Warangal Archives - https://navatelangana.com/category/warangal/ Thu, 17 Apr 2025 14:12:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Warangal Archives - https://navatelangana.com/category/warangal/ 32 32 పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి సన్మానం.. https://navatelangana.com/help-the-retired-teacher/ Thu, 17 Apr 2025 14:12:32 +0000 https://navatelangana.com/?p=548309
నవతెలంగాణ – తాడ్వాయి
పదవి విరమణ పొందిన భూపతిపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కొర్నెబెల్లి భూపాల్ సార్ ను గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా వీడ్కోలు తెలిపారు. మండలకేంద్రంలోని కామారం (పిటి) గ్రామంలో ఆయన నివాసంలో పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఏటిడిఓ క్షేత్రయ్య, మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు, మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు భూపాల్ సార్ కు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరవలేనిదని తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు భూపాల్ సార్ ఏజెన్సీలో నీ పాఠశాలలో చాలాకాలం పనిచేసి విద్యార్థులకు సేవలందించారని అన్నారు. అంకితభావంతో పనిచేసి విద్యార్థుల, పాఠశాల ప్రగతికి కృషి చేసిన ఉపాధ్యాయులను సన్మానించడం ఆనందంగా ఉందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు పదవీ విరమణ పొంది వెళ్లడం బాధగా ఉన్నప్పటికీ ఉద్యోగ నిర్వహణలో తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,  విద్యార్థులు, బంధుమిత్రులు గ్రామ పెద్దలు ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
]]>
ఉన్నత విద్యను అందించేందుకు డిసిసిబి బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలి  https://navatelangana.com/use-dccb-bank-services-to-provide-higher-education/ Thu, 17 Apr 2025 13:54:18 +0000 https://navatelangana.com/?p=548290
నవతెలంగాణ – ధర్మసాగర్
రైతుల పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 30 లక్షల వరకు ఎడ్యుకేషన్ లో లను అందించేందుకు డిసిసిబి బ్యాంక్ సేవలను అందిస్తుందని డిసిసిబి చైర్మన్ మార్నిని రవీందర్రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఏసీఎస్ అధ్యక్షులు గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, విశిష్ట అతిధులుగా ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ రైతు భరోసా భూభారతి కార్యక్రమాలతో రైతు సంక్షేమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహా సహకారాలు అందిస్తున్నారని అన్నారు. దీంతోపాటుగా రైతుల పిల్లలను విదేశాలలో చదువుకునేందుకు ఉన్నత విద్య కోసం 30 లక్షల రూపాయల వరకు విద్యాలోనూ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటివరకు 350 మందిని రైతు బిడ్డలను ఎలాంటి పూచికత్తు లేకుండా వ్యవసాయ చేసే రైతు బిడ్డలకు వారి భరోసా కోసం డిసిసిబి బ్యాంకు సేవలను అందిస్తుందని అన్నారు. ఈ సేవలను రైతు సోదరులు అందరు వినియోగించుకొని ఉన్నతంగా ఎదగాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పిడి శ్రీనివాస్, ఎంపీడీవో అనిల్ కుమార్, ఉపతహసిల్దార్ ప్రవీణ్ కుమార్, పెనుమాముల మార్కెట్ డైరెక్టర్ బొడ్డు ప్రదీప్ కుమార్, పిసిఎస్ డైరెక్టర్ బోర్డు లెనిన్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మహిళా మండలి అధ్యక్షురాలు మొట్టే యామిని, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
]]>
కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం.. https://navatelangana.com/leprosy/ Thu, 17 Apr 2025 13:51:37 +0000 https://navatelangana.com/?p=548302
నవతెలంగాణ – తాడ్వాయి 
కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కొరకు ప్రతీ గ్రామంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటి,ఇంటి కి తిరిగి అందరినీ పరీక్షించి శరీరం మీద స్పర్శ లేని, రాగి రంగు లేక లేత గోధుమ రంగు మచ్చలు గుర్తించి వారి పేర్లు నమోదు చేస్తున్నారని డిపిఎంఓ సంజీవరావు తెలిపారు. ఇందులో భాగంగా మంగపేట, కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గురువారం ముమ్మరంగా లెప్రసీ పరీక్షలు నిర్వహించారు. గుడిసెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు పి.బి కేసులను, మంగపేట పీహెచ్సీ పరిధిలో రెండు పీవీకేసులను గుర్తించారు. ఈ సందర్భంగా డిపిఎం ఓ సంజీవరావు మాట్లాడుతూ కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించాలన్నారు. కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, చెవులు, వీపు ఎదపై నొప్పిలేని బొడిపెలు కనుబొమ్మలు రెప్పల వెంట్రుకలు రాలిపోవడంతో కనురెప్పలు మూతపడకపోవడంతో ముక్కు దిబ్బెడ ముక్కు నుంచి రక్తం రావడం కాళ్ళు చేతులు తిమ్మిర్లు అరికాలు అరిచేతులు స్పర్శ కోల్పోవడం చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించకపోవడం చేతుల నుంచి వస్తువులు జారిపోవడం చేతులు కాలివేలు వంకలు ద్రవం వంటి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
]]>
ఇమ్మడిగూడెంలో గుడుంబా పట్టివేత https://navatelangana.com/gudumba-in-immadigudem/ Thu, 17 Apr 2025 13:21:16 +0000 https://navatelangana.com/?p=548266
– తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి 
నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో గల ఇమ్మడిగూడెం తండా లో గురువారం 20 లీటర్ల గుడుంబా అను పోలీసులు పట్టుకున్నారు. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పైన తెలిపిన వివరాల ప్రకారం ఇమ్మడిగూడెం తండాలో నాటు సారా కాస్తు అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించి గ్రామానికి చెందిన వారి వద్ద 20 లీటర్ల నాటు సారా, 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నిషేధిత గుడుంబా, గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.ఈ దాడుల్లో పూజారి రమేష్, సాంబయ్య, స్వప్న, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
]]>
భూ భారతితో సమస్యల పరిష్కారం.. https://navatelangana.com/the-solution-of-problems-with-land-bharti/ Thu, 17 Apr 2025 12:59:33 +0000 https://navatelangana.com/?p=548224
– జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ 
– తాడ్వాయి లో అవగాహన సదస్సు
నవతెలంగాణ – తాడ్వాయి 
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన “భూ భారతి” చట్టం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఎంతో దోహదపడుతుందని, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో “భూ భారతి” చట్టం పై అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు ఒక్కొక్క సెక్షన్, అంశాల వారీగా వివరించారు. రైతుల వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ఈ చట్టాన్ని తయారు చేశామన్నారు. గతానికి భిన్నంగా టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ విభేదాలు లేని భూ రికార్డులను తయారు చేసే విధంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి భూకమతానికి అక్షాంశాలు రేఖాంశాలతో సరిహద్దుల మ్యాపులు రానున్నాయన్నారు. 14 ఏళ్ల తర్వాత ప్రజల అభిప్రాయాలు స్వీకరించి చేర్పులు మార్పుల ద్వారా ఆర్ఓఆర్ చట్టాన్ని తయారు చేసినట్లు గుర్తు చేశారు. భూమి ఉన్న ప్రతి రైతుకు ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందన్నారు. అలాగే అధికారులను కూడా పికేంద్రీకరించాలని చట్టంలో స్పష్టం చేసినట్లు తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటుందన్నారు. ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ, భూ హక్కుల పరిరక్షణ, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలు ఎలా సులభతరం అవుతాయో వివరించారు. రైతులు ఈ చట్టం ద్వారా పొందగల ప్రయోజనాలను వివరించారు. ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని భూ హక్కుల పరిరక్షణకు ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు రైతులు తమ భూములపై పూర్తి హక్కులను పొందేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని వివరించారు.
]]>
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం… https://navatelangana.com/the-welfare-of-the-farmer-is-the-governments-mission/ Thu, 17 Apr 2025 10:04:50 +0000 https://navatelangana.com/?p=548076
– రైతులను రాజు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం
నవతెలంగాణ-ధర్మసాగర్
 రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే చిట్ట చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 500బోనస్ అందిస్తున్నట్లు గుర్తుకు చేశారు. రైతులకు ఎరువులు,విత్తనాలు,ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా,500బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు.అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కోని మళ్ళీ మనకే సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం మే  రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు. . మొరిగే కుక్కలు ఎప్పటికీ మొరుగుతూనే ఉంటాయని వాటి నోర్లు ముయించే సమయం దగ్గర్లోనే ఉందని అన్నారు. అనంతరం డిసిసిబి చైర్మన్ మారినేని రవీందర్రావు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని, కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. తేమ 17శాతం ఉండాలని, బస్తా 41కేజీలు మాత్రమే తూకం వేయాలని ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని, దళారుల వద్దకు వెళ్లి నష్టపోవద్దని సూచించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిడిద్దడమే ఎమ్మెల్యే కడియం శ్రీహరి లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనని అందరూ ఆశీర్వదించాలని సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ బొడ్డు ప్రదీప్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, మహిళా సంఘాలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
]]>
దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్  https://navatelangana.com/congress-brought-independence-to-the-country/ Thu, 17 Apr 2025 08:57:17 +0000 https://navatelangana.com/?p=548001
– తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ 
నవతెలంగాణ-గోవిందరావుపేట 
భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నూతన రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని మండల ఇన్చార్జిలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కళ్యాణి అన్నారు.
గురువారం మండలంలోని సోమలగడ్డ, కోటగడ్డ, పాపయ్యపల్లి మరియు రాంనగర్ గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్  కార్యక్రమాలను ఆయన గ్రామ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ ల ఆధ్వర్యంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా మండల ఇంచార్జీలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి మరియు ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కళ్యాణి హాజరై మాట్లాడారు. ముందుగా గాంధీజీ మరియు అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి, వారు చేసిన త్యాగాల వలనే మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది అని, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించిందని, వారి విధానాలతో దేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బైరెడ్డి భగవాన్ రెడ్డి మరియు రేగ కళ్యాణి  మాట్లాడుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని,  కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించి, భారత మాత నుదుటిన తిలకం దిద్దిన పోరాట వీరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని, కాంగ్రెస్ పార్టీ కేవలం దేశానికి స్వాతంత్ర్యం కోసమే కాంగ్రెస్ పార్టీ సమూహం ఏర్పడిందని అన్నారు. అలాగే బాపు గాంధీజీ గారు భారత దేశానికి స్వాతంత్ర్యం కోసం అహింస అనే ఆయుధాన్ని ఎంచుకొని పోరాటం చేసి స్వాతంత్ర్యం వచ్చేదాకా పోరాటం చేశాడని, అలాగే స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశానికి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిపి, అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని,  రాజ్యంగా బాధ్యతల తో అతి పెద్ద రాజ్యంగాన్ని నిర్మించే స్వేచ్చను కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 1950 జనవరి 26 నుండి భారత దేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చింది అని అన్నారు. భారత దేశాన్ని సర్వ సత్తాక, సార్వబౌమధికార, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాం అని, అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ భారతదేశం రాజ్యాంగం యొక్క హక్కు అని అన్నారు. అలాగే తల్లి సోనియమ్మ తెలంగాణ ప్రజల ఆకాంక్ష  వలన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని, అప్పటినుండి దొరల పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పులకోబిలోకి వెళ్ళిందని, రాష్ట్రంలో ఉద్యాగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య పరిగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 58000 ఉద్యగాలు ఇచ్చి యువతకు భవిష్యత్తు కల్పించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రతి పథకం పేదల అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ, భూమి ఉన్న వారికి రైతు భరోసా ద్వారా 12000 రూపాయలు పెట్టుబడి సాయం, అలాగే భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా, పేదలకు రేషన్ కార్డులు పంపిణీ, రాజీవ్ యువ వికాసం ద్వారా 5 లక్షల యువతకు బ్యాంకులతో కలిసి సబ్సిడీ రుణాలు, ప్రతి నియోజకవర్గానికి 3500  ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం అని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ అత్యున్నత పథకాలతో పేదల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తుంది అన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు కడుపునిండా భోజనం పెట్టడమే లక్ష్యంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టినం అని అన్నారు. అలాగే ఇటీవల వచ్చిన అకాల వడగండ్ల వర్షం వలన నష్టపోయిన రైతులకు కూడా నష్ట పరిహారం అందిస్తాం అని, రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులందరికీ అండగా సీతక్క  ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్మిక శాఖా జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి సూదిరెడ్డి జనార్ధన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్, జంపాల ప్రభాకర్, పెండెం శ్రీకాంత్, మద్దాల నాగమణి, భూక్య రాజు, జంపాల్ చంద్రశేఖర్, చిక్కుల్ల వెంకటేష్, పడిదల సాంబయ్య, సూదిరెడ్డి జయమ్మ, ఎండి.మాజిత, కొమ్మరాజు నాగమణి, చొప్పదండి వసంత, గోపిదాసు వజ్రమ్మ, ల్యాగల అనిత, గుర్రం రవళి, మిరియాల సోమలక్ష్మి గార్లతో పాటుగా గోవిందరావుపేట మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
]]>
వాటర్ ప్లాoట్ నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలి..! https://navatelangana.com/should-allocate-space-for-the-construction-of-water-plano/ Thu, 17 Apr 2025 07:51:32 +0000 https://navatelangana.com/?p=547972
– తహశీల్దార్ కు భూ నిర్వాసితుల హక్కుల సాధన కమిటీ వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రజలకు స్వచ్ఛత, సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆర్ఓఆర్ ప్లాoట్ షెడ్డు నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని మండల తహశీల్దార్ రవికుమార్ కు గురువారం తహశీల్దార్ కార్యాలయంలో తాడిచెర్ల,కాపురం గ్రామాల జెన్కో భూ నిర్వాసితుల హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేశారపు రవి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఇందుకు మండల తహశీల్దార్ సానుకూలంగా స్పందించినట్లుగా ఆయన పేర్కొన్నారు.ఇటీవల కాపురం ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ హెడ్ ఆపీస్ హైదరాబాద్ లో ఈ నెల 4న కంపెనీ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథ రాజు కు భూ నిర్వాసితుల హక్కుల పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో తాడిచెర్ల ప్రజలకు ఆర్ఓఆర్ ప్లాoట్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలని విన్నవించిన విషయం తెలిసిందే.ఇందుకు రెవెన్యూ శాఖ ద్వారా స్థలాన్ని సేకరిస్తే తాము ప్లాoట్ నిర్మాణం చేస్తామని ఏఎమ్మార్ అధికారులు తెలిపినట్లుగా తెలుస్తోంది.
]]>
తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుర్రాల రవిందర్ https://navatelangana.com/horses-ravinder-as-the-working-president-of-tudundeba-state-2/ Wed, 16 Apr 2025 17:35:25 +0000 https://navatelangana.com/?p=547756 Gurrala Ravinder as the working president of Tudundheb stateనవతెలంగాణ – మల్హర్ రావు:
గత కొన్ని సంవత్సరాల తుడుందెబ్బ ఆదివాసీ సంఘం కార్యకర్త నుండి రాష్ట్రస్థాయి వరకు వివిధ పదవులలో పని చేస్తూ ఆదివాసీ సమాజానికి సేవ చేస్తూ ,జాతిని చైతన్య పరిచే ప్రయత్నంలో నిమగ్నమైన గుర్రాల రవిందర్ ను తుడుండెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లుగా తెలిపారు..ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రవిందర్ మాట్లాడారు ఈనెల 12 నుంచి 14 వరకు కొమురం బీమ విరమరణంపై జొడెన్ ఘాట్ లో నిర్వహించిన మహాసభలలో బుధవారం రాష్ట్ర కమిటీ పున;నిర్మాణంలో భాగంగా ఆదివాసీ ప్రజలు తనపై నమ్మకంత మళ్ళీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్ననందుకు ఆదివాసీ ప్రజలకు కృతజ్ఞతకృతజ్ఞతలు తెలిపినట్లుగా పేర్కొన్నారు. ఆదివాసీ ప్రజ శ్రేయస్సు కోసం నిరంతరం పని చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

]]>
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య.. https://navatelangana.com/a-man-committed-suicide-2/ Wed, 16 Apr 2025 17:32:40 +0000 https://navatelangana.com/?p=547747 Man commits suicide by hanging himself..– ఇద్దరిపై కేసు నమోదు 
నవతెలంగాణ – తాడ్వాయి
ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కాటాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన కంపెల్లి దేవేందర్ (40) గత పది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఆరు రోజుల క్రితం 10వ తారీకు నాడు ఇంటికి వచ్చాడు. మంగళవారం రాత్రి సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో ఇంటి వెనుక ఉన్న ఇంటిలో చీరతో మెడకు ఉరేసుకొని మృతి చెందాడు. కాగా మృతుడి సెల్లులో రామెల్ల ప్రశాంత్, రామెల్ల నరసయ్య లు నా చావుకు కారణమని వాయిస్ రికార్డింగ్ లభించింది. దాని ఆధారంగా కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై వివరించారు. తల్లి కంపెల్లి కన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు
]]>
అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలు సీజ్ https://navatelangana.com/siege-of-illegally-cattle-mothers/ Wed, 16 Apr 2025 15:21:59 +0000 https://navatelangana.com/?p=547709
– తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ -తాడ్వాయి 
ఎలాంటి నిబంధనలు పాటించకుండా అక్రమంగా పశువులను ఐదు బొలెరో గూడ్స్ వాహనంలో తరలిస్తున్న పదిమందిని తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తన పోలీసు బలగాలతో పట్టుకొని వారిపై కేసులు నమోదు చేశారు. ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి కొంతమంది ఎలాంటి నిబంధనలు పాటించకుండా పశువులను బొలెరో వాహనంలో తలుస్తున్నారని నమ్మదగిన సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి తాడ్వాయి 163 జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనకి లో చర్ల ప్రాంతం నుండి ఐదు బొలెరో వాహనాలలో 69 పశువులను అక్రమంగా తరలిస్తున్న పదిమందిని వ్యక్తులను పట్టుకుని ఐదు బులోరి వాహనాలను సీజ్ చేశామని ఎస్సై తెలిపారు. కాగా పట్టుబడిన పదిమందిపై కేసు నమోదు చేసి పశువులను సురక్షిత ప్రాంతమైన గోషాలకు తరలించినట్లు తెలిపారు.
]]>
గవర్నర్ దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలో ఎన్సీఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ https://navatelangana.com/distribution-of-essential-goods-under-the-aegis-of-ncrd-charity-in-kondaparthi-village-adopted-by-governor/ Wed, 16 Apr 2025 14:52:32 +0000 https://navatelangana.com/?p=547702
నవతెలంగాణ -తాడ్వాయి 
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దత్తత తీసుకున్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం  కొండపర్తి గ్రామంలో ఆదివాసి గిరిజనులందరికి ఎన్.సి.ఆర్.డి అనే స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు ఒక నెల సరిపోయే బియ్యం, ఉప్పు, పప్పు, కారం, నూనె, సబ్బులు, దుస్తులు, చీరలు మొదలగు నిత్యవసర సరుకులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో సహాయం అందించినట్లు తెలిపారు. ఆదివాసి గిరిజన గ్రామాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వీరికి తాడ్వాయి కాంగ్రెస్ మండల నాయకులు గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజు, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్, సహకార సంఘం మాజీ చైర్మెన్‌ సాంబయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి, మాజీ సర్పంచ్లు ఇర్ప సునీల్ దొర, ముజఫర్, సింగిల్ విండో డైరెక్టర్లు యానాల సిద్దిరెడ్డి, నాయకులు రాజేందర్, కల్తీ రమేష్,తండాల శ్రీను, నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
]]>