Main News Archives - https://navatelangana.com/category/main-news/ Wed, 08 May 2024 08:31:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Main News Archives - https://navatelangana.com/category/main-news/ 32 32 ఆ జనం తెలంగాణలో మోడీ రోడ్‌షోకు వచ్చినవారు కాదు..అసలు నిజం ఇది https://navatelangana.com/the-real-truth-is-that-those-people-did-not-come-to-modis-roadshow-in-telangana/ Wed, 08 May 2024 07:32:25 +0000 https://navatelangana.com/?p=286011 నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని కొల్లాపూర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన రోడ్‌షోకు హాజరైన జనమంటూ వాట్సాప్‌లో ఇటీవల ఓ ఫొటో వైరల్ అయింది. అందులో ఇసుకేస్తే రాలనంతమంది జనం ఉన్నారు. వీరంతా డబ్బు, మద్యం పంచడం వల్ల రాలేదని, దేశం మీద ప్రేమ, మోడీ అభివృద్ధి మీద నమ్మకం ఉండడం వల్లే వీరంతా హాజరయ్యారంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. అయితే, ఈ ఫొటోపై ‘ఫ్యాక్ట్ చెక్’ చేయగా బోల్డన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా గుజరాత్‌ ప్రజలు తెలుపుతున్న నిరసన’ అంటూ ఇదే ఫొటోను వాడుకున్నారు. నిజమేంటంటే.. ఈ ఫొటో మోడీ రోడ్‌షోదీ కాదు.. గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనకు సంబంధించినది కూడా కాదు. ఇదే ఫొటో 12 మే 2008లో ‘ఫ్లికర్’ వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది. ఈ ఫొటో చైనాలోని గ్వాంగ్జౌలోనిది. చైనాలో నిర్వహించిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఒలింపిక్ టార్చర్‌ను తీసుకెళ్తున్నప్పటి ఫొటో ఇది.

]]>
తడిసిన ధాన్యం కొంటాం..పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : మంత్రి పోన్నం https://navatelangana.com/we-will-buy-stained-grain-and-help-the-farmers-who-lost-their-crops-said-the-minister/ Wed, 08 May 2024 04:49:41 +0000 https://navatelangana.com/?p=285982 నవతెలంగాణ-హైదరాబాద్ : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా సివిల్ సప్లయ్స్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడానని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వర్షం కారణంగా మంగళవారం కరీంనగర్​లో కాంగ్రెస్ సభ రద్దు కావడంతో సభా వేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్​ను గెలిపించాలి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఓటింగ్​తోనే బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది. అందుకే ప్రధాని మోదీ రెచ్చగొట్టేలా దిగజారి మాట్లాడుతున్నరు. తాళిబొట్టు అమ్మి నామినేషన్ వేసిన బండి సంజయ్​కి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినయ్? దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే సంజయ్.. కరీంనగర్​లోని ఆలయాల కోసం ఏం చేశాడు?’’అని పొన్నం నిలదీశారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగితే సంజయ్ ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు. సంజయ్ లాంటి మూర్ఖుడు ప్రజాస్వామ్యానికి పనికి రాడని విమర్శించారు. పొన్నం వెంట కరీంనగర్ లోక్​సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

]]>
ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ https://navatelangana.com/a-huge-setback-for-the-bjp-government-at-the-time-of-the-election/ Wed, 08 May 2024 04:43:54 +0000 https://navatelangana.com/?p=285979 నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానాలోని అధికార బీజేపీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌సింగ్ సైనీ సారథ్యంలోని ప్రభుత్వం మైనార్టీలో పడింది. మద్దతు వెనక్కి తీసుకున్న సోంబిర్ సంగ్వాన్, రణ్‌ధీర్ గోలెన్, ధర్మ్‌పాల్ గోండెర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్‌కేనని ప్రకటించి బీజేపీని ఇరకాటంలో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్‌భానుతో కలిసి రోహ్‌తక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది మాత్రమే ఉన్నారని, వారిలో బీజేపీ సభ్యులు 40 మంది మాత్రమేనని తెలిపారు. ఇటీవలి వరకు మద్దతిచ్చిన జేజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఉపసంహరించుకున్నారని, ఇప్పుడు తాము కూడా మద్దతును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో ఆయన రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఇక ఒక్క నిమిషం కూడా ఉండేందుకు అర్హుడు కాదని పేర్కొన్నారు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

]]>
బేగంపేట నాలాలో కొట్టుకు వచ్చిన రెండు మృత దేహాలు https://navatelangana.com/two-dead-bodies-washed-up-in-begumpet-canal/ Wed, 08 May 2024 02:53:12 +0000 https://navatelangana.com/?p=285972 నవతెలంగాణ-బేగంపేట్ : హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బేగంపేట లోని నాలాలోకి రెండు మృత దేహాలు కొట్టుకుని వచ్చాయి. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి. బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నీ అనుకుని కూకట్ పల్లి నాలా. అమీర్ పేట నాలాలు ప్రవహిస్తుంటాయి. అయితే మంగళ వారం రాత్రి కురిసిన వర్షాలకు ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు నాలాలో కొట్టుకుని వచ్చాయి. వీరు ప్రమాద వశాత్తూ నాలాలో పడి చనిపోయారా లేక రోడ్లపైనే వుండే మ్యాన్ హోల్స్ నీ గుర్తించలేక అలా అక్కడ పడిపోయి నాలా లోకి చేరుకున్నారా ఆన్న విషయాలు తెలియరాలేదు .మృతి చెందిన వారి వయస్సు సుమారు 40నుంచి 45సంవత్సరాలు వుంటుందని ప్రత్యక్ష సాక్షుల సమాచారం.తెల్లారే సరికి నాలా లో రెండు మృతదేహాలు కొట్టుకుని రావడం తో ఓల్డ్ కస్టమ్స్ బస్తీ వాసులు బేగంపేట పోలీసులకు సమాచారం అందించారు.ఎస్సై జయచందర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

]]>
హైదరాబాద్ లో ఘోరం..అపార్ట్మెంట్ గోడ కూలీ ఏడుగురు మృతి https://navatelangana.com/seven-killed-in-hyderabad-apartment-wall-collapse/ Wed, 08 May 2024 02:01:12 +0000 https://navatelangana.com/?p=285957 నవతెలంగాణ-హైదరాబాద్ : మంగళవారం సాయంత్ర నుంచి రాత్రి వరకు మహానగరం హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. వేసవి సమయంలో కురిసిన ఈ అకాల వర్షానికి హైదరాబాద్ బాచుపల్లి లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలిపోయింది. దీంతో ఏడుగురు కార్మికులు గొడవ కింద చిక్కుకుని మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. అలాగే మృతులు తిరుపతి (20), శంకర్ (22), రాజు (25), ఖుషి రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు(4) గా పోలీసులు గుర్తించారు. కాగా మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకు తీసి క్షతగాత్రులను పోస్టుమార్టం నిమిత్తం బాచుపల్లి మమత ఆస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఓ మహిళ నాలుగు సంవత్సరాల బాలుడు ఉన్నారు.

]]>
ఏమిచ్చినవో చెప్పి వరంగల్‌కు రా.. https://navatelangana.com/come-to-warangal-saying-what-you-have-been-given/ Tue, 07 May 2024 21:54:00 +0000 https://navatelangana.com/?p=285850 Tell me what was given Come to Warangal..– మోడీకి సీఎం రేవంత్‌ సవాల్‌
– ఎయిర్‌పోర్ట్‌, ఓఆర్‌ఆర్‌ ఏమైనరు..?
– కడియం కావ్యను లక్ష మెజారిటీితో గెలిపించాలి : హన్మకొండ, వరంగల్‌లో రోడ్‌షోలు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఏం అభివృద్ధి చేసినవో చెప్పినంకనే వరంగల్‌కు రావాలని ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరంగల్‌లో విమానాశ్రయాన్ని పునరుద్ధ రించలే.. అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించలే.. కాజీపేటకు మంజూరైన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని లాతూర్‌కు తరలించి చివరకు కాజీపేట రైల్వే జంక్షన్‌ను రద్దు చేసే పరిస్థితికి తీసుకొచ్చిండు.. వీటిపై సమాధానం చెప్పినంకనే వరంగల్‌కు రావాలని అన్నారు. మంగళవారం సాయంత్రం హన్మకొండ చౌరస్తాలో హన్మకొండ డీసీసీ అధ్యక్షులు, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రోడ్డుషోలో సీఎం ప్రసంగించారు. ప్రధాని మోడీ వరంగల్‌కు ఎన్ని కోట్ల నిధులిచ్చిండ్రో చెప్పాలన్నారు. వేయిస్తంభాల గుడికి ఏం గుర్తింపు ఇచ్చిండ్రు ? ఏం ఇవ్వకుండా బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి ? అని ప్రశ్నించారు. బిడ్డకు బెయిల్‌ ఇప్పించుకునేందుకు కార్యకర్తలను ఫణంగా పెట్టి బీజేపీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌ నుంచి ఒక నేతను బయటకు పంపి ఆ నేతకే బీజేపీ టికెట్‌ ఇచ్చి పోటీ చేయిస్తుందన్నారు. డిసెంబర్‌లో కేసీఆర్‌ను ప్రజలు బండకేసి కొట్టినా ఆయనలో మార్పు రాలేదన్నారు. కారు షెడ్డుకు పోయిందని, దీంతో కేసీఆర్‌ బస్సులో బయల్దేరిండన్నారు. వరంగల్‌ నగరాన్ని రెండో రాజధానిలా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ అంచనాలను రివైస్‌ చేసి పంపించాలని సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను పునరుద్ధరిస్తామన్నారు. ప్రధాని మోడీ పరిశ్రమలన్నీ గుజరాత్‌కు తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను 10 ఏండ్లలో నెరవేర్చలేదని, మాజీ సీఎం కేసీఆర్‌ కూడా అడగలేదని ఆరోపించారు. అందుకే ఈ ఎన్నికలు తెలంగాణ, గుజరాత్‌ మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. మొన్న డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్‌ మ్యాచ్‌ అయితే, పార్లమెంటు ఎన్నికలు ఫైనల్‌ మ్యాచ్‌ అన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ను డకౌట్‌ చేయాలన్నారు. ఢిల్లీ సుల్తానులను ఎదిరించిన గడ్డ కాకతీయ గడ్డ.. ఇప్పుడు ఒకపక్క మోడీ.. అమిత్‌ షా, మరోపక్క రాహుల్‌.. రేవంత్‌రెడ్డి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. ఈ పోరాటంలో కాకతీయుల వారసులైన మీరు నా పక్క వుండి గుజరాత్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. తులసివనంలో గంజాయి మొక్కలా ఒక పక్క ఎర్రబెల్లి, మరోపక్క ‘అరూరి’ అనకొండ వున్నారని, భూమి కనిపిస్తే అనకొండలా మింగుడేనని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ వేర్వేరు కాదని, రెండూ కలిసి దొంగ దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నాయని అన్నారు.

]]>
స్కూటీలు రాలే.. లూటీలు షురూ https://navatelangana.com/scooties-are-coming-and-looting-is-happening/ Tue, 07 May 2024 21:50:33 +0000 https://navatelangana.com/?p=285843 KCR is the leader of BRS– పాత పథకాలే అమలు చేస్తలే..
– ఒట్టు పెట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడే రేవంత్‌ పని
– బీజేపీ.. దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీ
– మత విద్వేషం, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే ఆ పార్టీ పని
– మోడీ మళ్లీ వస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ‘400 పార్‌’
– తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం కాపాడేది బీఆర్‌ఎస్సే.. : కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
నవతెలంగాణ-కామారెడ్డి
‘అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్‌ కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తే దానికి అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా..? చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తమన్నారు. స్కూటీలు రాలే కానీ లూటీలు మొదలైయ్యాయి’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం రోడ్‌షో, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘9వ తేదీ లోగా రైతుబంధు వేస్తాం అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయనే కుట్ర చేసి, ఎన్నికల కమిషన్‌కు చెప్పి బంద్‌ చేయించిండు’ అని ఆరోపించారు. ”కరెంటు వస్తుందా..? పొలాలు ఎండుతున్నాయి.. కేసీఆర్‌ ఉన్నప్పుడు ఉన్న కరెంటు ఇప్పుడు ఎక్కడికి పోయింది. మంచినీళ్లు వస్తున్నాయా..? భగీరథతో బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చాం. మరి ఇప్పుడు ఏమైంది. ధాన్యం కొంటున్నారా..? వరికి బోనస్‌ బోగస్‌ అయింది. ఊర్లకు పోవుడు.. ఒట్లు పెట్టుడు కేసీఆర్‌ను తిట్టుడే రేవంత్‌రెడ్డి పని అయింది. పని చేసే సిపాయి ఎక్కడైనా ఒట్టు పెడతాడా..?” అని ప్రశ్నించారు.
అబ్‌కి బార్‌.. పెట్రోల్‌ డీజిల్‌ ‘400 పార్‌’
‘దేశ ప్రధానిగా మోడీ పదేండ్లుగా పని చేసిండు. 150 హామీలు ఇచ్చిండు. ఒక్క హామీ నెరవేరిందా..? సబ్‌కా వికాస్‌ అంటూ సబ్‌కా సత్యనాశ్‌ చేసిండు. ఎక్స్‌పోర్ట్స్‌ బంద్‌ అయ్యాయి. ఇన్‌పోర్ట్స్‌లు పెరిగాయి. మేకిన్‌ ఇండియా.. డిజిటల్‌ ఇండియా అన్నాడు. ఏమైనా జరిగిందా..?’ అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు జరగలేదని, రూపాయి విలువ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి కృష్ణా, గోదావరి నదుల నీళ్లను ఇతర రాష్ట్రాలకు తరలించుకోవాలని చూస్తోందని చెప్పారు. ‘అబ్‌కి బార్‌ 400 పార్‌ అని మోడీ అంటున్నాడు. ఈసారి మోడీ వస్తే పెట్రోల్‌, డీజిల్‌ 400 పార్‌ అవుతాయి’ అని అన్నారు. బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీయే తప్ప.. అది పేదల పార్టీ కాదని అన్నారు. తెలంగాణకు ఏనాడూ ఒక్క మంచి పని నరేంద్ర మోడీ చేయలేదని విమర్శించారు. పైగా తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి.. బిడ్డను బతికించారని ఓ దిక్కుమాలిన మాట మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతసేపూ మతవిద్వేషం.. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, గందరగోళం చేసుడే తప్ప.. ఏ ఒక్క మంచి పని ప్రజలకు చేసింది లేదని విమర్శించారు. అందువల్ల బీజేపీకి ఓటు వేసినా వేస్టే అని, ప్రజలకు ఏం లాభం జరగదని అన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే రానుందని, బీఆర్‌ఎస్‌కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే కేంద్రంలో కీలకం అవుతామని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం కాపాడేది బీఆర్‌ఎస్సేనని, కాంగ్రెస్‌ ఇచ్చిన పథకాలు మెడలు వంచి అమలు చేసే బాధ్యత బీఆర్‌ఎస్‌ తీసుకుంటుందని అన్నారు. కావునా లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంపగోవర్ధన్‌, జాజాల సురేందర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు ముజిబుద్దీన్‌ తదితరులున్నారు.

]]>
భారీ వర్షం.. నీళ్లపాలైన ధాన్యం https://navatelangana.com/heavy-rain-waterlogged-grain/ Tue, 07 May 2024 21:45:38 +0000 https://navatelangana.com/?p=285846 Heavy rain.. waterlogged grain– ఈదురుగాలుల బీభత్సం
– పలుచోట్ల వడగండ్లు
– విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
– సిద్దిపేట జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
– హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన
నవతెలంగాణ- విలేకరులు
ఎండ, వడగాడ్పులతో మధ్యాహ్నం వరకు ఉక్కిరిబిక్కిరి చేయగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో ఈదురు గాలులు.. ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ వడగండ్లు, పిడుగులు పడ్డాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. సిద్దిపేటలో పిడుగుపాటుకు రైతు మృతిచెందాడు. కల్లాల్లోని ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వర్షం వల్ల సాయంత్రం జరగాల్సిన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార సభలు రద్దయ్యాయి. హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది.
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వడగండ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీళ్లపాలైంది. రాయికల్‌, కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో పిడుగుపాటుకు గేదె మృత్యువాత పడింది. వేములవాడ, జూలపల్లి గన్నేరువరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సుల్తానాబాద్‌, చొప్పదండిలో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్‌లోని వందల క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో జరగాల్సిన కాంగ్రెస్‌ జనజాతర సభ రద్దయింది.
ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దహెగాం మండల కేంద్రంలో తాటిచెట్టుపై పిడుగుపడి పూర్తిగా కాలిపోయింది. ఐనం, బీబ్రా, బోర్లకుంట తదితర గ్రామాల్లో గాలి వానతో పాటు వడగండ్లు పడ్డాయి. బీబ్రా గ్రామంలో విద్యుత్‌ తీగలపై చెట్లు విరిగిపడగా.. తీగలు ఇండ్లపై పడ్డాయి. బోర్లకుంట గ్రామంలో బొందుగుల స్వామి ఇల్లు కూలింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. పెంచికల్‌పేట్‌ మండల వ్యాప్తంగా కల్లాల్లో ఉన్న వరిధాన్యం తడిచింది. బెజ్జూర్‌ మండలంలోని కుకుడ, ముంజంపెల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. కౌటాల మండలంలో నాగెపెల్లి గ్రామంలో పిడుగు పడి రైతు మోర్లె దస్రుకు చెందిన ఎద్దు మృత్యువాత చెందింది. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(కె), పల్లి(బి) గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌, మందమర్రి మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వరి ధాన్యం తడిసి పోయింది. వడగళ్ల వానకు కోత దశకు వచ్చిన వరిపైరు నేలకొరిగింది. మామిడి పంట నేలరాలింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, కాగజ్‌నగర్‌, కౌటాలా, సిర్పూర్‌(టీ) భారీ వర్షం కురిసింది.
తడిసి ముద్దాయిన ధాన్యం కుప్పలు
భూపాలపల్లి జిల్లా మహముత్తారం, గణపురం మండలాల్లో మోస్తరు వర్షాలు కురిసాయి. ధాన్యం గింజలు నేల రాలిపోయాయి. మామిడి కాయలు నేలరాలాయి. పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దవగా, కొన్నిచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల వ్యాప్తంగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. మల్హర్‌రావు మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులకు ఇరువైపులా చెట్లు విరిగి కరెంట్‌ తిగలపై పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిపిపోయింది. వరంగల్‌ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో ఈదురు గాలులకు మొక్కజొన్న పంటకు నిప్పు అంటుకొని దాదాపు 20 ఎకరాల వరకు పంట బూడిదైపోయింది. 10 ఎకరాలలో డ్రిప్‌ పైపులు పనికిరాకుండా కాలిపోయాయి. పంట విలువ దాదాపు రూ.10లక్షలు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట డివిజన్‌ పరిధిలో వర్షానికి పంటల నష్టం జరిగింది. వరంగల్‌ కాశీబుగ్గ సర్కిల్‌ పరిసర ప్రాంతంలో వర్షపు నీరు మోకాలు లోతు వరకు నిలవడంతో చెరువును తలపించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఖానాపూర్‌, చెన్నారావుపేట, పర్వతగిరి, రాయపర్తి, గీసుగొండలో ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో భారీగా వర్షం కురిసింది. రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. పొలాల్లో ఉన్న పశుగ్రాసం ఈదురు గాలులకు కొట్టుకుపోయింది. మామిడి కాయలు నేలరాలాయి.
హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌..!
జంటనగరాలైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు, డ్రైయినేజీలు పొంగి పొర్లాయి. పలు బస్తీలు, కాలనీలలో ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాహనాదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. సికింద్రాబాద్‌, చిలకలగూడ, మారేడుపల్లి, బోయిన్‌పల్లి, ప్యారడైజ్‌, ప్యాట్నీ, మలక్‌పేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, అల్వాల్‌, ఎల్బీనగర్‌, కాప్రా, సుచిత్ర జీడిమెట్ల, ముషీరాబాద్‌, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరదనీరు చేరగా.. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్‌లో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి ఐకీయా వరకు, ఖాజాగూడ చౌరస్తా నుంచి డీపీఎస్‌ వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షం, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా బంద్‌ అయింది. ఇదిలా ఉండగా నగరంలో కురిసిన భారీ వర్షంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ సమీక్షించారు.
పిడుగుపడి వ్యక్తి మృతి
సిద్దిపేల జిల్లా కుకునూర్‌పల్లి మండల కేంద్రంలో పిడుగుపడి వ్యక్తి మృతిచెందాడు. చెందిన సంఘటన కుకునూర్‌పల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. కుమ్మరి మల్లేశం(33) బర్రెల పాల పితకడం కోసం వ్యవసాయ బావి దగ్గరకి వేళ్లగా అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం పడింది. దాంతో మల్లేశం చెట్టుకిందకు వెళ్లాడు. చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగాలం కష్టపడిన రైతులు వర్షం వల్ల ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.

]]>
కష్టమే.. https://navatelangana.com/it-is-difficult/ Tue, 07 May 2024 21:41:18 +0000 https://navatelangana.com/?p=285839 It's difficult..– ప్రజా సమస్యలు ముందుకు.. వెనక్కి పోయిన హిందూత్వ
– కాలం చెల్లిన మెజారిటీవాద రాజకీయాలు
– మసకబారుతున్న మోడీ ప్రాభవం
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు దశల పోలింగ్‌ ముగిసింది. మరో నాలుగు విడతల పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఎన్డీఏ నేతలు కలలు కంటున్నట్లు 400కు పైగా స్థానాలు వచ్చే అవకాశాలు ఏ కోశానా కన్పించడం లేదు. మోడీ మానియా క్రమేపీ అదృశ్యమవుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మోడీ ఛరిష్మాకు కాలం చెల్లిందని రాజకీయ పండితులు తేల్చేశారు.
న్యూఢిల్లీ : బీజేపీ, దాని మిత్రపక్షాలకు 400కు పైగా లోక్‌సభ స్థానాలు వస్తాయని మోడీ గతంలో చెప్పే వారు. 2014, 2019 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం స్పష్టంగా కన్పించింది. అయితే ఇప్పుడది ఎక్కడా కానరావడం లేదు. ఓటర్లను ప్రభావితం చేసే ఏకైక అంశం కూడా ఏదీ లేదు. తాను అన్నింటికీ అతీతుడినని మోడీ భావిస్తారు. తనకు ఎదురే లేదని అనుకుంటారు. దేశాన్ని అమృతకాలంలోకి నడిపిస్తానని చెబుతారు. హిందూ మత పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా అసంపూర్తిగా నిర్మితమైన రామమందిరాన్ని అయోధ్యలో అట్టహాసంగా ప్రారంభించారు. తను ఏం చేసినా ప్రజల మద్దతు ఉంటుందని విశ్వసిస్తారు. బీజేపీ కూడా తదుపరి ప్రధాని మోడీయేననే ధీమాతో ఉంది. ‘మోడీకీ గ్యారంటీ’ పేరుతో ప్రధాని ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఉచితంగా ఆహారం, గృహవసతి, వంటగ్యాస్‌, కుళాయి నీరు వంటివి వాటిలో కొన్ని. అయితే క్రమంగా మోడీ, ఇతర బీజేపీ నేతల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతోంది. రెండో దశ పోలింగ్‌ ప్రచారం సందర్భంగా ప్రధానిలో అసహనం కన్పించింది. ఆయన తన ఎన్నికల ప్రసంగాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నారు. మైనారిటీలకు కాంగ్రెస్‌ కొమ్ము కాస్తోందని, హిందువుల సంపదను గుంజుకొని వారికి ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఓటర్ల మనోగతాన్ని పసిగట్టేందుకు పలువురు విశ్లేషకులు హిందీ రాష్ట్రాల్లో పర్యటించారు. 2019తో పోలిస్తే బీజేపీ బలం తగ్గుతుందని వారు తేల్చి చెప్పారు. 2019లో హిందీ బెల్ట్‌లో బీజేపీ గరిష్ట సంఖ్యలో స్థానాలు సాధించింది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో మెజారిటీవాద రాజకీయాలు నడిపి ఓట్లు దండుకుంది. అయితే ఇప్పుడు ఆ వాతావరణం కన్పించడం లేదు. ఆయా రాష్ట్రాల్లో మోడీ ప్రాభవం ఇప్పుడు మసకబారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రజా సమస్యలు ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో హిందూత్వ వాదం వెనక్కి పోయింది. మోడీకి కంచుకోటలుగా ఉన్న హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని స్థానాలు కోల్పోతుందో చూడాల్సి ఉన్నదని రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మెజారిటీకి అవసరమైన 272 స్థానాలు గెలుచుకోవడం కూడా మోడీకి సవాలేనని ఆయన తెలిపారు.
తప్పుడు వాదనలు
ప్రధాని బీజేపీ బహిరంగ సభల్లో తప్పుడు వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. మే 1న గుజరాత్‌లోని బనస్కాంతలో నిర్వహించిన బహిరంగ సభలో .. ”ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 272 సీట్లు గెలవడం అవసరం. బీజేపీ తప్ప మిగిలిన దేశంలోని ఏ రాజకీయ పార్టీ 272 స్థానాల్లో పోటీ చేయడం లేదు. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు.” అని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు 327 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం.

]]>
మేడిగడ్డకు మరమ్మతులు వృథానే ! https://navatelangana.com/repairs-to-medigadda-are-in-vain/ Tue, 07 May 2024 21:38:07 +0000 https://navatelangana.com/?p=285829 to Madigadda Repairs are wasted!– ఎన్‌డీఎస్‌ఏ నివేదిక స్పష్టీకరణ
– దెబ్బతినకుండా ఉంటుందని చెప్పలేం
– 2019 జూన్‌లోనే బ్యారేజీకి నష్టం
– వానాకాలంలో బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలి
– పరీక్షలు చేసి, మరమ్మత్తులకు పూనుకోవాలి
– దీనికి బాధ్యత డ్యామ్‌ ఓనర్‌ (సీఈ రామగుండం)దే: బ్యారేజీల మరమ్మతులపై బాంబు పేల్చిన ఎన్‌డీఎస్‌ఏ
– రూ.లక్ష కోట్ల ప్రజాధనం గంగపాలేనా ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతులు చేసినా దెబ్బతినకుండా ఉంటుందనే నమ్మకం లేదనీ నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) బాంబు పేల్చింది. యథాతథస్థితిని కొనసాగించడానికి మాత్రమే మరమ్మత్తులు ఉపకరిస్తాయనీ, బ్యారేజీ మరింత దెబ్బతినకుండా మరమ్మతులు తప్పనిసరి అని తేల్చిచెప్పింది. లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఐదు రోజుల ముందు ఎన్‌డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక రావడం బీఆర్‌ఎస్‌కు శాపం కానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇక గత చరిత్ర కానుందా ? అనే అనుమానాలు ఈ నివేదికతో స్పష్టమవుతున్నది. ఈ నివేదికను బీఆర్‌ఎస్‌కు ఖేదాన్ని మిగిల్చగా, కాంగ్రెస్‌ ఇతర పార్టీలకు మోదాన్ని అందించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్‌(ఈఆర్టీ), గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌(జీపీఆర్‌) పరీక్షలతోపాటు బ్యారేజీ స్థితిగతులు, నిర్మాణ ఏజెన్సీలు, అధికారుల నివేదికలు, డిజైన్లు, డ్రాయింగులు పరిశీలించి, నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములైన అధికారులందరినీ విచారించిన అనంతరం ఎన్డీఎస్‌ఏ బ్యారేజీల పునరుద్ధరణ సంబంధించిన మధ్యంతర నివేదికను రాష్ట్ర సాగునీటిపారుదల శాఖకు ఈనెల ఒకటిన నివేదిక ఇచ్చింది. వానాకాలంలోపు బ్యారేజీల వైఫల్యంపై జియో ఫిజికల్‌ ఇన్వెస్టిగేషన్‌ (జీపీఐ), జియో సాంకేతిక పరీక్షల అనంతరం డిజైన్లు, డ్రాయింగులు సిద్ధం చేసి, మరమ్మతులకు పూనుకోవాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎన్‌ఏ) చైర్మెన్‌ అనిల్‌ జైన్‌ మధ్యంతర నివేదిక మంగళవారం లీక్‌ కావడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 జూన్‌లో మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించగా మొదటి వరదల అనంతరం 2019 నవంబరులో గేట్లు మూసివేయగా, బ్యారేజీ దిగువ భాగంలో సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాకులు (సీసీ బ్లాకులు), ఏప్రాన్‌ దెబ్బతిన్నట్టు గుర్తించడం జరిగిందని అన్నారు. అయితే మరమ్మతులతోపాటు ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం) పనులు చేయకుండా బ్యారేజీని వినియోగించడంతో 2023 అక్టోబరు 21వ తేదీన బ్యారేజీ కుంగిపోయిందని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్‌ నెం.16 నుంచి 21 దాకా ఆయా స్థాయిల్లో కుంగిపోయి, దెబ్బతిన్నాయని వివరించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ ఏప్రాన్లు దెబ్బతిన్నాయనీ, సీసీబ్లాకులు చెల్లాచెదురు అయ్యాయని గుర్తు చేసింది. అన్నారం బ్యారేజీతో పాటు గేట్ల వద్ద ఇసుక మేటలు వేస్తుండటంతో నీటి పారుదల శాఖ నిరంతరం వీటిని తొలగించి, వరద సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరింది. వానాకాలంలోపు బ్యారేజీలకు తగిన పరీక్షలు చేసి, మరమ్మత్తులు చేయాల్సిన బాధ్యత డ్యామ్‌ సేఫ్టీ చట్టం -2023 ప్రకారం డ్యామ్‌ ఓనర్‌(రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌)దేనని పేర్కొన్నది. ఈ సందర్భంగా బ్యారేజీల పునరుద్ధరణకు పలు సూచనలు చేసింది.
మరమ్మతులకు ఎన్‌డీఎస్‌ఏ సూచనలు
1. మేడిగడ్డ బ్యారేజీ మరింత దెబ్బతినకుండా మరమ్మత్తులు చేయాలి. మరమ్మత్తులు యధాతథాస్థితిని కొనసాగించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. భవిష్యతులో ఏ పరిణామాలు చోటుచేసుకున్నా బ్యారేజీ దెబ్బతినకుండా ఉంటుందనే గ్యారంటీ లేదు.
2. పగుళ్లును నిరంతరం వరిశీలించాలి. బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో సీనీ బ్లాకులు ద్బెబతిన్నాయి.
3.పిల్లర్లు 16 నుంచి 22 దాకా పగుళ్లు వచ్చాయి. ఆ పిల్లర్లు మరింత దెబ్బతినకుండా వాటికి ఇనుప పట్టీలు వేయాలి.
4. రాఫ్ట్‌(పునాది)పై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
5. రాఫ్ట్‌ కింద ఉన్న ప్రెషర్‌ రిలీవ్‌ వాల్వ్‌ మరమ్మతులు చేయడం లేదా మార్చడం చేయాలి.
6. బ్లాకు-7 కుంగుబాటును నిరంతరం పరిశీలించడానికి వీలుగా టోటల్‌ స్టేషన్‌ను వినియోగించాలి. బ్లాక్‌-7 రాఫ్ట్‌ కిందకు ఇసుక చేరింది. దీనికోసం ఇసుక నింపిన బస్తాలతో పాటు సిమెంట్‌ బస్తాలను వరుస క్రమంలో పెట్టాలి.
7. బ్యారేజీ అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ సీకెంట్‌ పైల్‌ను పరిశీలించాలి. ప్లింత్‌ శ్లాబు కింద ఇన్వర్టర్డ్‌ ఫిల్డర్లపై ఉన్న కాంక్రీట్‌ బ్లాకులు దెబ్బతిన్నాయి. ప్లింత్‌ స్లాబులపై కింద ఉన్న ఫిల్డర్లనుంచి ఇసుక కొట్టుకుపోయిందా…? లేదా వరిశీలించాలి.
8. జియో ఫిజికల్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసి, సీకెంట్‌ ఫైల్స్‌ దెబ్బతిన్న చోట షీట్‌ ఫైల్లు దించాలి. సీకెంట్‌ ఫైల్స్‌ ఎండ్‌నీల్‌ మధ్య సిమెంట్‌, ఇసుక మిశ్రమంతో గ్రౌటింగ్‌ చేయాలి.
9. సీకెంట్‌ ఫైల్స్‌ వైఫల్యంతో రాఫ్ట్‌ (పునాది) కింద భారీ రంధ్రాలు(బొరియలు) పడ్డాయి. వీటిని మూయడానికి రాఫ్ట్‌ 5 నుంచి 7 సెంటీమీటర్ల మేర రంధ్రాలు వేయాలి. రెండు మీటర్ల కన్నా ఎక్కువ వేయరాదు. సిమెంట్‌, ఇసుక, నీళ్లతో గ్రౌటింగ్‌ చేయాలి. వాటిని గుర్తించడానికి బోర్‌ రంధ్రాల్లోకి కెమెరాలను పంపాలి. గ్రౌటింగ్‌ చేసే క్రమంలో రాఫ్ట్‌పై ఒత్తిడి, భారం పడకుండా చూసుకోవాలి.
10, వర్షాకాలంలో ఏడో బ్లాకు గేట్లన్నీ ఎత్తి ఉంచాలి. గేట్లు ఎత్తే క్రమంలో అన్ని గేట్లను సమగ్రంగా పరిశీలించాలి. వర్షాకాలంలో బ్యారేజీ గేట్లతో పాటు అన్ని కాంపోనెంట్లను తనిఖీచేయాలి. ప్రధానంగా ఏడో బ్లాకులోని 15 నుంచి 22 గేట్లు ఓపెన్‌ కావడం లేదు. దీనికోసం క్రేన్లను ఏడో బ్లాకుపై కాకుండా వేరే చోట పెట్టి, గేట్లను ఎత్తాలి. ఈ క్రమంలో పిల్లర్లకు ఇనుప పట్టీలను బిగించాలి.
11. పిల్లర్‌ నెంబర్‌ 20-21 మధ్య ఉన్న గేట్లను తొలగించాలి.
12. బ్యారేజీ అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ సీకెంట్‌ పైళ్లు, శ్లాబును కలిపే సీసీ బ్లాకులు, ప్లింత్‌ స్లాబులు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవి కట్టాలి. ఈ క్రమంలో వాటి కింద ఉన్న ఇసుకను సరిచేయాలి.
అన్నారం, సుందిళ్లకు ఒకే తరహా మరమ్మతులు
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఒకే తరహా సమస్యలు ఉండటంతో వాటికి ఒకే తరహా మరమ్మత్తులను ఎన్డీఎస్‌ఏ సూచించింది.
1. అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ సీకెంట్‌ పైళ్లను పరిశీలించాలి.
2. నాలుగు వరుసల ఉన్న బ్లాకులను తొలగించి, వాటి కింద ఉన్న ఇన్వర్టర్డ్‌ పిల్లర్ల స్థానంలో జియో టెక్స్‌టైల్‌ పిల్టర్లు పెట్టాలి. రాళ్లు లేకుండా చేసుకోవాలి.
3. నాలుగు వరుసల్లోని సీసీ బ్లాకులను ఇనుప కడ్డీలతో అనుసంధానం చేసి, పరదను దిగువకు వదిలిపెట్టినప్పుడు అవి కొట్టుకుపోకుండా చూసుకోవాలి. ఇక రాఫ్ట్‌ కింద రంధ్రాలు ఉంటే గుర్తించి, గ్రౌటింగ్‌ చేయాలి.
ఈ సీజన్‌లో కూడా బ్యారేజీలకు హాలీడే
బ్యారేజీల మరమ్మతుల కోసం జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసి, మరమ్మతుల కోసం తగిన డిజైన్లు, డ్రాయింగులు సిద్ధం చేయాలని ఎన్డీఎస్‌ఏ రాష్ట్ర నీటిపారుదల శాఖకు గుర్తు చేసింది. అయితే మరో నాలుగు వారాల్లో గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలున్నాయి. ఆయా పరీక్షలు చేయడానికే దాదాపు నెలరోజులకు పైగా సమయం పడుతుంది. ఇక డిజైన్లు, డ్రాయింగ్‌లకు కనీసం 15 రోజుల సమయం కావాల్సిందే. అదే జరిగితే ఈ సీజన్లో మరమ్మతులకు అవకాశాల్లేవు. ప్రధానంగా ప్రాణహితకు భారీగా వరదలుంటాయి. మేడిగడ్డకు ప్రతియేటా జూన్‌ నుంచి ఫిబ్రవరి దాకా ప్రాణహితకు వరదలు వస్తుంటాయి. డిసెంబరులోనే కాస్తా తగ్గుముఖం పట్టినా, రోజుకు 11 వేల క్యూసెక్కుల వరద ఫిబ్రవరి దాకా వస్తుంది. అన్నారం, సుందిళ్లకు నవంబరులో వరదలు తగ్గుముఖం పడతాయి. ఈ బ్యారేజీలను మరమ్మత్తులు చేయడానికి అవకాశం ఉన్నా, మేడిగడ్డకు మరమ్మత్తు అంత సులభం కాదు. మేడిగడ్డ మరమ్మత్తులు కత్తిమీద సాములాంటివే. మేడిగడ్డ లేకుండా ఇతర బ్యారేజీలన్నీ దండగే అని నీటిపారుదల శాఖ అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, తాపీగా వానాకాలానికి నెలరోజుల ముందు ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇవ్వడంతో మరమ్మతులు ఇక ప్రశ్నార్థకం కానున్నాయి.

]]> పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండానే.. https://navatelangana.com/fighting-for-the-poor-is-a-red-flag/ Tue, 07 May 2024 21:33:25 +0000 https://navatelangana.com/?p=285836 Fighting for the poor is a red flag.– మతోన్మాద బీజేపీని ఓడించండి
– సీపీఐ(ఎం) అభ్యర్థి ఎమ్‌డి.జహంగీర్‌ను గెలిపించండి : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-చౌటుప్పల్‌
ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి.. నిత్యం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో ఎండి.జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ రోడ్డుషో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో వీరయ్య మాట్లాడారు. మతోన్మాద, నియంతృత్వ, ప్రజా వ్యతిరేక బీజేపీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం మతం, కులం పేరుతో ఓట్ల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం, రోజు కూలి అందించడంలో విఫలమైందని, రోజుకు రూ.178 కూలి సరిపోతుందని చెప్పడం దుర్మార్గమని అన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. రైతులే కూలీలుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే కార్మికులు, రైతులు, ప్రజల మధ్య కూడా చిచ్చుపెడ్తారని అన్నారు.
అభివృద్ధి శూన్యం
సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌
భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో రెండు సార్లు కాంగ్రెస్‌, ఒకసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచినా అభివృద్ధి చేయలేదని సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ అన్నారు. ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాని సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి మారిన బూర నర్సయ్యగౌడ్‌ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఎన్ని నిధులు తెచ్చి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. సొంత ఆస్తులు పెంచుకున్నారని విమర్శించారు. వైద్యసంస్థలను పెంచుకోవడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రజల కోసం ఎక్కడ ధర్నాలు చేశారు, ఎప్పుడైనా జైళ్లకు పోయారా అని ప్రశ్నించారు. ప్రజల వెన్నంటి ఉండి పనిచేస్తున్న తనను గెలిపిస్తే ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు తెస్తానని అన్నారు. గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. పిలాయిపల్లి కాల్వ సాధన కోసం 130 రోజులు దీక్షలు చేపట్టామన్నారు. సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగానే ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలు సాధించామన్నారు. పార్లమెంట్‌కు దద్దమ్మలు ఎన్నికవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాట నాయకులను గెలిపించి ఆయుధం ఇవ్వాలని కోరారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, నాయకులు ఎమ్‌డి.పాషా, బండారు నర్సింహా, నందిపాటి మనోహర్‌, అవ్వారు రామేశ్వరి, ఆ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ గోపగోని లక్ష్మణ్‌, వైస్‌చైర్మెన్‌ బత్తుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

]]>
ప్రచారానికి.. నాలుగు రోజులే..! https://navatelangana.com/only-four-days-to-the-campaign/ Tue, 07 May 2024 21:19:09 +0000 https://navatelangana.com/?p=285833 Only four days for the campaign..!– పీక్‌ స్టేజ్‌లో ప్రచారం
– ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
– బస్తీల్లో ఊపందుకున్న ప్రచార హౌరు
– ఈ వారంలో నగరానికి రాహుల్‌, ప్రియాంక, మోడీ రాక
నవతెలంగాణ-సిటీబ్యూరో
లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇంకా నాలుగు రోజులే గడువుంది. ఈ నెల 13న పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. రెండ్రోజుల ముందుగా 11వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు సభలు, రోడ్డు షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో హోరెత్తిస్తున్నాయి. ఆయా పార్టీల నాయకులు రోజులో రెండు మూడు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ముఖ్యంగా తటస్థ ఓటర్లు, మహిళాసంఘాలు, కుల, కాలనీ సంఘాలతో పాటు ఇతర బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. గ్రేటర్‌లోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, చేవేళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రసంగాల్లో ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయ వేడి పుట్టిన్నారు. మరోపక్క గడువులోగా అధిష్టాన పెద్దలతో బహిరంగ సభల నిర్వహణ ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకొనే వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈ మిగిలిన కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకునే కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.
ఎండల ఎఫెక్ట్‌.. రాత్రి వేళల్లోనూ ప్రచారం!
ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వేడి వాతావరణంతో సభలు, ప్రచార కార్యక్రమాలకు ఇబ్బందిగా మారిందని నగరానికి చెందిన పలువురు ముఖ్య నేతలు చెబుతున్నారు. సభలు, సమావేశాలకు జనసమీకరణ, నిర్వహణ కష్టతరంగానే ఉందని అంటున్నారు. ఉదయం వేళల్లో బస్తీలు, అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, పార్కులు, జనసంచారం ఉండేచోట నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. సాయంత్రం కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. చీకటి పడ్డాక ప్రచార సమయం ముగిసే వరకూ బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తున్నారు. గడువు దగ్గరపడే కొద్దీ ఎండను దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే ఆ రోజు ప్రణాళిక మేరకు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఆయా డివిజన్ల వారీగా వెళుతూ.. ప్రజలతో మమేకమవుతూ.. బిజీబిజీగా గడుపుతున్నారు. బస్తీలు, కాలనీల్లో స్థానిక సమస్యలను.. అక్కడ జరగాల్సిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తున్నారు.
నగరానికి అగ్రనేతల రాక..
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడటంతో మూడు ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు డజను మందికిపైగా రాజధానికి రానున్నారు. దాంతో ప్రచారం పీక్‌ స్టేజీకి చేరనుంది. పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రేటర్‌లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు. రానున్న రోజుల్లో మరిన్ని రోడ్డు షోలు, కార్నర్‌ మీటింగ్‌లు జరపనున్నారు. ఈనెల 9న సరూర్‌నగర్‌లో జరిగే జన జాతర సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రానుండగా.. 10న ప్రియాంకా గాంధీ తాండూరు జనజాతర సభలో.. అనంతరం పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొననున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బస్సు యాత్ర సాగిస్తున్నారు. దాదాపు 14 రోజులుగా చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీలవి మోసపూరిత హామీలంటూ ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.
బస్సుయాత్ర ముగిసిన వెంటనే.. 11వ తేదీన నాలుగు పార్లమెంట్‌ స్థానాలను కవర్‌ చేసేలా.. నగరంలో భారీ సభ నిర్వహించడంపై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈలోగా కేటీఆర్‌తో రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక బీజేపీ తరపున ఇప్పటికే కేంద్ర హౌం శాఖమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్డుషోలు నిర్వహించారు. ప్రధాని మోడీ 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో సభకు రానున్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు బుధవారం నుంచి శనివారం వరకు ఇక్కడే ఉండి ప్రచారంలో పాల్గొననున్నారు.
అసంతృప్తులకు గాలం..
ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే పార్టీలు తమ బలాన్ని పెంచుకొనేందుకు ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నా యి. అయితే కొత్తగా వస్తున్నవారికి.. పాత నాయకులకు సమన్వయం చేయటం.. ప్రచారంలో భాగస్వాములను చేయడం లేదని తెలుస్తోంది. మూడు పార్టీల అభ్యర్థులు బలమైన సామాజిక తరగతుల్లో పెద్ద మనుషులను కలుస్తూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.

]]>