Khammam Archives - https://navatelangana.com/category/khammam/ Wed, 08 May 2024 20:13:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Khammam Archives - https://navatelangana.com/category/khammam/ 32 32 మోడీది అరాచక పాలన https://navatelangana.com/modi-is-an-anarchist-regime/ Wed, 08 May 2024 20:13:16 +0000 https://navatelangana.com/?p=286650 – బీజేపీకి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు
– ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
– ఆర్‌ఆర్‌ఆర్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలి
నవతెలంగాణ-ఖమ్మం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోదీ అరాచక పాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి విమర్శించారు. బుధవారం నగరంలోని శ్రీశ్రీ హౌటల్‌లో ఏఎస్‌ఆర్‌ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఖమ్మం లోక్‌ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, రేణుకాచౌదరి మాట్లాడుతూ ఈసారి కేంద్రంలో కాంగ్రెస్‌ వస్తే.. హిందువుల తాళిబొట్లు తీసి ముస్లింలకు ఇస్తారని దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే.. పరిపాలన దిక్సూచిగా నిలిచే భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తోందని, సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకురాబోతోందని అన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందామని, ఇక్కడ మన రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు హస్తం గుర్తుపై ఓటేసేలా విస్తృత ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు దొడ్డ నగేష్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్‌ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, టీపీసీసీ నేత మద్ది శ్రీనివాసరెడ్డి, వడ్డే బోయిన నరసింహారావు, ఏఎస్‌ఆర్‌ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్‌ చైర్మన్‌ ఆవుల సైదేశ్వరరావు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మానుకొండ రాధా కిషోర్‌, నాయకులు ఎండీ.ముస్తఫా పాల్గొన్నారు.

]]>
బారుగూడెం యువకుడికి గుండె మార్పిడి https://navatelangana.com/heart-transplant-for-barugudem-youth/ Wed, 08 May 2024 20:11:08 +0000 https://navatelangana.com/?p=286639 నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
గుండెజబ్బుతో బాధపడుతున్న మండల పరిధిలోని బారుగూడెం గ్రామానికి చెందిన కాలంగి భాస్కర్‌కు హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రి వైద్యులు ఇటీవల శస్త్రచికిత్స చేసి గుండెమార్పిడి చేశారు. భాస్కర్‌(40) దివ్యాంగుడు, శారీరక శ్రమ చేయలేక టైలరింగ్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భాస్కర్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. సుమారు మూడేళ్లుగా భాస్కర్‌ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఇటీవల కాలంలో గుండె జబ్బు ఎక్కువైంది. గుండెకు ఉన్న నాలుగు వాల్వులలో మూడు మూసుకుపోయి, గుండె కిందకు జారింది. అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. భాస్కర్‌ గుండె పనితీరులో కూడా మార్పు రావడంతో చివరకు గుండె మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఆ వైద్యుని సూచనమేరకు హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు.కామినేని వైద్యులకు బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ వ్యక్తి గుండెను మార్చేందుకు అ వ్యక్తి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వెంటనే ఆసుపత్రి వైద్యులు భాస్కర్‌కు ఇటీవల సమాచారం అందజేశారు. భాస్కర్‌కు అన్ని వైద్య పరీక్షలు చేసి ఎనిమిదిమంది వైద్యుల బృందం దాదాపుగా ఎనిమిది గంటలు శ్రమించి భాస్కర కు గుండెమార్పిడి చేశారు. భాస్కర్‌కు గుండెమార్పిడి చికిత్స జరిగి దాదాపుగా 13 రోజులు అవుతుంది. ప్రస్తుతం భాస్కర్‌ ఆరోగ్యంగానే ఉన్నాడు. భాస్కర్‌కు బుధవారం డిశ్చార్జ్‌ చేశారు. అయితే ఆసుపత్రి పరిసరాలకు సమీపంలోనే ఉండాలని ప్రతి రెండు రోజులకోసారి భాస్కర్‌ను పరీక్షించాలని వైద్యులు సూచించారు. భాస్కర్‌ వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి సమీపంలోని ఉన్నారు. గుండెమార్పిడి చేసిన వైద్యులే తమకు దేవుళ్లని వారి వల్లనే భాస్కర్‌ జీవించి ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గుండె వితరణ చేసిన వ్యక్తి వివరాలు మాత్రం వైద్యులు భాస్కర్‌ కుటుంబ సభ్యులకు తెలపలేదు.

]]>
రైతులకు ఎలాంటి కష్టమూ రానివ్వం https://navatelangana.com/lets-not-let-the-farmers-face-any-hardship/ Wed, 08 May 2024 20:10:16 +0000 https://navatelangana.com/?p=286638 – జిల్లా భూములను గోదావరి జలాలతో తడుపుతాం
– రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ..కిసాన్‌ కాంగ్రెస్‌ సమ్మేళనంలో మంత్రి తుమ్మల
– ప్రజా సేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి
– కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంలోని రైతులెవరికీ కష్టం రానివ్వబోమని, అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్‌ పాలన ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం నగరంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో కిసాన్‌ కాంగ్రెస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందరోజుల పాలనలో ఎంతో చేశామని, ఎన్నికల అనంతరం అభివృద్ధిని నిర్విరామంగా కొనసాగిస్తామని అన్నారు. రైతు దిగాలుగా ఉండకూడదని బీమా సదుపాయం కల్పించామని, తడిసిన ధాన్యాన్ని కొని అండగా నిలుస్తామని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల తర్వాత అధిక ప్రాధాన్యత ఇచ్చి..అన్ని రకాలుగా ఆదుకుంటామని అన్నారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందజేస్తామని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మాదిరిగా లోపాలు జరగకుండా పర్యవేక్షిస్తామని తెలిపారు. పామాయిల్‌ పంటను ప్రోత్సహించి.. అధిక లాభాలు పొందేలా చూస్తామన్నారు. వైరా, లంకా సాగర్‌ ప్రాజెక్టులను గోదావరి జలాలతో నింపుదామని, జిల్లా సాగుభూములు అన్నింటిని తడుపుతామని అన్నారు. సమయం తక్కువగా ఉంది మిత్రులారా.. అంతా గ్రామ గ్రామాన ముమ్మర ప్రచారం చేసి, రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కాంగ్రెస్‌ లోక్‌ సభ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ కోసమే వచ్చానని, జిల్లా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎంపీగా పోటీ చేస్తున్నానని, అందరూ ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, రాజ్యసభ సభ్యురాలి పర్యవేక్షణలో పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్‌ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, టీపీసీసీ నేత మద్ది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, కాంగ్రెస్‌ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

]]>
చిన్న విత్తనం మహావృక్షమైంది.. https://navatelangana.com/a-small-seed-became-a-great-tree/ Wed, 08 May 2024 20:09:05 +0000 https://navatelangana.com/?p=286628 – వందలాదిమంది చిన్నారులకు సంకల్ప నీడనిస్తోంది
– ఈ సేవలు మరింత విస్తృతం కావాలి
– ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ సూపరింటెండెంట్‌ కిరణ్‌, ఆర్టీసీ వైద్యాధికారి ఎ.వి.గిరిసింహారావు
– సంకల్ప ఆధ్వర్యంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం
నవతెలంగాణ-ఖమ్మం
పదిహేనేళ్ల క్రితం నలుగురు ఐదుగురు చిన్నారుల కోసం సేవా కార్యక్రమాలు ప్రారంభించేందుకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వేసిన చిన్న విత్తనం నేడు మహావృక్షమైందని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రుడావత్‌ కిరణ్‌, ఆర్టీసీ సీనియర్‌ వైద్యాధికారి ఎ.వి.గిరిసింహారావు అన్నారు. బుధవారం ఖమ్మంలోని గుప్త కోణార్క్‌ హౌటల్‌లో సంకల్ప స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మంజిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తలసేమియాతో బాధపడుతున్న వందలాదిమంది చిన్నారులకు వైద్యసేవలు అందించడం గొప్ప విషయమన్నారు. వైద్యుల సహకారం, సంస్థ బాధ్యుల చేయూతతో తలసేమియా చిన్నారులు నిశ్చింతగా జీవిస్తున్నారని అన్నారు. డాక్టర్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ తలసేమియాపై విస్తృత ప్రచారం చేయాలని, వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్‌ కంభంపాటి నారాయణరావు మాట్లాడుతూ తలసేమియా చిన్నారులకు సంకల్ప సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఐఎంఏ తరుపున చిన్నారులకు సేవా కార్యక్రమాలకు నిర్వహిస్తామని, చిన్నారులకు, సంస్థకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. సంస్థ బాధ్యులు పి.అనిత మాట్లాడుతూ సంకల్ప ఆధ్వర్యంలో 250 మంది పిల్లలకు ఉచిత మెడిసిన్‌, రక్తం అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 11 మంది చిన్నారులకు బోన్‌మ్యారో చికిత్స చేయించామని, ఎనిమిది మంది చిన్నారులకు తలసేమియా ఫ్రీ అయ్యారని తెలిపారు. అంతకు ముందు తలసేమియా వ్యాధితో మరణించిన చిన్నారులకు నివాళులు అర్పించారు. తలసేమియా ప్రపంచ దినోత్సవ వేడుకల్లో చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. మ్యాజిక్‌షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆటల పోటీల్లో గెలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, వైద్యులు డి.నారాయణమూర్తి, డాక్టర్‌ సాయి భార్గవ్‌, డాక్టర్‌ లక్ష్మీదీప, లలిత, రజిత, పి.పావని, అనురాధ, పి.రవిచందర్‌, పి.ఉదరుభాస్కర్‌, పి.వంశీకిరీటి, ఎన్‌.ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

]]>
అబద్దపు హామీలతో కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసింది https://navatelangana.com/congress-has-cheated-people-with-false-promises/ Wed, 08 May 2024 20:07:53 +0000 https://navatelangana.com/?p=286617 – తప్పు జరిగిపోయిందనే భావనలో ప్రజలున్నారు
– బీఆర్‌ఎస్‌ ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు
– మార్పు మొదలైంది: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
– కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియాలి: సండ్ర
– పట్టణం, రూరల్‌ మండలంలో నామ విస్తృత పర్యటన
నవతెలంగాణ-సత్తుపల్లి
అబద్దపు హామీలతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చిందని, అది తెలుసుకున్న ప్రజలు తప్పు జరిగిపోయిందనే భావనలో ఉన్నారని ఖమ్మం పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులతో రూరల్‌ మండలంలోని రామానగరం, సిద్దారం, కొత్తూరు, రేజర్ల గ్రామాల్లో నామ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణ, రూరల్‌ మండల నాయకులతో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే ముందుగా బీసీలను అణగదొక్కే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ నేపధ్యంలో ఖమ్మం డీసీసీబీ ఛైర్మెన్‌ కూరాకుల నాగభూషణంపై అవిశ్వాసం పెట్టి పదవిని లాగేసుకున్నారని విమర్శించారు. మరికొందరిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పోలింగ్‌కు ఇంకా ఎంతో సమయం లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పాలన తీరును అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై అప్పుడే వ్యతిరేకత మొదలైందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కేసీఆర్‌ను విస్మరించామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. కారుగుర్తుకు ఓటేసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. కచ్చితంగా ఇంకా మూడు రోజులు మాత్రమే ప్రచార సమయం ఉందని, ఈ మూడు రోజులు రేయింబవళ్లు కష్టపడి నామ గెలుపు కోసం కృషి చేయాలని వద్దిరాజు గులాబీ శ్రేణులను కోరారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఆరు నెలల కాలంలోనే పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన తీరును, వైఫల్యాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని సండ్ర బీఆర్‌ఎస్‌ శ్రేణులను కోరారు. ఈ మూడు రోజులు రేయింబవళ్లు కష్టపడి పార్లమెంట్‌కు నామ నాగేశ్వరరావును పంపించడానికి మనమంతా అవిరళ కృషి జరపాలన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాణిని వినిపించే సత్తా ఒక్క నామకే ఉందన్నారు. జిల్లావాసి, అందరికి సుపరిచితుడని, నామను గెలిపించుకోవడం ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

]]>
ప్రశ్నించే గొంతుకను పార్లమెంటుకు పంపాలి https://navatelangana.com/the-voice-of-questioning-should-be-sent-to-parliament/ Wed, 08 May 2024 20:06:13 +0000 https://navatelangana.com/?p=286610 – బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించండి
– వద్దిరాజు రవిచంద్ర, నామ, సండ్ర, పిలుపు
నవతెలంగాణ-కల్లూరు
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రతిపక్షంపై నోరు పారేసుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రజలను కోరారు. బుధవారం స్థానిక లక్కినేని రఘు గృహ వద్ద ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ చెప్పే మాటలన్నీ మోసాలేనని, వంద రోజులు దాటిన అమలు కానీ 6 గ్యారంటీ మాటేమిటంటే వారు ప్రశ్నించారు. బస్సు, గ్యాస్‌, విద్యుత్తు ఇస్తే ఇచ్చిన హామీలన్నీ పూర్తయినట్లేనా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయని వాటి పరిస్థితి ఏమిటి అంటూ నిలదీశారు. రైతుబంధు వేస్తున్నట్లు ప్రకటించి కుంటి సాకుతో ఎలక్షన్‌ కమిషనర్‌ వద్దన్నారని ఆపటం ఇది రేవంత్‌ పని కాదా అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను అమలు కాని హామీల గురించి కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో ప్రజలకు వివరించాలన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నామ నాగేశ్వరావు గెలిపించాలంటే కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలను కోరాలని కార్యకర్తలు కోరారు. పక్క లోకల్‌ అని నిత్యం ప్రజల మధ్యనే ఉంటాడని ప్రజల సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తారని అలాంటి ప్రశ్నించే గొంతుకు పార్లమెంటుకు పంపాలంటే సమిష్టిగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఖమ్మంలో నామ ని గెలిపించి కేసీఆర్‌ కి కానుక ఇద్దామని అందుకు మీ అందరి సహకారం అవసరమని ఇక మిగిలింది నాలుగు రోజులైనా ఈ నాలుగు రోజులు సమిష్టిగా ప్రచార కార్యక్రమంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేయమని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కట్ట అజరు కుమార్‌, లక్కీనేని రఘు, పెద్ద బోయిన మల్లేశ్వరరావు, స్థానిక నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలంటూ అమలుగాని హామీలతో మోసం
కారేపల్లి: ఆరుగ్యారంటీలు అంటూ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్‌ ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు లు విమర్శించారు. మంగళవారం రాత్రి కారేపల్లిలో జరగాల్సి రోడ్‌ షో వర్షంతో రద్దు అయింది. రోడ్‌ షోకు వచ్చిన టీడీపీ శ్రేణులు చెల్లచెదురైనారు. అయినా నామా రోడ్‌ షో కోసం కార్యకర్తలు తడుస్తూనే కారేపల్లిలో వేచి ఉన్నారు. కారేపల్లిలోని అంబేద్కర్‌ సెంటర్‌ లో కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసిఆర్‌ కుందన్నారు. ధాన్యాగారంగా బాసిల్లిన తెలంగాణను కరువురాష్ట్రంగా మారుస్తున్నారన్నారు. రైతుల ధాన్యానికి రూ.500 బోనస్‌ బోగస్‌గా మార్చారన్నారు. కళ్యాణలక్ష్మిలో తులం బంగారం, యువతులకు స్కూటీలు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వీ 420 హామీలు తప్ప ప్రజలకు ఇచ్చేవి కావన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని దానిలో బీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించనుందన్నారు. స్ధానికుడిని గెలిపించుకోని అభివృద్ధికి బాటలు వేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షకులు ఆర్‌జెసి.కష్ణ, వైరా నియోజకవర్గ ఇంచార్జ్‌ బానోతు మదన్‌లాల్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, ఎంపీపీ మాలోత్‌ శకుంతలకిశోర్‌, జడ్పీటీసీి వాంకుడోత్‌ జగన్‌, మాజీ జడ్పీటీసీ ఉన్నం వీరేంధర్‌, నాయకులు హన్మకొండ రమేష్‌, గౌసుద్దీన్‌, డొంకెన రవీందర్‌, అడపా పుల్లారావు, జూపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

]]>
నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి https://navatelangana.com/cash-and-liquor-smuggling-should-be-stopped/ Wed, 08 May 2024 20:03:19 +0000 https://navatelangana.com/?p=286609 – పోలింగ్‌ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి
– ఎస్పీ రోహిత్‌ రాజు
నవతెలంగాణ-ఇల్లందు
పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు, మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని, పోలింగ్‌ పూర్తయ్యే వరకు చెక్పోస్టుల వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు ఆదేశించారు. ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం నందు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన అంతర్‌ జిల్లా సరిహద్దు చెక్పోస్టులను బుధవారం తనిఖీ చేశారు. బొమ్మనపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద,ఇల్లందు లలితాపురం చెక్‌ పోస్ట్‌లను తనిఖీ చేసి సింగరేణి ఎయిడెడ్‌ హై స్కూల్‌ నందు స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్పోస్టుల వద్ద పనిచేసే అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. పోలింగ్‌ పూర్తయ్య వరకు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా జరిగే నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా అధికారులు భాద్యతగా వ్యవహారించాలన్నారు. అనంతరం ఇల్లందు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోలింగ్‌ స్టేషన్లు, రూట్‌ మ్యాప్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను పూర్తిచేసినట్లు ఈ సందర్బంగా ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను, సీఐ కరుణాకర్‌, ఎస్బి ఇన్స్‌పెక్టర్‌ నాగరాజు, ఎస్సై సందీప్‌, సిబ్బంది పాల్గోన్నారు.

]]>
మతోన్మాద బీజేపీని ఓడించాలి https://navatelangana.com/the-bigoted-bjp-should-be-defeated-6/ Wed, 08 May 2024 20:02:04 +0000 https://navatelangana.com/?p=286600 – సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
మతోన్మాద బీజేపీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. బుధవారం ములకలపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ(ఎం) మండల స్థాయి జనరల్‌ బాడీ సమావేశంలో ఆకయన పాల్గొని మాట్లాడారు. అనేక వాగ్దానాలు చేసి గత తొమ్మిది సంవత్సరాలుగా దేశంలో అధికారంలోఉన్న బీజేపీ ప్రజాసమస్యలు గాలికి వదిలేసి సంపన్న వర్గాల జపం చేస్తూ ఈ దేశంలో పేదరికాన్ని పెంచి పోషించిందన్నారు. సగటు పేదవాడి ఆర్థిక పరిస్థితి మనుపెన్నడూలేనంతగా దిగజారి పోయిందని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంటే భారత్‌ వెలిగి పోతుందని బీజేపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉండటంకోసం పెట్టుబ డిదారులకు రాయితీలు కల్పిస్తూ వారు ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చే లక్షల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి వెళ్తుందన్నారు. కాబట్టి దేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా అమలు జరగాలంటే ఇండియా కూటమి నుండి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో పార్టీ శ్రేణులు అగ్రభాగంలో ఉండి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.పుల్లయ్య, మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నాయకులు పొడియం వెంకటేశ్వర్లు, గౌరి నాగేశ్వరరావు, వీ.రవికుమార్‌, రావుజా, వీరస్వామి, ఆదినారాయణ, రాంమూర్తి సారయ్య, లక్మినర్సయ్య తిరుపతమ్మ, వెంకటేశ్వర్లు, వెంకట నర్సమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

]]>
విత్తనాల కొరత లేకుండా చూడాలి https://navatelangana.com/see-that-there-is-no-shortage-of-seeds/ Wed, 08 May 2024 20:00:49 +0000 https://navatelangana.com/?p=286597 – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా
నవతెలంగాణ-పాల్వంచ
రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లాలో రాబోయే వర్షాకాలం సీజన్‌కు సంబంధించిన విత్తనాలు, ఎరువుల ఏర్పాటు ప్రణాళిక సమాయక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా మాట్లాడుతూ జిల్లాలో సాగు విస్తీర్ణం ఆధారంగా కావాల్సిన పత్తి, మొక్కజొన్న మరియు మిర్చి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. విత్తనాల కొరత లేకుండా చూడాలని, పత్తి విత్తనాలను గరిష్ట అమ్మకం ధర 864 /- ప్యాకెట్‌ చొప్పున మాత్రమే అమ్మాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను అమ్మినట్లు తెలిస్తే సంబంధిత డీలర్లపై చట్టవరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు నాణ్యమైన విత్తనాలను రైతులు సాగు చేసేలా రైతు వేదికలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. రాబోయే వాన కాలంలో సాధారణ వర్షపాతం నమోదయ అవకాశాలు ఉన్నాయని, కావున సాగు విస్తీర్ణం పెరుగుతుందని దానికి అనుగుణంగా విత్తనాలను ప్రణాళికాబద్ధంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ, డీలర్లను ఆదేశించారు.
జిల్లాలో పత్తి 2,16,625 ఎకరాలలో, మొక్కజొన్న 60 వేల రెండు వందల ఎకరాల్లో మరియు మిరప 32 వేల 168 ఎకరాల్లో సాగు ప్రణాళిక ఉందని, దానికి అనుగుణంగా విత్తనాలతో పాటు ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డీలర్లు విత్తనాలను అమ్మేటప్పుడు రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని సూచించారు. రైతులు లూజుగా విత్తనాలను, గు డ్డ సంచుల్లో విత్తనాలను కొనుగోలు చేయరాదని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల నమూనాలను సేకరించి విశ్లేషణ ప్రకారం విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో చెరువులలో పుడుక తీసిన మట్టిని పంటచేయులకు వాడుకునే లాగా రైతులను అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి సూర్యనారాయణ, జిల్లా సహకార శాఖ అధికారి ఖుర్షీద్‌, జిల్లా డివిజన్‌ స్థాయి వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, మరియు విత్తనాలు, ఎరువుల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

]]>
అమరవీరుల స్ఫూర్తితో…అలనాటి ఉద్యమ జ్ఞాపకాల యాదిలో… https://navatelangana.com/in-the-yadi-of-the-memories-of-the-movement-of-that-time-with-the-spirit-of-the-martyrs/ Wed, 08 May 2024 19:59:52 +0000 https://navatelangana.com/?p=286592 – రంపచోడవరం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకై కదిలిన తెలంగాణ బందం
– ముంపు మండలాలలో సీపీఐ(ఎం) తెలంగాణ నేతల ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్టుల కంచుకోటగా పిలవబడిన పూర్వపు భద్రాచలం డివిజన్‌లో ఆనాటి ఉద్యమాల జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ రంపచోడవరం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి లోత రామారావు గెలుపుని కాంక్షిస్తూ పూర్వపు భద్రాచలం డివిజన్‌ ఉద్యమ నాయకులు ముంపు మండలాలలో విస్తతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సీపీఐ(ఎం) నుండి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 13న జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఇండియా బ్లాక్‌ బలపరుస్తున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి లోత రామారావు, సీపీఐ(ఎం) అరకు పార్లమెంటు అభ్యర్థి పాచిపట్ల అప్పలనర్సుల గెలుపుని కాంక్షిస్తూ మన్నెంలో ఉద్యమ ఓనమాలు నేర్చుకున్న పూర్వపు భద్రాచలం డివిజన్‌ నాయకులు ప్రస్తుత సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌, భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, నాయకులు ఎంబీ. నర్సారెడ్డి బండారు శరత్‌ బాబు, ఎర్రంశెట్టి వెంకట రామారావు, నాదెండ్ల లీలావతి, డీ.సీతాలక్ష్మిలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు మండలపు జ్యోతి, కే.సత్యాలు విస్తతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని చింతూరు వీఆర్‌ పురం కూనవరం ఎట్టపాక మండలాలలో భద్రాచలం డివిజన్‌ నాయకులకు విడదీయలేని ఉద్యమ అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. తునికాకు పోరాటాలైన పోలవరం వ్యతిరేక ఉద్యమాలైన ఆదివాసి హక్కుల సాధనాలైనా ఈ ప్రాంత ఉద్యమ సరళిని అణువణువునా తెలిసిన బండారు రవికుమార్‌ కూనవరం వీఆర్‌ పురం చింతూరు మండలాలలో పాతతరం నాయకుల చరిత్రలను తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన బండారు చందర్‌రావు, భీష్మారావు, శ్యామల, వెంకటరెడ్డి, టివిఆర్‌ చంద్రం, పులి రామయ్య, మడివి ముకయ్యలతోపాటు మచ్చలేని ప్రజాప్రతినిధులైన కుంజా బుజ్జి సున్నం రాజయ్య చరిత్రను ఈ నేటితరం యువతకు తెలియపరుస్తూ గిరిజన సంస్కతి సంప్రదాయాలను అద్దం పట్టేలాగా ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం డివిజన్‌ నుండి పార్టీ పట్టుకొమ్మలుగా ఉన్న నాలుగు మండలాలు ఆంధ్రలోకి వెళ్లినప్పటికీ ఆ ప్రాంత ప్రజలతో ఆ ప్రాంత నాయకులతో వీరుకున్న అనుబంధాన్ని సంబంధాన్ని నెమరేసుకుంటూ ఎన్నికల కథనరంగంలో రంపచోడవరం నియోజక వర్గంలో ఎర్రజెండాను ఎగిరేసేందుకు శక్తి వంచన లేకుండా కషి చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ వైఫల్యాలతో పాటు ఈ ప్రాంతానికి ఎన్డీఏ కూటమి చేసిన అన్యాయ ఫలితంగా సీపీఐ(ఎం)కి అంతకంతకు ప్రజల నుండి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఈ ఎన్నికలలో ఎర్రజెండా రెపరెపలాడటం ఖాయమని స్పష్టమవుతుంది. సీపీఐ(ఎం) నిలబెట్టిన లోత రామారావు సైతం ప్రజా ఉద్యమాలలో రంపచోడవరం పరిధిలో ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి కావడంతో ఎన్నికలలో సీపీఐ(ఎం) గెలుపు ఖాయమని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రాంతాలుగా విడిపోయిన ఉన్న ఉద్యమ సంబంధాలతో ఆదివాసి గిరిజన ప్రజల చెంతకు ఎర్రజెండాను తీసుకువెళ్లడం కోసం రాష్ట్ర సరిహద్దును దాటి సీపీఐ(ఎం) తెలంగాణ నేతలు చేస్తున్న కషిని అభ్యుదయ వాదులు అభినందిస్తున్నారు.

ప్రాంతాలుగా వేరైనా ఉద్యమ బంధాలు విడిపోవు..సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు
బండారు రవికుమార్‌
రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపు పేరుతో భద్రాచలం డివిజన్‌ని ముక్కలుగా విభజించి సీపీఐ(ఎం)కి ఉద్యమాల పట్టుకొమ్మగా ఉండే చింతూరు వీఆర్‌ పురం, కూనవరం, ఎట్టపాక మండలాలను భద్రాచలం డివిజన్‌తో విడదీసి నాటి తెలుగుదేశం, బీజేపీలు ఆంధ్రాలో కలిపినప్పటికీ ఈ ప్రాంత ప్రజలతో ఉన్న ఉద్యమ బంధాలను ఎప్పటికీ విడదీయలేరు. పూర్తి స్థాయిలో ఆదివాసి సంస్కతి, సంప్రదాయాలు కలిగిన నాలుగు మండలాల ఆదివాసి ప్రజల కోసం బండారు చందర్‌రావు, భక్తుల భీష్మారావు, శ్యామల వెంకటరెడ్డి, పులి రామయ్య, మడివి నూకయ్య వంటి సీపీఐ(ఎం) ఉద్యమ నిర్మాతలు, నక్సలైట్లతో పోరాడి తమ ప్రాణాలర్పించిన చరిత్ర సీపీఐ(ఎం)కే ఉంది. పోరాటాలతో పాటు ఈ ప్రాంత సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు నిస్వార్థ పాలన ఫలితంగానే నాలుగు మండలాల అభివద్ధి అన్న విషయం ఈ ప్రాంత ప్రజలకు తెలియంది కాదు. సీపీఐ(ఎం) త్యాగాలను స్మరిస్తూ ఈ నెల 13 న జరిగే ఎన్నికల ప్రచారం ఉద్యమ పందాలు కొనసాగుతుంది. ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణను చూస్తే కచ్చితంగా మరోసారి మన్యంలో ఎర్రజెండా రెపరెపలాడటం ఖాయమని స్పష్టమవుతుంది.

]]>
పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి https://navatelangana.com/all-facilities-should-be-provided-in-polling-centers/ Wed, 08 May 2024 19:51:33 +0000 https://navatelangana.com/?p=286587 – జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ప్రియాంక అలా
నవతెలంగాణ-పాల్వంచ
పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ప్రియాంక అలా అధికారులకు సూచించారు. బుధవారం జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంఈఓ లు, ఎంపీ ఓలు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈ ఈ, పోలింగ్‌ కేంద్రాలు నిర్వహించుచున్న గ్రామ సెక్రెటరీలతో జిల్లా కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 13న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంటు, మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, టాయిలెట్స్‌, రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యం విధిగా ఏర్పాటు చేయాలని అందరూ ఎంపీడీవోలను ఆదేశించారు.
కొన్ని గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ఇంకా పురో గతిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి చేసి ఓటర్లు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, పనులను పూర్తి చేసి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో రిపేర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో చేపట్టాలని, తాత్కాలిక మరమ్మత్తులు చేయరాదని హెచ్చరించారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వర్క్స్‌ జరుగుతున్న చోట చెరువుల నుండి సారవంతమైన మట్టిని రైతుల పొలాలలో ఉపయోగించుకొనుటకు వారి సొంత ఖర్చులపై మట్టి తీసుకువెళ్లలని అట్టి రవాణాకు గ్రామ కార్యదర్శి ఎక్కడ నుంచి మట్టి తీసి వెళుతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయం రసీదు ద్వారా తెలియజేస్తూ పంపాలని ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా ట్రాక్టరు మట్టి రవాణా అక్రమ మార్గం ద్వారా జరుగుతున్నది అని పట్టుపడితే దానికి పంచాయితీ కార్యదర్శి పూర్తి బాధ్యతలు వహించవలసి ఉంటుందని, అతనిపైచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఉపాధి హామీ పథకం పనులు జరిగే చోట ఎటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని, ప్రచారం చేయడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలను అనుమతించరాదని పనులు పూర్తయ్యాక సాయంత్రం సమయంలో ప్రచారం నిర్వహించవలసిందిగా వారిని కోరాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది అందరూ విధిగా ఎన్నికల నియామవళి ఆచరించి విధులు చేయాలని పోలింగ్‌ అనంతరం జూన్‌ 5 వరకు ఎన్నికల నియమావళి ఉన్నందున అందరూ జాగ్రత్తగా తమ విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యా చందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో మహిళలు మూల స్తంభాలు
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో మహిళలు మూల స్తంభాలు అని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ప్రియాంక అలా అన్నారు. బుధవారం ఐ డిఓసి కార్యాలయంలో డిఆర్డిఓ, డిడబ్ల్యుఓ, మెప్మా వారి సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్‌ అవేర్నెస్‌ ప్రోగ్రాం లిస్వీప్‌లి ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళల అందరితో ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, దీనిని గమనించి అర్హులైన మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా, మెరుగైన భవిష్యత్తు కోసం సమర్థవంతమైన నాయకులకు ఓటు వేయాలని ఆమె సూచించారు. అందుకే పోలింగ్‌ రోజైన మే 13ను సెలవుదినంగా ప్రకటించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా100 మంది మహిళలతో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, మెప్మా మహిళలు, ఐసిడిఎస్‌, ఐడిఓ సి లోని మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న అభ్యర్థులను కలెక్టర్‌ అభినందించారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమముకు జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి సులోచన రాణి, బీసీ వెల్ఫేర్‌ అధికారి ఇందిరా, ఎస్సీ డెవలప్మెంట్‌ అధికారి అనసూయ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం పోటీలలో గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డిఓ విద్యాచందన, టిడబ్ల్యూఓ విజేత, పరిపాలన అధికారి గన్యా, మెప్మా పిడి రాజేష్‌, డిఆర్డిఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

]]>
మేము ఓటు వేయము… వెలసిన ప్లెక్సీలు https://navatelangana.com/we-dont-vote-for-faded-plexiglass/ Wed, 08 May 2024 19:50:32 +0000 https://navatelangana.com/?p=286586 – సమస్యలు తీర్చకుంటే ఓటు వేసేది లేదుంటున్న గిరిజనులు
నవతెలంగాణ-కొత్తగూడెం
మా సమస్యలు పరిష్కరించని ప్రభుత్వాలకు మేమెందుకు ఓటు వేయాలి….? అని ఏజెన్సీ గిరిజనులు అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మేము పాల్గొనమని, పవిత్రమైన మా ఓటు వేయమని స్పష్టం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, గరిమెలపాడు చెందిన గిరిజనులు తమ ఓటు హక్కు వినియోగించుకోమని, మేము ఓటు వేయమని స్పష్టం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గరిమెళ్ళ పాడు ప్రజల సమస్యలు తెలుసుకుందామని ప్రయత్నం చేసింది. కానీ గత ప్రభుత్వాలు అన్యాయం చేశాయని…. ఎన్నిసార్లు విన్నవించుకున్నా పరిష్కారం చేయలేదని గిరిజనులు వాపోతున్నారు. వారు నివాసం ఉండడానికి కనీసం ఇంటి స్థలం కూడా కేటాయించని ప్రభుత్వాలకు మేమెందుకు ఓటు వేయాలని వారు మండిపడుతున్నారు. గత ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చాయని, పరిష్కరించకుండానే నిర్లక్ష్యం చేశాయని ఆరోపిస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాలో… ఏజెన్సీ మండలంలో… ఏజెన్సీ వాసులమైన మమ్మల్ని అధికారులు ప్రతిసారి మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు అన్యాయం చేస్తున్నారని గరిమెళ్ళ పాడు ఆదివాసి గిరిజనులు ఈసారి ఓటు వేయమంటూ నిరసన బాట పట్టారు. గరిమెలపాడులో ఐటీడీఏ ఏర్పాటు చేసిన నర్సరీ భూములు ఆదివాసి గిరిజనలు నుండే తీసుకున్నారని, ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాల్సిన పరిహారాలు నేటికీ చెల్లించకపోవడం, వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఉపాధి ఇవ్వడం లేదని అంటున్నారు. కనీసం నివాసాలు ఉండడానికి కూడా ఏజెన్సీ భూముల్లో గుడిసెలు వేసుకుంటే పీకి వేస్తున్నారని, భూమి హక్కులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా యంత్రాంగం, అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెళ్ళపాడు ఆదివాసి గ్రామాన్ని గురువారం సందర్శించనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఇదే విధంగా ఓటు వేయమని నిరసన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆనాటి జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వాపోతున్నారు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు గరిమెళ్ళ పాడు ఆదివాసి గిరిజనుల మొరపెట్టుకున్న పరిష్కారం లేకుండా పోయిందని అంటున్నారు. ఐదేళ్ల తర్వాత మరోసారి సమస్యల పరిష్కారం కోసం ఓటును బహిష్కరించి నిరసన బాట పట్టిన గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని మేధావులు, ప్రజలు, పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

]]>