Josh Archives - https://navatelangana.com/category/josh/ Sat, 12 Apr 2025 17:31:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Josh Archives - https://navatelangana.com/category/josh/ 32 32 నేటి త‌రానికి ఆద‌ర్శం అజ‌య్ ప్ర‌స్థానం https://navatelangana.com/todays-generation/ Sat, 12 Apr 2025 17:31:28 +0000 https://navatelangana.com/?p=544940 కృ‘రైతులు, యువత, సమాజాభివృద్ధి – ఈ మూడు మార్గదర్శక సూత్రాలతో నడుస్తున్న అజయ్ ప్రయాణం వ్యవసాయ విద్యార్థులకు స్పూర్తిగా, వ్యవసాయం చేసే రైతులకు అండగా నిలిచాయి. వ్యవసాయ, సామాజిక రంగాల్లో అతను చేస్తున్న విశేషమైన కృషికి గుర్తింపుగా ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సంకల్ప్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్‌ 2025’ ను అందుకున్న అతని పరిచయం…
నేటి సమాజంలో మార్పు తెచ్చే నాయకులు అరుదుగా మారిన వేళ విద్య, వ్యవసాయం, యువత అభివద్ధి అనే మూడు ముఖ్యమైన రంగాల్లో తన ప్రయాణాన్ని ఎంతో ప్రభావశీలంగా కొనసాగిస్తూ నవ సమాజ నిర్మాణంలో మార్గ దర్శకుడిగా నిలుస్తున్నాడు అజయ్.
బాల్యం నుంచే సామాజిక బాధ్యతతో…
నల్లగొండ జిల్లా, అనుముల మండలం, పంగవానికుంట గ్రామంలో శ్రీనివాస్‌, వెంకట రమణ దంపతులకు జన్మించిన అజయ్ చిన్ననాటి నుంచే విద్యలో ప్రతిభను, సమాజం పట్ల చైతన్యాన్ని కలిగి ఉన్నాడు. పదవ తరగతి నలంద విద్యాలయంలో ఉత్తమ ఫలితాలు సాధించి, ఉద్యాన విద్యలో డిగ్రీ, వ్యవసాయ విద్యలో పీజీతో పాటు సామాజిక శాస్త్రంలో పీజీ కూడా పూర్తి చేశారు. ఉత్తమ విద్యార్థి, అత్యుత్తమ ఉపాధ్యాయుడు, సమాజసేవలో నిబద్ధత, ప్రతి దశలో అజరు తన కషితో ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగాడు.
రైతుల అభివద్ధికి నిరంతర కషి:
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయం, నేటి కాలంలో అధిక పెట్టుబడులు, తక్కువ ఆదాయం, నేల నిస్సారత వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లను అధిగమించి రైతులకు ఉత్తమ మార్గదర్శకత్వాన్ని అందించేందుకు అజరు నిరంతర కషి చేస్తున్నాడు.
సేంద్రియ, ప్రకతి వ్యవసాయంపై అవగాహన: వేలాది మంది రైతులకు శిక్షణ అందించి, ఆరోగ్యకరమైన, సమర్థవంతమైన సాగు విధానాలను ప్రోత్సహించడం.
రైతులకు నిరంతర మద్దతు: తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ, ఉత్తమమైన వ్యవసాయ సలహాలు, మార్గదర్శకత్వం అందింస్తున్నారు.
తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం: రసాయన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక మార్గదర్శకత అందించి, రైతుల లాభాలను పెంచడంలో సహాయం చేస్తున్నారు.
నేలసారాన్ని పెంచే నూతన విధానాలు: మట్టిలో జీవం పెంచే సేంద్రియ,ప్రకతి-ఆధారిత వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు.
అజరు చేసిన ఈ విశేష కషి ఎంతో మంది రైతుల జీవితాలలో వెలుగులు నింపి, వారికి ఆర్థిక స్వావలంబనతో పాటు ప్రకతికి, నేలకు అనుకూలమైన వ్యవసాయ విధానాలను అందించడంలో కీలక పాత్ర పోషించింది.
విద్యలో వినూత్న మార్పులు…
వ్యవసాయ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన అజరు, విద్యను కేవలం పుస్తకాల పరిమితికి నిర్ధేశించకుండా, ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్పుతూ విద్యార్థుల్లో నిజమైన నైపుణ్యాలను అభివద్ధి చేశారు.
ఉద్యోగ అవకాశాల కోసం నిరీక్షించే పరిస్థితి రాకుండా, విద్యార్థులను వ్యవసాయ రంగంలోనే స్వయం ఉపాధి దిశగా ముందుకు నడిపేలా మార్గనిర్దేశం చేశారు.
అగ్రి-ఎంటర్‌ప్రెన్యూర్లుగా విద్యార్థుల ఎదుగుదల: వ్యవసాయాన్ని ఉపాధి అవకాశంగా మార్చి, పెద్ద సంఖ్యలో విద్యార్థులను వ్యవసాయ రంగంలోనే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు.
విద్య అనేది మార్కులకే పరిమితం కాదు: ఉపాధి అవకాశాలను నిర్మించేందుకు విద్యను దిశానిర్దేశం చేసి, విద్యార్థులకు స్వయం ఉపాధి మార్గాన్ని చూపించడంలో కృషి చేస్తున్నారు.
విద్య అనేది ఉద్యోగం కోసం కాకుండా, తమలో తమకు ఆత్మ విశ్వాసాన్ని కలిగించేదిలా వుండాలని ,స్వయంగా ఉపాధి కల్పించుకునే స్థాయికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో అజరు చేసిన ఈ కషి అనేకమంది విద్యార్థుల జీవితాలను మారుస్తోంది.
యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గదర్శకుడు:
వ్యక్తిత్వ వికాస శిక్షణ ద్వారా:
ల విద్యాలయాల్లో, యూనివర్సిటీలలో విద్యార్థులకు తన ప్రసంగాల ద్వారా సానుకూల దక్పథాన్ని పెంచేలా కషిచేయడం..
ల నాయకత్వ లక్షణాలను తీర్చిదిద్దుతూ యువతలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం
ల స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రేరేపిస్తూ వారిలో ఆత్మనిర్భరత పెంపొందించడం
ల సోషల్‌ మీడియా, వార్తా పత్రికల ద్వారా స్ఫూర్తిదాయకంగా మారుతూ, లక్షల మందికి మార్గదర్శకత్వం అందించడం
కరోనా సంక్షోభంలో:
ల గ్రామాల్లో కరోనా పట్ల అవగాహన కల్పించడం, హాస్పిటల్స్‌లో కరోనా బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, వారిలో ధైర్యాన్ని నింపడం జరిగింది
ల అలాగే కరోనా సమయంలో ఎంతో మందికి ఆర్థిక, మానసిక సహాయం అవసరమైన వారికి అండగా నిలిచిన మార్గదర్శి
”సేవాదక్పథమే నిజమైన నాయకత్వం” అనే సూత్రాన్ని తన జీవితంతోనే నిరూపించిన అజరు, ఎంతో మంది యువతకు ప్రేరణగా మారాడు..
గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణలో
ల ఎన్జీవోల సహకారంతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, యువతను స్వయం ఉపాధివైపు మళ్లించడం..
ల వ్యవసాయ ఆధారిత వ్యాపారాలపై అవగాహన పెంచి, గ్రామీణ యువతను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దడం
ల ప్రభుత్వ పథకాల గురించి సద్వినియోగ మార్గదర్శనం అందించి, వారి భవిష్యత్తుకు దారులు చూపడం
ల కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించి, గ్రామీణ యువతలో వినూత్న ఆలోచనలకు ఉత్తేజం కలిగించడం
”ఆర్థిక స్వావలంబన కలిగిన యువతనే శక్తివంతమైన భవిష్యత్తును నిర్మించగలరు” అనే సంకల్పంతో, అజరు తన ప్రయాణాన్ని విస్తరిస్తూ, ఎంతో మంది గ్రామీణ యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నారు..
భవిష్యత్తు లక్ష్యాలు:
రైతుల ఆర్థిక భద్రత: పెట్టుబడులను మరింత తగ్గించేందుకు వినూత్న వ్యవసాయ విధానాలను రూపొందించడం
అగ్రి-ఎంటర్‌ప్రెన్యూర్ల అభివద్ధి: యువతను పెద్ద ఎత్తున వ్యవసాయ పారిశ్రామిక రంగంలోకి ప్రోత్సహించి స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం
సేంద్రియ, ప్రకతి వ్యవసాయం విస్తరణ: దేశవ్యాప్తంగా సేంద్రియ,ప్రకతి సాగు విధానాలను విస్తరించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించడం, నేల సారవంతతను పెంచి, ప్రకతిని కాపాడే విధానాలను వీలైనంత ఎక్కవ మంది రైతులకు చేరువ చేయడం
వ్యక్తిత్వ వికాస శిక్షణ: ఇంక ఎంతో మంది యువతకు, వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి నమ్మకంతో, బాధ్యతతో జీవించేలా చేయడం.. అజరు ముందున్న భవిష్యత్తు లక్ష్యాలు.
మార్గదర్శి జీవిత యానం!
రైతుల, యువత, సమాజ అభివద్ధి” అనే త్రిసూత్రాన్ని నమ్ముకుని నడుస్తున్న అజరు, కేవలం మాటల్లోనే కాదు, తన జీవితంలోనే దాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు. అంతే కాకుండా తన కషితో ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలుస్తూ, వేలాదిమందికి స్ఫూర్తిగా మారాడు.
ఈ ప్రేరణాత్మక ప్రయాణం ఇంకా అనేక మందికి వెలుగునిచ్చే దీపంలా మారాలని మనసారా కోరుకుందాం!
– యస్వర్ధన్‌
9676404318

]]>
కళ్ల ముందు జరిగే సంఘటనలే తన కవిత్వం https://navatelangana.com/the-events-that-take-place-in-front-of-the-eyes-are-his-poetry/ Sat, 05 Apr 2025 18:33:41 +0000 https://navatelangana.com/?p=540154 తన కవిత్వంతన కళ్ల ముందు జరిగే సంఘటనల్ని.. కదిలించే సన్నివేశాల్ని.. కవితలుగా రాస్తూ నేటి తరంలో మేటి రచయితగా రాణిస్తున్నాడు ఈ యువకుడు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూనే తను అక్షరాలను ఒద్దికగా రాస్తున్నాడు. తెలుగు భాషపై మంచి పట్టు, సాహిత్యంపై మక్కువతో భాషాభిమాని అనిపించుకున్నాడు. ఇప్పటికే రెండు కవితా సంపుటాలను వెలువరించి ప్రముఖల ప్రశంసలు అందుకుంటూ.. సాహిత్యలోకంలో తన బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నాడు ఈ మూడు పదుల యువకుడు. అతడే నాయిని గోవర్ధన్‌ రెడ్డి.
కలంతో కుస్తీ పడుతున్న గోవర్ధన్‌ ది మెదక్‌ జిల్లా శివంపేట మండలం కొత్తపేట్‌ గ్రామం. అమ్మ తారమ్మ, నాన్న జనార్ధన్‌ రెడ్డి. అక్క గీత తమ్ముడి ఆసక్తిని నిరంతరం ప్రోత్సహిస్తుంది. 2016లో కీర్తనతో వివాహమైంది. వీరి ఏకైక కుమార్తె ప్రణవి. గోవర్ధన్‌ ప్రతి విజయం వెనుక ఆమె అందించిన సహకారం ఎంతో గొప్పది. పాఠశాల స్థాయి నుండి వాలీబాల్‌ ఆటపై ఆసక్తితో అనేక మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బి.పి.ఇడి) కోర్సును పూర్తి చేసి 2012 డి.ఎస్సీ ద్వారా ప్రభుత్వ వ్యాయమ ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 2012 నుండి జెడ్‌ పీ హెచ్‌ ఎస్‌ ఏటిగడ్డ కిష్టాపూర్‌ మండలం, తొగుట, సిద్దిపేట జిల్లా నందు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఆ పాఠశాల నుండి అనేక మంది విద్యార్థులను, క్రీడాకారులుగా తయారు చేసి వివిధ క్రీడలలో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గోనేలా వారిని ప్రోత్సహించాడు.
సమాజమే కవిత్వం
సమాజంలో జరిగే సంఘటలు, వాటి వెనక విషయాలను పరిశీలించి.. రచయితగా మారినట్లు చెబుతాడు గోవర్ధన్‌. ‘For all good poetry is spontinous overflow of power feel-ings! – William words worth. కవిత్వమంటే ఏదోకాదు మనసులో మేదిలే ఆలోచనలను అక్షరాల్లో పేర్చి తరువాతి తరాలకు లిఖిత పూర్వకంగా అందజేసే మహత్తర ప్రక్రియ. కవిత్వము మనసు పొరల్లోంచి తన్నుకొచ్చే శక్తివంతమైన భావనల సమ్మేళనం. కవిత్వం ఒక సజనాత్మక సాహితీ ప్రక్రియ, అన్వేషణ, ఆవేదన, వ్యక్తపరచటం నిరంతర అధ్యయనంతో కవిత్వంతో రాటు దేలుతుంది. కవిత్వాన్ని చేపట్టిన గోవర్ధన్‌ రెడ్డి కషికి ‘కందిలిలి ఒక నిదర్శనం మాత్రమే.
గోవర్ధన్‌ జీవితం చిన్ననాటి నుంచే ఎత్తుపల్లాలను చవిచూసింది. అనుభవం నేర్పిన పాఠాలు, మరణించిన నాన్నను మననం చేసుకుంటూ తల్లి చెప్పిన తొవ్వలో నడుస్తూ తొవ్వంటి కనపడుతున్న బతుకుల్ని కవిత్వీకరిస్తున్నది. కవిత్వంలోకి మనము ప్రవేశించేలా, తనవైపు తిప్పుకుంటున్న తన కవిత్వానికున్న శక్తి మనల్ని చదివిస్తుందంటే అతిశమోక్తి కాదు. ఇష్టమైన పనిని ఎవరైనా మనసు పెట్టి చేస్తారు. అది మనసుల్ని కదిలించేలా ఉంటే.. గుర్తింపు వెతుక్కుని మరీ వస్తుంది. సమాజంలో చోటుచేసుకునే విషాదాలు, మూఢనమ్మకాల విపరిణామాలే తన కవితాంశాలుగా మినీ కవిత్వమై ప్రశ్నిస్తున్నాడీ యువకవి. సహజ వచన శైలితో సరళ వాడుక భాషలో సొంత గొంతుతో కలవరిస్తూ పలవరించే నిలువెత్తు నిరసన స్వరం గోవర్ధన్‌ రెడ్డి. ముక్కుసూటితనం ఎక్కువ. వస్తు విస్తతితోపాటు పలు సామాజిక సమస్యల్ని విభిన్న కోణాల్లో ఎండగడుతూ తూర్పారబెట్టడం ఈ కవి అంతర్గత చైతన్య దష్టిని తేటతెల్లం చేస్తుంది.
‘మూఢాచారపు/ చెరలో చిక్కిన ఆ మోహననారి/ సమ్మోహన శవాలకు/ తానొక స్మశానం’ అంటాడు. జోగిని మినీ కవిత్వంలో. తెలంగాణ సామాజిక వ్యవస్థలో అత్యంత అవమానకర సామాజిక దురాచారాలైన జోగిని, దేవదాసి వ్యవస్థలు మతం ముసుగులో దళిత స్త్రీల లైంగిక బానిసత్వాన్ని, సామాజిక దోపిడీని ప్రతిబింబిస్తాయి. భారతదేశ చరిత్రలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు సామాజిక పరిణామక్రమాన్ని పరిశీలిస్తే అనేక సామాజిక దురాచారాలు క్రమక్రమంగా తొలగిపోయాయి. కానీ జోగిని, దేవదాసి వ్యవస్థలు మాత్రం నేటికీ తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొనసాగుతూనే ఉండటాన్ని బట్టి వీటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆ దూరాచారంపై తన కవిత్వం ఎక్కుపెట్టాడు గోవర్ధన్‌.
‘మంత్రతంత్రాల చింతలు/ మనిషి మస్తిష్కంలో/ గెరిల్లా యుద్థతంత్రాలై భ్రమిస్తుంటే / తన తలరాతకు/ తాయత్తే తాహత్తని తలుస్తూ/ హేతుతత్వ తలంపులకు/ తిలోదకాలిచ్చిన వైనమది..%-% అంటూ మూఢనమ్మకం కవిత ద్వారా సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతపై తన కలాన్ని ఝుళిపించాడు. సమస్యలు మూఢత్యంలో నుంచి పుట్టినవి అయినా, మరేరకమైన సమస్యలు అయినా.. వాటి పరిష్కారం మాత్రం భౌతిక వాస్తవికత ద్వారానే సాధ్యమవుతాయి. అంతేతప్పా.. మాయలు మంత్రాలు, క్షుద్రపూజలు వంటి అశాస్త్రీయమైన మార్గాలేవి ఉండవు. ఇలాగాకుండా.. పూజలు, ప్రార్థనలు, ప్రసాదాలు, మంత్రించడాలు, శివసత్తులు అభయమివ్వడం, ఆయిల్‌ పూయడం, సేవించడం లాంటివి ప్రయోగిస్తే, ఏమీ
ఫలితముండదు. వ్యాధి ముదిరి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాపోతారని బలంగా నమ్మిన యువకుడు గోవర్ధన్‌. కాబట్టే సమాజాన్ని చైతన్యపరిచే పనికి కలంతో సమాయత్వం అయ్యాడు.
అలిశెట్టి ప్రభాకర్‌కు ఎంతో పేరు తెచ్చిన వేశ్య కవిత- ‘తను శవమై../ ఒకరికి వశమై…/ తనువు పుండై…/ ఒకడికి పండై../ ఎప్పుడూ ఎడారై…/ ఎందరికో ఒయాసిస్సై..’లో ఉన్నవి మొత్తం పన్నెండు పదాలే. ‘వేశ్య కవిత అంటే గుర్తుకు వచ్చేది అలిశెట్టి ప్రభాకరే. ‘వేశ్య కవితను గోవర్థన్‌ కూడా అంతే ఘాటుగా రాశాడు. ‘ విటులకు వెలయాలై/ సంభోగ సాగరంలో టైటానిక్‌ లా/ మునిగిపోతున్న తన జీవితం/ లైఫ్‌ లైబ్రరీలో ఒక ట్రాజెడి పుస్తకం ‘గా వేశ్య జీవితాన్ని అలతి అలతి పదాలతో చిత్రిస్తాడు గోవర్థన్‌. అలిశెట్టి అక్షరాలు ద్వారా పొందిన స్ఫూర్తితో ‘ అలిశెల్టి అక్షరాలను చదువుతుంటే/ సమాజానికి పట్టిన దూర్నీతి స్వేదాన్ని తుడుస్తూ/ అడవి మెడపై వాలిన/ ఎర్రటి జేబురుమాళ్లను చూస్తున్నట్టుంది అంటాడు ఈ యువకవి.
వ్యాయామ ఉపాధ్యాయుడే కాకుండా అతనికున్న సాహిత్యాభిలాషతో సాహిత్యరంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ధరిత్రి సాహితీ సమూహం వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీల్లో ”చిత్తు కాగితం” అనే కవితకు గాను రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి అందుకున్నాడు. మూఢ నమ్మకాలు అనే కవితకు గాను తెలంగాణ సాహితి నుంచి ప్రథమ బహుమతిని అందుకున్నాడు. 2018లో అనేక సామాజిక అంశాలతో కూడిన గోవర్ధన్‌ రెడ్డి కవితా సంపుటి ‘కందిలి’ని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం ఆవిష్కరించారు.
వర్తమాన సమాజం పట్ల నిబద్దత , రాజకీయ పరిజ్ఞానం , ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం ఇలా కవిత్వం రాయడానికి సరిపడా సరంజామా అంతా ఇతని దగ్గర సిద్దంగా ఉంది. వస్తు ఎంపిక, నిర్వహణ బాగుంది. ఇంకాస్త స్పష్టత ఉంటే అలిశెట్టి ‘చురకలు%-%లా సమాజానికి చురకలు అంటించవచ్చు.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

]]>
లిటిల్ మూవ్ యాప్ https://navatelangana.com/little-move-app/ Sat, 29 Mar 2025 16:34:35 +0000 https://navatelangana.com/?p=535230 Little Move Appఉరుకులు పరుగుల జీవితం పిల్లలను బడిలో దింపే తీరిక, ఓపిక నేడు తల్లిదండ్రులకు లేవు. తల్లిదండ్రులకు ఆఫీస్‌ టైమింగ్స్‌, పిల్లల స్కూల్‌ టైమింగ్స్‌ దాదాపు ఒకటే కావడం అందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో వారి అలానా పాలనా చూసుకోవడానికి ఆపసోపాలు పడుతుంటారు. స్కూల్‌ కు పంపడం దగ్గర నుంచి వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చే వరకు నానా హైరానా పడిపోతుంటారు. ఎవరైనా ఇలాంటి పనులకు సాయంగా ఉంటే బాగుండునని మనస్సులో అనుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అమ్మమ్మో, తాతాయ్యయో పిల్లలకు తోడుగా స్కూల్‌కు తీసుకెళ్లి తీసుకొస్తుంటారు. కానీ పట్టణ ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉంటుంది. దంపతులు ఇద్దరూ పనికి వెళ్తేగాని పూటగడవని పరిస్థితి ఉంటుంది. ఈ తరహా కుటుంబాలు తమ పిల్లలను స్కూల్‌ పంపడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తుంటాయి. దానికి చక్కని పరిష్కారమే లిటిల్‌ మూవ్‌ యాప్‌.
ఉదయం 9 గంటల లోపు.. సాయంత్రం 4 నుంచి 6 మధ్య ప్రధాన రహదారులు మొదలుకుని హైవేలు, కాలనీ రోడ్లపై చూస్తే పాఠశాలల నుంచి చిన్నారులతో కిక్కిరిసి వస్తున్న ఆటోలు కనిపిస్తాయి. డ్రైవర్‌కి ఇరువైపులా కూర్చొని కొందరు, లోపల సీట్లు నిండిపోగా బయటకు వేలాడుతూ మరికొందరు.. వెనుక తెరిచిన డోర్‌ పై కూర్చొని కాళ్లు కిందకు ఆనుతుండగా అవస్థలు పడుతూ ఇండ్లకు వస్తుంటారు. ముగ్గురు ప్రయాణించాల్సిన ఆటోలో పది మంది విద్యార్థులను, ఆరుగురిని తీసుకెళ్లాల్సిన ఆటోలో 15-20 మంది విద్యార్థులను ఎక్కిస్తున్నారు. ఇక పుస్తకాల బ్యాగులు, భోజనం క్యారియర్లు, వాటర్‌ బాటిళ్లతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తున్నది. దీంతో తెలిసినా వ్యక్తలతోగానీ, ఆటో, రిక్షా, ఆటో క్యాబ్‌లు తదితర వాహనాల్లో తమ పిల్లలను రోజూ స్కూల్‌ పంపడానికి నీత్య కష్టాలు పడుతుంటారు. ఇంకొందరు తమ పిల్లలను సొంత వాహనాలపై బడికి తీసుకెళ్లి, తీసుకొస్తుంటారు. స్కూల్‌ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తుంటారు. అంతేకాదండోయో.. స్కూల్‌ నుంచి ఆ పిల్లలు తిరిగొచ్చేవరకు మనుస్సులో ఒకటే బేంగతో ఇంటిగడప ముందు కంట్లో ఒత్తులు వేసుకొని వేచి చూస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నగానీ పిల్లల భద్రతపై తల్లిదండ్రలు ఒక్కింత ఆందోళనకు గురైవుతుంటారు. బ్యాగులను ఆటోకి ఇరువైపులా తగిస్తుండడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి. ఈ తరహా సమస్యలకు చెక్‌ పెడుతూ కర్నాటకకు చెందిన కాలేజ్‌ విద్యార్థులు ముగ్గురు వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.
బెంగుళూర్‌కు చెందిన రాహుల్‌ వర్మ, హరీశ్‌ సింగ్‌, ప్రేమ్‌ కుమార్‌ వర్మలు.. పిల్లలకు భద్రతకు అధిక ప్రాధ్యాన్యత ఇస్తూ.. లిటిల్‌ మూవ్‌ పేరుతో ఓ రవాణా సేప్టీ యాప్‌ను రూపొందించారు. అందుకు మొత్తం మూడు యాప్‌లను రూపొందించారు. ఒక్కటి స్కూల్‌ వివరాలను తెలుపగా, మరొకటి పిల్లల తల్లిదండ్రులకు, ఇంకొటి స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్ల కోసం మూడు యాప్‌లను డైవలప్‌ చేశారు… వాటితో ఎప్పటికప్పుడు పిల్లల లోకేషన్‌, స్కూల్‌ బస్సు వచ్చే టైం కోడ్‌ ఆప్‌ డేట్‌ అవుతుంది. దీంతో విద్యార్థుల స్కూల్‌కు వెళ్లిన దగ్గర నుంచి.. ఇంటికి తిరిగొచ్చే వరకు ప్రతి మూమెంట్‌ను ఆ యాప్‌ ద్వారా గమనించివచ్చు. డ్రైవర్ల యాప్‌లో బస్సు రూట్‌తోపాటు లైవ్‌ లొకేషన్స్‌ వివరాలను తెలుపుతుంది. యాప్‌లో మూడు బటన్స్‌ ఉంటాయి. ఆరెంజ్‌ బటన్‌ ఆన్‌బోర్డింగ్‌, గ్రే రంగు బటన్‌ డీబోర్డింగ్‌ తెలుపగా.. ఎర్రపురంగు బటన్‌ పిల్లల గైర్హజరును తెలియజేస్తాయి.
ఒకవేళ బస్సు ట్రాఫిక్‌ లో ఉండిపోవడం, తమ రూట్‌కు బస్‌ ఆలస్యంగా రావడం వంటి తదితర వివరాలను యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వేరే వాహనాలను తల్లిదండ్రులు ఆశ్రయించొచ్చు. విద్యార్థుల హాజరు శాతంపై ప్రభావం తగ్గుతుంది. బస్సు ఏ టైంకు ఎక్కడికి వెళ్తోందో ఖచ్చితమైన సమయాన్ని యాప్‌ ద్వారా తెలిసిపోతుంది. అంతే కాకుండా యాప్‌ ద్వారా పిల్లల తల్లిదండ్రులతో డ్రైవర్ల ఫోన్‌ కూడా మాట్లాడొచ్చు. పిల్లల తల్లిదండ్రుల కోసం రూపొందించిన యాప్‌లో… పిల్లల ఆరోగ్య పరిస్థితులు, స్కూల్‌కు వచ్చేది రానిదీ… తదితర వివరాలు ఆ యాప్‌లో పోస్ట్‌ చేయొచ్చు అని తెలిపారు. దీంతో డ్రైవర్లు మన రూట్‌కు రాకుండా వేరే స్టాప్‌కు వెళ్తారని యాప్‌ రూపకర్తలు తెలిపారు. దీంతో వారికి టైం సేవ్‌ అవుతుంది. అంతే కాకుండా గుర్తింపులేని రవాణా సంస్థలను ఆశ్రయించనప్పుడు బీ2బీ మోడల్‌ పద్ధతిలో డ్రైవర్‌తో పాటు వెహికిల్‌ లోకేషన్‌ ను కనిపెట్టొచ్చు.
ఇంకా స్కూల్‌ కోసం రూపొందించిన యాప్‌లో విద్యార్థుల పూర్తి బయోడేటా తోపాటు ఆ విద్యాసంస్థలకు సంబంధించిన ఆయా బస్సు రూట్ల వివరాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఎప్పటికప్పుడు విద్యార్థుల రూట్‌ ట్రాక్‌ చేయవచ్చు. ఢిల్లీ నోయిడాలోని ఓ స్కూల్‌లో ప్రయోగాత్మకంగా ఈ లిటిల్‌ మూవ్‌ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ విజయవంతంకావడంతో పలు స్కూల్‌ యాజమాన్యాలు కూడా ఈ యాప్‌ను వాడకం పట్ల మక్కువ చూపుతున్నాయి. పాఠశాల రవాణా నిర్వహణ సాఫ్ట్‌వేర్‌ అనేది AI-ఆధారిత రవాణా వ్యవస్థ, ఇది నెలకు విద్యార్థికి కేవలం 40-50 రూపాయలకు లభిస్తుంది. ఇది ఖర్చు తక్కువ భద్రత ఎక్కువ.
– దామచర్ల ఉపేందర్‌,
7093937730

]]>
స్టూడేంట్ కేరాఫ్ స్టూడేంట్ ట్రైబ్ https://navatelangana.com/student-keraf-student-tribe/ Sat, 22 Mar 2025 17:37:11 +0000 https://navatelangana.com/?p=529811 Student Care of Student Tribeఏ దేశానికైనా శక్తివంతమైన యువత పెట్టనికోట. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది. మన దేశానికి ఇదే అతిపెద్ద వనరు. యువత బాగుంటే దేశం బాగుంటుంది. యువత ప్రగతిపథంలో దూసుకెళ్తే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడుతుంది. ”కొంతమంది యువకులు ముందుయుగం దూతలు /భావన నవజీవన బృందావన నిర్మాతలు” అని శ్రీశ్రీ అన్నట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికత, వినూత్న నైపుణ్యాలను అందిపుచ్చుకుంటోంది ఈతరం యువత.
క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం… లేదా స్టార్టప్‌ పెట్టేయడం.. సక్సెస్‌ కొట్టేయడం… మీడియా కథనాలు చూస్తుంటే… మంచినీళ్ల ప్రాయమన్నట్టు తోస్తుంది… నిజానికి అది అంత సులభమా? అయితే ఇప్పటికే ఎంతమంది ఇంజినీరింగ్‌ చేసినవారు ఖాళీగా ఎందుకు ఉంటారు? అనే ప్రశ్నలు రాక మానవు. మీడియా కథనాలు వేరు… వాస్తవాలు వేరు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలే చూడని కాలేజీలు మన రాష్ట్రంలోనే కోకొల్లలు. ఇక స్టార్టప్‌ల సంగతి సరేసరి. స్టార్టప్‌లు పెట్టి సక్సెస్‌ అయిన వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు అత్యున్నత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది ‘స్టూడెంట్‌ ట్రైబ్‌’. ఒక స్టార్టప్‌ లాంటి ఈ వేదిక ఏదైనా డిగ్రీ, ఆ పైన చదువులు చదువుతున్న విద్యార్థులకు ఈ తరం సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను అందజేస్తూ.. మరోవైపు పరిశ్రమలో వారికి అవకాశాలను చేరువ చేస్తోంది. 6 లక్షలకు పైగా స్టూడెంట్‌ నెట్‌వర్క్‌తో విభిన్న వేదికల్లో విద్యార్థులకు అవగాహన అవకాశాలను కల్పిస్తోంది. అలాంటి వాళ్లని ఇతర విద్యార్థులతో అనుసంధానించి… అద్భుతాలు చేస్తోంది ‘స్టూడెంట్‌ ట్రైబ్‌’! ఫ్రెండ్‌షిప్‌తో పాటు స్కాలర్‌షిప్‌లూ అందించే అతిపెద్ద స్టూడెంట్‌ కమ్యూనిటీ ఇది!
ఎలా వచ్చిందీ ఆలోచన
‘ఎక్స్‌పోజర్‌…’ చిన్న పదమే కావచ్చు కానీ దాని ప్రభావం చాలా పెద్దది. విద్యార్థుల ఎదుగుదలలో అదే అత్యంత కీలకమైంది. వాళ్లవాళ్ల అభిరుచుల్లో ఎక్స్‌పోజర్‌ తప్పనిసరి. కానీ ఇలాంటి ఎక్స్‌పోజర్‌ హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లో విద్యార్ధులకు దొరకొచ్చు. ఓ మోస్తరు నగరాల్లోనూ చదివే విద్యార్థులకి పర్వాలేదు అన్నట్టు ఉన్నా, అదే పట్టణాలూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ చదివేవాళ్లకి మాత్రం అందని దాక్షగానే ఉంది. పేరుకి డిగ్రీ చదువుతారు కానీ ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్‌ ఉండవు. అందువల్లే కంపెనీలేవీ వాళ్ల దగ్గరకి క్యాంపస్‌ ఇంటర్వ్యూకు రావు. ఇక స్టార్టప్‌లు పెట్టడానికో… ఇన్‌క్యుబేషన్‌లకో అవకాశమే ఉండదు! ఇన్ఫోసిస్‌ సంస్థ హెచ్‌ఆర్‌ నిపుణుడిగా ఇలాంటి కాలేజీలనీ విద్యార్థులనీ చూసిన మన హైదరాబాదీ యువకుడు శ్రీచరణ్‌ లక్కరాజుకి వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది. తనకున్న అనుభవంతో- ఓ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థని ఏర్పాటుచేసి కోచింగ్‌ క్లాసుల్లాంటివి పెడితే… బాగానే సంపాదించి ఉండేవాడేమో కానీ అతను అటు వెళ్లలేదు. బదులుగా- ఈ విద్యార్థుల్ని ‘మంచి ఎక్స్‌పోజర్‌’ ఉన్న ఇతర విద్యార్థులతో కలపాలనుకున్నాడు. కోచింగ్‌ క్లాసులు ఇవ్వలేని స్ఫూర్తిని ఫ్రెండ్‌షిప్‌ ఇస్తుందని భావించాడు! ఆ ‘నెట్‌వర్క్‌’ మంచి అద్భుతాలు చేస్తుందని నమ్మాడు! అలా- 2014లో ‘స్టూమ్యాగ్జ్‌’ అనే ఆన్‌లైన్‌ స్టూడెంట్‌ కమ్యూనిటీని ప్రారంభించాడు. ప్రతి కాలేజీకీ వెళ్లి, విద్యార్థుల్ని కలిసి అక్కడ స్టూమ్యాగ్జ్‌ కమ్యూనిటీలని ఏర్పాటుచేశాడు. వాళ్లలో కాస్త రాయగలిగేవాళ్ల చేత వివిధ విద్యా ఉద్యోగావకాశాలకి సంబంధించిన అంశాలపైన వ్యాసాలు రాయించేవాడు. వాటితోపాటూ నిపుణుల ద్వారా ఇంటర్న్‌షిప్‌లూ ఉద్యోగావకాశాల వివరాలని అందిస్తుండేవాడు. ఈ సైట్‌ కోసమే ఇన్ఫోసిస్‌ ఉద్యోగాన్నీ వదిలేశాడు శ్రీచరణ్‌. ఈ సైట్‌తో ఆదాయం పెద్దగా రాదని అందరూ అంటున్నా… మా క్యాంపస్‌కి రావొద్దని కాలేజీ యాజమాన్యాలు కొన్ని మోకాలడ్డినా మొండిగానే ముందుకెళ్లాడు. మెల్లగా సైట్‌కి వచ్చే ప్రకటనలతో ఆదాయం రాసాగింది.
నాలుగో ఏట ఈ నెట్‌వర్క్‌లోని విద్యార్థుల సంఖ్య మూడులక్షలకి చేరింది! దాంతో ఫోర్బ్స్‌ సంస్థ తమ ’30 అండర్‌ 30′ జాబితాలో శ్రీచరణ్‌ పేరుని చేర్చింది. నెట్‌వర్క్‌లో ఉన్నవాళ్ల సంఖ్య ఐదు లక్షలకి చేరింది. అప్పుడే ఓ కొత్త పోకడకి శ్రీకారం చుట్టాడు శ్రీచరణ్‌. విద్యార్థులందరూ ప్రత్యక్షంగా కలిసే ఒరవడిని ప్రారంభించాడు. విద్యార్థుల దగ్గరికే పారిశ్రామికవేత్తలూ నిపుణులూ వచ్చి మాట్లాడేలా రకరకాల కార్యక్రమాలని రూపొందించాడు. పనిలో పనిగా తన సంస్థకి ‘స్టూడెంట్‌ ట్రైబ్‌’ అని పేరుమార్చాడు!
స్టూడెంట్‌ ట్రైబ్‌
స్టూడెంట్‌ ట్రైబ్‌ అనేది స్టూడెంట్‌ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌. విద్యార్థులను నైపుణ్యాలకు అనువైన బ్రాండ్స్‌కు అనుసంధానం చేస్తోంది. గిగ్‌ వర్క్‌ ఇంటర్నీషిప్‌, వలంటీర్‌, ఫుల్‌టైమ్‌గా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన, స్కిల్స్‌ మెరుగు పర్చుకోవడంతో పాటు సర్టిఫికెట్లు పొందవచ్చు. స్థిరమైన భవిష్యత్‌ వద్ధికి అంతులేని అవకాశాలను సష్టిస్తోంది. టెక్నాలజీ నుంచి మార్కెటింగ్‌, డిజైన్‌ వరకు ప్రతి అవకాశాన్ని దగ్గర చేరుస్తోంది. 2022లో ప్రతి నెలా చివరి శనివారం విద్యార్థుల కోసం ‘ట్రైబ్‌ మీట్‌’లని ఏర్పాటుచేస్తున్నట్టు పిలుపునిచ్చాడు శ్రీచరణ్‌. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల కాలేజీల నుంచి కేవలం నలుగురే వచ్చారట! అయినా వెనకడుగు వేయలేదు. ఈసారి కాలేజీలకెళ్లి ఈ భేటీల గురించి ప్రచారం చేశాడు. దాంతో రెండో కార్యక్రమానికి మూడొందల మంది వచ్చారు. డ్రోన్స్‌, ఏఐ రంగాలకి చెందిన నిపుణుల్ని రప్పించి అక్కడున్న అవకాశాల గురించి చెప్పించాడు. సినిమా రంగంలోని వాళ్లని పిలిపించి అక్కడి సాధక బాధకాలని వివరించేలా చేశాడు. ఇది క్లిక్‌ అయ్యింది. ఆ తర్వాతి నెల నుంచి ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల హాజరు 1500 పైచిలుకే ఉంటోంది. రూ.11 ఎంట్రీ ఫీజుతో- ల్యాప్‌టాప్‌లూ మొబైళ్లూ అతితక్కువ ధరకి కొనేలా కూపన్‌లూ అందించడం మొదలుపెట్టారు. దీంతోపాటూ- స్టూడెంట్‌ ట్రైబ్‌ బృందంవాళ్లే వివిధ రంగాల నిపుణుల్ని తీసుకుని కాలేజీలకు వెళ్లే ‘ట్రైబ్‌ ఫెస్ట్‌’ అనే కార్యక్రమాలూ చేస్తున్నారు.
ఇక ‘ప్రోస్ట్‌’… ఏడాదికోసారి నిర్వహించే అతిపెద్ద విద్యార్థుల ఉత్సవం. స్ఫూర్తి, వినోదం, విజ్ఞానాల మేలుకలయికగా ఉండే ఈ కార్యక్రమానికి ఇటీవల పదివేల మంది విద్యార్థులు హాజరయ్యారు! ఈ ఉత్సవంలో ‘దియా స్కాలర్‌షిప్‌’ పేరుతో ఓ నిరుపేద విద్యార్థినికి రూ.50 వేలు సాయం అందిస్తారు! ఈ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు… వీళ్లు నిర్వహించే ‘ఎస్టీ 33’ మరో ఎత్తు!
నైపుణ్య శిక్షణ…
ఈ వేదిక దాదాపుగా ఆరు లక్షలకు పైగా విద్యార్థులతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైగా కాలేజీలతో అనుసంధానమై ఉంది. సోషల్‌ మీడియా వేదిక ఇన్‌స్ట్రాగామ్‌లో 4.5 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. టైర్‌%-%2, టైర్‌%-%3నగరాల్లో సేవలు అందించడంతో పాటు వారికి అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. విద్యార్థులు సంపాదించిన డబ్బు అటు చదువు, ఇటు ప్యాకెట్‌ మనీకి ఉపయోగపడుతుంది. బ్రాండింగ్‌, ఉపాధి అవకాశాలు, నైపుణ్యం అభివద్ధి అనే మూడు అంశాలపై సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక యాప్‌ ఆవిష్కరించి అవకాశాలు, వర్క్‌షాప్‌లు, వెబినార్స్‌ తదితర కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ వంటి ఏదైనా డిగ్రీ చేసిన విద్యార్థులు ఈ సేవలను ఉచితంగానే పొందవచ్చు.
గ్రామీణ విద్యార్థులకి సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిజైనింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ అందించే కార్యక్రమం అది. ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న నిపుణులే ఈ శిక్షణ అందిస్తారు. రూ.15 వేల నుంచి లక్ష రూపాయలదాకా ఫీజు ఉంటుంది. చక్కటి ప్రతిభ కనబరిచినవారికి మొత్తం ఫీజు తిరిగిచ్చేస్తారు. ప్రారంభించిన నాలుగునెలల్లోనే ఈ శిక్షణ ద్వారా 120 మంది విద్యార్థులకి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఏదేమైనా ఈ కార్యక్రమాల ద్వారా స్టూడెంట్‌ ట్రైబ్‌ సభ్యుల సంఖ్య ఆరున్నర లక్షలకి చేరింది. దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ స్టూడెంట్‌ కమ్యూనిటీగా గుర్తింపు సాధించింది! విద్యార్థులకి సంబంధించిన ఉత్తమ వేదికగా ఎన్నో అవార్డులూ అందుకుంది.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

]]>
బహు భాషా ప్రవీణుడు https://navatelangana.com/multi-linguistic/ Sat, 15 Mar 2025 17:15:40 +0000 https://navatelangana.com/?p=524351 Multilingualమీకు ఎన్ని భాషలొచ్చు? మహా అయితే మూడో, నాలుగో భాషలు వచ్చు. అది కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీషు.. ఇంకా? ఈ మూడేనా? నాలుగైదు భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? అంటే చెప్పడం కష్టం. తెలంగాణ రాష్ట్రంలో బహుబాషావేత్త అనగానే మనకు తొలుత గుర్తుకు వచ్చేది మన మాజీ ప్రధాని పి.వి.నర్సింహారావే. ఆ తరువాత నలిమెల భాస్కర్‌, ఇటు నల్లగొండలో అయితే నోముల సత్యనారాయణ గుర్తుకు వస్తారు. వీరిలో కూడా పి.వి కే దాదాపు 16 భాషలు వచ్చు. వీరు కాకుండా మరి కొన్ని భాషలు మాట్లాడే వారు ఉండవచ్చు. మాట్లాడటం సరే, వాళ్లు ఆ భాషలు రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మహమూద్‌ అక్రమ్‌. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాలా 400 భాషలు. అంతేకాకుండా, సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికి మూడు ప్రపంచ రికార్డులు సాధించాడు.
తమిళనాడు అభిరామం గ్రామానికి చెందిన అబ్దుల్‌ హమీద్‌, అమీనాల్‌ బేగంల పెద్ద కుమారుడు మహమూద్‌ అక్రమ్‌. తండ్రి ఉద్యోగరీత్యా రకరకాల దేశాలకు వెళ్లేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థంకాక, వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్‌ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. దాంతో తండ్రి అక్రమ్‌కు నాలుగేళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. ఆరు రోజుల్లో మొత్తం ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకున్న అక్రమ్‌, మూడు వారాల్లో తమిళంలోని 299 అక్షరాలను నేర్చేసుకుని ఆ చిన్నవయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తమిళనాడులోని పెని జిల్లాకు చెందిన మహమూద్‌ భాషలలోకి ప్రయాణం కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే ప్రారంభమైంది. అతని తల్లిదండ్రులు అతనికి ఇంగ్లీష్‌, ప్రాథమిక భాషా నిర్మాణాలను పరిచయం చేశాడు. మహమూద్‌ భాషా నైపుణ్యం చాలా చిన్న వయసులోనే స్పష్టంగా కనిపించింది. ”నేను తరచుగా వివిధ దేశాలకు వెళ్లేవాడిని, నా కొడుకు భాషలపై తీవ్రమైన ఆసక్తిని పెంచుకున్నాడు. అతను ఇంత త్వరగా, అప్రయత్నంగా ఇన్ని భాషలు నేర్చుకుంటాడని నేను ఎప్పుడూ ఊహించలేదు.” అంటాడు తండ్రి. అతని అభిరుచి అతన్ని బహుళ భాషలను అర్థం చేసుకోవడం, పరిపూర్ణం చేయడంలో సహాయపడిన ఆన్‌లైన్‌ భాషా డేటాబేస్‌ అయిన ఓమ్నిగ్లోట్‌ ఎన్‌సైక్లోపీడియా వంటి భాషా వనరులను అన్వేషించేలా చేసింది. మహమూద్‌ అస్సామీ, బెంగాలీ, హిందీ, డోగ్రీ, తమిళం, తెలుగు, ఉర్దూ, నేపాలీ, అరబిక్‌, చైనీస్‌, బలూచి, ఇంగ్లీష్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, హిబ్రూ అనేక ఇతర భాషలను నేర్చుకున్నాడు. అతని అసాధారణ భాషా సామర్థ్యాలు అతనికి విస్తత గుర్తింపును తెచ్చిపెట్టాయి. మహమూద్‌ సాధించిన ఘనత భాషా నిపుణులను ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే నమోదు చేయబడిన చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఇంత చిన్న వయస్సులో భాషలపై ఇంత విస్తతమైన పట్టును ప్రదర్శించలేదు. అతని విజయాలు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ దష్టిని కూడా ఆకర్షించాయి. కేవలం చదవడమే కాకుండా, ఆ భాషల్లో టైప్‌ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్‌, అతి చిన్నవయసులో వివిధ భాషలు టైప్‌ చేసి మొదటి ప్రపంచ రికార్డు సాధించాడు. 70 మంది భాషా నిపుణులతో పోటీ పడుతూ జర్మనీలో తన మూడవ ప్రపంచ రికార్డును సాధించాడు.
ఒక్క గంటలోనే
10 ఏండ్ల వయసులో మన జాతీయ గీతం ‘జనగణమన’ను ఒక్క గంటలో 20 భాషల్లో రాసి రెండో ప్రపంచ రికార్డు సాధించాడు. 12 ఏండ్లకే 400 భాషలు చదివి, రాసి, టైప్‌ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో మూడోసారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్‌, అందుకుగానూ జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘జర్మనీ యంగ్‌ టాలెంట్‌ అవార్డు’ అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్‌ అనువాదకులు సైతం ఆశ్చర్యపోయారు.
స్కూల్‌ మానేసి
అయితే భాషల మీద ఇంత పట్టున్న అతనికి స్కూళ్ల నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టుల మీదే దష్టి పెట్టాలని అతణ్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్‌ మానేసి, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి, ఆస్ట్రియాలోని డనుబే ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అతనికి స్కాలర్‌షిప్‌ ఇచ్చి మరీ తమ స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్‌ యూకేలోని ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి భాషావిభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు.
విజయాలు – రికార్డులు
ఆరు నుండి ఎనిమిది ఏండ్ల మధ్య, భాషా ప్రావీణ్యం కోసం అక్రమ్‌ స్వీయ-ఆధారిత తపన అతన్ని 50 భాషలను నేర్చుకోవడానికి దారితీసింది. ”గతంలో, వివిధ భాషలను నేర్చుకోవడానికి నేను కొన్ని పాఠ్యపుస్తకాలు మరియు ఓమ్నిగ్లాట్‌పై ఆధారపడవలసి వచ్చింది” అని అక్రమ్‌ చెప్పారు. ఓమ్నిగ్లాట్‌ అనేది భాషలను రాయడానికి, చదవడానికి ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా. ఈ ప్రయాణం కేవలం ఎనిమిది సంవత్సరాల వయసులో అతి పిన్న వయస్కుడైన బహుభాషా టైపిస్ట్‌గా అతని మొదటి ప్రపంచ రికార్డుకు దారితీసింది . ”నేను యూట్యూబ్‌లో వివిధ భాషలను టైప్‌ చేస్తూ, చదువుతూ ఒక వీడియోను అప్‌లోడ్‌ చేసాను. పంజాబ్‌లోని ఒక ప్రపంచ రికార్డు సంస్థ నన్ను ఒక రికార్డును ప్రయత్నించమని ఆహ్వానించింది, దానిని నేను విజయవంతంగా పూర్తి చేసాను” అని అతను గుర్తుచేసుకున్నాడు.
బహుభాషలు
అక్రమ్‌ అస్సామీ, బెంగాలీ, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మైథిలి, కొంకణి, సంస్కతం, మణిపురి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి భారతీయ భాషలను టైప్‌ చేసే నైపుణ్యం ఉంది. అలాగే అరబిక్‌, అసేన్‌, అఫ్రికాన్స్‌, అల్‌ బనియన్‌, అమాక్ట్‌, అమ్హారిక్‌, అర్మేనియన్‌, అసంటే ట్వీ, అజర్‌బైజానీ, బాలినీస్‌, బలూచి, బౌల్‌, బాష్కిర్‌, బాస్క్‌, బస్సా, బటాకేస్‌, బెలారూసియన్‌, బెంబా, బెంబా, బెటెన్‌, బూసానో, బొసాయిన్‌, బొసాయిన్‌, బ్యోసూనా, బొసూనా, బూసూనా, బాయెచోనో ఎన్‌ ఇ, చిచెవా, చైనీస్‌ సాంప్రదాయ, చైనీస్‌ సింప్లిఫైడ్‌, చియావో, క్రియోల్‌, క్రొయేషియన్‌, చెక్‌, డాగ్బానీ, డానిష్‌, డారి, ధివేహి, డుసున్‌, డచ్‌, తూర్పు ఇనుక్టిటుట్‌, ఇంగ్లీష్‌, ఎస్పెరాంటో, ఎస్టోనియన్‌, ఈవ్‌, ఫాంటే, ఫిజియన్‌, ఫిలిపినో, ఫినో, గాలెర్‌, గాలెర్‌ ఇగ్బో, ఇలోకానో, ఇండోనేషియా, ఇరానియన్‌, ఐరిష్‌, ఇటాలియన్‌, జపనీస్‌, జావానీస్‌, జూలా, కబైల్‌, కట్లాన్‌, కజాఖ్‌, ఖైమర్‌, కికాంబ, కికోంగో, కికుయు, కొరియన్‌, కెపెల్లె, కుర్దిష్‌, కిర్గిజ్‌, లావో, లాటిన్‌, లాటివాన్‌, లింగే, లింగే, లింగాయన్‌, మలేన్‌, మాలె, మలే, మలేన్‌, మాలె, మలే, లేగ్‌ కా, మారనావో, మెండే, నార్వేజియన్‌/ నార్స్క్‌, న్జెమా, ఒరోమో, పాష్టో, పెర్షియన్‌, పోలిష్‌, పోర్చుగీస్‌, పులార్‌, రొమేనియన్‌, రష్యన్‌, సమోవాన్‌, సారాకి, సెర్బియన్‌, సింధీ, సిన్హాలా, స్లోవాక్‌ తజిక్‌ ఓరి, టెమ్నే, థారు, టిబెటన్‌, టిగ్రిన్యా, టోంగాన్‌, టాస్క్‌, టర్కిష్‌, తువలువాన్‌, ఉక్రేనియన్‌, ఉర్దూ, ఉయ్ఘర్‌, ఉజ్బెక్‌, వై, వియత్నామీస్‌, వాలే, వెల్ష్‌, వెస్ట్‌ ఇనుక్తిటున్‌, పశ్చిమ పుంజబి, ఎక్స్‌హౌ, యిద్‌, యోబెర్‌, యిడ్‌ లు మాట్లాడగలడు. రాయగలడు. అందరినీ ఒక గొప్ప ఆశ్చర్యానికి గురిచేసింది.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

]]>
‘తండేల్‌`.. ప్రాణం పెట్టి రాసుకున్న కథ https://navatelangana.com/tandel-a-story-written-with-my-life/ Sat, 08 Mar 2025 17:39:28 +0000 https://navatelangana.com/?p=519542 'Tandel.. a story written with my life'ఆ కుర్రాడికి బ్లాక్‌ బోర్డ్‌ పై పాఠాలన్ని సిల్వర్‌ స్క్రీన్‌ సీన్లులా అనిపించేవి. పేపర్లో చదివే వార్తలు కూడా ఉహల్లో కథలుగా అల్లుకోనేవి. కాలేజ్‌కి వచ్చాక తనకు అర్థమయ్యింది ‘క్లాస్‌ రూంలో తపస్సు చేయటం కాదు చిత్రసీమ బాట పట్టాలని. చదువు ఆపేసాడు. కష్ణానగర్‌ చేరాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ కథ రాసుకొన్నాడు. అది గీతా ఆర్ట్స్‌ వాళ్ళకి నచ్చింది. సినిమాగా తీసారు. అదేదో కాదు ‘తండేల్‌’ సినిమా. అరంగేట్రంతోనే బ్లాక్‌ బస్టర్‌ కథ రాసిన యువకథకుడు కార్తీక్‌ తీడా. తన సినిమా ప్రయాణం అతడి మాటల్లోనే.
‘తండేల్‌’ కథకు కేంద్రమైన శ్రీకాకుళమే మా సొంతూరు. తీడా రమణమూర్తి, మంగమ్మ అమ్మానాన్నలు. స్థానికంగా టెక్స్‌ టైల్‌ వ్యాపారం చేస్తుంటారు. చెల్లెలు రమ్యను, నన్ను మంచి చదువులు చదివించాలని అనుకొనేవారు. మొదట్లో నేను బాగా చదివేవాడిని. పోనుపోను సినిమా పెద్ద సిలబస్‌ లా మారిపోయింది. నా ప్రాథమికవిద్య అంతా స్థానికంగానే జరిగింది. ఇంజనీరింగ్‌ చేయడానికి శ్రీశివానీ కాలేజ్‌లో జాయిన్‌ అయ్యాను గానీ బ్లాక్‌బోర్డ్‌ అంతా సిల్వర్‌ స్క్రీన్‌లా కనిపించేది. చేయాల్సిన ప్రాక్టికల్స్‌ అన్నీ సినిమా షూటింగ్‌లా అనిపించేవి. సెకెండ్‌ ఇయర్‌కి వచ్చేపాటికి అర్థమయ్యింది.. నాకు చదువు ఎక్కడంకంటే ముందే సినిమా ఎక్కేసిందని. ఇంకా ఇక్కడే ఉంటే రెండింటింకి చెడుతామని ఇంజినీరింగ్‌ చదువు మధ్యలో ఆపేసి నచ్చిన సినిమా కోసం హైదరాబాదు బస్సెక్కాను.
అలా పడింది సినిమా బీజం
ఫ్రెండ్స్‌ తో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడుతుంటే కొంతమంది షార్ట్‌ ఫిల్మ్‌ కోసం కెమెరాలు, ట్రైపాడ్లు, లైట్స్‌ పెట్టుకొని పట్టుకొని షూటింగ్‌ చేయడం మొదలుపెట్టారు. మొదటిసారి షూటింగ్‌ ఎలా ఉంటుంది. డైరెక్టర్‌, రైటర్‌ ఎలా కథను నెరేట్‌ చేస్తారు. యాక్టర్స్‌ ఎలా నటిస్తారనేది లైవ్‌ చూశాను. తెలీకుండానే సినిమాపట్ల ఆకర్షణ ఏర్పడింది. సినిమాలు చూడడం, వాటి గురించి ఆలోచించడం, అప్పుడున్న తెలివితో ఏవేవో కథలు రాసుకోవడం, ఫ్రెండ్స్‌కి చెప్పడం చేస్తూ వచ్చేవాణ్ణి. షార్ట్‌ ఫిలిం షూటింగ్‌ చేయడానికి వచ్చిన ప్రేమ్‌ అనే అన్న నెంబర్‌ తీసుకొని సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేశాను.
కష్ణానగర్‌ కష్టాలు
సినిమాలలోకి రావడం అయితే వచ్చాను గానీ ఎక్కడ ఉండాలి, ఎలా ప్రయత్నం చేయాలి అనేవేవీ తెలీవు. సినిమావాళ్ళు ఉండే కష్ణానగర్‌లో రూమ్‌ రెంట్‌కు తీసుకోవడం, చిన్నచిన్న పరిచయాలతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం, కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయేవి. మొదటగా నాగబాబుగారు నటించిన ‘శిఖరం’ సీరియల్‌కు పనిచేశాను. తర్వాత ‘అదిలెక్క’, ‘నక్షత్రం’ సినిమాలకు కూడా పనిచేశాను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉంటూనే నాదైనా శైలిలో కథలు రాసుకొనేవాడిని. ప్రొడక్షన్‌ హౌస్‌ల చుట్టూ తిరుగుతుండేవాడిని. ఈ ప్రయాణంలో సగటు కష్ణానగర్‌ వ్యక్తికి ఉండే కష్టాలన్నీ అనుభవించాను.


తండేల్‌ కథ అలా మొదలైంది
ఉదయంపూట సరదాగా న్యూస్‌ పేపర్‌ తిరిగేస్తుంటే పాకిస్తాన్‌ జైల్లో చిక్కుకొన్న ఉత్తరాంధ్ర జాలరులు అనే అర్థం వచ్చే కథనం ఒకటి కనిపించింది. శ్రీకాకుళంలో ఉన్న వీళ్ళు ఎక్కడో ఉన్న పాకిస్తాన్‌ బలగాలకు ఎలా దొరికారు? అనే ఆసక్తితో వారి కుటుంబాలకోసం వెతకడం మొదలుపెట్టాను. అప్పటికే పుల్వామా దాడుల ప్రభావం, కోవిడ్‌ పరిస్థితులు నెలకొన్న వాతావరణంలో ఈ కథ కోసం అన్వేషించాను. వారి కుటుంబాల కోసం జైల్లో ఉండి రాసిన ఉత్తరాలు, వారికి వీళ్ళు రాస్తున్న ఉత్తరాలు, పోషించేవాడు లేకపోతే పడిన ఇబ్బందులు, పిల్లల కలవరింతలు… వంటి వాస్తవిక అంశాల ఆధారంగా తండేల్‌ కథ రాసుకున్నాను. ఇది చిన్న స్కేల్‌లో చెప్పాల్సిన కథ కాదు. మంచి నిర్మాత, హీరో, హీరోయిన్‌ దొరికితే పెద్ద స్కేల్‌ క్యాన్వాస్‌ ఉన్న కథ అన్నది నాకు మొదటినుంచి ఉన్న గట్టి నమ్మకం. దానికితోడు యునివర్స్‌ కూడా తోడైనట్టు ఉంది. భాను అనే నిర్మాతకు కథ నచ్చడంద్వారా బన్ని వాసుగారికి దగ్గరికి వెళ్ళడం, అల్లు అరవింద్‌ గారికి నచ్చడం, అక్కడినుంచి వేగంగా అడుగులు పడ్డాయి. నాగాచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్‌ గా కథ చెప్పడం, నచ్చడం, ప్రీ ప్రొడక్షన్‌, షూటింగ్‌ అలా అలా సినిమా ప్రజల్లోకి వెళ్లిపోయింది. విజయం సాధించడం, ఐదేళ్ళ శ్రమకు తగ్గ గుర్తింపు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

 

ఆ స్థాయికి చేరుకోవాలి
తెలుగులో దర్శకుడికిగానీ, రచయితకిగానీ ఒక స్టైల్‌ ఏర్పడి అదే పంథాలో సినిమాలు తీయడం జరుగుతుంది. వారు ప్రయోగాలు చేయడానికి ప్రజల్లో తమకున్న స్టైల్‌ ఒప్పుకోదు. తెలియకుండానే ఆ కంఫర్ట్‌ జోన్‌లో ఉండిపోవాలసి వస్తుంది. నాకు ఆ విధానం పెద్దగా నచ్చదు. అన్నిరకాల సినిమాలు చెయ్యాలి. ‘కార్తీక్‌ తీడా అంటే ఫలానా వీటికి మాత్రమే పరిమితం కాదు. అన్ని జానర్స్‌ టచ్‌ చెయ్యగలడు’ అన్న స్థాయికి ఎదగాలని ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు వేసుకొంటున్నా. నా దర్శకత్వంలో సినిమా తొందరలోనే ఉంటుంది. అలా అని పూర్తిగా అటువైపే ఉంటానని కాదు. అవసరం ఉన్నచోట నా దగ్గరున్న కథలు ఇవ్వడం, రాయడం కూడా కొనసాగిస్తూనే ఉంటా. చిన్న సినిమా – పెద్ద సినిమా, థియేటర్‌ – ఒటీటీ, రిజినల్‌ – ప్యాన్‌ ఇండియా అన్న తేడాలు లేకుండా సినిమాలు చేస్తూ ఉండాలన్నదే నా లక్ష్యం.


– బి. మదన్‌ మోహన్‌ రెడ్డి, 9989894308

]]>
అటెండర్‌ టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ https://navatelangana.com/attender-to-assistant-professor/ Sat, 01 Mar 2025 17:16:03 +0000 https://navatelangana.com/?p=514344 Attendant to Assistant Professorతన మొదటి ప్రయత్నంతో కోర్టులో అటెండర్‌ ఉద్యోగం సంపాదించాడు. ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుండి న్యాయమూర్తి వద్ద ఎంతో కష్టించి పనిచేస్తున్నప్పటికీ, తన స్థాయి కారణంగా న్యాయమూర్తి తనకు సరైన గౌరవం ఇవ్వడంలేదన్న భావన కలిగింది. రోజంతా విధినిర్వహణలో సమయం వెచ్చిస్తున్నందున తన నైపుణ్యాలను కోల్పోతున్నాననే బాధ ఉన్నప్పటికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఉద్యోగం తప్పనిసరి అని నిర్ణయించుకున్నాడు. ఓరోజు న్యాయమూర్తి ప్రవర్తనతో విసుగుచెంది, అటెండర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ సంఘటన తర్వాత అతను తన ఆత్మకథను ”మై సాన్‌ జడ్జ్‌ డా అర్ధాలి” అని తన మాత భాష అయిన పంజాబీ భాషలో రాసుకున్నాడు. అతనే ”నిందర్‌ ఘుగియాన్వి”.
నిందర్‌ ఘుగియాన్వి ఒక అటెండర్‌ స్థాయి నుండి ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగిన క్రమం ఎందరికో స్ఫూర్తిదాయకం. తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, ఘుగియాన్వి 69 పుస్తకాలు రాశారు. తన ఆత్మకథలో భారత న్యాయ వ్యవస్థలో క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగులను వ్యక్తిగత సేవకులుగా ఎలా ఉపయోగిస్తారో చిత్రీకరించబడింది. ఈ పుస్తకం ప్రజాదరణ పొందడమే కాదు అతని ఆత్మకథ ”ఐ వాజ్‌ ఏ సెర్వెంట్‌ టు ఏ జడ్జ్‌” అని ఆంగ్లంతో పాటు 15 భారతీయ భాషలలోకి అనువదించబడింది. గురు నానక్‌ దేవ్‌ విశ్వవిద్యాలయం, పంజాబీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయంతో సహా అనేక విశ్వవిద్యాలయాలు ఆయన రచనలను వారి పాఠ్యాంశాల్లో చేర్చాయి. 12 విశ్వవిద్యాలయాలలో ఎంఫిల్‌, పిహెచ్‌డి విద్యార్థులు ఆయన రచనలపై పరిశోధనలు నిర్వహించారు.
అటెండర్‌ నుంచి ప్రొఫెసర్‌ గా ఎలా ఎదిగారు తెలుసుకోవాలంటే ఈ క్రింది విషయాలు తప్పనిసరిగా చదవాల్సిందే..
కోర్ట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత పంజాబ్‌ భాషా విభాగంలో తోటమాలి గా చేరారు. అక్కడ అతని పని మొక్కలకు నీరు పెట్టడం తోటను చూసుకోవడం మాత్రమే. ఘుగియాన్వి ‘ఇక్‌ తారా’ తుంబి వాయించడంలో ప్రావీణ్యత కలిగినందున సాహిత్య విభాగంలో జరిగే కార్యక్రమాలలో ఇక్‌ తారా వాయించేవాడు. అతి తక్కువ సమయంలోనే సంగీత వాయిద్య కళాకారుడిగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఒక తోటమాలి ఇంత ప్రజాదరణ పొండటమేంటని కొంతమంది అధికారులు అసూయపడి అతన్ని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించారు. టాలెంట్‌ ఉన్నోడిని ఎవరూ ఆపలేరు అన్నట్లు అతనికి పంజాబీ భాషపై పట్టున్నందున కాలక్రమేణా అతను ప్రభుత్వ భాషా శాఖ సభ్యుడిగా ఎంపికైనారు. మొదటిసారిగా తన కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతనిని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించిన అదే అధికారి, అతన్ని మిస్టర్‌ నిందర్‌ ఘుగియాన్వి జీ అని పిలవడం ప్రారంభించాడు. నిందర్‌ ఘుగియాన్వి సాధారణ జీవితం నుండి సాహిత్య ఔన్నత్యానికి ఎదగడం పంజాబీ సంస్కతి, భాష, సాహిత్యం పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనం. పంజాబీ సంస్కతికి ఆయన చేసిన కషిని గుర్తించి పంజాబ్‌ విశ్వవిద్యాలయం ‘సాహిత్య రతన్‌’ అవార్డుతో సత్కరించింది.
అటెండర్‌ గా తన కెరీర్‌ను ప్రారంభించి, తన ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాడు. చివరికి పంజాబీలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచి, 69 కి పైగా పుస్తకాలు రాయడానికి దోహదపడింది. ఆయన రచనలపై అనేక లఘు చిత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన పంజాబ్‌ జానపదాలు, సంస్కతిపై పరిశోధనలు చేశారు. ఆయన నైపుణ్యాన్ని గుర్తించి, IAS,PCS అభ్యర్థులకు ఉపన్యాసాలు ఇవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికి ఆహ్వానించారు. ఇటీవల, ఆయన బటిండాలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో ప్రాక్టీస్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. నిందర్‌ ప్రపంచవ్యాప్తంగా USA, UK, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు పర్యటించి విదేశీ సంస్కతుల గురించి నేర్చుకుంటూనే తన సొంత సంస్కతిని విదేశాలకు ప్రచారం చేశారు.
1994లో భారత రాష్ట్రపతి ఎస్‌.గియాని జైల్‌ సింగ్‌, 2001లో కెనడా ప్రధానమంత్రి శ్రీ జి. క్రెచియన్‌, 2005లో యుకె ప్రధాన మంత్రి శ్రీ టోనీ బ్లెయిర్‌ వంటి ఉన్నత స్థాయి ప్రముఖులచే సత్కరించబడిన గౌరవం నిందర్‌ ఘుగియాన్వికి లభించింది.
నిందర్‌ ఘుగియాన్వి యొక్క ఆత్మకథను ‘నేను జడ్జిగారి సేవకుడ్ని’ అన్న పేరుతో డా. రహీమ్‌ పఠాన్‌ ఖాన్‌ తెలుగులోకి అనువదించారు.
జీవితం తరచుగా ఊహించని మలుపులు తీసుకుంటుంది. విజయం కొన్నిసార్లు తీవ్ర ప్రతికూల క్షణాల నుండి ఉద్భవిస్తుంది. ఆశయం కోసం నిరంతరం కషి చేసినప్పుడు అనుకున్నది సాకారమవుతుంది. డబ్బు లేదని చింతించకుండా ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం పాదాక్రాంతమవుతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
– కోట దామోదర్‌, 9391480475

]]>
విదేశీ చదువుకు దశ, దిశ https://navatelangana.com/step-direction-to-foreign-education/ Sat, 22 Feb 2025 19:07:38 +0000 https://navatelangana.com/?p=509589 Step direction for studying abroadఅంబిటియో భారతదేశపు మొట్టమొదటి ఎఐ అడ్మిషన్ల ప్లాట్‌ఫామ్‌. ఇది అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లను ఎలా పొందవచ్చో తెలియజేయడానికి బాగా సహాయపడుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్‌ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌ దీర్ఘాయు కౌశిక్‌, విక్రాంత్‌ శివాలిక్‌, వైభవ్‌ త్యాగీ.
అతడి పేరు విహారి. మంచి ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ చేశాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాన్న సంపాదన మీదనే కుటుంబం నడవాలి. అయినా కొడుకును చాలా కష్టపడి చదివించాడు. అతని కంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె చదువు అయిపోయింది. రేపోమాపో పెండ్లి చేయాలి. కేవలం తండ్రి సంపాదనతోనే చదువులు, పెండ్లిలు జరగడం కష్టం. అందుకోసమే విదేశాలకు పోదాం అనుకున్నాడు. కాలేజీలో అత్యధిక మార్కులతో పాసైనందుకు బ్యాంకు వాళ్లు కూడా తనకు లోన్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. రెండు మూడు దేశాలకు ప్రయత్నం చేశాడు. ఆ దేశాల్లో కాలేజీలో అప్లికేషన్స్‌కి 20, 30 వేలు ఖర్చు అయింది. కొన్ని కాలేజీల నుండి చదువుకు ఆమోదం కూడా వచ్చింది. పాస్‌పోర్ట్‌ అని, పోలీస్‌ వెరిఫికేషన్‌ అని, హెల్త్‌ చెకప్‌ అని ఎన్నో ఆఫీసులు తిరిగి అవసరమైన డాక్యుమెంట్స్‌ సమకూర్చుకున్నాడు. విదేశాలకు పోయేందుకు ఇంగ్లీష్‌ ప్రావీణ్యం అవసరం కాబట్టి ఆ ప్రావీణ్యాన్ని తేల్చి చెప్పే పరీక్షలు  ఉన్నాయి. వాటిలో కూడా మంచి ప్రావీణ్యం సాధించాడు. బ్యాంకు ద్వారా డబ్బులు కూడా ఒక విదేశీ కాలేజీకి పంపాడు. అక్కడ ఒక సంవత్సరం బతికేందుకు కావలసిన ఖర్చులను కూడా బ్యాంకులో వేయించుకున్నారు. ఆరు నెలలు పట్టింది. ఫీజు కట్టిన కాలేజీ వున్న దేశం నుండి వీసా రాలేదు. ఈ పంపిన డబ్బులకు వడ్డీ మాత్రం పెరుగుతుంది. మంచి మార్కులు వున్నాయి. విదేశాల్లో చదివేందుకు అవసరమైన కోర్సుల్లో, అవసరమైన స్థాయి కన్నా ఎక్కువ మార్కులు సంపాదించాడు. అయినా అదంతా వథా అయిపోయింది. ఇక్కడ కూడా ఉద్యోగాలు వచ్చాయి కానీ. అవి అతి తక్కువ జీతం ఇచ్చేవి. ఆ జీతాలతో వారికున్న బాధ్యతలు తీరడం అసంభవం అనుకున్నాడు. తండ్రి పదవీ విరమణకు దగ్గర్లో వున్నాడు. ఈ పరిస్థితుల్లో అంతగా ఆశపడడంలో తప్ప ఏమీలేదు.
ఇంతకు అతని దరఖాస్తును నిరాకరించేందుకు ఇచ్చిన కారణాలు విచిత్రమైనవి. మీరు చదువుకున్న కోర్స్‌కి మీరు అప్లై చేసిన కోర్సుకి సంబంధం లేదని. ఈ దేశం వచ్చేందుకు మీరు చెప్పిన ఉద్దేశం (స్టేట్మెంట్‌ ఇఫ్‌ పర్పస్‌) చదువుకునేందుకని, స్థిరపడేందుకు కాదని రాసి ఇచ్చింది మేము నమ్మడం లేదని వీసా తిరస్కరించారు. నిజంగా అలానే రాసి ఇవ్వాలి అని అతడికి విదేశాలు కోసం ప్రయత్నం చేయడంలో సహాయపడ్డ దళారి చెప్పాడు. కొన్ని నెలల తర్వాత అతడు కాలేజీకి కట్టిన డబ్బు అయితే తిరిగి పంపారు. కానీ, దాని మీద కట్టిన వడ్డీ వేలకు పెరిగింది. అతడికి ఏంచేయాలో తోచలేదు. ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఫలించలేదు. గత్యంతరం లేక ఇక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ పెళ్లిళ్ల గురించి, మంచి జీవితం గురించి మర్చిపోయి జీవనం గడిపేస్తున్నాడు. ఇలాంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. అలాంటి వారికి ఊరట కల్గిస్తుంది అంబిటియో.
విదేశీ విద్య అనేది నేటి యువతరం కల. దానిని నేరువేర్చుకోవడానికి సప్త సముద్రాలు దాటి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా అంటూ వివిధ దేశాలకు చేరుతుంటారు. రెండేళ్లు కష్టపడితే చాలు ప్రతిభకు తగిన ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. లైఫ్‌ సెటిల్‌ అయిపోతుంది అనుకుంటారు. ఇలా చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ అమెరికా విమానం ఎక్కుతుంటారు. కానీ, ”ఏ యూనివర్శిటీకి దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది? వంటి ప్రశ్నలు మనల్ని వేధిస్తాయి. సహాయం చేసే కౌన్సెలర్‌లు ఉన్నప్పటికీ, వారి వసూళ్లు కూడా అదేస్థాయిలో ఉంటాయి అంటున్నారు అంబిటియో వ్యవస్థాపకుడు దీర్ఘాయు కౌశిక్‌. దాదాపు ఐదారేండ్ల క్రితం, దీర్ఘాయు పరిస్థితి కూడా అదే. ఆ సమయంలో అతని పరిస్థితి అతని మాటల్లోనే… ”నేను మాస్టర్స్‌ చదవాలనుకున్నాను కానీ ఏ కాలేజిని ఎంచుకోవాలో నాకు తెలియదు. రాతపని, దాని గురించిన ఆత్రుత నన్ను చాలా టెన్షన్‌కి గురిచేసింది” అని గుర్తుచేసుకుంటాడు. అలాంటి సమయంలో అతను సహాయం కోసం వెతుకుతున్నప్పుడు అతడి మదిలో వచ్చిన ఆలోచనే అంబిటియో. ఇది భారతదేశపు మొట్టమొదటి AI (ఎఐ) అడ్మిషన్ల ప్లాట్‌ఫామ్‌ పునాదికి దారితీసింది. ఇది అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లను ఎలా పొందవచ్చో తెలియజేయడానికి బాగా సహాయపడుతుంది.
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్‌ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌ దీర్ఘాయు కౌశిక్‌, విక్రాంత్‌ శివాలిక్‌, వైభవ్‌ త్యాగీ. మన దేశంలోని తొలి ఎఐ అడ్మిషన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకుపోతోంది. ఐఐటీ – బీహెచ్‌యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కౌశిక్‌ ఫారిన్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్‌కు సహాయపడే ప్లాట్‌ఫామ్‌లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్‌లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు.
ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజీల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్‌. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్‌కు సంబంధించి కాలేజీ అప్లికేషన్స్‌, సరైన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్‌ ఎస్సేస్‌… మొదలైన వాటి గురించి ఒక ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్‌ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్‌ విక్రాంత్‌, వైభవ్‌ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్‌కు టాప్‌ ఇనిస్టిట్యూట్స్‌లో అడ్మిషన్‌ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్‌ ప్రొఫైల్స్‌పై ప్రధానంగా దషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు.
కార్నెగి మెలన్‌ యూనివర్శిటీ, ఎన్‌వైయూ, ఇంపీరియల్‌ కాలేజ్‌, యూసీ బర్కిలి… మొదలైన ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్‌కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్‌ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరైన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్‌ కమల్‌కు లండన్‌లోని వార్‌విక్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రవేశం దొరికింది.
‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్‌లో ఎఐ ఎలా ఉపకరిస్తుంది అనేదాని గురించి కో-ఫౌండర్‌, సిఇఒ కౌశిక్‌ మాటల్లో… ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఎఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మోస్ట్‌ సూటబుల్‌ ప్రోగ్రామ్‌ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్‌ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్‌ టూల్స్‌ ఉన్నప్పటికీ మేము ఎఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం. విస్తతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌ పర్సనలైజ్‌డ్‌ రికమండేషన్‌లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్‌ టైమ్‌ను సేవ్‌ చేస్తుంది.
‘స్టూడెంట్స్‌ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్‌కు శిక్షణ ఇచ్చాం. సరైన కాలేజీని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్‌ఫ్లామ్‌లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్‌. ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్‌ మార్కెట్‌లో వేగంగా దూసుకుపోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్‌.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

]]>
జ‌డ్జి అయిన‌ డెలివరీ బాయ్ https://navatelangana.com/the-delivery-boy-who-is-a-judge/ Sat, 15 Feb 2025 16:10:28 +0000 https://navatelangana.com/?p=504806 A delivery boy who is a judgeకలలు కనడం చాలా సులభం. వాటిని సాకారం చేసుకోవడమే కష్టం. కానీ కొద్దిమందే తమ కలలని సాకారం చేసుకొని.. ప్రగతిబాటలో నడుస్తారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే కేరళకి చెందిన మహ్మద్‌ యాసిన్‌. పేపర్‌ బాయ్ గా జీవితాన్ని ఆరంభించిన యాసిన్‌ ఆ తరువాత డెలివరీ బాయ్ గా మారాడు. అదే యువకుడు కేరళ జ్యుడిషియల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌లో రెండో ర్యాంకు సాధించి మెజిస్ట్రేట్‌గా నియమితుడయ్యాడు. యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు. ఈ లక్ష్యం సాధించడం వెనుక ఆయన ఎన్నో అవరోధాలు అధిగమించారు. అవమానాలు భరించారు. అతని గురించి చెప్పుకోవాలంటే ‘విలయూర్‌ పేపర్‌ బాయ్’గా అతని జీవితం మొదలైన దగ్గర నుండి తెలుసుకోవాలి.
యాసిన్‌కి మూడేండ్లప్పుడే తండ్రి కుటుంబం నుండి దూరంగా వెళ్లిపోయాడు. తమ్ముడిని, తనని ఆశా వర్కర్‌ అయిన తల్లే పెంచి, పోషించింది. ఒంటరి తల్లి పెంపకంలో సమాజం అతన్ని చిన్నచూపు చూసింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. తల్లి కష్టం చూడలేని యాసిన్‌ కుటుంబం కోసం ఏడేళ్ల నుండే పనులకు వెళ్లేవాడు. సౌకర్యాలు పొందడం, లగ్జరీగా ఉండడం చిన్నారి యాసిన్‌కి అస్సలు తెలియదు. పేపర్‌బాయ్ గా, పాలబ్బాయిగా, నిర్మాణరంగ కూలీగా, పెయింటర్‌గా, ఫుడ్‌ డెలివరీ బాయ్ గా ఏ పని ఉంటే ఆపనికి వెళ్లడం అతని దినచర్యగా ఉండేది.
‘అమ్మ మమ్మల్ని చాలా కష్టాలు పడి పెంచింది. కానీ అందరూ మమ్మల్ని చులకనగా చూసేవారు. సరిగ్గా పెరగడం లేదని అవమానించేవారు. మా ప్రతి కదలికను ఎగతాళి చేసేవారు. అవమానాలే నా పెట్టుబడి. పేదరికం కారణంగా స్కూల్లో కూడా అవమానాలు ఎదుర్కొన్నాను. సరిగ్గా చదవడం లేదని చాలాసార్లు తరగతి గది నుండి బయటికి పంపేశారు. నా వ్యక్తిగత పరిస్థితులు నా చుట్టూ ఎన్నో విషమపరిస్థితులను తీసుకొచ్చాయి’ అంటాడు యాసిన్‌. మొదట్లో సాధారణ విద్యార్థిగా ఉన్న యాసిన్‌ నెమ్మదిగా చదువుపై దష్టిపెట్టాడు. ఇతరుల నుంచి పాత పుస్తకాలు సేకరించి చదువుకునేవాడు. అలాగే ఇతరులిచ్చే పాత దుస్తులు ధరించేవాడు. రోజులో ఏది దొరికితే దానిని తిని కడుపునింపుకునేవాడు. ఇలా పనిచేస్తూనే 12వ తరగతి పూర్తిచేసిన యాసిన్‌ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కోర్సులో చేరేందుకు షోరనూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో అడ్మిషన్‌ తీసుకున్నాడు. ఈ కోర్సు పూర్తయ్యాక స్టేట్‌ లా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ గురించి విని, దానికి ప్రిపేర్‌ కావాలని నిర్ణయించుకున్నాడు. యాసిన్‌ 46వ ర్యాంక్‌తో కేరళలోని ఎర్నాకులంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందాడు. ఈ సమయంలో రాత్రి 2 గంటల వరకు ఫుడ్‌ డెలివరీ బాయ్ గా పనిచేశాడు. ప్రతికూలతలనే సానుకూలతలుగా మలచుకుని యాసిన్‌ విద్యాభ్యాసం పూర్తిచేశారు.
లా మొదటి సంవత్సరం కంటే రెండో ఏడాది నుండి మెరుగైన ప్రతిభతో రాణించారు. యూనివర్శిటీ టాపర్లలో ఒకరిగా నిలిచారు. ఎల్‌ఎల్‌బి పూర్తిచేసిన తరువాత 2023 నుండి లాయర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచారు. ‘అవుట్‌ స్టాండింగ్‌ లాయర్‌’ అవార్డు అందుకునేంతగా ఆయన పనితీరు ఉండేది.
‘నా ఉన్నత చదువంతా సెకండ్‌ హ్యాండ్‌ బుక్స్‌తోనే సాగింది. ఇతరులు వాడేసిన బట్టలనే కట్టుకునేవాడిని. మసీదు వాళ్లు దానం చేసిన బియ్యం, పప్పులతోనే మా రోజు గడిచేది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు సాయంగా నిలబడిన ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. నా సీనియర్‌ అడ్వకేట్‌ సాహుల్‌ హమీద్‌ ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోను. ఆయన తన ఆఫీసులో నాకు చోటిచ్చారు. ఆ వెసులుబాటు నాకు ఎన్నో మెట్లు పైకి ఎదగడానికి సాయం చేసింది’ అని తన ప్రయాణంలో చేయూతనిచ్చిన ప్రతిఒక్కరినీ యాసిన్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన రెండో ఏడాదే మెజిస్ట్రేట్‌గా నియమితులవ్వడం సాధారణ విషయం కాదు. ఎంతో కఠోరదీక్ష కావాలి. ఈ కల చాలామందికి ఉంటుంది. కానీ యాసిన్‌ లాంటి వారు మాత్రమే దాన్ని చేరుకుంటారు. అయితే ఈ విజయం పట్ల యాసిన్‌ ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘ఇక్కడితో నా గమ్యం పూర్తవ్వలేదు. జీవితం ఎన్నో సవాళ్లని మన ముందుంచుతుంది. అయితే నేను బలంగా ఒక్కటి నమ్ముతాను. నిన్నటి కంటే ఈ రోజు చాలా బాగుంటుంది’ అంటున్న యాసిన్‌ ‘అణగారిన వర్గాల కోసం పనిచేస్తాన’ని ప్రతిజ్ఞ చేశారు. ‘ఎన్నో సవాళ్ల మధ్య జీవించిన నేను వారి బాగు కోసం నిరంతరం కష్టపడతాను’ అంటున్నారు.
యాసిన్‌ మీడియాతో మాట్లాడుతూ ‘నేను 12వ తరగతిలో ఫెయిల్‌ అయి, చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా పట్టుదల వీడక 12వ తరగతి పాస్‌ అయ్యాను. నేను మలయాళం మీడియం స్కూల్‌లో చదవడంతో ఇంగ్లీషులో చదవడం ఇబ్బందిగా అనిపించేంది. పట్టుదలతో ఈ సమస్యను కూడా అధిగమించాను’ అని తెలిపారు. యాసిన్‌ 2023 మార్చిలో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేయించుకున్నారు. తరువాత పట్టాంబి మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో న్యాయవాది షాహుల్‌ హమీద్‌ దగ్గర పని చేశారు. ఈ సమయంలోనూ యాసిన్‌ వార్తాపత్రికలు విక్రయించడం, డెలివరీ బారుగా పనిచేయడాన్ని మానలేదు. యాసిన్‌ తనకు 29 ఏళ్ల వయసు వచ్చే వరకూ జీవితంతో పోరాడుతూనే వచ్చాడు. అయితే ఇదే సమయంలో తాను జడ్జి కావాలనుకున్న కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు యాసిన్‌ తాను అనుకున్న విధంగా జడ్జిగా మారి, పదిమందికి స్ఫూర్తిగా నిలిచారు.

– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

]]>
ప్రేమ… యువ‌త‌.. https://navatelangana.com/love-is-young/ Sat, 08 Feb 2025 16:56:08 +0000 https://navatelangana.com/?p=500581 14th is 'Valentine's Day'‘కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హదయమే / ప్రియతమా నీవచట కుశలమా/ నేనిచట కుశలమే..’, ‘నిజమే నే చెబుతున్న జానే జానా/ నిజమే నే చెబుతున్న ఏదేమైనా/ వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే/ నిను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే/ మౌనం తెలుసే నాకు మాట తెలుసే/ మౌనంలో దాగుండె మాటలు తెలుసే- లాంటి మధురమైన పాటలు, కావ్యాలు ప్రేమ అనే అవ్యక్తానుభూతి నుంచే వచ్చాయి. ప్రేమ అనే పదానికి సరైన అర్థం తెలియని ఆలోచన, ఆకర్షణల మధ్య సంఘర్షణలో యువత. ప్రేమంటే ఓ క్రేజ్‌.. ఇష్క్‌తో కుష్‌ అయిపోవడమే తెలుసు. మనసులో ఏదో తెలియని అలజడి.. అంత లోనే సందడి.. ఉత్సాహం.. ఉల్లాసం.. ఉత్తేజం.. కాస్త బిడియం.. కూసింత చలాకీగా ఉండాలనే ఉద్విగత.. మరికొంచెం ధైర్యంగా కనిపించాలనే ఉత్సుకత అన్నింటి మేళవింపు తో దిల్‌ ఖుష్‌ కావొచ్చు. అన్నింటికీ మించి ప్రేమంటే ఒక అవగాహన. స్వచ్ఛమైన, సహజమైన మానవత్వ భావన. నిజమే.. ప్రేమంటే మనసు అనే హదయఫలకంలో ప్రభవించే హరివిల్లు. ప్రేమ తత్వంగా మెలగడం సమాజహితంగా ఉంటే అదో స్ఫూర్తిదాయకం. ఈ నెల 14న ‘ప్రేమికుల  రోజు’ సందర్భంగా జోష్‌ ప్రత్యేక కథనం.
ప్రేమ ఒక ఇష్క్‌.. ప్యార్‌.. మొహబత్‌.. రెండు హదయాలు ఒక్కటవ్వడం.. రెండు మనుసుల కలయిక.. వంటి ప్రేమ మాటలు వింటూనే ఉంటాం. ఇద్దరి మధ్య ఒకరి పట్ల ఒకరికి గౌరవం, అభిమానం ఏర్పడినప్పుడే అ అనుబంధం నిజమైన ప్రేమగా మారుతుంది. ఇది ఒకరు చెబితే వచ్చేది కాదు… ఒకరు చెబితే పోయేదా కాదు. ఒకరి అభిరుచులు, అభిప్రాయాలు కలిసినప్పుడు కలిగే అనుభూతే ప్రేమ. ఒకరి గురించి ఇంకొకరు ఆలోచించగలగాలి. ఒకరికోసం ఒకరు ప్రాణంగా బతకడమే ప్రేమ. ప్రేమకు గాయపరచడం, ప్రాణం తీయడం తెలియదు. అలా చేస్తే ఉన్మాదం అంటాం. అందుకే ప్రేమంటే ప్రేమే. వరించేదే ప్రేమ.. అలాంటి ప్రేమకు వందనం చెప్పాలి.
గెలుపులోనే మధురం..
‘ప్రేమ ఎంత మధురం..!’ అన్నట్లు ప్రేమ ఒక అనిర్వచనీయమైనది.. మధురమైన బంధం, అపురూపమైన అనుభూతి.. అది అనుభవంలోనే అర్థమవుతుంది. ప్రేమించడం తప్పుకాదు.. అలాగని పెద్దలను నొప్పించడమూ సరికాదు. తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పడం అవసరం. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ కలసిమెలసి ఉంటేనే ప్రేమకు అర్థం పరమార్థం.
మోసం వద్దు..
స్నేహం ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టడం లేదు. సాంకేతికత పెరిగాక స్మార్ట్‌ఫోన్‌లు, వాట్సాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లో ప్రేమజల్లు కురవని మాద్యమం లేదంటే అతిశయోక్తి కాదు. ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవటం సాధారణమే అయినా.. దీన్ని అలుసుగా తీసుకుని కొందరు అడ్డదారులు తొక్కడానికీ వెనుకాడటం లేదు. మోసాలకు తెగబడుతున్న సంఘటనలు కొకొల్లలు. ఇవన్నీ ప్రేమపట్ల బాధ్యతగా మెలగకపోవడం, స్పష్టమైన అవగాహన లేకపోవడమే వలనే అన్నది స్పష్టం.
పరిపక్వత..
ప్రేమ కలగటానికి సమయం సందర్భం ఉంటుందా అంటే.. పరిపక్వత ఉండాలంటారు నిపుణులు. టీనేజ్‌లో సహజంగానే హార్మోన్ల ప్రభావంతో ఆకర్షణకు గురవుతారు. ఆ ఆకర్షణనే ప్రేమ అని భ్రమ పడుతుంటారు. ప్రేమను ప్రేమగా అర్థం చేసుకునే పరిణతి రావాలి. అప్పుడే ప్రేమ పటిష్టంగా ఉంటుంది. అలా కానప్పుడు జీవితంలో స్థిరపడకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవడం తదితర ప్రతిబంధకాలు ఎదురవుతాయి. దాంతో ‘నీ వల్లనే నేనిలా అయ్యా’ అని ఒకరినొకరు నిందించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ విఫలమవ్వడానికీ దారితీస్తుంది. పరిణతి చెందిన ప్రేమకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ప్రేమకు నిర్వచనం శారీరక ఆకర్షణగా భావించడం సరికాదు. ఇలాంటివారు తాత్కాలిక ఆనందాలకు వెంపర్లాడతుంటారు. ప్రేమ అనేది శాశ్వతమైనది.
వ్యాపారమయం..
సరళీకరణ విధానాల నేపథ్యంలో ప్రేమ కూడా సరకుగా మారిపోయింది. తత్ఫలితంగా సున్నితత్వాన్ని కోల్పోయి బహుముఖ రూపాల్లో దర్శనమిస్తోంది. ప్రేమికుల రోజున కోట్లలో వ్యాపారం నడుస్తోంది. దీనిని ఒక పెద్దాయన మాటల్లో.. ‘ప్రేమ ఫ్రాన్స్‌లో ఒక కామెడీ.. ఇంగ్లండులో ఒక ట్రాజెడీ.. ఇటలీలో ఒక ఓపెరా.. జర్మనీలో ఒక మెలోడ్రామా.. ప్రస్తుతం ప్రేమ ఒక మార్కెట్‌ సరుకు’ అని వ్యాఖ్యానించారు.
వాణిజ్యంలో వాలెంటైన్స్‌ డే..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ ప్రేమికుల రోజున 25 కోట్ల పువ్వులు అమ్ముడవుతున్నాయనేది ఒక అంచనా. అలాగే 36 కోట్ల గుండె ఆకారపు చాక్లెట్‌ బాక్స్‌లు అమ్ముడవుతున్నాయంట. ఇవేకాకుండా టెడ్డీబేర్‌లు, వాలెంటైన్‌ కార్డులు, రంగురంగుల ప్రేమలేఖలు, స్వీట్లు, ఇతర బహుమతులు కోకొల్లలుగా అమ్ముడవుతున్నాయి.
వాలెంటైన్స్‌ డే వారోత్సవాలు..
వాలెంటైన్స్‌ డే వారోత్సవాలుగా జరుపుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 14 వరకు జరుపుకునే ప్రత్యేకతలు ఏమంటే.. 7వ తేదీన రోజ్‌డే, 8న.. ప్రపోజ్‌ డే, 9న.. చాకొలేట్స్‌ డే, 10న.. ప్రామిస్‌ డే, 11న.. టెడ్డీ డే, 12న.. హగ్‌ డే, 13న.. కిస్‌ డే, 14న.. వాలెంటైన్స్‌ డే. ఇవన్నీ నిజమైన ప్రేమకు అవసరం లేదు. కానీ మార్కెట్‌ మాయాజాలం వీటిని సరకుగా చేసుకునే కుతంత్రం చేస్తోంది. యువత మేల్కొవడమే పరిష్కారం.
ఉన్మాదం కాకూడదు..
ప్రేమ అనే భావవ్యక్తీకరణ భాష పుట్టుక ముందే పుట్టింది. ఇది ఆకర్షణ, అవసరం కానేకాదు.. వికసించి, వసివాడని కుసుమం. ఇది ఎవరూ నేర్పించేది కాదు. జీవనం నిజాయితీగా సాగేటప్పుడు పెల్లుబికే భావన. ప్రేమకు కులం, మతం, జాతి అనే గోడలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ గోడల్లో కుల దురహంకార హత్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ ఉన్మాదంలో కన్నబిడ్డలను కడతేర్చేందుకూ తల్లిదండ్రులు సిద్ధపడుతున్న దుస్సంఘటనలు జరుగుతున్నాయి. ప్రేమించానంటూ వెంటపడి వేధించడం, తిరస్కరిస్తే తట్టుకోలేక చంపడానికీ తెగబడడం చేస్తున్నారు. ప్రేమకు సరైన నిర్వచనం తెలీకపోవడమే వీటికి కారణం. ప్రేమ చావుని కోరుకోదు.. ప్రాణం పోసేదే నిజమైన ప్రేమ.
కెమికల్‌ రియాక్షన్‌…
ప్రేమ అనే ఫీలింగ్‌ కలిగినప్పుడు మెదడులో ఏం జరుగుతుందనే దానిపై హార్వర్డ్‌ మెడికల్‌ కళాశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మెదడులో విడుదలయ్యే కొన్ని రసాయనాల ఫలితమే ప్రేమ అని తేల్చి చెప్పారు. ప్రియురాలితో చూపు కలవగానే మెదడులో ఫినెల్‌ తలామిన్‌ అనే రసాయనం విడుదలవుతుంది. అరచేతుల్లో చెమట పట్టడం.. మోకాళ్లు వణకడం ఈ హార్మోన్‌ ప్రభావమే. ఈ లవ్‌ మాలిక్యూల్‌ కొద్ది మోతాదులో చాక్లెట్‌లా ఉంటుంది. అందుకనే వాలంటైన్‌ రోజు చాక్లెట్ల అమ్మకాలు ఊపందుకుంటాయి. ఒక మనిషిపై వ్యామోహం కలగడానికి మెదడు విడుదల చేసే అడ్రినలిన్‌, డోపమైన్‌, నారెఫీనెప్రిన్‌ హార్మోన్లే కారణం. నచ్చినవారి చూడగానే శరీరంలో ఈ హార్మోన్లు విడుదలై అనేక స్పందనలు కలిగిస్తాయి. అందుకే ప్రేమికులు గంటల కొద్దీ కబుర్లు చెప్పుకొంటారు. ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈ దశలో వీరిలో ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ రిలీజ్‌ అవుతుంది. దీని ప్రభావంతో ఒకరిని ఒకరు టచ్‌ చేయాలని, హగ్‌ చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ హార్మోన్ల ప్రభావం 3 నెలల నుంచి 18 నెలల వరకూ ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రేమ ప్రయాణం దీర్ఘ కాలం కొనసాగితే వాసోప్రెసిన్‌ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది ఇద్దరి మధ్య బంధం మరింత బలపడటానికి దోహదపడుతుంది.
సజీవ స్రవంతి..
ప్రేమ ఒకరోజుతోనో, రోజా పువ్వులు ఇచ్చుకోవడంతోనో, మురిపించే బహుమతులు ఇవ్వడంతోనో ముగిసిపోయే క్షణికావేశం కాదు. జీవితకాలం కొనసాగాల్సిన సజీవ స్రవంతి. ప్రేమంటే ఒకరి కోసం బతకటం లేదా చావటం కాదు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, అర్థంచేసుకునే తత్వం కలిగి ఉండడం. ఒక లక్ష్యంతో పనిచేసేవారు.. ఆశయాలను, సిద్ధాంతాలను, బలాలను, బలహీనతలను ఒకరికొకరు పంచుకోవాలి. అవగాహన చేసుకోవాలి. ‘ప్రేమ అమ్మ పాల వంటి స్వచ్ఛత, నాన్న ఆప్యాయతలాంటి బాధ్యత ఉండాల్సిన అనుభూతి’ అంటాడో కవి. ఇరువురి మనసులో ఒకరిపట్ల ఒకరికి నమ్మకం.. చేతల్లో భరోసా ఉండడమే ప్రేమగా మెలగడం.
అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

]]>
గ్రౌండ్‌లోకి దిగితే చిచ్చరపిడుగే.. https://navatelangana.com/if-you-get-into-the-ground/ Sat, 01 Feb 2025 17:48:23 +0000 https://navatelangana.com/?p=495637 Gongadi Trishaభారత మహిళా క్రికెట్‌కు మరో భవిష్యత్‌ తార దొరికింది. అటు బ్యాట్‌తోనూ… ఇటు బంతితోనూ మ్యాజిక్‌ చేస్తూ తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అందరి దష్టిని ఆకర్షిస్తోంది. మహిళల అండర్‌ – 19 ప్రపంచకప్‌ టోర్నీ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా 19 ఏండ్ల త్రిష చరిత్ర సష్టించింది. స్కాట్లాండ్‌తో సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఈ కప్‌లో మరో విజయాన్ని అందించింది. ఇప్పటికే సెమీఫైనల్‌ చేరిన టీమ్‌ఇండియా.. ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అమె తన ఆధిపత్యం చాటుకుంది. గత 2 దశాబ్దాల నుంచి ఆటల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. వివక్షతలను ఎదిరించి, అడ్డంకులను అధిగమించి క్రీడల్లో మెరుస్తున్నారు. మిథాలీ, మేరీకోమ్‌, అశ్వనీ నాచప్ప, సింధు, ఛానుల బాటలో నడుస్తూ.. ఎందరో ‘యంగ్‌ ప్లేయర్స్‌’ వివిధ క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రముఖ క్రీడా మణిరత్నం, జాతీయ మహిళల అండర్‌-19 ప్రపంచ కప్‌ టోర్నీ తన సత్తా చాటుతోంది భద్రాద్రి యువతి.
‘తన కూతురు క్రికెట్‌లో బాగా రాణించగలదు..’ అని బలంగా నమ్మిన ఆమె తండ్రి చిన్న వయసు నుంచే ఆమెను ఈ దిశగా ప్రోత్సహించారు. ఈ క్రీడలో రాణించేలా అడుగడుగునా వెన్నుదన్నుగా నిలిచారు. ఆ కూతురి కష్టానికి, ఆ కన్నతండ్రి ప్రోత్సాహానికి ప్రతిఫలం తాజాగా దక్కింది. ప్రస్తుతం కౌలాలంపూర్‌ వేదికగా జరుగుతోన్న ‘అండర్‌-19 టీ20 మహిళల ప్రపంచకప్‌’లో సెంచరీతో చెలరేగింది త్రిష. తద్వారా ఇప్పటివరకు ఈ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసిన మహిళా క్రికెటర్‌ గా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకున్నదామె. దీంతో ఈ యువ ప్లేయర్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది.
టీ-20లో అర్ధ సెంచరీ చేయడమే చాలా అరుదు. అలాంటిది మెరుపు వేగంతో సెంచరీ చేయడమంటే అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది గొంగడి త్రిష. ప్రస్తుతం జరుగుతోన్న ‘అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌’లో పరుగుల వరద పారించి.. 59 బంతుల్లోనే 110 పరుగులతో అజేయంగా నిలిచిందీ తెలంగాణ అమ్మాయి. ఇలా ఈ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసిన మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సష్టించిందీ డ్యాషింగ్‌ బ్యాటర్‌.
అమ్మాయైనా, అబ్బాయైనా…
త్రిష తెలుగమ్మాయి. ఖమ్మంలోని భద్రాచలం ఆమె స్వస్థలం. ఆమె తండ్రి రామిరెడ్డికి ఆటలంటే మక్కువ ఎక్కువ. అదే ఇష్టం తన ఒక్కగానొక్క కూతురు త్రిషలోనూ ఉందని గుర్తించిన ఆయన.. పసి వయసు నుంచే ఆమెను ఈ దిశగా తండ్రి రామిరెడ్డి, ఆమె తల్లి మాధవి ప్రోత్సహించారు. తొలుత టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌.. వంటి ఆటల్లో రాణించేలా తన చిట్టితల్లిని ప్రోత్సహించాలనుకున్న ఆయన.. తన కూతురి శారీరక సత్తువ, దేహదారుఢ్యం క్రికెట్‌కే బాగా సరిపోతుందని గుర్తించారు. ఈ క్రమంలో చిన్న వయసులోనే త్రిషను క్రికెట్‌ ట్రైనింగ్‌లో చేర్పించానని చెబుతున్నారు.
‘త్రిష మా ఒక్కగానొక్క కూతురు. తను పుట్టకముందే.. మాకు పుట్టబోయేది అమ్మాయైనా, అబ్బాయైనా ఆటల్లో ప్రోత్సహించాలనుకున్నా. నా ఇష్టమే నా కూతురిలోనూ ఉందని నెలల వయసులోనే గుర్తించా. ఇంట్లో టీవీలో మేమంతా క్రికెట్‌ చూస్తుంటే పసి వయసులోనే తనూ మ్యాచులు చూసేది. మేం మ్యాచుల్ని ఎంజారు చేస్తుంటే తనూ కాళ్లూ, చేతులు కదిలిస్తూ నవ్వేది.. అది చూసి మేం ఆశ్చర్యపోయేవాళ్లం. అలా క్రికెట్‌ ఆటంటే తనకెంతో ఇష్టమని గుర్తించి రెండేళ్ల వయసు నుంచే ఈ క్రీడలో ప్రోత్సహించాం. తొలుత ప్లాస్టిక్‌ బాల్‌, బ్యాట్‌తో సాధన చేసేది. ఆపై టెన్నిస్‌ బాల్‌తో సాధన చేయించా. రోజుకు 200-300 బాల్స్‌ని ఫేస్‌ చేసేది. క్రమంగా ఈ సంఖ్యను పెంచుతూ పోయా. ఇక తనకు ఏడేళ్లొచ్చాక సికింద్రాబాద్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించా..’ అంటూ తన కూతురి గురించి చెబుతున్నారు రామిరెడ్డి.
భద్రాచలం టు హైదరాబాద్‌
త్రిష ఏడేండ్ల వయసులో మేము భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. మంచి కోచింగ్‌ కావాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. దాని కోసం వారికి ఊళ్లో ఉన్న జిమ్‌, నాలుగు ఎకరాల పొలం అమ్మేశారు. కూతురి భవిష్యత్తు ముందు మిగతావన్ని తక్కువేం కాదు. హైదరాబాద్‌లో టాప్‌ కోచ్‌లు ఉన్న సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. వారి ఆధ్వర్యంలో మంచి నైపుణ్యం సంపాదించింది త్రిష. ఏడాది తిరిగేలోపే తెలంగాణ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టోర్నీ, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆడింది. ఎనిమిదేండ్ల వయసులో అండర్‌-16 రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. అందరిలో గుర్తింపు, ఇవన్నీ చూశాక తనకు ఆటపై ఆసక్తి, ఇష్టం మరింత ఎక్కువయ్యాయి. భారత జట్టుకు ఆడాలన్న పట్టుదల పెరిగింది.
పదమూడేండ్లకే మిథాలీరాజ్‌ తో
త్రిష క్రికెటర్‌ కావాలన్న స్ఫూర్తి రగిలించింది మిథాలీరాజ్‌. పదమూడేండ్లకే మిథాలీరాజ్‌తో కలిసి ‘సీనియర్‌ చాలెంజర్స్‌’ ఆడింది. ఆ తరువాతే తను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైంది. అక్కడి నుంచి అండర్‌-19 ప్రపంచ కప్‌ జట్టులో స్థానం సంపాదించింది. ఫైనల్స్‌లో రాణించి జట్టు విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడు ప్రపంచ కప్‌తో తిరిగి వస్తోంది. స్వతహాగా త్రిష ఓపెనరే అయినా ఏ స్థానంలోనైనా ఆడగలనని నిరూపించుకుంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొనే బ్యాట్స్‌ ఉమన్‌గా పేరు సంపాదించింది.
క్రికెట్‌లో శిక్షణ కోసమే చాలా ఖర్చు అవుతున్నా తండ్రి మాత్రం వెనకడుగు వేయకుండా ప్రోత్సహిస్తున్నారు. ‘అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌’లో సెంచరీ చేయడం గొప్ప అనుభూతి. ఈ క్షణాన్ని నాన్నతో కలిసి పంచుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను..’ అంటోందీ యంగ్‌ క్రికెటర్‌.
క్రికెట్‌నే తన కెరీర్‌గా
చిన్న వయసులోనే క్రికెట్‌నే తన కెరీర్‌గా మార్చుకున్న త్రిష.. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. మైదానాన్ని ఎంత ప్రేమించిందో తరగతి గదిని అంతే గౌరవించింది. చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ప్రాక్టీస్‌ కారణంగా స్కూలుకు వెళ్లలేకపోయినా ఇంట్లోనే ట్యూషన్లు పెట్టించుకొని మరీ పరీక్షలు రాసిందీ స్టార్‌ ప్లేయర్‌. ఉదయం, సాయంత్రం నాలుగ్గంటల చొప్పున రోజుకు ఎనిమిది గంటలు క్రికెట్‌ సాధనే.. దీంతో స్కూలుకెళ్లడమే కష్టంగా మారింది. అయినా చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఇంట్లోనే ట్యూషన్లు పెట్టించుకొని మరి ఫైనల్‌ పరీక్షలు రాసింది. చిన్నప్పటి నుండి ఉన్న మొండితనమే తనను క్రికెట్‌లో రాణించేలా చేస్తోంది. ప్రస్తుతం సైనిక్‌పురి భవన్స్‌ కాలేజీలో ఇంటర్‌ (సీఈసీ) సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది.

అనంతోజు మోహన్‌కృష్ణ 8897765417

]]>
గుండె వీణ గొంతులో కొత్త రాగం https://navatelangana.com/a-new-melody-in-the-throat-of-the-heart-harp/ Sat, 25 Jan 2025 17:03:46 +0000 https://navatelangana.com/?p=490395 A new melody in the throat of the heart harp”జరీ లేని చీరల్లే / వాడే పువ్వల్లే / ఫేసే చినబోయే చూడమ్మా / పొలమారి పోయేలా /ఉండే నీ అందం /చూస్తే గోవిందం ఈ జన్మ’- అంటూ కవ్వించే కవిత్వంతో కుర్రకారును కిర్రెక్కిస్తున్నాడు నాగరాజు కువ్వారపు. కవిగా, వర్ధమాన సినీగేయ రచయితగా సుపరిచితులైన ఈ పల్లెటూరి పిల్లగాడు మొదటి సినిమా అనుభవం ఒక గమ్మత్తుగా జరిగిందంటూ నవతెలంగాణ ‘జోష్‌’తో పంచుకున్న కబుర్లు ఇవి.
1991 సెప్టెంబర్‌ 21 న ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో శ్రీనివాసరావు, అరుణ దంపతులకు జన్మించారు. తండ్రి తెలుగు అధ్యాపకులు కావడంతో నాగరాజుకు చిన్నతనం నుంచే తెలుగు సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. కవితలు రాయడం, పాటలు పాడడం అభిరుచిగా అలవడింది. అతనికి సినిమా పాటల్లోని సాహిత్యంపై కూడా మరింత ఆసక్తి. నిరంతర అధ్యయనాన్ని అలవాటు చేసుకున్నారు. 2009-2013 ఖమ్మంలోని ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ సెన్సెస్‌లో ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో బి.టెక్‌ పూర్తి చేశారు. అయినా సాహిత్య రంగంలోనూ తన సత్తా చాటుకున్నారు. కవిత్వంతోనే తప్తి పడకుండా పాటల రచన వైపు కూడా అతని కలం అడుగులు వేయడం ప్రత్యేకమైన విషయం. 2012 లో ఆయన రాసిన- ‘ఏవో కొన్ని భాషల్లో ఏదో కొత్త భావంలా నన్నే నువ్వు తరుముతూ ఉంటే నే నిలిచేదెలా’ అన్న ప్రణయగీతం (ప్రయివేటు) అతనికెంతో పేరు తీసుకొచ్చింది.
తండ్రి శ్రీనివాసరావు తెలుగు అధ్యాపకులుగా కల్లూరు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారు. 2007 వందేమాతరం వందేండ్ల వేడుకల్లో వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి పొందడం సాహిత్యం వైపు అడుగులు పడడానికి కారణం. తండ్రి వైపు వాళ్లు గాయకులు, తల్లి వైపు వాళ్లు సంగీతకారుల పరంపర ఉండడం పాటలు రాయడానికి, సాహిత్యం వైపు అడుగులు పడడానికి కారణం. 6వ తరగతి నుంచి హిందీ టీచర్‌ జగన్నాధరావు ప్రోత్సాహంతో పాటలు పాడడం మొదలై బి.టెక్‌ వరకు గాయకుడిగా ఎన్నో పోటీల్లో గెలిచి బహుమతులు పొందారు.
పదవ తరగతి నుంచి చిన్న చిన్న కవితలు రాస్తూ 2012 నుంచి పాటలు రాయడం ప్రారంభించారు. 2013లో మొదటిగా పాటలు రాసిన చిత్రం ”యూటర్న్‌” చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో.. పాటలు రాయడమే లక్ష్యంగా పెట్టుకుని 50 షార్ట్‌ ఫిల్మ్స్‌కు పాటలు రాశారు. ”ఓరు ఇడియట్‌” చిత్రంలో ఆరు పాటలు (సింగిల్‌ కార్డ్‌) రాశారు. రీసెంట్‌ గా ”రేంజ్‌ రోవర్‌” చిత్రంలో రెండు పాటలు రాశారు. వీడియో ఆల్బమ్స్‌, స్పాటిఫై ఇండిపెండెంట్‌ సాంగ్స్‌ మొత్తంగా 200 పై చిలుకు పాటలు రాశారు.
ఎలా ఆసక్తి వచ్చిందంటే
”చిన్నపుడు మా ఇంటి దేవుడి గదిలో తాతయ్య పాడిన భజన పాటల విన్నప్పటి నుంచి పాట నా జీవితంలో భాగమే. 4వ తరగతి నుంచి సినిమా థియేటర్‌లో చూడడం, పాటలు బాగా వినడం, పాడడం, పాటల గురించి తెలుసుకోవడం అలవాటే. మా చిన్నాన్నకి పాటల కలెక్షన్‌ హాబీగా ఉండేది. ఆయన అనేకానేక పాటలను రోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో వినిపించేవారు. అప్పటి నుంచే మొదలైంది నాకు సినిమా పిచ్చి. సిరివెన్నెల, శంకరాభరణం ప్రేమదేశం, ప్రేమికుల రోజు, బొంబాయి పాటలు విని నేను పీకల్లోతు పాటల ధ్యానంలో మునిగిపోయా. 6వ తరగతి నుంచి ”తూనీగా తూనీగా” అంటూ ”మనసంతా నువ్వే” సినిమాలో పాటను స్కూల్‌ అందరికీ బాగా పాడతానని తెలిసేదాక పాడించారు మా హిందీ టీచర్‌ జగన్నాథరావు. అలా ఎన్నో వేదికలపై పాడిన పాటలే నాతో పాటలు రాయించే ధైర్యం, శక్తిని తెచ్చాయి. దానికి తోడు ఇంటర్‌ నుంచి చదివిన ”అమతం కురిసిన రాత్రి”, ”మహాప్రస్థానం”, ”ప్రపంచ పదులు”, ”విశ్వంభర”, ”అసమర్ధుని జీవయాత్ర”, ”అతడు అడవిని జయించాడు” ఇలా చదివిన ఎన్నో కవితలు, నవలలు నాతో నిత్య చైతన్య రచనా స్ఫూర్తిని కలిగించాయి.
పాటలు రాసే మొదట్లో తీవ్రమైన వ్యతిరేకతని ఇంట్లోనూ, కాలేజీలోనూ చవిచూసాను. చదివింది బీటెక్‌. ఇంగ్లీష్‌ మీడియం చదువులు అవ్వడంతో మా ఫ్రెండ్స్‌ ఎవరికి తెలుగు రాదు. ఎవరికి నేను అర్థం కానట్టే ఉండేది నా పోకడ, కానీ నాకు అదే ఇష్టం అదే చేస్తూ పోతూ ఉండేవాడ్ని. మా నాన్న తెలుగు అధ్యాపకులు అవ్వడం వల్ల వాళ్ళ స్టాఫ్‌ పిల్లలు అంతా ఏవేవో చేసి ఏదేదో అయిపోతున్నారని కొంచెం ఒత్తిడి తెచ్చేవారు ఏదో ఐపోవాలని, ఏదో చేసెయ్యాలని. ఆ సమయంలో నాయనమ్మ, తాతయ్య ఇచ్చిన భరోసా మరువలేనిది. వాళ్లే చిన్నతనం నుంచి నా వెనకుండి బలంగా ముందుకు నడిపించింది” – అంటూ చెప్పుకొచ్చారు.
కొన్ని అనుభవాలు
”నా మొదటి సినిమా అనుభవం ఒక గమ్మత్తుగా జరిగింది. నేను కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌కి పాటలు రాశాక ఆర్ధిక సమస్యల వల్ల ”అమీర్‌ పేటలో” సినిమాలో హీరోకి ”పర్సనల్‌ అసిస్టెంట్‌” గా పని చేయడానికి వెళ్లాను. అప్పటికే 70 శాతం షూటింగ్‌, ఐదు పాటలు రాయడం, షూట్‌ చేయడం అయ్యాయి. చాలామంది ”సాఫ్ట్‌వేర్‌ లైఫ్‌ కోసం” సాంగ్‌ రాయడానికి ప్రయత్నించారు కానీ చివరగా నేను రాసిందే నచ్చడం ట్యూన్‌ కూడా నాదే అవ్వడం ఒకే రోజులో పాట రాయడం ముగియడం మంచి జ్ఞాపకాలు. ఒకతను ఒక పాట కోసం నన్ను 10 రోజులు 10 వేరు వేరు వెర్షన్స్‌ పాటలు రాయించాడు. వాటిలో లైన్స్‌ పొదిగి నేనే రాసాను. పాట నాకు నచ్చేలా నువ్వేం రాయలేదన్నాడు. అదొక చేదు అనుభవం. పాట రాయడం ఒక తపస్సు. నేను పాట రాసేటపుడు కూడా ఒక తపస్సులాగే రాస్తాను. సినిమాకి రాసిన ప్రతి పాట నాకు ఎంతో అపురూపం. పాట రాయడం మొదలెడితే 3-5 రోజులు అదే లోకంలో ఉండి రాస్తుంటాను. ”ఉత్తర” సినిమాలో ”ఓ చూపే చుక్కల ముగ్గులా” పాట అలా రాసిందే. కష్ణానగర్‌ కష్టాలు మొదటి దశలో నేను అనుభవించిన వాడినే. ఏ సహకారం లేకుండా, ఎవరు సినిమా పరిశ్రమలో తెలిసిన వాళ్ళు లేకుండానే నా ప్రయాణం మొదలై 200 పాటలు రాసేంత వరకు కొనసాగింది, కొనసాగుతోంది.- అంటూ తన అనుభవాలు పంచుకున్నారు.
తొలి సినిమా పాట
2016 లో దర్శకులు అనిల్‌ మద్దెల ప్రోత్సాహంతో ‘అమీర్‌ పేట్‌ లో..’ (2016) ‘సాఫ్ట్‌ వేరు లైఫ్‌ కోసం..’ అనే పాటతో గీత రచయితగా అతని సినీ ప్రస్థానం మొదలైంది. ఈ పాటలోని- ‘ముందు చూస్తే పొట్ట నెత్తిపైన బట్ట కంటి చూపు ఫట్టా పిల్లనివ్వట్లేదు ఎట్టా’ వంటి వాక్యాలు సాఫ్ట్‌ వేరు జీవితాలను కళ్ళముందుంచుతుంది. సాఫ్ట్‌ వేర్‌ జీవితాల వ్యదార్థగాథలను అక్షరబధ్ధం చేశారీపాటలో.
వలపు పాటలు
అలాగే- 2017 లో వచ్చిన ‘ఉందా లేదా?’ అనే సినిమాలో ‘సెల్ఫీపిల్లా’ అనే పాటను రాశారు. ఈ పాటలోని ‘నింగిలోని పాలపుంత కూడా చిన్నబోదా నిన్ను చూస్తే’ వంటి పంక్తుల్లో ప్రేయసి అందాన్ని కవిత్వీకరించిన తీరు కనబడుతుంది. అలకలో ఉన్న చెలిని బుజ్జగిస్తూ, ఆమె అందచందాల్ని పొగడుతూ సాగే ఈ పాట ఎంతో హద్యంగా ఆకట్టుకుంటుంది. ఇదే సినిమాలో ‘పిల్లా..రసగుల్లా’ అనే పాటను కూడా ఆయన రాశారు. లేతవయసులో ప్రేమ చేసిన సందడికి పులకించిన ప్రేమికుడు పరవశించి పాడే పాట ఇది. ఈ పాటలోని ‘నా చుట్టూ ఉన్న లోకాన్ని మరచిన.. ముందే ఉన్న రూపాన్ని కలిసిన.. చూపుల్లోని బాణాలు తగిలిన నిన్నే చూస్తున్నా..’ అంటూ ప్రేయసి చేసిన తొలివలపు గాయానికి ప్రేమికుడిలో చిగురెత్తిన వయసు తపనను ఈ పాటలో స్పష్టంగా ఆవిష్కరించారు నాగరాజు. అలాగే – ‘ఉత్తర’ (2020) సినిమాలో ఆయన రాసిన – ‘ఓ చూపే చుక్కల ముగ్గులా.. రూపం గోపెమ్మలా..’ అనే పాట కూడా చక్కటి ప్రణయ భావుకతను చాటుతుంది. ఈ పాటలోని ‘నీ వలన గుండె చాటున ఉన్నట్టుండి వింతభావన’ అనే వాక్యంలో తొలిప్రేమలోని సోయగం కనబడుతుంది. ‘అందాల దేవత భూలోకవాసిగా మారిముందుంటె చూస్తున్నా..’ అంటూ ప్రేయసిని స్వర్గలోక దేవతగా భావించిన వైనాన్ని, ప్రేమికుడు ఆమెపై చూపిస్తున్న నిండైన ప్రేమకు సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇలాంటి ప్రేమపాటల రచనలో ఆయన కలం సరికొత్తగా ఉరకలేసిందని చెప్పవచ్చు.
‘ఓరు ఇడియట్‌’ (2020) సినిమాలోని పాటలన్నీ ఆయన రాసినవే. ప్రతి పాట ఎంతో వైవిధ్యభరితంగా ఉంది. అటు ప్రణయాన్ని, ఇటు విషాదభరితమైన ప్రేమనుఆవిష్కరించే పాటల్ని ఆయన రాశారు. అందులో- ‘కనుపాపే కన్నీటితో తడిసే వేళ’ అనే పాట సరికొత్త అభివ్యక్తిని వ్యక్తపరుస్తుంది. ఈ పాటలోని ‘గాజు బొమ్మల్లే చూసుకున్నానే గాయమే చేసి వెళ్ళిపోతుందే తీపిముల్లలే గుచ్చుకున్నాదే..’ వంటి పంక్తుల్లో విరహభావన వింతగా తొంగిచూస్తుంది. ఇలా ఈ సినిమాలోని ప్రతి పాట లయబద్ధంగాను,కవితాత్మకంగాను ఎంతో చక్కగా ఆవిష్కృతమయ్యాయి.
ఆయన ప్రతిభాపాటవాలకు మెచ్చి ఎన్నో పురస్కారాలు వరించాయి. 2016 లో ‘నాన్నతో అనుబంధం’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి గాను ఉత్తమ గీతరచయితగా పురస్కారం, 2017లో తెలంగాణ కళాపరిషత్‌ వారి ఉగాది పురస్కారం మొ. గౌరవ సత్కారాలు ఆయన అందుకున్నారు. సినిమా పాటలే కాకుండా ఎన్నో ప్రైవేటుగీతాలను కూడా ఆయన రాశారు. కవిగానే కాకుండా గాయకుడిగా కూడా ఆయన ప్రజ్ఞ ప్రశంసనీయం. దాదాపు 9 సార్లు ఉత్తమ గాయకుడిగా పురస్కారాలను అందుకున్నారు. ఇలా అద్భుతమైన సినీపాటలతో దూసుకుపోతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నాగరాజు కువ్వారపు.
కుటుంబం : భార్య- వెంకటరావమ్మ కూతురు- అభిజ్ఞ, కొడుకు- శ్రీ ఆదిత్య
పాటల్లోని పంక్తులు
తి బాడీలోకెళ్లే రోజుల్లో
గుడిలో విన్న పాటలా
గుండె వీణ గొంతులో
కొత్త రాగం నీ పేరు

తి ఏవో కొన్ని భాషల్లో
ఏదో కొత్త రాగంలా
నన్నే నువ్వు తడుముతూ ఉంటే
నే నిలిచేదెలా
ఇంకో కొత్త లోకంలో
ఇంకా కొంత దూరంలో
నన్నే విడిచి నువ్వెళిపోతే
నే బ్రతికేదెలా

తి భూమ్యాకర్షణ న్యూటన్‌ సిద్ధాంతం
నీ చుట్టూ జరిగే ఘర్షణ అది నా సిద్ధాంతం
ఫీలింగ్స్‌ ప్రేరణ ఈ ప్రేమల్లో సహజం
ఇనుము అయస్కాంతం థియరీలో అది ప్రత్యక్షం

తి చూపులు ఆగవు చూడకపోతే
ఊసులు సాగవు చెప్పకపోతే
రెక్కలు లేని విహంగమల్లే ఉంటా
ఆశలు తుంచకే మాటలు ఆపి
అలజడి పెంచకే గుండెను మీటి
అందని తారగ దూరం అయిపోతావా

తి విరబూసే రంగుల్లో
చెలి రూపం చూసాలే
తొలిసారి నా కళ్ళతోనా
ఎదలోక యువరాణికి
ఈ చిత్రం చూపించనా
ఆకుల్లా నా గుండెను
పరిచానే నీ ముందర

తి ముచ్చట్లే చెప్తుంటే మహారాణల్లే ఉంటావే
నువు గుమ్మంలో కూర్చుంటే చాలు అనిపిస్తుందే
కన్నుల్లో లోకాన్ని నువు దాచావో ఏమోలే
స్వప్నాలన్నీ నీలో చూసానే

తి తీరంలేని కడలి
ఉగ్రరూపం చూసేదెవరు
ఒంటరిదైన మదిలో
మంట రేపితే ఆర్పేదెవరు

తి నన్నింత శూన్యంలో
నువ్వుంచి వెళ్ళొద్దే
నేనుండలేనంట ఈ బాధలోన
నా ప్రపంచమంతా
నన్నే కాదంటే ఇంకేం చెయ్యాలే
నే పరాయివాడై
ఉన్నా నీ ముందే ఇంకేం కావాలే

తి నడిచే ప్రతి అడుగులోనా
ఏడడుగులతో పోల్చుకోనా
ఇలా ప్రతి నిమిషము
ఆనందంగా ఎగిరిపోనా
సదా నీ చెలిమికై
పూల దారిలోన మేలుకుంటున్నా

తి సంద్రాన చినుకులే
తన పాదాల పరుగులే
తీరాల మలుపులో
తను కోరింది చెలిమినే
అనంతోజు మోహన్‌కృష్ణ 8897765417

]]>