World Archives - https://navatelangana.com/category/world/ Wed, 08 May 2024 14:27:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png World Archives - https://navatelangana.com/category/world/ 32 32 ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం.. https://navatelangana.com/a-volcano-erupted-in-indonesia/ Wed, 08 May 2024 14:27:38 +0000 https://navatelangana.com/?p=286312 నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోనేషియాలో ఇటీవల కాలంలో అగ్నిపర్వతాలు పేలుతున్న ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. తాజాగా బుధవారం తూర్పు ఇండోనేషియాలోని ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. అలాగే రెండవ అత్యధిక స్థాయి హెచ్చరికను జారీ చేశారు. ఉత్తర మలుకు ప్రావిన్స్‌లోని హల్మహెరా ద్వీపంలో ఉన్న మౌంట్ ఇబు పర్వతం ఉదయం 11 గంటలకు విస్ఫోటనం చెందింది. దీంతో దాని నుంచి భారీ స్థాయిలో లావా, బూడిద, పోగ రావడంతో అక్కడి ప్రాంతం మొత్తం కూడా చీకటిగా మారిపోయింది. అగ్ని పర్వత శిఖరానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో బూడిద కమ్మేసిందని ఇండోనేషియా అగ్నిపర్వత సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అగ్నిపర్వతం చుట్టూ దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ప్రత్యేక జోన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.

]]>
రఫా క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్‌ బలగాలు https://navatelangana.com/israeli-forces-capture-the-rafah-crossing/ Tue, 07 May 2024 22:07:39 +0000 https://navatelangana.com/?p=285876 Israeli forces capture the Rafah crossing– కీలకమైన సహాయక మార్గం మూసివేతతో ఆందోళనకర పరిస్థితులు
– గత రాత్రి దాడుల్లో 23మంది మృతి
– చర్చలను భగం చేసేందుకే ఈ చర్యలన్న హమాస్‌
గాజా : అంతర్జాతీయంగా ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా వాటిని బేఖాతరు చేసి తను అనుకున్నట్లుగానే రఫా విషయంలో ఇజ్రాయిల్‌ తన దూకుడు చర్యలతో ముందుకెళుతోంది. గాజాలోని రఫా క్రాసింగ్‌ను మూసివేసి పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకుంది. కీలకమైన సహాయ మార్గాన్ని మూసివేయడంతో సహాయం నిలిచిపోయింది. పైగా ఈ మార్గాన్ని తీవ్రవాదుల కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఇజ్రాయిల్‌ పేర్కొంటోంది. ఇప్పటికే అరకొర సరఫరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా క్రాసింగ్‌ను మూసివేయడంతో మరింత విపత్తుకు దారితీసే ప్రమాదముందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రఫా సరిహద్దును మూసివేయడమంటే ప్రజలు చనిపోవాలని ఇజ్రాయిల్‌ కోరుకుంటోందని అర్ధమవుతోందని పాలస్తీనియన్‌ నేషనల్‌ ఇనీషియేటివ్‌ సెక్రటరీ జనరల్‌ ముస్తఫా బర్గౌటి వ్యాఖ్యానించారు. పైగా గాయపడిన, అనారోగ్యంతో బాధ పడుతున్న వేలాదిమంది పాలస్తీనియన్లు బయటకు వెళ్లడానికి గల ఏకైక మార్గం కూడా ఇదేనని ఇప్పుడు ఇది మూసివేయడంతో ఇక మరణమే శరణ్యమవుతుందన్నారు. రఫాపై గత రాత్రంతా జరిగిన దాడుల్లో 23మంది మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు పిల్లలు వున్నారు. సెంట్రల్‌ రఫాలోని బిజీగా వున్న మార్కెట్‌ ఏరియాలో మసీదుపై క్షిపణిని ప్రయోగించడంతో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చినవారందరూ భయాందోళనలతో పరుగులు తీశారు. సెంట్రల్‌ గాజాలోని నుస్రత్‌ శిబిరంపై మిలటరీ దాడులు జరపడంతో పిల్లలతో సహా పలువురు గాయపడ్డారు.
తక్షణమే రఫా ఆపరేషన్‌ ఆపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) పేర్కొంది. ఇజ్రాయిల్‌ తీసుకున్న ఈ చర్యతో ఆరు లక్షలమంది పిల్లలతో సహా 15లక్షల మంది ప్రజల ప్రాణాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని తూర్పు మధ్యధరా ప్రాంత ప్రాంతీయ డైరెక్టర్‌ హనన్‌ బాల్కీ హెచ్చరించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా సాయమందడానికి కీలకమైన క్రాసింగ్‌ను తక్షణమే తెరవాలని ఎక్స్‌ పోస్టులో కోరారు. రఫాపై మిలటరీ దాడితో తీవ్ర పర్యవసానాలు వుంటాయని ఐక్యరాజ్య సమితి సంస్థలు, సహాయక గ్రూపులు హెచ్చరించాయి, అయినా ఏ రీతిలోనైనా తాము సాయం అందచేయడానికే కట్టుబడి వున్నామని స్పష్టం చేశాయి.పైగా గాజా కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్‌ అంగీకరించినప్పటికీ తాము రఫాపై మిలటరీ ఆపరేషన్‌ను కొనసాగిస్తామని ఇజ్రాయిల్‌ స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలోనే తాజా దాడి ప్రారంభమైంది. కతార్‌, ఈజిప్ట్‌ మధ్యవర్తులు చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయిల్‌ డిమాండ్లకు అసలు పొంతన లేదని, అయినా కూడా కైరో చర్చలకు ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రతిపాదన గురించి అమెరికాకు ముందే తెలుసునని, అయినా హమాస్‌ అంగీకరించేవరకు తమకు తెలియచేయలేదని ఇజ్రాయిల్‌ పేర్కొంది. మూడు దశల కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్‌ సోమవారం అంగీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ చర్చలను భగం చేసేందుకే రఫా దాడి ప్రారంభించిందని హమాస్‌ విమర్శించింది.
రఫా, కరీమ్‌ షలోమ్‌ సరిహద్దు క్రాసింగ్‌ను మూసివేయాలని నిర్ణయించడం ద్వారా ఈ ప్రాంతంలో కరువు కాటకాలను సృష్టించాలని, ప్రజలు ఆకలిదప్పులతో చనిపోయేలా చేయాలని ఇజ్రాయిల్‌ భావిస్తోందని విమర్శించింది. ఇటువంటి పరిస్థితుల్లో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్‌ను ఒప్పించేలా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని పాలస్తీనా గ్రూపు కోరింది. యుద్ధం ఇన్ని మాసాలుగా ఇలానే కొనసాగుతోందంటే అందుకు ప్రధాన బాధ్యత వహించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, అంతర్జాతీయ సమాజమేనని స్పష్టం చేసింది.రఫా దాడిని ఆపేందుకు ఇజ్రాయిల్‌ తక్షణమే చర్యలు తీసుకునేలా చూడాలని పాలస్తీనా అథారిటీ (పిఎ) ప్రతినిధి నబిల్‌ అబూ రుడెనెV్‌ా అమెరికాను కోరారు. తాజా దాడులతో నిర్వాసితుల ఇబ్బందులు రెట్టింపు అవుతాయని హెచ్చరించారు. ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, డబ్బు, రాజకీయ ఆశ్రయం ఇవ్వడం ద్వారా అమెరికా అనూహ్యమైన మానవతా విపత్తును సృష్టించిందని విమర్శించారు.

]]>
కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్‌ ఓకే https://navatelangana.com/hamas-oks-ceasefire-agreement/ Tue, 07 May 2024 22:05:26 +0000 https://navatelangana.com/?p=285873 Hamas OKs Ceasefire Agreementఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తులుగా ముందుకు తెచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్‌ అంగీకరించినట్టు గ్రూప్‌ ప్రతినిధి సోమవారం అల్‌ జజీరాతో చెప్పారు. ఇజ్రాయెల్‌ దీర్ఘకాలంగా ప్లాన్‌ చేసిన దాడికి ముందు రఫా నగరాన్ని ఖాళీ చేయమని ఆదేశించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వచ్చింది. హమాస్‌ నాయకుడు ఇస్మాయిల్‌ హనియే ఖతార్‌ ప్రధాన మంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ అల్‌ థానీ , ఈజిప్టు ఇంటెలిజెన్స్‌ మంత్రి అబ్బాస్‌ కమెల్‌తో ఫోన్లో చర్చించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తమ ప్రతిపాదనకు హమాస్‌ ఉద్యమం ఆమోదం తెలిపిందని గ్రూప్‌ అల్‌ జజీరా కు ఒక ప్రకటనలో తెలిపింది ప్రతిపాదన వివరాలు ఇంకా బహిరంగపర్చలేదు. హమాస్‌ గతంలో ఏదైనా కాల్పుల విరమణ శాశ్వతంగా ఉండాలని , ముట్టడి చేసిన పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ నుంచి ఇజ్రాయెల్‌ సైనికులందరినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఈ హామీలను ఇవ్వడానికి నిరాకరించారు. గత వారం ఇజ్రాయెల్‌ హమాస్‌ను గాజాలో అధికారంలో ఉండనివ్వదని , కాల్పుల విరమణ ఒప్పందం లేదా లేకుండా రఫాపై దాడి చేస్తుందని హెచ్చరించింది. అయితే, పాలస్తీనా ఖైదీల కోసం ఇజ్రాయెల్‌ బందీలను మార్చుకోవడానికి యుద్ధంలో తాత్కాలిక విరామాన్ని ప్రకటించటానికి ఇజ్రాయిల్‌ సిద్ధంగా ఉందని నెతన్యాహు చెప్పాడు. ప్రస్తుతం గాజాలోని ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 14 లక్షలమంది స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్లు నివసిస్తున్న దక్షిణ గాజాలోని రఫా నగరం పై దండయాత్రను ప్రారంభించాలని ఇజ్రాయెల్‌ ప్రధాని చాలా నెలలుగా బెదిరిస్తున్నారు. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, అనేక ఇతర దేశాలు ఖండించినప్పటికీ, ఇజ్రాయెల్‌ సైన్యం సోమవారం నాడు పౌరులను రఫాను విడిచి వెళ్ళాలని ఆదేశించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ”విపరీతమైన శక్తి”తో నగరంపై దాడి జరుగుతుందని హెచ్చరించింది. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించాలనే హమాస్‌ నిర్ణయాన్ని దాడి ముప్పు ప్రభావితం చేసిందా అనేది స్పష్టంగా తెలియలేదు. నెతన్యాహు రఫాలోకి ప్రవేశించాలని పట్టుబట్టినప్పటికీ, ఇతర ఇజ్రాయెల్‌ అధికారులు ఇజ్రాయెల్‌ తాత్కాలిక సంధికి అంగీకరించడం ద్వారా హమాస్‌ దాడిని నివారించవచ్చని సూచించారు. ఈజిప్ట్‌ , ఖతార్‌ ముందుకు తెచ్చిన ఒప్పందానికి ఇజ్రాయెల్‌ మద్ద తు ఉందా లేదా అనేది కూడా అస్పష్టంగా ఉంది.

]]>
రష్యా వ్యూహాత్మక అణు విన్యాసాల వెనుక …? https://navatelangana.com/behind-russias-strategic-nuclear-exercises/ Tue, 07 May 2024 22:04:22 +0000 https://navatelangana.com/?p=285868 Behind Russia's Strategic Nuclear Exercises ...?రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం ఉక్రెయిన్‌ సరిహద్దులో ఉన్న సదరన్‌ మిలిటరీ డిస్ట్రిక్ట్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాల వినియోగంలో స్నాప్‌ ఎక్సర్‌సైజ్‌ను ఆదేశించారు. ఈ డ్రిల్‌ ఉక్రెయిన్‌ సంఘర్షణను మరింత పెంచవద్దని అమెరికా, దాని మిత్రదేశాలకు ఒక హెచ్చరికగా ఉద్దేశించబడిందని మాస్కోలోని విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు వేర్వేరు బహిరంగ ప్రకటనల్లో నొక్కిచెప్పాయి. రష్యా అనేక సందర్భాల్లో అణు బెదిరింపులకు పాల్పడుతోందని పశ్చిమ దేశాలు ఆరోపించినప్పటికీ, మాస్కో అణు సిద్ధాంతం మారలేదని క్రెమ్లిన్‌ పదేపదే పేర్కొంది.”రష్యా సమగ్రత, సార్వభౌమత్వాన్ని నిర్ధారించడానికి, వ్యూహాత్మక అణ్వాయుధాల తయారీ, విస్తరణలకు సంబంధించిన ఆచరణాత్మక అంశాలను”, అలాగే పరికరాలు, సిబ్బంది సంసిద్ధతను బలోపేతం చేయడం తమ అణు కసరత్తుల ఉద్దేశం”అని రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఉక్రెయిన్‌కు సరిహద్దుగా ఉన్న సదరన్‌ మిలిటరీ డిస్ట్రిక్ట్‌ లో ఈ వ్యాయామాలు జరుగుతాయి. రోస్టోవ్‌-ఆన్‌-డాన్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. ఇది రష్యా మిలిటరీ జిల్లాలలో అతి చిన్నది. క్రిమియా, కాకసస్‌, రోస్టోవ్‌, వోల్గోగ్రాడ్‌, క్రాస్నోడార్‌ ప్రాంతాలు, అలాగే ఇటీవలే రష్యాలో కలిసిన డోనెట్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌, లుగాన్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌, ఖేర్సన్‌, జపొరొజ్జియో ప్రాంతాలలో ఈ అణు ఎక్సర్సైజెస్‌ జరుగుతాయి1945 ఆగస్టులో జపాన్‌ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపైన అమెరికా ప్రయోగించిన ఆయుధాల వంటవి ఇప్పుడు వ్యూహాత్మక అణ్వాయుధాలుగా పరిగణించబడుతున్నాయి. అవి ఫీల్డ్‌ ఫార్మేషన్‌లు లేదా గట్టిపడిన పోరాట స్థానాలు అయినా, యుద్ధభూమి లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉపయోగిం చడానికి ఉద్దేశించబడ్డాయి. 5-50 కిలోటన్నుల వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను బాలిస్టిక్‌ క్షిపణులు లేదా క్రూయిజ్‌ క్షిపణులపై అమర్చవచ్చు. రెండూ ఇస్కాండర్‌-ఎమ్‌ కాంప్లెక్స్‌ నుంచి ప్రయోగించబడతాయి. ఇలాంటి వార్‌హెడ ్‌లను కింజాల్‌, క్రూయిజ్‌ క్షిపణులు రష్యా బాంబర్లు మోసుకెళ్లగలవు. అనేక ఫిరంగి వ్యవస్థలు 152ఎమ్‌ఎమ్‌ షెల్లు , 240ఎమ్‌ఎమ్‌ మోర్టార్‌ రౌండ్లలో అమర్చబడిన 2-2.5 కిలోటన్‌ శ్రేణిలో వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను కూడా అందించగలవు.రష్యాలో దాదాపు 6,000 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని అంచనా వేయబడింది. నాటో సభ్యులు ఉక్రెయిన్‌కు క్షీణించిన యురేనియం ఆయుధాలను పంపిణీ చేసినందుకు ప్రతిస్పందనగా, గత సంవత్సరం బెలారస్‌లో పేర్కొనబడని సంఖ్యలో వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లు ఉంచబడ్డాయి. ఐరోపాలోని ఆరు స్థావరాలలో సుమారు 180 వ్యూహాత్మక అణు బాంబులను అమెరికా మోహరించింది(ఇటలీలో రెండు, బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్‌, టర్కియేలలో ఒక్కొక్కటి). ఇటీవల పోలెండ్‌ ప్రభుత్వం తమ దేశంలో అణ్వాయుధ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. పోలాండ్‌ అటువంటి అణ్వాయుధ స్థావరాన్ని గనుక నెలకొల్పితే అది తమ లక్ష్యంగా ఉంటుందని రష్యా ప్రకటించి ఉక్రెయిన్‌ వివాదానికి సంబంధించి ”పాశ్చాత్య దేశాల నాయకులు చేస్తున్న ప్రకటనలు ఇటీవలి పోరాట ప్రకటనలు , అనేక నాటో దేశాలు తీసుకున్న చర్యలను తీవ్రంగా అస్థిరపరిచే” నేపథ్యంలో ఈ వ్యూహాత్మక అణు కసరత్తులు జరుగుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
రష్యాకు ”వ్యూహాత్మక ఓటమి” కలిగించాలనే విధానాన్ని అమెరికా నేత్రుత్వంలోని నాటో కూటమి దేశాలు అనుసరిస్తున్నాయని, అది రష్యాతో బహిరంగ సైనిక ఘర్షణ దిశగా నడిపిస్తోందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకు ఉదాహరణగా పోలాండ్‌లో అమెరికా అణ్వాయుధాలను ఉంచడం గురించి పోలిష్‌ ప్రకటనలను, ఇటీవలి ఫ్రెంచ్‌, ఇతర నాటో దేశాలు తమ తమ దేశాల సైనికులను ఉక్రెయిన్‌కు పంపే అవకాశం గురించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలను కూడా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉదహరించింది.

]]>
అడ్డంకులను అధిగమించి అభివృద్ధి సాధిస్తాం https://navatelangana.com/we-will-overcome-obstacles-and-achieve-development/ Tue, 07 May 2024 19:49:00 +0000 https://navatelangana.com/?p=285778 – రష్యా అధ్యక్షులు పుతిన్‌
– ఐదోసారి దేశాధ్యక్షునిగా ప్రమాణం
మాస్కో : అన్ని అవరోధాలను అధిగమించి, అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తామని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. మంగళవారం రష్యా అధ్యక్షునిగా ఆయన ఐదవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి 15 నుండి 17 వరకు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు 87.28 శాతం ఓట్లు లభించిన సంగతి తెలిసిందే. క్రెమ్లిన్‌లో ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘రాబోయే దశాబ్దాల కాలంలో దేశాభివృద్ధిలో నమ్మదగిన కొనసాగింపు వుంటుందని హామీ ఇస్తున్నాం. రష్యా శక్తి సామర్ధ్యాలను మరింత బలోపేతం చేసేలా యువతరాలను పెంచాలి, విద్యావంతులను చేయాలి. పరస్పర సామరస్యంతో జీవించగలిగే, రష్యాలో నివసించే ప్రజలందరి సాంప్రదాయాలను పరిరక్షించేలా మన దేశ హోదాను అభివృద్ధి పరుస్తామని హామీ ఇస్తున్నాం’ అని పుతిన్‌ అన్నారు. ఈ మేరకు క్రెమ్లిన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.1999లో మొదట ప్రధానిగా చేసిన పుతిన్‌ ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షులయ్యారు. 2000 మార్చి 26న దేశాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి అధ్యక్షునిగా పనిచేశారు. 2008 నుండి 2012 వరకు ప్రధానిగా చేశారు. తిరిగి 2012 అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2018లో ఆరేళ్ళ పదవీ కాలానికి తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

]]>
తూర్పు రఫాను ఖాళీ చేయండి https://navatelangana.com/evacuate-east-rafah/ Mon, 06 May 2024 21:37:22 +0000 https://navatelangana.com/?p=285110 – ఇజ్రాయిల్‌ ఆదేశాలు
– పాలస్తీనియన్లలో పెరిగిన భయాందోళనలు
– మూటా ముల్లె సర్దుకుని వీధుల్లో గుంపులు, గుంపులుగా : ప్రతిఘటనకు సిద్ధమయ్యామన్న హమాస్‌
– రఫాను మానవతా సంస్థలు వీడరాదని విజ్ఞప్తి
– కైరో చర్చల్లో ప్రతిష్టంభన?
గాజా, జెరూసలేం: తూర్పు రఫా నగరాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయిల్‌ మిలటరీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పది లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకుంటున్న ఈ నగరంపై పూర్తి స్థాయిలో మిలటరీ దాడి జరగబోతోందన్న భయాందోళనలు ప్రజల్లో పెరిగాయి. కాగా, రఫా నగరంపై జరిగే ఏ దాడైనా ఇజ్రాయిల్‌ బలగాలకు ‘పిక్నిక్‌’ లా వుండబోదని హమాస్‌ వ్యాఖ్యానించింది. ఏదేమైనా పాలస్తీనియన్లను రక్షించుకోవడానికి తాము పూర్తిగా సంసిద్ధంగా వున్నామని చెప్పింది. సాయుధ విభాగం అల్‌ కసమ్‌ బ్రిగేడ్ల నేతృత్వంలో వీరోచితంగా ఇజ్రాయిల్‌ బలగాలను ప్రతిఘటించేందుకు సమాయత్తమయ్యామని హమాస్‌ ప్రకటించింది. ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే వేలాదిమంది ప్రజలు మూటా ముల్లె సద్దుకుని, పిల్లలు, వృద్ధులతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ముఖ్యమైన వస్తువులను తీసుకుఏని స్వంత వాహనాల్లో రఫా సెంట్రల్‌, అల్‌ మవసి ప్రాంతాలకు వెళుతుండడం కనిపిస్తోంది. నుస్రత్‌, డేర్‌ ఎల్‌ బాలా వీధుల్లో ప్రజలు గుంపులు, గుంపులుగా తరలుతున్నారు. ఎక్కడ సురక్షిత ప్రాంతం వుందో కూడా తమకు అర్ధం కావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయిల్‌ ఆదేశాలు వెలువడిన వెంటనే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, నెతన్యాహుతో మాట్లాడారు. మరో ఊచకోత మొదలవబోతోందని జోర్డాన్‌ వ్యాఖ్యానించింది. పరిస్థితులేమీ బాగా లేవని మానవతా సాయం కార్యకర్తలు తెలిపారు. మొండిగా ముందుకు సాగుతున్న ఇజ్రాయిల్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని బెల్జియం ప్రకటించింది. దీనిపై కసరత్తు జరుగుతోందని తెలిపింది.
ఎవరెంత చెప్పినా వినకుండా మొండిపట్టుతో, మూర్ఖత్వంతో ఒక పద్ధతి ప్రకారం రఫాపై దాడికి ఇజ్రాయిల్‌ సిద్ధమవుతున్న తరుణంలో అంతర్జాతీయ సమాజం అత్యవసరంగా చర్యలు తీసుకుని ఈ నరమేథాన్ని ఆపాలని హమాస్‌ కోరింది. అనూహ్యమైన విపత్తు చోటు చేసుకుంటుందని హెచ్చరించింది. తూర్పు రఫాలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే దాదాపు లక్ష మందిని అక్కడ నుండి తరలిపోవాల్సిందిగా ఇజ్రాయిల్‌ మిలటరీ ఆదేశించిన నేపథ్యంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులతో సహా వందల వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లనుందని పేర్కొంది. అలాగే రఫా నగరాన్ని వీడి వెళ్ళవద్దని పాలస్తీనియన్ల వ్యవహారాలు చూసే ఐక్యరాజ్య సమితి శరణార్ధ సంస్థ (యుఎన్‌ ఆర్‌డబ్ల్యుఎ)తో మానవతా సంస్థలకు హమాన్‌ విజ్జప్తి చేసింది. మరోవైపు, ఈజిప్ట్‌ రాజధాని కైరోలో కాల్పుల విరమణ చర్చలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రఫా తరలింపు వున్నా చర్చలు కొనసాగించాలని భావిస్తున్నట్లు హమాస్‌ తెలిపింది. సానుకూల ధోరణితోనే చర్చలు కొనసాగించాలనుకుంటున్నామని అబ్దుల్‌ లతీఫ్‌ మీడియాకు తెలిపారు. శాశ్వతంగా కాల్పుల విరమణ కోసం ఒప్పందం కుదుర్చుకోవడం అవసరమని హమాస్‌ ప్రతినిధి చెప్పారు. కాగా ఇజ్రాయిల్‌ కాల్పుల విరమణ ప్రతిపాదనలను బహిరంగంగానే తోసిపుచ్చుతోంది. కాగా, ఇజ్రాయిల్‌ వైఖరి వెంటనే తెలియరాలేదు. గత ఏడు మాసాలుగా సాగుతున్న యద్ధంలో 34,735 మంది పాలస్తీనియన్లు మరణించగా, 78,108మంది గాయపడ్డారని పాలస్తీనా అధికారులు సోమవారం తెలిపారు.
దిక్కుతోచడం లేదు
సోమవారం రఫాలో ఇజ్రాయిల్‌ మిలటరీ వైమానిక దాడులు జరిపిందని ప్రజలు తెలిపారు. రఫాలోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటే ఇజ్రాయిల్‌ ఆదేశించిన కొన్ని గంటల వ్యవధిలో ఈ దాడులు జరిగాయి. తరలిపోవాలని ప్రజలు ఆదేశాలు అందుకున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇజ్రాయిల్‌ ఆర్మీ ఈ వైమానిక దాడులు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో రఫాలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎక్కడకు వెళ్ళాలోకూడా తెలియడం లేదని పాలస్తీనియన్లు వాపోతున్నారు. ‘ఇజ్రాయిల్‌ ఆదేశాల నేపథ్యంలో తమకు దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయని ఉత్తరప్రాంతంలో తలదాచుకున్న అబూ ముహే వ్యాఖ్యానించారు. భారీగా వర్షం పడుతోంది, ఎక్కడకు వెళ్ళాలో తెలియడం లేదు. ఇలాంటి రోజొకటి వస్తుందని భయపడుతునే వున్నాను. నా కుటుంబాన్ని ఎక్కడకు తీసుకెళ్ళాలో చూడాల్సి వుంది.’ అని మరో శరణార్ధి అబూ రయీద్‌ వ్యాఖ్యానించారు.
ఆమోదయోగ్యం కాదు
రఫాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయిల్‌ జారీ చేసిన ఆదేశాలు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని యురోపియన్‌ యూనియన్‌ దౌత్యవేత్త జోసెఫ్‌ బారెల్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. భద్రతా మండలి ఆమోదించిన 2728 తీర్మానాన్ని ఇజ్రాయిల్‌ తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన కోరారు.
బ్రిటన్‌ వర్శిటీల్లో నిరసన శిబిరాలు
గత కొద్ది వారాలుగా అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌ సహా పలు దేశాల్లో సాగుతున్న విద్యార్ధుల నిరసన శిబిరాలు తాజాగా బ్రిటన్‌కు పాకాయి. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి వర్శిటీల్లో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల శిబిరాలను ఏర్పాటు చేశారు. పాల స్తీనియన్లకు సంఘీభావం తెలియచేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కొన్ని రోజుల పాట ఈ శిబిరాన్ని ఇలాగే కొనసాగిం చాలని భావిస్తున్నట్లు విద్యార్ధులు తెఇపారు. గాజాలో మారణహోమాన్ని, వర్ణవివక్షతను తక్షణమే నిర్మూలించాలని కోరారు. ఇజ్రాయిల్‌ ఆక్రమణల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే సంస్థలు, కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కోరారు. గాజాలో ఉన్నత విద్యా రంగాన్ని పాలస్తీనా నేతృత్వంలో పునర్నిర్మిస్తామని ఆక్స్‌ఫర్డ్‌ వర్శిటీ హామీ ఇవ్వాలని కూడా వారు కోరారు.

]]>
ఆస్ట్రేలియాలో భారత విద్యార్ధి హత్య https://navatelangana.com/indian-student-murdered-in-australia/ Mon, 06 May 2024 21:27:02 +0000 https://navatelangana.com/?p=285087 – నిందితులుగా అనుమానిస్తున్న మరో ఇద్దరి కోసం గాలింపు
మెల్‌బోర్న్‌, చండీగడ్‌: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధి ఒకరు కత్తిపోట్లకు గురై మరణించాడు. ఈ హత్యతో సంబంధముందని భావిస్తున్న మరో ఇద్దరు భారతీయుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి అద్దె విషయమై స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ ఈ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. అయితే మృతుడు నవజీత్‌ సంథు(22)కు ఈ గొడవకు అసలు సంబంధం లేదు. వారిని ఘర్షణ పడవద్దని వారించినందుకే ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. హర్యానాలోని కర్నాల్‌కి చెందిన నవజీత్‌ చదువు కోసం ఏడాదిన్నర క్రితం ఆస్ట్రేలియా వచ్చాడు. ఈ ఏడాది జులైలో శలవుల కోసం స్వదేశానికి రావాల్సి వుంది. ఈలోగానే ఇంత ఘోరం జరిగింది. వేరే చోటకు ఇల్లు మారదామనుకున్న నవజీత్‌ స్నేహితుడు (మరో భారతీయ విద్యార్ధి) తన సామాన్లతో కొత్త ఇంటికి తీసుకెళ్ళడానికి సాయం చేయాల్సిందిగా నవజీత్‌ను అడిగాడు. కారులో ఫ్రెండ్‌ను తీసుకెళ్ళడానికి వచ్చిన నవజీత్‌కు లోపల ఇంట్లో నుండి అరుపులు వినిపించడంతో లోపలకు వెళ్ళి అక్కడ ఘర్షణ పడుతున్న వారిని అడ్డుకోబోయాడు. వెంటనే ఛాతీలో తీవ్రంగా కత్త్తితో పొడవడంతో నవజీత్‌ చనిపోయాడని, అతడి స్నేహితుడు కూడా గాయపడ్డాడని నవజీత్‌ మావయ్య యశ్వీర్‌ తెలిపారు. ఆదివారం తెల్లవారు జామున తమకు సమాచారం అందిందని చెప్పారు. నిందితులుగా భావిస్త్నువారు కూడా కర్నాల్‌కి చెందినవారేనని తెలిపారు. నవజీత్‌ చాలా తెలివైన విద్యార్ధి అని చదువు కోసం తండ్రి ఎకరంన్నర పొలాన్ని అమ్మి మరీ ఆస్ట్రేలియా పంపించారని, ఈలోగా ఈ ఘోరం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు యశ్వీర్‌ తెలిపారు. తెల్ల టయోటా కారులో సోదరులు అభిజిత్‌, రాబిన్‌ గర్టన్‌ ఇరువురు పారిపోయారని, వారి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారని యశ్వీర్‌ చెప్పారు.

]]>
బ్రెజిల్‌ను ముంచెత్తిన వర్షాలు, వరదలు https://navatelangana.com/rains-flood-brazil/ Mon, 06 May 2024 21:11:05 +0000 https://navatelangana.com/?p=285060 – 78మంది మృతి, వేలాదిమంది తరలింపు
పోర్ట్‌ అలెగర్‌: దక్షిణ బ్రెజిల్‌ను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించడంతో 78మంది మరణించారు. లక్షా 15వేల మంది నిరాశ్రయులయ్యారు. పలు నగరాలు నీట మునిగాయి. వేలాదిమంది ప్రజలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రియో గ్రాండె రాష్ట్ర రాజధాని పోర్టో అలెగ్రెలో ప్రజలు ఇళ్ళ పైకప్పుల మీద ఎక్కి కూర్చున్నారు. నదుల్లాగా మారిన వీధుల్లో చిన్న చిన్న పడవలు వేసుకుని ప్రజలు వెళుతున్నారు. ఆందోళనకరంగా పరిణమించిన వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావమే ఈ విపత్తుకు కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలించకపో వడంతో 3వేల మందికి పైగా సైనికులను, అగ్నిమాపక సిబ్బందిని, ఇతర సహాయక కార్యకర్తలను రంగంలోకి దించారు. ప్రాధమిక అవసరాలు కూడా తీరని ఇబ్బందికర పరిస్థితుల్లో అనేకమంది చిక్కుకుపోయి, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. మొత్తంగా 341 పట్టణాలు, గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. తాజా పరిస్థితుల్లో 105మంది గల్లంతయ్యారని పౌర రక్షణాధికారులు తెలిపారు. యుద్ధం సంభవించి అంతా తుడిచిపెట్టుకుపోయినట్లు వుందని, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను చేపట్టాల్సి వుందని రియో గ్రాండ్‌ గవర్నర్‌ ఎడ్వర్డ్‌ లెయిట్‌ తెలిపారు. అధ్యక్షుడు లూలా డసిల్వా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.

]]>
కొలంబియా వర్సిటీలో కాల్పులు https://navatelangana.com/shooting-at-columbia-university/ Mon, 06 May 2024 19:42:25 +0000 https://navatelangana.com/?p=284985 – కొనసాగుతున్న దమనకాండ
– వైఖరిలో మార్పులేదన్న బైడెన్‌
– వామపక్ష రాడికల్స్‌ అంటూ ట్రంప్‌ అవహేళన
న్యూయార్క్‌: గాజా పట్ల అమెరికా విధానానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దమన కాండ కొనసాగుతోంది. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని హామిల్టన్‌హాలు లోపల ఓ పోలీసు తుపాకీతో కాల్పులు జరిపాడు. మరో పోలీసు మెట్లపై నుంచి ఓ విద్యార్థిని కిందకు తోసేశాడు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో 200 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. విస్కాన్సిన్‌-మాడిసన్‌ విశ్వ విద్యాలయంలో పోలీసులు నిరసన శిబిరాలను తొలగించారు. అయితే, 24 గంటలు కూడా తిరగక మునుపే విద్యార్థులు అదే చోట 30 గుడారాలను ఏర్పాటుచేసుకున్నారు. చాలా యూనివర్సిటీల్లో పోలీసులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. న్యూయార్క్‌లోని పోర్టు హామ్‌ యూనివర్సిటీ, న్యూహాంప్‌షైర్‌లోని డార్ట్‌ మౌత్‌కామ్‌ యూనివర్సిటీ, న్యూ ఓర్లీన్స్‌లోని టూ లేన్‌ వర్సిటీల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇలినాయిస్‌లో నార్త్‌ వెస్టర్న్‌ వర్సిటీ, చికాగో విశ్వవిద్యాలయం, రోడ్‌ ఐలండ్‌లోని బ్రౌన్‌ యూనివర్సిటీ, ఇతర కొన్ని కళాశాలల యాజమాన్యాలు మాత్రం పోలీసులను పిలవకుండా నిరసనకారులతో శాంతియుత చర్చలు జరుపుతున్నాయి. కొలంబియా యూనివర్సిటీలో కి పోలీసులను పిలిపించిన యూనివర్సిటీ చాన్సలర్‌ మినోచె షఫిక్‌ చర్యను అమెరికన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌ అసోసియేషన్‌ (ఎఎయుపి) ఖండించింది. దీనిని సాయుధ ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది.
మా వైఖరిలో మార్పులేదు: బైడెన్‌
అంతులేని సైనిక సహాయాన్ని ఇజ్రాయిల్‌ యుద్ధ తంత్రంలోకి పంప్‌ చేస్తున్న బైడెన్‌ ఈ నిరసనలకు తాను భయపడేది లేదని, ఇజ్రాయిల్‌ పట్ల తన ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు. నిరసనలు ప్రభుత్వ విధానంలో ఏమైనా మార్పు తెస్తాయా అని విలేకరులు వైట్‌ హౌస్‌లో బైడెన్‌ను ప్రశ్నించినప్పుడు లేదు అని పెడసరంగా సమాధానమిచ్చారు. యూనివర్సిటీ విద్యార్థుల నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్న బైడెన్‌, శాంతి భద్రతల పేరుతో పోలీసుల దమనకాండను సమర్థించుకున్నారు. యూనివర్సిటీలో వందల వేల డాలర్లు ట్యూషన్‌ ఫీజు చెల్లించిన విద్యార్థులు ఈ నిరసనల వల్ల విద్యాహక్కును కోల్పోతున్నారని, జీవితాంతం ఆ అప్పుల బాధ వారిని వెంటాడుతుందని మెసలి కన్నీరు కార్చారు. గాజాలో ఇజ్రాయిల్‌ గత ఏడు నెలలుగా సాగిస్తున్న దురాక్రమణ పూరిత దాడుల్లో 14 వేల మంది పిల్లలు చనిపోతే ఆయనకు ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. మొత్తంగా 35 వేల మంది అమాయక పౌరులు చనిపోయారు.

]]>
గాజా మారణహోమానికి https://navatelangana.com/to-the-gaza-genocide/ Sun, 05 May 2024 21:11:44 +0000 https://navatelangana.com/?p=284331 to the Gaza genocide– వ్యతిరేక ఆందోళనపై ఉక్కుపాదం
– అమెరికా విశ్వవిద్యాలయాల నిరసనలపైన బైడెన్‌ సర్కార్‌ అణచివేత
అమెరికా : పాలస్తీనా అనుకూల నిరసనలను అరికట్టడానికి పోలీసు హింసకు అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపిన ఆమోద ప్రభావం అమెరికా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతూ ఉంది. కొలంబియా విశ్వవిద్యాలయం, సిటీ కాలేజ్‌ ఆఫ్‌ న్యూయార్క్‌, పోర్ట్‌లాండ్‌ విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయం, టేనస్సీ విశ్వవిద్యాలయం, ఇతర క్యాంపస్‌లలో గురువారం 300 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ భారీ పోలీసు దాడులు ఆ మధ్యాహ్నం బైడెన్‌ చేసిన మూడు నిమిషాల ప్రసంగాన్ని అనుసరించాయి. ఆ ప్రసంగంలో అతను శాంతియుత నిరసనలను ”హింసాత్మకం”, ”యూదు వ్యతిరేకం” అని ప్రకటించాడు. ”ఆర్డర్‌ తప్పనిసరిగా గెలవాలి” అని చెప్పాడు.
బైడెన్‌ మాట్లాడటానికి కొన్ని గంటల ముందు, లాస్‌ ఏంజిల్స్‌ పోలీసులు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా క్యాంపస్‌లో ప్రవేశించి 137 మందిని అరెస్టు చేశారు. బుధవారం రాత్రి నిద్రిస్తున్న నిరసనకారులపై జియోనిస్ట్‌ ఫాసిస్టులు చేసిన దాడులను ఆపటానికి పోలీసులు ఏమీ చేయలేదు. శుక్రవారం న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ది న్యూ స్కూల్‌, న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం వద్ద నిరసన శిబిరాలను కూల్చివేసింది. ది న్యూ స్కూల్‌లో 43 మందిని, న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొలంబియాలోని హామిల్టన్‌ హాల్‌ను శాంతియుతంగా ఆక్రమించిన విద్యార్థులపై దాడి చేస్తున్న సమయంలో పోలీసుల్లో ఒకరు తన ఆయుధాన్ని ”అనుకోకుండా ప్రయోగించారని” న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అంగీకరించింది. తుపాకీ డిశ్చార్జ్‌పై మూడు రోజుల మౌనానికి పోలీసు ప్రతినిధి ఎటువంటి కారణం చెప్పలేదు.
అయితే నిరసనకారులను ”హమాస్‌ టెర్రరిస్టులు”, ”బయటి ఆందోళనకారులు” అని దుమ్మెత్తిపోయడానికి డెమోక్రాట్లు, రిపబ్లికన్‌లు చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా శుక్రవారం ఉదయం అరెస్టు చేసిన నిరసనకారులు విద్యార్థులని అంగీకరించిన తర్వాత న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ కాజ్‌ డాట్రీ ఇలా అన్నాడు : ఈ ఉద్యమం వెనుక ఎవరో ఉన్నారు… దీనికి ఎవరో నిధులు సమకూరుస్తున్నారు. మా విద్యార్థులను ఎవరో తీవ్రవాదం వైపు మరలిస్తున్నారు. మా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ టెర్రరిజం, ఇంటెలిజెన్స్‌ విభాగం అది ఎవరో కనుగొంటారు. అలా చేసినప్పుడు మేము వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాము.
శుక్రవారం కూడా, చాపెల్‌ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా వద్ద గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణహోమాన్ని ఆపాలని డిమాండ్‌ చేయడానికి ట్రాఫిక్‌ను నిలిపివేసిన ప్రదర్శనను పోలీసులు అనేక వందల మందితో విచ్ఛిన్నం చేశారు. పోలీసులు కనీసం 30 మందిని అరెస్టు చేశారు. విస్కాన్సిన్‌-మాడిసన్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు తదుపరి వారం ఫైనల్స్‌ ప్రారంభానికి ముందు నిరసన శిబిరాన్ని ముగించాలని డిమాండ్‌ చేసింది. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా సోమవారం అధ్యాపకులు వాకౌట్‌ చేస్తారని యుడబ్ల్యూ-మాడిసన్‌ వద్ద నిరసన కారులు ప్రకటించారు. చికాగో విశ్వవిద్యాలయం అధ్యక్షుడు పాల్‌ అలివిసాటోస్‌ ఏప్రిల్‌ 29న విద్యార్థులు ఏర్పాటు చేసిన శిబిరాన్ని తీసివేయాలని బెదిరించాడు.
క్యాంపస్‌ కాలేజ్‌ గ్రీన్‌లో ఏప్రిల్‌ 25 నుంచి కొనసాగుతున్న నిరసన శిబిరం త్వరలో మూసివేస్తారని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పాలనా యంత్రాంగం శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. వాక్‌ స్వాతంత్య్రం, రాజకీయ వ్యక్తీకరణ హక్కుల ఉల్లంఘనలను న్యాయపరంగా సవాలు చేయటానికి పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసన తెలిపిన తర్వాత ఇండియానా యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి నిషేధించబడిన ముగ్గురి తరపున అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ బ్లూమింగ్టన్‌ ఇండియానాలో శుక్రవారం కోర్టును ఆశ్రయించింది. ప్రొఫెసర్‌ బెంజమిన్‌ రాబిన్సన్‌, గ్రాడ్‌ విద్యార్థి మడేలిన్‌ మెల్‌డ్రమ్‌, బ్లూమింగ్టన్‌ నివాసి జాస్పర్‌ విర్ట్‌ షాఫ్టర్‌ అనే ముగ్గురు వ్యక్తులు నిరసనల కోసం నిర్దేశించబడిన 20 ఎకరాల క్యాంపస్‌ స్థలమైన డన్‌ మేడో వద్ద ప్రదర్శనలు చేస్తున్నారు, వారిని అరెస్టు చేసి తర్వాత నిషేధించారు.
గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ చేస్తున్న సామూహిక హత్యాకాండను వ్యతిరేకిస్తున్న నిరసన కారులపైన జరుగుతున్న పోలీస్‌ దాడులకు బైడెన్‌ పాలన, అమెరికాలోని రెండు పాలక పార్టీలతో పాటు అమెరికా సామ్రాజ్యవాద నాయకత్వంలోని నాటో కూటమి దేశాల మద్దతు ఉంది. అయినప్పటికీ, విద్యార్థులు, కార్మికులు సాహసోపేతంగా తమతమ నిరసన కొనసాగిస్తున్నారు. కొలంబియా, యూనివర్శిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా, లాస్‌ఏంజలిస్‌, ఇతర అమెరికా విశ్వవిద్యాలయ విద్యార్థులు తీసుకున్న వైఖరి స్ఫూర్తితో విద్యార్థుల నిరసన శిబిరాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ప్రారంభించాయి. లండన్‌, ప్యారిస్‌, రోమ్‌, సిడ్నీ, టోక్యో, బీరూట్‌లలో విద్యార్థుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

]]>
చర్చలకు నెతన్యాహునే అడ్డంకి https://navatelangana.com/netanyahu-is-an-obstacle-to-negotiations/ Sun, 05 May 2024 19:09:52 +0000 https://navatelangana.com/?p=284252 – హమాస్‌ విమర్శ
– అల్‌జజీరా కార్యాలయాల మూసివేత
జెరూసలెం/గాజా : కాల్పుల విరమణపై ఒప్పందం కోసం జరుగుతున్న యత్నాలను నెతన్యాహు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని హమాస్‌ విమర్శించింది. గాజాలో ఇజ్రాయిల్‌ ఆక్రమణకు స్వస్తి పలికేలా సమగ్ర కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని హమాస్‌ నిజాయితీగా కృషి చేస్తోందని, హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనీయే చెప్పారు. కైరోలో ఇరు పక్షాల మధ్య చర్చలు పునరుద్ధరించాల్సి వుంది, అందుకోసం ప్రతినిధి బృందాన్ని పంపించాల్సి వుంది. రఫా నగరంపై మిలటరీ దాడిని ఇజ్రాయిల్‌ ప్రారంభించదని అమెరికా గ్యారంటీ ఇవ్వాలని హమాస్‌ కోరుతోంది. ఒప్పందం కుదురుతుందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా దాడి జరిగి తీరుతుందని నెతన్యాహు చెబుతున్నారు. కాల్పుల విరమణకు నెతన్యాహు అంగీకరించాలని, ఒప్పందంలో భాగంగా గాజాలోని బందీలను విడిపించాలని ఇజ్రాయిల్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు కోరుతున్నారు. బందీలను విడుదల చేయాలంటే గాజాలో యుద్ధానికి ఇక స్వస్తి పలకాలని హమాస్‌ చేస్తున్న డిమాండ్‌ను నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అల్‌జజీరా కార్యాలయాల మూసివేతకు ఆదేశం ఇదిలావుండగా, ఇజ్రాయిల్‌లో అల్‌ జజీరా కార్యాలయాలన్నింటినీ మూసివేయాలని నెతన్యాహు ప్రభుత్వం ఆదేశిచింంది.

]]>
100 బిలియన్‌ యూరోల ఉక్రెయిన్‌ యుద్ధ నిధి ఏర్పాటును https://navatelangana.com/100-billion-euro-ukraine-war-fund/ Fri, 03 May 2024 21:14:27 +0000 https://navatelangana.com/?p=282968 100 బిలియన్‌ యూరోల ఉక్రెయిన్‌ యుద్ధ నిధి ఏర్పాటును– నాటో పిచ్చితనంగా హంగేరి ప్రకటన
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు నిధులు సమకూర్చేందుకు 100-బిలియన్‌ యూరోల (107 బిలియన్‌ డాలర్లు) ఐదేళ్ల నాటో ప్రణాళికను బుడాపెస్ట్‌ వ్యతిరేకిస్తోందని హంగేరియన్‌ విదేశాంగ మంత్రి పీటర్‌ స్జిజార్టో తెలిపారు. సైనిక సహాయ నిధికి సంబంధించిన ముసాయిదా ప్రణాళికను ఈ వారం ప్రారంభంలో సెక్రెటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ అమెరికా నేతత్వంలోని నాటో కూటమిలోని సభ్య దేశాలకు సమర్పించినట్టు స్జిజార్టో వెల్లడించారు. పారిస్‌లో ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీి) దేశాల మంత్రివర్గ సమావేశానికి వెళ్లే ముందు మంత్రి హంగేరియన్‌ బ్రాడ్‌కాస్టర్‌ ఎమ్‌1తో మాట్లాడుతూ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారంనాడు నాటో సభ్య దేశాలు 100 బిలియన్ల యూరోలను సమీకరించాలని సెక్రెటరీ జనరల్‌ ప్రతిపాదనను అందుకున్నాయి. ఈ మొత్తాన్ని నాటో ఉక్రెయిన్‌ యుద్ధం కోసం ఖర్చు చేయాలని యోచిస్తోంది అని హంగేరియన్‌ దౌత్యవేత్త చెప్పాడు. ఐదేళ్లలో ఈ డబ్బును సేకరించవలసి ఉంటుంది కాబట్టి ఉక్రెయిన్‌ యుద్ధం మరో ఐదేళ్ళపాటు కొనసాగుతుందని నాటో భావిస్తున్నట్టుగా అనుకోవచ్చు. హంగరి ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తుంది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వడం లేదా దాని సైనికులకు శిక్షణ ఇవ్వడంలో హంగరి పాల్గొనడం లేదని స్జిజార్టో నొక్కిచెప్పాడు. ముసాయిదా ప్రణాళిక దాని మొదటి పఠనం స్థాయిలోనే బ్లాక్‌ సభ్య దేశాలకు సమర్పించబడిందని, అంటే అది ఇప్పటికీ చర్చలకు లోబడే ఉందని ఆయన చెప్పారు.
”చర్చల సమయంలో రాబోయే వారాల్లో మేము ఈ 100 బిలియన్లను సేకరించి, ఐరోపా నుండి పంపడమనే ఈ పిచ్చి నుండి దూరంగా ఉండటానికి హంగేరి హక్కు కోసం పోరాడుతాము. బుడాపెస్ట్‌ తన స్వంత ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తుంది. యుద్ధం నుంచి దూరంగా ఉండటానికి తన వంతు కషి చేస్తుంది. చర్చల ద్వారా మాత్రమే వివాదం పరిష్కరించబడుతుందని హంగేరి భావిస్తుందని అన్నారు. కొత్త ప్రపంచ యుద్ధం ముప్పు, అణు యుద్ధానికి సన్నాహాలను మేము విస్మరించలేము. ఇక్కడ ఐరోపాలో ఈ పిచ్చిని ఆపాలి, ” అని స్జిజార్టో కోరాడు. ఉక్రేనియన్‌ యుద్ధంలో అమెరికా నేతత్వంలోని నాటో కూటమి – యూరోపియన్‌ యూనియన్ల ప్రమేయంపై హంగేరీ స్థిరంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
కీవ్‌కు మద్దతు ఇవ్వడానికి లేదా దాని దళాలకు శిక్షణ ఇవ్వడానికి ఆయుధాలను పంపడానికి నిరాకరించింది. మూడవ దేశాల నుండి అటువంటి సరుకులను పంపడానికి తన భూభాగాన్ని ఉపయోగించడాన్ని నిషేధించింది. చాలా కాలంగా ఉక్రేనియన్‌ నాయకత్వం యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటిగావున్న ఉక్రెయిన్‌ నాటోలో సంభావ్య ప్రవేశానికి వ్యతిరేకంగా బుడాపెస్ట్‌ కూడా బహిరంగంగా మాట్లాడింది ఉంది.

]]>