Karimnagar Archives - https://navatelangana.com/category/karimnagar/ Thu, 09 May 2024 15:33:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Karimnagar Archives - https://navatelangana.com/category/karimnagar/ 32 32 బాధిత కుటుంబానికి పరామర్శ https://navatelangana.com/counseling-the-victims-family-6/ Thu, 09 May 2024 15:32:56 +0000 https://navatelangana.com/?p=287303
నవతెలంగాణ ముత్తారం : మండలంలోని మచ్చుపేట గ్రామానికి చెందిన ఆలిశెట్టి మల్లయ్య   ఇటీవల అనారోగ్యంతో  మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను  జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం పరామర్శించి, మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నాడు అనంతరం చిత్రపటానికి పూలు వేసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి నివాళులర్పించారు. ఆయన వెంట. తాజా మాజీ సర్పంచ్ మెడబోని సతీష్. మాజీ సర్పంచ్ గోవిందుల పద్మ ఆనంద్. గ్రామ అధ్యక్షులు తాళ్లపల్లి కుమార్,.  మాజీ వార్డు సభ్యులు దొంతుల రాకేష్.సీనియర్ నాయకులు. దుండే రాజేశం.,అలిశెట్టి రామస్వామి. దుండె రాజేందర్.,మడ్డి అశోక్.,బక్కతట్ల రామ్మూర్తి. చిలివేరి లక్ష్మణ్.,అలిశెట్టి హరీష్. తదితరులు పాల్గొన్నారు.
]]>
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం.. https://navatelangana.com/development-is-possible-only-with-congress-10/ Thu, 09 May 2024 15:17:38 +0000 https://navatelangana.com/?p=287295
– కాంగ్రెస్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం
– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
నవతెలంగాణ ముత్తారం : ప్రజా సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అన్నారు. గురువారం ముత్తారం మండలం లక్కారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను కలుసుకొని కాంగ్రెస్ పార్టీ ఆస్తం గుర్తుపై ఓటు వేయాలని మహిళలను అభ్యర్థిస్తున్నారు. ఇండియా కూటమేనని ప్రధానిగా యువ నాయకులు రాహుల్ గాంధీకావడం ఖాయమన్నారు. ప్రజాసంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు పథకాలు ప్రతి ఒక్క నిరుపేదకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వాజిద్ ఫాష, నంద్యాల కుమారస్వామి గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
]]>
కార్ గ్యారేజికి పోయింది: ఆది శ్రీనివాస్.. https://navatelangana.com/adi-srinivas-went-to-the-car-garage/ Thu, 09 May 2024 15:03:13 +0000 https://navatelangana.com/?p=287286
– రైతు వ్యతిరేక బీజేపీకి తగిన గుణపాఠం చెపుదాం..
– కాంగ్రెస్ పేదల ప్రభుత్వం, బీజేపీ ది కార్పొరేట్ ప్రభుత్వం..
నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు మాత్రమే బాగుపడ్డారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపొయింది, కార్ గ్యారేజి కి పోయింది పది సంవత్సరాల్లో కెసిఆర్ కు ప్రజలు గుర్తుకు రాలేదు.. అని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. గురువారం వేములవాడ రూరల్  మండలం తుర్కాసినగర్, ఫాజుల్ నగర్,వట్టెముల, నమిలిగుండు పల్లి, నూకలమర్రి,గ్రామాల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు మద్దతుగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..మే 13 న  పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలను కోరారు.నాలుగున్నర మాసాల క్రితం బీఆర్ఏస్ పార్టి నీ పక్కన పెట్టినట్లుగా బిజేపి నీ కూడా పక్కన పెట్టాలి అని అన్నారు.గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో బిసి బంధు బిఆర్ఎస్ బందు అయ్యింది అని హెద్దేవా చేశారు.
దళిత బందు ఇవ్వలె, ఇంటికో ఉద్యోగం అని ఇవ్వలేదు..ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..రైతులకు ఋణ మాఫీ చేస్తామని మోసం చేశారు.కెసిఆర్ తెలంగాణ రాష్ట్రన్ని అప్పుల కుప్పగా మార్చిన మీ ఆశీస్సులతో అధికారంలోకి రాగానే మహిళా లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం అని వెల్లడించారు. ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంచుకున్నం,గతంలో రైతులకు ఉచిత కరెంటు  ఇచ్చామని తెలిపారు. నేడు గృహాలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నం,500 రూపాయలకే  సిలిండర్ ఇస్తున్నాం ని తెలిపారు. నియోజకవర్గం పరిధిలో 3500 ఇండ్లు మంజూరి అయ్యాయి..ఆగస్ట్ 15 లోపు రైతులకు 2 లక్షల వరకు రుణ మాఫీ చేసి తీరుతామని అన్నారు. రైతులకు రైతు భరోసా ఇస్తుంటే బిజేపీ,బీఆర్ఎస్ రెండు కలసి ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేసి రైతు భరోసా ఆ పేరు అని విమర్శించారు.బిజేపీ,బీఆర్ఎస్ రెండు ఒకే గూటి పక్షులు,గతంలో 2018 ఎన్నికల్లో ఎలక్షన్ రొజు ఓటర్లు లైన్ లో నిలుచొని ఓటు వేస్తున్న సమయంలొ టింగ్ టింగ్ మని రైతు బందు వేస్తే బిజేపీ ఎందుకు పిర్యాదు చేయలేదు కానీ ప్రశ్నించారు.కెసిఆర్ వేములవాడ రాజన్న కు ఏటా 100 కోట్లు ఇస్తానని మోసం చేశాడు.మొన్న మోడి వస్తె మా రాజన్న కు ఏం అన్నా ఇస్తాడు అనుకున్న, ఉత్తర కాశీ లో పోటీ చేసి గెలిచిన మోడి దక్షణ కాశీ వేములవాడ రాజన్న సన్నిధికి వస్తె గుడి అభివృద్ది కోసం నిధులు ఇస్తాడు అనుకుంటే ఉట్టి చేతులతో వెళ్లిపోయాడని ఆగ్రహించారు.మన రాజన్న కీ ఎం ఎవ్వని మోడి మన ప్రజలకు ఏం ఇస్తాడు..కేంద్రంలో ప్రసాద్ పథకం ద్వారా అయిన ఇవ్వనీ బిజేపీ వారికీ ఓటు ద్వారా బుద్ధి చెబుదాం అని అన్నారు. రిజర్వేషన్లు, రాజ్యాంగం ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  రావాలని కోరారు.కాంగ్రెస్ పేదల ప్రభుత్వం, బిజేపీ ది కార్పొరేట ప్రభుత్వం..మోడి పది సంవత్సరాల క్రితం నల్ల ధనం తెచ్చి పేదవారి ఖాతాల్లో నల్లధనం వేస్తా అన్నాడు..కని రైతాలకు నల్లా చట్టాలు తెచ్చారు.జన్ దన్ ఖాతాల్లో నల్లధనం 15 లక్షల ఇస్తానని మోసం చేశారని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకం పని దినాలను పెంచుతూ, కూలి 400 వరకు పెంచుతాం అని తెలిపారు.అధికారం ఉన్నప్పుడు ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కి పరిమితమై నేడు అధికారం పోగానే బస్సు యాత్ర పేరుతో వస్తున్నాడు నమ్మకండి అని అన్నారు. సోనియా గాందీ మిగులు బడ్జెట్ గా ఉన్నా రాష్ట్రన్ని ఇస్తే కెసిఆర్ రాష్ట్రన్నీ అప్పుల కుప్పగా మార్చారు అని మండిపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారు పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉన్న పలు సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి వస్తున్న రాహుల్ గాంధీకి అండగా ఉండాలన్నారు. వెలిచాల రాజేందర్ రావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
]]>
ప్రజల మేలు కోరే బిఆర్ఎస్ పార్టీని గెలిపించండి.. https://navatelangana.com/win-the-brs-party-which-seeks-the-welfare-of-the-people/ Thu, 09 May 2024 14:56:57 +0000 https://navatelangana.com/?p=287273 – వైస్ ఎంపీపీ సుదాటి రవీందర్ రావు

నవతెలంగాణ-ముత్తారం : ప్రజల మేలుకోరే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ముత్తారం వైస్ ఎంపీపీ సుదాటి రవీందర్ రావు అన్నారు గురువారం మండల కేంద్రంలోని ఇంటింటి ప్రచారంలో వారు మాట్లాడుతూ పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లోనే ప్రజల వద్ద నమ్మకం కోల్పోయిందన్నారు. ప్రజలందరూ ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట ముత్తారం గ్రామం శాఖ అధ్యక్షులు అలువోజు రవీందర్ చారి.బేధ సంపత్. చల్ల రాజేందర్. చల్ల సమ్మయ్య. రాగుల రవీందర్. రాగుల రాజేశం. కలవైన బాలమల్లు. తూటి లచ్చయ్య.అమ్ము కుమార్. మారం రామ్ రెడ్డి.పరుపాటి వీరారెడ్డి.ఆల్గం రాజయ్య. మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
]]>
లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను రక్షించాలి: బొంగోని అభిలాష్ https://navatelangana.com/secular-democratic-constitutional-system-should-be-protected-bongoni-abhilash/ Thu, 09 May 2024 14:43:41 +0000 https://navatelangana.com/?p=287248
నవతెలంగాణ – శంకరపట్నం
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరుగుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పౌరులు తమ రాజకీయ ఆర్థిక సామాజిక సమానత్వం స్వేచ్ఛ సౌబ్రాతృత్వం కొనసాగించాలని జాతీయ బీసీ సంఘం మండల అధ్యక్షుడు బొంగోని అభిలాష్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా గురువారం శంకరపట్నం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో అభిలాష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులు మతసామరస్యాన్ని కాపాడే పార్టీలకే మద్దతు ఇవ్వాలని 60 శాతం ధనం కేవలం 10 శాతంగా ఉన్న ధనవంతుల దగ్గరే ఉందని మిగిలిన 50% పేద ప్రజల దగ్గర కేవలం 6% సంపద మాత్రమే ఉందని దేశ భవిష్యత్ రీత్యా రాష్ట్ర విభజన హామీల రీత్యా సామరస్య హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రజాస్వామ్య సదస్సు ఈనెల 11 న హుజూరాబాద్ లోని సిటీ సెంటర్ హాల్లో జరిగే ఈ సమావేశానికి ప్రజలు హాజరుకావాలని భేటీ బచావో నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, సదానందం భీమోజు , పొడిశేట్టి వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.
]]>
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి  https://navatelangana.com/man-dies-after-tractor-overturns-2/ Thu, 09 May 2024 14:37:05 +0000 https://navatelangana.com/?p=287238
నవతెలంగాణ – జూలపల్లి 
మండలంలోని కాచాపూర్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై ఎన్. శ్రీధర్ కథనం ప్రకారం కాచాపూర్ గ్రామానికి చెందిన పుట్ట ప్రశాంత్ (32) రోజు లాగానే ట్రాక్టర్ పనిలో భాగంగా  వరి కోత మిషన్ హార్వెస్టర్ నుండి వడ్లను చేరవేసే క్రమంలో ఉర చెరువు శివారు ప్రాంతంలో అదుపుతప్పి చిన్న కల్వర్టుపై ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  ఎస్ ఐ తెలిపారు .మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం ఈ సంఘటనతో కాచాపూర్ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
]]>
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను గెలిపించండి: పిట్టల సమ్మయ్య https://navatelangana.com/let-congress-mp-candidate-velishala-rajender-rao-win-pittala-sammaiah/ Thu, 09 May 2024 14:34:54 +0000 https://navatelangana.com/?p=287233
నవతెలంగాణ – శంకరపట్నం
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు విద్యార్థి,నిరుద్యోగయువతను విస్మరించిందని, 2014,2018  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని బిఆర్ఎస్ పార్టీనీ, కెసిఆర్ నీ  ఓడించడానికి విద్యార్థి,నిరుద్యోగులు సిద్దం కావాలని, శంకరపట్నం మండల కేంద్రంలో బిఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులను ఓడించి,కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు నీ గెలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు.  గురువారం శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ని గెలిపించాలని సీపీఐ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించుతూ,కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ..ప్రజా పాలన చేస్తు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటు పేదలకు అన్నదాతలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని కరీంనగర్ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని విద్యార్థులకు, పేదలకు అన్నదాతలకు, మంచి పాలనా వస్తుందని అన్నారు. ప్రచారంలో ఏ ఎస్ ఎఫ్ ఐ కరీంనగర్ జిల్లా ఉపాధక్షలు కనకం సాగర్, మరియు, కన్నం సదానందం,తాడవేణి రవి, పిట్టల రామస్వామి, పిట్టల తిరుపతి, బోమ్మేటి వెంకటస్వామి, మేకల రవి, బొమ్మేటి పరమేష్, సంతోష్, అరవింద్,తదితరులు పాల్గొన్నారు.
]]>
కాంగ్రెస్ నేతలు కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం.. https://navatelangana.com/congress-leaders-election-campaign-in-the-vegetable-market/ Thu, 09 May 2024 14:30:55 +0000 https://navatelangana.com/?p=287224 నవతెలంగాణ – వేములవాడ 
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గురువారం వేములవాడ  పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో గల కూరగాయల మార్కెట్లో స్థానిక నాయకులతో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, స్థానిక కౌన్సిలర్ ఇప్పపుల అజయ్, కాంగ్రెస్ నేతలు పులి రాంబాబు గౌడ్, చిలుక రమేష్, కూర దేవయ్య, వస్తద్ కృష్ణ, రాజు, ఫిరోజు పాషా, వనపర్తి శంకర్, ముంజ ఉమేందర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు..
]]>
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదికి చల్మెడ సవాల్.. https://navatelangana.com/chalmeda-challenges-congress-mla-adi/ Thu, 09 May 2024 14:23:44 +0000 https://navatelangana.com/?p=287207 – మీకు వచ్చిన ఓట్లు …మీ అభ్యర్థికి రావాలే..
– పార్లమెంట్ అభివృద్ధికి నిధులు అడగని అసమర్థుడు బండి..
– బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు..
నవతెలంగాణ – వేములవాడ 
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సాధించిన ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి కూడా రావాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి  చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలలో 72 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థికి కూడా ఇదే స్థాయిలో ఓట్లు తీసుకువచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ సైనికుడని నిరూపించుకోవాలని చల్మెడ సవాల్ విసిరారు.  కాంగ్రెస్, బిజెపి ఒకటయ్యారు అనేది పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చే ఓట్ల ద్వారా తేలిపోతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడిందని 6 గ్యారంటీలు అమలు చేయడం వల్ల విఫలం కాగా ప్రజల్లో  తీవ్ర వ్యతిరేకత మొదలైందని అన్నారు. ఉద్దెర పథకాలు గృహ జ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేసి చేతులు దులుపు కో గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలు మరోసారి తప్పు తెలుసుకున్నామని పశ్చాత్తాప పడుతున్నారని వెల్లడించారు. రైతులకు కరెంటు నీళ్లు ఇవ్వకపోగా రైతు భరోసా అమలు కావడం లేదని కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు మాత్రమే అమలు అవుతుందని అన్నారు. ఇంతకాలం ఆపి మళ్లీ ఇప్పుడు రైతుబంధు వేశాడని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వేస్తామన్నప్పుడు అభ్యంతరం తెలిపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చి వాళ్ళ దాంట్లో నుంచే ఒకరి ద్వారా ఫిర్యాదు చేయించి మళ్లీ ఆపించాడని ఆరోపించారు.
ఇప్పటికే రాష్ట్రంలోని జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గాలుగా కుదించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిటీ వేశానని చెప్తున్నారని కొట్లాడి సాధించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆది శ్రీనివాస్ కట్టుబడి ఉన్నాడా ప్రజలకు తెలిపాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 రుణమాఫీ కూడా ఉత్తముచటేనని విమర్శించారు. ఇక దక్షిణ భారతదేశంలో ఆదాయాన్ని ఉత్తర భారత దేశంలో ఖర్చు పెడుతున్న ప్రధాని మోదీ మొదటి నుండి దక్షిణ భారతదేశ మీద వివక్షతే చూపుతున్నారన్నారు అని విమర్శించారు. దక్షిణ కాశీ రాజన్న ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శించుకున్న మోడీ అభివృద్ధికి మాత్రం ఒక రూపాయి కేటాయించకపోవడమే ఎందుకు నిదర్శనం అన్నారు. ప్రధాని హోదాలో మోడీ వస్తే కనీసం అభివృద్ధికి నిధులు అడిగే సమర్ధత లేని అసమర్ధుడు బండి సంజయ్ అని విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన బోయినపల్లి వినోద్ కుమార్ జిల్లాకు అనేక  అభివృద్ధి నిధులు సాధించిన విద్యావేత్తగా మరోసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను గెలిపించుకుందామని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలతో పాటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అభివృద్ధి  పరిధిలోని సమస్యల గళం విప్పే నాయకుడు వినోద్ కుమార్ అని ప్రతి ఒక్కరూ వినోద్ సమస్యల గళం విప్పే నాయకుడు వినోద్ కుమార్ అని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈనెల 10వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ఉన్నందున పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
పదో తరగతికి రెండో పేపర్ లేదు..
పదో తరగతిలో మొదటి పేపర్ ఆది శ్రీనివాస్ పాస్ అయినట్లుగానే రెండవ పేపర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు గెలిపించాలని వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను చల్మెడ లక్ష్మీనరసింహారావు తిప్పి కొట్టారు. రెండు సంవత్సరాల క్రితమే పదవ తరగతి పేపర్లను ఒకటికి కుదించారని చెబుతూ ఒకటి మాత్రమే పాసయ్యారని మరొకటి మీకు అవకాశం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్  చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి,  పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, కౌన్సిలర్లు నిమ్మశేట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, గోలి మహేశ్, నాయకులు ఏశ తిరుపతి, గడ్డం హనుమాన్లు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, రామతీర్థపు రాజు, పైడి శ్రీనివాస్, కొండ కనుకయ్య,  కమలాకర్ రెడ్డి, ప్రేమ్ చారి, అఫ్రొజ్, భాస్కర్, సందీప్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
]]>
న్యాయవాదుల సంక్షేమమే మా ధ్యేయం https://navatelangana.com/the-welfare-of-lawyers-is-our-mission/ Thu, 09 May 2024 07:00:18 +0000 https://navatelangana.com/?p=286871
– న్యాయవాదుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ లో చేరిక 
– కరీంనగర్ బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పివి.రాజ్ కుమార్ 
నవతెలంగాణ – భగత్ నగర్: న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మేరకు  గురువారం కాంగ్రెస్ పార్టీ  ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరినట్లు కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి వి రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యలైన బార్ అసోసియేషన్ సమావేశ మందిర నిర్మాణం, జూనియర్ అడ్వకేట్ లకు స్టైఫండ్ పెంపు, జీవిత భీమా పెంపు, నివేశన స్థలాల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్దిష్ట మైన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ & హ్యూమన్ రైట్స్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ రాచకొండ ప్రభాకర్, అడ్వకేట్లు కుమారస్వామి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
]]>
పద్మశాలీల భద్రతకు  నాదీ బాధ్యత https://navatelangana.com/i-am-responsible-for-the-safety-of-padmasali/ Thu, 09 May 2024 05:58:43 +0000 https://navatelangana.com/?p=286849
– కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు 
– కాంగ్రెస్ లో చేరిన పద్మశాలి సంఘం జిల్లా నేత, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పివి.రాజ్ కుమార్
నవతెలంగాణ – భరత్ నగర్
పద్మశాలి కులస్తుల ఆర్థిక సామాజిక భద్రతకు తాను కట్టుబడి ఉన్నానని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ నగరంలోని స్పెన్సర్ లో కరీంనగర్ బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, పద్మశాలి సంఘం జిల్లా నాయకులు పివి రాజ్ కుమార్  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకి వెలిచాల రాజేందర్ రావు కండువా కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ పద్మశాలిల ఆర్థిక పరిపుష్టి కోసం తాను ప్రత్యేక ప్రణాళిక రూపొందించానని, సిరిసిల్ల నేతన్నల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసి దాని అమలుకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో చేరిన పివి రాజ్ కుమార్ మాట్లాడుతూ వెలిచాల కుటుంబం అంటే తనకు ప్రత్యేక గౌరవమని, దివంగత జగపతిరావు ఆశయ సాధనతో ముందుకు సాగుతున్న రాజేందర్ రావుకు తాను మద్దతు ప్రకటించడంతో పాటు తన కుల సంఘం, బార్ అసోసియేషన్ లోని  ఇతర అడ్వకేట్లను కలిసి ఓట్లు వేపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ రాచకొండ ప్రభాకర్, అడ్వకేట్లు కుమారస్వామి, దినేష్, తదితరులు పాల్గొన్నారు.
]]>
ఇంటర్ కాలేజిల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల https://navatelangana.com/schedule-release-for-inter-college-admissions/ Wed, 08 May 2024 17:08:07 +0000 https://navatelangana.com/?p=286444
నవతెలంగాణ కరీంనగర్: పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్టు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. మే 9వ తేదీ నుంచి తొలి దశ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్లు బోర్డు బుధవారం అధికారికంగా ప్రకటించింది. మే 9వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను ఇంటర్ కాలేజీల్లో స్వీకరించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. కాగా, జూన్ 30వ తేదీ లోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
            అయితే పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు పొందాలనుకునే వారు.. ఆన్ లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న మార్స్క్ మెమో, ఆధార్ కార్డును తప్పని సరిగా జతపరచాలి. తాము ఎంచుకున్న కాలేజీల్లో ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తి అయిన తర్వాత కచ్చితంగా విద్యార్థులు ఒరిజినల్ మెమోతో పాటుగా టీసీని కాలేజీలో సమర్పించాలి. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకూడదని ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థులు పూర్తి సమాచారం కోసం https://acadtsbie.cgg.gov.in/ వెబ్ సైట్ చూడవచ్చు.
]]>