Warangal Archives - https://navatelangana.com/category/warangal/ Wed, 08 May 2024 14:50:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Warangal Archives - https://navatelangana.com/category/warangal/ 32 32 పార్టీని బలోపేతం చేస్తూ గెలుపుకై పనిచేయాలి  https://navatelangana.com/we-should-strengthen-the-party-and-work-for-victory/ Wed, 08 May 2024 14:50:29 +0000 https://navatelangana.com/?p=286355
– పైడాకుల అశోక్ కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు
నవతెలంగాణ-గోవిందరావుపేట
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థి గెలుపుకై కష్టపడి పని చేయాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చినవారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ..ప్రస్తుతం కాంగ్రెస్ పవనాలు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ఉన్నాయని ఇదే అదనుగా పార్టీలో చేరే వళ్లను ఆహ్వానించి పార్టీలు మరింత బలోపేతంగా తయారు చేయాలని అన్నారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు నిర్విరామంగా నిరంతరంగా కృషి చేయాలని సూచించారు. పార్టీ లో చేరిన ప్రముఖులలో టి ఎస్ ఎస్ డైరెక్టర్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి ,ఎర్ర ధనమ్మ అంజి నాయక్ ,సాంబయ్య బత్తుల, లకావత్ సేటియా ,బిక్య, వేణుగోపాల్, అజ్మీర బీఖ్య, తాటికొండ నారాయణ చారి ,చిలకమ్మా ,వీరమ్మ, లక్ష్మి ,రమణ ,భూక్య భద్రు , సోను , వెంకన్న, లక్ష్మణ్, భూక్య లక్ష్మ … వివిధ పార్టీల నుండి 20 మంది నేడు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది.
]]>
అవినీతికి తావులేకుండా పిఏసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు https://navatelangana.com/corruption-free-grain-procurement-under-pacs/ Wed, 08 May 2024 14:47:48 +0000 https://navatelangana.com/?p=286345
– తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ రామారావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో అవినీతికి తావులేకుండా వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని పిఏసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావు తెలిపారు. బుధవారం పిఏసిఎస్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన కార్యనిర్వహణాధికారి సంతోష్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. ఇటీవల మండలంలో ప్రారంభించిన 11 పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాలను ఎవరు ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వకుండా, సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రమే ధాన్యం సేకరించునట్లుగా తెలిపారు.రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.రైతులను తాలు, తరుగు పేరిట ఇబ్బందులకు గురి చేస్తే సిబ్బందిపై  శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.పిఏసిఎస్ కార్యాలయంలో విదులు నిర్వహిస్తున్న సిబ్బంది 6 శాతం వేతనాలు పెంచునట్లుగా,ఇటీవల ఇద్దరు డైరెక్టర్లు సస్పెన్షన్ అయిన విషయాలపై చర్చ కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు,డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య, వొన్న తిరుపతి రావు,సంగ్గెం రమేష్,రాజమ్మ,సమ్మక్క,సురేష్,రాము పాల్గొన్నారు.
]]>
కేసీఆర్ హాయంలో తెలంగాణ రాష్ట్ర ఎంతో అభివృద్ధి చెందింది  https://navatelangana.com/telangana-state-has-developed-a-lot-under-kcr/ Wed, 08 May 2024 14:45:04 +0000 https://navatelangana.com/?p=286337 – బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి 
నవతెలంగాణ నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ హాయంలో తెలంగాణ సమృద్ధిగా అభివృద్ధి చెంది రాష్ట్రంగా ఏర్పాటు అయిందని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పరు పాటిప వెంకటరెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావ్ జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు నల్లని నవీన్ రావు రైతు సమన్వయ సమితి మాజీ చైర్మన్ బాలాజీ నాయక్ అన్నారు మండలంలోని నైనాల నల్లగుట్ట తండా నర్సింహులగడెం ముప్పారం గ్రామాలలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని గురువారం పర్యటింబీచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత గతంలో ఎమ్మెల్యేగా మరియు ఇప్పుడు ఎంపీగా గెలిచి మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో పేద ప్రజలకు ఎంతో సేవ చేసిందని అన్నారు కోట్లాది నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత కవిత ది అని అన్నారు అందుకోసం మళ్లీ పార్లమెంట్ అభ్యర్థిగా  కవిత కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కాసం వెంకటేశ్వర రెడ్డి రమేష్ ఉపేందర్ ఆ పార్టీ మీద గ్రామ శాఖ మండల నాయకులు పాల్గొన్నారు
]]>
చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి https://navatelangana.com/chamala-kiran-kumar-reddy-should-work-hard-for-victory/ Wed, 08 May 2024 14:43:27 +0000 https://navatelangana.com/?p=286334
నవతెలంగాణ_తుర్కపల్లి
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జయం ఫంక్షన్ హాల్లో మండల ముఖ్య నాయకుల తో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల పనులను చేసినట్లు తెలిపారు గంధ మల్ల రిజర్వాయర్ను 1.5 టిఎంసి గా మార్చనున్నట్లు తెలిపారు ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు గడీల పాలన పోయింది ఢిల్లీ పాలన పోవాలని అన్నారు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గాలంటే కేంద్రంలో బిజెపిని ఓడించాలని అన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఎంపీ స్థానాలను గెలిపించి కానుకగా ఇవ్వాలని అన్నారు అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే కు ఎంత మెజారిటీ ఇచ్చారు ఎంపీకి కూడా లక్ష మెజార్టీ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 14 ఎంపీలు గెలుస్తామని అన్నారు.కార్యకర్తలు సైనికులు వాలే పనిచేసి ప్రచారాన్ని ఇంటింటికి నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ శంకర్ నాయక్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి నరసింహులు జిల్లా ఉపాధ్యక్షులు ఏలగల రాజయ్య మండల మహిళా అధ్యక్షురాలు అయినాల చైతన్య మహేందర్రెడ్డి నాయకులు పలువుల శ్రీనివాస్ పూలపల్లి వెంకటేష్ గడ్డమీది నిఖిల్ గౌడ్ బాలు యాదవ్ సుంకరిసెట్టయ్య పాన్గల కిష్టయ్య మారగొని వెంకటేష్ గౌడ్, రాజారాం నాయక్ బొత్త రాములు సోమల వెంకటేష్ పోరెడ్డి మహిపాల్ రెడ్డి బాబు నాయక్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి వెలగల వెంకటేశ్వర్లు ఎరుకల వెంకటేష్ గౌడ్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
]]>
కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం https://navatelangana.com/justice-for-the-poor-people-is-only-with-the-congress-party/ Wed, 08 May 2024 14:41:55 +0000 https://navatelangana.com/?p=286327

– ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్

నవతెలంగాణ – నెల్లికుదురు 
కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నాడు. బుధవారం మండలంలోని రాజులకొత్తపల్లి, రామన్నగూడెం, దుర్గ భవానితండ, వస్రంతండ, మునిగలవీడు, శ్రీరామగిరి, హేమ్ల తండ, కాచికల్ గ్రామాలలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ బాలాజీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు నాయిని సత్యపాల్ రెడ్డి, హెచ్ వెంకటేశ్వర్లు,కాసం లక్ష్మారెడ్డి,రంజిత్ రెడ్డి వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్ తో కలిసి మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ అవుతారని దీమా వ్యక్తం చేశారు.బలరాం నాయక్ ను గెలిపిస్తే మళ్ళీ కేంద్రమంత్రి అవుతారని జోష్యం చెప్పారు. ప్రజలంతా అమూల్యమైన ఓటును చెయ్యి గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోగుల మల్లయ్య, ఆయా గ్రామ పార్టీ అధ్యక్షులు డేగల వెంకన్న,పాశం చిన్న వెంకన్న,గుగులోత్ రమేష్,లాలు, ఇస్సంపల్లి వెంకట్, బెల్లి నర్సయ్య, ఇట్టే దేవేందర్ రెడ్డి, ఎంపిటిసిలు ఎల్దీ గోవర్ధన్,పెరుమాళ్ళ సుమలత మురళి,పార్టీ నాయకులు తూళ్ళ నరేందర్, రాస వెంకటరెడ్డి,గంజి గోవర్ధన్,పట్నంశెట్టి నాగరాజు, ఈసంపల్లి వెంకన్న రావుల సతీష్,గుగులోత్ రవి నాయక్,కాసం సుధాకర్ రెడ్డి,కొడిశెట్టి వెంకన్న, జిలుకర యాలాద్రి, మేరుగు వెంకటస్వామి, తూళ్ళ ప్రణయ్, రామ్మూర్తి, ఎల్లారెడ్డి, గడ్డమీది వేణుకుమార్, బండి శ్రీనివాస్, కర్నే సాయికుమార్ రమేష్ మధు లచ్చిరాం వెంకన్న ఏలోజి లాల్ సింగ్ పాటు తదితరులు ఉన్నారు
]]>
మేడారం లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశి తెలుపు కోసం గడపగడపకు ప్రచారం https://navatelangana.com/campaigning-for-congress-candidate-gaddam-vamsi-white-in-medaram/ Wed, 08 May 2024 14:35:32 +0000 https://navatelangana.com/?p=286317 నవతెలంగాణ – ధర్మారం

మండలంలోని నంది మేడారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం గడపగడపకు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు 6 గ్యారెంటీల ద్వారా మహిళలు పేద ప్రజలు 500 లకే గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు తదితర అంశాల గురించి ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటా ప్రచారంనిర్వహించారు ఈనెల13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఒటర్లను అభ్యర్థించారు కాంగ్రేస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు సవివరంగా వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కాడే సూర్యనారాయణ, దేవి జనార్ధ కారేటి వేను, సరిత తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
]]>
ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ https://navatelangana.com/congress-ignored-election-promises/ Wed, 08 May 2024 13:18:31 +0000 https://navatelangana.com/?p=286267
– మండల మాజీ వైస్ ఎంపీపీ పాయం నర్సింగరావు
– రెండవ రోజు లింగాలలో విస్తృత ప్రచారం
నవతెలంగాణ – తాడ్వాయి
ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మండల మాజీ వైస్ ఎంపీపీ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాయం నర్సింగరావు విమర్శించారు. బుధవారం మండలంలోని లింగాల గ్రామంలో రెండు రోజుల నుండి విస్తృతంగా టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ను మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నరసింగరావు మాట్లాడుతూ గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారం లోకి వచ్చింది అని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. వరికి బొనస్ 500 ఇస్తామని రైతు భరోసా 15000 ఇస్తామని రుణమాఫీ చేస్తామని మహిళలకు 2500 ఇస్తామని ఇంకా విద్యార్థినులకు స్కూటర్లు ఇస్తామని ఇంకా అనేక మోసపూరిత హామీలిచ్చి అధికారం లోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ నీ ఓడించి, రైతు పార్టీ అయిన బిఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత గారి ని గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఊకె జగన్ చెన్నూర్ వెంకన్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
]]>
ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి: ఎస్సై శ్రీకాంత్ రెడ్డి https://navatelangana.com/political-parties-should-act-in-accordance-with-the-rules-of-the-elections-s-s-srikanth-reddy/ Wed, 08 May 2024 12:56:42 +0000 https://navatelangana.com/?p=286243
– రాజకీయ నాయకులతో సమావేశం
నవతెలంగాణ – తాడ్వాయి 
ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు వ్యవహరించాలని తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని మేడారం, కాటాపూర్, బీరెల్లి గ్రామాల్లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 నియమావళి ప్రకారం రాజకీయ పార్టీలు , సభలు అనుమతులకు ఇతర కార్యకలాపాల కోసం వచ్చే దరఖాస్తులను ఎన్నికల నియమాలు లోబడి అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచార సభలకు, సమావేశాలకు నిబంధన లోబడి అనుమతులు మంజూరు వస్తుందని  తెలిపారు. మండలంలోని ఏ పార్టీకి కానీ, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమను నేరుగా సంప్రదించాలని తెలిపారు. అలాగే ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
]]>
కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు https://navatelangana.com/continued-migration-into-congress/ Wed, 08 May 2024 09:54:55 +0000 https://navatelangana.com/?p=286110
– కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్న మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు 
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలోని కాటారం,మల్హర్ రావుమహాదేవపూర్ తోపాటు పలు మండలాల్లోని ఆయా గ్రామాల నుంచి బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు, వలసలు గత వారం రోజులుగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. బుధవారం  ఏగ్లాస్ పూర్, చిల్లపల్లి, రామయ్య పల్లి, ఓదాల, పెద్దంపేట గ్రామాలకు చెందిన వందమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శ్రీధర్ బాబు  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యాలీర్తలు పాల్గొన్నారు.
]]>
ఈసీ ఆక్కసుతో రైతులపై బీజేపీ కుట్రలు https://navatelangana.com/bjp-conspiracies-against-farmers-with-ec/ Wed, 08 May 2024 09:49:46 +0000 https://navatelangana.com/?p=286104
– గతంలో ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసిన బీఆర్ఎస్
– రాష్ట్ర ఐటి పరిశ్రమల, శాసన సభ వ్యవహారల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
ఈసీ అక్కసుతో రైతులపై బీజేపీ కుట్రలు చేస్తుంటే, గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిందని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆరోపించారు..పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటువేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడారు యాసంగిలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సమయము కంటే ముందే రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసిందన్నారు..ఈసి ఎలక్షన్ ని అస్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకుండా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.కేంద్రంలో బిజెపి నల్ల చట్టాలను  తీసుకవచ్చి రైతులను నట్టేట్ట ముచ్చే కార్యక్రమం చేసిందని.నల్ల చట్టలపై పోరాటము చేసిన రైతులను బీజేపీ పార్టీ ఇబ్బందులకు గురి చేసి పొట్టన పెట్టుకుందన్నారు. రాష్ట్రములో బిఆరెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతు బంధు (రైతు బరోనా)తో రైతుల ఖాతాలల్లో డబ్బులను జమ చెయ్యడం జరిగిందని,.ఈసిని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ రైతుల ఖాతాలో జమ అయినా సొమ్మును నిలిపివేసే కార్యక్రమం చేస్తుందని ఆరోపించారు.బీజేపీ చేస్తున్న కుట్రలు రైతులు అందరూ గమనించాలన్నారు.రైతు బందు (రైతు భరోసా) డబ్బులు రైతులకు రైతుల ఖాతాలల్లో క్రమ క్రమంగా జమ చేస్తుంటే దీనిని ఈసి ఎందుకు నిలిపిసిందని బీజేపీలో భాగంగానే  కుట్ర అని చాలా స్పష్టంగా కనబడుతుందన్నారు.బీజేపీ,బిఆరెస్ పార్టీలు రైతు బంధు (రైతు భరోసా) నిధులను నిలుపుదల చేసి రెండు పార్టీ లు కుట్రలు చేశాయని,రైతులకు ఈ రెండు పార్టీ లు రైతులకు సమాధానం చెప్పాలన్నారు.బీజేపీ, బిఆరెస్ పార్టీలకు రైతులు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
రైతులకు సంబందించిన ఎరువులు,పని ముట్లకు ఎలాంటి సబ్సిడీ లేకుండా చేశాయన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీ లలో ఉచిత బస్ సౌకర్యం,రూ.500 గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల ఉచిత కరెంట్,రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ అమలు చేశామన్నారు.ఎలక్షన్ కోడ్ తర్వాత మిగిలిన హామీలను తప్పకుండ అమలు చేస్తామన్నారు. ప్రతి పేద వాడికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ముందుకు తీసుకవేళ్తామన్నారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం చదువుకున్న యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగిందని, ఈ పది సంవత్సరాల్లో  ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.ఎరువులు,డీజిల్,పెట్రోల్ ల ధరలు పెంచి రైతులకు అన్ని రకాలుగా నష్టం చేయడం జరిగిందని ఆరోపించారు.బీజేపీ పార్టీ ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు కదా.సోనియా గాంధీ నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలు పెట్టిందని, కాంగ్రెస్ పార్టీ ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిదంగా సమాచార హక్కు చట్టాన్ని కూడా ప్రతి ఒక్కరి సమాచారం తెలియజేయాలనీ కొత్త చట్టాలను తీసుకవచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ చేసిందన్నారు.గత కేంద్రం బడ్జెట్ లో ఉపాధి హామీ పథకాన్నీ నీరు గార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.కేంద్రంలో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పటం, బీసీ,ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్ లను మారుస్తాం అని చెప్పటం ప్రత్యేక్షముగా పరోక్షంగా చెప్పటం వాస్తవం కదాని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన లాల్ శర్మను ప్రశ్నించారు.డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రచించి, రాజ్యాంగాన్ని స్ఫూర్తి సమానత్వాన్ని, ప్రతి ఒక్క వ్యక్తికి సమాన హక్కులు కల్పించి వ్యవస్థలను నిర్మాణం చేసేది రాజ్యాంగం స్ఫూర్తి.డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  స్ఫూర్తి కి అనుగుణంగా 75 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాలకు,బీసీ లకు,మైనారిటీ లకు మేలు చెయ్యాలని సమానత్వాన్ని తిసుకరావాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ రాజ్యాంగాన్నీ తిరగరాసి ఎస్సి,ఎస్టీ,బీసీ రిజర్వేషన్ లు తీసివేయాలని బీజేపీ పార్టీ విధానాలు చూస్తే స్పష్టంగా కనబడతవుందన్నారు.సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గె , ఓబీసీ లకు కుల గణాన కార్యక్రమం రాష్ట్రములో మొదలు పెట్టడం జరిగిందని,జనాభా కుల గణన ప్రకారం బడ్జెట్ కేటాయింపు చేసుకొని రాహుల్ గాంధీ నాయకత్వంలో జనాభా ప్రతిపాదికన ఆ శాతం వారికీ ఆర్థికంగా,సామాజికంగా రాజకీయంగా హక్కులను కల్పియాలని ఆలోచన చేసిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో నిర్ణయం తీసుకోని బీసీ లకు కుల విభజన ఒక విప్లవత్మకమైన అలోచన చేసి ముందుకు తిసుకెళ్తున్నామన్నారు.రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే దేశ స్థాయిలో కూడా అన్ని వర్గాల వారికీ మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పారు.రాష్ట్ర విభజన సమయంలో ఇదే ప్రధాన మంత్రి రాష్ట్ర ప్రజలను,మనోభావాలను హేళన చేశారని.రాష్ట్ర మనోభావాలను దెబ్బ తియ్యడమే కాకుండా విభజన చట్టాలను అమలు చెయ్యకుండా రాష్ట్రనికి రావాల్సిన వ్యస్థలను రానీయకుండా అడ్డుకుంటూ.. బీజేపీ పార్టీ కి కి బిఆరెస్ పార్టీ వెనుక నుండి పూర్తిగా స్థాయిలో సపోర్ట్ చేస్తూ.. విభజన చట్టంలో ఉన్న విశ్వ విద్యాలయాలు,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరి,ఐటీడిఏ,ఎన్టీపిసి,మైనింగ్ యూనివర్సిటీ గాని అనేక అంశాలు పక్కన పెట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు  పాల్గొన్నారు.
]]>
కౌoట్ డౌన్.. ప్రచారానికి మిగిలింది మూడు రోజులే..! https://navatelangana.com/there-are-only-three-days-left-for-the-kowtow-campaign/ Wed, 08 May 2024 09:39:59 +0000 https://navatelangana.com/?p=286100
– క్యాంపియన్ జోరు పెంచిన ప్రధాన పార్టీలు
నవతెలంగాణ – మల్హర్ రావు
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలింది.పోలింగ్ కు 48 గంటల ముందే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది.దీంతో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 11న సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు.తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను కలిసేలా తమ ప్రచారం తీరును మార్చుకుంటున్నారు.ఇన్నాళ్లు నాయకులు,కార్యకర్తలు,సమావేశాలు,సభలు నిర్వహించిన ప్రధాన పార్టీలు ఇప్పుడు ప్రధాన పట్టణాలు,మండల కేంద్రాల్లో కార్నర్ మిగింగ్, రోడ్ షోలను నిర్వహిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇంటింటా ప్రచారం నిర్వహించేందుకు లోకసభ ఎన్నికల్లో విలుపడదు.పెద్దపల్లి లోకసభ నియోజవర్గ పరిధిలో ప్రధాన పార్టీల ప్రచారం విస్తృతంగా ఉండడంతోపాటు ఏడూ అసెంబ్లీ సెగమెంట్లు ఉన్నాయి.దీంతో తక్కువ సమయంలో ఎక్కువ మందితో మమేకం అయ్యేలా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.మండల స్థాయి,గ్రామస్థాయి నాయకులు,కార్యకర్తలు ఉదయాన్నే చెరువుల్లో పనులకు వెళుతున్న ఉపాధిహామీ కూలీల వద్దకు చేరుకొని తమ అభ్యర్థికి ఓటు వేయాలని కూలీలకు చల్లా ప్యాకెట్లు, మంచినీళ్లు,అరటి పండ్లు పంపిణీ చేస్తూ ఓటు వేయాలని అభ్యర్దిస్తున్నారు.
]]>
గుండెపోటుతో ఉపాధి హామీ కూలి హఠాత్ మరణం https://navatelangana.com/sudden-death-of-employment-guarantee-worker-due-to-heart-attack/ Wed, 08 May 2024 09:07:52 +0000 https://navatelangana.com/?p=286065 నవతెలంగాణ – ధర్మసాగర్ 
గుండెపోటుతో ఉపాధి హామీ కూలి హఠాత్తుగా మరణించిన  ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాపాకపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి గట్ట స్వామి (50) బుధవారం యాద విధిగా వందరోజుల ఉపాధి హామీ పథకం పనికి వెళ్లడం జరుగుతుందని, ఈ క్రమంలో పనిచేసే ప్రదేశంలో గుండె నొప్పితో బాధపడకుండా తోటి కూలీలు ఉపాధి హామీ సిబ్బంది హుటాహుటిన 108 కాల్ చేసి రమ్మనడం జరిగిందని తెలిపారు. సిబ్బంది, కూలీలు ఆయనకు  సి ఆర్ పి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని  తెలిపారు. విధులు నిర్వహిస్తూ హఠాత్ మరణం పొందిన గట్ట స్వామికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా తోటి ఉపాధి కూలీలు గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన స్థానిక ఎంపీడీవో అనిల్ కుమార్ ఉపాధి హామీ సిబ్బందిని తోటి కూలీలను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ సంపత్, జె ఈ శ్రీనివాస్, టీ ఏ కరుణాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, మేటి ప్రసన్నకుమారి, పంచాయతీ కార్యదర్శులు ఆకారపు సురేష్, మల్లేశం, సుధాకర్, గ్రామ పెద్దలు వినోద్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
]]>