Reporter's Diary Archives - https://navatelangana.com/category/reporters-diary/ Sat, 04 May 2024 18:10:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Reporter's Diary Archives - https://navatelangana.com/category/reporters-diary/ 32 32 తస్మాత్‌ జాగ్రత్త https://navatelangana.com/beware-of-tasmat-2/ Sat, 04 May 2024 18:09:57 +0000 https://navatelangana.com/?p=283644 ఎవరి వీపు వారికి కనిపించదన్నట్టు…. ఎవరి తప్పులు వారికి కనిపించవు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. పదేండ్లు చేసిన తప్పులను సరిదిద్దుకోకుంగా.. అ పూట గండం గడిచేందుకు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తోంది గులాబీ పార్టీ. తాము అధికారంలో ఉన్నప్పుడు లేని భయాలను ఐదు నెలల రేవంత్‌ సర్కార్‌ పాలనలో సృషించి పబ్బం గడుపుకునేందుకు బీఆర్‌ఎస్‌ నానా తంటాలు పడుతోంది. తెలంగాణ ప్రజల్లో మరోసారి భావోద్వేగాలను రెచ్చగొట్టి లోకసభ ఎన్నికల్లో పరువు నిలుపుకునేందుకు పాకులాడుతున్నది. ”హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులం టున్నారు. రేవంత్‌రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని సన్నాయి నొక్కులు నొక్కుతూ అసహనాన్ని వెళ్లగక్కుతున్నది గులాబీ దళం. తెలుగు ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త.
– కె.నరహరి

]]>
నా గతెంతకుందో? https://navatelangana.com/what-happened-to-me/ Sat, 04 May 2024 18:09:08 +0000 https://navatelangana.com/?p=283642 ఓరెల్లన్నా అంటే వొయ్యత్తన్నవారా? ఎప్పడు దీసుకవోతరటరా? కొడుకులు, కోడండ్లు,అల్లుండ్లు, బిడ్డలందరచ్చిండ్రారా? పెద్ద బలుగంరా ఆంది. అయినా ఉన్నన్ని రోజులేరా, మంచి చెడ్డా. పోయినంక ఎవరచ్చి సూత్తా ర్రా.. అయినా పోషిగాడు శిన్నోడారా? ఎన్నడన్నా బుక్కెడు బువ్వ వెట్టిండారా ఎవనికన్నా? మందికి వెట్ట పాయె, ఆడు దినకపాయె. కొడుకులు, బిడ్డలని కడుపుగట్టుకొని బతికిండు గదరా? ఈనికన్నా ముందు ఆ ముసల్ది పోవుడు నయమైంది. లేకుంటే ఎంత గోసపడునో? అర్వ కట్టం జేసింది. బంగార మసోంటి సావచ్చింది. ఈ గాడిదే శెప్పుతిన్నడారా? మూన్నెళ్లైతాంది మంచాన వడి. ఇద్దరు గాడుదులున్నా, ఎవ్వరు.. వట్టించుకోలే. సుట్టపు సూపు లెక్క అచ్చిపోయిండ్రు. ఈని మొండితనంగాక పోతేందిరా? రాయే బాపంటే, వీడు వాళ్ల దగ్గరికి వోకపాయె. వాళ్లకు ఇక్కడుండి అర్సుకునుడు వీలుగాక పాయె. ఎంగోసరా ఆంది, యాదికత్తె దుక్కమత్తది. అయినా ఆని గురించి శెపుతాన్న గాని, నా గతెంతకుందో? కొడుకులు మనోళ్ళైతే కోడండ్లు మనోళ్లైతరారా? అటు మాట్లాడితే ఇటు జూత్తరు. ఇటు మాట్లాడితే అటు జూత్తరు. ఇద్దరట్నే పాడ యిండ్రు. మా ముసల్దాని కన్నా ముందు నేనే వోవాల్రా. దాని మాటన్నా ఇంత గైశేత్తరుగని, నన్నైతే గంజిలీగను దీశేశినట్టు దీశేత్తరు. ఎల్లన్నా ఇగవోయె. ఈన తోని ఎంతసేపు మాట్లాడినా ఒడ్వది తెగది. ఓ పెద్దమనిషి అరుగు మీద గూసోని అచ్చిపోయెటోల్లతోని ముచ్చట వెట్టుడేనా? అంబటాల్లైంది. ఇంత మింగుతువుదా. అని మా ముసల్ది కోప్పడేసరికి బుక్కడంత తిందామని ఇంట్లకు వోయిన.
– ఊరగొండ మల్లేశం

]]>
బస్తీమే సవాల్‌ https://navatelangana.com/bastima-itself-is-a-challenge/ Sat, 27 Apr 2024 18:06:36 +0000 https://navatelangana.com/?p=278816 లోక్‌సభ ఎన్నికలు మూడు పార్టీలకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారయ్యాయి. బస్తీమే సవాల్‌ అన్నట్టుగా మారిన ముచ్చట ఎరుకే కదా ! ఉత్తరాన ఆశలు ఆవిరవుతున్న కొద్దీ దక్షిణాదిపై బీజేపీ కన్నేసింది. అందునా తెలంగాణలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. ఇక బీఆర్‌ఎస్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారే. కూతురు పోయి జైల్లో ఉండే, ఎంపీ సీట్లకు పోటీచేస్తేందుకు కూడా కేసీఆర్‌ పార్టీ అభ్యర్థులు సైతం వెనకడుగు ఏసిరి. ఎన్నికల ఖర్చు, ప్రచారమూ మాదే అంటనే బలవంతంగా కొందరు ‘కారు’ ఇంటి నుంచి బయటకు తీసిర్రు. ఇక కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ప్రెస్టీజ్‌గా మారే. ఎట్టాగైనా సరే ఇక్కడ రెండు డిజిట్ల సీట్లను గెలవాలే, ఢిల్లీలో రాహుల్‌ను ప్రధాన్నిజెయ్యాలే అనే పంతంతో ఉంది. ఈ మూడు పార్టీలు పైసల్‌ విపరీతంగా ఖర్చుపెట్టబట్టే. అక్కడ మోడీకి అంతా సజావుగా లేకపోగా, ఇక్కడ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు అడకత్తెరలో పోకచెక్కలా మారింది పరిస్థితి. హత విధీ !
– బి. బసవపున్నయ్య

]]>
పచ్రారమెక్కువ… పనితక్కువ! https://navatelangana.com/ten-times-less-work/ Sat, 27 Apr 2024 18:05:41 +0000 https://navatelangana.com/?p=278795 రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ పనితీరు ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా ఉంది. డబ్బు, మద్యం తదితర ప్రలోభాల్ని అరికట్టి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడుతున్నామని పదేపదే చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఈసీ పనితీరుపై ఎన్ని విమర్శలొచ్చినా కించిత్‌ పశ్చత్తాపం కనిపించడం లేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి రూ.75 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా, సగటున రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేసేస్తున్నారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ ఈసీ నిబంధనలు అమలు కావడం లేదు. మద్యం ఏరులై పారుతున్నది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారు. వార్డు మెంబర్‌ నుంచి పార్లమెంట్‌ వరకు ఏ ఎన్నికైనా దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా తెలంగాణ రికార్డును సొంతం చేసుకుంటున్నది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు తినే తిండి నుంచి మొదలుకుని సభలు, సమావేశాల వరకు పెట్టే ఖర్చు. నిబంధనలకు మించి ఎక్కువైతే కొరఢా జులిపిస్తామని కండ్లల్లో వత్తులేసుకుని కాపాలా కాస్తున్నా జరిగేది జరుగుతూనే ఉంది. పది రూపా యలు ఖర్చు చేసి పది పైసలు ఈసీకి లెక్క చూపుతున్నారు. 444 బృందాల ఎఫ్‌ఎస్‌టీ స్క్వాడ్‌, 460 బృందాల ఎస్‌ఎస్‌టీ స్వ్కాడ్‌ టీంల ఆధ్వ ర్యంలో 214 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్ల నగదు పట్టుకున్నారు. అయితే ఇం దులో ట్విస్ట్‌ ఏంటంటే పట్టుబడ్డ సొమ్ములో పోటీ చేసే అభ్యర్థులది పది శాతం సొమ్ముంటే, తొంభై శాతం సాధారణ ప్రజలది కావడం గమనార్హం. ‘ప్రచారమెక్కువ.. పని తక్కువ’ అనే పద్ధతిలో ఈసీ పనితీరు ఉందని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
-ఊరగొండ మల్లేశం

]]>
మోడీ ‘ఫోబియా’ https://navatelangana.com/modi-phobia/ Sat, 27 Apr 2024 18:04:33 +0000 https://navatelangana.com/?p=278804 పెట్టుబడులకు, కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు తెలుగు దినపత్రికలు అన్నారు శ్రీశ్రీ. ఆ రోజుల్లో తెలుగు మీడియా వాస్తవ పరిస్థితులను ఆయన కండ్లకు కట్టారు. కానీ నేడు ఒక్క తెలంగాణే కాదు దేశంలోని మెజార్టీ మీడియా పెట్టుబడులకు, కట్టుకథలకు మానస పుత్రికలుగా తయారయ్యాయి. భారతీయ మీడియా రంగానికి మోఢ ఫోబియా పట్టుకుంది. నిరుద్యోగం, ఆకలి, ద్రవ్యోల్బణం, కుదేలవుతున్న వ్యవసాయరంగం తదితర అనేక సమస్యలను గాలికొదిలేసి అయోధ్య రామమందిరం, సీఏఏ, దేశభక్తి, జాతీయతవాదం పేరిట ప్రజల్లో భావోధ్వేగాలను రెచ్చ గొడుతున్నాయి. మరోసారీ కాషాయ దళాన్ని గద్దెనెక్కించేందుకు వీరుడు, శూరుడు అంటూ మోడీ జపం చేస్తున్నాయి. నిన్నటివరకు ప్రజాస్వామ్యపు నాలుగు స్తంభాల్లో ఒకటిగా మన్ననలందుకున్న మీడియా నేడు ప్రజల దృష్టిలో పలచ నైంది. అబద్దాలను, అసత్యాలను ప్రచారం చేస్తూ మోడీని మార్కెట్‌ చేస్తున్న తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా రాబోయే ఎన్నికల్లో కాషాయ దళపతికి శృంగభంగం తప్పదు.
– కె.నరహరి

]]>
‘ఉరి’సిల్లగా… మార్చొద్దు https://navatelangana.com/dont-turn-it-into-a-hangman/ Sat, 06 Apr 2024 19:15:45 +0000 https://navatelangana.com/?p=263977 సిరిసిల్ల… ఉరిసిల్లగా మారకముందే నేతన్నలను ఆదుకోకుంటే పాత రోజులు పునరావృతమవుతాయి. కండె పోగులే మరణమృదంగాలై చేనేత కార్మికులను బలిగొన్న గతం మరోసారీ నిజం కాకుండా ఉండాలంటే సర్కార్‌ పెద్దమనసుతో తాయిలాలు ప్రకటించాలి. గడిచిన ఏడాది బతుకమ్మ చీరల పెండింగ్‌ బకాయిలు రూ.220 కోట్లు ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించకపోగా, ఈ ఏడాది చీరల ఆర్డర్లివ్వలేదు. ఫలితంగా అసాములు మరమగ్గాలకు హలీడే ప్రకటించడంతో పనులు లేక 30 వేల మంది కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన నిర్వాకానికి తోడు కేంద్రంలోని మోడీ సర్కార్‌ చర్యలు మూలిగే నక్కపై తాటిపండులా పరిణమించాయి.. టెక్స్‌టైల్‌, చేనేత బోర్డులను రద్దు చేయడంతో పాటు వాటి ఉత్పత్తులు, ముడిసరుకులపై కేంద్రం పెంచిన 12 శాతం జీఎస్టీ నేతన్నలకు శాపంగా మారాయి. సిరిసిల్ల నేత కార్మికుల దుస్థితికి తప్పు ఎవరిదనే చర్చ పక్కనపెట్టి ముందు వారిని ఆదుకునేందుకు రేవంత్‌ సర్కార్‌ వెంటనే చర్యలు చేపట్టాలి.
-ఊరగొండ మల్లేశం

]]>
పొగలు.. సెగలు… https://navatelangana.com/the-smoke-is-gone/ Sat, 06 Apr 2024 19:15:02 +0000 https://navatelangana.com/?p=263972 మనం ఇప్పుడు ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఉన్నాం. కానీ మే చివరి వారంలో ఉన్న ఫీలింగ్‌ కలుగుతోంది. ‘సూరయ్య’ దెబ్బకు ఉదయం పది దాటిందంటే చాలు… రోడ్ల మీదికి రావటానికి జనం జంకుతున్నారు. రోడ్ల మీది దాకా ఎందుకు..? ఇంట్లో ఫ్యాన్‌ కింద కూర్చున్నా శరీరం పొగలు.. సెగలూ కక్కుతోంది. లీటర్లకు లీటర్లు నీళ్లు తాగుతున్నా… ఒక్క చుక్కా బయటకు రావటం లేదు. అంతా ఒంట్లోనే ఇంకిపోతున్నవి. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే… మరోవైపు కుండలు, కూలర్లకు భలే గిరాకీ వచ్చింది. పుచ్చకాయలు, కొబ్బరి బోండాలు, నిమ్మ, చెరుకు రసాల బండ్ల వద్ద జనం క్యూ కడుతున్నారు. ఈ డిమాండ్‌ రీత్యా కాసింత లావాటి పుచ్చకాయ చెట్టెక్కి కూర్చుని రూ.వందిస్తే గానీ దిగిరానంటోంది. కొబ్బరి బోండాల్లో సాధారణ రకం, బెంగళూరు, కేరళ కాయలంటూ రకరకాల వెరైటీల్లో అమ్ముతున్నారు. సాధారణరకం ధర రూ.30గా ఉంటే, మిగతా రకాలకు రూ.60 పెట్టాల్సిందే. అదే లీటరు బాటిల్‌లో కొబ్బరి నీళ్లు నింపుకోవాలంటే రూ.130 సమర్పించు కోవాల్సి వస్తోంది. ఎండదెబ్బకు జనం జేబులు ఈ విధంగా గుల్లవుతుంటే ‘సూర్యారావు’ మాత్రం రోజుకు రోజుకి తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. 40, 43, 45 డిగ్రీలనుకుంటూ వేలం పాటలాగా ఉష్ణోగ్రతలతో హీటెక్కిస్తున్నాడు. బాబ్బాబూ.. మీలో ఎవరైనా వాడికి తెలిసిన వాడుంటే, కాస్త చెప్పండి, ఈ ఉక్కపోత నుంచి, ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం కల్పించమని…అలా చేస్తే ఆయనక్కూడా నాలుగు కొబ్బరి బోండాలు కొట్టిద్దాం…
– బి.వి.యన్‌.పద్మరాజు

]]>
కరెంటోళ్లా.. మజాకా..! https://navatelangana.com/carentola-is-funny/ Sat, 06 Apr 2024 19:14:24 +0000 https://navatelangana.com/?p=263970 ఎవ్వరి మాటా వినడు సీతయ్యా… అన్నట్టు, కరెంటోళ్లు ఈ మధ్య హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం మీద సీరియస్‌ అయ్యారు. ‘అది ఐపీఎల్‌ మ్యాచ్‌ అయితే ఏంటి..? ఇంటర్నే షనల్‌ క్రికెట్‌ స్టేడియం అయితే ఏంటి..?’ నా బిల్లు నాకు కట్టకపోతే కరెంటు కట్‌చేసి పడేస్తామంతే…అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అవటమే కాదు… మొన్నటి హైదరాబాద్‌-చెన్నై మ్యాచ్‌కు ఒకరోజు ముందు ఉప్పల్‌ స్టేడియానికి కరెంటు కట్‌చేసి పడేశారు. దెబ్బకు హైదరా బాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)కు దిమ్మతిరిగి బొమ్మ అగుపడ్డది. కరెంటు డిపార్టుమెంటోళ్లని బతిమిలాడు కున్నారో లేక బిల్లు మొత్తం కట్టేశారో తెలీదుగానీ, మ్యాచ్‌ రోజు మాత్రం స్టేడియానికి కరెంటు సరఫరా అయింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే తరహాలో బడాబాబుల పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదా యాలు కరెంటు బిల్లులు ఎగ్గొడితే… కత్తెరతో కరెంటు తీగలు కట్‌చేసి, ముక్కు పిండి బిల్లు వసూలు చేయాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రజలు…
– కె.నరహరి

]]>
లక్ష కోట్లు https://navatelangana.com/lakh-crores/ Sat, 02 Mar 2024 18:32:33 +0000 https://navatelangana.com/?p=240286 మీకు తెలుసానుల్ల.. గియ్యాల రాష్ట్రంల ఎక్కడజూసిన రూ.లక్ష కోట్ల మాటే ఇనబడుతుండే. గండ్ల ఏముంది అనుకుంటున్నర.. గండ్లనే ఉంది అసలు సంగతి. సారు, కారు సర్కారు కథ కంచికిపాయే. పెద్దసారుగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు అప్పుతెచ్చి మనలను, మన పిల్లగాండ్లను అప్పులపాలు జేసిండని ఉత్తమ్‌ సారు పదే పదే చెప్పబట్టే. మేడిగడ్డ బొందలగడ్డగా మార్చిండనే ఇమర్మలు ఒక్కటే చేయబట్టే. తండ్రీకొడుకులు అప్పులు కట్టాలని మంత్రులు సైతం అల్టీమేటమ్‌ ఇయ్యబట్టే. చల్‌ నేనెందుకు కడత అని గులాబీ బాస్‌ అనబట్టే. కానీ ఈళ్ల లొల్లిల జనం పరేషాన్‌ కాబట్టిరీ. ఎందుల్ల ఈళ్ల గొల రోజూ అని. మేడిగడ్డ పగుళ్లు చూస్తే గుండె గుబుల్‌ అనబట్టే. అచ్చే నెలల మళ్లీ ఎంపీ ఎలచ్చన్లు రాబట్టే. ఎక్కడ అర్థమైతలేదు 80 ఎయిల పుస్తకాలు చదివిన పెద్దసారుకు. చట్టం ప్రకారం కచ్చితంగా యాక్షన్‌ తీసుకుంటమని రేవంత్‌ సార్‌ గవర్నమెంటు బరాబర్‌ చెప్పబట్టే. మీకు సమజైందనుకుంటే ముచ్చట. మనకెందుకు అనుకోకుర్రీ. ఉంట మరీ.
– బి. బసవపున్నయ్య

]]>
కహానీ కమలం https://navatelangana.com/kahani-kamalam/ Sat, 02 Mar 2024 18:31:44 +0000 https://navatelangana.com/?p=240283 ‘పొద్దున లేస్తే చాలు. ఆ మతం ఇట్ల జేసింది. ఈ మతం అట్ల జేస్తోంది. వాటి వల్ల మన మతం ఆగమాగమైపోతుంది. మనం కలిసి ఉండాలే. లేకపోతే మన మతానికే ముప్పు వస్తుంది.’ ఇలా నిత్యం రెచ్చగొట్టే మాటలు చెప్తరు. వారి యవ్వారం చెప్పేటోనికి వినేవాళ్లులోకువ అన్నట్టు ఉంది. రాష్ట్రంలో అయితే పాత బస్తీపై పడి ఏడుస్తరు. దానిపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని రెచ్చగొడతారు. ప్రతిరోజు పాత బస్తీ ఉగ్రవాదులకు అడ్డా మారింది అని అంటరు. ఎంతో కోపంతో ఊగిపోతరు. బీజేపీ నేతలు బండి సంజరుకుమార్‌, అర్వింద్‌కుమార్‌, రాజాసింగ్‌, కిషన్‌రెడ్డి ముందు వరసలో ఉంటారు. అక్కడ ఎంఐఎంను ఓడించేందుకు వారి దగ్గర మాత్రం ప్లాన్‌లేనట్టుంది. ఐదేండ్లకోసారి బీజేపీ తరుపున ఎవరో ఒకర్ని అక్కడ పోటీకి నిలబెడతారు. కానీ వీళ్లు మాత్రం అక్కడ పోటీచేయరు. కనీసం ఈసారైనా హైదరాబాద్‌ పార్లమెంటు స్థానంలో వారిలో ఎవరో ఒకరు పోటీ చేస్తారని కమల శ్రేణులు ఎంతో ఆశగా ఎదురు చేశారు. వారి నమ్మకాన్ని ఈసారి కూడా నిలబెట్టుకోలేదు. అదే బండి సంజరు మళ్లీ కరీంనగర్‌లో పోటీకి దిగుతున్నరు. అర్వింద్‌ నిజామాబాద్‌లో, కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లో పోటీ చేస్తున్నరు. హైదరాబాద్‌లో మాత్రం పోటీ చేయరు. ఎందుకంటే అక్కడ నుంచి పోటీ చేస్తే అరణ్యవాసం తప్పదనే భయం. మతం లేదు, గితం లేదు. వారికి సీటు మాత్రమే కావాలి. అక్కడ టికెటిచ్చామంటే, ఇచ్చాం అనిపించుకుంటారు. వారి ఉరుములు, మెరుపులు రాజకీయం కోసమే తప్ప ప్రజల కోసం కాదు. నిజంగా ధైర్యముంటే, మీ మాటలకు విలువ ఇచ్చి ఉంటే, మీలో ఎవరో ఒకరు హైదరాబాద్‌ పార్లమెంటు స్థానంలో పోటీ చేయాలంటూ మీ అభిమానులే అడుగుతున్నారు. లేకపోతే మీరు చెప్పేవన్నీ కహానీ అని అనుకుంటరు.
– గుడిగ రఘ

]]>
అపహాస్యం https://navatelangana.com/ridicule/ Sat, 02 Mar 2024 18:30:50 +0000 https://navatelangana.com/?p=240280 అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య గత కొద్దిరోజులుగా సాగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్ల ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మధ్య మొదలైన యుధ్ధం చిలికి చిలికి గాలివానలా మారి, మంత్రులు, ఎమ్మెల్యేలకు తగులుకుంది. తగదునమ్మా అంటూ సందెట్లో సడేమియలా, ప్రాపకం కోసం చిన్నాచితక గల్లీ లీడర్లు సైతం ఇందులో తల దూర్చుతున్నారు. అసలు విషయమేమిటంటే బీఆర్‌ఎస్‌ను పుట్టి ముంచిన మేడిగడ్డ నుంచి మొదలై ఇరు పార్టీల నేతల రాజీనామాల వరకు సాగింది. ఒక్క సీటు గెలిచి చూపించూ అని ఒకరంటే, నువ్‌ గెలిచిన పార్లమెంట్‌ నియోజకవర్గంలో బోనీ కొట్టలేదని కౌంటర్‌…. దమ్ముంటే రాజీనామా చేయాలని ఒకరంటే… సిద్దమని మరొకరూ…వైరి పక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. విద్యా, వైద్యం, రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తారని ప్రజలు ఓట్లేసి గెలిపించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు, ఆపదకు, సంపదకు తమ వెన్నంటే ఉంటారని అధికార పీఠం కట్టబెట్టారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా వ్యక్తిగత స్వార్థం కోసం రాజీనామాల రాజకీయాలకు పాల్పడుతున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రజలెన్నుకున్నది ఐదేండ్లు అండగా ఉంటారనే తప్ప, ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు కాదు. ఇప్పటికైనా డ్రామాలకు తెరదించి క్షేత్ర స్థాయిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెడితే మరోసారి పట్టం కడుతారు. లేకుంటే ఇంటికి పంపడం ఖాయం.
– ఊరగొండ మల్లేశం

]]>
బదనామైత…ప్రచారానికి పోను.! https://navatelangana.com/i-will-not-go-for-campaigning/ Sat, 28 Oct 2023 18:45:05 +0000 https://navatelangana.com/?p=138991 వామ్మో ఆయన ప్రచారానికి నేను పోను. నేను ప్రచారానికి పోయిన తర్వాత ఎన్నికల ఫలితాల్లో ఆయనకు మెజార్టీ తగ్గితే నేను బదనాం అయిత. ఎందుకంటే ఆయన పెట్టిన షరతులు అలా ఉన్నాయి. హుజుర్‌నగర్‌లో 50 వేల మెజార్టీకి ఒక ఓటు తగ్గినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఆ నియోజకవర్గపు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రజలకు చెబుతున్నారు. దీనిపై మన హన్మంతన్న గాంధీభవన్‌లో సరదాగా స్పందించారు. ‘ఉత్తమ్‌ 50వేల మెజార్టీ గురించి ఎందుకు చెబుతున్నారో, ఆయన్ను ఎవరు అడిగారో, అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి. రేవంత్‌, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలని సవాల్‌ విసురుతున్నారేమో తెలియదు కానీ నేనైతే హుజుర్‌నగర్‌ ఎన్నికల ప్రచారానికి పోనంటే పోను’ అని తెగేసి చెబుతున్నారు. ‘నేను ప్రచారానికి పోతే అనుకోని పరిస్థితుల్లో 50 వేల మెజార్టీలో ఒక ఓటు తగ్గినా ఆ ఓటు హనుమంతరావు వల్లే పోయిందంటాడేమో, ఇంకెవరూ ఆయన ఎన్నికల ప్రచారానికి పోయినా మెజార్టీ తగ్గడానికి వారే కారణమంటాడేమో’ అని వ్యంగ్యంగా స్పందించారు. ‘నేను కూడా హుజుర్‌నగర్‌లో ప్రచారానికి పోవడానికి జంకుతున్నాను. ఎవరు ప్రచారానికి రాకుండా ఉత్తమ్‌ ప్లాన్‌ చేసినట్టున్నాడు. నా వల్ల ఒక ఓటు తగ్గినా ఆ బదనాం నేను మోయలేను. ఇదెక్కడి లొల్లిరా బై…ఊకే ఇంట్లో కూర్చొక.. నాకెందుకు రాబై ఇదంతా…నా వల్ల ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం నాకిష్టం లేదు.’ అంటూ నవ్వులు పూయించారు.
– గుడిగ రఘు

]]>