Vedika Archives - https://navatelangana.com/category/vedika/ Sat, 09 Nov 2024 18:46:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Vedika Archives - https://navatelangana.com/category/vedika/ 32 32 ఖాళీల సుడిగుండంలో గురుకులాలు https://navatelangana.com/gurukulas-in-the-vortex-of-emptiness/ Sat, 09 Nov 2024 18:46:06 +0000 https://navatelangana.com/?p=435669 Gurukulas in the vortex of emptinessతెలంగాణ ఉద్యమ సమయంలో ‘కేజీ నుండి పీజీ ఉచిత విద్య’ అందరికీ సమానంగా అందాలనే డిమాండ్‌తో పోరాటం జరిగింది. ‘ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలను మేము నెరవేరుస్తామని’ అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ‘కేజీ నుండి పీజీ’ విధానంలో భాగంగా నాణ్యమైన విద్యతో పాటు, అన్ని వసతులతో గురుకులాలను తీసుకొస్తున్నామని ప్రకటించింది. ‘కార్మికుల పిల్లలైన, కలెక్టర్‌ పిల్లలైన ఒకే తరగతి గదిలో చదువుకునే కామన్‌ స్కూల్‌ విద్యా విధానం మా లక్ష్యం’ అని వాగ్దానం చేసింది. కొద్దిమందికైనా ఏర్పాటు చేసిన గురుకులాలకు తగిన నిధులు కేటాయించకపోవడంతో అవన్నీ కూడా నేడు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఖాళీల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే గత సర్కార్‌ చేసిన తప్పిదాలు, నెరవేర్చని హామీల పట్ల ప్రస్తుత రేవంత్‌ ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం కనినిస్తున్నది. ఎందుకంటే, ప్రస్తుతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ గురుకులాలు ఆయా సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతుండగా.. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఆర్‌ఈఐఎస్‌) నేరుగా పాఠశాల విద్యా శాఖ పరిధిలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల సొసైటీల పరిధిలో 1022 గురుకులాలుండగా, వీటిలో ఐదు నుంచి ఇంటర్‌వరకు 6,18,880 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో సుమారు 13వేల మంది టీజీటీ, పీజీటీ, స్థాయి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టాయిలెట్లు, బాత్రూమ్‌లు లేవు. ఉన్న కాసిన్ని కూడా మరమ్మతులకు నోచుకోక నానా తంటాలు పడుతున్నారు. కాలకృత్యాలు కూడా సరిగా తీర్చుకోకుండా, రెండు మూడు రోజులకోసారి స్నానం చేస్తూ అనారోగ్యాల పాలవుతున్నారు. ఒక్కో గురుకుల విద్యాసంస్థలో 640 మంది విద్యార్థులుంటారు. ఐదు నుంచి పదివరకు 480 మంది విద్యార్థులు కాగా.. ఇంటర్మీడియట్‌లో 160మంది ఉంటారు. గురుకుల పాఠశాల వసతుల్లో భాగంగా కనీసం పదిమంది విద్యార్థులకు ఒక బాత్రూం, కనీసం ఏడుగురికి ఒక టాయిలెట్‌ ఉండాలనేది నిబంధన. ఈ లెక్కన ఒక్కో గురుకుల పాఠశాలలో 64 బాత్రూమ్‌లు, 90 టాయిలెట్లు ఉండాలి. కనీసం పది మందికి ఒకటి చొప్పున ఉన్నా సర్దుకుపోయే పరిస్థితి ఉంటుంది. కానీ చాలా చోట్ల 1:20 నిష్పత్తిలో కూడా లేవు. గురుకుల విద్యాసంస్థల్లో బాత్రూమ్‌లు, టాయిలెట్ల పరిస్థితి తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం కింద 29 గురుకులాల్లో వివరాలను సేకరించగా, ఆ 26 గురుకులాలు, 3 కేజీబీవీలలో ప్రస్తుతం 15136 మంది విద్యార్థులు వసతి పొందుతూ చదువుకుంటున్నారు. వారికి 1,513 బాత్రూంలు అవసరమవగా. 870 మాత్రమే ఉన్నాయి. 1:10 నిష్పత్తిలో లెక్కించినా.. 644 బాత్రూమ్‌లు తక్కువగా ఉన్నాయి. ఇక 2,162 టాయిలెట్లు అవసరంకాగా. 1,104 మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ తలుపులు సరిగా లేనివి, నిర్వహణ సరిగాలేక పాడైపోయినవి ఎక్కువే. దీంతో వీలు చిక్కినప్పుడే స్నానాలు చేస్తున్నామని.. కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే వారి ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నది వాస్తవం. శాశ్వత ప్రాతిపదిన ఉన్న గురుకులాల్లో కంటే.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటిలో ఈసమస్య మరింత తీవ్రంగా ఉంది.
అద్దె భవనాల్లో అవస్థలెన్నో?
850 గురుకులాలకు సొంతభవనాలే లేవు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటిలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా వసతులు కల్పించలేదు. కిటీకీలు, డోర్లు సరిగా లేవు. పుస్తకాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, కంప్యూటర్లు కానరావు. బోధన,బోధనేతర సిబ్బంది సరిపడా లేరు. పంటపొలాల నడుమ ఏర్పాటు చేసిన హాస్టళ్లలో కనీసం ప్రహరీ నిర్మించకపోవడం మూలాన అనేకచోట్ల విద్యార్థులు విషసర్పాల కాటుకు గురవుతున్నారు. పారిశుధ్యం లోపించి దోమలతో ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. బెంచీలు కూడా లేకపోవడంతో కింద కూర్చుని చదువుకుంటున్న కాలేజీలు విద్యార్థులున్నారు. చాలాచోట్ల తాగునీటి సమస్య కూడా తీవ్రంగానే వుంది. ‘ఒంటికి, రెంటికి’ బాత్రూమ్స్‌ లేక ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. స్వేచ్ఛ వాతావరణంలో ఆనంద నిలయాలుగా మారి సృజనాత్మకంగా విజ్ఞానం వైపు అడుగులు వేయా ల్సిన గురుకులాలు నిర్బంధ కేంద్రాలుగా మారాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మార్చిన టైం టేబుల్‌ కూడా శాస్త్రీయంగా లేకపోగా, విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పడుతున్నది. ఫలితంగా శారీరక అనారోగ్యానికి గురైవిద్యార్థుల డ్రాపౌట్లు పెరుగుతున్నాయి. గురుకుల విద్య మీద అనేక ఆశలు పెట్టుకున్న పేదవిద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురుకులాల్లో ఉండే భయానక పరిస్థితుల మూలంగా చాలామంది సీటు సంపాదించుకున్నప్పటికీ విద్యార్థులు క్యాంపస్‌ వాతావరణంలో ఉండే సమస్యలను చూశాక ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. ఫలి తంగా అన్ని గురుకులాల్లో కలిపి సుమారు లక్షా 22వేల విద్యార్థుల ఖాళీలున్నాయి.
ఖాళీలను భర్తీ చేసేదెప్పుడు?
రాష్ట్రంలో ఏ ఇతర శాఖలో పోస్టుల భర్తీ చేపట్టినా.. సంక్షేమ గురుకుల సొసైటీల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో బ్యాక్‌లాగ్‌లు పెరుగు తున్నాయి. ఇప్పటికే నియామకాల్లో అవరోహణ క్రమం పాటించకపోవడంతో దాదాపు 1800కి పైగా ఖాళీలు వచ్చినట్లు సమాచారం. తాజాగా పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ కింద 11,062 పోస్టుల భర్తీ చేసింది. దీంతో అన్ని సొసైటీల్లో కలిపి దాదాపు 1,800 వరకు వివిధ కేటగిరీ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అయ్యాయి. మరోవైపు ప్రభుత్వ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరి శీలన పూర్తయి, నియామకాలు జరిగితే ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది? గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనాభ్యసన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆహ్లాదకరమైన తరగతి గదులు, మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు స్టాఫ్‌ క్వార్టర్స్‌ కల్పించడం ద్వారా గురుకులాల్లో సరైన బోధనా వాతావరణన్ని సృష్టించగలుగుతారు. ఆరోగ్యకరమైన పని పరిస్థితుల ద్వారానే ఉపాధ్యాయులు సక్రమంగా, నాణ్యమైన బోధన చేయగలుగుతారు. అయితే మెజారిటీ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఫ్యామిలీ క్వార్టర్స్‌ లేకపోవడంతో వాళ్లు దూరప్రాంతాల నుంచి రావడం, మహిళా ఉపాధ్యాయులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం తరచూ జరుగుతున్నవే. గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు, పాఠశాలల్లో పనిచేసే టీచర్స్‌కు కొంత వ్యత్యాసం ఉంటుంది. దానికి తగినట్టుగా కూడా పేస్కేల్‌లో మార్పులు చేసి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. సమగ్రంగా ఆలోచించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆలోచించి రొటీన్‌ ఉద్యోగాల వల్లే గురుకుల ఉద్యోగాలను ట్రీట్‌ చేయడం సరికాదు. ఖాళీల సంఖ్య పెరిగితే ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై పనిభారం పెరిగి బోధనా ప్రమాణాలు పడిపోతాయన్న విషయం మరవకూడదు.
ఆనంద నిలయాలుగా మార్చాలి
ఉపాధ్యాయ వృత్తి అనేది గౌరవప్రదమైనది. ఈ వృత్తిలోకి సమాజంలో ప్రతిభావంతుడైన యువకులను ఆకర్షించడానికి మిగతా ఉద్యోగాల కన్నా జీతభత్యాలు ఎక్కువగా చెల్లించాలి. అప్పుడే ప్రతిభావంతులైన యువకులు ఈ ఉద్యోగంలోకి ఆకర్షింపబడుతారన్న కొఠారి కమిషన్‌ సిఫార్సును గమనంలోకి తీసుకోవాలి. ఉపాధ్యాయుల ఖాళీలు లేకుండా చూడాలి. పటిష్టమైన పర్యవేక్షణా చర్యలు తీసుకోవడంతోపాటు, శాశ్వత భవనాలు నిర్మించి, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. అనేక ఆశలతో గురుకులాల్లో చేరిన విద్యార్థులు వాటిని వీడకుండా, ఖాళీలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరిస్తూ, అన్ని పాఠశాలలను గురుకులాలుగా మార్చే దిశలో ప్రభుత్వం ఆలోచించాలి. చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రవేశ పరీక్ష లేకుండా ప్రవేశాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. స్వేచ్ఛా వాతావరణంలో ఆనంద నిలయాలుగా మారి సృజనాత్మకంగా విజ్ఞానం వైపునకు అడుగులు వేయాల్సిన గురుకులాలు నిర్బంధ కేంద్రాలుగా మారకూడదు. తద్వారా మాత్రమే తెలంగాణ విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించే అవకాశముంది.
కె.వేణుగోపాల్‌
9866514577

]]>
‘అపార్‌’కార్డు నమోదులో అపారమైన సమస్యలు! https://navatelangana.com/enormous-problems-with-aparcard-registration/ Sat, 09 Nov 2024 18:44:54 +0000 https://navatelangana.com/?p=435666 Enormous problems in 'Apar' card registration!‘ఒకేదేశం-ఒకే ఎన్నిక’ లాగే కేంద్రం మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇది నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా తెచ్చినట్టు చెబుతున్నది. ఇప్పటికే ఈ విద్యావిధానం శాస్త్రీయం కాదని విద్యావంతులు, మేధావులు చెబుతూనే ఉన్నా, కేంద్రం ఎవరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు సాగుతున్నది విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా ‘ఒకే దేశం-ఒకే స్టూడెంట్‌’ అనే కొత్త విధానాన్ని రూపొందించింది. అదే.. ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకాడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌)కార్డు. ప్రతి విద్యార్థికి ఈ కార్డు ద్వారా కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుందట! కార్డుపై క్యూఆర్‌ కోడ్‌తో పాటు పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుందట. అపార్‌తో ఎక్కడి నుంచైనా ప్రవేశాలు పొందవచ్చనేది పాలకుల వాదన. దేశంలో పౌరులకు గుర్తింపు కార్డుగా ఆధార్‌కార్డు తీసుకొచ్చినట్టే… విద్యార్థులకు కూడా ఆపార్‌కార్డులు తీసుకొస్తుందన్నమాట. ఇప్పటికే ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో తొమ్మిది, పదో తరగతులు చదువుకుంటున్న విద్యార్థులకు ఈ కార్డులు జారీ చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వన్‌నేషన్‌-వన్‌ స్టూడెంట్‌ నినాదం పేరుతో కేంద్ర విద్యాశాఖ అపార్‌ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది.
ఈ కార్డు తేవడం వెనుకున్న మతలాబేంటో తెలియదు కానీ, ఈ అపార్‌ నమోదులో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.అపార్‌ కార్డు నమోదు కోసం ఆధార్‌ కార్డును ఉపయోగించాల్సి వస్తున్నది. అయితే నమోదు సమయంలో ఆధార్‌ కార్డులో వివరాలు, అడ్మిన్‌ రిజిస్టర్‌, యూడైస్‌లో వివరాలతో పోలిస్తే తప్పుగా ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆధార్‌ కార్డులో మార్పులు చేసుకోవాల్సి వస్తోంది.ఆధార్‌, అపార్‌, బ్యాంక్‌ అకౌంట్‌, పాన్‌ కార్డు అన్నీ లింక్‌ అయి ఉంటాయి. అపార్‌ వివరాలు సేకరించే ఏజెన్సీ ఎవరికైనా విక్రయిస్తే విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందులకు గురికావడం ఖాయం. అక్టోబర్‌ 22 నుంచి 25 వరకూ అపార్‌ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అయితే మీసేవా కేంద్రాల్లో కేవలం ఫోన్‌ నంబర్‌ అఫ్‌డేట్‌ వంటి చిన్న చిన్న సమస్యలను మాత్రమే కరెక్షన్స్‌ చేస్తున్నారు ఆధార్‌ కార్డులో పుట్టినరోజు, తండ్రి పేరు వంటి వివరాలు మార్చాల్సి వస్తే బర్త్‌ సర్టిఫికేట్‌ అడుగుతున్నారు. ఆస్పత్రుల్లో జన్మించిన వారికి బర్త్‌ సర్టిఫికేట్ల సమస్య పెద్దగా ఉండటం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్ద పుట్టిన వారికి ఈ పుట్టినరోజు ధ్రువపత్రం సమస్యగా వస్తోంది. నిరక్షరాస్యత, బర్త్‌ సర్టిఫికేట్‌కు దరఖాస్తు చేసుకోకపోవటమే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో అపార్‌లో నమోదు చేసేముందు ఆధార్‌ కార్డులో, స్కూలు అడ్మిషన్‌ రిజిస్టర్‌లో వివరాలు ఒకేలా ఉన్నాయో లేదో సరిచూసుకోవటం మంచిది. అవి సరిగా లేకపోవడంతో మండల రెవెన్యూ ఆఫీస్‌ చుట్టూ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయినప్పటికీ పనికావడం లేదని వాపోతున్నారు. ఇలాంటి కార్డుల విధానం కేంద్రం తేవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది విద్యార్థికి తప్పనిసరి చెబుతుండటంతో, ఇదే అదనుగా నోటరీలకు గిరాకీ పెరిగింది. ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. విద్యార్థుల నుండి అందినకాడికి దండుకుంటున్నారు. అపార్‌ నమోదు కోసం ఇన్ని తంటాలా? అని తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– డా.ఎం.సురేష్‌బాబు

]]>
తెలంగాణ సంస్కృతి-‘సదర్‌’ ఉత్సవం https://navatelangana.com/telangana-culture-sadar-festival%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%a6%e0%b0%b0/ Sat, 02 Nov 2024 17:33:00 +0000 https://navatelangana.com/?p=430395 Telangana culture- 'Sadar' festivalభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం హైదరాబాద్‌ నగరం. ప్రతియేటా సరిగ్గా దీపావళి సమయానికి జంటనగరాలు మరో విభిన్నమైన ఉత్సవానికి జరుపుకోవడానికి ముస్తాబవుతాయి. అవే సదర్‌ ఉత్సవాలు. అ సదర్‌ను వృషభోత్సవాలు అని కూడా అంటారు. సదర్‌ అనే ఉర్దూ పదానికి ఆత్మ విశ్వాసం, లీడర్‌ అనే అర్థాలు ఉన్నాయి.”సదర్‌”అంటే హైదరాబాది వ్యవహారికం ప్రకారం ”ప్రధానమైనది” అని అర్థం. యాదవ సామాజిక వర్గం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ సదర్‌ ఉత్సవంలో కుల,మతాలతో సంబంధం లేదు. యాదవ కులాలతో పాటు ,వారి మిత్రులు, బంధువులు కూడా అందరూ పాల్గొని, ఆటా, పాటలతో సరదాగా గడుపుతారు.
ఈ సదర్‌ ఉత్సవాలు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికతలో భాగంగా ప్రారంభమై దేశ వ్యాప్తంగా విస్తరించినప్పటికీ, తర్వాత కాలంలో కనుమరుగై అక్కడక్కడ స్థానిక ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి.ఈ ఉత్సవాలు మన రాష్ట్రానికి దేవగిరి యాదవ రాజుల కాలంలో వ్యాప్తి చెందాయి. కాకతీయ రాజుల కన్నా ముందే యాదవులు గొల్లకొండగా పిలిచే ప్రస్తుత గోల్కొండను కేంద్రంగా చేసుకుని జీవించేవారని చరిత్ర. తరువాత కాలంలో గొల్లకొండ ప్రాంతాన్ని (ప్రస్తుతం గోల్కొండ ప్రాంతం) పాలించే గొల్లల రాణి (యాదవుల రాణి) కుతుబ్‌ షాహీ దండయాత్రలను ఐదు దున్నపోతుల సహాయంతో ఎదుర్కొని పోరాడి వీర మరణం పొందిందని, తర్వాత కాలంలో గొల్లకొండ గోల్కొండగా మారినా రాణి, దున్నపోతుల వీరత్వానికి ప్రతీకగా సదరు ఉత్సవాలు జరుపుతున్నట్లు ఒక నానుడి. యాదవ వీరులు కుతుబ్‌ షాహిలు, మొగలులు, నిజాంల కాలంలో సైనిక అధికారులుగా, అంగరక్షకులుగా సమర్థవంతంగా పనిచేసినట్టు చెబుతారు. నిజాం వారి సేవలను గుర్తించి గౌలిగూడను (ఒకప్పుడు దీన్ని గొల్లగూడ అనేవారు. అక్కడ పాల ఉత్పత్తులు ఎక్కువగా అమ్మడం వల్ల ఆ పేరొచ్చింది.) ఇనామ్‌గా ఇచ్చారని ఆ తరంవారు చెబుతుంటారు. అక్కడినుంచే ఈ సదర్‌ ఉత్సవాలు ప్రారంభమయినట్టు తెలుస్తోంది.
దీపావళి పండుగ నాటికి వ్యవసాయ పనుల్లో దున్నలు,గేదెలు,ఎద్దులు,ఆవులతో చేసే పని చివరి దశకు చేరుకుంటుంది.ఆ సమయంలో పశువులు సమృద్ధిగా మేతను తింటూ బలంగా తయారై తమ సంతతిని పునరుత్పత్తి చేసే దశకు చేరుకుం టాయి.మేలు జాతి జంతువులను ఉత్పత్తి చేసే క్రమంలో ఈ పండుగ పుట్టుకొచ్చింది. అప్పట్లో వందలు,వేలాదిగా తరలివచ్చే దున్నలన్నింటిలో మేలు రకమైన జాతిని ఎన్నుకుని ఆ దున్న రాజును, దాని యజమానిని ఘనంగా సత్కరించి,ఆ దున్న రాజును, గేదెలతో క్రాస్‌ చేయించి మేలు జాతి దూడలను ఉత్పత్తి చేసేవారు. ఈ విధంగానే ఆంధ్ర ప్రాంతంలో కాటమరాజు ఒంగోలు గిత్త అనే బ్రీడును, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మల్లన్న, బీరప్పలు మేలిమి జాతి దక్కనీ గొర్రెలను వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఈ ఒంగోలు గిత్తలు, దక్కనీ గొర్రెలు ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు పొందాయి.
ఆధునిక సదర్‌ ఉత్సవాలు మాత్రం 1946 నుంచి కీర్తిశేషులు చౌదరి మల్లయ్య యాదవ్‌, నారాయణగూడ వై.ఎం.సి ప్రాంగణంలో ప్రారంభించినట్లు తెలుస్తోంది.కాలక్రమేణా హైదరాబాద్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో విస్తరించినప్పటికీ నారాయణగూడలో సదర్‌ ఉత్సవం (రెడ్డి మహిళా కళాశాల సమీపంలో)దాని చరిత్ర, ప్రజాధారణ కారణంగా అత్యధిక మందిని ఆకర్షిస్తున్నది.అందుకే దీనిని పెద్ద సదర్‌ అంటారు. మల్లయ్యయాదవ్‌ తదనంతరం నాటి నుంచి నేటి వరకు అతని కుటుంబ సభ్యులచే ఏటా ఇక్కడ నిరంతరాయంగా నిర్వహించ బడుతున్నది. ఈ ఉత్సవం ప్రధానంగా నారాయణగూడతో పాటు షేక్‌పేట్‌-దర్గా,సైదాబాద్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, కార్వాన్‌, బేగంబజార్‌, ముషిరాబాద్‌, గోషామహల్‌, మల్కాజ్‌గిరి లాంటి వివిధ ప్రాంతాల్లో జరుపుతారు. నేడు ఈ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా శంషాబాద్‌, షాద్‌గర్‌, కొల్లాపూర్‌, తుఫ్రాన్‌,నాగార్జున సాగర్‌, నకిరేకల్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, కరీంనగర్‌, చేవేళ్ల, నల్గొండ, భువనగిరి,యాదగిరి గుట్ట లాంటి నగరాలతో పాటు,మండల కేంద్రాల వరకూ విస్తరించాయి.
ఇది కేవలం తెలంగాణలోనే సదర్‌ అని పిలుస్తారు. మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో పోలా అని, తమిళనాడులో జల్లికట్టు అని, కర్నాటకలో కంబాలని,నేపాల్‌లో మాళ్వి అని హర్యానా, ఆంధ్రప్రదేశ్‌ మొదలైన ప్రాంతాలలో కూడా వివిధ కాలాల్లో, వివిధ పేర్లతో యాదవులు ఘనంగా జరుపుకుంటారు.యాదవుల ఐక్యతను, జంతువుల పట్ల వారికున్న ప్రేమానురాగాలను, వారి జీవన విధానానికి, రుతువులకు ఉన్న సంబంధాన్ని ఈ సదర్‌ ఉత్సవాలు సూచిస్తాయి.సాధారణంగా దీపావళి రోజు వ్యాపార వర్గాలు లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. కానీ యాదవులకు ఈ సదరు ఉత్సవమే లక్ష్మీ పూజలాంటింది. ఎందుకంటే వారిది ఎక్కువగా పాల వ్యాపారం. గేదెలు, దున్నపోతులు, ఎద్దులు, ఆవులు, గొర్రెలే వారికి సంపద. కాబట్టి అవే వారికి లక్ష్మీ దేవతలు.అందుకనే ప్రత్యేకించి సదరు ఉత్సవం రోజున వాటికి శుభ్రంగా స్నానం చేయించి, పూలదండలతో అందంగా అలంకరంచి పండుగలా చేసుకుంటారు.ఉత్తర భారతదేశంలో ఉన్న గోవర్ధన పూజ వలే మన దగ్గర సదర్‌ ఉత్సవం జరుపుకుంటారు.
ఆవు పేడతో నేలపై అలికి, దానిపై రంగురంగుల ముగ్గులు వేసి,తీపి పదార్థంతో అన్నం వండిన మట్టి కుండపై దీపం వెలిగించి పూజ చేస్తారు.అనంతరం ఉరేగింపుకు తెచ్చిన బలిష్టమైన దున్నను దాని పైనుంచి దాటిస్తారు. దీంతో సదరు ఊరేగింపు ప్రారంభమైనట్లు.కవాతులో యాదవులు తమ అత్యుత్తమ దున్నలను ప్రదర్శించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు.దున్నల శరీరాన్ని నూనెతో రుద్ది, వాటి కొమ్ములకు రంగులు వేయడం, మెడ చుట్టూ దండలు, పాదాలకు చీలమండలు (గజ్జెలు), మెడ లేదా నుదుటిపై గంటలతో, వాటి కొమ్ములపై నెమలీకలతో అలంకరిస్తారు.వివిధ ప్రాంతాల నుంచి డప్పులతో, డ్యాన్సులతో దున్న రాజులు బయలుదేరి తన చురుకుదనాన్ని,బలిష్టతను ప్రదర్శిస్తాయి.వాటిని ప్రధానంగా దాని వెనుక కాళ్లపై నిలబడేలా చేస్తారు. అందులో భాగంగా ఏ దున్నపోతైతే ఎక్కువ ఎత్తుకు తన ముందుకాళ్లను లేపుతుందో ఆ దున్నపోతుకు బహుమతి ప్రదానం చేస్తారు. ఈ మధ్య జరుగుతున్నా సదర్‌ ఉత్సవాలు రాజకీయ రంగు పులుముకున్నట్లు కనిపిస్తోంది.ఆధిపత్య కులాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం యాదవుల మధ్య చీలికలు తెచ్చి వారి సాంస్కృతిక పండుగలను సైతం రాజకీయ రొచ్చులోకి లాగుతున్నారనే విమర్శ వినిపిస్తోంది. యాదవులంతా ఒక్కటిగా రాజకీయాలకు అతీతంగా జాతి ఔన్నత్యాన్ని ద్వివినీకృతం చేసే విధంగా సదరు ఉత్సవాలు నిర్వహించుకోవాలి. అన్ని కుల, మతాలను గౌరవిస్తూనే తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు భవిష్యత్‌ తరాలకు చాటాలి.

– జె.నారాయణయాదవ్‌, 9494019270

]]>
‘జమిలి’…ప్రయోజనమెవరికీ!? https://navatelangana.com/for-the-benefit-of-jamili/ Sat, 02 Nov 2024 17:30:49 +0000 https://navatelangana.com/?p=430384 'Jamili'...who benefits!?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ మొత్తం దాదాపు రూ.90 లక్షల కోట్లు ఉంటుంది. ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నవారు 97 కోట్ల మంది ఉంటారు. ఐదేళ్లకోసారి విడతల వారీగా జరిగే ఎన్నికల కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ విధంగా లెక్కేస్తే ఒక్క ఓటర్‌ పై కేవలం రూ.20 మాత్రమే ఖర్చవుతుందని విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలు చేసే ఖర్చు ప్రజలకు పున:పంపిణీ జరుగుతుందని, దీనివల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తా యని చెప్పుకొచ్చినా దీన్ని ఖర్చుగా భావించరాదు. కేవలం రూ.5 వేల కోట్లు ఆదా అవుతాయనే కారణంతో జమిలీ ఎన్నికలకు వెళ్లడం సరైన చర్య కాదు.
మన దేశంలో బ్రిటీష్‌ నియంతృత్వ పాలన విముక్తి కోసం పోరాడి, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను సాధించుకున్నాం. ఈ దేశంలో అనేక మతాలు, కులాలు, ప్రాంతాలు, నైసర్గికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విభిన్న పరిస్థితులు భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఇలాంటి స్థితిలోనూ భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పదనం. అందుకే మన దేశాన్ని ”ఉపఖండం” అంటారు. ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య పాలనలో బహుళ పార్టీ విధానంలో ఎనభై ఏళ్లకు చేరుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతున్నాం. డాక్టర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ రచన కోసం దేశంలోని అన్ని వర్గాల, మతాల, ప్రాంతాల అభిప్రాయాలు సేకరించి ”భిన్నత్వంలో ఏకత్వం” సాధించేలా పాలకులకు ”రాజ్యాంగాన్ని” అందించారు. రాజ్యాంగం ప్రజల నుంచి వచ్చిందే, అది ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించింది. అణగారిన వర్గాలకు, జాతులకు, ప్రాంతాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించింది. కానీ ఇక్కడ జరగాల్సింది.. ప్రభుత్వాలు చేయాల్సిన ప్రధాన కర్తవ్యం రాజ్యాంగబద్ధ పాలన సాగించడమే. రాజ్యాంగ బద్దంగా పాలన నిర్వహించకుండా రాజ్యాంగాన్ని మార్చాలని, ఇది విదేశీ వలస రాజ్యాంగమంటూ ఏకంగా ఎన్నికల విధానాన్ని మార్చాలని స్వార్థ నియంతృత్వ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ఖర్చు పెరిగిపోతుందనే సాకుతో జమిలి ఎన్నికల పేరుతో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానం తేవడానికి కేంద్రం ఏకపక్షంగా నిర్ణయించింది. మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ వేసి, ఆ కమిటీ నివేదిక కేంద్రానికి సమర్పించగా, దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఆ తదనంతరం పార్లమెంటులో ఆమోదించుకొని అమలుచేయ పూనుకున్నారు. ఈ జమిలీ ఎన్నికలు మన దేశానికి నష్టమని, లౌకిక విలువలు, రాజ్యాంగ మూలాలకు విఘాతం కలిగిస్తుందని, రాజ్యాంగ బద్ధమే కాదని! అమలులో అసాధ్యమని, రాజకీయ సంక్లిష్ట సంక్షోభాలకు దారితీస్తుందని మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ పాలకుల నియంతఅత్వం తట్టుకోలేక స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడి ప్రజాస్వామ్య పాలన ఏర్పరుచుకున్నాం. దీన్ని బలహీనపరచడం అప్రజాస్వామికంగా మళ్లీ స్వార్థ రాజకీయాల్లో నియంతృత్వ అధికారం బలం కోసం చేసే బలహీన ప్రయత్నమే!. దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిర్బంధంగా కదలాలని, కేంద్ర ప్రభుత్వ పాలనలో గుత్తాధిపత్యం కోసం రాష్ట్రాల, స్థానిక సంస్థల స్వేచ్ఛను హరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమే అని మేధావులంటున్నారు. అమలులో ఎట్టి పరిస్థితుల్లో మన దేశానికి తోడ్పడదు. కావున ప్రజల విశ్వాసాలను, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షించండి. నిజాయితీ, చిత్తశుద్ధి దండిగా ఉంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల నిర్వహణ విధానంలో మేలైన మార్పులు తెచ్చి, రాజ్యాంగం స్వయం ప్రతిపత్తి కల్పించిన ప్రత్యేక సంస్థల్లో అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలి. ఎన్నికలకు ముందు అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని పాలకులను ”రీ కాల్‌” చేసేలా సవరణ తెస్తే బాగుంటుంది. ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించకుండా.. సాధ్యం కాని ”జమిలీ ఎన్నికల”ను ముందు పెట్టి ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించే ప్రయత్నమే.
మన దేశంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లోని స్థానిక ప్రభుత్వాలలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాల ఏర్పాటుకు అనేక సమీకరణలు ఉంటాయి. ఏదైనా రాష్ట్రంలో రెండున్నర ఏళ్లకే ప్రభుత్వం కూలిపోతే మిగిలిన రెండున్నరేేండ్లు అక్కడ ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం పెత్తనం చేస్తుందా? అనే ప్రశ్న మొదలవుతుంది. అలాగే రాజ్యాంగ లౌకిక విలువలకు, మూలాలకు విఘాతం జరగబోతోంది. ఇందులో ప్రధానంగా దేశంలో ఐదేండ్లలో రెండుసార్లు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. అయితే దీనికోసం 15వ రాజ్యాంగ సవరణను కమిటీ ప్రతిపాదించింది. రాజ్యాంగ మార్పుకు లోక్‌సభలో రెండింట మూడొంతుల మెజార్టీ (362 మంది సభ్యులు) ఉండాలి. కానీ ఇప్పుడున్న కేంద్ర సర్కారుకు ఆ మెజార్టీ లేదు. దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ 50 శాతం మద్దతు అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ మొత్తం దాదాపు రూ.90 లక్షల కోట్లు ఉంటుంది. ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నవారు 97 కోట్ల మంది ఉంటారు. ఐదేళ్లకోసారి విడతల వారీగా జరిగే ఎన్నికల కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ విధంగా లెక్కేస్తే ఒక్క ఓటర్‌ పై కేవలం రూ.20 మాత్రమే ఖర్చవుతుందని విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలు చేసే ఖర్చు ప్రజలకు పున:పంపిణీ జరుగుతుందని, దీనివల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చినా దీన్ని ఖర్చుగా భావించరాదు. కేవలం రూ.5 వేల కోట్లు ఆదా అవుతాయనే కారణంతో జమిలీ ఎన్నికలకు వెళ్లడం సరైన చర్య కాదు. ఎన్నికల సంఘం విధించే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎమ్‌ సీ సీ) వల్ల ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కేవలం కొత్త పథకాల ప్రకటనలు, అమలుకు మాత్రమే వర్తిస్తుంది. రాజకీయ పార్టీలు తమకు అను కూలంగా ఎన్నికల ప్రక్రియను మార్చుకునేందుకు ”ఒక దేశం-ఒకే ఎన్నిక” నినాదం ముందుకు తెస్తుందని విశ్లేషకుల అంచనా. ఐదేండ్ల లోపు రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు కూలిపోతే, ప్రత్యేక పరిస్థితిలో ఖాళీ ఏర్పడితే ఏం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. గవర్నర్లు, స్పెషలాఫీసర్ల పాలనను దేశ ప్రజలు అంగీకరిస్తారా?
ఒక దేశం -ఒకే ఎన్నికలో పలు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీకి మెజా ర్టీ రాకుంటే ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేయాలనే పరిష్కారం లేదు. ఇప్పుడున్న విధానంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది. దాన్ని అమలు చేస్తే చాలు. ”జమిలీ ఎన్నికల నిర్వహణ” అంతిమంగా నియంతృత్వానికి దారి తీస్తుందనటంలో సందేహం లేదు. ఇది ఈ దేశ ప్రజలకు, దేశ స్వేచ్ఛ, సమన్వయ, సమాఖ్య స్పూర్తికి ఏ విధంగా తోడ్పడదు అని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం భేషజాలు వీడి ఎలాంటి చర్చలు జరపకుండా నియంతృత్వ ధోరణితో అమలు చేయడం శ్రేయస్కరం కాదు. నిపుణుల, విశ్లేషకుల, మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. గతంలోనే ఆగమేఘాల మీద వ్యవసాయ చట్టాలను తెచ్చి, ఆ తర్వాత ప్రజా పోరాటాలకు తట్టుకోలేక ”చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు” ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న గుణపాఠంతోనైనా వీటిని పున: పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

– మేకిరి దామోదర్‌, 9573666650

]]>
ఒకే దేశం-ఒకే ఎన్నిక : ప్రజాస్వామ్య స్ఫూర్తికి సవాల్‌! https://navatelangana.com/one-country-one-election-is-a-challenge-to-the-spirit-of-democracy/ Sat, 26 Oct 2024 21:02:09 +0000 https://navatelangana.com/?p=425936 One country-one election: a challenge to the spirit of democracy!భారత ప్రజాస్వామ్యంలో ఒక దేశం-ఒకే ఎన్నిక అనే సిద్ధాంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకే సమయంలో సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక ఎన్నికలను నిర్వహించడం అంత సులభమేమీ కాదు. కేంద్ర పాలకులు చెప్పే మాటలు, భారత లౌకిక విధానానికి పూర్తి భిన్నం. వాళ్లు చెప్పే ఖర్చుల తగ్గింపు కన్నా ఎక్కువ సమస్యలు నెలకొనే అవకాశాలున్నాయి. ఇది వైవిధ్యoతో కూడిన ప్రజాస్వామ్యస్ఫూర్తికి ఒక సవాల్‌గా మారనుంది? భారతదేశం అనేక భాషలు, సంస్కృ తులు, ప్రాంతాల సమాహారంతో కూడిన దేశం. వివిధ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక రాజకీయ, సామాజిక సమస్యలున్నాయి. ఇవన్నీ ఆయా రాష్ట్రాల కోణంలోనే పరిశీలన చేయాల్సి ఉంటుంది. జమిలితో ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయి సమస్యలను ముందుకు తెచ్చే అవకాశం క్షీణించవచ్చనేది విమర్శకులు భావన. దేశంలో 1952, 1957, 1962 , 1967 వరకు సార్వత్రిక ఎన్నికలు , రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించబడ్డాయి. కానీ, అప్పటి నుండి ప్రాంతీయ రాజకీయాల ప్రాముఖ్యత పెరిగింది. 1967 తర్వాత, వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల రద్దు లేదా ఎమర్జెన్సీ వంటి పరిస్థితుల కారణంగా రాష్ట్రాల ఎన్నికలు వేరుగా నిర్వహించబడ్డాయి. మనది, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పబడే దేశం ‘జమిలి’తో ఏకపక్షంగా రాజకీయాలు సాగే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. అందువల్ల జమిలి ఎన్నిక అనేది మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధం.
దేశంలో ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతాల సమ స్యలు వేరే రాష్ట్రాల సమస్యలతో పోల్చలేము.వీటిని ఆయా రాష్ట్రాల పరిధిలోనే పరిష్కరించుకోవాలి. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక వనరులను రాబట్టగలగాలి. అయితే ఇప్పుడున్న కేంద్రంలోని ఎన్డీయే రాష్ట్రాల హక్కుల్ని పూర్తిగా లాగేసుకుంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఇవ్వాల్సిన నిధుల్లోనూ కోతలు విధిస్తోంది. అందుకే జమిలి లాంటి విధానాలు రాష్ట్రాలకు మరింత నష్టాలు చేకూరుస్తాయనే భావన కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకే సమయంలో భారీ సంఖ్యలో ఎన్నికలను నిర్వహించడం ఎంతవరకు సాధ్యమవుతుందనేది కూడా అనుమానమే.
ఒకే సమయంలో సుమారు మూడువేల నియోజకవర్గాలు ఎన్నికలలో పాల్గొంటే, ఎన్నికల సంఘంతో పాటు ప్రజలు సమస్యల్ని ఎదుర్కొనే అవకాశముంది. ఒకే ఎన్నికల సమయంలో పోలింగ్‌ నిర్వహణ, ఇవిఎంలు సరిపడా లభ్యం, సురక్షిత చర్యలు వంటి సవాళ్ల గురించి కూడా అనేక చర్చలు నడుస్తున్నాయి. ఇది సాధ్యం కాదేమోననే భావనే ఎక్కువగా ఉంది. అంతకన్నా మతసామరస్యత, లౌకికవాదం అన్నిటికంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రధాన్యత పెరుగుతున్నది. జమిలిని తీసుకొస్తే సమాఖ్య వ్యవస్థ పెద్ద పరిణామాలను ఎదుర్కొనే అవకాశముంది. ఇది కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల సమతౌల్యానికి నష్టం జరగచ్చు. అందరికీ ఒకే చట్టం, ఒకే విధానం అనేవి రాష్ట్రాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయవచ్చు.
ప్రజల విశ్లేషణ, సర్వేల ప్రకారం, 2019లో భారతదేశంలో సుమారు 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో సుమారు 67శాతం మంది మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రాంతీయ ఎన్నికల ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈ భాగస్వామ్యం మరింత వివిధతను ప్రతిబింబిస్తుంది. ఒకే ఎన్నిక ఉంటే, ప్రజల ఆకర్షణ ప్రధాన నాయకత్వంపై మిగిలి, ప్రాంతీయ సమస్యలు దూరమయ్యే ప్రమాదముంది.
అంతిమంగా, జమిలి ఎన్నికలు అనేది వివిధ అభిప్రాయాల మధ్య ఒక సవాల్‌గా ఉందనే చెప్పాలి. ఒకే దేశం-ఒకే ఎన్నిక, ఒకే అభివృద్ధి అని చెబుతున్నప్పటికీ వైవిధ్యమైన భారత్‌లో ఇది సాధ్యం కాదు. ఎన్నికల ఖర్చు తగ్గడం, సమర్థత పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని చేస్తున్న కేంద్రం చేస్తున్న వాదన తప్పు. ఎందుకంటే ఎవరి రాష్ట్రాల వనరులు, ఆర్థిక భారాలు, ఖర్చులు, లోటు, మిగులు ఇప్పుడు భరిస్తున్నదే కదా. కేంద్రం చేస్తున్న సాయం ఏమీ లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ, మిగతా రాష్ట్రాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే భారత్‌ భిన్నమతాలు, విభిన్న భాషలు, భిన్న సంస్కృతుల కలయిక.లౌకితత్వంతో కూడిన దేశం. జమిలి ఎన్నికలు మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం!
సృజన దుర్గే

]]>
మళ్ళీ మనకు నోబెల్‌ వెలుగులు ఎప్పుడు..? https://navatelangana.com/when-will-we-have-nobel-lights-again/ Sat, 26 Oct 2024 17:02:26 +0000 https://navatelangana.com/?p=425750 When will we have Nobel lights again?‘We owe a lot to the Indians, who taught us how to count,without which no worth while scientific discovery could have been made’
ఈ అనంత విశ్వానికి, ‘సున్నా’ను అందించిన మన గురించి ఈ శతాబ్దపు అత్యున్నత ప్రభావిత వ్యక్తుల్లో ఒకరు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అన్న మాటలివి. ఎన్నో శతాబ్దాల కిందటే ప్రపంచ విజ్ఞానానికి గణితం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం, రసాయన శాస్త్రాల్లో మన శాస్త్రవేత్తలు చేసిన కృషి నేటి ఆధునిక సైన్స్‌కు పునాదిగా నిలిచింది. ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, మహావీర, వరాహమీర, భాస్కర, పతంజలి, చరక, సుసత, భరద్వాజ తదితరుల వంటి విఖ్యాత శాస్త్రవేత్తల మేధస్సు ప్రపంచపు పరిజ్ఞానాన్ని ప్రభావితం చేసింది.
ప్రస్తుతం 2024 సంవత్సరపు నోబెల్‌ బహుమతుల ప్రకటనల సందర్భంగా మనమంతా ఒక్కసారి మన ప్రతిభా పరిజ్ఞానపు ప్రయాణంలో నోబెల్‌ వెలుగుల గురించి మాట్లాడుకుందాం. మనకు స్వాతంత్య్రం రాకముందే బ్రిటీష్‌ వారి కింద బానిసత్వపు పాలన కాలంలోనే ఆసియా ఖండంలోనే సాహిత్యంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, భౌతికశాస్త్రంలో సి.వి రామన్‌ వంటి మహానుభావులు తొలి నోబెల్‌ సాధించి భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియజెప్పారు. నేడు ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో వుంటూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తూ, శతాబ్దాల నాగరికతను కలిగివున్న భారతదేశం నుంచి కేవలం మన పౌరసత్వంతో ఫిజిక్స్‌లో మాత్రమే 1930 లో వచ్చింది. ఆ తర్వాత ఫిజిక్స్‌ సాహిత్యంలో 78 వసంతాలలో స్వాతంత్య్ర భారత్‌ నుంచి నోబెల్‌ బహుమతి గెలవలేకపోయామంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన బిలియన్‌ డాలర్ల క్వశ్చన్‌. ప్రతిభకు అత్యుత్తమ కొలమానం నోబెల్‌ బహుమతి కానప్పటికీ, నోబెల్‌ కమిటీలపై ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు వున్నప్పటికీ నోబెల్‌ బహుమతుల విలువను ప్రపంచం ‘విశ్వ విజేత స్థాయి’గానే చూస్తుందనడం మనం కాదనలేని సత్యం.
“Where the mind is without fear and the held is high; Where knowledge is free; Where the world has not been broken up into fragments by narrow domestic walls; ….my father, let my country awake వంటి సుప్రసిద్ధ గేయంతో గీతాంజలి వంటి అసాధారణ, అసామాన్యమైన రచనతో 1913 లోనే నోబెల్‌ సాహిత్య బహుమతి గెలిచారు మన విశ్వ కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. మన జనగణమన గీతంతో పాటు బంగ్లాదేశ్‌ జాతీయ గీతాన్ని ఠాగూర్‌ రచించారు. శాంతినికేతన్‌ స్థాపనతో నేటి ఆధునిక భారతీయ విద్యా విధానంలో కూడా వారి ఆలోచనలు మనకు మార్గదర్శనం చేస్తున్నాయి. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, మహాత్మా గాంధీ వంటి విఖ్యాత ప్రముఖులతో సైతం ఎన్నో ఆధ్యాత్మిక, తాత్విక, పర్యావరణ, శాస్త్రీయ విశ్లేషణలను పంచుకున్నారు. వివేకానంద వారి రచనల నుంచి ఠాగూర్‌ ప్రేరణ పొందారు.
”నా మతం సైన్స్‌. నేను దాన్నే ఆరాధిస్తాను. నిత్య సాధకులైన వారే నా వారసులు” అంటూ కేవలం 200 రూపాయల ధర కూడా లేని పరికరాల సాయంతో రామన్‌ ఎఫెక్ట్‌ను కనుగొని 1930 లో మనకు ఫిజిక్స్‌ విభాగంలో నోబెల్‌ అందించారు. నోబెల్‌ బహుమతి తీసుకునే సందర్భంగా మన దేశపు జెండా లేనందుకు కన్నీటి పర్యంతమవుతూ, నిజాయితీతో కూడిన భావోద్వేగాల తన దేశభక్తిని ప్రదర్శించి నిజమైన భారతరత్నంగా భవిష్యత్తు తరాలకు ఆదర్శమయ్యారు. 1943 లో తానే సొంతంగా బెంగళూరులో రామన్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ స్థాపించి మన దేశంలోనే విక్రమ్‌ సారాభారు, హోమీ జహంగీర్‌ బాబా, అబ్దుల్‌ కలాం వంటి మహామహులకు దిక్సూచిగా నిలిచారు. నేటి ఆధునిక ప్రపంచం సైతం ఇంకా ‘రామన్‌ ఎఫెక్ట్‌కు ఎఫెక్ట్‌ అవుతూనే ఎన్నో ప్రకృతి రహస్యాలను చేధిస్తుంది.
సి.వి రామన్‌ బంధువు అయిన సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ విఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. భారతీయ-అమెరికన్‌ గా నక్షత్రాల పరిణామంపై పరిశోధనలు చేసి చంద్రశేఖర్‌ లిమిట్‌తో ఖ్యాతి గడించారు. బ్లాక్‌ హోల్స్‌ పై వీరి పరిశోధనల విషయాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వీరి కృషికి గుర్తింపుగా 1983లో విలియం ఎ.ఫౌలర్‌ తో కలిసి భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి అందుకున్నారు. వీరిలాగే మదర్‌ థెరిస్సా, హరగోవింద్‌ ఖొరానా, అమర్త్యసేన్‌, వెంకట్రామన్‌ రామకృష్ణన్‌ వంటి వారు మన దేశ మూలాలు కలిగిన నోబెల్‌ విజేతలు. 2014 లో మలాలా యూసఫ్‌జారుతో కలిసి ప్రఖ్యాత భారతీయ బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్‌ సత్యార్థి మన దేశ పౌరసత్వంతో నోబెల్‌ శాంతి బహుమతి గెలిచారు. గాంధీజీ నుంచి ప్రేరణ పొందిన వీరు ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’ వంటి ఎన్నో కార్యక్రమాలతో బాలకార్మిక వ్యవస్థ పై, విద్యా వ్యవస్థపై ఎన్నో ఉద్యమాలు చేశారు. లక్షల మంది పిల్లల జీవితాలను మార్చారు. కొన్ని సందర్భాల్లో ఎన్నో విమర్శలు, భౌతిక దాడులు ఎదుర్కోన్నప్పటికీ ‘నువ్వు కాకపోతే ఇంకెవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?’ అంటూ సమాజంలో మార్పు రావాలని అలుపెరగని ప్రయాణం చేస్తున్నారు.
గాంధీజీ, అరబిందో, మేఘనాథ్‌ సాహా, హోమీ జహంగీర్‌ బాబా, సత్యేంద్రనాథ్‌ బోస్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి మన దేశ ప్రముఖులు ఎన్నో సార్లు నోబెల్‌ బహుమతికి నామినేట్‌ అయినప్పటికీ ఎన్నో ఆనాటి రాజకీయ, సామాజిక కారణాల చేత అవార్డుకు ఎంపిక కాలేదు. విశేషం ఏమంటే సత్యేంద్రనాథ్‌ బోస్‌ వంటి వారు కనుగొన్న దైవ కణం విషయాలపై పరిశోధనలు చేసిన వారు నోబెల్‌ గెలిచారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా అహింసా మార్గంలో పోరాటం చేసిన ఎంతోమంది నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ఒబామా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, దలైలామా, ఆంగ్‌ సాన్‌ సూకీ వంటి నోబెల్‌ విజేతలకు గాంధీజీనే రియల్‌ హీరో. చరిత్రను పరిశీలిస్తే 1948లో గాంధీజీ హత్యకు గురికాకుంటే ఆ సంవత్సరం గాంధీజీకి నోబెల్‌ దక్కేదేమో! గాంధీజీ నోబెల్‌ వివాదంపై 2006 లో నోబెల్‌ కమిటీ ”మన 106 సంవత్సరాల చరిత్రలో అతి పెద్ద లోపం” అంటూ స్పందించింది.
ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన పరిశోధనలు, ఫలితాలు ప్రపంచ స్థాయిలో లేకపోవడమే నోబెల్‌లో మన స్థానం లేకపోవడానికి ప్రధాన కారణం. అంతరిక్ష పరిశోధనల్లో మంగళయాన్‌, చంద్రయాన్‌ వంటి అద్భుత ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మాట వాస్తవం. కానీ ఇంకా మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలి. విశ్వవిద్యాలయాల్లోని ఉన్నత విద్యలో, పరిశోధనల్లో రాజకీయ జోక్యం వుండకూడదు. బడ్జెట్‌ పెంచాలి. యువతరాన్ని పరిశోధనల వైపు ప్రోత్సహించాలి. ఫెలో షిప్స్‌ అమౌంట్‌ పెంచాలి. నేటితరపు చదువులు మార్కులు, ఉద్యోగం, సంపాదన చుట్టే తిరుగుతున్నాయి. ఆ దృక్పథాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు మార్చుకొని, శాస్త్రవేత్తలకు సరైన గుర్తింపు మనదేశంలో ఇవ్వాలి. విదేశాలకు వెళ్ళే శాస్త్రవేత్తల వలసలను ఆపాలి. ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి నూతన చట్టాలతో కృషి చేయాలి. పాఠశాల స్థాయి విద్య నుంచే గొప్ప గొప్ప శాస్త్రవేత్తల జీవితాల గురించి, సమాజం నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, గెలుపోటములకు సంబంధం లేని వారి ప్రయత్నాల పరంపర గురించి విద్యార్థులకు స్ఫూర్తివంతమైన విధానాలతో తెలియజెప్పాలి.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రగామిగా వుండాల్సిన అవసరం కనిపిస్తోందని, యువతను పెద్ద పెద్ద కలలుగనమని యావత్‌ భారతాన్ని ప్రభావితం చేసిన అబ్దుల్‌ కలాం జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. మన తరగతి గదుల్లో శ్రీనివాస రామానుజన్‌ వంటి అసాధారణ భారతరత్నాలు ఉదయించాలి. త్వరలోనే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సివిరామన్‌ వంటి మహానుభావుల స్ఫూర్తితో మళ్ళీ మనదేశం ప్రపంచానికి నోబెల్‌ వెలుగులతో అనంత విశ్వం దాకా అన్వేషణ కొనసాగాలని ఆశిద్దాం. జగదీశ్‌ చంద్రబోస్‌, సలీం అలీ , సి.యన్‌.ఆర్‌ రావు, కల్పనా చావ్లా, బిమ్లా బూటి వంటి మన శాస్త్రవేత్తలను నేటి తరాలకు గొప్ప హీరోలుగా పరిచయం చేస్తూ గౌరవిద్దాం. నవతరం విన్నూత్న ఆవిష్కరణలతో విదేశీగడ్డలపై మన జాతీయ పతాకాన్ని ఎగిరేలా మన ప్రయాణం, మన ప్రయత్నం కొనసాగిద్దాం.
– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌ 

]]>
ప్రపంచ ఆకలి సూచీ 2024 – ప్రమాదానికి సంకేతం! https://navatelangana.com/world-hunger-index-2024-is-a-sign-of-danger/ Sat, 19 Oct 2024 17:15:09 +0000 https://navatelangana.com/?p=420387 World Hunger Index 2024 - A Danger Sign!ప్రభుత్వం తానిచ్చిన నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2019-2021కి సంబంధించి ఇచ్చిన గణాంకాలలో చైల్డ్‌ వాస్టింగ్‌ 19.3శాతంగా, చైల్డ్‌ స్టన్‌టింగ్‌ 35.5 శాతంగా ఉంది. ఎస్‌ఓఎఫ్‌ఐ-2023 నివేదిక ప్రకారం కూడా భారతదేశంలో 24 కోట్లమంది ప్రజలు పోషకాహారలేమితో ఉన్నారని తెలిపింది. ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ నూట్రిషన్‌ ప్రపంచ నివేదిక-2023లో కూడా ఇది 16.6 శాతంగా ఉన్నది.
జాతీయంగా,ప్రాంతీయంగా నిర్దిష్ట సంవత్సరకాలంలో పేదరిక స్థాయిని నిర్ధారిం చటానికిి, ఆకలి తీరు తెన్నులు కొలవడానికి ప్రపంచ ఆకలి సూచీ (జిహెచ్‌ఐ) అనేది ఒక ముఖ్యమైన సూచికగా పరిగణిస్తున్నారు. విలువ, నాణ్యత, వాస్తవికత, అంతర్జాతీయ సంస్థల గణాంకాల ప్రామాణికత వంటి శాస్త్రీయ ప్రమాణాలతో నిర్ధారించబడిన ”గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌” నివేదిక ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ప్రంపచవ్యాప్తంగా ఆకలిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించబడుతుంది.
ఐర్లాండ్‌కు చెందిన ‘కన్‌సర్న్‌ వరల్డ్‌వైడ్‌’, జర్మనీకు చెందిన ‘వెల్త్‌ హంగర్‌ లైఫ్‌’ సంయుక్తంగా వివిధ గణాంకాల సూక్ష్మ పరిశీలన అనంతరం, నిపుణుల సమూహంతో తయారుచేసి, 2006 నుంచి ప్రతియేటా ఈ నివేదికను విడుదల చేస్తున్నాయి. 10, అక్టోబర్‌ 2024వ తేదీన ఈ రెండు నాన్‌-గవర్నమెంట్‌ యూరోపియన్‌ ఆర్గనైజేషన్స్‌ ”గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌-2024”ను 19వ ఎడిషన్‌గా విడుదల చేశాయి. గణాంకాలకు సంబంధించిన వివరాలను ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌, ఎఫ్‌ఏఓ, డిహెచ్‌ఎస్‌, యూఎన్‌ఐజిహెచ్‌ఇ వంటి అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన సంస్థలు ప్రచురించిన నివేదికల ఆధారంగా పరిగణనలోకి తీసుకోబడినట్టు నివేదికలో పేర్కొన్నాయి.
ఆకలి సూచి తీవ్రతను 100పాయింట్ల స్కేలు ప్రాతిపదికన నిర్ధారిస్తారు. స్కేలులో స్కోరు ‘0’ వుంటే ఆకలి లేని పరిస్థితులు, ‘100’ వుంటే ఘోరమైన పరిస్థితులు నెలకొనివున్నట్లుగా భావిస్తారు. ఈ స్కోరు 9.9 లేదా అంతకంటే తక్కువ వుంటే ‘తక్కువగా’ ఉందని, 10-19.9 మధ్య ఉంటే ‘మోస్తరుగా’ వుందని, 20-34.9 మధ్య వుంటే ‘తీవ్రంగా’ ఉందని, 35-49.9 ఉంటే ‘ఆందోళనకరమని’ 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ నమోదు అయితే ‘అత్యంత ఆందోళనకరమని’ నిర్ధారిస్తారు ఆహారం సరిపడినంతగా దొరక్కపోవడం, మొత్తం జనాభాలో పోషకాహార లేమితో ఉన్న జనాభా ప్రాతిపదికన నిర్ధారించే పోషకాహార లోపం (అండర్‌ నరిష్‌మెంట్‌), 5 సంవత్సరాలలోపు పిల్లలలో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం (చైల్డ్‌ స్టన్‌టింగ్‌), ఐదేండ్లలోపు పిల్లలలో తీవ్రమైన పోషకాహారలేమి వల్ల వయసుకు తగిన ఎత్తు లేకపోవడం (చైల్డ్‌ వాస్టింగ్‌), ఐదేండ్లలోపు పిల్లలకు సరిపడ పోషకాహారలేమి వలన, అనారోగ్యమైన వాతావరణం వలన జరుగుతున్న శిశు మరణాలు (చైల్డ్‌ మోర్టాలిటి) వంటి నాలుగు కీలక సూచికలను కొలమానంగా పరిగణనలోకి తీసుకుని ‘ప్రపంచ ఆకలి సూచీ’ని లెక్కిస్తారు. వెయిటేజ్‌ పరంగా విశ్లేషించినపుడు, హంగర్‌ ఇండెక్స్‌లో పోషకాహారలోపానికి 1/3, చైల్డ్‌ స్టన్‌టింగ్‌కు 1/6, చైల్డ్‌ వాస్టింగ్‌కు 1/6, శిశు మరణాలకు 1/3 వంతుగా ఇమిడిఉంటుంది.
127 దేశాలను పరిగణనలోకి తీసుకుంటే 27.3 హంగర్‌ స్కోరుతో భారతదేశం 105వ స్థానంలో నిలిచింది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం ఆకలి ప్రమాదకర స్థాయిలో ఉన్న 41 దేశాల జాబితాలో భారతదేశం చేరటం శోచనీయం. మొత్తం 127 దేశాల జాబితాలో 5 సంవత్సరాలలోపు పిల్లలలో పోషకాహార లేమితో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడమనే సూచిక (చైల్డ్‌ స్టన్‌టింగ్‌)లో 35.5శాతంగా నమోదై అత్యధిక స్థాయిలో నిలవడం ఆందోళనకరం. పిల్లల పోషకాహారలేమికి సంబంధించిన అన్ని సూచికలలో చైల్డ్‌ వాస్టింగ్‌ అనేది తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఏదైనా దేశంలో ఇది 15శాతం కంటే ఎక్కువ వుంటే అత్యంత ఆందోళనకరమైన అంశంగా భావించబడుతుంది. చైల్డ్‌ వాస్టింగ్‌ సూచికలో 18.7శాతంగా నమోదై, పోషకాహారలోప తీవ్రతను ప్రతిబింబించింది. 5 సంవత్సరాలోపు శిశుమరణాల రేటు 2.9శాతంగా నమోదయింది.ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం తర్వాత ఉగాండా, మొజాంబిక్‌, జింబాబ్వే, పాకిస్తాన్‌, నైజీరియా, సూడాన్‌, జాంబియా వంటి 22 దేశాలు మాత్రమే ఉండడం గమనార్హం. భారతదేశానికి పొరుగుదేశాలైన చైనా (4), శ్రీలంక (56), నేపాల్‌ (68), బంగ్లాదేశ్‌ (84) ర్యాంకులతో మనకంటే ముందునిలిచాయి. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం 36 దేశాలు అత్యంత ప్రమాదకర స్థాయిలోను, 6 దేశాలు ఆకలి తీవ్రతతోనూ ఉన్నాయి.
అంతర్జాతీయ ఆకలి సూచి స్కోరు ప్రపంచ వ్యాప్తంగా పరిగణించినపుడు 18.3శాతంగా ఉంది. పౌష్టికాహార లోపం ఉన్న ప్రజల సంఖ్య క్రమేపి పెరిగి షుమారు 733 మిలియన్ల స్థాయికి చేరిందని, 2.8 బిలియన్‌ మేర ప్రజానీకం ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని నివేదిక ఉటంకించింది. అంతర్జాతీయ సంఘర్షణలు, వాతావరణ మార్పులు, గాజా, సూడాన్‌లో నెలకొని ఉన్న యుద్ధపరిస్థితులు, కాంగో, హయతి, మాలి, సిరియా వంటి దేశాలలో నెలకొని ఉన్న అంతర్గత ఘర్షణ వంటి సవాళ్ళు ఈ స్థబ్దతకు కారణాలని అభిప్రాయాన్ని వెలియబుచ్చింది.గతంలో గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదికను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఇది ఆకలి లెక్కలలో లోపభూయిష్టమైన పద్ధతులను అవలంభించిందని అభివర్ణించింది. కేవలం కొద్ది మంది నమూనాగా నిర్వహించిన సర్వేతో పౌష్టికాహారలోపాన్ని నిర్ధారించడం అర్థరహితమని ఆరోపించింది. నివేదికపై ప్రభుత్వ విమర్శలను నిశితంగా విశ్లేషిస్తే వాటి వాదనలలో పసలేదనేది ప్రస్ఫుటమవుతోంది. ప్రభుత్వం తానిచ్చిన నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2019-2021కి సంబంధించి ఇచ్చిన గణాంకాలలో చైల్డ్‌ వాస్టింగ్‌ 19.3శాతంగా, చైల్డ్‌ స్టన్‌టింగ్‌ 35.5 శాతంగా ఉంది. ఎస్‌ఓఎఫ్‌ఐ-2023 నివేదిక ప్రకారం కూడా భారతదేశంలో 24 కోట్లమంది ప్రజలు పోషకాహారలేమితో ఉన్నారని తెలిపింది. ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ నూట్రిషన్‌ ప్రపంచ నివేదిక-2023లో కూడా ఇది 16.6 శాతంగా ఉన్నది.
ప్రజలకు ఆహారాన్ని హక్కుగా అందించే కృషిలో భాగంగా ‘ఈట్‌ రైట్‌’, రక్తహీనత, పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ‘పోషణ్‌’, ప్రసూతి సమయంలో ప్రయోజనాలను అందించేందుకు ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను లబ్దిదారులకు అందించేందుకు నిర్ధేశించిన ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’, బడిపిల్లలకు ‘మధ్యాహ్న భోజన పథకం’, ఆహార ధాన్యాల సరఫరాకు సంబంధించి ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’ వంటి వివిధ పథకాలు, కార్యక్రమాలు, చర్యల ద్వారా ఆకలిని తగ్గించి, పోషకాహాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రచారార్భటంలోని డొల్లతనాన్ని ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశ స్థానం బహిర్గతం చేసింది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ లెక్కించడానికి ప్రాతిపదికగా ఉన్న నాలుగు సూచికలు ఐక్యరాజ్య సమితి లక్ష్యాలుగా పెట్టుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగమనేది విస్మరించలేము. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి సాధించకుండా, ‘ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో (ఎస్‌డిజి)’ భాగమైన 2030 నాటికి ఆకలిలేని ప్రపంచాన్ని నిర్మించాలనే లక్ష్యం ఆచరణసాధ్యం కాదని నివేదిక అభిప్రాయపడింది.
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ వివిధ కీలక సూచికలు భారతదేశంలో నెలకొనిఉన్న ఆకలి తీవ్రతను, పోషకాహారలేమిని, పొంచిఉన్న సవాళ్లను పాలకుల ముందుంచాయి. దేశ ప్రజల భవిష్యత్‌ ప్రయోజనాల దృష్ట్యా పోషకాహార లోపాన్ని సరిచేసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ నివేదిక నిక్కచ్చిగా వెలియబుచ్చింది. సామాజిక-ఆర్థిక తారతమ్యాలు, ప్రబలిపోయిన పేదరికం, తగినంత ఆహారాన్ని తీసుకోలేకపోవడం, పోషక విలువలున్న ఆహార వస్తువుల ధరలు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య పరిరక్షణా కొరత, లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు, ఆహార పంపిణీ విధానాలు, లింగ అసమానతలు వంటివి ప్రపంచ ఆకలి సూచిలో భారతదేశ స్థానాన్ని దిగజార్చడానికి తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ అంశాలని పాలకులు గమనించి, సార్వజనీయ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక అసమానతలను తగ్గించే ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించి దేశ ప్రజల భవిష్యత్‌కు భద్రత కల్పించాల్సిన సమయమిది.

]]>
ఆన్‌లైన్‌ గేమింగ్‌-కరిగిపోతున్న పిల్లల భవితవ్యం https://navatelangana.com/online-gaming-is-a-melting-pot-of-childrens-fate/ Sat, 19 Oct 2024 17:13:15 +0000 https://navatelangana.com/?p=420368 Online gaming—the fate of the melting pot of childrenవిస్తృత రూపంలో సమాజమే, సూక్ష్మ రూపంలో బడి. ఆ తరగతి గది రేపటి పరిపూర్ణ వ్యక్తిత్వం గల పౌర సమాజాన్ని తయారుచేసే విజ్ఞాన కర్మాగారం. ఇల్లు-బడి బాల్యానికి బంగారు భవిష్యత్తును అందించే కేంద్రాలు. ఇంట్లో, బడిలో, సమాజంలో ఆధునిక పరికరాల వినియోగం విపరీతంగా పెరిగిపోయి ంది.నూతన టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వి నియోగ మూ చేసుకోవచ్చు. పిల్లలు మొబైల్‌ ఫోన్ల మాయ(వల) లో పడి తమ విలువైన కాలాన్ని, సహజ మేధస్సుతో ఆలోచించే స్పృహను కోల్పోతున్నారు. అంతేకాదు? యువత, పెద్దలు, ఆడ, మగ, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ ఆధునిక పరికరాల వినియోగం శృతిమించడంతో సమాజం మానసిక సమస్యలతో అనారోగ్యం పాలవుతుంది. పిల్లలను చదువు నుండి, కుటుంబం నుండి దూరం చేస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ల ను కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పిల్లలు ఫోన్‌ ఉంటేనే అన్నం తింటారు. చెప్పిన మాట వింటారు, దాన్ని చూస్తూనే తింటారు. ఆన్‌లైన్‌లో ఆడుతూనే గంటలకు గంటలు గడిపేస్తుంటారు. లేదంటే ఏడుస్తుంటారు. చివరికి ఆ ఏడుపు ఆపాలన్నా ఫోను తోనే సాధ్యం అనే స్థాయికి నేటి పిల్లల పరిస్థితి దిగజారింది. చదువుతో సంబంధం లేకుండా అందరూ దీని బాధ్యులే, బాధితులే. ఈ ఆధునిక మానసిక దౌర్భాగ్యంతో పిల్లలు సహజ మేధస్సుతో ఆలోచించే సృజనాత్మకత, వినూత్నత కోల్పోతున్నారు. పిల్లలు ఫోనే లోకం, ఆన్‌లైన్‌ ఆట లేనిదే పూట గడువదనేలా తయారయ్యారు. ఆన్‌లైన్‌ గేములలో తుపాకులతో కాల్చేసే విధ్వంసకరమైనవే ఎక్కువగా ఉంటున్నాయి. కొట్టుకోవడం, చంపుకోవడమే లక్ష్యంగా ఉండే ఆటల మూలంగా ఆ చిన్నారుల మనసులు ప్రతికూల ఆలోచనలతో నిండిపోతున్నాయి. పబ్జీ, బ్లూవెల్‌ లాంటివైతే మరణాలకు కారణమవుతున్నాయి. ఇలా ఫోన్లకు బానిసైన పిల్లల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. మితి మీరి ఫోన్లకు బానిసలైన వారంతా పెద్దయ్యాక బెట్టింగు, ఇతర చెడు వ్యసనాలకు లోనవుతారనే నిపుణుల సూచనలను తల్లిదండ్రులు, ప్రభుత్వాలు పట్టించుకొని తక్షణమే ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి. దీనికి బానిసలుగా పిల్లలు, యువకులు, పెద్దలు, వఅద్ధులు అనే తేడా లేకుండా ఫోన్‌ వినియోగం పెరిగిపోయి సమాజం గాడి తప్పుతుంది. చదువుకున్న(రాని)వారు అనే తేడా లేనే లేదు, ఫోన్‌ అతిగా వాడడం వల్ల జరిగే దుష్పరిణామాలు తెలిసిన వారు కూడా ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ వేధింపుల నుండి పిల్లల్ని దూరం చేయలేకపోతున్నారు. విపరీతమైన ఫోన్‌ వాడకంతో రేపటి భావితరం ”మానసిక, శారీరక సమస్యల పౌర సమాజం”గా పరిణమించనుంది. ఇలా పిల్లల భవిష్యత్తుతో ఆటాడేస్తున్న ఆన్లైన్‌ గేమ్‌ లను సమూలంగా కట్టడి చేయాలి.
ఆన్‌లైన్‌గేమింగ్‌..చిన్నారులపై ప్రభావం
చైనా, జపాన్‌ లాంటి దేశాల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యవస్థను నిషేధించినట్లు తెలుస్తోంది. పలుదేశాలు ఈ వ్యసనాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాయి. ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణపై అధ్యయనం చేసి పొంచి ఉన్న తీవ్ర పరిణామాల నుండి బయటపడేయటానికి మన దేశం లోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌, ప్రొఫెసర్లను నియమించింది. తమిళనాడు ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ (టీఎన్‌ఓజీఏ)ఈ సంస్థ దీని ప్రభావం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది, కట్టడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. దీని ద్వారా ఆన్‌లైన్‌ గేమింగ్‌ మీద నియంత్రణ కోసం పోరాడు తోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ చేసిన ప్రాథమిక సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. పాఠశాలలు, కళాశాలలలో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులపై సర్వే నిర్వహించగా వారిలో 20శాతం మంది ఆన్‌లైన్‌ గేములకు, సామాజిక మాధ్యమాలకు బానిసలు అయ్యారని తెలిసింది. సర్వే కోసం పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు, యాజమాన్యాల సహకారం తీసుకున్నారు.ఆన్‌లైన్‌ గేములకు ఎక్కువగా ఆడుతున్న విద్యార్థులకు కంటిచూపు సమస్యలు వచ్చాయని 67 శాతం మంది ఉపాధ్యాయు (అధ్యాపకు)లు చెప్పారు. బానిసైన విద్యార్థుల తెలివితేటలు, చురుగ్గా ఆలోచించడం బాగా తగ్గిందని 74 శాతం మంది వెల్లడించారు. ఈ అధికారులు నిర్వహించిన సర్వేలో ప్రత్యేకించి ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం విద్యార్థుల్లో గత ఐదేండ్లుగా ఎక్కువవుతూ వస్తోందని, ఎలక్ట్రానిక్‌ పరికరాలు అందుబాటులో లేకపోతే పిల్లల మానసిక స్థితి ఆందోళనకరంగా మారుతుందని చెబుతున్నారు.
తల్లిదండ్రులు, ప్రభుత్వాల బాధ్యత
విద్యార్థుల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం విచ్చల విడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. వారి ప్రస్తుత దినచర్యపై ప్రత్యేక పర్యవేక్షణ చాలా అవసరం. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు వచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాల్సి వుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి బాధ్యతతో వెంటనే నియంత్రణా చర్యలు చేపట్టాలి. ఆధునిక టెక్నాలజీ పిల్లలకు ఉపయోగపడే విధంగా విద్యార్థుల్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో చారిత్రక, పౌరాణిక అంశాలలో నైపుణ్యాలు పెంచు కోవడానికి కొన్ని గేమింగ్‌ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని పిల్లలు చూడరు. తల్లిదండ్రులకు అది చూపించేంత సమయం లేదు. అంతే కాదు! పిల్లల మానసిక శక్తి సామర్థ్యాలు పెంచే ఆటలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఆడరు, అలాంటి వాటిని ఈ సమాజం ఎన్నడో మర్చిపోయి కాలగర్భంలో కలిపేశారు. సోషల్‌ మీడియాలో అంతా ఫేక్‌.. డీప్‌ ఫేక్‌.. ఏఐ ఫేక్‌.. ఆఆన్‌లైన్‌ ఫేకులదే పెత్తనం అవడంతో దేన్ని విశ్వసించాలో తెలియడం లేదు. ”నిజాన్ని, జ్ఞానాన్ని కమ్మేసిన ఫేకుల”ను వ్యాపారం చేసుకునే విధానాలతో, ఫోన్లో ఎన్నో ఆన్‌లైన్‌్‌ గేమింగుల ద్వారా భావోద్వేగాలకు గురి చేసే ఫేక్‌ వ్యవహారాలతో రేపటి తరం నష్టపోయినాక ఏడ్చినా లాభలేదు. ”చనిపోయిన మొక్క లకు నీళ్లు పోసినట్లే రేపటి తరం భవిష్యత్తు”.విద్యార్థుల మానసిక భద్రత, భరోసా కోసం తల్లిదండ్రులు, ప్రభుత్వాలు సామాజిక, మానసిక నిపుణుల సూచనలు పాటిస్తూ రేపటి ఆరోగ్యవంతమైన సమాజం కోసం నేటి పిల్లల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌, ఫేక్‌ వ్యవహారాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

– మేకిరి దామోదర్‌, 9573666650

]]>
సనాతన ధర్మం కాదు…సమతా మార్గం కావాలి https://navatelangana.com/we-need-an-egalitarian-path-not-orthodoxy/ Sat, 05 Oct 2024 17:32:10 +0000 https://navatelangana.com/?p=411294 Not orthodoxy...needs a balanced path(పవర్‌ స్టార్‌కు బహిరంగ లేఖ)
అయ్యా…
ఒక సాధారణ కానిస్టేబుల్‌ కొడుకుని, చేగువేరా, భగత్‌సింగ్‌లు ఆదర్శం అన్నావ్‌.
ముఖానికి రంగులు వేసుకుని సినిమాల్లో హీరోగా నటించి లక్షల కోట్లు సొమ్ము ఆర్జించావు.
అది చాలదన్నట్టు ప్రజా సేవచేస్తాను అంటూ రాజకీయ పార్టీ పెట్టి ఊరూరా తిరిగావు.
విప్లవ భావాలు, అభ్యుదయ భావాలు ఉన్నవాడ్ని ,కులం లేదు, మతం లేదు అందరూ సమానమే అంటూ కమ్యూనిస్టులతో నాలుగు అడుగులు వేసావు, ఓడిపోగానే చంద్రబాబును నానా విమర్శలు చేస్తూ బీజేపీ పంచన చేరి మోడీ భజన చేసావు.మళ్ళీ ఎన్నికలు రాగానే అధికార దాహంతో ఉన్న చంద్రబాబుతో కలిసి వెళ్లావు. 21 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారు.నువ్వు ఉప ముఖ్యమంత్రివి అయ్యావు.
అంతా బాగానే ఉంది.
అయ్యా పవన్‌ కళ్యాణ్‌..
నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నావో అర్థం అవుతుందా? ఒక రాజకీయ పార్టీ అధ్యక్ష స్థానంలో.ప్రజలందరూ ఓట్లు వేస్తే 21 మంది ఎమ్మెల్యేలు గెలిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ సన్యాసిలాగా కాషాయ దుస్తులు ధరించి,పూజలు, దీక్షలు, దేవాలయాల మెట్లు శుభ్రం చేయడం, నీ దేవుళ్ళ దర్శనం కోసం వెళ్తూ మీడియా షూటింగ్‌లు, ఫోటో ఎగ్జిబిషన్‌లు ఏమిటి? నువ్వు సాధారణ భక్తుడు లాగా వెళితే ఎవడూ పట్టించుకోడు, ఎక్కడికి వెళ్తే అక్కడ , ఏ మత విశ్వాస మందిరం చర్చి, మసీదుల వద్దకు వెళ్లి వారికి అనుకూలంగా ఇతర విశ్వాసాల వారిపై రెచ్చగొట్టే ఉపన్యాసం చేయడం నీకే చెల్లుబాటు అయిందా?
పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదని అనుకుంటూ ఉంటుందని అంటారు.
ఉప ముఖ్యమంత్రి అవ్వగానే నేనేం చేసినా ఏం మాట్లాడినా ఫర్వాలేదు, అనే గర్వంగా ఫీల్‌ అవుతూ ఉన్నావా?
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ మోహన్‌ తప్పుడు పను లు చేసినట్టు, ప్రజా వ్యతిరేక పాలన చేశారంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు మాత్రం చేస్తున్న పని ఏమిటి?
ఇస్లాం, క్రైస్తవ విశ్వాసులు హిందూ దేవాలయంలోకి వెళ్ళడానికి ఆ దేవుడుపై విశ్వాసం ఉన్నట్టు డిక్లరేషన్‌ ఇవ్వాలా?
ఒక మతాన్ని మత దైవాన్ని ఆరాధించే వాళ్ళు ఇతర మత దైవ దర్శనం కోసం ఎలాగూ వెళ్ళరు.
నీలాంటి రాజకీయ నాయకులు, దొంగలే ఓట్లు, సీట్లు కోసం వెళుతూ మత రాజకీయాలు చేస్తూ ఉంటారు.
మరి నువ్వు నీలాంటి హిందూ ధర్మం పరిరక్షకులు మసీదు చర్చిలకు వెళితే అప్పుడు కూడా ఆ దేవుణ్ణి విశ్వసిస్తానని
డిక్లరేషన్‌ ఏదైనా ఇచ్చారా?ఆయా సమూహాల సభలకు వెళితే లేదా నెత్తి మీద ఇస్లాం పద్ధతిలో ఉండే టోపి పెట్టుకుని ప్రజల నెత్తిన టోపీలు పెడుతూ ఉంటారా?మతం, దేవుడు వ్యక్తిగతం ఆ దేవుణ్ణి నీ ఇంటి పూజా గదిలోనే ఉంచుకోవాలి, నీ కులాన్ని మతాన్ని నీ ఇంటి గడప లోపల ఉంచుకోవాలి. వాటిఅన్నిటినీ దాటుకుని బయటకు వస్తే అందరూ సమానమే. అన్న విషయం తెలుసా మీకు?మీ ఇంట్లో వయసులో ఉన్న భార్య, ఆడపిల్లల్ని 40 రోజులు దీక్ష,మాల వేసి శబరిమల అయ్యప్ప దర్శనంకు తీసుకుని వెళ్లే దమ్ము నీకు ఉందా?
హిందూ, క్రైస్తవ, ఇస్లాం, భౌద్ధ మతాలకు రెస్పెక్ట్‌ ఇవ్వడం ఏమిటి ?
మనిషికి రెస్పెక్ట్‌ ఇవ్వడం నేర్చుకో.
మతం విశ్వాసం మీద ఆధారపడి ఉంటే సైన్స్‌ వాస్తవం మీద ఆధారపడి నిత్య పరిశోధనలు చేస్తూ ఉంటుంది.
ముందు నువ్వు రాజకీయ పార్టీ అధ్యక్షుడువి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కదా!
సనాతన ధర్మాన్ని కాపాడటానికి నువ్వు ఎవడివి, దానికి ప్రత్యేకంగా బాబాలు, స్వాములు, పీఠాధిపతులు ఉన్నారు. లేదా పాస్టర్లు, ముల్లాలు లేదా మత పెద్దలు ఉన్నారు.వాళ్లు చూసుకుంటారు.ప్రజాపాలనలో మత పరమైన జోక్యం ఉండకూడదు. అలాగే మత పరమైన అంశాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు.
రాజ్య పాలకుడువు గా నువ్వు చేయవలసిన పని నువు చెరు. ధర్మో రక్షతి రక్షిత్ణ అని అంటారు కదా .లేదంటే కాషాయ గోచి కట్టుకుని, ఒక గుళ్లో పూజారిగా వెళ్ళు కోట్లు డబ్బులు వస్తాయి. పీఠాధిపతి గా అవతారం ఎత్తు.
నువ్వు చెప్పే పురాణ కథలు, పిట్ట కథలు, రామాయణ,భారత, భగవద్గీత చదువుతూ
జై శ్రీరాం అంటూ ఉండాలా?
సనాతన ధర్మం ప్రకారం.
ప్రతి ఒక్కడు తన భార్యల్ని అనుమానించి అడవికి పంపించి వేయాలా? అగ్నిపరీక్ష పెట్టాలా?
వెంకన్న స్వామి లాగా ఇద్దర్నీ పెళ్లి చేసుకోవాలా? భార్యలు అణిగిమణిగి ఉండాలా, విష్ణుమూర్తి కాళ్లను భార్య లక్ష్మిదేవి ఒత్తుతూ ఉన్నట్టే నేటి ఆడవాళ్లు వంటగదికి పరిమితమవ్వాలా?
బ్రహ్మ అనే దేవుడు ఎలా అయితే తన స్వంత కూతురు సరస్వతి దేవత అందాన్ని చూసి మోహించి భార్యగా చేసుకున్నట్లుగా నేడు ప్రతి తండ్రి తన కుమార్తెలను మోహించి పెళ్లి చేసుకోవాలా? సీత ,సావిత్రి, అనసూయ, అరుంధతి లాగా అణిగిమణిగి ఉండాలా?
విద్య లేకుండా ఓటు హక్కు లేకుండా ఇంటికే పరిమితం చేయాలా?
భర్తలు మరణిస్తే భార్యల్ని కూడా చితిమీద పెట్టి కాల్చిసట్టే సతీసహగమనం పాటించాలా?
లేదంటే అల్లా చెప్పాడని మా ఆడవారికి నల్ల ముసుగులు వేసి పరాయి మగాడు కన్ను పడకుండా ఉంచాలా?
పెళ్ళానికి తలాక్‌ చెప్పి మరో పెళ్లికి సిద్ధం కావాలా?
ఇదేకదా సనాతన ధర్మం అంటే?
అలాగే సమాజంలో నాటుకుని ఉన్న మూడ నమ్మకాల్ని ప్రశ్నిస్తూ, రచనలు చేసే మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, నాస్తికులు అయిన నరేంద్ర దబోల్కర్‌, గోవిందాపన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్‌ లను దారుణంగా హత్యలు చేసినపుడు మీరు ఏమైన ప్రశ్నించారా, వారి కుటుంబాలకు అండగా నిలిచారా?సినీ నటులు ప్రకాష్‌ రాజ్‌ గారి మేనత్త గౌరీ లంకేశ్‌ హత్య జరిగితే సాటి సినీ రంగ మిత్రునిగా మీరు వెళ్లి అండగా నిలిచారా?పేదల కోసం పాటుపడుతూ సాహిత్యం వ్రాసే మేధావులు ప్రొఫెసర్‌ సాయి బాబా , వరవరరావు, స్టాన్‌ స్వామి, లేదా జర్నలిస్టులపై అక్రమ కేసులు జైళ్లు, నిర్బంధాలు విధించినపుడు ఎప్పుడైనా మీ గొంతెత్తారా?
సనాతన ధర్మం ఒక వైరస్‌ లాంటిది అని ఒక సాహిత్య పుస్తకావిష్కరణ సభలో తమిళనాడు రాష్ట్ర మంత్రి , నీలాంటి ఒక సినిమా హీరో అయిన ఉదయనిధి మాట్లాడిన మాటల్ని వక్రీకరించి అతన్ని తల నరికిన వారికి వంద కోట్లు డబ్బులిస్తాం అని ఒక కాషాయ సన్యాసి అన్నటు వంటి వ్యాఖ్యలు చేస్తే మీ స్పందన ఏమిటో చెప్పారా?
కోవిడ్‌ రోజుల్లో రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఏడాదికి పైగా ఉద్యమం చేసినపుడు ఒక్కసారైనా వారికి మద్దతుగా నిలిచారా?ప్రభుత్వరంగ సంస్థలు కార్పొరేట్‌ పరం చేస్తున్నపుడు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే మీ వంతు బాధ్యతగా మీరేం చేశారు?
మహిళపై అత్యాచారాలు హత్యలు జరిగితే ఒక్కసారైనా మీ గొంతు విప్పారా?
కృష్ణా గోదావరి బేసిన్‌ లో ఉన్న ఆయిల్‌ నిక్షేపాలు అంబానీ, అదానీ కి దారాదత్తం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నారా?
లేదంటే నిత్యావసర సరుకులు, ఉల్లిపాయలు ధరలు నియంత్రణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏమిటి?
ఇవన్నీ కాకుండా దేవుడు లడ్డూలో కల్తీ జరిగింది అని నానా యాగి చేశారు.
ప్రాయశ్చిత్తం దీక్ష అంటూ ప్రజల్ని, సమాజాన్ని తప్పుతోవ పట్టిస్తారా?
ఇవన్నీ నాకెందుకు నా మతం, నా కులం నా దేవుడు అంటూ ప్రజల్ని రెచ్చగొడుతు ఉంటారా?
మీరు నటించే సినిమాలు కేవలం నీ మతం వాళ్లే, నీ కులం వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టి మరీ తల నొప్పి తెచ్చుకుంటూ ఉన్నారా?
మీరు కేవలం మీ కులం మీ మతం వాళ్ల ఓట్లు వేస్తేనే గెలిపించారా?
ఇంత పెద్ద విశ్వంలో ఒక నీటిబొట్టు లాంటి వాళ్లం. ఇంతకూ
మీ దేవుడు మీ సనాతన ధర్మం, మిమ్మల్ని సృష్టించిన దేవుడా లేక మీరు సృష్టించిన దేవుడా?
అందుకేనేమో ‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలచి ఉండును’ అని గురజాడ వారు ఎప్పుడోే అన్నారు.
మోతుకూరి అరుణకుమార్‌
9948024789

]]>
‘స్వచ్ఛభారత్‌’- సఫాయి కార్మికులు https://navatelangana.com/swachh-bharat-cleaning-workers/ Sat, 05 Oct 2024 17:29:02 +0000 https://navatelangana.com/?p=411278 'Swachh Bharat' - cleaning workers‘దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రం ఎంత ప్రధానమో, ప్రజా శ్రేయస్సుకు శుభ్రతతో కూడిన పారిశుధ్యం అంతే ప్రాణప్రదం’ అని వందేండ్ల క్రితమే గాంధీ పిలుపునిచ్చారు. అంతేకాదు ఇంట్లోని మరుగుదొడ్డి, వంటగది శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధవహించాలని నొక్కిచెప్పారు. మన దేశ ప్రజానీకం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి పారిశుధ్య (సఫాయి )కార్మికులు కోడికూత పొద్దున్నే నిద్ర లేచి చెత్త చెదారం, అపరిశుభ్ర పరిసరాలను, దుర్గంధమయమైన కాలనీలను శుభ్రపరిస్తేనే కదా!. ఉదయానికల్లా అందమైన రోడ్లులు, వాడలు కూడళ్లు పరిశుభ్రంగా కలకలలాడుతాయి. అలాంటి వారి సేవలు అనన్య సామాన్యం. పాలకులు మారినా వారి జీవితాల్లో మార్పు రావడం లేదు. ప్రజారోగ్యం బాగుండాలంటే ఇళ్లూ వాకిళ్లతో పాటు పరిసరాలు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు పరిశుభ్రత పైనే ఆధారపడి ఉంటుంది. స్వతంత్ర భారతంలో 1981నాటికి ఒక్కశాతం గ్రామీణ కుటుంబాలకే పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేవి.1986లో గ్రామీణ పారిశుధ్య కార్యక్రమం ప్రారంభించారు.1999లో సంపూర్ణ పారిశుధ్య ఉద్యమంగా మారింది. 2012 నాటికి అది కాస్త పారిశుధ్య వసతులు ఉన్న గ్రామీణ కుటుంబాల సంఖ్య 32.7శాతానికి చేరింది. ఈ నత్తనడక ప్రగతి వేగవంతం చేయడానికి 2014 అక్టోబర్‌ 2న, ”స్వచ్ఛ భారత్‌”కు శ్రీకారం చుట్టారు. కానీ అది ఆశించిన ఫలితాలు సాధించలేదు. కారణం, సరిపోని నిధులు, కొరవడిన పర్యవేక్షణ, చిత్తశుద్ధి లోపం. పారిశుధ్య పనులు, మరుగు దొడ్లు నిర్మాణాల వాడకంలో ప్రజల్లో కొంతమేరకు చైతన్యం వచ్చినప్పటికీ, దేశంలో ఇంకా అనేక ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన సమస్యలు తీరనే లేదు. ”స్వచ్ఛభారత్‌” కింద నిర్మాణాల నాణ్యతపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ మధ్యనే అసంతృప్తిని వ్యక్తపరిచింది. గ్రామీణ ప్రాంతాలలో టాయిలెట్ల వాడకం తగ్గుతుందని ప్రపంచ బ్యాంక్‌ అధ్యయనం కమిటీ నిరుడు పేర్కొంది.
దీన్నిబట్టి చూస్తే స్వచ్ఛభారత్‌ లక్ష్యాలు ఇంకా సంపూర్ణంగా సాధించలేదనేది వాస్తవం. కానీ మన ప్రధాని ”అక్టోబర్‌2 గాంధీ జయంతి” రోజు స్వచ్ఛభారత్‌ కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉద్యమం విజయవంతమైందని పాఠశాలలో పిల్లలతోపాటు చీపురు పట్టి ఊడుస్తూ ప్రచారం చేశారు.కానీ పరిశుభ్రతలో కీలక భూమిక పోషించిన సఫాయి కార్మికుల మురికి జీవితాల్లో వెలుగులు నింపలేదనేది వాస్తవం. నగరాల్లో , పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు చెత్తను డంపింగ్‌ సైట్లకు చేరుస్తున్నారు. ఇలా గుట్టలు గుట్టలుగా పోగయ్యే చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేయాలన్న ఆశ యాలు నెరవేరడం లేదు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా సుమారు పదిహేను వేల ఎకరాల్లో విస్తరించిన 2411డంపింగ్‌ సైట్లను శుభ్రం చేయాలి. దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో చెత్త సేకరణ, విభజన,జరిగినప్పటికీ పున:శుద్ధి చేయించడంలో పాలకుల చిత్తశుద్ధి లోపిస్తుంది.మరోవైపు పారిశుధ్య కార్మికుల మురికి బతుకుల్లో ఆర్థిక పరిస్థితి మారడం లేదు. తరతరాలుగా కొన్ని అట్టడుగు, అణగారిన సామాజిక వర్గాల వారే ఈ పనులను చేస్తున్నారు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ”స్వచ్ఛభారత్‌” కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకొని వేకువజామునే లేచి అపరిశుభ్ర పరిసరాలలోని చెత్తను, దుర్గంధాన్ని శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికుల మురికి బతుకల్లో వెలుగులు రాలేదు. గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మహానగరాల్లో పారిశుధ్య మురికి పనులు చేస్తున్న కార్మికులు ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ వర్గాల వారే 92 శాతానికి పైగా ఉన్నారు. మురుగు నీరు కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేసే సఫాయి కార్మికులు అధిక భాగం వారే ఉన్నారు. భారత్‌లోని నగరాలు, పట్టణాల నుంచి ప్రభుత్వ సేకరించిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది.
దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ) నుంచి 3వేలకు పైగా పట్టణ, నగరపాలక సంస్థల్లో ఉన్న 38వేల మంది కార్మికుల్లో 91.9 శాతంమంది ఎస్సీ , ఎస్టీ, ఓబీసీల నుంచే ఉన్నారు. వీరిలో ఎస్సీ వర్గం నుంచి అధికంగా 68.9శాతంమంది ఉండగా, 14.7 శాతం మంది ఓబీసీలు, 8.3 శాతం మంది ఎస్టీలు ఉన్నారు. 8శాతం మంది జనరల్‌ కేటగిరి నుంచి ఉన్నారు.దేశవ్యాప్తంగా 2019 నుంచి 2023 మధ్య ప్రమాదకర పరిస్థితుల్లో మురుగు కాల్వలను, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేస్తూ 377 మంది చనిపోయారని పార్లమెంటులో ప్రభుత్వం సమాచారాన్ని వెల్లడించింది. తరతరాలుగా పారిశుధ్య కార్మికుల మురికి బతుకులను ప్రజా పాలనలో కూడా మార్చలేకపోతున్నారు. కానీ ”స్వచ్ఛ భారత్‌” పేరుతో ప్రచారం పొందడం కోసం సఫాయి కార్మికుల కాళ్లు కడిగి ఆ నీళ్లని తలపై చల్లు కోవడం పాలకులు మానవీయతకు నిదర్శనం. వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారిశుధ్య కార్మికుల చేసే పనుల్లో ఎన్నో నూతన యంత్రాలను ప్రవేశింపజేసి వారికి ప్రమాదాల బారిన పడకుండా చూడాలి. పాలకులు వారి వేతనాలు పెంచి ఆ వృత్తి పట్ల గౌరవం, భరోసా, భద్రత కల్పించి వారి బతుకుల్లో వెలుగు నింపాలి. సఫాయి కార్మికులు యాచకులు కాదు.వారి వెల కట్టలేని శ్రమశక్తిని గుర్తించి న్యాయం చేయాలి.
మేకిరి దామోదర్‌
9573666650

]]>
ఏచూరి జీవితం…యువతరానికి దారిదీపం! https://navatelangana.com/yechurys-life-is-a-beacon-for-youth/ Sat, 28 Sep 2024 16:58:24 +0000 https://navatelangana.com/?p=406311 Yechury's life...a beacon for the younger generation!కమ్యునిస్టు యోధుడు,విద్యావేత్త, మహోన్నత వ్యక్తిత్వం మూర్తీభవించిన బడుగుల పక్షపాతిగా 72 ఏండ్ల సుదీర్ఘ జీవితాన్ని సామాజిక న్యాయస్థాపనకు అంకితం చేసిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం ఆ పార్టీకే కాదు, వామపక్ష ఉద్యమానికి, దేశానికి తీరనిలోటు. ఎందుకంటే ఏచూరి జీవితాంతం పేద ప్రజల కోసమే పనిచేసిన నాయకుడు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఏచూరి సీతారామ్‌ 12 ఆగష్టు 1952న ప్రభుత్వ అధికారి ఏచూరి కల్పకం – ఇంజనీర్‌ సర్వేశ్వర సోమయాజీ దంపతులకు మద్రాసులోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబారు దేశ్‌ముఖ్‌ శిష్యురాలిగా తల్లి కల్పకం నేర్పిన సామాజిక న్యాయ బాధ్యతలను అర్థం చేసుకున్నారు. ఆమె సోదరుడు పూర్వ ఐఏఎస్‌ అధికారి, చీఫ్‌ సెక్రటరీ మోహన కందా మేనల్లుడుగా సీతారామ్‌ రాజకీయాల పట్ల చిన్నతనం నుంచే ఆసక్తి పెంచుకున్నారు.హైదరాబాద్‌ ‘ఆల్‌ సేయింట్స్‌ స్కూల్‌’లో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసిన ఏచూరి ఆ తర్వాత ‘నిజామ్‌ కాలేజీ’లో తదనంతర విద్యాభ్యాసం ఢిల్లీలో కొనసాగింది. 1970లో ఢిిల్లీ ‘ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌ స్కూల్‌’లో సిబిఎస్సీ చదివి పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి, ఢిల్లీ యూనివర్సిటీ ‘సేయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ’లో బి ఏ ఆనర్స్‌ (ఆర్థిక శాస్త్రం), ‘జెఎన్‌యూ’లో ఎంఎ ఎకనామిక్స్‌ ప్రథమ శ్రేణిలో పట్టాలు పొందారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిలో నిరసనల్లో పాల్గొని అరెస్టయ్యారు. హిందూస్తానీ టైమ్స్‌ పత్రికలో సంపాదకీయ వ్యాసాలు రాయడంలో మన సీతారామ్‌ మేధో సంపత్తిలో దిట్ట. కుమారుడు అశీష్‌ 34వయేటా 2021లో కరోనాతో మృతిచెందాడు.ఆ బాధను తొందరలోనే దిగమింగుకుని ప్రజాసేవలోనే నిరంతరం నిమగమయ్యాడు. కుమార్తె అఖిల హిస్టరీ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.
యాభైఏండ్ల క్రితం జెఎన్‌యూలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన సీతారాం ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తదనంతరం జాతీయ అధ్యక్షుడిగా తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. 1970ల్లో జెఎన్‌యూ పర్యటనను వ్యతిరేకించి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి యూనివర్సిటీ విద్యార్థుల కోరికలు వినిపిస్తూ రాజీనామా చేయాలని ముందుండి ధైర్యంగా పోరాడారు. జెఎన్‌యూ ఎన్నికల్లో మూడుసార్లు గెలిచి అధ్యక్షుడిగా నాయకత్వ పటిమ చూపారు. 1975లో సీపీఐ(ఎం)లో చురుకైన కార్యకర్తగా చేరి 1984లో పార్టీ సెంట్రల్‌ కమిటీలో సభ్యుడిగా ఎదిగారు. 1985,1988లో సెంట్రల్‌ సెక్రటేరియట్‌, 1992లో పొలిట్‌ట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు.1996లో యూపిఏ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఆ కాలంలోనే అణుఒప్పందానికి వ్యతిరేకంగా కూటమి నుంచి వైదొలిగారు. మతోన్మాద పార్టీ అయిన బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా లౌకికపార్టీలను ఐక్యం చేసి ‘ఇండియా’ కూటమి నిర్మాణంలో ప్రధాన భూమిక నిర్వహించారు. పార్టీలన్నింటినీ ఐక్యం చేసి ఒక్కతాటికి తీసుకు రావడానికి కృషి చేశారు. ఆ ఫలితం ఇటీవల ఎన్నికల్లో స్పష్టమైంది. వెరసి బీజేపీ మెజార్టీ కోల్పోవడమే.
19 ఏప్రిల్‌ 2015 నుంచి నేటి వరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా పార్టీకి, ప్రజలకు అమూల్య సేవలందించారు. 2015-17 వరకు పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2017లో రాజ్యసభలో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు, అత్యంత ప్రతిభ కలిగిన రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేయగల ఆకర్షణీయ వ్యక్తిత్వం స్వంతం చేసుకున్న ఏచూరి నిజాయితీకి ప్రతిరూపంగా నిలబడ్డారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్న చురుకైన వ్యక్తిగా దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. తన మరణానంతరం పార్థివ దేహాన్ని మెడికల్‌ కాలేజీకి (ఏయిమ్స్‌- ఢిల్లీ) అందించాల్సిందిగా కోరుకున్న ఏచూరి ప్రదర్శించిన విలువలు, నడిచిన సన్మార్గం దేశానికే మార్గదర్శకం. కామ్రేడ్స్‌ సుర్జిత్‌ సింగ్‌, జ్యోతి బసు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొన్న ఏచూరి జీవిత చరమాంకం మచ్చలేని రాజకీయ జీవితం గడిపారు. రాజకీయ పరిపక్వత, నైతిక ప్రవర్తన, నీతి నియమాలు, ఆయన అర్థ శతాబ్దపు జీవన ప్రస్థానం నేటి యువభారతానికి దారిదీపం.
డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037

]]>
‘దామగుండం’ రక్షణకు.. మరో ‘చిప్కో’ ఉద్యమం అవసరమే! https://navatelangana.com/another-chipko-movement-is-needed-to-protect-damagundam/ Sat, 28 Sep 2024 16:57:09 +0000 https://navatelangana.com/?p=406299 To protect 'Damagundam'.. Another 'Chipko' movement is needed!70వ దశకంలో జరిగిన చిప్కో ఉద్యమం మొదలుకొని ప్రస్తుతం ముందుకొచ్చిన ”దామగుండం” రక్షణో ఉద్యమం వరకు ఎంతో మంది పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రమాదాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. 300 చెట్లను కాపాడుకునేందుకు జరిగిన ”చిప్కో” ఈ యాభై ఏండ్లలో దేశంలో అనేక కీలకమైన సహజ వనరులు, పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. చిప్కో ఉద్యమం ”గౌరాదేవి” అనే మహిళా నేతృత్వంతో ప్రారంభమై ”సుందర్‌ లాల్‌ బహుగుణ” నాయకత్వంలో విస్తృతపరచబడింది. అదే తరహాలో తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా ”దామగుండం” అటవీ ప్రాతంలో సుమారు మూడువేల ఎకరాల్లోని 12లక్షల పై చిలుకు చెట్లను రక్షించేందుకు ”జర్నలిస్టు తులసీచందు” ఒకడుగు ముందుకేసింది. స్పందించే సమూహాన్ని తట్టిలేపింది. ”జర్నలిస్టు తులసిచందు” చొరవతో ఇప్పుడు ”దామగుండం” రక్షణ కోసం చిప్కో తరహా ఉద్యమం అవసరమనే నినాదం ముందుకాచ్చింది. ఈ పిలుపులో సహజ వనరుల పరిరక్షణ కోసం తపించే శక్తులు వ్యక్తులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ హితులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, కవులు, రచయితలు ప్రతిఒక్కరూ ”దామగుండం” రక్షణ మూమెంట్‌లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి పేరుతో మానవ మనుగడకు ముప్పు తెచ్చేలా దామగుండం అడవిని విధ్వంసం చేయడం మనిషి ఆయుష్షుతో, ప్రకృతితో చెలగాటమాడటం కాక ఏమవుతుందని ప్రశ్నించాలి.
జీవ మనుగడకు ఈ భూమ్మీద అనుకూలమైన పర్యావరణం ఉండటం తప్పనిసరి. కానీ అభివృద్ధి పేరుతో పాలకుల కనుసన్నల్లో జరుగుతున్న విధ్వంసం వల్ల పర్యావరణం విపరీతమైన ఇబ్బందులకు గురవుతోంది. ముఖ్యంగా అడవులను విచక్షణారహితంగా నరికివేయడం, సహజ వనరుల విధ్వంసానికి పాల్పడటం ఫలితంగా అనేక పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ప్రకృతిని చూసే విధానం యుగయుగానికి మారవచ్చు, కానీ ప్రకృతి మారదంటారు ప్రసిద్ధ ప్రకృతి తత్వవేత్త మసనోబు. నిజంగా ప్రకృతి మారడం లేదా అనే ప్రశ్న రావడం సహజం. ప్రకృతి స్వభావంలో మార్పులేదు. కానీ అభివృద్ధి పేరిట ప్రకృతిని కొల్లగొట్టే విధానాలతో దాని సహజ గమనాన్ని అడ్డుకునే ప్రయత్నాలు శతాబ్దాలుగా జరుగుతూనే వున్నాయనేది కాదనలేని సత్యం! ఈ నేపథ్యంలోనే పర్యావరణ సమస్య తలెత్తుతోంది. ముందే చెప్పినట్లుగా మానవాళి ప్రశాంతంగా జీవించాలంటే ప్రకృతి, పర్యావరణం సజావుగా ఉండాలి. దీనికి విరుద్ధంగా సాగించే ప్రయాణం మానవ అస్తిత్వానికి పెనుసవాలే. సాంకేతికత, వృద్ధి పేరిట ప్రకృతి గుండెల్లో చిచ్చుపెట్టే ధోరణి అవాంఛనీయం. ఏమాత్రం క్షేమం కానిది. ప్రకృతి – పర్యావరణం – అభివృద్ధి మధ్య అనుసంధానాన్ని సాధించడానికి బదులుగా ఒకదానికొకటి పోటీగా నిలబెట్టడంలో దుర్మార్గంగా వ్యవహరించే ధోరణి పెరిగింది. సముద్రాల, నదుల, పర్వతాల, అడవుల ఉనికికి ముప్పుగా పరిణమించే విధానాలు అమలవుతున్నాయి.
ఫలితంగా పర్యవసానాలు రానున్న యాభయేండ్లలో ఊహించని విపత్కర పరిస్థితులు ముందుకొచ్చే ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలు ఇప్పటికే తెలుపుతున్నాయని గమనించాలి. ఇలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో అభివృద్ధి పేరుతో వేల ఎకరాల్లోని ”దామగుండం” అడవిలో సుమారు 12లక్షల పై చిలుకు చెట్లను తొలగించి ”రాడార్‌ ప్లాంట్‌” ఏర్పాటు చేయాలనే ఆలోచన సరైనది కాదు. అడవుల్ని అంటి పెట్టుకుని శతాబ్దాలుగా జీవిస్తున్న జనాన్ని వారి జీవన మనుగడను ప్రశ్నార్థకం చేయడమే అవుతుంది. గత రెండు మూడు దశాబ్దాలలో చోటుచేసుకున్న విపత్తులు నగరాల ఉనికినే చెల్లాచెదరు చేశాయనే వాస్తవాన్ని కూడా మరువొద్దు. ప్రకృతిని జయించడం పేరిట విధ్వంసానికి పాల్పడటం తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కోవడం అవుతుందని గుర్తించాలి. ”దామగుండం” అడవిని ధ్వంసం చేస్తే హైదరాబాద్‌ నగరానికి ఎంతటి ముప్పు వాటిల్లనుందో ఇప్పటికే అనేక విశ్లేషణలు తేటతెల్లం చేశాయి. అందుకోసమే అడవుల సంరక్షణ అవసరాన్ని, ప్రకృతి – పర్యావరణాన్ని కాపాడుకునే అవసరాన్ని మనిషి గుర్తించాలి. ముఖ్యంగా పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అడవుల నరికివేత, పర్యావరణ సమతుల్యత దెబ్బతీనే విధంగా చేపట్టే చర్యలు మానుకోవాలి.
చివరిగా…”చిప్కో” సత్యాగ్రహ ఉద్యమం ఆనాడే కాదు, ఇవాళ కూడా మనకు మన ప్రపంచానికి ఎంతో స్ఫూర్తిదాయకం.ఆ స్పూర్తి ప్రస్తుతం ”దామగుండం” రక్షణకోసం జరుగుతున్న ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, ప్రకృతితో మమేకమై జీవించడం మొదలైన ఎన్నో పాఠాలు మనకు చిప్కో ఉద్యమంతో పాటు ఆ స్పూర్తితో జరిగిన అనేక ఉద్యమాలు నేర్పిస్తు న్నాయి. శాంతియుతంగా గాంధేయ మార్గంలో చెట్లను కౌగిలించుకొని ఒక మహిళా నాయకత్వంతో చిప్కో ఉద్యమం మొదలైన విధంగా యాభై ఏండ్ల తరువాత అనివార్యంగా తెలంగాణలో ముందుకొచ్చిన దామగుండం అడవి రక్షణకోసం మహిళా అయినటువంటి ”జర్నలిస్టు తులసిచందు” వాయిస్‌తో ఉద్యమం మొదలైంది. ఈ ”సేవ్‌ దామగుండం” ఉద్యమం కూడా అనేక అనుభవాలు నేర్పుతూ చరిత్రలో నిలిచిపోక తప్పదు. ”చిప్కో” తరహాలో జరిగే శాంతియుత సత్యాగ్రహ ఉద్యమాన్ని బలపరుద్దాం..బాసటగా నిలుద్దాం..భాగస్వామ్యం అవుదాం…

]]>