Khammam Archives - https://navatelangana.com/category/khammam/ Thu, 17 Apr 2025 13:23:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Khammam Archives - https://navatelangana.com/category/khammam/ 32 32 108 వాహనంలో లో ప్రసవం… తల్లీ బిడ్డ క్షేమం.. https://navatelangana.com/108-in-the-vehicle-of-childbirth-in-the-vehicle/ Thu, 17 Apr 2025 13:23:16 +0000 https://navatelangana.com/?p=548270 నవతెలంగాణ – అశ్వారావుపేట
కొందరికి కాన్పు కష్టాలు అన్నీ ఇన్నీ కావు.ఈ రోజుల్లో కాన్పు అంటే అంబులెన్స్,ఆస్పత్రి,శస్త్ర చికిత్స సర్వసాధారణం. కాని ఏ హడావుడీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా కాన్పు కావడం అరుదైన విషయం. అయితే ఒకరిద్దరు క్షణాల్లో చక్కని పిల్లలకు జన్మనిస్తారు. అశ్వారావుపేట మండలం దురదపాడు కు చెందిన కుర్సం కనకదుర్గ కాన్పు నొప్పులతో బాధపడుతుంటే బుధవారం అర్ధరాత్రి 108 అంబులెన్స్ వాహనంలో అశ్వారావుపేట ఏరియా హాస్పిటల్ కి తరలిస్తున్నారు. మార్గం మధ్యలో సున్నం బట్టి సమీపంలో నొప్పులు అధికం అవడంతో విధుల్లో ఉన్న పైలెట్ హరిక్రిష్ణ, ఇ.ఎం.టీ దీప్తి హై,ఆశా కార్యకర్త శుభవాణి లు చికిత్స అందించి కాన్పు చేసారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండటంతో ఏరియా ఆసుపత్రి కి తరలించి మిగతా వైద్యం అందించారు.

]]>
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు https://navatelangana.com/essay-competitions-for-students-6/ Thu, 17 Apr 2025 13:07:36 +0000 https://navatelangana.com/?p=548240 నవతెలంగాణ – అశ్వారావుపేట
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల సందర్భంగా గురువారం విద్యార్థులకు “అగ్నిప్రమాదాలు – నివారణ” అనే అంశం పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. స్థానిక జవహర్ విద్యాలయంలో విద్యార్థులు అగ్ని ప్రమాదాలు నివారణ చర్యలు,ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు అనే అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.వ్యాసరచన లో పలు తరగతులకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలను అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ప్రిన్సిపాల్ మైథిలీ, ప్రవీణ్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.
]]>
కన్నయ్య కు నివాళులు https://navatelangana.com/tributes-to-kannaya/ Thu, 17 Apr 2025 13:06:00 +0000 https://navatelangana.com/?p=548237 నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇటీవల అపస్మారక స్థితిలో మృతి చెందిన సీపీఐ(ఎం) సానుభూతి పరుడు మడకం కన్నయ్య కు సీపీఐ(ఎం) మండల కమిటీ గురువారం నివాళులు అర్పించింది. పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు మడకం గోవిందు జ్యేష్ట సోదరుడు 10 రోజులు క్రితం మృతి చెందగా ఆయన పెద్ద కర్మను మండలంలోని పండు వారి గూడెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పుల్లయ్య,జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,మండల కార్యదర్శి వర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు,సారిన నాగేశ్వరరావు,కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు,ఆళ్ళ నాగేశ్వరరావు లు నివాళులు అర్పించారు.కన్నయ్య కుటుంబాన్ని ఓదార్చారు.

]]>
అశ్వారావుపేట లో మాజీ ఎమ్మెల్యే మెచ్చా పర్యటన… https://navatelangana.com/former-mla-mecha-tour-in-ashwaraupeta/ Wed, 16 Apr 2025 13:14:44 +0000 https://navatelangana.com/?p=547625
– అగ్ని ప్రమాద బాధితులకు పరామర్శ…
– మునగ రైతులను ఆదుకోవాలి…
– సమ్మక్క సారలమ్మ ల దర్శనం….
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పర్యటించారు. దురద పాడు పంచాయతీ పాల గుంపు లో ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురై 3 ఇల్లు పూర్తిగా కాలి పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.
బాధిత కుటుంబసభ్యులకు  బియ్యం,వంట సామగ్రి,నిత్యవసర సరుకులు,దుప్పట్లు, స్థానిక క్రైస్తవ పాస్టర్లు కుటుంబానికి 2 ఇనుప మంచాలు ఏర్పాటు చేయగా వాటిని కూడా మెచ్చా  చేతుల మీదుగా అందజేశారు.నష్ట పరిహారం తొందరగా అందేవిధంగా అధికారులతో మాట్లాడుతానని వారికి బరోసా కల్పించారు. సున్నంబట్టి లో సమ్మక్క సారలమ్మ లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మెచ్చా ని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాకలగూడెం లో నల్లాని వెంకటేశ్వరరావు అనే రైతు తన 4 ఎకరాల్లో మునగ పంట వేయగా ఇటీవలే కురిసిన భారీ వర్షానికి పంట నష్టం పోయిన మునగ సాగును మెచ్చా గారు పరిశీలించారు. వెంటనే ప్రభుత్వం మునగ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు,మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ మూర్తి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక ప్రసాద్,మోహన్ రెడ్డి,తాడేపల్లి రవి,బిర్రం వెంకటేశ్వరరావు,మాజీ ఎంపీటీసీ రాజు,వైస్ ప్రెసిడెంట్ రాజులు, కుర్రం కన్నయ్య,కాకా మధు,గాడ్రాల తాటి రాజులు,గంగు లు,యుగంధర్,చిన్న సత్యనారాయణ,నరేష్, మిండ శ్రీను,ప్రసాద్,చంద్రం,కాక చంద్రం,తదితరులు పాల్గొన్నారు.
]]>
పోషకాహారం తో సంపూర్ణ ఆరోగ్యం: సూపర్వైజర్ విజయలక్ష్మి https://navatelangana.com/full-health-supervisor-vijayalakshmi-with-nutrition/ Wed, 16 Apr 2025 11:29:11 +0000 https://navatelangana.com/?p=547491 నవతెలంగాణ – అశ్వారావుపేట
పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఆస్వాదించవచ్చని,స్థానికంగా లభ్యం అయ్యే ఆకు కూరలు, కూరగాయలుతో పాటు అప్పుడప్పుడు పప్పులు కూరలు విరివిగా భుజించాలి అని సమీకృత మాతా శిశు సంరక్షణ శాఖ(ఐసీడీఎస్) సూపర్వైజర్ విజయలక్ష్మి బాలింతలకు, గర్భిణి లకు సూచించారు. పోషణ పక్వాడ్ లో భాగంగా బుధవారం పట్టణంలోని కోత మిషన్ బజారు అంగన్వాడి కేంద్రంలో ఐసీడీఎస్ పోషణ అభియాన్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ పర్యవేక్షణలో శ్రీమంతాలు,అన్న ప్రాసనలు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. పోషకాహార ప్రాముఖ్యత గురించి తల్లులకు విజయలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ నాగమణి, రాధా, తల్లులు,గర్భవతులు బాలింతలు హాజరైనారు.

]]>
ఇందిరా బడిబాట విజయవంతం చేయాలి… https://navatelangana.com/indira-badibata-should-be-successful/ Wed, 16 Apr 2025 11:16:17 +0000 https://navatelangana.com/?p=547466
– వచ్చే విద్యాసంవత్సరం చేరికల పెంపుకు వ్యూహాలు…
– వార్షిక సమీక్షలో ఎంఈఓ ప్రసాదరావు సూచనలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 19 న నిర్వహించే ఇందిరా బడిబాట ను విజయవంతం చేయాలని,ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఎంఈఓ పొన్నగంటి ప్రసాదరావు సూచించారు. బుధవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో తన అద్యక్షతన నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల వార్షిక సమీక్ష సమావేశం లో వారికి ఆయన పలు సూచనలు చేసారు. 2025 – 2026 విద్యా సంవత్సరంలో జూన్ 12 నాటికి విద్యార్థులకు యూనిఫాం అందజేయడం కోసం స్వయం సహాయక సంఘాల చేత యూనిఫామ్ లు సిద్దం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలల్లో నూతన విద్యార్ధుల చేరికలు( అడ్మిషన్ల) పెంపు కోసం ఇప్పటి నుండే తల్లిదండ్రులలో అవగాహన కల్పించి,ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో కల్పించే వివిధ సౌకర్యాల గురించి విస్త్రుత మౌఖిక ప్రచారం చేయాలని తెలిపారు. వచ్చే వేసవిలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేక చొరవతో మూడు,నాలుగు,ఐదు తరగతుల విద్యార్థులకు పంపిణీ చేయనున్న రాత( నోట్ )పుస్తకాలను విద్యార్ధులకు అందించి వారికి తగు శిక్షణ కోసం( వ్రాయించడం )కోసం ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. వార్షిక పరీక్షలు అనంతరం ఈనెల 20 వ తేదీ లోపు పరీక్ష పేపర్లు దిద్ది విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. ఈనెల 23 వ తేదీన మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు ప్రగతి పత్రములు అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంప్లెక్స్ హెచ్.ఎం లు హరిత, కొండలరావు, వీరేశ్వరరావు, పద్మావతి, సీఆర్పీ ప్రభాకర్ రావు, రామారావులు పాల్గొన్నారు.
]]>
సామాజిక న్యాయానికి ఆద్యుడు అంబేద్కర్ https://navatelangana.com/ambedkar-is-the-pioneer-of-social-justice/ Tue, 15 Apr 2025 14:35:30 +0000 https://navatelangana.com/?p=546882 Ambedkar, a pioneer of social justice– ప్రిన్సిపాల్ స్పందన
నవతెలంగాణ – అశ్వారావుపేట
భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడు, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను ప్రతి విద్యార్ధికి ఆదర్శం కావాలని ప్రిన్సిపాల్ వి.స్పందన సూచించారు. మంగళవారం మండల పరిధిలోని పెదవాగు ప్రాజెక్టు లోగల ప్రభుత్వ గిరిజన మహిళా డిగ్రీ కళాశాల(దమ్మపేట)లో ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు అంబేడ్కర్ జీవిత చరిత్ర గురించి అవగాహన కల్పించారు. ముందుగా అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి వర్గానికి సమాన న్యాయం, హక్కులు అందే విధంగా ఆయన విశేష కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్ధిని లు పాల్గొన్నారు.

]]>
ముత్యాలమ్మ దేవాలయానికి రక్షణ కరువు https://navatelangana.com/protection-drought-to-the-muthiyalamma-temple/ Tue, 15 Apr 2025 14:31:58 +0000 https://navatelangana.com/?p=546873
Muthyalamma Temple in need of protection– చిలుకల గండి హుండీ చోరీకి యత్నం 

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలోని వినాయకపురం గ్రామ శివారు లోగల శ్రీ చిలకల గండి ముత్యాలమ్మ  ఆలయానికి రక్షణ కరువైంది.దీంతో మంగళవారం రాత్రి దొంగలు కొందరు హుండీ చోరీ కి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. ఆలయం లోపల ఉన్న నాలుగు వందల కేజీలు బరువు గల  ఐరన్ హుండీ ని కొందరు దొంగలు సుమారు 15 మీటర్ల దూరంలో ఆలయం వెనక వైపుకు తీసుకెళ్లి తాళాలను తెరిచేందుకు ప్రయత్నించారు.అయితే హుండీ తాళాలు తెరుచు కోక పోవడంతో హుండీ ని అక్కడే వదిలేసి వెళ్లారు.తాళాలు తెరుచు కోక పోవడంతో హుండీలో ఉన్న నగదు చోరీ కి గురి కాలేదు. ఈ విషయాన్ని ఉదయం ఆలయానికి వచ్చిన సిబ్బంది గుర్తించి,స్థానిక పోలీసులకు సమచారం అందించారు. ఏఎస్సై యాకూబ్ ఆలీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.కాగా ఇటీవలే వచ్చిన అకాల గాలి దుమారం తో ఆలయంలోని సీసీ కెమెరాలు కాలి పోగా, చోరీ కి వచ్చిన దుండగులను గుర్తించేందుకు వీలు లేకుండా పోయింది. అయితే ప్రతీ నెలా లక్షకు పైగా ఆదాయం వచ్చే ఈ ఆలయానికి పటిష్టం గా బందోబస్తు ఏర్పాటు చేయడంలో సిబ్బంది విఫలం అయినట్లు తెలుస్తుంది. ఈ ఆలయంలో చోరీ జరగడం కొత్తేమీ కాదు.గతంలోనూ జరిగిందని సిబ్బందే తెలుపుతున్నారు.
అనుమానాలు ఎన్నో…
వాచ్ మేన్ ఒకరు ఉన్నా మంగళవారం అనారోగ్యం కారణంగా విధులు నిర్వహించలేదని ఈఓ ప్రకాశరావు తెలిపారు.ప్రత్యామ్నాయం ఎందుకు చూడలేదు?
అశ్వారావుపేట – భూర్గంపాడు ప్రధాన రహదారికి ఆనుకునే ఈ ఆలయం ఉంది.వాహన రాకపోకల రద్దీ బాగానే ఉంటుంది.ఇంత రద్దీ లోనూ దొంగలు కు ఆటంకం ఎందుకు కలగలేదు అనేది పెద్ద ప్రశ్న. సీసీ కెమేరాలు మరమ్మత్తులకు గురైతే తక్షణ మరమ్మత్తులు ఎందుకు చేపట్టలేదు అనేది అనుమానాలకు తావు ఇస్తుంది. ఏది జరిగినా ఆ దేవత చూసుకుంటుంది లే అని సిబ్బంది భావించారా?  చివరిగా హుండీ చోరీ యత్నానికి గురైన సంగతిని పోలీస్ లకు పిర్యాదు చేస్తున్నట్లు ఈఓ ప్రకాశ రావు తెలిపారు.
]]>
ముందస్తు బడిబాట.. https://navatelangana.com/pre-slogan/ Tue, 15 Apr 2025 12:32:16 +0000 https://navatelangana.com/?p=546760 Early school..– ప్రయివేట్ పాఠశాలతో పోటీ చేరికలు పెంపుదలే లక్ష్యం
– హెచ్ ఎం హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం బడుల్లో ప్రవేశాలు పెంపుదలే లక్ష్యం అని స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) ప్రధానోపాధ్యాయులు హరిత అన్నారు. మంగళవారం ముందస్తు బడిబాట ను వినూత్నంగా ప్రారంభించారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వచ్చే విద్యాసంవత్సరం విద్యార్థులు చేరడానికి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత ఆధ్వర్యంలో పాఠశాల పరిసర గ్రామాలలో ఉన్న ప్రాధమికోన్నత,ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్ధులను కలిసి కరపత్రాలను అందించి ఉపాధ్యాయులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో గల సౌకర్యాలను విద్యార్ధులకు వివరిస్తున్నారు.పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధన,విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయం, ప్రతి తరగతిలో విద్యార్థులకు బల్లలు, ఫ్యాన్స్, శుద్ధిచేసిన తాగునీరు,ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి పదో తరగతి విద్యార్థులకు తర్ఫీదు, నేషనల్ మెరిట్ కం మీన్స్ స్కాలర్ షిప్, కొరకు 8 వ తరగతి విద్యార్ధులకు శిక్షణ, ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు, ఉంటాయని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా కరపత్రాలు ముద్రించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రయివేటు పాఠశాలల నుండి విద్యార్ధులను ఆకర్షించేందుకు ప్రణాళికలు చేబడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఊడల కిషోర్ బాబు, సీ.హెచ్ నర్సింహారావు, కట్టా శ్రీను, లక్ష్మయ్య తదితర ఉపాధ్యాయులు, నారంవారిగూడెం ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, ఆషిక్ ఆలం, సీఆర్పీ సిద్దాంతం ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

]]>
నాణ్యమైన వంగడాలు తోనే అధిక దిగుబడులు  https://navatelangana.com/high-yields/ Mon, 14 Apr 2025 13:40:44 +0000 https://navatelangana.com/?p=546191

నవతెలంగాణ – అశ్వారావుపేట
నాణ్యమైన వంగడాలను ఎంచుకుని సాగు చేయడంతోనే అధిక దిగుబడులు రాబట్టవచ్చని వ్యవసాయ నిపుణులు రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో వారం వారం నిర్వహించే రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ను సోమవారం స్థానిక రైతు వేదికలో అధికారులు తో పాటు పీఏసీఎస్ అద్యక్షులు, మాజీ అద్యక్షులు, రైతులు వీక్షించారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న భూ భారతి పధకాన్ని సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రసారం చేసారు. అనంతం వ్యవసాయ నిపుణులు రైతులకు పలు సూచనలు చేసారు.పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలిసేలా దుక్కి చేయడం భూసారం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శివరాం ప్రసాద్, ఏఈఓ లు షాకీరా భాను, నాగేశ్వరరావు, రవీంద్ర, శ్రీనివాస్, రైతులు మొగళ్ళపు చెన్నకేశవ రావు లు పాల్గొన్నారు.
]]>
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ నమూనా గృహం https://navatelangana.com/indiramma-sample-home-ready-to-start/ Mon, 14 Apr 2025 13:04:48 +0000 https://navatelangana.com/?p=546173  నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం పేద ఇంటి కల ను సాకారం చేయడానికి రూ.5 లక్షలతో గృహాలు నిర్మించనుంది.ఇందుకు గానూ ముందుగా ప్రతీ మండల కేంద్రం లో నమూనా గృహాన్ని నిర్మించి అందులో వచ్చిన అనుభవాలు,వ్యయప్రయాసలు అధ్యయనం చేసి మెరుగైన ఫలితాలు సాధించడానికి “ఇందిరమ్మ నమూనా గృహం” పేరుతో నిర్మాణాలు చేపట్టింది. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మించిన నమూనా గృహం పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది. వాస్తవానికి అంబేద్కర్ జయంతి రోజు అయినా సోమవారం ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ యోచించారు.ఇదే రోజు మరో ప్రతిష్టాత్మక భూ భారతి పధకం ప్రారంభించ నుండటంతో ఈ నమూనా గృహం ప్రారంభోత్సవానికి వాయిదా పడినట్లు విశ్వసనీయ సమాచారం. నియోజక వర్గంలో దమ్మపేట నమూనా గృహం సైతం ప్రారంభానికి రంగులు – హంగులు దిద్దుకుంది.ములకలపల్లి,చండ్రుగొండ లో స్లాబ్,అన్నపు రెడ్డి పల్లి లో బేస్ మెంట్ లెవెల్ ఇందిరమ్మ నమూనా గృహాల పనులు జరుగుతున్నట్లు హౌసింగ్ ఏఈ రాము సోమవారం తెలిపారు.

]]>
సీపీఐ(ఎం) ఆద్వర్యంలో… ఊరూ వాడా అంబేద్కర్ జయంతి https://navatelangana.com/under-the-aegis-of-cpim-uru-wada-ambedkar-jayanti/ Mon, 14 Apr 2025 12:31:28 +0000 https://navatelangana.com/?p=546113 నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆధునిక భారత దేశ నిర్మాత డాక్టర్ భీం రావు రాంజీ అంబేద్కర్ పుట్టిన రోజు వేడుకలను సీపీఐ(ఎం) ఆద్వర్యంలో శాఖ ఉన్న ప్రతీ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలిలో గల ఆయన విగ్రహానికి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోడెం ప్రసాదరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి,మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ముళ్ళగిరి గంగరాజు లు పాల్గొన్నారు. మండలంలోని దొంతికుంట,పేట మాల పల్లి,వినాయకపురం,నారాయణపురం గ్రామాల్లో గల ఆయన విగ్రహాలు పలు దళిత సంఘాల ఆద్వర్యం ఘనంగా నివాళులు అర్పించారు. పేరాయిగూడెం లో ఫిట్నెస్ గ్రూపు సభ్యులు,వ్యవసాయ కళాశాలలో విద్యార్ధులు,బోధనా సిబ్బంది,మామిళ్ళవారిగూడెం లో దళిత యువకులు ఆద్వర్యంలో నివాళులు అర్పించారు. ]]>