National Archives - https://navatelangana.com/category/national/ Thu, 09 May 2024 08:06:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png National Archives - https://navatelangana.com/category/national/ 32 32 24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డు.. https://navatelangana.com/a-world-record-for-climbing-70-thousand-steps-in-24-hours/ Thu, 09 May 2024 08:06:04 +0000 https://navatelangana.com/?p=286887

 

నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్‌లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్‌సింగ్‌ రాఠోడ్‌ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో  స్పెయిన్‌కు చెందిన క్రిస్టియన్‌ రాబర్టో (70,200 మెట్లు) పేరిట ఉన్న రికార్డును  అధిగమించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే సందేశాన్ని చాటేందుకు ఈ రికార్డు సృష్టించినట్లు ఆయన తెలిపారు. స్థానిక వైశాలి నగర్‌లో మొత్తం 439 మెట్లున్న 20 అంతస్తుల భవనాన్ని హిమ్మత్‌సింగ్‌ 81 సార్లు ఎక్కి, 80 సార్లు దిగారు. సోమవారం (మే 6) సాయంత్రం 5.30 గంటలకు మెట్లు ఎక్కడం ప్రారంభించి, మంగళవారం సాయంత్రం 5.22 గంటలకు పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల పీఈటీల బృందం ఈ విన్యాసాన్ని పర్యవేక్షించింది. హిమ్మత్‌సింగ్‌ మెట్లు ఎక్కుతున్న దృశ్యాలను  గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు పంపుతామని పీఈటీ సంతోష్‌ రాఠోడ్‌ తెలిపారు.

]]>
వెజ్‌ ఆర్డరిస్తే నాన్‌ వెజ్ డెలివరీ.. తర్వాత ఎం చేశారాంటే? https://navatelangana.com/if-you-order-veg-what-do-you-do-after-non-veg-delivery/ Thu, 09 May 2024 03:29:29 +0000 https://navatelangana.com/?p=286810 నవతెలంగాణ – హైదరాబాద్: ఫుడ్‌ డెలివరీ యాప్‌లో వెజ్ శాండ్‌విచ్ ఆర్డర్ చేసిన మహిళ చివరకు నాన్ వెజ్ శాండ్‌విచ్ డెలివరీ కావడంతో అగ్గిమీద గుగ్గిలమవుతోంది. చికెన్ శాండ్‌విచ్ సరఫరా చేసిన రెస్టారెంట్‌పై రూ.50 లక్షల పరిహారం కోరుతూ కేసు వేసేందుకు రెడీ అయ్యింది. అహ్మదాబాద్‌కు చెందిన నిరాలీ మే 3న పనీర్ ‘పిక్‌ అప్ మీల్స్ బై టెర్రా’ నుంచి పనీర్ టిక్కా శాండ్‌విచ్ ఆర్డర్ చేసింది. ఇంటికి ఫుడ్ డెలివరీ అయ్యాక రెండు ముక్కలు తిన్న ఆమెకు డౌట్ వచ్చింది. శాండ్‌విచ్ సాధారణం కంటే కాస్తంత గట్టిగా అనిపించడంతో చూస్తే అది చికెన్ శాండ్‌విచ్ అని తేలింది. దీంతో, మండిపడ్డ మహిళ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ హెల్త్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, ఆహార శాఖ ఆ రెస్టారెంట్‌కు రూ.5 వేల జరిమానా విధించింది. అయితే, విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టని మహిళ రెస్టారెంట్ నుంచి రూ.50 లక్షల పరిహారం కోరుతూ కేసు వేసేందుకు సిద్ధమైంది. ‘‘ఇదో భయానక ఘటన. జరిగింది వెనక్కు తీసుకోలేము. రూ.5 వేల జరిమానా సరిపోదు. నేను వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తా. రూ.50 లక్షల కంటే ఎక్కువ పరిహారాన్ని నేను అడిగుండేదాన్నే. అప్పుడు కూడా నాకు తగిన న్యాయం జరిగి ఉండేది కాదు’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం ఇంతవరకూ స్పందించలేదు.

]]>
నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ https://navatelangana.com/rahul-gandhi-for-telangana-today-2/ Thu, 09 May 2024 01:51:13 +0000 https://navatelangana.com/?p=286797 నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను తాజాగా పీసీసీ వెల్లడించింది. ఈ నలుగురు నాయకులు ఎప్పుడు ఎక్కడెక్కడ పాల్గొంటారో షెడ్యూల్‌ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జన జాతర సభతో పాటు 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరుకానున్నారు. ఈ నెల పదో తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌లో జన జాతర సభకు హాజరవుతారు. పదో తేదీన ఉదయం 10 గంటలకు పఠాన్ చెరు కార్నర్ మీటింగ్‌లో సాయంత్రం 4 గంటలకు మక్తల్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు షాద్ నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంక గాంధీలతో కలిసి సభలో సీఎం పాల్గొంటారని వెల్లడించాయి. ఈ నెల 11 న ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ, కామారెడ్డి, తాండూర్‌ సభల్లో పాల్గొంటారని పేర్కొంది.

]]>
అంతులేని విషం https://navatelangana.com/endless-poison/ Wed, 08 May 2024 22:40:12 +0000 https://navatelangana.com/?p=286753 Endless poison– హిందూత్వ శక్తుల గ్రూపులు, యూట్యూబర్ల కథనాలే మూలం
– ‘ఆ వర్గం’పై ప్రజల్లో ప్రతికూలత కలిగేలా తీవ్ర ప్రచారం
– ఇందుకు కవిత్వాలు, పాటలనూ వదలని కాషాయపార్టీ
– ప్రధాని మోడీ, బీజేపీ తీరుపై మేధావులు, సామాజిక కార్యకర్తల ఆగ్రహం
న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా మోడీ పాలనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం సాగింది. ముఖ్యంగా, కరోనా కాలంలో ఆ వర్గం వారిని సూపర్‌ స్ప్రెడర్స్‌(కరోనా మహమ్మారి వ్యాప్తిని వేగంగా వ్యాప్తి చెందించేవారు)గా కొన్ని హిందూత్వ శక్తులు తీవ్ర ప్రచారం చేశాయి.
బీజేపీ అనుకూల మీడియా, యూట్యూబ్‌ ఛానెళ్లు సైతం ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాయి. ఆ మతానికి వ్యతిరేకంగా కొన్ని కథనాలను తయారు చేసి సమాజంలోకి వదిలి ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటే ప్రయత్నాలను చేశాయి. ముఖ్యంగా, ఇందుకు హిందూత్వ శక్తుల మత సమావేశాలు, వాట్సప్‌ సందేశాలు, యూట్యూబ్‌ ఛానెళ్లు, ‘హిందూత్వ’, హిందూ జాతీయవాదాన్ని ప్రచారం చేసే విధంగా పాటలు, కవిత్వాలను రూపొందించే గాయకులు, వ్యక్తులు మూల వనరులుగా ఉన్నారు.
ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం కొన్ని వారాలుగా ఆ వర్గం మైనారిటీలపై బీజేపీ విషం చిమ్ముతున్నది. ముఖ్యంగా, ప్రధాని హౌదాలో ఉన్న మోడీనే ఇందుకు కేంద్ర బిందువయ్యారు. బీజేపీ, ప్రధాని చేసే ప్రచారాల తీరును మేధావులు, సామాజికవేత్తలు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆ వర్గానికి చెందిన వ్యక్తులకు మద్దతుగా ఉంటుందనీ, హిందువులు మాత్రం తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకోవటానికి అవకాశాలుండవనీ, ఆ వర్గం వారు ఆదివాసీ, గిరిజనుల భూములను ఆక్రమిస్తారని హిందూత్వ గ్రూపులు పలు సమావేశాలు, సోషల్‌ మీడియా ఖాతాల్లో ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఈ హిందూత్వ గ్రూపుల ప్రచారానికి బలం కల్పించేది ప్రధాని హౌదాలో మోడీ చేస్తున్న విషపూరిత ప్రసంగాలేనని మేధావులు, సామాజిక కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
‘ల్యాండ్‌ జిహాద్‌’ అంటూ ఆరోపణలు
ఆ వర్గం మైనారిటీలు చేసే ఏ పనినైనా సంఘవిద్రోహ కోణంలోనే చూసే ధోరణిని అలవాటు చేసుకున్న హిందూత్వ శక్తులు.. వాటినే ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పుదారి పట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో భూములను ఆక్రమించుకోవటానికి ఆ వర్గం వారు కుట్ర పన్నుతున్నారని ఏడాది నుంచి హిందూత్వ శక్తులు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. దీనిని ‘ల్యాండ్‌ జిహాద్‌’గా అభివర్ణించాయి. తమిళనాడు, కేరళ, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ వంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఆ మైనారిటీ వర్గానికి అవసరమైన భూమిని, నిధులను కేటాయించినా.. బీజేపీ శ్రేణులు, హిందూత్వ శక్తులు ఆ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ విపరీత ప్రచారాలు చేస్తున్నాయి.
ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం కోసం ఏ రాష్ట్రానికి వెళ్లినా.. ఆ మైనారిటీ వర్గాన్ని మాత్రం టార్గెట్‌ చేయకుండా ఉండలేకపోతున్నారు. జార్ఖండ్‌ పర్యటనలోనూ.. జేఎంఎం-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎలాంటి తనిఖీలు లేకపోవటంతో ”చొరబాటుదారులు” వస్తున్నారనీ, ఓటు బ్యాంకు కోసం ఈ పార్టీలు ఏమైనా చేస్తాయని మోడీ ఆరోపణలు గుప్పించారు. ఈ చొరబాటుదారులు ఆదివాసీల భూములను లాక్కొంటారనీ, జార్ఖండ్‌లోని సంతల్‌ పరజ్ఞ వంటి ప్రాంతాల్లో మహిళలకు భద్రత లేదని ప్రధాని చెప్పటం గమనార్హం.
ఆదివాసీ మహిళలను ఒక వర్గం పురుషులు వివాహం చేసుకొని, వారి భూములను ఆక్రమిస్తున్నారనే పరోక్ష ఆరోపణలను ఆయన చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలూ లేకుండానే ప్రధాని హౌదాలో మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. హిందూత్వ శక్తులు, గ్రూపుల కుట్ర కథనాలనే మోడీ తన బాధ్యతను విస్మరించి వినిపిస్తున్నారని మేధావులు, సామాజిక, మైనారిటీ హక్కుల కార్యకర్తలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
పాటలు, కవిత్వాలను కూడా ఆ వర్గంపై విషం చిమ్మటానికి ఉపయోగిస్తున్నాయి హిందూత్వ శక్తులు, బీజేపీ శ్రేణులు. రోహతక్‌కు చెందిన ఒక గాయకురాలు కవి సింగ్‌.. ఆర్టికల్‌ 370 రద్దుపై మోడీని పొగుడుతూ.. ఒక వర్గం ప్రజలను మాత్రం దేశద్రోహులు, చొరబాటుదారులుగా, ఎక్కువ మంది పిల్లలను కనేవారిగా వర్ణిస్తూ పాటను రూపొందించటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నదని మేధావులు చెప్తున్నారు.

]]>
జేపీ నడ్డాకు సమన్లు https://navatelangana.com/summons-to-jp-nadda/ Wed, 08 May 2024 22:36:59 +0000 https://navatelangana.com/?p=286745 జేపీ నడ్డాకు సమన్లు– వారం రోజుల్లోగా బెంగళూరులో విచారణకు హాజరవ్వాలని ఆదేశం
– అమిత్‌ మాలవియా, విజయేంద్రకూ నోటీసులు
బెంగళూరు : ముస్లిం మైనార్టీలపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో బీజేపీ పోస్టు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ చిక్కుల్లో పడింది. ఇప్పటికే దీనిపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆ పోస్టులను తొలగించాలని ‘ఎక్స్‌’ను ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే వ్యవహారానికి సంబంధించి తమ ఎదుట విచారణకు రావాలని, వారం రోజుల్లోగా తమ ఎదుట హాజరవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆయనతో పాటు బీజేపీ ఐటీ సెల్‌ అధ్యక్షుడు అమిత్‌ మాలవియా, ఆ పార్టీ కర్నాటక అధ్యక్షుడు బివై విజయేంద్రకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కర్ణాటక ఆధికారిక బీజేపీ ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసిన ఒక వీడియోపై కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారం ఈ కేసు నమోదయింది. ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ అనుకూలంగా ఉందని ఈ వీడియోలో ఉంది. ఈ కేసు విషయంలో మొదటి అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును కూడా పోలీసులు ఆశ్రయించారు. ఈ పోస్టును నిందితులు డిలీట్‌ చేయాలని, తమ అభ్యంతరాలు తెలిపాలని ఆదేశాలను పొందారు. కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

]]>
హర్యానాలో రాజకీయ సంక్షోభం https://navatelangana.com/political-crisis-in-haryana/ Wed, 08 May 2024 22:35:43 +0000 https://navatelangana.com/?p=286750 Political crisis in Haryana– మెజారిటీ కోల్పోయిన బీజేపీ సర్కార్‌
– ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలు జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌
– కుర్చీ వదలబోనన్న సీఎం సైనీ
చండీఘర్‌ : హర్యానాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ శిబిరంలో చేరడంతో హర్యానా రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం 88 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో బీజేపీకి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ప్రభుత్వం మైనారిటీలో పడినందున వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉదరు భాన్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ఇదిలావుండగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ముగ్గురు స్వతంత్రులు రోతక్‌లో ప్రతిపక్ష నేత భూపేందర్‌ సింగ్‌ హూడాతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయాన్ని రాష్ట్ర గవర్నరుకు తెలియజేశామని వారు చెప్పారు.
బీజేపీకి మద్దతు ఇస్తున్న 43 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు స్వతంత్రులు కూడా ఉన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి వ్యూహాత్మక మద్దతు ఇస్తామని నలుగురు సభ్యులున్న జన్‌నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) చెబుతోందని బీజేపీ అంటోంది. అయితే తాము ప్రతిపక్ష నేత భూపేందర్‌ సింగ్‌ హూడాకే మద్దతు ఇస్తామని జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా తేల్చి చెప్పడంతో బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. జేజేపీ మార్చిలోనే బీజేపీ ప్రభుత్వం నుండి బయటికి వచ్చింది. నాయబ్‌ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన పక్షంలో తాము మద్దతు ఇస్తామని జేజేపీ స్పష్టం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్‌ మాత్రమేనని దుష్యంత్‌ చౌతాలా చెప్పారు. రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్ధ్యం నాయబ్‌కు లేదని అన్నారు. తాను బలహీనుడినని ఆయన అంగీకరించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జేపీపీతో పాటు అభరు సింగ్‌ చౌతాలా నేతృత్వంలోని ఐఎన్‌ఎల్‌డీ, స్వతంత్ర ఎమ్మెల్యే బల్‌రాజ్‌ కుందు కూడా గవర్నర్‌కు లేఖలు రాయాలని ఉదరు భాన్‌ సూచించారు. ఇదిలావుండగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు స్వతంత్ర ఎమ్మెల్యేలు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పీకర్‌ జ్ఞాన్‌ చంద్‌ గుప్తా తెలిపారు. ప్రతిపక్షాల డిమాండ్‌పై నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. ఇప్పటికి కూడా బీజేపీకి 40, కాంగ్రెస్‌కు 30, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆరుగురు స్వతంత్ర సభ్యులు ఉన్నారని వివరించారు. హెచ్‌ఎల్‌పీ, ఐఎన్‌ఎల్‌డీ పార్టీల నుండి ఒక్కొక్క సభ్యుడు ఉన్నారని అన్నారు. మరోవైపు తన ప్రభుత్వం కొనసాగుతుందని, ఎలాంటి సమస్యలు లేవని ముఖ్యమంత్రి నాయబ్‌ సైనీ ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా తమకు 47 మంది సభ్యుల మద్దతు ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ మీడియా కార్యదర్శి ప్రవీణ్‌ ఆగ్రే చెప్పుకొచ్చారు. అయితే శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఇప్పట్లో లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 23న సైనీ ప్రభుత్వంపై భూపేందర్‌ సింగ్‌ హూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తాజాగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే ఆరు నెలల వ్యవధి అవసరం. అయితే ఇది బలపరీక్షకు సంబంధించిన అంశం కాదని, నైతికతకు సంబంధించినదని హూడా చెప్పారు.

]]>
ఓటింగ్‌కు దూరం పెండింగ్‌ సమస్యలే కారణం https://navatelangana.com/distance-to-voting-is-due-to-pending-issues/ Wed, 08 May 2024 22:25:48 +0000 https://navatelangana.com/?p=286743 ఓటింగ్‌కు దూరం పెండింగ్‌ సమస్యలే కారణం– గుజరాత్‌లో ఎన్నికలు బహిష్కరించిన మూడు గ్రామాల ప్రజలు
– డిమాండ్లు నెరవేర్చకపోవటంతో
– మరి కొన్ని గ్రామాల్లో పాక్షికంగా బహిష్కరణ
అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని మూడు గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను బహిష్కరించారు. అనేక ఇతర గ్రామాల వారు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోవటంతో ఎన్నికల ప్రక్రియకు పాక్షికంగా దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు బరూచ్‌ జిల్లాలోని కేసర్‌ గ్రామం, సూరత్‌ జిల్లాలోని సనాధార, బనస్కాంత జిల్లాలోని భఖారీ ఓటర్లు ఓటింగ్‌ను పూర్తిగా బహిష్కరించగా.. జునాగఢ్‌ జిల్లాలోని భట్గాం గ్రామం, బోడోలి, మహిసాగర్‌ జిల్లాలోని కుంజర గ్రామాలు దీనిని పాక్షికంగా బహిష్కరించాయి. సనాధార గ్రామం బార్డోలి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 320 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.. స్థానిక పోల్‌ అడ్మినిస్ట్రేషన్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ.. 320 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయకపోవటం గమనార్హం.
పటాన్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బఖ్రీ గ్రామంలోని దాదాపు 300 మంది ఓటర్లు.. తమ గ్రామ పంచాయతీ విభజనకు నిరసనగా సమిష్టిగా ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించు కున్నారు. ఎంతగా ఒప్పించే ప్రయత్నాలు చేసినా.. వారు తమ ఓటు హక్కును వినియోగించుకోకూడదనే నిర్ణయానికే బలంగా కట్టుబడి ఉన్నారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్‌ అధికారులు వేచి చూసినా గ్రామస్తులు ఓటింగ్‌కు రాలేదు. తమ గ్రామ పంచాయతీ విభజనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌సింగ్‌ దాభి కూడా గ్రామానికి చేరుకుని ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
భరూచ్‌ జిల్లాలోని కేసర్‌ గ్రామంలో దాదాపు 350 మంది ఓటర్లు కూడా తమ ఓటు వేయకూడదనే నిర్ణయంపై ఐక్యంగా ఉన్నారు. ఏ ఒక్కరూ ఓటు వేయకుండా పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రజలు తమ ఓట్లను బహిష్కరించడం ఇదేం తొలిసారి కాదు. నదిపై వంతెన నిర్మించాలని పలుమార్లు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం నెరవేర్చకపోవటంతో గతంలో కూడా ఇలాగే చేశామని స్థానికులు తెలిపారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్‌ జరిగింది. సూరత్‌ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయం తెలిసిందే.

]]>
మోడీ పాలనలో బ్రిటీష్‌ రాజ్‌ లాంటి పరిస్థితులు https://navatelangana.com/conditions-like-british-raj-under-modi-regime/ Wed, 08 May 2024 22:23:45 +0000 https://navatelangana.com/?p=286729 మోడీ పాలనలో బ్రిటీష్‌ రాజ్‌ లాంటి పరిస్థితులు– ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే సంస్థలన్నీ నిర్వీర్యం : ప్రియాంక గాంధీ
లక్నో : ప్రధాని మోడీ హయాంలో దేశంలో బ్రిటిష్‌ రాజ్‌ తరహా పరిస్థితులు నెలకొంటున్నాయనీ, ప్రభుత్వ విధానాలతో కోటీశ్వరులకే మేలు జరుగుతున్నదని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలు పేదలను దృష్టిలో ఉంచుకుని రూపొందించటం లేదనీ, కోటీశ్వరులకు మేలు చేసేలా తయారైందని చెప్పారు. నేడు భారత్‌లో అసమానత పరిస్థితి దారుణంగా ఉన్నదని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయని ఆమె గుర్తు చేశారు. తన సోదరుడు, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న యూపీలోని రారుబరేలీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి ”ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే అన్ని సంస్థలు.. మీడియా, పార్లమెంటు వంటివి నిర్వీర్యమవుతున్నాయి. మహాత్మాగాంధీ, పండిట్‌ నెహ్రూ ప్రజల హక్కులను బలోపేతం చేసేందుకు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజల హక్కులను హరించే స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పడే రోజు వస్తుందని వారికి తెలియదు” అని ఆమె కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోట్లాది ప్రజల జీవితాలను మార్చే రిజర్వేషన్‌ లాంటి వ్యవస్థను కల్పించే రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భాష, ప్రవర్తన, చర్యలు నాసిరకంగా ఉన్న వ్యక్తి నేడు ప్రధాని కుర్చీపై కూర్చోవటం దేశ దౌర్భాగ్యమని ఆమె అన్నారు. ”మేము ఎల్లప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తాం. అభివృద్ధి చెందిన, సంపన్నమైన రారుబరేలీ గురించి కలలు కన్నాం. మాకు అవకాశం వచ్చినప్పుడు, మేము రారుబరేలీలో ఉపాధి, అభివృద్ధి అవకాశాలను సృష్టించాం. కానీ మోడీ ప్రభుత్వం మేము ప్రారంభించిన అనేక ప్రాజెక్టులను మూసివేసింది” అని ప్రియాంక గాంధీ అన్నారు.
రారుబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ఈనెల 20న పోలింగ్‌ జరగనున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడ నుంచి 5,34,918 ఓట్లతో గెలుపొందారు. ఆమె సమీప ప్రత్యర్థి దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ 3,67,740 ఓట్లను సాధించి బలమైన పోటీనిచ్చారు. రాహుల్‌ గాంధీ 2004 నుంచి 2019 వరకు లోక్‌సభలో పొరుగున ఉన్న అమేథీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఆయన బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవి చూశారు.

]]>
ఒడిశాలో నువ్వా నేనా… https://navatelangana.com/you-are-me-in-odisha/ Wed, 08 May 2024 22:22:08 +0000 https://navatelangana.com/?p=286735 Are you me in Odisha?– బీజేడీపై ప్రభుత్వ వ్యతిరేకత
– భాషా, భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీజేపీ
ఒడిశాలో మొదటి దశ పోలింగ్‌ ఈనెల 13న జరుగనుండడంతో ప్రచారం పతాకస్థాయికి చేరింది. రాష్ట్రంలో ఉన్న 147 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్‌ జరుగుతున్న విషయం విదితమే. బీజేడీ, బీజేపీ అన్ని అసెంబ్లీ, ఎంపి స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ 145 స్థానాల్లో పోటీ చేస్తోంది. సీపీఐ(ఎం) జేఎంఎం పార్టీలకు చెరో సీటును కేటాయించింది. పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌ 20 స్థానాల్లో పోటీ చేసి, జగత్‌సింగ్‌పూర్‌ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. సీపీఐ(ఎం) ఎనిమిది అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో తన అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఐ పది అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో పోటీ చేస్తోంది. జేఎంఎం 16 అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ సెగ్మెంట్‌ బరిలో అభ్యర్థులను పోటీలో నిలిపింది. 2019 ఎన్నికల్లో బీజేడీి 112 అసెంబ్లీ, 12 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 23 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్‌ తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానం గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.
భువనేశ్వర్‌ : ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో అత్యధిక సీట్లలో విజయం సాధిస్తామని బీజేడీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి ఎన్నికల ముందు వరకు కేంద్రంలో మద్దతు ఇస్తుండడంతో, రెండు పార్టీలూ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, కార్మిక వ్యతిరేక బిల్లులకు బీజేడీ మద్దతు ఇవ్వడం, ఆ పార్టీకి కొంత నష్టం తెచ్చిందన్న భావన ప్రజల్లో నెలకొంది. కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు బీజేడీ ఎమ్మెల్యేలు సహకరించడమూ ఆ పార్టీకి చేటు తెస్తోంది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఒక్కటైపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేడీ ప్రభుత్వం సుమారు 25 ఏండ్లుగా అధికారంలో కొనసాగతుండ డంతో, ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి 33 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చింది. ఎంపీలలో ఆరుచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చింది. నవీన్‌ పట్నాయక్‌ ఇమేజ్‌ తమను గట్టెక్కిస్తుందని బీజేడీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేడీ,బీజేపీ
ప్రస్తుత ఎన్నికల్లో బీజేడీ, బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తొలుత ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న చర్చ నడిచింది. పొత్తులు విఫలమయ్యాయని, విడివిడిగా పోటీ చేయనున్నట్టు రెండు పార్టీల నేతలు ప్రకటించారు. విడివిడిగా పోటీ చేయడం వెనుక రహస్య అజెండా దాగున్నట్లు తెలుస్తోంది.బీజేపీ, బీజేడీ కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు బదిలీ అయి, ఆ పార్టీ లాభపడుతుందని గుర్తించిన ఇరు పార్టీలూ కూడబలుక్కునే స్నేహపూర్వక పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
భాషా భావోద్వేగాలు రెచ్చగొడుతున్న బీజేపీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక బిల్లులకు మద్దతు ఇచ్చినప్పటికీ బీజేడీని ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒడిశా పీఠాన్ని చేజిక్కించుకునేందుకు రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది. బీజేడీ ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ బలహీనపరిచే ప్రయత్నం చేస్తోంది. అయోధ్య రామమందిరం అంశాన్నీ ప్రస్తావిస్తూ బీజేడీని ఇరకాటంలో పెడుతోంది. కేంద్ర మంత్రి
అమిత్‌షా గత నెల 26న సోనేపూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో బీజేడీ ప్రభుత్వాన్ని దించాలంటూ పిలుపునిచ్చారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు నవీన్‌ పట్నాయక్‌ ప్రయత్నించారంటూ హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ సైతం నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలు చేస్తూ 50 పేజీల ఛార్జిషీట్‌ను వెలువరించారు. ఒడియా అస్మిత (ఒడియా గర్వం), ఆత్మగౌరవం అంశం పేరుతో నవీన్‌ ప్రభుత్వంపై ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒడిశా భాష, సంస్కృతిని నవీన్‌ పట్నాయక్‌ అర్థం చేసుకోవడం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మచ్చకుంద్‌తో పాటు కొన్ని ఒరియా మాట్లాడే ప్రాంతాలు ఒడిశా చిత్రపటంలో గల్లంతయ్యాయని, ఒడిశా ప్రభుత్వ అధికారులు తప్పుడు ఉచ్ఛారణలతో ఒరియా భాషకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ ప్రజల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పుంజుకుంటున్న కాంగ్రెస్‌
ఈ ఎన్నికల్లో 145 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను బరిలో నిలిపింది. సిపిఎం, జెఎంఎంలకు చెరో స్థానాన్ని కేటాయించింది. సుందరఘర్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని బొనై స్థానాన్ని సిపిఎంకు, బిరమిత్రపూర్‌ స్థానంలో జెఎంఎంకు మద్దతు ఇస్తోంది. గతం కంటే అధిక స్థానాల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది. బిజెడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు బదిలీ అవుతుందని భావిస్తోంది. పైగా బిజెడి, బిజెపి ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి వెళ్లడం తమకు లాభిస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని ఐదు గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలో లోపాలూ లేకపోలేదు. ఒడిశాలో కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు బరిలో దిగడంతో ఆయా జిల్లాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బిజెడి, బిజెపి నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం, పార్టీని నమ్ముకున్న వారిని పక్కనపెట్టడంతో కొన్నిచోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో దిగారు. ఇండియా వేదిక పార్టీలను కలుపుకుని అన్నిచోట్లా వారి సహకారం తీసుకుంటే, మెరుగైన ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

]]>
మోడీకి రాహుల్‌ గుబులు https://navatelangana.com/rahul-is-a-fool-for-modi/ Wed, 08 May 2024 21:52:07 +0000 https://navatelangana.com/?p=286700 Rahul for Modi the bushes– రాముడు గట్టెక్కించలేడని డౌట్‌..!
– ప్రజాసమస్యల ముందు కొట్టుకుపోయిన హిందూత్వ
– కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపైనే ఫోకస్‌
మోడీకి రాహుల్‌ గుబులు పట్టుకున్నట్టుంది. పడుకున్నా..నిద్ర లేచినా ఉలిక్కిపడుతున్నట్టుంది. అందుకే ప్రచారసభల్లో అభివృద్ధి అంశాలు ప్రస్తావించకుండా.. రాహుల్‌ ప్రసంగాలు, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపైనే ఫోకస్‌ చేస్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌ను హిందూత్వ అంశం గట్టెక్కిస్తుందనుకుంటే..ఇపుడు ప్రజాసమస్యల ముందు బీజేపీకి పరాభవం తప్పదన్న సంకేతాలొస్తున్నాయి.
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే మూడు దశల పోలింగ్‌ పూర్తయింది. పోలింగ్‌ సరళిని గమనించిన బీజేపీలో ‘400 ప్లస్‌’ ఆశలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ‘సంపద పంపిణీ’పై కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను లక్ష్యంగా ఎంచుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హిందువుల సంపదను, ఆస్తులను గుంజుకొని వాటిని దేశంలోని ముస్లింలకు పంపిణీ చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. సంపద పంపిణీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ మెజారిటీ హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఏముంది?
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో సంపద పున:పంపిణీపై నేరుగా ప్రస్తావన లేదు. ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏం చెప్పిందంటే…. ” సంపద, ఆదాయాల్లో పెరుగుతున్న అసమానతలను రాజకీయాల్లో అవసరమైన మార్పులు తీసుకు రావడం ద్వారా నివారిస్తాం. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక, కులగణన చేపడుతుంది. కులాలు, ఉప కులాలు, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను గణించడానికి ఈ సర్వే చేపడతాము. ఈ సమాచారం ఆధారంగా కార్యాచరణకు ఎజెండాను రూపొందిస్తాము.” అని చెప్పింది.
ఇవే అంశాలను రాహుల్‌ ప్రజలకు వివరిస్తున్నారు. కులగణన నుండి తీసుకున్న సమాచారం సంక్షేమ, సామాజిక భద్రతా పథకాల అమలుకు దోహదపడుతుందని అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోటాను పెంచుతామని హామీ ఇస్తున్నారు.
మోడీ వక్రభాష్యం
కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మ్యానిఫెస్టోను, రాహుల్‌ ప్రసంగాలను మోడీ వక్రీకరిస్తున్నారు. ప్రజల సంపదను, హిందూ మహిళల బంగారు ఆభరణాలను గుంజుకొని ముస్లింలకు పంపిణీ చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కుట్ర పన్నిందని ఆయన ఆరోస్తున్నారు. పనిలో పనిగా ముస్లింలను ఆయన చొరబాటుదారులు, అధిక సంతతి కలిగిన వారుగా నిందిస్తున్నారు. నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే మోడీ ఇలా అబద్ధాలు చెబుతున్నారని, విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టభద్రులు, డిప్లొమా హోల్డర్లకు అప్రెంటీస్‌షిప్‌, 30 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీపై కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో నిర్దిష్టమైన హామీ ఇచ్చింది. బీజేపీ యువతకు ఉద్యోగావకాశాలు పెంచుతానని మాత్రమే చెప్పింది. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తానని కాంగ్రెస్‌ చెబుతుంటే రైతులకు ఏటా ఇస్తున్న ఆరు వేల రూపాయల సాయాన్ని కొనసాగిస్తానని బీజేపీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వోద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, పేద కుటుంబాల్లో వృద్ధ మహిళలకు నగదు బదిలీ వంటి హామీలను కూడా కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చేర్చింది. కాగా భాగస్వామ్యపక్షమైన జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలల వీడియోలపై ప్రధాని ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు టిక్కెట్‌ ఇస్తే విమర్శలొస్తాయని… ఆయన కుమారుడిని బీజేపీ పోటీకి దింపింది. ఇలాంటప్పుడు బీజేపీ తన మ్యానిఫెస్టోలో మహిళలకు ఎలాంటి హామీలు ఇవ్వగలదని ఆశించగలం? దేశంలో కులగణనను, సామాజిక-ఆర్థిక సర్వేను చేపడతామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. మోడీ మాత్రం తాను ఓబీసీననే విషయాన్ని ప్రతిపక్షం గుర్తించడం లేదని వాపోతున్నారు.
బీజేపీ దృష్టంతా ‘400 ప్లస్‌’ పైనే
బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రతిపక్షాలపై దాడికే పరిమితం చేస్తోంది తప్ప ప్రజా సమస్యలను పట్టించు కోవడం లేదు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం డిమాండ్‌ చేస్తుంటే ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిర్దిష్ట ప్రణాళికను వివరించలేదు. ధరల పెరుగుదలను కూడా బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ నాయకుల మాటలన్నీ ‘400 ప్లస్‌’ పైనే. కాంగ్రెస్‌ పార్టీ కనీసం 272 సీట్లకు కూడా పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని మోడీ ప్రశ్నించారు. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ 320 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాలను ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు వదిలేసింది. అదే ఇప్పుడు మోడీని భయపెడుతోంది.

]]>
బీజేపీ ఓటమి స్పష్టం https://navatelangana.com/bjps-defeat-is-clear/ Wed, 08 May 2024 21:34:33 +0000 https://navatelangana.com/?p=286681 bjps-defeat-is-clear– వారితో కలవడం టీడీపీకే నష్టం
– కమలానికి జగన్‌ సహకరిస్తున్నారు : తాడేపల్లి, గన్నవరం సభల్లో ఏచూరి
అమరావతి : దేశంలో మోడీ ఓటమి స్పష్టమైందని, అందుకనే ఆయన మిత్రులైన అదానీ, అంబానీలను తిట్టడం మొదలుపెట్టారని, మూడు దశలుగా జరిగిన పోలింగులో మోడీ ప్రభావం పూర్తిగా తగ్గిందనేది తేలిపోయిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కాంగ్రెస్‌, సీపీఐ, ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన సీపీఐ(ఎం) మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు పార్లమెంటు సీపీఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌, గన్నవరం సీపీఐ(ఎం) అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరుతూ బుధవారం గన్నవరం, తాడేపల్లిలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. తాడేపల్లిలో సీపీఐ(ఎం) గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, గన్నవరంలో కృష్ణా జిల్లా కార్యదర్శి వై నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. తొలుత ‘నయవంచన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, లౌకిక ప్రజాతంత్ర పునాదులను కాపాడుకోవాలన్నా ఇండియా వేదికలోని పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే ఇండియా వేదిక తప్ప మరొకటి లేదని తెలిపారు. మూడు దశల్లో జరిగిన ఓటింగు సరళి మోడీ, బీజేపీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అందుకనే అదానీ, అంబానీలను మోడీ తిడుతున్నారని, కాంగ్రెస్‌కు డబ్బులిచ్చారని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. అతని అభద్రతాభావమే ఓటమి ఖాయమైందని తెలిసిపోతుందన్నారు. మోడీని గద్దె దించితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకనే గుంటూరు నుంచి పోటీచేస్తున్న సీపీఐ ఎంపీ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌, మంగళగిరి నుంచి పోటీచేస్తున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకర్‌ను గెలిపించాలని కోరారు. పోలింగు తగ్గడమంటే మోడీ హవా ఏమీ లేదని తెలిసిపోతుందన్నారు. మోడీ హవాలేదని తేలడంతో ప్రచారాన్ని మార్చి హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు పెంచేవిధంగా మాట్లాడుతున్నారన్నారు. లవ్‌ జిహాద్‌, గోరక్షణ పేరుతో దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్య పునాదులైన నాలుగు స్తంభాలు దెబ్బతిన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మోడీని గద్దె దించితేనే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలమ న్నారు. సహజ వనరులను లూఠీ చేశారని, అటవీ ప్రాంతం నుంచి గిరిజనులను తరిమేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చారని అన్నారు. దేశంలో ప్రతి గంటకూ మహిళలపై 46 దాడులు జరుగుతున్నాయని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత పెద్దయెత్తున దాడులు జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం న్యాయం చేసిందని బీజేపీతో కలిశారో సమాధానం చెప్పాలన్నారు. గతంలో వాజ్‌పేయి కాలంలోనూ ఇలాగే చేసి పదేళ్లపాటు అధికారానికి దూరమయ్యారని, ఇప్పుడూ అదే పరిస్థితి వస్తుందని, బీజేపీతో కలవడం టీడీపీకి నష్టమని హెచ్చరించారు.
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, ఈసారి రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలకు స్థానం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేండ్లలో ప్రతిపక్షాలను కలవని ఏకైక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని, అతను అధికారంలో ఉండటానికి ఏ మాత్రమూ అర్హత లేదని తెలిపారు. ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు బీజేపీతో కలిశారో ప్రజలకు చెప్పాలని కోరారు. మాజీ ఎంపీ పి మధు మాట్లాడుతూ.. దేశం బాగుపడాలంటే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌ అధికారంలోకి రాకూడదని అన్నారు. వీరంతా కలిసి దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని పేర్కొన్నారు.
ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలీ మాట్లాడుతూ.. మోడీ పాలనలో భారత జాతికి ప్రమాదం వచ్చిందని అన్నారు. చంద్రబాబు ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానని చెప్పినా కనీసం ఒక్క భవనం కూడా కట్టలేదని, జగన్‌ అయితే అనవాళ్లు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు పార్లమెంటు అభ్యర్థి జంగాల అజయ్, మంగళగిరి సీపీఐ(ఎం) అభ్యర్థి జొన్నా శివశంకరరావు, తాడేపల్లి మాజీ సర్పంచ్‌ డి శ్రీనివాసకుమారి, ఆవాజ్‌ రాష్ట్ర నాయకులు చిస్తీ తదితరులు మాట్లాడారు. ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయలేదన్నారు. ఇండియా వేదిక అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ఈ సభల్లో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, వి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, కాంగ్రెస్‌ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వి సంజీవరెడ్డి, సీపీఐ ఏపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

]]> క్యాన్సర్‌ గుప్పెట్లో భారత్‌ https://navatelangana.com/india-is-in-the-grip-of-cancer/ Wed, 08 May 2024 20:56:29 +0000 https://navatelangana.com/?p=286664 India is in the grip of cancer– ఈ వ్యాధి ప్రబలటానికి కారణాలేంటీ..?
– రెండు దశాబ్దాల్లో రోగుల సంఖ్య పైపైకి.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
క్యాన్సర్‌ పరిశోధన, నివారణ, చికిత్స రంగంలో సైన్స్‌ అభివద్ధిని సాధించినా..భారీ సంఖ్యలో ప్రజలు ఆ వ్యాధి బారిన పడుతూనే ఉన్నారు. ఈ విషయాలు బెంగళూరులోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌లో బయటపడ్డాయి. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో క్యాన్సర్‌ కేసుల పెరుగుదలను ధ్రువీకరిస్తూ.. రాబోయే కాలంలో దాదాపు 12 శాతం పెరుగుతాయని అంచనా వేయటంతో..సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ముంబయి : భారత్‌లో వైద్యం అందనంత ఖరీదైపోతోంది. గతంలో ఏ జబ్బు వచ్చినా..సర్కారు దవాఖానాకే వెళ్లేవారు. కానీ ఇపుడు ప్రయివేట్‌ వైద్యశాలలకు పాలకులు వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ వైద్యం అందించలేమన్నట్టుగా చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి మరెన్నో కారణాలతో.. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. అపోలో హాస్పిటల్స్‌ గత నెలలో విడుదల చేసిన ఒక నివేదికలో ”ప్రపంచంలోనే భారత్‌ క్యాన్సర్‌ రాజధాని”గా మారిందని పేర్కొందంటే.. వ్యాధి ఏవిధంగా ప్రబలుతుందో పరిశీలిస్తేనే భయమేస్తోంది.
ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రీ-డయాబెటిక్‌..
ప్రస్తుతం భారతీయుల్లో ముగ్గురిలో ఒకరు ప్రీ-డయాబెటిక్‌తో బాధపడుతుండగా, ముగ్గురిలో ఇద్దరు ప్రీ-హైపర్‌టెన్సివ్‌తో బాధపడుతున్నారు. 10 మందిలో ఒకరు డిప్రెషన్‌ సమస్యతో జీవిస్తున్నారని నివేదిక పేర్కొన్నది. క్యాన్సర్‌, డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, హృదయ సంబంధ వ్యాధులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు వంటి దీర్ఘకాలిక పరిస్థితులు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నది.
….దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ప్రొఫెషనల్‌ ప్రఫుల్‌ రెడ్డి (49), ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. రెండేండ్ల క్రితం క్యాన్సర్‌గా నిర్ధారణ అయినప్పటి నుంచి దాని వ్యాప్తిని ఆపడానికి టార్గెట్‌ థెరపీ, కీమోథెరపీ, రేడియేషన్‌ చేయించుకుంటున్నాడు. వాంతులు, తలనొప్పి, అల్సర్‌లు వంటి దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నాడు. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వైద్యులు మందులు ఇస్తున్నారు అయితే చికిత్సకు క్యాన్సర్‌ కణాలు కట్టడి కాకపోతే ఒక ఊపిరితిత్తుల మొత్తం లోబ్‌ను తొలగించాల్సి రావచ్చని వైద్యులు చెబుతున్నారని రెడ్డి పేర్కొన్నారు. – కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో, 12 ఏండ్ల అమ్మాయి దీప్తి కిడ్నీలను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్‌ విల్మ్స్‌ ట్యూమర్‌కు చికిత్స పొందుతోంది. ”ఆమె ప్రస్తుతం రేడియేషన్‌ థెరపీలో ఉంది, దీని వల్ల ఆమె చర్మం దెబ్బతినడం, జుట్టు రాలడం వంటి దుష్ప్రభావాలకు గురైందని ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుడు పేర్కొన్నారు.
చెస్ట్‌ క్యాన్సర్‌ ఎలా వేళ్లూనుకుంటుందంటే..
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ యొక్క సగటు వయస్సు భారతదేశంలో 59, అయితే చైనాలో 68 యునైటెడ్‌ స్టేట్స్‌లో 70 కింగ్‌డమ్‌లో 75 సంవత్సరాలకు క్యాన్సర్‌ బారిన గురవుతున్నారు భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక మిలియన్‌ కొత్త క్యాన్సర్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి, అందులో 4శాతం మంది పిల్లలే. దేశంలో ముఖ్యంగా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ ఆంకాలజీ సౌకర్యాల కొరత ఉందని వైద్యులు, ఇతర ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.”చాలా ప్రయివేట్‌ ఆస్పత్రులు పీడియాట్రిక్‌ ఆంకాలజిస్టులకు శిక్షణనిచ్చాయి, అయితే ఇది వైద్య కళాశాలలు లేదా ప్రభుత్వ ఆస్పత్రులలో ఉండకపోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం 41శాతం మాత్రమే పిల్లల ఆంకాలజీ విభాగాలను కలిగి ఉన్నాయని ముంబైలోని పిల్లల ఆస్పత్రిలో పీడియాట్రిక్‌ ఆంకాలజిస్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ రుచిరా మిశ్రా అన్నారు.క్యాన్సర్‌కు రెగ్యులర్‌ స్క్రీనింగ్‌ అవసరం. తల్లిదండ్రులు చికిత్సను భరించలేనందున వల్ల రెగ్యులగా చికిత్స అందక పోవడం వల్ల కూడా ఈ కేసులు పెరుగుతున్నాయని, ఆరోగ్య నిపుణులు తెలిపారు
నివారణ చర్యలకే ప్రాధాన్యం..
”క్యాన్సర్‌ పెరుగుతోందనడంలో సందేహం లేదు. ప్రతిఒక్కరూ నివారణ చర్యకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఉదాహరణకు ప్రభుత్వం మొదటి చర్యగా స్క్రీనింగ్‌ను ప్రోత్సహించాలి. ఆర్థిక రక్షణను అందించడానికి, క్యాన్సర్‌ కోసం స్క్రీనింగ్‌, నివారణ సేవలను విస్తరించడానికి పాలసీల అవసరం కూడా ఉంది,” అని ఫోర్టిస్‌ మెమోరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మెడికల్‌ ఆంకాలజీ సీనియర్‌ డైరెక్టర్‌ నితేష్‌ రోహత్గి అన్నారు.
భారతదేశంలో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ కోసం స్క్రీనింగ్‌ ప్రోగ్రామ్‌ ఉంది, అయితే జాతీయ డేటా ప్రకారం, కనీసం 70శాతం మంది మహిళలు పరీక్షించబడాలని డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసినప్పటికీ, స్క్రీనింగ్‌ రేట్ల 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.
”నేను దీనిని అంటువ్యాధి అని పిలవడం ఇష్టం లేదు, అయితే 2020తో పోలిస్తే 2040 నాటికి క్యాన్సర్‌ కేసులు రెట్టింపు అవుతాయి. వ్యక్తిగతంగా, సామాజికంగా, ప్రభుత్వ స్థాయిలో చాలా వరకు వాటిని నివారించవచ్చు” అని ఢిల్లీలోని క్యాన్సర్‌ కేర్‌ డైరెక్టర్‌ అసిత్‌ అరోరా అన్నారు . మోడీ సర్కార్‌ తెచ్చిన పథకాలు రోగులకు ఏమాత్రం ఉపయోగపడలేదన్న వాదన వినిపిస్తోంది. పీఎం కేర్‌కు ఫండ్స్‌ అడిగితే.. ఆ వివరాలివ్వలేమని కేంద్రం బుకాయించింది. ఇక ఆయుష్మాన్‌ భారత్‌ పేరిట వైద్యం అందిస్తామన్నా..అది కాస్త ప్రయివేట్‌ ఆస్పత్రులకు, బీమా సంస్థలకు ప్రయోజనం చేకూరేలా మలిచింది. దీంతో దేశ ప్రజలు రోగాల బారిన పడుతుంటే..పెద్దలకు మేలు చేసే ప్రయోజనాల గురించే బీజేపీ సర్కార్‌ తర్జన భర్జనపడుతోందని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అధ్యయనం ప్రకారం..
వార్షిక క్యాన్సర్‌ కేసుల సంఖ్య దాదాపు 2020లో దాదాపు 1.4 మిలియన్ల నుంచి 2025 నాటికి 1.57 మిలియన్లకు పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది. రొమ్ము, గర్భాశయం, అండాశయ క్యాన్సర్‌ మహిళలపై ప్రభావితం చూపితే, పురుషులలో ఊపిరితిత్తుల, నోటి క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. రాబోయే రెండు దశాబ్దాలలో ”క్యాన్సర్‌ కేసులు, మరణాలు మరింత పెరుగుతాయని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు శ్రీనాథ్‌ రెడ్డి భావిస్తున్నారు” వద్ధాప్యం, అనారోగ్యకరమైన ఆహారం, క్యాన్సర్‌ కారకాలతో నిండిన వాయు కాలుష్యానికి గురికావడం, వాతావరణ మార్పు వల్ల కూడా ఈ కేసులు పెరుగుతు న్నాయి. అపోలో హాస్పిటల్స్‌ నివేదిక ప్రకారం ఇతర దేశాల కంటే భారతదేశంలోని కొన్ని క్యాన్సర్లు తక్కువ వయస్సున్న వారిపై ప్రభావం చూపుతున్నాయి.

]]>