Nalgonda Archives - https://navatelangana.com/category/nalgonda/ Sat, 18 May 2024 14:54:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Nalgonda Archives - https://navatelangana.com/category/nalgonda/ 32 32 జూన్ 12 వరకు విద్యార్థులకు యూనిఫామ్ డ్రస్సులు సిద్ధం చేయాలి.. https://navatelangana.com/uniform-dresses-should-be-prepared-for-students-till-june-12/ Sat, 18 May 2024 14:54:33 +0000 https://navatelangana.com/?p=294320
– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండాగే..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులకు వచ్చే జూన్ 12 వరకు యూనిఫామ్ డ్రెస్సులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే అధికారులను ఆదేశించారు. శనివారం నాడు ఆయన యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ మండల పరిషత్, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన త్రాగునీరు ఏర్పాట్లు, టాయ్లెట్స్, విద్యుద్దీకరణ, తరగతుల మరమ్మత్తు పనులను పరిశీలించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి మౌళిక వసతులు కల్పించి విద్యార్ధులను కొత్త విద్యా సంవత్సరంలోనికి ఆహ్వానించాలని ఆదేశించారు. మల్లాపురంలో  విద్యార్థులకు డ్రెస్సులు కుడుతున్న స్వయం సహాయక మహిళా సంఘం ద్వారా నడుపబడుతున్న మహాలక్ష్మి కుట్టు కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ జిల్లాలో 673 ప్రభుత్వ, ఎయిడెడ్, కస్తూరిబా, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలకు 51,848 మంది విద్యార్దినీ విద్యార్ధులకు స్టిచింగ్ కోసం అన్ని మండల కేంద్రాలకు యూనిఫామ్ క్లాత్ పంపించడం జరిగిందని, 541 స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా యూనిఫామ్ డ్రెస్సులు కుట్టించి పాఠశాలలు ప్ర్రారంభమయ్యే జూన్ 12 నాడు విద్యార్ధులకు అందించేటట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఏంఏ కృష్ణన్ , జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ హైస్కుల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు వైష్ణవి, మండల పరిషత్ హైస్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు సంధ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మహిళా సమాఖ్య సభ్యులు  పాల్గొన్నారు.
]]>
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష.. https://navatelangana.com/review-of-parliament-election-counting-arrangements/ Sat, 18 May 2024 14:38:24 +0000 https://navatelangana.com/?p=294301
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండిగే.
నవతెలంగాణ – భువనగిరి
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండిగే అధికారులతో శనివారం  సమీక్షించారు.  కౌంటింగ్ కేంద్రంలో ఫర్నీచర్ ఏర్పాట్లు, పత్రాల సీలింగ్, వివిధ దశలలో కావలసిన సిబ్బంది నియామకం, ఉత్తర్వులు, స్కానింగ్ పనులు, లేబర్, సూపర్వైజర్ల ఏర్పాట్లపై, కేంద్రాలలో కావలసిన వసతులు ఇంటర్నెట్, పవర్ సప్లయ్, త్రాగునీరు, టాయ్లెట్స్, టెంట్లు, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, తదితర ఏర్పాట్లు, కౌంటింగ్ స్టాఫ్ ర్యాండమైజేషన్, శిక్షణ, తదితర కార్యక్రమాల పట్ల తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్షాలోమ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు అమరేందర్, శేఖర్రెడ్డి, భువనగిరి మున్సిపల్ కమీషనర్ రామాంజనేయులు రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రామ్మూర్తి, డి.టి. సురేష్, ఆర్.ఐ. శ్రీకాంత్ పాల్గొన్నారు.
]]>
ప్లాస్టిక్ రహిత సమాజమే మన లక్ష్యం: కలెక్టర్ https://navatelangana.com/a-plastic-free-society-is-our-goal-collector/ Sat, 18 May 2024 14:24:52 +0000 https://navatelangana.com/?p=294279
– కార్యాలయాల్లో తప్పక అమలుకు చర్యలు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్లాస్టిక్ రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.  శనివారం అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, బి.ఎస్. లతలతో కలసి జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో వెబెక్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక అమలు చేయాలని,  పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని పశువులు, పక్షులు, వచ్చేతరం ఆరోగ్యం గా ఉండాలంటే  ముందుగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. జిల్లా స్థాయి అమలులో ఆదనవు కలెక్టర్ స్థానిక సంస్థలు  సి.హెచ్. ప్రియాంక నోడల్ అధికారిగా అలాగే కలెక్టరేట్ కి  నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత వ్యవహరిస్తారని తెలిపారు. ముందుగా కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని కార్యాలయాలు అమలు చేయాలని, రెండవ విడతలో ఆర్.డి.ఓ, ఎంపీడీఓ, తహశీల్దార్ల కార్యాలయాల్లో మూడవ విడతలో పాఠశాలలు, వసతి గృహాలు, హాస్పిటల్స్ లలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిదంగా వచ్చే మంగళవారం నుండి కలెక్టరేట్ లో వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు నిషేదమని లేనియెడల సంబంధిత కార్యాలయానికి జరిమాన ఉంటుందని అలాగే అన్ని కార్యాలయాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.అంతకు ముందు ప్లాస్టిక్ వలన జరిగే హాని పై వివరించారు.ఈ కార్యక్రమంలో  సి.ఈ. ఓ అప్పారావు, పి.డి. మధుసూదన్ రాజు,    ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, ఈడియం గఫ్ఫార్,  జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
]]>
చలివేంద్రంలో చల్లటి మజ్జిగ పంపిణీ .. https://navatelangana.com/distribution-of-cold-buttermilk-in-chilly-center/ Sat, 18 May 2024 14:21:33 +0000 https://navatelangana.com/?p=294274
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వాసవి క్లబ్  యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో  శనివారం కీర్తిశేషులు కుక్కుటపు కైలాసం జ్ఞాపకార్థం భార్య బాలమణి కుటుంబ సభ్యులు స్థానిక  హైదరాబాద్ చౌరస్తా నందు  చలివేంద్రంలో చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. సౌహృదయ అనాధాశ్రమంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జీడిగం లక్ష్మయ్య, సుగ్గుల  చంద్రశేఖర్, పద్మాల ప్రభాకర్, మిత్తింటి భాస్కర్, జిల్లా విద్యాసాగర్, సుధీర్, ఉపేందర్,బాలేష్ పాల్గొన్నారు.
]]>
జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష.. https://navatelangana.com/group-1-preliminary-exam-on-9th-june/ Sat, 18 May 2024 13:31:20 +0000 https://navatelangana.com/?p=294237
– ఉదయం10:30 నుండి మధ్యాహ్నం 01:00 వరకు పరీక్షా సమయం
– బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు నమోదు..
– గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం కావాలి: టీజిపీఎస్సి  చైర్మన్ మహేందర్ రెడ్డి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జూన్ 09న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు సన్నద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రీజనల్ కో ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ జూన్  9న  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించు గ్రూప్ -01 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.ఎటువంటి పొరపాట్లు జరుగకుండా, సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.జూన్ 09న ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1-00 వరకు  నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని, చీఫ్ సూపరింటెండెంట్ మానిటరింగ్ చేసే విధంగా సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి రూమ్ లో విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు ఏర్పాటు చేయాలని  పరీక్షకు రెండు రోజుల ముందే పారిశుధ్య  కార్యక్రమాలు నిర్వహించి కేంద్రాలను
పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లోని గోడలపై ఎలాంటి మ్యాపులు, పట్టికలు, గడియారాలు, ఇతరత్రా లేకుండా చూడాలన్నారు.
ప్రతి గదిలో సరైన లైటింగ్,  ఫ్యాన్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు.దివ్యాంగులైన అభ్యర్థుల కోసం గ్రౌండ్ ఫ్లోర్ ను కేటాయించాలని పరీక్ష కేంద్రం ఆవరణలో సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరుచుకోకుండా చూడాలని, 144 సెక్షన్ విధించి 100 మీటర్ల దూరం వరకు ఇతరులను రానివ్వకూడదని పేర్కొన్నారు.  అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కచ్చితంగా మహిళలను పరిశీలించేందుకు మహిళా కానిస్టేబుల్ ను విధులలో ఉంచాలని ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి సెల్ ఫోన్లు,  స్మార్ట్ వాచీలు బ్లూటూత్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించవద్దని పేర్కొన్నారు. అభ్యర్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా పోలీసు శాఖ నుంచి ఎస్ హెచ్ ఓ స్థాయి అధికారి పరీక్ష పూర్తయ్య వరకు నిరంతర పర్యవేక్షించాలని తెలిపారు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమును ఏర్పాటు చేసి క్లోజ్డ్ వాహనంలో  పోలీస్ ఎస్కార్ట్ ద్వారా ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించాలని పరీక్ష పూర్తయిన తర్వాత పోలీస్ ఎస్కార్ట్ ద్వారా తిరిగి స్ట్రాంగ్ రూమ్ కు ప్రశ్నపత్రాలను తరలించాలన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ రూట్ అధికారులను నియమించి పరీక్ష జరిగే రోజు రూట్ అధికారులకు వారి వారి రూట్లలో పంపించాలని తెలిపారు.
బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేసుకోవడం జరుగుతుందని ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ అనుసరించాలని అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ లు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడానికి సిబ్బంది నియమించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలని కోరారు. అభ్యర్థులను పరీక్ష కేంద్రాల లోపలికి ఉదయం 09:30నుండి అనుమతించాలని అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకొని  రావాలని  అన్నారు. ఓఎంఆర్ షీట్ నింపడంలో అభ్యర్థులు హాల్ టికెట్ లో పేర్కొనబడిన సూచనలు క్షుణ్ణంగా పరిశీలించుకుని పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని  తెలిపారు. పరీక్షకు ముందు బబ్లింగ్ గురించి అభ్యర్థులకు తెలియజేసీ, టి.జి.పి.ఎస్.సి. నియమ, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేసే గ్రూప్ 01 ప్రిలిమినరీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని టిజి పి ఎస్ సి చైర్మన్ సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం 9,725 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని వన్ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎడిషినల్ ఎస్పీ నాగేశ్వరరావు,ఈ సూపర్డెంట్ పద్మారావు, తదితరులు పాల్గొన్నారు.
]]>
ధన్వంతరి ఆలయంలో ప్రత్యేక పూజలు.. https://navatelangana.com/special-pujas-at-dhanwantari-temple/ Sat, 18 May 2024 13:16:25 +0000 https://navatelangana.com/?p=294220
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం సైదాపూరం శనివారం, ధన్వంతరి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలోని నిర్వహిస్తున్న హోమంలో పాల్గొన్నారు. బీర్ల ఐలయ్య కి ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, మండల అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, మాజీ ఉపసర్పంచ్ దుంబాల సురేఖ వెంకటరెడ్డి, శిఖ ఉపేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
]]>
కౌంటింగ్  విధులను జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్ https://navatelangana.com/counting-duties-should-be-performed-carefully-by-the-collector/ Sat, 18 May 2024 12:32:12 +0000 https://navatelangana.com/?p=294174 – కౌంటింగ్ టేబుల్ వద్ద  నిబంధనలు పాటించాలి 
– ఏమరుపాటుగా ఉంటే  ఎన్నికల నియమావళి కింద చర్యలు
– నల్గొండ జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పార్లమెంట్  ఎన్నికల పోలింగ్ లో  అధికారులు, సిబంది  బాగా పనిచేశారని, ఇదే ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై శనివారం నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్  సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి చందన హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  కౌంటింగ్ టేబుల్ వద్ద పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  అలర్ట్ గా ఉండాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ చిన్న సమస్య  తలెత్తిన వెంటనే ఆర్వో, ఏఆర్ఓ ల దృష్టికి తీసుకురావాలన్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ఎన్నికల నియమావళి కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే మైక్రో అబ్జర్వర్స్, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ సెంటర్ లోకి ప్రవేశించిన సమయం నుండి ఏఏ స్టేజీలలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలకు సంబంధించి ట్రైనర్ బాలు  వారికి  విపులంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి  రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ పులిచింతల నటరాజన్, డిఆర్డిఓ నాగిరెడ్డి,నల్గొండ దేవరకొండ, హుజూర్నగర్ సూర్యాపేట, చండూరు ఆర్డీవోలు, శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి జిల్లా వ్యవసాయ అధికారి  శ్రవణ్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ లు హాజరయ్యారు.
]]>
ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి: చెరుపల్లి సీతారాములు https://navatelangana.com/cherupally-sitaramulu-the-state-government-should-immediately-focus-on-public-issues/ Sat, 18 May 2024 12:27:20 +0000 https://navatelangana.com/?p=294167
నవతెలంగాణ – భువనగిరి
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నికల చుట్టూ తిరిగినా వెంటనే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేయాలని ప్రజా ప్రయోజనకర పథకాలను అమలు అయ్యే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. శనివారం సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను మర్చిపోయి ఎన్నికల చుట్టూ తిరిగి కాలయాపన చేసి ప్రస్తుతం ప్రజా సమస్యలను పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని వారు అన్నారు. అకాల వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వరి ధాన్యం నీట మునిగి ఆరుకాలం కష్టపడి పండించిన పంట నష్టం జరగడంతో రైతులు ఆవేదనకు గురి అవుతున్నారనానారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బోనస్ రూ.500 రూపాయలు ఇస్తామని చెప్పిన ఇప్పుడు ఇచ్చిన హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. అదేవిధంగా అనేకమంది రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని ప్రగల్బాలు పలికిన  కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ప్రకటించి అదనంగా ఇచ్చిన హామీ రూ.500 రూపాయల బోనస్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే రైతాంగం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని వారు అన్నారు. రైతుల, కార్మికుల, వ్యవసాయ కూలీల, విద్యార్థి యువజన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ పథకాల అమలు జరగకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని వారు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అనేక మార్కెట్ యార్డులలో వేల క్వింటాల ధాన్యం తడిసి రైతులు నెత్తికి చేతులు పెట్టుకొని ఆదుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నష్టపోయిన రైతాంగానికి ఎలాంటి హామీ రాకపోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  జిల్లా వ్యాప్తంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతందానికి నష్టపరిహారం చెల్లించి బోనస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, బబ్బురు పోశెట్టి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేష్, మాయ కృష్ణ, దోడ యాదిరెడ్డి, పగిల్ల లింగారెడ్డి, బండారు నరసింహ, బొల్లు యాదగిరి, బోలగాని జయరాములు, గుండు వెంకటనర్సు, ఎంఏ ఇక్బాల్, గడ్డం వెంకటేష్, రాచకొండ రాములమ్మ, వనం ఉపేందర్, మండల కార్యదర్శిలు ధూపటి వెంకటేష్, పోతరాజు జహంగీర్, రేకల శ్రీశైలం, వేముల బిక్షం, బుర్రు అనిల్, నూకల భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
]]>
అన్ని రకాల వడ్లకి బోనస్ ఇవ్వాలి: కొత్తపల్లి శివకుమార్   https://navatelangana.com/kothapally-sivakumar-should-give-bonus-for-all-kinds-of-rice/ Sat, 18 May 2024 12:23:12 +0000 https://navatelangana.com/?p=294163
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్రంలో పండించిన అన్ని రకాల గుడ్లకు క్వింటాకు 500 బోనస్ ఇవ్వాల్సిందేనని  సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్  జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని విక్రమం భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం సన్న వడ్లకు మాత్రమే రూ.500 రూపాయలు బోనస్ ఇస్తా అని అనడం ఆశ్చర్యకరంగా ఉన్నదని అన్నారు. ఇప్పటికే అకాల వర్షాల వల్ల ఐకెపి సెంటర్లలో ఉన్న దాన్యం కొనడంలో జరిగిన ఆలస్యం వల్ల ధాన్యం తడిసి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్క పైన తాటిపండు పడ్డట్లు రేవంత్ రెడ్డి రూ.500 ఇస్తానని అనటం  సరైన పద్ధతి కాదని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో పండించిన అన్ని రకాల వడ్లకు  ప్రతి క్వింటాకు రూ.500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందేనని కోరారు లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్, పార్టీ డివిజన్ నాయకులు ఎస్ కే సయ్యద్, పిడమర్తి లింగన్న, బిక్షం, పాల్గొన్నారు.
]]>
ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్దికి ఉచితంగా యూనిఫామ్ అందజేయాలి: కలెక్టర్ https://navatelangana.com/collector-should-provide-free-uniform-to-every-government-school-student/ Sat, 18 May 2024 12:18:05 +0000 https://navatelangana.com/?p=294157 – జూన్ 5 నాటికి, ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్క జత అందజేయలి
– 53,234 మంది విద్యార్థులకు రెండు జతలు: జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ అందజేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.శనివారం సూర్యాపేట జమ్మిగడ్డ లో గల గోపాలపురం కుట్టు  కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.జూన్ 5వ తేదీ కల్లా ప్రతి విద్యార్థికి ఒక జత అందజేస్తున్నట్లు కలెక్టర్ కలెక్టర్ తెలిపారు. ఇక్కడ 2255 మంది పిల్లలకు యూనిఫార్మ్ కుట్టి అందజేయనున్నట్లు ఏపీ డి రామ్ సురేష్ కలెక్టర్కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ఏర్పాటు చేసింది అలాగే ఎస్ హెచ్ జి మహిళల ద్వారా నే స్కూల్ యూనిఫామ్స్ కుట్టించి ప్రభుత్వ పాఠశాలలకు సప్లై  చేయడం జరుగుతుందని, దీనివల్ల మహిళలు అర్దికంగా అభివృద్ధి చెందుతారని ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా స్వయం శక్తి ద్వారా పిల్లల యొక్క యూనిఫార్మ్స్ ను కుట్టించడం జరుగుతుందని దీనివల్ల మహిళలు ఉపాధి కొరకు బయటకు వెళ్లే అవసరం లేకుండా మంచి అవకాశం ప్రభుత్వం కల్పించిందని అందరూ సద్వినియోగం చేసుకొని, నాణ్యమైన మెటీరియల్ వాడుతూ యూనిఫామ్ కుట్టాలని కలెక్టర్ తెలిపారు. కేంద్రంలో యూనిఫార్మ్స్ కుడుతున్న ఫాజియా ,అన్నపూర్ణ లో కలెక్టర్ మాట్లాడుతూ ఈ అవకాశం ప్రభుత్వం కల్పించడం వలన ఎంత ఉపాధి పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 53,234 విద్యార్థులకు జూన్ 12 నాటికి రెండు జతలు  యూనిఫార్మ్స్ 1, 0 6, 4 6 8 యూనిఫార్మ్స్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు,  అడిషనల్ డిఆర్డిఓ సురేష్,డిపిఎం ఆంజనేయులు, ఏపీఎం వెంకయ్య, సీసీలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
]]>
ఎమ్మెల్సీ ఎన్నికలలో మధ్యవేలికి ఇంకు: కలెక్టర్ https://navatelangana.com/in-the-mlc-elections-he-was-the-collector-of-madhyavelik/ Sat, 18 May 2024 12:14:52 +0000 https://navatelangana.com/?p=294153
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్రంలో ఈ నెల 13 న లోక్ సభ ఎన్నికలు నిర్వహించడం వలన ఓటరుకి ఎడమ చేతి చూపుడు వేలు పై ఇదివరకే ఇన్ డిలేబుల్ ఇంక్ పెట్టడం జరిగిందని, మరల ఈ నెల 27 న జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నందున ఆ ఎన్నికలలో పాల్గొనే పట్టభద్రులు పార్లమెంటు ఎన్నికలలో ఓటు వేసి ఉన్నట్లయితే అట్టివారికి చూపుడువేలు బదులుగా మధ్య వేలుకి ఇండెలిబుల్ ఇంకు సిరా గుర్తు పెట్టాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి 49కే ప్రకారం వేలు నియమం మిస్ అయినట్లయితే  1961 వర్తింపజేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొసీడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్పుడు ఓటరు యొక్క ఎడమ చూపుడు వేలుని పరిశీలించి ఇంకును పెట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
]]>
నకిలీ విత్తనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి..  https://navatelangana.com/government-should-focus-on-fake-seeds/ Sat, 18 May 2024 11:18:12 +0000 https://navatelangana.com/?p=294106
నవతెలంగాణ – చండూర్
రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్న తరుణంలో నకిలీ విత్తనాలపై దృష్టి సారించాలని  బీజేపీ  కిసాన్ మోర్చామండలాధ్యక్షులు కొండారెడ్డి శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నకిలీ విత్తనాలు కొని అనేక మంది రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా నకిలీ విత్తనాలు తయారు చేసే వారి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదని ప్రభుత్వం వీరి పైన దృష్టి సారించి రైతన్నలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన తెలిపారు.
]]>