Telangana Roundup Archives - https://navatelangana.com/category/telangana-roundup/ Wed, 08 May 2024 08:20:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Telangana Roundup Archives - https://navatelangana.com/category/telangana-roundup/ 32 32 ఓటేసి గెలిపించి నిలదీయండి: కొప్పుల ఈశ్వర్ https://navatelangana.com/vote-and-win-koppula-ishwar/ Wed, 08 May 2024 08:19:28 +0000 https://navatelangana.com/?p=286014 – కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోకండ
– ఓటు విలువ తెలుసుకుంటేనే బాగుపడుతం
– కాంగ్రెస్సోళ్లను నమ్మి నాలుగు నెలలుగా గోసపడుతానం
– బిఆర్ఎస్  పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 
– శ్రీమంతుడు గెలవాలా.. బొగ్గు గాని కార్మికుడు గెలవాలా..
– ప్రజాసంక్షేమం…అభివృద్ది గురించి ఆలోచన చేయాలే
– కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించునే బాధ్యత మన అందరిది
– మాజీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
నవతెలంగాణ – రామగిరి  
ఓటేసి గెలిపించి సంక్షేమం కోసం నిలదీయండి అని పెద్దపెల్లి బిఆర్ఎస్  పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో లో భాగంగా రామగిరి మండలం సెంటినరీ కాలనీ లోని మార్కెట్ చౌరస్తాలో పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్  పుట్ట మధుకర్ తో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు విలువ తెలుసుకోకపోతే మన బాగుపడుమని గుర్తించాలన్నారు. మన ఓటుతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన మంథని ఎమ్మెల్యే నిన్నటి వరకు అనేక సమావేశాల్లో భయబ్రాంతులకు గురి చేశారని, ఇప్పటి వరకు 35ఎంఎం ట్రైలర్‌ చూపించామని, ఇక నుంచి 70ఎంఎం సినిమా చూపిస్తామని మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. అలాంటి ఎమ్మెల్యే ఈనాడు మన ఓటు కోసం ఉపాధి హమీ పని ప్రదేశాలకు వచ్చి గరీబోళ్ల నడుమ కింద కూర్చున్నాడని, ఓటుకు ఉన్న విలువ అలాంటిదని ఆయన వివరించారు. ఆనాడు ఓటు హక్కు కేవలం ధనవంతులు, విద్యావంతులు, భూస్వాములు, ఇన్‌కం టాక్స్‌ కట్టేవాళ్లకు మాత్రమే ఉండాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, బ్రాహ్మణీయ పాలకులు అంటే డాక్టర్‌బీఆర్‌ అంబేద్కర్‌ అందరికి ఓటుహక్కు ఉండాలని కొట్లాడి ఓటుహక్కు కల్పించారని ఆయన గుర్తు చేశారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్సోళ్ల మాటలు నమ్మి నాలుగు నెలలుగా గోసపడుతున్నామని,మళ్లీ నమ్మితే ఐదేండ్లు ఆగమై పోతామని అన్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పి వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయకపోగా కేసీఆర్‌ ఇచ్చే రూ.2016 పించన్‌ సొమ్మును రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారని ఆయన అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో ఏనాడు ప్రజలకు ఇబ్బందులు రానియ్యలేదని, ప్రజల అవసరాలను గుర్తించే పథకాలకు రూపకల్పన చేశారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా నాలుగున్నర ఏండ్లు ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించానని, అభివృద్ది పనులు చేస్తే బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడని కాంగ్రెస్సోళ్లు బదనాం చేసి ప్రజల నుంచి దూరం చేశారని అన్నారు.
గత ఎన్నికల్లో వంద కోట్లు ఖర్చు చేసి అధికారం చేజిక్కించుకున్నది ఎవరో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. తనలాంటి గరీబోళ్లు పైకి రావద్దని, రాజకీయంగా ఎదుగవద్దని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, 50ఏండ్లు వాళ్లకు అధికారం ఇస్తే ఏం చేశారని ఆలోచన చేయాలన్నారు. మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికలు రాగానే ప్రజల్లోకి వచ్చిమాయమాటలు చెప్తున్నారని, అబద్దాలతో అధికారంలోకి రావడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటేనని, అలాంటి అబద్దాలను నమ్మి మళ్లీ మోసపోవద్దని ఆయన సూచించారు. అలగే జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ..శ్రీమంతుడు కావాలా బొగ్గు గని  కార్మికుడు కావాలా అని ఆలోచన చేయాలని గరీబోడికి బలమైన ఆయుధం ఓటు అని, ఓటు విలువ ఎంత గొప్పదో ఆలోచన చేయాలని మాజీ ఎమ్మెల్యే,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టమధూకర్‌ అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో అనేక సేవలు, అభివృద్ది పనులు చేసిన కొప్పుల ఈశ్వర్‌ను ఆశీర్వదించాలని, పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌ను గెలిపిస్తే మనకు అండగా ఉంటారని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకవుతారని ఆయన  తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్‌ను బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ స్ మండల అధ్యక్షులు శంకేష్ రవీందర్, జడ్పిటిసి మేదరవైన శారద కుమార్, వైస్ ఎంపీపీ కాపురవేన శ్రీదేవి భాస్కర్,తాజా మాజీ సర్పంచ్ లు మైదం కుమార్, అల్లం పద్మ తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, టీబీజీకేఎస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి, నాగేల్లి  సాంబయ్య, రోడ్డ శ్రీనివాస్, బుద్ధె ఉదయ్, పుల్లెల కిరణ్, గాజుల ప్రసాద్, బొడ్డు వినయ్, కుమారస్వామి,వెంకటేష్, రాజు, రమేష్ అధిక సంఖ్యలో మహిళలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
]]>
మేడిగడ్డను సందర్శించిన.. జ్యుడీషియల్‌ కమిషన్‌ చైర్మెన్‌ https://navatelangana.com/judicial-commission-chairman-visited-medigadda/ Tue, 07 May 2024 22:36:33 +0000 https://navatelangana.com/?p=285909 Visited Madigadda.. Chairman Judicial Commission– ఇరిగేషన్‌ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన
నవతెలంగాణ-భూపాలపల్లి/మహాదేవపూర్‌
జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా పరిధి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా జ్యుడిషియల్‌ కమిషన్‌ చైర్మెన్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ పినాకి చంద్ర గోష్‌, ఇరిగేషన్‌ కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో కలిసి మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, ఎస్పీ కిరణ్‌ ఖరే ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో మేజర్‌గా దెబ్బతిన్న 20వ నంబర్‌ పిల్లర్‌ను, పాక్షికంగా దెబ్బతిన్న 19, 21 పిల్లర్లను కమిషన్‌కు సంబంధించిన అధికారులు, నిపుణుల బృందం సభ్యులు పరిశీలించారు. బ్యారేజీపై ఏడో బ్లాకులో వంతెనపై కాలినడకన సాగుతూ అణువణువూ పరిశీలించారు. ఏడవ బ్లాక్‌లో 20 పిల్లర్‌ దెబ్బతిన్న ప్రాంతాన్ని చూసి అధికారుల నుంచి వివరాలను సేకరించారు. బ్యారేజీ దిగువకు చేరుకొని 19, 20, 21 పిల్లర్ల కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పిల్లర్ల కుంగుబాటు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జ్యుడిషియల్‌ కమిషన్‌ చైర్మెన్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ పినాకి చంద్ర గోష్‌ మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నట్టు చెప్పారు. ఇరిగేషన్‌ శాఖ నిపుణులతో కలిసి మేడిగడ్డ బ్యారేజి పరిశీలించామన్నారు. పరిశీలనలో వెలుగులోకి వచ్చిన విషయాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఅండ్‌ఎం జనరల్‌ అనిల్‌ కుమార్‌, ఓఅండ్‌ఎం ఈఎన్సీ నాగేందర్‌రావు, సీఈ సుధాకర్‌ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్‌ సీఈ వెంకటకృష్ణ, ఈఈ తిరుపతిరావు, ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టు మేనేజర్‌ రజనీష్‌ తదితరులు పాల్గొన్నారు.

]]>
విద్యుత్ఘానికి గురై ఒకరు మృతి https://navatelangana.com/one-died-due-to-electrocution-2/ Tue, 07 May 2024 15:54:03 +0000 https://navatelangana.com/?p=285711
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ఘాతానికి  గురై ఓ తాపీ మేస్త్రీ మృతి చెందిన ఘటన జరిగింది. స్థానిక ఎస్.హెచ్.ఒ ఎస్ఐ శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా రౌతం పూడి మండలం బలరామ పురం కు చెందిన దాసరి సూరిబాబు(40) తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.కాగా కొద్ది రోజుల క్రితం అశ్వారావుపేట కు చెందిన తాపీ మేస్త్రీ పీ లక్ష్మణరావు,ఆశ్వారావుపేట లో ఓ భవన నిర్మాణ పనులు చేసేందుకు సూరిబాబు తో పాటు కొద్దిమంది కార్మికులను తీసుకొచ్చాడు.వీరంతా స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో నివాసం ఉంటూ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి పని ముగిసిన తర్వాత సూరిబాబు స్నానం చేసి తడిసిన టవల్ ను ఫీల్లర్లుకు కట్టిన ఉన్న మోటరు వైరుపై ఆరేస్తుండ గా ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై కింద పడిపోయాడు.గమనించిన తోటి కూలీలు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికు తరలించగా వైద్యులు పరీక్షించి మార్గమధ్యలోనే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి అన్నయ్య దాసరి అప్పన్నబాబు చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
]]>
బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్ర: ఆది శ్రీనివాస్.. https://navatelangana.com/adi-srinivas-conspired-to-stop-funds-from-bjp-farmers-accounts/ Tue, 07 May 2024 15:51:33 +0000 https://navatelangana.com/?p=285704
నవతెలంగాణ – వేములవాడ 
తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు నిధులను తమ ఖాతాలో వేయడాన్ని బిజెపి  ఓర్చుకోవడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు,మంగళవారం మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ప్రెస్ నోట్ ద్వారా వివరించారు. రైతు భరోసా ను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయానికి రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసింది,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పిన సమయం కంటే ముందుగానే ఒకేసారి రైతు ఖాతాలో డబ్బులు జమ చేసారు అని తెలిపారు. ఈసీ అస్త్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్రలు చేసింది అని మండిపడ్డారు.రైతుల నోటికాడి బుక్కును లాక్కుంది,బీజేపీకి మొదటి నుంచి అన్నదాతలు అంటే అక్కసు, ఆగ్రహం అని తెలిపారు.కేంద్రం నల్ల చట్టాలు రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేసింది. నల్ల చటాలను వ్యతిరేకించి పోరాటం చేసిన వందలాది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత గడ్డు పరిస్థితిలో కూడా నిధులు లేకున్నా అన్నదాతలను ఆదుకోవడం కోసం బ్యాంకులలో రైతు భరోసా నిధులు జమ చేసాము, బీజేపీ తన గుప్పిట్లో ఉన్న ఈసీ ని అడ్డం పెట్టుకొని బ్యాంక్ ఖాతాలో పడ్డ సొమ్ములను కూడా నిలిపి వేసింది. 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల రోజునే కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేశారు.. అప్పుడు నోరుమెదపని బీజేపీ, ఆపని ఈసీ ఇప్పుడు ఎందుకు ఆపింది అని ప్రశ్నించారు.రైతు భరోసా కొత్త పథకం కాదు.. గత కొన్ని రోజులుగా క్రమంగా డబ్బులు వేస్తున్నాం.. పెండింగ్ ఉన్న డబ్బులు ఇపుడు వేశాం,గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే నిధులు జమ చెయ్యమని అడిగింది. రైతుల ప్రయోజనాల కోసం కృషి చేసాము అని తెలిపారు.రైతు భరోసా నిధులు ఆపిన తోడు దొంగలు బీజేపీ,బిఆర్ఎస్ లను రైతులు రాష్ట్రం నుంచి తరిమి కొడతారు అని అన్నారు.
]]>
శాయంపేటలో భారీ వర్షం https://navatelangana.com/heavy-rain-in-sayampet/ Tue, 07 May 2024 15:36:18 +0000 https://navatelangana.com/?p=285700 – కల్లాలలో తడిసిన వరి ధాన్యం
– సైడ్ కాల్వ లేక రోడ్డెక్కిన వరద నీరు
నవతెలంగాణ – శాయంపేట
మండల పరిధిలోని గ్రామాలలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అన్నదాతలు కుదేలయ్యారు. పంట కోసి పంట క్షేత్రంలో ఆరబెట్టుకుంటున్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. శాయంపేటలో కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో దేవుని చెరువు ఆయకట్టులో పండించిన ధాన్యాన్ని రైతులు టార్పాలిన్ కవర్లు కప్పి వర్షం భారీ నుండి పంటను కాపాడుకున్నారు. శాయంపేట నుండి ఆత్మకూరు వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణంతో శాయంపేటలో సైడ్ కాలువ నిర్మాణం లేక వరద నీరు రోడ్డెక్కింది. కూరాకుల కుమారస్వామి ఇంటికి వెళ్లే దారి నీటితో నిండిపోయి చిన్నపాటి తటకాన్ని తలపించింది. మండలంలో కురిసిన భారీ వర్షంతో ప్రజలు ఊరట చెందారు. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలు పెరగడం, ఎండల తాకిడికి తట్టుకోలేని ప్రజలు వర్షంతో ఉపశమనం చెందారు.

]]>
నెల రోజుల నుంచి కల్లంలోనే ఉంటున్నాం https://navatelangana.com/we-have-been-staying-in-kallam-since-a-month/ Tue, 07 May 2024 15:21:37 +0000 https://navatelangana.com/?p=285694

నవతెలంగాణ – వీర్నపల్లి 

వీర్నపల్లి మండలం రంగం పేట గ్రామంలో అల్మాస్ పూర్ సొసైటీ అధ్వర్యంలో కొనుగోలు కేంద్రంలో రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతు నెల రోజుల నుంచి కళ్ళంలోనే ఎండనక రాత్రి అనక వడ్ల వద్దనే ఉంటున్నాం ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు నాన కష్టాలు పడుతున్నాం. మ్యాచర్ వచ్చీ రోజులు గడిచిన తూకం వేయడం లేదనీ రైతులు మండి పడుతున్నారు. రాత్రీ పందులు పగలు కోతులు ధాన్యం రాశులు బుక్కుతున్నాయి . నెల రోజుల ముందు కోసిన వడ్లు తుకాం వేయక నాలుగు రోజుల క్రితం పోసిన ధాన్యం ను తూకం వేస్తూ ఇష్టం వచ్చినట్లు కోనుగోలు నిర్వహకులు చేస్తున్నారనీ ఆరోపించారు.గతంలో ఐకేపీ సెంటర్ వారు ఇలా చేయలేదు సీరియల్ గా తూకం వేశారు. కొనుగోలు కేంద్రంలో దాదాపు 25 లారిల లోడ్ వడ్లు ఉన్నాయి .ఇప్పటికైనా అధికారులు స్పందించి పెరుకపోయినా ధాన్యం ను వెంటనే కోనుగోలు చేయలని రైతులు కోరుతున్నారు.
]]>
అభివృద్ది చూసి కారు గుర్తుకు ఓటు వేయండి  https://navatelangana.com/see-the-progress-and-vote-for-the-car-sign/ Tue, 07 May 2024 15:17:43 +0000 https://navatelangana.com/?p=285683
నవతెలంగాణ – వీర్నపల్లి 
తెలంగాణ ప్రభుత్వం పది ఎండ్లలలో అన్ని రంగాల్లో అభివృద్ది చేసింది ఆ అభివృద్ది చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని బి అర్ ఎస్ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి కోరారు.  వీర్నపల్లి మండల కేంద్రం తోపాటు కంచర్ల గ్రామంలో ఇంటింటికీ తిరుగుతు బి అర్ ఎస్ పార్టి మండల నాయకులు ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజేపి కి ఓటు వేసినట్లే నని బి అర్ ఎస్ పార్టి బలపరచిన ఎంపి అభ్యర్ధి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడుగా  బోయినిపల్లి  వినోద్ కుమార్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కటుకురి  రాజు, యూత్ మండల అధ్యక్షులు దేవ రాజు, మండల సీనియర్ నాయకులు గోగురి రమేష్, లింబద్రి నాయకులు రాజు,మహేందర్, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
]]>
ఓటు వేసేందుకు 12 గుర్తింపు కార్డులు https://navatelangana.com/12-identity-cards-for-voting/ Tue, 07 May 2024 15:15:21 +0000 https://navatelangana.com/?p=285679 నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్: పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.కేంద్ర ఎన్నికల సంఘం అనువర్తించిన గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు, లేదా పోస్ట్ ఆఫీస్ లు ఫోటోతో సహా జారీ చేసిన పాస్ బుక్, కేంద్ర కార్మిక శాఖ ద్వారా జారీ చేయబడిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆర్బిఐ ఎన్ పి ఆర్ కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్ పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టర్ అండ్ టేకింగ్ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వారి ఉద్యోగులకు జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డు, ఎంపీ ,ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ జారీచేసిన యూనిక్ దివ్యాంగ కార్డులలో ఏదో ఒకదానిని గుర్తింపుగా చూయించి ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.

]]>
ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గడ్డివాములు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం https://navatelangana.com/accidental-fire-is-a-major-hazard-of-lofts/ Tue, 07 May 2024 15:12:29 +0000 https://navatelangana.com/?p=285677
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం వ్యవసాయ వరికోత మడులలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని  వీచిన గాలులకు ముత్తారం, అరకండ్ల గ్రామాలకు వ్యాపించి, గడ్డివాములు దగ్ధమై కాలనీలో దట్టమైన పొగలు కమ్ముకొని పిల్లలు, పెద్దలు తీవ్రమైన శ్వాస ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల పొడవునా ధారాళంగా వ్యాపించి కాలనీలలోకి మంటలు వ్యాపించసాగాయి. సమాచారం అందుకున్న  బ్లూ కోల్డ్ పోలీసులు  హెడ్ కానిస్టేబుల్ రామచంద్రం వెంటనే ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజన్ రావడానికి ఆలస్యం జరిగింది. దీంతో మంటలు  కాలనీలోకి ప్రవేశిస్తుండగా అప్రమత్తమైన యువకులు, కాలనీవాసులు వ్యవసాయ బావుల మోటార్ల సహాయంతో మంటలను అదుపులోనికి తీసుకొచ్చారని, దీనికి వర్షం తోడై, పెను ప్రమాదం తప్పిందని  స్థానికులు తెలిపారు.
]]>
14 మంది 15 సెట్ల నామినేషన్లు https://navatelangana.com/14-people-with-15-sets-of-nominations/ Tue, 07 May 2024 15:11:05 +0000 https://navatelangana.com/?p=285670 నవతెలంగాణ నల్లగొండ కలెక్టరేట్: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా 5 వ రోజైన మంగళవారం14 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్. మహేందర్ జి కి వీరు నామినేషన్లను సమర్పించారు.
మంగళవారం నామినేషన్లు సమర్పించిన వారిలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఎనుగుల రాకేష్ 1 సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ నుండి నందిపాటి జానయ్య 1 సెట్, అలియన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుండి ఈడ శేషగిరిరావు 1 సెట్, శ్రమజీవి పార్టీ నుండి జాజుల భాస్కర్ 1 సెట్ ,యువతరం పార్టీ నుండి బండారు నాగరాజు 1 సెట్, నామినేషన్లు దాఖలు చేశారు.స్వతంత్ర అభ్యర్థులుగా అయితగోని రాఘవేంద్ర 1 సెట్, పిడిశెట్టి రాజు 2 సెట్ల నామినేషన్లు, పూజారి సత్యనారాయణ1 సెట్, మారం వెంకట్ రెడ్డి 1 సెట్, గుగులోతు బీమా 1 సెట్, డాక్టర్ పెంచాల శ్రీనివాస్ 1 సెట్, కంటే సాయన్న 1 సెట్, దైద సోమ సుందరం 1 సెట్, అల్వాల కనకరాజు 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

]]>
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం https://navatelangana.com/financial-assistance-to-the-family-of-the-deceased-24/ Tue, 07 May 2024 15:09:19 +0000 https://navatelangana.com/?p=285671
నవతెలంగాణ – తాడ్వాయి
 మండల కేంద్రంలోని భూపతి ధనలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా వారి దశ దినకర్మకు వారి కుమారుడు భూపతి శంకర్ క్లాస్ మెంట్స్ (పూర్వ విద్యార్థులు) కలిసి 7100 ఆర్థిక సహాయం అందించారు. శంకర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. తమ క్లాస్మేట్ శంకర్ తల్లి వియోగంతో బాధలో ఉండగా ప్రామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండూరి శ్రీదేవి నరేష్, తడక సుమన్, పల్లెర్ల ధర్మేందర్, దేవరకొండ రాజు, అపాజి తిరుపతి, బెల్లంకొండ నరేష్, ఎస్ డి కాజా పాషా అల్లే కృష్ణవేణి కవిత విజయలక్ష్మి పాయం లలిత పిన్నోజు సరిత, మృతి రాలి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
]]>
ఈదురు గాలులు.. వర్షం బీభత్సవం.. https://navatelangana.com/stormy-winds-and-rain/ Tue, 07 May 2024 15:07:04 +0000 https://navatelangana.com/?p=285663 – కొనుగోలు కేంద్రాలలో తడిసిన వరి ధాన్యం..
– పలుచోట్లలో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు..
– ఈదురుగాలికి పడిపోయిన చలువ పందిళ్లు, ఇంటి పై కప్పు..
నవతెలంగాణ – వేములవాడ 
ఎండలు మండుతుండగా మంగళవారం మధ్యాహ్నం నుండి ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షం వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా కురిసింది, ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.  ఈదురుగాలులతో వర్షం పడడంతో వేములవాడ దేవాలయ పరిసర ప్రాంతాలలో చెరువును తలపిస్తున్న రాజన్న ఆలయ పరిసరాలు కురిసిన భారీ వర్షానికి రోడ్ల పై నీళ్ళు వరదలా పారుతున్నాయి.రాజన్న ఆలయ పరిసర ప్రాంతాలు నీట మునిగి చెరువునుతలపిస్తున్నాయి,ఎక్కడిక్కడ నిలిచిపోయిన  వాహనాలు, రాజన్నలయ పార్కింగ్ స్థలంలో చలవ పందిర్లు పడిపోయాయి. వడగండ్లతో కురిసిన వర్షంతో బురదమయంగా మారిన ప్రధాని ప్రసంగించే సభాస్థలి, హెలిప్యాడ్ ప్రాంగణాలు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న వారి ధాన్యం మొత్తం వర్షానికి తడిసి ముద్దయ్యాయి, నీటి ప్రవాహంలో ధాన్యమంతా కొట్టుకుపోయింది. మునిసిపల్ విలీన గ్రామమైన నాంపల్లిలోని 6వ వార్డ్ బొజ్జపల్లి చెందిన నిరుపేద కుటుంబం అయిన రేగుల శేఖర్ ఇంటి పైకప్పుఈదురుగాలికి  మొత్తం ఎగిరిపోయింది. వేములవాడ రూరల్ మండలంలోని మల్లారం, బొల్లారం గ్రామాలలో ఈదురుగాలితో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి. ఈదురు గాలిలో నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
]]>