National Archives - https://navatelangana.com/category/national/ Fri, 18 Apr 2025 10:33:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png National Archives - https://navatelangana.com/category/national/ 32 32 మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. https://navatelangana.com/the-worst-road-accident-in-maharashtra/ Fri, 18 Apr 2025 10:33:57 +0000 https://navatelangana.com/?p=548574 acdtన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాసిక్‌ నుండి షిరిడికి దైవ దర్శనం కోసం వెళ్తున్న భక్తుల బస్సు.. బుల్దానాలో ఆగి ఉన్న ట్రక్కును ఢికొీట్టింది. ఈ భక్తులందరూ ఏపీకి చెందిన వారు. ఈ ప్రమాదంలో 35 మంది గాయపడ్డారు. పదిమందిని బుల్దానాలో ఉన్న ఆసుపత్రికి చికిత్స కోసం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని మల్కాపూర్‌ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సందీప్‌ కాలే తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

]]>
ఒడిశాలో భారీ వర్షం..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ https://navatelangana.com/heavy-rain-in-odisha-yellow-alert-to-several-districts/ Fri, 18 Apr 2025 10:26:55 +0000 https://navatelangana.com/?p=548570 rain at odన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఒడిశాలోని భువనేశ్వర్‌లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఏప్రిల్‌ 19,20 తేదీల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మయూర్‌భంజ్‌, బాలాసోర్‌, భద్రక్‌, మల్కన్‌గిరి, జాజ్‌పూర్‌, కేంద్రపారా, జగత్సింగ్‌పూర్‌, కటక్‌ మరియు కొన్ని ఇతర జిల్లాలకు వాతావరణ కేంద్రం ఉరుములతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్‌ 19న కోరాపూర్‌ మరియు మల్కన్‌గిరిలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఒడిశాతో పాటు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కూడా తుఫాను ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌, చమోలి, డెహ్రాడూన్‌, రుద్రప్రయాగ్‌, ఉత్తరకాశీతో సహా కొన్ని ప్రదేశాలలో వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

]]>
ఢిల్లీ పాలనకు తమిళనాడు ఎప్పటికి తలొగ్గదు: ముఖ్యమంత్రి స్టాలిన్‌ https://navatelangana.com/tamil-nadu-will-never-be-the-chief-minister-stalin/ Fri, 18 Apr 2025 10:18:39 +0000 https://navatelangana.com/?p=548566 stalimnnన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీ పాలనకు తమిళనాడు ఎప్పటికి తలొగ్గదని తమిళనాడు ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. 2026లో తమిళనాడులో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్‌ శుక్రవారం ఘాటుగా స్పందించారు. ”నేను సవాలు చేస్తున్నాను. ఢిల్లీ పాలనకు లొంగని ప్రత్యేకత తమిళనాడు రాష్ట్రానికి ఉంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం వంటి కాషాయ పార్టీ కుట్రలు తమిళనాడులో పనిచేయవు” అని అన్నారు. నీట్‌ పరీక్షలు, హిందీ విధించడంపై ఇప్పటికే ఆ విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేశామని స్టాలిన్‌ పునరుద్ఘాటించారు.” నీట్‌ నుండి మా రాష్ట్రానికి మినహాయింపు ఇస్తామని హామీ ఇవ్వగలరా, హిందీని విధించమని హామీ ఇవ్వగలరా అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అడగాలనుకుంటున్నాను. తమిళనాడుకు ప్రత్యేక నిధుల విడుదలను జాబితా చేయగలరా, డీలిమిటేషన్‌తో సీట్లు తగ్గవని హామీ ఇవ్వగలరా. మేము తమిళనాడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే.. మీరు ఎందుకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు” అని అమిత్‌షాను నిలదీశారు.కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ తమిళనాడు ప్రభుత్వాన్ని నిజాయితీ లేనిది అని, రాష్ట్ర ప్రజలను అనాగరికులు అన్నారని, కేంద్రం రాజకీయాలు తమిళనాడును విభజించలేవని స్టాలిన్‌ అన్నారు.

]]>
యూపీలో దారుణం… https://navatelangana.com/brutal-in-up/ Thu, 17 Apr 2025 20:35:05 +0000 https://navatelangana.com/?p=548496 Sexual assault on 11-year-old deaf girl– 11ఏండ్ల బధిర బాలికపై లైంగికదాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌ లోని రాంపుర్‌లో దారుణం చోటుచేసుకుంది. 11ఏండ్ల బధిర బాలికపై ఒక కీచకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడిని గుర్తించిన పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తొలుత బాలిక కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె కోసం కుటుంబసభ్యులు గాలిస్తుండగా.. పొలాల్లో తీవ్ర గాయాలతో, నగంగా కనిపించింది. వెంటనే ఆ బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దాన్‌ సింగ్‌ (24) అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించగా, అతడు పోలీసుల పైకి కాల్పులు జరిపాడు. ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలుకి గాయమవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఆ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ కీలక విషయాలు వెల్లడించారు. ఒకరు కంటే ఎక్కువమంది బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు తెలుస్తోందన్నారు. చిన్నారి ముఖంపై బలమైన గాయాలైనట్లు వెల్లడించారు. ఆమె ప్రయివేటు భాగాల పైనా అనేక గాయాలు ఉన్నాయన్నారు. తాను చూసిన అత్యంత ఘోరమైన లైంగిక నేరాల్లో ఇది ఒకటన్నారు.మరోవైపు చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణాలపై మహిళా సంఘాలు యోగి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

]]>
మణిపూర్‌ మాజీ సీఎం ఆడియో క్లిప్‌పై ఫోరెన్సిక్‌ నివేదిక సిద్ధం! https://navatelangana.com/forensic-report-on-former-cm-audio-clip-manipur/ Thu, 17 Apr 2025 20:30:56 +0000 https://navatelangana.com/?p=548488 Former Chief Minister Biren Singh– సుప్రీంకు తెలియచేసిన కేంద్రం
న్యూఢిల్లీ: రాష్ట్రంలో జాతుల మధ్య చెలరేగిన హింసాకాండలో మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ పాత్ర వున్నట్లు ఆరోపించబడిన లీకైన ఆడియో క్లిప్పుుల విశ్వసనీయతను నిర్ధారించే ఫోరెన్సిక్‌ నివేదిక సిద్ధమైందని కేంద్రం గురువారం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. త్వరలోనే సీల్డ్‌ కవర్‌లో దాన్ని అందచేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది చెప్పిన అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని బెంచ్‌ పరిగణనలోకి తీసుకుంది. కుకీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ట్రస్ట్‌ (కేఓహెచ్‌యూఆర్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మే 5కు వాయిదా వేసింది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి అందిన ఈ నివేదికను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అందచేసి, వాయిదా కూడా కోరతారని న్యాయవాది తెలిపారు. నాయకత్వ మార్పు కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర బిజెపిలో గొడవలు చెలరేగిన తరుణంలో ఫిబ్రవరి 9న బీరేన్‌ సింగ్‌ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ అల్లర్లలో సింగ్‌ పాత్రపై కోర్టు పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు జరగాలని కెఒహెచ్‌యుఆర్‌ కోరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెమ్మదిగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అందువల్ల ఈ అంశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేద్దామని సిజెఐ వ్యాఖ్యానించారు. తర్వాత ఈ కేసును విచారించేది సుప్రీం కోర్టా లేక హైకోర్టు అనేది నిర్ణయిస్తానని సిజెఐ చెప్పారు. ఆయన మాటలతో సొలిసిటర్‌ జనరల్‌ ఏకీభవించారు. ఆ ఆడియోలోని గొంతు 93శాతం ముఖ్యమంత్రిదేనని ట్రూత్‌ల్యాబ్‌ నిర్ధారించిందని కుకీల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు.

]]>
మంత్రి పొన్ముడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండి https://navatelangana.com/enter-an-fir-on-minister-ponmudi/ Thu, 17 Apr 2025 20:29:19 +0000 https://navatelangana.com/?p=548487 Minister Ponmudi– తమిళనాడు పోలీసులకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
చెన్నరు: శైవులు, వైష్ణవులు, మహిళలకు వ్యతిరేకంగా బహిరంగంగా అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మద్రాస్‌ హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ ఎన్‌ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడిను మద్రాస్‌ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడంపై జరుగుతున్న పునర్విచారణలో జడ్జి ఈ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పొన్ముడి ఇటీవల చేసిన ప్రసంగం వీడియాను జడ్జి ప్రస్తావించారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరైన సమావేశంలో కొన్ని మతాలకు వ్యతిరేకంగా మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ప్రభుత్వ తరుపున హాజరైన అడ్వకేట్‌ జనరల్‌ పిఎస్‌ రామన్‌కు జడ్జి ఈ విషయాన్ని తెలిపారు. మంత్రి ప్రసంగంపై తమకు కూడా ఫిర్యాదులు వచ్చాయని అడ్వకేట్‌ జనరల్‌ అంగీకరించారు. దీంతో మంత్రికి వ్యతిరేకంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, లేకపోతే పోలీసులు కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని జడ్జి హచ్చరించారు. అయితే ఒకటి కంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవద్దని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.

]]>
వక్ఫ్‌ జోలికెళ్లొద్దు https://navatelangana.com/dont-wake-up/ Thu, 17 Apr 2025 19:48:37 +0000 https://navatelangana.com/?p=548421 Supreme Court– ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు
– ఎలాంటి నియామకాలు చేపట్టొద్దు : కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం
– తదుపరి విచారణ మే 5కి వాయిదా
– అప్పటి వరకూ యధాతథస్థితి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వక్ఫ్‌ సవరణ చట్టంపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయొద్దని, అలాగే సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని పేర్కొంది. వక్ఫ్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరగా సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ పి.వి సంజరు కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేసు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి ఆదేశించింది.
కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. కేంద్రప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉందన్నారు. గ్రామాలకు గ్రామాలను వక్ప్‌ ఆస్తులుగా, వ్యక్తిగత ఆస్తులను తీసుకున్నారన్నారు. ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలన్న అభిప్రాయంపై ఆయన స్పందిస్తూ.. చట్టంపై స్టే విధించడం కఠినమైన నిర్ణయమవుతుందని అభిప్రాయపడ్డారు. కోర్టు ఎదుట కొన్ని పత్రాలతో ప్రాథమిక సమాధానం దాఖలు చేసేందుకు వారం రోజులు సమయం కావాలని కోరారు. అప్పటి వరకు బోర్డు, కౌన్సిల్‌ నియామకం ఉండదని సొలిసిటర్‌ జనరల్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పందిస్తూ పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదని, ఐదేండ్ల వరకు ప్రొవిజెన్స్‌ ఉన్నాయని తమకు తెలుసునన్నారు. వాటిని స్టే చేయబోమన్నారు. మళ్లీ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ తమ వాదనలు వినాలని సీజేఐని కోరారు. వారం రోజుల్లో ఎలాంటి మార్పు ఉండదని, చట్టంలోని సెక్షన్‌ 9, 14 కింద ఎలాంటి నియామకాలు చేపట్టబోమన్నారు. సీజేఐ జోక్యం చేసుకుంటూ తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులుండొద్దని చెప్పగా, ఎస్‌జీ మెహతా స్పందిస్తూ ఏ రాష్ట్రమైనా నియామకాలు చేస్తే చట్టబ ద్ధంగా పరిగణించకూడదన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎస్‌జీ వ్యాఖ్యలు రికార్డు చేసినట్టు పేర్కొంది. కౌన్సిల్‌, బోర్డులో ఎలాంటి నియామకాలు జరుగవని ఎస్‌జీ కోర్టుకు హామీ ఇచ్చారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని, యూజర్‌ బైౖ వక్ఫ్‌గా పేర్కొన్న వాటితో పాటు నోటిఫికేన్‌ ద్వారా రిజిస్టర్‌ అయినవి, డీ నోటిఫై చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. అలానే తదుపరి విచారణ తేదీ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

]]>
భావప్రకటనపై అణచివేత https://navatelangana.com/oppression-on-expression/ Thu, 17 Apr 2025 19:38:18 +0000 https://navatelangana.com/?p=548410 – ప్రతిపక్ష మీడియాను తొక్కే యత్నం
– జర్నలిస్టుల జీవనోపాధికి గండి
– కేంద్రం చర్యలతో వీధిన పడుతున్నారు
– ‘నేషనల్‌ హెరాల్డ్‌’పై చర్యల పట్ల డీయూజే దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ వార్తాపత్రిక ప్రచురించబడే ఢిల్లీలోని హెరాల్డ్‌ హౌజ్‌తో సహా దాని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కేంద్రం చర్యపై ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (డీయూజే) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది ప్రతిపక్ష మీడియాను అణచివేయ టానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదని ఆరోపించింది. ఈ చర్యతో చాలా మంది జర్నలిస్టులు వీధిన పడతారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రింట్‌ మీడియా, యూట్యూబ్‌ వంటి డిజిటల్‌ వేదికల ద్వారా అయినా.. భావప్రకటనా స్వేచ్ఛ హక్కు, సంపాదించుకునే జీవనోపాధిని అరికట్టటంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్య అని డీయూజే ఒక ప్రకటనలో పేర్కొన్నది. ప్రముఖ జర్నలిస్ట్‌ గిరిజేశ్‌ వశిష్ట నిర్వహిస్తున్న యూట్యూబ్‌ ఛానెల్‌ ‘నాకింగ్‌ న్యూస్‌’ హఠాత్తుగా మూసివేయబడిందనీ, ఈ పరిణామం పట్ల తాము దిగ్భ్రాంతి చెందామని వివరించింది. దానిని వెంటనే, బేషరతుగా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశామని డీయూజే వివరించింది.
‘మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు తగవు’
ప్రింట్‌ మీడియా లేదా యూట్యూబ్‌ వంటి డిజిటల్‌ వేదికల విషయంలో మీడియా రంగంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై డీయూజే తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. హెరాల్డ్‌ హౌజ్‌తో సహా నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను, లక్నో, ముంబయిలోని అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ భవనాలను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం తీసుకున్న చర్యపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. మనీలాండరింగ్‌ కేసులో రూ.661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవటంలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఈ చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ఈచర్యలు కాంగ్రెస్‌ యాజమాన్యంలోని పత్రికను ఆర్థికంగా కుంగదీసి, దానిని మూసివేయించే లక్ష్యంతో ఉద్దేశించినవని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష మీడియాను అణచివేయటం, నేషనల్‌ హెరాల్డ్‌ ఉద్యోగుల జీనోపాధికి ముప్పు వాటిల్లటం పట్ల తాము తీవ్రంగా ఆందోళన చెందు తున్నట్టు డీయూజే వివరించింది. మీడియా సంస్థను మూసి వేయటమంటే.. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులుగా, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చాలా మంది జర్నలిస్టులు వీధిన పడతారని ఆవేదన వ్యక్తం చేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ…
కేంద్ర దర్యాప్తు సంస్థలను, సమాచార సాంకేతిక చట్టాలలో లొసుగులను వాడుకుంటూ కేంద్రంలోని మోడీ సర్కారు దేశంలోని మీడియా, పత్రికా గొంతును నొక్కేస్తున్నది. వాటి స్వేచ్ఛను హరించి వేస్తున్నది. ఇప్పటికే పలు యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రం చర్యలు తీసుకున్నది. దీంతో ప్రతిపక్ష పాత్రను వహించే ఆ ఛానెళ్లు మూతపడ్డాయి. ఇక ‘న్యూస్‌క్లిక్‌’ వంటి సంస్థలపై వేధింపులు అందరికీ తెలిసిందే. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ చర్యలతో ఆ సంస్థ దాని ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్నది. కేంద్రంలోని మోడీ సర్కారు ఇలాంటి కక్షపూరితమైన చర్యలకు దూరంగా ఉండాలనీ, మీడియా, పత్రికను స్వేచ్ఛగా పని చేసుకోనివ్వాలని పలు జర్నలిస్టు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నాయి.

]]>
ఆవిష్కరణలకు గ్రహణం! https://navatelangana.com/eclipse-to-innovations/ Thu, 17 Apr 2025 18:25:46 +0000 https://navatelangana.com/?p=548362 Eclipse of inventions!– కరువైన ప్రభుత్వ ప్రోత్సాహం
– లాభాలే తప్ప ఆధునీకరణను పట్టించుకోని కంపెనీలు
న్యూఢిల్లీ: నూతన ఆవిష్కరణల విషయంలో దేశం బాగా వెనుకబడి పోతోంది. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభించకపోవడంతో ప్రతిభావంతులైన యువతీయువకులు సైతం ఆ దిశగా ఆలోచించడం లేదు. ‘స్టార్టప్‌ మహాకుంభ్‌’లో కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కు రూపకల్పన చేయాలని సలహా ఇచ్చారు. తద్వారా ఆయన నిరుద్యోగ యువతను చౌకగా లభించే కార్మికులుగా మార్చే ప్రయత్నం చేశారు. ఓ వైపు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానిస్తూ మరోవైపు వారికి చౌకగా సిబ్బందిని సమకూర్చడానికి పాలకులు సిద్ధపడుతున్నారు. ‘ఇక్కడికి రండి. ఇక్కడ నిపుణులైన సిబ్బంది, అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉన్నందుకు కాదు. ఇక్కడ కార్మికులు చౌకగా దొరుకుతారు. చట్టాలు సరళంగా ఉంటాయి. అందుకే మా దేశంలో పెట్టుబడులు పెట్టండి’ అనేది మన ప్రభుత్వ విధానంగా కన్పిస్తోంది.
చైనాలో దూసుకుపోతున్న తలసరి ఆదాయం
మూడు దశాబ్దాల క్రితం చైనాలో కార్మికులు తక్కువ వేతనాలకే దొరికేవారు. అయితే వారి జీవితాలను మార్చాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచబ్యాంక్‌ డేటా ప్రకారం 1980లో భారత తలసరి ఆదాయం 266 డాలర్లు కాగా చైనాలో 194 డాలర్లు మాత్రమే. కానీ 2000వ సంవత్సరం నాటికి పరిస్థితులు మారిపోయాయి. మన తలసరి ఆదాయం 1357 డాలర్లకు చేరితే చైనాలో తలసరి ఆదాయం దానిని దాటేసి 4450 డాలర్లకు చేరుకుంది. 2022 నాటికి ఈ వ్యత్యాసం మరింత పెరిగింది. భారత్‌లో తలసరి ఆదాయం 2388 డాలర్లు కాగా చైనాలో 12,720 డాలర్లుగా నమోదైంది.
ముడుపులే ముద్దు
డీప్‌టెక్‌, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ వంటి రంగాల్లో యువత స్టార్టప్‌లు ప్రారంభించాలని పీయుష్‌ సూచించారు. సలహాలు బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం మాత్రం నిరాశాజనకంగా ఉంటోంది. సెమీకండక్టర్ల తయారీకి ముందుకు వచ్చిన ఓ విద్యావంతుడు తన స్టార్టప్‌కు పన్ను రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ గోయల్‌ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ ఆయన దరఖాస్తును రెండేండ్ల పాటు పెండింగులో పెట్టి చివరికి తిరస్కరించింది. మరికొన్ని అదనపు పత్రాలు ఇవ్వాలంటూ చావు కబురు చల్లగా చెప్పింది. ఈ సమాచారం పంపిన కొన్ని గంటల తర్వాత ఓ వ్యక్తి ఆయన వద్దకు వచ్చి ‘పత్రాలను సిద్ధం చేసుకోవడంలో మీరు మా సాయాన్ని తీసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి’ అని ప్రలోభపెట్టాడు. దీనర్థం ముడుపులు ఇస్తే పని జరుగుతుంది తప్ప నిబంధనల ప్రకారం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్టప్‌లు నెలకొల్పడానికి ఎవరు మాత్రం ముందుకు వస్తారు?
పాత మూసలోనే…
అసలు మన స్టార్టప్‌ వ్యవస్థలోనే ఏదైనా సమస్య ఉన్నదా? డీప్‌-టెక్‌ రంగాల్లో ఒకటైన ఆటోమొబైల్‌ పరిశ్రమను తీసుకుందాం. కొన్నేండ్లుగా కార్ల ధరలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ వాటి ఆధునీకరణ జరగడం లేదు. దేశంలోని 60 శాతం కార్లు కేవలం పది జెనరిక్‌ ఇంజిన్లతోనే నడుస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
కంపెనీలు మారుతున్నా, మోడల్స్‌ మారుతున్నా ఇంజిన్లు మాత్రం అలాగే ఉంటున్నాయి. మరి ఆవిష్కరణలు ఎటు పోతున్నాయి? ఆటోమొబైల్స్‌ను తయారు చేస్తున్నది పెద్ద కంపెనీలే. పరిశోధనలు చేయడానికి కూడా వాటి వద్ద నిధులు లేవా? ఆ కంపెనీలు పదేండ్ల క్రితం కార్లను ఎలా తయారు చేశాయో ఈ రోజు కూడా అదే విధంగా తయారు చేస్తున్నాయి. ఇవాళ అందుబాటు ధరలో ఉన్న మోడల్స్‌ కూడా పదేండ్ల క్రితం నాటివే. మారుతీ ఆల్టో, స్విఫ్ట్‌, టాటా… ఇవే కంపెనీలు. మార్కెట్‌లోకి ఏ కొత్త కంపెనీ కూడా విజయవంతంగా అడుగు పెట్టలేకపోయింది.
ముందుచూపుతో ముందడుగు
గతంలో మనం చైనా యాప్‌లను నిషేధించడంలోనూ, ఆ దేశం నుంచి దీపావళి లైట్లను దిగుమతి చేసుకోవడంలోనూ బిజీగా ఉన్నప్పుడు అది అనేక వస్తువులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీగా మారింది. సెమీకండక్టర్లు, ఏఐ డ్రోన్లు, ఎలక్ట్రిక్‌ కార్లు, సోలార్‌ ప్యానల్స్‌ వంటి ఉత్పత్తుల తయారీని 2015లోనే లక్ష్యంగా చేసుకుని ‘మేడ్‌ ఇన్‌ చైనా 2025’ ప్రాజెక్టును ప్రారంభించింది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ప్రముఖ పోటీదారుగా నిలవడమే దాని ఉద్దేశ్యం. లక్ష్యానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ రంగాలన్నింటిలోనూ చైనా అగ్రగామిగా ఉంది. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న సౌర ఫలకాల ఉత్పత్తిలో 80 శాతం, లిథియం-అయోన్‌ బ్యాటరీలు, డ్రోన్లు, సొంత వాణిజ్య వాహనాల ఉత్పత్తిలో 75 శాతం అక్కడే జరుగుతోంది.
అక్కడ పీయస్‌యూలు బలోపేతం
ప్రభుత్వ రంగ సంస్థల్లో సమర్థత లోపించిందన్న సాకు చెప్పి ప్రభుత్వం వాటిని విక్రయించుకుంటూ పోతోంది. అయినప్పటికీ అవి మన ఆర్థిక వ్యవస్థకు చేయూత అందిస్తూనే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో పీయస్‌యూలు 74 వేల కోట్ల డివిడెండ్లు ఇచ్చాయి. ఒక్క కోల్‌ ఇండియాయే పది వేల కోట్ల డివిడెండ్‌ ఇచ్చింది. పీయస్‌యూల కారణంగానే ఇప్పుడు బెంగళూరు నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. చైనాలో నేటికీ ప్రభుత్వ రంగ సంస్థలు బలంగా ఉన్నాయి. టాప్‌-10 గ్లోబల్‌ ఫార్చ్యూన్‌ కంపెనీల్లో మూడు చైనా పీయస్‌యూలే. 2023లో 135 చైనా కంపెనీలు ఫార్చ్యూన్‌ 500 జాబితాలో ఉన్నాయి. వీటిలో 85 కంపెనీలు పీయస్‌యూలు కావడం విశేషం.
మన దేశంలో సెమీకండక్టర్‌ పరిశ్రమ సంగతేమో కానీ పేపర్‌ లీకేజీల పరిశ్రమ మాత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. కాదేదీ లీకేజీలకు అనర్హం అన్నట్టు ఏ పరీక్షలో చూసినా ప్రశ్నా పత్రాల లీకేజీలే కన్పిస్తు న్నాయి. ఇక మత విద్వేషాలు వ్యాపిం పజేసే పరిశ్రమ కూడా పరిఢ విల్లుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఇన్‌ఫ్లుయన్సర్ల హవా నడుస్తోంది. కీలక రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు నానాటికి తీసికట్టు అన్నట్టు పడిపోతున్నాయి. ఇలాంటి వాతావరణంలో నూతన ఆవిష్కరణలు ఎలా సాధ్యం?
లాభాల పైనే దృష్టి
మరి చైనాలోనో ? అక్కడ కార్ల తయారీదారుల సంఖ్య 200కు పైనే. అవి అనేక రకాల కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. 600 డాలర్ల ధరతో మొదలుకొని టెస్లా యజమానులు అసూయపడేలా అధిక ధర కలిగిన లగ్జరీ కార్ల వరకూ వాటి కర్మాగారాల్లో తయారవుతున్నాయి. ఇప్పుడు మన దేశంలో అత్యంత చౌకైన ఈవీ కారు ఎంజీ కంపెనీ తయారు చేస్తున్న కామెట్‌. దీని ప్రారంభ ధరే ఏడు లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే కార్ల ఉత్పత్తిదారులు తమ లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఆవిష్కరణలను గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. చైనా కార్లను భారత మార్కెట్లలోకి అనుమతిస్తే మన కార్ల ముఖం చూసే వారు కూడా ఉండరు.
ఎంత తేడా
భారత్‌ విషయానికి వస్తే 2023లో స్టార్టప్‌ నిధులలో కేవలం ఐదు శాతం మాత్రమే డీప్‌ టెక్‌లోకి వెళ్లాయి. అదే చైనా పెట్టుబడులలో 35 శాతం ఆ రంగంలోనే. గతేడాది చైనా పలు హైటెక్‌ సంస్థలకు పన్నులు, రుసుములు భారీగా మాఫీ చేసింది. గత ఏడాది పరిశోధనలు, అభివృద్ధిపై చైనాలో అయిన ఖర్చు 496 బిలియన్‌ డాలర్లు. అదే మన దేశంలో ప్రస్తుత బడ్జెట్‌లో దీనికి కేటాయించింది 23.45 బిలియన్‌ డాలర్లు మాత్రమే. భారతీయ స్టార్టప్‌లు నేటికీ నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇక నిబంధనలు, నియంత్రణలు సరేసరి. చైనాలో ప్రభుత్వమే స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతోంది. ఏ దేశంలో అయినా వ్యాపారానికి అనువైన వాతావరణం కల్పించాలంటే విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు అవసరం. కీలక రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఒకప్పుడు మన దేశంలోని నవరత్న కంపెనీలు ఉక్కు నుంచి ఔషధాల వరకూ ఉత్పత్తి చేసేవి. అవి నేటికీ పాఠశాలలు, ఆస్పత్రులు, పార్కులు, టౌన్‌షిప్పులు నిర్వహిస్తున్నాయి.

]]>
పడిపోయిన వజ్రాల ఎగుమతులు https://navatelangana.com/exports-of-fallen-diamonds/ Thu, 17 Apr 2025 18:19:11 +0000 https://navatelangana.com/?p=548351 daimonds– రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి క్షీణత
– అమెరికా, చైనా నుంచి డిమాండ్‌ తగ్గడమే కారణం
న్యూఢిల్లీ: గత రెండు దశాబ్దాల కాలంలో మునుపెన్నడూ లేని విధంగా మన దేశం నుండి కోత కోసిన, పాలిష్‌ చేసిన వజ్రాల ఎగుమతులు మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. అమెరికా, చైనా దేశాల నుండి డిమాండ్‌ తగ్గిపోవడమే దీనికి కారణమని ఓ ప్రముఖ వాణిజ్య సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే మన దేశం అతి పెద్ద కటింగ్‌, పాలిషింగ్‌ హబ్‌గా పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాసెస్‌ చేస్తున్న ప్రతి పది వజ్రాలలో తొమ్మిదింటిని మన దేశమే చేస్తోంది. అయితే భారత్‌కు అతి పెద్ద మార్కెట్‌ అయిన అమెరికాలో ఆర్థిక అనిశ్చితి (టారిఫ్‌ల గొడవకాదు) నెలకొనడంతో దాని ప్రభావం ఎగుమతులపై పడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రత్నాలు, ఆభరణాల ఎగుమతులలో సుమారు యాభై శాతం కోసిన, పాలిష్‌ చేసిన వజ్రాలే ఉంటాయి. అయితే వీటి ఎగుమతులు 16.8 శాతం తగ్గి 13.3 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తంగా చూస్తే రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 11.7 శాతం తగ్గి 28.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే మొదటిసారి. గత సంవత్సరంలో 32.28 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ఎగుమతులు జరిగాయి.
మెరుగు పెట్టిన వజ్రాలకు డిమాండ్‌ తగ్గిపోవడంతో భారతీయ ప్రాసెస్‌దారులు దిగుమతులను తగ్గించుకున్నారు. దీంతో ముడి వజ్రాల దిగుమతులు 24.3 శాతం తగ్గి 10.8 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మార్చితో అంతమైన సంవత్సరానికి ఒక శాతం పెరిగి 2.56 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అమెరికా సుంకాలు ప్రకటించడానికి ముందు ఎగుమతిదారులు ఎగుమతులను పెంచడమే దీనికి కారణం. పుండుమీద కారం జల్లినట్టుగా ఈ నెల 9వ తేదీ నుంచి భారత్‌ నుండి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై 27 శాతం సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలుత నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత దానికి 90 రోజుల విరామం ప్రకటించారు. భారత్‌ నుండి ఎగుమతి అవుతున్న రత్నాలు, ఆభరణాలలో 30 శాతం వరకూ అమెరికాకే వెళుతున్నాయి. సుంకాల విధింపునకు ముందుగానే అమెరికా కొనుగోలుదారులు భారీగా మన దేశం నుంచి రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేశారు. ఇటు భారతీయ ఎగుమతిదారులు కూడా వేగవంతంగా ఎగుమతులు చేశారు. సుంకాల భారం నుంచి తప్పించుకోవడానికే భారత్‌ నుంచి పెద్ద మొత్తంలో దిగుమతులు చేసుకున్నారని జీజేఈపీసీ వైస్‌ ఛైర్మెన్‌ షౌనక్‌ పారిఖ్‌ చెప్పారు. కాగా దేశం నుండి జరుగుతున్న రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఈ ఏడాది పెరగకపోవచ్చునని ముంబయికి చెందిన ఓ ప్రముఖ ఎగుమతిదారుడు రాయిటర్స్‌ వార్తా సంస్థకు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లను సుంకాలు కుదిపివేయడం, కొనుగోలుదారుల విశ్వాసం దెబ్బతినడమే దీనికి కారణమని ఆయన చెప్పారు.

]]>
రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవ‌డ‌మే మీ ప‌రిధి: ఉప‌రాష్ట్రప‌తి https://navatelangana.com/the-vice-president-of-your-paradise-is-to-understand-the-constitution/ Thu, 17 Apr 2025 13:41:51 +0000 https://navatelangana.com/?p=548293 vpన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీష్ ధ‌న్‌ఖ‌డ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీష్ ధ‌న్‌ఖ‌డ్ వ్యాఖ్యానించారు. అలాంటి ఆదేశం దేశ అత్యున్నత కార్యాలయ రాజ్యాంగ విధిని దెబ్బతీస్తుందని అన్నారు. ఆర్టికల్ 145(3) కింద చట్టాన్ని అర్థం చేసుకునే అధికారాన్ని న్యాయవ్యవస్థకు ఇస్తుందని, కానీ కోర్టులు రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయడానికి అధికారం ఇవ్వలేదని ఆయన అన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం మీకు ఉన్న ఏకైక హక్కు ఆర్టికల్ 145(3) కింద రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం. అక్కడ ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది జడ్జిలు ఉండాలి అని ఉప‌రాష్ట్రప‌తి అన్నారు. పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విష‌యం తెలిసిందే. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఉప‌రాష్ట్రతి తాజాగా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

]]>
ఇసుక క‌ళాకారుడు సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్‌కు రాష్ట్రప‌తి అభినంద‌న‌లు https://navatelangana.com/president-of-the-president%e0%b0%87%e0%b0%b8%e0%b1%81%e0%b0%95-%e0%b0%95u200c%e0%b0%b3%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b8%e0%b1%81%e0%b0%a6u200c%e0%b0%b0/ Thu, 17 Apr 2025 12:07:32 +0000 https://navatelangana.com/?p=548212 sand artన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్ర‌ముఖ ఇసుక క‌ళాకారుడు సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్‌ను రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము అభినందించారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌నానికి ఆయ‌నను ఆహ్వానించారు. త‌న క‌ళాతో ఇండియాకు పేరు ప్ర‌ఖ్యాతలు తెచ్చార‌ని, విశ్వ‌శాంతికి భార‌త్ చేస్తున్న కృషిని త‌న క‌ళాఖండాల‌తో ప్ర‌పంచానికి తెలియ‌జేశార‌ని కొనియాడారు. ఇసుక శిల్పకళా రంగంలో సుద‌ర్శ‌న్ సేవాల‌ను గుర్తిస్తూ .. బ్రిటిషు దేశానికి చెందిన ఫ్రెడ్ డారింగ్టన్ సంస్థ అరుదైన అవార్డును ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ శాంతిని సూచిస్తూ 10 అడుగుల మేర ఇసుకతో కూడిన‌ గ‌ణేష్ న‌మునాను నిర్మించారు. దీనికి గాను ఆయ‌న‌కు 2025 సంవ‌త్సారానికి ఆ దేశంలో జ‌ర‌గ‌నున్న కార్య‌క్ర‌మంలో ప్ర‌తిభ పుర‌స్కారాన్ని అంద‌జేయ‌నున్నారు. ప్రపంచవ్యాప్తంగా 65కి పైగా అంతర్జాతీయ ఇసుక శిల్పకళా ఛాంపియన్‌షిప్‌లను ఆయ‌న‌ కైవ‌సం చేసుకుని తన కృషికి అనేక ప్రశంసలు అందుకున్నారు. పట్నాయక్ భారతదేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీ అవార్డును కూడా స్వీక‌రించారు. ఆయన ఒడిశాలోని పూరి బీచ్‌లో ఇసుక కళా పాఠశాలను నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా త‌న ఇసుక శిల్ప‌క‌ళాతో.. HIV, AIDS, గ్లోబల్ వార్మింగ్, ఉగ్రవాదాన్ని ఆపడం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, COVID-19, పర్యావరణ పరిరక్షణ వంటి వివిధ సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు.

]]>