World Archives - https://navatelangana.com/category/world/ Thu, 17 Apr 2025 19:56:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png World Archives - https://navatelangana.com/category/world/ 32 32 భారతీయులకు దక్కని చోటు https://navatelangana.com/a-place-for-indians/ Thu, 17 Apr 2025 19:56:43 +0000 https://navatelangana.com/?p=548432 Trump, Keir Starmer, Yunus, Musk– ‘టైమ్‌’ ప్రభావశీలుర జాబితాలో ట్రంప్‌, కెయిర్‌ స్టార్మర్‌, యూనస్‌, మస్క్‌,..
న్యూయార్క్‌: తాము ఎంచుకున్న మార్గంలో నలుగురికీ మార్గనిర్దేశనం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంటారు కొంతమంది వ్యక్తులు. ప్రపంచవ్యాప్తంగా అలాంటి ప్రభావశీలురను గుర్తించి జాబితా రూపొందిస్తుంది ప్రముఖ మ్యాగజైన్‌ ‘టైమ్‌’. ఈ ఏడాది ఆ జాబితాలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్‌యూనస్‌ వంటి ప్రముఖులు చేరారు. వారిని ప్రభావవంతమైన వ్యక్తులుగా టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. కాగా, ఈ సారి ఈ జాబితాలో భారత్‌కు చెందిన ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.
2025 సంవత్సరానికి గానూ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను టైమ్‌ తాజాగా వెల్లడించింది. లీడర్స్‌, ఐకాన్స్‌, టైటాన్స్‌, ఆర్టిస్ట్స్‌, ఇన్నోవేటర్స్‌ ఇలా పలు కేటగిరీలుగా విభజించి ఈ వార్షిక జాబితాను రూపొందించింది. లీడర్ల కేటగిరీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌, డోజ్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌, బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్‌ యూనస్‌, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రభృతులు ఉన్నారు. ఏటా టైమ్‌ ప్రకటించే ఈ జాబితాలో సాధారణంగా భారతీయులకు స్థానం ఉండేది. గతేడాది బాలీవుడ్‌ నటి అలియా భట్‌, ఒలింపిక్‌ పతక విజేత, రెజ్లర్‌ సాక్షి మాలిక్‌లకు చోటు దక్కింది. అంతకుముందు 2023లో ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ వంటివారు ప్రభావవంతమైన వ్యక్తులుగా నిలిచారు. ఈసారి జాబితాలో భారత్‌ నుంచి ఏ ఒక్కరికీ చోటు దక్కకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
భారతసంతతి నాయకురాలికి చోటు
అయితే, భారత సంతతికి చెందిన రేష్మ కెవల్‌రామణి టైమ్‌ జాబితాలో ఉన్నారు. ఈమె వర్టెక్స్‌ ఫార్మా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రేష్మకు 11ఏళ్ళ వయసులోనే ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. ఫార్మా రంగంలో రాణించిన రేష్మ అమెరికా అతిపెద్ద బయోటెక్నాలజీకి తొలి మహిళా సీఈఓగా అరుదైన ఘనత అందుకున్నారు.

]]>
అమెరికా నుంచి బహిష్కరణకు వ్యతిరేకంగా దావా https://navatelangana.com/claim-against-deportation-from-the-us/ Thu, 17 Apr 2025 19:50:48 +0000 https://navatelangana.com/?p=548423 Claim-USA– భారతీయ విద్యార్థి సహా మరో ముగ్గురు
వాషింగ్టన్‌: అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ తన దుందుడుకు చర్యలతో విద్యార్థులనూ కలవరపెడుతున్నాడు. తమ స్టూడెంట్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టేటస్‌ను ‘చట్టవిరుద్ధం’గా రద్దు చేసినందుకు మిచిగాన్‌ పబ్లిక్‌ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు దావా వేశారు. రద్దు ఫలితంగా యూఎస్‌ నుంచి బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో వారు ఈ చర్యకు దిగారు. ఈ దావా వేసినవారిలో ఒకరు భారత్‌కు చెందినవారే కావటం గమనార్హం. భారత్‌ నుంచి చిన్మరు డియోర్‌, చైనా నుంచి జియాంగ్యున్‌ బు, క్యుయి యాంగ్‌, నేపాల్‌ నుంచి యోగేశ్‌ జోషిలు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హౌంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌), ఇమ్మిగ్రేషన్‌ అధికారులపై దావా వేశారు. స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఈవీఐఎస్‌)లో వారి స్టూడెంట్‌ ఇమ్మిగ్రేషన్‌ స్థితిని ‘తగిన నోటీసు, వివరణ’ లేకుండా చట్టవిరుద్ధంగా రద్దు చేశారని విద్యార్థులు ఆరోపించారు. ట్రంప్‌ యంత్రాంగం ఒక నోటీసు లేకుండా వారి ఎఫ్‌-1 స్టూడెంట్‌ ఇమ్మిగ్రేషన్‌ స్థితిని చట్టవిరుద్ధంగా, అకస్మాత్తుగా సహేతుక కారణం లేకుండా రద్దు చేయటాన్ని అత్యవసరంగా నిషేధించాలంటూ ఒక దావాను వేసినట్టు విద్యార్థుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ (ఏసీఎల్‌యూ) తెలిపింది. ఈ విద్యార్థులు తమ చదువులను పూర్తి చేయగలిగేలా, నిర్బంధం, బహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండటానికి వారి స్థితిని పునరుద్ధరించాలని దావా కోర్టును కోరుతున్నదని వివరించింది. ”వారిలో ఎవరూ కూడా యూఎస్‌లో నేరానికి పాల్పడినట్టు చెప్పలేదు. దోషిగా నిర్ధారించబడలేదు. ఎవరూ ఎలాంటి ఇమ్మిగ్రేషన్‌ చట్టాన్నీ ఉల్లంఘించలేదు. వారు ఏ రాజకీయ అంశానికి సంబంధించి కూడా క్యాంపస్‌లో నిరసనలలో పాల్గొనలేదు” అని డీహెచ్‌ఎస్‌ సెక్రెటరీ క్రిస్టి నోయెమ్‌, ఐసీఈ డైరెక్టర్‌ టాడ్‌ లియోన్స్‌, ఐసీఈ డెట్రాయిట్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌ రాబర్ట్‌ లించ్‌లను పేర్కొంటూ కోర్టులో దాఖలైన ఫిర్యాదు వివరించింది. దేశవ్యాప్తంగా న్యూహాంప్‌షైర్‌, ఇండియానా, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలలో ఇలాంటి వ్యాజ్యాలే దాఖలు కావటం గమనార్హం. ”ఈ క్రూరమైన, చట్టవిరుద్ధమైన ప్రభుత్వ చర్యలు విద్యార్థుల జీవితాను దెబ్బతీస్తాయి. అంతేకాదు.. ప్రభుత్వ చర్యలతో భవిష్యత్తులో అంతర్జాతీయ స్కాలర్లు మిచిగాన్‌, యూఎస్‌లను తమ విద్యా గమ్యస్థానంగా ఎంచుకోకుండా నిరోధిస్తాయి. ఇది మన విశ్వవిద్యాలయాల ఖ్యాతిని మరింత దెబ్బతీస్తుంది. ఇవన్నీ ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయి” అని మిచిగాన్‌ ఏసీఎల్‌యూలో స్టాఫ్‌ అటార్నీ రామిస్‌ వాదూద్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

]]>
టారిఫ్‌లతో అమెరికాకు ముప్పే.. https://navatelangana.com/thirty-to-america-with-tariffs/ Thu, 17 Apr 2025 19:21:40 +0000 https://navatelangana.com/?p=548400 America is losing money with tariffs..– మాంద్యం ముంచుకు రావొచ్చు
– ద్రవ్యోల్బణం ఎగిసిపడే ప్రమాదం : ట్రంప్‌ విధానాలపై యూఎస్‌ ఫెడ్‌ చైర్మెన్‌ ఆగ్రహం
వాషింగ్టన్‌: ట్రంప్‌ వాణిజ్య విధానాలతో అమెరికాకు తీవ్ర పరిణామాలు తప్పవని స్వయంగా ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ హెడ్‌ జోరోమ్‌ పావెల్‌ పేర్కొన్నారు. తమ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అవలంభిస్తోన్న అధిక టారిఫ్‌ల విధానంతో అమెరికాకు తీవ్ర ముప్పేనని అన్నారు. యూఎస్‌ ఫెడ్‌ చైర్మెన్‌ జోరోమ్‌ పావెల్‌ చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ట్రంప్‌ యంత్రాంగం ఇప్పటి వరకూ ప్రకటించిన సుంకాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటి గురించి ఎలా ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదన్నారు. సుంకాల పెంపునతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకోను ందని హెచ్చరించారు. ట్రంప్‌ పాలనలో విధానపరమైన మార్పులు తమ కేంద్ర బ్యాంక్‌ను ముంచేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. టారిఫ్‌ల వల్ల నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలపై భారీ స్థాయిలో సుంకాలతో ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. దీనివల్ల యూఎస్‌లోని కంపెనీలు, పరిశ్రమలపై నా పెను ప్రభావం పడనుండటంతో ట్రంప్‌ ఆర్థిక విధానాలపై స్వదేశంలో నూ పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఈ నేపథ్యంలో పావెల్‌ వ్యాఖ్యలకు మరింత విశేషం నెలకొంది. టారిఫ్‌ల వల్ల నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టా న్ని కలిగించే ప్రమా దం ఉందని పావెల్‌ పేర్కొన్నారు. టారిఫ్‌లను ఇలా పెంచుకుంటూ పోతే ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అటు ఆర్థిక మాంద్యం కూడా మొదలవుతుందని విశ్లేషించారు. స్టాక్‌ మార్కెట్లు కూడా తీవ్ర ఊగిసలాటకు లోనవుతాయన్నారు. ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణ నియంత్రణ వంటి ఫెడ్‌ లక్ష్యాలకు ట్రంప్‌ సుంకాలు ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలపై ఏప్రిల్‌ 2న ట్రంప్‌ అధిక సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత, అమెరికాలోనూ ఆందోళనలు చోటు చేసుకోవడంతో ట్రంప్‌ తన నిర్ణయాన్ని 90 రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. చైనాపై మాత్రం భారీస్థాయిలో సుంకాలు పెంచుకుంటూ పోతున్నారు. రెండు అగ్రదేశాల మధ్య సుంకాల పోరు ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్నది..

]]>
పాలస్తీనాకు మద్దతుగా చైనా, మలేషియా సంయుక్త ప్రకటన https://navatelangana.com/china-malaysia-is-a-us-statement-in-support-of-palestinian/ Thu, 17 Apr 2025 13:30:18 +0000 https://navatelangana.com/?p=548287 chinaన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్, హమాస్‌లు నిరంతరం, సమర్థవంతంగా అమలు చేయాలని చైనా-మలేషియా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మలేషియాకు అధికారిక పర్యటన తర్వాత రెండు దేశాలు ఈ ప్రకటనను విడుదల చేశాయి. ఆ ప్రకటన ప్రకారం మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చలలో గాజా పాలస్తీనా ప్రజలకు చెందినదని, అది పాలస్తీనా భూభాగంలో విడదీయరాని భాగమని నొక్కి చెప్పారు. గాజాలో ఘర్షణల అనంతరం “పాలస్తీనియన్లు పాలస్తీనాను పరిపాలించడం” ముఖ్యమైన సూత్రమని వారు పేర్కొన్నారు. గాజా ప్రజల బలవంతపు తరలింపును వ్యతిరేకించారు.

]]>
జపాన్ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు.. https://navatelangana.com/trade-deficit-in-the-fiscal-year-of-japan/ Thu, 17 Apr 2025 13:23:06 +0000 https://navatelangana.com/?p=548271 japanన‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: జపాన్‌ మార్చి-ఏప్రిల్‌ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు నమోదైందని ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం నివేదించింది. తాత్కాలిక గణాంకాల ప్రకారం.. మార్చి వరకు ఆర్థిక సంవత్సరంలో జపాన్‌ ప్రపంచ వాణిజ్యలోటు మొత్తం 37 బిలియన్‌ డాలర్లుగా తెలిపింది. వరుసగా నాలుగో ఏడాది లోటు నమోదైనట్లు వెల్లడించింది. కానీ అమెరికాతో పోలిస్తే 63 బిలియన్‌ డాలర్లకు మిగులు పెరిగినట్లు ప్రకటించింది.

పలుదేశాల దిగుమతులపై ట్రంప్‌ ఏప్రిల్‌ 2న అధిక టారిఫ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. జపాన్‌ దిగుమతులపై 24 శాతం సుంకాన్ని విధించాలని యోచిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అయితే ఆర్థిక మార్కెట్లలో భయాందోళనలకు లోనవడంతో 90 రోజుల పాటు ఈ టారిఫ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్‌ టారిఫ్‌లకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు జపాన్‌ దౌత్యవేత్తలు వాషింగ్టన్‌కు చేరుకున్నారు. జపాన్‌ అమెరికా దీర్ఘకాల మిత్రదేశంగానే కాకుండా అమెరికాలో ప్రధాన పెట్టుబడిదారు, లక్షలాది మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తోంది.

జపాన్‌ ఇప్పటికే దిగుమతి చేసుకునే కార్లు, ఆటో విడిభాగాలు, ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై 10శాతం బేస్‌లైన్‌ టారిఫ్‌, 25 శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది. వాటిలో అధిక భాగం ఇటీవలే అమల్లోకి వచ్చినవి కావడం గమనార్హం. ఈ సుంకాలతో జపాన్‌ ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ప్రధాని షిగెరు ఇషిబా ప్రకటించారు.

జపాన్‌ వార్షిక ఎగుమతులు గత ఏడాది కంటే 5.9శాతం పెరిగాయి. కంప్యూటర్‌ చిప్స్‌, వాహనాల ఎగుమతులు దోహదపడ్డాయి. దిగుమతులు 4.7 శాతం పెరిగాయి కానీ జపనీస్‌ యెన్‌ బలహీనం కావడంతో దిగుమతులు మరింత భారంగా మారాయి. మార్చిలో జపాన్‌లో 4 బిలియన్‌ డాలర్ల వాణిజ్య మిగులు రికార్డయింది. ఫిబ్రవరిలో కంటే ఎగుమతులు నెమ్మదిగా ఉన్నప్పటికీ.. వరుసగా ఆరో నెల లాభాల కోసం ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 4శాతం పెరిగాయి.

]]>
హమాస్‌కు ధన్యవాదాలు: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ https://navatelangana.com/thanks-to-hamas-russia-president-putin/ Thu, 17 Apr 2025 13:17:24 +0000 https://navatelangana.com/?p=548255 tqన‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: రష్యన్‌ బందీలను విడుదల చేసినందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హమాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. గాజా నిర్బంధం నుండి విడుదలైన రష్యన్‌ పౌరుడు అలెగ్జాండర్‌ ట్రూఫనోవ్‌, అతని ఇద్దరు కుటుంబసభ్యులను పుతిన్‌ స్వాగతించినట్లు స్థానిక మీడియా క్రెమ్లిన్‌ ఇంటర్‌ఫ్యాక్స్‌ ఏజన్సీ బుధవారం రాత్రి తెలిపింది. అలెగ్జాండర్‌ ట్రూఫనోవ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు. పాలస్తీనా ప్రజలతో, వివిధ సంస్థల ప్రతినిధులతో అనేక సంవత్సరాలుగా రష్యా కలిగి ఉన్న స్థిరమైన సంబంధాల ఫలితంగా ఇప్పుడు మీరు స్వేచ్ఛగా ఉన్నారని పుతిన్‌ పేర్కొన్నట్లు ఇంటర్‌ఫ్యాక్స్‌ తెలిపింది. ఈ మానవతా చర్యను నిర్వహించిన హమాస్‌ నాయకత్వానికి, రాజకీయ విభాగానికి కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు. ఈ సమావేశంలో విడుదలైన బంధీలతో పాటు రబ్బీ చీఫ్‌ బేర్ల్‌ లేజర్‌, ప్రముఖ రష్యన్‌ యూదు నేతలు పాల్గన్నట్లు ఇంటర్‌ ఫ్యాక్స్‌ వెల్లడించింది. 2023, అక్టోబర్‌లో ఇజ్రాయిల్‌పై హమాస్‌ చేపట్టిన దాడిలో 251 మందిని బందీలుగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. వీరిలో ట్రూఫనోవ్‌, అతని తల్లి ఎలెనా ట్రూఫనోవా, అమ్మమ్మ ఇరినా తట్టి, కాబోయే భార్య సపిర్‌లను కిడ్నాప్‌ చేసి గాజాస్ట్రిప్‌కు తీసుకువెళ్లారని, ఈ దాడిలో ట్రుఫనోవా తండ్రి విటాలీ ట్రుఫనోవా మరణించారని ఫ్యాక్స్‌ తెలిపింది. 53 రోజుల తర్వాత ఎలెనా, ఇరినా మరియు కొహెన్‌లను బందీల మార్పిడి సమయంలో విడుదల చేశారు. అలెగ్జాండర్‌ ట్రూఫనోవ్‌ సుమారు 500 రోజులు బందీగా ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 15న విడుదలయ్యారు. పాలస్తీనా బందీల విడుదలకు సహాయం అందిస్తామని పుతిన్‌ హమాస్‌కు హామీ ఇచ్చారు.

]]>
పాకిస్థాన్‌లో ఈదురు గాలుల బీభ‌త్సం https://navatelangana.com/winds-in-pakistan/ Thu, 17 Apr 2025 09:29:07 +0000 https://navatelangana.com/?p=548011 pak rainన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌లో ఈదురు గాలులు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. దేశరాజ‌ధాని ఇస్లామాబాద్ తో పాటు పంజాబ్, కైబ‌ర్ పఖ్తున్ఖ్వా తో పాటు ప‌లు ప్రాంతాల్లో భారీగా వ‌డ‌గండ్ల వాన కురిసింది.ఈ వ‌ర్షాల‌కు ఐదుగురు చ‌నిపోగా..19మందికి తీవ్ర గాయాలు అయ్యాయ‌ని ఆదేశ మీడియా సంస్థ‌లు క‌థ‌నాలు వెలువ‌రించాయి. ఉరుముల‌,మెరుపుల‌తో కూడిన వ‌ర్షాల‌తో పాటు భారీ ఈదురు గాలుల‌కు ప‌లు ప్రాంతాల్లో గోడలు స‌హితం కూలిపోతున్నాయి. జీలంలో ప‌రిస‌రాల్లో ఓ ఇంటి గోడ కూలి మ‌హిళ‌తో పాటు ఇద్దురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. కోటు అడ్డాలో పిడుగుపాటుకు ఓ యువ‌కుడు చ‌నిపోయాడు. రావ‌ల్పిండిలోని స్థానిక మ‌సీద్ కూలి బాలుడు మృతి చెంద‌గా..ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కోట్లీ న‌గ‌రంలో పిడుగుపాటుకు అట‌వీ ప్రాంతానికి మంట‌లు అంటుకున్నాయి. బ‌ల‌మైన ఈదురు గాలుల‌తో మంట‌లు అతివేగంగా అట‌వీంతా వ్యాప్తించాయి. అదేవిధంగా బ‌ల‌మైన గాలులధాటికి చీలాస్ ప్రాంతంలో ఓ ఇల్లు కూలి..చిన్నారితో పాటు ప‌లువురు గాయ‌ప‌డ్డారు. కైబ‌ర్ కైబ‌ర్ పఖ్తున్ఖ్వాలో భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌ద‌లు ముంచుకొచ్చాయి. ఆ ప్రాంతంలో రోడ్లు, ప‌లు వంతెన‌లు, విద్యుత్ స్తంభాలు వ‌ర‌ద ప్ర‌వాహానికి కొట్టుకుపోయాయి. పాక్-అప్ఘ‌న్ స‌రిహ‌ద్దు మ‌ధ్య ఉన్న ఎక్స్ ప్రెస్ హైవే వ‌ర‌ద నీటిలో మునిగిపోయింది. దీంతో ఇరుదేశాల మ‌ధ్య రాక‌పోక‌లు అధికారులు నిలిపివేశారు. అప్ర‌మ‌త్త‌మైన ఆదేశ అధికారులు స‌హ‌య‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. శ‌ర‌వేగంగా బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.

]]>
ట్రంప్ విధానాలపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ ఆగ్రహం https://navatelangana.com/fed-chairman-jerome-outrage-over-trump-policies/ Thu, 17 Apr 2025 06:00:38 +0000 https://navatelangana.com/?p=547919 joreamన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. భారత్‌, చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా 70కిపైగా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ట్రంప్‌ నిర్ణయంతో అమెరికా కంపెనీలు, పరిశ్రమలపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ట్రంప్‌ ఆర్థిక విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ చైర్మన్‌ జోరోమ్‌ పావెల్‌ సైతం ట్రంప్‌ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన కాలిఫోర్నియా ఈ విషయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగంపై న్యాయపోరాటానికి సిద్ధం కాగా, తాజాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్ జోరోమ్ పావెల్ దీనిపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.ట్రంప్ టారిఫ్ విధానాలతో అమెరికాలో తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన మండిపడ్డారు. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వు సిస్టమ్ (అమెరికా కేంద్ర బ్యాంకు)ను ముంచేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.

]]>
ఆగని ట్రంప్‌ టారిఫ్‌ల విధ్వంసం https://navatelangana.com/the-destruction-of-trump-tariffs/ Wed, 16 Apr 2025 20:48:56 +0000 https://navatelangana.com/?p=547803 ఆగని ట్రంప్‌ టారిఫ్‌ల విధ్వంసం– నాపై 245 శాతానికి సుంకాల పెంపు
– బ్లాక్‌మెయిల్‌కు లొంగేది లేదన్న బీజింగ్‌
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై టారిఫ్‌ల విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా చైనా నుంచి చేసుకునే దిగుమతులపై టారిఫ్‌లను 245 శాతానికి పెంచారు. దీంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరినట్టయ్యింది. చైనా తగ్గనంత వరకు తన తీరులో మార్పు ఉండబోదని యూఎస్‌ పేర్కొంది. తొలుత చైనాపై 10 శాతం సుంకాలు అమల్లో ఉండగా.. ఇటీవల క్రమంగా పెంచుతూ 145 శాతానికి చేర్చారు. తాజాగా సుంకాలను మరో 100 శాతం పెంచడం తీవ్ర ఆందోళనకరం.
ట్రంప్‌ ఎంత సుంకాలు విధించినా తాము భయపడే ప్రసక్తే లేదని చైనా తెగేసి చెప్పింది. మరోవైపు సమస్య పరిష్కారానికి తమ ద్వారాలు తెరిచే ఉన్నాయని ఆ దేశం పేర్కొంది. అమెరికాతో వాణిజ్య యుద్ధానికి తెరదించేందుకు తాము చర్చలకు సిద్ధమేనని మరోమారు స్పష్టం చేసింది. అమెరికా ఈ సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటే తమపై ఒత్తిడిని తీవ్రతరం చేయవద్దని సూచించింది. ”యూఎస్‌ ముందు భయ పెట్టడం, బ్లాక్‌ మెయిల్‌ చేయడం ఆపాలి. పరస్పర ప్రయో జనాలు, సమానత్వం, గౌరవప్రదంగా ఉండేలా చర్చలు జరగాలి. వాణిజ్య యుద్ధాన్ని అమెరికానే ప్రారంభించింది.” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ అన్నారు.
ట్రంప్‌ ప్రారంభించిన టారిఫ్‌ యుద్ధం ఇటీవల ఇరు దేశాల మధ్య తీవ్ర ప్రతీకార చర్యలకు దారి తీస్తోన్న విషయం తెలిసిందే. బోయింగ్‌ విమానాల కొనుగోలును చైనా నిలిపివేయగా, చైనాకు ఎగుమతి చేసే హెచ్‌20 ఎఐ చిప్స్‌పై యూఎస్‌ ఆంక్షలు విధించింది. ట్రంప్‌ నిర్ణయంతో ఆ దేశ చిప్‌ కంపెనీల షేర్లు కుదేలు అవుతున్నాయి. చైనాకు ఎగుమతి చేసే చిప్స్‌ను నిలిపివేస్తే తమకు 5.5 డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఎన్విడియా ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్‌ చర్యలతో ఎన్విడియా షేర్లు కుదేలు అవుతోన్నాయి. మరోవైపు అమెరికా దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలకు కొద్ది రోజులు మినహాయింపు ఇవ్వనున్నట్టు ట్రంప్‌ తెలిపారు. సరఫరా గొలుసును సరి చేసుకోవడానికి కార్ల తయారీ కంపెనీలకు కొంత సమయం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
చైనా జీడీపీ ఉరకలు..
చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పరుగులు పెడుతోంది. ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ 5.4 శాతం పెరిగింది. నిపుణులు ముందుగా 5.1 శాతం వృద్ధి అంచనా వేయగా.. అంతకు మించి రాణించడం విశేషం. గతేడాది తొలి త్రైమాసికంలోనూ 5.4 శాతం వృద్ధి చోటు చేసుకున్నప్పటికీ.. ఇటీవలి అమెరికా టారిఫ్‌ పరిణామాలు, ట్రంప్‌ విధానాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేశారు. మార్చిలో రిటైల్‌ అమ్మకాలు, వినిమయం 5.9 శాతం పెరిగింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి 7.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

]]>
న్యాష్టికే నోబెల్‌ ప్రైజ్‌ https://navatelangana.com/nobel-prize/ Wed, 16 Apr 2025 20:14:10 +0000 https://navatelangana.com/?p=547816 Nobel Prize in Chemistryఆర్థిక రంగంలో నోబెల్‌ బహుమతికి ఈ ఏడాది ఇంకెవరి పేరును ప్రతిపాదించనవసరం లేదని నోబెల్‌ కమిటీ బహిరంగంగా ప్రకటిస్తే బాగుంటుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ బహుమతికి ఆర్థిక రంగంలో అర్హత పొందిన వ్యక్తిని నోబెల్‌ కమిటీ ఇప్పటికే ఎంపిక చేసి ఉంది, కనుక ఎవరి పేరు కమిటీ ముందుకు వచ్చినా అది నేరుగా చెత్తబుట్టకే. ఆర్థిక రంగంలో, అందులోనూ అంతర్జాతీయ వాణిజ్యంలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేసిన ఆ వ్యక్తికి గాక మరొకరికి ఇచ్చే అవకాశమే లేదని కమిటీ అభిప్రాయపడ్డది.. పొరపాటున వేరే ఇంకెవరికైనా ఇచ్చినా ప్రపంచ పౌరులు అంగీకరించే ప్రసక్తి ఉండదు. కనుక ఆ వ్యక్తికి ఇవ్వకపోతే నోబుల్‌ ప్రైజ్‌ కమిటీ ప్రతిష్టకే నష్టం. విమర్శలు ఎదుర్కోవటం కమిటీకి ఇష్టం లేదు. ఇంతకీ నోబెల్‌ ప్రైజ్‌ కొట్టే ఆ ఆర్థిక వేత్త ఎవరో ఊహించండి.
కరెక్ట్‌. మీ ఊహ కరెక్టే! ఆ వ్యక్తి అమెరికాను మరోసారి గొప్పగా చేయాలని తన యావత్‌ మేధాశక్తిని ధారపోస్తున్నాడు. ఇంతకుముందు అమెరికాను గురించి ప్రపంచం అనుకున్న భావనలన్నీ తప్పని తేల్చేశాడు. ప్రపంచంలో ఆర్థికంగా నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న అమెరికా ప్రపంచ దేశాల వనరులన్నిం టినీ కొల్లగొడు తుందని జనం ఇంతవరకు భ్రమపడ్డారు. నిజానికి ప్రపంచమే అమెరికాను కొల్లగొడుతున్నదని ఈయన తన మేధాశక్తితో కనిపెట్టాడు. లేకపోతే అమెరికా లాంటి బల సంపన్న దేశం ప్రపంచంలోనే దేశాలన్నిటితో వాణిజ్య లోటు కలిగి ఉండటం ఏమిటీ అనేది ఆయన ప్రశ్న. అమెరికాను ప్రపంచం ఎలా దోచుకుంటూ ఉన్న దంటే ప్రపంచంలోని ప్రజలందరూ కూడా అమెరికాకు వచ్చి ఆ దేశాన్ని కొల్లగొట్టుకు పోదాం అని చూసేవాళ్ళే. చదువు పేరు చెప్పి వచ్చేవాళ్ళు, వర్కు పర్మిట్లని వచ్చే వాళ్ళు, దొంగచాటుగా సరిహద్దులు దాటి వచ్చేవాళ్ళు, సమయం గడిచిపోయినా అమెరికాలోనే తిష్ట వేసేవాళ్లు. వీళ్ళందరూ అమెరికా సంపదను దోచుకుని పోవటానికి వచ్చినవాళ్లే. నయానో, భయానో వీరిని సాగనంపకపోతే, వీరి దోపిడీకి అమెరికా ముష్టిదేశంగా మిగిలిపోతుంది. సామ్రాజ్యవాదం దేశం అంటే ఇప్పుడు ఈయన నిర్వచనం ఆ పద్ధతిలో దోపిడీకి గురయ్యే దేశంగా మార్చాలం టున్నాడు. నిజంగా ఇటువంటి ఆలోచనాపరుడు ఉద్భవించటం మన కాలం చేసుకున్న అదష్టం.
అంతేకాదు, ఇతను అంతర్జా తీయ వ్యాపారంలో కొత్త టారీఫ్‌ ఫార్ములా కని పెట్టాడు. వాణిజ్యలోటు ఉన్న దేశాలు ఆదేశాల నుంచి లోటును ఎలా భర్తీ చేసు కోవాలో చాలా సులువైన ఫార్ములాని కని పెట్టాడు. ఒక దేశం నుంచి ఎగుమతి అయ్యే సరుకుల విలువ నుంచి దిగుమతి అయ్యే సరుకులు విలు వను తీసేసి, దానిని దిగుమతయ్యే సరుకుల విలువతో భాగించి, తిరిగి దానిని రెండు చేత భాగిస్తే వచ్చేదే టారిఫ్‌. వాణిజ్య లోటు దేశంలోకి దిగిపోతే సరుకులు విలువను మళ్ళీ రెండుతో భాగించాలి. అదే టారిఫ్‌ రేట్‌ అవుతుంది. ఈ సింపుల్‌ ఫార్ములాని చూసి ఆర్థికవేత్తలు పక్కకు తిరిగి నవ్వుకోవచ్చు. కానీ ఏ కొత్త ఆవిష్కరణను ప్రజలు అబాసుపాలు చేయకుండా ఉన్నారు గనుక. అన్ని సూత్రాలకి మినహాయింపులు ఉన్నట్టే, దీనికీ ఉన్నాయి. ఈ సూత్రం చైనాతో నడవదు. అది కమ్యూనిస్టు దేశం కదా. అందుకని ఫార్ములాలో రెండు చేతే భాగించటం కాక 10 చేత హెచ్చించాలి.ఈ ఒక్క కాన్సెప్ట్‌తో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యూటీవోలు ఉత్త చెత్త అని మూలకు తోసేశాడు. ఎక్కడ నేర్చుకున్నాడోగానీ ఈ ఆర్ధిక సూత్రాలు, ఈయనే లేకపోతే ఆ పనికిరాని చెత్తనే పట్టుకుని మనం వేలాడుతుండేవాళ్ళం.
దేశ పౌరసత్వాన్ని అమ్మటం అనే కాన్సెప్ట్‌ను ఎంత సమర్థవంతంగా అమలు చేయాలనుకుం టున్నాడు అని చూస్తే ఈయన ముందు మార్క్సిస్టు ఆర్థికవేత్తలు దేనికి పనికి వస్తారు? 50 లక్షల డాలర్లతో అమెరికా పౌరసత్వం పొందవచ్చు. మానవసంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే అనే మార్క్స్‌ సూత్రీకరణను దేశానికి, దేశ పౌరులకు మధ్య ఉండే సంబంధానికి ఎంత చక్కగా అన్వయించాడు. ఈయనకు నోబెల్‌ ప్రెజ్‌కు ఎంపిక చేసినం దుకు సంప్రదాయ ఆర్థిక వేత్తలు, వామపక్ష ఆర్థికవేత్తలు విమర్శించవచ్చు. తన అర్థం లేని ఆర్థిక విధానాలతో ప్రపంచాన్ని మరో ఆర్థిక సంక్షోభంలోకి తోస్తున్నాడని ఆరోపించవచ్చు. ఇటువంటి సిల్లీ ఆరోపణలు పట్టుకుని మనకాలపు మేధావిని గుర్తించకుండా ఉండలేము అని నోబెల్‌ కమిటీ అభిప్రాయ పడ్డది.
ఆర్థికరంగంలో నోబెల్‌ ప్రైజ్‌కు ఈయననే ఎంపిక చేసినట్టు కమిటీ బహిరంగంగా ప్రకటించలేదు. అయినా అభిజ్ఞ వర్గాల ద్వారా ఈ సంగతి తెలుసుకున్న ఒక విలేకరి నోబెల్‌ ప్రైజ్‌ అందుకోబోయే ఆ మేధావి స్పందన ఏమిటీ అని ప్రశ్నించాడు. బూతుమాట లేకుండా స్పందించమని కూడా ఆ విలేకరి మరీ మరీ అడిగాడు. దానికి ఆ మేధావి స్పందన అతను నోరంతా వికారంగా తెరిచి చెప్పిన మాటలు వినండి- ”నాష్టీ, నోబెల్‌ ప్రైజ్‌ నాకిస్తే గౌరవం పెరిగేది నాకు కాదు, నోబెల్‌ ప్రైజ్‌ కే”
ఈ రకంగా ఆర్థిక రంగానికి నోబుల్‌ ప్రైజ్‌ ఎంపిక అయిపోయింది. మరి పీస్‌ (శాంతి) నోబుల్‌ ప్రైజ్‌కు బెంజమెన్‌ నెతన్యాహును ఎంపిక చేస్తే బాగుంటుందని కమిటీ ఆలోచిస్తునట్టు వార్త. శుభం.
– కర్లపాలెం

]]>
అమెరికాకు చైనా విదేశాంగ మంత్రి లిన్ జియాన్ కౌంట‌ర్ https://navatelangana.com/chinese-foreign-minister-lin-zian-counter-to-the-us/ Wed, 16 Apr 2025 11:18:06 +0000 https://navatelangana.com/?p=547471 counterన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మ‌రోసారి టారిఫ్‌ల పేరుతో చైనా దిగుమ‌తుల‌పై 245శాతం మేర సుంకాలు విధించిన విష‌యం తెలిసిందే. ట్రంప్ నిర్ణ‌యంపై చైనా విదేశాంగ‌మంత్రి స్పందించారు. ట్రేడ్ వార్‌ను ప్రారంభించింది అమెరికానే అని, చ‌ట్ట‌బ‌ద్దంగా, అంత‌ర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుబ‌ద్దంగా ట్రంప్ చ‌ర్య‌ల‌కు బీజింగ్ బ‌దులిచ్చింద‌న్నారు.వాణిజ్య య‌ద్ధంలో విజేత‌లు ఎవ‌రూ ఉండ‌ర‌నీ, ఈ త‌ర‌హా వార్‌ను కొన‌సాగించబోమ‌ని. కానీ టార‌ఫ్‌ల‌ పేరుతో భ‌య‌ప‌డితే..బెద‌ర‌మ‌ని ఆదేశ విదేశాంగ మంత్రి లిన్ జియాన్ కౌంట‌ర్ ఇచ్చారు. చేతులు కలపడానికి, అడ్డంకులను తొలగించడానికి చైనా సంసిద్ధంగా ఉంద‌ని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు.

]]>
ఐక్యరాజ్యసమితి కార్యదర్శి వ్యాఖ్యలపై స్పందించిన రష్యా https://navatelangana.com/russia-responded-to-the-comments-of-the-united-nations-secretary/ Wed, 16 Apr 2025 09:49:45 +0000 https://navatelangana.com/?p=547376 rrన‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: ఏప్రిల్‌ 13 సుమీ నగరంపై రష్యా క్షిపణి దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఈ దాడుల వల్ల 20 మందికిపైగా మృతి చెందారు. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెరాస్‌ రష్యా చర్యను తప్పుపడుతూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. గుటెరస్‌ వ్యాఖ్యలపై మంగళవారం రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మరియా జఖరోవా స్పందించారు. ‘ఐక్యరాజ్యసమితి కార్యదర్శి గుటెరస్‌ వ్యాఖ్యలు గందరగోళ వ్యాఖ్యలుగానే భావించాలి. ఎందుకంటే రష్యన్‌ దళాలు మొదటి నుంచి జనాభాను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా దాడులు చేయలేదు. కేవలం సైనిక స్థావరాల్ని మాత్రమే లక్ష్యంగా రష్యన్‌ దళాలు దాడులు చేస్తాయి’ అని ఆమె వెల్లడించినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ చట్టం, తీర్మానాలకనుగుణంగా ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం, ప్రాదేశిక సమగ్రతను కాపాడటం కోసం శాంతిని సాధించే ప్రయత్నాల్లో భాగంగానే గుటెరస్‌ ఆ ప్రకటను చేసి ఉంటారని రష్యా జఖరోవా అన్నారు. అలాగే జెలెన్‌స్కీ చర్యలపైనా ఆమె మండిపడ్డారు. రష్యా జాతికి చెందిన వారిని, రష్యన్‌ భాష మాట్లాడేవారిపై జెలెన్‌స్కీ బృందం ప్రాథమిక నియమాలను పదేపదే ఉల్లంఘిస్తోంది. వారిపైన దాడులు చేస్తోంది. భాషా, మతం, మానవ హక్కులను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి ఛార్టర్‌ ఆర్టికల్‌ 1 పిలుపునిస్తుంది. ప్రజల స్వయం నిర్ణయాధికారం, మానవ హక్కులను గౌరవించడం అనే చట్టబద్ధమైన సూత్రాల పట్ల కైవ్‌ పాలన నిర్లక్ష్యాన్ని మాత్రం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఎప్పుడూ కప్పిపుచుతూనే ఉంటారు అని జఖరోవా చురకలంటించారు.

]]>