Sopathi Archives - https://navatelangana.com/category/sopathi/ Sat, 04 May 2024 18:04:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Sopathi Archives - https://navatelangana.com/category/sopathi/ 32 32 యే దిల్‌ ‘మ్యాంగో’ మోర్‌!! https://navatelangana.com/ye-dil-mango-more/ Sat, 04 May 2024 18:03:49 +0000 https://navatelangana.com/?p=283635 Ye Dil 'Mango' More!!వేసవి అంటేనే మామిడి పండ్లు, మామిడి పండ్లు అంటేనే వేసవి. సీజనల్‌గా వచ్చే ఈ పండ్లు వేసవిలో ప్రతి ఒక్కరి నోరూ ఊరించడం వీటి నైజం. ఘుమఘుమల వాసనతో మదిని నింపేస్తాయి. ప్రపంచంలో ఎన్ని రకాల పండ్లు ఉన్నా మామిడి పండ్లు మాత్రం చాలా ప్రత్యేకం. మంచి రంగు, రుచి, వాసనతో మనుషులను ఇట్టే ఆకర్షించేస్తాయి. అందుకే వీటిని కింగ్‌ ఆఫ్‌ ఫ్రూట్‌ – పండ్లలో రారాజుగా పిలుస్తుంటారు. వేసవిలో అందరి కళ్లు మామిడి చెట్లమీదే. ఆకుల మధ్యన వేలాడే పచ్చి మామిడికాయలను చూడగానే ఎంతటి వారికైనా నోట్లో నీళ్లు ఊరుతాయి.
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మామిడి పండ్ల సొంతం. పచ్చిగా ఉన్న మామిడి కాయలను పచ్చళ్ళు, పప్పు, కూరలు వండుతారు. పండిన వాటితో పానీయాలు, స్మూతీలు, షేక్‌లు చేస్తుంటారు.
మూడువేల ఏళ్ల క్రితమే భారతీయతలో మామిడి పండ్ల ప్రస్తావన ఉంది. అయితే పాశ్చాత్య దేశాలకు ఈ పండ్లు చేరి వందల సంవత్సరాలవుతోంది. మామిడి ఆంగ్ల పేరు మ్యాంగో మళయాల పదం ‘మన్నా’ నుంచి పుట్టింది. 1498 ప్రాంతంలో కేరళతో పోర్చుగీస్‌ వాళ్లు సుగంధ ద్రవ్యాల వాణిజ్యం నిర్వహించేవారు. భారత్‌, పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాలకు మామిడి జాతీయ పండు. మామిడి వృక్షం బంగ్లాదేశ్‌ జాతీయ వృక్షం. అతి ఖరీదైన మామిడి పండ్లలో అల్ఫోన్సా ఒకటి. వీటినే అఫోన్స్‌డే, అల్బుక్యుర్క్‌ అఫోస్‌, హపోజ్‌ అనే పేర్లతో పిలుస్తారు.
కొమ్మల నుంచీ గుమ్మాలకీ
మన సంస్కృతీ సంప్రదాయాల్లో మామిడికి పెద్దపీట ఉంది. మామిడి కొమ్మలు పర్వదినాల్లో గుమ్మాలకి వలస వెళ్ళి పండగ శోభని ఆహ్వానిస్తాయి. శుభ కార్యాలప్పుడు ఇండ్లకు మామిడి తోరణాలు కడతారు. యజ్ఞాలకీ, పూర్ణకుంభాలకీ, వ్రతాలకీ మామిడాకు తప్పనిసరి. మామిడితోరణాన్ని గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి రాకపోకలు సాగించే సమయంలో తలపై ఉండే బ్యాక్టీరియాను మామిడి ఆకులు పీల్చుకుంటాయి. మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోరణాలను ఆలయాల్లో కూడా కడుతుంటారు. దుస్తులు, దుప్పట్లు, తివాచీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలోను మామిడి ఆకారం చోటు చేసుకుంది.
వేసవి సీజన్‌ మార్కెట్లలో, రహదారుల పక్కన, సూపర్‌ మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తాయి. రసాలు, కోత మామిడి అని మామిడి పండ్లలో చాలా రకాలే ఉంటాయి. కొన్ని రసంతో నోరూరిస్తే కొన్ని దిట్టమైన కండతో జిహ్వ చాపల్యాన్ని పెంచుతుంటాయి. అయితే ఏ మామిడి రకాన్ని తిన్నప్పటికీ మనకు కలిగే లాభాలు ఒకేవిధంగా ఉంటాయి. వేసవిలో శరీరానికి కావల్సిన పోషకాలు మామిడితో అందుతాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
మామిడి రకాలు బంగినపల్లి, రసాలు, చిన్న రసాలు, పెద్దరసాలు, చెరుకు రసాలు, నూజివీడు రసం, అల్ఫాన్సా, ఇమాంపసంద్‌, చందూరా, రుమానియా, మల్లోవా, చక్కెర కుట్టి, చిలక ముక్కు మామిడి లేక బెంగుళూరు మామిడి, షోలాపురి, పంచదార కలశ, కోలంగోవా, ఏండ్రాసు, సువర్ణ రేఖ, పండూరి వారి మామిడి, కలెక్టెరు, కొండ మామిడి, దషేరి, జహంగీర్‌, డిల్లీ పసంద్‌, నూర్జహాన్‌, హిమాని, నీలీషాన్‌, పుల్లూర, పెరడు మామిడి, కొబ్బరి మామిడి, చాకులు, ఆచారి, జలాలు, చౌంసా, లంగ్రా, కేసర్‌… ఇన్ని రకాల మామిడి పండ్లు ఉన్నా అందరూ ఇష్టంగా తినే పండు బంగినపల్లి. అన్ని పండ్ల కంటే ఎంతో రుచిగా ఉండే ఈ పండ్లకి ఎప్పుడూ గిరాకీ ఎక్కువే. పసందైన రుచితో రాజులు, చక్రవర్తులను సైతం ఆకట్టుకున్న ఘనత మామిడికి మాత్రమే దక్కింది. ఇలా రకరకాల తన రుచులతో ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్న ఘనత మామిడి పండ్లది.
ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి అమ్ముతారు. విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని ఆమ్‌ చూర్‌ అంటారు. కొన్ని ప్రదేశాలలో ఎండపెట్టిన మామిడి ఒరుగు ముక్కలను సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు.
అందరూ ఇష్టపడే మామిడిలో పోషక విలువలూ ఎక్కువే. న్యూట్రీషినల్‌ విలువలున్న మామిడి పండ్లతో ఎన్నో రకాల వంటలు చేయొచ్చు. పచ్చళ్లలోనైతే ఆవకాయ, మాగాయ, ముక్కల పచ్చడి, మామిడి తొక్కు పచ్చడి, బెల్లపు ఆవకాయ, నూనె ఆవకాయ, పెసరావకాయ, ఇలా ఇంకెన్నో రకాలు తరతరాలుగా అందరూ అభిమానించే రుచులున్నాయి.
మామిడిపండుతో హల్వా, ఐస్‌క్రీములు కూడా తయారు చేస్తారు. ఇక షర్బత్‌లు, జ్యూస్‌ల సంగతైతే సరేసరి. రెడీమేడ్‌గా ఫ్రూటీలు, మాజాలు ఉండనే ఉన్నాయి. వివిధ గార్నిష్‌లలో మామిడి ఉపయోగి స్తుంటారు. అన్నింటికన్నా అందరికీ నచ్చేది తాండ్ర. ఇది సీజన్‌తో సంబంధం లేకుండా మామిడి రుచిని జిహ్వపై నిలుపుతుంది. ఒక్క వేసవిలో మాత్రమే లబించే ఈ సీజనల్‌ ఫ్రూట్‌లో పదిహేను శాతం చక్కెర, ఒక శాతం మాంసకృత్తులు, తగిన మోతాదులో విటమిన్లు ఉంటాయి.
ఆరోగ్యప్రదాయిని
మామిడికాయలో ఉండే విటమిన్‌ ఎ, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇమ్యూన్‌ సిస్టమ్‌ను పటిష్టంగా మార్చుతుంది. మామిడికాయలో ఉండే కెరోటిన్‌ కంటెంట్‌ వివిధ రకాల వ్యాధులను నివారిస్తుంది. వివిధ రకాల బాడీ సిస్టమ్స్‌ను, కార్డియక్‌, రెస్పిరేటరీ ఇతర నాడీవ్యవస్థను డెవలప్‌ చేయడానికి సహాయ పడుతుంది. మామిడి పండ్లలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ – ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. మలబద్దక సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
మామిడి బ్లడ్‌ ప్రెజర్‌ను నార్మల్‌ లెవల్స్‌కు తీసుకొస్తుంది. ఇందులో ఉండే సి విటమిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఆక్సిజన్‌ ఫ్రీరాడికల్స్‌ నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఇది డీజనరేటివ్‌ డిసీజ్‌ క్యాన్సర్‌ను నివారిస్తుంది. న్యూమరాలజికల్‌ ఫంక్షన్‌ మెరుగు పరుస్తుంది. ఇది కొల్లాజెన్‌ ఫార్మేషన్‌ను పెంచుతుంది. గాయాలను మాన్పుతుంది. దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మామిడి పండ్లలో ఉండే పొటాషియం హార్ట్‌ రేటును కంట్రోల్‌ చేయడానికి సహాయ పడుతుంది. గర్భధారణ సమయంలో బ్లడ్‌ వాల్యూమ్‌ పెరుగుతుంది. కాబట్టి ఎక్స్‌ ట్రా మినరల్స్‌ అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ బి6 మతిమరుపును నివారిస్తుంది. ఇది బేబీ బ్రెయిన్‌ డెవలప్‌మెంట్‌ను, నర్వస్‌ సిస్టమ్‌ను మెరుగుపరుస్తుంది. హార్ట్‌, స్కెలిటిన్‌ సిస్టమ్‌, బ్లడ్‌ వెజిల్స్‌ ఫార్మేషన్‌కు మామిడి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫొల్లెట్‌ కంటెంట్‌ బ్రెయిన్‌, స్పైనల్‌ కార్డ్‌ డిఫెక్ట్స్‌ను, లోపాలను నివారిస్తుంది. ఫొల్లెట్‌ రెడ్‌ బ్లడ్‌ సెల్స్‌, డిఎన్‌ఎ ఏర్పాటుకు సహాయపడుతుంది. కార్డియక్‌ ఫంక్షన్‌ సిస్టమ్‌కు సహాయపడుతుంది.
మామిడిపండ్లలో ఉండే విటమిన్‌ ఎ, సి లు జుట్టు నిగారింపునిస్తాయి. బాగా పండిన మామిడి పండ్ల నుండి గుజ్జు తీసి జుట్టుకు అప్లై చేయాలి. ఈ నేచురల్‌ ట్రీట్మెంట్‌ వల్ల హెయిర్‌ ఫాలీ సెల్స్‌ ఆరోగ్యంగా ఉంటాయి. కమర్షియల్‌ హెయిర్‌ కలర్స్‌ కంటే ఇది చాలా ఉత్తమమైనది.
కమ్మనైన రుచితో నోరంతా తీపి చేసే మామిడి పండ్లు ఆరోగ్య ప్రదాయినే కాదు, సౌందర్య సంరక్షిణి కూడా. పచ్చి/ పండు మామిడి తొక్కను ముఖానికి, చేతులకు బాగా రుద్దాలి. అవసరం అయితై మిల్క్‌ క్రీమ్‌ ఉపయోగించి కూడా స్క్రబ్‌ చేయవచ్చు. 10-15 నిముషాలు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడంవల్ల సన్‌టాన్‌ పోతుంది.
బాగా పండిన మామిడిపండు గుజ్జులో అర టీస్పూన్‌ పాలు, రెండు మూడు చుక్కల తేనె మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేసి సర్క్యులర్‌ మోషన్‌లో బాగా మర్ధన చేయాలి. ఇది డెడ్‌స్కిన్‌ సెల్స్‌ తొలగిస్తుంది. బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. ముఖంలో డార్క్‌ స్పాట్స్‌ కనబడకుండా ఉండాలంటే ఎండుమామిడికాయని పొడి చేసి, దీనికి కొద్దిగా పెరుగు కలిపి ఈ పేస్ట్‌ ను ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. క్రమంగా డార్క్‌ స్పాట్స్‌ తొలగి ముఖానికి గోల్డెన్‌ గ్లో ను అందిస్తుంది.
మామిడి రసంలో నీరు, కొంచెం పంచదార కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. సూర్యుని వేడి వల్ల శరీరం వేడి స్ట్రోక్‌ తగ్గకపోతే మూత్రవిసర్జన ఆగి, మూత్రపిండాలు విషపదార్థాలతో ఓవర్లోడ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. దానిని నివారించటానికి మామిడికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది.
మరో కోణం
మామిడిపండ్లు త్వరగా మగ్గేలా చేయడానికి హానికారకమైన క్యాల్షియం కార్బైడ్‌ (కార్సినోజెన్‌) వంటి రసాయనాలు ఉపయోగిస్తున్నారు. ఫలితంగా క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉంది. సహజ సిద్దంగా పండిన వాటిని మాత్రమే తినాలి. రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లతో ఆరోగ్యానికి హాని. కాల్సియం కార్బైడ్‌లో 20 శాతం మలినాలు ఉంటాయి. ఇందులో కొద్దిగా ఆర్సెనిక్‌, ఫాస్ఫరస్‌ కాంపౌండ్‌లు ఉంటాయి. ఇవి వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కాల్షియం కార్బైడ్‌ తేమతో కలిసినపుడు విడుదలయ్యే ఎసిటిలిన్‌ వాయువు మెదడుకు ప్రాణవాయువు సరఫరాను తగ్గించి నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది. సాధారణంగా పండ్లన్నీ వాటిలో జరిగే రసాయనిక చర్యల కారణంగానే మగ్గుతాయి. కాయలు పూర్తిగా పక్వానికి రాక ముందే వాటిని కోసి మార్కెట్లకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో అవి బాగా పండినట్లుగా తయారవ్వడానికి క్యాల్సియం కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. మగ్గబెట్టిన మామిడిపండ్లు చూడటానికి పూర్తి పసుపురంగులోనే ఉన్నా వాటిపై ఆకుపచ్చని రంగులో మచ్చలు కొట్టొచ్చినట్లుగా కనబడుతుంటాయి. అలాగే మరి కొన్నింటిలో మామిడి పండు సహజసిద్దంగా పండినప్పుడు వచ్చే రంగు కంటే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
సహజ సిద్దంగా పండినవి తెలుసుకోవాలంటే మామిడి పండ్లను వాసన చూడాలి. సహజంగా పండినవి తీయని వాసనతో మధురంగా అనిపిస్తుంది.
కృత్రిమంగా మగ్గబెట్టిన పండును తింటున్నప్పుడు నోట్లోలో గొంతులో మంట పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటివి తిన్న కొంత సేపటి తర్వాత కొందరిలో కడుపు నొప్పి, డయేరియా, వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళ్ళు చేతులు లాగడం, తిమ్మెర్లు, ఫెరిఫెరల్‌ న్యూరో థెరఫి వంటి సమస్యలు వస్తాయి. పూర్తిగా పక్వానికి వచ్చి సహజసిద్దమైన రీతిలో మగ్గిన మామిడి పండులో రసం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా తియ్యగా కూడా ఉంటుంది. మామిడి పండును సహజసిద్దంగా పండేలా చేసే ఎథిలీన్‌ వల్ల పండులో రసం ఎక్కువగా ఉంటుంది.
ఒక మీడియం సైజ్‌ మామిడి పండులో 135 క్యాలరీలుంటాయి. ఒకేసారి ఎక్కువ మామిడిపండ్లు తినడం వల్ల క్యాలరీలు పెరిగి బరువు పెరుగుతారు. మామిడి పండ్లలో ఫ్రూట్‌ షుగర్‌ (ఫ్రక్టోజ్‌) అధికంగా ఉంటుంది. షుగర్‌ లేదా స్వీట్‌ కంటెంట్‌ అధికంగా ఉన్న వాటిని ఎక్కువ తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. శరీరంలో ఇన్సులిన్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి. ఆర్థ్రైటిస్‌, సైనటిస్‌ వంటి నరాల వ్యాధితో బాధపడేవారికి మంచిది కాదు. వీరు పచ్చిమామిడి, మామిడి పండ్లు, లేదా జ్యూస్‌ రూపంలో తీసుకున్నా మంచిది కాదు. మామిడి పండ్లను తినడం వల్ల కొన్ని అలర్జీలు వస్తాయి. కొంత మంది అలర్జిక్‌ రియాక్షన్‌ వల్ల కళ్లు, ముక్కు వెంబట నీళ్లు కారడం, శ్వాససమస్యలు, పొట్ట ఉదరంలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
చిట్టి చిట్కా:
మిరియాల పొడితో తింటే కాయైనా, పండైనా మామిడి అపకారం చేయకుండా ఉంటుంది.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి
8008 577 834

]]>
ఉత్తమ చిత్రంగా మొదటి ఆస్కార్‌ గెలుచుకున్న ‘వింగ్స్‌’ https://navatelangana.com/wings-won-the-first-oscar-for-best-picture/ Sat, 04 May 2024 18:01:33 +0000 https://navatelangana.com/?p=283632 ఉత్తమ చిత్రంగా మొదటి ఆస్కార్‌ గెలుచుకున్న 'వింగ్స్‌'అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ ప్రతి సంవత్సరం ఉత్తమ చిత్రాలకు అకాడమీ అవార్డులిస్తుంది. వీటినే ఆస్కార్స్‌ అంటాం. ఆస్కార్‌ అవార్డులు 1929 నుండి మొదలయ్యాయి. మొదటి సంవత్సరం ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డ్‌ గెలుచుకున్న సినిమా ‘వింగ్స్‌’. అన్ని కేటగిరీలకు అవార్డు ఇచ్చిన తరువాత ఆఖరున ఈ అవార్డు ప్రకటిస్తారు. ఉత్తమ చిత్రంగా ఓ చిత్రం ఎన్నికవడం, ఆ సినిమాకు సంబంధించినవారందరికీ గర్వకారణం అవుతుంది.
1927, 28 లలో నిర్మించిన చిత్రాలను ఆ సంవత్సరం అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఔట్‌ స్టాండింగ్‌ పిక్చర్‌గా ‘వింగ్స్‌’, యూనిక్‌ అండ్‌ ఆర్టిస్టిక్‌ పిక్చర్‌ కేటగిరీలో ‘సన్‌ రైజ్‌’ సినిమాలు ఆ సంవత్సరం ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. అయితే మొదట వరుసలో వింగ్స్‌కే అవార్డు ప్రకటించారు. తరువాత ఈ అవార్డుని ‘బెస్ట్‌ పిక్చర్‌’గా మార్చడం జరిగింది. అలా మొదటి ఆస్కార్‌, లేదా అకాడమీ ఆవార్డు పొందిన ఉత్తమ చిత్రంగా ‘వింగ్స్‌’ చరిత్రలో నిలిచిపోయింది.
వింగ్స్‌ చిత్రం మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తీసిన సినిమా. ఇది ఆ తరువాత వచ్చిన విమానయాన చిత్రాలకు ప్రేరణగా నిలిచింది. 1929 సైలెంట్‌ సినిమాలు మెల్లిగా మాయమవుతూ ఉన్నాయి. వింగ్స్‌ని ముందు పూర్తి మూకీ చిత్రంగా నిర్మించారు. తరువాత ప్రేక్షకులకు మూకి చిత్రాలపై విముఖత పెరుగుతుందని గ్రహించి సమకాలీకరించబడిన సౌండ్‌ ఎఫెక్ట్స్‌, సంగీతాన్ని జోడించి ఈ చిత్రాన్ని మళ్లీ రిలీజ్‌ చేసారు. ఇతర మూకీ సినిమాలవలే సంభాషణలు అవసరమైన చోట రాసి తెరపై ప్రదర్శించారు. ఇది యుద్ధ నేపథ్యంతో వచ్చిన సినిమా. కాని ఇది ముక్కోణపు ప్రేమ కథ కూడా. ఆ సంవత్సరం ఈ చిత్రానికి విశేషమైన ఆదరణ లభించింది. ఇప్పటికీ పెరిగిన టెక్నాలజీతో గొప్ప చిత్రాలను నిర్మించినా హాలీవుడ్‌లో యుద్ధ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో వింగ్స్‌ మొదటి వరుసలో నిలుస్తుంది.
వింగ్స్‌కు దర్శకత్వం వహించింది, విలియం. ఎ. వెల్మాన్‌. ఈయన మొదటి ప్రపంచ యుద్ధంలో మిలటరీ పైలట్‌గా పని చేశారు. అందుకే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో దర్శకులుగా ఎన్నుకున్నారు. ఇక అప్పట్లో పారమోట్‌ స్టూడియోలో ప్రాధాన నటి క్లారా బౌ. ఈమె ఈ చిత్ర కథానాయిక కూడా. అమెరికా’స్‌ బారు ప్రెండ్‌ అని ముద్దుగా ప్రజలు పిల్చుకున్న చార్ల్స్‌ ఎడ్వర్డ్‌ రోగర్స్‌ ఈ సినిమాలో మొదటి కథానాయకుడు జాక్‌ పావెల్‌గా నటించారు. రెండవ కథానాయకుడు డేవిడ్‌ పాత్రను రిచర్డ్‌ ఆర్లెన్‌ పోషించారు. ఈయనకు కెనడాలో మొదటి ప్రపంచ యుద్ధంలో పైలట్‌గా పని చేసిన అనుభవం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో విమాన శిక్షకుడిగా కూడా పని చేశాడు రిచర్డ్‌. సినిమాకు కథ అందించిన జాన్‌ మాంక్‌ సాండర్స్‌ కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్లోరిడాలో విమాన శిక్షకుడుగా పని చేసారు. అందుకే సినిమా వాస్తవ యుద్ధ వాతావరణానికి అతి దగ్గరగా ఉంటుంది. ముందు కథ పూర్తిగా యుద్ద్ధ నేపథ్యంలో రాసుకున్నా క్లారా బౌకు ఉన్న విశేష ప్రజాదరణ కారణంగా ఆమెని ఈ చిత్రంలో తీసుకోవాలని ప్రేమ కథగా దీన్ని మార్చారు.
ఈ సినిమాను అప్పట్లోనే ఎంతో డబ్బు ఖర్చు చేసి తీసారు. యుద్ధ సన్నివేశాల కోసం, వందల కొద్ది ఎక్స్‌ట్రా నటులను తీసుకుని దాదాపు 300 పైలెట్లను ఉపయోగించుకున్నారు. అమెరికా వైమానికా దళం ఈ సినిమా కోసం తమ పైలట్లను, ప్లేన్లను ఇచ్చింది. జర్మనీతో అమెరికన్లు, ఫ్రెంచి వారు కలిసి 12 నుంచి 15 సెప్టెంబర్‌ 1918, న జరిపిన యుద్ధాన్ని బాటిల్‌ ఆఫ్‌ సెంట్‌ మిహైల్‌ అంటారు. ఆ యుద్ధం సంఘటనలు యథావిధిగా చిత్రించారు దర్శకులు. దీని కోసం యుద్ధంలో పాల్గొన్న వారి దగ్గర ఎంతో సమాచారాన్ని సేకరించి, ఆ యుద్ధంలో పైలెట్ల ప్రణాళికలను తెలుసుకుని తమ సినిమాలో ఆ సంఘటనలను యధావిధిగా చిత్రించారు. దీని కోసం అమెరికా వైమానిక దళాలు పూర్తి మద్ధతుని ఈ చిత్ర పరివారానికి ఇచ్చారు.
అమెరికాలోని ఓ చిన్న పట్టణంలో జాక్‌ పావెల్‌, డేవిడ్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ పెరుగుతారు. ఇద్దరికీ తమ స్నేహితురాలు సిల్వియా లూయిస్‌ అంటే ప్రేమ. జాక్‌ మధ్య తరగతికి చెందిన యువకుడు. ఇతనికి కార్లు, ఇతర వాహనాలంటే విపరీతమైన ఆసక్తి. పాత కారుని కొత్తగా మార్చుకుని అందులో ఆనందం పొందుతాడు. ఈ వాహనాల పిచ్చి కారణంగా యుద్ధంలో పైలెట్‌ శిక్షణ కోసం తన పేరు నమోదు చేసుకుంటాడు. పక్కింట్లో ఉండే మేరీ ప్రెస్టట్‌ జాక్‌ని ప్రేమిస్తుంది. ఆమెతో కలిసి సమయాన్ని గడిపే జాక్‌ మాత్రం సిల్వియాని ఇష్టపడతారు. దీనికి కారణం డేవిడ్‌ సిల్వియాను ఇష్టపడడమే. డేవిడ్‌ తల్లిదండ్రులు ధనవంతులు. తండ్రి సైనికుడిగా పని చేసి కాళ్లు పోగొట్టుకుంటాడు. ఆ ఇంటి వాతావరణం కారణంగా కూడా డేవిడ్‌ పైలట్‌గా యుద్ధంలో పని చేయడానికి పేరు నమోదు చెసుకుంటాడు.
యుద్ధ సమయంలో ఇద్దరికీ పిలుపు వస్తుంది. జాక్‌ సిల్వియా దగ్గర సెలవు తీసుకోవాలని వస్తాడు. సిల్వియా డేవిడ్‌కి కానుకగా తన ఫొటో వెనుక ప్రేమ సందేశం రాసి ఓ లాకెట్‌ ఇవ్వడానికి సిద్దం చేస్తుంది. అది తన కోసమే అనుకుని జాక్‌ అది సిల్వియా నుండి చొరవగా లాకుంటాడు. యుద్ధానికి వెళ్తున్న అతన్ని బాధపెట్టలేక సిల్వియా మౌనంగా ఉండిపోతుంది. ఇది చూసిన డేవిడ్‌కు, జాక్‌ మొహం చూసి తానేమీ అడ్డు చెప్పలేకపోయానని, తాను ప్రేమిస్తుంది డేవిడ్‌నే అని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెబుతుంది సిల్వియా.
డేవిడ్‌ తల్లి ఓ చిన్న బొమ్మను డేవిడ్‌ చిన్నతనం గుర్తుగా దాచుకుంటుంది. డేవిడ్‌ ఆ బొమ్మను తనతో తీసుకెళతాడు. తల్లి తండ్రులు భారమైన మనసుతో అతనికి వీడ్కోలు పలుకుతారు. జాక్‌ ప్రయాణానికి బైలుదేరినప్పుడు మేరి కన్నీళ్ళతో అతనికి వీడ్కోలు పలుకుతుంది. సిల్వియా ప్రేమలో మునిగి ఉన్న జాక్‌ ఆమె ప్రేమను అర్ధం చేసుకోలేడు. శిక్షణ పొందే దళంలో డేవిడ్‌, జాక్‌ ఇద్దరూ కలుస్తారు. ముందు ఒకరిపై మరొకరు ద్వేషాన్ని, కోపాన్ని ప్రదర్శించుకున్న క్రమంగా మంచి స్నేహితులవుతారు. వీరి స్నేహం పైలట్లందరినీ ఆకట్టుకుంటుంది. ఇద్దరూ కష్టమైన యుద్ధ రీతులను ప్రదర్శించి తమ దేశానికి పేరు తీసుకువస్తారు. జాక్‌ తన విమానంపై తోకచుక్క బొమ్మ వేసుకుంటాడు. అతన్ని అందరూ తోకచుక్క పైలట్‌ అని పిలుస్తారు.
డేవిడ్‌, జాక్‌లతో పాటు వారి ఆవాసంలో వైట్‌ అనే మరో పైలట్‌ ఉంటాడు. అప్పుడే పరిచయమైన అతను కొన్ని నిముషాలలోనే యుద్ధంలో మరణించడం డేవిడ్‌ జాక్‌లను కలిచి వేస్తుంది. తమ జీవితంలో నిత్యం పొంచి ఉన్న ప్రమాదాన్ని వాళ్ళు గుర్తిసారు. ఈ వైట్‌ పాత్రలో గేరో కూపర్‌ మొదటిసారి తెరపై కనిపిస్తారు. తరువాత హాలీవుడ్‌ కథానాయకుడిగా ఈయన చరిత్ర సష్టించారు. వింగ్స్‌లో ఓ పది నిముషాలు కనిపించే పాత్రతో మొదటిసారి తెరంగేట్రం చేసారు ఆయన.
మేరి కూడా డేవిడ్‌ ప్రేమలో మునిగి యుద్ధంలో ఆంబులెన్స్‌ డ్రైవర్‌గా చేరుతుంది. యుద్ధంలో చూపిన ధైర్య సాహసాలకు డేవిడ్‌ జాక్‌లకు పారిస్‌లో సెలవు గడిపే అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. ఆ సమయంలో తాగిన మత్తులో అమ్మాయిలతో సరదాగా గడిపుతున్న జాక్‌ను మేరి చూస్తుంది. అందులో కొందరు జాక్‌తో అతి చనువు తీసుకోవడం చూసి భరించలేక ఆమె జాక్‌ను తన గదికి తీసుకొస్తుంది. తాగిన మత్తులో ఉన్న జాక్‌ మేరిని గుర్తు పట్టడు. అప్పుడే యుద్ధం తీవ్రమై సైనికుల సెలవుని ప్రభుత్వం రద్దు చేసిందనే సమాచారం వస్తుంది. హోటల్లో గడుపుతున్న సైనికులను తీసుకువెళడానికి ఓ దళం వస్తుంది. వీరికి హోటల్‌ గదిలో బట్టలు మార్చుకుంటున్న మేరి కనిపిస్తుంది. ఆ పక్కన మత్తులో దొర్లుతున్న జాక్‌ని చూసి ఆ సైనికులు వారిద్దరిని ప్రేమికులనుకుంటారు. మేరి చేతిలో యుద్ధ యూనిఫాం చూసిన వాళ్ళు ఆమె తప్పు చేసిందని నిర్ధారించి ఆమెను సస్పెండ్‌ చేస్తారు. దీనితో మేరి తన స్వగ్రామం వెళ్ళిపోతుంది. ఈ వార్తను జాక్‌ పేపర్‌లో చదువుతాడు. మేరి యుద్ధంలో చేరిందని అతనికి అలా తెలుస్తుంది. ఆమె రిజైన్‌ చేసి వెళ్లిందని పేపర్‌లో వస్తుంది. అతనికి పారిస్‌లో తనను గదికి తీసుకెళ్ళింది మేరి అన్నది కూడా తెలియదు. మేరి రిజైన్‌ చేసే నైజం ఉన్న అమ్మాయి కాదని ఆమెలో పట్టుదల ఎక్కువని జాక్‌ చెప్తున్నప్పుడు. తప్పు చేసిన అమ్మాయిలను ఇలా పంపించేస్తారని తోటి పైలెట్‌ అంటాడు. దానితో జాక్‌కి చాలా కోపం వస్తుంది. మేరి గురించి తప్పుగా మాట్లాడావని ఆ పైలేట్‌ పై కోపాన్ని ప్రదర్శిస్తాడు. అతను మేరి నీ ప్రేమికురాలని నాకు తెలియదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా వింటున్న డేవిడ్‌కి జాక్‌ మేరిని ప్రేమిస్తున్నాడని అయితే సిల్వియా మోజులో ఇది అతను గ్రహించట్లేదని అర్ధం అవుతుంది.
సెంట్‌ మిహెల్‌ యుద్ధం మొదలవుతుంది. ఈసారి తాను తిరిగి రానని అనిపిస్తుందని డేవిడ్‌ జాక్‌తో చెబుతాడు. జాక్‌ ఈ విషయాన్ని పట్టించుకోడు. మాట మార్చడానికి తన దగ్గర కూడా ఓ అదష్ట తాయత్తు ఉందని డేవిడ్‌కు చెబుతాడు. సిల్వియా యిచ్చిన లాకెట్‌ను చూపిస్తాడు. అది చూపించేటప్పుడు అందులో సిల్వియా ఫొటో జారి పడిపోతుంది. ఫొటో వెనుక డేవిడ్‌కు ప్రేమతో అని సిల్వియా రాసిన వాక్యం డేవిడ్‌కు కనిపిస్తుంది. సిల్వియా తననే ప్రేమిస్తుందని డేవిడ్‌కు పూర్తిగా అర్ధం అవుతుంది. కాని యుద్ధానికి బయలు దేరే ముందు నిజం తెలిస్తే జాక్‌ మనసు గాయపడి కోపంతో ప్రమాదం తెచ్చుకుంటాడేమో అని డేవిడ్‌ భయపడతాడు. అందుకని ఆ ఫొటో తీసుకుని చింపేస్తాడు. ఆ ముక్కలను లాక్కున్న జాక్‌కు డేవిడ్‌ పై చాలా కోపం వస్తుంది. అతను మిత్ర ద్రోహి అని తూలనాడుతూ కోపంతో విమానం ఎక్కి డేవిడ్‌కు సరయిన వీడ్కోలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఈ గొడవలో ప్రతిసారి తనతో తీసుకెళ్లే బొమ్మను డేవిడ్‌ మర్చిపోతాడు. దాన్ని తల్లి దీవెనగా తలచుకుని ఎప్పుడు తనతో ఉంచుకునే డేవిడ్‌ ఇప్పుడు అది లేకుండానే ఆకాశంలోకి తన విమానంతో వెళ్ళిపోతాడు.
డేవిడ్‌ ఎక్కిన విమానం శత్రు శిబిరాల మధ్య కూలిపోతుంది. అతను మరణించాడన్న వార్త జాక్‌ పరివారానికి చేరుతుంది. డేవిడ్‌ చింపిన ఫొటో ముక్కల వెనుక సిల్వియా రాసిన వాక్యాన్ని చదివి విషయం జాక్‌కు అర్ధం అవుతుంది. డేవిడ్‌ తనను ఎంతగా ప్రేమించాడో తెలుసుకున్న జాక్‌ అతను దూరమైన బాధను శత్రువులపై కోపంగా మార్చుకుని శత్రు విమానాలను కూల్చి జర్మన్‌ పతాకాలను ఆ విమానాల నుండి సేకరించి డేవిడ్‌కు నివాళి ప్రకటిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. భయంకరమైన యుద్ధ విమానాల మధ్య తన ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధం చేస్తాడు. ఎన్నో విమానాలను కూల్చి పడేస్తాడు.
చనిపోయాడనుకున్న డేవిడ్‌ గాయపడి కొన్ని రోజులుగా శత్రు శిబిరాల మధ్యనే దాక్కుని ఓ జర్మన్‌ ప్లేన్‌ను దొంగలిస్తాడు. దాన్ని తమ శిబిరాల వైపుకు నడుపుకుంటూ వెళ్తాడు. జాక్‌ విమానం శత్రు విమానాల పై దాడి చేస్తూ ఉంటుంది. విమానంపై ఉన్న తోక చుక్కను చూసి డేవిడ్‌ అందులో ఉన్నది జాక్‌ అని తెలుసుకుంటాడు. అతన్ని బిగ్గరగా సహాయం కోసం పిలుస్తూ ఈ విమానంలో తానున్నానని చెప్పాలని ప్రయత్నిస్తాడు. కాని కసితో కోపంతో ఉన్న జాక్‌కి ఈ పిలుపు వినిపించదు. ఈ విమానంపై బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. అది దగ్గరలో ఉన్న ఓ ఇంటిపై కూలి పోతుంది. ఆ ఇంట్లో ఓ తల్లి అసహాయంగా పడున్న డేవిడ్‌ని చూస్తుంది. అవి అతని ఆఖరి ఘడియలు అని అర్ధం చేసుకుంటుంది. గోడ బైట జర్మన్‌ విమానం పై నుండి జెండాను సేకరిస్తున్న జాక్‌ని పిలిచి ఆఖరి ఘడియల్లో ఉన్న వ్యక్తిని ఓ సారి చూడమని పిలుస్తుంది. జాక్‌ లోపలికి వెళ్లి అక్కడ ప్రాణాలతో కొట్టుకుంటున్న డేవిడ్‌ను చూసి నిర్ఘాంతపోతాడు. డేవిడ్‌ జర్మన్‌ విమానం ఎందుకు నడుపుతున్నాడని అడుగుతాడు. మిత్రుడిని చూసిన డేవిడ్‌ తాను ఆ విమానం దొంగతనం చేసి తప్పించుకుని తమ శిబిరాల వైపుకు వస్తున్నానని చెప్తూ, ఇలా మరణిస్తున్నందుకు తనకు బాధ లేదని, తాను జాక్‌ను క్షమిస్తున్నానని చెప్తాడు. డేవిడ్‌ తాను జాక్‌ కోసమే అంత కసిగా జర్మన్‌ విమానాల పై గుళ్ళ వర్షం కురిపించానని, అతని మరణానికి బదులు తీర్చుకుంటున్నానని అనుకుంటున్నానని చెప్తూ కన్నీరు కారుస్తాడు. మిత్రుడు తననెంత ప్రేమిస్తున్నాడో తనకు తెలుసని, జాక్‌ని తానూ అంతలా ప్రేమిస్తున్నాని చెప్తూ డేవిడ్‌ కన్ను మూస్తాడు. అతని అంత్యక్రియలను జాక్‌ నిర్వహిస్తాడు.
యుద్ధం ముగిసిన తరువాత జాక్‌ తన ఊరు తిరిగి వెళతాడు. అతనికి ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతారు. ఆ సమారోహంలో కూడా డేవిడ్‌ లేని లోటు జాక్‌కి ముల్లులా మనసులో గుచ్చుకుంటూ ఉంటుంది. అతను డేవిడ్‌ తల్లిదండ్రులను కలవడానికి వెళతాడు. తనతో డేవిడ్‌ అదష్టంగా భావించే బొమ్మను తీసుకుని వెళతాడు. అది చూసి డేవిడ్‌ తల్లి కన్నీళ్ళ పర్యంత మవుతుంది. డేవిడ్‌కు యుద్ధంలో ప్రభుత్వం బహుకరించిన మెడల్‌ను అతని తండ్రికి ఇస్తాడు జాక్‌. డేవిడ్‌ తల్లి కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకుంటాడు. దానికి ఆమె నిన్ను నేను క్షమిస్తున్నాను జాక్‌. తప్పు నీది కాదు యుద్ధానిది అంటుంది.
యుద్ధంలో జరిగే ప్రాణహాని ఆ చంపుకోవడం చూస్తే మనిషి సష్టించిన ఈ మారణహోమం అతన్ని ఓ పావుగా చేయడం ఎన్నో సందర్భాలలో తెలుస్తుంది. ఒకరిని ఒకరు చంపుకునే సైనికుల యుద్ధం దేశాల మీదకాని వ్యక్తుల మీద కాదు. కాని దేశం పేరుతో ఒకరినొకరు చంపుకుంటూ తాము సోదరులమనే భావాన్ని మర్చిపోయి గుండు పేలుస్తుంది ఎవరు, అవి తగిలి మరణిస్తుందెవరు అర్ధం కాని అయోమయిపు స్థితిలోకి వెళ్లిపోతారు. అదే యుద్ధంలోని అతి పెద్ద విషాదం. ఆ విషాదమే ఇద్దరు ప్రాణ మిత్రులు ఒకరినొకరు కాల్చుకునే స్థితికి తీసుకువచ్చింది. సినిమా ముగింపులో చాలా లోతు ఉంది. అందుకే ఈ సినిమా నేటికీ సంబంధిత యుద్ధ సినిమాగా సినీ ప్రేక్షకులను అలరిస్తుంది.
చివరికి మేరీ జాక్‌లను కలిపి కథను ముగించారు దర్శకులు. ఈ సినిమాలో చిత్రించిన యుద్ధ సీన్లు, ఆకాశంలో ఆ విమానాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, ఆ విమాన వ్యూహాలు, వీటి మద్య ఓ అందమైన ప్రేమ కథ, ఇద్దరు స్నేహితుల అనుబంధం, ఇవన్నీ సంభాషణలు లేకుండా చిత్రీకరించడం ఇప్పుడు ఈ రీతిలో చేయడం కష్టమే. అందుకే ఈ అపురూపమైన చిత్రానికి ఎంతో ఆదరణ ఉంది. ఈ చిత్రం నెగిటివ్‌ చాలా కాలం దొరకలేదు. దీన్ని పోగొట్టుకున్నామనే అనుకున్నారు అంతా. కాని ఓ స్పేర్‌ నెగెటివ్‌ పారిస్‌లో దొరికాక దీన్ని మళ్లీ రిలీజ్‌ చేయగలిగారు. అమెరికా వైమానికాదళం 1968లో స్వయంగా ఈ సినిమాను రీప్రింట్‌ చేసి ఓ పుస్తకం రూపంలో కూడా దీన్ని రిలీజ్‌ చేసింది. అంతగా ఇది అమెరికా దళంలో ఓ భాగం అయింది.
హాలీవుడ్‌ సినిమాను అధ్యయనం చేస్తున్నప్పుడు వింగ్స్‌ని మరో రెండు విషయాలలో గుర్తుచేసుకుంటారు. ప్రేక్షకులు. మొదటిసారి స్త్రీ, పురుష నగ శరీరాలను కెమెరా బహిర్గతపరిచింది ఈ సినిమాలోనే. సైనికుల పరీక్షల సమయంలో దూరంగా పురుష దేహాలను, హోటల్‌ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటున్న మేరీ వక్షాన్ని కేమెరా ఓ అరక్షణం చూపిస్తుంది. అదే అప్పట్లో పెద్ద సంచనలం. ఇక పేరిస్‌ హోటల్లో సైనికులు ఆడిపాడే సీన్లో మొదటి సారి ఓ లెస్బియన్‌ జంట ఒకరి కళ్లలోకి మరొకరు ఓరగా చూసుకుంటూ ఉండగా కెమెరాకు చిక్కుతారు. ఈ దశ్యాలకు మొదలుగా వింగ్స్‌ సినిమాని ప్రస్తావిస్తారు విశ్లేషకులు.
ఏమైనా మొదటి ఆస్కార్‌ గెలుచుకున్న ఈ ఉత్తమ చిత్రం నిజంగా ఓ అపురూపమైన సినిమా. సినీ ప్రేమికులు తప్పకుండా చూడవలసిన గొప్ప మూకీ చిత్రం కూడా.

– పి.జ్యోతి,
98853 84740

]]>
మీ పిల్లలు బెదిరింపులకు గురౌతున్నారా? https://navatelangana.com/are-your-children-being-bullied/ Sat, 04 May 2024 17:59:31 +0000 https://navatelangana.com/?p=283629 మీ పిల్లలు బెదిరింపులకు గురౌతున్నారా?ఈమధ్య తరచుగా పిల్లలు బెదిరింపులు గురౌతున్నారు. బెదిరింపు లేదా సైబర్‌ బెదిరింపులు అనుభవించడం వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా బలహినులవుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలును ఈ హింస నుండి ఎలా రక్షించాలో తెలియదు. వేధించే వారు సాధారణంగా పెద్దవారై ఉంటారు. జనాధారణ పొందిన వారో, ఉన్నత సామాజిక స్థితి లేదా అధికార స్థానంలో ఉన్న వారై ఉంటారు. వీరి వల్ల పిల్లలు బెదిరింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బెదిరింపులకు గురయ్యే వారు అట్టడుగు వర్గ, పేద, అమ్మాయిలు, వైకల్యాలున్న వారు లేదా వలస వచ్చిన శరణార్థి పిల్లలు.
బెదిరింపును గుర్తించే లక్షణాలు: ఉద్దేశం, పునరావృతం, శక్తి. వేధించే వ్యక్తి శారీరక హాని చేసేందుకు ప్రయత్నిస్తాడు. లేదా బాధ కలిగించే మాటలు పదేపదే అంటుంటాడు. అబ్బాయిలపై కూడా ఈ మధ్య కాలంలో శారీరక వేధింపులు బాగా పెరిగిపోయాయి. అయితే బాలికలు మానసిక వేధింపులకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది.
ెదిరింపు వ్యక్తి నుండి జరగవచ్చు లేదా ఆన్‌లైన్‌లోనూ జరగవచ్చు. సైబర్‌ బెదిరింపు తరచుగా సోషల్‌ మీడియా, మెసేజ్లు, ఇన్‌స్టంట్‌ మెసేజ్లు, ఈ మెయిల్‌ లేదా పిల్లలు ఇంటరాక్ట్‌ అయ్యే ఏదైనా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ ప్లాట్‌ఫారమ్‌లలో తమ పిల్లలు ఏం చేస్తున్నారో నిత్యం చూడలేకపోవచ్చు. దాంతో పిల్లలు ఎప్పుడు వీటికి ప్రభావితమవుతారో తెలుసుకోవడం కష్టం.
బెదిరింపులు పిల్లలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయి. భౌతిక ప్రభావాలతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. డిప్రెషన్‌తో పాటు మాదకద్రవ్య దుర్వినియోగానికి, పాఠశాలల్లో పిల్లల పనితీరు తగ్గడానికి దారితీస్తుంది. వ్యక్తిగత బెదిరింపులకు భిన్నంగా సైబర్‌ బెదిరింపులు ఎక్కడైనా, ఏ క్షణంలోనైనా జరగవచ్చు. ఇది తీవ్రమైన హాని కలిగిస్తుంది. పాఠశాలలు సైతం బెదిరింపులకు మినహాయింపు కాదు.
పిల్లలు సురక్షితంగా ఉండడానికి…
1.బెదిరింపు గురించి మీ పిల్లలకు అవగాహన కల్పించండి
బెదిరింపు అంటే ఏమిటో తెలుసుకుంటే మీ పిల్లలు దానికి గురౌతున్నా, ఇతర పిల్లలు బెదిరింపులకు గురౌతున్నా సలుభంగా గుర్తించగలుగుతారు.
2. పిల్లలతో బహిరంగంగా మాట్లాడండి
బెదిరింపు గురించి మీరు మీ పిల్లలతో ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది. వారు దానిని చూసినా లేదా అనుభవించినా మీతో సులభంగా చెప్పుకోగలుగుతారు. కనుక ప్రతిరోజూ మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. తరగతి, చదువుకు సంబంధించిన విషయాలే కాకుండా వారి భావాల గురించి కూడా ఆరా తీయండి.
3. మీ బిడ్డ సానుకూల రోల్‌ మోడల్‌గా ఉండేందుకు సహాయం చేయండి బెదిరింపులో మూడు పార్టీలు ఉన్నాయి: బాధితుడు, నేరస్థుడు, ప్రేక్షకుడు. పిల్లలు వేధింపుల బారిన పడకపోయినా, వారు తమ తోటివారితో కలిసి మెలిసి గౌరవంగా, దయతో ఉంటే బెదిరింపులను నిరోధించవచ్చు. వారు బెదిరింపును చూసినట్లయితే బాధితురాలి కోసం నిలబడవచ్చు, మద్దతును అందించవచ్చు లేదా బెదిరింపు ప్రవర్తనలను ప్రశ్నించవచ్చు.
4. మీ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడండి : మీ పిల్లలను తరగతుల్లో చురుకుగా ఉండేలా చూడండి. సంఘంలో వారు ఇష్టపడే కార్యకలాపాలలో చేరమని ప్రోత్సహించండి. ఇది వారిలో విశ్వాసాన్ని అలాగే స్నేహితుల సమూహాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది.
5. రోల్‌ మోడల్‌గా ఉండండి : ఇతరులు చెడుగా ప్రవర్తించినప్పుడు మీరు ఎలా మాట్లాడతారో, చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నారో అదే పిల్లలకు నేర్పించండి. ఇతర పిల్లలతో, పెద్దలతో దయ, గౌరవంతో ఉండాలని పిల్లలకు నేర్పించండి. ఆన్‌లైన్‌లో ఎలాంటి పోస్టులు పెట్టాలో కూడా పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. కనుక మీరు పిల్లలకు రోల్‌ మోడల్‌గా ఉండాలి.
6. పిల్లల ఆన్‌లైన్‌ అనుభవంలో భాగం అవ్వండి
మీ పిల్లలు ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌లతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ప్రపంచం ఎలా కనెక్ట్‌ చేయబడిందో మీ పిల్లలకు వివరించండి. వారు ఆన్‌లైన్‌లో ఎదుర్కొనే విభిన్న ప్రమాదాల గురించి వారికి తెలియచేప్పండి.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

]]>
ఆశయ పథంలో ‘ఆయన’ https://navatelangana.com/he-is-on-the-path-of-ambition/ Sat, 04 May 2024 17:58:05 +0000 https://navatelangana.com/?p=283628 'He' in the Path of Ambitionకామ్రేడ్‌ చెన్నుపాటి చంద్రశేఖరరావు కమ్యూనిస్టు కార్యకర్తగా ఎన్నో ఒడిదుడుకులు, వాటిని దాటుకుంటూ ఎదుర్కొన్న పరీక్షలు, సాధించిన విజయాలు అనేకం ఆయన జీవితంలో కనిపిస్తాయి.ఆయన పోరాట జీవితాన్ని ఎర్రపూల వనంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తనతో పెనవేసుకున్న ఘటనలు, ముడివేసుకున్న సందర్భాలు, చెరిగిపోని సన్నివేశాలు కాలక్రమేణా వారిలో భాగమవుతాయి. కానీ విప్లవ నాయకులకు మాత్రం అరెస్టులు, నిర్బంధాలు, జైళ్లు వారి జీవితంలో నిత్య భాగంగా ఉంటాయి. అలాంటి పోరాటయోధుడే చెన్నుపాటి. అరవై ఏండ్ల వైవాహిక జీవితాన్ని పురస్కరించుకుని ‘ఆశయపథంలో నేను’ అనే పుస్తకాన్ని రాశాడు. తండ్రి చెన్నుపాటి వెంకటేశ్వరరావు జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు చేసిన పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అనేక సందర్భాల్లో అరెస్టయి జైలు జీవితం కూడా గడిపాడు. వారసత్వ ప్రభావం సహజంగా చంద్రశేఖర రావును కమ్యూ నిస్టు ఉద్యమంలోకి నడిపించింది. అయితే తండ్రి చనిపోయేవరకు అంటే తొంభై ఏండ్ల వయసులో కూడా తనకు ప్రేరణగానే నిలిచాడని నాన్న గురించి గొప్పగా చెప్పడం చూస్తుంటే వారి కుటుంబానికి సమాజం పట్ల అంకితమైన సేవను అర్థం చేసుకోవచ్చు.
చంద్రశేఖరరావుది నాన్నది ఏపీలోని కృష్ణా జిల్లా అయినప్పటికీ వలసొచ్చి స్థిరపడింది మాత్రం తెలంగాణలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లా, ములుగు మండలం, గోవిందరావుపేట గ్రామం. 1964 సంవత్సరంలో కమ్యూనిస్టు అంతర్గత సిద్ధాంత చర్చలు జరుగుతున్న క్రమంలో ఆయన కుటుంబమంతా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వైపు నిలిచారు. అప్పటి పోరాట నాయ కులు పోట్ల రామనర్సయ్య, ఓంకార్‌ నాయకత్వంలో పనిచేశారు. కమ్యూనిస్టు ముఖ్యనేతలైన మోటురు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి వారి ఇంట్లో జరిగే సమావేశాల్లో రాజ కీయ రిపోర్టులు ఇచ్చేవారు. అంతకుముందు పుచ్చలపల్లి సుందరయ్యగారు, మాకినేని బసవపున్నయ్య గారూ కూడా వచ్చారు. చెన్నపాటి పెద్దనాన్నలైన వీరపనేని కృష్ణమూర్తి, వీరపనేని రామదాసుతో పాటు ముగ్గురు అన్నదమ్ములు స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి ఉద్యమాలతో మమేకమయ్యారు. వీరే కాదు మొత్తంగా వీరి కుటుంబం నుంచి పదహారు మంది కమ్యూనిస్టు పార్టీకి మూలస్తంభాలుగా ఉంటూ అభ్యుదయవాదులుగా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలనే తమ భుజాలపై మోశారు.
చంద్రశేఖరరావు 1949 ఏప్రిల్‌ 4న జన్మించారు. తండ్రి పోరాట వారసత్వం, పెద్ద నాన్నలు,అన్నదమ్ముల్లంతా కూడా కమ్యూనిస్టు పార్టీలోనే పనిచేశారు. ఈయన చిన్నతనం నుంచే ఆ భావజాలంతోనే పెరిగారు. ముఖ్యంగా ఈ పుస్తకంలో వారి కుటుంబం సీపీఐ(ఎం) ఉద్యమాల్లో ఎలా ంటి పాత్ర పోషించిందో చెప్పడంతో పాటు గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలిం చిన తీరు కనిపిస్తుంది. వారి కుటుంబ నేపథ్యానికి ఉన్న కమ్యూనిస్టు చరిత్రతో చంద్రశేఖరరావు చదువుకునే రోజుల్లోనే పెద్దపెద్ద నాయకుల పేర్లు విన్నాడు.1964లో పార్టీ చీలిన తర్వాత ఎబికె ప్రసాద్‌ సంపాదకత్వాన జనశక్తి పార్టీ అధికార పత్రికగా వస్తుండేది. అందులో ప్రచురితమైన వ్యాసాలను ఊళ్లోవాళ్లకు చదివి వినిపించేవాడు. వియాత్నంలో అమెరికాకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు గెరిల్లాల పోరాటగాథలు చదివి విప్లవానికి ఆకర్షితులయ్యాడు.భారతదేంలో కూడా చైనా, వియాత్నం లాగా సాయధ పోరాటాన్ని చేసి విముక్తి చేయాలని అనుకునేవాడు. విద్యార్థి, కార్మిక, పార్టీ ఉద్యమాల్లో నిత్యం పాల్గొంటూ ఆయన జీవితానికి అతనే ఓ చైతన్యపుధారను వేసుకున్నాడు.ఆయన అరెస్టయినప్పుడు కూడా బాధ కలగలేదు కానీ, సుందరయ్యగారు చనిపోయిన వార్త అతన్ని ఎంతగానో కలిచివేసింది. వెంటనే విజయవాడ వెళ్లి కడసారి చూపుతో అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అక్కడే కొంతమంది పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతో కూడా పరిచయం ఏర్పడినట్టు చెన్నుపాటి జ్ఞాపకాల్లో ఉన్నవి.
పుస్తకం ముగింపులో చెప్పిన విషయాలు చూస్తే అతి పిన్న వయసులో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన చుట్టూ జరుగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలను గమనిస్తూ ‘అసమానతలతో ఉన్న సమాజంలో నేను ఉన్నాను’ అని భావన కలిగిందని రాసుకొచ్చారు. అందుకే అధికార పార్టీ ఏదైనా కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించడాన్ని సహించని చెన్నుపాటి గ్రామం నుంచి మొదలుకుని పట్టణాల వరకు ఉద్యమ విస్తరణకు, పోరాటాలను అంకితభావంతో ముందుకు తీసుకెళ్లగలిగారు. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి గనుక సిటీ కమిటీలో ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. పూరి గుడిసెల్లో ఉంటూ, ఒక్కపూట తిని మరోపూట పస్తులుంటూ, చాలీచాలని బట్టలతో ఆస్తి లేని బడుగుల గురించి చెన్నుపాటి పడ్డ తపన అంతా ఇంతాకాదు. వారిని చైతన్యపరిచి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయాలనే దృఢ లక్ష్యంతో సాగు తున్నాడు చెన్నుపాటి. పదవీ విరమణ చేసిన తర్వాత మరింత స్వేచ్ఛగా పార్టీ ఉద్యమాలకు తోడ్పడుతూ పనిచేయడం ఆయన విప్లవస్ఫూర్తికి నిదర్శనం.
– అజయ్ కుమార్‌ 94900 99140

]]>
సంసారి సల్ల గురిగి ఎత్తేస్తె కల్లు గురిగి https://navatelangana.com/samsari-salla-gurigi-atteste-kallu-gurigi/ Sat, 04 May 2024 17:41:10 +0000 https://navatelangana.com/?p=283614 Samsari Salla Gurigi Atteshte Kallu Gurigiకొందరి మనుషుల అంతరంగం గుర్తుపట్టడం కష్టం. మీది మాటలు ఒకతీరు వుంటయి. లోపల ఇంకో తీరు కప్పిస్తయి. ‘మీద మెరుగులు లోపల పురుగులు’ లెక్కనే వుంటరు. వీల్ల రంగు బయట పడాలంటే ఏదైన గురిగి పట్టుకొని పోతే జారిపోతె తెలుస్తది. గురిగి అంటే మట్టితో చేసిన పాత్ర. గత కాలంలో ఈ పాత్రలోనే మజ్జిగ, కల్లు తీసికపోయేవారు. కల్లు తాగడు అని ప్రచారంలో వున్న పెద్ద మనిషి చేతిల గురిగి పలిగిపోతే బజార్ల తెల్సిపోయిందట. అప్పుడే పుట్టింది ‘సంసారి సల్ల గురిగి ఎత్తేస్తే కల్లు గురిగి’ అని. పగిలి పోయినంక కింద పడంగనే కల్లు వాసన వచ్చే వరకు ఆ సంసారి సంగతి బయటపడ్డది. ఇటువంటి వాల్లు అందరికి నీతులు చెప్పుతరు. అందుకే వీల్లను ఉద్దేశించే ‘చెప్పేటివి శ్రీరంగ నీతులు దూరేటివి వేరొక గుడిసెలు’ సామెత ఉద్భవించింది. మాటలు ఒకటి చేతలు ఒకటి అయితే గిట్లనే వుంటది. అయితే కొందరు కుల రీత్యా శాఖాహారులుగానే వుంటరు. మరికొందరు మాంసాహారులుగా జీవితం కొనసాగిస్తరు. పుట్టుక రీత్యా ఎట్లా వున్నా ఎవరి ఆహారపు అలవాట్లు వాల్లవే. బ్రాహ్మణ వైశ్యలు సంపూర్ణ శాఖాహారులుగానే వుంటరు. ఊర్లల్ల వీల్ల వాడలు వేరుగానే వుంటయి. ఇప్పుడంటే చికెన్‌ సెంటర్లు వచ్చినయి గానీ గతంలో ఇతరులు ఇండ్లల్లోనే కోళ్లను పెంచుకునేది. కోసుకుని వండుకుని తినేవాల్లు. కోళ్లు మాయం అయినప్పుడు ‘అందరు కోమట్లు బాపండ్లే మరి కోళ్లు ఎట్ల మాయమయినయి’ అనే సామెత గమ్మత్తుకోసం వాడేవాల్లు. ఆ కాలంలో కోళ్లను దొంగతనంగ తీసుకపోయి తినేవాల్లు. తర్వాత గుర్తుపట్టవచ్చు. వాల్ల పెంటలల్ల, పెండ్లల్ల కోడి బూరు చూసి గుర్తుపట్టవచ్చు. అట్లనే కొందరు ఒక పనికి వచ్చి అసలు ముచ్చట చెప్పనే చెప్పరు. వాల్లను ‘సల్లకు వచ్చి ముంత దాసినట్లు’ అని అంటరు. సల్ల అంటే మజ్జిగ. మజ్జిగను ఉచితంగనే తీసికపోతరు. రాంగనే సల్లపోయండి అని అనకుండ ముంత కొంగు కింద దాచుకుని వుంటరు. అట్లనే కొందరు పైన చెప్పిన రకాలే ‘తాటి చెట్టు కింద కూచోని పాలు తాగుతున్న’ అనేవాల్లు. పాలు తాగేందుకు ఇంట్లనే వుండి తాగుతరు కాని తాళ్లల్లకు ఎందుకు వెళ్లుతరు. ఎందుకంటే ‘సురాపానం’ సేవించేందుకే అని అర్థం. కాని తాగకూడని వాల్లు ఇలా సాటుకు మాటుకు తాగుతరు అన్నట్టు. ప్రతి సందర్భంలో జానపదులు ఆ తాత్వికతను బట్టి సామెతను సృష్టించుకున్నరు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

]]>
మధువు తీపిలాంటి మత్తైన పాట https://navatelangana.com/madhu-is-a-sweet-song/ Sat, 04 May 2024 17:39:27 +0000 https://navatelangana.com/?p=283611 Honey is sweet
Intoxicating songప్రేయసి కళ్ళల్లో ఉన్న కైపు ప్రియున్ని మత్తెక్కిస్తుంది. ప్రేయసి ప్రేమలోని మత్తు ప్రియుని మనసును ఉయ్యాలలూగిస్తుంది. ఆమె చేతిలో మధుపాత్ర కూడా ఉంటే ఇక మత్తులో మత్తుగా, సుతిమెత్తగా, గమ్మత్తుగా ప్రియుడు తూలిపడిపోవాల్సిందే. అలాంటి మత్తెక్కించే పాటను ‘పరమానందయ్య శిష్యులకథ'(1966) సినిమా కోసం శ్రీశ్రీ రాశాడు. ఆ పాటను చూద్దాం.
మహాకవి శ్రీశ్రీ అనగానే చాలామందికి ఉడుకెత్తించే విప్లవగీతాలో లేక పరిగెత్తించే ప్రబోధగీతాలో గుర్తుకొస్తాయి. కాని ఆయన వెచ్చవెచ్చగా, మత్తుమత్తుగా హుషారెక్కించే నిషాగీతాలను కూడా రాశాడని చాలామందికి తెలియదు. తన కవిత్వంతో ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక శకాన్ని సష్టించిన ఆ మహాకవి సినిమాకోసం ఎలాంటి సిచుయేషన్‌కైనా అలవోకగా పాటలు రాసి మెప్పించాడు. నిజానికి సినిమాకవి చేయవల్సిన పని కూడా అదే..
ప్రేయసి వలపు మత్తులో ఉంది. ప్రియుడు కూడా వలపు మత్తులో ఉన్నాడు. ఈ వలపు మత్తు వయసువల్ల వచ్చింది. వయసులోని కొంటెదనానికి వలపులోని తీయదనం తోడై మత్తు మరింత మత్తుగా ఇద్దరి మనసుల్ని ఊగిస్తోంది. చెప్పలేని ఆనందాల్లో పులకింపజేస్తోంది. అయితే ఆమె చేతిలో మధుపాత్ర ఉంది. అది ప్రియుని కోసమే తీసుకొచ్చింది. అది అతనికి తాగిస్తూ అతన్ని మధువువల్ల వచ్చిన మత్తులోను, తన కౌగిలి మత్తులోను తేలియాడించాలని ఆరాటపడుతుంటుంది. ప్రియుడు కూడా ప్రేయసి అందానికి దాసోహమంటూ మరీ మత్తులో తేలిపోతుంటాడు. ఆ ఇద్దరి ప్రణయానుభూతిని, ప్రణయావేశాన్ని పాటలో అద్భుతంగా పలికించాడు శ్రీశ్రీ.
ప్రేయసి ప్రియున్ని మన్మథునితో పోల్చుతోంది. రతిరాజా! అంటూ సంబోధిస్తుంది. అతని కోసం మధువును తీసుకొచ్చానని చెబుతోంది. అతడు రాజ్యమేలే మహారాజు. చివరలో మహారాజా! అన్న సంబోధన కూడా ఉంది. ఆ మధువు తాగుతూనే తన అందాన్ని కూడా ఆస్వాదించమనే అంతరార్థం కూడా పాటలో ఉంది. రతిరాజుగా, మహారాజుగా అతన్ని కీర్తించడం వెనుక, తన వయసును ఏలే రాజు అతడేనన్న అర్థమూ దాగి ఉంది. ప్రేయసి మాటలకు పరవశించిన ప్రియుడు ఆమె తెచ్చి ఇచ్చిన మధుపాత్రను తీసుకుని మధువును ఆస్వాదిస్తాడు.
నేను వచ్చింది నీకు మధువును అందించడానికి మాత్రమే కాదు. నీ అనురాగాన్ని నేను అందుకోవడానికి కూడా అని చెబుతుంది ప్రేయసి. నీ అనురాగంలో నేను పరవశిస్తుంటాను. నా మధువులో నువ్వు పరవశించు. అప్పుడు అంతులేని ఆనందంతో నేను ఆడుతూ, పాడుతూ ఉంటానని అంటుంది. సున్నితమైన, సన్ననైన తీగెలు పెనవేసుకుని ఊగినట్లుగా మనమిద్దరం పెనవేసుకుంటూ కలకాలం ఒక్కటిగానే ఉండిపోదామా అంటూ తన మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తుంది ఆ ప్రేయసి. అంటే.. మధువును ప్రియుడికి తెచ్చిచ్చి, అతని మనసును తాను తీసుకుంటుంది. ఇద్దరిలో ఉన్న మత్తు ఒకటై పోయి, వాళ్ళూ ఒక్కటిగా కలిసిపోతున్నారు.
ప్రేయసి పెదవిలో తీయని తేనెలున్నాయి. అంటే.. ఆమె ఇచ్చే మధుపాత్రలోని మధువు, ఆమె ప్రేమలోని మధువు మాత్రమే కాకుండా ఆమె పెదవిలో కూడా ముద్దులనే తేనెలున్నాయి. వాటిని కూడా తాగమని చెబుతుంది ప్రేయసి. ఆమె కన్నులలో ప్రణయ తరంగమూ ఉంది. అది అతన్ని స్వర్గ సుఖాల విహరింపజేస్తోంది. ఆమె పెదవిలోని తేనె, ఆమె కనులలోని ప్రణయతరంగం కలిసి ప్రవాహమై పొంగుతున్న సమయంలో ఆమె అందాన్ని అనుభవించుమని ప్రేయసి ప్రియున్ని కోరుతుంది. ఇద్దరి ప్రణయానందం అపురూపమైన ఈ పాటగా వినబడుతోంది. శ్రీశ్రీ కలంలోని ప్రణయ కవితా మాధుర్యానికి ఇదొక మచ్చుతునక.
పాట:

ఇదిగో వచ్చితి రతిరాజా!/
మధువే తెచ్చితి మహరాజా!/
అందజాలితి నీ అనురాగం/
అంతులేనిదీ నా ఆనందం/
లలితములైన లతల విధాన/
కలిసిపోదమా కలకాలం/
మగువ పెదవిలో మధుర మరందం/
చెలియ కనులలో ప్రణయతరంగం/
వెల్లువలైన ఈ సమయాన/ అనుభవింపుమా ఈ అందం..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]

]]>
పెద్దపల్లి కమాన్‌ మీద బాలల రచనల జెండా https://navatelangana.com/a-flag-of-childrens-writings-on-the-arch-of-pedpadalli/ Sat, 04 May 2024 17:36:33 +0000 https://navatelangana.com/?p=283602 పెద్దపల్లి కమాన్‌ మీద బాలల రచనల జెండాఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బాలల వికాసం కొరకు నిరంతరం పనిచేస్తూ, బాల వికాసకారులు గరిపెల్లి అశోక్‌ బాటలో నడుస్తున్న వారిలో కవి, రచయిత, ఉపాధ్యాయులు, బాల వికాసకార్యకర్త, కావ్యకర్త కందుకూరి భాస్కర్‌ ఒకరు. భాస్కర్‌ మే 5, 1979న నేటి పెద్దపల్లి జిల్లాలోని నంది మేడారం గ్రామంలో పుట్టాడు. తల్లితండ్రులు శ్రీమతి కందుకూరి సత్తమ్మ-శ్రీ చంద్రమౌళి గార్లు. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ., ఎం.కాం., బిఎడ్‌లు చదివి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.
ఇవ్వాళ్ళ బాల సాహిత్యంతో పాటు అన్ని ప్రక్రియలపై విరివిగా సమీక్షలు, వ్యాసాలు రాస్తున్న కందుకూరి భాస్కర్‌ కవిగా కూడా సుపరిచితులు. బాల వికాస కార్యకర్తగా తాను పనిచేసిన ప్రతిచోట పిల్లల సంకలనాలు, పిల్లల రచనలు సంపుటాలు ప్రచురింపజేసి బాల వికాస యజ్ఞంలో నేను సైతం అంటూ ముందువరుసలో నిలిచాడు. ఉపాధ్యాయునిగా నియామకమై ఉద్యోగం చేసిన మొదటి బడి చెగ్యాంలో పిల్లలతో రచనలు చేయించి చెగ్యాం బడిపిల్లల రచనలను ‘వెలుగు రేఖలు’గా వెలువరించాడు. 2025లో మరో బడికి బదిలీ కాగా ఆ జగదేవ్‌ పేట పాఠశాల పిల్లల రచనలను ‘చిరుదివ్వెలు’ పేరుతో ప్రచురించాడు. తరువాత పెద్దపల్లి జిల్లాలోని నర్సింహుల పల్లి పాఠశాలకు బదిలీ అయి ఆక్కడి పిల్లల రచనలను ‘పల్లె పరిమళాలు’ కథలుగా తెచ్చారు. అంతేకాదు ఇక్కడి పిల్లల కథలు కెనడా కేంద్రంగా వచ్చే గడుగ్గాయి పత్రికలో ప్రచురింపబడడం వెనుక ఈయన కృషి ఉంది. భాస్కర్‌ కృషి వల్ల మణికొండ వేదకుమార్‌ గ్రామీణ పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ‘బాల చెలిమి బాలల గ్రంథాలయం’ నర్సింహుల పల్లిలో నెలకొల్పబడింది.
కవిత్వంలోని పలు లఘు ప్రక్రియలైన మణిపూసలు వంటి వాటిలో కృషిచేసి రచనలు చేశాడు. తన విద్యార్థుల రచనలు పుస్తకాలుగా వచ్చేందుకు తోడ్పాటునందించారు. అలా వెలువడినవే బుర్ర వైష్ణవి రచించిన ‘ఆడపిల్ల’ మణిపూసల శతకం, వేల్పుల శ్రీలత బాలల కథల సంపుటి ‘నిజమైన స్నేహితులు’, పాడేటి సమజ్ఞ రచించిన ‘తెలుసుకో విద్యార్థి’ మణి పూసల శతకం. ఈ కోవలోనే నాగుల శ్రీనిత్య రచించిన పుస్తకం ‘ప్రకృతి ఒడిలో’ సంపుటి. ఈ విద్యార్థులందరి పుస్తకాలకు స్ఫూర్తిగా నిలవడమే కాక రచనల్లో మెళకువలను నేర్పాడు భాస్కర్‌. నర్సింహులపల్లె బడి పిల్లల ఇరవై ఒక్క కథల సంపుటి ‘పల్లె పరిమళం’కు ఈయనే సంపాదకుడు. బండారు బాలనంద సంఘం ‘గురుబ్రహ్మ పురస్కారం’, డా||చింతోజు బ్రహ్మయ్య- బాలమణి బాలసాహిత్య పురస్కారం’, ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వెల్గటూరు ఉపాధ్యాయ పురస్కారం’ వంటివి భాస్కర్‌ అందుకున్న పురస్కారాలు, సత్కారాలు.
బాల సాహిత్యకారుడుగా భాస్కర్‌ తొలి పుస్తకం ‘సిరిమల్లెలు’ పేరుతో బాలల కోసం రాసిన వివిధ ముఖ్య దినోత్సవాల సందర్భంగా పాడుకునే పాటలు. ఇందులోని పాటలన్నీ వివిధ సమయాలు, సందర్భాలు, పండుగలు, పబ్బాల సమయంలో, రూట్‌ మార్చ్‌ మొదలు పాఠశాలల్లో జరిగే ఉత్సవాల కోసం రాసినవి. తొలి గీతం ‘తెలంగాణ’. ఇందులో తెలంగాణ వీరులను, అమరులను తలచి పాట రాశాడు భాస్కర్‌. ‘జై కొట్టు తెలంగాణ బిడ్డ/ కీర్తి పెంచు నీ పురిటి గడ్డ’ అంటూ ఘనమైన, భవ్యమైన తెలంగాణ బంగారు చరితను ఆయన కీర్తిస్తాడు. ఇందులో సర్వాయి పాపన్న, కొమరం భీం మొదలుకుని ఇక్కడి వనరులు, స్థలాలు, కీర్తి, మహత్తును కీర్తిస్తాడు. ఇది జూన్‌ 2 ఆవిర్భావ దినోత్సవం కోసం రాసింది. ప్రకృతిని, పర్యావరాణ మహత్తును గురించి రాసిన మరో మంచి పాట ‘ప్రకృతియే లేకుంటె మనమెక్కడ/ ఈ సృష్టికి మూలం ప్రకృతియే కాదా/ వనసంపదనంతా నరికివేస్తూ/ బతకుల బుగ్గిపాలు చేయద్దురా/ జలసంపదనంతా కాలుష్యం చూస్తూ/ నీటిని వృధా చేవద్దురా’ అంటూ పర్యావరన కార్యకర్తగానే కాక ఒక బడి బాధ్యునిగా పిల్లలకు చక్కని నడతను, నడవడికలను తన రచనలతో అందించే ప్రయత్నం చేశాడు. ప్రముఖుల జయంతులు, వర్దంతుల సందర్భాల కోసం కూడా భాస్కర్‌ బాల గీతాలు రాసాడు. వాటిలో ‘అలుపెరుగని ఉద్యమ పోరాట యోధుడా!’ అంటూ ఆచార్య జయశంకర్‌ గురించి, ‘తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కాళన్నా’ అంటూ కాళోజీ గురించి, ‘స్వాతంత్య్ర స్వప్నమునే నెవేర్చిన బాపూజీ’ అంటూ జాతిపిత మహాత్మాగాంధీని, ‘మిస్సైల్‌ మ్యాన్‌ మీకు సలాం’ అంటూ అబ్దుల్‌ కలాం గురిచి, ఇంకా శ్రీనివాస రామానుజన్‌, సావిత్రీబాయి ఫూలే, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, సర్‌ సి.వి. రామన్‌ వంటి అనేక మంది వీరి పాటల్లో పిల్లలకు అందారు. ‘వందనాలు వందనాలు’ అంటూ బడిలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవం గురించి, ‘చదువు చదువు చదువు/ చదువేరా కంటికి వెలుగు/ చదువు చదువు చదువు/ చదువేరా మన ఇంటికి వెలుగు’ వంటి చక్కని పాటు ఇందులో ఉన్నాయి. ఆకంశంలోని జాబిలి ఇలపైకి వచ్చినట్టుగా ఉందని బతుకమ్మను గురించి రాసిన భాస్కర్‌ పిల్లల గురించి కూడా చక్కగా రాశాడు: ‘పిల్లలం బడి పిల్లలం/ మీ కంటి వెలుగులం/ మొగ్గలం పసిమొగ్గలం/ విరబూసే సిరిమల్లెలం’ అంటూ పిల్లలను గురించి రాస్తారు. కవిగా, రచయితగా, బాల వికాప కార్యకర్తగా పిల్లలకు నిరంతరం రచనలో మార్గదర్శనం, పాఠాలు చెబుతున్న ఈ ఉపాధ్యాయ కవి బాలల వికాసం కోసం ముందునిలిచి సైనికునిగా పనిచేస్తున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సైనికుడు, పెద్దపల్లి కమాన్‌ మీద ఎగురుతున్న బాలల రచనల జండా!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

]]>
చెట్టు సాక్ష్యం https://navatelangana.com/tree-evidence/ Sat, 04 May 2024 17:34:21 +0000 https://navatelangana.com/?p=283607 చెట్టు సాక్ష్యంఐదవ తరగతి చదువుతున్న వినరు స్కూల్‌ నుండి రాగానే బ్యాగ్‌ని బాల్కనీలో పడేసి బాధగా ఇంట్లోకి వచ్చేడు.
”ఏమైంది వినరు అలా వున్నావు?” అని అమ్మ తలని తడుముతూ అడిగింది.
”మా కొత్త తెలుగు సార్‌ ఒక్కొక్కరిని లేపి ఒక కథ చెప్పమన్నారు. అందరూ చెప్పారు. నేను చెప్పలేక పోయాను సిగ్గేసింది” అని బదులిచ్చాడు.
”అయ్యో ఇంతేనా.. ఇంకేమోనని కంగారు పడ్డాను. ఐరాల నుండి మీ తాత వచ్చారు. రాత్రికి కథ చెపుతారు గానీ ఫ్రెష్షై రా. స్నాక్స్‌ తిని హోమ్‌ వర్క్‌ కంప్లీట్‌ చేద్దువు” అంటూ కిచెన్లోకి వెళ్ళింది.
వినరుకి ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందానని ఆతురతో త్వరత్వరగా పనులు పూర్తి చేసుకున్నాడు.
రాత్రి భోజనాలు అయ్యాక తాత, మనవడు మిద్దె మీద పడక వేసుకున్నారు. తాత పడక మీద నడుం వాల్చాడు. వినరు తాత పొట్ట మీద కూర్చోని కథ చెప్పమన్నాడు. ఉండరా చెపుతానని వక్కపలుకు నోట్లో వేసుకొని నములుతూ మనవడిని పొట్టమీద నుండి లేపి, మోకాళ్ళు మడిచి కాళ్ళపై వేసుకుని ఊయలలూపుతూ కథ చెప్పడం మొదలెట్టాడు.
రామాపురంలోని రామయ్య, సోమయ్య ఇద్దరూ మంచి మిత్రులు. వానలు కురవక కరువొచ్చి ఊరంతా ఆకలితో మాడి పోతున్నది. ఇద్దరు మిత్రులు చంద్రగిరికి పనుల కోసం వలసి పోయారు. చంద్రగిరిలో ఇల్లు కట్టేదానికి పునాదులు తవ్వే పని దొరికింది. పగలు పని చూసుకొని రాత్రిపూట చంద్రగిరికోటలో పడుకొనేవారు. ఇక మూడురోజులు పని చేస్తే వారం కూలీ ఇస్తారు. ఆదివారం పనికి సెలవు కాబట్టి ఐరాల కెళ్ళి దుడ్లు ఇచ్చి రావాలనుకున్నారు. ఐదోరోజు పునాదులు తవ్వుతుంటే లంకెబిందె దొరికింది. బిందె నిండా బంగారు ఆభరణాలు. ఎవ్వరూ చూడలేదు కాబట్టి రహస్యంగా ఓ పొదలో దాచిపెట్టారు. వారం రోజుల కూలీ దుడ్లు తీసుకొని పాతగోనె సంచిలో లంకెబిందెను దాచుకొని, చంద్రగిరిలో రైలెక్కి పాకాలలో దిగి ఐరాలకు నడవడం మొదలెట్టారు. దామలచెరువు కాడికొచ్చాక మర్రిచెట్టు నీడలో అలుపు తీర్చుకోవడానికి ఆగారు. రామయ్య అలసటతో నిద్రపోయాడు. సోమయ్యకు కుట్రబుద్ధితో నిద్రపట్ట లేదు. రామయ్య అడ్డుతొలిగించుకుంటే లంకెబిందె తన సొంతం అవుతుందని, రామయ్య గుండెలమీద బండ వేశాడు.
రామయ్య నెత్తురు కక్కుకుంటూ ”మిత్రద్రోహీ ఈ చెట్టే సాక్ష్యం నీవు ఇంతకింతకూ శిక్ష అనుభవించే తీరుతావని” అంటూ చనిపోయాడు. సోమయ్య గబగబా రామయ్య శవాన్ని పారే ఏటిలో పారేశాడు. చూస్తుండగానే రామయ్య శవం కొట్టుకు పోయింది. సోమయ్య రామాపురం వెళ్ళి ఆనందంగా బతుకుతున్నాడు.
సంవత్సరం తరువాత సోమయ్య తన పెళ్ళాంతో ఊరెళుతూ మర్రిచెట్టు దగ్గర ఆగి పకపకా నవ్వాడు. ఎందుకయ్యా నవ్వుతున్నావని అడిగిన భార్యకు రామయ్య కథ చెప్పి ”ఏదీ నోరు లేని చెట్టు సాక్ష్యం చెప్పిందా” అని పడిపడీ నవ్వాడు. సోమయ్య పెళ్ళాం పక్కింటి సీతమ్మతో ఎవ్వరికీ చెప్పొద్దు అంటూ రామయ్యకథ చెప్పేసింది. ఆనోటా ఈనోటా పడి అందరికీ తెలిసిపోయి సోమయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ”సత్యాన్ని ఎంతలోతు గోతి తీసి పాతి పెట్టినా ఏదో ఒకనాటికి బయట పడుతుంది” అని తాత కథ ముగించాడు. వినరు ఆనందంతో తాతను కౌగిలించుకుని నిద్రలోకి జారుకున్నాడు.
– సురేంద్ర రొడ్డ , 9491523570

]]>
హృదయ పరిష్వంగన https://navatelangana.com/heart-attack-2/ Sat, 04 May 2024 17:26:51 +0000 https://navatelangana.com/?p=283597 హృదయ పరిష్వంగనబ్రతుకు యుద్ధంలో అదో సంధి కాలం
పూర్వపు గాయాల తాలూకు జ్ఞాపకాల
పచ్చి పుండ్లు అసంకల్పితంగానే
సలుపుతూ వేధిస్తున్న అనిశ్చితి బందీ కాలం
శబ్దిస్తున్న హదయానికి స్వేచ్ఛ వుందో లేదో
తెల్వనట్టి తెలుసుకోలేనట్టి
అపసవ్య ఆపసోపాల కాలం
కాలం వీచిన గాలికి నేను కొట్టుకు పోయానో
నేను పోతున్న వైపే గాలి వీచిందో ..
ఏ సంకల్పమో.. ఏ దఢ నిశ్చయమో
నా నావను ఇటు తిప్పేసిన ఒకానొక శుభ సూచిక
ఎన్ని అద్భుత దశ్యాలను ఆవిష్కరించిందో
అలజడుల గుండె చప్పుళ్ల మధ్య పదసడుల ఆర్తి ధ్వనుల మధ్య
అక్షరాలను వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ …
కదులుతున్న నేనొక మది తలపును
పుస్తక పువ్వుల పరిమళాలు వీస్తున్న
సంపెంగల సందర్భ కాలం అది
అవ్యాజ్య ప్రేమ పదతోరణాల నడుమ
ఓ కవనం పవనమై తాకిన స్పర్శ
ఎంత వెచ్చని సోయగమో..
ప్రేమైక చిహ్నమైన తాజ్‌ మహాల్‌లా
గుత్తులుగా పూసిన గుల్‌ మొహార్‌ పువ్వుల్లా
భావాలు గట్టిగా కమ్మేసుకున్న గాఢ అనుభూతి
ఆ క్షణం అలాగే ఆగిపోతే బాగుండు …
అమేయంగా అమోఘంగా లోలోపల హదయ పరిష్వంగన
– డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327

]]>
ఆన్‌ (ఏ) లైన్‌ https://navatelangana.com/on-a-line/ Sat, 04 May 2024 17:25:29 +0000 https://navatelangana.com/?p=283594 అంతరంగం అంతర్జాలపు వేదిక మీద ముఖచిత్రం గీసుకుంటుంది
మూకుమ్మడి దాడికి ముసుగుదొంగల మూడో కన్ను
ఎవరి రంగులు వారివి కావు
ఎవరికి వాళ్ళు కాసింత దూరంగా నెట్టివేయబడ్డవారే
ఇదో సంకల్పిత సప్తవర్ణాల చిత్రం
పగలు రేయి కలానికే తప్ప నడిచే మనిషికి సంబంధమే లేదు
ఓ దుఃఖాన్ని మోస్తున్నప్పుడు మారే డిస్‌ప్లే పిక్చర్‌లా
ఏ గడ్డకట్టిన నదులను దాటినప్పుడల్లా మార్చుకునే స్టేటస్‌లా
మాటిమాటికి మారే ఓ భావ ప్రకంపనల ప్రవాహంలో
చిల్లు పడ్డ పడవలో ప్రయాణిస్తూ ఉంటావ్‌
వ్యక్తిత్వానికి వేలం వేస్తూ వేళ్ళకొనల్లో వల్లకాడు
వసంతాలను వెతుక్కుంటున్న కోకిలలా అక్కడక్కడ వాలిపోతూ
వారానికే ఓ విలాపగీతాన్ని శిశిరంలా వెంటబెట్టుకువస్తుంది
ఒకరిని ఒకరు దోచుకోవడమో, నిందించుకోవడమో
నాగరికతకున్న అనాగరికపు లక్షణం
నిన్ను నువ్వు అవాస్తవంగానో, అవసరానికి తగ్గట్టు ఆవిష్కరించుకుంటావ్‌
ఇప్పుడు బ్రతుకులన్నీ ఆన్‌ ‘లైన్‌’
అలవాటుపడ్డ నీ జీవితాన్ని తదేకంగా చూస్తూ ఓ తరం
తనని తాను అనునయించుకుంటుంది
నిస్తేజం నీ కళ్ళకు పొరలను అల్లి
అప్‌డేటెడ్‌ వర్షన్‌ ఇన్‌ స్టాల్‌మెంట్‌ నెత్తి మీద డేటా బటన్‌ నొక్కుతుంది
ఓకానొక రోజు నువ్వంతా ఖాళి అయ్యాక ఓ బహిరంగ ప్రకటన
గుట్టురట్టు
సైబర్‌ నేరగాళ్ళ చేతిలో సంకల్పితంగా మోసపోయినా ఓ వ్యక్తి
మసకగా సన్నని అక్షరాల సమూహాంలో ఇలా రాయబడి ఉంటుంది
నిన్ను నువ్వు బహిరంగ ప్రకటించుకోవడానికి
జీవితం ఏమీ వేలం పాట కాదు కాసింతనై రహస్యంగా బ్రతకాలి
– పి.సుష్మ, 9959705519

]]>
గోరఖ్పూర్‌ ఆసుపత్రి విషాదం, వ్యవస్థ అలసత్వపు సాక్ష్యం! https://navatelangana.com/he-gorakhpur-hospital-tragedy-is-a-testament-to-the-systems-laxity/ Sat, 04 May 2024 17:23:56 +0000 https://navatelangana.com/?p=283591 గోరఖ్పూర్‌ ఆసుపత్రి విషాదం, వ్యవస్థ అలసత్వపు సాక్ష్యం!వ్యవస్థలు వ్యక్తుల మీద పగ పడతాయా? ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సమానమనే భావనా, ప్రజల చేత, ప్రజల కొరకు పాలించే ఆ వ్యవస్థలో న్యాయం అందరికీ సమానంగానే వర్తిస్తుందనీ, చట్టం ముందు అందరూ సమానులేననీ తరచూ వింటూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఇవి రాసుకున్న ఆదర్శాలు మాత్రమేనన్న విషయం బోధపడుతూ ఉంటుంది. కుల, మత, ప్రాంతీయ, భాషా విభేదాలూ, తారతమ్యాలూ, హెచ్చుతగ్గులూ ఒకటేంటి సమాజంలో ఉండే అన్ని రుగ్మతలూ షరతులు లేకుండా యదేచ్ఛగా వర్ధిల్లడం అనుభవంలో ఉన్నదే.
2017 ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బాబా రాఘవ దాస్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో అలక్ష్యం కారణంగా ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయి 60 మంది శిశువులు మరణించటంలోని వ్యవస్థ నిర్వాకాన్ని ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది. దోషులంతా ఎంచక్కా బయట తిరుగుతుంటే, పసిబిడ్డల ప్రాణాలను కాపాడటానికి తన వంతు కర్తవ్యంగా చేయగలిగిందంతా చేసిన డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ ఎందుకు నిర్దాక్షిణ్యంగా శిక్షకు గురై సర్వం కోల్పోయి, నిస్సహాయంగా న్యాయం కోసం రోడ్డున పడాల్సిన పరిస్థితుల వెనక జరిగిన ఘోరాన్ని ఈ పుస్తకం కళ్ళకు కడుతుంది.
ఏ.ఈ.ఎస్‌ అనే మెదడువాపు వ్యాధి 1978 తర్వాత 25 వేల మంది ప్రాణాలు తీసుకోవడంతో పాటు లక్ష మందిని శాశ్వత అంగవికలురుగా చేసింది. పేదరికం, సురక్షితమైన మంచినీటి సౌకర్యం, పోషణ లోపాలు, అపరిశుభ్రత, టీకా వేసుకోకపోవడం వల్ల వచ్చే ఈ వ్యాధిని కొంచెం చిత్తశుద్ధితో పనిచేస్తూ, టీకా డ్రైవ్‌ను కూడా నిర్వర్తిస్తే ప్రతి సంవత్సరం లక్షలాది పసిబిడ్డల ప్రాణాలు కాపాడబడతాయి. కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో చాలా రొటీన్‌గా పసిబిడ్డలు చచ్చిపోతుంటారు. వారికి ఆక్సిజన్‌ అవసరమవుతూ ఉంటుంది. ఆక్సిజన్‌ సప్లైదారులతో కుమ్ముకై ఆక్సిజన్‌ ప్లాంటేషన్స్‌ను వ్యాపార స్థాయికి దిగజార్చి, ప్రాణాలు పోయడానికి బదులు, పసిబిడ్డల ప్రాణాల్ని ఫణంగా ఎందుకు పెట్టారో తెలియాలంటే ఈ పుస్తకం చదివి తీరాలి.
డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ ఈ వికత చదరంగంలో ఒక పావుగా ఎందుకు శిక్ష అనుభవించాల్సి వచ్చిందో తెలుసుకుంటే అసలు సిసలైన ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయాన్యాయాల తాలూకూ డొల్లతనం తేటతెల్లమవుతుంది. ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ఢ కొనటం అనేది సామాన్యమైన విషయం కాదు. మీరు మంచి చేస్తున్నారా హాని చేస్తున్నారా అనేది ఈ వ్యవస్థకు అక్కర్లేదు. వ్యవస్థకు ఎదురు నిలబడితే సహించే పరిస్థితి ఉండదు. గురువుల్ని ప్రశ్నించే విద్యార్థీ, యాజమాన్యాన్ని ప్రశ్నించే కార్మికుడూ, వ్యవస్థను ప్రశ్నించే ఉద్యోగీ తాము న్యాయంగానే, చట్టబద్ధంగానే ప్రశ్నిస్తున్నామని చెప్పినంత మాత్రాన, ”అయ్యో పాపం నిజమే కదా!” అంటూ అవి నిమ్మళించవు. అవకాశం కోసం కాచుకు కూచుంటాయి. దీనికి మతం రంగు తోడైతే అదెంత ఘోరంగా ఉంటుందో డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ పుస్తకం చూపిస్తుంది.
డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తారు. ఆగస్టు 10 అర్ధరాత్రి రోజు ఆయన ఒక ఫోన్‌ రిసీవ్‌ చేసుకుంటారు, ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అయిపోయిందని. పిల్లల వార్డులో అప్పటికే ఆక్సిజన్‌ మీద వైద్యం జరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. ఒక్కసారిగా గుండె గుభిల్లుమంటుంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఏం చేయాలో తోచక పై అధికారులకు ఫోన్‌ చేస్తే ఎవరు సరిగ్గా సమాధానం ఇవ్వక జూనియర్‌ డాక్టర్లతో, ఇతర సిబ్బంది సాయంతో 500 సిలిండర్లను పోగుచేసి బిడ్డల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా ఆరోజు 60 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతారు.
అసలెందుకీ కొరత ఏర్పడింది? అలక్ష్యం ఎక్కడ జరిగింది? పసిబిడ్డల ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన విషాదం వెనుక సందర్భాలేమిటి? దీని వెనుకున్న కుట్ర కోణం ఏమిటి, ఈ ఆక్సిజన్‌ ప్లాంట్‌ టెండర్లు దక్కించుకోవడంలో రాజకీయ శక్తుల ప్రమేయాలేమిటో ఈ పుస్తకం నగంగా చూపుతుంది. అలక్ష్యాన్ని ప్రశ్నించారన్న కారణంగా డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ను టార్గెట్‌ చేయడమూ, వారి కుటుంబాన్ని వేధించడమూ, వారి ఆస్తులను ధ్వంసం చేయడమూ, వారి వ్యాపారాలని నాశనం చేయడమూ, కుటుంబ సభ్యుల్లో ఒకరిపై కాల్పులు జరపడమూ, ఆసుపత్రికి తీసుకు వెళ్లేటప్పుడు వెంటాడటమూ, జైల్లో సాధారణ ఖైదీగా ఘోరమైన జీవితాన్ని చవి చూపించడమూ, నెలల తరబడి జైల్లో మగ్గేలా చేయడమూ లాంటి హదయం చలించిపోయే అనేక ఉదంతాల గురించి చెప్పి కంటతడి పెట్టిస్తుందీ పుస్తకం.
ఇది పసిబిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల విషాదమే కాదు, కఫీల్‌ఖాన్‌ స్వయంగానూ, తన కుటుంబం ఎదుర్కొన్న ఒక అమానుషమైన, నిరంతర చిత్రవధకూ కూడా ప్రత్యక్ష సాక్ష్యం. ఈ పుస్తకం చదివినంత సేపూ గుండెలుపిండే వేదన. అనేకసార్లు కళ్ళు చెమ్మగిల్లుతాయి. అలక్ష్యం పట్ల ఆగ్రహవేశాలు కలుగుతాయి.
ఉద్యోగం కోల్పోయినా, కుటుంబ సభ్యుల ఆర్థిక మూలాల్ని విధ్వంసం చేస్తున్నా, నిరంతరం వెంటాడుతూ, వేధిస్తున్నా, వాళ్లు ప్రాణభయంతో విలవిలలాడిపోతున్నా ఏమీ చేయలేని తన అశక్తతని గుండెల్లో దిగమింగుకొని, ఎన్ని ఆటుపోటులెదురైనా ధైర్యంగా ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, ప్రజా మద్దతును కూడగట్టుకుంటూనే, అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే, డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ మానవీయ కోణంతో దేశవ్యాప్తంగా మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తూ రావడం అత్యంత శ్లాఘనీయం. పోతే పోనీ, హితుల్‌ సుతుల్‌, వస్తే రానీ కష్టాల్‌ నష్టాల్‌ అనుకుంటూ ముందుకెళ్ళిపోతున్న డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ ధైర్యాన్నీ, వారి న్యాయ పోరాటాన్నీ ఈ పుస్తకం చదివిన తర్వాత అభినందించకుండా ఉండలేరు.
– వి.విజయకుమార్‌

]]>
నవ్వుల్‌ పువ్వుల్‌ https://navatelangana.com/smiles-are-flowers-19/ Sat, 04 May 2024 16:49:19 +0000 https://navatelangana.com/?p=283583 టైమ్‌ సెన్స్‌
కుమార్‌ : మా సెక్రటరీ చాలా సిన్సియర్‌గా పనిచేస్తాడురా. టైమ్‌ సెన్స్‌ను బాగా పాటిస్తాడు.
హరీష్‌ : నీకెలా తెలుసు?
కుమార్‌ : ఆఫీసులో చేరిన రోజు నుంచి ఏ రోజూ టీ టైమ్‌ను మిస్‌ కాలేదు.

అంతా సమానమే
వెంకటేష్‌ : మీ ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కి ఒక్క రెక్క కూడా లేదేమిటి సార్‌?
సుబ్రహ్మణ్యం : మా ముగ్గురు పుత్రరత్నాలు ఆస్థి పంపకాల్లో తలో రెక్క లాక్కుపోయారు!

అతి తెలివి
టీచర్‌ : నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావ్‌?
విద్యార్థి : పెళ్ళి చేసుకుంటా.
టీచర్‌ : అది కాదురా.. ఏమవుతావని అడుగుతున్నా.
విద్యార్థి : పెళ్ళికొడుకునవుతా.
టీచర్‌ : నా ఉద్దేశ్యం పెద్దయ్యాక ఏం సాధిస్తావని?
విద్యార్థి : పెళ్ళికూతుర్ని సాదిద్దామనుకుంటున్నా.
టీచర్‌ : ఒరేరు… నా ప్రశ్న నీకర్థం కావట్లేదా, నేనడిగేది మీ అమ్మానాన్నల కోసం ఏం తెస్తావని?
విద్యార్థి : కోడల్ని తెద్దామనుకుంటున్నా సార్‌.
టీచర్‌ : అది కాదురా బాబూ… మీ నాన్న నీ దగ్గర్నుంచి ఏం కోరుకుంటున్నాడు?
విద్యార్థి : మనవణ్ణి.
టీచర్‌ : పోనీ… నీ జీవితాశయమేంటో అదన్నా చెప్పు?
విద్యార్థి : మేమిద్దరం, మాకిద్దరు.

]]>