నూతన విద్యావిధానంలోనే బోధించాలి: సీడీపీఓ రోజా రాణి

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రతి అంగన్వాడి కేంద్రం లో రివైజ్డ్ కర్క్యులం బోధించాలని, జాతీయ విద్యా విధానం ద్వారా పిల్లలని పూర్తి సంసిద్దులను చేయడమే లక్ష్యంగా పాఠ్య ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని సీడీపీఓ రోజా రాణి అంగన్వాడీ ఉపాధ్యాయులకు సూచించారు. జాతీయ నూతన విద్యావిధానం (ఎన్ఈపీ) భాగంగా అంగన్వాడి బోధనలో మార్పులు, కొత్త రివైజ్డ్ కర్క్యులం లను మండలంలో గల అంగన్వాడి టీచర్స్ 3 వ బ్యాచ్ శిక్షణా మంగళవారంతో  ముగించారు. ముగింపు సందర్భంగా ఆమె పాల్గొని పలు సూచనలు, సలహాలు చేసారు.  ఈ కార్యక్రమం ను మాస్టర్ ట్రైనర్స్ జే.వరలక్ష్మి శిక్షణ ఇచ్చారు.ఇందులో మండల లోని సూపర్వైజర్,టీచర్స్ పాల్గొన్నారు.
Spread the love