Poetry Archives - https://navatelangana.com/category/poetry/ Sat, 11 May 2024 18:48:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Poetry Archives - https://navatelangana.com/category/poetry/ 32 32 జీవన్మృ‌త్యువు https://navatelangana.com/life-and-death/ Sat, 11 May 2024 18:48:17 +0000 https://navatelangana.com/?p=288973 శత్రువు లేని యుద్ధం
వరద పోటెత్తినట్లు నెత్తుటి ప్రవాహం
క్షణక్షణానికి విస్తరిస్తున్న వేదన
ఆయుధాల కోతలతో ఉగ్గబట్టిన ఊపిరి
నడుముకింద నవనాడుల్లో భరించలేని రాపిడి
గాలిలో దీపమవుతున్న ప్రాణం
తొమ్మిది నెలలు కాపురమున్న అతిధి
కొత్తలోకంలోకి రావాలని చేసే విశ్వ ప్రయత్నం
ఉప్పెనలా ఉధతమై ఊరుకుతున్న ఉమ్మనీరు
జీవన్మత్యు పోరాటం
కేర్‌ కేర్‌ అని ఏడుపు వినపడగానే
తెగిన బొడ్డుతాడు సాక్షిగా
యుద్ధం పరిసమాప్తమవుతుంది
పండంటి బిడ్డని తనివితీరా తడిమి
మురుగుపాలు నోటికిస్తేనే ఆనందం
బిడ్డ ఎంగిలి, కన్నీరు కడకొంగుతో తుడుస్తుంది
మలమూత్రాలను దేవుడివన్నట్లు భక్తితో ఎత్తిపోస్తుంది
బిడ్డల ఆనందమే తన జీవన పరమావధి అనుకుంటుంది
పసిబిడ్డ అడుగులకు మడుగులొత్తుతుంది
వెన్నెల్లో పసిబిడ్డకు పాలబువ్వ అవుతుంది
వెండి చందమామలో కుందేలు పిల్లలా గంతులు వేస్తుంది
ఉప్పుమూటలా వీపుకెత్తుకుని
సంబరాల పరుగులెడుతుంది
అమ్మ అన్న పిలుపుకోసం పరితపిస్తుంది
నెలవంకలా ఎదుగుతున్న బిడ్డను చూస్తూ
తననితాను మరచిపోతుంది పిచ్చి తల్లి
చెట్టంత ఎదిగిన బిడ్డ నీడే నిశ్చింతని తలపోస్తోంది
తాటిచెట్టు నీడని తెలుసుకోలేని భ్రమలో
బిడ్డే తన ప్రాణమని తలపిస్తుంది
నడిరోడ్డుమీదో నట్టేట్లోనో వదిలేసిపోతే
బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనే కోరుకుంటుంది
ఆమె మాతమూర్తి
అమ్మతనం ఆమెకు
శాపమైన వరమా? వరమైనహొశాపమా?

– రోహిణి వంజారి, 9000594630

]]>
పెట్టెలోంచి పునరుజ్జీవించే దేశం!? https://navatelangana.com/a-nation-reborn-out-of-the-box/ Sat, 11 May 2024 18:45:47 +0000 https://navatelangana.com/?p=288970 డెబ్భైౖ ఏడేళ్ల స్వరాజ్యం
కాలప్రవాహంలో ఈదుతూ
తీర్పుల తీరాల్ని చేరడానికి ప్రతీ
ఐదేళ్ళకోసారిలానే నేడు కూడా
బ్యాలెట్‌ పెట్టెలో శూన్యం నిండా కళ్ళు చేసుకొని
ఎన్నికల రంగస్థలం తెర తీసికొని
ఉత్కంఠగా ఎదురు చూస్తోంది!
రేపటి నవభారతం పురుడు పోసుకొనేందుకు
స్వేచ్ఛా విహాంగాల్లాంటి
ఏ పాట్లూ లేని స్వచ్ఛమైన ఓట్ల కోసం..
బంగారు భవిత నిర్మించే బాధ్యతనే
ఓటుగా వేసి ప్రగతి ఫలాల మహావక్షాన్ని
నేటి బ్యాలెట్‌ బాక్సులోంచే సష్టించుకొందాం..
ప్రలోభాలు ఉచితాలు తాయిలాలు
ఇలాంటి క్షణికాలు కాలగర్భంలో
కరగక తరగక ఆగవు కదా!
కానీ, దేశమొక్కటే సత్యం
మనం నిలబెట్టుకోవాల్సిన నిత్యం
అసలు దేశం కాదిది.. ప్రజాదేవళం!
కోట్లాది ప్రజల భవితవ్యాన్ని వాళ్ళే
ఆ నిశ్శబ్ద బ్యాలెట్‌ పెట్టెలో వితరణ శీలతతో రాసి
దేశం కోసం అమరులైన ఎందరో
త్యాగధనుల శైథిల్య సమాధులపై చిరునవ్వుల పుష్పాలు పూయించే
ఏ వర్ణనలకు ఏ వివరణలకు అందని అద్భుత క్షణం..!!

– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253

]]>
అమ్మ… నైట్‌ వాచ్‌ మెన్‌ https://navatelangana.com/amma-is-a-night-watchman/ Sat, 11 May 2024 18:44:47 +0000 https://navatelangana.com/?p=288966 అర్ధరాత్రి నాన్న తలుపు తెరిచాడు
అమ్మ ఆదుర్దాగా లేచి వెన్ను తట్టింది
ఎక్కడ బుద్ధుడు ఆయి పోతాడో అని బెంగ
అన్న నిద్రలో ఎవరి పేరో కలవరిస్తున్నాడు
అమ్మ నోట్‌బుక్‌లు మొత్తం వెతికినది
రాధ ఎవరురా అని తెల్లవారి నిలదీసింది
అలారం పూర్తి కాకుండానే లేచింది
ఇడ్లీ పిండి పులుపు ఎక్కకూడని టతీఱసస్త్రవలో పెట్టింది
రెండో అలారం పెట్టుకుని తల దిండు కింద దూరింది
మద్యలో లేచి నప్పుడల్లా
పరికిణీ సవరించి బెడ్‌ షీట్‌ పరిచి పెట్టి
అమ్మాయి ఎదుగుతుంటే అమ్మకు దిగులు మొదలు
కామాలే కాని ఫుల్‌స్టాప్‌ లేని పనులు
పుట్టుకతోనే వర్క్‌ ఆర్డర్‌ పట్టుకుని వచ్చినట్లు
ప్రశాంతమైన నిద్ర కూడా నోచుకోని జీవితం
అమ్మ డేలో వర్క్‌ మెన్‌ నైట్‌లో వాచ్‌ మెన్‌
కలలో కూడా కుటుంబ కలవరింతే…..
– దాసరి మోహన్‌, 9985309080

]]>
ఆకుపచ్చతనం https://navatelangana.com/greenness/ Sat, 20 Apr 2024 15:56:15 +0000 https://navatelangana.com/?p=273662 మనమో చెట్టుగా నిలిచినందుకు
చిక్కటి చెట్టు ఛాయలో కొమ్మల బాహువుల నడుమ
అపురూపంగా అల్లుకున్న అందమైన గూడు కౌగిట
మనపిల్లలు పిచ్చుకలై కేరింతలతో పసరు రెక్కల్ని
పరచుకుంటూ ఆకాశాన్ని అందుకోవాలని ఆనందంగా
ఎగరాలని తపించింది మనమే!

దట్టపు ఆకుల చేతుల చాటున కష్టాల జడి వానలనుండి
సమస్యల ఈదురు గాలుల్నుండి కబళించ వచ్చే విషనాగులతో
జీవన సమరం చేస్తూ మిమ్ము కాపాడుకున్న పేగు తడి మాది!

రెక్కలొచ్చి ఎగిరి ఆకాశాన్ని ముద్దాడుతూ సాగే మీరు
రంగు రంగుల హరివిల్లులను జీవన కాన్వాసుపై చిత్రిస్తుంటే
లోలోన మురిసి పోతుంటాము!

కలిసి పండించిన ప్రేమబీజాలను మీనోట కరుచుకుని నలుదిశలా
స్నేహవనాలను నాటుతున్నందుకు చెదరని చెట్టుగా ఇద్దరం మరింత
గర్వంతో నిటారవుతుంటాం !

ఒక్కోసారి పిల్లల్లేక ఇల్లుబోసిపోయి పిట్టలు కనిపించని చెట్టులా
నిశ్శబ్దం కమ్ముకున్నప్పుడు ఒకరికి ఒకరమై చెట్టూ గూడూ
మేమే నిండి పిల్లల జ్ఞాపకాలతో పిల్లలమై ఊసులాడుకుంటాం!

ఎదిగి ఎగిరి ఆకాశమంతటా చెదరిన నిన్నటి పిల్లలు నేడు
కువకువల చంటి పికాలకూడి మాతచెట్టును మరవకుండా
వచ్చి ఒడిలోకి వాలతాయని…
వాడిపోకుండా ప్రతి వసంతాన చిగురిస్తూ పుష్పిస్తూ పచ్చగా
పరిమళాలను పంచేందుకు ఎదురు చూస్తోంది అమ్మ చెట్టు!

కనిపించే పచ్చాకుతనం తానైతే ఎద లోతుల్లో బలంగా నిలిచిన
కనిపించని చెట్టుమూలవేరు నేనేనా ?
(ఆకుపచ్చ ‘నందు’కు ప్రేమతో)
– డా|| కె. దివాకరాచారి, 9391018972

]]>
పారాహుషార్‌…! https://navatelangana.com/parahushar/ Sat, 20 Apr 2024 15:55:14 +0000 https://navatelangana.com/?p=273655 జిత్తులమారి గుంట నక్కలు
బాహాటంగానే ఊళ పెడుతున్నాయి,
నీ సహజీవన సంస్కతి నుండి
నిన్ను వేరుచేయడానికి కుట్రలు చేస్తుంటాయి..!

నువ్వు చైతన్యమై కనిపించినపుడు
స్థూలంగా నిన్నొక మతంగా
సూక్ష్మంగా నిన్నొక కులంగా
విడగొట్టి పడగొట్టే ప్రయత్నం చేస్తుంటాయి..!

భిన్నత్వంలో ఏకత్వం నుండి చీల్చి
నిన్ను విభజించి పాలించడానికి
వారి ఆటలో పావుగా చేసుకోవడానికి
నీ మత విశ్వాసాల్ని సైతం ఫణంగా పెడతాయి.!

పాలనా కర్తవ్యాలను మరిచి
మేనిఫేస్టో తాయిలాలతో మురిపించి
తమ స్వార్థాలను సొమ్ము చేసుకునేందుకు
ఓట్ల పండుగకు సిద్ధమవుతున్నాయి..!

బహుపరాక్‌..! పారాహుషార్‌..!
రాజకీయపు ఎత్తుగడలకు లొంగిపోకు
మనీ, మద్యం, మాంసానికి
వజ్రాయుధమైన నీ ఓటును బలి చేయకు..!

బహుపరాక్‌..! పారాహుషార్‌..!
నీ చైతన్యమే నీకు దారి చూపుతుంది..!
కుల, మత, వర్గ రహితంగా ఎన్నుకుంటేనే
ప్రజాస్వామ్య సంస్కతి వికసిస్తుంది..!!
– డా|| వాసాల వరప్రసాద్‌, 9490189847

]]>
ఎలక్షన్ల పండుగ..! https://navatelangana.com/festival-of-elections/ Mon, 08 Apr 2024 10:18:41 +0000 https://navatelangana.com/?p=265023 వస్తుంది వస్తుంది ఉగాది
కొత్త ఉత్సాహం తెస్తుంది
బాధ, కోపం, ఆవేశం
సంతోషం, ఆగ్రహం, ఆనందం
అన్నిటినీ స్వీకరిస్తాము ఉగాది పచ్చడి రూపంలో

ఈ ఉగాదికి మరో ప్రత్యేకత ఉంది

త్వరలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి
ఎంపీ, ఎమ్మెల్యే, కార్పోరేటర్, సర్పంచ్
ఏ ఓట్లయితేనేమీ..
మన దగ్గరికి వస్తారు పెద్దలు
పెడతారు కమ్మటి భక్షాల విందు
చూయిస్తారు అరచేతిలో వైకుంఠం

ఏరులై పారుతుంది డబ్బు
ఆ పదిరోజులు పండగే సామాన్యుడికి
ఓట్లరోజు వత్తాలని ఉంది అన్ని గుర్తులపై
ఇచ్చారు కదా మరి డబ్బులు అందరూ..

కానీ ఒక గుర్తుపై వత్తగానే మోగింది సైరన్
రమ్మన్నారు బయటకు..

ఎవరో వస్తారు అధికారంలోకి
అప్పుడు తెలుస్తుంది మనం తిన్నది బెల్లంలేని భక్షాలనీ..

వదిలేశారు చెప్పిన హామీలకు తిలోదకాలు
ప్రశ్నిస్తే బడ్జెట్ చర్చా సమావేశాలు అంటారు..

ఎలక్షన్ల ముందు వ్యర్ధ ఖర్చులు
అదే డబ్బులతో కల్పించవచ్చు కదా సామాన్యుడికి వసతులు

అలా చేస్తే వస్తుంది నిజమైన ఉగాది
కానీ మతి లేదు ఓటర్లకు
స్పృహ లేదు నాయకులకు..
చివరికి మిగిలేది వేపపూతే..!

 

                                                                                 – మోటమర్రి అనురాధ
                                                                                ఫోన్ : 9392671861

]]>
భూమి మాట్లాడిన కాలం https://navatelangana.com/a-time-when-the-earth-spoke/ Sat, 06 Apr 2024 17:06:00 +0000 https://navatelangana.com/?p=263878 A time when the earth spokeఅరేరు!
నిజమే! నిజమే!
వీర తెలంగాణ నుండి
నువ్వు మరీమరీ
కౌగిలించుకుంటున్న వల్లభారుపటేల్‌
విమోచణ కల్గించాడు
మీ ప్రియాతి ప్రియమైనమీర్‌ ఉస్మానలిఖానుకు
మీ దొరలకు భూస్వాములకు దేశ్‌ముఖ్‌లకు
జమీందార్లకు జాగీర్ధార్లకు నిజాంరజాకార్లకు
కానీ పీడిత తెలంగాణకు కాదు

లక్షలాది ఎకరాల పొలాలై
18తాలూకాల్లో విస్తరించిన నిజాం కు
నా వంచిత తెలంగాణకు
నీ సెప్టెంబర్‌ పదిహేడు
విమోచన దినం కాదు
విద్వేష దినం! విషదినం!! విద్రోహదినం!!!
ఒరేరు! మతోన్మాద దోపిడి ముఠాల్లారా!
1946నుండి1951 చరిత్ర
ఏ ఎరేజర్తో చెడుపుతార్రా?
నీ విషబీజం మొలకెత్తే నేలేనా?
అబద్దానికి నిజం దుస్తులేశావు
అబద్దాల హామీల్లా అబద్దాల గ్యారంటీల్లా
ఒక అప్రకటిత ఎమర్జెన్సికాలం సెంగోల్‌ తెచ్చి వాక్‌ స్వాతంత్య్రం జైల్లో పెట్టావు

నీ కథలే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి
దోపిడిసొమ్ముతో ప్రజా చరిత్ర
చెదలుపడ్తుందా?
పాలకుడు ముస్లిం
నిజమే! అతని పటిష్ట పునాది
పిల్లర్లు భీమ్లూ
హిందూ రెడ్లూ రావులే కదా!

అయినా తెల్వకడుగుతా?
ఇక్కడి మెడల ముంత వేలాడిన కాయల చరిత్రెవడ్డి?
ఇక్కడి బతుకుల ముడ్లకు కట్టిన
తాటాకులుగీరిన చిత్రలేఖనా నైపుణ్య చరిత్రెవడ్ది?
చెవుల్లో సీసం పోసిన
చావుకేకల ముఖచిత్రాల ముచ్చటెవడ్ది?
కోసిన నాలుకలోంచి చిందిన రక్తచరిత్రెవడ్ది?

నువ్వెంత ఒయలు బోయినా
రజాకార్ల బలమూ బలగమూ
హిందూ దొరలే కదా!

బండెనుక బండికట్టి
బతుకుమీద నడిపించీ
చెమటచుక్క తునాతునకలు చేసినప్పుడు
బిగిసిన పిడికళ్ళ స్వేచ్ఛ చిగురించింది

ఊళ్ళు స్మశాన వాటికలైనప్పుడు
ఎర్రజెండా ఒక్కటే గుండెలకత్తుకుంది
పజ్జొన్నకంకై తలెత్తిన ఊళ్ళల్లో
కొండల్లో గుట్టల్లో
అడవుల్లో సాయుధరాగం పురుడు పోసుకుంది

బంగారం పండే భూములు
తియ్యనికొబ్బరి నీటివనరులు
కంచెలు తోటలు పెరళ్ళూ
అన్నీ బ్రహ్మదేవుడు
హిందూదొర పేరుమీద రాసి పుట్టించి
చెమటచుక్కను ఖాళీ చేతుల్తో
ఏహక్కులేని బానిసగా పుట్టిస్తే
పుట్టిన పాపానికి దొరదొడ్లో కట్టేసుకున్నట్టు
వెట్టిచాకిరైరి నజరానాలై రి
నాగులవడ్డైరి అక్రమ వసూల్లైరి
లేవీ వసూల్లైరి అక్రమ బేదఖల్లైరి
నియంతత్వ యంత్రంలో పిండిపిండి
ప్రజల నెత్తురు తాగుతున్నప్పుడు

రోలుపన్నూ రోకలిపన్నూ
సమర్తపన్నూ సనుగులపన్నూ
పెండ్లిపన్నూ చావుపన్నూ
అప్పటి హిందూ దోపిడి ముఠా
ఇప్పటి హిందూ రాజ్య కలల పాలకుడి +ూులా సకలం పీల్చినప్పుడు

ఆంధ్ర మహాసభ అంధకారంలో వెలిగింది
తెలుగు భాష అణిచివేత వ్యతిరేకత
తెగింపై తెలంగాణ చొరబడ్డది
గ్రంధాలయోద్యమం గమనం నిర్ధేసించింది

తెలంగాణ కాళ్ళ కింది వడ్లతాలు
భూస్వాములు దొరలు దేశ్‌ ముఖ్లు జాగిర్ధార్లు పటేళ్ళు పట్వార్లు రజాకార్లు
ఏడోనిజాం మీర్‌ ఉస్మానలి కళ్ళల్లో పడ్డది

హింసాప్రణాళికల కమలాంధులారా!
అజీముల్లాఖాన్‌ అందించిన
”భారత్‌ మాతాకీ జై”వదిలేయవు గాని
ఒంటి నిండ ముస్లిం వ్యతిరేకత
తొడుక్కొని తిరుగుతావు
దౌత్యవేత్త అబిద్‌ హుసేన్‌ ”జైహింద్‌ ”ను
గాయపు బర్రలా వదలవు గాని
మనసంతా ముస్లిం వ్యతిరేకత లో ముంచి
నినాదమైతావు

కాషాయ కబోదులారా!
రజాకార్లంటే
భూస్వాములు దొరలు దేశ్‌ ముఖ్ల జాగీర్ధార్ల పటేల్‌ పట్వార్ల రక్షణకోట
ఏడో నిజాం ప్రైవేట్‌ సైన్యం

దోపిడీ ముఠాల గడి రజాకార్ల గెస్టౌజ్‌!
తెలంగాణ బతుకు
నిప్పుల్లో ముంచిన చేతుల్లో
రజాకార్ల రిమోటు
ఇంకేం నిజాంచీకటి అల్లిన మృత్యువు!

దొరలు నిజా మైయ్యిండ్రు
భూస్వాములు నిజామైయ్యిండ్రు
దేశ్‌ ముఖ్లు నిజామైయ్యిండ్రు
జాగీర్ధార్లు నిజామైయ్యిండ్రు
పటేల్‌ పట్వార్లు నిజామైయ్యిండ్రు
ఏడో నిజాం ఎలిగి పోయిండు

దోపిడి ముఠాల చేతి
తల్వార్లైయ్యిండ్రు రజాకార్లు
దోపిడీ ముఠాల చేతి
తుపాకులైయ్యిండ్రు రజాకార్లు
దోపిడిముఠాలు రజాకార్లు
రజాకార్లు దోపిడి ముఠాలు

ఎంతపండించినా
గుడిసె ఆకలితో రోదించింది
ఆహార లోపంతో
తెలంగాణ చిక్కి శల్యమైంది

ఊళ్ళను మెతుకు తిన నీయలేదు
నీళ్ళు తాగ నీయలేదు నిద్ర బోనీయలేదు

దోపిడి ముఠాలు రజాకార్లు
చీకటి అమావాస్యలా కలెగల్సి పోయారు
ఒక కులం లేదు ఒక మతం లేదు
సకల జనులు సబ్బండ కులాలు
ఊళ్ళను
ఉమ్మడి రజాకార్లు గడికి కట్టేసుకున్నారు
వెట్టికి పట్టం గట్టి
ప్రజల రక్తమాంసాలు
మానాలు ప్రాణాలు
ఏదైనా వాళ్ళ కోరికలకోరలు చెప్పినట్టే!
నోరెత్తీతే
నోట్లె మట్టి పడ్డట్టే!!

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో
ఒక్క చెమట చుక్క రాల్చని
ఒక్క నెత్తుటి బొట్టు చిందని
హిందూ మతోన్మాదమా!
నువ్వెక్కడ నిలబడ్డావు
నిజాం వెనుకే కదా!
నీ పోరాటమెక్కడ
పీడిత తెలంగాణ మీదే కదా!

ఏక పక్ష దారిద్య్రరేఖ ఎక్కిరిస్తుంటే
నిజ దారిద్య్రం పామై బుస కొడ్తుంటే
ధరల సూచికల గుండె దడ హెచ్చి
ఎన్ని క్యాలరీల ఎలక్ట్రో బాండ్లు తిన్నా!
పెగాసస్‌ ప్రేమలు ఒలకబోసినా
ఎక్కడో పురి తెగి
మార్కెట్టుమర్కట నీతి ఓటు
కలలో కూడా జారిపోతాంటే
విజయాకలిసూచి అట్టడుగున పడిపోతుంటే
మతాన్ని గంజాయిలా అలవాటు చేసి
ఉన్మాద”ఉడ్తా తెలంగాణ” కలలప్రవాహంలో
నిలబడ్తామనుకుంటున్నావు కాని
రజాకార్ల సైన్యాధ్యక్షుడు
ఖాసిం రజ్వీ అయితే
రజాకార్ల ఉపాధ్యక్షుడు
హిందూ విస్నూర్‌ రాంచంద్రా రెడ్డే కదా!

బజాయించి ఢంకా
బడాయికి పోతారు గానీ
ఇప్పుడు చెప్పు?
హిందూ ముస్లిం పోరాట మెక్కడ మతోన్మాది?
చరిత్ర వక్రీకరణా చెద చక్రవర్తీ!
అబద్దాల అలంకరణల తిరుగుబోతా!!
వాడు హిందువా కాదు
వాడు ముస్లిమా కాదు
తెలంగాణ పేదలంతా
గంగ జమున తెహజీబ్‌ !!!

వట్టికోట ఆళ్వారుస్వామి కధలు చెవికెక్కలేదా!
పెన్నూగన్నూ పట్టిన రంగాచార్య
చిల్లరదేవుల్లో మోదుగూపూలో మాయాజలతారో
రుచించలేదా!

క్రిష్ణమాచారి రుద్రవీణకు మీ చెవులు బ్రద్ధలైయ్యాయా?
కాళోజీ కణకణమండే అక్షరాలకు కళ్ళు మూస్కపోయాయా?
‘వీరతెలంగాణవిప్లవపోరాటం’
చేదుమాత్రైయ్యిందా?
సాయుధ పోరాటదర్పణం ‘మా భూమి’
మీ మనస్సు ముక్కలు చేసిందా!
1946నుండి1951దాక
తెలంగాణ ఎర్రజెండై ఎగరడం
ప్రపంచం కళ్ళల్లో దాచుకుంది
కళల్లో దాచుకుంది

ఆ సినీ స్థూపం చుట్టూరా
ఆ త్రివర్ణ పతాకంతో భలే పోరు చేయించావు
సజనాత్మకత మీకే పుట్టిందా ఏం?

రజాకార్లతో యుద్ధంచేశాయా?
తెలంగాణ ఊళ్ళు నవ్వుతున్నాయి!!!

నీ కట్టుకథలకు
నీ పిట్టకథలకు పుట్టిన రజాకార్‌ చూశాకే
నీ కశ్మీర్‌ ఫైల్స్‌ అర్ధమైంది
నీ కేరళాస్టోరి సుస్పష్టమైంది
మణిపూర్‌ ఫైల్స్‌ కు మరీ కొంత సమయముందా?
ఒరేరు !
బందగీని
ఎవడి బలుపు
కండకండాలుగా నరికి చంపింది
చాకలి అయిలమ్మ పంట భూమి
చాపచుట్టుక పోవాలనుకున్నదెవడు?
దొడ్డి కొమురయ్య పొట్టపేగుల్ని బయటేసిన
తుపాకీ గుండు ఏ గడిది?
కొడుక్కు దగ్గ తల్లి
తండ్రికి దగ్గ కొడుకు
విస్నూరు రాపాక రాంచంద్రా రెడ్డెవరు?
రాపాక జానమ్మెవరు?
జనగాం రైలు పట్టాల్ల
పీడిత తెలంగాణ
దసరా బలి
నరికినట్టు నరికిన బాబూరావు దొరెవడు?
ప్రజలపాణాలు పనాయిగా తింటూ
లక్షన్నర ఎకరాలు కాళ్ళకింద తొక్కి పట్టిన
జెన్నారెడ్డి ప్రతాపరెడ్డెవడు?
పసిబిడ్డకు పాలిస్తానంటే
మూడురోజుల బాలింత రొమ్మును
మోదుగు దొప్పల్లో పిండించి శల్యపరీక్ష చేసిన
పసునూరి రామ్మోహనరావెవడు?
పూస్కూరి రాఘవ రావెవడు?
కటారీ రామచంద్రారావెవడు?
బేతవోలు తడమల్ల సీతారాంచంద్ర రావెవడు?
రామసహాయం దామోదర రెడ్డెవడు ?

తెలంగాణ తల్లుల్ని అక్కల్ని చెల్లెల్లని
గడీలలో
నగబతుకమ్మలాడించిన హిందూ రజాకార్లు కాదా!

ప్రజల చెమటా నెత్తురు తాగి
తెలంగాణ గడ్డను చీల్చి చెండాడిన
గడ్డం నర్సింహ రెడ్డెవడు?
నియంతకు నిలువెత్తు రూపం
నీర్మాల నర్సింహరెడ్డెవడు?
దోపిడి పాలనకు
మూలస్తంభం భూస్వామ్యం!
ఉద్యమం చేతుల్లో మట్టిముద్దై కూల్తుంటే
నిజాం ఉమ్మడిరజాకార్ల గుండెలు జారిపోగానే
ఆపరేషన్‌ పోలో అత్యాధునిక ఆయుధాగారంతో
యాభైవేల సైన్యమై
ఆగమేఘాల మీద
ఉద్యమతెలంగాణ కలల మీద పడ్డది
పాలస్తీనపై గాజాపై
ఇజ్రాయిల్లా
నిజాంప్రియురాలు యూనియన్‌ సైన్యం
సరిహద్దుల్లో నక్కిన నక్కలు
రజాకార్లు
తెలంగాణ శవాలదిబ్బచేస్తూ
రక్త వసంతాలాడు కున్నారు
తెలంగాణ గుండెల్లోని
వేలాది అమాయక నెలవంకల్ని
ప్రజలసాయుధం చేసిన ప్రాణాల్ని
దండ గుచ్చి
ఆనాటి నెతాన్యూహు
నిజాం మెడలో వేశారు
దొడ్డి కొంరయ్య అమరత్వం దారేసిన జైత్రయాత్ర
ఎర్రజెండాకాశం కింద
ప్యూడల్‌ పిడికిలి చీల్చి చీల్చి
భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం
తెలంగాణ నాటుతుపాకై
సకల ఆయుధ సంపత్తి
దోపిడిముఠాకు ఎదురేగింది
ఆ సమాజం ఆ పాలన
ఆ విలువలు పునర్మూల్యాంకనం చేసింది

హిందూ కాదు ముస్లిం కాదు
రైతు నాగలి కుమ్మరి సారె
మంగళి కత్తి చాకలి బండ
మాదిగ గూటం సాలెల మగ్గం
బెస్తోళ్ళ వల
సమస్త కులాలు సమస్తమతాలు
వెట్టి చాకిరికి సమాధి కట్టి
ఉమ్మడి రజాకార్ల ఉచితాలకు ఉరి వేశారు
ఊళ్ళు తిరగ బడ్డాయి
దోపిడిముఠా గడీల
భయాలు బాదలు చావులు చొరబడ్డాయి
నిజాంరాచరికం కాళ్ళు విరగ్గొట్టి
‘దున్నే వానికి భూమై’
తెలంగాణ నక్షత్రాలు వెలిగాయి
గడీల్ని పగలగొట్టి
చీమలు పండించిన పాములు దోచిన
పుట్లధాన్యం ఆకలికి పంచింది
పటేల్‌ పట్వారీల పత్రాలు తగలబడ్డాయి
అప్పు పత్రాలు ఆహుతైయ్యాయి
ఆకాశంలో సగానికి
విడాకుల హక్కు పుట్టింది
గడ్డిపోచ తుపాకి పట్టింది
కట్టెపుల్ల కదనాన కరవాలమై మెరిసింది
నాలుగు వేల ప్రాణాలు ముట్టించి
తెలంగాణ వెలిగించారు వీరులు
నిజాం వికృతరూపాన్ని
అద్ధంలో చూపినందుకు
రజాకార్‌ కత్తి జల్లెడ చేసిన
షోయబుల్లాఖాన్‌ ఎవరు?
నిజాం దోపిడి ముఠా మీద
కవితాయుధం ఎక్కుపెట్టిన
మఖ్ధుంమోహినోద్దిన్‌ ఎవరు?
పది లక్షల ఎకరాలు ఆకలి కడుపుకు పంచింది ఆడమగ సమానం చేసి
కులాన్ని తెలంగాణ సరిహద్దుల్లో
బొంద బెట్టింది
దోపిడి ముఠాకూ నిజాం పెత్తనానికీ
దహనసంస్కారం చేసింది ఎర్రజెండే!

ఎక్కడి రాంజీ గోండూ ?
ఎక్కడి తెలంగాణ సాయుధ
రైతాంగ పోరాటం ?
దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని
కంటి రెప్పవేయకుండ కాపలాకాస్తున్న
బుద్ధిజీవుల కంప్యూటర్ల చొరబడ్డ
భీమా-కోరేగావ్‌ సాక్ష్యాల్లా ఇరికించారు గదరా!
చిలుకపలుకులతో చిలుకలా కొట్టడానికీ
తెలంగాణ జాంపండేం కాదు
కణకణమండే సూర్యగోళం!
ఇవ్వాల్టి జనతన సర్కార్లా గ్రామాల విముక్తం చేసింది
గ్రామ రాజ్యాల విస్తృ‌తం చేసింది
నిజాం పాలన నేలమట్టం చేసింది
తారీఖులు దస్తావేజులు
ఇవి కావోరు చరిత్ర సారమన్నా
శ్రీశ్రీనీ కాదని నాయకుల పేర్లు పలికారు
తేదీలు చెప్పారు
ప్రాంతాల బట్టీపట్టారు
సారానికి కాషాయం పూశారు
జియోనిజం హిందూయిజం
జోడు గుర్రాలు!

కడుపులపేగులు బయటపడి
తెలంగాణకు జై కొడుతాంటే
దోపిడిముఠావెంటబడి తుపాకీ వదలని
కొన్నెత్తుటి ఎర్రజెండ గోపాల్‌ రెడ్డెవరు?
చీకటి రాజ్యంపై
బానిల తిరుగుబాటై ఎగిసిపడ్డ గెరిల్లాలు !
సహించీ సహించీ
సహనంతో సాహసంతో సృజనాత్మకతతో
వద్ధులు యువకులు యువతులు పిల్లలు స్త్రీలు పురుషులు
వొడిసెల రాళ్ళై విరుచుకు పడ్డారు
కారపునీళ్ళై ఎగిసి పడ్డారు
తుపాకి తూటై పొడుచుకు పోయారు
గుత్పల దండయాత్రైయ్యారు

ఊళ్ళను ఖాళీ చేసిన పీడన
భారతయూనియన్‌ సైన్యం కాంగ్రేస్‌ రజాకార్ల నీడన
మళ్ళీ ఊళ్ళకు చేరీంది
మళ్ళీ
గడి నిలబడ్డది !
1948 సెప్టెంబర్‌ 17కు
ముందు
నిజాం పోలీసు రజాకార్లు తోడైతే
తర్వాత భారతయూనియన్‌ మిల్ట్రీ
కాంగ్రేస్‌ రజాకార్లు తోడైయ్యారు

గొర్రెలు తినే వాడు పోయి
బర్రెలు తినే వాడొచ్చినట్టు
ఊళ్ళను తగలబెట్టీ
భోగి మంటల్లా కాగారు

పచ్చి నిజం చెప్పనా?
లొంగిపోయింది
నిజాం మీర్‌ ఉస్మానలి ఖాన్‌ కాదు
రాజ్‌ ప్రముఖ్తో రాజాభరణాలతో
భారత యూనియన్‌ సైన్యం !
ఉమ్మడి రజాకార్ల సెక్యూరిటీ జోన్‌
యూనియన్‌ సైన్యం!
రాజాభరణాల రద్దు చేస్తే
అరిచి గీ పెట్టిన
జనసంఘం ఎవరి తల్లి?
1950జనవరి26వరకు
అధికారం ఎవడి రాజముద్రికలో కూర్చొని
దాగుడుమూతలాడింది
రైతురాజైతే
హైదరాబాదు ఎర్రజెండా
ఎర్రకోటను కౌలించుకోవడం దూరం లేదని
పటేల్‌ వణకడంతో
1948 సెప్టెంబరు17 దాటినా
1951దాకా
తెలంగాణ సరిహద్దు దాటలేదు యూనియన్‌ సైన్యం కాని
బ్యాండుమేళాలే తక్కువ
సకల లాంఛనాలతో ఖాసీంరజ్వీని
సకలజనుల కాంక్షకు భిన్నంగా
సరిహద్దవతల క్షేమంగా చేర్చిందెవరు?

కత్తులు తుపాకుల దొరతనంతో
తెగిపడ్డ కుత్తుకలు
రక్తాక్షరాల రాసిన
అగ్నివికసిత చరిత తెలంగాణ
భారత భావితరాల వ్యవసాయిక విప్లవ వేగుచుక్క!

– వడ్డెబోయిన శ్రీనివాస్‌

]]>
రంగుల పెట్టె https://navatelangana.com/color-box/ Sat, 30 Mar 2024 18:34:42 +0000 https://navatelangana.com/?p=259213 ఒకనాడు రంగుల పెట్టెలోంచి
హరివిల్లు కరిగిపోతూ
నేలపై అచ్చుపోయడాన్ని చూసాను
అది బాల్యం.
ఇవాళ మళ్ళీ రంగుల పెట్టెలోంచి
ఎరుపు రంగు వొలకడాన్ని చూస్తున్నాను
ఇది బాంబు పొగలు కమ్ముకున్న సమయం
ఉదయమో రాత్రో అర్దం కాదు సమయం ఏదైనా
వొక్క ఎరుపు మాత్రమే వొలుకుతుంది
ఆ పిల్లల వొళ్ళంతా పచ్చినెత్తురు పారుతుంది!
సీతాకోకచిలకల్లాంటి పిల్లలు
పగిలిన ఎర్రటి రంగు డబ్బాల్లాగా నెత్తురోడుతున్నారు.
నన్నెవరైనా అడిగితే ఏమని చెప్పను
బాల్యానిది రక్తం రంగని చెప్పనా?
లేదా, బాంబు పొగల రంగని చెప్పనా?
లేదా గాలికి రంగు లేనట్టుగా బాల్యానికీ రంగులుండవని
అతిపెద్ద అబద్దాన్ని చెప్పనా?
యుద్ధనేలపై బాల్యమంటే.. హరివిల్లు బూడిదైన ఆకాశం!
– దొంతం చరణ్‌

]]>
స్వేచ్ఛ https://navatelangana.com/freedom-3/ Sat, 30 Mar 2024 18:32:53 +0000 https://navatelangana.com/?p=259210 మహిళా దినోత్సవం
స్త్రీ సాధికారత అంటూ
ఈ ఒక్కరోజు సంబరాలు మాకొద్దు.
మీ మేల్‌ ఈగోలు మగ పెత్తనాలు
పురుషాహంకారాలు అన్నీ పక్కన పెట్టి
ఆమెను ఆమెలా బతకనిస్తే చాలు.
ఆమె కలలు, కన్నీళ్లకు
ఇంత విలువిస్తే చాలు.
ఆమె ఆశలు, ఆశయాలను నిలబెడితే చాలు.
అనుమానాలు, ఆక్షేపణలు వదలి ఇంత అభిమానం
కురిపిస్తే చాలు.
బతుకంతా తోడోస్తున్నందుకు
ఆమె ఒక మనిషని గుర్తిస్తే చాలు.
ఆడది తక్కువని మగవాడు ఎక్కువని కాక
ఇద్దరూ ఒక్కటేనని ఒప్పుకుంటే చాలు.
స్వేచ్ఛగా నింగిలో ఎగరాలనుకునే పక్షి
‘ఆమె’ అయినప్పుడు ఆంక్షల గుండ్లతో వేటాడే
వేటగాడు ‘అతడు’ కాకూడదు.
అతను ఆమె చెరిసగం అనుకుంటే
ప్రతి రోజు ఉమన్స్‌ డే నే.
– శైలజ బండారి

]]>
నిస్పృహ ఊపిరి https://navatelangana.com/a-sigh-of-relief/ Sat, 30 Mar 2024 18:31:37 +0000 https://navatelangana.com/?p=259207 నిస్పృహలో ఉగ్గపట్టుకోవడానికి
ఆటుపోట్లకి చెదరని చిత్రం
ఊహలకు ప్రాణం పోస్తుంది
కడలి దాటిపోయిన దశ్యాలన్నీ
శిధిల రంగులు సశింపజేస్తూ
నిశ్శబ్దమైన ఆశల గతాన్ని ఆలోచిస్తున్నాను

పిడికెడు మట్టితో
చుట్టుపక్కన తలా పరిశీలన చేస్తుంది
చీకటి రాత్రి కదలికల తరగమేంటో
కలగలిపే గమ్యాలెప్పుడు
కాలం కపోలంలా
ఇద్దరి చుట్టూ కాపు కాస్తుంది
అక్కెర వచ్చే ముళ్లదారులన్నీ
పూలకోనలుగా విచ్చుకుంటాయి
కనిపెట్టవలసిన నిమిషాలలో
అయస్కాంతంలా తిప్పుతుంది
నిల్చున్నప్పుడు హదయ సూత్రం
ఎడమవైపు గమనిస్తుంది
రెక్కలు విప్పిన జీవిత సంఘర్షణ
ప్రశాంతత సౌందర్యాన్ని వెతికిస్తుంది

విస్తరించే ఊపిరిలా
పదిల పరుచుకునే కోల్పోయిన
గుండెకి హత్తుకునేలా
గాలి మోసుకొచ్చే నీలినీడలన్నీ
చిరునవ్వుల సెలవిచ్చే
నిస్సహా ఊపిరి
హదయ సంఖ్యాతను ప్రతిధ్వనిస్తుంది
– బూర్గు గోపికష్ణ, 7995892410

]]>
సింధూర తీరాలు https://navatelangana.com/sindhurs-shores/ Sun, 17 Mar 2024 02:04:37 +0000 https://navatelangana.com/?p=250694 ఎర్రని అలల మీద చెలియ లేఖలు రాసి
దోసిలితో తోసిందో ఏమో గాజుల గలగలలు
గస్తీ కాస్తూ నా వైపే చేరవేస్తూ ఉన్నాయి
ఎదురు తీరాలు అగుపడకున్నా
ఆలింగనాలూ అసాధ్యమైనా
ఎదలను కోసే వ్యధలన్నీ ఒక్కటే
ప్రేమ సందేశాల్ని అందించే
శ్వేత కపోతాలను ఏ డేగలు
పీక్కు తిన్నాయో కానీ నెత్తుటి అలలు మాత్రం
నెచ్చెలి దు:ఖాన్ని మోసుకు రావటం
లోక విషాదం వడిసెల కట్టబడి
పెనుగులాడే కన్న పేగులు
కదన రంగాన విసురబడుతున్న
కపాలాల పోలికేకలు
రణ దాహానికి సాక్ష్యం నిలిచిన
అస్థిపంజరాల రాశుల శిఖరాలు
ఇది ఏ తృష్ణ చిత్రించిన రంగుల చిత్రమో
ఏ తుపాకుల అంచుల మీద
స్వర పరచిన తూటాల పాటనో
ఏ కోరలు చిమ్ముతున్న
విషపు వికటాట్టహాసమో కానీ
శిథిలాల నడుమన
స్తన్యంబాసి నోరు తెరిచి
పసి హస్తం ఒక్కటి
సూర్యోదయాన్ని అడ్డగిస్తోంది
– పర్కపెల్లి యాదగిరి

]]>
భూతల్లి లోగిళ్ళు వీళ్లు https://navatelangana.com/these-are-the-boots-of-bhuthalli/ Sun, 17 Mar 2024 02:03:39 +0000 https://navatelangana.com/?p=250691 బువ్వకుండలున్న మెతుకులను
మాకందరికీ వెట్టి
మాయింట్లున్న నీళ్ళకుండకు
తన ఎతను జెప్పి
నీళ్ళు దాగి పండుకున్న
మా యమ్మను చూస్నప్పుడు
ఆడదాని ఓపికెందో తెల్సింది
ఊళ్ల్య ఆకతాయిల తోటి తిరిగితే
మాయక్క నా చెంపమీద గొట్టి
నాకు బుద్ధి జెప్పినప్పుడు
తప్పుచేస్తే ఆడది…….
ఆదిశక్తయితదని తెల్సింది
మా పొట్టాపతి దీర్వనీకే
కూలి పన్లకు పొయిన
మా నాయిన కొరకు
నదినెత్తిల సూరీడొచ్చి
ఎండ దంచుతున్న…..
బుక్కెడు బువ్వ తీస్కొని
పోయ్యేటి మా చెల్లె ను చూస్తే
ఆడది మమకారంకు మారుపేరని తెల్సింది
సిల్లులువడ్డ అంగిలకు
దారంతోటి మడ్షి కుట్టి
ఇంటిగుట్టు బయటపడకుండ
మా యామె తండ్లాడుతుంటే
ఆడదాని సంస్కారమేందో తెల్సింది
బరువులమూటలు మోస్తూ
సంసారం లోతు తెల్వకున్న
కడగండ్ల ను ఈదుకుంట
దారులు దెల్వకున్న
దూరాలను దాటుకుంట
బంధాలను సాలేడో లే అల్లుకుంట
పోతున్న మీకు గుండె నిండ
ఊపిరి పీల్వనీకే ……
ముడ్సుకున్న రెక్కలను
ఇప్పుకొని ఎగరనీకే
సమాజం చేయూత నిస్తే చాలు
అదే పదివేలు..!

– కొండాపురం లక్ష్మి, సంగారెడ్డి

]]>