Josh Archives - https://navatelangana.com/category/josh/ Sat, 04 May 2024 17:32:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Josh Archives - https://navatelangana.com/category/josh/ 32 32 జొమాటో టు బ్లింకిట్‌ https://navatelangana.com/zomato-to-blinkit/ Sat, 04 May 2024 17:31:13 +0000 https://navatelangana.com/?p=283600 అనంతోజు మోహన్‌కృష్ణ దాదాపు 16ఏండ్ల క్రితం ఇద్దరు యువకులు ఢిల్లీ సరిహద్దుల్లోని గురుగ్రామ్‌లో ఉన్న యాంబియెన్స్‌ మాల్‌లోని ఓ కేఫ్‌కు లంచ్‌కి వెళ్లారు. అక్కడ అనేక మంది వివిధ రెస్టారెంట్ల ఫుడ్‌ మెనూలను చూస్తున్నారు. చాలా రద్దీగా ఉంది. ఏదో విధంగా భోజనం పూర్తి చేసుకొని ఆఫీసుకి తిరిగొచ్చారు. అక్కడ తమ సహచరులంతా ఫుడ్‌ మెనూ గురించి చర్చించుకుంటుండడం వీరిద్దరూ గమనించారు. అప్పుడు తట్టింది. ఫుడ్‌ మెనూలన్నింటినీ.. ఓ డిజిటల్‌ వేదికపైకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అని. స్టాక్‌ఎక్సేంజ్‌ల్లో నమోదై చరిత్ర సష్టించిన జొమాటో ప్రస్థానం 2008లో అలా ప్రారంభమైంది. ఆ ఇద్దరు యువకులు జొమాటో వ్యవస్థాపకులు దీపిందర్‌ గోయల్‌, పంకజ్‌ చద్దా.
తొలుత ఫుడీబే.కామ్‌
వెంటనే ఆ మెనూలన్నింటినీ స్కాన్‌ చేసి తమ కంపెనీ ఇంటర్‌నెట్‌లో రెస్టారెంట్ల డైరెక్టరీని రూపొందించారు. కొన్ని రోజుల్లోనే డైరెక్టరీకి ట్రాఫిక్‌ విపరీతంగా పెరగడం గమనించారు. దీన్ని ఫుడీబే.కామ్‌గా మార్చి ఓ వెబ్‌సైట్‌గా రూపొందించారు. సేవల్ని ఢిల్లీ వ్యాప్తంగా విస్తరించారు. కొద్ది నెలల్లోనే మంచి ఆదరణ లభించింది. ముంబయి, కోల్‌కతాకు కూడా సేవల్ని చేర్చారు. కాలేజీలో ఉన్నప్పుడే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలకు సంబంధించిన ఆలోచన వచ్చిందని గోయల్‌ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. పిజ్జా కోసం లైన్లో నిలబడడం చిరాకుగా అనిపించి ఆ ఆలోచన తట్టినట్లు ఆయన చెప్పారు.
జొమాటోగా రూపాంతరం
ఫుడీబే.కామ్‌కు ఆదరణ పెరగడంతో దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని భావించారు. అయితే, అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన ‘ఈబే’ అనే ఇ-కామర్స్‌ సంస్థ పేరుతో పోలి ఉండడంతో పాటు ఫుడీబే అనే పదం కష్టమర్లను అంతగా ఆకట్టుకోకపోవచ్చునని ఆలోచించారు. అందరికీ సులభంగా గుర్తుండేలా 2010లో జొమాటోగా నామకరణం చేశారు. అయితే, జొమాటో అనే పేరు ఎంపిక వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. అప్పటికే రిజిస్టర్‌ అయి ఉన్న ‘జొమాటో.కామ్‌’ అనే యూఆర్‌ఎల్‌ను ఓ ప్రముఖ బ్రాండింగ్‌ సంస్థ నుంచి కొనుగోలు చేశారట. భారత్‌లో ప్రతి వంటింట్లో ఉంటే ‘టొమాటో’ అనే పదంతో జొమాటో సరిపోలి ఉండడంతో ఇది వారిని బాగా ఆకట్టుకుందట! వెంటనే సంస్థ పేరును సైతం జొమాటోగా మార్చారట!
సర్‌ప్రైజుల సీఈవో
ఏదో ఒక ప్రొడక్ట్‌ లాంచ్‌ చేశామా? రెండు, మూడు యాడ్స్‌ తీసి ప్రచారం చేశామా? అంటే సరిపోదు. ప్రజల్లోకి ఆ ప్రొడక్ట్‌ని తీసుకెళ్లాలన్నా, మార్కెట్‌లో దూసుకుపోవాలన్నా.. కాలానికి అనుగుణంగా వినూత్న ప్రచార కార్యక్రమాలకు తెరతీస్తూ ఉండాలి. జనాలు మైమరిచిపోయేలా సరికొత్త విధానాల్ని అవలంభించాలి. ఆయా సందర్భాల్లో సర్‌ప్రైజ్‌లు కూడా ఇస్తుండాలి. జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ అలాంటి సర్‌ప్రైజులు ఇవ్వడంలో అందెవేసిన చేయి. ఏ సీఈవో కూడా గతంలో ఇలాంటి సర్‌ప్రైజులు ఇచ్చి ఉండరు. అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. తానే డెలివరీ బారుగా రంగంలోకి దిగి.. డెలివరీ పార్ట్‌నర్స్‌, రెస్టారెంట్‌ పార్ట్‌నర్స్‌, కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీ చేశాడు.
ప్రతి మూడు నెలలకోసారి
టిప్‌టాప్‌గా ఆఫీసుకు రావడం.. ఉన్నత స్థాయి ఉద్యోగులతో చర్చించడం.. వ్యాపార విస్తరణ ప్రణాళికలు రూపొందించు కోవడం.. సాధారణంగా ఓ కంపెనీ సీఈఓ దినచర్య ఇలానే ఉంటుంది. కానీ జొమాటో సీఈఓ, ఆ కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ అలా కాదు. ఎంచక్కా సాధారణ డెలివరీ బారులా రెడ్‌ టీ షర్ట్‌ ధరించి.. బైక్‌ మీద ఫుడ్‌ డెలివరీలు చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి కాదు.. ప్రతి మూడు నెలలకోసారి.. గడిచిన మూడేళ్లుగా ఆయన ఇదే పనిచేస్తున్నారట. నౌకరీ.కామ్‌ యజమాని సంజీవ బిక్‌చందానీ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించేవరకు ఎవరికీ తెలియదు.
దీపిందర్‌ గోయల్‌ ఒక్కరే కాదు ఆ కంపెనీలో పనిచేసే సీనియర్‌ మేనేజర్లందరూ ఇదే తరహాలో ప్రతి మూడు నెలలకోసారి డెలివరీ బారు అవతారం ఎత్తుతుంటారని సంజీవ్‌ తెలిపారు. రోజంతా ఫుడ్‌ డెలివరీలు చేస్తుంటారని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లుగా దీపిందర్‌ ఇదే పనిచేస్తున్నారని వివరించారు.
పెట్టుబడుల వెల్లువ
జొమాటో వద్ధిని పసిగట్టిన అనేక పెట్టుబడి సంస్థలు నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చాయి. అలాగే మొట్టమొదటి సారి ‘ఇన్ఫోఎడ్జ్‌’ అనే ప్రముఖ సంస్థ రూ.60 లక్షల నిధులను అందజేసింది. అలా 2010-2013 మధ్య ఇన్ఫోఎడ్జ్‌ పలు దఫాల్లో 16.7 మిలియన్‌ డాలర్ల నిధుల్ని సమకూర్చి 57.9 శాతం వాటాల్ని సొంతం చేసుకుంది. అనంతరం 2013లో సెకోయా క్యాపిటల్‌ నుంచి కూడా భారీగా నిధుల్ని రాబట్టింది. సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్‌, వై క్యాపిటల్‌, అలీబాబాకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌, కోరా, టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా జొమాటోకు నిధులు సమకూర్చాయి.
విదేశాల్లో జొమాటో రుచులు
2012లోనే జొమాటో తమ సేవల్ని విదేశాలకు విస్తరించింది. తొలుత యూఏఈలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఖతార్‌, దక్షిణాఫ్రికా, యూకే, ఫిలిప్పైన్స్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, టర్కీ, బ్రెజిల్‌లో సేవలు అందుతున్నాయి. ఈ సమయంలోనే ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ యుగం ఊపందుకుంటుండడంతో మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సంస్థ రూపురేఖలే మారిపోయాయి.
కొనుగోళ్లే సగం బలం
ఈ ప్రయాణంలో ఇటు భారత్‌తో పాటు విదేశాల్లో అనేక కంపెనీలను జొమాటో కొనుగోలు చేసింది. దాదాపు 12 అంకుర సంస్థల్ని తనలో కలుపుకొంది. పోలండ్‌లోని రెస్టారెంట్‌ సెర్చ్‌ సర్వీస్‌ గ్యాస్ట్రోనౌసి, ఇటలీకి చెందిన సిబాండో, అమెరికాలోని అర్బన్‌స్పూన్‌, మ్యాపిల్‌ గ్రాఫ్‌, నెక్ట్స్‌ టేబుల్‌, టైనీబౌల్‌, ఉబర్‌ఈట్స్‌.. ఇలా అనేక సంస్థలు జొమాటోలో కలిసిపోయాయి.
ఇప్పుడు ‘బ్లింకిట్‌’
పబ్లిక్‌ ఇష్యూలో హిట్‌ కొట్టిన జొమాటో భవిష్యత్తులో తమ సేవల్ని ఇతర రంగాలకు కూడా విస్తరించాలని యోచిస్తోంది. నిత్యావసర సరకుల డెలివరీని కూడా ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మనకు ఏమి కావాలన్నా మనచెంతకే వచ్చేలా చేసుకుంటున్నాం. అలాంటి వాటి కోసమే కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే ‘గ్రోఫర్స్‌’ పేరిట యాప్‌ను కూడా రూపొందించింది. కరోనా మహమ్మారి సమయంలో కొన్ని నగరాల్లో ఈ సేవల్ని ప్రారంభించింది. క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌ (గతంలో గ్రోఫర్స్‌) సైజు జొమాటో ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌న మించిపోనుంది. 2022లో బ్లింకిట్‌ను జొమాటో 57 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కిరాణా, ఆహార ఉత్పత్తుల వంటి నిత్యావసరాలను డెలివరీ చేసే ఈ ప్లాట్‌ఫామ్‌ ప్రస్తుతం ఐఫోన్స్‌ కూడా డెలివరీ చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ మొత్తం ఆదాయంలో జొమాటో ఫుడ్‌ డెలివరీ వ్యాపార వాటా56 శాతంగా ఉంది. కంపెనీ తదుపరి వద్ధికి బ్లింకిట్‌ చోదకం కానుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్లింకిట్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించి పూర్తి స్థాయి ఈ-కామర్స్‌ కంపెనీగా మార్చే దిశగా జొమాటో ఆలోచిస్తోంది.
ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌
శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభించింది. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌లోనే అత్యధిక శాతం శాకాహారులు.. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్‌ల ఎంపిక, నాన్‌-వెజ్‌ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్‌ వెజ్‌ మోడ్‌లో ఉంటాయి. ఫ్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్‌లను వినియోగించనుంది.
అనంతోజు మోహన్‌కృష్ణ
8897765417

]]>
64 గళ్ల ఆటలో కొత్త రారాజు https://navatelangana.com/64-is-the-new-king-of-the-game/ Sat, 27 Apr 2024 16:22:05 +0000 https://navatelangana.com/?p=278685 In a game of 64 balls
The new kingఆదివారం అర్ధరాత్రి భారత్‌ కీర్తి కిరీటం ధగధగా మెరిసింది. ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన ఆ కీర్తి కిరీటాన్ని ధరించాడు. 17 ఏండ్ల వయసులోనే 64 గళ్ల యుద్ధక్షేత్రంలో.. 7 మంది బలమైన ప్రత్యర్థులను ఓడించి విజేతగా నిలిచాడు. ప్రపంచ మహా సమరానికి సై అంటున్న ఆ యువరాజు… దొమ్మరాజు గుకేశ్‌. తెలుగు మూలాలున్న ఈ చెన్నై టీనేజర్‌ సంచలనం సష్టించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ చదరంగ క్రీడాకారులు తలపడ్డ క్యాండిడేట్స్‌ టోర్నీలో జయకేతనం ఎగురవేశాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సష్టించాడు.
”ఈ టోర్నీలో భారత అవకాశాలు స్వల్పమే. మన కుర్రాళ్లు గెలుస్తారని చెప్పలేం”.. క్యాండిడేట్స్‌ టోర్నీ ఆరంభానికి ముందు దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ చేసిన వ్యాఖ్యలివి. అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌ అలాంటి అభిప్రాయం వెల్లడించడం, టోర్నీలో 2018లో గెలిచిన కరువా నా, వరుసగా గత రెండు సార్లు నెగ్గిన నెపోమ్నియాషి ఉండటంతో మన కుర్రాళ్లకు కష్టమే అనిపించింది.
64 గళ్ల ఆటలో కొత్త రారాజు వచ్చాడు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా భారత చదరంగ క్రీడకు కర్త, కర్మ, క్రియగా ఉన్న దిగ్గజ గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ వారసుడిగా తెలుగు మూలాలున్న 17 ఏండ్ల చెన్నై చిన్నోడు దొమ్మరాజు గుకేశ్‌ సంచలన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సష్టించాడు.

ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు పాల్గొనే ‘క్యాండిడేట్స్‌’లో ఉన్నదే 16 మంది. అందులో ముగ్గురు మగ వాళ్ళు (గుకేశ్‌, విదిత్‌, ఆర్‌. ప్రజ్ఞానంద), ఇద్దరు ఆడవారు (కోనేరు హంపీ, ఆర్‌. వైశాలి)తో మొత్తం అయిదుగురి అతి పెద్ద బృందం భారత్‌దే. ఇంతమంది ఆటగాళ్ళు ఈ క్లిష్టమైన అలాగే, 2024 ఏప్రిల్‌ నాటి ‘ఫిడే’ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 25లో అయిదుగురు భారతీయ పురుషులే.
మహిళల ర్యాకింగ్స్‌లో టాప్‌ 15లో ముగ్గురు మనవాళ్ళే. జూనియర్‌ ర్యాకింగ్స్‌కు వస్తే టాప్‌ 20లో ఏడుగురు భార తీయులే. అదే టాప్‌ 30 జూనియర్స్‌ని గనక లెక్క తీస్తే మూడింట ఒక వంతు మన దేశీయులే.ప్రపంచ చదరంగ వేదికపై అంతకంతకూ విస్తరిస్తున్న భారతదేశ స్థాయికీ, స్థానానికీ ఇదే సాక్ష్యం.
ఈ కంప్యూటర్‌ యుగంలోనూ సంప్రదాయ శిక్షణ, క్లాసికల్‌ ఫార్మాట్‌పై ప్రేమ అతణ్ని భిన్నంగా నిలుపుతోంది. పిన్న వయస్సు (12 ఏళ్ల 7 నెలల 17 రోజులు)లోనే గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన భారత ఆటగాడిగా చరిత్ర సష్టించిన గుకేశ్‌.. కేవలం 17 రోజుల తేడాతో ప్రపంచ రికార్డు కోల్పోయాడు. ప్రపంచంలో మూడో అతి పిన్న వయస్సు గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. అలాంటి ఆటగాడు ఆరంభం నుంచి కోచ్‌ల శిక్షణలో, బోర్డుపై గేమ్‌లు ఆడుతూ ఎదిగాడు. ఎలో రేటింగ్‌ 2500 దాటిన తర్వాతే గుకేశ్‌ చెస్‌ ఇంజన్ల సాయం తీసుకున్నాడు. 36 ఏళ్లలో తొలిసారి విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కినెట్టి నిరుడు గుకేశ్‌ భారత టాప్‌ ర్యాంకు ఆటగాడిగా నిలిచాడు.
గెలుపుతో స్ఫూర్తి పొందేవాళ్లను చూసుంటాం. కానీ ఓటమి నుంచి ప్రేరణ పొంది, కసిగా ఆడాలనేది గుకేశ్‌ మంత్రం. స్వీయ నమ్మకంతో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనే చెక్కుచెదరకుండా ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో నిలబడుతున్నాడు. 2022లో దిగ్గజం కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. 2022 ఒలింపియాడ్‌లో మొదటి బోర్డుపై వ్యక్తిగత స్వర్ణం గెలిచాడు. నిరుడు ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో రజతం సొంతం చేసుకున్నాడు. గతేడాది అత్యధికంగా 2,758 రేటింగ్‌ సాధించిన గుకేశ్‌.. ప్రస్తుతం 2,743 వద్ద ఉన్నాడు. ప్రపంచ చెస్‌లో 2750 రేటింగ్‌ దాటిన పిన్న వయస్సు క్రీడాకారుడూ అతనే.
చిన్నప్పటి నుంచి అమ్మానాన్న నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 2018 ఆసియా యూత్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అయిదు స్వర్ణాలు గెలవడంతో వాళ్లకు నాపై పూర్తి నమ్మకం వచ్చింది. ఈఎన్‌టీ సర్జన్‌ అయిన నాన్న నా కోసం ప్రాక్టీస్‌ ఆపేశారు. అప్పుడు అమ్మ సంపాదనతోనే ఇల్లు గడిచేది. రెండేళ్ల పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ నాన్న ఏ కష్టాన్ని నా వరకూ రానివ్వలేదు. నేను గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాక పరిస్థితి మెరుగైంది. కరోనా సమయంలో బయట టోర్నీలు లేకపోవడంతో నాన్న వైద్యుడిగా పనిచేశారు.
ఆనంద్‌ సర్‌ను ఆరాధిస్తూ పెరిగా. ఆయన అకాడమీలో శిక్షణ పొందడం గొప్ప అవకాశం. ఆయన సూచనలతో నా ఆట ఇంకా మెరుగైంది. ఇప్పుడు ఆయన బాటలోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడం ఆనందంగా ఉంది.
మేం చెన్నైలో స్థిరపడ్డా మా కుటుంబంలో తెలుగు మూలాలున్నాయి. మా ముత్తాతలు పుత్తూరు సమీపంలోని సత్యవేడు దగ్గర గ్రామంలో ఉండేవాళ్లు. ఇప్పటికీ అక్కడ మాకు బంధువులున్నారు. చిన్నప్పుడు అమ్మానాన్నతో కలిసి అక్కడికి వెళ్లేవాణ్ని. కానీ చెస్‌ కెరీర్‌ కారణంగా ఇప్పుడు కుదరడం లేదు.

ప్రపంచ చాంపియన్‌తో ‘డీ’
ఈ విజయంతో గుకేశ్‌.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతడు చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌తో తలపడాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కానప్పటికీ ఇక్కడా గెలిస్తే ప్రపంచ చాంపియన్‌గా నిలిచే అతి పిన్న వయస్కుడిగా అతడు రికార్డులకెక్కుతాడు.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

]]>
కష్టాల కడలిలో… స్ఫూర్తి కెరటాలు https://navatelangana.com/waves-of-inspiration-in-the-midst-of-adversity/ Sat, 20 Apr 2024 16:08:20 +0000 https://navatelangana.com/?p=273665 యువతకు చాలా సరదాలుంటాయి. స్నేహితులతో పార్టీలు చేసుకోవడం, టూర్లకు వెళ్లడం, సినిమాలు చూడటం, ఆటలు ఆడటం… ఇలా అనేకం ఉంటాయి. కానీ, వాటంటిన్ని వదులుకొని తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. జనం జీవితాల్లో మార్పు కోసం పరితపించే వారు కొందరుంటారు. ఆ కొందరు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. విఫలమైన ప్రతిసారీ వారిలోని లోపాలను సరిచేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసిన వీరంతా కష్టాల కడలిలో ఎగసిన స్ఫూర్తి కెరటాలు. సివిల్‌ సర్వీసెస్‌ – దేశంలో కోట్లాది మంది యువత మదిలో మెదిలే అత్యున్నత ఉద్యోగం. అన్ని పరీక్షల కంటే అత్యంత క్లిష్టంగా, అనేక వడపోతలతో సాగే ఈ ప్రక్రియ గురించి వింటేనే… వామ్మో మనకెలా సాధ్యం..? అనే భయం కలుగుతుంది. ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల కోసం ఎంపియ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలకు ఇప్పుడు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. సివిల్స్‌ విజేతల ఫ్యాక్టరీగా హైదరాబాద్‌ అవతరించింది. సివిల్‌ సర్వీసెస్‌లో తెలుగు బిడ్డల జైత్రయాత్ర గత నాలుగేండ్లుగా కొనసాగుతూనే ఉంది.
తాజాగా విడుదలైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2023 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ అభ్యర్థులు వరుసగా రెండో సంవత్సరం జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులు పొందారు. విజేతలుగా నిలిచినవారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఐఐటీ కాన్పుర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసిన లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. ఒడిశాలోని అనుగుల్‌ జిల్లా తాల్చేరు వాసి అనిమేష్‌ ప్రధాన్‌ ద్వితీయ స్థానంలో నిలిచారు. పి.కె.సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌, రుహానీలు వరుసగా నాలుగు, అయిదు స్థానాలు దక్కించుకున్నారు. తొలి అయిదు స్థానాలు సాధించిన వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

లక్ష్యమే నన్ను నడిపింది
‘జీవితంలో కచ్చితంగా ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. దాన్ని చేరుకునేందుకు ఈ ప్రపంచం నీకు ఏదో ఒకలా సహాయ పడుతుంది..’ అన్న ఆల్కెమిస్ట్‌ పౌల్‌ కోయెల్హో మాటల్నే స్ఫూర్తిగా తీసుకుంది కేరళకు చెందిన సారిక. సెరెబ్రల్‌ పాల్సీ కారణంగా చిన్న వయసు నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె.. ఈ శారీరక లోపాన్ని అధిమించి తానేంటో నిరూపించుకోవాలనుకుంది. ఈ సంకల్పంతోనే సివిల్స్‌ సాధన చేసిన సారిక.. తాజా ఫలితాల్లో 922 ర్యాంకు సాధించింది. తద్వారా శారీరక లోపాలు విజయానికి ఏ మాత్రం అడ్డు కావని నిరూపించింది. ‘సెరెబ్రల్‌ పాల్సీ కారణంగా నా కుడి చేయి పనిచేయదు. వీల్‌ ఛెయిర్‌ను కదిలించడం, రాయడం, తినడం, ఇతర పనులన్నీ ఎడమ చేత్తోనే చేస్తుంటా. అమెరికాకు చెందిన జెస్సికా కాక్స్‌ నా జీవితానికి అతిపెద్ద స్ఫూర్తి ప్రదాత. రెండు చేతులు లేకపోయినా కాళ్లతో విమానం నడిపి.. పైలట్‌ లైసెన్స్‌ సాధించిందామె. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్‌ సాధన మొదలుపెట్టా. ఇక నా సివిల్స్‌ జర్నీలో అమ్మానాన్నలూ ఎంతగానో సపోర్ట్‌ చేశారు. రెండో ప్రయత్నంలో నాకు ర్యాంకొచ్చింది. నాన్న ఖతార్‌లో పనిచేస్తున్నప్పటికీ.. నా సివిల్స్‌ పరీక్షల కోసం ఇండియాకొచ్చారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో అమ్మానాన్నలు నాతోనే ఉన్నారు. ఎన్ని సవాళ్లెదురైనా నాలో ధైర్యం నింపారు. ఏదేమైనా నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది..’ అంటోందీ సివిల్స్‌ ర్యాంకర్‌.

చీకటి వెనుక వెలుతురు
విశాఖపట్నానికి చెందిన వేములపాటి హనిత రెండో కోవకు చెందుతుంది. మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ దగ్గరే ఆగిపోయిన ఆమె.. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్‌, ఇంటర్వ్యూ దశలు కూడా దాటి సివిల్స్‌లో 887వ ర్యాంకు సాధించింది. అరుదైన వ్యాధి కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమైనా తన కలను సాకారం చేసుకుంది. ‘సివిల్స్‌ లక్ష్య సాధనలో నాకు ముందు నుంచీ సరైన గైడెన్స్‌ లేదు. కానీ ప్రతి ప్రయత్నంలో నన్ను నేను మెరుగుపరచుకున్నా. చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాను. ఆ పట్టుదలే ర్యాంకు తెచ్చిపెట్టింది. మన జీవితానికంటూ ఓ సార్థకత ఉండాలని పదే పదే మా గురువు గారు చెబుతుండేవారు. సివిల్స్‌ అందుకు చక్కని మార్గమంటూ దిశానిర్దేశం చేశారు. ఆయన మాటలే నన్ను సివిల్స్‌ వైపు అడుగులు వేయించాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటొచ్చినప్పుడు Transverse Myelitis’ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డా. దీంతో ఒక్కసారిగా నడుస్తూనే సడెన్‌గా కింద పడిపోయా. నాలుగ్గంటల్లోనే పక్షవాతం రావడంతో నడుం కింది భాగం చచ్చుబడిపోయింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. వెన్నెముకలో ఇన్ఫెక్షన్‌ వల్ల ఈ సమస్య వచ్చినట్లు, ఇక జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆ క్షణం మానసికంగా ఎంతో క్షోభను అనుభవించా. ఆ తర్వాత కోలుకొని డిగ్రీ పూర్తిచేశా.. నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌ కలనూ సాకారం చేసుకున్నా. నా ఈ జర్నీలో అమ్మానాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది. సాధారణ వ్యక్తుల్లాగే ప్రత్యేక అవసరాలున్న వారినీ ఈ సమాజం సమాన దష్టితో చూడాలనేది నా కోరిక. ఓ సివిల్‌ సర్వెంట్‌గా నేనూ ఇదే చేయాలనుకుంటున్నా. చీకటి వెనుక వెలుతురు ఉంటుందని నేను నమ్మిన సిద్ధాంతమే నన్ను ఈ రోజు మీ అందరి ముందు నిలబెట్టింది..’ అంటూ తన జర్నీని పంచుకుంది హనిత.

పట్టుదలతో సాధించలేనిది లేదు
కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం, వెలిచాలకు చెందిన నందాల సాయి కిరణ్‌ సివిల్స్‌లో 27వ రాంక్‌ సాధించారు. సాధారణ కుటుంబంలో పుట్టారు సాయికిరణ్‌. తండ్రి కాంతారావు చేనేత కార్మికునిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. క్యాన్సర్‌ బారినపడి 2016లో మతి చెందాడు. బీడీ కార్మికురాలైన తల్లి లక్ష్మి రెక్కల కష్టంపై కుటుంబం నడిచింది. దీనితో తాను చదువుకునే వయసులోనే కుటుంబానికి సాయంగా ఉండేందుకు తాను ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కి ప్రిపేర్‌ అయ్యారు. చివరికి దేశంలోనే 27వ ర్యాంక్‌ సాధించి పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సాయి అక్క స్రవంతి ప్రస్తుతం ఏఈఈగా ఉద్యోగం చేస్తుంది.

రోజుకు 14 గంటలు చదివాను..
మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి… దోనూరు మంజుల, సురేశ్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దమ్మాయి అనన్య. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని యూనివర్సల్‌ పాఠశాలలో ప్రాథమిక విద్య, కాకతీయ పాఠశాలలో ప్రాథమికోన్నత విద్య, గీతం పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ నారాయణ ఐఏఎస్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌… ఢిల్లీలోని మిరిండా హౌస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అప్పటి నుండే… సివిల్స్‌ వైపు దష్టి పెట్టిన ఆమె… ఆంత్రోపాలజీ ఆప్షనల్‌ సబ్జెక్టుగా సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటలపాటు పుస్తకాలతో కుస్తీ పట్టడంతో తొలి ప్రయత్నంలోనే విజయం ఆమెను వరించింది.

తల్లీ మరణం కృంగదీసినా
అనుగుల్‌ జిల్లాలోని తాల్‌చేర్‌కు చెందిన అనిమేశ్‌.. కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. రావుర్కెలాలోని ఎన్‌ఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం దిల్లీలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రిఫైనరీస్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. 2022లో సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించా. సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. రోజుకు 5-6 గంటల పాటు చదివా. పరీక్ష కోసం ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. సివిల్స్‌ ఫలితాలు చాలా సంతప్తిని ఇచ్చినా… 2015లో తండ్రిని, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు తల్లిని కోల్పోవడం అత్యంత విషాదం. ”ఐఏఎస్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చానని, ఒడిశా క్యాడర్‌ ఆశిస్తున్నాను. నా రాష్ట్ర ప్రజలు.. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రాంతాల వారి అభ్యున్నతి కోసం పని చేయాలనుకుంటున్నా” అని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పార్లమెంటరీ డిబేటింగ్‌, మీడియా అడ్వకసీ- జర్నలిజం, ఫ్రీ-స్టైల్‌ డ్యాన్స్‌ అతని హాబీలు.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

]]>
ఆకాశమంత కవిత్వం https://navatelangana.com/akashmanta-kavitnam-dear-akash/ Sat, 13 Apr 2024 16:53:57 +0000 https://navatelangana.com/?p=269031 data structure”డియర్‌ ఆకాశ్‌,

ఈ రోజు (26.6.2022) నవతెలంగాణ సోపతిలో నీ బీటెక్‌ జర్నీ కవిత చదివినంక (నీ కవితలను నవ తెలంగాణ పత్రికలలో ప్రచురించి నీకు ధైర్యాన్ని ఇచ్చిన అనంతోజు మోహనన్నకు ప్రేమలు) మనసంతా వానకు తడిసిన విత్తనపు సాలు లెక్క మారింది. పదేళ్ళ క్రితం పాల్కురికి సోమనాథుని పాఠాన్ని చెబుతుంటె కనురెప్ప వేయకుండ విన్న ఎం.వి.ఆకాశేనా ఇది రాసింది? బడి అయిపోయినంక బస్సెక్కిందాక నిలబడి సాగదోలిన నా ప్రియమైన ఆకాశమేనా ఇది రాసింది? ఎంతని ప్రేమనైనా గుండెలోనె దాచుకొని ఋషి లెక్క కనిపించె వెస్ట్‌ మారేడుపల్లి నా స్టూడెంటేనా ఇది రాసింది?” అని మనసులో ఎంత సంతోషపడ్డనో మాటల్లో చెప్పలేను.
నేను వెస్ట్‌ మారెడుపల్లిలోని విద్యాకిరణ్‌ టెక్నో స్కూల్‌లో టీచర్‌గా పనిచేసింది రెండేళ్ళే అయినా జీవితాంతం మరిచిపోని ప్రేమను పంచింది. సికింద్రాబాద్‌కు ఏ పని మీద వొచ్చినా విద్యా కిరణ్‌ టెక్నో స్కూల్‌ను తలువకుండా, మిమ్మల్ని కలువకుండా పోయిన రోజులు లేవు. మీ స్కూల్‌ నుంచి నేను వెళ్ళిపోయేటపుడు ఎనిమిదవ తరగతిలో నీవు రాసిన కొలవరి సాంగ్‌ గుర్తుందా? ఎన్నెన్ని వెచ్చటి కన్నీటి జ్ఞాపకాలో ఆ పాట చుట్టూ. పేరడి పాటను ఎంతో ఉద్వేగంగా నడిపిన నీ ప్రతిభ గురించి ఇప్పటికీ మా బడిపిల్లల ముందు గుర్తుచేసుకుంట.
ఇప్పటి వరకు నీవు రాసిన కవితలన్నీ ఊహాలోకంలో విహరించి రాసినవి కావు. జీవితంలో ఎదురైన వాస్తవ దశ్యాలను నీలోకి తీసుకొని, తనివితీరా అనుభవించి, పలువరించి రాసినవి. ఇప్పటిదాక ఏడెనిమిది కవితలే రాసినా, నిరు పేదల జీవితాన్ని చిత్రించినవి, శ్రామికుల చెమట బొట్ల ముందు మోకరిల్లి రాసినవే ఉన్నయి.
కార్మికుల దినోత్సవం సందర్భంగా రాసిన ‘నెత్తుటి యోధులు’ కవితలో కార్మికుల శ్రమను గొప్పగా కవిత్వకరించావు.
”ఎర్రని మట్టి గంపను నెత్తిన పెట్టుకొని/ ఐదు అంతస్తులు మేడ ఎక్కుతుంటే/ సూర్యుడినే ఆకాశానికి/ తీస్కపోతున్నటు కనిపిస్తరు”
మట్టిగంపలో పెట్టుకొని సూర్యుడిని ఆకాశానికి తీసుకపోతారడనం గొప్ప ఊహ. నీ భావుకత సహజమైనదో, గొప్పదో చెప్పడానికి ఇలాంటి వాక్యాలు చాలు.
వాస్తవిక నగర జీవితాన్ని అద్దంలో చూపించిన కవిత ‘మంచీళ్ళొచ్చినై’. కొన్ని గల్లీలకు నీళ్ళు రానపుడు వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను కండ్లకు కట్టినట్టు చూపించావు. హైద్రాబాద్‌ అనంగనే విలాసాలకు లోటు లేని నగరంగానో, గొప్ప దర్శనీయ స్థలంగానో చెబుతుంటారు గాని ఇలాంటి జీవితాల గురించి ఇంకా రావలసిన అవసరం ఉంది.
”సాయంత్రం ఐతే/ రాత్రైనా ఇంటికిరాని కొడుకు/ గురించి చూసినట్టు/ మంచినీళ్ళ గురించి ఎదురు చూస్తరు
బోరునీల్లు విడిచేది గంటసేపే/ ఒచ్చేదే ఇంటికి రెండు బిందలే/ పుస్తకాలలో చదువుకున్న కురుక్షేత్రాన్ని/ రోజు ఇంటి ముందుట చూస్తుంటం
డ్రమ్ముల కాడికెల్లి/ చిన్న సర్వల దాకా/ నీళ్ళ పండుగ చేసుకుంటయి/ రాత్రికి ఒండే అన్నంకి/ బియ్యం కూడా ఇప్పుడే/ కడిగి పెట్టుకుంటరు”
గల్లీలలో నీళ్ళ కోసం ఎదురుచూసే ఎదురుచూపులను కవిత్వీకరించడంలో ఎంతో సహజత్వం ఉంది.
డ్రమ్ముల దగ్గర నుంచి చిన్న చిన్న సర్వల దాక నీళ్ళు పట్టుకునే దశ్యాన్ని చెప్పడంలో నీ సూక్ష్మ పరిశీలన పరిశీలన తెలుస్తుంది.
మనల్ని వద్దనుకునే వాళ్ళు గొప్పవాళ్ళ దగ్గర ఉండడం కన్నా మనల్ని కావాలనుకునే చిన్న వాళ్ళ దగ్గర ఉండాలి అనే జీవిత సత్యాన్ని ఒక మినీకవితలో చెప్పావు.
”వెలుగు నన్ను ఒదిలేసినా/ కటిక చీకటి చేయందించింది/ పండుటాకును చెట్టు కొమ్మ వద్దనుకున్నా/ సిరులు పండించె నేల గుండెకు అద్దుకుంది”
ఈ మినీకవితలో నీదైన అనుభవాన్ని ఎంతో గాఢతతో వ్యక్త పరిచావు. దేనికీ తొందరపడని తనం, అందరినీ కలుపుకొని నడిచే స్నేహ గుణం, సున్నితమైన దశ్యాలకు కదిలిపోయే తత్వం, పెద్దరికంగా ఆలోచించె విధానం నీలోని ప్రత్యేకత. అవి నీ కవిత్వంలో కనబడకుండా ఎలా ఉంటాయి చెప్పు ?
‘బి.టెక్‌ జర్నీ’ కవిత బి.టెక్‌ పూర్తి చేసిన విద్యార్థి మళ్ళీ తన కాలేజి జ్ఞాపకాల్లోకి వెళ్ళినట్లుగా ఉంది. కాలేజీలోకి అడుగుపెట్టింది మొదలు ఫైనల్‌ ఇయర్‌ దాక బి.టెక్‌ జీవితమంతా ఈ కవితలో కనబడింది. క్లాసురూంలలో ఎలాంటి కేరింతలు ఉంటాయో, క్యాంటిన్ల దగ్గర ఎలాంటి సరదాలు ఉంటాయో చెబుతూనే బి.టెక్‌ చదువులు ఎలా సాగుతాయో చెప్పావు. బి.టెక్‌ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరిని వాళ్ళవాళ్ళ కాలేజి రోజుల్లోకి తీసుకపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కవిత చదవగానే ”పాదమెటు పోతున్న/ పయనమెందాకైనా” పాట గుర్తొచ్చింది. కొంత భాగమైనా ఆ కవితను మళ్ళీ గుర్తు చేస్తా.
”జీవితంలో వెనుకబడుతాను అనుకున్నాడేమో/ మా M1 సార్‌ ఎప్పుడు క్లాస్కొచ్చినా/ లాస్ట్‌ బెంచ్‌ నుంచి ముందుకు తిస్కొచేట్టోడు/ క్లాస్‌ బంక్కొట్టి మల్టీప్లెయర్‌ గేమ్స్‌ ఆడుతుంటే/ ఇంక మిరు మారరా అని అనే M3 మేడం మాటలు/ మా లక్ష్యాన్ని గుర్తు చేసేవి/ ఎగ్జామ్‌ హల్లో వెనుక ఆన్సర్‌ షీట్ను/ చూడడం కోసం చేసే ప్రయత్నం/ ఏ సర్కస్‌ ఫీట్కు తీసిపోదు/ చివరి క్షణంలో చెమటబొట్టు/ కంటిరెప్పను పలకరిస్తూ అన్సర్‌ శీట్తో చేయి కల్పడం/ ఇంకా నా కళ్లముందే కదులుతుంది/ ఎగ్జామ్స్‌ తర్వాత బావర్చిలో ఫ్రెండ్స్‌ అందరం కలిసి తిన్న బిర్యానీ వాసన ఇంకా చేతులకి అలానే ఉంది/ అస్సైన్మెంట్‌ సబ్మిషన్‌ రోజు/ పెన్ను పెపర్లతో మేమంత కుస్తిపడుతుంటే/ పక్కనోని అసైన్మెంటును జిరాక్స్‌ తీసి సబ్మిట్‌ చేసే/ కష్ణలీలలు మా ఫ్రెండ్‌ ఒక్కడికే సాధ్యం

ఇస్త్రీ చొక్కా ఎసుకొని చేతికో వాచి తగిలించి/ కొత్త పెళ్లి కొడుకులా ముస్తబయ్యి/ లాబ్‌ ముందు నిల్చునేటోల్లం/ వైవాలో అడిగిన క్వశ్చన్‌లకు/ అరుంధతి నక్షత్రం దిక్కు తలలు తిప్పెటోలం/

సీనన్నకు గొంతినంగనే మా ఆకలి తెలిసేదేమో/ ఫోన్‌ కొట్టంగనే క్యాంటీన్లో ఎంతపెద్ద లైన్‌ ఉన్నా/ ముందు మాకు ఫ్రైడ్‌ రైస్‌ పంపించేటోడు/ సాయంకాలం పానిపూరి తిని ఖాతాపుస్తకంలో/ హజీరు వేయించుకునేవాళ్ళం

జ, జంం, జీaఙa అంటూ/ కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ వెనుక/ ఎన్నో పరుగులు తిసాము/ GRE,Toefl అంటూ/ విమానాన్ని పట్టుకోడానికి జింకపిల్లలక్క/ చంగుచంగుమని మరెన్నో గంతులేసాం/ Data structures ఇంకాSQL టేబుల్స్‌లో/ మా జ్ఞాపకాలను పదిలంగా భద్రపరిచాము”
సబ్జెక్టుల విషయంలో బి.టెక్‌ విద్యార్థులు మాట్లాడుకునే భాష (M1,M3), తరగతి వాతావరణం కవితకు తాజాదనాన్ని తెచ్చాయి. కంప్యూటర్‌ విద్యకు సంబంధించిన పరిభాష కూడా ఈ కవితకు కొత్త అభివ్యక్తిని తెచ్చింది. చాలా ఒడుపుగా కంప్యూటర్‌ భాషలను, పరిభాషను పోలికలుగా వాడుతూ కవితను నడిపించావు.
GRE (Graduate Record Examinations), toefl(టోఫెల్‌-Test of English as a Foreign Language) లు విదేశాలకు పోవడానికి రాసే పరీక్షలు. విమానాన్ని పట్టుకోవడానికి జింక పిల్లల లెక్క అనడంలో ఆ పరీక్షల లక్ష్యం స్పష్టంగా సమన్వయం కుదిరింది.Sql (Structured Query Language) టేబుల్‌ అనేది కంప్యూటర్లో మనకు కావలసిన డేటాను స్టోర్‌ చేసేది. data structure బతీవ కూడా అలాంటిదే. వీటిల్లో జ్ఞాపకాలను భద్రంగా స్టోర్‌ చేశామని చెప్పడం చాలా కొత్తగా ఉంది.
ల్యాబ్లో అడుగుపెట్టిన విద్యార్థులను కొత్త పెళ్ళికొడుకుతో పోల్చి వెంటనే వైవాలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పక దిక్కులు చూడడాన్ని అరుంధతి నక్షత్రం దిక్కు చూస్తారని చెప్పడం విషయ కవిత మీద నీకున్న శ్రద్ధను తెలియజేస్తుంది. పోలికల మధ్య సమన్వయం చెడకుండా జాగ్రత్తపడ్డావు.
ఏ కవితకైనా ఎత్తుగడ, ముగింపులు ప్రాణనాడులలాంటివి. కవితలోనికి వెళ్ళడానికైనా, కవిత చదివినంకా ఇంకా అది మనల్ని వెంటాడడానికైనా వీటి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. ఈ కవితలో నీవిచ్చిన ముగింపు అలాంటిదే. ‘నాలుగేళ్ళు నా ఇల్లైన కాలేజీ గుర్తొస్తుంది’ అనడం ద్వారా ఒక కుటుంబంగా జీవించిన కాలేజి ప్రేమలన్నింటిని చూపించావు.
హైద్రాబాద్‌ జీవితం నీ కవిత్వానికి ముడిసరుకు కావాలి. చిత్తు కాగితాలు ఏరుకునె వాళ్ళ దగ్గర నుంచి సాయంత్రం క్లినిక్లో పని చేసే మిత్రుల జీవితాల వరకు నీ చూపు విస్తరించాలి. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వెస్ట్‌ మారెడు పల్లి ప్రజల జీవనాడి దొరికిచ్చుకోవాలి. సిటీలైఫ్‌ను సరికొత్తగా దర్శించాలి.
నాయిన ఆటో నడుపుతూ నిన్ను, అన్నను ఎంత కష్టపడి చదివించిండో దగ్గరి నుండి చూసిన వాడిని. దండ కడియానికి కేంద్ర సాహిత్య యువ పురస్కారం వచ్చినపుడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభినందన సభ ఏర్పాటు చేసినపుడు నాన్ననే తన ఆటోలో స్వయంగా దించి వెళ్ళడం ఎంతో గౌరవం అనిపించింది.
హైద్రాబాద్‌ పోయిన కొత్తలో నగరజీవితం పట్ల ఒక నిరసన భావం ఉండేది. హైదరాబాద్‌ జీవితం తీరిక లేనిది, మనుషుల మధ్య అంత అనుబంధాలు ఉండవనే అనుకునేది. కానీ విద్యాకిరణ్‌ స్కూల్‌లో పని చేసినన్ని రోజులు వాటన్నింటిని దూరం చేసింది. ప్రేమిస్తే ప్రాణమైన ఇచ్చె హైద్రాబాదీల తత్వం మీ స్నేహం వలన నాకు తెలిసింది. ఆకాశ్‌! ఎప్పుడూ చెబుతుంటాను మీరంతా నా ఆత్మీయ ప్రపంచమే కాదు, ఆత్మ కూడా.
2013లో మా నాయిన చనిపోయినపుడు మీ టెన్త్‌ క్లాస్‌ బ్యాచంతా చూడడానికి భవాని టీచర్‌తో కలిసి మా ఊరికి వచ్చిండ్రు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను తల్చుకుంటే గుండె సెలిమె నిండుతది. ఆసిఫ్‌, భరత్‌, విష్ణు, రాకేష్‌ అన్నను అడిగినట్లు చెప్పు. ఆకాశ్‌! ఇక ఉంటాను, సరేనా. అత్యంత ప్రేమతో
మీ తగుళ్ళ గోపాల్‌
– తగుళ్ళ గోపాల్‌
9505056316

]]>
బంధం ఆనందంగా ఆరోగ్యంగా https://navatelangana.com/the-relationship-is-happy-and-healthy/ Sat, 06 Apr 2024 17:13:33 +0000 https://navatelangana.com/?p=263881 The relationship is happy and healthyప్రేమ బంధం చాలా బలమైనది. దీన్ని మించిన బంధం మరొకటి లేదు. కనులు కలుసుకోవడంతోనే ప్రారంభమవుతుంది ఇది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా అనూహ్యంగా ఏర్పడే పరిచయంతో పురుడు పోసుకుంటుంది. నిర్వచనాలకు అందని అపురూప భావం ప్రేమ. ఒకరినొకరు అర్థం చేసుకుని ఎన్ని అనర్థాలైనా అధిగమించేందుకు సిద్ధమయ్యేదే ప్రేమ. కష్టాలెన్నెదురైనా కడదాకా కలిసి జీవించాలని ప్రమాణాలు చేయిస్తుంది ఇది.

నిజమైన ప్రేమ ధనిక, పేద అనే తారతమ్యాలకు తావివ్వదు. అందచందాలకు ప్రాధాన్యమివ్వదు. జీవిత రథం సాఫీగా సాగాలంటే బంధాలు బలంగా ఉండాలి. అది నమ్మకమనే పునాదిపై నిర్మితమవుతుంది. అప్పుడే ఆ బంధం పటిష్ట భవనమై చిరకాలం నిలుస్తుంది. స్వార్థాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వదు. స్వార్థం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న చోట స్వార్థం నిలవదు. ఈ రెండు కలిశాయంటే ప్రేమ చచ్చిపోయినట్టే. విడిపోవడం చాలా సులువు. కానీ, కలిసి బతకడం గొప్ప. సమస్యలు రావచ్చు. అభిప్రాయ భేదాలు ఎదురుకావచ్చు. మాట పట్టింపులు ముప్పుతిప్పలు పెట్టవచ్చు. అయినా సరే, కడదాకా కలిసి ఉండే ప్రయత్నమే చేయాలి.
ప్రేమంటే.. పవర్‌ఫుల్‌
నగరంలో బాగా పేరుమోసిన వ్యక్తి కూతుర్ని ప్రేమిస్తాడు ఓ సాధారణ యువకుడు. అతడు పేదవాడని తెలిసి కూడా ఆ అమ్మాయి మనసు ఇస్తుంది. ఆమె ఆస్తిపాస్తులతో సంబంధం లేదు.. ఆమె ప్రేమే తనకు ముఖ్యమని భావిస్తాడు అతడు. ఒకరునొకరు చూసుకోకుండా క్షణం కూడా ఉండలేరు. పార్కులు, రెస్టారెంట్లు, సిన్మాలు, షికార్లు.. ఇలా ఎక్కడ చూసినా వీళ్లే. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారనే విషయం పెద్దలకు తెలుస్తుంది. అగ్గి మీద గుగ్గిలమవుతాడు అమ్మాయి తండ్రి. అబ్బాయికి వార్నింగ్‌ ఇస్తాడు. ఇంకోసారి తన కూతురి వైపు కన్నెత్తి చూస్తే కండ్లు పీకేస్తానంటాడు. అమ్మాయిని బయటకు వెళ్లకుండా నిర్బంధిస్తాడు. అయినా అబ్బాయి సాహసం చేస్తాడు. అమ్మాయికి ఆ చెర నుంచి విముక్తి కలిగిస్తాడు. ఆమె కుటుంబ సభ్యుల కండ్లు గప్పి దూరంగా తీసుకెళ్లిపోతాడు. అమ్మాయి కనిపించడం లేదని తెలవడంతోనే ఆమె తండ్రి ఆగ్రహంతో ఊగిపోతాడు. తన అనుచరుల ద్వారా వెతికిస్తాడు. ఎట్టకేలకు వాళ్ల ఆచూకీ దొరుకుతుంది. అమ్మాయి ఎదుటే అబ్బాయిని చితకబాదుతారు. అయినా ఆమెను మరచిపోవడానికి అతడు ససేమెరా అంటాడు. దీంతో మరింత కోపోద్రిక్తులై అతడిని హత్యచేయడానికి సిద్ధమవుతారు. అప్పుడు అమ్మాయి అడ్డొస్తుంది. అతడిని చంపాలనుకుంటే ముందు తనను చంపమని అంటుంది. దీంతో తండ్రి మనసు కరుగుతుంది. ఏమిటీ గొప్పదనం.. ప్రేమ ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందా? అనుకుని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటాడు. అల్లుడిగా ఆ అబ్బాయిని స్వీకరిస్తాడు.
ఇదంతా సిన్మా స్టోరీలా ఉంది కదూ! అవును.. అలాంటిదే. ఇది సిన్మా స్టోరీ లాంటిదైనా నిజ జీవితంలో కూడా ఇలాంటి కథలు ఉంటాయి. ప్రేమంటే.. అంతేమరి! మహారాజులకోట కంటే గొప్పది ప్రేమ. మహామహుల వేటకైనా చిక్కనిది. మహాశాసనాలనైనా ఎదిరించేది. మరణ ఆసనాలనైనా వేయించేది. ఎలాంటి గుండెనైనా నునువెచ్చని సెగసోకిన వెన్నలాగా కరిగించేది ప్రేమ.
ప్రేమ ఎన్ని రకాలు..?
ఆలోచించి ప్రేమించే వాళ్లుంటారు. ఆకర్షణ వల్ల ప్రేమించేవారూ ఉంటారు. అవసరం కోసం ప్రేమించే వాళ్లు కూడా ఉంటారు. ఆలోచించి ప్రేమించే వారు తమ భవిష్యత్తును, తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని ప్రేమించాలనుకుంటారు. తన కుటుంబ పరిస్థితులను పరిగణనలో తీసుకుంటారు. ముందు చదువు, ఆ తర్వాత జాబ్‌ లేదా మంచి వ్యాపారం. జీవితంలో సెటిల్‌ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటారు. ఈ దారిలో ఎన్ని ‘ఆకర్షణలు’ ఎదురైనా మనసు పారేసుకోరు. వారలా చేస్తున్నారంటే ప్రేమంటే వీరికి పడదని కాదు. తమ లక్ష్యాలు, కర్తవ్యాలను నెరవేర్చుకోవాలనే తపనే అలా చేయిస్తుంది. ఇది మంచిదే. తాను సెటిల్‌ కావాలనుకోవడంలో తప్పులేదు. స్థిరపడ్డాక ప్రేమ గురించి ఆలోచిస్తున్నారంటే దూర దృష్టితో ఆలోచిస్తున్నారనుకోవాలి. అనుకున్నట్టు లక్ష్యాలు సాధించాక ఇలాంటి వాళ్లూ ప్రేమలో పడతారు. అప్పుడు కలిగే ఆత్మసంతృప్తి వెలకట్టనిది.
రెండో అంశం ఆకర్షణ. దీన్ని ప్రేమ అనుకుంటే పొరపాటే. ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. ఆకర్షణ ఆయుష్షు చాలా తక్కువ. ఇది కొంతకాలమే ఉంటుంది. ప్రేమ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆకర్షించి ప్రేమించే వారు ఆ ఆకర్షణ ఉన్నంత వరకే ప్రేమించుకుంటారు. ఆ తర్వాత మరో ‘ఆకర్షణ’ మాయలో పడిపోతారు. వీరిది నిలకడ లేని మనస్తత్వం. ఇక మూడో అంశం.. అవసరం కోసం పుట్టే ప్రేమ. అన్నింటికన్నా ఇది ప్రమాద కరమైనది. ఎప్పుడైతే తమ అవసరం తీరిపోతుందో అప్పుడు ఈ ప్రేమ కూడా ముగిసిపోతుంది. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు.
ప్రేమ వర్ధిల్లాలంటే..
ప్రేమను పంచటంలో ఉండే ఆనందం వేరు.. ప్రేమను స్వీకరించడంలో ఉండే ఆనందం వేరు. మనం కావాలనుకున్న వారు ఎప్పుడూ మనతోనే ఉంటారు. బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలనుకున్న వారు నిస్వార్థంగా వ్యవహరిస్తారు. అహంభావాన్ని దరిదాపుల్లోకి రానివ్వరు. ఒకర్నొకరు ఉత్సాహ పర్చుకుని ముందుకు వెళ్తారు. అప్పుడే ప్రేమ వర్ధిల్లుతుంది.
1. కమ్యూనికేషన్‌
బంధాల బీటలకు తొలి కారణం.. కమ్యూనికేషన్‌ లోపించడం. అలా అని, సన్నిహితులకు మన విషయాలన్నీ చెప్పాలని మాత్రం కాదు. వాళ్లంతట వాళ్లే అర్థం చేసుకుంటారని అనుకోవడమూ మంచిది కాదు. కాకపోతే మనం చెప్పదలచుకున్న విషయంలో స్పష్టత ఉంటే సరిపోతుంది.
2. పరస్పర నమ్మకం
నమ్మకం దానంతట అదే రాదు. నిరంతర ప్రయత్నాలతో నిర్మించుకోవాలి. ఎదుటివారి బాధలను సానుభూతితో అర్థం చేసుకోవాలి. అలా నమ్మకాన్ని నెమ్మదిగా పటిష్ఠం చేసుకోవాలి. అయితే, నమ్మకం ఒక్కసారి దెబ్బతింటే మళ్లీ పునర్నిర్మించుకోవడం కష్టం. ఏ బంధానికైనా నిజాయతీ పునాది.
3. గౌరవం- సమానత్వం
గౌరవం లేని ప్రేమ నిలబడదు. కాబట్టి, ఎదుటి మనిషి ప్రవర్తన మనకు కష్టంగా అనిపించినట్టే, మన ప్రవర్తన కూడా సన్నిహితులకు కష్టంగా తోచవచ్చు. కించిత్‌ కూడా ఆధిపత్య ధోరణి కూడదు. మన విలువలు, నైతికత, ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి.
4. మద్దతు- ప్రోత్సాహం
నేను అనుకోవడం కంటే.. ‘మనం’ అనుకున్నప్పుడే బంధాలు ఎక్కువ కాలం మన్నుతాయి. ఒక్కోసారి సన్నిహితులతో ఏకీభవించకపోయినా సరే.. వారి నిర్ణయాలకు అండగా నిలవాలి. పరిస్థితులు తలకిందులైనప్పుడు కూడా సన్నిహితుల వెన్నంటి ఉండాలి.
5. సంక్షోభంలో ధైర్యం
కష్టకాలంలో మనం ఎలా ప్రవర్తిస్తాం అనే దానిపైనా జీవిత భాగస్వామి సహా సన్నిహితులతో మన సంబంధాలు ఆధారపడి ఉంటాయి. మనం ధైర్యంగా ఉంటేనే వాళ్లూ తమ కష్టసుఖాలను మనతో పంచుకుంటారు. దయ, సహానుభూతి ఈ విషయంలో కీలకంగా నిలుస్తాయి.
6. సాన్నిహిత్యం, ఆపేక్ష
మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనం అనుకున్న వాళ్ల యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండాలి. సన్నిహితుల పట్ల నిరంతరం ప్రేమ, అనురాగం చూపించాలి.
7. స్వతంత్రం
మానవ సంబంధాల్లో అత్యంత ముఖ్యమైనది, చాలావరకు మనం పట్టించుకోనిది ఒకటుంది.. మన సన్నిహితులకు కూడా వారిదైన జీవితం ఒకటి ఉంటుంది. కెరీర్‌, కుటుంబాలు, హాబీలు ఇందులో భాగంగా ఉంటాయి. ఈ సంగతి మరిచిపోవద్దు.
అనుమానం పెరిగితే..
సంసారంలో కోపతాపాలు.. అరుచుకోవడం. ఆపై.. అనునయించుకోవడం వంటివి మామూలే. అక్కడితో ఆ వివాదానికి ముగింపు ఉండాలి. అలాకాకుండా ఒకరిపై మరొకరు అనుమానపడటం మొదలైతే ఆ బంధం బలహీనపడే ప్రమాదం ఉంది. భార్యాభర్తల్లో ఒకరిపై మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఇరువురూ దాన్ని వమ్ము చేసుకోకుండా కాపాడుకుంటేనే ఆ బంధం బలంగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పడం లేదా ముందు రోజు చెప్పిన కారణాన్ని మర్చిపోయి మరోలా వివరించడం వంటివన్నీ భాగస్వామికి మీపై నమ్మకాన్ని దూరం చేస్తాయి. అబద్ధం చెప్పకుండా అసలైన కారణాన్ని చెప్పడం మంచిది. లేదంటే ఆ తర్వాత నిజం తెలిసినప్పుడు తనను ఎదుటివారు మోసం చేశారని భావించే ప్రమాదం ఉంది. జీవితభాగస్వామి తనతో అబద్ధాలు చెబుతున్నారనే ఆలోచన వారిని అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. మోసం చేస్తున్నారనే అనుమానం మొదలవుతుంది. అసూయగా మారకుండా.. మొదట్లోనే తమ మధ్య అనుమానానికి చోటివ్వకుండా ఉండటానికి దంపతులిద్దరూ ప్రయత్నించాలి. అనుమానం పెనుభూతంగా మారడమే కాకుండా, క్రమేపీ అది అసూయగా పరిణమిస్తుంది. అందుకే జరిగిన సందర్భాన్ని లేదా విషయాన్ని వివరంగా చెప్పాలి. ఒకవేళ మీకే అనుమానం వస్తే ఎందుకో వివరంగా కూర్చొని మాట్లాడాలి. ఇరువురూ చర్చించుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. మరోసారి అటువంటి సందర్భం రాకుండా ఉంటుంది.

– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

]]>
యవ్వనంలో బాల్యాన్నే ప్రేమిస్తారు https://navatelangana.com/in-youth-they-love-childhood/ Sat, 30 Mar 2024 18:26:32 +0000 https://navatelangana.com/?p=259201 In youth they love childhoodఒక సినిమాకి జన్మనిచ్చేది కథా రచయిత.. ఆ కథకు ఊహలకి రెక్కలిచ్చి.. ప్రేక్షకుడి మనసులు గెలిచేలా రాసేది దర్శకుడు. చూసేవాళ్లకి సినిమా ఓ రంగుల ప్రపంచం అయితే.. తీసేవాళ్లకి, నటించేవాళ్లకి అదోక జీవిత కల. అది నెరవేరాలంటే.. ప్రతిభ తప్పనిసరి. పదిమందిని మెప్పించాలి. అవకాశాలు అందిపుచ్చుకోవాలి. నిజానికి సినిమాలు అందరూ చూస్తారు… కానీ, సినిమా కథలు కొందరే రాస్తారు. తన జీవితాన్నే కథగా మలిచి, సినిమా తీసేవాళ్లు అరుదు. ఈ మధ్యకాలంలో విడుదలైన ‘చ90 ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్‌ సిరీస్‌ ఆ కోవకు చెందిందే. ప్రముఖ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించగా … ఆదిత్య హాసన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ కు దర్శకత్వం వహించాడు. ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల అయిన తర్వాత దీనికి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు, నవ యువకుడైన దర్శకుడు ఆదిత్య హాసన్‌ కు తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నిర్మాణ సంస్థల నుండి క్రేజీ సినిమా అవకాశాలు వస్తున్నాయి. యువ దర్శకులు (చ90ఫేమ్‌) ఆదిత్య హాసన్‌ గారితో ముఖాముఖి
మీ కథ ఏమిటి? మీరు ఎలా, ఎక్కడ ప్రారంభించారు?
నేను తెలంగాణలోని వనపర్తికి చెందినవాడిని. నేను 1994లో పుట్టి 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. నా ఇంటర్మీడియట్‌కి హైదరాబాద్‌కు వెళ్లి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పోస్ట్‌ చేశాను. ఏడాది పాటు హైదరాబాద్‌లోని సబ్‌వే రెస్టారెంట్లకు ఏరియా మేనేజర్‌గా పనిచేశాను. కానీ, నా దష్టి సినిమాపై ఉండేది. అందుకే సినిమాల్లో నా అదష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాను. అవకాశాల కోసం ఒక ఏడాది పాటు తిరిగాను. కానీ ఏదీ ఫలించలేదు.
మా నాన్న, గణిత ఉపాధ్యాయుడు, హెడ్‌మాస్టర్‌ కూడా. నేను బాగా చదువుకొని విదేశాలకు వెళ్లాలని ఆయన కోరిక. నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం కాబట్టి, ఆ దిశగా నా ప్రయత్నాలు చేస్తూ అందుకు సంబంధిత పరీక్షలు రాసి, బోర్న్‌మౌత్‌ విశ్వవిద్యాలయం నుండి స్కాలర్‌షిప్‌ పొంది చదువుకోవడానికి యూకే వెళ్ళాను. అక్కడే నేను అప్పటికే రెండు ఇండీ చిత్రాలకు దర్శకత్వం వహించిన నవీన్‌ మేడారంను కలిశాను. ‘బాబు బాగా బిజీ (2017)కి దర్శకత్వం వహించిన నవీన్‌ మా పూర్వ విద్యార్థి అని మా యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుండి తెలుసుకున్నాను. అప్పటికే అక్కడ ఒక తెలుగువాడు చదువుకుని అతని వద్దకు చేరుకున్నాడని నేను తక్షణమే ఆకర్షితుడయ్యాను. 2017లో నేను పని చేస్తున్నప్పుడు తీసిన ‘లగ్గం’ లఘు చిత్రం ఆయనకు నచ్చింది. నేను హైదరాబాద్‌కు తిరిగి వచ్చినప్పుడు తనను కలవమని చెప్పాడు. ఖఖ లో కొంతకాలం పనిచేసిన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చాను. దీూఉలో పని చేసాను, =aజూఱసశీ నడిపాను. తల్లిదండ్రులపై ఆధారపడటం ఇష్టం లేక ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేదు.
ఏ రచయితైనా తాను రాసే వాక్యంలో కనీసం ఒక అక్షరమైనా తన అనుభవం ఉంటుంది.
ఈ ‘చ90’ మీదా? మీరు గమనించిన మనుషులదా?
రెండు అనుకోవచ్చు. వాస్తవానికి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. కొత్తగా డైరెక్టర్‌ వచ్చి సినిమా చేస్తానంటే ఎవరు నమ్మరు. అందుకని పెద్దపెద్ద కథలు, పెద్ద బడ్జెట్‌లో రాసుకొని వాటి ప్రయత్నాలలో జిగ్‌ జాగ్‌ చెయ్యకూడదని చెప్పి తక్కువ బడ్జెట్లో మహా అయితే రెండు కోట్లతో అయితేనే మనం సినిమా చేయగలుగుతాం అని ఆలోచించినప్పుడు అందులో అన్ని కథలు పోను మిగిలింది, నాకు బాగా నచ్చింది ఈ నోస్టాల్జియా. ఇది అప్పటికి ఎవరు పెద్దగా టచ్‌ చేయని సబ్జెక్టుగా అనిపించింది. ప్రాపర్‌ మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌ చూపిద్దాం. ఇంతవరకు చూపించిన మిడిల్‌ క్లాస్‌లైఫ్‌ కాకుండా వాస్తవంగా ఉండే డిష్‌ కనెక్షన్‌ గొడవలు, చిట్టీలు కట్టుకునే ఇబ్బందులు, చదువుని ఆస్తిగా భావించే తీరు వంటి అచ్చమైన మిడిల్‌ క్లాస్‌ తీద్దాం అన్న ఆలోచనలో భాగంగానే ఈ నేటివిటీ ఉన్న మిడిల్‌ క్లాస్‌ సినిమాని చేయాలనుకున్నా. సినిమా మొదట్లో చెప్పినట్టుగా ఇది కేవలం అనుభూతుల సమాహారం. ఈ సినిమా రాసే, తీసే క్రమంలోనే చాలా సంతప్తి కలిగింది. ఎక్కువ సీన్లు మా ఇంట్లో జరిగిన విషయాలే ఉంటాయి. మరికొన్ని నా జీవితంలో గమనించిన వ్యక్తులను ఆధారంగా చేసుకొన్నవి కూడా ఉన్నాయి. ఇలా రెండు అనుకోవచ్చు.
చిత్రసీమలో మీ అరంగ్రేటం అనుకొన్న ప్రణాళికపరంగానే సాగిందా?
చిత్రసీమకు రావాలన్నది నా కాన్సస్‌ నుండి జరిగిందే. కానీ ఈ ఆపర్చునిటీలు మాత్రం అనుకోకుండా వచ్చేశాయి. ఈ ‘చ90’ కంటే ముందు కలర్స్‌ స్వాతి హీరోయిన్‌ గా ‘టీచర్‌’ అనే ఒక సినిమా తీశాను. అది ఇంకా రిలీజ్‌ కావాల్సి ఉంది. కొద్దిగా ఆలస్యం అవుతూ ఉండడం ద్వారా అనుకోకుండానే ఈ వెబ్‌ సిరీస్‌ రాసుకోవడం, ఈటీవీ విన్‌ వాళ్ళ ద్వారా సినిమాల్లోకి రావడం అలా జరిగిపోయింది. ప్రతిదీ ఒక ఫ్లోలో జరుగుతూ పోయిందే తప్పితే దేన్నీ నేను ప్రత్యేకించి ప్రణాళిక వేసి చేసిందంటూ ఏమి లేదు. కాకపోతే ఇచ్చిన అవకాశానికి న్యాయం చేశాను.
చిత్రనిర్మాణంలో మీకు ఏవిధమైన స్వేచ్ఛా సాకారాలు ఇచ్చారు?
అప్పటికి నేను ‘చ90’ పట్టుకొని ‘ఈటీవి విన్‌’ తప్ప అన్ని ఓటిటి సంస్థల్ని తిరగేశాను. నచ్చకపోవడం… తిరస్కరించడం… కొందరికి నచ్చినా సినిమాగా మారకపోవడం… నేను తియ్యగలనా అన్న అనుమానం ఉండేవి. అన్ని తిరిగేశాం కదా ఈ ‘ఈటీవి విన్‌’ వాళ్ళకు ఒకసారి చెబితే పోలా అని ప్రయత్నం చేశా. వెళ్ళేటప్పుడు ఏవిధమైన నమ్మకం లేదు. అన్నిటిలానే వీళ్ళు కూడా రిజక్ట్‌ చేస్తారు అనుకొన్న. వెళ్ళి చెప్పగానే వాళ్లకు ఎంతగానో నచ్చింది. కేవలం వారంలోనే జరగవలసిన రిజిస్టర్‌ ప్రాసెస్‌ అంతా జరిగిపోయింది.
కేవలం 24 రోజుల్లో మూడున్నర గంటల నిడివి కలిగిన 6 ఎపిసోడ్లను తియ్యగాలిగాను అంటే అది వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛనే కారణం. ఒక దశలో నేను లో గా ఫీలైనా వాళ్ళు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వాస్తవానికి ఏ సంస్థలోనైనా ఏ డైరెక్టర్‌ కైనా స్వేచ్ఛ ఉంటుంది. ఎప్పటివరకు అంటే సినిమా నిర్మాణంలో తలెత్తే ప్రశ్నలకు అతడి దగ్గర సమాధానం ఉన్నప్పటివరకు. నా వరకు ‘ఈటీవి విన్‌’ వాళ్ళ ద్వారా పూర్తి సహకారం దొరికింది.
నేటి యువ దర్శకులు తొందరగా విఫలం అవ్వడానికి ‘థియరీ ఎక్కువ- ప్రాక్టికల్‌ తక్కువ’న్న విమర్శ నిజమేనా?
నేను విఫలం అయ్యే అంతవరకు దానికి రీజన్‌ ఏంటో నాకు తెలియకపోవచ్చు అనుకొంటా (నవ్వుతూ). ఇండిస్టీలో ఏ హీరోనయినా ఎక్కడ ఫిలిం కోర్స్‌ చేసి వచ్చావు? ఏం చదువుకున్నావు? అన్నది చూసి సినిమా ఇవ్వరు. కేవలం నువ్వు రాసిన స్క్రిప్ట్‌ ని చదివే అవకాశం ఇస్తాడు. సో ఎక్కువ సినిమాలు చేసినా, అసలు సినిమాలు చేయకపోయినా ఫైనల్‌ గా స్క్రిప్ట్‌ మాత్రమే కీరోల్‌ ప్లే చేస్తుంది. అది బలంగా లేనప్పుడు పెద్ద డైరెక్టర్‌ అయిన చిన్న డైరెక్టర్‌ అయినా ఫలితంలో వ్యత్యాసం ఉండదు. సినిమా ప్రేక్షకులకు ఏ కోణంలో నచ్చుతుందో అన్నదాన్ని బట్టి దర్శకుడు ఎదుగుతాడు. నాకు తెలిసినంతవరకు ఇండిస్టీలో ‘థియరీ-ప్రాక్టికల్‌’ మోతాదులు సరాసరి ఇంత ఉండాలని కొలమానమంటూ ఏది ఉండదు.
‘ఎవరి దగ్గర పనిచేయ్యకుండానే సినిమా తీసేయ్యాలి’ అన్నది చిత్రసీమకి ప్రయోజనమా? ప్రమాదమా?
వాస్తవానికి దీన్ని అంత పెద్ద అంశంగా పరిగణించకూడదు. చిత్రసీమకు అనుభవం ఉన్నవాళ్లు వచ్చినా, అనుభవం లేకుండా వచ్చి సినిమా తీసినా ఇండిస్టీకి ఎటువంటి ప్రమాదమూ ఉండదు. ఎందుకంటే ఇండిస్టీ మొత్తం కలిసి ఒక్క సినిమా తియ్యరు కాబట్టి. ఒక్కోరు ఒక్కొక్క కోణంలో సినిమా తీస్తూ ఉంటారు. సినిమా తీయబోతున్న సబ్జెక్ట్‌ ని బట్టి జయాపజయాలు ఉంటాయి. ఒకవేళ కొత్తవాళ్ళందరు వచ్చి ఫ్లాప్‌ లు తీసినా ఇండిస్టీకి వచ్చిన నష్టమంటూ ఏదీలేదు. ఫ్లాప్‌ అన్నది కొంతమందికి నష్టం వచ్చినా చాలామందికి ఉపాధి దొరుకుతుంది. ఈ విధానాన్ని అంత నెగిటివ్‌గా చూడాల్సిన అవసరం అయితే లేదు.
బాల్యాన్ని వద్ధాప్యంలో ఎక్కువగా ప్రేమిస్తారు. మీరు యవ్వనంలోనే వాటిపై అంత మక్కువ కలిగివుండడానికి కారణమేంటి?
మారుతున్న జీవనశైలే అందుకు కారణం. దీనివల్ల గతంమీద నమ్మకం, భవిష్యత్తుమీద ఆలోచనలు పెరుగుతాయి. ఒక సమయంలో చిన్నగా ఉన్నప్పుడు పెద్దగైతే బాగుంటుంది అనిపిస్తుంది. అదే పెద్దయ్యాక స్కూల్‌ లైఫే బాగుందనిపిస్తుంది. సహజంగా కాలేజ్‌ అయ్యిపోయాక స్కూల్‌ డేస్‌ బాగా గుర్తుకువస్తాయి. జీవితంలో ఒక దశకి వెళ్ళాక ఇప్పుడున్న దశ చాలా బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్‌ మెమోరీస్‌ వద్ధాప్యంలోకి వెళ్లాక చాలా మరిచిపోతాం. అది ఎక్కువగా గుర్తొచ్చేది యవ్వనంలోనే… అందుకే నేను స్కూల్‌ గురించి అప్పటి జీవితం గురించి తీయడానికి ఆసక్తి చూపాను. బహుశా ఒకదశకు వెళ్లాక ఇప్పుడున్న జీవితం గురించి తీస్తానేమో (నవ్వుతూ)
దర్శకులుగా ఎదగడానికి ఏయే పుస్తకాలు తోడ్పడ్డాయి?
వాస్తవానికి నేను పెద్దగా ఏ పుస్తకాలూ చదవలేదు. ఆఖరికి సినిమాకి సంబంధించిన పుస్తకాలు కూడా. ఇప్పటికీ నేను పుస్తకాలు పెద్దగా చదవలేకపోయానే అని వెలితిగా భావిస్తుంటాను. బయట ఎంతోమంది మిత్రులు పుస్తకాలు చదవమని ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా యువరచయితలు. అవన్నీ తీసుకొచ్చి అలా అల్మారాలలో పెట్టడమే సరిపోతుంది కానీ చదివేంత అవకాశం దొరక్కపోవడం జరుగుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు వేగంగా రాయడం, చదవడం కూడా రాదు. మహాప్రస్థానం చదువుదామని ఎంతో ప్రయత్నించినా కొన్ని పదాలు నా నోరు కూడా తిరగలేదు. ఒకటి రెండు సినిమాలు చేసి తప్పకుండా పుస్తకాలు చదవడానికి బ్రేక్‌ తీసుకొంటా.
ప్రభావం చూపిన సినిమాలు, దర్శకులు?
నన్ను దర్శకుడు అవ్వాలన్నంత ప్రభావితం చేసిన సినిమాలేవీ లేవు. సినిమా చేస్తున్నప్పుడు కూడా ఇలా చేయాలి, అలా చేయాలన్నంత ఇతరుల ప్రభావానికి కూడా నేను గురికాలేదు. వాస్తవానికి ఎవరైనా సినిమా డైరెక్టర్‌ అవ్వాలని ఒక దశలో చాలా డీప్‌ ఫోకస్‌లో ఉంటాడు. ఆ సమయంలో అతడికి రిజెక్ట్‌నెస్‌ ఎక్కువగా ఉంటుంది. అప్పటికి నువ్వు అన్నింటినీ వదిలిపెట్టి చిత్రసీమలోకి రావడం… ఆర్థిక బలహీనత ఉండడం… తోటి మిత్రుల లైఫ్‌ సెటిల్మెంట్‌ అయిపోయినా మనం కాకుండా ఉండడం… కుటుంబ సహకారం తగ్గుతూ రావడం… ప్రేమించిన అమ్మాయి చేజారిపోతుండడం… వంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు సినిమాకథ చెబితే కొంతమందికి నచ్చకపోవడం… నచ్చినా సినిమాగా కాకపోవడం… వంటి క్లిష్ట పరిస్థితుల్ని కూడా ఎదుర్కొంటుంటాడు. అటువంటి సందర్భంలో కూడా నమ్మకంగా ఉంటే కచ్చితంగా విజయం సాధిస్తావ్‌. ఆ సందర్భంలో నువ్వు తెలుసుకోవాల్సిన అసలు వాస్తవం ఏందంటే ఈ ఫేజ్‌ జీవితాంతం ఉంటుందని. నీకు నిరంతరం విజయం వచ్చినా అదే ఫేజ్‌లో ఉంటావు. ఓటమి వచ్చిన అదే ఫేజ్‌లో ఉంటావని నువ్వు ఆలోచించగలిగినప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తావ్‌. ఒకవేళ సాధించకపోయినా ‘నేను అలా ప్రయత్నించలేద’న్న విచారం నీ జీవితంలో ఉండదు. ఇది చాలా కీలకం. ఏ ఫిలింమేకర్‌ కైనా ‘ఫెయిల్యూర్‌ ఈజ్‌ నాట్‌ అబౌట్‌ విన్నింగ్‌ అండ్‌ లూజింగ్‌. ఫెయిల్యూర్‌ ఈజ్‌ వెన్‌ యు స్టార్ట్‌ రిగ్రేటింగ్‌.’ ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది.
సినిమా ప్రయాణంలో నన్ను వ్యక్తిగతంగా ప్రభావితం చేసింది వేణు ఉడుగుల, తరుణ్‌ భాస్కర్‌, వెంకట్‌ మహా. వీళ్లు తీసిన సినిమాలకంటే వీళ్ళు సినిమా చేయడం కోసం ఇటువంటి సందర్భాలను ఎలా తట్టుకుని నిలబడ్డారు అన్న అంశాలే నన్ను ఎక్కువ ప్రభావితం చేశాయి. అటువంటి క్లిష్ట సందర్భాలు దాటివచ్చి ఒక సక్సెస్‌ కొట్టారు కదా అన్నదే మాలాంటి ఫిలిం మేకర్స్‌కు ఒక ఇన్స్పిరేషన్‌ కలిగిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే మెంటల్‌ స్టెబిలిటీ నుంచి ప్రభావితమైనవాడిని తప్ప… కొన్ని సినిమాలు, కొందరు దర్శకులు అంటూ ఏమి లేదు.
‘అనువాద సినిమా’ – ‘స్వతంత్ర సినిమా’లకు సంభాషణలు రాయడంలో ఉన్న వ్యత్యాసాలు?
ఒక రచయితగా ఈ రెండింటి మధ్య ప్రధానంగా తేడా గమనిస్తే… స్వతంత్ర సినిమా అన్నది మీ ఇంట్లో మీరు మీకు నచ్చినట్లుగా ఉండడం లాంటిది. అనువాద సినిమాకు రాయడం ఇతరుల ఇంట్లో నువ్వు అతిథిగా ఉండడం. వాళ్ళ విధానాలకు లోబడి మీ పరిధిలో మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. అనువాద సినిమాకి రాస్తున్నప్పుడు స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. దర్శకుడి విజన్‌కు లోబడి మాటలు రాయవలసి ఉంటుంది. ఈ అనువాద సినిమాలో ప్రేక్షకులకంటే దర్శకుడుని ఎక్కువ మెప్పించాల్సి ఉంటుంది. దర్శకుడుకి ఎంతమేరకు న్యాయం చేయగలుగుతున్నామన్నది ప్రధానంగా ఉంటుంది. అలాగే రాస్తున్న భాషలో ప్రేక్షకులకు ఎంత దగ్గరగా తీసుకెళ్తున్నాం అన్నది కూడా ప్రధానమే. ఈ విధమైన నిబంధనలు స్వతంత్ర సినిమాలో ఉండవు. ఈ ‘ప్రేమలు’ సినిమాకు తెలుగులో సంభాషణలు రాయడం ద్వారా తెలిసిన విషయం ఏమంటే అనువాద సినిమా అన్నది రచయితకు సవాలుగానే ఉంటుంది.
మొదటి సినిమా విజయం రెండో సినిమాకు అంచనాలు పెంచుతుంది. అది మీకు ఒత్తిడిగా ఉందా? ఉత్సాహం కలిగిస్తుందా?
రెండు కలిగించవు. నాకు ప్రధానంగా ఉండేది కథపరంగా సినిమాను ఎలా తీస్తున్నాం అన్నది తప్పితే ఇంకేమి మైండ్‌ లో ఉండవు. సినిమా తీస్తున్నప్పుడు కూడా ప్రేక్షకుడి కోణంలో నుంచి ఆలోచించను. రాస్తున్నప్పుడు నాకు సంతప్తినిచ్చిందా అన్నదే ప్రధానం. నాకు సంతప్తి కలిగితే ఖచ్చితంగా ప్రేక్షకులకు కూడా సంతప్తినిస్తుందని బలంగా నమ్ముతా. ప్రేక్షకుల గురించి ఎక్కువగా ఆలోచించను కాబట్టి వాళ్ళనుంచి ఒత్తిడి ఉండదు. ఉత్సాహం కూడా ఉండదు. నాకు సినిమా తీయడానికి దొరికిన అవకాశాన్ని ఎంత ఉన్నతంగా తియ్యగలనన్న ఆలోచన తప్పితే మరే ఇతర అంశాలకు నేను ప్రభావితంకాను.
తదుపరి మీ ‘ఫిల్మోగ్రఫీ’ ్‌శీ సశీ శ్రీఱర్‌ లో ఏయే ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి?
మొన్ననే ‘ప్రేమలు’ సినిమాకి తెలుగులో సంభాషణలు రాశా. ప్రస్తుతానికి నితిన్‌ గారితో ఒక లవ్‌ స్టోరీ చేద్దామన్న ప్రాసెస్‌ నడుస్తుంది. మైండ్‌ లో ఏవేవో తిరుగుతున్నా ఇప్పటికైతే ఇదో సినిమానే ఉంది.

– మదన్‌ మోహన్‌ రెడ్డి 9989894308

]]>
హ్యాట్స్‌ ఆఫ్‌ జయలక్ష్మి.. https://navatelangana.com/hats-off-to-jayalakshmi/ Sat, 23 Mar 2024 17:40:51 +0000 https://navatelangana.com/?p=255249 Hats off Jayalakshmi..సూర్యుడితో పోటీ పడి మరీ ఆమె పనికి బయలుదేరుతుంది. అమ్మ బండో, నాన్న బండో ఎక్కి ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తుంది. పదిగంటలకు కళాశాలలో విద్యార్థిని అవుతుంది. సాయంత్రం… పాఠాలు చెప్పే పంతులమ్మ, విరామం దొరికితే… సమస్యలపై పోరాడే సామాజిక కార్యకర్త. బస్తీల్లో కొత్తగా అంగన్వాడీలు సాధించుకొని… వాటిల్లోని పిల్లలకు అల్పాహారం అందించిన ఘనత ఆమెది. హైదరాబాద్‌ ‘చిల్డ్రన్స్‌ పార్లమెంట్‌’కు ప్రధానిగా చిన్నారుల్లో చైతన్యం రగిలిస్తున్న డిగ్రీచదువుతూ ఛేంజ్‌ మేకర్‌ అవార్డు అందుకున్న అరిపిన జయలక్ష్మి జీవితం భిన్న కోణాల సమాహారం. గమ్యం ఐఏఎస్‌.
అరిపిన జయలక్ష్మిది రాయలసీమ నుంచి బతుకుదెరుకు హైదరాబాద్‌ వచ్చిన వలస దళిత కుటుంబం. ముగ్గుపిండి అమ్ముకుని బతుకు వెళ్లదీసే కుటుంబం. జయలక్ష్మి తల్లిదండ్రులు హుసేనమ్మ, రామ్మోహన్‌ లు మాత్రం చెత్తబండి నడపడాన్ని ఉపాధి చేసుకున్నారు. చిన్న వయసులోనే పెండ్లి అయినా ఈ జంట బతుకుబండికి చెరో ఇరుసులా చెరోబండి నడిపేవారు. కాలనీ వాళ్లు నెలకు ఇంతని ఇచ్చే డబ్బులే ఆ కుటుంబానికి జీవనాధారం. వీరికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ఏ కష్టంచేసి అయినా పిల్లలను చదివించాలని తపన వారిది.
తల్లి కష్టాన్ని పంచుకుంటూ.. 
ఏడో తరగతి నుంచి ఈ రోజు వరకూ తల్లికి తోడు తానూ చెత్త సేకరించడం, తడిచెత్త పొడిచెత్తను వేరు చేయడం, డంపింగ్‌ యార్డ్‌లో పడేయడం అన్నీ చేస్తోంది. ఇది చాలా దారుణమైన పని అని, కష్టమైన పని అని అనేవారు లేకపోలేదు. కాని ”నా మటుకు నాకు ఇది అన్నం పెట్టే వత్తి. నేను దానిని గౌరవిస్తాను” అంటూ ఆ మాటలను కొట్టిపారేస్తోంది జయలక్ష్మి.
తొలి సారి స్కూల్లో…
జయలక్ష్మి చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేది. కాలనీలోని సమస్యలపై మాట్లాడేది. స్కూల్లో ఒకసారి ఇలాగే మాట్లాడితే ‘మాంట్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌’ అనే ఎన్‌.జి.ఓ దృష్టిలో పడింది. పేదవర్గాల కోసం పని చేసే ఆ సంస్థ జయలక్ష్మిని తన కార్యకలాపాల్లో భాగం చేస్తూ ప్రోత్సహించింది. ఏడేళ్ల కిందట మాంట్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అనే స్వచ్ఛంద సంస్థ 56 బస్తీల్లో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే చిల్డ్రన్‌ పార్లమెంట్‌ నిర్వహిస్తోంది. 6 నుంచి 18 ఏండ్ల వయసు పిల్లలను భాగస్వాములుగా చేసి వారి సమస్యలపై వారే చర్చించుకుని పరిష్కార మార్గాలు అన్వేషించేలా తీర్చిదిద్దింది. ఇందులో భాగమే పార్లమెంట్‌, ప్రధానమంత్రి. ఇక్కడి సమస్యలపై బాగా అవగాహన, చురుకుదనం ఉన్న జయలక్ష్మి ప్రధానిగా ఎన్నికయ్యింది. ”అమ్మానాన్నలు పొద్దునే కూలికి వెళ్లిపోతే… స్కూల్లో మధ్యాహ్నానికిగానీ అన్నం పెట్టరు. అంత వరకూ ఆకలితో ఉండాల్సిందే. ఆలోపు తినేందుకు ఏమైనా ఉంటే బాగుంటుంది కదా” అని ఓ చిన్నారి బాధపడింది. తక్కిన పిల్లలూ ఆమెతో గొంతు కలిపారు. అదే విషయంపై ఓ తీర్మానం చేశారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ ప్రధానమంత్రిగా ఉన్న జయలక్ష్మి ఈ విషయాన్ని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌కు వివరించింది. చిన్నారుల ఆకలి బాధకు స్పందించి 56 బస్తీల్లో ఉన్న అంగన్‌వాడీలలో ఉదయం అల్పాహారం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత మరో 21 బస్తీల్లోకి దీన్ని విస్తరించింది. దీనిపై స్పందిస్తూ.. ”స్లమ్స్‌లో ఉండే పిల్లల వికాసం కోసం నేను పని చేశాను. హైదరాబాద్‌లో 56 స్లమ్స్‌ ఉంటే వాటిలో 21 చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు లేవు. మేమందరం మహిళా సంక్షేమ శాఖ దగ్గరకు వెళ్లి మాట్లాడి వాటిని సాధించాం” అంటుంది జయలక్ష్మి.
చిల్డ్రన్‌ పార్లమెంట్‌ 
తొమ్మిదో తరగతి చదువుకునేప్పుడు హైదరాబాద్‌ చిల్డ్రన్‌ పార్లమెంట్‌కు ప్రధానమంత్రిగా ఎన్నికైంది. ఇదేమంత చిన్న విషయం కాదు. ప్రతి బస్తీ నుంచీ ఓటింగ్‌ జరుగుతుంది. బస్తీ ప్రతినిధులందరూ కలసి ప్రధానిని ఎన్నుకుంటారు. సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు ఉన్న వారినే ఎన్నుకుంటారు. ఈ పార్లమెంట్‌కూ స్పీకర్‌, ఉపప్రధాని, హోంమంత్రి.. ఇలా అన్ని పదవులూ ఉంటాయి. వీరంతా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివద్ధి లక్ష్యాలపైన, స్థానిక సమస్యలపైన చర్చిస్తారు. గతంలో డ్రైనేజీలతో పడుతున్న ఇబ్బందుల గురించి జలమండలి ఎండీ దానకిశోర్‌ దష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి కాల్వలు బాగు చేయించడంతోపాటు, దోమల నివారణకు ఫాగింగ్‌ చేయించారు. మురుగు సమస్య, అంగన్‌వాడీలు, రోడ్లు, విద్యుత్తు సరఫరా, తెల్లరేషను కార్డులు, ఇళ్లు.. అనేక సమస్యలను చిల్డ్రన్‌ పార్లమెంట్‌లో చర్చించి, అధికారుల దష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటుంది. వీరి బస్తీలో ఇటీవల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన సంచలనం రేపింది. దీనిపై పిల్లలతో పార్లమెంట్‌ నిర్వహించి పరిస్థితులలో మార్పు తీసుకువచ్చారు. మద్యపానం, వాటి అమ్మకాలకు వ్యతిరేకంగా చిల్డ్రన్‌ పార్లమెంట్‌ తీర్మానం చేసింది.
కోవిడ్‌ సమయంలో.. 
ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలనుకుని తన వాడ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్న జయలక్ష్మి తన వాడలోని పిల్లలకు సాయంత్రాలు ట్యూషన్‌ చెప్తూ వారి చదువుకు మేలు చేస్తోంది. ‘కోవిడ్‌ సమయంలో మా కాలనీలో నేను కార్యకర్తగా పని చేశాను. కోవిడ్‌ రాకుండా చాలా వరకు సక్సెస్‌ అయ్యాను’ అంది.
నా లక్ష్యం ఐఏఎస్‌.. 
‘యువతకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. హక్కుల కోసం పోరాడాలి. అమెరికాలో శాంతియుత పోరాటాల విజయగాథలను అధ్యయనం చేయగలగడం నా అదష్టం. ఒక యువ ప్రతినిధిగా పోరాడుతూనే ప్రజల సేవ కోసం ఐఏఎస్‌ సాధించాలనుకుంటున్నాను. అందుకు కావలసిన సహాయం పొందగలననే అనుకుంటున్నాను. నాకు ఎంతమంచి పేరున్నా చెత్త అమ్మాయి అనే పిలుస్తారు కొందరు. వారి చేత ఉత్తమ అమ్మాయి అనిపించుకునేందుకు, లక్ష్యం లేని వారి బుర్రలే చెత్త అని నిరూపించేందుకు మరింత కష్టపడతాను’ అంది జయలక్ష్మి.
అన్ని ఉండి ఈ రోజుల్లో ఏదైన సాధించాలంటే.. ఎంతో కష్టం. కానీ ఏమిలేని ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక బలమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈమెకు మనం నిజంగా హ్యాట్స్‌ ఆఫ్‌ చెప్పాల్సిందే. సాధించాలనే లక్ష్యం బలం ఉంటే.. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సాధించవచ్చని నిరూపించింది. ఎవరికీ సక్సెస్‌ అనేది అంత సులువుగా రాదు. ఎంతో కష్టపడి చదివితే కానీ ఆ సక్సెస్‌ అనే తీపి ఫలాలను రుచిచూడలేం. అలాగే జీవితంలో ఫెయిల్‌.. పరీక్షలో ఫెయిల్‌ అయ్యామని బాధపడే వారికి జయలక్ష్మి జర్నీ ఒక మంచి ఉదాహరణ. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ సమీపంలో అతి పెద్ద మురికివాడ.. సింగరేణి కాలనీలో ఉంటూ, చెత్త బండి లాగుతూ చదువుకుంటున్న ఈ అమ్మాయి ఇలా అమెరికా వరకూ చేరుకోవడం సామాన్యం కాదు. పోరాడే తత్వం, సాధించాలనే పట్టుదల ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. జయలక్ష్మిలోని అసాధారణమైన చొరవ, తపన ఆమెను ఇలా ముందుకు నడుపుతున్నాయి.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417 

]]>
ఈ త‌రాన్ని క‌విత్వంగా మాట్లా‌డ‌నివ్వండి… https://navatelangana.com/let-this-generation-speak-poetry/ Sun, 17 Mar 2024 02:18:53 +0000 https://navatelangana.com/?p=250709 ”యువ కవులూ మీకు నచ్చినట్లు రాయండి.. మీకు నచ్చిన శైలిలో రాయండి. ఈ దారే సరైనదని నమ్మించి వంతెన కింద రక్తపుటేర్లు పారించారు. కవిత్వంలో అన్నింటికీ అనుమతి ఉంది. అయితే ఒక్క షరతు… మీరు రాసేది తెల్ల కాగితం కన్నా మెరుగ్గా ఉండాలి” అంటాడు నికనోర్‌ పర్రా అనే కవి.
ఇవ్వాళ అసలు కవిత్వం లేదు. ఇప్పుడు రాసేది కవిత్వమే కాదని వినిపిస్తున్న కాలంలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ తరం కవిత్వాన్ని పరిచయం చెయ్యాలనుకున్నాను. పైన నికనోర్‌ పర్రా అనే కవి అన్నట్లు ఈ తరం హదయానికి నచ్చినట్టు రాస్తుంది. వాస్తవ ప్రపంచాన్ని కళాత్మకంగా కవిత్వం చేస్తుంది. మూలాలను వెతుకుతుంది. కాలానికి అనుగుణంగా ప్రత్యేక కవిత్వ భాషను ఏర్పాటు చేసుకుంటుంది. బాధలతో, గాయాలతో, నొప్పితో రాయాల్సిన వాక్యాన్ని స్కాన్‌ చేస్తూ రాస్తుంది. కవితా వాక్యాలతో దశాలను చూపిస్తుంది. గుండెను మెలిపెడుతుంది. మెలిక తిప్పుతుంది. ఎంతో కొంత మనుషులను గడ్డ కట్టినప్పుడల్లా కరుగతీస్తుంది. ఆలోచింపజేస్తుంది. కవిత్వం ఇలానే రాయాలనే నియమాన్ని దాటుకుంటూ రాస్తుంది. రాసే ప్రతీ దానికి తమదైన పరిమళాన్ని వెంటేసుకొస్తుంది. దేశంలో.. దేహంలో జరిగే కదలికలను పసికట్టి రాస్తోంది. నిలబడాల్సిన చోట నిలబడుతూనే రాస్తుంది. కలలను రాస్తుంది. కళాత్మకమైన నినాదాన్ని వినిపిస్తుంది. భిన్నమైన శైలిలో, సొంత గొంతుతో ఎవరికి తీసిపోని విధంగా కవిత్వం కవిత్వంగా బయటకొస్తుంది. అయితే పూర్తిగా కాకున్నా ఇంకా నేర్చుకోవాల్సి ఉందేమో, ఇంకాస్త మెరుగులు దిద్దుకోవాల్సి ఉందేమో అలా అని అందరిని అదే కాల్వలోకి నెట్టడానికి వీలులేదు. స్పష్టతతోనే కవిత్వం నడుస్తుంది. ముందైతే రాయనివ్వండి. ఈ తరాన్ని సొంత గొంతుతో మాట్లాడనివ్వండి. భావాలను వ్యక్తపరచనివ్వండి. ఆ రక్తాన్ని ఒకే చోట గడ్డకట్టకుండా ప్రసరింపజేయనివ్వండి.
శ్రీశ్రీ కవిత్వం ఒక మార్క్‌ వేసుకొని రాస్తునప్పుడు కవిత్వమంటే ఇట్లాగే ఉండాలని అనుకొని అలాగే రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత చాలా పరిణామాలు కవిత్వంలో వచ్చాయి. చాలా వాదాలు కవిత్వాన్ని బలంగా నిలబెట్టాయి. భావ కవిత్వం, దిగంబర కవిత్వం విమర్శలు ఎదుర్కొన్న దాని పని అది చేసుకుంటూ పోయింది. అభ్యుదయం, స్త్రీవాదం, దళిత వాదం, మైనారిటీ వాదం, బీసీ వాదం ఇలా ఏ వాదం ఎట్లాంటి విమర్శలు ఎదుర్కొన్న వాటి పని అవి సమర్ధవంతంగా చేసుకుంటూనే వొచ్చాయి.
వచన కవిత్వ ఆద్యుడు కుందుర్తి ఆంజనేయులు దగ్గర నుండి మా కన్న ముందున్న తరం దాకా కవిత్వానికి వాళ్ళు చేసిన సజన, రాసినవి కవిత్వం ఆయా కాలానికి అవసరం. ఆయా కాలంతో పాటుగా నడిచారు. కవిత్వం కాలంతో పాటుగానే నడుస్తుంది.
ఏ కాలానికి ఆ కాలం ఒక కొత్త తరాన్ని తయారు చేసుకుంటుంది. అట్లా ఈ తరం కూడా కవులను కన్నది. కవిత్వాన్ని కంటుంది. ఈ నేల మీద కవిత్వ నదులు పారుతుంటాయి. అడ్డుకట్టలకు ఆగిపోయే నదులు కావవి. ఎగిరిదుమికి పరుగులుపెడుతుంటాయి.
ఆ కోణంలో ఈ తరం ఈ వాదాన్ని ఎత్తుకుంది అని గమనించినప్పుడు ఒకే మాటల చెప్పడానికి వీలుకానిది. చాలా వరకు స్పాంటేనియస్‌ స్పందిస్తుంది ఆ స్పందన నిరసన రూపంలో వుంటుంది. ధిక్కారరూపంలో వుంటుంది. బాధగా వుంటుంది. మూలాలలోంచి మాట్లాడుతునట్టుగా వుంటుంది. ఒక ప్రత్యేకమైనదిగా కాకుండా అవసరమైన గొంతుగా కవిత్వం వస్తుందని చెప్పుకోవచ్చు. సంఘటనాత్మకంగా ప్రతిస్పందిస్తుంది అని రాసుకోవచ్చును. సమాజంతో చర్య పొందుతూ రసాయానాత్మకంగా వస్తుందని చెప్పవచ్చు.
ఇప్పటి తరాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి ఉన్నప్పటికీ ఆ విస్తతి పెద్దది కాబట్టి ఇక్కడ కవిత్వ పుస్తకాలను వెలువరిచిన కవులను మాత్రమే కొంత పరిచయం చేస్తున్నాను. నిజానికి రాస్తున్న వాళ్ళు కవితా పుస్తకాలను ప్రచురించకుండా చాలా మంది ఉండి ఉండొచ్చు. ముద్రించిన వాళ్ళలో పేజీల పరిమితికి, సమయభావం వలన అందుబాటులో ఉన్న కొందరిని మాత్రమే పరిచయం చేయాల్సి వస్తుంది.
మా తరం విద్యార్థులుగా తమ చదువు తాము చదువుతూ, తమ పనులు తాము చేసుకుంటూ సిరియస్‌ గా కవిత్వం రాస్తూ పుస్తకాలు ప్రచురించిన వాళ్ళలో దొంతం చరణ్‌ -మట్టికనుగుడ్ల పాట, ఊహ చేద్దాం రండీ, గూండ్ల వెంకటనారాయణ – ఇయ్యాల ఊళ్ళో, కాపాలదారుల పాటలు, ఉదరు కిరణ్‌ – నేల నుడికారం, అమత రాజు – పిలుపు, సభావట్‌ హాథిరామ్‌ – నల్లింకు పెన్ను, తెగిపడ్డ నాలుక – మధు సార్వభౌమ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా కవిత్వం ప్రచురణకు నోచుకోవడం సంతోషదాయకం.
దొంతం చరణ్‌ ఇప్పటికే రెండు పుస్తకాలను ప్రచురించాడు. మట్టి కనుగుడ్ల పాటతో కవిత్వంలో ఒక నూతనత్వానికి తెర తీశాడు. ఊహా చేద్దాం రండీ అంటూ రెండవ కవిత్వ పుస్తకాన్ని వెలువరించాడు. చరణ్‌ ప్రత్యేక చూపున్న కవి. దేశంలో జరిగే సంఘటలకు ప్రతిస్పందనగా కవిత్వమౌతున్నాడు. ధిక్కార స్వభావంతో అన్యాయాన్ని ఖండిస్తున్నాడు. వాస్తవాన్ని కళాత్మకంగా రాయాలని పరితపిస్తుంటాడు.
”చెమటచుక్కలు భూగోళమంత ప్రేమతో నిండి వుంటాయని
మట్టి పెళ్లకు తెలిసినంత స్పష్టంగా
పొలంలోని నీరుకి తెలిసినంత లోతుగా
చెమటపైన దాడిచేసే ఉచ్చకేం తెలుసు
రైతుల మీద ఉచ్చ పోసే వర్గానికి
అన్నం ముద్దల్లో చందమామలెలా కనిపిస్తాయి.
అమాయకులు కాదు అనే కవితలో ఆదివాసీ మనిషి మీద మూత్రం పోసిన సంఘటలకు స్పందిస్తూ రాసిన కవితలోనిది ఇది.
***
గూండ్ల వెంకట నారాయణ ఇయ్యాల ఊళ్ళో, కాపలాదారుల పాటలు రెండు కవిత్వ పుస్తకాలను వెలువరించారు. నారాయణ మూలాలను విడవని వ్యక్తి. ఊరు జ్ఞాపకాలను కవిత్వంలోకి పట్టుకొచ్చిన కవి. కాపాల దారుల పాటలు పుస్తకంలో తడకలకు అలికిన మట్టిలో శ్రమజీవుల మాటలుంటాయి అని గుర్తుచేయ్యడం. తల్లికాలి కడియంలా చంద్రుడిని చూపెట్టడం, పంటల్లో పాలను పిండి జున్నును తినడం వంటివి అనుభూతులను, జీవితాన్ని స్వచ్చంగా రాస్తున్నాడు.
***
అమత రాజు ”పిలుపు” పేరుతో కవిత్వంలోకి వొచ్చాడు. అమ్మను, అలిశెట్టిని, అంబెడ్కర్‌ ని వంటి మహానీయులను తలుచుకుంటూ సమాజంలో జరుగుతున్న చర్యలకు స్పందిస్తూ స్పాంటేనియస్‌ కవిత్వం రాస్తున్నాడు. కవిత్వంతో హెచ్చరిక చేస్తున్నాడు.
”కరోనా…నువ్వు మా ముక్కుల్లో చేరక ముందే మా డొక్కల్లో ఆకలి వైరసుంది
మా బ్రతుకుల్లో కులమత వైరసుంది. అని ఈ సమాజంలో తిరుగుతున్న వైరస్ల గురించి మాట్లాడుతున్నాడు. ఏదైతే ఆశిస్తున్నాడో ఆ పిలుపును రాగం తీస్తున్నాడు.
***
సభావట్‌ హాథిరామ్‌ ”నల్లింకు పెన్ను” పుస్తకాన్ని ప్రచురించాడు. డిగ్రీ చదువుతూ కవిత్వం రాస్తున్నాడు.
”వస్తున్నాయి… వస్తున్నాయి
రాజకీయపు కత్తెరలు మరింత పదునెక్కుతూ వస్తున్నాయి
ఎజెండాల జెండాలు
మానవత కేతనాన్ని కత్తిరిస్తూ
ఓట్లకై కోట్లు ఆశలు చూపుతూ
కుల, మత గోడలను నిర్మిస్తూ
మానవునికి వాస్తవానికి గల బంధాన్ని కత్తిరిస్తూ వస్తున్నాయి” అంటూ జీవిత మూలాలను, బాధలను, చైతన్యవంతమైన దారులకోసం కవిత్వ కలలు కంటున్న కవి.
***
ఉదరు కిరణ్‌ ” నేల నుడికారం ” ఒక కొత్తధనపు వాసన వేసే కవిత్వం. సాదాసీదాగా మొదలై కొంత నడక సాగాక మెరుపులా మెరిసి, భాస్వరంలా మండే వాక్యాలు ఉదరు ప్రతి కవితలో కనిపిస్తాయి అని రివెరా ముందు మాటలో అన్నారు. అట్లా తనదైన నడకతో నడుస్తున్న కవి ఉదరు కిరణ్‌.
ఒకానొక సందర్భంలో ”ఈ నేలంతా కలల వనమై మళ్ళీ మొలకెత్తుతుంది ఎర్రని మల్లెల తావిగా వికసిస్తుంది మొండి కొడవళ్లు తమకు తాము పదును పెట్టుకుంటాయి ఆకాశమంతా తారల వనమై వెలుగుతుంది ” అంటాడు.
***
మధు సార్వభౌమ నేనొక చీకటిని కాలం మోసం చేసిన కారుమబ్బుని కట్టుకథలు పన్నిన కుట్రకు బలైన నిజచరితను” అంటాడు. ‘ఆర్యులు సష్టించిన కారుచిచ్చులో కాలిపోయిన రక్తమాంసాల ద్రావిడ చరిత్రను నేను’ అంటాడు. ఆర్యులు యుద్ధకాముకులు. ద్రావిడులు శాంతిప్రియులు. ఈ కవి చరిత్రను గుర్తు చేస్తాడు. కొత్త శక్తిని నిద్రలేపుతున్నాడు.
‘క్షమించరాని నేరం’ కవితలో విస్మరించబడిన చరిత్రను తెలుపుతాడు. ”వాన నీటికి తడిస్తే వచ్చే మట్టి వాసనలా స్పష్టంగా తెలుస్తుంది మా ధ్వంసం కాబడిన చరిత్ర” అంటాడు. చరిత్రను ఆవాహన చేసుకున్న కవి యితడు.
ఈ తరంలో స్త్రీలు రాస్తున్నారు. పూర్తిగా స్త్రీ వాదాన్ని కాకుండా అనేక విషయాలపైన స్పందిస్తున్నారు. కొత్త సూర్యుడిని కలగంటున్నారు. కొత్త ఆకాశాన్ని రాస్తున్నారు. సమాజంలో జరిగే అఘాయిత్యాలకు ప్రతిస్పందనగా అక్షారాలను బిగిస్తున్నారు. అమానవీయ సంఘటలకు కన్నీళ్ళవైపు నిలబడుతున్నారు. చేయాల్సిన సంతకాలను అక్షరాలతో చేస్తున్నారు. వీళ్ళలో శ్రీనిధి విప్లవ శ్రీ – రాలిన చుక్కలు, సుంక ధరణి – అరుణిమలు, సాత్విక ద్యాగలి – నీలి స్వప్నాలు, స్వేచ్ఛా బిందువులు, భాను తేజ శ్రీ- మీ మదిలో నేను స్వేచ్ఛగా ఎగరాలని వంటి పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. ఇంకా రావాల్సినవి ఉన్నాయి.
ఏది ఏమైనా ఇవాళ్టి తరం కవిత్వం రాస్తుంది. వాస్తవాన్ని రాస్తుంది. కొత్త కవిత్వ రైలును పాత ప్లాట్‌ ఫారం మీదకు తీసుకురాకండి. వెళ్ళనివ్వండి గుండెల మించి..పసునూరి శ్రీధర్‌ బాబు అన్నట్లు దాని నడకను నడవనివ్వండి. రాయనివ్వండి. ఋతువులకు అనుకూలంగా ఆకు రాలుతూ చిగురిస్తూనే బావుంటుంది. కింద రాలుతున్న ఆకునే చూసి ఆనంద పడకండి. చిగురిస్తున్న ఆకులను ప్రేమించండి. చదవండి. అనుభూతి పొందండి. కవిత్వపు వాతావరణ పొరలో జీవించనివ్వండి.
– పేర్ల రాము, 96425 70294

కవిత్వమంటే వసంతం రాక మానదని చెప్పే ఒక ఆశావాదం. దాడికి ప్రతిదాడి. సజనాత్మక ప్రతిఘటన. మనల్ని మనం మానవీకరించుకోవటానికి పనికొచ్చే కళాత్మకమైన పనిముట్టు.
– దొంతం చరణ్‌
కవిత్వమంటే ఆలోచనలకు, అక్షరాలకు మధ్య జరిగే సంధి. భావోద్వేగాలకు, భావార్థాలకు మధ్య జరిగే పొత్తు. సున్నితమైన ఊహలను కవిత్వం చేయాలనుకుంటాను. బతుకు చట్రంలో వెంటాడే అనేక విషయాలను కవిత్వంలోకి తీసుకురావాలనుకుంటాను. ఇవాళ్టి కాలానికి రాయాల్సిన కవిత్వం చాలా వుంది.
– సుంక ధరణి
కవిత్వమంటే ఒక్కో కవికీ/ కవయిత్రికి ఒక్కో రకమైన నిర్వచనం వుండి వుంటది. అది సమాజం పట్ల వాళ్ళ దక్పథాలను, వాళ్ళ ఆలోచనల్ని ప్రతిబింబిస్తూ వుంటది.
అందరిలాగే కవిత్వమంటే నాకూ ఓ నిర్వచనం వుంది. ”మతం, మార్కెట్‌ రెండూ ఒక్కటై విశాల ప్రజా సముహంపై దాడి చేస్తున్నప్పుడు మనుషులని సామాజికంగా, వ్యక్తిగతంగా కాపాడేది. మనిషిగా నిలబెట్టేది. అవసరమైన ప్రతీ చోట మనిషిని చైతన్యవంతంగా తీర్చి దిద్దేది.” మార్పు కోసం మాత్రమే కాదు మీలో మనిషితనం కాపాడుకోవడం కోసం ప్రతీ ఒక్కరూ కవిత్వం రాయండి.
– అమృత రాజు
కవిత్వం నాకు మానసిక ఆత్మకథ లాంటిది. అందులో ప్రజల ఏడుపు, పోరాటం, శ్రమ, సౌందర్యం కలిసి ఉంటాయి. కాబట్టి అది సామూహిక ఆత్మకథ అవుతుంది. ఆ సామూహిక ఆత్మకథను చెప్పటం కోసం నేను కవిత్వం రాస్తాను.
– గూండ్ల వెంకట నారాయణ

]]>
ఫోర్బ్స్‌ మెచ్చిన తెలంగాణ బిడ్డ https://navatelangana.com/telangana-child-appreciated-by-forbes/ Sat, 09 Mar 2024 17:19:51 +0000 https://navatelangana.com/?p=245330 Telangana child appreciated by Forbesసరికొత్త ఆలోచనలు.. సాధించాలనే కసి ఉంటే చాలు. యువత అనుకున్నది సాధించి తీరుతుంది. చేస్తున్న పని విజయవంతమైతే కొందరు కోట్లు కూడా కూడబెడతారు. కానీ, కొందరు మాత్రం భిన్నం. ఎంత సంపాదించామన్నది కాదు.. జనానికి ఎంత ఉపయోగపడుతున్నాం అనే ఆలోచిస్తారు. సృజనాత్మక దారిలో ముందుకెళ్లాలనుకుంటారు. తమ ఆలోచనలు పదిమందికి ఉపయోగపడాలని ఆశిస్తారు. కేవలం ఆలోచనలుంటే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ఫలితాలు వస్తాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నరేందర్‌ చింతం. స్వయం కృషితో ఎదిగిన ఈ పల్లెటూరి పిల్లగాడు.. ప్రపంచ యవనికపై నేడు తెలంగాణ ఖ్యాతిని చాటుతూ అఫీషియల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫోర్బ్‌ జాబితాలో చోటు సాధించాడు. అతి పిన్న వయసులో అత్యున్న శిఖరాలకు ఎదిగిన కరీంనగర్‌ జిల్లా వాసి పరిచయం ఈ వారం జోష్‌.
కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మక్తపల్లి అనే మారుమూల గ్రామంలో మద్యతరగతి వ్యవసాయ కుటుంబంలో చింతం రాములు, కనకలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఎల్‌ఎండీ కాలనీలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటర్‌ నుండి డిగ్రీ వరకు కరీంనగర్‌లో పూర్తి చేశారు. 2004-2005 మధ్య రాష్ట్రంలో తీవ్రమైన వర్షబావ పరిస్థితి నెలకొన్నది. ఆ కాలంలో వర్షాలు లేకపోవడంతో బోర్లు వేసి నష్టపొవడం… అప్పులపాలు అయ్యారు. ఉన్న పదెకరాలు అమ్ముకోవాల్సిన వచ్చింది. చదువు మధ్యలోనే ఆపేయాల్సిన గడ్డు పరిస్థితులు. కానీ, వాటిని అధిగమించి 2007లో హైదరాబాద్‌లో ఎంబీఏ డిగ్రీ అందుకున్నాడు. కొన్ని రోజులు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు.
మలుపు తిరిగిన జీవితం
నరేందర్‌ ప్రతిభను ఆనతికాలంలోనే బెంగళూరులో తాను పనిచేస్తున్న కంపెనీ గుర్తించింది. సీనియర్లు చాలా మందే ఉన్నా కంపెనీ వర్క్‌ నిమిత్తం నరేందర్‌నే అమెరికా పంపింది. ఆ తరువాత అతి కొద్దికాలంలోనే అతడు అమెరికా, ఇటలీ, జర్మనీ, బ్రిటన్‌, స్కాట్లాండ్‌, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ లాంటి అనేక దేశాలు వత్తిరీత్యా పర్యటించి, అతికొద్ది సమయంలోనే ఎక్కువ దేశాలు తిరిగిన సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌గా పేరు సంపాదించారు.
160 ప్రపంచ స్థాయి జర్నల్స్‌…55 ఇన్నోవేటివ్‌ పేటెంట్లు
ప్రపంచంలోని అత్యున్నత విద్యాసంస్థ అయిన MIT కేంబ్రిడ్జ్‌ నుండి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా పట్టా పొందిన నరేందర్‌ 2015లో అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే తన సజనాత్మకను ప్రపంచానికి తెలిసేలా చేశారు. అమెరికా వెళ్లిన తర్వాత రీసెర్చ్‌ చేసి సుమారు 55 ఇన్నోవేటివ్‌ పేటెంట్లను పబ్లిష్‌ చేశారు. దానితో పాటు అనేక ప్రపంచస్థాయి కాన్ఫెరెన్సులకు కీ నోట్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. పదకొండు ప్రపంచ స్థాయి జర్నల్‌ సంస్థలకు చీఫ్‌ ఎడిటర్‌గా పని చేస్తూ, సుమారు 160 ప్రపంచ స్థాయి జర్నల్స్‌ ప్రచురించి అనేక విద్యాసంస్థలకు టెక్నికల్‌ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
అత్యంత తక్కువ సమయంలో కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ కంపెనీలో సీనియర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆర్కిటెక్ట్‌ స్థానాన్ని సంపాదించారు. అనేక ఇన్నోవేటివ్‌ జర్నల్స్‌ మార్కెట్లో విడుదల చేసి, అత్యంత ప్రతిష్టాత్మకమయిన ఫోర్భ్స్‌ జర్నల్‌లో అఫియల్‌ ఎగ్జిక్యూటివ్‌గా స్థానం సంపాదించగలిగారు. ఇటీవల దేశరాజధాని న్యూఢిల్లీలో ఢిల్లీ విధాన సభ స్పీకర్ర్‌ శ్రీరాం నివాస్‌ గోయ చేతుల మీదుగా అత్యంత అరుదైన భారత సమ్మాన్‌ నిధి అవార్డును టాప్‌ టెన్‌ రేసర్‌గా ఎక్కువ రీసర్చ్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ పేటెంట్స్‌ కలిగిన వ్యక్తిగా అందుకున్నారు. ఆయన భార్య వినీత కూడా అక్కడే ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె సహకారం అతని విజయానికి తోడ్పాటునిస్తుంది.
నరేందర్‌ చింతం ఇన్నోవేషన్స్‌
నరేందర్‌ రీసర్చ్‌లో కొన్ని ముఖ్యమైనది ఆర్టిఫిషియల్‌ ఇటెలిజెన్స్‌ ఆధారిత కళ్ళజోడు. దానిలో పర్సనల్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌ను జోడించారు. రోజువారి కార్యక్రమాలు మొత్తం ఆ వర్చువల్‌ అసిస్టెంట్‌ గైడ్‌ చెయ్యటం, ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు, ఎంతవరకు నిజం మాట్లాడుతున్నారు అని చెప్పడం క్యారెక్టర్‌ అనాలిసిస్‌ చేస్తుంది. చెవిలో తనకు కావల్సిసిన వార్తలు చదవడం, కళ్ళజోడు నుండి ప్రొజెక్టర్‌ ద్వారా ఎమైల్స్‌ చూపెట్టడం, రిపొర్ట్స్‌ చూపెట్టడం నావిగేషణ్‌ చూపెట్టడం, చుట్టు పక్కల ఎలాంటి షాప్స్‌ ఉన్నాయో వివరిస్తుంది. తనకి ఏమేం అవసరం? లాస్ట్‌ ఇయర్‌ ఎన్ని సార్లు ఆ షాప్‌ లో ఏం కొన్నారు? లాంటి వివరాలతో పాటు, ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌, ఇంట్లో సామాన్లు ఏం నిండుకున్నాయో తాను ఏం కొనాలో రిమైండ్‌ చేయనుంది ఈ డివైజ్‌.
అలాగే మనిషి ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన హెచ్చరికలు సైతం చేస్తుంది. తినే వస్తువులలో క్యాలరీలు ఎంత వున్నాయో, క్యాలరీస్‌ క్యాలుక్యులేట్‌ చేసి చెప్పడం, బీపీ షుగర్‌ లాంటివి మానిటర్‌ చేసి అలర్ట్‌ చెయ్యడం, హెల్త్‌ ప్రొఫైల్‌, ఎమర్జెన్సీ కాల్స్‌, ఆటోమేటిక్‌ ఆంబులెన్స్‌ కాల్స్‌ చెయ్యడం, అత్యవసర పరిస్థితిని వీడియో తీసి పోలీసులకు అందిచడం, ఎవరయి కొత్త వ్యక్తి కలినప్పుడు అతని సోషల్‌ ప్రొఫైల్‌నను అనలైస్‌ చేసి అతని వ్యక్తిత్వాన్ని అంచానా వేయడం, క్రెడిట్‌ కార్డ్‌ బిల్స్‌ పే చెయ్యడం, ఫినాన్షియల్‌ అడ్వైస్‌ ఇవ్వడం, మెయిల్స్‌ కంపోస్‌ చేయ్యడం లాంటి, ప్రజెంటేషన్‌ AI ద్వారా ప్రిపేర్‌ చెయ్యడం లాంటి ఇన్నోవేటివ్‌ ఆవిష్కరణలు సష్టించారు చింతం నరేందర్‌.
నరేందర్‌ మరో ఆవిష్కరణ మహా ఏఐ
నరేందర్‌ కూతురు పేరు మహా శ్రీవర్థిని. ఆ పేరుతోనే మహా ఏఐ అని ప్రారంభించారు. మహా ఏఐ అనే కంపెనీని స్థాపించి అనేక పరిశోధనలతో సుమారు ఆరేండ్ల నిర్విరామ కృషితో ప్రోటోటైప్‌ చేసి లండన్‌, ఆస్ట్రేలియాతో పాటు ఇండియాలో పేటెంట్స్‌ పబ్లిష్‌ చేశాడు. అలాగే సోలార్‌ ఎనర్జీతో నడిచే వెహికల్స్‌, పొల్యూషన్‌ ఫ్రీ ఏసీ బైకులు, క్లౌడ్‌ కంప్యూటరింగ్‌, ఐఓటీ ఆర్కిటెక్చర్లలో అనేక సప్లరు చైన్‌, యార్డ్‌ మెనేజ్‌మెంట్‌, ఆటోమాటిక్‌ డ్రోన్‌ రోబో, జీపీఎస్‌ ద్వారా ఆక్సిడెంట్‌ ప్రదేశానికి వెళ్ళి ప్రథమ చికిత్స, రక్తం ఆగడానికి ఆక్సిజన్‌ మాస్క్‌ ఇచ్చే డ్రోన్‌ ఆవిష్కరణలు, ఎనిమిది విప్లవాత్మకమైన న్యూఅరల్‌ నెట్‌వర్క్‌, ఆర్టిఫియల్‌ ఇంటలెజెన్స్‌, రీసర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పుస్తకాలు ప్రచురించి విశేష ఆదరణ పొందారు.
ఎనలేని ప్రతిభతో స్ట్రీట్‌ లైట్స్‌ ద్వారా ఎనర్జీ సేవ్‌ చేయడానికి ఐఓటీ ఆధారిత ఆబ్జెక్ట్‌ బేస్డ్‌ డిటెక్షన్‌ ద్వారా కేవలం మనుషులు లేదా జంతువులు ఉన్నప్పుడు మాత్రమే వెలిగేలా స్ట్రీట్‌ లైట్లను అవిష్కరించారు. మిగతా టైంలో ఆఫ్‌ అయ్యే విధంగా ఉంటూ పక్కా స్ట్రీట్‌ లైట్‌ వెలగకపొతే ఆటోమెటిక్‌గా ఇంకో లైట్‌ టికెట్‌ క్రియేట్‌ చేసి ఈ కామర్స్‌ ద్వారా ఆటోమెటిక్‌గా ఆర్డర్‌ చేసి సంబంధిత అధికారికి నోటిఫై చెయ్యడం లాంటి అనేక విప్లవాత్మక పేటేంట్స్‌ సంపాదించడంతో పాటు, ఫారెస్ట్‌లో మిషన్‌ లెర్నింగ్‌ ఆధారిత సీడ్‌ బాల్స్‌ డ్రోన్స్‌ ద్వారా వేయడం, జీవరాశుల సంఖ్యను బట్టి అడవులల్లో పండ్ల మొక్కలు వాటికి కావలసిన ఆహారానికి సంబంధించిన AI బేస్డ్‌ అనాలిసిస్‌ చేసి అక్కడ సీడ్‌ బాల్స్‌ వేయడం, ఎక్కడెక్కడ విస్తతంగా చెట్లు ఉన్నాయో చూసి అక్కడ పెరిగే చెట్లను సాయిల్‌ అనుకూలతలను బట్టి డ్రోన్‌ ద్వారా విరివిగా సీడ్‌ బాల్స్‌ వెయ్యడం లాంటి అనేక విశిష్ట సేవలకు రీసర్చ్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన అనేక అవార్డులు అందుకున్నారు నరేందర్‌. ఇంతకు ముందు పిల్లర్స్‌ ఆఫ్‌ ద నేషన్‌, ఇండియన్‌ ఎమినెంట్‌ అవార్డు, అబ్దుల్‌ కలాం పురస్కార్‌ అవార్డ్‌, ఇంటర్నేషనల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు లాంటి పలు గౌరవ పురస్కారాలు అందుకున్నారు.
తన వంతుగా సమాజానికి
తన కుటుంబం బాగుంటే చాలు.. పక్కవాడికి ఏమైతే ఏంటి అనుకుంటున్న సమాజంలో సాయం చేయాలన్న ఆలోచనను విస్మరిస్తున్నారు. రూపాయి సాయం చేసి వంద రూపాయల పబ్లిసిటీ కోరుకునే రోజుల్లో కూడా ఎంతో మందికి ఇలా సాయం చేస్తూనే.. అటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారిని అరుదుగా చూస్తుంటాం. ఎన్నో కష్టనష్టాలను చవి చూసి.. స్వశక్తితో ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తిగానే కాదు, చదువు విలువ తెలిసిన వ్యక్తిగా మరి కొంతమందికి చదువుకు సాయం చేస్తున్నాడు. 32 మంది లా విద్యార్థులను చదివిస్తున్నాడు. మరి కొంతమంది గ్రూప్‌ 1, 2 లకు ప్రిపేర్‌ అవుతున్న వారికి తన వంతు సాయం చేస్తున్నాడు. ప్రభుత్వ విద్యాలయాలకు మంచి నీటి సౌకర్యానికి కషిచేస్తున్నారు. ఎంతో మంది ఐఐటిలో చదువుతున్న విద్యార్థులకు వారి ప్రాజెక్ట్‌ వర్క్‌ సంబంధిత విషయాలలో తన సలహాలు ఇస్తూ తోడ్పడుతున్నాడు.
అన్నార్తులు అనాథలుండని
అన్నార్తులు అనాధులుండని ఆ నవయుగమదెంత దూరం అని ప్రశ్నించారు దాశరథి. నరేందర్‌ కూడా అలాంటి సమాజానే కాంక్షిస్తున్నాడు. అందుకే అన్నార్తులున్న చోట అన్నదానాలకు చేయూతనిస్తున్నాడు. మరణం ఎవరికైనా సహజమే. కానీ, బంధులందరూ ఉంటే మరణానంతరం వారి దేహలకు గౌరవంగా అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. ఎవరు లేని వారు, కుటుంబాలు పట్టించుకొని వారు కూడా ఈ దేశంలో చాలామందే ఉన్నారు. అలాంటి అనాథ శవాల పట్ల కూడా నరేందర్‌ కు గౌరవ భావమే ఉంది. కాబట్టే అలాంటి వారి దహనసంస్కారాలకు అయ్యే ఖర్చులు తాను పంపిస్తూ స్థానికుల ద్వారా ఆ పనులు పూర్తి చేస్తున్నాడు.

– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

]]>
సివిల్స్‌ ఎంచుకునే ముందు ఓ క్లారిటీ ఉండాలి https://navatelangana.com/there-should-be-clarity-before-choosing-civils/ Sat, 02 Mar 2024 19:53:39 +0000 https://navatelangana.com/?p=240353 There should be clarity before choosing civilsసివిల్స్‌ ప్రజలకు సేవ చేసేందుకు ఓ గొప్ప అవకాశం. అయితే అది సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. లక్షల మంది పోటీపడితే వందల మంది మాత్రమే ముందుకెళ్తారు. దుర్భిణి వేసి మరీ మెరికల్లాంటి కొద్ది మందినే ఎంపిక చేస్తారు. ‘ఐఏఎస్‌, ఐపీఎస్‌’ లాంటి మూడక్షరాల పదాన్ని గర్వంగా తమ పేరు పక్కన చేర్చుకునే అర్హత అతికొద్ది మందే సాధిస్తారు. ఏదైనా సాధించాలనే లక్ష్యం స్పష్టం ఉండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. అతనే సంకేత్‌ అజ్మెర. అతని పరిచయం నేటి జోష్‌లో…

సివిల్స్‌ ఎంచుకోవాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
నా కుటుంబం, నా కమ్యూనిటీ దీనికి కారణం. మాది మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, కర్ణాపేట్‌ గ్రామం. అమ్మానాన్నల ఉద్యోగ రీత్యా మేము హైదరాబాద్లో స్థిరపడ్డాం. మాది చిన్న గ్రామం. మహా అయితే 15 ఇండ్లు ఉంటాయి అంతే. అందరూ చిన్న చిన్న ఇండ్లలో ఉండేవారు. చిన్నప్పుడు ఊరికి వెళుతుంటే మా కమ్యూనిటీలో ఇన్ని సమస్యలు ఉన్నాయా అనిపించేది. ఎలాగైనా మా వాళ్ళకు సాయం చేయాలని అనుకున్నాను. సివిల్‌ సర్విస్‌ ద్వారా అయితే నేను అనుకున్నది కొంత వరకైనా చేయగలను అనిపించింది. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను.
మీ ఎడ్యుకేషన్‌ ఎలా కొనసాగింది?
చిన్నప్పటి నుండి బాగా చదువేవాడిని. అమ్మానాన్న చదువులో బాగా ప్రోత్సహించేవారు. ముఖ్యంగా అమ్మతో ఎక్కువగా చర్చిస్తుండేవాడిని. ఐఐటీ ఢిల్లీ నుండి ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తర్వాత మాస్టర్స్‌ చేసి ఏడాది పాటు జాబ్‌ కూడా చేశాను.
సివిల్స్‌ రాయాలనే ఆలోచన మీకు మొదటి నుండే ఉందా?
అలాంటిదేమీ లేదు. నిజానికి ఇంటర్‌ తర్వాత అమ్మానాన్న సివిల్స్‌ వైపు దష్టి పెట్టమని చెప్పేవాళ్లు. కానీ నాకు మ్యాథ్స్‌ అంటే ఇష్టం. అందుకే ఇంజనీరింగ్లో చేరాను. ఎమ్మెస్సీ రీసర్చ్‌ చేసిన తర్వాత పీహెచ్‌డీ చేయాలని అనుకున్నాను. అయితే ఇది చేస్తే ప్రజలకు ఎలా ఉపయోగపడతాను అనే సందేహం వచ్చింది. పీహెచ్‌డీ చేస్తే నాకు మాత్రమే ఉపయోగం. దీని వల్ల నా కమ్యూనిటీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పుడే యూపీఎస్సీ అయితే బాగుంటుంది ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది.
మరి మీ సివిల్స్‌ ఆలోచనను ఆచరణలోకి ఎప్పుడు వచ్చింది?
కోవిడ్‌ టైంలో చాలా ఫ్రీ టైం దొరికింది. నా కెరీర్‌ గురించి మరింత లోతుగా ఆలోచించే అవకాశం కూడా అప్పుడే వచ్చింది. ఏం చదివితే నేను ప్రజలకు ఉపయోగపడతాను అని ఆలోచిస్తూ ఈ నిర్ణయానికి వచ్చాను. సమాజంలో ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే అందరికంటే ఎక్కువగా గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారు. వారి సమస్యలను కొంత వరకైనా పరిష్కరించ వచ్చు అని భావించాను. ముఖ్యంగా పేదలు, గిరిజనులు, వద్ధులు వీరికి సేవ చేయాలనేది నా ఆశయం.
కోచింగ్‌ ఏమైనా తీసుకున్నారా?
2021లో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక ఏడాది ప్రిపరేషన్‌, ఒక ఏడాది ఎగ్జామ్స్‌ కోసం కేటాయించాలని ముందే నిర్ణయించుకున్నాను. నిజానికి ఈ నిర్ణయం తీసుకునే ముందు నా సీనియర్స్‌ లో కొంత మందితో మాట్లాడి నేనూ చేయగలను అనే నమ్మకం వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయాను. రెండేండ్లల్లో పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నాను. ఏ బుక్స్‌ చదవాలి, కోచింగ్‌ అవసరమా, ఎలా చదవాలి అని ప్లాన్‌ చేసుకున్నాను. ఇంజనీరింగ్‌ నుండి వచ్చాను కాబట్టి సివిల్స్‌ లో ఓనమాలు కూడా తెలియదు. కాబట్టి ముందు కోచింగ్లో చేరాను. మూడు నెలలు కోచింగ్‌ తీసుకున్న తర్వాత నా అంతట నేను ప్రిపేర్‌ కావొచ్చు అనే నమ్మకం వచ్చింది.
మీ ప్లానింగ్‌ ఎలా ఉండేది?
మ్యాథ్స్‌ నా ఆప్షనల్‌. ఎలాగో నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌ కాబట్టి విపరీతంగా ప్రాక్టీస్‌ చేసేవాడిని. రివిజన్‌ కూడా బాగా చేశాను. ఏడాది టార్గెట్‌ పెట్టుకున్నాను కదా! 12 నెలల్లో ఒక్కో నెలలో ఏది ప్రిపేర్‌ కావాలి, ఎంత కంప్లీట్‌ చేయాలో ప్లాన్‌ చేసుకున్నాను. అలాగే నెలలో నాలుగు వారాలు కాబట్టి వారంలో ఎంత కంప్లీట్‌ చేయాలి అని. ఇంకో ప్లాన్‌. అలాగే రోజుకు ఎంత సేపు చదివితే వారంలో అనుకున్నది పూర్తి చేయగలను. అలా ఒక టైం టేబుల్‌ని రెడీ చేసుకున్నాను. దీన్ని సీరియస్‌గా ఫాలో అయ్యాను, వారంలో ఆరు రోజులు బాగా ప్రిపేర్‌ అయ్యి ఏడో రోజు పూర్తిగా గాని సగం రోజు గానీ రిలాక్స్‌ అయ్యేవాడిని. ప్రతి రోజు ఎన్ని గంటలు చదువుతున్నా యాప్‌లో ట్రాక్‌ చేసుకున్నాను. ఏ రోజైనా ప్రిపరేషన్‌ కాస్త తగ్గినట్టు అనిపిస్తే తర్వాత రోజు కవర్‌ చేసుకునేవాడిని. రోజుకు 8 నుండి 10 గంటలు కచ్చితంగా చదివేవాడిని. రివిజన్‌ కు ఎక్కువ టైం కేటాయించాను. మొదటి ట్రయల్‌ కోసం ఎగ్జామ్స్‌ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. తర్వాతి ఏడాది సీరియస్‌గా రాసి సెలక్ట్‌ అయ్యాను.
మీ స్నేహితులు, బంధువుల నుండి సహకారం ఎలా ఉంది?
యూపీఎస్సీ అనగానే అనేక అనుమానాలు ఉంటాయి. చాలా మంది అవసరమా అనేవాళ్ళు ఉంటారు. ముందు మనకే సెలక్ట్‌ అవుతామో లేదో అనే భయం ఉంటుంది. ఎందుకంటే ఇందులో సక్సెస్‌ కంటే ఫెల్యూర్సే ఎక్కువ. నాకు తెలిసిన వాళ్ళు ఐదారుగురు చాలా సార్లు రాసినా సెలక్ట్‌ కాలేకపోయారు. అలాంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడి వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేశారో తెలుసుకొని అలాంటివి చేయకూడదని తెలుసుకున్నాను. అలాగే సెలక్ట్‌ అయిన నా సీనియర్స్‌ తో మాట్లాడి వాళ్ళ గైడెన్స్‌ కూడా తీసుకున్నాను, అలాగే ఇంజనీరింగ్లో నా క్లాస్‌మేట్‌ రవితేజ అని ఇప్పుడు తమిళనాడులో పని చేస్తున్నాడు. అతను నాకు బాగా సపోర్ట్‌ చేశాడు.
మీ కుటుంబం గురించి చెప్పండి?
మా అమ్మ అజ్మెర సవిత, ఇస్రోలో సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌. నాన్న అజ్మెర ప్రేమ్‌ సింగ్‌. హార్టీ కల్చర్‌ డిపార్ట్‌ మెంట్‌ లో డిప్యూటి డైరెక్టర్‌ గా ఉన్నారు. ఇద్దరూ హైదరాబాద్లోనే మంచి స్థాయి ఉద్యోగాల్లో ఉన్నారు. అమ్మ చిన్నప్పటి నుండి చదువులో నన్ను బాగా ప్రోత్సహించేది అమ్మతో ఎప్పుడూ చర్చిస్తూ ఉండేవాడిని. సివిల్స్‌ కు ప్రిపేర్‌ అయ్యేటపుడు కూడా అమ్మతో రెగ్యులర్‌గా మాట్లాడేవాడిని. తనకు కూడా ఈ సబ్జెక్ట్‌ కొత్తే. అయినా తను తెలుసుకుని మరీ నాతో చర్చించేది. అది నాకు బాగా ఉపయోగపడింది. ఇక మా నాన్న చాలా చిన్న స్థాయి నుండి వచ్చి ఇప్పుడు ఒక మంచి స్టేజికి చేరుకున్నారు. ఇది చిన్నప్పటి నుండి నన్ను బాగా ఇన్‌స్పైర్‌ చేసింది.
గిరిజనులు ఇంకా అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. దీనికి కారణం ఏమనుకుంటున్నారు?
దీనికి రెండు కారణాలు ఉన్నాయి. గిరిజనుల భాష అందరికీ అర్ధం కాదు. వాళ్ళకు తెలుగులో చదువు చెప్పినా, మాట్లాడినా అర్థం కాదు. ఇంగ్లీష్‌ కూడా అంతే. కమ్యూనికేషన్‌ సమస్య ఎక్కువ, కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్లో అయినా వారికి చెప్పే చదువు వారి భాషలో ఉండాలి. దీనివల్ల కొంత వరకైనా చదువుకుంటారు. అలాగే వాళ్ళు సుదూర ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు మన దగ్గరకు రావడం కన్నా మనమే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. అధికారులు రెగ్యులర్‌ గా ఆ ప్రాంతాలకు వెళతారు. అప్పుడు రోడ్లు పడతాయి, ట్రాన్స్‌పోర్ట్‌ పెరుగుతుంది. కమ్యూనికేషన్‌ పెరుగుతుంది. ఇవి జరిగితే కొంత వరకు అభివద్ధి చెందే అవకాశం ఉంటుంది.
దేశం అభివద్ధి చెందాలంటే అధికారుల పని ఎలా ఉండాలంటారు?
మన దేశంలో అడ్మినిస్ట్రేషన్‌ వర్క్‌ బాగా జరుగుతుంది. అయితే ప్రభుత్వం తెస్తున్న స్కీంల గురించి ప్రజలకు కింది స్థాయి వరకు అవగాహన ఉండడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలియాలి. వీటిపై అవగాహన కల్పించడానికి టెక్నాలజీని ఉపయోగించాలి. దీని కోసం జిల్లా స్థాయిలో కొన్ని మార్పులు జరగాలి. అన్నీ డిజిటల్‌గా జరిగేలా చూడాలి. నేను ఏ జిల్లాకు వెళ్ళినా డిజిటల్‌ రంగాన్ని ఉపయోగించి అలాంటి మార్పు తీసుకురావాలి అనుకుంటున్నాను.
మీకు నచ్చిన ఐఏఎస్‌ అధికారులు ఎవరైనా ఉన్నారా?
పరమేశ్వరన్‌ అయ్యర్‌ అనే ఒక ఆఫీసర్‌ బుక్‌ చదివి చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఆయన గతంలో నీతి అయోగ్‌ చైర్మన్‌ గా ఉన్నారు. కింది స్థాయి వరకు వెళ్ళి ఆయన ఎంతో కషి చేశారు. ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఎంత చేయాలో దాని కంటే చాలా ఎక్కువ చేశారు. ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఆయన పుస్తకాన్ని చాలా సార్లు చదివాను.
పోస్టింగ్‌ ఇచ్చిన తర్వాత దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు?
వ్యవసాయంపై దష్టి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర అవకాశాలు ఎక్కువ ఉన్నా ఉత్పత్తి చాలా తక్కువ వస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర లేదు. దీనికోసం ఏదైనా చేయాలనుకుంటున్నా. రైతుల కోసం ఎన్నో స్కీంలు ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే రైతులకు గిట్టుబాటు ధర కచ్చితంగా వస్తుంది. రైతుల ఆత్మహత్యలే ఉండవు. అలాగే ఎడ్యుకేషన్‌ కూడా చాలా అవసరం. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ పెంచాలి. ఇప్పటికీ చాలా మంది పదో తరగతి వరకు చదివితే చాలు అనే ఆలోచనలో ఉన్నారు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలి. తమలోని స్కిల్స్‌ డెవలెప్‌ చేసుకొని ఉపాధి పొందాలి. అందుకే నా జిల్లా పరిధిలో ఆదాయ మార్గాలను చేయాలనుకుంటున్నాను. అలాగే గిరిజనుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలి.
ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో గ్రూప్‌ పరీక్షలు క్యాన్సిల్‌ అవుతున్నాయి. వీటి ప్రభావం యువతపై ఎలా ఉందంటారు?
కచ్చితంగా ఉంటుంది. యూత్‌ చాలా ఒత్తిడికి గురౌతున్నారు. ఇన్నేళ్లు వాళ్ళు పడిన శ్రమకు ఫలితం కనబడకపోయే నిరుత్సాహానికి గురౌతున్నారు. అయితే యూత్‌ ఇలా డీలా పడిపోవడం సరైనది కాదు. మనం ఏదైనా ఒక జాబ్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నామంటే కేవలం ఆ ఒక్కదానిపైనే ఆధారపడవద్దు. మనకున్న స్కిల్క్స్‌ని ఉపయోగించి ఇంకా ఏదైనా చేయవచ్చా అనేది కూడా ఆలోచించాలి. ఉదాహరణకు నేను ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ని. కాబట్టి క్లాసులు తీసుకొనే వాడిని. దీని వల్ల నాలో కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఫైనాన్షియల్‌ గా కూడా సపోర్ట్‌ ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించుకోవాలి. ఒక్కదానిపైనే ఆధారపడొద్దు.
మెయిన్స్‌కు ఎలా ప్రిపేరయ్యారు?
ప్రిలింమ్స్‌ తర్వాత మెయిన్స్‌కు వంద రోజులు టైం ఉంటుంది. ఆ వంద రోజుల్లో ఎంత చదవగలిగితే అంత చదవాలి. నేను ప్రతి రోజూ 10 గంటలు చదివేవాడిని. సిలబస్‌ మొత్తం నా టేబుల్‌పైన పెట్టుకున్నాను. మాక్‌ టెస్టులు రాసేవాడిని. మంచి మార్కులు వచ్చిన వాళ్ళతో మాట్లాడి వారి సూచనలు తీసుకొని ప్రాక్టీస్‌ చేశాను. వంద రోజులు ఇదే ప్రాక్టీస్‌ కొనసాగించాను. రోజు రోజుకు మార్కులు పెరుగుతూ ఉండేవి. చివరకు రాయగలను అనే నమ్మకం వచ్చింది. అయితే ఎగ్జామ్‌ రాయడానికి మూడు గంటలు మాత్రమే ఉంటుంది. ఈ టైం సరిపోదు. కాబట్టి రాయడం కూడా ప్రాక్టీస్‌ చేయాలి.
ఇంటర్వ్యూలను ఎలా ఫేస్‌ చేశారు?
నేను రెండు ఇంటర్వ్యూలు ఇచ్చాను. మొదటి సారి వందకు 160/276 మార్కులు మాత్రమే వచ్చాయి. అప్పుడు చేసిన పొరపాటు ఏంటంటే ఇంటర్వ్యూ అంటే చాలా భయపడ్డాను. ఆ భయంతో తెలిసి కూడా సమాధానాలు చెప్పలేకపోయాను. తర్వాత ఆ భయాన్ని పోగొట్టుకొని స్కిల్స్‌ ను పెంచుకొని ప్రాక్టీస్‌ చేసి ఇంటర్వ్యూ ఇచ్చాను.. దాంతో స్కోర్‌ 190కి పెరిగింది.
మీ ట్రైనింగ్‌ ఎలా నడుస్తుంది?
ట్రైనింగ్‌ చాలా కష్టంగా ఉంటుంది. ముందు మూడు నెలలు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ ఇలా అన్ని సర్వీసెస్‌ వారికి కలిపి ట్రైనింగ్‌ ఇస్తారు. ఇందులో ఫిజికల్‌ యాక్టివిటీస్‌ తో పాటు హిమాలయాలకు తీసుకెళ్ళి ట్రెక్‌ చేయిస్తారు. అలాగే ట్రైబల్‌ ప్రాంతాలకు వెళ్ళి వారం రోజులు ఉండాలి. ఇదంతా చాలా కష్టమే. కానీ ఎంత కష్టపడితే అంత నేర్చుకోవచ్చు. ముస్సోరీలో ఈ ట్రైనింగ్‌. ఫేస్‌ 1 ట్రైనింగ్‌ ఆరు నెలలు ఉంటుంది. ఇప్పటికి నాలుగు నెలలు అయిపోయింది. 40 రోజులు భారత్‌ దర్శన్‌ పేరుతో ఇండియా టూర్‌ చేసి సెలవులకు హైదరాబాద్‌ వచ్చాను.. ఇంకా రెండు నెలల్లో జిల్లా ట్రైనింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. తెలంగాణకే కేటాయించారు. ముందు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పొస్ట్‌ ఇస్తారు.

– సలీమ,
94900 99083

]]>
‘అయ్యో పాపం’ దగ్గర ఆగిపోడు https://navatelangana.com/alas-sin-does-not-stop-there/ Sat, 24 Feb 2024 17:27:34 +0000 https://navatelangana.com/?p=235127 He does not stop at 'Oh my God'ఇతరుల దీనస్థితికి తను ‘అయ్యో పాపం’ దగ్గర ఆగిపోడు. చేయూతనందిస్తాడు. తనతోపాటు మరికొందరిని భాగస్వామ్యం చేస్తూ తనే ఒక సంస్థగా మారాడు. కలిసొచ్చిన వాళ్లందర్నీ కలుపుకొని తోడు నీడలేని వారికి అండగా నిలబడ్డారు. వద్ధుల నుండి అనాథ శవాలదాకా, గ్రామంలో మద్యపాన నిషేధం నుండి పేదవిద్యార్థుల చదువుదాకా ‘వివేకానంద ఫౌండేషన్‌’ ద్వారా సేవలందిస్తూ వస్తున్న ‘పాపిజెన్ని రామకష్ణారెడ్డి’తో ఈ వారం ‘జోష్‌’ ముచ్చట…
సంపాదన మొదలు పెట్టాల్సిన వయసులోనే సమాజసేవ కోసం ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
పసితనం నుండే పేదరికంతో సహవాసం చేస్తూ పెరగడం వలన, చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను సమస్య పట్ల తక్షణం స్పందించేలా పురిగొల్పాయి. బాగా సంపాదించాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. పూర్తి సమయం సేవకే కేటాయించాలని ప్రతిక్షణం తపిస్తుంటాను. దాచుకోవడం తెలియదు.. పంచడం మాత్రమే తెలుసు.
కుటుంబ గురించి
మాది బద్వేలు(కడప) తాలుకాలోని తెల్లపాడు (కలసపాడు మం.). నాన్న పాపిజెన్ని యర్రారెడ్డి, అమ్మ మహాలక్ష్మమ్మ, తమ్ముడు శ్రీకాంత్‌ రెడ్డి, చెల్లెలు సుమిత్ర. 2014లో ముత్తుముల రామతులసితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు(వివేకానంద-కుషల్‌). వర్షం వస్తే తప్ప పండని రెండెకరాల పొలం. కరువునేలలో వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకున్న కుటుంబం. నేను ప్రొద్దుటూరులో రైల్వే గేట్‌మెన్‌గా పనిచేస్తున్నాను. ఇది స్థూలంగా నా కుటుంబం.
ఎన్నో మార్గాలు ఉండగా ‘వద్ధులు’, ‘అనాథ శవాల సంస్కారాలు’ మాత్రమే చేయడానికి ప్రత్యేక కారణం?
మానవ జీవితంలోని అన్ని దశలకంటే వద్ధాప్యం క్లిష్టమైనది. శరీరం పట్టు సడలుతుంది. మనసు చంచలమైతుంది. రోగాలతో పోరాటం మొదలవుతుంది. ఈ స్థితిలో నా అన్న వాళ్ళకు భారంగా మారుతారు. అలాంటి పరిస్థితులలో వారికి నేనున్నానని భరోసా ఇస్తే ఇంతకుమించిన సేవ లేదనిపించింది. కొందరు రాజభోగాలు అనుభవించి కాలక్రమంలో కొన్ని కారణాల వలన అనాథలుగా మారతారు. కొందరు జీవితాంతం అనాథలుగానే ఉంటూ మరణిస్తారు. మరణానికి పేద, ధనిక తేడా ఉండదు. వారి గతం ఎలా ఉన్నా మరణించిన వారిని గౌరవంగా, సంప్రదాయబద్దంగా ఖననం చేయాలన్నది నా అభిప్రాయం. ప్రయోజనం ఆశించి చేసేది వ్యాపారం. తప్తి కోసం చేసేది సమాజసేవ. అందుకే ఈ మార్గాలను ఎంచుకొన్నాను. ఇందులో శ్రమ కంటే తప్తే ఎక్కువ.
వివేకానంద పేరు మీదనే సేవాసంస్థ మొదలు పెట్టడం వెనక ఉన్న ప్రత్యేకత?
పోరుమామిళ్ళలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నప్పుడు రిటైర్డ్‌ డి.యం.హెచ్‌.ఓ. డా||మార్కారెడ్డి వివేకానందుని గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన సాహిత్యం చదివేకొద్ది నాలో ఆలోచన విధానం, అలవాట్లు, మారాయి. యువత వల్లనే ఏదైనా సాధ్యం అన్న ఆయన మాటలతో ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలనిపించి ‘వివేకానంద ఫౌండేషన్‌’ పేరుతో ఆయన పుట్టినరోజున (12 జనవరి 2010) నా స్నేహితుల సహకారంతో ప్రారంభించాను. ఆ తరువాత ఆశ్రమాన్ని కూడా ఏర్పాటుచేశాం.
మీ ఆశ్రమం ప్రత్యేకత?
మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం. అనాథలకు అన్నదానం, వస్త్రదానం, చలికాలం దుప్పట్లు ఇవ్వటం వంటివి చేస్తుంటాం. మురికి బట్టలతో, మాసిన వెంట్రుకలతో ఉన్న అనాథల దగ్గరకు వెళ్ళి క్షౌరము చేసి, మంచిగా తయారు చేసి మళ్ళీ అలానే రోడ్ల మీద వదిలేసేవాళ్ళం. కొన్నాళ్ళకు వాళ్ళు మరణిస్తే మేమే అంత్యక్రియలు చేసేవాళ్ళం. ఒకసారి ఒక అనాథ యువకుడు కాలికి గాయమై పురుగులు పట్టి నరకయాతన అనుభవించాడు. అతనికి దగ్గరగా వెళ్ళి వైద్యం చేయాలన్నా దుర్వాసన వచ్చేది. అప్పుడు నేను నా టీం కలిసి అతనికి సేవ చేశాం. కానీ అతను ఎక్కువ కాలం బతుకలేదు. ఆ క్షణం ఆలోచన మొదలైంది. ఇలాంటి వారికి సరైన వసతి, ఆహారం అందిస్తే జీవితం నిలబెట్టవచ్చని అనుకున్నా. ఆ ఆలోచనను మా పెద్దలకు, కుటుంబ సభ్యులకు, సంస్థ ప్రతినిధులకు తెలియచేయడంతో అంగీకరించారు. కాశినాయన మండలంలోని పిట్టికుంట గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి బోయిళ్ళ విద్యార్థన రెడ్డి ఒక ఎకరా స్థలాన్ని ఓబుళాపురం గ్రామం సమీపంలో గల సగిలేరు నది ఒడ్డున ఇవ్వడంతో ఆశ్రమం నిర్మాణం చేశాం. పట్టణంలో మాదిరిగా ఇరుకుఇరుకుగా కాకుండా పల్లె వాతావరణంలో ప్రశాంతంగా, విశాలమైన గదులతో, మంచానికి పరిమితమైన వారికి ప్రత్యేక వసతులతో ఆశ్రమాన్ని తీర్చిదిద్దాం. పూర్వం ఆశ్రమాలు తలపించేలా ప్రశాంత వాతావరణంలో ఉంది. సేవలు అందిస్తున్నాము.
దాతల సహకారం ఏమైనా ఉందా?
ఏదీ ఒక్కడితోనే కాదు. కేవలం నేనొక వారధిని మాత్రమే. శింగల్‌ రెడ్డి రామకష్ణారెడ్డి, వేచలపు స్వాతి, శిరీషా, రవీంద్రారెడ్డి, నరాల శ్రీనివాసరెడ్డి, ముమ్మటిరెడ్డి, నాగేంద్రరెడ్డి, నరసింహారెడ్డి, కలసపాటి దేవమణి, రఘనాధ్‌ అన్న, దేవసాని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్దవాళ్ళ తోపాటు వందలాది మంది దాతలున్నారు. స్థానిక రాజకీయ నాయకుల సహకారం, ప్రోత్సాహం కూడా ఉంది. చప్పట్లే ఒక్క చేతితో సాధ్యం కానప్పుడు… నలుగురికి సాయం చేయడం మాత్రం ఒకరితో ఎలా సాధ్యపడుతుంది?
కుటుంబం నుంచి సహకారం?
ఒక పని చేస్తున్నప్పుడు ప్రోత్సాహం, ఫలించాక ప్రశంస అవసరం. ఈ రెండు మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. కానీ, వాటితోపాటు కనీస కుటుంబ అవసరాలు కూడా తీర్చాలి. లేకపోతే ప్రశంసలు కూడా విసుగ్గా అనిపిస్తాయి. ఈ విషయంలో నేను అదష్టవంతుడిని. నా కుటుంబసభ్యులు కూడా నాలాగే సేవాభావాన్ని కలిగి ఉండడం నా ఆశయానికి మరింత ఊపిరి పోసింది. నా కుటుంబ అవసరాలు తీర్చడానికి నా ఉద్యోగం (రైల్వే డిపార్ట్మెంట్‌) తోడుగా ఉంది.
మీ ఫౌండేషన్‌ సేవలకు అర్హులైన వారెవరు? మిమ్మల్ని ఎలా సంప్రదించాలి?
మా సంస్థద్వారా ఎక్కడ ఏ అవసరం ఉందో మా శక్తి మేరకు సహాయం అందిస్తున్నాం. పేద విద్యార్థులకు, నిరుపేదలకు చేయూతను ఇవ్వటం కూడా జరుగుతుంది. మా సేవాశ్రమంలో చేరాలంటే ఆదరణలేక, నిరాదరణకు గురైనవారు, ఆస్తులు ఏమి లేకుండా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. 8897292237, 9346850854 నెంబర్ల ద్వారాగానీ, వెబ్‌ సైట్‌(vivekanandasevasramam.org)) ని సంప్రదించవచ్చు.
ఆశ్రమ నిర్వహణలో మీ భార్య సహాకారం?
తను ఫౌండేషన్‌లో ఒక వాలంటీర్‌గా సేవలందించేది. నా భావాలకు, నా ఆశయాలకు తగ్గిన వ్యక్తి, నా బాటలో నడిచే వ్యక్తి అయితే పెండ్లి చేసుకోవాలనుకున్నా. మా బంధువుల అమ్మాయి రామతులసితో నాకు పరిచయం ఏర్పడింది. తనకు నా విధానాలు, ఆశయాలు చెప్పాను. ‘మంచే చేస్తున్నావు’ నీ వెనుక నేను నిలబడతానని నా చేయి అందుకుంది.
ఊర్లో బెల్టు, నాటుసారాయి పై పోరాటం?
మా ఊరులో నాటుసారా తయారు చేసేవారు. బయట ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం గానీ సొంత ఊరిలో తాగుడుకు బానిసై జీవితాలు విచ్ఛిన్నం కావడం కలచివేసింది. 20 మంది యువకులు ఉద్యమానికి సిద్ధమై నాతో నడిచారు. అప్పటి మా ఎస్‌ఐ రాజారెడ్డి సహకారంతో సరిగ్గా సంక్రాంతి పండుగ రోజున నాటుసారా, బెల్టుషాపులపై ఉద్యమం మొదలుపెట్టాం. ఈ ఉదంతంలో మాకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకే అడుగులేశాం. ఈ విషయంలో ప్రింట్‌ మీడియా, పోలీస్‌ శాఖ మా వెనంటి ఉండి నడిపించటం వల్ల సంపూర్ణ మద్యపాననిషేధం చేయగలిగాం.
మీ ఫౌండేషన్‌ నుంచి మునుముందు ఏ కార్యక్రమాలు ఉండవచ్చు?
‘వివేకానంద సేవాశ్రమం’ ముఖ్య ఉద్దేశ్యం ఎవరూలేని వారికి అండగా నిలవటం. దాదాపు 50 మందికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసుకున్నాం. అమ్మానాన్నలులేని పిల్లలను, నిరుపేద విద్యార్థులను చదివించాలనుకుంటున్నాం. మా సమీపంలో ఉన్న యానాది కాలనీల్లోని అడవి బిడ్డలకు అవసరమైన నిత్యావసర సరుకులు, వారికి అవసరమైన సహాయం చేస్తున్నాం. దీన్ని మరికొన్ని ప్రాంతాలకు విస్తరింపచేయాలని ఉంది. అటువైపుగా ప్రణాళికలు, వనరులను సిద్ధం చేసుకొంటున్నాం. మా సేవలను వీలైనంతవరకు విస్తరణ చేయడమే ముఖ్య లక్ష్యం.
– మహేష్‌ బోగిని,
89852 02723
హైదరాబాద్‌, విశ్వవిద్యాలయం, 

]]>
సాహిత్య జిహ్వ ‘అజగవ’ https://navatelangana.com/literary-language-ajagava/ Sat, 17 Feb 2024 17:34:45 +0000 https://navatelangana.com/?p=230493 సాహిత్య జిహ్వ 'అజగవ'మాధ్యమాల ప్రభావంతో ‘పుస్తకరూప’ సాహిత్యం కాస్త ‘దశ్యరూపం’, ‘శ్రావ్యరూపం’గా కోరుకొనే ఆధునికతరం మొదలైంది. తెలుగువారికి ఆ కోవలో ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని అందించే ఆవశ్యకతను తన ‘అభిలాష’గా చేసుకొని ‘సంతప్తి’నే సంపదగా పరిగణిస్తే తెలుగు శ్రోతలకు ‘అజగవ’ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా విశాలంగా సాహిత్యాన్ని ‘విని’పిస్తున్న రాజన్‌ పిటిఎస్కే (పెట్ల త్రిసత్య కామరాజన్‌)తో ముఖాముఖి నేటి జోష్‌ …సాహిత్యాన్ని మాధ్యమాల ద్వారా విస్తరణ, ఆదరణ కలిగించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది?
హైస్కూల్‌ రోజుల నుండే నా ఆప్తమిత్రుడు వేగేశ్న వెంకట మురళీకష్ణంరాజు, నేను చందమామ కథల గురించి, షాడో డిటెక్టివ్‌ నవలల గురించి అబ్బురంగా మాట్లాడుకునేవాళ్ళం. అలా మా చిన్నప్పుడే చిన్నపాటి సాహితీగోష్ఠులు జరుపుతుండేవాళ్లం. ఆ తరువాత కాలంలో మరో ఆప్తమిత్రుడు కత్తివెంటి గుర్నాథ్‌ శ్రీకాంత్‌, నేను కలిసి సినీ సాహిత్యాన్ని ఎక్కువగా చర్చించుకునేవాళ్ళం. ఆ తరువాత కాలంలో ఇలా ఎవరితో అయినా చర్చలు చేస్తున్నప్పుడో, పుస్తకాలు చదువుతున్నప్పుడో, ప్రకతిలో ఏకాంతంగా గడుపుతున్నప్పుడో నాలో కలిగే భావాలను కవితల రూపంలోనో, వ్యాసాల రూపంలోనో డైరీలో రాసుకుంటూ ఉండేవాడిని. ‘ఇలా నీ రాతలన్నీ డైరీలలో ఉండిపోతే ఎవరికి ఉపయోగం అంటూ బలవంతంగా నాతో బ్లాగు పెట్టించినవాడు నా మరో ఆప్త మిత్రుడు అజరు వేగేశ్న. అలా ‘నా..గోల’ అనే బ్లాగు పెట్టి చాలా కవితలు, వ్యాసాలు, పద్యాలు రాశాను. ఆ తరువాత కాలంలో అజరు ‘బొమ్మలాట’ ఛానల్‌లో సినీ గీతరచయితలైన చైతన్యప్రసాద్‌, అనంత శ్రీరామ్‌ లను ఇంటర్వ్యూలు కూడా చేశాను.
ఇక్కడ మరో ముగ్గురు ప్రియమిత్రుల గురించి కూడా చెప్పుకోవాలి. హైదరాబాదులో నా జీవితం మొదలవ్వడానికి ఊతమిచ్చినవాడు వేగేశ్న సత్యనారాయణ రాజైతే, జీవితంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా అండగా నిలబడుతుండేవాడు దండు కళ్యాణ వర్మ. అలానే మరో ఆప్త మిత్రుడైన ఉద్దరాజు రంగరాజుతో చేసే చర్చలు, వాదోపవాదాలు నేను విషయాలను కొత్త కోణంలో చూడడానికి ఉపయోగపడుతుంటాయి.
ఇక ఫేస్‌బుక్‌, కోరా వంటి మాధ్యమాలలో ఇప్పటికి సుమారుగా 150కి పైగా సాహిత్య వ్యాసాలను రాశాను. 2019లో ‘కథా పరిచయ సప్తాహం’ పేరుతో రోజుకు మూడుకథలుగా, ఏడురోజుల్లో మొత్తం 21 తెలుగు కథల పరిచయ వ్యాసాలు రాశాను. వాటిలో చలం, కొ.కు, విశ్వనాథ, రావిశాస్త్రి, చాసో, మధురాంతకం రాజారాం ఇలా ప్రసిద్ధ కథకుల కథలన్నాయి. ఆ తరువాత ‘కవితా పరిచయ షట్కం’ పేరుతో కష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కరుణశ్రీ, దాశరథి, ఆరుద్ర, నారాయణరెడ్డిగార్ల కవిత్వంపై వరుసగా ఆరురోజులపాటూ సుదీర్ఘమైన పరియచ వ్యాసాలు రాశాను. ఒక్కో వ్యాసం సుమారుగా 20పేజీలు నిడివితో ఉంటుంది. ఇంకా పింగళి నాగేంద్రరావు ‘జేబున్నీసా, మల్లాది రామకష్ణశాస్త్రి ‘చలవ మిరియాలు’, వేటూరి ‘సిరికాకొలను చిన్నది…’ ఇలా సుమారు 50 అపురూప పుస్తకాలను ఫేస్‌బుక్‌ పాఠకులకు పరిచయం చేశాను.
2019 జూలైలో యుట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాలనుకున్నప్పుడు ఛానల్‌ పేరు ఏం పెడదామా అని పెద్దగా ఆలోచించలేదు. అప్పటికే ‘అజగవ’ అన్న పేరంటే నాకెంతో ఇష్టంగా ఉండేది. ఈ అజగవ అన్న పేరును అమరకోశంలో మొదటిసారిగా చూశాను. అజగవ అంటే పరమశివుడి ధనస్సు పేరు. ఆ పేరంటే నాకు ఎందుకో అభిమానం ఏర్పడింది. అందుకే అజగవ ఛానల్‌ ఒక సాహితీ ధనువనీ, నేను చెప్పే సాహిత్య విషయాలే ఆ ధనువు నుండి వచ్చే సాహిత్య బాణాలనీ ఊహించుకుంటూ మన ఛానల్‌కు అజగవ అన్న పేరు ఖాయం చేశాను. ”వేటూరిగారొస్తున్నారు” అనే నా ఖీaషవదీశీశీస పోస్టులు అందులో మొదటి వీడియోగా పెట్టాను. దర్శకులు, హీరో, హీరోయిన్లు వేటూరిగారి పాటలతో అంత్యాక్షరి ఆడుతున్నట్లుగా ఊహిస్తూ ఒక సరదాసన్నివేశాన్ని సష్టించి చేసిన రచన అది. అలా సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం మొదలైన అజగవలో ఇప్పటికి 350 వరకూ సాహిత్య వీడియోలు ఉన్నాయి.
మీలో సాహిత్య అభిలాష కలిగించిన వ్యక్తులు… రచయితలు… పుస్తకాలు?
సుశీల, ఘంటసాల పాటలు పాడతారని, యండమూరి, యద్దనపూడి నవలలు రాస్తారని, ఇవన్నీ నాకు అన్నం తినిపిస్తూనో, జోకొట్టి పడుకోబెడుతూనో మా అమ్మ చెప్పిన విషయాలే. రామాయణ, భారతాలలో ప్రధానపాత్రల గుణగణాలన్నీ వివరించి మరీ చెప్పేది. వంట చేసుకుంటూ రేడియోలోనో, టేప్‌ రికార్డర్‌లోనో సినిమా పాటలు, లలిత సంగీతం వినడం, పనంతా అయిపోయాక యద్దనపూడిదో, యండమూరిదో, మాదిరెడ్డి సులోచనదో నవల పట్టుకోవడం ఆవిడకు అప్పట్లో నిత్యకత్యాలు. అలానే రోజూ రాత్రి పడుకునేముందు మా నాన్నగారు నన్ను, మా అక్కను చెరోప్రక్కన పడుకోబెట్టుకొని పోతన భాగవత పద్యాలు, మొల్ల రామాయణ పద్యాలు శ్రావ్యంగా పాడి వినిపించేవారు. అప్పట్లో వాటి అర్థాలు తెలియకపోయినా, మా నాన్నగారి కంఠమాధుర్యానికో ఏమో పద్యాలంటే అభిమానం పెరిగింది.
ఒక్కోసారి మా అమ్మ సరదాగా పొడుపు కథలు అడుగుతుండేది. ఆ పొడుపులు విప్పడానికి మా నాన్నగారితో పాటూ, నేను మా అక్క కూడా తెగ ఆలోచించేసేవాళ్ళం. ఇక మా నాయనమ్మ చెప్పిన కథలు. అలా మా ఇంట్లో చిన్నపాటి సాహిత్య వాతావరణం ఉండేది. అందుకే సాహిత్యంలో నా తొలిగురువులు ఎవరు అంటే.. మా అమ్మ, నాన్న, నాయనమ్మ. తొలి సహాధ్యాయి మా అక్క. మూడో తరగతి చదివే రోజుల్లో మొదటిసారి చందమామ పరిచయం అయ్యింది. ఆ తరువాత పెరిగే కొద్ది యండమూరి నవలు చదివేవాణ్ని. నేను డిగ్రీ చదివే రోజుల్లో రోజూ మా భీమవరం శాఖా గ్రంథాలయంలో చలం, శ్రీపాద, మల్లాది, గురజాడ, జాషువా, కరుణశ్రీ, శ్రీశ్రీ, రావిశాస్త్రి, కష్ణశాస్త్రి, కొడవటిగంటి, బుచ్చిబాబు, విశ్వనాథ ఇలా మహామహుల రచనలన్నీ అలా అక్కడ చదివినవే.
విద్యాభ్యాసం- వత్తి?
నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది అంతా భీమవరంలోనే. డిఎన్‌ఆర్‌ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేశాను. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఐదేండ్లు, ఈ-బుక్‌ పబ్లిషింగ్‌ రంగంలో పదేండ్లు పనిచేశాను. కొంతకాలంగా తెలుగు ఫ్రీలాన్స్‌ రైటర్‌గా పనిచేస్తూ, ‘అజగవ’ను నిర్వహిస్తున్న.
ఇప్పటివరకు మీ అజగవ ఛానల్‌ లక్షలాది మందికి చేరువైన క్రమం?
‘అజగవ’లో ఏ వీడియో పెట్టాలి అని ఆలోచించడం మొదలుకొని, అందుకు అసరమైన పుస్తకాలను చదవడం, అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి స్ప్రిప్ట్‌ తయారు చేసుకోవడం, ఆపై రీకార్డింగ్‌ చేయడం, చివరిగా ఎడిటింగ్‌ చేసి వీడియోను అప్‌లోడ్‌ చేయడం వరకూ… ఈ పనులన్నీ ఒక్కడినే చేసుకుంటాను. కావ్యాల గురించి చెప్పేటప్పుడు ఏ ఒక్కరి పుస్తకాన్నో కాకుండా, నాకు అందుబాటులో ఉన్న వ్యాఖ్యానాలన్నీ చదువుతాను. అందుకే నెలలో గరిష్టంగా 6, 7 వీడియోలను మించి పెట్టలేకపోతున్నాను. రోజులో కనీసం 12 నుండి 14 గంటల సమయాన్ని చదువుకోవడానికో, చదివింది నోట్సు రాసుకోవడానికో, అజగవకు వీడియోలు తయారు చేయడానికో వెచ్చిస్తుంటాను. అప్పుడప్పుడూ శరీరం అలసిపోయి కాస్త శ్రమ అనిపిస్తుంటుంది కానీ, మానసికంగా మాత్రం ఎప్పుడూ ఉల్లాసంగానే ఉంటుంది. వత్తి, ప్రవత్తి ఒక్కటే అయితే కలిగే లాభం అదే అనుకుంటాను.
చెప్పదలిచిన వస్తువు మీ ఐచ్చికమా? ప్రేక్షకుల ఇష్టం మేరకు ఉంటుందా?
సాధారణంగా అయితే నాకు నచ్చిన విషయాలనే చెబుతుంటాను. అయితే కొన్నిసార్లు అజగవను అభిమానించే వాళ్ళ డిమాండ్‌ అనుగుణంగా కూడా వాటికి ప్రాధాన్యత ఇచ్చి వీడియోలు చేస్తాను.
వినోదభరితమైన ఛానల్‌ కు వచ్చినంత గుర్తింపు సాహిత్య ఛానల్‌ కు రాదు. దీనికి కారణం ఏమై ఉంటుంది?
సాధారణంగా వినోదభరితమైన ఛానల్స్‌ ఎవరికైనా వెంటనే ఉల్లాసాన్ని ఇస్తాయి. అందుకే ఎక్కువ మంది వాటివైపు మొగ్గుచూపుతుంటారు. ఇక సాహితీ ఛానల్స్‌ విషయానికి వస్తే అవి చూడగానే ఆసక్తి కలిగించేలా ఉండకపోవచ్చు. మనకు తెలియని మనిషి, ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ లేకుండా, అలా సాదాసీదాగా చెప్పుకుపోతుంటే వినడం కాస్తంత కష్టంగానే ఉంటుంది కదా!! వీడియోలలో విషయం బావుంటే.. ఈరోజు కాకపోతే రేపైనా ఆ ఛానల్స్‌కు ఆదరణ పెరుగుతుంది. ఏ ప్రముఖులో వాటి గురించి షేర్‌ చేస్తే మంచి ఛానల్స్‌కు మరింత ప్రచారం లభిస్తుంది.
మీరు చేసిన అన్నిటిలోకెల్లా కాశీమజిలీ కథలకు ప్రత్యేక గుర్తింపు రావడాన్ని ఏవిధంగా పరిగణిస్తారు?
చాలామందికి తెలియకపోవచ్చును కానీ, కాశీమజిలీ కథలు ఇప్పటి సూపర్‌ హీరోస్‌ సినిమాలు, హారీపాటర్‌ సినిమాల కంటే బావుంటాయి. అద్భుతమైన వింతలు, వినోదాలతో సాగిపోయే ఆ కథలు ఒక్కసారి చదవడం అంటూ మొదలుపెడితే ఇక ఆపబుద్ధి కాదు. సుమారు 100 సంవత్సరాల క్రితం నాటివి కావడంతో ఆ పుస్తకాలలో గ్రాంథికం పాళ్ళు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఆ కథలను చదువుకొని, వాటిని ఈనాటి వారికి అర్థమయ్యేలా సరళమైనభాషలో రాసుకుంటూ అజగవలో చెబుతున్నాను. మొత్తం 12 సంపుటాల కాశీమజిలీ కథలలో ఇప్పుటికి 5 సంపుటాలలోని కథలను 100 భాగాలుగా చెప్పాను. మిగిలిన భాగాలను కూడా చెప్పుకుంటూనే వెళతాను.
సాహితీ పిపాసులనుంచి స్పందన ఎలా ఉంటుంది?
సాహిత్యాభిమానుల ప్రోత్సాహమే అజగవకు ఇంధనం. అజగవలో ఉన్న వీడియోలు సుమారు 350 మాత్రమే అయినా, ఇప్పటికి ఆ వీడియోలు లక్షా డెబ్భై వేలసార్లకు పైగా షేర్‌ అయ్యాయి. పందొమ్మిది వేలకుపైగా కామెంట్లు వచ్చాయి. ఇంతటి అభిమానం కురిపించే సాహిత్యాభిమానులున్నప్పుడు నిరుత్సాహం కలిగే అవకాశం ఎక్కడ ఉంటుంది?
ఇతరుల మాదిరి వివాదాస్పదమైన, అర్థంలేని మీ వీడియోస్‌ కి ఉండవు. దానికి ఏమైన ప్రత్యేక ఉద్దేశ్యం ఉందా?
అజగవను ప్రారంభించేటప్పుడే రెండు నియమాలను పెట్టుకున్నాను. కేవలం భాషా, సాహిత్య, సంస్కతులకు సంబంధించిన విషయాలు, మానవజాతికి సేవ చేసిన మహనీయుల గురించిన విషయాలు తప్ప మరేవిధమైన విషయాల జోలికీ వెళ్లకూడదన్నది నా తొలినియమం. వీడియోలో ఏముందన్న విషయాన్నిThumbnails లో స్పష్టంగా, సరళంగా, సూటిగా చెప్పాలన్నది నా రెండవ నియమం. ఇంతవరకూ ఎప్పుడూ కూడా నా నియమాలను నేను తప్పలేదు.
సినిమా రంగం నుంచి ఆహ్వానాలు రాలేదా?
నేను అటువైపు వెళ్లడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ సినీమహాప్రపంచంలో నిలదొక్కుకోవడానికి, నెగ్గుకురావడానికి అవసరమైన శక్తి సామర్ధ్యం నాకున్నాయని కూడా అనుకోవడం లేదు.
భావి ప్రణాళికలు?
ఇప్పుడు చేస్తున్న ఈ సాహితీ సేవను ఎప్పటికీ చేయగలగాలన్నదే నా కోరిక. అంతకుమించి ప్రత్యేక ప్రణాళికలంటూ ఏమీ లేవండి.
– బి. మదన్‌ మోహన్‌

]]>