Music Literature Archives - https://navatelangana.com/category/music-literature/ Sat, 23 Sep 2023 17:24:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Music Literature Archives - https://navatelangana.com/category/music-literature/ 32 32 సంగీత కళ ప్రస్థానం – పోకడ https://navatelangana.com/the-art-of-music-is-trending/ Sat, 23 Sep 2023 17:24:19 +0000 https://navatelangana.com/?p=109709 ”స్వతో రంజయతి శ్రోత చిత్తం స స్స్వర ఉచ్యతే” (బహద్దేశి) శబ్ద్ధాన్ని కాలంతో మేళవించి వినసొంపుగ మార్చే విలక్షణమైన ప్రక్రియ. స్వయంగా రంజింప చేయు ధ్వని రూపం సంగీతం. ప్రకృతిలో సంగీతం మిళితమై మన జీవన గమనంలో భాగమైపోయింది. అందుకే సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటిగా నిలిచిపోయింది సంగీతం.
భారతీయ సంగీతానికి మూలం సామవేదం అంటారు. సంగీతంలో కర్ణాటక, హిందుస్తానీ, వాగ్గేయకారుల భక్తి గీతాలు, జానపద గీతాలు, బుర్ర కథలు ఇలా ఎన్నో వున్నాయి. అనాదిగా ప్రజలు పాడుకునే జానపద సంగీతం, కర్ణాటక సంగీతం సంస్కృతీకరించబడి నేటి సినీ గీతాలుగా, లలిత గీతాలుగా కొత్త పోకడలతో సాగుతోంది.
అతి ప్రాచీన గ్రంథం అయిన భరతుని నాట్యశాస్త్రం సంగీతానికి అంకితమైన ఒక ప్రామాణిక గ్రంథం. అలాగే 13, 14 శతాబ్ధాలలో భారతీయ సంగీతం రెండు పద్ధతులుగా విభజింపబడింది.
అల్లావుద్దీన్‌ కాలంలో పారశీక కవి, సంగీత కోవిదుడైన అమీర్‌ ఖుస్రో తన దేశమందలి రాగాలను సమన్వయించి కొత్త రాగాలను సూచించాడు. పరకీయ ప్రభావంతో ప్రారంభమైన దేశపద్ధతి మొగల్‌ చక్రవర్తుల పాలనలో బాగా వ్యాపించింది. మన సంగీతంలో ఉత్తరాది, దక్షిణాది అనే రెండు పద్ధతులు ఏర్పడ్డాయి. క్రమేణా అదే మన భారతీయ సంగీతంగా రూపాంతరం చెందింది.
సంగీతానికి ఆధారం స్వరం. సంగీత త్రయంలో ఒకరైన సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారు స్వయంగా తమ కీర్తనంలో ‘కోలాహల సప్త స్వరముల గురుతే మోక్షమురా’ అని, ‘సరిగమపదని వర సప్తస్వర’ అని, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే అని… పలు విధములుగా శ్లాఘించారు.
మన పూర్వీకులు సంగీతం గురించి పలువిధాల ప్రశంసించారు. చంటి బిడ్డకు, ఆవుదూడకు, నాగు పాముకు సైతం పాటంటే ఎంతో మక్కువ అని.. అదే ఒక ఆంగ్లేయుని అభిరుచి చూస్తే తన ఆలోచనలో సంగీతాన్నిthe rhythm of life అని వర్ణిస్తారు.
దేశకాల పరిస్థితులను బట్టి మానవుని బుద్ధి చాతుర్యంతో పాటు కూని రాగం ఎన్నో మార్పులను తెచ్చిన దాఖలాలు వున్నాయి. శ్రీ వెంకటమఖి, పురందరదాసుల వారు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు మొదలగువారు సంగీతానికి ఎంతో వన్నె తెచ్చారు.
సంగీతకళకు పునాది సప్తస్వరాలు. సప్తస్వరాలు ప్రకృతిలో ఒక అంతర్భాగం. అందుకే నెమలి కూతను షడ్జమముగ, వృషభధ్వనిని రిషభముగా, మేక శబ్ధమును గాంధారముగాను, క్రౌంచపక్షి పలుకును మధ్యమముగాను, వసంత ఋతువు నందలి కోకిల కూతను పంచమముగాను, గుర్రపు ధ్వనిని దైవతముగాను, ఏనుగు ఘీంకారమును నిషాదంగాను పోలుస్తారు.
నాటి నుండి నేటి వరకు నిష్ణాతులైన సంగీతజ్ఞులు ఎందరో ఎన్నో అద్భుతమైన రచనలు చేసి మనకు అందించారు. సంగీత కళ నవరసాల రూపుదాల్చి కతులు, కీర్తనలు, భజనలు, బావ, భక్తి, కార్మిక, కర్షక, జానపద గీతాలుగా రూపు దాల్చి మన భారతీయ సంగీతంలో భాగం అయ్యాయి.
సేద్యం చేయు వారికి పొలం పాటలు, రోకటితో ధాన్యము దంచు వారికి రోకటి పాటలు, ఓడ నడుపు వారికి ఓడ పాటలు, భక్తి ద్యానము చేయువారికి భక్తి పాటలు, సంగీత కళలో ప్రవేశం, అభిరుచి గల వారికి తగు శిక్షణ పద్ధతులుగా రచించబడిన రచనలు ఇలా ఎన్నెన్నో గాన యోగ్యమైన సంగీత కళలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చాయి.
సంగీతానికి లయ ఆధారితమైతే ఆ కళ మరింత వినసొంపుగా శ్రవణారవిందంగా మారుతుంది. రాగ భావం తోడైతే గాత్ర ధర్మాన్ని బట్టి స్వరస్థాన శోభ రక్తి కడుతుంది. ఉదయించే సూర్యుని వలె భౌళి రాగ ఛాయ, అస్తమించే సూర్యుని వలె కల్యాణి రాగ ఛాయ, చల్లని చంద్రుని స్పర్శ వలె రేవతి, ఖామాస్‌ రాగ ఛాయలు ఇలా ఎన్నెన్నో రాగాలు మన నిత్య జీవితానికి, ప్రకృతికి సరితూగుతాయి.
కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య తమ రుతు గానంలో శరదృతువును వర్ణిస్తూ – ”తెల్ల చీర తెలివెల్గులన్‌ గల్గి సీతకు ముదము దాల్చు రుతు లతాంగి దైవతము పాడే” అన్నారు. ఋతువు కాలానికి సంబంధించినది. తెలుపు వర్ణాలకు చెందినది. దైవతం సంగీత శాస్త్ర పారిభాషిక పదంగా సంబోధిస్తారు.
రాళ్ళను సైతం నర్తింపచేయ గల శక్తి సంగీతానికి ఉంది అంటారు. శాస్త్ర బద్ధమైన ఆధారాలు కూడా ఎందరో మహనీయులు శోధించి ప్రయోగించటం జరిగింది. ఈ శోధన చేసిన వారిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, ఇంకా మంగళంపల్లి బాలమురళి కృష్ణ ప్రముఖులు.
రాగాలతో రోగాలను నియంత్రించడం వంటి పరిశోధనలు ఎన్నో జరిపించారు. అందుకే ఆసుపత్రి లో కూడా సంగీత ద్వని ని సూక్ష్మంగా పెట్టడం వల్ల రోగ గ్రస్తులలో ఉన్న మానసిక రుగ్మతలు, డిప్రెషన్‌ వంటివి దూరం అవ్వటం ఒక విశేషం.
సంగీత సుధాలాపనలో పాడి పశువులు ఎక్కువ పాలు ఇచ్చినట్లు, పైర్లు పుష్కలంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు నిరూపించారు. అందుకే శాస్త్ర ఆధారమైన సంగీతం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం అవ్వటం గర్వించతగ్గ విషయం. ఎందరో కళాకారులు మన ఈ లలిత కళని ఆధారంగా చేసుకొని తమ నిత్య జీవితంలో జీవనోపాధిగా పొందారు.
పూర్వపు చిత్ర తారాగణంలో పాటలు వింటే గానం చేసిన గాయనీ గాయకులు, సంగీతం సారధ్యం చేసినవారు, రచయితలు మన శాస్త్రీయ సంగీత ఆధారితమైన సాహిత్య మెళకువలను ఎంతగానో పోషించేవారు. అందుకే నాటికి యేనాటికి ఆ పాటలు ఎప్పుడు విన్నా సరికొత్తగా, సంతృప్తిగా అనిపిస్తాయి.
నేటి చిత్రాలలో కూడా అటువంటి శాస్త్రీయ ఆధారిత సాహిత్య పోకడలు కలిగిన పాటలు మనం గమనించవచ్చు. పాటకు శాస్త్ర బద్ధమైన సంగీతం ఆధారమైతే ఆ పాట ఎప్పటికీ చిరస్మణీయంగా నిలుస్తుంది.
సంగీతం ఏదోరకంగా ప్రతి మనిషి జీవితంలో సందర్భాను సారంగా సమ్మిళితమై సదా రంజిపచేస్తూనే ఉంది. అందుకే గానం మానవ వికాస యానానికి ఓ ప్రమాణం. అదే భారతీయ సంగీతకళా ప్రస్థానం. యావత్‌ ప్రపంచానికి గురుస్థానం. ప్రతి సంగీత కళాకారునికి స్వరాస్థానం.
– శ్రీమతి మూల్పూరు శ్రీవాణి, ఎం. ఏ., ఎం. ఫిల్‌. మ్యూజిక్‌. 

]]>
గుండెకు వల వేసిన వలపు పాట https://navatelangana.com/the-song-of-the-net-for-the-heart/ Sat, 01 Jul 2023 17:26:26 +0000 https://navatelangana.com/?p=46010 తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో ప్రేమ పాటలున్నాయి. ఒక్కో పాటది ఒక్కో ప్రత్యేకత. ప్రేయసీప్రియులిద్దరు కలిసి పాడుకునేవి కొన్నైతే, ప్రేయసిని ఉద్దేశించి ప్రియుడు పాడేవి కొన్ని. ప్రియుడిని ఉద్దేశించి ప్రేయసి పాడేవి మరికొన్ని. ఏది ఏమైనా ప్రతి ప్రేమపాటలో ఒక మధురానుభూతి తొంగిచూస్తుంది. అలాంటి తీయని అనుభూతికి లోనై ప్రియుడు పాడే పాటను ‘విరూపాక్ష’ (2023) సినిమా కోసం కె.కృష్ణకాంత్‌ రాశాడు. ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
తెలుగు సినీగీత రచయితల్లో ఇప్పుడు ధ్రువతారలా వెలుగుతున్నాడు కె.కృష్ణకాంత్‌. ఆయన ఏది రాసినా కొత్తగా ఉంటుంది. తీసుకున్న వస్తువుకు పదబంధాల్ని ఎన్నుకోవడంలో ఎంతో ప్రత్యేకతను చూపిస్తాడు. తేలికైన పదాల్లో అందమైన భావాల్ని ఎంతో ఇంపుగా పొదుగుతాడు.
ఈ మధ్యే విడుదలై ఓ సంచలనం సృష్టించిన సినిమా ‘విరూపాక్ష’. ఆ సినిమాలో కథ మిస్టరీగా ఉన్నా, కథ మొత్తంలో ఓ ప్రేమపాట లేకపోలేదు. అదే ‘నచ్చావులే నచ్చావులే’ అనే పాట. ఈ పాట కథానాయకుడు తన ప్రేయసిని గూర్చి పాడే పాట. ఈ పాట మొత్తంలో ఎక్కడా కూడా ప్రేయసి ప్రియున్ని ఉద్దేశించి పాడదు. కేవలం ప్రియుడే ప్రేయసిని ఉద్దేశించి పాడుతాడు. అతడు మొదటి చూపులోనే కథానాయికను ఇష్టపడతాడు. అనుకోని పరిస్థితుల్లో ఆమెతో పరిచయం ఏర్పడుతుంది. ఆమెలో ఉన్న కొంటెదనం, గడుసుదనం అతనికి బాగా నచ్చాయి. ఆమె సుకుమారమైన అందం, ఆమెలో ఉన్న మొండితనం, గుండెధైర్యం అతన్ని బాగా ఆకర్షించాయి. ఇక ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమెపై తనకు కలిగిన ప్రేమానుభూతిని ఈ పాటలో స్పష్టం చేస్తాడు..
నువ్వు నాకు నచ్చావు. నిన్ను ఏ రోజైతే చూశానో ఆరోజే నచ్చావు. తొలిచూపులోనే ఓ తెలియని పరవశం, వింతమైకం నన్ను కమ్మేసిందని అంటాడు. ఇక్కడ ఈ మాటలన్నీ ఆమెతో నేరుగా చెప్పడం లేదు. తన మనసుతో ఆమె మనసుకి మాత్రమే వినబడేలా చెబుతున్నాడు. ఇదీ ఈ పాటలోని ప్రత్యేకత. ఆమె వేసే కొంటె వేషాలు చూశాక ఇంకా ఎంతో నచ్చిందని, ఆమెకే మనసిచ్చానని చెబుతాడు.
ఆమె తెగబడుతూ దూకుతుంది. అయినా తడబడని తీరు ఆమెది. చిన్నపిల్లలా అల్లరివేషాలు వేస్తూ ఉంటుంది. ఆ చిలిపి వయసు గల తెల్లని మనసు అతనికి బాగా నచ్చుతుంది. ఆమెకు అతడు పరిచయం లేదని కాదు. పరిచయమే. కాని, ఎదురుపడినప్పుడు మాత్రం ఎవరో ఏమో పరిచయం లేదన్నట్టుగా చూస్తుంది..
అమాయకంగా ఉంటూనే హుషారుతనాన్ని చూపిస్తుందామె. ఏ మాత్రం భయం లేకుండా తాననుకున్న పనినే చేస్తుంది. అప్పుడే అర్థమైనట్టు ఉంటుంది కాని అర్థం కాదు. పొగరుకే అణకువ అద్దినంత అందంగా ఉంటుంది. పొగరు, అణకువ రెండూ కలిస్తే ఆమెనే. ఆమె అందంతో, సుగుణంతో తనను ఏమార్చేసిందని అంటాడు. పద్ధతి పరికిణీ కట్టి అమ్మాయి రూపం దాల్చితే ఆమెలా ఉంటుందట. అలా అని నమ్మితే మాత్రం నేను మోసపోయినట్టే. అంటే పద్ధతిగా ఉన్నట్టే ఉండి మాయ చేసేయగలదని అంటున్నాడిక్కడ. పైకి మామూలుగా కనిపిస్తుంది. కాని మాటలతో మరిపిస్తుంది. తన మనసుకు ముసుగును వేస్తుంది. ఎంత పెద్ద కష్టమొచ్చినా అవలీలగా దాటేయగలదు. ఎంత ఇష్టమున్నా బయటికి చెప్పదు. మనసులోనే దాచేసుకుంటుంది. తను పైకి అలా సామాన్యంగా కనబడుతున్నా లోపల మాత్రం ఇంకో లోకమొకటుంది. అందులో ఓ మూలనో తనకు చోటివ్వమని కోరుకుంటున్నాడతడు. అంటే.. ఆమె మనసులో తనకు స్థానమివ్వమని అడుగుతున్నాడని ఇక్కడ అర్థం.
తన మనసులోని మాటల్ని, దాచిపెట్టలేనంత ప్రేమని మౌనంగానే తన ప్రేయసికి ఇలా పాట రూపంలో వినిపిస్తున్నాడు ప్రియుడు. ప్రేయసి తన చూపులతో ప్రియుని గుండెకు వలవేసి లాగిన వలపుపాట ఇది..
పాట:-
నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే/
నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే
తడబడని తీరు నీదే/ తెగబడుతు దూకుతావే/
ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే/
బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే/
అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థంకావే/
పొగరుకే అణకువే అద్దినావే/
పద్ధతే పరికిణిలోనే ఉన్నదా అన్నట్టుందే/
అమ్మడూ నమ్మితే తప్పునాదే/
నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే/
పైకలా కనిపిస్తావే/ మాటతో మురిపిస్తావే/
మనసుకే ముసుగునే వేసినావే/
కష్టమే దాటేస్తావే.. ఇష్టమే దాచేస్తావే/
లోపలో లోకమే ఉంది లేవే/
నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే..
– డా||తిరునగరి శరత్‌ చంద్ర, [email protected]

]]>
మానసిక ఉల్లాసాన్నిచ్చే సంగీతం https://navatelangana.com/uplifting-music/ Sat, 17 Jun 2023 18:55:33 +0000 https://navatelangana.com/?p=37471 ”శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి:” అని ఆర్యోక్తి. సంగీతానికి శిశువులు, జంతువులు, పాములు సైతం ఆనందిస్తాయి అని అర్థం. ఆ మాటకొస్తే ప్రకృతిలోని ప్రతి సవ్వడిలోనూ నిండి ఉన్నదంతా సంగీతమే. గాలి సవ్వడిలోనూ, జలపాతపు హోరులోను, ఆకుల కదలికలోనూ లయబద్ధమైన సంగీతం వినిపిస్తుంది. విశ్వవ్యాప్తంగా మనమందరం మాట్లాడుకునే భాష పేరే సంగీతం. ఇది ప్రణవ నాదమైనా ‘ఓంకారం’ నుంచి జనించిన అద్భుతం. రాగం, తానం, పల్లవుల సమాహారం సంగీతం. స,రి,గ,మ,ప,ద,ని సప్త స్వరాలు సంగీతానికి మూలం. స – షడ్యమం, రి- రిషభం, గ- గాంధారం, మ- మధ్యమం, ప-పంచమం, ద-దైవతం, ని-నిషాదం. ‘శృతిర్మాత లయ పిత:’ సంగీతానికి ‘శృతి’ తల్లి అయితే ‘లయ’ తండ్రి. సంగీతం విని పరవశించని మనసు ఉండదు, మనిషి ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో! మన:స్థితిని నియంత్రించడానికి సంగీతాన్ని మించిన సాధనం మరొకటి లేదు. మనసును ఉల్లాసపరిచేది సంగీతం, బాధలు మరిపించేది సంగీతం. ఇలా చెప్పుకుంటూ పోతే మనలోని ప్రతి భావన సంగీతం తోనే ముడిపడి ఉంది. సంగీత సాధన చేయడం వల్ల బుద్ధి వికసిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఒత్తిడి తగ్గి సహనం అలవడుతుంది. అందుకే దీనిని ”మ్యూజిక్‌ థెరపీ’ పేరుతో వైద్య రంగంలో కూడా వాడతారు.

సంగీతంలోని ప్రతి రాగం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. సూర్యోదయ వేళలో వినిపించే ‘భూపాల రాగం’ నిద్రలేవగానే మనసుకు తెలియని ప్రశాంతతను ఇస్తుంది. సాయం సంధ్యకు చిహ్నంగా ‘హిందోళ రాగాన్ని’ చెప్పవచ్చు. మోహన, కళ్యాణి రాగాలు ఎప్పుడు విన్నా మనసుకు హాయిగా అనిపిస్తుంది. మనలోని బాధను, దు:ఖాన్ని సూచించేరాగం ‘శివరంజని’. భారతీయ సంగీతమైనా, పాశ్చాత్య సంగీతమైనా దేనికున్న ప్రాముఖ్యత దానిది. మన భారతదేశంలో ముఖ్యంగా వినిపించే సంగీతం హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలు. ఇవి పూర్తిగా శాస్త్రపరమైనవి. గురువుల దగ్గర సాధన చేస్తే మాత్రమే అభ్యసించగలిగిన సంగీతం.
రెండవది భావ ప్రధానమైనది. దీనినే ‘లలిత సంగీతం’ అంటారు. సున్నితమైన పదాలకు అందమైన రాగాలను జత చేసి, చక్కని భావవ్యక్తీకరణ చేసే సంగీతం లలిత సంగీతం. సినీ సంగీతం కూడా లలిత సంగీతం కోవకు చెందినదే. ఈ సంగీతాన్ని ఎవరైనా సులభంగా ఆస్వాదించగలరు. పాడుకునే ప్రయత్నమూ చేయగలరు. మూడవది జనుల గుండెల్లోంచి పుట్టిన ‘జానపదం’. ఇది పని నుంచి పుట్టిన పాట. ‘పనీ- పాట’ అన్నమాట జానపదాన్ని ఉద్దేశించి చెప్పినదే కావచ్చు. పనిచేసే పల్లె పడుచులు, శ్రామికులు తమ అలసటను మర్చిపోవడానికి పాడుకునే పాటలు జానపదాలు. దీనితోపాటు జాతిని జాగృతం చేసే పాటలు ‘విప్లవ గీతాలు’.
మనదేశంలో శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య సంగీత పోకడలు కూడా పెరిగి పాప్‌, రాక్‌, వెస్ట్రన్‌ మ్యూజిక్‌గా రూపాంతరం చెందాయి. నేటి యువతరం దీనిని క్రమంగా ఇష్టపడడం, వినడం, నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఎవరు ఎలాంటి సంగీతాన్ని ఆస్వాదించినా, నేర్చుకున్నా దాని అంతిమ ఫలితం మానసిక ఉల్లాసమే. భారతీయ శాస్త్రీయ సంగీతంలో త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ఈ ముగ్గురిని త్రిమూర్తులుగా చెబుతారు. వీరి రచనలలో ఒకరిది ద్రాక్ష పాకం, ఇంకొకరిది కదలీపాకం, మరొకరిది నారికేళ పాకం అని అభివర్ణిస్తారు. త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలకు పరవశించేది ఒకరైతే, అన్నమయ్య పదములకు ముగ్ధులయ్యేది కొందరు. భక్త రామదాసు భజనలకు తన్మయత్వం పొందేది కొందరైతే, ముత్తుస్వామి దీక్షితులు గారి నవ వర్ణ కీర్తనలకు మురిసేది మరికొందరు. తమ రచనలు తామే స్వయంగా చేసుకొని, అరుదైన శైలిలో తమ ప్రతిభతో దానికి అద్భుత రాగాలను అందించి, గానం చేయగల పుంభావ సరస్వతీ మూర్తులను వాగ్గేయకారులుగా చెప్పవచ్చు. అట్టి కోవకు చెందిన వారే త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, పురంధర దాసు, సూరదాసు, రామదాసు, నారాయణ తీర్థులు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు మొదలైనవారు. వీరిని ఆదర్శంగా తీసుకొని నేటి వరకు ఎందరో గురువులు మన భారతీయ సంగీతానికి ప్రాణం పోస్తున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి ఎందరో శిష్యులను తయారు చేశారు. వారి పరంపరను కొనసాగిస్తూ నేదునూరి కృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకష్ణ తమదైన శైలిలో భారతీయ సంప్రదాయ సంగీతానికి ప్రాణం పోశారు.
ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి, బాలమురళీకష్ణ మన భారతీయ సంప్రదాయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఎంతో కృషి చేశారు. ఇలాంటి అద్భుత సంగీతం పండితుల దగ్గర నుండి పామరుడి వరకు చేరి అందరూ విని ఆనందించాలనే ఉద్దేశంతో రూపొందించబడినదే ఈ ‘అంతర్జాతీయ సంగీత దినోత్సవం’.
ఫ్రెంచ్‌ రాజకీయవేత్త ‘జాక్‌ లాంగ్‌’ఈ సంగీత దినోత్సవం అనే ఆలోచన రూపకర్త. ఈ సంగీత దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1982 జూన్‌ 21న ఫ్రాన్స్‌లో జరుపుకున్నారు. సంగీతాన్ని ప్రోత్సహించడమే కాక ప్రతి ఒక్కరూ సంగీత వాయిద్యాలని ప్లే చేసి వినడం ద్వారా ఆరోజు పూర్తి ఆనందాన్ని అనుభవించి, ఒత్తిడిని తగ్గించుకొని రోజంతా ప్రశాంతంగా ఉండడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. సంగీత ఔత్సాహికులు అందరికీ ఉచిత సంగీతాన్ని అందించి, ప్రపంచవ్యాప్తంగా వీరి ప్రదర్శనలను పరిచయం చేయడం, ప్రతి దేశం తమ సంగీతం తమతోనే కాకుండా ప్రపంచ సంగీత ప్రియులందరితో పంచుకునే సదుద్దేశంతో ఈ ‘ప్రపంచ సంగీత దినోత్సవం’ ప్రారంభించారు. దీనికొక ఫారంను కూడా రూపొందించారు. ఇంత అద్భుతమైన సంగీతాన్ని మనమందరం ఆస్వాదిద్దాం. ఈ వేడుకను అందరం జరుపుకుందాం ప్రపంచ సంగీత ప్రియులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.
(జూన్‌ 21 ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా)

– వందన ద్విభాష్యం, 7981941760

]]>
లోకం గుట్టును విప్పి చెప్పిన పాట https://navatelangana.com/%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%82-%e0%b0%97%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86%e0%b0%aa/ Mon, 28 Nov 2022 22:57:38 +0000 https://dev.navatelangana.com/?p=1043

అవినీతి చర్యలతో, కల్తీ వ్యాపారాలతో, దోపిడీ విధానాలతో ఈ లోకం అల్లకల్లోలమె ౖపోతుంది. ఎటు చూసినా అక్రమాలే. చేసే ప్రతి పనిలో కల్తీయే. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, స్వరాజ్యం లభించిందని మనం విర్రవీగుతాం కాని, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్యారంగాలలో ఎక్కడా న్యాయం జరగడం లేదు. అంతా దగాలే జరుగుతున్నాయి. వాటి గుట్టును విప్పి చెప్పే పాటను ‘దేశంలో దొంగలు పడ్డారు’ (1987) సినిమా కోసం కె.లక్ష్మీనారాయణ రాశాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు ఎక్కడ న్యాయం జరిగింది? పేదల్ని దోచుకోవడం, ధనవంతుల ఖజానాలు నింపడం – ఇదే తరతరాలుగా జరుగుతున్న అన్యాయమని ఈ పాటలో ఎలుగెత్తి ప్రశ్నించారు కె.లక్ష్మీనారాయణ.
చూడు మల్లేశా! చూడు. ఈ దేశం ఎటుపోతుందో ఒక్కసారి చూడు. ఈ దేశ భవిష్యత్తు ఎలా మారిపోతుందో ఒక్కసారి కన్నెత్తి చూడు అంటూ సినిమాలో ఓ పసివాడు ఆవేదనతో పాడుతుంటాడీపాటను. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పే ఈ ప్రభుత్వం, పసిపిల్లలు తినడానికి తిండి లేక వాళ్ళ కడుపులు వీపుకంటుకుపోయి, ఆకలి మంటలతో అలమటించి, చెత్త కుప్పల వద్ద ఎంగిలి విస్తర్లలోని తిండిని ఏరుకుని తింటుంటే కాస్తయినా జాలి చూపని ఈ ప్రభుత్వం, ఈ సమాజం – బాలల్ని రేపటి పౌరులుగా ఎలా గుర్తించగలదని అధిక్షేపించిన తీరు ఇందులో కనిపిస్తుంది.

పిల్లల చదువుల కోసం ఎన్ని పాఠశాలలు తిరిగినప్పటికీ లాభం లేకపోయింది. కారణం వాళ్ళు పేద విద్యార్థులు కావడమే. సీట్లు అన్నీ ధనవంతుల పిల్లలకు రికమెండేషన్ల ద్వారా అందుతాయి. కష్టపడి చదువుకోవాలనుకునే విద్యార్థులకు మాత్రం సీటు దొరకదు. ప్రశ్నించినా పై ఆఫీసర్‌ నుంచి బదులు దొరకదు. ఎంత బతిమిలాడినా, కాళ్ళ వేళ్ళ పడినా ఫలితమేమి ఉండదు. లంచాలకు, డబ్బులకు చదువు అమ్ముడుపోయే రోజులు దాపురించాయని, ఈ దేశ విద్యావ్యవస్థ అంతకంతకు దిగజారిపోతున్న సందర్భం కనబడుతుంది.

పేద విద్యార్థుల కోసమని వేరే బళ్ళు పెడతారు. ధనవంతుల పిల్లలతో కలిసి చదువుకోనివ్వరు. చదువుకునే దగ్గర ధనిక, బీద తేడాలు చూపించే దుస్థితి నేడు ఉంది. అలా పశువుల కొట్టాల మాదిరిగా పేదపిల్లలకు బడులు పెడితే – వర్షం పడితే వరద నీరంతా బడిలోకే వస్తుంది. ఎండకు ఎండుతూ, గాలికి వణుకుతూ, భయపడుతూ, చెట్ల కింద చదువుకుంటూ, రోడ్డు పక్కన బతుకు గడుపుతూ పేదపిల్లల జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి.

అంతే కాదు – వెనుకబడ్డ పిల్లల్ని ఉద్ధరిస్తామని చెప్పి, వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తామని చెప్పి, కొన్ని హాస్టళ్ళు పెట్టి, పుచ్చిపోయి పురుగులు పట్టిన ఆహారాన్ని పిల్లలకు పెట్టి వాళ్ళ తిండి కోసం ఖర్చు పెట్టాల్సిన సొమ్మును అధికారులు మింగి పేదోళ్ళ కడుపులు కొడుతున్నారు.

ప్రతి సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంటాయని చెబుతుంటారు. కాని తెలుగు పుస్తకం ఉంటే, హిందీ ఉండదు. హిందీ ఉంటే గణితం ఉండదు. కారణం పాఠ్య పుస్తకాలను కూడా బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుని పుస్తకాల దుకాణం వాడు తన జేబు నింపేసుకుంటున్నాడు. ఇలాంటి దారుణ పరిస్థితులు మన దేశంలో ఇంకా నేటికీ కనబడుతున్నాయి.

జాతీయ జెండాకు ఎన్ని రంగులుంటాయో కూడా తెలియని అవివేకులు ఎందరో రాజకీయాల్లోకి చేరి ప్రజల బాగోగులు చూస్తామని వాగ్దానాలు చేస్తుంటారు. గద్దెలెక్కి పరిపాలకులుగా చలామణీ అవుతుంటారు. ఉదయం ఒక రాజకీయ పార్టీ పుడుతుంది. సాయంత్రం మరో రాజకీయ పార్టీ పుడుతుంది. ఇలా రాజకీయ పార్టీల మీద పార్టీలు పెట్టి, న్యాయం మాట మరిచిపోయి దేశాన్ని భ్రష్టు పట్టి స్తున్నారు. ఎవడు ఏ పార్టీకి చెందినవాడో గుర్తించరాని రోజులు వచ్చాయి.

అవినీతి మరకలతో పెడదారి పట్టిపోతున్న ప్రస్తుత దేశ పరిస్థితులను గూర్చి కళ్ళకు కట్టినట్లు చిత్రించాడీ పాటలో లక్ష్మీనారాయణ.
పాట:-
చూడు మల్లేశా చూడు మల్లేశా
దేశమెటు పోతుందో కనరా మల్లేశా
ఈనాటి బాలలంత రేపటిపౌరులంట
నరాలన్ని తేలిపోయి నత్తబడ్డ కడుపుతోటి
ఎంగిలి ఇస్తర్ల కొరకు ఎగాబడ్డ తీరు జూడు
పిల్లగాండ్ల సదువు కొరకు ఎన్ని బళ్ళు తిరిగినా
సీటు మాట సెప్పరాయె సాటు మాటు పిలుపులాయె
కాళ్ళ వేళ్ళ బడ్డా గాని కనికరించబాయే సారు
లంచమిస్తె గాని నీకు సీటు లేదు పొమ్మనిరో
దొడ్డ కొట్ల లోలె బడులు ఊరూరు పెట్టినారు
వానపడితె వరదనీరు బడిలోకి వచ్చినాయి
ఎండదెబ్బ గాలిదెబ్బ ఏకంగ కొట్టబట్టె
చెట్ల కింద చదువులాయె రోడ్ల మీద బతుకులాయె
వెనుకబడ్డ వాళ్ళ పిల్లనుద్దరిస్తామాని చెప్పి
కంటి తుడుపులాగ కొన్ని హాస్టళ్ళు పెట్టినారు
పుచ్చిపోయిన బియ్యాన్ని పిల్లలకు వండిపెట్టి
హాస్టళ్ళో సొమ్మునంత అధికారులు మింగినారు
ఏడాదికొకసారి పుస్తకాలు ముద్రకొట్టి
అందరికీ పుస్తకాలు అందుబాటుంటయనిరి
తెలుగు ఉంటే హింది లేదు హింది ఉంటే లెక్కల్లేవు
బ్లాక్‌ చేసి రెట్లు పెంచి షావుకార్లు బలిశిరాయె
జాతీయజెండకున్న రంగులెన్నొ తెలియనోళ్ళు
ప్రజల దోచి గద్దెలెక్కె రాజకీయ దేశగాళ్ళు
పొద్దు పొడిస్తె ఓ పార్టీ పొద్దుగూకితె ఓ పార్టీ
ఎవ్వడు ఏ పార్టోడో ఎరగరాని రోజులొచ్చె
చూడు మల్లేశా చూడు మల్లేశా దేశమెటుపోతుందో కనరా మల్లేశా
చూడు మల్లేశా చూడు మల్లేశా దేశమెట్ల కాల్తందో కనరా మల్లేశా.
– తిరునగరి శరత్‌ చంద్ర

]]>