Sports Archives - https://navatelangana.com/category/sports/ Thu, 09 May 2024 02:06:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Sports Archives - https://navatelangana.com/category/sports/ 32 32 పొట్టి ఫార్మాట్‌లో మంగోలియా జట్టు చెత్త రికార్డ్ https://navatelangana.com/mongolia-teams-worst-record-in-the-shortest-format/ Thu, 09 May 2024 02:00:51 +0000 https://navatelangana.com/?p=286800 నవతెలంగాణ – హైదరాబాద్: బౌలర్లకు కాలరాత్రులను మిగుల్చుతూ బ్యాటర్లు పండుగ చేసుకుంటున్న పొట్టి ఫార్మాట్‌లో మంగోలియా జట్టు మాత్రం చెత్త రికార్డును మూటగట్టుకుంది. గతేడాది ఆసియా క్రీడల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆ జట్టు.. జపాన్‌తో ఆడిన రెండో టీ20 మ్యాచ్‌లో 8.2 ఓవర్లలో 12 పరుగులకే ఆలౌట్‌ అయింది. బుధవారం సానొ (జపాన్‌) వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జపాన్‌.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మంగోలియా.. 12 రన్స్‌కే కుప్పకూలి 205 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆ జట్టులో ఆరుగురు బ్యాటర్లు ‘సున్నా’కే ఔటవ్వగా 4 పరుగులతో తుర్‌ సుమ్య టాప్‌ స్కోరర్‌. జపాన్‌ బౌలర్‌ కజుమొ 3.2 ఓవర్లు వేసి 7 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇది (12) రెండో అత్యల్ప స్కోరు. గతేడాది ఫిబ్రవరి ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ను స్పెయిన్‌ 10 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

]]>
ఓపెనర్లే ఉతికారేశారు https://navatelangana.com/the-openers-washed-out/ Thu, 09 May 2024 00:10:24 +0000 https://navatelangana.com/?p=286503 The openers washed out– ఛేదనలో హెడ్‌, అభిషేక్‌ ఊచకోత
– 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ గెలుపు
– లక్నో 165/4, హైదరాబాద్‌ 167/0
ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ ఉప్పెన. తొలుత బంతితో భువనేశ్వర్‌ కుమార్‌ (2/12) విజృంభించగా.. ఛేదనలో బ్యాట్‌తో ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (89 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (69 నాటౌట్‌) ఊచకోత ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9,4 ఓవర్లలోనే ఊదేసింది. మరో 62 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌ తొలుత 165/4 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్‌ 9.4 ఓవర్లలోనే 167/0 పరుగులు చేసింది.
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓ అడుగు ముందుకేసింది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో కీలక మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-3లోకి చేరుకుంది. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఉతికారేసిన హైదరాబాద్‌ కీలక నెట్‌రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకుంది. సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (89 నాటౌట్‌, 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (69 నాటౌట్‌, 27 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీలతో విశ్వరూపం చూపించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ ఆయుశ్‌ బడోని (55 నాటౌట్‌, 30 బంతుల్లో 9 ఫోర్లు), నికోలస్‌ పూరన్‌ (48 నాటౌట్‌, 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (2/12) దెబ్బకు లక్నో సూపర్‌జెయింట్స్‌ 13 ఓవర్లలో 73/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకోగా.. చివరి ఏడు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 92 పరుగులు సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏడో విజయం కాగా.. లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఇది ఆరో పరాజయం.
ఓపెనర్లే ఊదేశారు : లక్ష్యం 166 పరుగులు. సన్‌రైజర్స్‌కు విజయంతో పాటు నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవటం అవసరం. విధ్వంసం, ఊచకోతకు సరికొత్త నిర్వచనం చెప్పిన సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (89 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (75 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి రెండు ఓవర్లలో సాధారణంగా సాగిన ఇన్నింగ్స్‌.. మూడో ఓవర్‌ నుంచి మలుపు తిరిగింది. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన ఓవర్లో ట్రావిశ్‌ హెడ్‌ విరుచుకుపడ్డాడు. మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 22 పరుగులుపిండుకున్నాడు. ఆ తర్వాత రవి బిష్ణోరుకి అభిషేక్‌, హెడ్‌లు కలిసి పంచ్‌ ఇచ్చారు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 17 పరుగులు పిండుకున్నారు. ఇక నవీన్‌ ఉల్‌ హాక్‌కు ట్రావిశ్‌ హెడ్‌ చుక్కలు చూపించాడు. అతడు వేసిన ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఏకంగా 23 పరుగులు సాధించాడు. ట్రావిశ్‌ హెడ్‌ ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 16 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఇందులో బౌండరీలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇక అభిషేక్‌ శర్మ సైతం ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 19 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. పవర్‌ప్లేలోనే 107 పరుగులు సాధించిన సన్‌రైజర్స్‌ ఏకపక్ష విజయం లాంఛనం చేసుకుంది. 9.4 ఓవర్లలో 167 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

]]>
బరిలో బల్లెం వీరుడు! https://navatelangana.com/spear-hero-in-the-ring/ Wed, 08 May 2024 19:08:39 +0000 https://navatelangana.com/?p=286509 బరిలో బల్లెం వీరుడు!– 12 నుంచి ఫెడరేషన్‌ కప్‌
భువనేశ్వర్‌ (ఒడిశా) : ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, భారత సూపర్‌స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా మూడేండ్లలో తొలిసారి ఓ దేశవాళీ టోర్నమెంట్‌లో పోటీపడుతున్నాడు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పసిడి పతకం నిలబెట్టుకునేందుకు కఠోర సాధన చేస్తున్న నీరజ్‌ చోప్రా ఈ నెల 12 నుంచి 15 వరకు ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరుగనున్న 27వ ఫెడరేషన్‌ కప్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్స్‌లో బరిలోకి దిగుతున్నాడు. ఈ మేరకు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. మే 14, 15న మెన్స్‌ జావెలిన్‌ త్రో ఈవెంట్లు షెడ్యూల్‌ చేయగా.. 14న క్వాలిఫికేషన్‌ రౌండ్‌, 15న మెడల్‌ పోటీలు ఉంటాయి. ‘వచ్చిన ఎంట్రీల ప్రకారం నీరజ్‌ చోప్రా, కిషోర్‌ కుమార్‌ ఝా మే 12 నుంచి భువనేశ్వర్‌లో జరిగే దేశవాళీ ఫెడరేషన్‌ కప్‌లో పోటీపడనున్నారు’ అని అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పోస్ట్‌ చేసింది.
టార్గెట్‌ 90మీ : చివరగా 2021 ఫెడరేషన్‌ కప్‌లో నీరజ్‌ చోప్రా పోటీపడ్డాడు. పటియాలలో జరిగిన ఆ పోటీల్లో నీరజ్‌ చోప్రా బల్లెంను 87.80 మీటర్ల దూరం విసిరాడు. రెండు సార్లు ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా.. 90 మీటర్ల మార్క్‌ తాకేందుకు కఠోర సాథన చేస్తున్నాడు. అందుకు మే 10న దోహా డైమండ్‌ లీగ్‌లోనూ ఓ ప్రయత్నం చేయనున్నాడు. నీరజ్‌ చోప్రా వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించినా.. నీరజ్‌ చోప్రా ఇంకా 90 మీటర్ల మార్క్‌ కోసం చెమటోడ్చుతున్నాడు. ఫెడరేషన్‌ కప్‌ అనంతరం ఫిన్లాండ్‌లో పోటీపడనున్న నీరజ్‌ చోప్రా ఆ తర్వాత పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం యూరప్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు ఎన్నో అసమాన విజయాలు సాధించిన నీరజ్‌ చోప్రా.. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ పసిడి సాధనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సహచర జావెలిన్‌ త్రోయర్‌ కిశోర్‌ కుమార్‌ ఝా తోడుగా పారిస్‌ ఒలింపిక్స్‌లో డబుల్‌ మెడల్‌పై నీరజ్‌ చోప్రా కన్నేశాడు. సూపర్‌స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా బరిలో నిలువటంతో ఫెడరేషన్‌ కప్‌ పోటీలకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

]]>
SHR Vs LSG: ఉప్పల్ లో IPL మ్యాచ్.. రాత్రి 12 గంటల వరకు మెట్రో https://navatelangana.com/shr-vs-lsg-uppal-lo-ipl-match-till-12-pm-metro/ Wed, 08 May 2024 08:57:35 +0000 https://navatelangana.com/?p=286039 నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం రాత్రి SHR Vs LSG ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా క్రికెట్ అభిమానులు స్టేడియానికి రానున్నారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా మెట్రో రైల్ టైమింగ్ పొడిగించారు. మెట్రో రైళ్లు బుధవారం అర్ద రాత్రి 12:15 చివరి ట్రైన్ బయలు దేరి 1:10 వరకు చివరి టర్మినల్స్ కు చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చే అభిమానూలు మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఉప్పల్ స్టేడియం, ఎంజీఆర్ ఐ స్టేషన్స్ లో ఎంట్రీ, మిగతా స్టేషన్స్ లో ఎగ్జిట్ మాత్రమే ఉండనుంది. అయితే ఈరోజు కూడా హైద్రాబాద్ లో వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి.. ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. మెట్రో అధికారులు మాత్రం టైం పొడిగింపు ప్రకటించారు.

]]>
అటు ఫ్రేజర్‌.. ఇటు అభిషేక్‌ https://navatelangana.com/fraser-and-abhishek/ Tue, 07 May 2024 19:46:56 +0000 https://navatelangana.com/?p=285773 అటు ఫ్రేజర్‌.. ఇటు అభిషేక్‌– రాజస్తాన్‌పై 20 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపు
న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక రాణించాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అభిషేక్‌ పొరెల్‌(65), జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌(50) అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 201పరుగులే చేసింది. దీంతో ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకింది. ఛేదనలో భాగంగా రాజస్తాన్‌ ఓపెనర్లు జైస్వాల్‌(4), బట్లర్‌(19) నిరాశపరిచినా.. సంజు(86; 46బంతుల్లో 8ఫోర్లు, 6సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసి ముఖేష్‌ కుమార్‌ బౌలింగ్‌లో వివాదాస్పద క్యాచ్‌కు ఔటయ్యాడు. రియాన్‌ పరాగ్‌(27), దూబే(25), బట్లర్‌(19) ఫర్వాలేదనిపించినా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు నిరాశపరిచారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కుల్దీప్‌కు దక్కింది. ఢిల్లీ బౌలర్లు ఖలీల్‌ అహ్మద్‌, ముఖేశ్‌కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలి వికెట్‌కు ఫ్రేసర్‌, అభిషేక్‌ 4.1ఓవర్లలో 60పరుగులు చేసి గట్టి పునాది వేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం దక్కింది. ఆసీస్‌ యువ ఓపెనర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌(50; 20బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లో ఒకటే ఫోర్‌ కొట్టినా.. ఆ తర్వాత సందీప్‌ శర్మ, అవేశ్‌ ఖాన్‌లను ఉతికేశాడు. ఆవేశ్‌ వేసిన నాలుగో ఓవర్లో రెచ్చిపోయిన మెక్‌గుర్క్‌ వరుసగా.. 4, 4, 4, 6, 4, 6 బాది అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫ్రెజర్‌ కేవలం 20 బంతుల్లోనే అర్ధసెంచరీని కొట్టాడు. దీంతో ఈ సీజన్‌లో మరోదఫా ఫ్రెజర్‌ 20బంతుల్లోనే అర్ధసెంచరీని నమోదు చేశాడు.

]]>
ఇక చావోరేవో! https://navatelangana.com/what-are-you-waiting-for-2/ Tue, 07 May 2024 18:11:56 +0000 https://navatelangana.com/?p=285757 ఇక చావోరేవో!– నేడు లక్నోతో హైదరాబాద్‌ ఢీ
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఐపీఎల్‌ 17 ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది. రాజస్థాన్‌, కోల్‌కత దాదాపుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. చెన్నై, లక్నో, హైదరాబాద్‌లు టాప్‌-4లో చోటు కోసం పోటీపడుతున్నాయి. ఈ మూడు జట్లు 11 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో సమవుజ్జీలుగా కొనసాగుతున్నాయి. చివరి మూడు మ్యాచుల్లో మెరిసిన జట్టును ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ వరించనుంది. నేడు ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో సూపర్‌జెయింట్స్‌ ఢకొీట్టనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ప్లే ఆఫ్స్‌ రేసులో ఓ అడుగు ముందుకేయనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివరి మూడు మ్యాచులను సొంతగడ్డపైనే ఆడనుంది. ఇది పాట్‌ కమిన్స్‌ సేనకు అతిపెద్ద అనుకూలత. ఈ సీజన్లో ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట సన్‌రైజర్స్‌ విజయం సాధించింది. సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ బ్యాటింగ్‌ రికార్డులను తిరగరాసింది. బౌలర్లు సైతం అద్భుతంగా రాణిస్తున్నారు. కొత్త బంతితో భువనేశ్వర్‌ కుమార్‌, మిడిల్‌ ఓవర్లలో పాట్‌ కమిన్స్‌, డెత్‌ ఓవర్లలో నటరాజన్‌ అదరగొడుతున్నారు. స్పిన్నర్లు సైతం మెరిస్తే హైదరాబాద్‌ బౌలింగ్‌కు ఎదురులేదు. ట్రావిశ్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ నిలకడగా రాణిస్తున్నా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ ఫామ్‌ కోల్పోయాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన సమయంలో క్లాసెన్‌ ఫామ్‌ సన్‌రైజర్స్‌కు అత్యంత కీలకం. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, షాబాజ్‌ అహ్మద్‌, అబ్దుల్‌ సమద్‌ మరింత క్రీయాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.

]]>
గుకేశ్‌పైనే ఫోకస్‌ https://navatelangana.com/focus-on-gukesh/ Tue, 07 May 2024 18:10:21 +0000 https://navatelangana.com/?p=285748 గుకేశ్‌పైనే ఫోకస్‌– నేటి నుంచి గ్రాండ్‌ చెస్‌ టూర్‌
వార్సా (పోలాండ్‌) : క్యాండిడేట్స్‌ కింగ్‌గా నిలిచిన తర్వాత డి. గుకేశ్‌ తొలి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఐదు అంచెల్లో సాగే గ్రాండ్‌ చెస్‌ టూర్‌ నేటి నుంచి పొలాండ్‌లో షురూ కానుంది. ప్రపంచ మేటీ తొమ్మిది మంది గ్రాండ్‌మాస్టర్లు ఇందులో పోటీపడుతున్నారు. గుకేశ్‌తో పాటు ఆర్‌. ప్రజ్ఞానంద సైతం ఎత్తులు వేయనున్నాడు. రోమానియా, క్రోయేషియా, యుఎస్‌ఏలో చివరి నాలుగు అంచెల పోటీలు ఉంటాయి. ఐదు అంచెల పోటీల అనంతరం విజేతను ప్రకటిస్తారు. ఫాబియానో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాడు. పొలాండ్‌లో అర్జున్‌, క్రోయేషియాలో విదిత్‌ గుజరాతీలు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఓవరాల్‌ ప్రైజ్‌మనీ సుమారు రూ.15 కోట్లు.

]]>
అహిక, సుతీర్థ ఓటమి https://navatelangana.com/ahika-sutirthas-defeat/ Tue, 07 May 2024 18:08:35 +0000 https://navatelangana.com/?p=285754 అహిక, సుతీర్థ ఓటమి– సౌదీ స్మాష్‌ 2024
జెడ్డా (సౌదీ అరేబియా) : సౌదీ స్మాష్‌ టోర్నమెంట్‌లో భారత డబుల్స్‌ జోడీలకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్‌లో అహిక ముఖర్జీ, సుతీర్థ ముఖరీ జోడీ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో నిరాశపరిచింది. మియు (జపాన్‌), కిమ్‌ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఆసియా క్రీడల కాంస్య పతక విజేతలు 2-3తో ఓటమి చెందారు. 6-11, 11-9, 10-12, 11-6, 11-8తో అహిక, సుతీర్థ పోరాడి ఓడారు. మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో మనుశ్‌ షా, మానవ్‌ ఠాకూర్‌లు స్లోవేకియా, హాంగ్‌కాంగ్‌ ప్యాడర్ల చేతిలో 18-20, 11-4, 11-6, 9-11, 11-7తో పరాజయం పాలయ్యారు.

]]>
శతకబాదిన సూర్య https://navatelangana.com/the-century-sun/ Mon, 06 May 2024 19:10:42 +0000 https://navatelangana.com/?p=284967 – హైదరాబాద్‌పై ముంబయి గెలుపు
– హైదరాబాద్‌ 173/8, ముంబయి 174/3
నవతెలంగాణ-హైదరాబాద్‌
సూర్యకుమార్‌ యాదవ్‌ (102 నాటౌట్‌, 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. వాంఖడే స్లో పిచ్‌పై ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ బౌలర్లపై విరుచుకుపడిన సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబయి ఇండియన్స్‌కు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. 174 పరుగుల ఛేదనలో సూర్యకు తోడుగా తిలక్‌ వర్మ (37 నాటౌట్‌, 32 బంతుల్లో 6 ఫోర్లు) సైతం రాణించగా 17.2 ఓవర్లలోనే ముంబయి లాంఛనం ముగించింది. రోహిత్‌ శర్మ (4), ఇషాన్‌ కిషన్‌ (9), నమన్‌ దిర్‌ (0) విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (48, 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (35 నాటౌట్‌, 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. వాంఖడే స్లో పిచ్‌పై ట్రావిశ్‌ హెడ్‌ (48), అభిషేక్‌ శర్మ (11) తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో హెడ్‌ ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో వన్‌మ్యాన్‌ షో చూపించాడు. పవర్‌ప్లే తర్వాత సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో వేగం మందగించింది. మయాంక్‌ అగర్వాల్‌ (5), హెన్రిచ్‌ క్లాసెన్‌ (2), షాబాజ్‌ అహ్మద్‌ (10)లు విఫలమయ్యారు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (20), మార్కో జాన్సెన్‌ (17) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. 96/5తో ఉన్న సన్‌రైజర్స్‌ ఓ దశలో 173 పరుగులు చేస్తుందని ఎవరూ అనుకోలేదు. అబ్దుల్‌ సమద్‌ (3) సైతం నిరాశపరిచినా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (35 నాటౌట్‌) డెత్‌ ఓవర్లలో విలువైన పరుగులు జోడించాడు.

]]>
కప్పు వేటకు నయా జెర్సీ https://navatelangana.com/a-new-jersey-for-cup-hunting/ Mon, 06 May 2024 19:04:42 +0000 https://navatelangana.com/?p=284964 – టీ20 వరల్డ్‌కప్‌ భారత జెర్సీ ఆవిష్కరణ
ముంబయి : 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వేటలో భారత జట్టు ధరించే జెర్సీని కిట్‌ స్పాన్పర్‌ ఆడిడాస్‌ సోమవారం ఆవిష్కరించింది. సంప్రదాయ బ్లూ, ఆరెంజ్‌ రంగులో ఉన్న జెర్సీకి ఆడిడాస్‌ త్రీ స్ట్రిప్స్‌ తెలుగు రంగులో ఉన్నాయి. కాలర్‌కు మువ్వెన్నల జెండా రంగులను ఉంచారు. కొత్త జెర్సీపై అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. 2019 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ధరించిన జెర్సీనే అటుఇటుగా మార్చి కొత్తగా విడుదల చేశారని విమర్శిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ కరీబియన్‌, యుఎస్‌ వేదికగా జూన్‌ 2 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

]]>
మనిక సంచలనం https://navatelangana.com/manika-sensation/ Mon, 06 May 2024 19:03:09 +0000 https://navatelangana.com/?p=284963 – వరల్డ్‌ నం.2 వాంగ్‌పై గెలుపు
జెడ్డా (సౌదీ అరేబియా): ఇటీవల భారత టాప్‌ ర్యాంక్‌ ప్లేయర్‌ హోదా కోల్పోయిన మనిక బత్ర.. సౌదీ స్మాష్‌ 2024లో సంచలన ప్రదర్శన చేసింది. వరల్డ్‌ నం.2 వాంగ్‌ మన్యు (చైనా)పై 3-1తో (6-11, 11-5, 11-7, 12-10) మెరుపు విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే చైనా ప్యాడర్లను చిత్తు చేసిన మనిక.. తొలి సెట్‌లో నిరాశపరిచినా వరుసగా మూడు సెట్లలో విజయం సాధించింది. క్వార్టర్‌ఫైనల్లో చోటు కోసం వరల్డ్‌ నం.14 నైనా (జర్మనీ)తో మనిక బత్ర నేడు పోటీపడనుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హర్మీత్‌ దేశారు, యశస్విని జోడీ ఐదో సీడ్‌ స్పెయిన్‌ జంటను షాకిచ్చారు. 11-5, 5-11, 3-11, 11-7, 11-7తో సంచలన విజయం నమోదు చేసి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు.

]]>
మియామి విజేత నోరిస్‌ https://navatelangana.com/miamis-winner-is-norris/ Mon, 06 May 2024 18:54:23 +0000 https://navatelangana.com/?p=284958 – లాండో ఖాతాలో తొలి ఎఫ్‌1 టైటిల్‌
మియామి : మెక్‌లారెన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌ అద్భుతం చేశాడు. ట్రిపుల్‌ ఒలింపిక్‌, రెడ్‌బుల్‌ స్టార్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ను నిలువరించి మియామి గ్రాండ్‌ ప్రీ ఎఫ్‌1 రేసు విజేతగా అవతరించాడు. 57 ల్యాప్స్‌లో 308.37 కిమీలను 1.30.49.876 సెకండ్లలో పూర్తి చేసిన లాండో నోరిస్‌ మియామి ఫార్ములా వన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. లాండో నోరిస్‌ కెరీర్‌లో ఇదే తొలి ఫార్ములా వన్‌ రేసు టైటిల్‌ కావటం విశేషం. మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘గత ఐదారేండ్ల కెరీర్‌లో ఎన్నో పొరపాట్లు చేశాను. కానీ ఈ రోజు అవన్నీ సరిదిద్దుకుని ముందుకెళ్లాను. కఠినమైన రేసు గెలవటం పట్ల ఎంతో గర్వపడుతున్నాను’ అని లాండో నోరిస్‌ ఆనంద పరవశంతో చెప్పాడు.

]]>