State Archives - https://navatelangana.com/category/state/ Thu, 09 May 2024 15:38:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png State Archives - https://navatelangana.com/category/state/ 32 32 వరంగల్ లో మక్కజొన్న రైతు సజీవ దహనం https://navatelangana.com/maize-farmer-burned-alive-in-warangal/ Thu, 09 May 2024 15:38:04 +0000 https://navatelangana.com/?p=287235 నవతెలంగాణ వరంగల్‌: మక్కజొన్న చొప్పను కాల్చుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని రైతు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు(65)తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టాడు. అనుకోకుండా మంటలు వ్యాపించి పక్కనే మరో రైతుకు చెందిన ఆయిల్‌ పామ్‌ తోటకు వ్యాపించాయి. దీంతో మంటలను ఆర్పేందుకు వెళ్లిన పాపారావు ప్రమాదవశాత్తు అదే మంటల్లో చిక్కుకొని ఊపిరాడక సజీవ దహనమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వం దవాఖానకు తరలించినట్టు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ తెలిపారు. రైతు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

]]>
ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు https://navatelangana.com/deadline-for-nominations-for-mlc-by-election-is-over/ Thu, 09 May 2024 11:41:48 +0000 https://navatelangana.com/?p=287011

 

]]>
ఉచిత బస్సు లొల్లి.. బస్సు ఆపలేదని ఆర్టీసీ డైవర్ పై మహిళ తీవ్ర ఆగ్రహం https://navatelangana.com/the-woman-is-very-angry-with-the-rtc-diver-for-not-stopping-the-free-bus/ Thu, 09 May 2024 11:27:43 +0000 https://navatelangana.com/?p=287006 నవతెలంగాణ – హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి నిత్యం ఎక్క‌డో ఒక చోట ఘ‌ర్ష‌ణ‌లు జరుగుతూనే ఉన్నాయి. సీట్ల కోస‌మో, బ‌స్సును ఆప‌డం లేద‌నో గొడ‌వ‌లు అవుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని ల‌క్డీకాపూల్ బ‌స్టాండ్‌లో గొడ‌వ చోటు చేసుకుంది. లక్డికాపూల్‌లో బ‌స్టాండ్‌లో బ‌స్సు ఎక్కేందుకు సిద్ధ‌మైన ఓ మ‌హిళ‌ను ఆర్టీసీ డ్రైవ‌ర్ నిలువ‌రించాడు. బస్సు ఓవర్ లోడ్ అయిందని చెప్పి ఆమెను బస్సు ఎక్కించుకునేందుకు నిరాకరించాడు. త‌న‌ను ఎందుకు ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై బాధిత మ‌హిళ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాను బ‌స్సు న‌డ‌ప‌లేను.. బండి తీసుకొని పో అంటూ ఆమె ప‌ట్ల డ్రైవ‌ర్ దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. బ‌స్సు ఎక్కించుకుంటావా..? లేదా..? అంటూ ఆమె బస్సుకు ఎదురుగా వెళ్లి నిల్చుంది. ఆ త‌ర్వాత ఆమెను ఎక్కించుకోవ‌డంతో బ‌స్సు ముందుకు క‌దిలింది. ఈ ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారంటూ మహిళలు మండిప‌డ్డారు. ఉచిత బస్ పెట్టి మా ప్రాణాల మీదకు తెస్తున్నార‌ని డ్రైవ‌ర్ కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ]]> తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. https://navatelangana.com/reduced-crowd-of-devotees-in-tirumala-6/ Thu, 09 May 2024 09:06:54 +0000 https://navatelangana.com/?p=286918 ]]> నారాయణపేట్ జిల్లాలో ఒకే రోజు పీఎం.. సీఎం భారీ బహిరంగ సభలు https://navatelangana.com/pm-cm-held-huge-public-meetings-in-narayanapet-district-on-the-same-day/ Thu, 09 May 2024 09:00:19 +0000 https://navatelangana.com/?p=286905

 

నవతెలంగాణ – నారాయణపేట: లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల అధినాయకుల ప్రచారాలు హోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈనెల10న ఒక్క గంట తేడాతో ..బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎన్నికల ప్రచార సభలు భారీ సభలను నిర్వహించేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నద్ధం అవుతున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఈ నెల10న షెడ్యూలు ఖరారు అయ్యింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానుండడంతో సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సారథ్యంలో ఆ పార్టీ నాయకులు సన్నద్ధం అయ్యారు. ఇదిలా ఉండగా..నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందు రెడ్డికి మద్దతుగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఈ నెల 10న షెడ్యూల్ ఖరారు అయ్యింది. ప్రధానమంత్రి సభ ఆరంభమైన గంట తర్వాత మధ్యాహ్న 3 గంటల నుండి కాంగ్రెస్ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఒకేరోజు నారాయణపేట జిల్లాలో జరిగే రెండు బహిరంగ సభలకు ఇటు ప్రధాని, అటు ముఖ్యమంత్రి హాజరవుతుండడం తో శాంతిభద్రతలను కాపాడవలసిన పోలీసులు, జన సమీకరణ చేయవలసిన నాయకులు, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు.

]]>
టీసీఎస్ సీఈఓ వార్షిక వేతనం ఎంతంటే.. https://navatelangana.com/what-is-the-annual-salary-of-tcs-ceo/ Thu, 09 May 2024 08:38:50 +0000 https://navatelangana.com/?p=286900

 

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25.4 కోట్లు వేతనంగా తీసుకున్నారు. గతేడాది జూన్ 1న కంపెనీ బాధ్యతలు తీసుకున్న ఆయన, అంతకుముందు కంపెనీ బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. అయితే, కృతివాసన్ జీతం కంపెనీ మాజీ సీఈఓ రాజేష్ గోపీనాథన్ కంటే కొంచెం తక్కువగా ఉంది. రాజేష్ గోపీనాథన్ 2022-23లో రూ. 29.16 కోట్ల వేతనాన్ని అందుకున్నారు.

]]>
ట్రాఫిక్ రూల్స్ పై ఈ పిల్లల అవగాహన అభినందనీయం: సజ్జనార్ https://navatelangana.com/the-awareness-of-these-children-on-traffic-rules-is-commendable-sajjanar/ Thu, 09 May 2024 08:17:10 +0000 https://navatelangana.com/?p=286894 నవతెలంగాణ – హైదరాబాద్ :  టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఓ ప్రభుత్వ పాఠశాల పిల్లలు రూపొందించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ‘చిన్నతనంలో ట్రాఫిక్ రూల్స్ పై ఈ పిల్లలు అవగాహన కల్పిస్తోన్న తీరు అభినందనీయం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు, టీచర్స్ వారిలో సామాజిక స్పృహను నింపాలి’ అని ఆ వీడియో కింద సజ్జనార్ కామెంట్ పోస్ట్ చేశారు. ఈ వీడియోను కేంద్ర రోడ్డు రహదారుల మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేశారు.
అలాగే రోడ్, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ అనే పదాలతో హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు. ఈ వీడియోలో ముందుగా ఫోన్ చూస్తూ రోడ్డు దాటడం, జీబ్రా క్రాసింగ్ పైన కాకుండా దానికి కొంచెం ముందు నుంచే రోడ్డు దాటడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను పిల్లలు కళ్లకు కట్టినట్లు చూపారు. అదే ఒకవేళ రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్ మీద నడుస్తూ వాహనదారుడికి చేయి చూపిస్తే ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఆ తర్వాత రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఓవైపు పాదచారులు రోడ్డు దాటుతున్నా ఆగకుండా వాహనాన్ని పోనివ్వడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో విద్యార్థులు తెలియజేశారు. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగి, గ్రీన్ సిగ్నల్ వచ్చాక వాహనదారులు ముందుకు కదిలితే ఎంత సురక్షితంగా గమ్యం చేరొచ్చో విద్యార్థులు నటించి చూపారు. అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రమాదానికి గురైతే లేదా హెల్మెట్ ధరించినప్పుడు ప్రమాదం జరిగితే ఎలా క్షేమంగా బయటపడొచ్చో స్టూడెంట్స్ చూపారు. వీడియోలో చివరగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో విద్యార్థులు చూపించారు.

 

]]>
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై కేటీఆర్ సెటైర్లు.. https://navatelangana.com/ktr-satires-on-six-guarantees-of-congress/ Thu, 09 May 2024 07:49:58 +0000 https://navatelangana.com/?p=286883

Request all fellow citizens to stock up on the following products

Six Guarantees 😄

1. Inverter
2. Charging bulbs
3. Torch lights
4. Candles
5. Generators
6. Power Banks

Remember it’s the Congress Govt, Not BRS’

Vote wisely on 13th May 🙏#Vote4Car #KCRForTelangana

— KTR (@KTRBRS) May 9, 2024

ktr-will-prevent-hyderabad-from-becoming-a-union-territoryనవతెలంగాణ – హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సైటర్లు వేశారు. ఆరు వస్తువులను ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలని తెలిపారు. ఇన్వర్టర్‌, ఛార్జింగ్‌ బల్బులు, టార్చ్‌ లైట్లు, క్యాండిల్స్‌, జనరేటర్స్‌, పవర్‌ బ్యాంక్ లను దగ్గర పెట్టుకోవాలని.. సిక్స్‌ గ్యారంటీస్‌ అని ఎద్దేవా చేశారు. ఇది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మే 13వ తేదీన ప్రజలంతా తెలివిగా ఓటు వేయాలని సూచించారు.
]]>
తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు https://navatelangana.com/two-more-days-of-rain-in-telangana-4/ Thu, 09 May 2024 02:34:18 +0000 https://navatelangana.com/?p=286806 నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఏపీలోని రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు మంగళవారం ఏర్పడిన ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, జల్లులు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 12వ తేదీన కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు (ఆరెంజ్‌) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు ఎంతటి విలయం సృష్టించాయో తెలిసిందే. పంటలు నీటిపాలై, నేలరాలి రైతులు కుదేలయిపోయారు. మరోవైపు హైదరాబాద్లో వర్షం కారణంగా 14 మంది మరణించారు. అయితే వాన కురవడం వల్ల బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం జకోరా, నిజామాబాద్‌ అర్బన్‌లో 42.9 డిగ్రీలు నమోదైంది.

]]>
ప్రజా వ్యతిరేక, మతోన్మాద బీజేపీని ఓడించాలి https://navatelangana.com/the-anti-people-bigotry-bjp-should-be-defeated-2/ Wed, 08 May 2024 22:57:11 +0000 https://navatelangana.com/?p=286708 The anti-people and bigoted BJP should be defeated– ఎలక్టోరల్‌ బాండ్ల పేరుతో అవినీతి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య
– ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణలపై మాటిచ్చిన మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బలరామ్‌నాయక్‌
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రజా వ్యతిరేక మతోన్మాద బీజేపీని ఓడించాలని, సీపీఐ(ఎం) బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య పిలుపునిచ్చారు. బుధవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో కొండ్రెడ్డి చెన్నారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఆ పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలతో దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించి లౌకిక శక్తులను పార్లమెంట్‌కు పంపాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పదేండ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతూ కార్పొరేట్లకు దోచిపెట్టిందని అన్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల పేరుతో బీజేపీ పెద్ద అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రూ.16 వేల కోట్లు వస్తే అందులో రూ.8262 కోట్లు కేవలం బీజేపీ ఖాతాలో పడ్డాయని అన్నారు. కార్మికులకు ఫ్లోర్‌ లెవెల్‌ మినిమం వేజ్‌ రోజుకు రూ.178గా బీజేపీ నిర్ణయించడం దారుణం అన్నారు. 2022 విద్యుత్‌ సవరణ చట్టాన్ని తెచ్చి ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకొని కార్పొరేట్‌ విద్యుత్‌ కంపెనీలకు వేల కోట్ల లాభాలు కట్టబెట్టేందుకు తెగబడిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ దిశగా బాటలు వేశారని ఆరోపించారు. పదేండ్లలో 1,30,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. 2017లో మోడీ పార్లమెంటు సాక్షిగా కనీసం మద్దతు ధరకు హామీ ఇచ్చి అమలు చేయకుండా రైతులను మోసం చేశారని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ అమలు చేయకపోగా, ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను సైతం భర్తీ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానన్న మోడీ.. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారని తెలిపారు. రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సీబీఐ, ఈసీ. ఐటీలను.. దుర్వినియోగం చేస్తున్నదని, బీజేపీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రశ్నించే వారిపై ఉ.పా లాంటి క్రూర చట్టాలను ప్రయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అన్నారు.
ఇలాంటి బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు మద్దతు ధరతో పాటు సాగు నీరు అందిస్తామని అన్నారు. సీపీఐ(ఎం) నాయకుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రత్నం రాజేందర్‌, బీరెడ్డి సాంబశివ, కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సమన్వయ కర్త అనిల్‌కుమార్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్‌, మండల అధ్యక్షులు పాలడుగు వెంకట క్రిష్ణ, సీపీఐ(ఎం) నాయకులు గ్యానం వాసు, కొప్పుల రఘుపతి, పొదిల్లా చిట్టిబాబు, ఎండీ దావుద్‌, తీగల ఆగిరెడ్డి, కుమ్మరి శ్రీను, గఫుర్‌,రాజేష్‌, చిన్న, చిరంజీవి, ఐలయ్య, సుధాకర్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

]]>
బీజేపీ మళ్లీ వస్తే సార్వత్రిక ఎన్నికలుండవ్‌ https://navatelangana.com/if-bjp-comes-again-then-general-elections-will-be-held/ Wed, 08 May 2024 22:53:41 +0000 https://navatelangana.com/?p=286773 If BJP comes again then general elections will be held– ఆ పార్టీ డబుల్‌ ‘ఏ’ కు దోచిపెడుతున్నది
– కేేసీఆర్‌ గురించి మాట్లాడటం టైమ్‌ వేస్ట్‌
– కాంగ్రెస్‌కు 15 సీట్లు…బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు గల్లంతు
– జూన్‌ 5 తర్వాత కాంగ్రెస్‌లోకి 25మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
– త్వరలో నియోజకవర్గాల డీలిమిటేషన్‌ : మీట్‌ ది ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సార్వత్రిక ఎన్నికలనేవే ఉండవని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పదేండ్లలో చేసింది ఏమీ లేకపోవడంతో ఆ పార్టీ నేతలు దేవుడి పేరిట ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో త్రిబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారంటూ మోడీ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడు నెలలే అయిందనీ, అప్పుడే ట్యాక్స్‌ ఎలా వసూలు చేస్తామని ప్రశ్నించారు. పదేండ్ల బీజేపీ హయాంలో దేశ సంపదను అదానీ(ఏ), అంబానీ (ఏ)లకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు పేదలుగానే ఉన్నారనీ, పెద్దలు మాత్రం లక్షల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ నిర్వహించిన ‘మీట్‌ ది మీడియా’ లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మరో ప్రమాదం కూడా ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చడంతోపాటు రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరారు. తమ పార్టీ అధికారం లోకి వస్తే దేశంలో కులగణన ఆధారంగా రిజర్వేషన్లను పెంచుతామన్నారు. తద్వారా దేశ సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇది బీజేపీకి ఇష్టం లేదన్నారు. అందుకే రాముడ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు పెంచేలా మోడీ మాట్లాడుతున్నా రని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ చెప్పి హిందువుల ఓట్లు పొందాలని చూస్తున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్‌ పరం చేస్తోందని విమర్శించారు. పేదలకు డబ్బులు పంచుతానంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ…ఇప్పుటివరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్యే పోటీ ఉంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 14 లేదా 15 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో నియోజకవర్గాల డీలిమిటేషన్‌ చేస్తామనీ, అందులో భాగంగా అసెంబ్లీ సీట్లు 154కు పెరగబోతున్నాయనీ, అందులో 120 కాంగ్రెస్‌ సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ శకం ముగిసింది
రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ శకం ముగిసిందని మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆయన… ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. వారి కుటుంబమే బాగుపడింది తప్ప ప్రజలు బాగుపడలేదన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రానున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రెండు నియోజకవర్గాల్లో డిపాజిట్ల కోసం సర్వశక్తులొడ్డుతున్నదన్నారు. కొన్ని చోట్ల బీజేపీకి లోపాయికారిగా మద్దతు ఇస్తున్నదని ఆరోపించారు. వరంగల్‌లో కేసీఆర్‌ జర్నలిస్ట్‌లకు ఇచ్చిన హామీలు చూస్తే నవ్వొస్తుందనీ, బ్రహ్మనందం జోకుల్లా కేసీఆర్‌ మాటలు ఉంటాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ దొంగ దీక్షలు చేశారని ఆరోపించారు. ఆయన దీక్ష సమయంలో నిమ్స్‌లో చేరిన తర్వాత ఏమేమీ మందులు వాడారో త్వరలో రికార్డులు బయట పెడతామన్నారు. తెలంగాణ కోసం తాను కూడా 10 రోజులు దీక్ష చేసినట్టు తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని తాను ఉద్యమం చేశానన్నారు. సాగర హారం సందర్భంగా తనకు మూడు రబ్బర్‌ బుల్లెట్లు తగిలాయన్నారు. ప్రతిసారీ డ్రామాలాడే కేసీఆర్‌కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదన్నారు. ఎంపీ సంతోష్‌రావు ఒక్క లైసెన్స్‌ పేరుతో పది బార్లు నడిపారని ఆరోపించారు. వాటి మీద వేల కోట్లు సంపాదించారని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు సాండ్‌, ల్యాండ్‌, లిక్కర్‌ మాఫియా నడిపారని విమర్శించారు.
పదేండ్లు రేవంతే… సీఎం
పదేండ్లపాటు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆయన ప్రతి ఒక్కర్ని గౌరవిస్తారని తెలిపారు. ప్రజల కోసం ఏదో చేయాలనే తపన రేవంత్‌కు ఉందన్నారు. ఆయనలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కనిపిస్తున్నారని తెలిపారు. తనకు మంత్రి పదవి కావాలని కూడా అడగలేదన్నారు. తనకు ఇష్టమైన శాఖ ఇచ్చారని చెప్పారు. రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన కోసం పట్టుబట్టి రూ. 50వేల కోట్లు తెచ్చారని తెలిపారు. త్రిబుల్‌ఆర్‌ను పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. తెలంగాణ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నష్ట పోయిందన్నారు. వందేండ్లైనా అక్కడ కాంగ్రెస్‌ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఐకానిక్‌ టవర్స్‌ నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌ నాయుడు, రవికాంత్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

]]>
బీజేపీ ఓటమే కార్మికవర్గ తక్షణ కర్తవ్యం https://navatelangana.com/the-immediate-task-of-the-working-class-is-to-defeat-the-bjp/ Wed, 08 May 2024 22:50:51 +0000 https://navatelangana.com/?p=286770 బీజేపీ ఓటమే కార్మికవర్గ తక్షణ కర్తవ్యం– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-కాప్రా
ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే కార్మికవర్గ తక్షణ కర్తవ్యమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని చర్లపల్లిలో చర్లపల్లి ఇండిస్టియల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల ముగింపు సందర్భంగా ‘పార్లమెంట్‌ ఎన్నికలు- కార్మికవర్గ కర్తవ్యం’ అనే అంశంపై బుధవారం సాయంత్రం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. 138 సంవత్సరాల కిందట కార్మికుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పని గంటల దినం మేడే అన్నారు. 1991 తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం నూతన సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి పెట్టుబడిదారీ వర్గానికి లాభాలు చేకూర్చేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు లాభాలు చేకూర్చడానికి 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్‌లుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కార్మికుల ఉద్యోగ భద్రత, హక్కులు ప్రమాదంలో పడ్డాయన్నారు. అలాగే యూనియన్లు లేకుండా చేసి కార్మికులను దోచుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. నాలుగు లేబర్‌ కోడ్లను అనేక రకాలుగా మార్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఈసారి మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తుందని, అందుకే కార్మికవర్గం ఆలోచించి కార్మిక వ్యతిరేకి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్మికులకు, యువకులకు, రైతులకు, అందరికీ ద్రోహం చేసిన పార్టీని ఓడించాలన్నారు.
మే డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్మయాస్‌ చైర్మెన్‌ రోషిరెడ్డి, సీఐటీయూ మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి జె.చంద్రశేఖర్‌, చర్లపల్లి ఇండిస్టియల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బివి.సత్యనారాయణ, జి.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.శ్రీనివాసరావు, నాయకులు జె.వెంకటేష్‌, పి.శ్రీనివాస్‌, టి.నరసింహ, ఆదాం, పాషా, సంతోష్‌, గణేష్‌, ఆర్‌.శ్రీనివాస్‌, ఎన్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

]]>