Manavi Archives - https://navatelangana.com/category/manavi/ Wed, 08 May 2024 18:52:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Manavi Archives - https://navatelangana.com/category/manavi/ 32 32 మామిడితో య‌మ్మీ య‌మ్మీ https://navatelangana.com/yummy-yummy-with-mango/ Wed, 08 May 2024 18:48:59 +0000 https://navatelangana.com/?p=286467 Yummy Yummy with Mangoతియ్యటి మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. వేసవిలో మాత్రమే లభించే వీటి కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటాం. వీటితో కేవలం రుచే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మార్కెట్లో దొరికే మామిడిపండ్లలో స్వచ్ఛమైనవి ఏవో గుర్తించి కొనుక్కోవాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచిది. వీటిని అతిగా కూడా తినకూడదు. మామిడి పండ్లను నేరుగా తీసుకోవటమే కాదు.. నోరూరించే చాలా వెరైటీలను చేసుకోవచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం..
మ్యాంగో మిల్క్‌ షేక్‌
కావాల్సిన పదార్థాలు : మామిడి పండ్లు – రెండు, పాలు – 350 మి.లీ, పంచదార – ముప్పావు కప్పు, మ్యాంగో ఎసెన్స్‌ – పావు టీస్పూన్‌, జీడిపప్పు – 3 టేబుల్‌ స్పూన్లు, ఐస్‌ క్యూబ్స్‌ – 20
తయారీ విధానం : ముందుగా మామిడిపండ్లను పైన తొక్క తీసి.. గుజ్జును ముక్కలుగా కోసి ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. వాటిని ఫ్రిడ్జ్‌లో ఓ గంట ఉంచాలి. ఇప్పుడు పాలను కాచుకుని.. వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అవి కూడా పూర్తిగా చల్లగా ఉండాలి. ఓ అరగంట నానపెట్టిన జీడిపప్పును తీసుకోవాలి. జీడిపప్పు కేవలం ఆప్షనే. కానీ రుచి కావాలనుకున్నప్పుడు దీనిని స్కిప్‌ చేయకపోవడమే మంచిది. ఈ లోపు చక్కెరను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అది మెత్తగా పొడి అయ్యేవరకు గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.
మామిడి పండ్ల ముక్కలను ఫ్రిజ్‌లో నుంచి తీసి.. వాటిని బ్లెండర్‌లో వేసుకోవాలి. దానిలో చల్లని పాలు, పంచదార, మ్యాంగో ఎసెన్స్‌, ఐస్‌ క్యూబ్స్‌ వేసుకోవాలి. మ్యాంగో ఎసెన్స్‌ వల్ల మిల్క్‌ షేక్‌ మరింత రుచిగా మారుతుంది. మంచి ఫ్లేవర్‌నిస్తుంది. వద్దనుకునేవారు దానిని స్కిప్‌ చేయవచ్చు. తాగినప్పుడు మంచి ఫ్లేవర్‌ కావాలనుకుంటే మాత్రం కచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు హై స్పీడ్‌లో మిల్క్‌షేక్‌ను బ్లెండ్‌ చేయాలి.
మామిడి ముక్కలు పూర్తిగా బ్లెండ్‌ అయి.. పాలు పూర్తిగా కలిసిపోయేలా బ్లెండ్‌ చేసుకోవాలి. దానిని గ్లాసులో పోసుకుని సర్వ్‌ చేసుకోవటమే. నానబెట్టిన జీడిపప్పు, మామిడి ముక్కలతో దీనిని సర్వ్‌ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.

మ్యాంగో లస్సీ
కావలసిన పదార్థాలు : మామిడిపండ్లు – రెండు, పెరుగు – రెండు కప్పులు, యాలకుల పొడి – చిటికెడు, పిస్తా తరుగు – ఒక స్పూన్లు, చక్కెర – రెండు స్పూను.
తయారీ విధానం : బాగా పండిన మామిడి పండును తీసుకోవాలి. తొక్కను తీసి గుజ్జునంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. దాన్ని స్పూన్‌తో బాగా కలపాలి. లేదంటే బ్లెండర్లో వేసి ఒకసారి మెత్తని పేస్ట్‌లా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో పెరుగు, చక్కెర, యాలుకల పొడి వేసి బాగా కలపండి. కాసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచి బయటకు తీయండి. పైన పిస్తా తరుగును చల్లండి. ఒక గ్లాసులో వేసుకొని తాగితే మ్యాంగో లస్సి అదిరిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది.
ఇడ్లీలు
కావలసిన పదార్థాలు : మామిడి పండు గుజ్జు- రెండు కప్పులు, నెయ్యి – రెండు టేబుల్‌స్పూన్లు, ఇడ్లీ రవ్వ – రెండు కప్పులు, చక్కెర పొడి – అర కప్పు, యాలకుల పొడి – అర టీస్పూను, మిరియాల పొడి – పావు టీస్పూను, పెరుగు – అర కప్పు, పాలు – అర కప్పు, ఉప్పు – రుచికి తగినంత, జీడిపప్పు – గార్నిష్‌కి సరిపడా
తయారీ విధానం : బాండీలో రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ నేతిలోనే ఇడ్లీ రవ్వను సన్నని మంట మీద వేయించుకోవాలి. ఒక పెద్ద బౌల్‌లో మామిడి పండు గుజ్జు, చక్కెర పొడి, ఉప్పు, పెరుగు, యాలకుల పొడి, మిరియాల పొడి, వేయించిన ఇడ్లీ రవ్వ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి. రెండు గంటల తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రకు నెయ్యి రాసుకుని పిండి వేయాలి. దోరగా వేయించిన జీడిపప్పు పలుకులను ఇడ్లీ పిండి పైన గార్నిష్‌ చేసుకోవాలి. 20 నిమిషాల పాటు చిన్న మంటపై వాటిని ఉడకనిస్తే ఎంతో రుచిగా ఉండే మామిడి పండు ఇడ్లీ రెడీ..! ఐదు నిమిషాల తర్వాత సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.
ఐస్‌ క్రీమ్‌
కావలసిన పదార్థాలు : రెండు పెద్ద పండిన మామిడి పండ్లు, 1/2 లీటర్‌ పాలు, 200 గ్రా క్రీమ్‌, 100 గ్రాముల చక్కెర, 2 టేబుల్‌ స్పూన్లు మొక్కజొన్న పిండి
తయారీ విధానం : ముందుగా పావు కప్పు పాలను సపరేట్‌గా తీసుకోవాలి. మిగిలిన పాలను పాన్‌లో పోసుకుని వేడి చేసుకోవాలి. పాలు మరిగే లోపు.. మామిడిపండు తొక్క తీసి.. ముక్కలు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను, పంచదారను కలిపి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత… ముందుగా పక్కన పెట్టుకున్న పాలలో మొక్కజొన్న పిండిని కలుపుకోవాలి.
మరుగుతున్న పాలలో మొక్కజొన్న పిండి కలిపిన పాలు వేసి 5-6 నిమిషాలు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కొద్దిగా చిక్కగా అయిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. అది చల్లారిన తర్వాత అందులో మామిడికాయ గుజ్జు, క్రీమ్‌ వేసి బీట్‌ చేయండి. గాలి చొరబడని కంటైనర్‌లో ఐస్‌క్రీం కోసం తయారు చేసిన పేస్ట్‌ను నింపి, దానికి సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలను వేయండి. కంటైనర్‌ను 7-8 గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. రుచికరమైన మ్యాంగో ఐస్‌ క్రీమ్‌ రెడీ.
జామ్‌
కావలసినవి కావలసిన పదార్థాలు : రెండు పెద్ద గుజ్జు మామిడి పండ్లు, 1/2 కప్పు పంచదార, మీరు కావాలనుకుంటే 1 టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం వేసుకోవచ్చు.
తయారీ విధానం :
మామిడి పండు గుజ్జును మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జును పాన్‌లో వేసి 2 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత పంచదార వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకున్నాక మిశ్రమం గట్టిపడుతుంది. తరువాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. కొద్దిగా చల్లారాక నిమ్మరసం పిండి మిక్స్‌ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత… గాలి చొరబడని గాజు కంటైనర్‌లో పెట్టుకోవాలి. బయట ఉంచితే నెల రోజులు ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే.. సంవత్సరమంతా జామ్‌ను ఎంజారు చేయవచ్చు.
ఒత్తిడిని జయించాలంటే..
మారుతున్న జీవన విధానం, పని వేళల్లో మార్పులు, మారిన వర్క్‌ కల్చర్‌ కారణం ఏదైనా చాలా మంది ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ టెన్షన్‌తో కూడిన జీవితం కారణంగా చాలా మంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు. దీంతో మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని రకాల చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం…
ఎక్కువ సేపు పని చేసి తర్వాత ఏర్పడే ఒత్తిడిని చిత్తు చేయడంలో ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం లేదా సాయంత్రం, ఏకాంత ప్రదేశంలో కూర్చుని, కళ్లు మూసుకుని శ్వాసపై దష్టి పెట్టాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతీ రోజూ చేస్తే మార్పు మీరే స్పష్టంగా గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు.
సంగీతం వినడం వల్ల మాననసిక స్థితితో పాటు భావోద్వేగాలను చాలా వరకు మెరుగుపరుస్తుంది. ఇది మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజులో కొంత సేపు సంగీతం వింటే ఒత్తిడి తగ్గి మైండ్‌ రిలాక్స్‌ అవుతుంది.
ఏదైనా పుస్తకాన్ని చదవడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కొద్ది సేపు పుస్తకం చదవడం వల్ల మనస్సు టెన్షన్‌, ఒత్తిడి లేకుండా ఉంటుంది. మనస్సును రిలాక్స్‌గా ఉంచడానికి చదవడం సులభమైన మార్గం.
మానసిక ఒత్తిడిని తగ్గించడంలో శారీరక వ్యాయామం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతీ రోజూ వాకింగ్‌, యోగా, రన్నింగ్‌ వంటి వాటితో మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఇక పనిలో ఎంత బిజీగా ఉన్న ప్రతీ రోజూ కొద్ది సేపైనా మీకు కావాల్సిన వారితో మాట్లాడాలని చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడపాలి. ఇలా చేయ డం వల్ల ఒత్తిడి బలదూర్‌ అవుతుంది.

]]>
పల్లీలతో ప్రయోజనాలు… https://navatelangana.com/advantages-with-pally/ Wed, 08 May 2024 18:43:36 +0000 https://navatelangana.com/?p=286459 పల్లీలతో ప్రయోజనాలు...పల్లీలు.. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచటంలో ఎంతో తోడ్పడతాయి. వీటిని రెగ్యులర్‌గా తినటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి బరువును సైతం నియంత్రిస్తాయి. మెదడు పనితీరును నిర్వహించడంలో ఇవి దోహదపడతాయి. తగు మోతాదులో పల్లీలను తినటంవల్ల డయాబెటిస్‌ రిస్క్‌ తగ్గుతుంది. మెరుగైన జీర్ణ ఆరోగ్యం వీటితో లభిస్తుంది. పల్లీలను వేయించి, తేనెతో కలిపి తీసుకుంటే మొటిమల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోరియాసిస్‌, ఎగ్జిమా వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే వీటిని క్రమం తప్పకుండా తింటుండాలి.

]]>
మాట‌ల్లోనే మహిళా శక్తి https://navatelangana.com/womens-power-in-words/ Tue, 07 May 2024 16:17:08 +0000 https://navatelangana.com/?p=285721 మాట‌ల్లోనే మహిళా శక్తి‘స్త్రీలు ఎక్కడ పూజింపడతారో అక్కడ దేవతలు నడయాడుతారు అంటారు. స్త్రీ ఔన్నత్యానికి సమాజంలో వారికి ఉన్న ప్రాధాన్యతకు మన భారతీయ సంస్కృతి ఇచ్చిన గౌరవం అది. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏమిటి? మహిళలు అంటే అడుగడుగునా అవమానాలు, లైంగికదాడులు, హత్యలు. అందుకే ప్రతి స్త్రీ మూర్తికి ప్రణమిల్లి చెబుతున్నాం. మీ రక్షణ కోసం, సమాజంలో మీకు సమున్నత గౌరవం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది’ ఒకానొక సందర్భంలో బీజేపీ నాయకులు అన్న మాటలు ఇవి. కానీ ఆచరణలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. బీజేపీ కాలంలోనే మహిళలపై దాడులు మరింత పెరిగిపోయాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ‘బేటీ బచావో, బేటీ పడావో’, ‘మహిళా శక్తి’ అంటూనే మనువాదాన్ని ప్రవేశపెట్టి మహిళలకు తిరిగి ఇంటికి పరిమితం చేయాలని చూస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇవే వినిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీకు ఎలాంటి పాలన కావాలని అడిగితే మహిళల స్పందన ఎలా ఉందో చూద్దాం…
మహిళా అణచివేత చరిత్ర కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. వారి సనాతన విశ్వాసాలు, పితృస్వామ్య మనస్తత్వం స్త్రీలను బలహీనులుగా మాత్రమే చూస్తాయి. స్త్రీలు ఎప్పుడూ మగవారికి లోబడి ఉండాలని చెప్తారు. సొంత నిర్ణయాలు తీసుకోలేని వారిగా, గొంతు లేని వారిగా చిత్రీకరిస్తున్నారు. పదేండ్ల బీజేపీ పాలనలో మహిళలపై పెరుగుతున్న నేరాలే దీనికి నిదర్శనం. 2014కు ముందు మహిళల పట్ల ఇంతటి దిగజారుడు తనాన్ని మనం చూడలేదు. ఉన్నావ్‌, హత్రాస్‌ కేసులలో బాధితులు, వారి కుటుంబాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుల గురించి విన్నాం. కాపాడాల్సిన వారే నేరస్థులతో చేతులు కలపడం కండ్లారా చూశాం. అంతేనా మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ నేటీ బీజేపీ పాలనలో హరించివేయబడుతున్నాయి. మహిళలను రక్షిస్తామని చెబుతున్న కేంద్రం ఆచరణలో మాత్రం మనువాద విధానాలతో మరింత దుస్థితిలోకి నెట్టివేస్తోంది.
అభద్రతా భావంలో బతుకుతున్నారు
హింసకు గురైన బాధితులను న్యాయానికి దూరం చేసి దేశంలో మహిళలకు రక్షణ లేకుండా చేశారు. అభద్రతా భావంలో బతికేలా చేస్తున్నారు. దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన రెజ్లర్‌లు బ్రిడ్జ్‌ భూషణ్‌ తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని నడిరోడ్డుపై నినదించినా వారి ఆర్తనాధాలు వినిపించుకోలేదు. మణిపూర్‌లో మహిళలపై సామూహిక లైంగిక దాడి చేసి, వివస్త్రలను చేసి ఊరేగించినా నోరు మెదమని పాలకుల చేతుల్లో మన దేశం ఉంది. అందుకే మహిళలు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి మరింత దిగజారి పోతుందనీ, తమ ఉనికే ప్రశ్నార్థమవుతుందని వారు ఆందోళన చెందడం సహజం.
పూర్తి భిన్నంగా ఉన్నాయి
21వ శతాబ్దంలో మహిళలు సమానత్వం, స్వేచ్ఛను కోరుకుంటున్నారు. వారు తమ కార్యాలయంలో, కుటుంబంలో, సామాజిక సమూహాలలో, సమాజంలో సమానత్వాన్ని కోరుకుంటున్నారు. సొంత ఎంపికలు చేసుకునే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కానీ నేడు దేశాన్ని పాలిస్తున్న పాలకుల విధానాలు మహిళల ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. భారతదేశంలోని ప్రతి స్త్రీకి సమానత్వాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వుంది. అలాంటి ప్రభుత్వం కావాలని మహిళలు కోరుకుంటున్నారు.
బీజేపీతో దేశానికి నష్టమే
కేంద్రంలో పదేండ్ల నుండి బీజేపీ పాలిస్తుంది. ఇప్పటి వరకు దేశానికి చేసింది ఏమీ లేదు. పైగా ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మహిళల గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. మణిపూర్‌లో మహిళలను లైంగిక దాడి చేసి వివస్త్రలుగా చేసినా నోరు విప్పలేదు. ఇలాంటి వారి వల్ల దేశానికి నష్టం తప్ప ఎలాంటి లాభం లేదు. పైగా జీఎస్టీ తెచ్చి పన్నుల భారం మరింత పెంచాడు. నేను ఈ మధ్య నాలుగు చీరలు కొంటే పదిహేను వందలు జీఎస్టీనే కట్టాల్సి వచ్చింది. పెట్రోల్‌, గ్యాస్‌ రేట్లు పెంచారు. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ ఏదో రేట్లు తగ్గిస్తున్నట్టు గ్యాస్‌పై కొంత తగ్గించారు. ఇవన్నీ సామాన్యులకు భారాలుగా మారాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ వస్తే దేశానికి కాస్త అయిన మంచిదని అనిపిస్తుంది.
– ఊర్మిళ, ఉప్పల్‌
బీజేపీని ఓడించాల్సిందే
దేశంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ప్రజాస్వామ్యం అంటే విలువ లేకుండా పోతోంది. బీజేపీ వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అమ్మాయిలు చదువులు మానేసి మళ్ళీ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేలా అనిపిస్తుంది. రెజ్లర్‌లు తమపై దాడులు జరిగాయని అన్ని రోజులు ధర్నాలు చేసినా అస్సలు పట్టించుకోలేదు. మణిపూర్‌లో కూడా అంతే. మనువాదాన్ని ప్రవేశపెట్టి మహిళల జీవితాలను పాతాళంలోకి నెట్టేసేలా ఉన్నారు. మహిళలు పిల్లల్ని కని పెంచితే సరిపోతుందని మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రధాని వల్ల దేశానికి నష్టం తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈసారి బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్‌ వస్తే కొద్దిగైనా బాగుందనిపిస్తుంది.
– కె.సుమతి, ఫ్యాషన్‌ డిజైనర్‌
మతం పేరుతో విడదీస్తున్నారు
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం పరిస్థితి బాగా మారిపోయింది. నోట్లు రద్దు చేసినప్పుడు ఎంతో మంది చాలా ఇబ్బందులు పడ్డారు. జీఎస్టీ తెచ్చి మనపై విపరీతమైన భారాలు మోపారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. అన్నిటికంటే ముఖ్యంగా కలిసి మెలిసి ఉండే ప్రజలను మతం పేరుతో విడదీయాలని చూస్తున్నారు. ఇక్కడే పుట్టి, పెరిగిన ముస్లింలను ఇక్కడి వారు కాదన్నట్టు ప్రచారం చేస్తున్నారు. పాఠశాల విద్య నుండి రామాయణ, మహాభారతం వంటికి ప్రవేశపెట్టి మతోన్మాదాన్ని పెంచి పోషించాలని చూస్తున్నారు. పైగా రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. ఇలాంటి వారు దేశాన్ని పాలిస్తే మరింత నష్టం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి బీజేపీ ఓడిపోవాల్సిందే.
– అమీన, ప్రైవేట్‌ ఉద్యోగి

]]>
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు https://navatelangana.com/coconut-water-is-good-for-health/ Tue, 07 May 2024 16:10:55 +0000 https://navatelangana.com/?p=285715 కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలుకొబ్బరి నీటిలోని కాల్షియం ఎము కల్ని, పళ్ళను దఢంగా ఉంచి, కండరాల బలోపేతానికి సహకరిస్తుంది. శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయిన ప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. విరోచనా లతో ఇబ్బంది పడే వారు శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు తాగాలి. మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడి యం వంటి పోషకాలు ఉన్న కొబ్బరి నీరు తాగ డం వల్ల గర్భవతులకు మలబద్దకం, జీర్ణకోశంలో సమస్యలు తలెత్తవు. పాలిచ్చే తల్లులు ఈ నీళ్లు తాగితే పాల ద్వారా వారి బిడ్డలకు ఈ పోషకాలు అందుతాయి. కొబ్బరి నీరు తల్లి పాలలో చేరి లారిక్‌ యాసిడ్‌ను పెంచుతుంది. దీనిలో యాంటీఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు ఉంటాయి.

]]>
ప్రొటీన్‌ మనకు చాలా అవసరం… https://navatelangana.com/we-need-protein-a-lot/ Tue, 07 May 2024 16:09:24 +0000 https://navatelangana.com/?p=285714 ప్రొటీన్‌ మనకు చాలా అవసరం...మన శరీరంలో జుట్టు, చర్మం, ఎముకలు, కండరాలు ఏర్పడటానికి, పెరుగుదలకి ప్రొటీన్‌ అవసరం. శరీరంలో ఎంజైమ్స్‌, హార్మోన్స్‌, నరాల పనితీరుకి కూడా ప్రొటీన్స్‌ అవసరం. ఈ ప్రొటీన్స్‌ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన చిన్న అమైనో ఆమ్లాల గొలుసులు. ఇది కండరాల పెరుగుదలని మెరుగ్గా చేస్తుంది.
మొత్తం 20 అమైనో ఆమ్లాలు ఉన్నాయి. వాటిలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు. ఈ తొమ్మిది శరీరంతో ఉత్పత్తి కావు. మనం తినే ఆహార పదార్థాల నుంచి వీటిని పొందొచ్చు. ఈ అమైనో ఆమ్లాలని ప్రధానంగా ప్రోటీన్ల నుంచి పొందొచ్చు. ఈ అమైనో ఆమ్లాలు.. మాంసం, చేపలు, చికెన్‌, సోయా, క్వినోవా, గోధమ వంటి మాంసాహార ఆహారాల్లో ఉంటుంది.

]]>
న‌ట శిరోమ‌ణి క‌న్నాంబ‌ https://navatelangana.com/actress-shiromani-kannamba/ Mon, 06 May 2024 17:10:11 +0000 https://navatelangana.com/?p=284868 Actress Shiromani Kannambaసినీ రంగం అంటేనే కత్తి మీద సాము. అందులోనూ ఎటువంటి పరిచయాలు, కుటుంబ నేపధ్యం లేని వారు ఈ రంగంలో రాణించాలంటే మామూలు విషయం కాదు. ఇక మహిళలు అవకాశాలు దక్కించుకోవాలంటే మరింతగా శ్రమించాల్సి వుంటుంది. సినీ రంగం రంగుల ప్రపంచం కాకముందు కేవలం నలుపు తెలుపులో మాత్రమే చిత్రాలు నిర్మించేవారు. ఆ సమయంలో ఈ రంగంలోకి మహిళలు అడుగుపెట్టడమే మహా అద్భుతం. అలాంటిది ఒక మహిళ నాటక రంగం నుండి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తన సహజమైన నటనతో తనకంటూ ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. నేటి తరం తారలకు స్ఫూర్తిగా నిలిచింది. గొప్ప నటుల పక్కన నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ నటి మరెవరో కాదు పసుపులేటి కన్నాంబ. ఈ రోజు ఆమె వర్ధంతి సందర్భంగా….
కన్నాంబ పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకొచ్చేది లవకుశలో ఆమె పోషించిన కౌసల్య పాత్ర. తర్వాత మనోహరలోని పాత్ర. ఆ రోజుల్లో ఆమెకు ధీటైన నటులు ఎస్వీ రంగారావు, శివాజీ, సావిత్రి. గంభీరమైన స్వరం, చక్కటి రూపం వీటికి తోడు మాటలు పలకడంలో ఆమె చాతుర్యం, హావభావాలతో ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు.
నాటక రంగం నుండి…
కన్నాంబ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో 1912లో జన్మించారు. తండ్రి వెంకట నరసయ్య, తల్లి లోకాంబ. తండ్రి ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పని చేసేవారు. వీరికి కన్నాంబ ఒక్కతే కూతురు. ఈమె తన చిన్నతనంలో ఎక్కువగా అమ్మమ్మ ఇంట్లోనే పెరిగారు. కన్నాంబ సంగీతం మీద ఆసక్తి కనబర చడంతో తాతయ్య ఆమెకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఆనాటి నావెల్‌ నాటక సమాజంలో తన 13వ ఏట బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగప్రవేశం చేశారు. ఆమెకు పదహారేళ్ళ వయసులో ఏలూరులో సత్యహరిశ్చంద్ర నాటకం జరుగుతోంది. ఆ నాటకానికి కన్నాంబ కూడా వెళ్ళారు. చంద్రమతి పాత్రధారిణి శోకరసంలో పాడాల్సిన పద్యాలను పాడకపోవడంతో ప్రేక్షకులు గేలి చేయడం మొదలుపెట్టారు. ప్రేక్షకుల మధ్య నుంచి కన్నాంబ లేచి స్టేజ్‌ మీదకు వెళ్ళి చంద్రమతి పాత్రను తను పోషిస్తానని ప్రకటించి, వేగంగా ముఖానికి రంగు పూసుకొచ్చి పద్యాలు పాడుతూ వుంటే, ప్రేక్షకులు ఆశ్చర్యపోయి చూస్తూ వన్స్‌ మోర్లు కొట్టారంట. అలా కన్నాంబ నటనా ప్రస్థానం మొదలైంది. ఇదే నాటక సమాజం వారు కన్నాంబకు సావిత్రి, సత్యభామ, అనసూయ, చంద్రమతి వంటి మంచి పాత్రలు ఇచ్చి వారి నాటకాలను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఆమె దొన్నేటి సూర్యనారాయణతో కలిసి ‘రంగూన్‌ రౌడి’ అనే నాటకాన్ని దేశ వ్యాప్తంగా ప్రదర్శించి మన్ననలు పొందారు. తన నాటక రంగ అనుభవంతో 1935లో హరిశ్చంద్ర అనే తెలుగు చలనచిత్రంలో చంద్రమతిగా అడుగు పెట్టారు. ఆ తర్వాత ద్రౌపతి వస్త్రాపహరణంలో ద్రౌపది పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకున్నారు.
అతి తక్కువ సమయంలో…
కన్నాంబ సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి, గొప్ప నటీమణిగా కీర్తి గడించారు. నవరసాలను సమర్థవంతంగా పోషించగల అద్భుత నటి. కన్నాంబ భర్త కడారు నాగభూషణం. వీరిద్దరూ కలిసి ‘రాజరాజేశ్వరి’ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. దీని ఆధ్వర్యంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాలు నిర్మించారు. కన్నాంబ అతి తక్కువ సమయంలోనే ఎం.జి.రామచంద్రన్‌, ఎస్‌.ఎస్‌.రాజేంద్రన్‌, శివాజీ గణేషన్‌, నాగయ్య, పి.యు.చిన్నప్ప, నందమూరి తారక రామారావు వంటి అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రాల్లో నటించారు. కేవలం కనుబొమ్మలతో ఆవిడ ప్రేమ, కరుణ, రౌద్రం… ఒకటేమిటి నవరసాలు పలికించేవారు.
కన్నాంబ లోలాకులు…
ఆ రోజుల్లో ఆమె నటించిన చిత్రాలలోని పాత్రల పేరుతో కాంచనమాల గాజులు, కన్నాంబ లోలాకులు అంటూ ఆభరణాలు వచ్చేవి. వాస్తవానికి కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు. కానీ ఐశ్వర్య ఎలా వస్తుందో ఎలా పోతుందో ఎవరూ చెప్పలేరని పెద్దలు అంటుం టారు. అలా ఆమె ఐశ్వర్యం ఎలా పోయిందో, ఏమైపోయిందో కానీ కన్నాంబ మరణంతో వారు స్థాపించిన కంపెనీలతో సహా అన్నీ మాయమై పోయాయి. ఆమె భర్త నాగభూషణం ఒక చిన్న గదిలో ఉంటూ కాలక్షేపం చేశారు. కన్నాంబ నటించిన చిత్రాలలో ఆత్మబలం, లవకుశ, దక్షయజ్ఞం, జగదేకవీరుని కథ, మాంగల్యబలం, తోటి కోడలు, చరణదాసి, అనార్కలి, పాదుకా పట్టాభిషేకం, అన్నా తమ్ముడు, తల్లి ప్రేమ, సారంగధర వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రతి చిత్రంలోనూ ఆమె నటన అద్భుతమే. సహజ సౌందర్యంతో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
మంచి గాయనిగా…
కేవలం నటిగానే కాదు మంచి గాయనిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు కన్నాంబ పాడిన కృష్ణం- భజరాధా గ్రామఫోన్‌ గీతాలు ప్రతి ఇంటా మారుమోగుతూ ఉండేవి. చండిక చిత్రంలో చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, కళ్లెర్రజేస్తూ ‘నేనే రాణినైతే, ఏలనే ఈ ధర ఏకధాటిగా’ అనే పాట కోసమే చాలా మంది ఆ రోజుల్లో ఆ సినిమా చూసేవారు. ‘ఏమే ఓ కోకిల..ఏమో పాడేదవు ఎవరె నేర్పినది ఈ ఆట ఈ పాట…’ అంటూ సాగే ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతు పాడారు. మధ్య మధ్యలో వచ్చే ఆ నవ్వు ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి ప్రేక్షకులు చెప్పుకునేవారు.
– పాలపర్తి సంధ్యారాణి
కటిక పేదరికంలో…
ఆవిడ గొప్ప మనసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పుకోవాలి. శ్రీ రాజరాజేశ్వరి ప్రొడక్షన్స్‌ ఆనాడు ఒక దాన ధర్మ నిలయంగా విలసిల్లేదని నేటికీ సినీ పరిశ్రమలో ఎంతో మంది చెప్పుకుంటారు. ఇటువంటి గొప్ప నటి కటిక పేదరికంలో చనిపోయారు అని తలచుకుంటే ఎవరికైనా గుండె ద్రవించక మానదు. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న కన్నాంబ 1964 మే 7న తన తుది శ్వాస విడిచారు.

]]>
వ్యాయామం చేస్తే.. https://navatelangana.com/if-you-exercise/ Mon, 06 May 2024 17:06:33 +0000 https://navatelangana.com/?p=284867 వ్యాయామం చేస్తే..వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజూ వ్యాయామం చేసి చాలా ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. ఊబకాయం మొదలు గుండె సంబంధిత సమస్యల వరకు ఎన్నో రకాల సమస్యలకు వ్యాయామం బెస్ట్‌ ఆప్షన్‌గా చెబుతారు. అయితే వ్యాయామంతో నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. వారానికి కనీసం రెండు, మూడుసార్లు చేసినా రాత్రిపూట బాగా నిద్ర పడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా వ్యాయామం ఉపయోగపడుతుందట. ఈ పరిశోధన కోసం సుమారు 4400 మందిని ఎంచుకొని వారానికి ఎన్నిసార్లు, ఎంతసేపు, ఎంత తీవ్రతతో వ్యాయామం చేస్తున్నారు, నిద్రలేమి లక్షణాలు ఎలా ఉన్నాయి.? లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే రాత్రిపూట ఎంతసేపు పడుకుంటున్నారు.? అనే విషయాలను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు. వారానికి కనీసం రెండు, అంతకన్నా ఎక్కువసార్లు వ్యాయామం చేసేవారిని చురుకుగా ఉన్నవారిగా పరిగణనలోకి తీసుకుని వారి నిద్రకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఇలాంటి వారిలో నిద్రలేమి ముప్పు 42శాతం తక్కువగా ఉంటోందని గుర్తించారు. అలాగే వీరిలో నిద్రలేమి లక్షణాలు 22-40శాతం వరకు తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది.

]]>
స‌రిహ‌ద్దులు దాటింది https://navatelangana.com/boundaries-are-crossed-2/ Sun, 05 May 2024 17:08:40 +0000 https://navatelangana.com/?p=284208 Boundaries are crossedఅన్నపూర్ణి రాజ్‌కుమార్‌... అడ్డంకులు బద్దలుకొట్టింది. 40 ఏండ్ల వయసులో బంగ్లాదేశ్‌లోకి సరిహద్దు దాటిన మొదటి మహిళా ట్రక్కర్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. పురుషులకు మాత్రమే పరిమితమైన డొమైన్‌లో తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకుంది. లింగ మూస పద్ధతులను పగులగొట్టింది. ఆమె బద్దలు కొట్టిన ఈ అడ్డంకులతో పురుషాధిక్య రంగాలలో మహిళల ప్రవేశాన్ని మరింతగా ప్రేరేపిస్తోంది.
అన్నపూర్ణి తమిళనాడు నుండి 10 రోజుల పాటు ప్రయాణం చేసి సుమారు వెయ్యి కిలోమీటర్లు దాటుకుని పెట్రాపోల్‌ సరిహద్దు చెక్‌పోస్ట్‌కు చేరుకుంది. ‘విశాఖపట్నం సెజ్‌ నుండి కాటన్‌ నూలుతో కూడిన ట్రక్కును నడుపుకుంటూ గత శనివారం రాత్రి పెట్రాపోల్‌కు చేరుకుంది” అని పెట్రాపోల్‌లోని ల్యాండ్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (LPAI) మేనేజర్‌ కమలేష్‌ సైనీ అన్నారు.
అడ్డంకులను అధిగమించడం
అన్నపూర్ణి తన ప్రయాణ సమయంలో అనేక రవాణా సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. జాతీయ రహదారుల వెంబడి మహిళల కోసం రెస్ట్‌రూమ్‌ సౌకర్యాలు లేకపోవడం ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల్లో ముఖ్యమైనది. ‘ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ ఆమె తన ట్రక్కును పార్క్‌ చేసిన హోటళ్లలోనే వసతిని ఏర్పాటు చేసుకుంది’ అని సైనీ జోడించారు. అయితే ఈ ప్రయాణంలో వసతికి సంబంధించి ఆమెకు ఎంపికలు చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఆమె రోడ్‌సైడ్‌ ధాబాలలో బస చేయకూడదని నిర్ణయించుకుంది. పురుషుల ఆధిపత్య కారణంతో ఆమె సాధారణంగా డ్రైవర్‌లు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలకు దూరంగా ఉంది.
బంగ్లాదేశ్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దు వేగంగా దాటడానికి అవసరమైన క్లియరెన్స్‌ తీసుకోగలిగింది. ‘ఆమె చేసిన ప్రయాణం మహిళల కోసం రూపొందించిన LPAI మార్గదర్శకాలకు కట్టుబడి ఉంది. మేము బంగ్లాదేశ్‌ అధికారులతో కలిసి ఆమె ట్రక్‌ నుండి కాటన్‌ను వెంటనే దించాము. మధ్యాహ్నం 12:30 గంటలకు పెట్రాపోల్‌కు వేగంగా వెళ్లేందుకు వీలు కల్పించాము. సాధారణంగా ట్రక్కులు సరిహద్దులో చాలా సమయం వేచివుండాల్సి వుంటుంది. కానీ ఆమెకు ఆ నిరీక్షణ లేకుండా చేశాము’ అని సైనీ వివరించారు. తమిళం మాత్రమే మాట్లాడగలిగే ఆమె హిందీలో కొంత మాట్లాడగలదు. తన సంభాషణ కోసం ఆమె తోటి డ్రైవర్ల సహకారం తీసుకుంది.
లింగ సముపార్జన
బంగ్లాదేశ్‌ నుండి ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఆమెకు ప్రత్యేక సౌకర్యాలతో కూడిన మహిళా వసతి గృహంలో వసతి కల్పించారు. ఇది లింగ పక్షపాతాలను తొలగించడానికి, కస్టమ్స్‌ క్లియరింగ్‌, ఫార్వార్డింగ్‌ ఏజెంట్‌ల వంటి పాత్రలలో స్త్రీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభ ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. పెట్రాపోల్‌ సి అండ్‌ ఎఫ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కార్తిక్‌ చక్రవర్తి, ఢిల్లీ నుండి పెట్రాపోల్‌కు ఇటీవలి పర్యటన సందర్భంగా హోం వ్యవహారాల సీనియర్‌ మంత్రిత్వ శాఖ అధికారులలో అసంతృప్తిని వెల్లడి చేశారు. ఈ రంగాలలో వేళ్లూనుకున్న పురుషాధిక్యతను పరిశీలించారు.
ఆమె చేసిన ఈ ప్రయాణం ఫలితంగా సాంప్రదాయకంగా పురుషాధిపత్య రంగాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు, మహిళల భద్రత అంశాలపై దృష్టి సారించేందుకు చర్చను లేవదీసింది. మహిళా డ్రైవర్లకు సరైన సౌకర్యాలు కల్పిస్తే ఈ రంగంలో మరింత మంది మహిళలు వచ్చేందుకు ఆసక్తి చూపుతారని ఆమె ఈ సందర్భంగా పంచుకుంటుంది.
LPAI సభ్యురాలు రేఖా రాయ్కర్‌ కుమార్‌, మహిళా కార్మికులకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించాలని కోరుతూ మార్చి 19న పెట్రాపోల్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘లింగ వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే సరిహద్దు సంబంధిత వృత్తులలో భాగస్వాములు అయ్యేలా మహిళలను ప్రోత్సహించాలనుకుంటున్నాం. అయితే ముఖ్యంగా చీకటి పడిన తర్వాత మహిళలకు కొన్ని సమస్యలు, ఆందోళనలు మొదలవుతాయి. హోటల్‌ సిబ్బందిలో అందరూ మగవారు ఉండటమే దీనికి ప్రధాన కారణం’ అని రేఖా అంటున్నారు. మరింత సమగ్రమైన కార్యాలయ వాతావరణాన్ని పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆమె నొక్కిచెప్పారు.
అన్నపూర్ణి సాధించిన ఈ విజయం దీర్ఘకాలంగా ఉన్న లింగ మూస పద్ధతులను సవాలు చేస్తూ, సాంప్రదాయకంగా పురుషాధిపత్య రంగాలలో వృత్తిని కొనసాగించేందుకు మరింత మంది మహిళలకు మార్గం సుగమం చేసింది. కష్టాలను ఎదుర్కునే ఆమె సంకల్పం, పట్టుదల ఇతర మహిళలు అద్దాల పైకప్పులను ఛేదించడానికి అడ్డంకులు లేకుండా వారి కలలను స్వీకరించడానికి ప్రేరేపించాయి.

]]>
రక్తపోటును తగ్గించే సూపర్‌ ఫుడ్స్‌..! https://navatelangana.com/super-foods-that-lower-blood-pressure/ Sun, 05 May 2024 17:04:09 +0000 https://navatelangana.com/?p=284213 రక్తపోటును తగ్గించే సూపర్‌ ఫుడ్స్‌..!ఇటీవల కాలంలో అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్‌ సమస్య చాలా మందిలో బయటపడుతోంది. ఇది శరీరంలోని ధమనులను ప్రభావితం చేస్తుంది. రక్త నాళాల ద్వారా రక్తం ప్రవహించే శక్తి నిరంతరం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే, రక్త నాళాల్లో ప్రవహించే రక్తం ధమనుల గోడలపై అధిక పీడనాన్ని కలుగజేస్తే దాన్ని హై బ్లడ్‌ ప్రెజర్‌ అంటాం. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రకారం దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, రక్త ప్రసరణ వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని ఫలితంగా గుండెపోటు, పక్షవాతం, ఇతర సమస్యలకు దారితీస్తుంది. రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. తినే ఆహారం రక్తపోటు నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి రక్తపోటు తగ్గించుకోవడానికి తినాల్సిన కొన్ని ఉత్తమ ఆహారాలు ఏవో చూద్దాం.
అరటి పండ్లు : అరటిపండ్లలో గుండె ఆరోగ్యాన్ని పెంచే, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే అనేక ముఖ్యమైన పోషకాలుంటాయి. రక్తపోటును తగ్గించే న్యూట్రియంట్సూ ఉంటాయి. ఈ పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం మోతాన్ని తగ్గిస్తుంది.
బీట్‌రూట్‌ : రోజూ బీట్‌రూట్‌ తినడం లేదా బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇందులో ఫైబర్‌, ఫోలేట్‌, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌ సి వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. .
పెరుగు : రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజూ పెరుగు తినటం మంచిది. పెరుగులో రక్తపోటు స్థాయిలను నియంత్రించే విటమిన్లు, ఖనిజాలు, మెగ్నీషియం ఉంటాయి.
బెర్రీలు : ఈ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్‌, ముఖ్యంగా నీటిలో కరిగే ఫైబర్‌, ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పోషకాలు కూడా మెండుగా లభిస్తాయి. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్‌ కాంపౌండ్‌ అయిన ఆంథోసైనిన్స్‌ ఉంటుంది, ఇది రక్తపోటు తగ్గించడానికి చాలా అవసరం.
పుచ్చకాయ : వేసవిలో దొరికే పుచ్చకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం కూడా అధికంగా దొరుకుతుంది. పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లతో హెల్తీగా రక్తపోటును తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో సిట్రులిన్‌ వంటి అమైనో యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్త నాళాలను వదులు చేసి ధమనులలో ఫ్లెక్సీబిలిటీని పెంచుతాయి, తద్వారా రక్తపోటు తగ్గుతుంది.
ఓట్స్‌ : పాపులర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ఫుడ్‌ ఓట్స్‌. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. హెల్తీ ఫ్యాట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్‌లోని ఫైబర్‌ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి.

]]>
హార్డ్‌ వర్క్‌ కంటే స్మార్ట్‌ వర్క్‌ చేయాలి https://navatelangana.com/smart-work-should-be-done-rather-than-hard-work/ Sat, 04 May 2024 16:22:01 +0000 https://navatelangana.com/?p=283569 Smart work should be done rather than hard workఐఏఎస్‌, ఐపీఎస్‌ కావాలని అందరూ కలలు కంటారు… కానీ ఆ కలని కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. ఇలా తన కలను నిజం చేసుకుంది పాలమూరు ఆడబిడ్డ దోనూరు అనన్య రెడ్డి. సివిల్‌ సర్విసెస్‌ 2023 ఫలితాల్లో ఆల్‌ ఇండియా స్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించింది. ఎలాంటి కోచింగ్‌ లేకుండా సొంతంగా ప్రిపేర్‌ అయి మొదటి ప్రయత్నంలోనే ఇంత గొప్ప ర్యాంక్‌ తెచ్చుకొని యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆమెతో మానవి సంభాషణ…
మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి…
అడ్డాకుల మండలం, పొన్నకల్‌ గ్రామం, మహబూబ్‌నగర్‌ జిల్లా మాది. చిన్నతనమంతా అక్కడే గడిచింది. స్కూలింగ్‌ కూడా అక్కడే. పదో తరగతి మాత్రం గీతమ్‌ హైస్కూల్లో పూర్తి చేశాను. నాన్న సురేష్‌ రెడ్డి, ఊళ్ళో వ్యవసాయం చేయిస్తూ, సొంతంగా వ్యాపారం కూడా చేస్తారు. అమ్మ మంజుల, గృహిణి. నాకు ఓ చెల్లెలు వుంది. తన పేరు చరణ, ఇంటర్‌ చదువుతుంది. కలక్టర్‌ అయితే ప్రజలకు సేవ చేయొచ్చని నా చిన్నతనంలో మా తాతయ్య ఎప్పుడూ అంటుండేవారు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. అంతే కాక మొదటి నుండి ఆర్ట్స్‌ కోర్సులంటే బాగా ఇష్టం. అందుకే పదో తరగతి తర్వాత ఇంటర్‌లో ఆర్ట్స్‌ తీసుకున్నా. హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్‌ నా సబ్జెక్ట్‌.
అందరూ ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ అంటున్న రోజుల్లో మీరు ఈ కోర్సు తీసుకుంటే ఇంట్లో ఏమీ అనలేదా?
ఒకసారి ఆలోచించుకో అన్నారు. అయితే చిన్నప్పటి నుండి అన్ని సబ్జెక్ట్స్‌లో బెస్ట్‌గా ఉండేదాన్ని. అయితే నా ఇష్టాన్ని ఇంట్లో వాళ్ళు కాదనలేదు. కాబట్టి ఈ కోర్సు తీసుకున్నాను. ఇంటర్‌ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ మిరాండ హౌస్‌లో జియోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేశాను. అయితే అప్పటి వరకు సివిల్స్‌ రాయాలా వద్దా అనేది కచ్చితంగా నిర్ణయించుకోలేదు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ అప్పుడు సివిల్స్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాను. ఇంటర్‌లో ఉన్నప్పుడే సివిల్స్‌ గురించి కొన్ని బేసిక్స్‌ నేర్పించారు. సివిల్స్‌కి ప్రిపేర్‌ కావాలి అనుకున్నపన్పుడు ఆంథ్రోపాలజీ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాను. రెండేండ్లు దీనిపై కూర్చున్నాను. సెలక్ట్‌ అవుతానని అనుకున్నాను కానీ మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు.
మీ ప్రిపరేషన్‌ ఎలా సాగింది..?
ఇంటర్‌ నుండే పేపర్‌ చదవడం అలవాటయింది. డిగ్రీకి వెళ్ళిన తర్వాత కరెంట్‌ అఫైర్స్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేదాన్ని. అలాగే క్లాస్‌ పుస్తకాలతో పాటు ఫిక్షన్‌, నాన్‌ఫిక్షన్‌ బుక్స్‌ బాగా చదువుతుండేదాన్ని. దాంతో చదివే అలవాటు పెరిగింది. మూడు రోజులకు ఒక బుక్‌ పూర్తి చేసేదాన్ని. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు కరోనా రావడంతో ఢిల్లీ నుండి ఇంటికి వచ్చేశాను. అప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులు జరిగేవి. 2021లో నా అసలు ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ ఉన్నప్పుడు ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్‌కు మూడు నెలలు ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకున్నాను. కానీ ఫుల్‌ టైం ప్రిపరేషన్‌ మాత్రం జూన్‌ 2021 నుండి మొదలుపెట్టాను.
మొదటి సారే మూడో ర్యాంక్‌… ఎలా సాధ్యమయిందను కుంటున్నారు?
మొదట నేను ఈ ఎగ్జామ్స్‌ గురించి బాగా విశ్లేషణ చేశాను. ఏడాదిన్నర దీని కోసం కేటాయిస్తే సరిపోతుందనిపించింది. అయితే ఎంత టైం కేటాయిస్తున్నాం అనేది కాదు ఎంత క్వాలిటీ టైం కేటాయిస్తున్నామనేది దీనిలో ముఖ్యం. ప్రిలిమ్స్‌కి ప్రిపేరయ్యేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్‌ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, దానికి తగ్గట్టు నోట్స్‌ ఎలా తయారు చేసుకోవాలి, ప్రాక్టీస్‌ ఎలా చేయాలి, ఎగ్జామ్‌ హాల్లో టెన్షన్‌ లేకుండా రాయాలంటే ఎలా ప్రిపేరవ్వాలి వీటిపై దృష్టి పెట్టాను. అలాగే మెయిన్స్‌కి కూడా ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో టాప్‌ ర్యాంకర్లు వచ్చిన వారు ఎలా రాశారు, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడారు ఇలాంటి వీడియోలు బాగా చూసేదాన్ని. చదవడంతో పాటు వాటి విశ్లేషణకు టైం బాగా కేటాయించేదాన్ని. ఈ విశ్లేషణ నాకు ప్లెస్‌ పాయింట్‌ అయిందనుకోవచ్చు. గత టాపర్స్‌ నుండి నేను నేర్చుకున్నది ఏమిటంటే ఒకరు చెప్పింది విని దాన్ని ఫాలో అవ్వడం కాదు. మన ప్లానింగ్‌ మనకు తగినట్టు ఉండాలి. మరో విషయం బ్లయిండ్‌గా వెళ్ళొదు. అంటే ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నామంటే దాని నుండి మనం ఏం నేర్చుకున్నామో ఓ స్పష్టత ఉండాలి. ఏదో చదివామంటే చదివామని కాదు. ప్రతి దాంట్లో మనకు ఉపయోగపడే అంశం ఏముందో దాన్ని అవగాహన చేసుకుంటే అప్పుడు చదివినా, రాసినా ఫలితం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పని చేసినా సూక్ష్మంగా ఆలోచించాలి.
పోస్టింగ్‌ వచ్చిన తర్వాత మీ పని ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
మాకు ఇచ్చే జిల్లాను బట్టి అక్కడ అవరాలు, పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుంది. అయితే మొత్తంగా చూసినప్పుడు ప్రజలకు అర్థమయ్యే పాలన అందించాలని నా కోరిక. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది అధికారులు, పోలీసులను కలవాలంటే భయపడుతున్నారు. అలాంటి ఫీలింగ్‌ పోగొట్టాలి. అప్పుడు వారి సమస్యలను పరిష్కరించగలుగుతాం. మా పని కూడా సక్రమంగా చేశామనే తృప్తి ఉంటుంది. ఏ పని చేసినా ప్రజలు కేంద్రంగా ఉండాలి. అలాగే విద్యపై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలంటే విద్య చాలా అవసరం. ఒక ఇంట్లో ఒక జనరేషన్‌ చదువుకుని ఉంటే వారు ఆలోచించే విధానం, జీవన పద్ధతి మారిపోతుంది. కాబట్టి విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను.
మీ హాబీలు..?
క్రికేట్‌ బాగా చూస్తాను. ఎంత ఇష్టమంటే టెస్ట్‌ మ్యాచ్‌లు కూడా వదలకుండా చూస్తాను. అయితే చూసి వదిలేయను, క్వీన్‌గా విశ్లేషణ చేస్తాను. ఎగ్జామ్స్‌ టైంలో మాత్రం కాస్త తగ్గించాను. అలాగే నవలలు బాగా చదువుతాను. డిగ్రీ చదివేటప్పుడైతే మూడు రోజులకు ఒక బుక్‌ పూర్తి చేసేదాన్ని. ప్రిపేరేషన్‌ అప్పుడు కాస్త తగ్గింది. మళ్ళీ మొదలుపెడతాను. అలాగే మ్యూజిక్‌ కూడా బాగా వింటాను.
మూడో ర్యాంక్‌ సాధించారు ఎలా ఫీలవుతున్నారు..?
చాలా హ్యాపీగా ఉంది. నేనే కాదు మా ఇంట్లో, ఊళ్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మహబూబ్‌నగర్‌ అంటే ఇప్పటికీ వెనకబడిన జిల్లానే. విద్యలో, అందునా మహిళా విద్యలో వెనకబడి ఉంది. ఇప్పుడు నాపై బాధ్యత పెరిగింది అనుకుంటున్నాను. ర్యాంక్‌ వచ్చింది సరే అది సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేదే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యాలు.
సివిల్స్‌కి ప్రిపేరయ్యే వారికి మీరిచ్చే సూచనలు..?
డిగ్రీలో ఉన్నప్పుడే చదవడం, రాయడం మొదలుపెట్టాలి. ముఖ్యంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. పరీక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. హార్డ్‌ వర్క్‌ కంటే స్మార్ట్‌ వర్క్‌ చేయాలి. ఈ ఎగ్జామ్‌ ఓ లాంగ్‌ జర్మీ లాంటిది. ప్రిపేరయ్యేటప్పుడు ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. అయితే దీన్ని మనం ఎందుకు ఎంపిక చేసుకున్నాం అనే విషయంలో ఓ స్పష్టత వుంటే కచ్చితంగా సాధిస్తాం. ఒక్కసారి ఫెయిల్‌ అయినా కుంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పరీక్షల్లో అది చాలా సహజం. మరింత పట్టుదలతో ప్రిపేర్‌ అవ్వాలి.
అమ్మాయిల అభివృద్ధికి మీరిచ్చే సూచన..?
చదువు చాలా అవసరం. ఆ చదువు వల్లనే మనపై కాన్ఫిడెన్స్‌ వస్తుంది. ఒకరిపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మేమూ ఎందులోనూ తక్కువకాదు, ఏమైనా సాధించగలం అనే నమ్మకం వస్తుంది. అప్పుడు ఎవరికీ భయపకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతాయి. అయితే మన ముందు ఎంతో మంది స్ఫూర్తిదాయక మహిళలు ఉన్నారు. వారి జీవితాలను చూసి మన స్థాయిలో మనం ఏం చేయగలమో ఆలోచించాలి. అప్పుడు అమ్మాయిల కెరీర్‌ అద్భుతంగా ఉంటుంది.
ఇంటర్వ్యూ : సలీమ 

]]>
పెద్దల జోక్యం తగ్గాల్సిందే.. https://navatelangana.com/the-interference-of-adults-should-be-reduced/ Fri, 03 May 2024 16:37:54 +0000 https://navatelangana.com/?p=282823 పెద్దల జోక్యం తగ్గాల్సిందే..ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు తమ పిల్లలు చిన్నవారిగానే కనిపిస్తారు. అయితే పెండ్లి చేసిన తర్వాత కూడా వాళ్ళకేం తెలియదు అనుకుంటారు చాలా మంది. అన్ని విషయాల్లో తామే కల్పించుకుని సరిదిద్దాలనుకుంటారు. దాంతో ఆ జంటల మధ్య అనేక సమస్యలు వస్తున్నాయి. పెద్దల జోక్యానికి తోడు నేటి జంటల్లో ‘నేను గొప్పంటే నేను గొప్పా’ అనే భావన కూడా బాగా పెరిగిపోయింది. కుటుంబం అంటే సర్దుకుపోవడం అనే విషయమే మర్చిపోయారు. వీటన్నింటి ఫలితంగా యువ జంటలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
ముజఫర్‌ తన ముఫ్పై ఏండ్ల కూతురు రిజ్వానాని వెంటబెట్టుకుని ఐద్వా ఆఫీస్‌కు వచ్చి ‘మేడమ్‌ తను నా కూతురు. కరోనా కంటే ముందు పెండ్లి చేశాము. అబ్బాయి పేరు షరీఫ్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, మంచి జీతం. తెలిసిన వారు మంచి అబ్బాయి అంటే మంచి ఉద్యోగం ఉంది కదా అని పెండ్లి చేశాము. మా అమ్మాయి గవర్నమెంట్‌ ఆఫీసులో కాంట్రాక్ట్‌ ఉద్యోగం చేస్తుంది. పెండ్లికి ముందే తను ఉద్యోగం చేస్తున్న విషయం అతనికి తెలుసు. ‘పెండ్లి తర్వాత చేసినా మాకెలాంటి అభ్యంతరం లేదూ’ అన్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగం మానేయమంటున్నాడు. ఇల్లు పట్టించుకోడు. తనకు వచ్చిన జీతం ఏం చేస్తున్నాడో తెలియదు. పెండ్లి అయినప్పటి నుండి వాళ్ళ ఖర్చులన్నీ నేనే చూసుకుంటున్నాను. బాగా పిసినారి. తన కొడుకు గురించి కూడా పట్టించుకోడు. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాం’ అంటూ బాధపడ్డాడు.
అంతా విని తండ్రిని బయటకు పంపించి రిజ్వానాతో మాట్లాడితే ‘మేడమ్‌ అతను ఇంట్లో అస్సలు పట్టించుకోడు. బాబుకు నాలుగేండ్లు, స్కూల్లో చేర్పించాలంటే పట్టించుకోలేదు. మా నాన్ననే తీసుకెళ్ళి చేర్పించాడు. వాళ్ళ బంధువుల ఇంటికి నన్ను తీసుకెళ్ళడు. వాళ్ళ గురించి నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళు ఉండే ఇల్లు మా ఆఫీసుకు చాలా దూరం. అందుకే నేను ఎక్కువగా మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని. పెండ్లి తర్వాత వెంటనే ప్రెగెన్సీ వచ్చింది. ఇక జర్నీలు చేయడం ఎందుకనీ ఆయనే నన్ను ఇక్కడ ఉండమన్నారు. వారానికి ఒకసారి వస్తుండేవాడు. బాబు పుట్టాడు.
దేనికైనా ఖర్చు పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తాడు. బాబు కోసం ఖర్చు పెట్టినప్పుడు కూడా ఇదే ధోరణి. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. మా నాన్న వాళ్ళకు ఇంకో ఇల్లు ఉంటే మేము కొన్ని రోజులు అందులో అద్దెకు ఉన్నాము. అక్కడకు వచ్చిన దగ్గర నుండి రోజూ ఇంటికి లేటుగా వచ్చేవాడు. బాబును మా అమ్మ దగ్గర వదిలిపెట్టి నేను ఆఫీస్‌కి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత తీసుకెళ్ళేవాడు. ఒకరోజు మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి మా నాన్నను రమ్మంటూ ఫోన్లు చేశాడు. ఆయనకు గుండె ఆపరేషన్‌ జరిగి మందులు వేసుకొని పడుకుంటాడు. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని వద్దని గట్టిగా వాదించాను. నన్నూ బాబును కొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది. మీరే ఆయన్ని పిలిచి మాట్లాడండి’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
మేము షరీఫ్‌ను పిలిపించి మాట్లాడితే ‘మేడమ్‌ మా మధ్య సమస్యలకు కారణం వాళ్ళ నాన్న. ప్రతి విషయంలో కల్పించుకుంటాడు. రిజ్వానా వాళ్ళ నాన్న ఏం చెప్తే అదే వింటుంది. ఏదైనా గట్టిగా అంటే చచ్చిపోతానని తల గోడకేసి కొట్టుకుంటది, చాకుతో కోసుకోబోతది. అందుకే నేను వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్‌ చేస్తాను. ఒక రోజు నేను తిన్న ప్లేటు కడగలేదు. మేము వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు 40 కిలో మీటర్లు జర్నీ చేయాల్సి వచ్చేది. బాగా అలసిపోయేవాడిని. దాంతో తర్వాత రోజు కడుగుతా అంటే నా మాట వినకుండా ఇప్పుడు కడగాల్సిందే అని షింక్‌ వైపు నన్ను తోసింది. నాకు కోపం వచ్చి ఒక దెబ్బ వేశాను. ఇలా ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇక మా వాళ్ళ ఇంటికి అంటారా పెండ్లి తర్వాత కరోనా వచ్చింది. బాబు చిన్నవాడు, ఆ సమయంలో బయట తిరిగితే ఎలా అందుకే తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తీసుకెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
తను కూడా ఆఫీస్‌కి వెళ్ళి అలసిపోయి వస్తుంది. నేను ఇంట్లో పనులు చేయాలేనంటుంది. కనీసం మా ఇద్దరి మధ్య రిలేషన్‌ కూడా సరిగా లేదు. పైగా చిన్న పిల్లవాడు ఉన్నాడు చూసుకోవాలి కదా. అందుకే తనని జాబ్‌ మానేయమంటున్నాను. ఆమేమో ‘నువ్వే మానేసెరు, నిన్ను నేను పోషిస్తాను’ అంటుంది. ఇది ఎంత వరకు సరైనది. వాళ్ళ నాన్న కూడా ‘మా అమ్మాయి జాబ్‌ మానేయదు. నా కూతురు ఉద్యోగం చేయాల్సిందే’ అంటాడు. కూతురికి సర్ధి చెప్పాల్సింది పోయి ఆయనే రెచ్చిగొట్టినట్టు మాట్లాడుతున్నాడు’ నాకు నా భార్యను, కొడుకుని తీసుకెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ తను జాబ్‌ మానేసి ఇంట్లో బాబును మంచిగా చూసుకుంటే చాలు’ అన్నాడు.
ఇదే విషయం రిజ్వానాకు చెబితే ‘జాబ్‌ మానేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన నెల నెలా నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇవ్వాలి. అలాగే మేము ఉండబోయే ఇల్లు కూడా ఆయన ఆఫీస్‌కి దగ్గరలో తీసుకోవాలి. మా అమ్మ వాళ్ళకు కానీ, వాళ్ళ వాళ్ళకు కానీ దగ్గర్లో వద్దు’ అంది.
‘నీ భర్త నీ చేతికి డబ్బు ఇస్తాడు. ఇంట్లో కావల్సిన వన్నీ నువ్వు చూసుకోవాలి’ అని చెప్పాము. దానికి ఆమె తండ్రి ‘ఇప్పటి వరకు మా అమ్మాయి ఇంటి బాధ్యతలు ఏమీ చూడలేదు. తను చేయగలుగుతుందో లేదో’ అన్నాడు. దానికి మేము ‘పిల్లల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. అందరూ అన్నీ పుట్టుకతో నేర్చుకోరు. అవసరాలే అన్నీ నేర్పిస్తాయి. అమెకు ఇప్పుడు 30 ఏండ్లు. ఇంకా చిన్న పిల్ల కాదు. తన కుటుంబాన్ని తాను చూసుకోగలదు. అవసరమైతే మేం తనకు సహకరిస్తాం. మీకు ఆరోగ్యం బాగోలేదు. అనవసరంగా ఆమె జీవితంలో కల్పించుకుని సమస్యలు తెచ్చుకోకండి. ఇప్పటి వరకు వాళ్ళ భారాలన్నీ మీరే మోశారు. ఇక వాళ్ళ బతుకు వాళ్ళను బతకనివ్వండి. మెల్లగా తనే అన్నీ చూసుకుంటుంది’ అని చెప్పాము.
‘అంతా మీ ఇష్టం మేడమ్‌. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. తను సంతోషంగా ఉంటే మాకు చాలు’ అన్నాడు. షరీఫ్‌ మాట్లాడుతూ ‘తనకు నచ్చినట్టే మా ఆఫీస్‌కు దగ్గరలో, బాబు స్కూల్‌కి ఇబ్బంది లేకుండా ఇల్లు చూసుకుంటాం. రిజ్వానాకు నచ్చితేనే అడ్వాన్స్‌ ఇచ్చి అందులోకి మారతాం. తను అడిగినట్టు ప్రతి నెలా ఖర్చుల కోసం డబ్బు ఇస్తాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. కానీ వాళ్ళ నాన్నను మాత్రం మా విషయాల్లో కల్పించుకోవద్దని చెప్పండి’ అన్నాడు.
‘ఇకపై మీ విషయాల్లో ఆయన కల్పించుకోడు. కానీ రిజ్వానాకు ఏమైనా ఇబ్బంది వస్తే మాత్రం మేం ఊరుకోం. ఇప్పటి నుండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా మాతో చెప్పుకోండి. కూర్చొని పరిష్కరించుకుదాం. ఇద్దరూ బాబును తీసుకొని వారం వారం సరదాగా బయటకు వెళ్ళి రండి, జీవితాన్ని సంతోషంగా గడపండి’ అని చెప్పి పంపించాము.

]]>
త్వరగా కుళ్లిపోతున్నాయా? https://navatelangana.com/are-they-rotting-quickly/ Fri, 03 May 2024 16:36:07 +0000 https://navatelangana.com/?p=282821 అరటి పండును పేదవాడి ఆపిల్‌గా పిలుస్తారు. తక్కువ ధరకు లభించే అరటితో కలిగే లాభాలు అలాంటివి మరి. అందుకే ప్రతి రోజూ కచ్చితంగాఅరటి పండును పేదవాడి ఆపిల్‌గా పిలుస్తారు. తక్కువ ధరకు లభించే అరటితో కలిగే లాభాలు అలాంటివి మరి. అందుకే ప్రతి రోజూ కచ్చితంగా అరటి పండును తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అరటి పండ్లలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇందులోని ఐరన్‌, ఫైబర్‌, ఆక్సిడెంట్స్‌ కిడ్నీలు, జీర్ణవ్యవస్థ, గుండె వంటి అవయవాలను కాపాడుతాయి.
ఇన్ని లాభాలున్న అరటి పండ్లతో వచ్చే సమస్య అవి త్వరగా కుళ్లి పోవడం. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
– అరటి పండ్లను వేలాడదీస్తే త్వరగా పాడవవు. ఇందుకోసం ఒక తాడుతో కట్టి గాలి సోకే ప్రాంతంలో వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల అరటి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
– ఇక అరటి పండ్లను ప్లాస్టిక్‌ ర్యాపింగ్‌లో చుట్టడం వల్ల కూడా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. గాలి తాకకుండా ఉండేలా కవర్‌తో అరటిపండ్లను కవర్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల అరటి పండ్లు తాజాగా ఉంటాయి.
– మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే అరటి పండ్లకు వెనిగర్‌ను అప్లై చేయాలి. అనంతరం గాలి తగిలే ప్రదేశంలో ఉంచితే అరటి పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
– ఇదిలా ఉంటే మీరు కొనుగోలు చేసిన అరటి పండ్లలో ఒక్క పండు కుళ్లిపోయినా దానిని తొలగించాలి. ఇందుకంటే బాగా మగ్గిన అరటిపండు నుంచి ఇథిలిన్‌ వాయువు వస్తుంది. ఇది పక్కనున్న అరటిపండ్లను కూడా కుళ్లిపోయేలా చేస్తుంది.

]]>