పెరటి తోటలతో అనేక ప్రయోజనాలు – సిడిపిఒ రోజా రాణి

నవతెలంగాణ – అశ్వారావుపేట
పెరటి తోటలు పెంచడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అందుకోసం స్థలం ఉన్న అంగన్ వాడీ కేంద్రాల్లో విటిని పెంచాలని సిడిపిఒ రోజా రాణి సూచించారు. సోమవారం అశ్వారావుపేట పట్టణంలోని కోత మిషన్ బజార్ అంగన్వాడి సెంటర్ లోని మేరీ లైఫ్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటి ఆవరణలోని పెరటి తోటలు పెంపకం గురించి ఆయాలకు, టీచర్ లకు అవగాహన కల్పించారు. కరివేపాకు, ములగాకు ఇగురు, తులసి మొక్కలు స్కూలు ఆవరణ లోనూ, అంగన్వాడి సెంటర్స్ లో పెంచాలి అని అన్నారు. వారంలో రెండు రోజులు మిల్లెట్ ఫుడ్ తీసుకోవాల్సిన ఆవశ్యకతను తల్లులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి అని, ఒక్కసారి వాడిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తిరిగి వాడకూడదు అని, స్టీల్ బాటిల్స్, గాజు బాటిల్స్ లోని వాటర్ తీసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పర్యావరణ కాపాడుకోవాలి అని అన్నారు. చెట్ల పెంపకం, ఇంటి చుట్టూ ఇంకుడు గుంటలో బావులు పక్కన, బోర్లు పక్కన ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, నీటి ఆదాయాన్ని బాగా పెంపొందించాలి అని తల్లులకు అవగాహన కల్పించారు. అంగన్వాడి సెంటర్లో ఈ కార్యక్రమానికి గర్భిణీలు, బాలింతలు,ఆశా,సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడి టీచర్ నాగమణి  తదితరులు పాల్గొన్నారు.
Spread the love