Nizamabad Archives - https://navatelangana.com/category/nizamabad/ Wed, 08 May 2024 15:35:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Nizamabad Archives - https://navatelangana.com/category/nizamabad/ 32 32 దుకాణ సముదాయాల బందుపై పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం https://navatelangana.com/the-chief-minister-expressed-his-anger-at-the-closure-of-shop-complexes/ Wed, 08 May 2024 15:34:40 +0000 https://navatelangana.com/?p=286427 నవతెలంగాణ ఆర్మూర్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమం సభకు ముందస్తుగా దుకాణ సముదాలయాలను బందు చేసినారు. దీంతో జిల్లా సిపి, కలెక్టర్ ,స్థానిక ఏసీపీ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

]]>
బైక్ ర్యాలీ… https://navatelangana.com/bike-rally/ Wed, 08 May 2024 15:08:23 +0000 https://navatelangana.com/?p=286408 నవతెలంగాణ – మోపాల్ 

బుదువారం రోజున నిజామబాద్ గడ్డపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రోడ్ షోకి జిల్లా  కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి ఆధ్వర్యంలో మంచిప్ప, బైరాపూర్, అమ్రాబాద్ కల్పొల్, గ్రామాలకు సంబంధించిన సుమారు 1000 బైకులతో  ర్యాలీగా రేవంత్ రెడ్డి రోడ్ షో కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. ఈ  కార్యక్రమంలో బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మోహన్ కేతవత్, ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో బయలుదేరారు

]]>
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు https://navatelangana.com/brs-leaders-joined-congress-8/ Wed, 08 May 2024 15:05:53 +0000 https://navatelangana.com/?p=286401
నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు బుధవారం కాంగ్రెస్లో చేరారు. కన్నాపూర్ తాండ ఉప సర్పంచ్ సర్మన్ నాయక్, ఉప్పల్వాయి మాజీ సర్పంచ్ అరవింద్ గౌడ్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అన్నారం, మద్దికుంట, గొడుగు మర్రి తండ మాజీ ఉపసర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, కామెల్ల నరేందర్, రవి నాయక్, నాయకులు బండి రవి, కిష్టారెడ్డి, శివరాజు, సంతోష్ రెడ్డి, ముదాం బాలయ్య తోపాటు పలువురు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
]]>
అమ్మ ఆదర్శ కమిటిలో పనులు చేయించాలి.. https://navatelangana.com/amma-should-do-the-work-in-adarsh-u200bu200bcommittee/ Wed, 08 May 2024 14:58:34 +0000 https://navatelangana.com/?p=286380

నవతెలంగాణ – డిచ్ పల్లి

అమ్మ ఆదర్శ కమిటి లో మహిళ సంఘాలతో పనులు చేయించాలని, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం ను సమయాను సారం అందజేసే విధంగా చూడాలని ఎపిడి రవీందర్ అన్నారు.బుదవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం లో యూనిఫాం తయారు చేసే వారితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం ఇందల్ వాయి మండలం లో 3399 మంది పిల్లలు వున్నారని దిని లో  బాయ్& గర్ల్ కి కుట్టడానికి ఒక జాతకు  50 రూపాయలు అందజేస్తామని తెలిపారు. ఎవరికైన  కట్టింగ్ చేసి ఇవ్వడానికి నిజామాబాద్ దేవేందర్ వస్తారని,ఇది మంచి అవకాశమని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కట్టింగ్ వచ్చిన వారు కాట్టింగ్ చేసి ఇవ్వలని వివరించారు. డ్రేస్ తయారు చేసే వారు  ఒకేదగ్గరకు చేరి సెంటర్ లోనే అందురు కలిసి తయారు చేసే విధంగా చుసుకోవలని పేర్కొన్నారు.పాఠశలల్లో అమ్మ ఆదర్శ కమిటి లో కూడా పనులను అప్పగించి చేయించే విధంగా చొరవ చూపాలని కోరారు.వి. ఓ. ఏ లు  లోకస్ ఆప్ ద్వారా నమోదు చేస్తున్న సంఘం సభ్యుల వివరాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో డిపిఎం సాయిలు,ఇందల్ వాయి మండల ఎపిఎం సువర్ణ,సిసి ఉదయ్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
]]>
అంత్యక్రియలకు అర్థిక సహాయం అందజేత.. https://navatelangana.com/provides-financial-support-for-funerals/ Wed, 08 May 2024 14:57:48 +0000 https://navatelangana.com/?p=286373 – నీరు పేద కుటుంబానికి అదుకోవాలని వెడుకోలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన కలిగోట లక్ష్మి 55 బుధవారం మృతి చెందింది. అమే అంత్యక్రియలకు  ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఉన్న ఒక్కగానొక్క కూతురు ఏమి చేయ్యలేని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న గ్రామంలో ఉన్న(రజక) చాకలి కుల సంఘాల సభ్యులు చందాలు వేసుకుని లక్ష్మీ అంత్యక్రియలకు సహకరించారు. మృతురలి కూతురు వనజా కు ఉండటానికి ఎమీ లేకపోవడం,పని,బట్టలు దోరికినప్పుడు బట్టలను ఉతుకుతు బతుకు బండి నడిచింది. తండ్రి, తల్లి లేక అనాథగా మిగిలిపోయింది. ప్రస్తుతం తిర్మాన్ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వెనకాల ఒక చిన్న గుడిసె వేసుకొని జీవిస్తుంది. ఎవరైనా దాతలు ఆమె పరిస్థితిని ముందుకు వచ్చి అర్థిక సహాయం చేసి ఒక నీరు పేద కుటుంబానికి అండగా ఉంటు సహకరించాలని పలువురు వేడుకుంటున్నారు.
]]>
ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రేస్,బీజేపీ లకు ఎన్నికల్లో సురుకు పెడదాం: ప్రశాంత్ రెడ్డి https://navatelangana.com/prashanth-reddy-lets-give-the-election-to-the-congress-bjp-who-have-not-fulfilled-their-promises/ Wed, 08 May 2024 13:28:15 +0000 https://navatelangana.com/?p=286278
– రైతు బిడ్డను ఆశీర్వదించండి మీ తరపున పోరాటం చేస్తా: ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలోని స్థూపం వద్ద ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని,బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేవని, ప్రజలు వారికి ఓట్లు వేసి మోసపోయారని అన్నారు.నేను రైతు బిడ్డను అని రైతు కష్టాలు తెలిసిన వాడినని అన్నారు.రైతులకు రైతు బంధు రాలేదని,పెళ్ళి చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం రాలేదని,కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వలేదని ప్రజలను కాంగ్రేస్ పార్టీ  మోసం చేసిందని అన్నారు. కాంగ్రేస్ పార్టీ,బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేవని నన్ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి హామీలు అమలయ్యే వరకు ప్రజల తరపున పోరాటం చేస్తానని అన్నారు.అలాగే బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…ఎంపీగా అరవింద్ గెలిచి ఐదు సంవత్సరాలు అయిన పసుపు బోర్డు తేలేదని,ఏర్గట్ల వైపు కన్నెత్తి చూడలేదని,ఒక కోటి రూపాయల పని కూడా ఏర్గట్లకు చేయలేదని అన్నారు.కాంగ్రేస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల్ నుండి వచ్చి మీ సమస్యలు వినలేడని, బాజిరెడ్డిని గెలిపిస్తే ఇద్దరం కలిసి ప్రజల తరపున కొట్లాడుతాం అని అన్నారు.
డిసెంబర్ 9 వ తేదీన గెలవగానే ఆరు గ్యారంటీల మీద సంతకం పెడతామని,100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని,అది చేయకపోగా… మళ్ళీ ఆగస్టు 15 లోగా రైతురుణమాఫీ అమలు చేస్తా అని  దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మరి అబద్దాలు ఆడుతున్నాడని,ఆగస్టు 15 వరకు ఎంపీ,సర్పంచ్,ఎంపిటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయని,మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా ఆయన ప్రజల మొఖం చూడడని,ప్రజలు మరొక సారి మోసపోయే ప్రమాదం ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైన,రైతు రుణమాఫీ కాలే,రైతు బంధు సక్కగా పడలే, కొత్త పింఛన్లు రాలే,పెండ్లి ఆయిన ఆడపిల్లలకు తులం బంగారం రాలే,చదవుకునే ఆడ పిల్లలకు స్కూటీలు రాలే అని ఎద్దేవా చేశారు.ఇచ్చిన హామీలు అమలు చేయని బీజేపీ కాంగ్రేస్ పార్టీలకు ప్రజలు ఈ ఎన్నికల్లో సురుకు పెట్టాలని అన్నారు.అలాగే మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను గ్రామాల్లోకి తెచ్చిన పనులను కాంగ్రేస్ పార్టీ వారు రద్దు చేయాలని చూస్తున్నారటని,ప్రజల కోసం ఇచ్చిన ఆర్డర్ కాపీలను నకిలీవి అంటున్నారటని,మరి ఆ ఆర్డర్ కాపీలను పట్టుకుని కలెక్టర్ దగ్గరకు పోదాం,నాతో పాటు నలుగురు కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు రండి.అవి నకీలివైతే నేను నా ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తానని సవాల్ విసురుతున్నానన్నారు.ఈ నెల 13 జరిగే ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పూర్ణానందం,ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి,ఎంపిటీసీ జక్కని మధు సూధన్,ఏర్గట్ల పిఏసీఎస్ చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య,మండల ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
]]>
ప్రజలు, రైతులు కేసీఆర్ ను వదులుకొని బాధపడుతున్నారు https://navatelangana.com/people-are-suffering-because-farmers-have-abandoned-kcr/ Wed, 08 May 2024 13:13:44 +0000 https://navatelangana.com/?p=286261
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రజలు, రైతులు కేసీఆర్ ను వదులుకొని బాధపడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చౌట్ పల్లిలో ఉపాధి హామీ పని ప్రదేశంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజరెడ్డి రెడ్డి గోవర్థన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజరెడ్డి రెడ్డి గోవర్థన్ కు  ఇక్కడి ప్రజల కష్టసుఖాలు తెలుసన్నారు.అనుభవం ఉన్న నాయకుడు, ప్రజల మధ్య ఉండే నేత ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పార్లమెంట్ ఎలక్షన్ లు ఉన్నప్పుడే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదన్నారు.ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓట్లు వేశాక  హామీలు అమలు చేస్తారనే గ్యారంటీ లేదని, ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలో  ఒకటి రెండు మినహా వేటిని  అమలు చేయడం లేదన్నారు. ప్రజలు  పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రైతులను, మహిళలను, యువతకు  అనేక హామీలు ఇచ్చారని, ఈ హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలంటే ప్రశ్నిచే కేసీఆర్ సైనికుడు బాజిరెడ్డి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కొంత ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ మారు శంకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
]]>
ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి: ఎంపీపీ ప్రతాప్ రెడ్డి https://navatelangana.com/mpp-pratap-reddy-should-tell-the-congress-party-by-voting/ Wed, 08 May 2024 13:06:35 +0000 https://navatelangana.com/?p=286254
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఎంపీపీ ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారంరోజున మండలంలోని అంజని,శివాపూర్,తలాప్తాండచావనీతాండ,పోచారం,పోచారం తాండ, గ్రామాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు.బీఆర్ఎస్అధినేత కేసీఆర్ పదేళ్ల క్రితం తెలంగాణలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా చేశారన్నారు.రైతుబంధు కింద రూ.15వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంరైతులనుమోసం చేసిందన్నారు.కారుగుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడువిజయ్ దేశాయ్, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కండేరావు పటేల్, సాయ గౌడ్,మహ్మద్,అశోక్ పటేల్,బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
]]>
కేసీఆర్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అందాయి: ఎంపీపీ దశరథ్ రెడ్డి https://navatelangana.com/mp-dasharath-reddy-received-welfare-schemes-in-kcr-government/ Wed, 08 May 2024 12:44:42 +0000 https://navatelangana.com/?p=286233
నవతెలంగాణ – రామారెడ్డి
కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని బుధవారం స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, అన్నారు. మండలంలోని అన్నారం గ్రామ పరిధిలో ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారాన్ని బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కి, ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయక, కాలయాపన చేస్తుందని అన్నారు. తెలంగాణను సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన బి ఆర్ ఎస్ కు మద్దతు తెలుపుతూ, కారు గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు గడ్డం రవీందర్ రెడ్డి, నాయకులు కూడెల్లి బాలరాజు, కుమ్మరి మురళి, పోచయ్య, లక్ష్మణ్, శంకర్, రాములు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
]]>
చికిత్స పొందుతూ వృద్దుడు మృతి https://navatelangana.com/the-old-man-died-while-receiving-treatment-2/ Wed, 08 May 2024 12:39:18 +0000 https://navatelangana.com/?p=286220 నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని బోర్గం (కే) గ్రామానికి చెందిన వృద్దుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఇంఛార్జి ఏఎస్ఐ నర్సయ్య బుదవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన తెడ్డు పోషయ్య(70) అనే వ్యక్తి గత నెల 30 వ తేదీన బోర్గం గ్రామం నుంచి మానిక్ బండర్ గ్రామ వైఫ్  వెళుతుండగా చెక్క వద్ద 63వ రహదారిపై రోడ్డు దాటుతుండగా ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వెళుతున్న బైక్ అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ డీ కొట్టాడు. వెంటనే క్షేతగాత్రున్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు ప్రస్తుతం బోర్గం గ్రామంలో నివశిస్తున్నాడు. మృతుని అన్న కుమారుడు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
]]>
మతోన్మాద మోడీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి https://navatelangana.com/defeat-bigoted-modi-and-make-india-alliance-candidate-win/ Wed, 08 May 2024 12:32:14 +0000 https://navatelangana.com/?p=286208
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మతోన్మాద ఫాసిస్టు బీజేపీ మోడీ పరిపాలనలో నిరుద్యోగం, ఆకలి, అసమానతలు, అధిక ధరలు, మహిళలపై అత్యాచారాలు, కవులు, కళాకారుల, మేధావుల పై దాడులు తీవ్రమైనాయని సీసీఐఎంఎల్ లో డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు. జక్రాన్ పల్లి బస్టాండ్ కూడలి, అర్గుల్, తోర్లికొండ ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారాన్ని న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దాసు మాట్లాడుతూ.. బీజేపీ మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి రైతు వ్యవసాయ వ్యతిరేక విధానాలు అవలంబించాలని ఆయన అన్నారు. ఉపాధి భద్రత, ప్రతి యాడాది రెండు కోట్ల కొలువులు హామీ నీళ్ల మూటగా మార్చారని ఆయన తెలిపారు. నిత్యవసర సరుకుల ధరలను ఆకాశానికి అంటించినారని ఆయన అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకుండా, కనీస వేతనాల చట్టాలు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని  ఆయన విమర్శించారు. బేటి పడావో బేటి బచావో నినాదం ఇచ్చిన మోడీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి శిక్ష పడకుండా అండగా నిలిచిందని ఆయన అన్నారు. ప్రభుత్వ సొమ్మును కాజేసిన విజయ్ మాల్యా, నీరడ్ మోడీ లాంటి వారికి శిక్షించకుండా అవినీతిపరులకు అండగా నిలిచిందని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడం దుర్మార్గమని, మతవైషామ్యాలు పెంచి ఓట్లు కొల్లగొట్టే కుట్ర బీజేపీ చేస్తుందని వారన్నారు. అంబానీ ఆదాని లాంటి పెట్టుబడిదారులకు 17 లక్షల కోట్లు మొండి బకాయిల పేరుతో రద్దుచేసి, ప్రజలపై పన్నుల భారం మోపిందని ఆయన అన్నారు. బీజేపీ మోడీ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమిస్తున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఎన్నికల్లో బిజెపిని ఓడించి, బీజేపీ నియంతృత్వ పాసిస్టు విధానాల్ని కట్టడి చేసేందుకు ఈ ఎన్నికల్లో ఓడించి, ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి ని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమం లో సూర్య శివాజీ, ప్రిన్స్, మహమ్మద్ గంగాధర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.
]]>
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న తహసీల్దార్ https://navatelangana.com/tehsildar-exercising-right-to-vote-by-postal-ballot/ Wed, 08 May 2024 12:26:20 +0000 https://navatelangana.com/?p=286201 నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం లోని ఎన్నికల సిబ్బంది జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగం కోసం నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ను మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు మద్నూర్ తాసిల్దార్ గా విధులు నిర్వహించే ఎండి ముజీబ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల సిబ్బందికి మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
]]>