అడవుల తోనే జీవుల మనుగడ ఉంటుందని,నూతనంగా అడవులు అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఉన్న అడవులను రక్షించు కోవాల్సిన ఆవశ్యకత ప్రతీ పౌరుడి పై ఉంటుందని సీసీ ఎఫ్ భీమా నాయక్ అన్నారు. ఆయన మండలంలో నూతన అటవీ అభివృద్ది పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు అటవీ సంపదతో మానవ మనుగడ ఉంటుంది, వన్యప్రాణులు ఆవాసం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఎఫ్డీఓ దామోదర్ రెడ్డి,ఎఫ్ఆర్ఓ మురళీ,ఎఫ్ఎస్ఓ శ్రీనివాస్,ఎఫ్బీఓ నరేష్,మల్సూర్ లు ఉన్నారు.