Vedika Archives - https://navatelangana.com/category/vedika/ Sat, 04 May 2024 16:30:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Vedika Archives - https://navatelangana.com/category/vedika/ 32 32 మంచినీరుకు ఇక్కట్లు.. మద్యపానానికి చప్పట్లు https://navatelangana.com/applause-is-like-drinking-water/ Sat, 04 May 2024 16:30:17 +0000 https://navatelangana.com/?p=283575 మంచినీరుకు ఇక్కట్లు.. మద్యపానానికి చప్పట్లుకేంద్రానికి గత నెల ఏప్రిల్‌లో జీఎస్టీ 2 లక్షల 10వేల కోట్ల రూపాయలు రికార్డు స్థాయిలో వచ్చినట్టు సమాచారం. దీనిలో ప్రజల ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఛిద్రం చేస్తున్న మద్యపానంపై వచ్చిన సొమ్ములెంత…!?ఏయే ఇటువంటి సందర్భంలో కొన్ని విషయాలు పరిశీలన చేయుట సబుబుగా ఉంటుంది కదా. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి, అనేక పార్టీలు సుమారు 78 సంవత్సరాల పాటు పాలించినా దేశంలో అందరికీ మంచినీరు అందించటంలో విఫలం చెందాయి. కానీ దేశంలో అన్ని ప్రాంతాలకు మాత్రం మద్యపానం అందించటంలో సఫలం అయ్యాయి. దీనికి తోడు ధూమపానం, వివిధ రూపాల్లో మత్తు పదార్థాలు, పానీయాలు కూడా అన్ని చోట్లా లభ్యం అవుతున్నాయి. మరి సర్కారు వారు చేసిన చట్టాలు ఎంత బలహీనంగా అములు అవుతున్నాయో… అందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణం అమలులో చిత్తశుద్ధి లేదు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలే అని గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యపానంపై వచ్చే రాబడే. ప్రభుత్వాలే అధికారంగా మద్యపాన వ్యాపారం ప్రోత్సాహం ఇస్తున్నాయి అని చెప్పవచ్చు..పేద ,బడుగు బలహీన వర్గాల ప్రజలు, యువత బతుకులు దుర్భరంగా మారడానికి కారణం మద్యపానమే… దీనికి ప్రధాన కారణం దాదాపు ప్రతీ గ్రామంలో బెల్ట్‌ షాపులు ద్వారా అక్రమ మద్యపాన వ్యాపారం జరుగుతోంది. దీనికి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇక పట్టణ, నగర ప్రాంతాలలో కొన్ని మేజర్‌ గ్రామాల్లో ప్రభుత్వాలే మద్యపాన వ్యాపారం, లైసెన్స్‌, టెండర్లు పిలిచి మరీ ప్రోత్సాహిస్తూ ఆదాయాన్ని సమూపార్జన చేస్తున్నాయి. కొత్త, కొత్త బ్రాండ్‌లతో స్వతహాగా తయారు చేసి మరీ అమ్మటం మరో గమ్మత్తైన విషయం… పైకి మాత్రం మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుపుతూ, అదే సమయంలో అందరికీ అందుబాటులోకి తేవడం వెనుక మర్మం ఇకనైనా అందరూ గ్రహించాలి..
అదే ప్రతీ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలంటే ప్రభుత్వాలు కప్పదాటు ధోరణి అవలంబించుట జరుగుతున్నది. నదులకు ఆనకట్టలు కట్టాలన్నా, ఇసుక మేటలు తొలగించాలన్నా, చెరువులు పూడికలు తీయించాలన్నా ఏదో సాకు చెప్పుతూ ప్రజలకు, పశువులకు, వ్యవసాయానికి నీళ్లు అందించకుండా కాలం గడుపుతున్నారు. అదే మద్యం సరఫరాకు ఆటంకం లేకుండా చేయుట గమనార్హం. ఇక ప్రస్తుతం ఎండాకాలంలో మంచినీళ్లు దొరక్కపోవచ్చు. కానీ మద్యం మాత్రం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వాలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందో ఇక ఈ ఎండాకాలం, ఎన్నికల సీజన్‌ ప్రభుత్వాలకు ఎంత ఆదాయమో, ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేం.ఇది అంతా సామాన్య ప్రజల నుంచి దోపిడీ చేయడమే కదా…!? అనేక కుటుంబాలు ఛిద్రం కావడానికి ప్రభుత్వాలే కారణం కదా!
ముఖ్యంగా ఏ ప్రజలకైతే ఉచితాలు పేరుతో, సంక్షేమ పథకాలు పేరుతో వివిధ పథకాలు అందిస్తున్నారో, అదే ప్రజల కష్టార్జితాన్ని ఈ ప్రభుత్వాలు మద్యపానం ధూమపానం రూపంలో తిరిగి దోచుకోవడం ఏ రకమైన సంక్షేమ రాజ్యమో ఈ పాలకులే తెలపాలి. అదే సమ యంలో ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వాలు తమ బలహీనతను ఆసరాగా తీసుకుని కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు అని గ్రహించాలి. వాస్తవాలు తెలుసుకోవాలి… కనీసం ఈ ఎన్నికలు సమయంలోనైనా వాస్తవాలు గ్రహించి, తమ భవిష్యత్తును ఓటును సద్వినియోగం చేసుకోవడం ద్వారా సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేయాలి.. తాము ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు ప్రోత్సాహంతో అందరికీ అందుబాటులోకి తెస్తున్న మద్యపానమే అని గ్రహించాలి.
ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన కూడు, గూడు, గుడ్డ, మంచినీరు, విద్య వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి తప్పా, అందరికీ అందుబాటులో మద్యపానం, ధూమపానం మత్తు పదార్థాల కాదని ప్రస్తుత ప్రభుత్వాలకు తమ ఓటు ద్వారా ప్రజలు తెలియపరచాలి. ఏ రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజల కష్టసుఖాల్లో, మంచిచెడ్డల్లో తమ వెంట ఉంటున్నారో అటువంటి ప్రజాసంఘాల నాయకులకు అండగా నిలవాలి. ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం చేస్తున్న ప్రజా పార్టీలకు అధికారం అందించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే వారికి, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడే ప్రజాస్వామ్య సోషలిస్టు పార్టీలకు నాయకులకు వత్తాసు పలకాలి. కనీసం ప్రజలకు మంచినీరు అందించే వారికి, ఉపాధి అవకాశాలు కల్పించే వారికి అండదండలు అందించుట సమంజసమని అందరూ ఆలోచన చేయాలి. ముఖ్యంగా చదువుకున్నవారు ఆలోచన చేయాలి. పదిమందికి అవగాహన కల్పించాలి. ఎన్నికల వేళ మంచి ప్రజాతీర్పు ఓటు ద్వారా అందించాలి. అప్పుడు మాత్రమే పేద, మధ్య తరగతి ప్రజల భవిష్యత్తు కొంతైనా మెరుగుపడే అవకాశముంది.
రావుశ్రీ

]]>
ఆకాశాన్నంటుతున్న మామిడి ధరలు https://navatelangana.com/skyrocketing-mango-prices/ Sat, 04 May 2024 16:29:02 +0000 https://navatelangana.com/?p=283574 ఆకాశాన్నంటుతున్న మామిడి ధరలుఅది తెలంగాణ అయినా ఆంధ్రాలో అయినా రైతు గోస ఒక్కటే. అకాల వర్షాలకు పిందెలు, కాయలు రాలిపోయి చాలా చోట్ల ఇరవై కిలోల బాక్స్‌ మార్కెట్‌ ధర రూ.రెండు వేలు మార్కెట్‌ ధర పలుకుతోంది. సహజంగా ఇంట్లో మాగడానికి ఎక్కువ సమయం పడుతుంది, అలాగే ఎక్కువ కాయలు కుళ్లిపోతున్నాయి. సాధారణంగా మామిడి, అరటి, బొప్పాయి పండ్లను పూర్తిగా పండకుండానే చెట్ల నుండి కోసి, తర్వాత వాటిని మగ్గ బెడతారు. సహజసిద్ధంగా పండటానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా పండ్లను మగ్గ పెట్టడానికి ఎథ్రెల్‌ స్ప్రే చేయడం గానీ, వాటిని ఎథ్రెల్‌ ద్రవంలో ముంచడం గానీ చేస్తారు. అయితే అది శ్రమతో కూడిన పని. అదీకాక బయట అమ్మే ఎథ్రెల్‌లో కల్తీ రసాయనాలు ఉంటే సమస్యలు వస్తాయి.
పండ్ల తోటల్లో మామిడి పంట చాలా ప్రముఖమైనది. అందుకే దీన్ని పండ్లలో రారాజు అని పిలుస్తారు. మన భారతదేశంలో చాలా రకాల మామిడి వంగడాలు / రకాలు వివిధ ప్రాంతాలలో సాగవుతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ పంటను సాగుచేస్తున్నారు. ప్రపంచంలోనే మామిడిని పండించడంలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో సగం వరకు మామిడి ఉత్పత్తి మన భారత దేశంలో జరుగుతుంది. మామిడి పండులో అధిక పోషకాలు, విటమిన్‌-ఎ, సి, అలాగే మంచి రుచి ఉండడం వలన, చాలా మంది ప్రజలు ఈ పండును ఇష్టపడతారు. అలాగే మామిడిలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మామిడి పంటను చాలా మంది రైతులు ముఖ్యమైన ఉద్యాన వాణిజ్య వంటగా సాగుచేస్తున్నారు. మామిడిని మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్‌, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు, నల్గొండ జిల్లాల్లో సాగుచేస్తున్నారు. మామిడిని పండించడానికి అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్టు అభివృద్ధి చెంది చాలా కాలం ఫలాన్నిస్తాయి.
ఏడాది ఒకసారి వచ్చే మధురమైన పంట మామిడి పంట. వేసవిలో మామిడి పచ్చడి, ఊరగాయలు, మాగాయ, మామిడి పులిహోర మామిడి పండ్లు పండ్ల రసాలు తినడానికి ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. ఈ ఏడాది కాపు సంతృప్తికరంగా లేదు, డిసెంబర్‌ జనవరి నెలల నుండి విపరీతమైన ఎండలు ఉండడంతో పూత నిలవలేదు. కాపు పూర్తిగా పలుచగా ఉంది. కొన్ని చోట్ల కాపు లేదు. గత నెల రోజులుగా హోల్‌ సేల్‌ మార్కెట్లో ధర రూ.900 నుండి 1800 వరకు బాక్స్‌కు ఉండటంతో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. దళారులు నెలకిందట తక్కువ ధరకు చెట్లు కొని ఎక్కువ ధరకు మార్కెటు కు తరలిస్తున్నారు. వర్షాలు పడకపోవడంతో మామిడి పండు రుచి ఉండటం లేదు. మార్కెటుకు వచ్చిన మామిడి కృత్రిమ పద్ధతిలో మాగ పెడుతున్నారు. కార్బైడ్‌, స్ప్రే చేయడం, అసిటిలిన్‌ ద్రావణంలో అద్దడంతో పండు మాధుర్యం కోల్పోయింది. కొన్ని చోట్ల పంట దెబ్బతీసింది, కోయకుండా చెట్టుపైన ఉన్న కాయలకు ఉజి ఈగ బెడద ఎక్కువగా ఉంది. నిండా కాపు ఉన్న చెట్టు కాయలు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు వ్యాపారస్తులు పెడుతున్నారు. మూడు వందల చెట్లకు రెండు లక్షలు మించడం లేదు. సంవత్సర కాలం కంటికి రెప్పలా చూసుకున్న కాపలాదారుడు జీతానికి సరిపోయేటట్లు ఉంది. రైతులకు పెట్టుబడి లేక చెట్లు తీసివేసే ప్రమాదం ఉంది.
గత దశాబ్ద కాలంగా కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్స్‌, ధాన్యం నిలువ చేసుకోవడానికి వేర్‌హౌస్‌లు లేక రైతులు తీవ్ర ఇబ్బందికి గురవు తున్నారు. ప్రతి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు కానీ ఎక్కడా మార్కెట్‌ సౌకర్యం, సరకు నిల్వ సౌకర్యం, గిట్టుబాటు ధర, రవాణా సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. వేరుశెనగ వేసుకుంటే గిట్టుబాటు లేదని పత్తికి మారితే దానికీ గిట్టుబాటు లేదని, టమోటా, మిర్చీ ఫల సంప్రదాయానికి మారినా నష్టాలు మిన్నంటుతున్నాయి. దేనికి మారినా తమ బతుకులు మారక అప్పుల ఊబిలో కొట్టుకుపోతున్నారు. అది తెలంగాణ అయినా ఆంధ్రాలో అయినా రైతు గోస ఒక్కటే. అకాల వర్షాలకు పిందెలు, కాయలు రాలిపోయి చాలా చోట్ల ఇరవై కిలోల బాక్స్‌ మార్కెట్‌ ధర రూ.రెండు వేలు మార్కెట్‌ ధర పలుకుతోంది. సహజంగా ఇంట్లో మాగడానికి ఎక్కువ సమయం పడుతుంది, అలాగే ఎక్కువ కాయలు కుళ్లిపోతున్నాయి. సాధారణంగా మామిడి, అరటి, బొప్పాయి పండ్లను పూర్తిగా పండకుండానే చెట్ల నుండి కోసి, తర్వాత వాటిని మగ్గ బెడతారు. సహజసిద్ధంగా పండటానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా పండ్లను మగ్గ పెట్టడానికి ఎథ్రెల్‌ స్ప్రే చేయడం గానీ, వాటిని ఎథ్రెల్‌ ద్రవంలో ముంచడం గానీ చేస్తారు. అయితే అది శ్రమతో కూడిన పని. అదీకాక బయట అమ్మే ఎథ్రెల్‌లో కల్తీ రసాయనాలు ఉంటే సమస్యలు వస్తాయి.
దీనికి ప్రత్యామ్నాయంగా, పండ్లను మగ్గబెట్టి గోదాములలో ఇథిలీన్‌ గ్యాస్‌ ఉపయోగిస్తారు. అయితే దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. రైతులకు, చిన్న వ్యాపారులకు ఆర్ధికంగా గిట్టుబాటు అవదు. కాబట్టి తక్కువ పెట్టుబడితో పండ్లను మగ్గించడానికి ప్లాస్టిక్‌ టెంట్లలో ఇథలీన్‌ గ్యాస్‌ను వదిలి పండ్లను పండబెట్టడం రూపొందించారు. ఇతర ఉద్యాన పంటలలో లాగానే, మామిడిని కూడా చాలా రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. వాటిలో ప్రధానమైనవి తేనెమంచు పురుగు, టెంక పురుగులు, వండు ఈగ, పిండిపురుగులు. ఈ ప్రధాన పురుగుల వలన కలిగే నష్టం అపారం. ఎన్ని ఎత్తులు వేసి మార్కెట్టుకు కాయలు తరలించినా ఆరుగాలం శ్రమించిన రైతుకు దక్కేది శూన్యం, దళారులకు భోజ్యం. తక్షణం రైతులను ఆదుకొని రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులు నిర్దిష్ట ప్రణాళికతో సత్వరమే మార్కెటు, నిల్వ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి ఫలాన్ని ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు.
డా. యం. సురేష్‌ బాబు

]]>
పండించడానికి నెలలు…పడేయడానికి సెకెన్లు..! https://navatelangana.com/months-to-harvest-and-seconds-to-fall/ Sat, 27 Apr 2024 18:00:43 +0000 https://navatelangana.com/?p=278788 పండించడానికి నెలలు...పడేయడానికి సెకెన్లు..!సకల జీవరాశుల మనుగడకు ఆహారం తప్పనిసరి. అటువంటి ఆహారాన్ని వృధా చేయడం బాధ్యతారహితమైన చర్య. ఆహార వ్యర్థాలు తీవ్రమైన ఆర్థిక, సామాజిక పర్యావరణ పరిణామాలతో కూడిన ప్రపంచ సమస్య. ప్రతిరోజూ తినదగిన ఆహారాన్ని టన్నుల కొద్దీ పారబ్రోస్తాం. ఇది నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ ఆర్థిక సవాళ్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఏటా ఆహారం వృథా కావడం మానవాళికి సిగ్గుచేటు. ఆహార వ్యర్థాలను తగ్గించి ఆకలితో ఉన్న వారికి అందజేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తెరగాలి. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 బిలియన్‌ టన్నుల ఆహార వ్యర్థాలు (తినదగిన పదార్ధాలతో సహా) ఉత్పత్తి చేయబడ్డాయి.
ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. జనాభాలో మూడవ వంతు ఆహార అభద్రతను అనుభవిస్తున్నారు. ఇది మొత్తం ఆహార పదార్ధాలలో 19 శాతంగా ఉంది. గృహాల ద్వారా రోజుకు సుమారు ఒక బిలియన్‌ భోజనం వృధా అవుతుంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో దాదాపు ఐదవ వంతు, సగటున ప్రతీ వ్యక్తీ 79 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నారు. వృథాలో పావు శాతం ఆదా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో జీవిస్తున్న 870 మిలియన్ల మందికి ఆహారాన్ని అందించవచ్చు.ఆహార వ్యర్థాలు అంటే ఏమిటి..?తినడానికి వీలుగా ఉండి కూడా తినకుండా విస్మరించబడిన లేదా విసిరేసిన ఏవైనా ఆహార పదార్థాలను ఆహార వ్యర్ధాలని అంటారు.
ఆహార వ్యర్థాల సూచిక 2024
యు.యన్‌.ఇ.పి – యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్మెంట్‌ ప్రోగ్రాం మార్చ్‌ 27 తేదీన విడుదలచేసిన ఆహార వ్యర్థాల సూచిక 2024 ప్రకారం ఆహార వ్యర్థాలు 60 శాతం గృహాల నుంచి, 28 శాతం ఆహార సేవారంగం నుంచి,12 శాతం రిటైల్‌ రంగం నుండి వస్తున్నాయి. ఇవి వరుసగా 631మి.ట, 290.మి.ట, 131 మి. ట గా ఉన్నాయి.( మి.ట అంటే మిలియన్‌ టన్నులు ) ప్రపంచంలోని వార్షిక తలసరి ఆహార వృధా 132 కిలోలుగా ఉంది. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 12.3 అనేది 2030 నాటికి రిటైల్‌, వినియోగదారు స్థాయిలలో తలసరి ప్రపంచ ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించాలని లక్ష్యించింది. చాలా దేశాలు యస్డిజి 12.3 చేరుకోడానికి తగిన వ్యవస్థలు కలిగి లేవు. నాలుగు జి20 దేశాలు (ఆస్ట్రేలియా, జపాన్‌, యుకె, అమెరికా) యూరోపియన్‌ యూనియన్‌ మాత్రమే 2030కి పురోగతిని ట్రాక్‌ చేయడానికి తగిన ఆహార వ్యర్థాల అంచనాలను కలిగి ఉన్నాయి. కెనడా, సౌదీ అరేబియా తగిన గృహ అంచనాలను మాత్రమే కలిగి ఉన్నాయి. బ్రెజిల్‌ అంచనా 2024 చివరిలో అంచనా వేయబడింది. ఆహార వ్యర్థాలు కేవలం సంపన్న దేశం సమస్య మాత్రమే కాదు. గృహ ఆహార వ్యర్థాల స్థాయిలు అధిక-ఆదాయ, ఎగువ-మధ్య మరియు దిగువ-మధ్య-ఆదాయ దేశాలలో సగటున తలసరి 7 కిలోల చొప్పున తేడాను కలిగి ఉన్నాయి. తాజా ఆహార పదార్థాలను ఎక్కువగా వినియోగించడం, బలమైన కోల్డ్‌ స్టోరేజ్‌ వ్యవస్థకు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, కరువుల వలన ఆహారాన్ని సురక్షితంగా నిలువా చేయలేకపోవడం వంటి కారణాల వలన ఉష్ణ దేశాల గృహాలలో తలసరి ఆహార వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఆహార నష్టం, వ్యర్థాలు వార్షిక గ్లోబల్‌ గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలలో 8-10 శాతం ఉత్పత్తి చేస్తున్నాయని ఇవి విమానయాన రంగం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువని ఇటీవల డేటా తెలియజేస్తుంది. పెంపుడు జంతువులు, పశువులు మొదలైనవి అందుబాటు లో ఉండడం వలన గ్రామీణ ప్రాంతాలు సాధారణ ంగా తక్కువ ఆహారాన్ని వృధా చేస్తున్నాయి. 2022 నాటికి కాబో వెర్డే, చైనా, నమీబియా, సియెర్రాతో సహా కేవలం 21 దేశాలు మాత్రమే జాతీయ వాతావరణ ప్రణాళికలు కలిగివున్నాయి. పబ్లిక్‌ ప్రయివేటు భాగస్వామ్యాలు ఆహార వ్యర్థాలు తగ్గించే ఫలితాలను అందించే ఒక ముఖ్య సాధనం.
మనదేశంలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఆహారంలో దాదాపు 40 శాతం ఆహారం అసమర్థమైన సరఫరా గొలుసు వ్యవస్థ కారణంగా ప్రతి ఏడాది వృధా అవుతుంది. విడ్డూరమేమిటంటే ఆహారం వినియోగదారునికి చేరకముందే నష్టం జరుగుతుంది. భారతదేశం మొత్తం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వినియోగించే దానికంటే ఎక్కువ పండ్లు కూరగాయలను వృధా చేస్తుంది. ఆస్ట్రేలియా ఉత్పత్తి చేసే దానికంటే ఎక్కువ ధాన్యాలను వృధా చేస్తుంది. జీడీపీలో దాదాపు ఒక శాతం ఆహార వృధా రూపంలో క్షీణిస్తోంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేయబడిన రూ.50వేల కోట్ల విలువగల ఆహారం వృధా అవుతుంది. దేశంలో దాదాపు 23 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. జనాభాలో 15శాతం మంది ప్రతిరోజూ ఆకలితో అలమటిస్తున్నారు. నలుగురి పిల్లలలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దాదాపు 3వేల మంది ప్రతిరోజు సరైన ఆహారం లేని కారణంగా అనారోగ్యంతో మరణిస్తున్నారు.ఆహార వ్యర్థాలు ప్రధానంగా ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, నిల్వ సమయాలలో జరుగుతుంది. ఇండ్లలో , వివాహాలు, పార్టీలు జరిగేటప్పుడు, హోటల్స్‌లో, ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడిన ఆహారంలో మూడింట ఒక వంతుకు పైగా వృధా అవుతుందని అంచనా వేయబడింది.
జీవ పర్యావరణాలపై ప్రభావం
ఆహారం ఉత్పత్తి చేయడానికి మంచి నీరు, భూమి, శ్రమ అవసరం. ఆహారాన్ని వృధా చేసామంటే వీటిని కూడా వృధా చేసినట్లే…! ఈ వినియోగించని ఆహార పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా 8-10శాతం కార్బన్‌ ఉద్గారాలకు కారణమవుతున్నాయి. ఇవి ప్రతి సంవత్సరం పర్యావరణంలోకి 3.3 బిలియన్‌ టన్నుల గ్రీన్హౌస్‌ వాయువులును విడుదల చేస్తాయి. పల్లపు ప్రదేశాలలో కుళ్లిన ఆహారాల నుంచి విడుదలయ్యే మీథేన్‌ కార్బన్‌ డయాక్సైడ్‌ కంటే మరింత శక్తివంతమైన గ్రీన్‌హౌస్‌ వాయువు. ఇది మానవాళికి క్యాన్సర్‌, శ్వాసకోశవ్యాధులు వంటి వ్యాధులు రావడానికే కాకుండా అంగ వైకల్యంతో పిల్లలు పుట్టడానికి కారకం కూడా. ఆహార వ్యర్థాలు కుళ్ళడం వలన విడుదలయ్యే 10శాతం గ్రీన్‌హౌస్‌ వాయువులు ఓజోన్‌ పొరకు హాని కలిగిస్తున్నాయి. ఇంకా పర్యావరణ పరంగా మొక్కలు జంతుజాతుల క్షీణత జరిగి దాదాపు 70శాతం జీవ వైవిధ్య నష్టానికి ఈ ఆహారవ్యర్థాలు పరోక్షంగా కారణమవుతున్నాయి. చెత్తాచెదారం పల్లపు ప్రదేశాల్లోకి వెళ్లడం వలన నీటి కాలుష్యం జరుగుతుంది.
ఆహార వృధాను ఎలా తగ్గించాలి?
పోషకమైన, ఆరోగ్యకరమైన స్థిరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవస్థను కలిగి ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే అవసరమైన పరిమాణంలో ఆహారాన్ని కొనుగోలు చేయాలి. ఆహారాన్ని సరిగ్గా భద్రపరచాలి. మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి ఉపయోగించడం, అదనపు ఆహారాన్ని అవసరమైన వారికి అందించడం, ఫుడ్‌ బ్యాంకులకు పంపించడం మొదలైనవి చేయాలి. ఆహార వ్యర్థాలు మట్టిని పోషకాలతో సుసంపన్నం చేస్తాయి కావున మిగిలిన ఆహార వ్యర్థాలను కంపోస్టింగ్‌ చేయాలి. ఒక ఇంటి కంపోస్టింగ్‌ ద్వారా 150 కిలోల వరకు ఆహారవ్యర్థాలను నివారించవచ్చు. పండ్లు వంటి వాటిని నిలవచేయడానికి శీతల గిడ్డంగులును నెలకొల్పాలి. నిలవకు శాస్త్రీయ పద్ధతులను పాటించాలి.
జనక మోహన రావు
8247045230a

]]>
మానసిక ఒత్తిడిలో ‘యువ’భారతం https://navatelangana.com/young-india-under-stress/ Sat, 27 Apr 2024 17:58:38 +0000 https://navatelangana.com/?p=278764 మానసిక ఒత్తిడిలో 'యువ'భారతంనవంబర్‌ 2022లో భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 2030 నాటికి ఆత్మహత్యలను కనీసం పది శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. విద్యాలయాల్లో మానసిక ఆరోగ్య తరగతుల నిర్వహణ, ప్రవర్తన సంబంధ విశ్లేషణలు, యువతకు సంబంధించిన దురలవాట్లకు వ్యతిరేకంగా ప్రచారాలకు యూత్‌ క్లబ్బులను నెలకొల్పడం, స్కూల్‌ హెల్త్‌ అంబాసిడర్ల నియామకాలు చేపట్టాలని విద్యాలయ యాజమాన్యాలకు సూచిస్తున్నా ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. ఆత్మహత్యల నివారణలకు ప్రభుత్వాలు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి యంత్రాంగాలను నెలకొల్పి నేటి యువతను సన్మార్గంలో నడపడానికి కృషి చేయాలి.
ఆత్మహత్య అనేది అత్యంత విచారకర స్వయంకృతాపరాధ ఆక్షేపణీయ అకాల మరణం. ఒక బలహీన క్షణంలో మనిషి తీసుకునే అత్యంత పిరికి లేదా ఓటమిని అంగీకరించిన అసంబద్ధ నిర్ణయమే ఆత్మహత్య. ఆత్మహత్య అనే నిర్ణయం ఏదో ఒక ”తాత్కాలిక సమస్యకు జడిసి తీసుకునే శాశ్వత పరిష్కారం”. ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఆత్మహత్యలు నమోదవుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఆత్మహత్యలు అత్యధికంగా నమోదు అవుతున్న దేశంగా భారత్‌ రికార్డుల్లోకి ఎక్కడం విచారకరం. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వివరాల ప్రకారం 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఏడాదికి ప్రతి లక్ష మంది భారత జనాభాలో 12.4 మంది ఆత్మహత్యల ఊబిలో మునిగి బలవంతంగా ఊపిరి తీసుకున్నట్లు స్పష్టమవుతున్నది. ఆత్మహత్యల వివరాలు పూర్తిగా నమోదు కాకపోవడంతో వాస్తవ ఆత్మహత్యల గణాంకాలు అనేక రెట్లు అధికంగా (లక్షకు 80 మహిళలు, 34 మంది పురుషులు) ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. నమోదు అవుతున్న మొత్తం ఆత్మహత్యల్లో 41 శాతం వరకు 30 ఏండ్ల లోపు యువత ఉండడం మరింత ప్రమాదకర ప్రజారోగ్య సమస్యగా తోస్తున్నది. మహిళల మరణాల్లో ఆత్మహత్యలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. భారత్‌లో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక యువతి లేదా యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబాలకు తీరని లోటు, ఆర్థిక నష్టం, దేశ భవిష్యత్తుకు పూల్చలేని లోటుగా మిగిలి పోతున్నది.
ఆత్మహత్యలకు కారణాలు అనేకం
యువ రక్తంలో జరుగుతున్న సామాజిక, మానసిక, సాంస్కఅతిక, జీవశాస్త్ర, కుటుంబ సంఘర్షణలతో ఆత్మహత్య ఆలోచనలు పురుడు పోసుకుంటున్నాయి. కౌమార యువత ఆత్మహత్యలకు కారణాలుగా మానసిక అనారోగ్య సమస్యలు (54 శాతం), ప్రతికూల కుటుంబ సంఘర్షణలు (36 శాతం), విద్యపరమైన ఒత్తిడులు (23 శాతం), గృహ హింస (22 శాతం), సామాజిక/జీవనశైలి సమస్యలు (20 శాతం), ఆర్థిక నిరాశలు (9.1 శాతం), మానవ సంబంధ కారణాలు (9 శాతం)తో పాటుగా శారీరక లైంగిక నిందలు, పరీక్షల్లో వైఫల్యాలు, తరాల అంతరాల ఘర్షణలు, తల్లితండ్రుల ఒత్తిడి, కుల వివక్ష, అయిష్టమైన వివాహాలు, చిన్న వయస్సులోనే తల్లి కావడం లాంటివి గుర్తించబడినవి. 2022లో పరీక్షల్లో వైఫల్యాలు లేదా తక్కువ మార్కులు/ర్యాంకులు రావడం, విపరీతమైన పోటీతత్వం పెరగడం, అనుకున్న ఐఐటి/మెడికల్‌ కళాశాలలో సీటు రాకపోవడం లేదా ఆయా కాలేజీల్లో సీటు పొందిన తర్వాత కూడా చదువుల ఒత్తిడి పెరగడం, తల్లితండ్రుల బలవంతంతో అయిష్టంగా పోటీ పరీక్షలకు తయారు కావడం లాంటి కారణాలతో 2,095 మంది భారతీయ యువత ఆత్మహత్యలే పరిష్కారంగా తీసుకొని బలవంతంగా ప్రాణాలను కోల్పోతున్నారని తెలుస్తున్నది. డిజిటల్‌ యువతలో చోటు చేసుకుంటున్న విపరీత ధోరణులతో గత రెండు దశాబ్దాలుగా యువత ఇంటర్నేట్‌ దురలవాట్లు, సైబర్‌-బుల్లీయింగ్‌(బెదిరింపులు)ల విష వలలో పడుతున్నారు. నేటి కళాశాల యువత కనీసం 20 శాతం వరకు ఇంటర్నెట్‌ ఊబిలో చిక్కుకొని మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నట్లు తేలింది. మీడియాల్లో వచ్చే నేరాలు, ఘోరాలు, సెలబ్రిటీల ఆత్మహత్యల ప్రసారాలతో యువతలో ఆత్మహత్యల ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ”ఆత్మహత్యలు చేసుకోవడం ఎలా ?” అనే విషయంలో గూగుల్‌ సైట్లను యువత ఎక్కువగా చూస్తున్నట్లు తెలుస్తున్నది.
ఆత్మహత్యల నివారణ మార్గాలు
విద్యాలయాల్లో మానసిక నిపుణులతో తరుచుగా కౌన్సిలింగ్‌ తరగతులు, ప్రవర్తనలో వచ్చే మార్పులను త్వరగా గుర్తించడం, భావోద్వేగ సమతుల్యతను నియంత్రించుకోవడం, సమస్యలను అధిగమించే మార్గాలు నేర్పడం, యువత ఇష్టపడే ప్రాంగణ వాతావరణాలు కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలిని (పోషకాహారం, శారీరక వ్యాయామం, పరిమిత ఇంటర్ననెట్‌ వాడడం, స్నేహితులతో గడపడం, యోగా, ధ్యానం, నిద్ర లాంటివి) అలవర్చుకోవడంతో యువతలో మానసిక ఆరోగ్యం పెరిగి ఆత్మహత్యల ఆలోచనలు తగ్గుతాయని వివరిస్తున్నారు. సానుకూల కుటుంబ వాతావరణం, గృహ హింసకు తిలోదకా లివ్వడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం, అవసర ఆర్థిక వనరులు కల్పించడం, విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం ప్రధానం. సమాజంలో నెలకొన్న కళంకాలు/ దురాచారాలకు మంగళం పాడడం, కుల వివక్షను వ్యతిరేకిం చడం, కోటా రాజస్థాన్‌ కోచింగ్‌ చెరసాలల్ని నియంత్రించడం చేయాలి. రాజకీయ/సామాజిక/ ప్రభుత్వ సమన్వయాలతో కార్యాచరణ రూపొందించి ఆచరణలో పెట్టడం లాంటి చర్యలు ఆత్మహత్యల నమోదును గణనీయంగా కట్టడి చేస్తాయి.
నవంబర్‌ 2022లో భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 2030 నాటికి ఆత్మహత్యలను కనీసం పది శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. విద్యాలయాల్లో మానసిక ఆరోగ్య తరగతుల నిర్వహణ, ప్రవర్తన సంబంధ విశ్లేషణలు, యువతకు సంబంధించిన దురలవాట్లకు వ్యతిరేకంగా ప్రచారాలకు యూత్‌ క్లబ్బులను నెలకొల్పడం, స్కూల్‌ హెల్త్‌ అంబాసిడర్ల నియామకాలు చేపట్టాలని విద్యాలయ యాజమాన్యాలకు సూచిస్తున్నా ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. ఆత్మహత్యల నివారణలకు ప్రభుత్వాలు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి యంత్రాంగాలను నెలకొల్పి నేటి యువతను సన్మార్గంలో నడపడానికి కృషి చేయాలి. ఒక్క ప్రభుత్వమే కాదు సమాజంలో ఉన్న మనం కూడా జీవితం ఒక్కటే అని తెలుసుకొని, దానిని సర్వాంగ సుందరంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుకోవాలని నేటి ఆధునిక యువతకు హితబోధ చేద్దాం, ఆత్మహత్యలు నమోదుకాని భారత సమాజాన్ని నిర్మించుకుందాం.
డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి 9949700037

]]>
తప్పెవరిది…శిక్షెవరికి? https://navatelangana.com/whoever-is-wrong-will-be-punished/ Sat, 20 Apr 2024 18:10:32 +0000 https://navatelangana.com/?p=273763 తప్పెవరిది...శిక్షెవరికి?మహబూబాబాద్‌ నుంచి వరంగల్‌కు ఉదయం పూట కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కి వెళ్లడానికి బయలుదేరి రైల్వేస్టేషన్‌కు వెళ్లాను. కోణార్క్‌లో ముందుభాగాన ఇంజన్‌ తర్వాత ఒక జనరల్‌ భోగి ఉంటుంది దాని వెనుక ఏసీ బోగీలుంటాయి, సాధారణ భోగిలో ఎక్కడానికి స్థాయికి మించి ఎక్కువ రష్‌ ఉండటంతో అతి కష్టం మీద ట్రెయిన్‌ ఎక్కడానికి ప్రయత్నం చేశాను, నాతోపాటు ఒక స్త్రీ సంకలో చిన్న పాపను ఎత్తుకొని ట్రైన్‌ ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ కింద పడింది, కింద పడటంతో చంకలో ఎత్తుకున్న పాపకు తలకు దెబ్బ తగిలింది. అయినా కూడా ఆ స్త్రీ కింద పడి లేచి మళ్లీ ట్రెయిన్‌ ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా… ఆ పాప వాంతి చేసుకుంది వృత్తిరీత్యా డాక్టర్‌ కావడంతో ఆ వాంతి చేస్తున్న క్రమాన్ని అబ్జర్వ్‌ చేసిన నేను వెంటనే ఆమెను బండి ఎక్కనీయకుండా ఆపాను. నేను కూడా వరంగల్‌కు వెళ్లే ప్రయాణాన్ని విరమించుకుని వెంటనే 108 కు ఫోన్‌ చేసి ఆమెను జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్‌కి తరలించాను. నేననుకున్నది నిజమే అయింది. ఆ పాపకు తలకు దెబ్బ తగలడంతో బ్రెయిన్‌కు గాయమై నాలుగు రోజులకు అభం శుభం తెలియని ఆ పాప చనిపోయింది, పుట్టెడు దు:ఖంలో ఉన్న తల్లిని కౌన్సెలింగ్‌ చేసి నెమ్మదిగా ఇంటికి తరలించాము. పదహారు రోజుల తర్వాత నాకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది పాప తల్లిదగ్గర నుంచి. సారాంశమేమిటంటే రైలు ఎక్కుతున్న క్రమంలో కింద పడిన సందర్భంలో గర్భంతో కూడా ఉన్న ఆ తల్లి కడుపుకు దెబ్బ తగిలిందని, దాంతో కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయిందని తెలిసింది. నాకు ఒక వారం రోజుల పాటు నిద్ర పట్టలేదు. కారణం గర్భంతో ఉన్న తల్లి చంటి పిల్లను సంకలో పెట్టుకొని ఒకే ఒక జనరల్‌ బోగీలో ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ కింద పడటంతో పుట్టినపాప చనిపోయింది.కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? తప్పెవరిది ?! శిక్షెవరికి?! అనేది నాటి నుంచి నేటివరకు నా అంతర్మదనాన్ని తొలుస్తున్న ప్రశ్న.
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఏదో చేయాలి, ఏదైనా చేయాలనే తపన నాలో సంఘర్షణకు దారితీసింది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనిషిగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కానీ ఆలోచించాలి. ఊరకనే ఉండకూడదని, ఒక ప్రయత్నమైతే చేద్దామని అప్పటి నుంచి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాను. రైలులో పేద ప్రజలు ప్రయాణించేందుకు వీలుగా జనరల్‌ భోగిలను పెంచేందుకు ప్రధానికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమం.’ఇది మా డిమాండ్‌ అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, విన్నపమనుకోండి’ ఏది ఏమైనా మా కోరిక ఏంటంటే ప్రతి రైల్లో ఐదు సాధారణ బోగీలుండాలి. ఒక సాధారణ మనిషి కూలి కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, చిన్న చిన్న పనులకు ట్రెయిన్‌ ఎక్కే ప్రతి వ్యక్తి అనుభవిస్తున్న సుదీర్ఘ సమస్య. ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఇది.స్టేషన్లు పెరుగుతున్నాయి, వందే భారత్‌ లాంటి అత్యున్నత ఆధునిక ట్రెయిన్స్‌ కూడా వస్తున్నాయి, ఉన్న స్టేషనులను కూలగొట్టి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు.
కానీ ఒక సాధారణ ప్రయాణికునికి సౌకర్యాలు అనుకున్న స్థాయిలో పెరగలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పెట్టిన రెండు సాధారణ భోగిల అంచనా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్ట్‌ సిస్టంగా ఉన్న భారతదేశ రైల్వేలు, ఈ చిన్న సమస్యను వారి దృష్టికి సరైన మార్గంలో చేరితే పరిష్కారం కచ్చితంగా దొరుకుతుందనేది నా భావన. అందుకే మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో వరంగల్‌ కేంద్రంగా- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌ గారి చేతుల మీదుగా మొదటి ఉత్తరము ప్రధానమంత్రి గారికి రాయించి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టాము.
ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకొని, సూరత్‌ కూడా వెళ్లి అక్కడ కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఈ మధ్యనే ఒక జాతీయ అవార్డు తీసుకోవడానికి బెంగళూరుకు వెళ్లగా అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిసింది. మా ఆశ, ఆశయం, లక్ష్యం ఒక్కటే. ఒక సాధారణ పౌరునికి అత్యంత సరసమైన ధరలతో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లగలిగే సౌకర్యం రైల్వేలోనే కల్పించాలనేది. 130 కోట్ల పైగా ఉన్నటువంటి దేశ జనాభాలో సుమారు 30 కోట్ల మంది, ప్రతిరోజూ రైల్లో ప్రయాణం చేస్తున్నారనేది ఒక అనధికారిక అంచనా. అందుకే దేశ ప్రజల కోరిక, విజ్ఞప్తి ఏమిటంటే? ప్రతి రైలులో ఐదు సాధారణ భోగిలు ఉండాలనేది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని ఒక సామాజిక బాధ్యతగా నడుం బిగించి ప్రధానికి ఒక ఉత్తరం ముక్క రాయాలి. ప్రతి ఒక్కరికీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉన్నందున అడ్రస్‌ దొరకడం పెద్ద పనేం కాదు. గూగుల్‌లో సెర్చ్‌ చేస్త తప్పక వస్తుంది. ప్రతి రైలులో జనరల్‌ భోగీలను ఐదు పెంచేందుకు ఒక సమూహంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించగలమనే నమ్మకం ఉంది. ఈ కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాను.
అశోక్‌ పరికిపండ్ల
9989310141

]]>
ప్లాస్టిక్‌ను నివారించాలి… పర్యావరణాన్ని కాపాడాలి https://navatelangana.com/avoid-plastic-and-save-the-environment/ Sat, 20 Apr 2024 18:09:08 +0000 https://navatelangana.com/?p=273760 ప్లాస్టిక్‌ను నివారించాలి... పర్యావరణాన్ని కాపాడాలిభూమి నీలిరంగులో కనిపించే మానవ నివాసయోగ్యమైన ఒక గ్రహం. నాలుగింట, మూడొంతుల భూమి నీటితో ఆవరించబడి ఉండటం వలన భూమి నీలి రంగులో కనిపిస్తుంది. ఎర్త్‌ డే మొదటిసారిగా ఏప్రిల్‌ 22, 1970న పాటించబడింది. ఇది ఆధునిక పర్యావరణ ఉద్యమానికి నాందిగా పరిగణించబడుతుంది. 1969లో శాంటా బార్బరా తీరంలో చమురు చిందటం వలన కలిగిన అపారమైన పర్యావరణ విధ్వంసానికి ప్రతిస్పందనగా, అమెరికా సెనేటర్‌ గేలార్డ్‌ నెల్సన్‌ పర్యా వరణాన్ని ఎలా రక్షించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎర్త్‌ డేని స్థాపించారు. ఐక్యరాజ్యసమితి 2009 సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 22న జరుపుకునే ధరిత్రి దినోత్సవాన్ని ” ఇంటర్నేషనల్‌ మదర్‌ ఎర్త్‌ డే” గా నామకరణం చేసింది.
ప్రతి సంవత్సరం ధరిత్రి దినోత్సవాన్ని”ఎర్త్‌ డే. ఓ ఆర్‌ ర్జీ” (జుA=ునణA్‌.ఉ=+) అనే సంస్థ నిర్వహిస్తుంది. ఇది స్థిరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి పనిచేసే ప్రపంచ సంస్థ.”ఎర్త్‌ డే.ఓఆర్‌ జి” లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాన్ని వైవిధ్య పరచడం, అవగాహన కల్పించడం. మొదటి ఎర్త్‌ డే (1970) నుండి అభివృద్ధి చెందుతూ, పర్యావరణ ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి దాదాపు 192 దేశాలలో 150,000 కంటే ఎక్కువ భాగస్వాములతో కలిసి ఈ సంస్థ పని చేస్తుంది.ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక బిలియన్‌ కంటే ఎక్కువ మంది ప్రజలు ఎర్త్‌ డే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఏప్రిల్‌ 22ని ఎర్త్‌ డేగా ఎంచుకున్నారనడానికి ఓ కారణం ఉంది. 1970లో మొదటి ఎర్త్‌ డే ప్రారంభమైనప్పుడు నిర్వాహకులు కళాశాల క్యాంపస్లలో విద్యార్థులు గరిష్టంగా పాల్గొనే తేదీని కోరుకున్నారు. ఏప్రిల్‌ 22 స్ప్రింగ్‌ బ్రేక్‌, ఇది విద్యార్థులకు ఈవెంట్లు, ర్యాలీలను నిర్వహించడానికి అనుకూలమైన సమయం. అదనంగా, ఈ తేదీన ఏ మతపరమైన సెలవులు లేదా ఇతర ప్రధాన కార్యక్రమాలు లేవు. అందుకు ఈ రోజును అనువైనదిగా భావించారు.
ఎర్త్‌ డే 2024 థీమ్‌
ఎర్త్‌ డే 2024 థీమ్‌ (విషయము) ప్లానెట్‌ వర్సెస్‌ ప్లాస్టిక్స్‌. ఈ థీమ్‌ ముఖ్య ఉద్దేశం. 2040 కల్లా 60 శాతం ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం, భూమిని ప్లాస్టిక్‌ రహితముగా మార్చడం. ఇది మనల్ని, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య అయిన ప్లాస్టిక్‌తో పోరాడటమే ప్లాస్టిక్‌ నివారణకు సరైన మార్గం.ప్లాస్టిక్‌లు విచ్ఛిన్నమైన తర్వాత కూడా, అవి మైక్రోప్లాస్టిక్లుగా భూమిలో మిగిలిపోతాయి. ప్లాస్టిక్లు మైక్రోప్లాస్టిక్లుగా విడిపోవడంతో విషపూరిత రసాయనాలు మన ఆహారం ద్వారా, నీటి వనరుల ద్వారా, మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి రక్త ప్రవాహం ద్వారా మైక్రోప్లాస్టిక్స్‌, పేరు సూచించినట్లుగా, చిన్న ప్లాస్టిక్‌ కణాలు. అధికారికంగా అవి ఐదు మిల్లీమీటర్ల (0.2 అంగుళాలు) కంటే తక్కువ వ్యాసం కలిగిన ప్లాస్టిక్లుగా నిర్వచించబడ్డాయి. దాదాపు 70శాతం దుస్తులు ముడి చమురుతో తయారవుతాయి, దీని ఫలితంగా ఉతికినప్పుడు ప్రమాదకరమైన మైక్రోఫైబర్లు విడుదలై పల్లపు ప్రదేశాలలో దీర్ఘకాలిక కాలుష్యాన్ని కలగజేస్తాయి. అదేవిధముగా దాదాపు 85శాతం వాడిన వస్త్రాలు ల్యాండ్ఫిల్ల లోనికి పారవేయపడి నేల కాలుష్యాన్ని కలగజేస్తాయి. కేవలం ఒక శాతం మాత్రమే రీసైకిల్‌ చేయబడతాయి.
నాన్‌ స్టిక్‌ పాన్‌ దోశలతో క్యాన్సర్‌
నాన్‌ స్టిక్‌ పాన్‌ల ఉపరితలం ”పాలి టెట్రా ఫ్లోరో ఇథలీన్‌” అనే పాలిమర్‌తో పూత వేస్తారు. దీనినే ”టెఫ్లాన్‌” గా వ్యవహరిస్తారు. ఇది ప్లాస్టిక్‌ల వలె కృత్రిమంగా తయారు చేయబడే ఒక పాలిమర్‌. ఇది ఒక క్యాన్సర్‌ కారకం. దోశలు మొదలైన ఆహార పదార్థాలు నాన్‌ స్టిక్‌ పాన్‌లో వండించటం వలన క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్నది. నాన్‌స్టిక్‌ పాన్‌ వేడి చేయడం వల్ల టెఫ్లాన్‌ కరిగి ఆహారంలో కలుస్తుంది. దాని వల్ల మనిషి శరీరంలోకి వెళ్తుంది. అదే ఇనుప పెనం మీద అయితే ఎటువంటి కెమికల్స్‌ ఉండవు. గనుక ఇనుప పెనం మీద చేసిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
సిగరెట్లతో ప్లాస్టిక్‌ కాలుష్యం
ప్లాస్టిక్స్‌ సీసాలు, స్ట్రాస్‌, ప్లాస్టిక్‌ సంచులు కన్నా సిగరెట్‌ పీకలు వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక సమృద్ధిగా ఏర్పడే ప్లాస్టిక్‌ వ్యర్ధాలు. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేసేవారు ప్రతి సంవత్సరం దాదాపు 6.5 ట్రిలియన్‌ సిగరెట్లను కొనుగోలు చేస్తున్నారు. ”సెల్యులోజ్‌ అసిటేట్‌” అనే మానవ నిర్మిత ప్లాస్టిక్‌ పదార్థంతో తయారు చేయబడతాయి, వందలాది విష రసాయనాలను కలిగి ఉంటాయి. సిగరెట్‌ ఫిల్టర్లు, లేదా బట్స్లోని ప్లాస్టిక్‌ భాగం . సముద్ర జీవులపై సిగరెట్‌ పీకల ప్రభావముపై 2022 సంవత్సరంలో ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం సముద్ర జంతువులు ప్లాస్టిక్‌ల వలన ఊపిరి ఆడక తీవ్రమైన అనారోగ్యానికి గురై మరణిస్తున్నాయని ఈ అధ్యయనం తెలియజేసింది. ఇదే పరిశోధన సిగరెట్‌ పీకల నుంచి విడుదలైన మైక్రోప్లాస్టిక్లు మానవ కణజాలాలలో ఎలా వచ్చి చేరుతున్నవో వివరించింది.
తూర్పు వైపుకు వంగిన భూమి అక్షం
భూమిపై నీటి అసమాన పంపిణీ వలన భూఅక్షము ప్రతి సంవత్సరము 1.7 ఇంచులు తూర్పు వైపుకు వంగిపోతున్నది. భూగర్భజలాలను వెలికితీసి మరో చోటుకు తరలిస్తుండడం వల్ల భూమి అక్షం తూర్పు వైపు 80 సెం.మీ వంగిపోయింది. ఈ మార్పు1993-2010 మధ్య కాలంలో జరిగింది. భూగర్భ జలాలను వెలికి తీయడం, నీటిని భారీగా సముద్రాల్లోకి తరలించడమే ఇందుకు కారణమని కొత్త అధ్యయనం తెలిపింది.”బయటకు తీసిన భూగర్భజలాలు ఆవిరిగా మారి వాతావరణంలో చేరతాయి లేదా నదుల్లో కలుస్తాయి. తర్వాత వానల రూపంలో సముద్రంలో కలుస్తాయి. ఈ విధంగా నీరు భూభాగం నుంచి సముద్రాలకు చేరుతుంది.
1993-2010 మధ్య కాలంలో మానవులు 2,150 గిగాటన్నులు భూగర్భజలాలను వెలికితీశారని అధ్యయనాలు అంచనా వేశాయి. 2,150 గిగా టన్నుల నీరు 860 మిలియన్‌ ఒలంపిక్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ను నింపగలవు. 2,150 గిగా టన్నుల నీటి పరిమాణం అంటే 6 మి.మీకు పైగా సముద్ర మట్టాల పెరుగుదలకు సమానం.నీరు కదులుతున్నప్పుడు భూమి కూడా కాస్త భిన్నంగా తిరుగుతుంది.సముద్ర మట్టం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీరప్రాంత జీవనానికి తీవ్ర ముప్పు ఏర్పడు తోంది. తుఫాను ఉప్పెనల తీవ్రత, వరదలు, తీర ప్రాంతాలకు నష్టం వాటిల్లడం వంటివి సంభవిస్తాయి.
(ఏప్రిల్‌ 22 ” ఇంటర్నేషనల్‌ మదర్‌ ఎర్త్‌ డే”)
శ్రీదరాల రాము
9441184667

]]>
బీజేపీ అంబేద్కర్‌ను ఎందుకు పొగుడుతుంది? https://navatelangana.com/why-does-bjp-praise-ambedkar/ Sat, 13 Apr 2024 18:30:54 +0000 https://navatelangana.com/?p=269086 బీజేపీ అంబేద్కర్‌ను ఎందుకు పొగుడుతుంది?దేశంలో ఎక్కడ చూసినా అంబేద్కర్‌ పేరు నేడు వినిపిస్తున్నది. అయితే వినిపించే వారెవరనుకున్నారు? భారతీయ జనతాపార్టీ అంబేద్కర్‌ను భుజాన వేసుకొని మోస్తున్నది. ఆ నేతలు అంబేద్కర్‌ను తెగ పొగిడేస్తున్నారు.అన్ని పార్టీలు,అందరు రాజకీయవాదులు అంబేద్కర్‌ను గౌరవిస్తుండగా ఇక కావాల్సిందేమున్నది? సామాజిక న్యాయం రాకేం చేస్తుంది? అనేవి నేటి ప్రశ్నలు.అయితే ఒకసారి జాగ్రత్తగా చరిత్రను పరిశీలిస్తే హిందూ మతం హింసతో జంతుబలులు చేస్తూ, యజ్ఞయాగాదులు జరుపుతూ వున్నా రోజులలోనే బౌద్ధం పుట్టింది.అహింసావాదాన్ని ప్రచారం చేసింది.సంఘంలో ఉన్న హెచ్చుతగ్గులు పోవాలని,స్త్రీ పురుషులు సమానం అనీ, మానవులంతా ఒకటేనని అన్నది.అందుకే ప్రజలు బౌద్ధాన్ని ఆరాధించారు.ఆదరించారు. అనుసరించారు.ఇక అప్పుడేం జరిగింది? హిందూ మతం పునరుద్ధరణ పేరిట,రాజుల సహాయంతో శంకరాచార్యులు మొదలైనవారు బౌద్ధాన్ని చంపేశారు.బౌద్ధ భిక్షువులను నాశనం చేసారు. బౌద్ధ ఆరామాలను కొన్నిచోట్ల దేవాలయాలుగా మార్చారు.అయినా బౌద్ధం పూర్తిగా నాశనం కాకపోయేసరికి,బుద్దుడిని పొగడడం ప్రారంభించారు.నేడు అంబేద్కర్‌ను పొగిడినట్లే నాడు బుద్ధుడిని ఆకాశానికికెత్తారు.తెలివిగా బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒక్కడన్నారు. దేవుడు అనే భావనను దూరంపెట్టిన బుద్దుడినే దేవుడిగా మార్చి కొలిచారే గానీ బుద్ధుడి భావాలు అమలు పరచలేదు.సమానత్వం అనే మూలభావాన్ని ఆచరించలేదు. అంతిమంగా బౌద్ధాన్ని పారదోలగలిగారు. మన దేశంలో బౌద్ధం నాశనంగావడం పునర్వికాసానికి,హేతువాదానికి, మానవ వాదానికి ప్రమాదంగా పరిణమించింది. కులాల హెచ్చుతగ్గులు మళ్లీ విజంభించాయి.
బౌద్ధులకు, హిందువులకు జరిగిన పోరాటంలో అంటరానితనం పుట్టింది. సంస్కరణవాదులు ఎందరు పైపైన ప్రయత్నించినా,హిందూ సమాజంలోని దోషాల్ని తొలగించలేకపోయారు. ఈ దోషాలకు మూలాధారంగా పవిత్ర మత గ్రంథాలు, శాస్త్రాలు నిలిచాయి.వాటి జోలికి పోకుండా తలపెట్టిన సంస్కరణలు హిందూ మతాన్ని, వాటిలో దోషాల్ని తొలగించలేకపోయాయి. 20వ శతాబ్దంలో అంటరాని తనాన్ని పాటించే హిందూ సమాజం ప్రపంచం దష్టిలో తలవంపులకు గురైంది. అలాంటి స్థితిలో అంబేద్కర్‌ వచ్చి కూలంకషంగా హిందూ సమాజంలోని దోషాల్ని పరిశీలించారు. వాటిపై పోరాడారు.అంటరాని కులాలు,శూద్రులు సమాజంలో గణనీయంగా వున్నారు.వారి ఓట్లు లేనిదే ఏ పార్టీ గెలవదు గనుక కొత్త ఎత్తుగడలతో,తాత్కాలికంగా ఓటర్లను మభ్యపెట్టే వ్యూహాలు అనుసరిస్తున్నాయి. అందులో భాగంగా నేడు అంబేద్కర్‌ ను తెగ పొగిడేస్తున్నారు.అది విని అటు షెడ్యూల్‌ కులాలు,ఇటు శూద్రకులాలు సంతోషపడి ఓట్లు వేయాలనేది బిజెపి ఉద్దేశం.అంబేద్కర్‌ సిద్ధాంతీకరించిన వాటిని ఆమోదించి ఆచరిస్తామంటే అభ్యంతరం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు.కానీ పొగుడుతూ, గోతులు తవ్వి అంబేద్కర్‌ ను పూర్తిగా చంపేయాలనే ఎత్తుగడ అయితే, జాగ్రత్త పడాలి. ఆ విషయం శ్రద్ధగా,లోతుగా పరిశీలించాలి. అంబేద్కర్‌ పేరిట, కొందరు బయలుదేరి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ కమిటీలు వేయమనీ, విగ్రహాలు? ప్రతిష్టించమనీ, ఉత్సవాలు జరపమనీ కోరుతున్నారు. ఇలాంటి అంబేద్కర్‌ వాదులను సంతప్తి పరచడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధమే.అది కూడా అంబేద్కర్‌ వాదాన్ని ఉరితీయడానికి పన్నుగడే.ఈ విషయం గ్రహించడానికి అంబేద్కర్‌ వాదులకు కొంతకాలం పట్టొచ్చు ఈలోగా ప్రమాదం జరిగిపోతుంది. అంబేద్కర్‌కు ప్రస్తుతం దేశంలో కొత్త అభిమానులు ఏర్పడ్డారు.
బీజేపీ తమ ఎత్తుగడలో అంబేద్కర్‌ని కూడా చేర్చడం గమనార్హం.కానీ ఈ ఎత్తుగడ విఫలంగాక తప్పదు. అంబేద్కర్‌లో బీజేపీ ఆమోదించే అంశమేదీ కనిపించడం లేదు.కేవలం ఓట్ల కోసమే అంబేద్కర్‌ను శ్లాఘిస్తున్నా,అది మరీ కత్రిమంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది.ఇటీవలే బిజెపి వారు అయోధ్యలో రామమందిరానైని నిర్మించారు.రామరాజ్యం నిర్మిద్దాం అంటూ, అయోధ్య మందిర నిర్మాణానికై దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు రాళ్ళు మోసుకొని వెళ్ళారు కూడా.కానీ అంబేద్కర్‌ను పొగుడుతూ,ఆయన ఆశయాలను పాటిస్తామంటున్న బీజేపీి వారికి అసలు విషయం తెలియదనుకోలేం గదా! అందులో బాగా చదువుకున్న నాయకులు, అనుచరులు ఉన్నారు.వారిలో అందరూ కాకున్నా, కొందరైనా అంబేద్కర్‌ రచనలు చదివి వుంటారు. హిందూమతాన్ని గురించి, రాముడిని – రామాయణాన్ని గురించి అంబేద్కర్‌ రాసింది వారి దష్టికి వచ్చే వుంటుంది.అంబేద్కర్‌ రచనలలో అముద్రితంగా రచనలు కొన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించగా,అందులో రాముడి గురించిన విషయమై పెద్ద ఆందోళనే జరిగింది. బీజేపీి,శివసేన,హిందూ ఛాందసులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. కనుక అంబేద్కర్‌లో బీజేపీవారు అంగీకరిస్తున్నదేమిటో, నిరాకరిస్తున్నదేమిటో జనానికి తెలియాలి.ఫలానా విషయం తణీకరిస్తున్నామంటే,ఎందుకో కారణాలు కూడా బిజెపి చెప్పాలి.ఇదేమీ చేయకుండానే బీజేపీ హఠాత్తుగా అంబేద్కర్‌ వర్ధంతులు,జయంతులు జరుపుతూ ఊరేగింపులు చేస్తుంటే ప్రయోజనం ఉండదు.అంబేద్కర్‌ కేవలం ద్వేషంతో,పగతో హిందువులలో అగ్రవర్గాల వారిని, ముఖ్యంగా బ్రాహ్మణ ఛాందసులను తిట్టలేదు. సుదీర్ఘంగా పరిశోధించి, ప్రమాణాలతో విషయ పరిశీలన చేసి చూపారు.పరస్పర విరుద్ధ విషయాలను ఎత్తి ప్రస్తావించారు.మనువు తన ధర్మశాస్త్రంలో పేర్కొన్న అమానుష, క్రూర, ఘోర నియమాలు, నిషిద్ధాలు, అక్రమశిక్షలు, నిచ్చెనమెట్ల సమాజాన్ని బిగించిన తీరు చూపారు. అంటరానితనాన్ని శాస్త్రోక్తంగా సమర్ధిస్తున్న ధర్మాలను అంబేద్కర్‌ చూపారు.ఇవేవీ తెలియనట్లు బీజేపీ నటిస్తోందా? లేక అవన్నీ మరచిపోదాం అంటోందా?
అంబేద్కర్‌ ఆశయాలు అమలు జరగాలంటే,కొన్ని శాస్త్రాల్ని, గీతను,వేదాలను, రామాయణ, మహాభారతంలోని అంశాలను, ధర్మశాస్త్రాల్ని పక్కన బెట్టాలి. పాఠ్య గ్రంథాలలో యీ అంశాలు రాకుండా చూడాలి.అంటరానితనాన్ని పాటించే ఆశ్రమాధి పతుల్ని ఖండించాలి.ఇవి చేయడానికి బీజేపీి సిద్ధపడితే మనం సంతోషించాలి, ఆహ్వానించాలి.అంతేగానీ కేవలం అంబేద్కర్‌ను పొగిడితే అది ఓట్ల వ్యూహంగానే భావించాలి.హిందూమతం ప్రజాస్వామిక విలువలకు చోటు ఇప్పుడు లేదని అంబేద్కర్‌ ఫిలాసఫి ఆఫ్‌ హిందూయిజంలో స్పష్టం చేశాడు. సాంఘిక న్యాయానికి తోడ్పడని హిందూమతాన్ని అమానుషమైనదిగా సహజంగానే అంబేద్కర్‌ నిర్ధారిం చాడు. బీజేపీ వారు అంబేద్కర్‌ తత్వాన్ని, వాదనల్ని ఏ మేరకు అంగీకరిస్తున్నారో,ఎక్కడ ఎందుకు నిరాకరిస్తున్నారో తెలపాలి. అంటరానితనం పోవాలని చిలుకపలుకులు ఉచ్ఛరిస్తే సరిపోదు.అంబేద్కర్‌ ను వాడుకుని ఓట్లు తెచ్చుకుందామనే బీజేపీ ఆలోచనల్ని దేశ ప్రజలు పసిగట్టి తిప్పికొట్టకపోతే నష్టపోయేది ప్రజలే.
నాదెండ్ల శ్రీనివాస్‌
9676407140

]]>
రాజ్యాంగ రక్షణే నేటి తక్షణ కర్తవ్యం https://navatelangana.com/todays-urgent-task-is-to-protect-the-constitution/ Sat, 13 Apr 2024 18:29:44 +0000 https://navatelangana.com/?p=269080 రాజ్యాంగ రక్షణే నేటి తక్షణ కర్తవ్యంస్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్రను నిర్వహించడమే కాక, మనదేశంలో అస్పృశ్యతా నివారణకు, కుల నిర్మూలన, ఛాందస భావాలకు, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం కృషిచేసిన మహావ్యక్తి డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ 133వ జయంతిని దేశం జరుపుకుంటోంది.
కఠోరమైన పరిశ్రమ, నిరంతరమైన పఠనా వ్యాసంగం, అచంచలమైన దీక్ష ఆయనను ప్రపంచంలో ప్రధమశ్రేణిలో నిలబెట్టినాయి. అంబేద్కర్‌ పుస్తకాలకే ఎక్కువ ఖర్చుపెట్టేవారు. ఆయన లండన్‌లో ఒక్క నిమిషము కూడా వృధాకాకుండా చదివేవారు. బ్రిటీష్‌ మ్యూజియంలోని గ్రంథాలే కాక ఇండియా ఆఫీసు గ్రంథాలయం, నగర గ్రంథాలయంలో ఎక్కువసేపు గడిపేవారు. న్యాయశాస్త్రం ఒక్కటే కాకుండా అర్థశాస్త్రంలో యమ్‌.యస్‌.సి. డాక్టరేట్‌ పట్టాకోసం విశేష కృషిని సల్పి రెండేళ్ళ వ్యవధిలో మూడు పట్టాలు సాధించారు. 1921లో లండన్‌ విశ్వవిద్యాలయానికి ‘ప్రొవిన్షియల్‌ డీసెంట్రలైజేషన్‌ ఆఫ్‌ ఇంపీరియల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటీష్‌ ఇండియా’ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించి యమ్‌.యస్‌.సి. పట్టా పొందారు. ‘ప్రోబ్లమ్‌ ఆఫ్‌ ది రూపీ’ అనే వ్యాసం సమర్పించి బి.యస్‌.సి. పట్టా పొందారు. అంబేద్కర్‌ బారిష్టర్‌ వృత్తిలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో బొంబాయి గాంచ్‌ కోర్టులో ఒక కేసు విషయమై ఏడుగంటలు ఏకధాటిగా ఇంగ్లాండ్‌, భారతదేశ న్యాయస్థానాల తీర్పులను ఉదహరిస్తూ వాదించారు. ‘నేషనల్‌ డివిడెండ్‌ ఆఫ్‌ ఇండియా – ఎ హిస్టారికల్‌ అండ్‌ అనలిటికల్‌ స్టడీ’ అనే దానిపై ఆయన రాసిన పరిశోధన వ్యాసానికి కొలంబియా విశ్వవిద్యాలయంవారు డాక్టరేట్‌ ఇచ్చారు.
డాక్టర్‌ అంబేద్కర్‌ తన చిన్నతనంలోనూ, స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనూ అనేక అవమానాలు స్వయంగా అనుభవించారు. ఆ అనుభవాలు ఆయనలో వ్యవస్థ పట్ల ద్వేషాన్ని పెంచాయి. విద్యాభ్యాసం చేసి అమెరికా నుండి తిరిగి వచ్చినప్పటినుండి ఆయన అణగారిన వర్గ ప్రజలలో చైతన్యాన్ని పెంపొందించి, వారిలో బానిస ప్రవృత్తిని నిర్మూలించేందుకు, మానవ హక్కులు, సమానత్వం కోసం వారు పాటుపడేటట్లు నిర్విరామంగా కృషిచేశారు. బహిరంగ చెరువుల్లో నీరుతాగే హక్కుకోసం మహద్‌లో 1927లోనూ, 1930లో నాసిక్‌ దేవాలయ ప్రవేశం కోసం పోరాడేందుకు అస్పృశ్యులనబడే వారిని సమీకరించి పోరాటాలు నిర్వహించారు.
ప్రభుత్వం ఎలా ఉండాలి అనే అంశంపై 1930 నవంబర్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతూ ‘నేడున్న ఆర్థిక, సాంఘీక అసమానతలను తొలగించేందుకు భయపడని ప్రభుత్వం మనకుండాలి. ఆ పాత్రను బ్రిటీష్‌ ప్రభుత్వం ఏమాత్రం పోషించజాలదు. ప్రజలచే, ప్రజలకోసం ఎన్నుకోబడే ప్రజా ప్రభుత్వమే దాన్ని నిర్వహించడం సాధ్యమవుతుంది’ అని స్పష్టం చేశారు. మొత్తం రాజకీయ పరిష్కారంలో భాగంగా దళిత వర్గాల సమస్య కూడా పరిష్కరించబడాలని, వారికి స్థానం ఉండేలా రాజకీయ యంత్రాంగం మారాలని ఆయన చెప్పారు.
1937 సెప్టెంబర్‌లో మసూర్‌లో జరిగిన దళిత మహాసభలో అధ్యక్షోపన్యాసమిస్తూ ‘సాంఘీక, ఆర్థిక సమానత్వం’ అనే లక్ష్యాల ద్వారా మాత్రమే సామాన్య మానవునికి తన అభిమతానుసారం స్వేచ్ఛగా పురోగమించడానికి అవకాశాలు ఏర్పడగలవని, ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది చేతుల్లోనే ఉండి దోపిడీ చేయడానికి వీలున్నంతవరకు సామాన్య మానవుడు అభివృద్ధి చెందడానికి ఏమాత్రం అవకాశం ఉండదని డా|| అంబేద్కర్‌ అన్నారు. 1938లో కొంకణ్‌లో భూస్వామ్య వ్యవస్థ రద్దుకోసం జరిగిన రైతాంగ ప్రదర్శలో పాల్గొన్నారు.
ప్రపంచ చరిత్ర అంతా వర్గ సమాజ చరిత్రే. ఇందుకు ఇండియా మినహాయింపుకాదు. వర్గంలోనే కులం ఇమిడివుందని ఆయన మనదేశంలోని వర్గ వ్యవస్థ గురించి వివరించారు. ‘రాష్ట్రాలు – మైనారిటీలు’ అన్న అంశం మీద రాజ్యాంగం నిర్మాణ సభకు షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌ తరుపున సమర్పించిన డాక్యుమెంట్‌లో డా|| అంబేద్కర్‌ ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాన్ని కోరుకున్నారు. మౌలికమైన కీలక పరిశ్రమలు, ఇన్సూరెన్స్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, సాగుకు అనుకూలమైన భూములకు పరిహారం చెల్లించి, ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పేదరైతులకు, భూమిలేని పేద వ్యవసాయ కార్మికులకు పంచాలన్నారు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలని, మైనారిటీలకు తగు రక్షణ కల్పించాలని కోరారు.
గొప్ప మేధావి, న్యాయశాస్త్రంలో నిష్ణాతుడైన డా|| అంబేద్కర్‌ను స్వాతంత్య్ర భారతదేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా తీసుకున్నారు. హిందూ కోడ్‌ బిల్లు ద్వారా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించేందుకు ఆయన చేసిన కృషికి నెహ్రు ప్రభుత్వం ఆటంకాలు కల్పించడంతో రాజీనామా చేశారు. హిందూ మతంలోని వర్ణ వ్యవస్థ అసమానతలతో, వివక్షలతో కూడి ఉన్నదని, బౌద్ధమతం సమాజాన్ని మానవత్వంతో పునర్‌నిర్మించగలదని, బుద్ధుడు చెప్పిన దు:ఖం అన్నదానిని నిరుపేదరికంతోనూ, దోపిడీతో సమాన అర్థంగా భావించారు. ప్రయివేటు ఆస్తులను రద్దుచేయడం ద్వారా దీనిని నివారించవచ్చని ఆయన భావించారు. అందుకే లక్షలాది మంది తన అనుచరులతో బౌద్ధమతం స్వీకరించారు.
మనం స్వాతంత్య్రం సాధించుకుని 76 సంవత్సరాలు అయినప్పటికీ, నాడు డా|| అంబేద్కర్‌ ఏ వివక్షతకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారో ఆ వివక్షత నేటికీ కొనసాగుతూనే వుంది. జనాభాలో 70 శాతంకి పైగా ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు అనాగరికమైన కుల వివక్షతకు గురవుతూనే ఉన్నారు. అణచివేత, అత్యాచారాలు నిరంతరం సాగుతూనేవున్నాయి. వీరిలో అత్యధికులు వ్యవసాయ కార్మికులు, పేద, సన్నకారు రైతులు, చేతివృత్తుల వారుగా ఉండి ఆర్థిక దోపిడీకి కూడా గురవుతున్నారు. కులపరమైన దోపిడీ వీరి బతుకులను మరింత దుర్భరం చేస్తున్నాయి. ఈ వివక్షతకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం అనేక ఉద్యమాలు సాగుతున్నాయి. వాటిలో భాగస్వాములం కావడం డా|| అంబేద్కర్‌ ఆశయసాధన కృషిలో భాగం కాగలదు. డా|| బిఆర్‌ అంబేద్కర్‌ బోధించినట్లు సామాజిక న్యాయానికి భంగం కలిగిస్తున్న, ప్రజల జీవన ప్రమాణాలను దిగజారుస్తున్న విధానాలను అధ్యయనం చేద్దాం. వీటికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సమీకరిద్దాం. ఉద్యమాలు నిర్వహిద్దాం. అదే ఆయనకు మనమర్పించే నిజమైన నివాళి.
జి. కిషోర్‌ కుమార్‌
9440905501

]]>
విద్యార్థుల ఒత్తిడిని తగ్గించే ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్స్‌ https://navatelangana.com/open-book-exams-to-reduce-student-stress/ Sat, 06 Apr 2024 18:45:27 +0000 https://navatelangana.com/?p=263925 Open Book Exams to reduce student stressసహజంగా పరీక్షలు సమీపిస్తుంటే విద్యార్థుల్లో భయం, ఆందోళన మొదలవుతాయి. ఏడాదిగా చదివిందంతా గుర్తుపెట్టుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొదటి వాక్యం గుర్తుకు రాకపోయినా సమాధానం సరిగా రాయలేరు. రాత్రనక, పగలనక కష్టపడి చదువుకొని పరీక్షహాల్లోకి వెళ్లగానే పరీక్షాపత్రం చూస్తూ ఆత్రుతతో టెన్షన్‌ పడుతూ విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల్లో టెన్షన్‌ తగ్గించి, కంఠస్థం (బట్టి పద్ధతి) చేసే విధానానికి స్వస్తి పలికి, పరీక్షలకు పుస్తకాలను తీసుకుని వెళ్లి, చూసి రాసే అవకాశమిస్తే ఎలా ఉంటుందోనని సీబీఎస్సీ ఆలోచిస్తోంది. ఈ ఆలోచనే ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ చర్చను తెరపైకి తీసుకువచ్చింది.
ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌: పుస్తకాలు చూస్తూ పరీక్షలను రాసే పద్ధతిని ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్స్‌ అంటారు. ఈ పరీక్ష విధానంలో సమాధానం రాసేటప్పుడు విద్యార్థులు వారి పుస్తకాలు, స్టడీనోట్స్‌, గైడ్లు ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తారు.ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌లో విద్యార్థులు ఆమోదింపబడిన స్టడీ మెటీరియల్‌ మాత్రమే అనుమతిస్తే దాన్ని పరిమితి చేయబడిన ఓపెన్‌ బుక్‌ అసెస్మెంట్‌ అని, ఏదైనా సంబంధిత స్టడీ మెటీరియల్‌ ఉపయోగిస్తే అది ఉచిత టైప్‌ ఓపెన్‌ బుక్‌ అసెస్మెంట్‌ అని అంటారు.ఓపెన్‌ బుక్‌ పరీక్షలు ప్రస్తుత పరీక్షలతో పోల్చుకుంటే కఠినంగా ఉంటాయి. ప్రస్తుత పరీక్షా విధానంలో విద్యార్థుల జ్ఞానాన్ని వారి బట్టి పట్టే సామర్థ్యాన్ని మనం పరీక్షిస్తున్నాం. ఓపెన్‌ బుక్‌ పరీక్షల్లో ప్రశ్నలు సాంప్రదాయ పద్ధతిలో వలె నేరుగా ఉండవు పరోక్షంగా విద్యార్థుల అవగాహనా సామర్ధ్యాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. విశ్లేషణ స్థాయినీ అంచనా వేసేలా ఉంటాయి. మూల్యాంకన ప్రక్రియను మార్చడానికి, సమస్యలను సంశ్లేషణ చేయడానికి, విశ్లేషించడానికి విద్యార్థులను సమర్థవంతంగా తయారు చేయడానికి సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి విమర్శనాత్మక ఆలోచనలు ప్రోత్సహించడానికి విద్యార్థుల్లో అవగాహనా సామర్ధ్యాన్ని పెంచడానికి ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ ఉపయోగపడుతుంది.ఈ విధానం సృజనాత్మకతతో కూడి, పుస్తకాలతో విస్తారమైన పరిచయం లేకుండా విద్యార్థులు సమాధానాలు రాయలేరు. ఓపెన్‌బుక్‌ పరీక్షలో వచ్చే ప్రశ్నలు విస్తృత పరిధిని కలిగి ఉంటాయి. పుస్తకం ఆమూలాగ్రం చదివి పరీక్ష రాసేలా ఉండదు. ఆ సబ్జెక్టుకి సంబంధించి అనేక పుస్తకాలతో సంబంధం ఉండేలా విస్తృతస్థాయి ప్రశ్నలు ఈ పరీక్షల్లో అడుగుతారు.
బుక్‌ రీడింగ్‌, ఇంటర్నల్‌ డిబేట్‌లకు బాగా అలవాటు పడి ఉంటే ఈ ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ విద్యార్థులకు సులభమవుతుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే టీచర్లు పాఠాలు బోధించే విధానం గతంతో పోల్చుకుంటే చాలా మారిపోయింది. నూతన భావనలకు అవగాహన కల్పించే బదులుగా ఈ ప్రశ్నకు ఇలా జవాబు రాస్తే ఇన్ని మార్కులు వస్తాయి అనే విధంగా విద్యార్థులకు పాఠ్యాంశ బోధన జరుగుతుంది.ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నూతన భావనలపై లోతైన అవగహన లేకుండా పోతుంది. విశ్లేషించి జవాబు రాసే ఆలోచన విద్యార్థుల్లో లోపిస్తుంది.ఓపెన్‌ బుక్‌ పరీక్షలో ప్రశ్నలు విద్యార్థులను ఆలోచింపజేసేలా ఇండైరెక్ట్‌గా ఉంటాయి. జవాబులు రాసేముందు ప్రశ్నలను అర్థం చేసుకుని భావనలపై అవగాహన లేకుంటే సమాధానాలు రాయలేరు. వారు తెచ్చుకున్న పుస్తకాల్లో స్టడీ మెటీరియల్‌లో ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన సమాచారాన్ని వినియోగించుకొని ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉంటుంది.
ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్స్‌ ఎందుకు?: నూతన జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా మూల్యాంకన పద్ధతిని మార్చడం, ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్ధతిని అన్వేషించడం, విద్యార్థుల ప్రయోజనం కోసం వివిధ రకాల పరీక్షలను అమలు చేయాలని సిఫారసు చేసింది. సీబీఎస్సీ సాధారణ పరీక్షలకు ప్రత్యామ్నాయంగా ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ని అన్వేషిస్తుంది. సీబీఎస్సీ గతేడాది విడుదల చేసిన నేషనల్‌ కరికులం ప్రైమ్‌ వర్క్‌ ఆధారంగా ఈ రకమైన ప్రతిపాదన ను రూపొందించింది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌ వర్క్‌ ప్రస్తుత మూల్యాంకన ప్రక్రియను సంస్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పరీక్షల సంస్కరణలలో భాగంగా ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ విధానాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేసి ఫలితాలను సమీక్షించనుంది సీబీఎస్సీ.
దేశంలో ఓపెన్‌ బుక్‌ పరీక్ష విధానం: 2014లో సీబీఎస్సీ ఓపెన్‌ టెక్స్ట్‌ బేస్డ్‌ అసెస్మెంట్‌ (ఓబిటిఏ)ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా 9, 11 తరగతులలో ఓపెన్‌ బుక్‌ పరీక్షలు నిర్వహించారు. బట్టి పట్టే విధానాన్ని తగ్గించి సమాచార ప్రాసెసింగ్‌ నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకొని అమలు చేసారు. కాని విద్యార్థుల్లో క్రిటికల్‌ థింకింగ్‌ స్కిల్స్‌ పెంచడంలో విపులమయ్యామనే భావనతో 2017-18 విద్యాసంవత్సరంలో దీన్ని నిలిపివేశారు.2019లో ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలలో ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ను అడ్వయిజర్‌ బోర్డ్‌ సిఫారసు చేసిన తర్వాత అనుమతించింది. 2020-21 కరోనా సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఇండోర్‌, ఐఐటి బాంబే, కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థులను మూల్యాంకనం చేయడానికి ఓపెన్‌ బుక్‌ టెస్టులను నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ ప్రయోగం 2021-22లో తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్‌ పరీక్షలకు ఈ విధానం అమలు చేసి సత్ఫలితాలను పొందింది. అప్లైడ్‌ ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌లో పాస్‌ పర్సంటేజ్‌ 24 శాతం పెరిగింది.కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో అంతర్గత మూల్యాంకనం కోసం ఈ ఓపెన్‌ బుక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రయోజనాలు: ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ విద్యార్థులకు ముఖ్యమైన భావనలు, హై ఆర్డర్‌ స్కిల్స్‌, సెల్ఫ్‌ అసెస్మెంట్‌పై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది. క్లిష్టమైన సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. బోర్డ్‌ ఎగ్జామ్‌ ఆధారంగా నడిచే కోచింగ్‌ పరిశ్రమ విస్తరణను నిరోధిస్తుంది. వనరుల నిర్వహణ నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. విద్యార్థుల్లో పరీక్షకు సంబంధించిన ఒత్తిడిని తగ్గిస్తుందని ఆల్‌ ఇండియా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ భువనేశ్వర్‌కు చెందిన వైద్య విద్యార్థులతో జరిపిన అధ్యయనంలో తేలింది. విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. పరీక్షలు స్వేచ్చగా ఎలాంటి ఒత్తిడి లేకుండా రాస్తారు.
సీబీఎస్సీ పైలెట్‌ ప్రాజెక్టు: నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌ వర్క్‌ ప్రకారం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్సీ) 9 నుండి 12వ తరగతి విద్యార్థులకు ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ విధానాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని పరీక్షించనుంది. ఈ పైలట్‌ ప్రాజెక్టులో 9, 10వ తరగతి లకు ఇంగ్లీష్‌, గణితం, సైన్స్‌, 11 తరగతిలకు ఇంగ్లీష్‌, గణితం, జీవశాస్త్రం కోసం ఓపెన్‌ బుక్‌ పరీక్షలు ఉంటాయి.జూన్‌ నాటికి సీబీఎస్సీ పైలట్‌ ప్రాజెక్టు రూపకల్పన, అభివృద్ధి ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సహాయ సహకారాలు తీసుకోవాలని నిర్ణయించింది.నవంబర్‌, డిసెంబర్‌లో ఎంపిక చేసిన బడుల్లో ఈ పైలట్‌ ప్రాజెక్టు ద్వారా ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ నిర్వహించనుంది సీబీఎస్సీ.వచ్చే ఫలితాలను విశ్లేషించి ఈ పరీక్షా విధాన అమలుపై నిర్ణయం తీసుకోనుంది.
ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ అంటే కాపీ కొట్టే విధానం కాదని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలి. పాఠ్యాంశాలలోని భావనలను అవగాహన చేసుకొని లోతైన అధ్యయనం చేస్తేనే ఈ పరీక్షా విధానంలో విద్యార్థులు సరైన జవాబులు రాయగలరు.రాబోయే తరాల భవిష్య త్తును దృష్టిలో పెట్టుకొని, ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా సీబీఎస్సీ పైలట్‌ ప్రాజెక్ట్‌ ఫలితాల ఆధారంగా మరింత అధ్యయనం చేసి ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిన్లాండ్‌, సింగపూర్‌, ఇంగ్లాండ్‌, అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వివిధ పరీక్షల్లో ఈ ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ అమలు చేసి సత్ఫలితాలు పొందుతున్నాయి.

– పాకాల శంకర్‌ గౌడ్‌
9848377734

]]>
‘ఆరోగ్య భారత్‌’ అందని ద్రాక్షేనా? https://navatelangana.com/arogya-bharat-is-not-available/ Sat, 06 Apr 2024 18:43:08 +0000 https://navatelangana.com/?p=263928 Is 'Arogya Bharat' a miracle?ముఖ్యంగా మనదేశంలో వైద్య రంగం దాదాపు ప్రయివేటీకరణ, కార్పోరేట్‌ వ్యక్తుల సంస్థల్లో ఉన్నదనేది వాస్తవం. అధిక ఫీజులు, స్కానింగ్‌, మందులు ఖర్చులు ఎక్కువగా ఉండటంతో పేద మధ్య తరగతి ప్రజలకు పూర్తిగా వైద్యం ఎండమావి వలే ఉన్నది. ముఖ్యంగా మహిళలు పిల్లలు రక్తహీనత, న్యూమోనియా, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా ఈ విషయాలను ధ్రువపరుస్తుంది. ప్రజలకు ఆరోగ్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదే అయినా, మనదేశంలో మాత్రం ఇదో ఓట్లు దండుకునే కార్యక్రమంగా ఉచిత, సంక్షేమ పథకాలు అమల్లో భాగంగా చూడటం బాధాకరం.

1948 ఏప్రిల్‌ 7న ” ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)” ఏర్పడిన రోజునే 1949 నుంచి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రపంచ జనాభా అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో, అనేక వ్యాధులు నిర్మూలనకు కృషి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇటీవల కాలంలో మనందరం చూసిన ‘కరోనా’ విస్ఫోటనం మన ఆరోగ్య వ్యవస్థ ఎలా ఎంతగా దిగజారిందో బట్టబయలు చేసింది. అప్పటినుంచే ప్రపంచ దేశాలు, ప్రజలు ఆరోగ్య సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో నిమగమయ్యాఇయి. అయితే ఇటీవల వెల్లడించిన 2024 గ్లోబల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ సూచికలో సింగపూర్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆఖరి స్థానంలో ఆఫ్రికా దేశమైన లెసోతో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. మనదేశంలో ప్రతీ 10,189 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉన్నాడు. అందుబాటులో ఉన్న వైద్య నివేదికల ప్రకారం..మనదేశంలో 10 లక్షల మంది వైద్యులు రిజిస్టర్‌ కాబడి ఉన్నారు. వీరిలో 58 శాతం పట్టణ/నగర ప్రాంతాలలో సేవలందిస్తుండగా, కేవలం 18.8 శాతం వైద్యులు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. ప్రపంచంలో స్పెయిన్‌, ఇటలీ, ఐస్‌లాండ్‌, జపాన్‌, స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆరోగ్య రంగంలో ముందంజలో ఉంటూ, ఆదేశ ప్రజలకు సురక్షిత ఆరోగ్యం అందిస్తున్నాయి. ఇక మన పొరుగు దేశమైన ‘భూటాన్‌’ తీవ్రంగా వైద్యుల కొరతతో సతమతమవుతోంది. ఈ దేశంలో ప్రతీ ఐదు వేల మందికి ఒక వైద్యుడు ఉండటం ఆందోళన కలిగించే అంశం. జపాన్‌ ప్రజలు మంచి ఆరోగ్యంతో ఫిట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మన భారతదేశంలో అందరికీ ఆరోగ్యం అందని ద్రాక్షవలే ఉన్నది. 142 కోట్ల మందికి అవసరమైన డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రులు అందుబాటులో లేవు. దీనికి ప్రధాన కారణం మనదేశ స్థూల జాతీయోత్పత్తిలో కేవలం ఒక శాతం నిధులు మాత్రమే నేటికీ కేటాయించడం జరుగుతోంది. ఇంత తక్కువ నిధులతో అందరికీ ఆరోగ్యం ఎలా అందిస్తారో… పాలకులకే తెలియాలి. ఈ ఏడాది ” మై హెల్త్‌ – మై రైట్‌” అనే థీమ్‌ తో జరుపుకుంటున్న ఈ ఆరోగ్య దినోత్సవం మనదేశంలో అందరికీ ఈ సౌకర్యం లభిస్తుందా? అనేది బిలియన్‌ డాలర్ల ప్రశ్న..!? కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో వైద్య రంగానికి బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయించి ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ, ప్రజల అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల కూడా కొంత మేరకు ఆరోగ్య సేవలందించటం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ”ఆయుష్మాన్‌ భవ” వంటి కార్యక్రమాలు చేపడుతున్నా, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా నేటికీ మనదేశంలో నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులో లేదు. దీనికి ప్రధాన కారణం పేదరికం, నిరుద్యోగంతో పాటు ప్రభుత్వ విధానాలు. ముఖ్యంగా మనదేశంలో వైద్య రంగం దాదాపు ప్రయివేటీకరణ, కార్పోరేట్‌ వ్యక్తుల సంస్థల్లో ఉన్నదనేది వాస్తవం. అధిక ఫీజులు, స్కానింగ్‌, మందులు ఖర్చులు ఎక్కువగా ఉండటంతో పేద మధ్య తరగతి ప్రజలకు పూర్తిగా వైద్యం ఎండమావి వలే ఉన్నది. ముఖ్యంగా మహిళలు పిల్లలు రక్తహీనత, న్యూమోనియా, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా ఈ విషయాలను ధ్రువపరుస్తుంది. ప్రజలకు ఆరోగ్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదే అయినా, మనదేశంలో మాత్రం ఇదో ఓట్లు దండుకునే కార్యక్రమంగా ఉచిత, సంక్షేమ పథకాలు అమల్లో భాగంగా చూడటం బాధాకరం.
ఇక మనదేశంలో వైద్య విద్య నేటికీ ఖరీదైన చదువుగానే పరిగణించబడుతోంది. ధనికులకు మాత్రమే లభ్యమవుతుంది. దీనికి ప్రధాన కారణం వైద్య కళాశాలలు ఎక్కువగా ప్రయివేటు రంగంలో నెలకొల్పారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య లభించుటలేదు. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో తగినంత బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నాణ్యత గల విద్య అందిపుచ్చుకుని లేకపోవడం జరుగుతుంది. అందుచేతనే అమెరికా, రష్యా, చైనా, ఉక్రెయిన్‌, ఆస్ట్రేలియా వంటి విదేశాలకు విద్యార్థులు వలసపోతున్నారు.అక్కడే చదువుకుని, అక్కడే స్థిరపడుతున్నారు. అక్కడ ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, ప్రభుత్వాల విధానాలు వారిని ఆకర్షించుట చేత అక్కడే వైద్యులుగా స్థిరపడుతున్నారు. ఇక మన భారతదేశంలో అనేక వివక్షతలు వెంటాడుతూనే ఉండుట, రాజకీయ విధానాలు, సౌకర్యాల లేమి వల్ల వైద్యులు, ఇతర సిబ్బంది ఇక్కడ పనిచేయుటకు సుముఖత చూపడం లేదు.
2047 నాటికి వికసిత భారత్‌ అనే లక్ష్యం చేరుకోవాలంటే ముందు అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలి. వైద్య రంగానికి ఇక నుంచైనా బడ్జెట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఎక్కువగా కేటాయించి ఖర్చు చేయాలి. లైబ్రరీలు, లాబొరేటరీస్‌, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని గ్రహించాలి. మగవారితో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో సమభాగం కల్పించాలి. వివక్షతలు లేకుండా చూడాలి. ఇప్పటికే మనదేశంలో ఊబకాయం, డయాబెటిస్‌, థైరాయిడ్‌, మానసిక అనారోగ్యం, వివిధ శారీరక అనారోగ్యాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కల్తీలతో ఆహారం కలుషితమవుతుంది. వాయు కాలుష్యము, పెస్టిసైడ్స్‌ వలన కాలుష్యం మానవుని అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. జంక్‌ ఫుడ్స్‌, ఫ్రైడ్‌ ఐటమ్స్‌ తినుట వలన కూడా యవ్వనంలోనే అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. తస్మాత్‌ జాగ్రత్త. గుండె, ఊపిరి తిత్తులు, మూత్రపిండాల సంబంధించిన వ్యాధులు ప్రబలి తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం వలన కూడా అనారో గ్యాలతో బాధపడుతున్నారు. కనీసం ప్రతీ రోజూ ఒక గంట వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం చేయడం జరగాలి. పరిశుభ్రత పాటించాలి. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. అందరికీ ప్రభుత్వం మంచినీరు సరఫరా చేయాలి. ప్రజలు కూడా ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. ”ఆరోగ్యమే మహాభాగ్యము” అనే భావన అందరిలో కల్పించడమే ఈ దినోత్సవ పరమార్థం.
(నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం)

– ఐ.ప్రసాదరావు 6305682733

]]>
మత్తుకు చిత్తవుతున్న యువత https://navatelangana.com/youth-who-are-addicted-to-drugs/ Sat, 30 Mar 2024 17:02:55 +0000 https://navatelangana.com/?p=259123 మత్తుకు చిత్తవుతున్న యువతఉడుకు రక్తం, ఉక్కు నరాలతో ఉరకలెత్తే యువతరమే ఏ దేశానికైనా సహజ వనరులను మించిన బలమైన సంపద. యువత ఆరోగ్యంగా, పటిష్టంగా సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు ఆ దేశం అభివృద్ధి సాధించడం చాలా సులభం.మన దేశముతో పాటు ప్రపంచంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలను తీసుకుంటే ఎక్కడైనా యువతరానిదే కీలకపాత్ర. అధిక శాతం మంది యువ జనాభాతో ప్రపంచంలోనే నవ యువదేశంగా కీర్తించబడుతున్న మనదేశం ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉంది. అయితే అద్భుతాలను సృష్టించాల్సిన ఈ యువశక్తి ఇప్పుడు ”మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల” బారిన పడి నిర్వీర్యంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.ముఖ్యంగా విద్యార్థి దశలో చెడు వ్యసనాల బారిన పడి, యువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విచ్చలవిడిగా దొరుకుతున్న డ్రగ్స్‌, పెరిగిపోతున్న ”మద్యం” అలవాటు, వారి జీవిత గమ్యాన్ని పతనం వైపు నడిపిస్తున్నాయి.ఈ మధ్య హై స్కూల్‌ స్థాయి విద్యార్థులు కూడా ”గంజాయికి” అలవాటు పడ్డారని వార్తను చూస్తే భావిభారత పౌరులుగా ఎదగాల్సిన యువతరం ఎటువైపు వెళుతుందో తెలియని పరిస్థితి ఉంది.
మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఇప్పుడు అందరినీ కలవరపరిచే విషయం ”డ్రగ్స్‌”. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే వీటికి అధిక శాతం మంది ”విద్యార్థులు” బానిసలుగా మారడటం. సరదాగా స్నేహితులతో మొదలు పెట్టిన ఈ అలవాటు చివరకు వారిని బానిసలుగా మార్చి,పరువు ప్రతిష్టలను తీసి అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోయే పరిస్థితికి తీసుకువస్తుంది.విద్యార్థులకు యువకులకు డ్రగ్స్‌ను మొదట తక్కువధరలో ఇచ్చి, అలవాటు అయిన తర్వాత ఎక్కువ ధరలకు అమ్మడంతో వాటిని కొనే స్తోమత లేక దొంగతనాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించి కటకటాల పాలైపోతున్నారు కొందరు యువకులు. కొన్నేళ్ల క్రితం వరకూ హైదరాబాద్‌ లాంటి పట్టణాలలో మరియు కొన్ని విశ్వ విద్యాలయాలకు మాత్రమే పరిమితమైన డ్రగ్స్‌ భూతం ఇప్పుడు శరవేగంగా విస్తరించి పట్నం నుండి పల్లెలకు విస్తరించింది. ధనవంతులు, గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉన్నవారికి, విశ్వవిద్యాలయాల్లో కొంతమందికి పరిమితమైన ఈ డ్రగ్‌ సంస్కృతి, గ్రామాల్లోకి,పాఠశాల విద్యార్థుల వరకు రావడమే అందరికీ ఆందోళన కలిగిస్తోంది.ఈ మధ్య గ్రామాల్లో కొందరు విద్యార్థులు గంజాయి తాగుతూ, అమ్ముతూ పోలీసులకు చిక్కడంతో డ్రగ్స్‌ వినియోగంతో పాటు గంజాయి వాడకమూ అధికంగా పెరిగిందనే అసలు విషయం బయటపడింది.
కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులకు డ్రగ్స్‌ అలవాటు చేయిస్తున్నారని, ఇటువంటి వాళ్ల వలలో చిక్కుకోకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలనీ తల్లిదండ్రులు కూడా ఎప్పడికప్పుడు పిల్లలను గమనిస్తూ ఉండడం వల్ల కొంతవరకైనా అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు. ఒక విద్యార్థి ఇంటి నుంచి బయటకెళ్లిన దగ్గర్నుంచి స్కూల్లో అతనేం చేస్తున్నాడు? స్నేహితులు ఎలాంటివారు? బయటేం చేస్తున్నాడు? ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు అప్పుడప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పిల్లలపై నమ్మకం ఉంచడం ముఖ్యమే కానీ, పూర్తిగా పర్యవేక్షణ లేకుండా ఉండటం మంచిది కాదనీ ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు ఇద్దరూ వారిపనుల్లో బిజీ అయిపోయి పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల, ఇలాంటి అలవాట్లు చేసుకొని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పిల్లలకు కష్టాలు తెలువకుడదని అడిగిన వెంటనే, బైక్‌, పాకెట్‌మనీ ఇవ్వడం వల్ల విలాసవంతమైన లైఫ్‌ స్టైల్‌కు అలవాటు పడి, చాలామంది విద్యార్థులు మరింత ఆనందం కోసం డ్రగ్స్‌, మద్యపానం, గంజాయి వంటి వాటికి బానిసలుగా మారుతున్నారు.వీటికి బానిసలుగా మారి, విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకుని జీవచ్ఛవాలుగా మారుతున్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు, యువకులు, తల్లిదండ్రులు ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మద్యపానం, డ్రగ్స్‌ అనేవి జీవితాన్ని నాశనం చేసే విషయాలని వాటి జోలికి వెళ్లకుండా స్వీయనియంత్రణతో ఉండాలని తెలియచేయాలి.అదే విధంగా స్నేహితులే వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారని విద్యార్థులు గుర్తించి వ్యసనాలు, చెడు అలవాట్లు ఉన్న స్నేహితుల్ని వీలైనంత దూరంగా ఉంచడం వల్ల కొంతైనా తగ్గించవచ్చు.డ్రగ్స్‌ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకర వ్యసనంగా మారింది.దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత యువత, విద్యార్థులపై ఉంది.ఒక్క చిన్న తప్పు అందమైన జీవితాన్ని నాశనం చెయ్యకుండా ఉండాలంటే ”గంజాయి, డ్రగ్స్‌, మద్యపానం” వంటి వాటిని దగ్గరకు రానియ్యకుండా ఉండి జీవితాంతం ఆనందంగా ఉండి దేశాభివృద్ధికి సహకరిస్తారని ఆశిద్దాం.
గడప రఘుపతిరావు 9963499282

]]>
‘అసమానతల’ ప్రపంచం! https://navatelangana.com/a-world-of-odds/ Sat, 30 Mar 2024 17:01:19 +0000 https://navatelangana.com/?p=259120 'అసమానతల' ప్రపంచం!‘పుర్రెకో బుద్ది..జిహ్వకో రుచి’ అనే నానుడి అందరికీ తెలిసిందే. కార్పొరేట్‌ దోపిడీ పెరుగుతున్నకొద్దీ ప్రపంచంలో మరిన్ని అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇప్పటికే అనేక వింతలు, విశేషాలు ఎప్పటికప్పుడు వార్తలు, టీవీల్లో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. కొంతమంది ఔత్సాహికులు వారికి నచ్చినవాటిపై వీడియోలు చేసిమరీ ‘నెట్టింట’ పెడుతున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఖరీదైన కార్లలో తిరుగుతూ, విలాసవంతమైన భవనాల్లో సేదతీరుతూ చెమట వాసన కూడా తెలియని లగ్జరీ పీపుల్స్‌కు మాత్రమే.
నదీ తీరాన, సముద్రంపై షిప్‌ల మీద, విలాసవంతమైన రెస్టారెంట్లలో, ఇష్టమైన పర్యాటక ప్రాంతాల్లో ఇలా వినూత్నంగా డిన్నర్‌ ప్లాన్స్‌ వేసుకొని చాలామంది ఎంజారు చేస్తుంటారు. అదే అంతరిక్షంలో అయితే ఇంకెలా ఉంటుంది? సరదాగా భూమి నుండి లక్ష అడుగుల దూరంలోకి అంతరిక్షంలోకి జర్నీ చేస్తే ఇటు సూర్యోదయం..అటు సూర్యాస్తమయాన్ని చూస్తూ గాల్లో తేలుతూ మంచి రుచికరమైన డిన్నర్‌ చేస్తుంటే..! ఆహా.. ఓహో ఆ ఊహే అద్భుతంగా ఉందికదూ. ఈ కొంగొత్త ఆలోచనతో ఓ వ్యాపారవేత్త అంతరిక్షంలో డిన్నర్‌ ప్లాన్‌ చేశాడట! బెలూన్‌ ద్వారా నిర్వహించే ఈ ట్రిప్‌కు స్పేస్‌ వీఐపీ అనే సంస్థ రూపకల్పన చేసింది. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటన కోసం కంపెనీ ఇప్పటికే ప్రముఖ డానిష్‌ షెఫ్‌ను (పాకశాస్త్రనిపుణుడు) రంగంలోకి దింపింది. ప్రపంచంలో ఐదో అత్యద్భుత రెస్టారెంట్‌గా పేరుగాంచిన ప్రముఖ డానిష్‌ రెస్టారెంట్‌లో ఆయన షెఫ్‌గా ఉన్నారు. హైటెక్‌ స్పేస్‌ బెలూన్‌లో అతిథులకు షెఫ్‌ స్వయంగా ఆహారాన్ని వడ్డిస్తారట..!
ఈ ట్రిప్‌లో భాగంగా పర్యాటకులు లక్ష అడుగుల ఎత్తున అంతరిక్షంలోకి బెలూన్‌లో వెళతారు. సూర్యోదయ, సూర్యాస్తమయాల్ని ఆస్వాదిస్తూ డిన్నర్‌ని ఎంజారు చేస్తారు. అంతరిక్ష పర్యాటకం ఊపందుకుంటున్న తరుణంలో ఈ కొత్త ఆలోచనతో చేసిన బిజినెస్‌ స్టార్టింగే మాంచి ఊపందుకుంది. ‘ముందు మాకు రిజిస్ట్రేషన్‌ చేయండి.. మాకు రిజిస్ట్రేషన్‌ చేయండి’ అంటూ జనాలు కూడా ఎగబడుతుండటం ఇక్కడ విశేషం. మొత్తం ఆరుగురు.. ప్రత్యేక క్యాప్సూల్‌లో సిట్టింగ్‌ అవకాశం కల్పించే ఈ బెలూన్‌ అంతరిక్ష పర్యటనకు ఒక్కోటిక్కెట్‌ ధర సుమారు ఐదు లక్షల డాలర్లుగా (సుమారు రూ.4.14 కోట్లు) ఉండొచ్చని తెలుస్తోంది. ధర ఇంత భారీగా ఉన్నా ఔత్సాహిక పర్యాటకులు మాత్రం వెనక్కు తగ్గడంలేదు. ఇండియా నుంచి కూడా చాలామంది దీని గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట! ట్రిప్‌ గురించి ప్రకటించిన 24 గంటలలోపే చాలామంది తమ పేర్లు రిజిస్టర్‌ చేసుకుంటామంటూ ముందుకొస్తున్నారట.
ఇదంతా ఒక విధంగా అభివృద్ధి అవుతున్న ప్రపంచంగా మనకు కనిపిస్తుంది. ఇంకా మన ఇండియా లాంటి దేశమైతే ఏదైనా సాధిస్తే మాటల్లోనే చెప్పలేం. అంతరిక్షంలోకి వ్యోమనౌకను పంపి విజయవంతమయ్యాం. దీని గురించి మారుమూల ప్రాంతంలోని సామాన్య జనానికి పూర్తిగా తెలియకపోయినా..ఏదో సాధించామనే ఒక భావోద్వేగం వారి రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. చాతీ ఆరంగుళాలు ముందుకు పెరిగిందనడంలో ఆశ్చర్యం లేదు. ‘సాధించాం..రా.’ అనే ఫీలింగ్‌ మనసులో బలంగా నాటుకుంది. ఇదంతా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో మన శాస్త్రవేత్తలు చేసిన కృషి. కాదనలేం..అభినందించాల్సిందే. దీని ఫలాలు ఎప్పుడో ఏదోరూపంలో భవిష్యత్తు తరానికి చెందుతాయనేది ఆశాభావం. అయితే ఇక్కడ చెప్పాల్సిన అంశమేమిటంటే అంతరిక్షంలోకి పంపిన రాకెట్‌తో అనేక పరిశోధనలకు ప్రయోజనం. కానీ అంతరిక్షంలో చేసే డిన్నర్‌తో ఏం ఉపయోగమనేది ప్రశ్న?
ఇక్కడ లోతుగా చూడాల్సింది పేద, ధనిక మధ్య తారతమ్యాలు. ధనవంతులు, బాగా బలిసినోళ్లు ఏం చేసినా అది వైరల్‌గానే మారుతుంది. తాజాగా అంతరిక్షంలో డిన్నర్‌కు చేసే ప్లానింగ్‌ కూడా అలాంటిదే. ఇటీవల భారతదేశ దిగ్గజ వ్యాపార వేత్త అయిన అనిల్‌ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ మ్యారెజ్‌ రిసెప్షన్‌ ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో తెలిసిందే. ఆ కార్యక్రమానికి అయిన ఖర్చు వేల కోట్ల రూపాయలు. అందులో వంట చేసినోడికి ఇచ్చిన పారితోషికంతో పేద కుటుంబం ఏడాది హాయిగా గడపొచ్చు. మన మధ్యతరగతి జనాలు పార్కుల్లో ఆనందంగా గడుపుతారు. ఇంకొంతమంది జలపాతాల్లో విహరిస్తారు. మరికొందరు సాగరతీరాన సరదాగా గడపుతారు. ఎక్కువమంది ట్రెయిన్‌లలో ప్రయాణిస్తారు. కుటుంబాలతో షికారుకెళ్తారు. దీని ద్వారా మానసికోల్లాసమే కాకుండా ట్రిప్పులకు ఉపయోగించే కార్ల ద్వారా డ్రైవర్లకు లేదా బోటుషికారులు చేస్తే దాని నిర్వాహకులకు, మనం విహారయాత్రకు కాలు బయటపెడితే చాలు.. ఏదో రూపాన కొన్ని కుటుంబాలు జీవనోపాధి పొందుతాయి. మరీ పేదరికంలో ఉండి ఈ కాస్త ఆనందాన్ని కూడా పొందలేని వారు శ్రమలోనే దాన్ని ఆస్వాదిస్తారు. కూలి పనులు, వ్యవసాయ పనులు చేసేటప్పుడు పాడే పాటల ద్వారా ఆనందం పొందుతారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.
సముద్ర తీరాన ఏర్పాటుచేసిన రెస్టారెంట్లలో కడుపునిండా తినొచ్చు, రుచులను ఆస్వాదించొచ్చు. ఆకాశంలో విహరిస్తూ చేసే విన్యాసాల గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. ఎత్తయిన పర్వతాలపై పడుకునేందుకు ఏర్పాటు చేసిన గదుల్లో హాయిగా నిద్రపోవచ్చు. కానీ అతికొద్ది ధనవంతులు మాత్రమే ఉపయోగించుకునే ఇలాంటి వాటివల్ల నాగరికత అభివృద్ధి చెందుతుందంటే ఏకిభవించలేము. సగం కాలిన కడుపుతో బతుకున్న ప్రజలు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనదేశంలోనైతే ముడొంతుల్లో ఒక వంతు జనాభా అలాగే ఉంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైంది. దీనికి పాలకుల సహకారం కూడా అదేస్థాయిలో ఉంది. దేశం నుంచి దోచుకుపోయిన వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో విదేశాల్లో, ఇలాంటి ఖరీదైన పర్యటనలతో ప్రశాంతంగా గడుపుతున్నవారు అనేకమంది ఉన్నారు.వారి గురించి మాట్లాడటం ఇప్పుడు దేశమున్న పరిస్థితుల్లో చాలా అవసరం.కానీ మనమది చేస్తున్నామా?
మన దేశంలోనిదే మణిపూర్‌ ఒక చిన్న రాష్ట్రం. జాతివైషమ్యాలతో ఏడాదికిపైగా మండుతోంది. ఎంతోమంది దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఆడపిల్లల్ని నడిరోడ్డుపై నగంగా నడిపించి మరీ హత్య చేశారు. ఆదుకునేందుకు, అడ్డుకునేందుకు ఏ ఒక్కరూ రాలేదు. కనీసం పరామర్శకు కూడా ఆ కుటుంబాలు నోచుకోలేదు. చాలా కుటుంబాలు హత్యకు గురయ్యాయి. చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. ఇంతటి దారుణమైన పరిస్థితి అక్కడుంటే ధైర్యం చెపాల్సిన మన ప్రధాని దేశ, విదేశాల్లో పర్యటిస్తారు. ఇంకా చెప్పాలంటే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చూస్తారు. కాశ్మీర్‌ వెళ్తారు, లడక్‌లో ప్రయాణిస్తారు. లక్షద్వీప్‌లో సేదతీరుతారు. కానీ మణిపూర్‌ బాధితుల్ని పరామర్శించేందుకు ఆయనకు ఒక్క పూట కూడా సమయం దొరకదు! ఇది మన దేశప్రజలు చేసుకున్న దౌర్భగ్యం. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఢిల్లీ నడిరోడ్డుపై మద్దతు ధరకోసం రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు ఈ విషయం కూడా తెలియదు తమ కోసమే పోరాడుతున్నారన్న సంగతి. ఇలాంటివాటి గురించి ఎవరికీ బాధలేదు. కనీసం చర్చ కూడా పెట్టరు. కానీ కార్పొరేట్‌ మాయజాలంతో ఆకట్టుకునే అంతరిక్షాల్లో డిన్నర్‌లు, విమానాల్లో విందుల గురించి బాగా సెర్చ్‌చేస్తారు. పర్యటనలకు అడ్వాన్స్‌ బుకింగ్‌లు కూడా చేసు కుంటారు. ఇది మన పాలకులు చెబుతున్న అభివృద్ధి. ఇదేనా దేశం వెలుగుతున్న తీరు! ఇది మారాలి. మనకు రోజు ఎంతోమంది తారసపడుతుంటారు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. చుట్టుపక్కల వారు, మన స్నేహితులు, వారి బాధలు, సమస్యలు ఏకరువు పెడుతుంటారు. కానీ ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో మనమెక్కడున్నాం? పేదరికం, నిరుద్యోగం పెరగడానికి కారణమెవరు? పేద,ధనిక మధ్య పెరుగుతున్న అంతరాలు ఇంకెంతకాలం? వీటి గురించి ప్రధానంగా చర్చించాలి. సగటు మనిషి ఆవేదన తీర్చేందుకు తోటిమనిషి ఉన్నారన్న ధైర్యమివ్వాలి. ప్రపంచంలో ఏమూలన సమస్య ఉన్నా తమదిగా భావించాలి. అలా కృషిచేస్తూ పోరాడే ప్రగతిశీల ఉద్యమాలకు, అభ్యుదయ శక్తులకు తోడుగా నిలవాలి. అప్పుడే ఈ అసమానతల ప్రపంచాన్ని అర్థం చేసుకోగలం.
ఎన్‌ అజయ్ కుమార్‌
9441122809

]]>