Nizamabad Archives - https://navatelangana.com/category/nizamabad/ Fri, 18 Apr 2025 11:21:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Nizamabad Archives - https://navatelangana.com/category/nizamabad/ 32 32 ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.. https://navatelangana.com/the-government-supports-the-health-of-the-people/ Fri, 18 Apr 2025 11:21:31 +0000 https://navatelangana.com/?p=548632
The government stands by the health of the people.– ఎమ్మెల్యే కృషి ఫలితంగా సీఎం రిలీఫ్ ఫండ్ రూ.52,500 మంజూరు: దన్నూర్ దేవిదాస్ పటేల్

నవతెలంగాణ – మద్నూర్
ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని దేవిదాస్ పటేల్ అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషి ఫలితంగా మద్నూర్ మండలంలోని దన్నూరు గ్రామానికి చెందిన తాలే లక్ష్మణ్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా రూ.52,500 చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేసినట్లు తెలిపారు. ధన్నూరు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ కుటుంబంకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రజలు అనారోగ్యాల ద్వారా హాస్పిటల్లో వేలాది రూపాయలు ఖర్చులు పెట్టుకున్న వాటికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృషి చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా నిధులు మంజూరు చేయిస్తూ ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో సాయి పటేల్ పెద్ద తడగూర్ కొండ రాజు ఈరన్న తదితరులు పాల్గొన్నారు.
]]>
జిల్లా జడ్జి ని సన్మానిచిన న్యాయవాదులు  https://navatelangana.com/lawyers-honored-with-district-judge/ Fri, 18 Apr 2025 11:18:01 +0000 https://navatelangana.com/?p=548629
Lawyers who honored the District Judgeనవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా జిల్లా న్యాయాధికార సేవా సంస్థ సమావేశం హాల్లో న్యాయవాదులు శాలువాలు కప్పి నెమెంటులు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల్లో జిల్లా ప్రజలతో మమేకమై న్యాయ సేవలు అందించడం అభినందనీయమని రాబోయే రోజుల్లో ప్రజలకు సత్వర న్యాయం అందించిన కృషి చేయాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, డిఫెన్స్ కౌన్సిల్స్ రాజ్కుమార్ సుబేదార్,  ఉదయ్ కృష్ణ, ప్రమోద్,   ప్రమోద్, విష్వక్ సేన్,  రవిబాబు, ఖలీద్,  మహిపాల్, డి ఎల్ ఎస్ ఏ సిబ్బ పర్యవేక్షకురాలు శైలజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
]]>
ఖానాపూర్ రోడ్ లో అగ్నిమాపక వారోత్సవాలు.. https://navatelangana.com/firefighters-on-khanapur-road/ Fri, 18 Apr 2025 11:16:48 +0000 https://navatelangana.com/?p=548625
Firefighters' Week celebrations on Khanapur Road..నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 5వ రోజు సందర్భంగా శ్రీ ఆర్కే ఇండస్ట్రీస్ ఖానాపూర్ రోడ్ లో అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు, యాజమాన్యానికి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి క్లుప్తంగా నిజామాబాద్ ఫైర్ అధికారి నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగరావు మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రతి ఒక్కరు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరుగుతే 101కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. అలాగే స్వతగా అనుకోని పరిస్థితులలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని నివారించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనది మనం రక్షించుకోవడమే కాకుండా ఇతరులను కూడా రక్షించే అవకాశం ఉంటుందన్నారు. ఇందులో 50 మంది కార్మికులు పాల్గొనగా, అగ్గిమాపక అధికారి శ్రీపి నరసింహారావు, మా సిబ్బంది కే సుమన్, బి కిరణ్ కుమార్, ప్రశాంత్ గౌడ్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

]]>
జీవన్ రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. https://navatelangana.com/jeevan-reddys-mouth/ Fri, 18 Apr 2025 11:13:51 +0000 https://navatelangana.com/?p=548617
Jeevan Reddy.. keep your mouth shut..– పోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
– మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పేరుగాంచిన పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గంలో తిరిగానివ్వం అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పేర్క శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ లో  పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ కనీసం అవగాహన లేని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్యే పోచారం పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీవన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవలన్నారు. బీఆర్ఎస్ పార్టీకే పెద్ద శని అని అన్నారు. జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మూడో స్థానంలో నిలసి ఆర్మూర్ ప్రజల మద్దతు లేని నాయకుడుగా మిగిలవన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు  నీ బాగోతం తెలియక ఇంక పార్టీలో ఉంటున్నావు. నీలాగా మా నాయకుడు పోచారం అవినీతి చేయలేదనీ  మండి పడ్డారు. రాష్ట్రంలోనే అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపించాడు అన్నారు. మా ఎమ్మెల్యే పోచారం మచ్చలేని నాయకుడని ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండే నాయకుడని ఆయన తెలిపారు. మీలాగా భూములు కబ్జా చెయ్యలేదని, హత్య ఆరోపణలు లేవని, ఆర్టీసీ కాంప్లెక్స్ లో కరెంట్ బిల్లు కట్టకుండా అవినీతి చేయలేదని తెలిపారు. రాష్ట్రంలోని డబుల్ బెడ్ రూమ్ నిర్మాణంలో బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందన్నారు. మొదట ప్రతి నియోజకవర్గానికి 1200 ఇండ్లు , మొత్తం 5 వేల ఇండ్లు ఇస్తే కనీసం ఆర్మూర్ నియోజకవర్గంలో 1000 ఇండ్లు కట్టలేని ఎమ్మెల్యేగా నిధులు నిలిచిపోయామన్నారు. అదే బాన్సువాడలో 12 వేల ఇండ్లు నిర్మాణం చేసి ఆదర్శంగా  నిలిచిన పోచారం అన్నారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, మాజీ ఎంపీపీ పాల్త్య  విఠల్,  మాజీ జెడ్పి కోఆప్షన్ నెంబర్ మాజీద్, మండల ఎంపిటిసి ఫోరం మాజీ కన్వీనర్ కంది మల్లేష్,  నాయకులు చుంచు సాయిలు, మాజీ సర్పంచ్లు సాయిలు, రాము, నాయకులు ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
]]>
6వ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ.. https://navatelangana.com/heavy-theft-within-the-6th-police-station/ Fri, 18 Apr 2025 11:12:09 +0000 https://navatelangana.com/?p=548615
Massive theft in the 6th police station area..– 13 తులాల బంగారం, 40 తులాల వెండి అపహరణ

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మిస్బావుల్ రెహ్మాన్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. పడక గదిలో ఉన్న బీరువాను ధ్వంసం చేసి అందులోని 13 తులాల బంగారం, 40 తులాల వెండితోపాటు నగదును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ గురువారం రాత్రి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఉదయం మిస్బాహుల్ రెహమాన్ కొడుకు ఇంటికి వచ్చేసరికి గేట్ తాళం వేసింది వేసినట్టు ఉండగా ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆనవాళ్ళు, వేలిముద్రలు సేకరించారు. నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీల ఘటనలు విపరీతంగా పెరిగాయి.
]]>
జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం  https://navatelangana.com/start-with-sorghum-purchasing-centers/ Fri, 18 Apr 2025 11:10:42 +0000 https://navatelangana.com/?p=548609
Sorghum purchasing centers openedనవతెలంగాణ – నిజాంసాగర్ 
ప్రాథమిక వ్యవసాయా సహకార సంఘం అచ్చంపేట్ పరిధి లోని  వెల్గనూరు గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సకాలంలో జొన్నలను తేమశాతం 14 శాతం మించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన సూచించారు. క్వింటాలుకు రూ.3371 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఎకరానికి 8 క్వింటల జొన్నలు కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, ఆనంద్ కుమార్, వెంకటేశ్వర్లు, సంఘ సీఈవో సంగమేశ్వర్ గౌడ్, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
]]>
బ్లేడ్ తో దాడి చేసిన వ్యక్తి ఫోటోలు విడుదల https://navatelangana.com/release-photos-of-the-person-who-attacked-with-the-blade/ Fri, 18 Apr 2025 11:09:35 +0000 https://navatelangana.com/?p=548607
Photos of the man who attacked with a blade released– గుర్తిస్తే సమాచారం అందించండి: రైల్వే ఎస్సై సాయి రెడ్డి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఈనెల 12న ఓ వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన అనుమానితుని కోసం గాలిస్తున్నట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బ్లేడ్ తో దాడి చేసిన వ్యక్తి ఫోటోలను రైల్వే పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఈ నెల 12న నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి కు చెందిన కుంచెపు బాబు అనే వ్యక్తి నిజామాబాదు రైల్వేస్టేషన్ లో బుకింగ్ కౌంటర్ వద్ద పడుకొని ఉండగా గుర్తు తెలియని వ్యక్తి అతనితో గొడవపడ్డాడు. అంతేకాకుండా బ్లెడ్ సాయంతో బాబు మెడపై గాయపర్చాడు. బాబు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈవిషయమై ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రైల్వే పోలీస్ నిజామాబాదు కు పంపారు. రైల్వే పోలీసులు కూడా అతడిపై కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ ఇంత వరకు దొరకలేదు. బాబు పై దాడి చేసిన వ్యక్తి యొక్క ఫోటోలను విడుదల చేశారు. అతడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే ఈ నంబర్ కు 8712658591 సమాచారం ఇవ్వాలని ఎస్సై సాయిరెడ్డి కోరారు.

]]>
వీడీపీలపై కఠిన చర్యలు తీసుకోవాలి https://navatelangana.com/strict-action-should-be-taken-on-vdps/ Fri, 18 Apr 2025 11:07:54 +0000 https://navatelangana.com/?p=548603
Strict action should be taken against VDPs– ఈ నెల19 న కళ్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ ల ఆగడాల పై రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తాళ్ళ రాంపూర్ లో కల్లుగీత కార్మికులను సాంఘీక బహిష్కరణ చేసి, గౌడ మహిళలను గుడిలో నుండి గెంటివేసి, ఈత చెట్లను తగులబెట్టిన వీడిసి లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, వీడిసి లను నిషేధించాలి అని తెలంగాణ కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్ రాములు,  జిల్లా నాయకులు కోయేడి నర్సింహాలు గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇటీవల బీడీసీలు గౌడ గీత కుటుంబాలను కుల బహిష్కరణ చేయడం గౌడ మహిళలను గుడిలోకి రానివ్వకుండా అవమానపరచడం మీరంది అని ప్రశ్నిస్తే గీసే గీతకార్మికులకు ఆధారమైన ఈతవనాన్ని తాగులపెట్టివ్వడం లాంటి వి డి సి ల ఆగడాలు సభ్యసమాజం తల దించుకునే విధంగా గ్రామాలలో వృత్తులపై ఆధారపడి బ్రతికే బడుగు బలహీనులపై వీరి సమాంతర ఆరాచక పాలన నడుస్తుంది అని తెలిపారు. ఈ సంఘటన కు కారకులైన వి డి సి సభ్యులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వారి పై చర్యలు తీసుకోలేదు. దాని విషయమై అన్ని కుల వృత్తి, బీసీ ఎస్సీ, ఎస్టీ, సంఘాలు,రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి సమిష్టి నిర్ణయం తో ఐక్యంగా ఉద్యమించాలని కే జి కే ఎస్  శనివారం అనగా 19-4-2025 నాడు, ఉదయం 10.30 కు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి అందరు సకాలంలో హాజరుకాగలరని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు తెలిపారు.
]]>
పోలీస్ శాఖ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలి https://navatelangana.com/the-police-department-should-follow-the-rules/ Fri, 18 Apr 2025 11:05:04 +0000 https://navatelangana.com/?p=548591
Police department regulations must be strictly followed.– పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా ప్రజలు పోలీస్ శాఖ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదు, ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్  ఆద్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. ఎక్కువశబ్దంతో డి.జే లను ఏర్పాటుచేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డి.జే ల సౌండ్ సిస్టం పూర్తిగా నిషేదం గలదు. పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డి. జేలు. సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేటు పరిధిలో నిషేదం గలదు. ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్వీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి.
500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమనికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ గారి అనుమతి తీసుకోవాలి. మాల్స్, సినిమా ధియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటి నిబంధనలు తప్పనిసరి పాటించాలి. ప్రతీ ఒక్కరు క్యూ పద్దతిని తప్పనిసరి పాటించాలి. డ్రోన్ల వాడకం వలన ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపద్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరగుతుందని, ఈ డ్రోన్ల ఉపయోగం వలన జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకి విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ,ఎవరయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదలచినచో ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు మరియు ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాస్ పోర్టు, వీసా, రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు అనదికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ,అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కావున జిల్లా ప్రజలు గల్ఫ్ ఏజెంట్లకు తమ ఇల్లు అద్దెకు ఇచ్చే ముందుజాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అటువంటి వారు అద్దెకు వస్తే ముందస్తుగా వారి సమాచారాని సంబంధిత పోలీసు స్టేషన్ వారికి తెలియజేయండి. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.నిజామాబాద్ జిల్లాలో ఎ (పెద్దలు) సర్టిఫికేట్ పొందిన సినిమాలను మైనర్లు చూడటానికి ధియేటర్లను అనుమతించరాదు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులు నిజామాబాద్ వీదుల్లో చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల పట్ల అసభ్యకరమైన వికృత మరియు అసభ్యకరమైన ప్రవర్తన ను ప్రదర్శిస్తున్నట్లు నివేధికలు సూచిస్తున్నాయి. సాధారణంగా రోడ్డు వినియోగదారులకు, ముఖ్యంగా మహిళలు పిల్లలకు చికాకు, ఆటంకము కలిగించి ప్రజా ప్రశాంతతకు దారితీస్తుంది. కావున బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేయడం జరిగింది. నిబంధనలను ఎవ్వరయినఅతిక్రమించినయెడల వారిపై సంబంధిత చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లకు / ఎస్.ఐ లకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్  అధికార ఉత్తర్వులను జారీచేయడం జరిగింది. ఇట్టి ఉత్తర్వులు ఏప్రిల్ 16వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుంది. కావున ప్రజలందరూ సంబంధిత పోలీస్ అధికారులకు సహకరించగలరు ప్రజలకు పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
]]>
సైలెన్సర్లను ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు  https://navatelangana.com/traffic-police-who-destroyed-silencers/ Fri, 18 Apr 2025 11:01:36 +0000 https://navatelangana.com/?p=548593
Traffic police destroy silencers– మైనర్లకు వాహనాలు నడపడానికి ఇస్తే జైలుకే వాహన రిజిస్ట్రేషన్ రద్దు 

– ఇక నుండి రోజు జిల్లా లో మైనర్ స్పెషల్ డ్రైవ్
– ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలి 
– ఆటో కిరువైపులా సీట్లను తొలగించాలి 
– లేదంటే చెల్లెలు తప్పవు 
– నిజామాబాద్ ఏ.సీ.పీ. నారాయణ వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాలు సైలెన్సర్లతో శబ్దకాలుష్యం చేస్తున్న వాహనాలపై సీపీ సాయిచైతన్య ప్రత్యేక దృష్టి పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనదారులపై కోరాడ ఝులిపించారు. అందులో భాగంగానే ద్విచక్ర వాహనాలకు మోడీఫైడ్ సైలెన్సర్లు అమర్చి నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. మార్చి ఆరవ తేదీన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 240 సైలెన్సర్లను ధ్వంసం చేయడం జరిగిందని ట్రాఫిక్ ఏసిపి నారాయణ తెలిపారు. దీంట్లో భాగంగా ఇటీవల వాహనాలకు తొలగించిన సుమారు 200 సైలెన్సర్లను శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్చౌరస్తా వద్ద వరుసగా పేర్చి రోడ్డురోలర్ తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దంగాల సైలెన్సర్లను అమర్చి నడిపితే చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడమే కాకుండా అమర్చిన మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై బైక్లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణ హెచ్చరిస్తున్నారు. అలాగే మైనర్లకు వాహనాలు నడపడానికి ఇస్తే ఇక జైలు తప్పదని, వాహనాలు ఇస్తే వాహన రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తామని ఇకనుండి రోజు జిల్లాలో మైనర్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకు మైనర్లు వాహనాలు నడుతూ పట్టుబడితే, పోలీసు వారే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు వేసేవారు, మైనర్ డ్రైవింగ్ ను అరికట్టేందుకు, ఇకపై మైనర్లు వాహనం తీసుకుని రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుచన్నవి, ఇకముందు నుండి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తు దొరికితే, అట్టి మైనర్ ను తల్లిదండ్రులు లేదా యజమాని ఎవరైనా ఎం వి యాక్ట్-2019 అమెండ్మెంట్ సెక్షన్ 199-ఏ ప్రకారము, సంబంధిత కోర్టులలో హాజరుపరచబడును, వాహన యజమానికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 25 వేల రూపాయల వరకు జరిమానా విధించబడుతారు. మైనర్ల పట్టుబడిన వారికి 25 సంవత్సారాల వయస్సు నిండినంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ కు అర్హడు కాడు, అట్టి వాహనం యొక్క రిజిస్ట్రేషను 1 సంవత్సారం వరకు రద్దు చేస్తామని తెలిపారు.కావున ఎవరు కూడా మైనర్లకు వాహనాలు నడపడానికి ఇవ్వరాదని తెలియజేశారు. అదేవిధంగా ఆటో నడిపే ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ఆటో కిరువైపులా సీట్లను స్వయంగా తొలగించుకోవాలన్నారు లేని యెడల చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో కురువైపులా సీట్లు ఉండడంతో ఎక్కువ మొత్తంలో ప్రయాణికులను కూర్చోబెట్టుకొని నడపడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందందున తొలగించాలని సూచించారు. ఇకమీదట నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ లో నిర్వహిస్తామని సూచించారు కావున ప్రజలందరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐలు ప్రసాద్, శేఖర్, ట్రాఫిక్ ఎస్ఐ సుమన్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
]]>
బారడి పోచమ్మ బోనాల పండుగ https://navatelangana.com/baradi-pochamma-bonala-festival/ Fri, 18 Apr 2025 10:56:46 +0000 https://navatelangana.com/?p=548584
Baradi Pochamma Bonala festival..నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు బారడి పోచమ్మ వార్షికోత్సవ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. బారడి పోచమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామంలోని ప్రజలంతా ఇంటింటా నైవేద్యాలు బోనాలు సమర్పించారు. బారడి పోచమ్మ వార్షికోత్సవానికి బాజా భజంత్రీలతో మొట్టమొదట బోనాల నైవేద్యం ధూప దీప నైవేద్య పూజారిగా సేవలందిస్తున్న సందూర్వార్ శంకర్ ఇంటి నుండి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ ఉత్సవాలకు ఆలయ భూమి యజమాని తూమువార్ రామ్ కిషన్, నైవేద్యాలు సమర్పించే భక్తుల కోసం టెన్త్ ల సౌకర్యం ఏర్పాటు చేయించారు. వార్షికోత్సవానికి తానంటూ ముందుంటూ కావలసిన ఏర్పాట్లు ఖర్చులు సమర్పించినట్లు తెలిపారు. బారడి పోచమ్మ అంటే ప్రతి ఇంటి కుటుంబీకులు నైవేద్యాలతో బోనాలతో ఆలయానికి చేరుకొని నైవేద్యాలు సమర్పించారు. బారడి పోచమ్మ వార్షికోత్సవం సందర్భంగా ఇంటింట పండుగ జరుపుకున్నారు.
]]>
దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు https://navatelangana.com/a-case-against-the-person-who-tried-to-theft/ Thu, 17 Apr 2025 13:16:40 +0000 https://navatelangana.com/?p=548258
నవతెలంగాణ గాంధారి
గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామం లో ఈరోజు ఉదయం అందాజ 08.00 గంటల సమయంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఇంటి వెనకాల కాలీ స్థలంలో ట్రాక్టర్ కి సంబంధించిన పాత ఇనుప సమానులు పెట్టి ఉండగా వాటిని బిచ్కుంద మండలానికి చెందిన కడమంచి రమేష్ అనే వ్యక్తి  దొంగతనానికి ప్రయత్నించగా వెంటనే సప్పుడు రావడంతో దొంగ దొంగ అరవగా,  గ్రామస్తులు దొంగ ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వగాకేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
]]>