Neti Vyasam Archives - https://navatelangana.com/category/main-news/neti-vyasam/ Wed, 08 May 2024 18:20:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Neti Vyasam Archives - https://navatelangana.com/category/main-news/neti-vyasam/ 32 32 మేడిగడ్డ వదిలేస్తే ఏమవుతుంది? https://navatelangana.com/what-happens-if-we-leave-madigadda/ Wed, 08 May 2024 18:20:11 +0000 https://navatelangana.com/?p=286454 What happens if we leave the grass?ప్రాణహిత-చెవేళ్ల పథకాన్ని రీ-డిజైన్‌ చేసి 02మే2016 జూన్‌ 19న కాళేశ్వరం పేరుతో సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో 13 జిల్లాలు, 7 లింక్‌లు, 56 ప్యాకేజీలు, 3 బ్యారేజీలు, 14 జలశయాలు, 31 లిఫ్టులు, 1832 కి.మీ కాల్వలతో పునర్‌ నిర్మాణం చేపట్టారు. 3 బ్యారేజీలలో గోదావరి నదిపై ఎల్లంపెల్లికి 108 కి.మీ దిగువన, ప్రాణిహిత నది గోదావరిలో కలిసిన తరువాత మేడిగడ్డ వద్ద 16.17 టిఎంసీలతో బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. దానికి ఎగువన 46 కి.మీ దూరంలో అన్నారం బ్యారేజ్‌ 10.87 టిఎంసీలతోనూ, అన్నారం బ్యారేజ్‌కి ఎగువన 31.5 కి.మీ దూరంలో సుందిల్ల ప్రాజెక్టు 8.56 టిఎంసీలతో చేపట్టారు. సుందిల్ల నుండి 31 కి.మీ దూరంలో ఉన్న ఎల్లంపెల్లి ప్రాజెక్టులోకి పంపిణీ చేయాలి. 195 టిఎంసీలకు మేడిగడ్డ నుండి గోదావరి ఎగువకు అనగా అన్నారం, సుందిల్ల, ఎల్లంపెల్లి ప్రాజెక్టుకు లిఫ్ట్‌ చేయాలి. ఇదిగాక 20 టిఎంసీలు గోదావరిలో లభ్యత ఉంటుంది. 25 టిఎంసీల భూగర్భ జలాలతో కలిపి 240 టిఎంసీల లభ్యత ఉంటుందని ప్రాజెక్టు సర్వే చేసిన ఢిల్లీ ప్రభుత్వ సంస్థ వ్యాప్‌కోస్‌ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్‌, పంపుహౌజ్‌, అన్నారం బ్యారేజ్‌, పంపుహౌజ్‌, సుందిల్ల బ్యారేజ్‌ పంపుహౌజ్‌ నిర్మాణం చేపట్టారు. మార్చి 2022 నాటికి 3 బ్యారేజీలకు, 3 పంపుహౌజ్‌లకు కలిపి రూ.17,941.75 కోట్లు వ్యయం చేశారు. ఈ మూడు బ్యారేజీలకు 2,623.68 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం.
ఏడాదిలో 90 రోజులు ఈ లిప్టులు పని చేస్తాయి. మేడిగడ్డ నీటిని 17 పంపులతో కన్నెపెల్లి పంపుహౌజ్‌ నుండి అన్నారానికి లిప్టు చేయాలి. విద్యుత్‌ చార్జీ యూనిట్‌ రూ.6.30 చొప్పున నిర్ణయించారు. రోజుకు 203.02 మిలియన్‌ యూనిట్లు అవసరం కాగా, విద్యుత్‌ చార్జీలకు ఏటా రూ.10,374.56 కోట్లు కావాలి. నిర్వహణ వ్యయం రూ.10,647.26 కోట్లు అవసరమని కాగ్‌ నివేదిక వెల్లడించింది. ఈ ప్రాజెక్టును ఎల్లంపెల్లి నుండి మల్లన్నసాగర్‌ ద్వారా కొండపోచమ్మ వైపు ఒక లైను, మల్లన్న సాగర్‌ నుంచి చిట్యాల (గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్‌లు) వరకు ఒక లైను ద్వారా 14 జలాశయాలను నిర్మించాలి.
కాగ్‌ నివేదిక ఏం చెప్పింది?
ఈ ప్రాజెక్టు ద్వారా 169 టిఎంసీలు సాగుకు, 16 టిఎంసీలు పారిశ్రామిక అవసరాలకు, 30 టిఎంసీలు హైదరాబాద్‌ పట్టణానికి, 10 టిఎంసీలు దారి పొడువున ఉన్న గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. మార్చి 2022 నాటికి రూ.86,788.06 కోట్లు వ్యయం చేశారు. ఇందులో రూ.55,807.86 కోట్లు వివిధ సంస్థల ద్వారా అప్పులు తెచ్చారు. ఈ అప్పులకు 7.8 శాతం నుండి 10.9 శాతం వడ్డీ చెల్లించాలి. 2035-36 నాటికి ఆసలు రూ.87,369.89 కోట్లు, రూ.54,174.70 కోట్లు వడ్డీకింద మొత్తం రూ.1,41,544.59 కోట్లు 14 ఏండ్లలో చెల్లించాలి. ఈ మొత్తం నిర్వహణ వ్యయం లెక్కవేసినప్పుడు ఎకరానికి ఒక పంటకు రూ.40వేల ఖర్చు అవుతుంది. ప్రభుత్వం మొదటి 3 బ్యారేజీలకు పెట్టిన పెట్టుబడిలో 70 శాతం రుణాలు తెచ్చి పెట్టారు. అందువల్ల ఏటా రైతులపై ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలకు అదనపు భారాలు వేయాల్సి వస్తున్నది. ఇంత భారాన్ని తెలంగాణ ప్రజలు, రైతులు భరించగలరా? ఇంత వ్యయం చేసి నిర్మాణం చేసినప్పటికీ మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాకులోని 18, 19, 20, 21 పియర్స్‌ 4 ఫీట్ల లోతుకు కుంగిపోయాయి. అంతేగాక అన్నారం బ్యారేజీకి బుంగ పడి నీరు దిగువకు వస్తున్నది. అన్నారం బ్యారేజీ ముందుగల నిర్మాణాలు బుంగ ద్వారా దిగువకు కొట్టుకు వచ్చాయి. సుందిల్ల బ్యారేజీ కూడా నిర్మాణ లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ లోపాలపై ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం విజిలెన్స్‌ శాఖతో విచారణ చేపట్టింది. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌తో జూడీషియల్‌ విచారణకు కమిషన్‌ వేసింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ డ్యాం సెప్టీ ఆథారిటీ ద్వారా విచారణ జరిపించింది. పై మూడు కమిషన్లు జరిపిన విచారణలో మేడిగడ్డ నుండి సుందిల్ల వరకు గల ఎత్తిపోతల పథకాలు పనికి రావని నిర్దారణకు వచ్చాయి. కానీ, జస్టిస్‌ చంద్రఘోష్‌ ఏప్రిల్‌ 28న ”మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా ? అని” ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. ఇంత డబ్బు వ్యయం చేసి చేసిన నిర్మాణాన్ని వదిలివేస్తే జరిగే నష్టానికి బాధ్యులెవరు? అన్న ఆలోచనతో జస్టిస్‌ ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. కానీ ప్రాజెక్టు జీవిత పర్యంతం ప్రతియేట ఎకరాకు రూ.40వేలు వ్యయం చేయడం ప్రభుత్వానికి సాధ్యమవుతుందా అన్న విషయాన్ని ఆలోచించ లేదు. పైగా గోదావరి నది ఇసుక తిన్నెలపై నిర్మాణం చేసిన బ్యారేజీల జీవిత కాలం ఎంత కాలం ఉంటుంది. శాస్త్రీయంగా విచారించాల్సిన అవసరం ఉంటుంది.
మేడిగడ్డకు ప్రత్యామ్నాయం ఉందా?
2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత నుండి కాళేశ్వరం వరకు గల 116 కి.మీ కాలువ ద్వారా 165.38 టిఎంసీల నీటిని లిప్టు చేయాలని పథకం రూపొందించి 2014 నాటికి రూ.8వేల కోట్లు వ్యయం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద 150 అడుగుల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. కానీ వెంటనే ప్రారంభించకపోవడం వల్ల మహారాష్ట్రలో ప్రభుత్వం మారడం, తుమ్మిడిహెట్టి వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి ప్రాజెక్టుకు అనుమతించకపోవడం జరిగింది. కానీ, 148 అడుగుల ఎత్తు నిర్మాణం చేపట్టడానికి అంగీకారం తెలిపారు. 148 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో 3,990 ఎకరాలు తెలంగాణలో 434 ఎకరాలు ముంపునకు గురవుతాయి. అందుకు పరిహారం చెల్లించాలి. 116 కి.మీ కాలువ (తుమ్మిడి హెట్టి – ఎల్లంపెల్లి)లో మైలారం వద్ద లిప్టు ఏర్పాటు చేయాలి. దానికి 332.64 మిలియన్‌ యూనిట్లు మాత్రమే కావాలి. యూనిట్‌ చార్జి రూ.6.30లు అయినప్పటికీ ఏటా వ్యయం 212.89 కోట్లు ఖర్చు అవుతుంది. 1 టిఎంసీకి రూ.1.33 కోట్లు వ్యయం చేయాలి. మేడిగడ్డ లిప్టు ద్వారా 1 టిఎంసీకి రూ.8.61 కోట్లు వ్యయం చేయాలి. మొత్తం తుమ్మిడిహెట్టి నుండి ఎల్లంపెల్లి వరకు గల కాలువ, తుమ్మిడి హెట్టి బ్యారేజీ కలిపి 8,603 కోట్లు మాత్రమే వ్యయం జరుగుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ తూర్పు ప్రాంతంలోని 1.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. అంతేగాక ఎల్లంపెల్లి నుండి శామీర్‌పేట వరకు (శామీర్‌పేట నుండి చెవేళ్ల వరకు గల డిజైన్‌నే ప్రస్తుత డిజైన్‌గా మార్చారు. ఎల్లంపెల్లిని మినహాయించి శామీర్‌పేట తో ముగింపు చేశారు. తుమ్మిడిహెట్టి నుండి ఎల్లంపెల్లి వరకు అతి తక్కువ నిల్వతో 165 టిఎంసీల నీటిని వినియోగించవచ్చు. ఎల్లంపెల్లి తరువాత గల మిడ్‌ మానేర్‌ మినహా మిగిలిన అనంతరగిరి, మల్లన్నసాగర్‌, రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ, బస్వాపురం రిజర్వాయర్‌లను 1 నుండి 3 టిఎంసీల వరకు నీటి నిల్వకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వం డిజైన్‌ రూపొందించింది. ఆ డిజైన్‌ను మార్చి 50 టిఎంసీలతో మల్లన్న సాగర్‌ చేపట్టారు. 20 గ్రామాలను నిర్వాసితులు చేసి నిర్మించిన మల్లన్న సాగర్‌ దిగువన భూమి నిలువుగా చీలి ఉన్నదని ఎప్పుడైనా భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నదని భూగర్భ శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు అన్ని శాఖల సర్వేలను గమనంలోకి తీసుకోవాలి. గత ప్రభుత్వం డిజైన్‌ ప్రకారం నిర్మాణం చేసినచో ప్రభుత్వం పైనేగాక సాగు నిర్వహణ వ్యయం చాలా వరకు తగ్గుతుంది.
ఏం చేయాలి?
ప్రస్తుత మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను వినియోగించడం వల్ల కలిగే భారాల కన్న తుమ్మిడి హెట్టి నుండి కర్జెల్లి, సురగపెల్లి, మైలారం ద్వారా ఎల్లంపెల్లికి నీటిని తేవడం తక్కువ వ్యయంతో కూడుకున్నది. ఏటా నిర్వహణ వ్యయం కూడ చాల తక్కువ. అంతేగానీ, నిర్మాణం జరిగిన ప్రాజెక్టులను వదిలివేయడం, కొంత భారమైన ప్రాజెక్టు జీవిత పర్యంతం ఆ భారాన్ని మోయడం సాధ్యం కాదు. 2015లోనే అనంతరాములు, మరి నలుగురు ఇంజనీర్లు రీ-డిజైన్‌ను వ్యతిరేకిస్తూ నోటు ఇచ్చారు. అంతేగాక కేంద్ర ఇరిగేషన్‌ శాఖ సలహాదారు ఎదిరే శ్రీరాం కూడా తుమ్మిడి హెట్టి వద్ద 160 టిఎంసీల నికర జలాల లభ్యత ఉన్నట్లు నివేదిక ఇచ్చారు.
ఇవన్ని శాస్త్రీ యంగా పరిశీలించ కుండా టీ(బీ)ఆర్‌ఎస్‌ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు ను ప్రారంభించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిం ది. ఇప్పటికైన తుమ్మిడిహెట్టి నుండి ఎల్లంపెల్లికి గల పాత డిజైన్‌లోని ఐదవ ప్యాకేజీని అనగా 71 కి.మీ నుండి 116వ కి.మీ వద్ద గల ఎల్లంపెల్లికి నిర్మాణం పూర్తి చేయాలి. అలాగే తుమ్మిడి హెట్టి వద్ద 150 అడుగుల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలి. ఈ పనులు పూర్తి చేయడానికి ప్రస్తుతం చేయ తలపెట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల రిపేర్లకన్న తక్కువ వ్యయమవుతుంది. ఇంజనీర్ల నివేదికలను పరిశీలించి తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును చేపట్టడం లాభదాయకంగా ఉంటుంది.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666

]]>
ఫాసిజాన్ని ఓడించగలిగేది సోషలిజమే https://navatelangana.com/it-is-socialism-that-can-defeat-fascism/ Wed, 08 May 2024 18:18:27 +0000 https://navatelangana.com/?p=286448 ఫాసిజాన్ని ఓడించగలిగేది సోషలిజమేనేడు ప్రపంచ వ్యాపితంగానే ఫాసిస్టు శక్తులు విజృంభిస్తున్నాయి. పచ్చిమితవాద, నయా ఫాసిస్టు శక్తులు మన దేశంలో లాగానే టర్కి, నెదర్‌ల్యాండ్స్‌, ఇజ్రాయిల్‌, అర్జెంటీనా వంటి దేశాల్లో అధికారంలోకి వచ్చాయి. అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, అమెరికా వంటి దేశాలలో సైతం మితవాదులు బలపడుతున్నారు. ఉదారవాద ప్రజాస్వామ్యం ఈ క్రమంలో బలహీనపడుతున్నది. దాని స్థానంలో మితవాద, నయాఫాసిస్టు శక్తులకు దారి కల్పించడం 21వ శతాబ్దంలో ఓ ముఖ్య పరిణామం. ఈ నేపథ్యంలో ఫాసిజంను ఎదుర్కోవడం, తుదముట్టించడం గురించి త్రీవమైన చర్చలు జరుగుతున్నాయి. తీవ్రమైన కృషి కూడా జరుగుతున్నది. అందువలన ఈ సందర్భంలో ‘మే 9 విక్టరీడే’ గురించి ఒకసారి మననం చేసుకోవాలి.
విక్టరిడే కు – ప్రపంచ జేజేలు
ప్రతిదేశంలోనూ విక్టరీ డేలు వుంటాయి. కాని మే 9 ప్రపంచ మనవాళి యావత్తు విజయోత్సవం జరుపుకోవాల్సిన రోజు. ఆరేండ్లు సాగిన రెండో ప్రపంచ యుద్ధం 1945 మే 9న ముగిసింది. సోవియట్‌ ఎర్రసైన్యం నాజీ ఫాసిస్టు హిట్లర్‌ (జర్మనీ) సైన్యాన్ని తరిమి తరిమి కొట్టింది. ప్రంపచాన్నే గడగడలాడిస్తున్న జర్మనీ ఫాసిస్టు సైన్యం ఎర్రసైన్యం దాడికి మే 9న లొంగిపోయింది. నరరూప రాక్షసుడు హిట్లర్‌ ఓటమి భరించలేక తన ప్రియురాలితో కలిసి ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. యావత్‌ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఫాసిస్టు హిట్లర్‌ ఆక్రమించుకున్న 10 దేశాలను, దాదాపు 12 కోట్ల మంది జనాభాని సోవియట్‌ యూనియన్‌ తొలి కార్మిక వర్గ రాజ్యం విముక్తి చేసింది. మే8 వ తేదీన బ్రిటన్‌ అధినేత చర్చిల్‌ సోషలిస్టు రష్యా ప్రజలకు పంపిన సందేశంలో ”నాజీ నియంతను మీ భూ భాగం నుండి తరిమికొట్టడంలో సాధించిన విజయాలకు హృదయ పూర్వకంగా మా అభినందనలు తెలుపుకొంటున్నాను.” అని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు డిగాల్‌ ”మార్షల్‌ స్టాలిన్‌, ఐరోపా ఖండంలో యుద్ధం విజయవంతంగా ముగించినందుకు మీ దేశ ప్రజల ధైర్య, సాహసాలకు ప్రశంశలు, ప్రేమభిమనాలు పంపుతున్నాను” అన్నారు. సామ్రాజ్యవాద దేశాల నాయకులే కాదు విముక్తి చెందిన దేశాల నాయకులు కూడా సోషలిస్టు రష్యాకి అశేషత్యాగాలు గావించిన సోవియట్‌ ప్రజలను లేనోళ్ల పొగడటం జరిగింది. యూగోస్లావియా నాయకుడు జోసఫ్‌ టిటో ” మానవ జాతిని కాపాడి, దానికి మంచి భవిష్యత్‌ను ప్రసాదించిన ఎర్రసైన్యానికి , రష్యా ప్రజలకు మా దేశ ప్రజల జేజేలు” అన్నారు. ఆస్ట్రియా దేశాధినేత ” రష్యాలోని సోషలిస్టు వ్యవస్థ, ఎర్రసైన్యం మమ్మల్ని ప్రపంచాన్ని కాపాడినందుకు మేము మా భవిష్యత్‌ తరాలు కూడా ఎంతో రుణపడి వుంటాము.” అని నాడు ప్రకటించారు. ఇటలీ, ఈ యుద్ధంలో హిట్లర్‌ పక్షాన వుండింది. సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్స్‌ సాధించిన ఈ ఘన విజయం సందర్భంగా రష్యన్‌ ప్రజలకు సెల్యూట్‌ చేస్తున్నాము” అని ఆ దేశ ప్రజలు ప్రకటించారు.
ఫాసిజం – సామ్రాజ్యవాదం – సోషలిజం
ఈ మూడు విడదీయరానివి. సామ్రాజ్యవాద దశను వివరిస్తూ లెనిన్‌ ”ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అత్యున్నత దశ, ఇది సోషలిస్టు విప్లవాల దశ” అని నిర్వచించారు. సోషలిజాన్ని, సోషలిస్టు వ్యవస్థను అంతం చేయాలన్నది ఫాసిస్టు లక్ష్యం. దాని పుట్టుక నుండి ఇది కనబడుతూనే వుంది. 1939- 45వరకు ఆరేండ్లపాటు సాగిన రెండో ప్రపంచ యుద్ధంలో నాలుగేండ్లు (22జూన్‌ 1941 నుండి) ఫాసిస్టు జర్మనీకి, సోషలిస్టు రష్యాకు మధ్యే యుద్ధం సాగింది. రెండు శిబిరాలుగా ఏర్పడి తమ లాభార్జనకు, భూమండలాన్ని పంచుకోవడానికి సాగిన మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) ముగిసిన 20 ఏండ్లలోనే సామ్రాజ్య వాదులు తమలో తాము తన్నుకుని మరల ప్రపంచాన్ని భయానకమైన యుద్ధంలోకి లాగారు. అమెరికా, ఇంగ్లండ్‌ ఫ్రాన్స్‌లు ఒక వైపు, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు మరోవైపు. ఆనాటికి జరిగిన మరో ముఖ్యమైన రెండు పరిణామాలు మన దృష్టిలో వుండాలి. 1. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి (1917) తొలి కార్మికరాజ్యం, సోషలిస్టు వ్యవస్థ రష్యాలో ఏర్పడి వున్నాయి. నిజానికి ఈ తొలి కార్మిక రాజ్యం అవతరించగానే తమ దేశం ప్రపంచం యుద్ధం నుండి వైదొలుగుతుందని ప్రకటించడం తోనే యుద్ధం ముగిసింది. ఇక రెండవది ఫాసిజం పుట్టుక, రష్యాలో సోషలిస్టు విప్లవం జయప్రదమై రష్యా అప్రతిహతంగా ముందుకు సాగుతుంటే పెట్టుబడిదారి ప్రపంచం ఆర్థిక సంక్ష్షోభంలోకి దొర్లిపోయింది. ప్రపంచ మానవాళి చూపు సోషలిజం వైపు మళ్లింది. అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఆవిర్భవించాయి. మార్క్సిస్టు సిద్ధాంతం ఔన్నత్యం విస్తరించనారంభించింది. ఈ పురోగమనాన్ని నిలువరించడానికి సామ్రాజ్య వాదం పుట్టించిన సిద్ధాంతమే ఫాసిజం. కమ్యూనిస్టు పార్టీలకు ప్రతిగా అనేక దేశాల్లో ఫాసిస్టు పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇటలీలో ముస్సోలినీ, జర్మనీలో హిట్లర్‌, జపాన్‌లో టోజో, స్పెయిన్‌లో ఫ్రాంకో, పోర్చుగల్‌ సల్జార్‌ల నాయకత్వాన ఫాసిజం విజృంభించింది. సరిగ్గా ఆ కాలంలోనే (1925) మనదేశంలో ఫాసిస్టు సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టింది. ఫాసిజాన్ని, దాని ప్రమాదాన్ని నాటి ఉదారవాద ప్రజాస్వామ్య వాదులూ, సోషల్‌ డెమెక్రాట్లు అంటే అనేక బూర్జువా మధ్యేవాద పార్టీలు గుర్తించలేదు. కానీ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ సరిగ్గా గుర్తించింది. ” ఫాసిజం శ్రామిక జన బాహుళ్యంపై పెట్టుబడి చేసే అతిక్రూరమైన దాడి. ఫాసిజం అది అతినీచమైన జాతిఉన్మాదం. పచ్చి మితవా దానికి పరాకాష్ట. ఫాసిజం అనేది ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం. కార్మికవర్గం, విప్లవోన్ము భిమైన రైతాంగం, మేధావులపై కక్ష తీర్చుకునే ఉగ్రవాద సంస్థ. విదేశస్తులపై విద్వేషం విరజిమ్మే సంస్థ అని ”కమ్యూనిస్టు ఇంటర్నే షనల్‌, సోవియట్‌ యూనియన్లు ప్రకటించాయి. ఈ పరిపక్వమైన అవగాహన వల్లనే ఫాసిజం ప్రమాదం నుండి ప్రపంచాన్ని రక్షించింది.
మరో పక్క ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారితీస్తున్నా సామ్రాజ్యావాద దేశాలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ కూడా ఫాసిజం, సోషలిజాన్ని నాశనం చేస్తుందన్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చారు. ఇంగ్లండ్‌ ప్రధాని చర్చిల్‌ 1927లో ఓ సభలో మాట్లాడుతూ ” నేను ఇటలీ దేశస్తుడనై వుంటే మీతోపాటు ఫాసిస్టుగా కచ్చితంగా వుండేవాడిని.” లెనినిజం అనే మృగం ఆకలికి, కోరికలకి వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటంలో చివరివరకు మీతో వుండేవాడిని” అని ఫాసిజాన్ని ప్రశంసిం చడం మన గమనంలో వుండాలి. అంతేకాదు, యుద్ధం ప్రారంభమై ఫాసిస్టు హిట్లర్‌ దేశదేశాల్ని ఆక్రమిస్తూ ముందు కొస్తున్నాడు, కలిసిరండని రష్యన్‌ కమ్యూనిస్టు ప్రభుత్వం పదేపదే కోరినా అమెరికా, ఇంగ్లండ్‌లు స్పందించకుండా ఉండిపోయాయి. బీరాలు పల్కిన ఫ్రాన్స్‌ హిట్లర్‌ పాదాక్రాంతం అయిపోయింది. ఇంగ్లాండ్‌ ఇక తమదేశం బలికానున్నదని వణికిపోతున్న తరుణంలో హిట్లర్‌ ఉన్న పళంగా యుద్ధాన్ని రష్యా పైకి మళ్లించాడు. అప్పటికీ మిత్రదేశాలు స్పందించకపోగా సోషలిస్టు రష్యా నాశనం చేయబడితే తమ వర్గ ప్రత్యర్ధి అంతం అయిపోతాడని కలలుకన్నారు. అమెరికా నాటి అధినేత (తర్వాత కాలంలో ఆ దేశ అధ్యక్షుడైన) హరీట్రూమన్‌ ” యుద్ధంలో జర్మనీ గెలిచేటట్లు వుంటే రష్యాకు, రష్యా గెలిచేటట్లుంటే జర్మనీని బలపర్చుదాం. ముందు వాళ్లలో వాళ్లని కొట్టుకుని ఎంత మందిని చంపుకుంటారో చంపుకొనీ” అనడం బట్టి వారి అసలు ఉద్దేశం అర్ధమవుతుంది.
ఏమైనా రష్యానే గెలిచింది
సామ్రాజ్యవాదులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, సోషలిస్టు రష్యా ఒంటిచేతి మీద ఫాసిస్టు జర్మనీని మట్టి కరిపించింది. రెండు కోట్ల మంది రష్యన్‌లు ఈ యుద్ధంలో సోషలిస్టు వ్యవస్థను కాపాడుకో వడానికి, ఫాసిజం నుండి ప్రపంచ మానవాళిని రక్షించడానికి ప్రాణతర్పణ చేసారు. అసమాన్యమైన యుద్ధ వ్యూహంతో, ప్రజాబలంతో, శక్తివంతమైన సోషలిస్టు సిద్ధాంత పటిమతో రష్యా, దాని అధినేత కామ్రేడ్‌ స్టాలిన్‌ నాయకత్వాన జర్మనీ సైన్యాన్ని ఫాసిస్టు శక్తుల్ని మట్టి కరిపించగలిగారు. ఇక యుద్ధంలో రష్యా విజయం తధ్యమని తేలిపోవడంతో అమెరికా, ఇంగ్లండ్‌లు మల్లగు ల్లాలు పడ్డాయి. 1945 ఏప్రిల్‌ 1న చర్చిల్‌ ” రష్యాగెలిస్తే ప్రజల మనస్సులో రష్యా స్థానం బలంగా పెరుగుతుంది. ఇది మనకు నష్టం కదా! అందువలన ఇక మనం రంగంలోకి దిగాలి. ఇక లోపాయికారిగా జర్మనీ సైన్యం రష్యాను చుట్ట ముట్టడాన్ని చూసీచూడకుండా వదిలేయ కూడదు.” అని సందేశం పంపాడు.
ఈ చరిత్ర ఏం చెబుతోంది!!
ఫాసిజం ఏ రూపంలో వున్నా, ఏ దేశంలోనైనా దాన్ని అంతిమంగా ఓడించగలిగేది సోషలిస్టు శక్తులే. ఫాసిజం అనేది అనుకోని ఓ చారిత్రక ఘటన కాదు. పెట్టుబడి వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుపోయే సందర్భంలో ఆ వర్గ పాలనే సంక్షోభంలోకి దిగిపోయేటప్పుడు వచ్చే రాజకీయ విధానం. ఈ క్రమంలో ఉదారవాద ప్రజాస్వామ్యం క్రమంగా బలహీనపడుతూ ఓగుణాత్మకమైన పరిణామంగా ఫాసిజం తెరపైకి వస్తుంది అంటారు ఫాస్టర్‌.
వలసకార్మికుల పైన (కాందిశీకుల పైన) మహిళలు, పర్యావరణ వాదులు, ట్రాన్స్‌జండర్‌ల పైన వారి హక్కుల పైన కార్మిక/ కర్షక ఉద్యమాల పైన విషం కక్కుతూ, భౌతిక దాడులు చేస్తూ ప్రారంభమైన ఫాసిజం జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి అందలం ఎక్కుతుంది. ప్రముఖ కమ్యూనిస్టు సిద్దాంతకారుడు రజనీపావిూదత్‌ తన గ్రంథం ”ఫాసిజం- సాంఘిక విప్లవం”లో ”బూర్జువా ప్రజాస్వామ్యంపై ఆధారపడి ఫాసిజాన్ని ఓడించలేము. కార్మిక వర్గం పీడిత వర్గాలను కలుపుకుని చేసే పోరాటాల ద్వారానే ఫాసిజాన్ని తుదముట్టించగలం” అన్న మాటలు గుర్తుంచుకుందాం.
ఆర్‌. రఘు
9490098422

]]>
‘నవోదయం’ https://navatelangana.com/innovation-2/ Wed, 08 May 2024 18:16:42 +0000 https://navatelangana.com/?p=286447 'నవోదయం'ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇది!
కొత్తగా తెల్లారినా కొత్త పొద్దు కోసం
కోటి ఆశలతో ఉత్కంఠ భరిత
మనసుల్ని గుప్పిట బిగించి
ఎన్నికల రణక్షేత్రానికి తరలి
వస్తున్నారంతా

సిబ్బంది పోలింగ్‌ సామాగ్రి
సిద్ధం చేసుకొంటుంటే
సీలు వేసిన ఇనుప బ్యాలెట్‌
బాక్సులు శూన్యాన్ని కండ్లుగా
చేసికొని ఖాళీ పొట్టలతో
ఆవురావురంటున్నాయి.
రాలే ఓటు ఫలాల కోసం
ఎదురుచూస్తున్నాయి!
డబ్భై ఏడేండ్ల స్వేచ్ఛా విహంగం
ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే
వంకర టింకర
అపభ్రంశ ముళ్లబాటల
పయనంలో వెనుకబాటు,
గాయాల ఆనవాళ్లే
ఎక్కువ వెక్కిరిస్తున్నాయి..
పాత తప్పిదాలకు పాతరేసే
సరైన సమయమిదే!

బాధ్యతగల రాజకీయాలకు
నిస్వార్ధప్రజాఆకాంక్షలు తోడైతే
బ్యాలెట్‌ బాక్సుల్లో
వెలుగులు చిమ్ముతూ
మనం కలలుగనే
నవభారతం
తప్పక ఉదయిస్తుంది..!!
– భీమవరపు పురుషోత్తమ్‌
 సెల్‌ : 9949800253

]]>
ఆపితే నెతన్యాహు, కొనసాగిస్తే జోబైడెన్‌ పతనం! https://navatelangana.com/if-netanyahu-continues-zobaiden-will-fall/ Tue, 07 May 2024 17:14:08 +0000 https://navatelangana.com/?p=285741 ఆపితే నెతన్యాహు, కొనసాగిస్తే జోబైడెన్‌ పతనం!పాలస్తీయునులపై ఇజ్రాయిల్‌ మారణకాండ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఓవైపు హమాస్‌తో చర్చలు అంటూనే మరోవైపు ఎడతెగని దాడులకు పాల్పడుతున్నది. బహిరంగంగా యుద్ధం ఆపాలని చెబుతున్నవారే, మళ్లీ వెనుకనుంచి ఆపొద్దని నెతన్యాహును హెచ్చరిస్తున్నారు. ఇది ఇలా కొనసాగుతుండగానే పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దమనకాండ పట్ల అమెరికాలో పెల్లుబికుతున్న నిరసనలు జోబైడెన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ యుద్ధం అమెరికాలో జరగబోయే ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశమున్నది. అందుకే నెతన్యాహు, జోబైడెన్‌ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు.
పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయిల్‌ మారణకాండ మంగళవారం నాటికి 214వ రోజుకు చేరుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చలు సాగుతున్నాయి. తమకు అంగీకారమే అని హమాస్‌ చెప్పింది. ఎటూ తేల్చకపోగా రఫా నగరం మీద సైనికచర్యకు ముందుకు పోవాలని ఇజ్రాయిల్‌ యుద్ధ మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. మరొకవైపు చర్చలకు తమ ప్రతినిధులను పంపుతామని చెబుతూనే సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారే వరకు వైమానిక దాడులు జరుపుతూ రాఫా-ఈజిప్డు సరిహద్దు ద్వారం దగ్గర పాలస్తీనా వైపు ప్రాంతాన్ని ఇజ్రాయిల్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గాజాలోని పౌరులకు ఐరాస అందిస్తున్న సహాయాన్ని కూడా అడ్డుకుంటున్నాయి.దాడుల్లో అనేకమంది మరణించారు. మధ్యవర్తులు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను హమాస్‌ ఆమోదించినప్పటికీ తమకు అంగీకారం కాదని, తమ డిమాండ్లకు చాలా దూరంగా ఉందని నెతన్యాహు కార్యాలయం చెప్పింది. సోమవారం నాటికి గాజాలో 34,735 మందిని ఇజ్రాయిల్‌ చంపివేసినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన వారు 78,108 మంది, గత 24 గంటల్లో మరణాలు 52, క్షతగాత్రులు 90 మంది అని వెల్లడించింది. రాఫాను ఖాళీ చేయాలని పౌరులను ఇజ్రాయిల్‌ ఆదేశించింది. ఇతర దేశాలకు ప్రత్యేకించి పక్కనే ఉన్న ఈజిప్టుకు వెళ్లకుండా దిగ్బంధనం గావించింది.ఇది రాసిన సమయానికి ఏం జరగనుందో తెలియని స్థితి.జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒకటి స్పష్టం.ఏదో ఒక ఒప్పందం చేసుకొని హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించాలని నెతన్యాహు మీద రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది.మరోవైపు హమాస్‌ను తుడిచిపెట్టకుండా వెనుదిరిగితే మీ సంగతి చూస్తామనే దురహం కారులు, మారణకాండకు మద్దతు ఇవ్వటాన్ని ఏమాత్రం సహించం అంటున్న విద్యార్థులపై జో బైడెన్‌ సర్కార్‌ కాల్పులకూ పాల్పడింది. గాజా దక్షిణ ప్రాంతంలోని రాఫా నగరం మీద దాడులకు దిగితే అక్కడ ఉన్న పిల్లలు పెద్ద సంఖ్యలో మరణించే అవకాశం ఉన్నందున హమాస్‌ ఒక అడుగు వెనక్కు తగ్గేందుకు నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఒక్కముక్కలో చెప్పాలంటే మారణకాండను కొనసాగించకపోతే నెతన్యాహు, ముందుకు పోతే ఎన్నికల్లో జో బైడెన్‌ పతనం ఖాయంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. మారణకాండను అంతర్జాతీయ న్యాయ స్థానం కూడా అడ్డుకోలేకపోయింది. తన ఆదేశాన్ని ధిక్కరించిన ఇజ్రాయిల్‌ను ఏమీచేయలేని అశక్తురాలిగా మారింది.పాలస్తీనా పౌరులకు సంఘీభావం తెలుపుతున్న విద్యార్థులు యూదు వ్యతిరేకులంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిందించి మరింతగా రెచ్చగొట్టారు.
మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో అనేక మంది మరణించినట్లు వార్తలు. వైమానిక దళం జరిపిన దాడుల్లో అనేక భవనాలు నేలమట్టం కాగా అనేక మంది శిధిలాల్లో చిక్కుకుపోయారు. ఎందరు గాయపడింది, మరణించిందీ ఇంకా స్పష్టం కాలేదు. తమ ఆసుపత్రికి పదకొండు మృతదేహాలు వచ్చినట్లు రాఫాలోని కువాయిట్‌ ఆసుపత్రి వెల్లడించింది. హమాస్‌ వద్ద ఉన్న తమ బందీలను విడిపించే వరకు దాడులు కొనసాగిస్తూనే ఉంటామని, మరోవైపు చర్చలకు తమ ప్రతినిధి బృందాన్ని పంపు తామని ఇజ్రాయిల్‌ ప్రకటించింది. ఇరవైలక్షల మందికి పైగా పాలస్తీనియన్లు గాజాలో వున్నారు. వారి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇజ్రాయిల్‌ మిలిటరీ తరలిస్తున్నది. ఈ క్రమంలో 64చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రాఫా నగరం, పరిసరాల్లో లక్షల మంది తలదాచుకుంటున్నారు. హమాస్‌ సాయుధులు జనంలో కలసిపోయినందున వారిని పట్టుకోవాలంటే పెద్ద ఎత్తున దాడులు చేయకతప్పదని ఇజ్రాయిల్‌ చెబుతున్నది. అసలు ఆ సాకుతోనే ఏడు నెలలుగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.రాఫా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించటం ఏ మాత్రం సహించరాదని ఐరాస ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఈ దాడులను వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా కబుర్లు చెబుతున్నది. బందీల విడుదలకు తాత్కాలిక కాల్పుల విరమణ అని ఇజ్రాయిల్‌ చెబుతుండగా పూర్తిగా గాజా నుంచి వైదొలగాని హమాస్‌ పట్టుబట్టటంతో ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న చర్చలు నిలిచిపోయాయి. సంప్రదింపుల ప్రక్రియ వెంటిలేటర్‌ మీద ఉంది, అందుకే ఒక మధ్యవర్తిగా ఉన్న కతార్‌తో చర్చలు జరిపేందుకు సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బరన్స్‌ వెళ్లినట్లు ఇజ్రాయిల్‌ మీడియా పేర్కొన్నది. మూడు దశల్లో ఒప్పందం అమలు జరుగుతుందని, తన వద్ద బందీలుగా ఉన్న 132 మందిలో 33 మందిని 42 రోజుల వ్యవధిలో విడుదలు చేస్తుందని దీనికి ఇరు పక్షాలూ అంగీకరించినప్పటికీ తదుపరి రెండు దశల గురించి వివాదం ఏర్పడిందని తొలుత వార్తలు వచ్చాయి. కొత్త ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్లు సోమవారం హమాస్‌ ప్రతినిధి ఈజిప్టు, కతార్‌ మంత్రులకు ఫోన్‌ ద్వారా తెలిపినట్లు వార్తలు. ఇజ్రాయిల్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా రాఫా ప్రాంతం నుంచి పాలస్తీనియన్లు వెళ్లిపోవాలని విమానాల నుంచి వెదజల్లిన కరపత్రాల్లో ఆదేశించటమేగాక, రాత్రి నుంచి దాడులను కూడా ప్రారంభించింది. ఒప్పందం కుదిరినా, కుదరకున్నా దాడులు చేసి తీరుతామని నెతన్యాహు చెబుతున్నాడు.
కైరో చర్చలు సఫలమౌతాయని, తక్షణ, శాశ్వత కాల్పుల విరణమకు దారితీస్తాయని కతార్‌ విదేశాంగశాఖ ప్రతినిధి మహమ్మద్‌ అల్‌ అన్సారీ చెప్పారు.వ్యవధి కోసం హమాస్‌ నాటకమాడుతున్నదని, దాడులను నిలిపివేసేందుకు, చర్చల వైఫల్య నెపం తమపై నెట్టేందుకు చూస్తున్నదని ఇజ్రాయిల్‌ ఆరోపిస్తున్నది. రాఫా ఇప్పుడు బాలల నగరంగా మారిందని, దాడులు జరిగితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం ఉంటుందని యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసిందని, రక్షణ కోసం పిల్లలు ఎక్కడకు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారని సంస్థ డైరెక్టర్‌ కాథరీన్‌ రసెల్‌ చెప్పారు. ఇప్పటికే అక్కడి పిల్లలు భౌతికంగా, మానసికంగా ఎంతో బలహీనపడ్డారని, పిల్లలతో పాటు మొత్తం జనాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఇజ్రాయిల్‌ దాడులకు ముందు నగరం, పరిసరాల జనాభా రెండున్నరలక్షలు కాగా ప్రస్తుతం అక్కడ పన్నెండు లక్షల మంది తలదాచుకుంటున్నారని, వారిలో దాదాపు ఆరులక్షల మంది పిల్లలే ఉంటారని చెబుతున్నారు. హమాస్‌ ఒక మెట్టు దిగిరావటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. దాడుల ప్రభావం పెద్దల మీద కంటే పిల్లల మీద ఎక్కువగా ఉంటుందని యూనిసెఫ్‌ హెచ్చరించింది. రాఫా మీద దాడి అంటే ఏదో విహారయాత్ర అని భావిస్తే పొరపాటు తమ వారిని రక్షించేందుకు పూర్తి సన్నద్దంగా ఉన్నామని హమాస్‌ ప్రకటించింది. దాడులకు పాల్పడవద్దని సౌదీ అరేబియా విదేశాంగశాఖ ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.
తమ నేత జో బైడెన్‌కు గాజా మరో వియత్నాంగా మారుతున్నదని, అయితే డోనాల్డ్‌ ట్రంప్‌ను వెనక్కు కొట్టేందుకు తాను బైడెన్‌కు మద్దతు ఇస్తున్నట్లు డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ ప్రకటించాడు. గాజాలో మారణకాండను ఖండిస్తూ అమెరికా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగటంతో ఎన్నికలలో పోటీ చేస్తున్న అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరకాటంలో పడ్డాడు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పూనుకోవటంతో పాటు ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయిల్‌ మీద ఒత్తిడి తెస్తున్నట్లు నాటకం ప్రారంభించాడు.రాఫాపై దాడులను వ్యతిరేకిస్తున్నట్లు బైడెన్‌ స్పష్టం చేసినట్లు జాతీయ భద్రతా మీడియా సలహాదారు జాన్‌ కిర్బీ చెప్పాడు. అర్ధగంటపాటు నెతన్యాహు-జో బైడెన్‌ ప్రయివేటుగా నిర్మాణాత్మకంగా మాట్లాడుకున్నారని అన్నాడు. నెతన్యాహుతో మాట్లాడిన తరువాత జో బైడెన్‌ వైట్‌హౌస్‌లో జోర్డాన్‌ రాజు రెండవ అబ్దుల్లాకు అనధికారిక మధ్యాహ్న విందు ఏర్పాటు చేశాడు. ఇజ్రాయిల్‌ గనుక రాఫాపై దాడులకు దిగితే పెద్ద ఎత్తున మారణకాండ జరిగే అవకాశముందని అబ్దుల్లా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఏడు నెలల దాడుల తరువాత గాజాలో తీవ్రమైన కరవు పరిస్థితి ఏర్పడిందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమ అధిపతి సిండీ మెకెయిన్‌ చెప్పాడు.తన మీద ప్రపంచ నేతలెవరూ ఏమాత్రం ఒత్తిడి తేలేరని, ఏ అంతర్జాతీయ సంస్థా ఇజ్రాయిల్‌ తనను తాను కాపాడుకోవటాన్ని అడ్డుకోజాలదని నెతన్యాహు ఆదివారం నాడు చెప్పాడు.
కొలంబియా విశ్వవిద్యాలయాన్ని అదుపులోకి తీసుకున్న న్యూయార్క్‌ పోలీసుల్లో ఒకడు విద్యార్థుల మీద కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. వారి వెనుక బయటి శక్తుల హస్తం ఉందనే సాకుతో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది.దీనికి కార్పొరేట్‌ మీడియా మరింతగా ఆజ్యం పోస్తున్నది.ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా రెచ్చగొడుతుంటే అంత ఎక్కువగా విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. గుడారాలను పీకివేస్తే వెంటనే కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. దొంగే దొంగని అరచినట్లుగా విద్యార్థుల నిరసనలను తప్పుదారి పట్టించేందుకు ఇజ్రాయిల్‌ అనుకూలురను రెచ్చగొట్టి పోటీ ప్రదర్శనలను చేయించటం, ఆ ముసుగులో పౌరదుస్తుల్లో ఉన్న పోలీసులు, బయటివారిని రప్పిస్తున్నట్లు అనేక చోట్ల స్పష్టమైంది. వారు విద్యా ప్రాంగణాల్లో ప్రవేశించి దాడులు చేస్తున్నారు. యూదు వ్యతిరేక నినాదాలు చేస్తూ విద్యార్ధుల ఆందోళనను తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. ఇలాంటి వారి చర్యలను చూపి మీడియా దాడులకు దిగుతున్నది. మీడియాకు జరుగుతున్నదేమిటో తెలిసినప్పటికీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది కనుక దాని ప్రాపకం కోసం కట్టుకథలు రాస్తున్నది, పిట్టకథలు చెబుతున్నది. పార్లమెంటు సభ్యుల కమిటీల పేరుతో విద్యాసంస్థల చాన్సలర్లు, అధ్యక్షులు, ఇతర అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి ఆందోళనను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలేమిటని అడ్డదిడ్డంగా ప్రశ్నిస్తున్నారు. గట్టిగా వ్యవహరించక పోతే రాజీనామా చేసి ఇంటికిపోండని ఒత్తిడి తెస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచి వేయకపోతే తాము ఇచ్చిన విరాళాలను స్తంభింపచేస్తామని బెదిరించేందుకు దాతలను రంగంలోకి దించారు. నిజానికి వీరంతా బయటివారు తప్ప ఆందోళన చేస్తున్న వారు లేదా వారికి మద్దతు ఇస్తున్నవారు కాదు. ఇలాంటి వారిని చూసి ఆందోళనలకు దూరంగా ఉన్నవారు తొలిరోజుల్లో పొరపాటు పడినా అనేకమంది ఇప్పుడు తోటి విద్యార్థులతో చేతులు కలుపుతున్నారు. అమెరికా పాలకుల నైజాన్ని బయటపెడుతున్నారు.
ఎం కోటేశ్వరరావు
8331013288

]]>
నోటాతో మోడీ పోటీ! https://navatelangana.com/modis-competition-with-nota/ Tue, 07 May 2024 17:12:07 +0000 https://navatelangana.com/?p=285738 నోటాతో మోడీ పోటీ!ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వా మ్య దేశంగా గొప్పలు చెప్పుకునే దేశంలో అసలు ప్రతిపక్షం అనేది ఉండకూడదా? ప్రతిపక్షాలు ఆందోళన పడుతున్నట్టుగా నిజంగానే మోడీ మరోసారి అధికారం చేపడితే భారత దేశంలో ఇవే చివరి ఎన్నికలా? ఇన్నాళ్లుగా తన అధికారం కోసం కుల, మతాల మధ్య వైషమ్యాలు పెట్టి అది పారక ప్రతిపక్ష పార్టీల నేతలను ఈడి పేరుతో జైళ్లో పెట్టించాడు. కానీ ఇప్పుడు ఏకంగా కుర్చీ కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులనే ట్యాంపర్‌ చేస్తూ తనకు ప్రత్యర్థులు లేకుండా చేసుకుంటు న్నాడు. అంటే ఇదో రకంగా మోడీ నోటాతో పోటీ పడుతున్నట్టే. ఎందుకంటే ఏ స్థానాలైతే అసంబద్ధంగా కైవసం చేసుకోవాలని చూస్తున్నాడో, ఆ పార్లమెంటు నియోజకవర్గాల ప్రజల పరిస్థితి ఏంటి? వారికి ఓటు హక్కు వినియోగించుకోనే అవకాశం ఎక్కడుంటుంది?
లోక్‌సభ ఎన్నికలలో ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేష్‌ కుంభాని నామినేషన్‌ రద్దుకావడం, ఇతర ఇండిపెండెంట్లు బరిలోనుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముకేష్‌ దలాల్‌ పోటీ లేకుండా అసంబద్ధంగా ఏకగ్రీవమయ్యారు. అక్కడ దాదాపు 18 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని, తమకు నచ్చిన ప్రజా ప్రతినిధి ఎన్నుకునే అవకాశం లేకుండా పోయింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షరు కాంతి బమ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరడం రాజకీయం మరింత రాజుకుంది. మే 13న మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి ఇండోర్‌ లోక్‌సభా స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు నామినేషన్ల ఉపసంహరణకు సరిగ్గా చివరి రోజు వెళ్లి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నాని అందరూ చూస్తుండగానే మీడియా ముఖంగా తన నామినేషన్‌ ఉపసంహరించు కున్నారు.”ప్రధాని మోడీ మార్గదర్శ కత్వంలోని బీజేపీ ప్రగతిశీల ఆలోచనలు నచ్చి మా సహచరుడు కైలాస్‌ విజయ వర్గీయ, ఎమ్మెల్యే రమేష్‌ మెండోలాతో కలిసి, లోక్‌సభ అభ్యర్థిత్వం నుంచి వైదొలిగి బీజేపీలో చేరుతున్న అక్షరు కాంతి బమ్‌కు సాదర స్వాగతం పలుకుతున్నా” అని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ప్రకటిం చారు. దీన్నిబట్టి చూస్తే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని తెలుస్తోంది.
ఇండోర్‌లో అక్షర కాంతి బామ్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటి? నిజంగానే మోడీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్య డా? కానీ వాస్తవంగా పరిశీలిస్తే దీనికి వెనుక పెద్ద రాజకీయ కుట్రకోణం దాగుందనిపిస్తోంది. సరిగ్గా అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకొనే మూడు రోజుల ముందు 17 ఏండ్ల కిందటి స్థల వివాదం కేసును బయటకు తీశారు. ఓ వ్యక్తిని బెదిరిం చాడని సెక్షన్‌ 307 కింద కోర్టుకు హాజరు కావాలని నోటీసులు అందాయి. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పార్టీలో చేరాడు. ఇదంతా యాదృచ్చికంగా జరిగిందనుకుంటే పొరపాటే! నాగపూర్‌ తర్వాత ఇండోర్‌ ఆరెస్సెస్‌కు అత్యంత ముఖ్యమైన స్థావరం. అలాంటి ఇండోర్‌లో గత 40 ఏండ్లుగా అంటే 2019 వరకు అక్కడ సుమిత్ర మహజన్‌ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయితే 2019లో శంకర్‌ లల్వానీకి టికెట్టిచ్చి ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలిపించింది బీజేపీ. అంత మెజార్టీ స్థాయిలో గెలిచిన పార్లమెంటు సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ని ఎందుకు విత్‌డ్రా చేయించింది? దీన్ని బట్టి చూస్తే ఓటమి భయం బీజేపీని వెంటాడుతుందా? అంటే దీన్నిబట్టి చూస్తే అదే అర్థమవుతున్నది. అందుకే బీజేపీ అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ఇండోర్‌ వరకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందా? అన్న వాదనలకు బలం చేకూరుస్తున్నది.
మొన్న ఖజురహోలో సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థి మీరా యాదవ్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీనికి కారణాలు బయటకు పొక్కకున్నా ఇందులో బీజేపీ పాత్ర ఉందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇండోర్‌లో కేవలం ఒకే ఒక్క జాతీయ పార్టీ బీజేపీ మాత్రమే పోటీలో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ఎన్నుకోబడిన వారే ప్రజాప్రతినిదులు కావాలి కానీ బీజేపీ ఎవరు పోటీలో ఉండాలో, ఉండకూడదో నిర్ణయిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకం. ఇలా పోటీలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనుకున్నపుడు ఇంకా ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పౌరుడు తనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛని ఉండాలి. ప్రజల్లో ఓటు గొప్పతనాన్ని చాటి చెప్పి ఓటింగ్‌ శాతం పెంచే విధంగా కృషి చేయాలి. కానీ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఏకపక్షంగా ప్రతిపక్షం లేకుండా ఏకగ్రీవం చేయడం, వారికి పోటీ అనుకున్నవారిని బలవంతంగా తప్పించడం బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాయి.
ఇప్పటికే తన అధికారానికి అడ్డుగా ఉన్నారని కేజ్రీవాల్‌, లొంగడం లేదని హేమంత్‌ సోరెన్‌ లాంటి ముఖ్యమంత్రుల మీద కేసులు పెట్టించి ఈడి పేరుతో జైల్లో పెట్టడం చూశాం. అది చాలదంటూ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులన సామ, దాన, భేద, దండో పాయాలు ఉపయోగించి లొంగదీసుకుం టున్నాడు. ప్రతిపక్ష నాయకులు ‘ఉంటే మోడీ జేబులో ఉండాలి.. లేదంటే జైల్లో ఉండాలి’ అనే విధంగా తయారైంది బీజేపీ రాజకీయ వ్యవహరం.
మొన్న ఖజురహో! నిన్న సూరత్‌! నేడు ఇండోర్‌, మరి రేపు ఎక్కడో? మోడీ అధికార దాహానికి ఎన్ని స్థానాల్లో ఓటర్లు ఓటేయకుండా బలికావాలి? బీజేపీ ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా కూడా ఎన్నికల కమిషన్‌ చూసీ చూడనట్లు వ్యవహరించడం శోచనీయం. ఇదంతా చూస్తూ ఉంటే వామపక్షాలు చెబుతున్నట్టు 2024లో మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే ఇవే చివరి ఎన్నికలవుతాయి అనేది నిజం కాబో తుందా? ప్రజాస్వామ్య మనుగడ అనేది ఇక ప్రశ్నార్థక మేనా? ప్రజలు ఆలోచించాల్సిన సమయమిది.
భరత్‌ చౌహాన్‌
9030666999

]]>
ఓటు విలువ తెలుసుకో.. https://navatelangana.com/know-the-value-of-vote/ Tue, 07 May 2024 17:07:07 +0000 https://navatelangana.com/?p=285736 ఓటంటే ఒట్టి మాటల కోట కాదు
ఓటంటే ప్రజాస్వామ్య బాట
ఓటంటే ఇంకు చుక్క కాదు
ఓటంటే వ్యవస్థనే
మార్చుకునే వెలుగు చుక్కఓటంటే ఒట్టి మాటల కోట కాదు
ఓటంటే ప్రజాస్వామ్య బాట
ఓటంటే ఇంకు చుక్క కాదు
ఓటంటే వ్యవస్థనే
మార్చుకునే వెలుగు చుక్క
ఓటంటే చిత్తుకాగితం కాదు
ఓటంటే ప్రజా చైతన్యగీతం
ఓటంటే కీర్తి కిరీటం కాదు
ఓటంటే స్ఫూర్తీ పోరాటం
ఓటంటే అసామాన్య స్వరబాణి కాదు
ఓటంటే సామాన్య జనవాణి
ఓటంటే అమ్ముకునే సరుకు కాదు
ఓటంటే నీ అంబులపొదిలో శరము
ఓటంటే అపరిచిత పదం కాదు
ఓటంటే ఆత్మశుద్ది వాక్యం
ఓటంటే స్వార్థాల వ్యవహారం కాదు
ఓటంటే నిస్వార్థాల సమహారం
ఓటంటే నిన్ను ఎత్తుకునే సంపతి కాదు
ఓటంటే నున్ను హత్తుకునే సోపతి
ఓటంటే రాచరికపు పీఠం కాదు
ఓటంటే రాజ్యాంగపు పాఠం
ఓటంటే వాగ్దానాల వర్షం కాదు
ఓటంటే వమ్ముకాని హర్షం
ప్రజాస్వామ్య పరిరక్షణకే ఈ యుద్ధం
బాధ్యతగా వేసే ఓటే ప్రగతికి అద్దం..!
డా.కటుకోఝ్వల రమేష్‌
సెల్‌: 9949083327

]]>
డ్రెయినేజీ సమస్య పరిష్కరించండి సారూ… https://navatelangana.com/solve-the-drainage-problem-sir/ Tue, 07 May 2024 16:55:34 +0000 https://navatelangana.com/?p=285733 నగరంలోని ఉప్పల్‌ నుంచి బోడుప్పల్‌ వెళ్లే రోడ్డుపై ఉన్న డ్రెయినేజీ నీరు వారానికి ఓసారి పొంగి పొర్లుతోంది. ఈ నీరంతా కూడా కాలనీల్లోకి ప్రవేశించడంతో రోడ్ల మీద పాదచారులకు నడవం ఇబ్బంది అవుతున్నది. అలాగే డ్రెయినేజీ కంపుతో దుర్వాసన వస్తున్నది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం స్థానిక కార్పొరేటర్‌కు కాలనీవాసులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. మున్సిపల్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా కంప్లయింట్‌ ఇస్తే వచ్చి క్లియర్‌ చేస్తారు. కానీ రోడ్లపైనున్న డ్రెయినేజీ చెత్తను తొలగించడం లేదు. దీంతో మరల కంప్లయింట్‌ ఇస్తే వచ్చి క్లియర్‌ చేసేసరికి మళ్లీ రోడ్డు మీద డ్రెయినేజీ పొంగుతున్నది. ఇది రోజూ షరామామూలైంది. ఈ సమస్యపై దాదాపు ఏడాది కాలంగా కార్పొరేటర్‌కు విన్నవిస్తే పట్టించుకోవడం లేదని కాలనీవాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక్క డ్రెయినేజీనే కాదు రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉన్నది. చిన్నపాటి వర్షానికి పూర్తిగా గుంతలు, రాళ్లు పైకి లేచి వస్తున్నాయి. చిన్నచిన్న యాక్సిడెంట్స్‌ కూడా అవుతున్నాయి. ఉదయం, సాయంత్రం అనేక స్కూల్‌ బస్సులు, ఆటో లు ఈ రోడ్డున వెళ్తుంటాయి. అయినా కూడా అధికారులు రోడ్డును బాగు చేద్దామనే ఆలోచనకు రావడం లేదు. కనీసం కార్పొరేటర్‌ అయినా పట్టించుకుంటారనే ఈ సమస్యలను గాలికొదిలేశారు. వాస్తవానికి ఈ డ్రెయినేజీ సమస్య చాలా చిన్నది. పౖౖెనుంచి వస్తున్న దురేనేజ్‌ లైన్‌ను స్ట్రెయిట్‌గా కలిపేస్తే ఆ వాటర్‌ ఇరు పక్కలకు పొంగకుండా ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్నది. ఇప్పటికైనా ఈ డ్రెయినేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
– ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌, 9490300867

]]>
వారసత్వ పన్ను https://navatelangana.com/inheritance-tax/ Mon, 06 May 2024 18:34:12 +0000 https://navatelangana.com/?p=284946 వారసత్వ పన్నుపై మోడీ చేస్తున్న ప్రకటనలు అల్పత్వాన్నే చూపిస్తున్నాయి. ఒక దేశ ప్రధాని నుంచి ఈ స్థాయి ప్రకటనలు రావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ స్థాయిలో ఉన్నవారు చేయదగిన ప్రకటనలు కావవి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శామ్‌ పిట్రోడా వారసత్వ పన్ను ప్రవేశపెట్టే విషయమై ప్రస్తావించారు. దాన్ని వ్యతిరేకించే వారు వేరే ఏమైనా హేతుబద్ధ వాదనలు చేయవచ్చు. నిజానికి ఇటువంటి ప్రతిపాదన మీద లోతైన చర్చ జరగవలసిన అవసరం కూడా ఉంది. కాని మోడీ ప్రతిస్పందనలో అటువంటి వాదనలేమీ లేవు సరికదా చాలా నీచమైన వ్యాఖ్యానాలు చేసి అటువంటి ప్రతిపాదన చేయడమే అర్ధం లేనిదన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నించారు. ఒక దురుద్దేశ పూరితమైన ప్రయత్నంతో లోతుగా జరగవలసిన చర్చను అపహాస్యం పాలు చేయబూనుకున్నారు. మోడీ చేసిన రెండు వ్యాఖ్యానాలు ఇలా ఉన్నాయి: ప్రేక్షకులలో కూర్చున్న మహిళలను ఉద్దేశించి వారసత్వపన్ను ప్రవేశపెడితే వారి తాళిబొట్లు లాక్కుంటారని, చచ్చిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళని విడిచిపెట్టదని మోడీ అన్నారు. ఇందులో మొదటి వ్యాఖ్యానం శుద్ధ తప్పు. ఎందుకంటే వారతస్వ పన్ను ఒక స్థాయిని దాటి అధికంగా ఉన్న సంపదమీదనే విధిస్తారు. ఇక రెండోది కేవలం ప్రేక్షకుల నుండి వ్యతిరేకతను రప్పించడం కోసం మాత్రమే చేసినది. అది ఏరకంగా చూసినా వాదన అనిపించుకోదు. ఒక వ్యక్తి మరణా నంతరం అతడి వారసులకు సంక్రమించే సంపదమీద పన్ను విధించడంలో తప్పు ఏమీ లేదు.
ప్రస్తుత కాలంలో ఆర్థిక పరిస్థితిని బలపరచడానికి తీసుకోవలసిన గట్టి చర్యల సంగతి చూద్దాం. ఆదా యాల్లోను, సంపద లోను అంతరాలు నయా ఉదారవాద కాలంలో బాగా పెరిగిపోయాయని దాదాపుగా అందరూ అంగీకరిస్తున్నారు. భారతదేశంలోనైతే ఈ విధానాల ఫలితంగా నిష్ట దారిద్య్రంలోకి వచ్చి పడినవారు కూడా ఎక్కువయ్యారు. ఎన్డీయే పాలనాకాలంలో ఈ దారిద్య్రం మరీ కొట్టొచ్చినట్టు పెరిగింది. 2014-15 నుండీ గ్రామీణ శ్రామికుల ఆదాయాల్లో పెరుగుదల నిలిచిపోయి స్తంభించిపోయాయన్న వాస్తవం గురించి ఇదివరకే మనం చెప్పుకున్నాం. వాస్తవ ధరల పెరుగుదలను యథాతథంగా చూపించే విధంగా గనుక ధరల సూచీని సరి చేస్తే గ్రామీణ ప్రజల వేతనాల్లో నిజానికి తరుగుదల కనిపిస్తుంది. శ్రామికుల బేరసారాల శక్తి కూడా సన్న గిల్లింది. నిరుద్యోగం ఈ కాలంలో బాగా పెరిగిపోవడం వల్లనే ఇది జరిగింది. నిజ వేతనాల్లో తరుగుదలతో పాటు నిరుద్యోగం కూడా పెరగడం వలన నిష్ట దారిద్య్రం గత ఏభై సంవత్సరాలలోనూ ఎన్నడూ లేనంతగా పెరిగిపోతోంది.
నయా ఉదారవాద విధానాలను యథేచ్ఛగా కొనసాగనిచ్చిన ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడింది. అందుచేత ప్రభుత్వం కొన్ని ఆర్థిక పరమైన చర్యల ద్వారా జోక్యం కల్పించుకుని ఆ విధానాలను కట్టడి చేయవలసి వుంటుంది. సంపన్నుల మీద పన్నులను పెంచి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదలకు బదిలీ చేయడమో, లేక వారికి ప్రభుత్వ సహాయాన్ని పెంచడమో చేయాల్సి వుంటుంది. దారిద్య్రం తీవ్రతరమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి ఆర్థిక జోక్యానికి గనుక ప్రభుత్వం పూనుకోకుంటే అది శ్రామిక ప్రజలకు తీరని ద్రోహం చేయడమే ఔతుంది. సంపన్నుల మీద ప్రత్యక్ష పన్నులను విధించడం ప్రభుత్వం చేయవలసిన విధి. అలాగాక, పరోక్ష పన్నులను పెంచితే దాని భారం మళ్లీ ఆ నిరుపేదల మీదే పడుతుంది.
ఈ ప్రత్యక్ష పన్నులను విధించే మార్గం ఏమిటి? ఆదాయాల మీద గాని, సంపన్నులు చేసే వ్యయాల మీద గాని, వారివద్ద ఉన్న సంపద మీద గాని, కంపెనీల షేర్ల రూపంలో ఉన్న సంపద మీద గాని, లేదా వార సత్వంగా సంక్రమించిన సంపద మీద గాని పన్నులు విధించవచ్చు. ఒకవేళ కంపెనీల షేర్ల రూపంలో ఉన్న సంపదను మినహాయించాలనుకుంటే తక్కిన రూపాల్లోని సంపదమీద విధించే పన్ను రేటును మరింత పెంచాల్సి వుటుంది. ఐతే ఇదేమంత మంచి ఆలోచన కాదు. కంపెనీల షేర్లతో సహా అన్ని రూపాల సంపదల లావాదేవీల మీదా పన్నులను విధిస్తే అది అథిక సంపన్నులమీద ఎక్కువగా భారం పడుతుంది. కంపెనీల షేర్లను మినహాయిస్తే అప్పుడు కావలసిన ఆదాయాన్ని సమకూర్చుకోడానికి పన్ను పరిధిలోకి ఇంకా ఎక్కువ మందిని తీసుకు రావలసి వస్తుంది. సంపద పన్ను విధించినందు వలన పెట్టుబడుల ప్రవాహం మీద ఎటువంటి ప్రభావమూ ఉండదు (ఎందుకంటే పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రభావితం చేసే అంశాలు-మార్కెట్‌లో వృద్ధి అంచనాలు, పన్నులు పోను మిగిలే లాభాల రేటు, వడ్డీ రేటు వగైరాలేవీ సంపద ఎంత ఉంది అన్న అంశంమీద ఆధారపడి ఉండవు). అదే లాభాల మీద పన్ను పెంచితే అప్పుడు పెట్టుబడులు తగ్గిపోవచ్చు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పెట్టుబడి దారులు వెనక్కి తగ్గుతారు. పైగా సంపదలో, ఆదాయాల్లో అసమానతలు బాగా పెరిగిపోతే ఆర్థిక వ్యవస్థ సమతూకం దెబ్బతింటుంది గనుక ఎటుతిరిగీ ఆ అసమానతలను తగ్గించాల్సిందే. అందుకు సంపదమీద, వారసత్వ సంపద మీద పన్నులు వేయడం తప్పదు.
పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధించేవారంతా ఒక వాదనను బలంగా ముందుకు తెస్తారు. సమాజంలో తక్కినవారెవరికీ లేని ప్రత్యేక లక్షణాలు పెట్టుబడిదారులకు ఉంటాయని, ఆ లక్షణాల వల్లనే వారు లాభాలను ఆర్జించడానికి తాపత్రయ పడతారని, సమాజానికి అది తోడ్పడుతుందని, అందుచేత ఎక్కువ సంపదను కలిగి వుండే అర్హత వారికి ఉందని అంటారు. ఇది మార్క్సిస్టు దృక్పథానికి పూర్తిగా వ్యతిరేకం. కార్మికుల శ్రమను కొల్ల గొట్టడం ద్వారా పెట్టుబడిదారులు లాభాలను ఆర్జించగలుగుతున్నారని మార్క్సిజం అంటుంది. ఇంతకూ వాళ్లు చెప్పే ఆ ‘ప్రత్యేక’ లక్షణాలేమిటి? కొత్త పద్ధతులను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ తమ లాభాలను పెంచు కోగలగడమే ఆ ప్రత్యేక లక్షణం అని స్కంపీటర్‌ అన్నాడు. పెట్టుబడులు పెట్టి రిస్క్‌ తీసుకునే లక్షణం ఉందని మరొకరు అన్నారు.
వాదన కోసం వాళ్లు చెప్పినట్టు పెట్టుబడిదారుడికి ప్రత్యేక లక్షణాలు ఉన్నందువల్లనే అతడి దగ్గర సంపద బాగా పోగుబడిందనుకుందాం. ఐతే, అతగాడి దగ్గర సంపద పోగుబడినంత మాత్రాన అతడి సంతా నానికి అతడి ప్రత్యేక లక్షణాలు సంక్రమించాయని అనుకోలేం. అతడి సంతానం స్వతంత్రంగా, అంటే, తండ్రి సంపదతో నిమిత్తం లేకుండా తమ ప్రత్యేక లక్షణాలను ముందు రుజువు చేసుకోగలగాలి. అప్పుడే తక్కిన కొత్తగా రంగంలోకి వస్తున్న పెట్టుబడిదారులతో సమాన స్థాయిలో మార్కెట్‌లో పోటీ పడడం సాధ్యమౌతుంది. అలా కాకుండా, తమ తాత ముత్తాతల కాలం నుంచీ పోగేసిన సంపదకు వాళ్లు వారసులుగా ఆ సంపదనంతటికీ హక్కుదారులు అయ్యారనుకుందాం. అప్పుడది పెట్టుబడిదారీ సమర్ధకులు చెప్పే (పెట్టుబడిదారులకుండే ప్రత్యేక లక్షణాల) సిద్ధాంతానికి వ్యతిరేకం కాదా? వారికి ప్రత్యేక లక్షణాలు ఉన్నదీ లేనిదీ రుజువు కాకుండానే వారు సంపన్నులు ఎలా అవగలుగుతారు? అందుచేత వారసత్వ సంపద అనేది పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధించే వారి సిద్ధాంతానికి సైతం విరుద్ధం.
అందుచేత నైతికంగా తమ పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధించుకోడానికి, చాలా సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో, తమకు బొత్తిగా ఇష్టం లేకపోయినప్పటికీ, వారసత్వ పన్నును ప్రవేశపెట్టారు. ఉదాహ రణకు, జపాన్‌ దేశంలో వాసత్వపన్ను 55 శాతం దాకా వసూలు చేస్తున్నారు. కాని భారతదేశంలో ఎటువంటి వారసత్వ పన్నూ లేదు. సంపద పన్ను కూడా నామమాత్రమే. సంపదపన్నుకి న్యాయం జరగాలంటే వారసత్వ పన్ను తోడుగా ఉండాలి. వారసత్వ పన్ను అనేది లేకుండా కేవలం సంపద పన్ను మాత్రమే విధిస్తే ఆ సంపదను వారసులందరూ చిన్నచిన్న ముక్కలుగా పంచుకున్నట్టు చూపించి ఆ సంపద పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటారు. ఒక్కోసారి అసలు యజమాని ఇంకా జీవించి ఉన్నప్పుడే పంపకాలు జరిగిపోతాయి.
కాబట్టి సంపదను బిడ్డల పేరనో, మిత్రుల పేరనో బదిలీ చేయక మునుపే వారసత్వ పన్ను ఆ సంపద మీద విధించాలి. ఒకానొక స్థాయిలో పోగుబడిన సంపదమీదనే వారసత్వ పన్ను విధించాలి. అంతకు తక్కువ ఆస్తి ఉంటే దానిని మినహాయించాలి. లేకపోతే మోడీ వంటి వారు మంగళసూత్రం కూడా ఆస్తే కనుక అది కూడా లాక్కుంటారు అన్న అర్ధం లేని వాదనలను తెస్తారు. సామాన్య ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. ఆస్తిపరుడు చనిపోయిన అనంతరం మాత్రమే వర్తించేలా కాకుండా, అతడు జీవించి వుండగానే ఆస్తిని పంపకాలు చేసినప్పుడు కూడా వర్తించేలా వారసత్వ పన్ను అమలు చేయాలి.
ఈ సంపద పన్నును గాని, వారసత్వ పన్నును గాని అమలు చేయడం కష్టం అనే వాదనను కొందరు ముందుకు తెస్తారు. పైగా దీనినుండి చాలా తక్కువ మొత్తంలో పన్ను వసూలౌతుందని వారంటారు. అందుచేత భారతదేశంలో పన్ను వసూళ్ల పద్ధతులను అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన సవరణలన్నీ చట్టాలలో తెచ్చి కచ్చితంగా ఈ పన్ను వసూలే అయేట్టు కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాల్సి వుంటుంది. జపాన్‌ వంటి దేశాల్లో అది ఎలా అమలు చేయగలుగుతున్నారో కూడా పరిశీలించాలి.
ఈ వారసత్వ పన్ను డిమాండు మన జాతీయోద్యమ డిమాండ్లలో ఒకటిగా ఉంది. 1931లో జరిగిన కరాచీ జాతీయ కాంగ్రెస్‌ మహాసభల్లో స్వతంత్ర భారతదేశంలో పౌరులందరూ సమానులుగా ఉండాలని, చట్టం ముందు అందరూ సమానులుగానే పరిగణింపబడాలని, రాజ్యం దృష్టిలో అన్ని మతాలనూ ఒకే విధంగా చూడా లని చెప్పారు. వాటితోబాటు ”ఒకానొక పరిమితికి మించిన ఆస్తులు ఉన్నవారి నుండి వారి తదనంతరం ఆస్తులు పొందే వారసులపై పన్ను విధించాలి” అని కూడా ప్రకటించారు. కరాచీ జాతీయ మహాసభలు ఆనాటి మన దేశ రాజకీయ జీవితం మీద వామపక్ష భావజాలం ఆధిక్యత కలిగివుండడాన్ని సూచిస్తాయి. జాతీయ కాంగ్రెస్‌ పార్టీ లోపల, వెలుపల కూడా ఈ ఆధిక్యత కనపడుతుంది. ఈ కరాచీ మహాసభలు 1931 మార్చి 26న జరిగాయి. భగత్‌సింగ్‌, అతడి సహచరులను ఉరితీసిన మూడు రోజుల అనంతరమే జరిగిన మహాసభలు ఇవి. ఈ తీర్మా నాలకు ప్రజానీకం నుండి మొత్తంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించినవారు జవహర్‌లాల్‌ నెహ్రూ. మహాత్మా గాంధీ ఈ తీర్మానాన్ని లోతుగా పరిశీలించి ఆమోదించినర తర్వాతే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ సభలకు అధ్యక్షుడు వల్లభారుపటేల్‌. ఈ చరిత్ర పరిశీలిస్తే మన ప్రధాని మోడీకి వలస పాలనపై సాగిన జాతీయోద్యమం గురించి ఎటువంటి అవగాహనా లేదని అర్ధం ఔతోంది.
ప్రస్తుత పరిస్థితిలో సంపద పన్ను, దానితోబాటు వారసత్వ పన్ను విధించడం చాలా అవసరం. కేవలం పెరుగుతున్న అసమానతలను అరికట్టడానికే కాదు, దేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా మలచడానికి కూడా అవసరం. కరాచీ తీర్మానం ఆశించిన ఆర్థిక న్యాయం అప్పుడే సాధ్యం.
(స్వేచ్ఛానుసరణ)

– ప్రభాత్‌ పట్నాయక్‌

]]>
‘కండ్లు తిరిగి పడిపోకండ్రీ !’ https://navatelangana.com/dont-roll-your-eyes/ Mon, 06 May 2024 18:32:34 +0000 https://navatelangana.com/?p=284940 ఆహా హా… పెద్దసారు ఏమి చెప్తిరి, ఏమి చెప్తిరి. తెలుగువారికి… పెరుగన్నంలో కొత్త ఆవకాయ నంజుకున్నంత మజాగా ఉంది మరి!
(ప్రధాని మోడీ ఓ తెలుగు పత్రికకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వూ చూసి (నవ తెలంగాణ కాదు)
‘రోజుకు ఎన్నిగంటలు పని చేసానని లెక్కలేసుకునే వ్యక్తిని కాదు. కొన్ని అలవాట్లను చిన్నప్పుడే నేర్చుకుని ఇప్పటికీ పాటిస్తున్నాను. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తా. నా జీవితంలో పనికి, విశ్రాంతికి మధ్య తేడా లేదు. పనిలోనే విశ్రాంతి వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాను’.
– పాపం సెమించుగాక, ఈ ఇసయం తెలియకనే మన దేశంలో కోట్లాదిమంది రైతులు కూలీలు పొద్దస్తమానం పనే చేస్తుంటారు. ప్చ్‌. ఏం చేద్దాం. ఎవరి ఆకలి వారిది. ఎవరి పని వారిది. ఎవరి విశ్రాంతి వారిది. అంతేగా… అంతేగా….
‘పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ధృడమైన హామీ ఇస్తున్నా. దాన్ని పూర్తి చేసే బాధ్యత నాదే. దాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే రూ.15 వేల కోట్లకు పైగా విడుదల చేసింది. సాంకేతిక సహాయమూ అందిస్తుంది.’
– అబ్బబ్బా ఇన్నాళ్లూ ఈ తెలుగోళ్లు ముఖ్ఖెంగా ఈ ఎ.పి. పెజలు ఎంత యాగీ చేసీ… ,చేసీ… పోలవరం నిర్మాణ పనులు అడ్డుకున్నారు. పదేండ్లంటే మాటలా… వాళ్ళకింకేం పని లేదా.. ? పొగరు కాకపోతే ఏంటిది? బొత్తిగా యవ్యారం తెల్వదు. అందుకే అలా తగలడ్డారు. గందుకే మళ్లీ మళ్లీ యాద్‌ చెయ్యాల్సి వస్తుంది. చెప్పి చెప్పి నా నోరు పడి పోతుందీ….
‘ఈ రోజు మనం మొబైళ్ల తయారీ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. మన రక్షణ ఎగుమతులు రూ.21 వేల కోట్లు ఉంటాయి. సౌర విద్యుత్‌ పరికరాల తయారీలో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా అవతరించ బోతున్నాం. ఇంత విస్తృత స్థాయిలో మనం చేస్తున్న పనులు కొత్త ఉద్యోగాలు సృష్టించవనుకుంటున్నారా?’
-వార్ని ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు. ఈ పదేండ్లల్లో 20 కోట్ల ఉద్యోగాలు మెరుపు వేగంతో వచ్చాయి. పోయాయి. యువతే చేతగాని దద్దమ్మ ల్లా వాటిని పట్టుకోకుండా లొల్లి చేస్తే ఎలా? అర చేతిలోబెల్లంపెట్టి మోచేతిని నాకమంటే నాకరేంటి?
‘వాస్తవానికి మేం రెండు రాష్ట్రాలకు చాలా మేలు చేసాం. 14, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 2015-20 మధ్య కాలంలో రూ.22 వేల కోట్లు, 2020 – 26 మధ్య కాలంలో రూ.35 వేల కోట్లు గ్రాంటుఇచ్చాం. ఇవ్వబోతున్నాం. దీనికి తోడు వనరుల లోటు భర్తీ, 7 వెనుక బడిన జిల్లాల అభి వృద్ధి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విదేశీ సాయం. కింద చేపట్టిన ప్రాజెక్టుల రుణాలపై వడ్డీరాయితీ కోసం 2014-23 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు 35 వేల కోట్లకు పైగా విడుదల చేసాం’.
– ఇచ్చాం … ఇవ్వబోతున్నాం. వేల కోట్ల సాయం మాటల్లోని ఆంతర్యం లోగొట్టు పెరుమాళ్ళకే ఎరుక. అంతా శంకరాచార్యుని గజం మిధ్య పలాయపం మిధ్య.
ఈ ‘మండే ఎండల మాటలకు’ ఎవరికి వారు కండ్లు తిరిగి పడిపోకుండా జాగర్త పడాలి మరి. అంతేగా…. అంతేగా….
– శైలి, 9959745723

]]>
పదేండ్ల బ్యాంకింగ్‌ సంస్కరణలు- శ్రమదోపిడీకి పరాకాష్ట https://navatelangana.com/decades-of-banking-reforms-are-the-culmination-of-labor-exploitation/ Mon, 06 May 2024 18:28:55 +0000 https://navatelangana.com/?p=284943 Decades of banking reforms - the culmination of labor exploitationభూగోళం పుట్టుక, మానవ సమాజ పరిణామ క్రమం గురించి అభ్యుదయ కవితా సారథిగా పేరుగాంచిన దాశరథి కృష్ణమాచార్యులు రాసిన ‘ఆ చల్లని సముద్రగర్భం’ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో శ్రమదోపిడీ ఎంత అమానుషంగా ఉండేదో పైచరణంలో తెలియజేశారు. దశాబ్దాలు మారాయి. భూస్వామ్యవ్యవస్థ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్థగా మారింది. ఫైనాన్స్‌ కాపిటల్‌ ఆధిపత్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పట్టుబిగించింది. కానీ శ్రమజీవుల రక్తమాంసాలు, చెమట ద్వారానే సంపద సృష్టించబడుతుందనీ, ఆ శ్రమ దోపిడీ ద్వారానే తమ లాభాల దాహాన్ని తీర్చుకొని ధనవంతులు, అపర కుబేరులు, బిలియనీర్లుగా ఎదుగుతారనే సత్యం మారలేదు సరికదా బ్రిటిష్‌ వలస పాలనకంటే కొత్త అవతారాలెత్తింది. శ్రమ దోపిడీ ఇంకా పెరిగింది. దాశరథి ఆశించిన ‘అన్నార్తులు, అనాథలుండని నవయుగం’ ఇంకా ఇంకా దూరమయ్యింది. ఆరోజు భూస్వాములు వేసిన బాటలోనే ఈనాటి కార్పొరేట్‌ శక్తులు, ప్రభుత్వరంగ సంస్థలు కూడా నడుస్తున్నాయి. చట్టాలను, సుప్రీంకోర్టు తీర్పులను నిర్భయంగా తుంగలో తొక్కి తమ లాభాలను పెంచుకుంటు న్నాయి. శ్రమ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఎన్డీయే ఏలుబడి లో గత దశాబ్దకాలంలో బ్యాంకింగ్‌ రంగంలో ఏర్పడిన పరిస్థితిని పరిశీలిస్తే ఇది అక్షర సత్యమని అర్ధమవుతుంది.
అనేక అవతారాలెత్తిన బ్యాంక్‌ ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు కేంద్రప్రభుత్వం చేసిన చట్టాల ద్వారా ఏర్పడ్డాయి. కాబట్టి కార్మిక చట్టాలను, మార్గదర్శకాలను అమలు చేయటం వాటి కనీస బాధ్యత. సమాన పనికి సమాన వేతనం చెల్లించటం చట్టరీత్య తప్పనిసరి. ఈమేరకు సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకత్వంలో పెద్ద ఉద్యమాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ప్రభుత్వం 1987లో జస్టిస్‌ ఓబుల్‌ రెడ్డి కమిషన్‌ నియమించింది. మూడేండ్ల సుదీర్ఘ వాదనల తరవాత ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు చేసేపనే చేస్తున్న గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగులకు కూడా ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల జీతాలనే చెల్లించాలని తీర్పునిచ్చింది. సమాన పనికి సమాన వేతనం బ్యాంకింగ్‌ రంగంలో అమల్లోకి వచ్చింది. కానీ గత పదేండ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన బ్యాంకింగ్‌ సంస్కరణలు సమాన పనికి సమాన వేతన నిబంధనలను తల్లకిందులు చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా లాభాల సంపాదనే ప్రధాన లక్ష్యంగా మార్చిన దరిమిలా శ్రమదోపిడే బ్యాంకుల విధానంగా మారింది. డబ్బుతో వ్యాపారం చేసే సున్నిత రంగంలో ఖాతాదారులు భద్రతకోసం బ్యాంకులలో పర్మినెంట్‌ ఉద్యోగులే పనిచేయాలనే నియమం అమలయ్యేది. ఆ నియమాన్ని నీరుగారుస్తూ నిరుద్యోగులను, బ్యాంకు ఉద్యోగులను శ్రమ దోపిడీకి గురిచేస్తూ అనేక పథకాలు రూపొందించబడ్డాయి.
2021-2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ప్రకటిస్తూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌, ప్రయివేటు బ్యాంకులతో పోటీపడి లాభాలు సంపాదిస్తున్నా ఖర్చు – ఆదాయనిష్పత్తి (కాస్ట్‌ టు ఇన్కమ్‌ రేషియో) ఎక్కువగా ఉండటం వలన స్టేట్‌ బ్యాంక్‌ నికర లాభాలు తక్కువగా ఉన్నాయని పత్రికా సమావేశంలో చెప్పారు. అంటే ఖర్చు తగ్గించుకోవాలని ఆయన తాత్పర్యం. ఆరోజు తెలియదు అది నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుందని. మూడు నెల్ల తర్వాత ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆపరేషన్స్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌’ (ఎస్‌బిఓఎస్‌ఎస్‌) అనే అవుట్‌సోర్సింగ్‌ కంపెనీని స్వంతగా (రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతితో) స్థాపించింది. స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న శాఖలు నడపటానికి కావలసిన కాంట్రాక్టు ఉద్యోగులను ఎంపిక చేయటం ఆ కంపెనీ ఉద్దేశ్యం. స్టేట్‌ బ్యాంక్‌లో పనిచేసే పర్మినెంట్‌ ఉద్యోగుల జీతాలు వారికి వర్తించవు.
అప్పటికే రిజర్వ్‌బ్యాంక్‌ బిజినెస్‌ కరస్పాండెంట్లనే స్కీమ్‌ రూపొందించింది. ఖాతాదారుల నుంచి డబ్బు జమచేసు కోవటం, ఖాతా నుండి డబ్బు ఇవ్వటం, డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌ ఇవ్వటం, చెక్కులు ఖాతాలో జమ చేయటం లాంటి పర్మినెంట్‌ ఉద్యోగులే చేసే అనేక పనులు వీళ్లూ చేస్తారు. అన్ని బ్యాంకులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్కొక్క బ్యాంక్‌లో ఒక్కొక్క విధమైన జీతాలు. చేసిన వ్యాపారం మీద కమీషన్‌, లేక కొంత నిర్దిష్ట కమీషన్‌ కొంత జీతం. కొన్ని బ్యాంకులలో బ్యాంక్‌ శాఖల నుంచి, కొన్ని బ్యాంకులలో నిర్దిష్టమైన ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. సెంట్రల్‌ బ్యాంకులో మన రాష్ట్రంలో నెల రోజులు పనిచేసి రూ.రెండు వేల అతి తక్కువ ఆదాయంతో, కొంతమంది రూ.6 వేలు, రూ.10 వేల లోపు సంపాదనతో బిజినెస్‌ కరస్పాండెంట్‌ గా పనిచేస్తున్నారు. కొన్ని బ్యాంకులలో మాత్రమే నిర్దిష్ట జీతాలు ఉన్నాయి. ఈవిధంగా అరకొర జీతాలతో బ్యాంకులలో 35 లక్షల మంది బిజినెస్‌ కరస్పాండెంట్లున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు 15 లక్షల మంది. అంటే ఉద్యోగుల సంఖ్య కంటే రెట్టింపు పైగా బిజినెస్‌ కరస్పాండెంట్లున్నారన్న మాట.
ఇంతేనా? ఇంకా నిర్ఘాంత పోయే రూపాలలో శ్రమదోపిడీ బ్యాంకులను ఏలుతుంది. గత పదేండ్లకాలంలో బ్యాంకుల వ్యాపారం 270 శాతం పెరిగింది. పెరిగిన వ్యాపారానికి తగిన రిక్రూట్మెంట్‌ జరగలేదు సరికదా పదవీ విరమణ వలన, ఉద్యోగుల మరణం, పర్మినెంట్‌ ఉద్యోగాల్లో ఏర్పడిన ఖాళీలలో కూడా రిక్రూట్మెంట్‌ జరగలేదు. ఉన్న ఉద్యోగుల మీద పనిభారం చెప్పలేనంతగా పెరిగింది. శాఖలు నడపలేని స్థితిలో టెంపరరీ, క్యాజువల్‌, కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తూ వస్తున్నారు. ఇన్‌స్పెక్షన్‌, రుణాల మంజూరు, రికవరీ, క్రెడిట్‌ కార్డు వ్యాపారం, ఏటీఎంలలో క్యాష్‌ పెట్టటం, క్యాష్‌ శాఖలకు సరఫరా చెయ్యటం, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థాయివరకు, ఒకటేమిటి అన్ని విభాగాలలో అన్ని క్యాడర్లలో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సుమారు లక్షన్నర మంది పర్మినెంట్‌ ఉద్యోగాలలో టెంపరరీ క్యాజువల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లందరినీ పర్మినెంట్‌ చేయాలని ఏండ్ల తరబడి ఉద్యమాలు జరుగుతున్నా ప్రయోజనం లేదు. సమాన పర్మినెంట్‌ ఉద్యోగాలలో పనికి సమాన వేతనం మచ్చుకైనా మిగల్లేదు.
అన్యాయాన్ని ఎదిరించి ఓడించటమే ప్రధాన కర్తవ్యం
దేశంలో నిరుద్యోగం పెరిగి గత 45 ఏండ్లలో లేనంత ఎక్కువ స్థాయికి చేరిందని అనేక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగం చేసే వయసు (15-59 సం.లు) లో ఉన్న యువకులు, గ్రాడ్యుయేషన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివిన యువకులలో నిరుద్యోగం పెరుగుతుంది. ఆర్థిక అంతరాలు బ్రిటిష్‌ కాలంలో కంటే ఘోరంగా పెరిగాయి. 80 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ రేషన్‌ మీద ఆధార పడి జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో కుబేరులు సంఖ్య వారి వద్ద పోగుపడ్డ సంపద అందనంత ఎత్తుకు పెరిగాయి. నిరుద్యోగం, ఆకలి, అసమానతలు ఈ ప్రభుత్వ విధానాలు సృష్టించినవే. ఇది ప్రతి పౌరుడు గౌరవ ప్రదంగా జీవించే హక్కును కాలరాయటమే. పైన పేర్కొన్నది ఒక్క బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న పరిస్థితే కాదు. ప్రతి ప్రభుత్వశాఖ, ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఇదే పరిస్థితి. కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా ఉన్న ప్రభుత్వ విధానాలు మారాలి. ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడమే సరైన పరిష్కారం. దీనివలన కోట్ల కుటుంబాలు సరైన విద్య వైద్యాన్ని పొందగలుగుతాయి. కార్పొరేట్‌ కంపెనీల లాభాల పెంపుకోసం, వారి సేవలో తరించే ప్రభుత్వం మారా లి. దానికి ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు సువర్ణావ కాశం.ఈ నెల13న జరిగే ఎన్నికల్లో బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకులలో పని చేస్తున్న లక్షలాది మంది టెంపరరీ క్యాజువల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, బ్యాంకులతో ముడిపడి ఉన్న కోట్లాది మంది ఖాతా దారులు వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక పార్టీల అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలి. సరైన విధాన రూపకల్పనకు ఉద్యమిం చటమే దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ పరిష్కారం.

– పి.వెంకట్రామయ్య
9553533815

]]>
చరిత్రలో చరిత్రతో కారల్‌ మార్క్స్‌ https://navatelangana.com/karl-marx-with-history-in-history/ Sat, 04 May 2024 18:13:55 +0000 https://navatelangana.com/?p=283651 చరిత్రలో చరిత్రతో కారల్‌ మార్క్స్‌ఈ రోజు మార్క్స్‌ జయంతి. మామూలుగా జయంతులు, వర్థంతులు మన మధ్యలేని వారికి సంబంధించినవే. మనిషి అంటే తను చేసిన పని, నడిచిన నడిపిన మార్గం అనుకుంటే మార్క్స్‌కు, మార్క్స్‌ విషయంలో ఈ పదాలు పూర్తిగా వర్తించవు. ఎందుకంటే మార్క్స్‌ మార్గం నడుస్తున్న చరిత్ర. ఎక్కడిదాకానో ఎందుకు , ఈ మే నెల మొదటిరోజున ప్రపంచ వ్యాపితంగా కార్మికులు కష్టజీవులు ఎర్రజెండాలతో నడిచినప్పుడు ఆయన వారితో వున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కూడా మే1నే పుట్టాడు.అంటే ఆయన తర్వాత దాదాపు వందేళ్లకు పుట్టిన సుందరయ్య ఆదర్శం, ఆచరణ కూడా ఇప్పటికీ తెలుగువారిని ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి.సబ్‌కా నామ్‌ వియత్నాం అని ఒక తరాన్ని ఊపేసిన హోచిమన్‌, పుట్టింది మే19నే. ఇప్పటికీ సోషలిస్టు పథంలో పయనిస్తూ గ్లోబల్‌ యుగంలోనూ సిద్ధాంత నిబద్దతను చాటుతున్నది వియత్నాం. రష్యాలో మేడే గురించే తొలి కరపత్రం రాసిన లెనిన్‌, మార్క్స్‌ మార్గంలో ప్రపంచ చరిత్రనే మలుపుతిప్పిన మహావిప్లవ సారథి అయ్యారు. చైనాలోనూ మే4 ఉద్యమం చాలా ప్రసిద్ధికెక్కింది. మార్క్క్‌ బోధనల చరిత్ర అయిపొయిందనుకునే వారికీ, అదేపనిగా చెప్పేవారికి చరిత్ర తెలియదని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఈ దేశాలే లేకపోతే ఇప్పుడు ప్రపంచం ఇలా వుండదు. గ్లోబల్‌ మీడియా, గోడీ మీడియాలు కావాలని తొక్కిపడుతున్నా ఆ ప్రభావాలు ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. మొన్న ఒక తెలుగు చానల్‌తో సహా నెట్‌వర్క్‌కు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూను చూడండి.. బెంగాల్‌ను మూడు దశాబ్దాలు అవిచ్చిన్నంగా పాలించిన కమ్యూనిస్టుల గురించి ఇప్పటికీ పలవరించడం కనిపిస్తుంది. ఆ ప్రభుత్వం పోయినా ఇంకా పూర్తి మార్పు రావాలని ముచ్చటపడ్డారు. కమ్యూనిస్టుల గురించి లేదా ఆ భావాలు ఏదో విధంగా ప్రస్తావించకుండా బీజేపీ నేతల ఇంటర్వ్యూలు వుండవు. నిజానికి వారు అతితెలివితో కాంగ్రెస్‌కే ఈ భావాలు ఆపాదించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు సంపదల పున:పంపిణీ గురించిన చర్చ తీసుకుంటే అది సామ్యవాద ప్రేరణతో వచ్చిన మాటని వారికి తెలుసు. కాని దానిపై మరో కోణంలో దాడి చేస్తారు.
కదిలేది, కదిలించేదీ!
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తన పాలన పేదలకూ పెద్దలకూ యుద్ధం అంటున్నపుడు ఇది కమ్యూనిస్టు భావం అని తెలుసు. తెలంగాణను ఇదివరకు పాలించిన కేసీఆర్‌,ఇప్పుడు సీఎంగా వున్న రేవంత్‌ రెడ్డి కూడా ఏదో రూపంలో కమ్యూనిస్టు భావాలను తాము గౌరవిస్తామనే సంకేతం ఇస్తుంటారనేది నిజం కాదా?మళ్లీ ఇదే కాంగ్రెస్‌ కమ్యూనిస్టులు పాలిస్తున్న కేరళలో వారిని ఓడించడమే ముఖ్యమనుకుంటుంది గాని బీజేపీ మతరాజకీయాలను ఎదుర్కొంటున్నారు గదా అని సానుకూలంగా వ్యవహరించదు. ఎందుకంటే పాలకపార్టీల మధ్య ఎన్ని తేడాలున్నా సరే మార్క్స్‌ సిద్ధాంతాలను నికరంగా, నిరంతరంగా అనుసరించే కమ్యూనిస్టులు మాత్రం పెరగకూడదనేదే వారి ఆలోచన. మరి ఆ పాలక పార్టీలతోనే కమ్యూనిస్టులు ఎందుకు కలసి పనిచేస్తారు, ఎన్నికలకు వెళతారని అడ్డు సవాళ్లు వేస్తుంటారు. అదీ మార్క్స్‌ చెప్పిందే. వ్యవస్థలు, పాలకవర్గాలు, పాలకపార్టీలూ వాటి దోపిడీ వ్యూహాలు అన్నీ ఆయన చెప్పాడు.అయితే వీరబ్రహ్మం కాలజ్ఞానం లాగా కాదు. మార్క్స్‌ది కేవలం తర్కం కాదు, గతి తర్కం. కాలాన్ని పరిణామాలను భిన్న శక్తులను అధ్యయనం చేసి శ్రమజీవులకు మొత్తం సమాజానికి ఏది మరీ ప్రమాదమో దాన్ని అడ్డుకోవడం,ఏది కాస్త ఉపయోగమో దాన్ని ముందుకు తీసుకుపోవడం కర్తవ్యంగా పెట్టుకుని అడుగేయాలన్నాడు. మార్క్స్‌ కాలానికి ప్రజాస్వామ్య సమాజాలు కూడా పూర్తి రూపం తీసుకోలేదు.సార్వత్రిక ఓటు హక్కు కూడా చాలాదేశాల్లో లేదు. తర్వాత కాలంలో ఎంగెల్సు ఈ విషయంలో మరింత స్పష్టత ఇచ్చాడు. ఇన్నేళ్లలోనూ చరిత్ర చాలా పురోగమిం చింది, ఎదురుదెబ్బలూ చూసింది. పురోగమన ప్రస్థానం లోనూ ప్రతికూల పరిస్థితిలోనూ మార్క్స్‌ బోధనలే మార్గదర్శకమయ్యాయి, దారి పొడుగునా గుండెనెత్తురులు తర్పణ చేస్తూ మహాప్రస్థానం సాగుతూనే వుంది. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అనుసరించ బడుతున్న అధ్యయనం చేయబడుతున్న మహోపాధ్యాయుడు మార్క్స్‌ మాత్రమే. కారణం ఆయన బోధనల గతిశీలతే. సమగ్రత,సమరశీలత, సందర్భశుద్ధి, సమరశీల కార్యాచరణ, సమిష్టి సంకల్పం, సమూహ కార్యాచరణ ఇవన్నీ కలిశాయి గనకే మార్క్స్‌ మానవాళి చరిత్రపై అనితరసాధ్యమైన ప్రభావం ప్రసరించారు. మార్క్సిజం వర్తమానమూ భవిష్యత్తు తప్ప కేవలం గతం కాదు. మారే కాలానికి తగినట్టు అన్వయశీలత ఆయనలోనే వుంది. దాన్ని శుద్ధతర్కం కింద మార్చిన వారే కొటేషన్స్‌కు పరిమితమై చిలకపలకులు వల్లించేవారిని లేదా దుస్సాహసాలు చేసేవారిని పక్కనపెడితే విశాల ప్రజారాశులు వేల వేల సంఘాలు, సంస్థలూ విశ్వ వ్యాపితంగా విముక్తి పథంలో పయనిస్తూనే వున్నాయి.చైనా వుండకపోతే ఆసియా ఖండంగాని, రష్యా(పుతిన్‌ కాలంలోనైనా) లేకపోతే యూరప్‌ గాని, క్యూబా ఉనికితో సహా వామపక్ష ప్రేరిత ప్రభుత్వాలు లేకపోతే అమెరికా ఖండంగాని ఇలా వుండేవా? సోవియట్‌ విచ్చిన్నం తర్వాత అనేక దురదృష్టకర మైన స్థానిక యుద్ధాలు చేసిన ప్రపంచం మొత్తంగా మరెంత దారుణమైన పరిస్థితులు ఉండేవో ఊహించలేము.
సమగ్ర సిద్ధాంతం,స్పష్టమైన ఆచరణ
కనక మార్క్స్‌ చరిత్ర కాదు, చరిత్రలోనూ చరిత్రతోనూ ఉంటాడు. చరిత్ర నిర్మాణానికి దారి చూపిస్తాడు. మార్క్స్‌ అంటే ఆయనను అనుసరించే అధ్యయనం చేసేవారంతా.ఆ ప్రయత్నం చేసేవారంతా. మార్క్స్‌ బోధనల సమగ్రత సారాంశం వంటబట్టించు కోనివారు, అర్థమై వ్యతిరేకించే వారు, ఏవో పైపై మాటలతో వారిపై దాడి చేస్తుంటారు. ఇంకొందరు వ్యతిరేక శక్తుల ప్రేరణత సవాళ్లు విసురుతుంటారు. నిజానిజాలు, నిర్దిష్ట పరిస్థితులు వారికేమీ అవసరముండదు. ఎందుకంటే వారు ఆయన ఆశయాల బాటలో నడిచే ఉద్యమాలలో ఉండరు. ఆచరణలో పాల్గొనరు. కనుక వాస్తవ సమస్యలు తెలియవు. సమిష్టిచర్చలు, సహచరుల అభిప్రాయాలు, అనుభవాలు వినే అవకాశం, అవసరం కూడా వుండవు. తమకు తోచింది నచ్చింది నచ్చంది అంతే. ఆ మార్గంలో నిలబడటానికి కొనసాగడానికి సిద్ధం కాలేరు. చాలామంది ఆ భావాలు తెలిసినా బయట ఒత్తిళ్ల వల్ల లేదా స్వీయ కాంక్షల వల్ల పదవులో, అవకాశాలో తెచ్చుకోవాలనుకుంటారు. తెలుగురాష్ట్రాలే తీసుకుంటే వివిధ రంగాలలో అలాటి వారు అనేకులు. రాజకీయాలు, వ్యాపారాలు, సినిమా, మీడియా ఒకటేమిటి ప్రతిచోటా ఇలాంటి వారు అందరికీ పరిచయమే. తమ కుటుంబ పెద్దల మార్గంలో ఉద్యమాన్ని గౌరవించే సహకరించే వారూ అనేకులుంటారు. ఏమైనా ఇలాంటి వారిలో అభిమానంతో పాటు అవగాహనా పరిమితులూ వుంటాయి. పరిస్థితుల లోనూ వాటి కారణంగా, వారిలోనూ వచ్చిన మార్పులూ వుంటాయి. సిద్ధాంతపరంగా తాము ఇటే అనుకుంటున్నా ఆలోచనలు గాడి తప్పే ప్రమాదాలుంటాయి. అంతే గాక పాలక వర్గాలు, ప్రభుత్వాలు ఎప్పుడూ కమ్యూనిస్టులపై దాడికోసం బృందాలను తయారు చేస్తుంటాయి.ఇలాంటి వారు కూడా సానుకూలంగా వుంటూనే నిజాయితీగానే అనేక సందేహాలు పెంచుకోవడం కద్దు. వారి మాటలు వినేవారిలోనూ సందేహాలు రావచ్చు.ఈ సందర్భంలో రెండు ఉదాహరణలు చూద్దాం.
ఏపీ, తెలంగాణ ఎన్నికలు
ఏపీలో మూడు పొందికలు రంగంలో వున్నాయి, జగన్‌ పాలనదారుణంగా వుంది గనక బీజేపీతో కలసి గెలవడమే మార్గమనేది టీడీపీని, చంద్రబాబును అభిమానించేవారి వాదన.అంతకుముందు ఎన్నికల్లో వామపక్షాలతో కలసి పోటీచేసిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ముందే బీజేపీతో వున్నారు.జాతీయంగా మోడీ పాలనలో నిరంకుశత్వాన్ని బీజేపీ, ఆరెస్సెస్‌ మతతత్వాన్ని కార్పొరేట్‌ అనుకూల మతతత్వాన్ని నిలవరించడం కోసం లౌకికపార్టీలు ఐక్యంగా పోరాడాలనే వైఖరి వామపక్షాలది గనక కాంగ్రెస్‌తో ‘ఇండియా’ వేదికగా ఏర్పడ్డాయి. ఎంత బలం, ఎన్నిసీట్లు అనేది ఎలా వున్నా ఏపీకి కూడా ప్రత్యేకంగా అన్యాయం చేసిన బీజేపీతో కలసిన టీడీపీ, వైసీపీలను రెంటినీ వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మాత్రమే గనక భువనగిరిలో మాత్రం సీపీఐ(ఎం) పోటీ చేస్తూ మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నది. జగన్‌ పాలనను ఓడించడం ఏకైక అవసరం కాగా బీజేపీ సమస్య తీసుకురావడమే మిటని కొందరు అదేపనిగా వాదిస్తుంటారు. అసలు జగనే దీనజనోద్ధారకుడు కాగా కమ్యూనిస్టులు విమర్శించడమే మిటని వైసీపీవారు అంటుంటారు. అదానీ బొగ్గును తీసుకొచ్చి సింగరేణిని బుగ్గి చేసిన కాంగ్రెస్‌ను కమ్యూనిస్టులు ఎలా బలపరుస్తారని కేసీఆర్‌ నిన్ననే సవాలు విసిరారు. రెండు చోట్లా బీజేపీ తన పబ్బం గడుపుకునే ఎత్తుగడలతో మతరాజకీయాలు నడుపుతూనే వుంటుంది.వైసీపీ, టీడీపీ కూడా ఆర్థిక విధానాలలో ఒకటే తరహాగా వుండటం, బీజేపీతో ప్రత్యక్ష, పరోక్ష పొత్తులు కలిగివున్నాయి. అలాగే బీఆర్‌ఎస్‌ కూడా ఉప ఎన్నికలో వారి మద్దతుతో బయటపడి తర్వాత దూరం చేసుకుంది. బీజేపీతో దాని సంబంధాలపై సందేహాలు కూడా కొనసాగు తున్నాయి. ఇలాంటి పరిస్థితుల రీత్యా ఇంతకన్నా భిన్నమైన విధానం కమ్యూనిస్టులు అనుసరించే అవకాశమే లేదు. ఈ రాష్ట్రాలు దేశంలో భాగం కానట్టు, ఇకిక్కడికే పరిమితమై ఆలోచించడం ఎలాసాధ్యం? బెంగాల్‌లో వామపక్ష సంఘటన ఏర్పడి 32 ఏండ్లు పాలించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ వేర్వేరు సమయాల్లో చేతులు కలిపి దాన్ని దెబ్బతీశాయి.ఇప్పుడు బీజేపీ స్థానాలు పెరుగుతుండగా లోపాయికారి అవగాహన కొనసాగుతున్నట్లు సందేహాలు న్నాయి. మమత పాలనలో అమానుషాలనేకం. అయినా వామపక్ష సంఘటన బీజేపీని, టీఎంసీని వ్యతిరేకించి పోరాడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరినప్పటికీ భువనగిరిలో పోటీ విరమించుకోవడానికి నిరాకరించింది. ఇంత కచ్చితమైన విధానమే మార్క్స్‌ సిద్ధాంత నిర్దేశమే.
శ్రామిక ప్రస్థానం ఆగిందా?
సాంకేతికంగా గొప్ప పురోగమనం వచ్చింది గనక వర్గపోరాటం కార్మిక శక్తి వంటి మాటల పదును తగ్గిందనే వాదన చేస్తుంటారు చాలామంది. శ్రామికుల శ్రమతో అదనపు విలువ ఆర్జించే పెట్టుబడిదారీ విధానం ఉత్పత్తి పరికరాలు సాధనాల ఆధునీకరణ చేస్తూనే ఉంటుందనేది మార్క్స్‌ ప్రాథమిక సూత్రం. శ్రామికుల పాత్రను తగ్గించి లాభాలు పెంచుకోవడం దీని ఏకైక లక్ష్యం. ఇప్పుడు రోబోలు, కృత్రిమ మేధ (ఎఐ)లు ప్రవేశించాయి. ఈ క్రమం పరాకాష్టకు చేరింది. కానీ పోరాటాలు పోయాయా? కార్మికు ల శక్తికి కంప్యూటర్లు ప్రత్యామ్నాయం కావు. కంప్యూటర్ల నిపుణులు కూడా ఎఐ వచ్చాక వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతూ వీధిన పడుతున్నారు. డ్రైవర్లు లేనికార్లు, నిర్మాణ కార్యకలాపాలలోనూ భారీ పరికరాలు ఏ విధంగా పనులు పోగొట్టాయో ఈ ఎఐ కూడా అందుకే దారితీస్తున్నది, (దీనికి రాజకీయం కూడా మేళవించి ఇజ్రాయిల్‌ దురాక్రమణపై నిరసన తెలిపిన వారిని కూడా గూగుల్‌ పిచ్చరు తీసేస్తున్నారు) ఇప్పుడు ఈ వర్గాలలో అలజడికీ ఆందోళన చెందుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్‌ కాలూనిన తర్వాత బయటిదేశాలు అటుంచి ఆ దేశస్తుటే ఉక్కిరిబిక్కిరవుతున్నారు.నిజానికి వీటన్నిటినీ అర్థంచేసు కోవడానికి అవసరమైన అవగాహన బీజ రూపంలో మార్క్స్‌లోనే మనకు దొరుకుతుంది. ఆ ప్రభావం వైజ్ఞానిక కళా సాహిత్య, సాంస్కృతిక రంగాలపై చూపిన ప్రభావం మరో పెద్ద అంశం, అవి లేకుండా ఆధునిక జీవితమే లేదు.అందుకే మార్క్స్‌ చరిత్రను నడిపే ప్రేరణగా ఉంటూనే ఉంటాడు. మహాప్రస్థానం సాగుతూనే ఉంటుంది.
తెలకపల్లి రవి

]]>
మార్క్స్‌ స్ఫూర్తితో మరింత ముందుకు..! https://navatelangana.com/further-forward-in-the-spirit-of-marx/ Sat, 04 May 2024 18:12:50 +0000 https://navatelangana.com/?p=283648 మార్క్స్‌ స్ఫూర్తితో మరింత ముందుకు..!”అతడు తనకోసమే శ్రమించినట్లయితే బహుశా గొప్ప పండితుడుగా, గొప్ప జ్ఞానిగా, మంచి కవిగా ప్రసిద్ధి చెందవచ్చు. అతనెప్పటికీ పరిపూర్ణుడు, సిసలైన గొప్ప వ్యక్తిగా ఉండజాలడు” అని విస్పష్టంగా తన పదిహేడవ యేటనే చెప్పిన మార్క్స్‌, ఆచరణలో మానవాళి కోసం జీవితాంతం శ్రమించిన, ఆలోచిం చిన మహనీయుడు. ఇది పూలబాటకాదని తెలుసతనికి, రాళ్లతో నిండినదనీ తెలుసు. ”జీవితంలో అన్నింటికీ మించి మానవాళికోసం శ్రమించగల స్థానం మనం ఎంచుకున్నట్లయితే, ఏ బరువులూ మనల్ని కుంగదీయ లేవు” అని చెప్పగలిగిన యువ మార్క్స్‌ను చూసినపుడు, అతని భవిష్య దృష్టి మనకర్థమవుతుంది.
సాధించినదానిపట్ల నిరంతర అసంతృప్తి, పరిపక్వత కోసం ఎడతెగని శోధన అతని విశిష్ట లక్షణాలు. కళాసాహిత్యాలపై లోతైన విశ్లేషణ ఇప్పటికీ మనకు దారిచూపుతూనే ఉంటుంది. నూతన భావాల ఆవిర్భావానికి తరగని ధార అయిన సృజనాత్మకత ఉత్తేజానికి ప్రేరణగా ఉండే సామర్థ్యాలను వ్యక్తిలో వృద్ధి చేసేది కళే అని చాటి చెప్పాడు. మార్క్స్‌ పూర్తిగా కళామయ వాతావరణంలో బాల్యం నుండీ పెరిగాడు. మార్క్స్‌ చివరి వరకూ అధ్యయనాన్ని ఆపలేదు. జీవిత చరమాంకంలో కూడా కొత్త భాషలు నేర్చుకోవడానికి పూనుకున్నాడు. అపారమైన అధ్యయనం, అపారమైన రచన ఆయన సొంతం. ప్రపంచ మానవాళి విముక్తి కోసం పనిచేసిన మార్క్స్‌ దుర్భర దారిద్య్రాన్ని అనుభవించాడు. అత్యంత ధనిక కుటుంబం నుండీ వచ్చిన జెన్నీ, మార్క్స్‌తోపాటుగా కష్టాలు, బాధల్ని పంచు కుంది. ఆఖరికి దారిద్య్రంలో, తిండిలేక ఆకలితో అలమటించారు. అనారోగ్యాలతో పిల్లలూ మరణించారు. ఇంతటి ఇక్కట్లలోనూ తన పనిని వొదిలిపెట్టక, మరింత పట్టుదలతో చేశాడు మార్క్స్‌. ఆయన జయంతి సందర్భం గా, ఒక తత్త్వవేత్త, సామాజిక విప్లవ సిద్ధాంతకర్త ఎలా రూపుదిద్దుకున్నాడో అధ్యయ నం చేయాలి. అలాంటి జీవితాలు, నిరాశా నిస్పృహలు, ఓటములు, బలహీనతలు, తిరోగమన ఆలోచనలు ఎదురైనపుడు వాటిని ఎదుర్కొనే ఉత్సాహాన్ని అందిస్తాయి, చైతన్యాన్ని నింపుతాయి. మరీ ముఖ్యంగా మన దేశం నేడెదుర్కొంటున్న మతతత్వమూ, దోపిడీ కలిపి ఫాసిస్టు తరహా పాలన సాగుతూ, మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము నిరాకరించ బడుతున్న సందర్భంలో మార్క్స్‌ను అధ్యయనం చేయటం, మార్క్సిజాన్ని అవగాహన చేసుకోవటం ద్వారా వీటిపై పోరాటం చేయటానికి ఆయుధాలను సమకూర్చుకోవటం ఒక్కటే మనముందున్న కర్తవ్యం.
మార్క్స్‌ జయంతి వేళ, సాంస్కృతికరంగం, భావజాల రంగాల గురించి కొద్దిగా ప్రస్తావించుకుందాము. నేటి మన దేశ పాలకులు ప్రజలపై దోపిడీని తీవ్రతరం చేస్తూనే, సాంస్కృతిక విషయాలను ముందుకు తెచ్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలకు పూనుకుం టున్నారు. భారతదేశంలాంటి సంప్రదాయ, విశ్వాసాలపై ఆధారపడిన సమాజంలో సంస్కృతికి సంబంధిం చిన అంశాల ఆధిపత్య భ్రమలను కల్పించి, అందుకు కావల్సిన శత్రువులనూ సృష్టించి, ఒక యుద్ధ వాతావరణాన్ని నిర్మిస్తున్నా రు. ఒకవైపు కుల వ్యవస్థలో వున్న పీడనకు, మరోవైపు శ్రమ దోపిడీలో అణచివేతను ఎదుర్కొంటూ బలహీన పడుతున్న ప్రజలకు, ప్రపంచీ కరణ ఫలితంగా అనేకమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న మధ్యతరగతి జీవులకు, తామూ ఒక ఆధిపత్యం వహించ గలిగే మానసిక ప్రాబల్యాన్ని అందించే మెజారిటీ, మైనారిటీ పేర మత విభజనకు అధికారగణం ఉపయోగిస్తున్నది. ప్రపంచీకర ణ ప్రభావాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్య మించడం, నిరసన పెల్లుబికిరావడంతో, జాతి, మత వైషమ్యాలను పెంచుతూ దాని చుట్టూ ప్రజలను తిప్పే మితవాద తిరోగమన భావజా లాన్ని ముందుకు తెచ్చాయి పాలకవర్గాలు.
ఇలాంటి పరిస్థితిలో ప్రగతిశీల భావాలు వెనుకపట్టుపట్టి, విశ్వాసాలవైపు, విభజన ఆలోచనలవైపు జనం చూస్తున్న సమయంలో ఉద్యమకారులు, నిర్దిష్ట వాస్తవ పరిస్థితులను, సాంస్కృతిక విషయాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మార్క్స్‌ చూపిన దారిలోనే ఆ చైతన్యాన్ని పొందగలుగుతాము. మార్క్సిజం గుడ్డి విశ్వాసాలకు వ్యతిరేకమైనది. పెట్టుబడిదారీ ప్రపంచంలో మనిషి స్వార్థం ఇరుసుగా పనిచేస్తున్నది అమానవీయ హేతువాదం. ‘పొరుగువాని బాధలు చూసి ముఖం తిప్పుకునేవాడు ఎద్దుతో సమానం’ అనే ప్రవచనాన్ని పెట్టుబడిదారీ హేతువాదం అంగీకరించదు. మనిషికి ఉండాల్సిన సామాజిక బాధ్యతలను తిరస్కరించి ‘ఏదీ ఉచితంగా రాదు’ అనే సూక్తిని బోధిస్తుంది. పైగా ప్రతి ఒక్కరూ తమ బాగు కోసం తాము కష్టపడితే అందరూ బాగుపడతారు అని తర్కిస్తుంది. నీ కష్టం మీదనే నీ విజయం, నీ అపజయానికి కారణం నీ బలహీనత అనే చెబుతుంది. ఏ విషయాన్నయినా వ్యక్తి కేంద్రంగానే చర్చిస్తుంది. సమాజం మొత్తంగా ఎప్పుడూ చర్చించదు. ఎందుకంటే సామాజిక విషయంగా ఏది చర్చించినా, సామాజిక వెనుకబాటు, దారిద్య్రం, అసమానతలకు సమాజమే బాధ్యత వహించాల్సి వస్తుంది కనుక. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యక్తి స్వార్థపు విలువనే మానవ విలువగా చూస్తుంది. ఈ రకమైన భావాల నే ప్రతి అంశంలోనూ ప్రతిపా దిస్తుంది. ప్రచారమూ చేస్తుంది.
ప్రజల మనసులను ఆకట్టుకున్న భావాలు భౌతికశక్తిగా మారతాయన్న మార్క్స్‌ మాటలు నిజమేనని చరిత్ర రుజువుచేసింది. భావాలు చైతన్యంగా మారి విప్లవాత్మక మార్పుకు ఎలా దారితీస్తాయో, అవే భావజాలాలు ఫాసిజం రూపంలో మానవ మారణహౌమం సాగించడానికి తోడ్పడింది. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ అది వున్న రూపంలో అధికారంలో కొనసాగలేనపుడు, దాని స్థానంలో ప్రజాస్వామ్య శక్తులు అధికారంలోకి రాగలిగేంత బలంగా లేనపుడు ఫాసిజం తలెత్తుతుందని గ్రాంసీ, యితర మార్క్సిస్టు మేధావులు చెప్పారు. అయితే హిట్లరు అన్ని కోట్ల మంది జర్మను ప్రజల్లో జాతి ద్వేషాన్ని ఎలా రెచ్చగొట్టగలిగాడు? యూదులను అత్యంత దారుణంగా చంపుతున్నా పట్టించుకోని కఠినాత్ములుగా ఎలా మార్చలిగాడు? జాత్యహంకారాన్ని ఎలా ప్రేరేపించగలిగాడు? అనే ప్రశ్నలకు బూర్జువాహేతువాదం, సామాజిక మానసిక శాస్త్రాలు సమాధానం చెప్పలేవు. ఈ ఫాసిస్టు ఉదంతం ప్రజల మనసులను ఆవహించిన భావజాలపు బలాన్ని సుస్పష్టంగానే చూపింది. పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాలు వీటి పెరుగుదలకు కారణమనే ఒక సాధారణ సమాధానం పూర్తి సమాధానంగా ఉండదు. ఈ వైఫల్యాలు వర్గ చైతన్యం, వర్గ స్పృహ, వర్గ సంస్కృతులను ఎందుకు పెంచడంలేదు అనేది ప్రశ్నించుకుంటే, పెట్టుబడిదారీ వ్యవస్థలోని వ్యక్తివాదం, అందుకు సంబంధించిన భావ జాలం ప్రజల మనస్సుల్లోకి బాగా ఇంకిపో యిందని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు సంస్కృతి, భావజాలాల ప్రాధాన్యతను గుర్తించి, వాటిని గురించి చర్చించాలి. దానికి నిర్దిష్ట అధ్యయనం అవసరమవుతుంది. మన దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను చూస్తూనే ఉన్నాం. దీని సమర్థకుల్లో ఎక్కువగా విద్యావంతులే ఉన్నారు. కాబట్టి భావాలు, ఆశయాలు వ్యక్తులపై ఎంత బలంగా పనిచేస్తాయో చూడవచ్చు. ఆ భావాల నిర్మాణం ఏ రకమైనవి అయినప్పటికీ, సత్యా లపై వాస్తవాలపై ఆధారపడినవా లేదా అనేది వేరే విషయం. సాంస్కృతిక పరమైన మనిషిపై భావాల ప్రభావం చాలా తీవ్రంగా పనిచే స్తుంది. మనదేశంలో స్వాతంత్య్ర పోరాట కాలంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ లక్షలాది మంది ప్రజలు, తమ కుటుంబాలను, ఆస్తిపాస్తులను,సుఖసంతోషాలను, జీవితాలను సైతం త్యాగంచేసి పనిచేశారు. వీటిని కేవలం ఆర్థిక విశ్లేషణలతో అర్థం చేసుకోలేము. ఆర్థిక విశ్లేషణ స్థూలంగా సమాజ గమన సూత్రాలను అర్థం చేసుకోవటానికి అత్యంత ఆవశ్యకమైనదే. అంతిమంగా సంస్కృతిని ఆర్థికాంశమే నిర్ణయి స్తుందనేది నిజమే అయినా, భావాలకు, సంస్కృతికి ఉండే సాపేక్ష స్వతంత్ర పాత్రను గ్రహించకపోతే విఫలమవుతాము. ఉపరితల అంశాలుగా ఉన్నవి కూడా పునాదిపై ప్రభా వాన్ని కలిగిస్తాయనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఏ జీవన పరిస్థితులు పాలకవర్గ భావజాల సారాంశాన్ని నిర్ణయి స్తాయో, అవే పరిస్థితులు ఆ భావజాలాన్ని తిరస్కరించడానికి అవసరమైన పరికరాలనూ సమకూరుస్తాయి. అయితే ఇదంత సులభం కాదు. ప్రయత్న పూర్వకంగా సాధించాల్సింది.
వర్గ సంఘర్షణలో భాగంగా రైతులు, కార్మికులు, యాజమాన్యాల, ప్రభుత్వాల ఆధిపత్యంపై అణచివేతపై ఎంత తీవ్రంగా పోరాడినప్పటికీ, ఇదే శ్రామికవర్గాలు కుటుంబాల్లో స్త్రీలపై, పిల్లలపై అణచివేత, ఆధిపత్యం ప్రదర్శించడం మనం చూస్తాము. అంతేకాదు ఉద్యమాలలో పనిచేసేవారు, ఇతర అంశాలలో భిన్నంగా వ్యవహరించడము అక్కడక్కడ కనపడుతుంది. ఇకపోతే సంప్రదా యాలు, ఆచారాలు, పరంపరగా వస్తున్న కుటుంబ వ్యవహారాలు అనేక విషయాలపట్ల వెలువరించే భావాలు గమనిస్తే, ఎంత లోతుగా నిండిపోయి ఉన్నాయో తెలుస్తుంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మన పోరాట చైతన్యము వర్గ చైతన్యంగా మారితేనే మిగతా అన్ని సంబంధాలలో మార్పు వస్తుంది. శ్రామికుల మధ్య నిజమైన సామాజిక, సాంస్కృతిక సంబంధాలు కార్మికవర్గ విప్లవానికి ముందస్తు షరతు అంటాడు మార్క్స్‌. అదే వర్గ స్పృహ. వర్గంగా ఉండటంవేరు, వర్గ స్పృహ కలిగి ఉండటం వేరు. ఈ వర్గ చైతన్యాన్ని పెంపొం దించటానికి సాంస్కృతిక రంగంలో, భావజాల రంగంలో తీవ్రంగా కృషి చేసినపుడు మాత్రమే వీటన్నింటిని అధిగమించగలుగు తాము.
మార్క్సిజం ప్రకారం సంస్కృతి అనేది సామాజికంగా వ్యవస్థీకృతమైన మానవ అస్తిత్వ పరిస్థితుల ఉత్పత్తితో ముడిపడిన భౌతిక శక్తి. సంస్కృతి, మనిషి సమాజ సభ్యునిగా సముపార్జించుకున్న జ్ఞానం, నమ్మకం, కళ, నైతిక విలువలు, చట్టం, సంప్రదాయం తదితర సామర్థ్యాలు, అలవాట్లు అని మోర్గాన్‌ వివరిస్తారు. దీనిని ఏంగెల్స్‌ స్వీకరించి సాంస్కృ తిక అంశాల విశ్లేషణతో నిర్దిష్ట సూత్రాలను కనుగొన్నారు. మానవ జీవితానికి సంబం ధించిన ఎంత స్వల్ప విషయమైనా సాంస్కృతిక సిద్ధాంతానికి పరాయిది కాదు. సంస్కృతి మానవ నిర్మిత ద్వితీయ ప్రకృతి. వర్తమానంలో వినిమయ సంస్కృతిని ఒకవైపు పెంచి పోషిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ, మరోవైపు విశ్వాసాలపై ఆధారపడిన మూఢ త్వాన్ని విస్తరింపజేస్తున్నది. ఒకవైపు అత్యంత శాస్త్ర సాంకేతిక వస్తు వినియోగం, మరోవైపు సవాళ్లు, సమస్యలపట్ల అచేతన దీనావస్థ రెండూ విచిత్ర సహజీవనం నేటి వ్యవస్థ విషాదం. ఈ రెండింటి గందరగోళంలో భ్రమాత్మక అంశాలతో నిండిన మతాన్ని తెచ్చి, వైరుధ్య భావాలను వెదజల్లుతున్న తరుణంలో, భావజాల రంగంలో వర్గ చైతన్యంతో పనిచే యాల్సిన అవసరం ఉంది. అందుకు వ్యూహా లను రచించుకోవాలి. మార్క్స్‌ మనకు ఎన్నో పరికరాలు ఇచ్చాడు. వాటిని సమర్థవంతంగా వినియోగిస్తే ముందుకు పోతాము.
(నేడు కారల్‌ మార్క్స్‌ 206వ జయంతి)
కె.ఆనందాచారి
9948787660

]]>