Sunday Fun Archives - https://navatelangana.com/category/sunday-fun/ Sat, 06 Apr 2024 17:35:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Sunday Fun Archives - https://navatelangana.com/category/sunday-fun/ 32 32 నవ్వుల్‌ పువ్వుల్‌ https://navatelangana.com/smiles-are-flowers-18/ Sat, 06 Apr 2024 17:35:01 +0000 https://navatelangana.com/?p=263890 Smiles are flowersమగవాళ్ళకు మాత్రమే
ఓ కంపెనీలో అందరూ మగాళ్ళను, అందునా పెళ్ళైన వాళ్ళనే రిక్రూట్‌ చేసుకుంటున్నారు. పైగా ఆడవాళ్ళు అర్హులు కాదంటూ నోటిఫికేషన్‌లో రాయడంతో మండిపడ్డ మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అసలు విషయం కనుక్కుంటే ఆ కంపెనీ యజమాని ఒక మహిళ. ఈ విషయం తెలిసిన మహిళా సంఘం నేతలకు మరింత కోపం వచ్చింది. ఆ యజమానిని ఈ విధంగా కోపంగా ప్రశ్నించారు ”ఒక మహిళ అయ్యుండీ ఏమిటా నోటిఫికేషన్‌?”
”అబ్బే… మాకే విపక్షా లేదండి. ఇది ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కంపెనీ. చెబితే వినేవాళ్ళు, ఆదేశాల్ని తక్షణం పాటించేవాళ్ళు, కోప్పడ్డా ఎదురుతిరగనివాళ్ళు కావాలి మాకు. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫీస్‌ అవర్స్‌ అయిపోగానే తక్షణం ఇంటికి వెళ్ళాలనిపించకూడదు.” అసలు విషయం చెప్పింది అధినేత.
చిన్న-పెద్ద
”మీరు చూస్తే చాలా చిన్న లాయర్లా ఉన్నారు. నా కేస్‌ టేకప్‌ చెయ్యగలరా?” సందేహంగా అడిగాడు క్లయింటు.
”ఫరవాలేదు. మీ కేసు పూర్తయ్యేనాటికి నేను పెద్ద లాయర్నవుతాను” అభయమిచ్చాడు లాయర్‌.
తల వంచదు
పెళ్ళి కొడుకు తండ్రి: ఏమింటండీ..! మావాడిని నుంచుని తాళికట్టమంటున్నారు..!
పెళ్ళికూతురి తండ్రి: అవునండి.. మా అమ్మాయి వాళ్ళ అమ్మలాగే తలవంచదు. నేను నిల్చునే తాళి కట్టాను..!
ధగధగలు
సువర్ణ : సినిమాకు వెళ్ళావు. సినిమా ఎలా వుంది అని అడిగితే చూడలేదంటావేం?
అపర్ణ: ఔను నా పక్కన కూర్చున్నావిడ పెట్టుకొచ్చిన రవ్వల దుద్దులు అంత చీకట్లోనూ ధగధగ మెరుస్తుంటే సినిమా ఎలా చూడగలను చెప్పు..?

]]>
నవ్వుల్‌ పువ్వుల్‌ https://navatelangana.com/smiles-are-flowers-17/ Sat, 30 Mar 2024 18:42:17 +0000 https://navatelangana.com/?p=259182 రియాల్టీ తిట్లు
పైలెట్‌ భార్య:
నా దగ్గర మరీ అంతలా ఎగరకండి.
డాక్టర్‌ భార్య: ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకూ తెలుసు
టీచర్‌ భార్య: నాకేం క్లాసులు పీకక్కర్లేదు..
జడ్జిభార్య: ఇది చెప్పడానికి వాయిదాలెందుకు. నేను చెప్పేదే ఫైనల్‌.
న్యాయవాది భార్య: ఆధారాలు నాచేతికి వచ్చాక మీకుంటాది..
యాక్టర్‌ భార్య: ఈ మాత్రం యాక్షన్‌ మాకూ వచ్చూ
ఇంజనీర్‌ భార్య: ప్లాన్లు వేయడం మాకూ తెలుసు
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భార్య: మీ ఆఫీస్‌లో ఉన్న యాంటీవైరస్‌కి ఏ సాఫ్ట్‌వేర్‌ వాడాలో నాకు బాగా తెలుసు..
పొలిటీషియన్‌ భార్య: మీ అధిక ప్రసంగం ఆపకపోతే, మా అమ్మ నాన్నలతో అత్యవసర సమావేశం పెట్టి మీ భర్త పదవికి ఉద్వాసన పలుకుతా.
వ్యాపారి భార్య: మీ పత్తేపారం బయట చూపించండి. నాకాడ కాదు.
జర్నలిస్టు భార్య: మీ కవరేజీలు మీ ఛానల్‌లో చూపించుకోండి. ఎక్స్‌ట్రాలు చేస్తే ఇంట్లో మీ లైవ్‌ కవరేజ్‌ని నేను వీధిలో చూపించాల్సి ఉంటాది.

అర్థంకాని రాత
ఒక అమ్మాయి మెడికల్‌ షాపు బయట నుంచిని ఉంది.
తనకు కావాల్సింది వెళ్లి అడుగుదామంటే, షాప్‌లో చాలా మంది జనం నుంచుని ఉన్నారు.
చాలా సేపు వెయిట్‌ చేసిన తర్వాత జనం కాస్తా తగ్గారు.
అప్పుడు చాలా మొహమాట పడుతూ షాప్‌ అతని దగ్గరికి వెళ్లింది.
”సార్‌, మీరు ఏమి అనుకోకుండా నాకు ఒక హెల్ప్‌ చేయాలి. ఇందాకటి నుండి ఎలా అడగాలో అర్ధం కావడం లేదు….
నాకు కాబోయే భర్త ఒక డాక్టర్‌ అండీ.. తను నాకు లవ్‌లెటర్‌ రాశాడు. ఎంత చదివినా అర్ధం కావడం లేదు. కాస్తా చదివి పెడతారా?

]]>
డబ్బింగ్‌ చెప్తే సరి! https://navatelangana.com/dubbing-is-right/ Sat, 17 Jun 2023 18:16:38 +0000 https://navatelangana.com/?p=37466 అధికారి: నీకు యాంకర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ గొంతు చాలా బలహీనంగా, కీచుగా ఉంది.
యాంకర్‌: డబ్బింగ్‌ చెప్పించండి సార్‌, సరిపోతుంది.

]]>
చట్నీ, సాంబార్‌ https://navatelangana.com/chutney-sambar/ Sat, 17 Jun 2023 18:14:56 +0000 https://navatelangana.com/?p=37465 టీచర్‌: 5-5 ఎంత అవుతుంది?
టీచర్‌ ప్రశ్నకు విద్యార్థి మౌనంగా ఉంటాడు.
టీచర్‌: సరే విను. నీ దగ్గర ఐదు ఇడ్లీలు ఉన్నాయి. ఆ ఐదు ఇడ్లీలను నేను తీసుకున్నాను. అప్పుడు నీ వద్ద ఏం ఉంటుంది?
విద్యార్థి: సాంబర్‌, చట్నీ ఉంటుంది టీచర్‌.

]]>
బంగారు దంతాలు https://navatelangana.com/gold-teeth/ Sat, 17 Jun 2023 18:13:14 +0000 https://navatelangana.com/?p=37459 పోలీసు: నీ కళ్ల ముందే దొంగలు ఇళ్లు దోచుకుపోతుంటే నువ్వు అరవకుండా ఎలా చూస్తూ కూచున్నవయ్యా… అరిచి ఉంటే ఎవరైనా వచ్చి ఉండేవారు కదా.
వ్యక్తి: అరిస్తే నా నోట్లోని బంగారం దంతాలు బయటపడుతాయనే నోరు తెరవలేదు.

]]>
ఎవరూ లేరు https://navatelangana.com/there-is-no-one/ Sat, 17 Jun 2023 18:12:15 +0000 https://navatelangana.com/?p=37462 రాకేష్‌: నాకు రైల్లో నిద్ర పట్టలేదురా…
సురేష్‌: ఎందుకు…
రాకేష్‌: అప్పర్‌ బర్త్‌ వచ్చింది..
సురేష్‌: ఎవరితోనైనా ఎక్స్‌చేంజ్‌ చేసుకోలేకపోయావా…
రాకేష్‌: చేసుకుందామంటే కింది బెర్త్‌లో ఎవరూ లేరు..

]]>
పొద్దునే నిద్దుర వేట https://navatelangana.com/%e0%b0%aa%e0%b1%8a%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81%e0%b0%a8%e0%b1%87-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0-%e0%b0%b5%e0%b1%87%e0%b0%9f/ Mon, 28 Nov 2022 23:00:57 +0000 https://dev.navatelangana.com/?p=1046

పొద్దునే నిద్దుర వేట
చేసెనే మాటల తూట
చెత్తబండి సౌండూ…
చెదిరె నా మైండూ…
తెలతెల్లవారగానే అదే మోతా…ఆ….
కునుకన్న తీయనీక ఒకే కూతా…ఆ…
||పొద్దునే ||

అలసి అలసి కనుమోసి పడుకున్న ఆ రేయీ…ఈ..ఈ..
తెలుసునా ఎన్నడైన ఆ హాయి నీకోయీ…ఈ..ఈ..
కనులు వాల్చీ…కునుకుదీస్తీ…
అంతలోపే…ఏ.ఏ.ఏ…ఏ.ఏ.ఏ…ఏ.ఏ.ఏ
మున్సిపాల్టీ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ
చత్తబండీ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ
ఇంటిముందే…ఏ.ఏ.ఏ…ఏ.ఏ.ఏ…ఏ.ఏ
నా…నా…పాలిట అలారమయ్యెనా
||పొద్దునే ||

సుప్రభాతమే రోజు నాకు ఇక ఆ మైకూ…ఊ..ఊ..
ఒక్కసారి వినగానె మరిసె కనులే కునుకూ…ఊ..ఊ..
ఒక్కరైనా…ఆపలేరా…
చెత్తబండీ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ
వచ్చెనండీ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ
తీస్కరండీ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ
వేసిపొండీ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ…ఈ.ఈ.ఈ
అంటూ నాలో మంట రేపెనే
||పొద్దునే ||

సినిమా : మెకానిక్‌ అల్లుడు
పాట : జుమ్మనే తుమ్మెద వేట
గాయకులు :SPB & K.S చిత్ర
రచన : భువన చంద్ర

– అజయ్ మెంగని,
8688144853

]]>
Navratri 2022: హలో లేడీస్.. నవరాత్రికి ఇలా సూపర్ ఫ్యాషన్ లుక్ లో కనిపించండి https://navatelangana.com/navratri-2022-%e0%b0%b9%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b2%e0%b1%87%e0%b0%a1%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%a8%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%87/ Fri, 23 Sep 2022 05:40:15 +0000 https://dev.navatelangana.com/?p=687  


Navratri 2022: నవరాత్రి వచ్చేస్తోంది. చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే పండగ ఇది. నవరాత్రి ఉత్సవాల్లో రోజూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. గర్భా ఆడే సమయంలో అందంగా కనిపించాలని అమ్మాయిలు కోరుకుంటారు. ఎప్పుడూ చీరలు, లంగా ఓణీలేనా.. ఈ సారి కొత్తగా ట్రై చేయాలనుకునే వారి కోసమే ఇది.
గొప్ప ఆడంబరం మరియు ఉత్సాహంతో, నవరాత్రి రోజులు నిర్మలమైన శ్లోకాలు, శక్తివంతమైన గర్బా ప్రదర్శనలు మరియు అద్భుతమైన నవరాత్రి దుస్తులతో నిండి ఉంటాయి. ఇక్కడ నవరాత్రుల మొత్తం 9 రోజుల కోసం అధునాతనమైన మరియు అందమైన దుస్తులను ప్లాన్ చేయడంలో ఇది సహాయంగా ఉంటుంది.

]]>