Medak Archives - https://navatelangana.com/category/medak/ Tue, 07 May 2024 14:58:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Medak Archives - https://navatelangana.com/category/medak/ 32 32 కార్టూన్ చిత్రకళపై శిక్షణ https://navatelangana.com/training-in-cartoon-art/ Tue, 07 May 2024 14:57:38 +0000 https://navatelangana.com/?p=285655 నవతెలంగాణ – సిద్దిపేట
 సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటిసారి కార్టూన్ చిత్రకళపై చిన్నారులకు మంగళవారం ప్రముఖ కార్టూనిస్ట్,  జర్నలిస్టు నెల్లుట్ల రమణారావు చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. మంగళవారం  బాల సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా సిద్దిపేట శిరిడి సాయిబాబా గుడి ప్రాంగణంలో గీతలతో నవరసాలను, భావోద్వేగాలను కార్టూన్ ద్వారా వ్యక్తీకరించవచ్చునని గీసి చూపించారు.  సమకాలిన సమస్యలపై అవగాహనతో కార్టూన్లను వేస్తే ఎందరినో ఆలోచింపజేయవచ్చునని సూచించారు. చిన్నారులకు కార్టూన్ చిత్రకళలో మెలకువలను ,  నైపుణ్యాలను వివరించారు. ఈ సందర్భంగా బాల సంస్కార్ కోర్స్ డైరెక్టర్ తోట సంధ్య , సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ , ప్రముఖ యోగ శిక్షకులు సతీష్ , కవి బసవరాజ్ రాజ్ కుమార్ తదితరులు  కార్టూనిస్టు రామారావును సన్మానించారు.
]]>
నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తాం https://navatelangana.com/we-will-set-up-a-trust-with-100-crores-within-a-month/ Tue, 07 May 2024 14:23:23 +0000 https://navatelangana.com/?p=285611
– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి.
నవతెలంగాణ – తొగుట
 ఎంపీ గా గెలిచిన 30 రోజుల్లో 100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి యువతకు అండగా నిలుస్తామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామరెడ్డి కి మద్దతు గా లింగం పేట లో ఉపాధి హామీ పనుల వద్ద ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రస్టు ఏర్పాటు ద్వారా 7 నియోజక వర్గంలలో కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి నిరుపేద యువతీ, యువకులకు కోచింగ్ ఇప్పించే విదంగా  కృషి చేస్తామన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణ అందిం చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో  ఫంక్షన్ హాల్ నిర్మించి నిరు పేదలకు ఉచితంగా వివాహాలు చేసుకునే విదంగా నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తామ న్నారు. కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామరెడ్డి కి విశేషమైన పరిపాలనా అనుభవం ఉందని, పార్ల మెంటు లో తెలంగాణ గళం వినిపించడం కోసం ఎంపీగా ఓటు వేసి గెలుపించాలని కోరారు. తాగు, సాగు నీళ్లు, 24 గంటల కరెంటు అందించిన కేసీఆర్ కే జై కొట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో మాజీ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు అభీద్ హుస్సేన్, జంగిడి భిక్షపతి, నాయకులు మంగ నర్సింలు, గొడుగు ఐలయ్య, మంగ యాదగిరి, శేరుపల్లి స్వామి, లక్ష్మణ్, కె. కర్ణాకర్, ప్రకాష్, రాజు, గణేష్, నర్సింలు, దినేష్, తోయేటి వెంకటేశం, అంకుశం, నాగరాజు, శ్రీకాంత్, భాస్కర్, రాజు, మల్లేశం, లచ్చయ్య, కనకరాజు, నర్సింలు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
]]>
ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం https://navatelangana.com/it-is-certain-that-the-congress-flag-will-fly-on-orugallu-soil/ Tue, 07 May 2024 14:17:54 +0000 https://navatelangana.com/?p=285603
నవతెలంగాణ – రాయపర్తి
పార్లమెంటు ఎన్నికల్లో ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని   కేశవాపురం, ఎర్రకుంటా తండా, జింకురాం తండా, గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు చేసిందేమి లేదని తెలిపారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నిరుద్యోగులకు ఉద్యోగాలకు ఇస్తామని హామీ ఇచ్చి నేటి వరకు కల్పించలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని, అదే విధంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని తుంగలో తొక్కినట్టే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి చరమగీతం పాడాలని ఉపోద్ఘాటించారు. వరంగల్ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అమ్య నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, ముద్రబోయిన వెంకన్న, గోవర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
]]>
నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం https://navatelangana.com/congress-partys-aim-is-the-welfare-of-the-poor/ Tue, 07 May 2024 13:24:47 +0000 https://navatelangana.com/?p=285523 – బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్
నవతెలంగాణ – మిరుదొడ్డి
నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ చేయమని ఆ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం అక్బర్ పేట భూంపల్లి మండలం అక్బర్ పేటలో అభ్యర్థి నీలం మధు కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆరు గ్యారంటీలతో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి నీలం మధును అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో నర్సింలు, దుబ్బరాజు, బాలరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
]]>
నేడు మండల కేంద్రంలో రోడ్ షో ను విజయ వంతం చేయాలి https://navatelangana.com/today-the-road-show-at-mandala-center-should-be-made-a-success/ Tue, 07 May 2024 13:16:47 +0000 https://navatelangana.com/?p=285511
నవతెలంగాణ – తొగుట
మండల కేంద్రంలో రోడ్ షో ను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కo స్వామి, ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నియోజక వర్గ కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్ కు విజయవంతం చేయాలని కోరారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే రోడ్ షో నాయకులు, కార్య కర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి కనకయ్య, మాజీ ఎంపీపీ గంట రేణుక రవీందర్, మాజీ సర్పంచు చెరుకు విజయ్ రెడ్డి, నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
]]>
ఆకాల వర్షం..రైతన్నకు అపార నష్టం.. https://navatelangana.com/unseasonal-rain-is-a-huge-loss-to-the-farmer/ Tue, 07 May 2024 12:50:19 +0000 https://navatelangana.com/?p=285479
– కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యం
నవతెలంగాణ – బెజ్జంకి  
ఆరుగాలం కష్టపడిన రైతులు ఆకాలంగా కురిసిన వర్షం వల్ల ఆగమాగమయ్యాడు.కోతకు వచ్చిన వరిపంటలను కోసి వరిధాన్యాన్ని విక్రయించడానికి గత కొద్ది రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించారు.మంగళవారం మండలంలో కురిసిన అకాల వర్షం వల్ల మండల కేంద్రంతో పాటు అయా గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర అందోళన చెందారు. కొనుగోలు కేంద్రాల నిర్వహాకులు నిర్లక్యంగా వ్యవహరించడం వల్లే ధాన్యం తడిసిపోయిందని రైతులు అగ్రహం వ్యక్తం చేశారు.ఆకాల వర్షం వల్ల తడిసిన వరిధాన్యాన్ని ఎలాంటి అంక్షలు లేకుండా కేంద్రం నిర్వహాకులు మద్ధతు ధరపై  కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు త్వరితగతిన కొనుగోల్లు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
]]>
సాధ్యం కానీ హామీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్: కాముని శ్రీనివాస్ https://navatelangana.com/congress-kamuni-srinivas-who-is-hiding-with-possible-promises/ Tue, 07 May 2024 11:48:00 +0000 https://navatelangana.com/?p=285432
నవతెలంగాణ – చిన్నకోడూరు 
కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నదని బిఆర్ఎస్ పార్టీ చిన్నకోడూరు మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కారు గుర్తుకు ఓటు వేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తూ, రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బిజెపి లకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలన్నీ రద్దు చేసినట్లు మండిపడ్డారు. బిజెపి పార్టీ మతం పేరుతో ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో 10 సంవత్సరాలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏంలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎంపి సీట్లు సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నట్లు తెలిపారు. మెదక్ ఎంపి సీటుపై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగర వేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నట్లు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో ఎక్కడిక్కడ ధాన్యం నిలిచిపోయిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు  గమనిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ యాదవ రెడ్డి, మాజీ సర్పంచ్లు ఎల్లయ్య, శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
]]>
సంకల్పం..అభినందనీయం.. https://navatelangana.com/the-determination-is-commendable/ Tue, 07 May 2024 11:34:44 +0000 https://navatelangana.com/?p=285412
– విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు..
– యువకుడు పట్నం రమేశ్ ప్రయత్నం..

– సద్వినియోగం చేసుకోవాలని సూచన 
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల కేంద్రానికి చెందిన యువకుడు పట్నం రమేశ్ గొప్ప సంకల్పంతో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతుల నిర్వహణకు శ్రీకారం చట్టడం అభినందనీయమని పలువురు కొనియాడారు.  మంగళవారం స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాల తరగత గదిలో అధికారుల అనుమతులు తీసుకుని శిక్షణ తరగతులను కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభించాడు.భవిష్యత్తులో విద్యార్థులు రాణించేందుకు ఇంగ్లీషుభాష ప్రాధాన్యత సంతరించుకుంది.ఉచిత శిక్షణ తరగతులను విద్యార్థుల సద్వినియోగం చేసుకునేల తల్లిదండ్రులు ప్రోత్సాహించాలని యువకుడు పట్నం రమేశ్ సూచించారు.తన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలనే గొప్ప సంకల్పంతో వేసవి సెలవు రోజుల్లో ఉచిత ఇంగ్లీషుభాష పటుత్వంపై శిక్షణ తరగతులు ఏర్పాటుచేయడం ఆనందనయమని మండల కేంద్రంలో పలువురు అభినందనలు తెలిపారు.
]]>
ఆకాల వర్షం..ఎండ తీవ్రతకు ఉపశమనం.. https://navatelangana.com/seasonal-rain-is-a-relief-from-the-heat-of-the-sun/ Tue, 07 May 2024 11:32:07 +0000 https://navatelangana.com/?p=285409

– మండలంలో కురిసిన తేలికపాటి వర్షం..

నవతెలంగాణ – బెజ్జంకి 
సూర్యుడు చూపిన ప్రతాపానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.ఎండ తీవ్రతకు ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యాహ్న సమయంలో నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లు గత కొద్దిరోజులగా నిర్మానుష్యమైయ్యాయి.మంగళవారం ఈదురుగాలులతో కురిసిన తేలికపాటి అకాల వర్షం ఎండ తీవ్రత నుండి ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించి ఊరటనిచ్చింది.
]]>
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి: సీఐ శ్రీను https://navatelangana.com/elections-should-be-held-peacefully-ci-srinu/ Mon, 06 May 2024 16:29:22 +0000 https://navatelangana.com/?p=284901 – గుండారం గ్రామస్తులకు సీఐ శ్రీను సూచన 
– సమస్యలను సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక 
నవతెలంగాణ – బెజ్జంకి 
ఎన్నికల సమయంలో గుండారం గ్రామం సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా నమోదైందని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి గ్రామస్తులు సహకరించాలని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను సూచించారు. సోమవారం మండల పరిధిలోని గుండారం గ్రామస్తులతో సీఐ శ్రీను ఎస్ఐ క్రిష్ణారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఎన్నికల రోజున ఎవరైనా సమస్యలు సృష్టించి ఎన్నికలకు అటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని..ప్రతి ఒక్కరూ సహరించాలని హెచ్చరించారు.
]]>
వెంకట్రామరెడ్డి ఘన విజయం ఖాయం: జీడిపల్లి రాంరెడ్డి https://navatelangana.com/venkatramareddys-great-victory-is-assured-jedipalli-ramreddy/ Mon, 06 May 2024 14:20:21 +0000 https://navatelangana.com/?p=284756
నవతెలంగాణ – తొగుట
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి ఘన విజయం ఖాయమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండ లంలోని లింగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పను ల వద్ద కూలీలకు మజ్జిగ పంపిణీ చేసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అలివి కాని హామీలు ఇచ్చి అమలు చేయ డంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొక్క బోర్లా పడ్డారన్నారు. ఇంటింటికి తాగు నీళ్లు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, 2 వేల పించిన్, కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత కేసీ ఆర్ కే దక్కుతుందన్నారు. గ్రామ గ్రామాన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కి ప్రజలం తా మద్దతు పలుకుతున్నారన్నారు.గత ప్రభుత్వం లో అందించిన సంక్షేమ పథకాలు దేశా నికి ఆద ర్శంగా నిలిచాయని అన్నారు. గత ఎన్నికలలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీగా గెలిచిన నెల రోజులలో తన సొంతంగా 100 కోట్ల రూపాయల నిధులతో ట్రస్టు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని అన్నారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని అభివృద్ధి చేసే వారికి తమ యొక్క ఓటు వేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో లింగాపూర్ లో బీఆర్ఎస్ కు ఘన విజ యం అందించారని, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటా లన్నారు. కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, గ్రామ పార్టీ అధ్య క్షులు తగరం అశోక్, నాయకులు బిక్కనూరి శ్రీశై లం, గంగి కృష్ణ, నరోత్తం రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చంద్రయ్య, సంతోష్, రామస్వామి, సుతారి రాము లు, జీడిపల్లి స్వామి, యాదగిరి, మల్లేశ్, యేళ్లేం ధర్, శ్రీశైలం, కొమురయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.
]]>
డీబీఎఫ్ నేత శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీమంత్రి హరీష్ రావు  https://navatelangana.com/former-minister-harish-rao-visited-dbf-leader-shankars-family/ Mon, 06 May 2024 14:14:44 +0000 https://navatelangana.com/?p=284748
నవతెలంగాణ – మిరుదొడ్డి 
దళిత బహుజన ఫ్రంట్‌ (డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ కుటుంబాన్ని మాజీ మంత్రి  హరిష్ రావు పరామర్శించారు.శంకర్ తండ్రి పెద్దలింగని రాజయ్య మరణించిన  సమాచారం తెలుసుకొని హరిష్ రావు  లింగుపల్లి కి వచ్చి రాజయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాజయ్య మంత్రి మరణం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమం లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపి ఆభ్యర్ధి  వెంకట్రామ్ రెడ్డి,  ఎస్సీ,ఎస్టి కమిషన్  మాజీ చైర్మన్  డాక్టర్  ఎర్రోళ్ళ శ్రీనివాస్ ,బిఅర్ ఎస్ నాయకులు మనొహర్ రావు,రాధక్రిష్ణశర్మ,మదాసు శ్రీ నివాస్, మట్టి మనిషి ఫౌండేషన్ చైర్మన్ కుడుదుల పరశురాం, మండల వైస్ యంపిపి రాజులు, పంజాల శ్రీనివాస్ గౌడ్ రాజ మహేందర్ రెడ్డి బాబు రెడ్డి సూకురి లింగం తదితరులు పాల్గొన్నారు.
]]>