Editorial Archives - https://navatelangana.com/category/editorial/ Tue, 07 May 2024 17:17:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Editorial Archives - https://navatelangana.com/category/editorial/ 32 32 ద్వేషపు నోళ్లు! https://navatelangana.com/hateful-mouths/ Tue, 07 May 2024 17:16:06 +0000 https://navatelangana.com/?p=285746 Mouths of hate!సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ముస్లింలపైకి హిందువులను ఉసిగొలిపే పూర్తి మతత్వంతో కూడిన వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి. మోడీ పరివార ప్రచారమంతా విద్వేషం చిందిస్తూనే సాగుతోంది. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో తమని కాపాడే మంత్ర దండం అదేనని మన విశ్వగురువు నమ్ముతున్నాడు. అందుకే మొదటి నుంచి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల ప్రచారం లో భాగంగా తెలంగాణకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పిస్తాం’ అన్న మాటలే దీనికి తాజా ఉదహరణ. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశ సంపద మొత్తం ముస్లింలకు దోచిపెడతారు’ అన్న మాటలు రెండు వారాల కిందట స్వయానా మోడీ నోటి నుంచే విన్నాం. అప్పుడు ఆయన అబద్దాల అక్రమ ప్రచారం అలా… ఇప్పుడు ఈయన ఇలా… విడతల వారీగా సాగుతున్న ఎన్ని కల పోలింగ్‌ కమలం గుండెల్లో గుబులు రేపుతున్నది. అందుకే తమ విద్వేష ప్రసంగాలను మరింత తీవ్రతరం చేస్తున్నారు.
అసలు రిజర్వేషన్లకే వ్యతిరేకమైన బీజేపీ, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల గురించి తెగ మాట్లాడుతుంటే నవ్వు తెప్పిస్తోంది. వినేటోళ్లు ఉంటే హరికథను ఇంగ్లీష్‌లో చెప్తారనే ఓ నానుడి ఉంది. ఇప్పుడు బీజేపీ నాయకుల మాటలు కూడా అలాగే ఉన్నాయి. ‘మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం’ అని కూడా నడ్డా వారు సెలవిచ్చారు. అయితే రాజ్యాంగం, దాని విలువ, దానిని గౌరవించాలనే విషయం బీజేపీకి ఇప్పుడే గుర్తొచ్చింద నుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. మతాలను, రాజ్యాంగాన్ని, రాముడిని, సనాతన ధర్మాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో కమల నాధులకు తెలిసినంత బాగా బహుశా మరెవ్వరికీ తెలియదనుకుంటా!
ఆనాడు రాజ్యాంగ రచనను, అమలును తీవ్రంగా వ్యతిరేకించిన ఆరెస్సెస్‌ తానులోని గుడ్డే కదా ఈ బీజేపీ. అందుకే దేశంలో మతాలతో సంబంధం లేకుండా అట్టడుగు, వెనకబడిన వారి అభ్యున్నతిని కోరుతూ అంబేద్కర్‌ నాయకత్వాన లిఖించిన రాజ్యాంగాన్ని ‘తిరగ రాస్తాం, సమూలంగా మార్చేస్తాం’ అంటూ రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేస్తున్న వాళ్లు ఇప్పుడు రాజ్యాంగం, దాని విలువల గురించి మాట్లాడడం విడ్డూరం! దేశంలో వెనకబడిన, అట్టడుగు జనాభాలో ముస్లింలు కూడా ఉన్నారనే విషయం బీజేపీకి తెలియనిది కాదు. ఇవన్నీ వారి ఓటు రాజకీయాల్లో భాగంగా చేస్తున్నదని దేశంలోని హిందువులు తెలుసుకోవాల్సిన కీలకమైన సమయమిది.
మిగిలిన పార్టీలన్నీ ముస్లింలకు అనుకూలమైన వనీ, తామొక్కరమే హిందువులను ఉద్దరించేందుకు పుట్టినట్టు ప్రతి సభలో ఢంకా బజాయించి మరీ చెప్పుకుం టున్నారు బీజేపీ నాయకులు. మైనార్టీలైన ముస్లింలకు కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్లనే దేశంలోని మోజార్టీ హిందువులకు తీవ్రమైన నష్టం కలిగినట్టు ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. ముస్లింల పట్ల తీవ్ర వ్యతిరేకతను సృష్టిస్తున్నారు. దేశ ప్రజల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడుతు న్నారు. ఇలా బహిరంగ సభల్లో రాజ్యాంగానికి, ప్రజాస్వా మ్యానికి తూట్లు పొడిచే విధంగా మాట్లాడుతున్నా ఎలక్షన్‌ కమిషన్‌ చూసీ చూడనట్టు వ్యవహరించడం అత్యంత దారుణం.
ఇక దేశంలో హిందూరాజ్యమే మా ధ్యేయమని చెప్పుకుంటున్న బీజేపీ వల్ల హిందూ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అంటే అదీ లేదు. మోడీ పదేండ్ల పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపో యాయి, ప్రజలు ఉన్న ఉపాధిని కోల్పోయారు, కొత్త ఉద్యో గాలు రాలేదు, జీఎస్టీ పేరుతో పన్నుల భారం పెంచారు. దళితులపై, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ఇలా బీజేపీ పాలనలో బాధపడుతున్న వారిలో హిందువులే అధికంగా ఉన్నారనే నిజాన్ని గుర్తించాలి.
దేశంలోని ఆదివాసీలు, గిరిజనుల కంటే కూడా ముస్లింలు అత్యంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. సచార్‌ కమిటి ఈ విషయాన్ని స్పష్టంగా వివరించింది. ఎన్నో పోరాటాల ఫలితంగా చివరకు ముస్లిం లకు ఆ మాత్రమైనా రిజర్వేషన్‌లు అమల్లోకి వచ్చాయి. కనీసం వీటిపై కూడా అవగాహనలేని ముస్లిం జనాభా మన దేశంలో నేటికీ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం తమ అధికార పీఠాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలను తమ ఓటు బ్యాంకుగా వాడుకుంటు న్నారు కమల నాధులు. కార్పొరేట్ల భజన తప్ప సామాన్యుల సమస్యల గురించి పట్టించుకోని కాషాయ దళం ఇంతకు మించి గొప్పగా ఆలోచిస్తారను కుంటే అత్యాశే అవుతుంది.
కొన్ని రోజులు కష్టపడితే చాలు, మరో ఐదేండ్లు దేశాన్ని దర్జాగా దోచుకోవచ్చని కమల దళం ఉవ్విళ్లూరుతోంది. దేశం ఏమైనా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. మళ్లీ అందలమె క్కాలని తహతహలాడుతోంది. దేశంలో ప్రమాద ఘంటికలు మారు మోగుతున్న నేపథ్యంలో బీజేపీ అబద్ధాల, మత విద్వేష ప్రచారం పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కాలే కడుపులు, ఆకలి మంటలు మరిచి తమ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పాలకులను ప్రజలు ఎన్నటికీ సహించరని నిరూపించాల్సిన సమయమిదే.

]]>
ఏది సత్యం? ఏదసత్యం? https://navatelangana.com/what-is-true-is-not-true/ Mon, 06 May 2024 18:37:34 +0000 https://navatelangana.com/?p=284953 What is the truth? What is the truth?”ఏది సత్యం? ఏదసత్యం? ఓ మహాత్మా!, ఓ మహర్షి!” అంటూ ప్రశ్నలతోనే పాట కట్టాడు శ్రీశ్రీ. అవును మరి ఏది సత్యమో తెలుసుకోవాల్సిన పోలీసు శాఖ తమ ఊహాత్మక అభిప్రాయాన్ని వాస్తవంగా చిత్రిస్తూ…ఉన్నత న్యాయస్థానానికి సమర్పించిన 60 పేజీల రిపోర్టులో 40 పేజీలు రోహిత్‌ వేములను దళితుడు కాదని నిరూపించేందుకే కేటాయించారంటే… దాని వేనుక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అదుపాజ్ఞలు లేవని కొట్టిపారేయలేము. ఎందుకంటే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆ కమల దళాలే కనుక.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు దర్యాప్తును ముగిస్తున్నట్టు తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. ఏబీవీపీ, బీజేపీ చేసిన ప్రచారానికి పోలీసులు వంతపాడినట్టే కనబడుతోంది. రోహిత్‌ ఆత్మహత్యకు, ఆయన కులానికి సంబంధం ఏమిటో అర్థం కాని రీతిలో పోలీసులు నివేదిక ఉంది. తన కుల ధ్రువీకరణ పత్రం సరైనది కాదనే విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భావనతో అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని, వారి కులం సర్టిఫికెట్లు అన్నీ నకిలీవని, ఎటువంటి సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును మూసివేస్తున్నామని తేలికగా చెప్పేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నాటి సికింద్రా బాద్‌ ఎంపీ, నేటి హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, నాటి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు, హైదరాబాద్‌ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పలువురు ఏబీవీపీ నాయకులకు పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు.
‘చావు లాంచనాల గురించి రాయడం మర్చిపోయాను. ఎవరూ నా ఆత్మహత్యకు బాధ్యులు కాదు. వారి చర్యల ద్వారా గానీ, మాటల ద్వారా గానీ నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు. ఇది పూర్తిగా నా స్వనిర్ణయం. నా చావుకు నేనే బాధ్యుడిని. నా స్నేహితులను గానీ, నా శత్రువులను గానీ నా ఆత్మహత్య కారణంగా వేధించకూడదు’ రోహిత్‌ వేముల సూసైడ్‌ నోట్‌ సారాంశం ఇది. ఓ దళిత విద్యార్థి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నుంచి అతడితో గొడవపడిన ఏబీవీపీకి, వారికి కొమ్ముకాసిన పెద్దలకు ఈ సూసైడ్‌ నోట్‌ రక్షణ కవచంలా ఉపయోగపడొచ్చు. బోలెడంత భవిష్యత్తుకు తిలోదకాలిచ్చి అర్ధాంతరంగా తనువు చాలించిన రోహిత్‌ మరణంలో దాగున్న వేదన, వాస్తవ పరిస్థితులు ఎనిమిదేండ్లుగా ఈ సమజాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
‘నా పుట్టుక అనేది.. నా ప్రాణాంతక ప్రమాదం. ఓ దళితుడిగా వేముల రోహిత్‌ చనిపోదల్చుకోలేదు. నేనెప్పుడూ కూడా రచయితను కావాలని అనుకున్నాను. కార్ల్‌ సాగన్‌ వంటి సైన్స్‌ రచయితగా అవ్వాలనుకున్నాను. చివరికీ.. నేను ఈ ఉత్తరం మాత్రమే రాస్తున్నాను.” అని తన సూసైడ్‌ నోట్‌లో రాశాడు. ఈ కేసు ఇప్పుడు మూసేయడంలోనే అసలు ట్విస్ట్‌ ఉంది. గతేడాది నవంబర్‌లోనే నివేదిక సిద్ధమైనా… దాన్ని ఎన్నికల వేళ మార్చి 21న క్లోజర్‌ రిపోర్టను హైకోర్టుకు ఇస్తే.. ఇప్పుడు నిందితులు తమపై కేసులు రద్దు చేయాలని పిటీషన్‌ వేయటం వెనుక పరమార్థం ఏమిటి? ఈ ఎన్నికల్లో బీజేపీకి దళిత వ్యతిరేకుల ఓటు బ్యాంకును పెంచుకోవటం, దళితుల్లో రోహిత్‌పై వ్యతిరేకత పెంచటమే ధ్యేయంగా ఈ కుట్ర జరిగిందన్న విద్యార్థి సంఘాలు ఆరోపణలకు ఈ చర్యలు మరింత ఊతాన్నిస్తున్నాయి.
కానీ, రాష్ట్ర సర్కార్‌ ఈ కేసును రీఓపెన్‌ చేస్తామని, రోహిత్‌ కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసానివ్వడం కొంత ఊరటనిచ్చే అంశం. గతంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పినట్టు విద్యాసంస్థల్లో కుల వివక్షపై కఠిన చర్యలు తీసుకునే ‘రోహిత్‌ వేముల యాక్ట్‌’ గురించి కూడా ఈ సర్కార్‌ ఆలోచించాలి.
ఈ ప్రపంచంలో ఒంటరినని, తానొక శూన్యమని వేముల రోహిత్‌ ఎందుకు భావించాడు? ఇది ఇప్పుడు మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఆర్థిక అంతరాలు, సామాజిక అంతరాలు పెరుగుతున్నంత కాలం ఈ ఖాళీలు పెరుగుతూనే ఉంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు, రిజర్వేషన్ల రద్దు వంటి ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ విద్వేషాలకు, అంతరాలకు చరమగీతం పాడాల్సిన తరుణం ఇది. ఆలోచనాపరులంతా ఆలోచించాల్సిన సమయమిది.

]]>
వేధింపులు https://navatelangana.com/harassment/ Sat, 04 May 2024 18:11:32 +0000 https://navatelangana.com/?p=283646 Harassmentఇప్పుడెక్కడ చూసినా ‘వేధింపుల’ పర్వమే కనపడుతోంది. రాజకీయంగా వేధింపులు, వెంటాడటాలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాము. ఇక సామాజికంగా జరుగుతున్న వేధింపులు తరాలుగా కొన సాగుతూనే ఉన్నాయి. మత విద్వేషాలతో మైనారిటీల మీద వేధింపులు, బలహీనుల మీద వేధింపులు సర్వసాధారణమై పోతున్న తీరు మనందరికీ తెలుసు.
వీటన్నింటికి మించి లైంగికవేధింపుల సంఘటనలు సమాజంలో మరింత పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అందులోనూ పరిపాలన చేస్తున్న నాయకులు, అధికారులు ఈ లైంగిక వేధిం పులకు పాల్పడటం పెరిగిపోతున్నది. అంతేకాదు లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని రక్షించే శక్తిగా కూడా పాలకులు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తున్నది. ఈ రకమైన వేధింపులు ఈ పదేండ్ల కాలంలో మరింత పెరిగాయి. మహిళలపట్ల వివక్షతాపూరిత ఆలోచనల పెరుగుదల, ఆధిపత్య భావ జాలం పెరిగిన కారణంగా వేధింపుల పర్వమూ విస్తృతమవుతున్నది.
నిన్నగాక మొన్న బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌పై, రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని, తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. రెజ్యుమే తీసుకుని రమ్మని తన గదికి పిలిచి వేధించారని తీవ్రంగానే ఆవిడ ఆరోపించారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎలా మసలుకోవాలో, మహిళలపట్ల ఎంత మర్యాదగా ఉండాలో తెలుసుకుని ప్రవర్తించాలి. గవర్నర్‌ ఆ ఆరోపణలను ఖండించినప్పటికీ విచారణ చేసి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇంతకుముందు కూడా, ఎన్‌డి. తివారి గవర్నర్‌గా ఉన్నపుడు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు. ఇప్పుడీ ఉదంతం ఆ రాష్ట్రంలోనూ, బయటా పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు వారం ముందు, కర్నాటకలో జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అనేకమంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
ఈ ఆరోపణలను ఎదుర్కోలేక ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాలకు పారిపోయారు. ఇపుడు ప్రజ్వల్‌ లైంగికదాడికి గురయిన బాధితురాలు నేడు కిడ్నాప్‌నకు గురైంది. జేడీఎస్‌ పార్టీకే చెందిన మహిళపైనే గత రెండేండ్లుగా ఈ వేధింపులకు గురిచేస్తున్నాడని, తనకు తన భర్తకు ప్రాణముప్పు ఉందనే, ఇన్నినాళ్లు చెప్పలేదనీ మహిళ తెలియజేసింది. ఇపుడు జేడీఎస్‌ పార్టీ ఎన్డీయే కూటమిలో ఉండి బీజేపీకి మద్దతు నిస్తోంది. ప్రభుత్వం దీనిపై సిట్‌ ఏర్పాటు చేసి దర్వాప్తు చేపట్టింది. అయినా బీజేపీ ఇంతవరకు వేధింపు చర్యలను ఖండించలేదు. ఒక్క వేధింపు కాదు, ప్రజ్వల్‌ రేవణ్ణ వద్ద మూడు వేలకు పైగా మహిళల అభ్యంతరకర వీడియోలున్నాయని తెలుస్తున్నా కేంద్ర పెద్దలు మిత్రపక్షంగా ఉన్న పార్టీ నాయకులపై పెదవి విప్పటం లేదు.
ఇక అత్యంత విచారకరమైన అంశమేమంటే లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ కుమారుడికి ఉత్తరప్రదేశ్‌ లోకసభ స్థానాన్ని ఇచ్చి బీజేపీ మహిళలను అవమానిస్తోంది. బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్‌లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేష్‌ ఫోగాట్‌ మొదలైన అనేక మంది రెజ్లర్లు వీధుల్లోకి వచ్చి బ్రిజ్‌భూషణ్‌ ఆకృత్యాలపై చర్య తీసుకోవాలని ఆందోళన చేస్తే, చివరికి ఆయన కొడుక్కి పార్లమెంటు సీటులో పోటీ చేయటానికి టికెట్‌ ఇచ్చి వారు ఎటువైపు వున్నారో తెలియజేశారు. ఇవి మాత్రమే కాదు, 2020లో హత్రాస్‌లో ఒక దళిత అమ్మాయిపై అత్యాచారం, హత్యకేసులోనూ, అత్యాచారం చేసిన వారి పక్షమే ప్రభుత్వం నిలబడింది. ఆ సంఘటన వివరాలు తెలుసుకుందామని వెళ్లిన జర్నలిస్టు సిద్ధికీ కప్పన్‌ను అరెస్టు చేసి అన్యాయంగా జైల్లో పెట్టింది. అత్యాచారాలు, వేధింపులు చేసిన వారి పక్షం వహించడం ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ నాయకులకు సర్వసాధారణమైన విషయంగా ఉన్నది.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా చాలా సంఘటనలను పేర్కొనవచ్చు. కేవలం వేధింపుల పక్షమే కాదు, మహిళలను చిన్నచూపు చూడటంతో పాటు, బలహీనులుగా భావించే లక్షణం సంఫ్‌ు పరివార్‌ వారసులకు ఉంది. మనుధర్మాన్ని తూచ తప్పక పాటించేవారు, మనుధర్మ శాస్త్రాన్ని మన రాజ్యాంగమని భావించేవాళ్లు ఇలాగాక ఇంకెలా ఉంటారు! అందుకనే వేధింపులకు, వివక్షతలకు, వ్యతిరేకంగా నిలబడి పోరాడాలని, ఆ శక్తులను ఓడించేందుకు కృషిచేయాలని ప్రజలను చైతన్య పరుద్దాం!

]]>
మరో పెద్ద తలకాయ కోసం… https://navatelangana.com/for-another-big-head/ Fri, 03 May 2024 16:44:39 +0000 https://navatelangana.com/?p=282839 Sampadakiyamవిద్వేష విషం చిమ్మడంలోనే కాదు.. ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపులోనూ తనకెవరూ సాటిరారని నరేంద్రమోడీ సర్కారు నిరూపించుకుంటోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ వచ్చిన కమలం పార్టీ ప్రభుత్వం హోం శాఖ కనుసన్నల్లో నడిచే ఢిల్లీ పోలీసులను ఇప్పుడు ప్రయోగిస్తోంది. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై ఫేక్‌ వీడియో పోస్ట్‌ చేశారంటూ ఆ శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆగమేఘాల మీద తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ హుకుం జారీచేసి వెళ్లారు.
అయోధ్య రామ్‌లల్లా ఓట్లు రాల్చ లేదనీ, వికసిత భారత్‌ కట్టుకథయేనని ప్రజలు గుర్తు పట్టేశారు. మొదటిదశ ఎన్నికల్లో అడుగుజారిందని అర్థమయ్యాక 2002 గుజరాత్‌ మారణకాండకు పురిగొల్పిన భాషను ప్రధాని మోడీ తన అంబుల పొదిలోంచి బయటకు తీశారు. మత విద్వేష వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు పెంచేపని చేస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకం గా విషం చిమ్ముతున్నారు. అది చాలదన్నట్టు 400 సీట్లిస్తే రాజ్యాంగం మార్చేస్తామని తమ అంతే వాసుల రణన్నినాదాలు ప్రతిపక్షాలు సరిగ్గా వాసన పట్టాయి. మనరాష్ట్రంలో ప్రతిపక్షాలు మన ముఖ్యమంత్రి సైతం తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రచారం కూడా ప్రజలను ఆకట్టుకోవట్లేదు సరికదా రిజర్వేషన్లు పొందే తరగతుల వారు ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రజలను ఏమార్చడానికి ఈ నోటీసుల తతంగాన్ని ముందుకు తెచ్చారన్నది నిర్వివాదాంశం.
అసలు రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌ వైఖరేంటి? దాని వ్యవస్థాపకులేమన్నారు? బీజేపీ నేతలు ఇన్నాళ్లూ ఏం మాట్లాడారు? ఈ ప్రశ్నలకు వారెవ్వరూ సమాధానాలివ్వరు. ఇస్తే వారి బండారం బయటపడుతుంది. ”ఇప్పుడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అవసరం లేదు. ఎందుకంటే ఏ కులం కూడా వెనుకబడి లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పదేండ్లే కొనసాగించాలి. ఆ తరువాత కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు రద్దు చేయాలి” అని ది హిందూ పత్రికతో ఆర్‌ఎస్‌ఎస్‌ సైద్ధాంతిక వేత్త ఎంజి వైద్య 2015లోనే కుండబద్దలు కొట్టారు. ఇక ప్రస్తుత ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఒక కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించాలని, ఏ కేటగిరీకి ఎంతకాలం అవసరమో నిర్ణయించాలని 2015 లోనూ, రిజర్వేషన్ల అనుకూలురు, వ్యతిరేకుల మధ్య సామరస్య వాతావరణంలో చర్చలు జరగాలని 2019లోనూ సెలవిచ్చారు. పరివార్‌ మూల పురుషుడు హెడ్గేవార్‌ మొదలు అందరిదీ ఇదే మాట. ఇప్పుడు కొత్తగా ఏం చెబుతారు?
పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తాను ప్రజలకు చేసిందేమిటో చెప్పుకుని ఓట్లడగటం సర్వ సాధారణం. మోడీ సారధ్యంలో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, నల్ల చట్టాలు, రైతుల ఆందోళనలు ఉపసంహరణ.., కరోనా కాలంలో శవాల కుప్పలు, పళ్లాల మోతలు.. పెట్రో, గ్యాస్‌ ధరల బాదుడు, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇత్యాది ఘనకార్యాలను ఏమని చెప్పుకోగలరు? ఇక ప్రపంచ సూచీలన్నింటా పాతాళమేనాయె! పేదల్ని నిరుపేదలుగా దిగజార్చి కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు కట్టబెట్టడమే మోడీ నెరవేర్చిన గ్యారెంటీ! జీఎస్టీ పేరుతో రాష్ట్రాల వనరులన్నీ ఊడ్చేసినా, పన్ను కేటాయింపులను తొక్కిపెట్టినా, రుణ పరిమితిని తగ్గించేసినా కేరళ సహా అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలకన్నా మెరుగ్గా పాలన సాగిస్తున్నాయి.
కేంద్రం అన్యాయంపై కేరళ ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన నిరసన ప్రతిపక్షాల ఐక్య గొంతును వినిపించింది. తొలుత జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌, ఆ తరువాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లను అరెస్టు చేయించిన కేంద్రం కేరళ సీఎం పినరయి విజయన్‌ కుమార్తెపై ఈడి ద్వారా కేసు పెట్టడం, పలు రాష్ట్రాల్లో దాడులు చేయించడం తదితర ఎత్తులన్నీ ముగిసిపోగా, తాజాగా రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులతో నోటీసులిప్పించింది. ఆయన నోటికి తాళం వేయాలని బహుశా కాషాయ నేతల పేరాశ కావచ్చు. ఇప్పటికే సీఎస్‌డీఎస్‌ -లోక్‌నీతి సర్వే తేల్చినట్టు ఆర్థికాంశాలే రేపటి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఇక మిగిలింది నిరంకుశ పాలకులకు కర్రుకాల్చి వాతపెట్టేందుకు ఓటర్లు సిద్ధమవడమే.

]]>
అంతర్జాతీయ కోర్టు అన్యాయం! https://navatelangana.com/the-international-court-of-justice-is-unjust/ Thu, 02 May 2024 16:52:20 +0000 https://navatelangana.com/?p=282222 గాజాలో పాలస్తీనియన్ల మారణకాండకు పాల్పడు తున్న ఇజ్రాయిల్‌కు జర్మనీ చేస్తున్న ఆయుధ ఎగుమతులు నిలిపివేయాలంటూ నికరాగువా చేసిన వినతిని ఏప్రిల్‌ 30న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) తిరస్కరిం చింది. దక్షిణాఫ్రికా దాఖలు చేసిన మరొక వాజ్యంలో మారణకాండ నిలిపివేయాలంటూ అదే కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇజ్రాయిల్‌ ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. అలాంటి నేరదేశానికి ఆయుధాలు సరఫరా చేయవచ్చం టూ జర్మనీకి అనుమతి ఇచ్చిన తీరు న్యాయవ్యవస్థల మీద జనానికి ఉన్న విశ్వాసాన్ని పొగొట్టేది తప్ప మరొకటి కాదు. ఇప్పటికే 35,568 మందిని చంపిన యూదు దురహం కారులు ఇంకెందరినీ బలితీసుకుంటారో ఎన్ని వేల మందిని గాయపరుస్తారో తెలియదు. ఇంకా మిగిలి ఉన్న భవనాలను కూల్చివేస్తూ గాజాను మరుభూమిగా మారుస్తున్నప్పటికీ అంతర్జాతీయ న్యాయస్థానం పాలస్తీనియన్ల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నదనే చెప్పాలి. మరణించిన వారిలో 70శాతంపైగా మహిళలు, పిల్లలే ఉన్నారన్న పచ్చి నిజాలను చూసేందుకు నిరాకరిస్తున్నది. కోర్టు తీరు అక్కడ జరుగుతున్నది మారణ కాండ అని ఇంతవరకు రుజువు కాలేదన్న జర్మనీ వాదనను బలపరచటం తప్ప మరొకటి కాదు. ఆ దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా బల పరుస్తున్న పశ్చిమదేశాలు చేస్తున్న వాదనలు కూడా అవే. ఈ కేసులో న్యాయస్థానాన్ని, ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు జర్మనీ అడుగడుగునా ప్రయత్నించటమే కాదు వంచనకు పాల్పడింది.
గతేడాది అక్టోబరులో హమాస్‌ సాయుధులు ఇజ్రాయిల్‌పై దాడి జరిపినపుడు ఐరాస సహాయ సిబ్బందిలో కొందరు హమాస్‌కు సహకరించారని ఇజ్రాయిల్‌ ఆరోపించింది. నిజానిజాల నిర్ధారణ కాకుండానే ఇతర నాటో దేశాలతో పాటు పాలస్తీనీయన్లకు ఐరాస చేస్తున్న మానవతా పూర్వక సాయానికి నిధులు నిలిపివేసిన దేశాల్లో జర్మనీ ఒకటి. గాజాలో మారణకాండ జరుపుతున్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదు కనుక తాము చేస్తున్న సాయాన్ని, విక్రయిస్తున్న ఆయుధాలను మారణకాండకు వినియోగిస్తున్నారని చేసిన అభియోగం చెల్లదని అదే జర్మన్లు ఐసిజెలో వాదించారు. భద్రతా మండలి, ఐరాస సాధారణ అసెంబ్లీలో దారుణంపై ప్రవేశపెట్టిన తీర్మానాలు, పాలస్తీనాలో భాగాలైన గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దారుణాలు జర్మనీకి కనిపిం చటం లేదా ? ఇజ్రా యల్‌ దిగుమతి చేసుకుం టున్న ఆయుధాలలో జర్మనీ నుంచే 30శాతం వస్తున్నాయి. అమెరికా ప్రధమ స్థానంలో ఉంది. ఆయుధ ఒప్పందాలు అక్టోబరు ముందు చేసుకున్నవని ఒక ముక్తాయింపు, తామిచ్చిన ఆయుధాలు గాజాలో ఉపయోగి స్తున్న రుజువుల్లేవని దబాయింపు, ఇస్తున్న ఆయుధాలు యుద్ధాలకు ఉపయోగించేవి కాదని, మిలిటరీయేతర పరికరాలని బుకాయింపులకు పాల్పడింది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకు అవసరమైన గడ్డి ఎక్కడుం దో చూద్దామని చెప్పినట్లుగా తాము సరఫరా చేసిన ఐదులక్షల మెషిన్‌ గన్‌ తూటాలు ఇజ్రాయిల్‌ మిలిటరీ ”శిక్షణ” కోసమని కోర్టుకు తెలిపింది. ఇలాంటివే ఎన్నో వక్రీకరణలు జర్మనీ దాఖలు చేసిన పత్రాల్లో ఉన్నాయి.
ఐరాస శరణార్ధుల సాయ సంస్థకు నిలిపివేసిన నిధులను పునరుద్దరిస్తామని, నికరాగువా దాఖలు చేసిన కేసును కొట్టివేయాలన్న వినతిని న్యాయస్థానం తిరస్కరించుతూనే ఆయుధ సరఫరాకు అనుమతి ఇచ్చింది. తక్షణమే ఆయుధ సరపరాల నిలిపివేతకు, సరఫరా చేసిన వాటిని ఉపయోగించకుండా ఆంక్షలు, శరణార్ధులకు చేస్తున్న సాయాన్ని కొనసాగించేలా ఉత్తరువుల ఇవ్వాలని నికరాగువా కోరింది. అలా ఇచ్చేందుకు తగినన్ని రుజువులు లేవని కోర్టు పేర్కొన్నది. గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ కడవల కొద్దీ సానుభూతి ప్రకటించిన న్యాయ మూర్తులు మారణకాండలను సమర్ధించ కూడదన్న ఐరాస ఒప్పందంలో భాగస్వామి అయిన జర్మనీ మరొకరు ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందేనంటూ సుభాషితాలు వల్లించారు.శరణార్ది శిబిరాలపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో ఐరాస సహాయ సిబ్బంది మరణించిన ఉదంతం తెలిసిందే. గాజాలో జరుగుతున్న దారుణాలను అనేక ఐరాస సంస్థలు నివేదిస్తున్నప్పటికీ న్యాయమూర్తులు పట్టించుకోలేదు. తాను ఇచ్చిన ఆదేశాలను అమలు జరప నిరాకరిస్తున్న ఇజ్రాయిల్‌ను కట్టడి చేయలేని అశక్తత అంతర్జాతీయ న్యాయస్థానానిది. అందువలన కోర్టులను నమ్ముకొని వేచి ఉండకుండా అమెరికాలో ఉద్యమిస్తున్న విద్యార్ధుల మాదిరి ప్రపంచం లోని శాంతి, అభ్యుదయ శక్తులు పెద్ద ఎత్తున కదిలి ఇజ్రాయిల్‌ను, దానికి మద్దతు ఇస్తున్న సామ్రాజ్య వాదుల మీద ఒత్తిడి తేవాలి, మారణకాండ నివారణకు పూనుకోవాలి.

]]>
వచ్చారు సరే.. తెచ్చిందేమిటి…? https://navatelangana.com/what-did-you-bring/ Wed, 01 May 2024 17:46:01 +0000 https://navatelangana.com/?p=281461 They came ok.. what did you bring...?సారొచ్చారు.. అలా వచ్చి ఇలా వెళ్లారు. త్వరలోనే ఆయన మళ్లీ వస్తారు. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్‌ కాబట్టి. కానీ ఆయన ఎన్నిసార్లు రాష్ట్రానికి వచ్చినా ఇప్పటిదాకా మనకేం ఇచ్చారో, భవిష్యత్‌లో ఏం ఇవ్వబోతారో చెప్పరు గాక చెప్పరు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇచ్చిందే లేదు. మున్ముందు ఇవ్వబోయేది కూడా ఏమీ ఉండదు కాబట్టి. మోడీ తాజాగా మెతుకు సీమకు వచ్చారు. త్వరలో వరంగల్‌, వేములవాడ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో కూడా ఆయన పర్యటించనున్నారు. ఎలక్షన్ల క్యాంపెయిన్‌ సందర్భంగా రాష్ట్రానికి ఆయన రావొచ్చును, పోవచ్చును, తన పార్టీ తరపున ప్రచారం చేసుకోనూ వచ్చును. కానీ గత పదేండ్ల నుంచి గద్దె మీద కూర్చున్న పార్టీగా బీజేపీ తెలంగాణకు ఏం చేసింది? ఏమిచ్చిం దనేది చెప్పటం ప్రధానిగా ఆయన కనీస బాధ్యత, ధర్మం. కానీ పొద్దున లేస్తే దేశం కోసం.. ధర్మం కోసమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టే ఆ పెద్ద మనిషి…తన కర్తవ్యాన్ని, బాధ్యతను విస్మరించారు. మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి రేవంత్‌ పైనా విమర్శలు గుప్పించేందుకే పరిమితమయ్యారు. ‘ఆర్‌ఆర్‌ (రేవంత్‌ రెడ్డి) ట్యాక్స్‌’ అంటూ సరికొత్త పదాన్ని జనం మీదికి వదిలి, తన తప్పిదాల గురించి ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ…’ అనే లెవల్లో ఫోజుకొట్టారు. షరా మామూలుగా ముస్లింలకు సంబం ధించిన రిజర్వేషన్లపై మరోమారు తన అక్కసును వెళ్లగక్కటమనేది ఆ అంశంపై బీజేపీ విధానాన్ని తేటతెల్లం చేసింది.
దేశవ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశమైన అంశం ఎలక్టోరల్‌ బాండ్లు. ఈ రూపేణా వచ్చిన ఫండులో సగానికి (రూ.8,268 కోట్లు) పైగా కాషాయ పార్టీ ఖాతాలోకే వెళ్లాయన్నది దేశ ప్రజలందరికీ తెలిసిందే. అలా ఇవ్వని కంపెనీలపై ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులతో దాడులు చేయించింది ఆ పార్టీ. ఈ దాడులు జరిగిన మరుసటి రోజే కమలం ఖాతాలోకి అప్పనంగా సొమ్ములొచ్చి పడ్డాయనేది ప్రజలందరికీ తెలుసు. దీన్నిబట్టే బీజేపీకి, కార్పొరేట్‌ సంస్థలకు మధ్య ఎంత బలమైన బంధముందో విదితమవుతున్నది. ఇలాంటి వాస్తవాలన్నింటినీ మరుగుపరిచి, మసిపూసి మారేడుకాయ చేయటం మోడీకే చెల్లింది. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ రూపంలో హస్తం పార్టీకి కొందరు గుత్తేదారులు వెనుక దర్వాజా ద్వారా నుంచి సొమ్ములు పంపుతున్నారన్నది ఆయన మెదక్‌లో చేసిన ఆరోపణ.
ఆ రకంగా వచ్చిన డబ్బు సంచులను ఆర్‌ఆర్‌ ఢిల్లీకి (కాంగ్రెస్‌ అధిష్టానం) పంపుతున్నారనేది పీఎం వాదన. ఈ ఆరోపణలు, వాదనల గురించి మాట్లాడాల్సి వస్తే… అసలు గత పదేండ్ల నుంచి కమలం పార్టీ చేసిందేమిటి..? సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల మేర రాయితీలిచ్చి కార్పొరేట్ల గరిసెలను నింపింది మోడీ కాదా..? ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అంటూ ఎద్దేవా చేస్తున్న ఆయన ‘ఒకే దేశం-ఒకే పన్ను’ పేరిట జీఎస్టీని తీసుకొచ్చి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ సరుకు మీద పన్ను విధించింది వాస్తవం కాదా…? జీఎస్టీ ద్వారా వచ్చే పన్నులో 64 శాతం పేదలు, మధ్య తరగతి ప్రజానీకం నుంచే వసూలవుతుండగా, కేవలం మూడు శాతం మాత్రమే దేశంలోని టాప్‌ పది మంది ధనవంతుల నుంచి వస్తోన్నట్టు ఆక్స్‌ఫామ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. ‘కమల నాథులు’ మాత్రం దీనిపై నోరు విప్పరు గాక విప్పరు.
అదే మెదక్‌ సభా వేదిక నుంచి రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీల గురించి ప్రస్తావించని ప్రధాని… మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మాత్రం శతవిధాలా ప్రయత్నించారు. అసందర్భ ప్రేలాపనలాగా… ‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను నేను బతికున్నంతకాలం ముస్లింలకు ఇవ్వబోను…’ అని బల్లగుద్ది మరీ చెప్పటం దేనికి సంకేతం. ఆయన అలా చెప్పటం ద్వారా దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలిచారు…? ఆ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు తీర్పులు, వివిధ కమిషన్ల సిఫారసులు, వీటన్నింటికీ మించి అత్యున్నతమైన రాజ్యాంగం, దాని దిశా నిర్దేశంలో నడిచే పార్లమెంటు… ఇలా అనేక వ్యవస్థలున్నప్పుడు వాటిని కాదని ఓట్ల కోసం ఏకోన్ముఖంగా అడ్డగోలు వ్యాఖ్యలు చేయటం ప్రధానికే చెల్లింది.
ఇలాంటి టక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యలకు చైతన్య వంతమైన తెలంగాణ సమాజం లొంగబోదనే విషయాన్ని బీజేపీ పరివారం గ్రహిస్తే మంచిది. సాయుధ రైతాంగ పోరాట వారసులుగా ఆ చైతన్యాన్ని మనం ఇప్పుడు ప్రదర్శించాల్సిన తరుణం ఆసన్నమైంది.

]]>
మీ గుర్తుగా మా గుండెల‌ల్లో నెత్తుటి స్థూపాలు క‌డ‌తాం https://navatelangana.com/as-a-sign-of-you-we-wash-bloody-stupas-in-our-hearts/ Tue, 30 Apr 2024 22:26:50 +0000 https://navatelangana.com/?p=280898 As a sign of you, we wash bloody stupas in our heartsపోరాడే వారికి ఉరికొయ్యలు కొత్తకాదు. మేడే వీరులను ఉరితీసిన కొయ్యలే భగత్‌సింగ్‌నూ ఉరితీశాయి. వాటి సూక్ష్మ రూపం ఒక్కటే. ఆ వ్యవస్థనే రద్దుచేసి ఆ మృతవీరుల ఆశయాలకు కొత్త ఊపిరి పోస్తుంది రేపటి ఉదయం.
చికాగో అమరులకు ఈ మేడే సందర్భంగా ఇంతకు మించిన నీరాజన మేముంటుంది? ఓ యువ కవి రాసిన పై గీత చరణం వయసు తక్కువే. కాని దానిలో దాదాపు ఒకటిన్నర శతాబ్దాల చరిత్ర ప్రతిధ్వనిస్తోంది. పెట్టుబడి పొట్టన పెట్టుకున్న ఆ వీరులను ఇన్నేండ్లుగా ప్రపంచ కార్మికోద్యమం కంటిపాపలకన్నా భద్రంగా చూసుకుంటున్నది. ఉరితీయబడ్డ ఆ శిరస్సులు అస్తమించిన రోజు నుండే ప్రశ్నలెన్నో ఉదయిస్తూనే ఉన్నాయి. దానికి ముందూ, ఆ తర్వాత కూడా ఎందరో కార్మిక నాయకుల్ని, సాధారణ కార్మికులను రాజ్యం మట్టుబెట్టింది. యంత్రాల విధ్వంసానికి పాల్పడ్డ లుడ్డైట్‌లను 1812, 1813లో కాల్చిచంపింది బ్రిటన్‌ ప్రభుత్వం. ఆ దేశ సిఆర్‌పీసీనే సవరించి యంత్రాన్ని ధ్వంసం చేసినా ఉరిశిక్షలు ఖాయం చేసింది. 1971లో పారిస్‌ కమ్యూన్‌ను అణిచివేసేందుకు విమానాల ద్వారా బాంబులు కురిపించింది ఫ్రెంచ్‌ ప్రభుత్వం. ఇవి 1886కు ముందు ఘటనలు. 1940ల్లో నాజీ నరహంతకులను ఎదిరించేందుకు సోవియట్‌ పౌరులు రెండు కోట్ల మంది ఆహుతయ్యారు. వారి రక్తతర్పణే లేకుంటే వలస వ్యవస్థ కూలిపోయేఉండేది కాదు. మన దేశంతో సహా ఎన్నో దేశాలు సామ్రాజ్యవాద దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందేవేగావు. వేటికవే సాటిలేని త్యాగాలవి.
అయినా, మేడే అమరులెందుకు చిరస్మరణీ యులుగా నిలిచారు? ఎందుకంటే, వారు సవాలు చేసింది పెట్టుబడిదారీ వ్యవస్థను. ఆ వ్యవస్థకు ఇంధనం అదనపు విలువ. ఆనాడు అదనపు విలువ పిండుకోవడానికి అధిక పనిగంటలు ప్రధాన సాధనం. అందుకే దాన్ని రక్తపుటేరుల్లో ముంచెత్తారు ఆనాటి అమెరికన్‌ పాలకులు. పెట్టుబడిదారులు తమ దోపిడీ పద్ధతులను ఎప్పటికప్పుడు పదును చేసుకున్నట్లే, కార్మికవర్గమూ రాటుదేలాలి కదా! ప్యారిస్‌ కమ్యూన్‌ వైఫల్యం తర్వాత కార్మిక, కర్షక ఐక్యత కీలకంగా ముందుకొచ్చింది. కార్మికవర్గం తనను తాను విముక్తి చేసుకోవాలంటే ఇతర కష్టజీవుల్నీ విముక్తి చేయాలి. ”మధ్యయుగాల్లో మున్సిపాలిటీలను, కమ్యూన్‌లను ఉపయోగించుకుని ఫ్యూడల్‌ ప్రభువులపై విజయవంతంగా తిరగబడింది పెట్టుబడిదారీ వర్గం. అలానే ట్రేడ్‌ యూనియన్‌లను ఉపయోగించి పెట్టుబడిదార్లపై కార్మికోద్యమం దాడి చేయాల”ని మార్క్స్‌ ఆశించాడు. మన ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం ఏ స్థాయిలో ఉందో నేడు మనం సమీక్ష చేసుకోవడం మేడేకు శోభనిస్తుంది.
తెలుగు రాష్ట్రాలకు మే 13 కీలకం. విశ్వ గురువు వేషధారణో, జి-20 పటాటోపమో, 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న ప్రచారమో విని, చూసి ఆ ఒక్క రోజూ ఏమరుపాటుకు లోనైతే దేశ ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్ల వశమవడమేకాదు, భారత రాజ్యాంగమే మనువు పాలబడ్తుంది. ప్రభుత్వరంగ పరిశ్రమలు, ప్రభుత్వ సేవలు కలికానికి కూడా కనపడకుండా పోతాయి.
ఇటీవల ప్రచురితమైన సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి సర్వే ఈ ఎన్నికల్లో ఆర్థికాంశాలే కీలకం కానున్నాయని తేల్చింది. పరిమితమైన ఉపాధి అవకాశాలు, ఆకాశాన్నంటుతున్న ధరలు, పెచ్చరిల్లిన అవినీతి, పెరిగిన గ్రామీణ దారిద్య్రం, దిగజారుతున్న గృహ వినియోగం కీలకంగా మారనున్నాయని ఆ సర్వే తేల్చింది.
మరోసారి ఎన్నికల సమరాంగణాన మేడే వచ్చింది. కేంద్ర పాలకుల పుణ్యాన సాధించుకున్న హక్కులు, పెట్టుబడి కోసం వథ్య శిలపై ఎక్కించబడ్డాయి. ఇప్పటికే ఎన్నో బలయ్యాయి కూడా. సాంకేతికంగా రేపు ”మోడీ 3.0” పాలన వస్తుందా లేదా అనేదానికంటే కార్పొరేట్‌ స్వామ్యాన్ని అంతమొందించే దిశగా కార్మికోద్యమం సాగాలి. పోరాడేవారికి ఉరికొయ్యలు కొత్తకాదు. మేడే వీరులను ఉరితీసిన కొయ్యలే భగత్‌సింగ్‌నూ ఉరితీశాయి. వాటి సూక్ష్మ రూపం ఒక్కటే. ఆ వ్యవస్థనే రద్దుచేసి ఆ మృతవీరుల ఆశయాలకు కొత్త ఊపిరి పోస్తుంది రేపటి ఉదయం.

]]>
శాతాల శఠగోపం https://navatelangana.com/shatala-shathagopam/ Mon, 29 Apr 2024 17:22:05 +0000 https://navatelangana.com/?p=280021 Shatala Shathagopam112 శాతం…109.09 శాతం…105.30 శాతం…100.15 శాతం… ఇవి ఇటీవల విడుదలైన పరీక్షల్లో కార్పొరేట్‌ కళాశాలలు సాధించిన మార్కుల శాతాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అవి త్రిపుర రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోల్‌ అయిన ఓట్ల శాతాలు. ఈ ఓట్ల శాతాలను చూస్తుంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరొందిన దేశానికి ఈ ఎన్నికలు ఒక మచ్చగా మిగిలిపోతాయన్న భయం కలుగుతోంది. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న జుగుప్సాకర పరిణామాల వల్ల కూడా ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి నెలకొంటోంది.
రెండు విడతలుగా త్రిపుర రాష్ట్రంలో రెండు లోక్‌ సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికలలో వంద శాతానిపైగా పోలింగ్‌ నమోదుకావడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వేచ్ఛగా, న్యాయంగా ఈ ఎన్నికలు జరగలేదని సీపీఐ(ఎం) త్రిపుర కార్యదర్శి జితేంద్ర చౌదరి విమర్శించారు. అంబాసోల్‌ లో112 శాతం, మజ్లిస్‌పూర్‌ సెగ్మెంట్‌లో 105.30 శాతం, ఖాయర్‌పూర్‌లో 100.15 శాతం, మోహన్‌పూర్‌ సెగ్మెంట్‌లో 109.09 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, సాధారణ పద్ధతిలో జరగలేదని పైరికార్డులు రుజువు చేస్తున్నాయి. బూత్‌లను స్వాధీనం చేసుకున్నప్పుడు, వ్యవస్థీకృత పద్ధతిలో పూర్తిగా రిగ్గింగ్‌ చేసినప్పుడే ఇటువంటి సరిపోలని పోలింగ్‌ శాతం జరుగుతుందన్న విమర్శలను కేవలం విమర్శలుగానే చూడకూడదు. ఈ అంకెలనీ కూడా స్వయంగా ఎన్నికల సంఘం బయటపెట్టిన వాస్తవాలు. నాగాలాండ్‌లోనైతే ప్రజాప్రతినిధులే ఓటింగుకు దూరంగా ఉన్నారు.
మరోవైపు గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ లోక్‌సభా స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక సైతం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నది. సాధారణంగా సర్పంచ్‌, ఎంపీటీసీ స్థానాలు పెద్ద సంఖ్యలోనే ఏకగ్రీవమవుతుంటాయి. జడ్పీటీసీలు కూడా అత్యల్పమే! అలాంటిది అంతకు పదింతలుండే లోక్‌సభ స్థానంలో ఏకగ్రీవం ఎలా సాధ్యమైందో! ఎన్నికలే జరగకుండా బీజేపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడం వల్ల తమ ప్రజాస్వామిక హక్కును కోల్పోయిన ఆ నియోజకవర్గ ఓటర్లకు ‘ఏకగ్రీవం’ వెనకనున్న నిజాలు తెలియాల్సి ఉంది. అలా తెలుసుకోవడం వారి హక్కు కూడా. అదే తరహలో దేశమంతా కొల్లగొట్టుకోవాలన్నది అధికార బీజేపీ ఆకాంక్ష. ప్రజాస్వామిక దేశంలో ఇది చాలా తీవ్రమైన విషయం!
సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, వారి డమ్మీ అభ్యర్థి నామినేషన్లను ఏ విధంగా డిస్‌క్వాలిఫై చేశారో, అసలు ఒక్కరు కూడా మిగలకుండా అందరు ఇండిపెండెంట్లూ ఎందుకు ఉపసంహరించుకున్నారో అన్న చిదంబర రహస్యమూ తెలియాలి. కొద్దికాలం క్రితమే చండీగఢ్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికలో కమలనాథుల మోసం సాక్షాత్తూ భారత సర్వోన్నత న్యాయస్థానంలోనే బట్టబయలయ్యింది. దాంతో ఆ మేయర్‌ ఎన్నికను రద్దుచేసి తిరిగి ఎన్నిక జరపాలని సుప్రీంకోర్టే ఆదేశించింది. ‘చార్‌ సౌ పార్‌’ అంటున్న బీజేపీ సూరత్‌లో ఏ ఎత్తుగడలు వేసిందో మరి! కాబట్టి అందులో ఉన్నతాధికారుల పాత్ర ఏమిటన్నది వెలికి రావలసివుంది.
రాజకీయ పక్షాల సంకుచిత విధానాల వల్ల భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రస్తుతం బలహీనపడుతున్న మాట వాస్తవం. అయినా భారతీయ ప్రజాస్వామ్యం ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలకు స్ఫూర్తిదాయకమే. అయినా కేవలం ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా అధికార పీఠం దక్కించుకుని ప్రత్యర్థులను అణచి అస్మదీయులను అందలం ఎక్కించే మాధ్యమంగా భారతీయ ప్రజాస్వామ్యం మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిమ్మిక్కులు, బూటకపు వాగ్దానాలు, భావజాల భావోద్వేగాల వాతావరణంలో ఎన్నికలలో విజయం సాధించడమే అధికార పార్టీ అంతిమ ధ్యేయమైపోయింది. ఫలితంగా ఇప్పుడు అవినీతి, అరాచకం, అక్రమాలు, అబద్ధాలు, నగదు అనే అంశాల ప్రాతిపదికన దేశం ”వర్ధిల్లుతోంది”. ఈ రుగ్మత దేశ భవితకు అత్యంత ప్రమాదకరం.
లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం కోల్పోవడం బాధాకరం.నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన ప్పటినుంచీ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, వాటిని పరివార్‌ శక్తులతో నింపేయడం జరుగుతోంది. రాజ్యాంగ మౌలికాంశాలైన ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, సార్వభౌమత్వం, ఫెడరలిజాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ- ఆరెస్సెస్‌ నిరంతరాయంగా ప్రయత్నిస్తోంది. ఒకే దేశం- ఒకే ఎన్నిక, అధ్యక్ష తరహా పాలనను తీసుకురావాలనీ చూస్తోంది. ఎన్నికలను ఓ ప్రహసనంగా మార్చడమూ అందులో భాగమే! ఈ కుట్రలను ప్రతిఘటించడం ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం.

]]>
రంగులు https://navatelangana.com/colors/ Sat, 27 Apr 2024 18:11:42 +0000 https://navatelangana.com/?p=278829 Colorsఇక ఈ మధ్యనే ఎన్నికలు ప్రకటించి, కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాతనే మన దూరదర్శన్‌ ఛానెల్‌ లోగో రంగును అకస్మాత్తుగా కాషాయ రంగులోకి మార్చేశారు. అంతకు ముందు ఎరుపురంగు ఉండేది. రాజ్యాంగం ప్రకారం లౌకిక, ప్రజాస్వామిక ప్రభుత్వ నిర్వహణలో ఉన్న దూరదర్శన్‌ లోగో రంగును కాషాయీకరించడం దారుణమైన విషయం. అందుకే దూరదర్శన్‌ మాజీ సీఈఓ అన్నట్లు ”ఇప్పుడిది ప్రసార భారతి కాదు, కేవలం వారి ప్రచార భారతిగా మార్చేసారు”. అన్నది అక్షర సత్యం. అధికారంలో వున్న వారి స్నేహితులయిన కార్పోరేట్‌ శక్తుల చేతుల్లోకి అన్ని ఛానెళ్లు వచ్చేసాక, ఇప్పుడు ప్రభుత్వ ఛానల్‌నూ పూర్తిగా తమ ప్రచారానికి వినియోగిస్తూ రంగును సంకేతించారు.
చాలా జంతువులకు రంగుల వ్యత్యాసాలు కనిపించవు, గుర్తించనూ లేవు. మనిషికి రంగులు తెలవటమే కాదు, రంగులకు అనేక భావాలనూ అద్దాడు. వాస్తవంగా రంగులు ప్రకృతి సిద్ధమైనవి. సప్త వర్ణాలే కాదు, అనేకానేక వర్ణాలు ప్రకృతిలో వున్నవే. ప్రాథమికంగా వున్నవి మూడు రంగులని చెబుతారు రంగుల శాస్త్రకారులు. ఎరుపు, నీలం, పసుపు. వాటి నుండి మరో మూడు ఏర్పడతాయని కూడా చెబుతారు. కానీ న్యూటన్‌ చక్రం మాత్రం తెలుపునే తెలుపుతుంది కదా! సమాజ పరిణామ క్రమంలో మనిషి మనోభావాలు, సంతోషాలు, దు:ఖాలు, బాధలు, ఆవేశాలు, అపాయాలు, ఆవేదనలు మొదలైన భావోద్వేగాలన్నిటినీ రంగుల సంకేతాలతో వ్యక్తీకరించడమూ నేర్చుకున్నాడు. ఇప్పుడు రంగులు మాట్లా డుతాయి. బోధిస్తాయి. జాగ్రత్తలూ చెబుతాయి. అంతేకాదు, నిరసనలూ తెలియ జేస్తాయి. దేశాలకూ సంకేతమవుతాయి. ఒక్కొక్క రంగుకు అనేకానేక అర్థాలను, భావాలను మనిషి ఆపాదించుకున్నాడు. వాటినారకంగా వాడుతున్నాడు కూడా.
రాజకీయ పార్టీలకూ, వారి జెండాలకు ఉన్న రంగులు, అవి ఏయే ఆశయాలతో, లక్ష్యాలతో పని చేస్తాయో వర్ణాధారంగానే తెలియజేస్తాయి. శ్రామికుల శ్రమకు, వారి రక్తానికి, పోరాటానికి సంకేతంగా ఎర్రజెండా ప్రపంచ వ్యాప్తంగానే ప్రసిద్ధి చెందింది.. ఆకుపచ్చ రంగు సస్యశ్యామలానికి, ముస్లిం ప్రజ లకు సంకేతంగా చూడబడుతున్నది. నీలం రంగు నేడు అంబేద్కర్‌ ఆశయ మార్గంలో పయనించే వారి రంగుగా పిలువబడుతున్నది. కాషాయ రంగు ఆధ్యాత్మిక మార్గంగా, సన్యాసుల వస్త్రావర్ణంగా మనం దరికీ పరిచయమే. ఇప్పుడు ఆరెస్సెస్‌, బీజేపీ వర్గాలు ఈ రంగును హిందువుల సంకేతంగా వాడు తున్నారు. హిందూ దేవాలయాలలోనూ ఈ రంగునే వాడుతున్నారు. అదే తమ రాజకీయ రంగుగా బీజేపీ ప్రచారం చేస్తున్నది. మొదట స్వామి వివేకానంద కాషాయ వస్త్రాలు ధరించి ధర్మ ప్రచారానికి పూనుకున్నాడు. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ కాషాయం ధరంచి అధికారం, పదవులు, సకల సౌకర్యాలు అనుభవిస్తారు. అది వేరే విషయం.
సాధారణంగా కాషాయం ధరిస్తే లౌకిక విషయాలనన్నీ, సుఖాలు, సౌఖ్యాలనన్నీ పరిత్వజించి సన్యాసులుగా ధర్మ, విముక్తి మార్గాలలో నిమగమవుతారు. కానీ ఇపుడు అర్థాలు మారాయి. కాషాయం ధరించి సర్వభోగాలనూ, ఆధిపత్యాలనూ కలిగి జీవిస్తుంటారు. ఇప్పుడీ రంగు భయంకరమైన నియంతృ త్వానికీ, ఫాసిస్టు తరహా ఆలోచనలకూ పాలనకూ గుర్తుగా ప్రతిబింబిస్తోంది. ఆధ్యాత్మిక, ధర్మాచార ముసుగేసుకున్న నిరంకుశత్వానికి ప్రతీకగా మారిపోయింది. అంటే, ఆ రంగు వెనకాల అత్యంత దుర్మార్గ ప్రవర్తనల హిట్లరురంగు విధ్వంసం, విద్వేష రంగు దాగి ఉందన్నది మనం గ్రహించాల్సిన విషయం.
ఇప్పుడీ రంగుల విషయాలెందుకంటే, ఎప్పుడైతే హిందూత్వ నియంతృత్వ పాలనకు సంకేతంగా కాషాయాన్ని ప్రచారంలోకి తెచ్చారో అప్పటినుండి అధికారం చేపట్టి వారు చేస్తున్న పనులన్నీ, మన భార తీయ లౌకిక, ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇస్తున్న తీరు మనకు అవగతం అవుతున్నది. అందుకనే ఇప్పుడు కాషాయీకరణ అంటే మతతత్వ భావనలను, పరమత ద్వేషాన్ని నూరిపోసేందుకు చేసే ప్రయత్నమని అర్థం. భావితరాలు నేర్చుకునే విద్యాపాఠాలను అదేవిధంగా మార్చి వేస్తున్నారు. దేశంలోని అన్ని సంస్థలనూ ఆ భావాలు గల వారితో నింపేస్తున్నారు. ఆఖరికి మన దేశ రక్షణ రంగం, మిలటరీ వ్యవస్థలోకీ మతతత్వ భావాలను చొప్పిస్తున్నారు. పోనీ ఇవన్నీ దేశీయమైనవేమీ కాదు, ప్రపం చంలోని కార్పోరేటు శక్తులతో కూడుకున్న కాషాయీకరణ అంటే దోపిడీ, పీడనలతో కూడుకున్నదని అర్థం.
ఇక ఈ మధ్యనే ఎన్నికలు ప్రకటించి, కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాతనే మన దూరదర్శన్‌ ఛానెల్‌ లోగో రంగును అకస్మాత్తుగా కాషాయ రంగులోకి మార్చేశారు. అంతకు ముందు ఎరుపురంగు ఉండేది. రాజ్యాంగం ప్రకారం లౌకిక, ప్రజాస్వామిక ప్రభుత్వ నిర్వహణలో ఉన్న దూరదర్శన్‌ లోగో రంగును కాషాయీకరించడం దారుణమైన విషయం. అందుకే దూరదర్శన్‌ మాజీ సీఈఓ అన్నట్లు ”ఇప్పుడిది ప్రసార భారతి కాదు, కేవలం వారి ప్రచార భారతిగా మార్చేసారు”. అన్నది అక్షర సత్యం. అధికారంలో వున్న వారి స్నేహితులయిన కార్పోరేట్‌ శక్తుల చేతుల్లోకి అన్ని ఛానెళ్లు వచ్చేసాక, ఇప్పుడు ప్రభుత్వ ఛానల్‌నూ పూర్తిగా తమ ప్రచారానికి వినియోగిస్తూ రంగును సంకేతించారు.
మొసలి రంగులు మారుస్తుందని అందరికీ తెలుసు. అందుకే రంగులు మార్చే రాజకీయుల్ని దానితో పోలుస్తారు. కానీ దానిది ప్రకృతి సహజం. వీరిది స్వార్థపూరితం. వాస్తవంగా రంగులకు ఏ భావనా ఉండదు. మనం సృష్టించుకుని స్థిరపరచినవే. ఇప్పుడు వీళ్లు చేస్తున్న దయితే, వారి అసలు స్వరూపాన్నీ, స్వభావాన్నీ కాషాయం రంగు కింద కొనసాగిస్తూ నియంతృత్వాన్ని విస్తరించడమే. అందుకే రంగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి!

]]>
చిత్తశుద్ది లేని బ్లింకెన్‌ పర్యటన https://navatelangana.com/an-unscrupulous-blinken-tour/ Fri, 26 Apr 2024 17:36:02 +0000 https://navatelangana.com/?p=277881 Editorial హాలీవుడ్‌ సినిమాల్లో అనకొండ మాదిరి చైనాను మింగివేయాలన్నంత కసి ఉంది.మాయ కొండచిలవల గురించి ఇతరులకంటే సృష్టించిన తమకే నిజానిజాలేమిటో తెలుసు గనుక అమెరికన్లు వాస్తవాలను మింగలేక కక్కలేకుండా ఉన్నారు. బీజింగ్‌తో పూర్తి స్థాయి పోరుకు దిగితే కొన్ని అమెరికా కార్పొరేట్లకు కోపం, లేకపోతే మరికొన్నింటికి ఆగ్రహం.పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్రలో ఇలాంటి పరిస్థితి గతంలో లేదు. శ్వేతసౌధంలో గాడిద(డెమోక్రాట్లు)-ఏనుగు(రిపబ్లికన్లు) పార్టీ నేతలు ఎవరున్నా దారీ తెన్నూ తేల్చుకోలేని డోలాయమానంలో పడ్డారు. పర్యవసా నాలను ఊహించలేక డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో చైనాతో ప్రారంభించిన వాణిజ్య పోరును గెలవలేక, గౌరవప్రదంగా ముగించలేక అమెరికా పాలకవర్గం సతమతమౌతున్నది. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగా చైనా తనపని తాను చేసుకుపోతున్నది. ఈ పూర్వరంగంలో శుక్రవారం వరకు జరిపే పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ బుధవారం నాడు చైనా గడ్డపై కాలుమోపాడు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా తమ భవిష్యత్‌ గురించి చైనాలో ఉన్న అమెరికా కంపెనీలు ఆందోళన వెల్లడిస్తూ ఈ సందర్భంగా ఒక నివేదికను వెల్లడించాయి. చైనా మార్కెట్‌ ఆకర్షణ వారిని అక్కడే ఉండాలని కట్టిపడేస్తున్నది. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా జో బైడెన్‌-డోనాల్డ్‌ ట్రంప్‌ పోటీ పడుతున్నారు.తమ కార్పొరేట్లకు రాయితీలు సాధించేందుకు ఒక వైపు ఒత్తిడి మరోవైపు తెగేదాకా లాగేందుకు సిద్ధం కాని స్థితిలో బ్లింకెన్‌ పర్యటన సాధించేదేమీ ఉండదనే విశ్లేషణలు ముందే వెలువడ్డాయి. కాపురం చేసే కళ కాళ్ల గోళ్లపుడే బయటపడుతుందన్న సామెత మాదిరి తమ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తప్ప చైనాతో వివాద పరిష్కారానికి సిద్దంగా లేనట్లు బ్లింకెన్‌ పర్యటనకు ముందు అమెరికా చర్యలున్నాయి.చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకే ఉన్నాం అన్నట్లుగా కనిపించేందుకు రెండు ప్రధాన పార్టీలు చూస్తున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది. రెండు దేశాల మధ్య ఉక్రెయిన్‌ వివాదం, మధ్య ప్రాచ్య ఉద్రిక్తతలు, తైవాన్‌, దక్షిణ చైనా సముద్ర అంశాల మీద ఏకాభిప్రాయం లేదని ఎపి వార్తా సంస్థ విశ్లేషించింది. వీటిలో ఏ ఒక్కదాని మీద రెండుదేశాల మధ్య సయోధ్య కుదిరే అవకాశమే లేదు.
అమెరికా తప్పుడు అంచనాలు, వైఖరితో వివాదాలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా అమెరికా తీరు ఉంది.తాజాగా చైనా సముద్ర రవాణా,నౌకా నిర్మాణ సంబంధిత అంశాలపై దర్యాప్తు జర పాలని నిర్ణయించింది.రష్యాకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకొనేందుకుగాను ప్రపంచ ద్రవ్య వ్యవస్థ నుంచి కొన్ని చైనా బాంకులను దూరం చేయాలన్న సూచనలను కూడా వెల్లడించింది. రష్యా పారిశ్రామిక పునాది పునర్‌నిర్మాణానికి, మిలిటరీ ఉత్పత్తులకు అవసరమైన చిప్స్‌ మొదలు ఖండాంతర క్షిపణులకు కావాల్సిన ఇంజన్లను చైనా సరఫరా చేస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. దక్షిణ చైనా సముద్ర వివాదం పేరుతో జపాన్‌, ఆస్ట్రేలియాలను ఫిలిప్పీన్సుకు మద్దతుగా సమీకరించేందుకు పూనుకున్నది. మానవ హక్కులపై తప్పుడు ప్రచారం, తైవాన్‌కు ఆయుధ సరఫరా సరేసరి. ఈ అంశాలపై అమెరికాకు ఓటమే తప్ప విజయం కనుచూపు మేరలో కనిపించటం లేదు. స్వజనాన్ని, బయటివారినీ ఎంతకాలమో మభ్యపెట్టే అవకాశమూ కనిపించకపోవటంతో ఒత్తిడి, గారడీలకు పాల్పడుతున్నది.
చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోనుందని అమెరికా, ఇతర పశ్చిమదేశాల మీడియా, ఆర్థికవేత్తలు చెప్పిన జోస్యం ఒక్కటీ నిజమయ్యే దాఖాలు లేవు. ఒకవైపు పతనం కానుందని చెబుతూనే తమకు ప్రధాన పోటీదారుగా ఉందని, చైనాను అదుపు చేయాలని అమెరికా అంటున్నది. కూలిపోయేదానితో జగడమెందుకు? ఒక వైపు తమను అణచివేయాలని చూస్తున్న అమెరికా మరోవైపు తన పాటలకు అనుగుణంగా నృత్యం చేయాలని కోరుకుంటున్నదని ఇదెలా సాధ్యమని చైనా ప్రశ్నిస్తున్నది.ఆంక్షలతో నిమిత్తం లేకుండా రష్యాతో సహా అన్ని దేశాలతో తాము సాధారణ ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తామని, తమ హక్కుల్లో జోక్యం చేసుకోవద్దని పదే పదే స్పష్టం చేస్తున్నది. తమ మీద రుద్దిన వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై ఆంక్షలను ఎత్తివేయాలని, దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌ అంశంలో జోక్యం చేసుకోవద్దని, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను పాటించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నది. వీటి మీద రాజీపడేందుకు అమెరికా పాలకవర్గం సిద్ధంగా ఉందా ?

]]>
వేధిస్తున్న ప్రశ్న https://navatelangana.com/a-nagging-question/ Thu, 25 Apr 2024 17:29:53 +0000 https://navatelangana.com/?p=277286 A nagging questionవిద్యార్థులు.. దేశ భావి పౌరులు. నాణ్యమైన మానవ వనరులుగా మారి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సినవారు. అలాంటి విద్యార్థులు ఇంటర్‌ ఫలితాలు వెలువడిన వెంటనే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపాటుకు గురిచేస్తున్నది. రైతుల ఆత్మ హత్యలను మించి విద్యార్థుల బలవన్మరణాలు చోటుచేసు కోవడం మరింత ఆందోళన కలిగిస్తున్తది. దీనికి కారణం చదువుల ఒత్తిళ్లా?.. తల్లిదండ్రుల ఆకాంక్షలను తీర్చలేక పోతున్నామనే భయమా? ఏం చేస్తే విద్యార్థుల ఆత్మహత్యలు ఆగుతాయనేది సర్వే సర్వత్రా వేధిస్తున్న ప్రశ్న.
ఇంటర్‌ ఫలితాల వెల్లడి తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం వంటి ఘటనలు విద్యార్థులు పడుతున్న మానసిక సంఘర్షణను స్పష్టంగా చెబుతున్నా యి. ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఎదురవుతున్న సమస్య కాదు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఏటా విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతున్నది. జాతీయ నేర నమోదు విభాగం- 2023 గణాంకాల ప్రకారం ఒక్క 2022లోనే దేశ వ్యాప్తంగా పదివేలకు పైగా 18ఏండ్లలోపు వారే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2022లో జరిగిన ఆత్మహత్యల్లో దాదాపు 8శాతం విద్యార్థులవే. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలలో విద్యార్థి ఆత్మహత్యలు సైతం ఒకటి. సమాజ ప్రగతిలో విద్యారంగం పాత్ర అతి ప్రధానమైనది. భవిష్యత్‌ సమాజ నిర్మాణానికి ఉపయోగపడేలా మానవ వనరులను అభివృద్ధి పరచడం విద్యా సంస్థల ప్రధాన బాధ్యత. ప్రాథమిక స్థాయిలో అందుకు సంబంధించిన బీజాన్ని విద్యార్థుల్లో నాటడంలో వాటిదే కీలక భూమిక.
తెలిసీ తెలియని వయసులో ఒత్తిడిని తట్టుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఈ ఘటనలు రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రమవుతున్నాయే తప్ప… అందుకు గల కారణాలను లోతుగా అధ్యయనం చేసి, దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడంలో వ్యవస్థలు వైఫల్యం చెందాయి. ప్రస్తుతం విద్యాబోధన విద్యార్ధి కేంద్రంగా జరగడం లేదనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమ మార్కెట్‌ను మరింతగా విస్తరించుకోవడం కోసం మార్కులు, ర్యాంకులే ధ్యేయంగా విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతు న్నాయి. తమ పిల్లలు మెరుగైన ఉద్యోగాల్లో స్థిరపడాలనే కోరికతో తల్లిదండ్రులు సైతం అందుకు సహకరిస్తున్నారు.
కానీ, విద్యార్థులు పడుతున్న మనోవేదనను ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. మెరుగైన ఫలితాలు రాకపోతే ఏమంటారోనని కొందరు, తల్లిదండ్రులు తమపై పెంచు కున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నామని మరికొందరు ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, భరోసా కల్పించేవారు లేక అంతర్గత సంఘర్షణకు లోనవుతూ చివరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇందుకు మారుతున్న పరిస్థితుల్లో వారి కుటుంబ నేపథ్యం, సామాజిక, ఆర్ధిక స్థితిగతులు విద్యార్థుల్లో మానసిక ఆందోళన కూడా కారణాలు అవుతున్నాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి విద్యా సంస్థలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. మారుతున్న పరిస్థితిలో ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలను మాత్రమే పాఠ్యప్రణాళికల్లో చేరుస్తూ సామాజికాంశాలు, మానవీయ విలువలు, జీవన నైపుణ్యాలు వంటి నిజజీవితానికి సంబంధించిన అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. దీంతో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, భావోద్వేగాలకు లోనవుతూ అర్ధాంతరంగా అసువులు బాస్తున్నారు.
2019లో ఇంటర్‌ ఫలితాల తర్వాత 27మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడంతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం అన్ని జూని యర్‌ కళాశాలల్లో కౌన్సిలర్లను నియమించుకోవాలని ఆదేశించినప్పటికీ అది అమలుకు మాత్రం నోచుకోలేకపోయింది. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థులే కేంద్రంగా విద్యా భోధన జరిగేలా విధానాలను రూపొందించి అమలు పరచాలి. నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక స్థితిగతులపై నిత్యం పర్యవేక్షణ అవసరం. అప్పుడే విద్యార్థుల సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి పరిష్కార మార్గాలను చూపగలుగు తాం. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని పెంపొందిం చాలి. అప్పుడే స్వతహాగా తమ సమ స్యలను తామే పరిష్కరించుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేసినప్పుడే విద్యార్థుల సమ్మిళిత అభివృద్ధి సాధ్యం. ‘పరీక్షలు శిక్షలు కాదు..నీ సామర్ధ్యం తెలుసుకునే ఒక ప్రయత్నం మాత్రమే’ అని చెప్పి ధైర్యపు మందు పోసే వారే కావాలిప్పుడు. ఆ దిశగా ప్రభుత్వం, విద్యాశాఖ చర్యలు చేపట్టాలి. అప్పుడే విద్యార్థుల ఆత్మహత్యలు లేని రాష్ట్రాన్ని, దేశాన్ని చూడగలుగుతాం.

]]>
చెరువులను కాపాడుకుందాం https://navatelangana.com/lets-save-the-ponds-2/ Wed, 24 Apr 2024 17:39:41 +0000 https://navatelangana.com/?p=276502 Editorial ‘నీరు సమస్త ప్రకృతికి చోదక శక్తి’ అనే నానుడి అందరికి తెలిసే ఉంటుంది. అంత ప్రాధాన్యత కలది నీరు. రాష్ట్రంలో చెరువులు, జలశాయాల పరిరక్షణపై మరోసారి ఉన్నతన్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా భూఆక్రమణలను అడ్డుకోవడంతోపాటు తాగునీటి అవసరాలు తీరేలా వ్యవస్తీకృత మార్పులు అవసరమని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌ నగర శివార్లల్లోని జల్పల్లి, ఉమ్డాసాగర్‌తో పాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ సర్కారుకు హైకోర్టు నోటీసులిచ్చింది. మెట్రో ప్రాజెక్టు రావడం, భూముల ధరలు పెరగడంతో చెరువులపై దురాక్రమణ దారుల కన్నుపడిందనీ, వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనంటూ కర్తవ్యభోధ చేసింది. నీటి వనరుల ఆక్రమణ సామాజిక దురాచారమంటూ వ్యాఖ్యానించింది. చెరువుల పరిరక్షణను అలక్ష్యం చేస్తే పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌ చెరువులపై రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)గా స్వీకరించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హైకోర్టు చేసిన కీలక కామెంట్లు చెరువుల ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
నిజానికి చెరువుల చరిత్ర అంతా ఇంతా కాదు. వీటి నిర్మాణం శాతవాహనుల కాలం నుంచే ఉంది. కాకతీయులు దీన్ని మరింతగా ప్రొత్సహించారు. దీంతో రామప్ప, పాకాల, లక్నవరం, ఘనపురం, బయ్యారం తదితర ప్రాచీన చెరువులు నేటికి మనుగడలో ఉన్నాయంటే వారి పుణ్యమే. కాకతీయుల సంప్రదాయాన్ని కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు సైతం కొనసాగించారు. కాగా ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆధునికకాలం. అడుగడుగునా సాంకేతికత పెరుగుతున్న సమయం. అనేక అంశాల్లో తీవ్రమైన మార్పులే చోటుచేసుకుంటున్న సందర్భం. సాధారణంగా చెరువులు గ్రామీణ ఉపాధి, పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటు నందిస్తాయనడంలో సందేహామే లేదు. గత ప్రభుత్వాలు చెరువుల నిర్వహణపై నిర్లక్ష్యంగా ఉండటంతో ఇక్కట్లు తప్పడంలేదు. వాటి బాగోగులను పట్టించుకోక పోవడంతో ఆ ప్రభావం పలు రూపాల్లో ప్రజలపై పడుతున్నది. జీవన ప్రమాణాలు పడిపోవడానికి కారణమవుతున్నది. చెరువుల నిర్వహణా వ్యవస్థలు సరిగ్గా లేక చెత్తాచెదారం పేరుకుపోవడం, ఆక్రమణలకు గురికావడంతో అవి ధీనస్థితికి చేరాయి. ఆక్రమణకు గురికావడమే గాక భూగర్భజలాలు తగ్గిపోవడంతో పాటు సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తుతున్నది. ఇది ప్రధానంగా సాధారణ గ్రామీణ ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతరులపై అధికంగా ఉంటున్నది. ఇది ఇటు ప్రభుత్వాలు,అటు ప్రజలకు గుదిబండగా మారుతున్నది. సర్కార్లు చెరువులు, జలాశాయాల్లో పూడికతీత పనులు చేయక పోవడమూ ఇబ్బందులకు మూలమే. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్డినా ఫలితాలు సున్నానే. దీంతో గ్రామాలు కరువు నిలయాలుగా అవతారమెత్తాయి.
కరువు గ్రామీణ పేదల జీవితాలను చిధ్రం చేస్తున్నది. రైతుల ఆత్మహత్యలు వలసలు, విపరీతంగా జరుగుతు న్నాయి. ఇటు దేశంలోనూ, అటు గల్ఫ్‌ దేశాలకు కార్మికులు, కూలీలు వలసెళ్తున్నారు. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 46,531 చెరువులున్నాయి. వీటిలో వేలాది చెరువుల ఎఫ్‌టీఎల్‌ను పాతరేసి భూబకాసురులు ఆక్రమించుకున్నారు. ఆయా చోట్ల ఇండ్లు వెలుస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నారు. ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా ఉంది పరిస్థితి.
మిషన్‌ కాకతీయ పేరుతో బీఆర్‌ఎస్‌ సర్కారు హడావిడి చేసి రూ.వేల కోట్లు కుమ్మరించి కొంత పూడిక తీసినా, ప్రయోజనం అంతంతే. కార్యకర్తలకు ప్రజాధనాన్ని ఫలహారంగా బిల్లుల రూపంలో పంచి రాజకీయ లబ్ధి పొందారే తప్ప, సాధారణ పేదలకు ఒరిగిందేమీ లేదు. దీంతో భూగర్భజలాలు అధ:పాతాళానికి పడిపోయాయి. అది వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువుకు మార్గం సుగమమం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో పగుళ్లురావడం, సీపేజీలు ఏర్పడటంతో గత ఏడాది సెప్టెంబరులో చినుకుల పలకరింపు ఆశించినంతగా లేకపోవడం తెలిసిందే. చెరువులను చెర బట్టే అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు పెట్టి కఠినంగా శిక్షించకపోతే తప్పిదం సర్కారుదే అవుతుంది. తాజా నిర్ణయాల మూలంగా జలాశయాల్లో పూడిక తీత వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు వెళ్లారు. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు రాజస్థాన్‌లో అధ్యయనానికి వెళ్లారు. వచ్చిరాగానే తాగు, సాగునీటి వనరులను బాగుచేసి నీటిని ఒడిసిపట్టే ప్రాథమిక బాధ్యత వారితోపాటు సర్కారుది. ఈ గ్రహం మీద మాయాజాలం అంటూ ఉంటే, అది నీటిలోనే అనేది వేరేగా చెప్పాలా!

]]>