पाकिस्तान के क्वेटा रेलवे स्टेशन के पास बड़ा बम धमाका !!
इसमें बम धमाके मे 22 की मौत, 30 घायल।
ज्यादा खुजली हुई तो खुद पे ही बम मार लिया 💣 #QuetaBombBlast #Pakistan #Balochistan #TrainAccident pic.twitter.com/llL88PItEr
— Ansh (@realonlineansh) November 9, 2024
నవతెలంగాణ-హైదరాబాద్ : బాంబు పేలుడుతో పాకిస్థాన్ మరోసారి దద్ధరిల్లింది. బలూచిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. స్టేషన్ నుంచి రైలు పెషావర్‌కు బయల్దేరుతుండగా.. ఈ పేలుడు సంభవించినట్లు పాకిస్థాన్ డాన్ న్యూస్ నివేదించింది. ఈ ఘటనలో 24 మంది మరణించగా.. సుమారు 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుడును ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహ్మద్ బలోచ్ తెలిపారు. ఘటన సమయంలో రైలు ప్లాట్‌ఫామ్‌పై వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా పేలుడు సంభంవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైలు ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.