Features Archives - https://navatelangana.com/category/features/ Sat, 02 Sep 2023 07:23:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Features Archives - https://navatelangana.com/category/features/ 32 32 గురివింద సూక్తి ముక్తావళి! https://navatelangana.com/gurivinda-sukti-muktavali-2/ Fri, 07 Apr 2023 12:34:12 +0000 https://dev.navatelangana.com/?p=10418 ఎదుటివారి నలుపు గురించి గురివిందలు మాట్లాడటం ఆశ్చర్యమే! అదీ తల్లి గొబ్బెమ్మలాంటి పెద్ద గురివింద నీతులు చెప్పడం ఒకింత అసహ్యం కూడా కలుగుతోంది. తన ‘శుద్ధపూసత్వా’ న్ని వెలుగులోకి తేవడానికి, నిలువునా నిలబెట్టడానికి ఇతర పార్టీలన్నింటినీ అవినీతిపరమైనవన్న వాఖ్యానం, చేస్తున్న ఆర్భాటం ‘భక్తుల’ కెలావున్నా మిగిలిన దేశ ప్రజలకు జుగుప్స కలిగిస్తున్నాయి. అన్ని పత్రికల్లో, లేదా చాలా పత్రికల్లో బీజేపీ అస్మదీయులు దిగబడి ఉన్నారు. మోడీ మీద వాలే ‘ఈగల్ని’ తోలడం వారి తక్షణ కర్తవ్యం. ఇది మరీ ‘నాటు’గా ఉంటే, మోడీపై ఈగలు వాలకుండా చూడటం వారి వృత్తి ధర్మం! ఢిల్లీ వీధుల్లో పోయే తెలుగువారి పరువు గురించీ, అది మోరీల్లో కలుస్తున్న తీరు గురించీ ఒక ‘సత్య’వంతుడు తెగ బాధపడ్డాడు. బీఆర్‌ఎస్‌ నేతలు ఈడీ, సిబిఐల దెబ్బకి భయపడి కోట్ల రూకలు ప్రచారంపై ఖర్చు చేశారని ‘బాధ’పడ్డాడు. అవినీతి సామ్రాట్టుల భరతం పట్టేందుకే ఈడీ, సిబిఐలున్నాయట! ”నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!” అంటే ఇదే కదా! మీపై కాలుదువ్వినవారిని ఒకరకంగాను, మీకు లొంగిపోయిన వారిపై మరొక రకంగా పైరెండు సంస్థల్నీ వినియోగించడం దేశం గమనిస్తూనే ఉంది కమలనాథులారా! 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణమో, ‘కోల్‌’గేట్‌ కుంభకోణం గురించో మోడీ పదే పదే చెపుతూ ఉంటారు. ఇలాంటి కుంభకోణాలు వ్యక్తులకో, పార్టీలకో సంబంధించినవి కావు

 

 

 

 

 

]]>
సర్వ సమతా సత్యవాదం – బాపురెడ్డి కవితానాదం https://navatelangana.com/sarva-samata-satyavadam-bapureddy-kavitanadam/ Mon, 13 Mar 2023 08:39:07 +0000 https://dev.navatelangana.com/?p=8859 ప్రసిద్ధ సమకాలీనాంధ్ర కవుల్లో డా||జె.బాపురెడ్డి గణనీయులు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గూడ సుపరిచితులైన వీరు 1936 జులై 21న కరీంనగర్‌ జిల్లా ‘సిరిసిల్ల’ తాలుకా పరిధిలోని ‘సిరికొండ’లో జంకె కష్ణారెడ్డి, రామలక్ష్మి దంపతులకు జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, గ్రామీణ వాతావరణం లో వేళ్లు తన్నుకున్న వీరి జీవితం, అంచెలంచెలుగా వత్తిరీత్యా ప్రతిష్టాత్మక ఐ.ఏ.ఎస్‌. ఉన్నతాధికారి స్థాయికి ప్రవత్తిరీత్యా ప్రముఖ కవిగా విజ్ఞాన వేత్తగా ఎదిగిన పరిణామాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. యువతరానికి స్ఫూర్తిదాయకంగా వెలుగొందాయి.
బాపురెడ్డి బహు గ్రంథకర్త. పాఠశాల స్థాయి లోనే కవిత్వ రచన ఆరంభించి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉండగా శోభ పత్రికలో ఎకనా మిక్స్‌ సుందరి అనే కవితను ప్రచురించి ఉత్తమ కవిత అవార్డును సొంతం చేసుకున్నారు. చైతన్య రేఖలు అనే కవిత్వ సంపుటిని ప్రచురించారు. వీరు రచించిన ఋతురాగం గేయ నాటిక నంది అవార్డును కైవసం చేసుకున్నది. బాపురెడ్డి గేయాలు, శ్రీకారశిఖరం, ప్రేమారామం, నా దేశం నవ్వుతుంది, బాపురెడ్డి భావ గీతాలు, ఆటపాటలు, నవగీత నాట్యం, వంటి గేయ సంపుటాలు, రాకెట్టు రాయబారం, భావి జీవులు, సాగర సౌధం, విజయహేల, కళ్యాణ యాత్ర, చాచా నెహ్రూ, ఎన్జీవో, చేతన కేతనం, స్వాతంత్య్రహేల, సకల జన సంక్రాంతి మొదలైన గేయ నాటికలు, బాపు రెడ్డి పద్య కావ్యాలు, మన చేతుల్లోనే ఉంది, రంగు రంగుల చీకట్లు, ప్రణవ ప్రణయం, కాలం మాయాజాలం, సౌదామిని కవితలు, ఆత్మీయ రాగాలు, అక్షరానుభూతులు, వాడిపోని వసంతాలు, లోకానులోకనం వంటి కవిత్వ సంపుటాలు, ఆధునిక తెలుగు కవిత్వం తీరు తెన్నులు, సాహితీ వైవిధ్యము మొదలైన విమర్శ గ్రంథాలు, అనంత సత్యాలు, నాద వేదాలు, బాపురెడ్డి గద్య కావ్యాలు, పంచ బాణసంచా, వంటి గ్రంథాల తో పాటు నబవర్‌ quest of harmony, longing for life, Urn of love, loving is living, anatomy of time, varieties and visions వంటి ఆంగ్ల గ్రంథాలు, వ్యవధి లేదు, పైకెత్తాలి, ప్రకతిలో పవిత్రత, అజ్ఞాత శాంతి సందేశం, రాకుమారుడు పగడాల కడలి వంటి అనువాద గ్రంథాలు మొదలైన 50కి పైగా రచనలు చేశారు.
నవ్యత, మానవత, ప్రసన్నత, భావుకత, తాత్వికతలు బాపురెడ్డి కవితల్లో ప్రసాదభరితమై సజీవంగా దర్శనమిస్తాయి. వచన కవిత్వం రాజ్య మేలుతున్న నేటి కాలంలో వీరు సాహసంతో పద్యప్రక్రియను స్పశించి అనుభూతి, అభివ్యక్తి, సౌందర్యం, సందేశం. స్ఫూర్తితో ఛందో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, రసరమ్య భావవాహినులను పొంగించి, తమ పద్యరచనా పటిమను నిరూపించుకున్నారు. వీరి గేయాలు లలిత పద బంధురమై, సురాసుర సంగీత సాహిత్య ప్రియులకు విందు చేశాయి. సుప్రసిద్ధ సంగీత వీరి లలిత గీతాలకు స్వరకల్పన చేసి శ్రోతలనలరించారు.ఇక వీరి గేయనాటికలు రమణీయ భావ పేటికలు. హద్య కవితావాటికలు. చారిత్రక, పురాణేతిహాస కథాభరితంగా నడుస్తున్న గేయనాటికల ఇతివత్తాలను తమ కలంతో సామాజిక ఇతివత్తాలుగా మార్చి గేయనాటికా రచనల్లో నూతన ఒరవడిని సష్టించారు. వీరి అనువాదాలు అనుభూతి పరాలు, ప్రఖ్యాత పాశ్చాత్య కవయిత్రుల మూడు ఆంగ్లకతుల్ని వీరు తెలుగులోకి అనువదించి మూలకతులలోని కవి హదయాన్ని ఆవిష్కరించారు. తెలుగులో వీరు ఎంత హద యంగమంగా కవితలల్లారో, అంతే హద్యంగా నాలుగు ఆంగ్లకతులను కూడా విర చించి, ఉభయకవి మిత్రులని పించుకున్నారు. వివిధ ధక్కో ణాలతో తన ‘మనసులోని మాటలను సామాజిక సాహిత్య వ్యాసాలుగా తీర్చిదిద్ది, వ్యాససంపుటం ద్వారా ‘ఆధునిక తెలుగు కవిత తీరుతెన్నులు’ తెలుగు వారికందించి విమర్శకునిగా కూడా గుర్తింపు పొందారు. వీరి ప్రతి రచనలోనూ, ప్రణయ, ప్రణవ, ప్రగతి భావాలు, అంతర్వాహినిగా కన్పి స్తాయి. మానవజాతికి నిర్మాణాత్మక శాంతిమయ జీవితదర్శాన్ని అందించే సౌందర్యలహరి ప్రణయం, భౌతిక సత్యాన్ని పరతత్వాన్ని జోడించే పరిమళపోపానమది. ఆయత్నపూర్వక సంవేదనా భివ్యక్తితో మనలను పునీతులగా చేసే తీయని భావమిది. అందుకే ప్రకతి పురుషయోగ తత్వం ప్రతిఫలించే ప్రణయ తత్త్వం మానవ జీవిత సత్యం కావాలని వీరు తమరచనల్లో ఆశించారు. వీరి ప్రగతి భావాలు నిర్మాణాత్మక నిర్ణయాత్మక ఫలితాలను సష్టించాయి. అనంత సత్య గర్భితమైన చరాచర సష్టిలో మానవ జీవితానికి ఉపయుక్తమయ్యే సామాజిక భావోద్దీపన వీరి ప్రగతి తత్త్వంలో దర్శన మిస్తుంది. సామాజిక వైరుధ్యాల పట్ల స్పందన అవశ్యమని తన ప్రగతిశీల భావాల్లో నిరూపిం చారు. తరతరాల ఏకతాభావాన్ని సమతావేదికపై నిలపాలనీ అపుడే సామాజిక అసమానతలు తొలగిపోయి మమతా మానవతలు పరిమళి స్తాయని ప్రగతి దక్పధంతో భావించారు.
బాపురెడ్డి ప్రణవనాదం ఆధ్యాత్మిక, తాత్త్విక భావాలను వినిపించింది. ప్రాపంచిక విషయ సుఖాలలో మునిగిన మనిషి అశాశ్వతమైన కాయమే సత్యమని భ్రమించి జీవితాన్ని వథా చేసుకుంటున్న విషయాన్ని తమ ఆధ్యాత్మక భావా లలో రంగరించిపోశారు. భక్తి, జ్ఞాన, కర్మ యోగ సాధనల ద్వారా అంతులేని ప్రశాం తతను, పవిత్రతను పొంది, ప్రజ్ఞానాన్ని సంపాదించి మోక్షము పొందవచ్చునని రెడ్డి ప్రణవదష్టితో చెప్పారు.
ఇక, వీరి ‘భావ భౌతికవాదం’ తెలుగులో సరికొత్త స్వేచ్ఛావాదంగా నిలిచి సాహితీ విమర్శకులను సైతం ఆలోచింపజేస్తోంది. భౌతికాన్ని భావంతో సంధానించినప్పుడు అనుభూతమయ్యేది ఆనందమనే అనంతసత్యం. ఒక వస్తువులోని అనంత రూపగుణాలను విశ్వసించడం వల్ల నూతన విలువలు ఏర్పడ తాయి. అవి మన ఆదర్శాలకు అనుగుణంగా ప్రతిఫలించాలని దైవత్వం అనంతత్వాలను ప్రకటితం చేయాలని వీరు తన వాదం ద్వారా అభిలషించారు. అధివాస్త వికతను ఆనందము వైపుమళ్ళించడమూ, సామా జిక స్పహను సౌందర్యం వైపు నడిపించటమూ రెడ్డి భావభౌతికవాద ప్రస్థానం. బాపురెడ్డి నిరంతరాన్వేషి, కవితా పిపాసి. తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ సాహితీ స్రవంతిలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపించారు. అలుపెరుగని కవితా తష్ణతో కడదాకా రచనలు చేసిన బాపురెడ్డి ఇటీవల లోకాన్ని వీడి వెళ్లడం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. తెలుగు సాహితీవినీలాకాశంలో బాపురెడ్డి ఒక ధ్రువతారగా వెలుగుతూనే ఉంటారు.

(వ్యాసకర్త ‘బాపురెడ్డి కవితా దక్పథం’ పై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టం పొందారు)
– డాక్టర్‌ చింతోజు మల్లికార్జునాచారి
99499 27142

]]>
మన కాలం గొప్ప పాత్రికేయ విమర్శక నవలాకారిణి కె.రామలక్ష్మి https://navatelangana.com/k-ramalakshmi-is-the-greatest-journalist-critic-novelist-of-our-time/ Mon, 13 Mar 2023 08:36:47 +0000 https://dev.navatelangana.com/?p=8857 ”కాలం కరుణామయహంతకి” అంటాడు మక్దూం ఓ సందర్భంలో… 2023 సినీ ప్రముఖుల్ని తీసుకుపోతోంది. ఒక్కొక్కర్ని… 92 ఏండ్ల నిండు జీవితం గడిపిన కె.రామలక్ష్మి 3 మార్చి 2023 శుక్రవారం కన్నుమూశారు. కూచి రామలక్ష్మి 1930 డిసెంబర్‌ 31న ఆంధ్రప్రదేశ్‌ లోని కాకినాడ జిల్లా కోట నందూరు గ్రామంలో జన్మించారు. మద్రాస్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని మేరి స్టెల్లా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసారు. రామలక్ష్మి ఆధునిక భావాలు; పురోగమన దృక్పథం, ధిక్కార స్వరం, ఫెమినిస్ట్‌ ఆలోచనలు ఈమె రచనల్లో కనిపిస్తాయి. దాదాపు 100 పుస్తకాలు రాసారు. ఖసా సుబ్బారావు నడిపిన తెలుగు స్వతంత్ర పత్రికలో ఆంగ్ల విభాగంలో ఉప సంపాదకురాలిగా పనిచేసారు. డా|| సినారె తొలి పుస్తకానికి ఆ పత్రికలో తొట్టతొలిగా సమీక్ష చేసింది రామలక్ష్ష్మీ. 1950 ఏప్రిల్‌ 30న ఆరుద్రని రిజిస్టర్‌ మేరేజ్‌ చేసుకొంది. హెచ్‌.ఎం. రెడ్డి, శ్రీశ్రీలు నాటి పెండ్లికి పెద్దలూ, సాక్షులు.. ఆదర్శాలు ఆచరణలో చూపాలనే ధోరణి ఆమెది. తెలుగు, హిందీ, తమిళం, సంస్కృతం, ఆంగ్లం భాషల్లో మంచి పట్టు ఉన్న రామలక్ష్మి 15 నవలలు, మూడు కథా సంపుటాలు పలు చిత్రాలకు రచనలు చేసారు. సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. చిన్నారి పాపలు, జీవనజ్యోతి చిత్రాలకు కథా రచన చేసారు. జీవనజ్యోతికి నంది పురస్కారం వచ్చింది. కథ, నవల, విమర్శ, సమీక్ష, అనువాదం, పాత్రికేయ వృత్తి, సినీ కథలకు రచనలు.. ప్రాచీనాంధ్ర సాహిత్యంపై మంచి పట్టు వున్న రామలక్ష్మి 1954లో విడదీసే రైలు బళ్లు నవల రాసి ప్రఖ్యాతినొందారు. అవతలి గట్టు, మెరుపు తీగె, తొణికిన స్వరం (1961), మానని గాయం, ఆణిముత్యం, పెళ్ళి (2013), కస్తూరి (2001), ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్ళు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పండరంగని ప్రతిజ్ఞ మొ|| నవలు రాసారు. రామలక్ష్మి మృతికి తెలుగు సాహిత్యానికి తీరనిలోటు.

– తంగిరాల చక్రవర్తి

]]>
కావ్యాలంకారం https://navatelangana.com/poetry/ Mon, 13 Mar 2023 08:35:03 +0000 https://dev.navatelangana.com/?p=8855 ఎప్పటిలాగే మనం
రోజూ మాట్లాడాలనుకుంటాం
అయినా కొన్ని వారాలదాకా
తంత్రీహాసంలో నిశ్శబ్దం
ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
కారణం తెలియని కలవరం
చుట్టూరా పరిభ్రమిస్తుంది

ఈస్టిండియా పాలన గురించో
ఈశాన్య రాష్ట్రాల ఉద్యమం వల్లనో
అయినవీకానివీ ఆపాదించుకొని ఉద్రేకపడినందుకా

శాతవాహనులలో విష్ణుకుండినులలో
ఎవరు దమ్మను శిరసావహించారనే
రచ్చ నిట్టనిలువుగా చీలినందుకా

పక్షుల భాషను
అనువదించినప్పుడు జారిపోయిన
నుడికారం ఎత్తిచూపి విలాసంగా నవ్వినందుకా

మా ప్రాంగణంలో పిట్టలకు
మీ కాంపౌండులో మొక్కలకు
ఒకటే వయసైనా
గోలలో తేడా ఉందన్న ధిక్కారానికా

అవ్యవస్థపై నీ అసహనాన్ని కూడా
మధురిమగా తడిసే
నా మనోయవనిక మీద
ఏ అక్షరమూ నమోదుకాని విభావరిలో నేను
కల్లోల పడికూడా
నీ ఇష్టులంతా నా వాళ్ళుగా
నా పరిసరాలన్నీ నీవి అయినట్లుగా
భావనలు బల పరుచుకుంటున్నప్పుడు
ఒక ఇంద్రజాలం లా నువు కనెక్టవుతావు
కారణాలను ఒక తాత్విక గాథతో
కలిపి కుడతావు

అది మనసంతా నింపుకొని
నేనొక పరిమళభరితమైన వసంతాన్నౌతాను
నిజానికి మనం మన గురించి కాదు
మహా లోకాన్ని వ్యాఖ్యానించే
కావ్యాలంకారాలం

– డా కాచాపురం దుర్గాదేవి
7893093495

]]> పొయ్యిమీదనే ఆకలి కాలిపోతున్నది https://navatelangana.com/hunger-is-burning-on-the-stove/ Mon, 13 Mar 2023 08:32:51 +0000 https://dev.navatelangana.com/?p=8853 దేశభక్తంటే
సరిహద్దుల్లో మీసాలు మెలేయ్యడమే కాదు
పేదల ఇండ్లల్ల పొయ్యి వెలుగాలే
కడుపులకింత కూడుడుకాలే !

బతుకును నెట్టుకురావడమంటే
నిచ్చెన లేకుండా మిద్దెక్కినట్లుంది
వొట్టి కాళ్లతో పలుగురాళ్లల్ల నడిచినట్లుంది
పేదల కన్నీళ్ళంటే ఎంత ప్రీతో
వెలిగిపోతున్న ”భారతం”లో
నెత్తిమీద గ్యాస్‌ బండలు

పొయిన కాలాలే బాగుండే
సెలుకల్ల కూలిపోయి వచ్చెటప్పడు
అమ్మ కట్టెలమోపుతోనె ఇంటికొచ్చేది
ఒక్కనాడు కట్టెల బాధలేదు
ఎన్ని దినాలైనా పొయ్యి దగాదగా మండేది
దీని పాడుగాను నెలకాకముందే
సిలిండర్‌ గ్యాస్‌ పెద్దపులై తరుముతున్నది

అడ్డామీది కూలి పని దొరుకని వెతలు
చెట్టుగొట్టొద్దు వంట చెరుకు తేరాదు
ఆరిపోతున్న పొయిల బతుకు బువ్వెట్ల
చేసిన పనంతా గ్యాస్‌కే కాలిపోతే
బతుకు చెరువులో
చేపలు ఈదెదెట్ల సంసారం సాగేదెట్ల ?

మహారాజా !
మీది పోయేదేముంది
కలం మీదే పాలన మీదే
అన్నీంటిని పెంచేయ్యండి
ఎన్నింటిని పెంచినా తిరిగితిరిగి
మీ బోశానమే గదా నిండేది !

కరోనాలో
చావుల్ని పెంచినట్లుగా
అన్నింటి మీద మీ ముద్దెరలేసుకోని
నిత్య అవసరాలను నిప్పులను చేయండి
కరెంట్‌ను ముట్టుకున్నా కాలిపోతలేం గానీ
ఏదికొన్నా బొగ్గులైతున్నం
మీది పోయేదేముంది
అన్నింటిని అందకుండా చేసే కాషాయపాలన

ఇప్పట్లో
ఇగ ఏ ఎన్నికల వానలు లేవేమో
మేం గుర్తుండటానికీ!
రోజురోజు అంగట్ల కొన్కొచ్చుకొనే బీదలం
మీరొక్కనాడే కొని అయిదేళ్ళు
మహారాజుల్లా వెలిగిపోతూనే వుంటారు

సబ్సీడీని
కత్తులమూటను చేసిన కర్కశ పాలన”
ఇన్నిసార్లు మా రక్తాన్ని పిండుకోవడమెందుకు
ఒకటేసారి
ఆ కంట్రోల్‌ బియ్యముల ఏమన్న కలపి పంపీయండి
ఒక్కసారే తిని ఒక్కపారే గుడ్డు పెడ్తాం !

– వనపట్ల సుబ్బయ్య
9492765358

]]>
16న ‘అనార్కలి’ ఆవిష్కరణ https://navatelangana.com/anarkali-unveiling-on-16/ Mon, 13 Mar 2023 08:28:10 +0000 https://dev.navatelangana.com/?p=8851 అభ్యుదయ రచయితల సంఘం తెలంగాణ రాష్ట్ర విభాగం, పాలపిట్ట బుక్స్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమ్జద్‌ అనువాద కథల సంపుటి ‘అనార్కలి’ ఈ నెల 16న గురువారం సాయంత్రం 6:00 గం||లకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాలులో ఆవిష్కరించ నున్నారు. రాపోలు సుదర్శన్‌ సభాధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి జూలూరి గౌరిశంకర్‌ ముఖ్యఅతిథిగా, ఏ.కె.ప్రభాకర్‌ విశిష్ట అతిథిగా, ఏనుగు నరసింహారెడ్డి గౌరవ అతిథిగా, కవి యాకూబ్‌, అబ్దుల్‌ వాహెద్‌, రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ ఆత్మీయ అతిథిలుగా హాజరు కానున్నారు.

]]>
17న ‘మూడు గుడిసెల పల్లె’ ఆవిష్కరణ https://navatelangana.com/on-the-17th-the-village-of-three-huts-was-discovered/ Mon, 13 Mar 2023 08:25:37 +0000 https://dev.navatelangana.com/?p=8849 ఈ నెల 17న ప్రముఖ కథా రచయిత డా. సిద్దెంకి యాదగిరి కథా సంపుటి ”మూడు గుడిసెల పల్లె” పుస్తకావిష్కరణ మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి మినీ హాల్లో సాయంత్రం 5:30గం.లకు నిర్వహించనున్నారు. మంజీర రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు కె.రంగాచారి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి కొలకలూరి ఇనాక్‌ పుస్తకావిష్కరణ, విశిష్ట అతిధులుగా ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, నందిని సిద్ధారెడ్డి ముఖ్యఅతిథులుగా, తెలుగు సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు, ప్రముఖ కవి గాయకులు దేశపతి శ్రీనివాస్‌ వక్తలుగా హాజరు కానున్నారు.

]]> జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు https://navatelangana.com/national-level-stories-and-poetry-competitions/ Mon, 13 Mar 2023 08:24:09 +0000 https://dev.navatelangana.com/?p=8847 వురిమళ్ళ ఫౌండేషన్‌ – అక్షరాల తోవ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు నిర్వహించనున్నారు. ‘వురిమళ్ల శ్రీరాములు’ స్మారక కథల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.5000/-, రూ.4000/-, రూ.3000/- లతో పాటు రెండు కన్సలేషన్‌ బహుమతులు రూ.1000 చొప్పున ఇవ్వనున్నారు. ‘వురిమళ్ళ పద్మజ’ స్మారక కవితల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.4000/-, రూ.3000/-, రూ.2000/- లతో పాటు రెండు కన్సలేషన్‌ బహుమతులు రూ.1000 చొప్పున అందివ్వనున్నారు. వీరితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాహిత్యంలో విశేష కృషి చేసిన ఒకరికి ‘భోగోజు పురుషోత్తం సముద్రమ్మ’ సాహితీ పురస్కారం కూడా అందివ్వనున్నారు. ఆసక్తి కలిగిన వారు కథలు, కవితలు 15 ఏప్రిల్‌ లోగా భోగోజు ఉపేందర్‌రావు, ఇ.నెం. 11-10-694/5, బురహాన్‌ పురం, ఖమ్మం – 507001 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9494773969 నంబరు నందు సంప్రదించవచ్చు.

]]>
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ – పాలపిట్ట కథల పోటీ ఫలితాలు https://navatelangana.com/makkena-ramasubbiah-foundation-palapitta-story-competition-results/ Mon, 13 Mar 2023 08:22:27 +0000 https://dev.navatelangana.com/?p=8845 మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ – పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ – 2022 ఫలితాలు వెలువరించారు. బహుమతులకు ఎంపికయిన కథల వివరాలు… ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు – షేక్‌ షబ్బీర్‌ హుస్సేన్‌ (లాలాల్‌ సాయిబు), జాలాది రత్న సుధీర్‌ (కొరడా దెబ్బలు), తెలిదేవర భానుమూర్తి (చేదు నిజం), వీటితో పాటు 7 ప్రత్యేక బహుమతులుకు చీకట్లోంచీ… – విహారి, పూర్ణ చంద్రోదయం – ఉణుదుర్తి సుధాకర్‌, కరు(రో)ణ – డాక్టర్‌ నక్కా విజయరామరాజు, నల్ల చీమలు – స్ఫూర్తి కందివనం, అసతోమా సద్గమయ – వేణు మారీడు, దేవుడు – మనిషి – తటవర్తి నాగేశ్వరి, రేపటి సూర్యుడు – శరత్చంద్ర కథలు ఎంపికయ్యాయి.

 

]]>
నిషిద్ధ వస్తువుపై నిర్భయ ప్రకటన 1818 https://navatelangana.com/nirbhaya-proclamation-1818-on-contraband/ Mon, 13 Mar 2023 08:19:11 +0000 https://dev.navatelangana.com/?p=8842 దీర్ఘ కవితల్లో కవిత్వం రాను రాను తేలిపోతుంది… లేదా వస్తువు డామినేట్‌ చేస్తుంది కానీ ఈ పుస్తకంలో మాత్రం లోనికి పోనుపోను కవిత్వ ధార చిక్కబడింది. వస్తువు బట్వాడాను బలోపేతం చేసింది.. కొన్ని అంశాలను ముట్టుకునేందుకు సాహితీకారులు భయపడుతున్న దశను మనం చూస్తున్నాం. కానీ ఈ కవి ఆ పరిస్థితుల్ని సవాల్‌ చేస్తూ రాజ్యం నిషిద్ధం చేసిన ఈ వస్తువును భుజానికెత్తుకున్నడు… అంతేనా పిడికిలి బిగించి దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నాడు.. మనల్నీ ఔర్‌ జోర్‌ సే బోలో అని పిలుపు నిస్తున్నాడు… వరవరరావును, సాయిబాబాను విడిచిపెట్టండి… 75 ఏండ్ల స్వతంత్రదేశం పదానికి అర్థం కల్పించండి.. అని..ఈ కవి దీర్ఘకవిత కోసం ఎంచుకున్న వస్తువు అత్యవసరంగా చర్చించాల్సిన అనేక సామాజిక అంశాల సమ్మిళితం.. అయితే ఆ భావాలా బట్వాడాలో కవిత్వాన్ని రొమాంటిసైజ్‌ చేయటం ఆశ్చర్య పరిచింది.. విప్లవ కవిత్వానికి భావ సౌందర్యం సరిగ్గా అమరింది.. భీమా కోరేగావ్‌ ఒక అమానుష అమానవీయ ఘటనకు సాక్ష్యం.. గాయపడిన గొంతు నుంచి ఈ కవిత్వం పెల్లుబికింది.. న్యాయ వ్యవస్థలో అన్యాయం గురించి అండర్‌ ట్రయల్‌ ఖైదీల దయనీయ స్థితిగతుల నుంచి పుట్టిన సజీవ భావ ప్రవహం భీమానదిలా ప్రవహించింది.. ప్రముఖ చిత్రకారుడు పీవీ చారి చిత్రాలు ఈ కవిత్వ సాంద్రతను బొమ్మకట్టి చూపాయి.. చారి బొమ్మల వల్ల ఈ కవిత్వం మరింత ఫోకస్‌ సంతరించుకుంది..
”కొన్ని తేదీలు కాలాన్ని దుఖానికి బిగిస్తారు… గోడ కొక్కేలకి కాదు”… ”కొన్ని తేదీలు క్యాలెండర్‌లో పేజీలు తిప్పనివ్వవు”… కవి తేదీలు అన్నాడు కానీ అది ఈ పుస్తకానికి వర్తిస్తుంది.. అవును ఈ పుస్తకం పేజీలు తిప్పనివ్వదు. ఆలోచనల్లో ఆగిపోనిస్తుంది.. ఈ పేజీలు బాధిత వర్గాన్ని దుఖానికి బిగిస్తుంది.. కవిత్వాన్ని ఇంత బలంగా నిర్మించటం ఇటీవలి కాలంలో నేను చదవలేదు… ఇంత ధడంగా వాక్యాల్ని పేర్చాలంటే నరాల్లో రక్తం తిరుగుబాటు పాట పాడుతున్నట్లుండాలి… ఇంతటి శక్తిమంతమైన అభివ్యక్తి ‘శ్రీరాం పుప్పాల’ది… ఈ కవిత్వ శైలి తన ముందు కవిత్వం కంటే ఎన్నో రెట్లు పదునైనది… ఇది నది ఆక్రోశధ్వని.. ఆ నది నిండా గట్లనొరిసే నిరసన సెగల పరవళ్ళు.. ‘పద్దెనిమిదొందల పద్దెనిమిది’.. ఇది ఈ పుస్తకం పేరు.. పేరులోఎంత ఫోర్స్‌ ఉందో కవితా వాక్యాల్లోనూ అంతే వేగముంది.. వత్తి పలుకుతున్న పేరు వెనుక వందల ఏండ్ల వత్తిడుంది.. ఇది నది గొంతుకగా కవి అభివర్ణన.. కానీ ఇది సముద్రహోరు.. తుఫాను గర్జన.. గాయపడ్డ, దగాపడ్డ, చెరచబడ్డ, దోచుకోబడ్డ, అణగారిన గుండెల్లో అగ్నికణం.. నిప్పు కాపిన ఢమ ఢమ డప్పుల మోత.. ”తెప్పలన్నీ మునిగిపోతున్నాయి.. ఈ ఉపాఖండం చిమ్మ చీకటిలో మగ్గిపోతోంది” ”పూచీకత్తు దొరకని సామాన్యుని కథంతా ఒక ఉపాయం ప్రకారమే ముగిసిపోతుంది”.. ఉపా దగ్గర ఇన్విటెడ్‌ కామాస్‌ పెట్టుకొని చదవండి ఈ పుస్తక సారాంశం ఏంటో మీకు అవగతమవుతుంది.. ఉప ఖండాన్ని ఉపాఖండంగా అభివర్ణించటం ఇప్పటివరకూ రాని అల్టిమేట్‌ స్టేట్‌మెంట్‌ హై లెవెల్‌ ఎక్స్‌ప్రెషన్‌.. తద్వారా కవి దేనిని నిరసిస్తున్నాడో.. భీమా నది గొంతులో లావాగ్ని సెగ ఎంతలా పెనుమంటగా ప్రవహిస్తుందో ఎరుక అవుతుంది.. అరిగిన పోయిన మెటఫర్‌లు నేను వాడను కానీ.. ఈ రొండు సిమిలీ ఉదాహరణలు చాలు.. సాహిత్య స్పహ ఏ కొద్ది మాత్రం ఉన్న వారికైనా ఇట్టే అర్థం అవుతుంది. ఈ కవిత్వం ఏ కోవకు చెందిందో ఈ దీర్ఘ కవితా వస్తువు ఏంటో…. ఈ కవి రెండు రాష్ట్రాల్లో తన అభిమాన వర్గాన్ని బలంగా నిర్మించుకోటంలో సఫలీకతుడైనవాడు.. ఈ దీర్ఘ కవితలో లెక్కకు మించి రివ్యూలు రాబట్టే సారాంశం ఉంది. అందులో సందేహం లేదు.. తన దీర్ఘకవితా మూలవస్తువు హైలెట్‌ అయ్యేలా ఎందరో సాహిత్య దిగ్గజాలు.. సాహిత్యేతర సామాజిక వర్గాలు, విద్యా వంతులు మేధావుల నుంచి తన ఎఫర్ట్‌కు తగిన సమీక్షలు తప్పకుండా వస్తారు… అందరూ అదే ప్రధాన వస్తువుపై దష్టి కేంద్రీకరిస్తారు. నేను మాత్రం ఈ దీర్ఘ కవితలోని మరో కోణాన్ని మాత్రమే స్పశించదలిచాను. అది సూటిగా మూల వస్తువుకు సంబంధించనిది కాకపోయినా కవి కవిత్వ నిర్మాణ బలం ఏమిటో విశదపరుస్తుంది. వస్తువును పరిపుష్టం చేసేది..
ఇక కవిత్వం ప్రధాన వస్తువులోకొస్తే..
1- ”సగం కాలిన చితులపై నుండి అంటరాని కళేబరాన్నై పైకి లేస్తున్నాను నేను భీమా నదిని”
2- ”కవిత్వం ఎక్కుపెడుతున్న విలుకాన్ని కరెంటు ఫెన్సింగు వేస్తున్నారు”
పైన ముందుగా చెప్పిన ఆ రెండు ఉదాహరణలతో పాటు ఈ వాక్యాలు చాలు, ఈ కవిత్వంలోని వస్తువు గురించి అర్థం అవ్వటానికి.. దీర్ఘ కవిత సాధారణంగా ఏదో ఒక వస్తువునే కలిగి ఉండటం మనకు తెలుసు. కానీ ఈ దీర్ఘ కవితలో మూడు అంశాలున్నాయి..
1- వర్ణ వివక్ష
2- భావప్రకటనా స్వేచ్ఛపై దాడి..
3- రాజద్రోహ అభియోగాలు మోపే దుర్మార్గపు నల్ల చట్టం ఉపా..
అయితే ఇవేవీ కొత్త వస్తువులో సంఘటనలో కావు మనలో ప్రతి ఒక్కరికీ అవగాహనుంది.. అయితే సమాజాన్ని జాగత పరచటంలో కవి అలిసిపోడు.. విసుగుచెందడు.. ఈ విషయంలో సజనకారుడి నేత్రానికి సాధారణ చూపుకి వ్యత్యాసముంది..
అంశాలు రొటీన్‌ అనిపించొచ్చు కానీ వాటిపై మీరైనా నేనైనా ఈ కవైనా నిరంతరమూ చర్చకు పెట్టాల్సినవి ప్రశ్నల నిప్పులు రాజేయాల్సినవి సమాధానాల పరిష్కారాలు రాబట్టాల్సినవి.. ఈ ఆవేదన ఆక్రోశం భీమా నది గొంతుతో పలికించటం ప్రత్యేకత అయితే కవిత్వ నిర్మాణం కవి స్థాయిని పెంచింది.. అర్థం అయ్యేలా చెప్పగలిగితేనే సారం తలకెక్కుతుంది.. చరిత్రో, పాఠమో అవగతం అవుతుంది.. ఆ పని ఈ కవిత చేసింది. ఇందులో వాడిన కవిత్వ భాష కవి ప్రతిభకు దర్పణం..
”పదునైన కత్తి మొనలన్నీ గుండె లోతుల్ని తెగ్గోస్తున్నారు జల్లెడైన నీటి చర్మాన్నిప్పటికీ బుల్లెట్లు చీల్చుతున్నారు..” అణగారిన వర్గపు ఆక్రందనకు అక్షరరూపం కావా ఈ వాక్యాలు..?
”కవిని జైల్లో పెట్టారు రాజ్యం ఎన్ని సార్లీ తప్పు చేస్తుంది..
ఇరుకుతనమ్నుంచి కూడా గొంతెత్తేవాళ్లు సకల జీవుల భాష మాట్లాడగలరు”..
”ఈ దేశపు నల్ల గౌను ముందు తమ కేసు తామే వాదించుకోలేని అనేక వర్ణాల ఇంధ్ర ధనువులున్నారు” సాయిబాబా, వరవరరావు అని వేరే చెప్పాలా.. మితలారా పై వాక్యాలు ఎవరెవరిని ఉద్దేసించినవో… అండా సెల్‌ దుస్థి కల్పించిన కారకులెవరో తెలుసు కదా..
”చెరసాల కనుపాపల్లో పూసిన తురాయిపూల తహతహ ఇనుప తెరల్ని కరిగించి వేస్తుంది”.. రాజ్యం అణచివేత ధోరణి తీరు మారకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్న సూటి హెచ్చరికను ఎంత సుతిమెత్తగా చెప్పాడో చూడండి.. ఒక చోట ”నిదుర మేయని రాత్రులు” అంటాడు.. బాధిత వర్గపు నిద్రపట్టని ఉక్కిరిబిక్కిరి స్థితిని కవి అంతలా ఓన్‌ చేసుకున్నాడు. ఒక సంక్లిష్టత స్థితిని అంత కవిత్వం చేయటం గమనార్హం..
”ఉడుకు నెత్తురు వెల్ల వేసుకున్న ఇంటి గోడల్లా ఉంటాయి, కోతలయ్యాక కొడవళ్ళిక్కడ నెలవంకలై వచ్చి వాలతాయి.. గూట్లోకెళ్ళే ముందు పక్షుల్లా సేదతీరతాయి”. అంత సీరియస్‌ సబ్జెక్ట్‌ లోకి ఇంత కవిత్వ హద్యం ఎలా నింపాడో చూడండి. ఎర్ర మట్టి గోడలను విప్లవ ప్రతీక చేశాడు.. కొడవళ్లను నిలబెడితే అర్ధచంద్రాకారాకతిలో నెలవంకల్లా ఉంటాయి… పొలాల్లో కోతల్లో అలసిన కొడవళ్ళు గూట్లోకి వెళ్ళే పక్షుల్లా సేద తీరతాయి, భలే పోలిక. చాలా అందంగా అమరింది.. కోతలు అయ్యాక అని కవి అనటంలో అర్థం వేరే.. కోయాల్సిన కోతలు మాత్రం ఇంకా ఉన్నారు, కొడవళ్లు మరింత కక్కు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని భావన..
మహాకవి వాపోయినట్టు మనుషుల్లో పుట్టుకతో వద్ధులు ముందుయుగం దూతలు ఉన్నట్టే.. కొడవళ్లలో కూరలు తరిగేవి, ముదురు పనల పొలాలను కోసే కక్కు కొడవళ్లు వేరుగా ఉంటారు..
”కాగితప్పూల రెక్కలపై వాన చినుల్ని ఆడుకోనివ్వరేమో కదా..” క్షీణించిన స్వేచ్ఛకు పరాకాష్ట ప్రకటన ఇది. కానీ అంత బరువైన వేదన ఎంత సునితంగా చెప్పాడో గమనించండి..
”తోడు పడుకునేందుకు రాని స్నేహితుడి కోసం చేలోని జొన్న కంకులు పాలుకట్టవు” ఊస బియ్యమంత కమ్మగా ఉంది ఈ వాక్యం.. పాలకండె అంత అందంగా ఉంది.. మంచు రాత్రుల్లో మంచెల్లో చేల కావలిగా గ్రామాల్లో పాలకనుకుల వయ్యసంత పాలేర్లే ఉంటారు. జొన్న చేనును దళిత వర్గ కావలితనం స్థితిలోంచి, పహారాలో ఉన్న గిరిజన గూడేల దయనీయ దశ్యాన్ని ఒక్క వాక్యంలో దశ్యమానం చేశాడు..
”మనుషులు ఒకర్నొకరు పలకరించుకోటం కన్నా తడిపి ముద్దచేసే వానెక్కడ కురుస్తుంది ?” సమాజంపై కురవాల్సిన మనిషితనం కోసం ముసిరిన నల్లమబ్బు భావాలివి… అంటరాని తనం అనే మన్ను కప్పబడిన మనిషితనాలను మొలిపించాల్సిన చినుకులు కావా ఇవి ?…
”గాలిపటం కిందకు దిగిపోయాక ఆకాశం కళ్లెవరి కోసం అతతగా వెతుకుతాయి.. పడవెళ్లిపోయాక తీరమెందుకు దిగులు పడుతుంది, నీటిలోని చేపలు తమ కాలితో తన్నకపోతే నదిగుండె నరాలెంత చిక్కబడతాయి..” విరహాన్ని వియోగాన్ని కోల్పోతున్న తనాన్ని కవి ఇలా రొమాంటిసైజ్‌ చేశాడు. విప్లవ కవితలో ఇలాంటి ఎన్నో ప్రతీకల గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు.
సామాజిక రుగ్మతలు, సమస్యలపై భీమా నది గొంతుతో కవి పడ్డ ఆవేదన అభినందనీయం కానీ.. దేశం గాయాల బొబ్బల బాధితుల బర్నింగ్‌ వార్డ్‌ అక్షరాలు, వాక్యాలు పుస్తకాల లేపనాల పూతలతో బర్నింగ్‌ సమస్య తీరదు మారదు.. ఏసీ గదిలో కూర్చోని ఉక్కిరిబిక్కిరి స్థితిని గతిని నమోదు చేసి చల్లబడితే చాలదు..
హని బాబు, తేల్‌ తుంబ్డే, గౌతం నవ్‌ లఖా, సుధా భర్ధ్వాజ్‌, అరుణ్‌ ఫెరీరా, గోంజాల్వెజ్‌, వరవర రావు, సాయిబాబా తదితర హక్కుల కార్యకర్తలా ప్రత్యక్ష్య పోరాట కార్యాచరణ వాగ్దానమివ్వాలి.. అప్పుడే వర్గ సమాజం తన రాతల్ని విశ్వసిస్తుంది.. కావ్య గౌరవం పెంపొందుతుంది.

– శ్రీనివాస్‌ సూఫీ, 9640311380

]]>