పిందన్నారు.
నల్ల డబ్బును బయటికి తీసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి 15లక్షలు జమ చేస్తామని చెప్పిందన్నారు. ఆమాట ఎక్కడికి పోయిందోనన్నారు. మరోవైపు  బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతికి చట్టబద్ధత కలిగించిందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..ఎలెక్ట్రోల్ బాండ్స్ రూపంల్ రూ.1600 కోట్ల రూపాయల అవినీతి జరిగితే రూ. 800 కోట్ల రూపాయలు బీజేపీకి పార్టీకి చేరాయన్నారు. భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న  బూర నర్సయ్య గౌడ్  భువనగిరి పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి చూయించి ప్రజల్ని ఓట్లు అడగాలని అన్నారు . ఎంపీగా ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే అభివృద్ధి చేయని బూర నర్సయ్యకు ఈ ఎన్నికల్లో ఓటు అడిగి అర్హత లేదని అన్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలియని అవగాహన లేని వ్యక్తులని కేవలం ప్రజాబలం లేకుండా ధన బలంతో వస్తున్న వ్యక్తులకు ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు.  గత 35 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా ప్రజా ఉద్యమాలలో ఉండి పోరాడిన తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే నాయకునిగా కాదు సేవకునిగా పనిచేస్తానని అన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలందరికీ సీపీఐ(ఎం) చేసిన పోరాటాలు తెలుసునన్నారు. సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించిపెట్టారన్నారు. నేడు ప్రజలు వాటిని అనుభవిస్తురన్నారని అన్నారు.. మునుగోడు నియోజకవర్గంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ ఏర్పడిన 2009 ఎన్నికల నుండి సీపీఐ(ఎం) పోటీ చేస్తుందన్నారు. అందుకే నిరంతరం నిజాయితీగా, నికరంగా, అవినీతికి తావులేకుండా  ప్రజాసమస్యలపై పోరాడే తమ ను ఆశీర్వదించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి  కట్ట నరసింహ, వివిధ మండలాల కార్యదర్శులు  నాంపల్లి చంద్రమౌళి, ఎర్పుల యాదయ్య, సీపీఐ(ఎం) చండూరు మాజీ మండల కార్యదర్శి  బొట్టు శివకుమార్, జెర్రిపోతుల ధనంజయ గౌడ్, పగిళ్ల శ్రీను, వల్గూరి శ్రీశైలం, అచ్చిన శ్రీనివాస్,బండారి కృష్ణయ్య, బండ యాదయ్య, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
]]>
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలి : నున్నా https://navatelangana.com/in-the-lok-sabha-elections-bjp-has-to-sing-the-final-song/ Sat, 04 May 2024 13:37:47 +0000 https://navatelangana.com/?p=283416 నవతెలంగాణ ఖమ్మం: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకు చరమగీతం పాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు అన్నారు. పింజరమడుగులో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం నాగభూషణం అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మతతత్వాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్న భాజపాను ఓడించాలన్నారు. మహబూబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గి కృష్ణ, శ్రీనివాసరెడ్డి, రామచంద్రయ్య కృష్ణమూర్తి పాల్గొన్నారు.

]]>
రాయదుర్గంలో దారుణ హత్య… https://navatelangana.com/brutal-murder-in-rayadurgam/ Sat, 04 May 2024 06:07:24 +0000 https://navatelangana.com/?p=283153 నవతెలంగాణ హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్‌(54) కొండాపూర్‌ వైట్‌ ఫీల్డ్స్‌ విల్లాస్‌లో ఉంటున్నారు. అంజయ్యనగర్‌లో తన కుమారుడు కేశవ్‌ వినయ్‌(28)తో కలిసి సీఎస్‌ డెలాయిట్‌ ఇన్‌ హోటల్‌ నిర్వహిస్తున్నారు. ఆయన హోటల్‌ వెనుక స్టోర్‌ రూం కోసం గది అద్దెకు తీసుకున్నారు. ఏడాది క్రితం స్టోర్‌ రూం ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్‌ చేసి సరకులు దించుకుంటున్నారు. ఆటో ట్రాలీ పార్కింగ్‌ వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పక్కింట్లో ఉండే మహేందర్‌(35) అనే వ్యక్తి శ్రీనివాస్‌తో గొడవపడ్డాడు. నాడు స్థానికులు అతడినే వారించి గొడవ సద్దుమణిగేలా చూశారు. తన పరువు తీశాడని కక్ష కట్టిన మహేందర్‌ అప్పటి నుంచి అతన్ని అంతమొందించాలనుకున్నాడు. అందులో భాగంగా గురువారం సాయంత్రం హోటల్‌లోకి ప్రవేశించి సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనివాస్‌పై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న కేశవ్‌, హోటల్‌ సిబ్బంది మహేందర్‌ను అడ్డుకుని శ్రీనివాస్‌ను కేర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11.45కు ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్‌ మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు మరో కుమారుడు ఉన్నారు. అవివాహితుడైన మహేందర్‌ ఎంబీఏ ఫైనాన్స్‌ చేసి ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం చూసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పినా పెడచెవిన పెడుతుంటాడు.

]]>
నిర్భయంగా ఓటేసే వాతావరణం కల్పిస్తాం https://navatelangana.com/we-will-create-an-atmosphere-for-fearless-voting/ Fri, 03 May 2024 15:34:50 +0000 https://navatelangana.com/?p=282761 – ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్

నవతెలంగాణ – ఆళ్ళపల్లి: లోక్ సభ ఎన్నికల్లో మండలంలోని ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆళ్ళపల్లి ఎస్సై ఈ.రతీష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సాయంత్రం వేళల్లో ఆళ్ళపల్లి నుండి మర్కోడు గ్రామం వరకు, అదేవిధంగా ఆళ్ళపల్లి నుండి పెద్ద వెంకటాపురం గ్రామం వరకు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన భద్రతా బలగాలతో ఎస్సై “పోలీస్ రూట్ మార్చ్” నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికల్లో అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. దానికి గాను చెక్ పోస్టుల్లో పోలీస్ సిబ్బంది నిఘా పటిష్టం చేశామని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సామాన్య ప్రజానీకానికి, శాంతిభద్రతలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల రూట్ మ్యాప్ పై భద్రతా బలగాలకు ముందుగానే అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఉపేందర్, ఎం.శ్రీనివాస్, వై.శ్రీనివాస్, వి.వెంకటేశ్వర్లు, టీఎస్ ఎస్ పీ సిబ్బంది పాల్గొన్నారు.

]]>
విధుల్లో నిర్లిప్తత పనికిరాదు https://navatelangana.com/detachment-in-duties-is-not-useful/ Fri, 03 May 2024 15:29:30 +0000 https://navatelangana.com/?p=282754 – అటవీశాఖ జిల్లా అధికారి కృష్ణ
నవతెలంగాణ – ఆళ్ళపల్లి: అటవీశాఖ ఉద్యోగులకు విధుల పట్ల నిర్లిప్తత పనికిరాదని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని భద్రాద్రి కొత్తగూడెం అటవీశాఖ జిల్లా అధికారి కృష్ణ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం ఈస్ట్, సౌత్, చింతోళ్లగుంపు ఈస్ట్ బీట్లలో ఫారెస్ట్ ట్రెంచ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిన్నెరసాని పరివాహక వైల్డ్ లైఫ్ పరిధిలోని అడవుల్లో చెట్లను నరకడం, జంతువులను వేటాడటం చేయొద్దని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే శాఖా పరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అక్రమంగా కలపను తరలించే వారిపై, వాహనాలపై సైతం కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వేసవి దృష్ట్యా జంతువులకు దాహార్తిని తీర్చేందుకు నీటి సౌకర్యం కల్పించాలని సిబ్బందికి చెప్పారు. ఉద్దేశపూర్వకంగా అడవుల్లో ఎరగడి పెట్టకూడదన్నారు. డీ.ఎఫ్.ఓ వెంట కిన్నెరసాని వైల్డ్ లైఫ్ ఎఫ్.డీ.ఓ బాబు నాయక్, ఆళ్ళపల్లి రేంజర్ కె.నరసింహారావు, తదితరులు ఉన్నారు.

]]>
రాయికల్…’పిక్క’టిల్లుతోంది https://navatelangana.com/raikal-is-picking-up/ Fri, 03 May 2024 15:05:56 +0000 https://navatelangana.com/?p=282719 – ఒకే రోజు 11 మందికి కుక్క గాట్లు
– నెలకు 70 మంది చొప్పున కుక్క గాట్లతో  యుపీహెచ్సీకి పరుగులు
– ఈ ఏడాది జనవరి నుండి కుక్కల దాడిలో 346 మందికి గాయాలు
– కోతుల దాడిలో 11, పిల్లులు,ఎలుకల వల్ల 10 మందికి గాయాలు
– పట్టణంలోనే అత్యధిక కేసులు నమోదు
– ఏ వీధిలో చూసినా ‘గ్రామ సింహాల’ స్వైరవిహారం
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ పట్టణంలో కుక్కల దాడి రోజు రోజుకూ పెరుగుతోంది. కుక్కపిక్క పీకితే లబోదిబోమంటూ పట్టణంలోని ఉన్నత స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరుగులు తీస్తున్న వారి సంఖ్య నెలకు పదుల సంఖ్యలో ఉంటుంది.కుక్కలకు తోడు కోతులు,పిల్లులు సైతం దాడి చేస్తున్నాయి.గాయపడుతున్న వారిలో ఒక్క రాయికల్ యుపీహెచ్సీ పరిధిలోనే యాంటి రేబిస్ వాక్సిన్ కోసం వచ్చే వారి సంఖ్య నెలకు 70 నుండి 95 మంది వరకు ఉంటుండగా.. ఈ  నాలుగు నెలల కాలంలో 366 మంది చికిత్స పొందారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో బేరీజు వేసుకోవాలి. కుక్కల నియంత్రణ పై దృష్టి సారించకపోవడం,వాటి సంతతి విపరీతంగా పెరగడం తో తిండి దొరక్క గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులపై దాడి చేసే స్థాయికి చేరాయి. పట్టణంలో జనవరి,ఫిబ్రవరి,మార్చి,ఏప్రిల్,మే 03 వరకు లెక్కలు పరిశీలిస్తే కుక్కకాటు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. జనవరిలో మొత్తం 92 మంది కుక్క గాటుతో, కోతుల వల్ల 01,పిల్లి వల్ల 02, ఫిబ్రవరిలో 76 మంది కుక్క గాటుతో,కోతి వల్ల 02, మార్చిలో 81 మంది కుక్క గాటుతో,కోతి వల్ల 03,పిల్లి వల్ల 02,ఎలుక వల్ల 02,ఏప్రిల్ లో  81 మంది కుక్క గాటుతో,కోతి వల్ల 04,పిల్లి వల్ల 03,ఎలుక వల్ల 01,ఈ నెలలో కుక్క గాటుతో 16 మంది గాయపడగా శుక్రవారం ఒకే రోజు 11 మంది కుక్క కాటుకు గురై పట్టణంలోని ఉన్నత స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి చికిత్స పొందారు.

గ్రామాలతో పోల్చుకుంటే 100కు 80 శాతం కేసులు పట్టణంలోనే నమోదు అవుతున్నాయి.  
కుక్కల అదుపునకు నిలిచిన శస్త్ర చికిత్సలు.. విపరీతంగా పెరుగుతున్న సంతతి
యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), జంతు సంరక్షణ బోర్డు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వీధి కుక్కల సంఖ్య అదుపునకు శస్త్రచికిత్సలు చేయాలి.కానీ గత ఏడాది మార్చిలో వీధి కుక్కల సంతానం తగ్గించేందుకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 821 కుక్క లకు శస్త్రచికిత్స చేయగా..జంతు సంరక్షణ బోర్డుకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో అప్పటి నుంచి శస్త్రచికిత్సలు నిలిపి వేశారు.అయితే ఈ జంతు సంరక్షణ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో స్థలాన్ని కేటాయించి భవనం నిర్మించాల్సి ఉండగా జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిబంధనల పేరుతో కుక్కలు,కోతులను నియంత్రించాల్సిన అధికారులు వెనక్కి తగ్గుతున్నారు.
ప్రాణాలమీదకు తెస్తున్న అవగాహన లోపం
గతంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ,రాత పుస్తకాల పై కుక్క, పాము కాటుకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పరిచేలా సూచనలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. కుక్క కరిస్తే రక్తం కారుతుందని వస్త్రం కట్టి ఆసుపత్రికి తెస్తున్నారు.అలా కాకుండా వైద్యులు సూచించిన ప్రకారం ఆసుపత్రికి తీసుకరావాలని,అవగహన లోపం,మూఢనమ్మకాల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
కుక్కకాటులో ఆలస్యం, నిర్లక్ష్యం తగదు..  (సూపరింటెండెంట్ డా. రవి- రాయికల్ యుపీహెచ్సీ)
జంతువులు దాడి చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
జంతువులు కరిచిన ప్రదేశంలో మంచి నీరు,సబ్బుతో ఐదు నిమిషాలు పరిశుభ్రంగా కడగాలి.
ఎలాంటి జంతువులు హాని తలపెట్టిన వెంటనే వైద్యుని సంప్రదించాలి.
స్వల్ప గాయాలకు (గీతలకు) మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి.
రక్త స్రావం అయిన గాయాలకు నాలుగు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
కుక్క లాంటి జంతువులు కరిచిన రోజు మొదటి డోస్,3వ రోజు రెండో డోస్,7వ రోజు మూడో డోస్, 21వ రోజు నాలుగో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.
తల భాగంలో ఎలాంటి జంతువులు గాయపరిచిన నాలుగు డోసుల వ్యాక్సిన్  తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు ఉన్న గాయాలపై ఎలాంటి జంతువులు వాటి నాలుకతో స్పృశించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
గేదె, ఆవు లాంటి జంతువులను కుక్కలు గాయపర్చినపుడు వాటి పాలను తాగిన వారు కూడా వైద్యులను సంప్రదించాలి.
జంతువులు కాటు వేసినప్పుడు, స్నానం చేయకూడదు, నూనె పెట్టుకోకూడదు, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు లాంటి మూఢనమ్మకాలను నమ్మకుండా వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలి.
యాంటీ రేబిస్ వ్యాక్సిన్ చేయించుకుని తగిన చికిత్స పొందాలి. ఆలస్యం, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వస్తుంది.
ప్రధానంగా ఇండ్లలోని పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ క్రమం తప్పకుండా వేయించాలి.
నియంత్రణకు చర్యలు తీసుకుంటాం..(ఎ.జగదిశ్వర్-మున్సిపల్ కమిషనర్)
వేసవి సమయంలో నీళ్లు,ఆహారం దొరకక వీధి కుక్కలు దాడికి దిగుతుంటాయి.యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ను సంప్రదించి సంతతి పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం,ఉన్నతాధికారుల ఆదేశాలతో వెటర్నరీ అధికారులను సంప్రదిస్తాం.కుక్కల దాడిపై ఉన్నతాధికారులకు నివేదించి వాటి బెడద తగ్గించేందుకు కృషి చేస్తాం.

]]>
ప్రతి కుటుంబానికి అండ… జీవితా బీమా…. https://navatelangana.com/life-insurance-for-every-family/ Fri, 03 May 2024 06:23:37 +0000 https://navatelangana.com/?p=282477 నవతెలంగాణ – యాదాద్రి: కలెక్టరేట్ ప్రతి కుటుంబానికి అండగా భారతీయ జీవిత బీమా సంస్థ ఉంటుందని ఎల్ఐసి అడ్వైజర్ అబ్బ గాని వెంకట్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన యాదగిరిగుట్ట మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన బండి పాండు అనారోగ్యంతో మరణించినందున వారి కుటుంబ సభ్యులు వారి భార్య బండి కలమ్మకు 75 వేల రూపాయల ఎల్ఐసి చెక్కును అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాలసీదారునికి నమ్మకాన్ని కల్పిస్తూ భరోసాని ఇచ్చే భారతదేశంలో ఏకైక ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి సంస్థ అని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్థిక సహకారనందిస్తూ పాలసీదారుడు పెట్టే పెట్టుబడికి నమ్మకాన్ని కలిగిస్తుందని తెలిపారు పాలసీదారుడు చెల్లించిన ప్రీమియానికి తన పాలసీ కాలవ్యవధి పూర్తయిన తర్వాత లాభాలతో అమౌంట్ అందజేస్తూ మరియు కుటుంబ సభ్యులు ఏ కారణం చేతనైనా మరణించిన వారి కుటుంబానికి అండగా ఉంటూ ఎల్ఐసి భరోసాను కల్పిస్తుంది అని తెలిపారు. ప్రజలందరూ కూడా వేరే ఇతర ప్రైవేటు సంస్థల జోలికి వెళ్లకుండా నమ్మకమైన ఎల్ఐసి సంస్థలో మీ యొక్క పెట్టుబడులు పెట్టాలని ప్రీమియం సరైన తేదీలలో విధిగా చెల్లించాలని కోరారు.

]]>
మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు https://navatelangana.com/brs-leaders-joined-the-congress-in-the-presence-of-the-minister/ Fri, 03 May 2024 06:14:34 +0000 https://navatelangana.com/?p=282462 నవతెలంగాణ-రామగిరి: రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు మాజీ వార్డ్ సభ్యులు గురువారం పెద్ద ఎత్తున మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి చాంద్ పాషా, మాజీ సర్పంచ్ ఎరుకల బాపూరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారిని ఐటి , పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పార్టీ కండువాపీ పార్టీలోకి స్వాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, గత 10 ఏండ్లుగా బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఏమి సాధించలేకపోయామని ఎలాంటి సంక్షేమ పథకాలు మాకు చేరలేదని కలత చెంది బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేస్తున్న దానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని వారన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ, మంత్రి శ్రీధర్ బాబు కోసం అహర్నిశలు కృషి చేసే వారి అడుగుజాడల్లో నడుచుకుంటామని ఎంపీ ఎలక్షన్లలో నాగపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పనిచేసి మెజార్టీ తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు.
పార్టీలో చేరిన నాయకులు తాజా మాజీ వార్డు సభ్యులు సట్ల రాజ్ కుమార్ గౌడ్, ఎర్రం శంకర్ ముదిరాజ్,చింతం మహేందర్, పొనం శ్రీనివాస్ గౌడ్, ఎర్రం కుమార్ ముదిరాజ్, నిమ్మల చంటి,తిప్పని సతీష్, రవి, నేరెళ్ల సారయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ జడ్పిటిసి సభ్యులు ఎల్లే రామ్మూర్తి, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, ఎండి చాంద్ పాషా, మాజీ సర్పంచ్ , మండల పార్టీ అధ్యక్షుడు రొడ్డ బాపన్న,ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య, ఎరుకల ప్రదీప్, పుప్పాల సంపత్, తొట్ల ప్రసాద్ యాదవ్, సందెల కుమార్, కల్వల శంకర్, బీసీ సెల్ మండల నాయకులు బండారి సదానందం, పందుల సతీష్, పందుల సోమశంకర్, తదితరులు పాల్గొన్నారు.

]]>
9.7 జిపిఏ సాధించిన విద్యార్థిని అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు https://navatelangana.com/minister-sridhar-babu-congratulated-the-student-who-achieved-97-gpa/ Fri, 03 May 2024 06:10:06 +0000 https://navatelangana.com/?p=282458 నవతెలంగాణ – రామగిరి: రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రస్తుత ఎంపీటీసీ తీగల సమ్మయ్య స్వప్న గార్ల ద్వితీయ పుత్రిక తీగల శ్రీతన్వి ముదిరాజ్ సెంటినరీ కాలనీలోని వాణి సెకండరీ పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థినికి నిన్న వెలువడినటువంటి పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి9.7 సాధించి పట్టణ టాపర్ గా నిలిచినందుకు గురువారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభినందించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, సూచిస్తూ ఇంకా ఎన్నో ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు, గురువులకు, మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా ఉన్నత చదువుతోపాటు దేశానికి సేవ చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఎల్ల శశిరేఖ రామ్మూర్తి, వనం రామచంద్ర రావు,బివి స్వామి గౌడ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య, ఎరుకల బాబురావు, ఎండి చాంద్ పాషా, ఎంపీటీసీలు కొప్పుల గణపతి, కొట్టే సందీప్, జనగామ బుచ్చి బాబు, చిందం మహేష్ పటేల్, మాజీ సర్పంచులు దేవునూరి రజిత శ్రీనివాస్, మాజి జడ్పిటిసి గంట వెంకట రమణారెడ్డి, తోట చంద్రయ్య, కాటం సత్యం, విద్యార్థిని శ్రీ తన్విని అభినందించారు.

]]>
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రం చేస్తాం https://navatelangana.com/we-will-make-ramagiri-qilla-a-tourist-center/ Fri, 03 May 2024 06:05:04 +0000 https://navatelangana.com/?p=282455 – కోడ్ రాకముందే ప్రతిపాదన తయారు చేశాం
– ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ- రామగిరి: రామగిరి ఖిల్లాను పెద్ద పర్యాటక కేంద్రంగా చేస్తామని, ఎన్నికల కోడ్ రాకముందే ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రామగిరిఖిల్లా సమీపంలో ఉపాధిహామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణతో కలసి ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ … కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పనిదినాల పెంపుతో పాటు వేతనాల పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి దఫాలో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఏమైనా సమస్యల ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం కింద నిధులు తగ్గించాడు తప్ప కనీసం పని దినాలు కూడా పెంచలేదనీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వంద రోజులు ఉన్న ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులు చేస్తాం అని అన్నారు అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలకు పెంపు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో పాటు ఆశీర్వాదంతోని ఇక్కడ నిరుద్యోగ సమస్యను అడ్రస్ లేకుండా చేసి ఉద్యోగాలు వచ్చేటట్లు పని చేస్తానని మాట ఇస్తున్నానీ అన్నారు. అలాగే మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని ప్రజలని కోరారు.
ఈ పార్లమెంటు ఎన్నికలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మన కోసం 5 న్యాయ గ్యారంటీలు అనే పథకాలను ప్రవేశపెట్టారని వాటిని కూడా కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాని, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో, అధిక ధరలతో నిరుద్యోగంతో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. అలాగే స్వర్గీయ శ్రీపాద రావు, కాక వెంకటస్వామి చాలా మంచి స్నేహితులనీ, వారిలాగే అభివృద్ధికి కంకణ బద్ధుడనై పని చేస్తానని మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో రత్నాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ, ఐ ఎన్ టి సి నాయకులు ఎంపీపీ, ఎంపీటీసీలు, లు మాజీ సర్పంచులు సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్ , ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

]]>