Sports Archives - https://navatelangana.com/category/sports/ Thu, 17 Apr 2025 19:05:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Sports Archives - https://navatelangana.com/category/sports/ 32 32 మళ్లీ అదే కథ https://navatelangana.com/same-story-again/ Thu, 17 Apr 2025 19:05:22 +0000 https://navatelangana.com/?p=548377 Sunrisers– సన్‌రైజర్స్‌కు ఐదో పరాజయం
– 4 వికెట్లతో తేడాతో ముంబయి గెలుపు
రికార్డు టార్గెట్‌ను ఛేదించి గెలుపు బాట పట్టిన సన్‌రైజర్స్‌ కథ మళ్లీ మొదటికొచ్చింది. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు నిరాశపరిచారు. అభిషేక్‌ శర్మ (40), క్లాసెన్‌ (37) మెరిసినా 162/5 పరుగులే చేసింది. బ్యాటింగ్‌ లైనప్‌ సమిష్టి మెరుపులతో ముంబయి ఇండియన్స్‌ 18.1 ఓవర్లలోనే 166/6 పరుగులు చేసింది. 4 వికెట్ల తేడాతో సీజన్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. ఏడు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌కు ఇది ఐదో పరాజయం.
నవతెలంగాణ-ముంబయి
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిరాశపరిచింది. గురువారం వాంఖడె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్‌ 18.1 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (3/26) విజృంభించినా.. సహచర పేసర్లు, స్పిన్నర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్లలో విల్‌ జాక్స్‌ (36, 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రియాన్‌ రికెల్టన్‌ (31, 23 బంతుల్లో 5 ఫోర్లు), రోహిత్‌ శర్మ (26, 16 బంతుల్లో 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (26, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (21 నాటౌట్‌, 17 బంతుల్లో 2 ఫోర్లు), హార్దిక్‌ పాండ్య (21, 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) సమిష్టిగా రాణించారు. మరో 11 బంతులు ఉండగానే గెలుపొందిన ముంబయి ఇండియన్స్‌ విలువైన రెండు పాయింట్లతో పాటు నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులే చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (40, 28 బంతుల్లో 7 ఫోర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (37, 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. ఆఖర్లో అనికెత్‌ వర్మ (18 నాటౌట్‌, 8 బంతుల్లో 2 సిక్స్‌లు) ధనాధన్‌ సిక్సర్లతో సన్‌రైజర్స్‌కు 160 ప్లస్‌ స్కోరు అందించాడు. ముంబయి ఇండియన్స్‌ స్పిన్నర్‌ విల్‌ జాక్స్‌ (2/14) మాయజాలం చేయగా.. జశ్‌ప్రీత్‌ బుమ్రా (1/21), ట్రెంట్‌ బౌల్ట్‌ (1/29) రాణించారు.
బ్యాటర్లు విఫలం : వాంఖడెలో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్‌కు ముంబయి ఇండియన్స్‌ పేసర్లు స్లో బాల్స్‌తో పరీక్ష పెట్టారు. తొలి బంతి నుంచే షాట్లు ఆడేందుకు అభిషేక్‌ శర్మ (40), ట్రావిశ్‌ హెడ్‌ (28) ఇబ్బంది పడ్డారు. పవర్‌ప్లేలో వికెట్‌ నిలుపుకున్నా ఓపెనర్లు 46 పరుగులే చేశారు. అభిషేక్‌ ఏడు ఫోర్లతో మెరువగా.. హెడ్‌ తడబాటుకు గురయ్యాడు. హార్దిక్‌ బౌన్సర్‌కు అభిషేక్‌ నిష్క్రమించగా.. ఇషాన్‌ కిషన్‌ (2) అనవసర దూకుడుతో వికెట్‌ కోల్పోయాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (19), హెన్రిచ్‌ క్లాసెన్‌ (37) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడిగా.. ముంబయి బౌలర్లు పరుగుల కట్టడితో బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. క్లాసెన్‌ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో మెరిసినా.. బుమ్రా అద్భుత బంతికి బౌల్డయ్యాడు. అనికెత్‌ వర్మ (18 నాటౌట్‌), పాట్‌ కమిన్స్‌ (8 నాటౌట్‌) ఆఖర్లో మూడు సిక్సర్లు బాది సన్‌రైజర్స్‌కు గౌరవప్రద స్కోరు అందించారు. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో హార్దిక్‌ పాండ్య (1/42), దీపక్‌ చాహర్‌ (0/47) ధారాళంగా పరుగులు ఇవ్వగా.. ట్రెంట్‌ బౌల్ట్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, విల్‌ జాక్స్‌, మిచెల్‌ శాంట్నర్‌లు పొదుపుగా బౌలింగ్‌ చేశారు.

]]>
రాయల్స్‌ ‘సూపర్‌’ తప్పిదం? https://navatelangana.com/royals-are-super-wrong/ Thu, 17 Apr 2025 19:01:54 +0000 https://navatelangana.com/?p=548374 Rajasthan Royals– సూపర్‌ ఓవర్‌ బ్యాటర్ల ఎంపికపై విమర్శలు
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో 4 ఏండ్ల విరామం తర్వాత సూపర్‌ ఓవర్‌ ఉత్కంఠ అభిమానులను అలరించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ నిర్ణీత 20 ఓవర్ల అనంతరం టైగా ముగిసింది. ఇరు జట్లు 188 పరుగులతో సమవుజ్జీలుగా నిలువటంతో సూపర్‌ ఓవర్‌లో విజేతను నిర్ణయించారు. సూపర్‌ ఓవర్లో బ్యాటర్లుగా హెట్‌మయర్‌, పరాగ్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ ఎంచుకుంది. అర్థ సెంచరీలు బాదిన ఉత్సాహంలో ఉన్న యశస్వి, నితీశ్‌లను కాదని బౌండరీ కొట్టడంలో విఫలమవుతున్న బ్యాటర్లను ఎంచుకోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. యశస్వి జైస్వాల్‌ సూపర్‌ ఓవర్లో రాకపోవటంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘మిచెల్‌ స్టార్క్‌పై జైస్వాల్‌కు మంచి రికార్డుంది. జైస్వాల్‌ క్రీజులో ఉంటే స్టార్క్‌పై కచ్చితంగా ఒత్తిడి ఉండేది. నితీశ్‌ రానా సైతం సూపర్‌ ఓవర్లో బ్యాటింగ్‌కు రావాల్సిందని’ విశ్లేషకులు పుజారా, ఇయాన్‌ బిషప్‌లు అభిప్రాయ పడ్డారు. సూపర్‌ ఓవర్‌ను సైతం జోఫ్రా ఆర్చర్‌ బదులుగా.. సందీప్‌ శర్మకు రాయల్స్‌ అందించింది.

]]>
నేనైతే 20 ఏండ్ల నిషేధం పడేది! https://navatelangana.com/i-am-a-ban-on-20-years/ Thu, 17 Apr 2025 19:00:42 +0000 https://navatelangana.com/?p=548370 Serena Williams– డోపింగ్‌లో వివక్షపై సెరెనా విలియమ్స్‌
న్యూఢిల్లీ: ప్రపంచ టెన్నిస్‌లో పురుషులతో పోల్చితే మహిళలకు డోపింగ్‌ శిక్షల్లోనూ వివక్ష కొనసాగుతుందని టెన్నిస్‌ దిగ్గజం, అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వ్యాఖ్యానించారు. పురుషుల సింగిల్స్‌ వరల్డ్‌ నం.1 జానిక్‌ సినర్‌ ఇటీవల డోపింగ్‌లో పట్టుబడగా.. వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (వాడా) కేవలం 3 నెలల నిషేధంతో రాజీపడింది. కండరాల ఎదుగుదలకు తోడ్పడే ‘క్లోస్టోబాల్‌’ ఉత్పేరకం అవశేషాలు సినర్‌ శాంపిల్‌లో బయటపడ్డాయి. వాడా నిషేధంతో సినర్‌ అప్పీల్‌కు వెళ్లగా.. తర్వాత జరిగిన ఒప్పందంలో భాగంగా మూడు నెలల నిషేధాన్ని అంగీకరించాడు. డోపింగ్‌ అంశంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటకీ వరల్డ్‌ నం.1 సినర్‌కు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వటంపై సెరెనా విలియమ్స్‌ విమర్శలు గుప్పించింది. మసాజ్‌ థెరపిస్ట్‌ చికిత్స సమయంలో చేతి వేలికి గాయం కాగా.. అప్పుడు వాడిన ఔషధం కారణంగానే తన శాంపిల్‌లో క్లోస్టోబాల్‌ అవశేషాలు కనిపించాయని సినర్‌ వాదించిన సంగతి తెలిసిందే.
‘నాకు సినర్‌ అంటే ఇష్టం. టెన్నిస్‌ అంటే ఇష్టం. ఈ స్పోర్ట్‌లో అతడు గొప్ప ఆటగాడు. నేను ఎవరినీ కిందకు దించాలని అనుకోవటం లేదు. మెన్స్‌ టెన్నిస్‌కు సినర్‌ అవసరం ఎంతో ఉంది. కానీ అదే (డోపింగ్‌) నేను చేస్తే..కచ్చితంగా 20 ఏండ్ల నిషేధం పడేది. నిజాయితీగా చెబుతున్నా.. నా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ వెనక్కి తీసుకునే వారు’ అని సెరెనా విలియమ్స్‌ టైమ్స్‌ మ్యాగజిన్‌తో తెలిపింది. మహిళల టెన్నిస్‌లో మాజీ వరల్డ్‌ నం.1 ఇగా స్వైటెక్‌, సిమోన హలెప్‌లు సైతం డోపింగ్‌లో పట్టుబడి నిషేధం ఎదుర్కొన్నా.. అప్పీల్‌తో వ్యవధి కాలం గరిష్టంగా కుదించుకున్నారు. సినర్‌ వివాదంతో స్వైటెక్‌, హలెప్‌ అంశం సైతం విమర్శకులు చర్చకు తీసుకొస్తున్నారు. 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన సెరెనా విలియమ్స్‌ చివరగా 2022 యుఎస్‌ ఓపెన్‌లో రాకెట్‌ పట్టుకుంది. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆటకు దూరం కావటం బాధగా ఉందని సెరెనా విలియమ్స్‌ వాపోయింది.

]]>
నాయర్‌పై వేటు https://navatelangana.com/vote-on-nair/ Thu, 17 Apr 2025 18:59:24 +0000 https://navatelangana.com/?p=548366 Abhishek Nair– కాంట్రాక్టు రద్దు చేసిన బీసీసీఐ
– టెస్టుల్లో దారుణ వైఫల్యమే కారణం
ముంబయి: స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 0-3తో టెస్టు సిరీస్‌ వైట్‌వాష్‌, ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని 1-3 ఓటమికి ఆలస్యమైనా భారత క్రికెట్‌లో తొలి వికెట్‌ పడింది. టీమ్‌ ఇండియా సహాయక కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ కాంట్రాక్టును రద్దు చేస్తూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా ఏడాది కూడా పూర్తి చేసుకోని అభిషేక్‌ నాయర్‌ పనితీరుపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బోర్డు కార్యదర్శి దేవాజిత్‌ సైకియ సహా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పాల్గొన్నారు. ప్రత్యేకించి టెస్టు ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియా ప్రదర్శనపై సుదీర్ఘ రివ్యూ చేసినట్టు తెలిసింది. ఆనాటి రివ్యూ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే అభిషేక్‌ నాయర్‌ను తాజాగా తప్పించినట్టు తెలుస్తోంది.
2024 ఐపీఎల్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు గంభీర్‌తో కలిసి సహాయక కోచ్‌గా పని చేసిన అభిషేక్‌ నాయర్‌.. గౌతీ భారత జట్టు చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగానే జాతీయ జట్టులోకి వచ్చాడు. గంభీర్‌కు మూడేండ్ల కాంట్రాక్టు (2027 వరల్డ్‌కప్‌) ఇచ్చిన బీసీసీఐ.. సహాయక సిబ్బందికి ఎటువంటి కాల వ్యవధి లేకుండానే కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఐపీఎల్‌ మినహా దేశవాళీలోనూ కోచింగ్‌ అనుభవం అభిషేక్‌ నాయర్‌కు లేదు. రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రఘువంశీ వంటి క్రికెటర్లకు నాయర్‌ వ్యక్తిగత కోచ్‌గా పని చేశారు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌కు సితాన్షు కోటక్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా బీసీసీఐ ఎంపిక చేసినప్పుడే.. నాయర్‌ కాంట్రాక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, కోటక్‌, నాయర్‌లతో పాటు మరో సహాయక కోచ్‌ రియాన్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ టి. దిలీప్‌లు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టుకు పని చేశారు.

]]>
నీరజ్‌ పసిడి షో https://navatelangana.com/neeraj-pasidi-show/ Thu, 17 Apr 2025 18:58:00 +0000 https://navatelangana.com/?p=548363 Neeraj Chopra– 84.52మీ త్రోతో స్వర్ణం సొంతం
పోచ్‌ (దక్షిణాఫ్రికా): 2025 సీజన్‌ను స్టార్‌ అథ్లెట్‌, రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా ఘనంగా మొదలెట్టాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన పోచ్‌ ఇన్విటేషనల్‌ టోర్నమెంట్‌లో నీరజ్‌ చోప్రా బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. పతక వేటలో ఆరుగురు అథ్లెట్లు పోటీపడగా.. నీరజ్‌ చోప్రా సహా దక్షిణాఫ్రికా జావెలిన్‌ త్రో స్టార్‌ స్మిత్‌ (25) మాత్రమే 80 మీటర్ల మార్క్‌ దాటారు. 82.44మీటర్ల దూరంతో స్మిత్‌ రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్‌ సాధించగా.. లోకల్‌ అథ్లెట్‌ రాబర్ట్‌సన్‌ 71.22 మీటర్ల త్రోతో కాంస్య పతకం దక్కించుకున్నాడు. నీరజ్‌ చోప్రా వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. పోచ్‌లో అతడు 84.52 మీటర్ల దూరంలో బల్లెంను విసిరాడు. పోచ్‌లో పసిడితో మెరిసిన నీరజ్‌ చోప్రాకు మే 16న దోహాలో జరుగనున్న డైమండ్‌ లీగ్‌ కఠిన సవాల్‌ విసరనుంది. ప్రపంచ మేటి జావెలిన్‌ త్రో అథ్లెట్లు డైమండ్‌ లీగ్‌లో పోటీపడనున్నారు.

]]>
ఢిల్లీ సూపర్‌ విక్టరీ https://navatelangana.com/delhi-super-victory/ Wed, 16 Apr 2025 19:17:57 +0000 https://navatelangana.com/?p=547775 Super Over win over Rajasthanరాజస్థాన్‌పై సూపర్‌ ఓవర్లో గెలుపు
– జైస్వాల్‌, రానా పోరాటం వృథా
ఢిల్లీ క్యాపిటల్స్‌ జోరు కొనసాగుతుంది. ఐపీఎల్‌18లో ఐదో విజయం నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సూపర్‌ ఓవర్‌లో తేలిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ మెరుపు విజయం సాధించింది. సూపర్‌ ఓవర్లో రాయల్స్‌ 12 పరుగులు చేయగా.. క్యాపిటల్స్‌ నాలుగు బంతుల్లోనే 13 పరుగులు చేసి గెలుపొందింది. అంతకుముందు ఇరు జట్లు 188 పరుగులతో మ్యాచ్‌ను టై చేసుకున్నాయి.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. సూపర్‌ ఓవర్లో 12 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు ఉండగానే ఛేదించింది. రాహుల్‌ ఓ ఫోర్‌ బాదగా, స్టబ్స్‌ సిక్సర్‌తో లాంఛనం ముగించాడు. అంతకుముందు హెట్‌మయర్‌, రియాన్‌ పరాగ్‌ మరోసారి మిచెల్‌ స్టార్క్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతూ 5 బంతుల్లో 12/2 పరుగులు చేశారు. అంతకుముందు తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. అభిషేక్‌ పోరెల్‌ (49), కెఎల్‌ రాహుల్‌ (38) రాణించారు. ఛేదనలో యశస్వి జైస్వాల్‌ (51), నితీశ్‌ రానా (51) అర్థ సెంచరీలు బాదినా.. ఆఖరు ఓవర్లో రాయల్స్‌ 9 పరుగులు చేయలేక తడబాటుకు గురైంది.
యశస్వి, రానా ఫిఫ్టీలు
ఛేదనలో యశస్వి జైస్వాల్‌ (51, 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్‌ రానా (51, 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (31, 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రిటైర్డ్‌ హర్ట్‌గా డగౌట్‌కు చేరుకున్నా.. ధ్రువ్‌ జురెల్‌ (26, 17 బంతుల్లో 2 సిక్స్‌లు), హెట్‌మయర్‌ (15 నాటౌట్‌) రాయల్స్‌ను గెలుపు దిశగా నడిపించారు. ఆఖరు ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. మిచెల్‌ స్టార్క్‌ 8 పరుగులే ఇచ్చాడు. జురెల్‌, హెట్‌మయర్‌ బౌండరీ కొట్టడంలో విఫలమయ్యారు. 20 ఓవర్లలో 4 వికెట్లకు రాయల్స్‌ 188 పరుగులు చేసింది.
సమిష్టి మెరుపులతో..
ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెనర్‌ అభిషేక్‌ పోరెల్‌ (49, 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అదరగొట్టాడు. జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (9) మరోసారి నిరాశపరిచగా, ఫామ్‌లో ఉన్న కరుణ్‌ నాయర్‌ (0) డకౌట్‌గా నిష్క్రమించాడు. 34/2తో క్యాపిటల్స్‌ కష్టాల్లో కూరుకోగా.. కెఎల్‌ రాహుల్‌ (38, 32 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్స్‌లు)తో కలిసి అభిషేక్‌ పోరెల్‌ మూడో వికెట్‌కు 63 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. అర్థ సెంచరీకి పరుగు దూరంలో వికెట్‌ కోల్పోయిన పోరెల్‌.. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మిడిల్‌ ఓవర్లలో స్పిన్నర్లు తీక్షణ, హసరంగను సమర్థవంతంగా ఎదుర్కొన్న క్యాపిటల్స్‌ బ్యాటర్లు.. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేదు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (34 నాటౌట్‌, 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (34, 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆషుతోశ్‌ శర్మ (15 నాటౌట్‌, 11 బంతుల్లో 2 ఫోర్లు) మెరుపులతో క్యాపిటల్స్‌ 188 పరుగులు చేసింది. ఆఖరు ఓవర్లో సందీప్‌ శర్మ వరుస వైడ్లు, నో బాల్‌తో 19 పరుగులు సమర్పించాడు. రాయల్స్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (2/32) రెండు వికెట్లు పడగొట్టగా.. మహీశ్‌ తీక్షణ (1/40), వానిందు హసరంగ (1/38) చెరో వికెట్‌ తీసుకున్నారు.

]]>
రూల్స్‌కు విరుద్ధంగా ఆ బ్యాట్లు https://navatelangana.com/those-bats-in-contrast-to-the-rules/ Wed, 16 Apr 2025 18:23:58 +0000 https://navatelangana.com/?p=547766 Those bats are against the rules.ముల్లాన్‌పూర్‌ : ఐపీఎల్‌18లో అంపైర్లు క్రికెటర్ల బ్యాట్లను గ్రౌండ్‌లోనే చెక్‌ చేస్తున్నారు. పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ అంపైర్లు ఓ పరికరం సహాయంతో బ్యాట్లను తనిఖీ చేశారు. కోల్‌కత బ్యాటర్లు సునీల్‌ నరైన్‌, ఎన్రిచ్‌ నోకియా బ్యాట్లు ఐసీసీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని తనిఖీలో తేలింది. నరైన్‌ ఈ విషయంపై అంపైర్‌తో మాట్లాడినా.. మరో బ్యాట్‌తోనే ఆడక తప్పలేదు. నొకియా బ్యాట్‌ టెస్టులో ఫెయిల్‌ కాగానే.. మరో బ్యాట్‌ తెప్పించుకుని క్రీజులోకి వచ్చాడు.

]]>
నితిన్‌ గుప్తాకు సిల్వర్‌ https://navatelangana.com/silver-to-nitin-gupta/ Wed, 16 Apr 2025 18:22:31 +0000 https://navatelangana.com/?p=547762 Nitin Gupta wins silver– ఆసియా అండర్‌-18 అథ్లెటిక్స్‌
న్యూఢిల్లీ : భారత యువ అథ్లెట్‌ నితిన్‌ గుప్తా (17) ఆసియా అండర్‌-18 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియాలోని డామమ్‌లో జరుగుతున్న పోటీల్లో 5000 మీటర్ల రేస్‌ వాక్‌లో నితిన్‌ గుప్తా రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. 20.21.51 సెకండ్లలో రేస్‌ వాక్‌ను ముగించిన నితిన్‌ గుప్తా..సెకన్‌లో 01 వ్యత్యాసంతో పసిడి పతకం చేజార్చుకున్నాడు. చైనా అథ్లెట్‌ జు పసిడి నెగ్గగా.. చైనీస్‌ తైపీ అథ్లెట్‌ షెంగ్‌ క్విన్‌ కాంస్య పతకం గెల్చుకున్నాడు.

]]>
హైదరాబాద్‌ వ్యాపారవేత్తతో జాగ్రత్త! https://navatelangana.com/beware-of-hyderabad-businessman/ Wed, 16 Apr 2025 18:15:16 +0000 https://navatelangana.com/?p=547750 Hyderabad Beware of the businessman!– ఐపీఎల్‌ జట్లకు బీసీసీఐ హెచ్చరిక
– బంగారు ఆభరణాలు, ఖరీదైన గిఫ్ట్‌లతో వల
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మరోసారి ఫిక్సింగ్‌ కలకలం. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త.. లీగ్‌ ప్రాంఛైజీల యజమానులు, ఆటగాళ్ల నుంచి సహాయక సిబ్బంది వరకు ఎవరినీ వదలకుండా ఫిక్సింగ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక భద్రత విభాగం (ఏసీఎస్‌యు) ఐపీఎల్‌ జట్లను హెచ్చరించింది.
నవతెలంగాణ-ముంబయి
2012 ఐపీఎల్‌ స్ఫాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం తర్వాత మరోసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫిక్సింగ్‌ కలకలం ఆటగాళ్లను, అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఐపీఎల్‌లో ప్రాంఛైజీ యజమానుల కుటుంబ సభ్యులు సహా ఆటగాళ్ల కుటుంబాలు, సహాయక సిబ్బంది కుటుంబ సభ్యులతో పాటు వ్యాఖ్యాతల కుటుంబాలను సైతం ప్రలోభాలకు గురి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ కళంకిత వ్యాపారవేత్త ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఆ హైదరాబాద్‌ వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండాలంటూ ఐపీఎల్‌ జట్లను బీసీసీఐ అవినీతి నిరోధక భద్రత విభాగం హెచ్చరించినట్టు సమాచారం. ఈ మేరకు ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ సంచలన వార్తను ప్రచురించింది. ఈ వార్తను బీసీసీఐ, ఐపీఎల్‌ వర్గాలు కొట్టిపారేయకపోవటం గమనార్హం.
బంగారు ఆభరణాలు, ఖరీదైన గిఫ్ట్‌లు :
2012 ఫిక్సింగ్‌ వివాదం తర్వాత అవినీతి కట్టడి చేసేందుకు బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే అవినీతి నిరోధక విభాగాన్ని బలోపేతం చేసింది. బుకీలు ఆటగాళ్లను సంప్రదించే సహజ మార్గాలు కాకుండా.. ఇతర భిన్నమైన దారుల్లో క్రికెటర్లు, వారి కుటుంబాలతో సన్నిహితంగా మెలిగేందుకు బుకీలు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సైతం అవినీతి నిరోధక భద్రత విభాగం అధికారులు అంచనా వేయలేని విధంగా ప్రలోభాలకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఖరీదైన బహుమతులు, బంగారు ఆభరణాలు బహుమతిగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా బుకీలు క్రికెటర్లకు మాత్రమే వల వేస్తారు. కానీ హైదరాబాద్‌ బిజినెస్‌మ్యాన్‌ మాత్రం క్రికెటర్ల కుటుంబ సభ్యులకు గాలం వేస్తున్నాడని బీసీసీఐ అవినితి నిరోధక అధికారులు చెబుతున్నారు.
అభిమాని ముసుగులో.. :
ఐపీఎల్‌ ప్రాంఛైజీ యజమానులు, క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది సహా వ్యాఖ్యాతలను సైతం హైదరాబాద్‌ వ్యాపారవేత్త సంప్రదించినట్టు తెలుస్తోంది. అభిమాని ముసుగులో చేరువై… కుటుంబ సభ్యులను ఆభరణాల షోరూమ్‌కు తీసుకెళ్తానని, ఏడు నక్షత్రాల హౌటల్‌లో పార్టీలు ఆఫర్‌ చేస్తున్నట్టు సమాచారం. విదేశాల్లో ఉంటున్న ఐపీఎల్‌ ప్రాంఛైజీ యజమానులు, క్రికెటర్ల కుటుంబ సభ్యులతో సోషల్‌ మీడియా వేదికగా పరిచయం పెంచుకునే ప్రయత్నం సైతం జరిగిందని అధికారులు అంటున్నారు!. దీంతో ఎటువంటి అనుమానాస్పద పరిచయం, ప్రయత్నం జరిగినా.. తక్షణమే అవినీతి నిరోధక భద్రత విభాగం దృష్టికి తీసుకు రావాలని కోరుతున్నారు.
హైదరాబాద్‌ వ్యాపారవేత్తకు బుకీలతో పరిచయాలు సహా గతంలో అవినీతి కార్యకలాపాల్లో పాలుపంచుకున్న రికార్డు ఉందని తెలుస్తోంది. ఆధునాతన సాంకేతికతతో క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకునే అవకాశాలు ఎక్కువయ్యాయి. దీంతో అవినితీ నిరోధక విభాగం అధికారుల పని మరింత సవాల్‌గా మారిందని, అందుకే ఎటువంటి సమాచారం ఉన్నా, అనుమానాస్పద కదలికలు గమనించినా అధికారులకు తెలియజేయాలని బీసీసీఐ కోరింది.

]]>
300 లోడింగ్‌?! https://navatelangana.com/300-loading/ Wed, 16 Apr 2025 18:10:02 +0000 https://navatelangana.com/?p=547759 300 loading?!– ముంబయి, హైదరాబాద్‌ ఢీ నేడు
– పరుగుల వరదకు చిరునామా వాంఖడె
ఐపీఎల్‌ 18 ఆరంభానికి ముందే 300 పరుగులపై భారీ అంచనాలు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసక బ్యాటర్లు ఈ మార్క్‌ దాటేస్తారని క్రికెట్‌ పండితులు సైతం విశ్వసించారు!. ఉప్పల్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 246 టార్గెట్‌ను ఊదిపడేసిన సన్‌రైజర్స్‌ నేడు వాంఖడెలో 300పై గురి పెడుతుందా?
నవతెలంగాణ-ముంబయి
వరుస పరాజయాల నుంచి బయటపడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నేడు ఐదుసార్లు చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబయి వాంఖడె స్టేడియంలో నేడు సన్‌రైజర్స్‌ సీజన్లో ఏడో మ్యాచ్‌ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ముంబయి ఇండియన్స్‌ సైతం ఓ విజయంతో పుంజుకున్నా.. జశ్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ వంటి ప్రపంచ శ్రేణి పేసర్లు ఆ శిబిరంలో జోరందుకున్నప్పటికీ.. నేడు వాంఖడెలో సన్‌రైజర్స్‌ 300 లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌18లో హైదరాబాద్‌, ముంబయిలు ఆరు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించాయి.
సన్‌రైజర్స్‌ భారీ స్కోర్లకు అభిషేక్‌ శర్మ, ట్రావిశ్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ ముఖ్య కారణం. ప్రస్తుతం ఈ ముగ్గురు బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. ట్రావిషేక్‌ మ్యాజిక్‌ గత మ్యాచ్‌తో మళ్లీ మొదలవగా.. క్లాసెన్‌ తనదైన కండ్లుచెదిరే షాట్లతో సిక్సర్లు సంధిస్తున్నాడు. ఓడిన నాలుగు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ భారీ వ్యత్యాసంతో పరాజయం పాలైంది. దీంతో నెట్‌ రన్‌రేట్‌ భారీగా దెబ్బతిన్నది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచిన సన్‌రైజర్స్‌ ఇప్పుడు విజయంతో పాటు నెట్‌ రన్‌రేట్‌ను భారీగా పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే వాంఖడెలో 300 స్కోరుపై కన్నేసినట్టు చెప్పవచ్చు. ముంబయి ఇండియన్స్‌లో నాణ్యమైన పేసర్లు ఉన్నప్పటకీ.. వాంఖడె పరుగుల సునామీకి చిరునామా. తొలి నుంచి నుంచే విరుచుకుపడే సన్‌రైజర్స్‌ బ్యాటర్లకు వాంఖడె స్వర్గధామం అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, ముంబయి ఇండియన్స్‌ సైతం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తెలుగు తేజం తిలక్‌ వర్మ సహా సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. విల్‌ జాక్స్‌, రియాన్‌ రికెల్టన్‌లు ముంబయి తరఫున కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.

]]>
తండ్ర‌యిన టీమిండియా మాజీ పేస‌ర్ జ‌హీర్ ఖాన్ https://navatelangana.com/jaheer-khan-a-former-pacer-of-the-father-of-team-india/ Wed, 16 Apr 2025 06:51:22 +0000 https://navatelangana.com/?p=547277 Former Team India pacer Zaheer Khan becomes a fatherనవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ పేస‌ర్‌ జ‌హీర్ ఖాన్ తండ్రి అయ్యాడు. ఆయ‌న అర్ధాంగి సాగ‌రిక పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. చిన్నారికి ఫ‌తేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టిన‌ట్లు తెలిపారు. “ప్రేమ, కృతజ్ఞత, దైవ ఆశీర్వాదాలతో మేము మా చిన్న బాబు ఫతేసిన్హ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము” అని ఆమె రాసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఈ జంట ఓ అందమైన కుటుంబ ఫొటోను కూడా పంచుకుంది. ఫొటోలో జహీర్ ఖాన్ తన బిడ్డను తన ఒడిలో పట్టుకుని ఉండగా, సాగరిక తన చేతులను జహీర్ భుజాల చుట్టూ ఉంచ‌డం చూడొచ్చు. తొలి బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికిన జ‌హీర్ ఖాన్ దంప‌తుల‌కు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

]]>
IPL: నేడు ఢిల్లీని ఢీకొట్టనున్న రాజస్థాన్.. https://navatelangana.com/rajasthan-to-collide-with-delhi-today/ Wed, 16 Apr 2025 02:21:43 +0000 https://navatelangana.com/?p=547201 IPL: Rajasthan to clash with Delhi today..నవతెలంగాణ – హైదరాబాద్: IPLలో ఇవాళ DC, RR తలపడనున్నాయి. ఈ రెండింటి మధ్య లీగ్లో 29 మ్యాచులు జరగ్గా, 15(RR) – 14(DC) విజయాలు దక్కించుకున్నాయి. రాజస్థాన్కు పరాగ్ ఫామ్ కలవరపెడుతుండగా కెప్టెన్ శాంసన్పైనే భారం పడుతోంది. మరోవైపు ఢిల్లీ ఓపెనర్ మెకుర్క్ పేలవ ప్రదర్శన వారిని ఇబ్బంది పెడుతుండగా, కరుణ్ నాయర్ మొన్నటి నాక్తో బ్యాటింగ్ లైనప్ను పటిష్టం చేశారు. ఢిల్లీ పిచ్ కాబట్టి ఇవాళ హైస్కోరింగ్ గేమ్ చూసే అవకాశం ఉంది.

]]>