నేడు రాష్ట్రానికి సీఈసీ..

CEC for the state today.– ఎన్నికల సన్నాహాలపై పరిశీలన
– మూడు రోజులు బిజీబిజీ
– తాజ్‌కృష్ణలో రాజకీయపార్టీల నేతలతో భేటి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) బృందం మంగళవారం రాష్ట్రానికి రానుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో సీఈసీ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలో ఎన్నికల సన్నాహాలపై సమీక్ష చేయనున్నారు. మూడు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. సీఈసీతోపాటు మరో ఇద్దరు కమిషన్లు, డిప్యూటీ కమిషనర్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (సీఈవో)తో కలిసి ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. తొలిరోజు మంగళవారం హౌటల్‌ తాజ్‌కృష్ణలో రాజకీయ పార్టీల నాయకులతో భేటి కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నాం 2:30 నుంచి 4.:30 గంటల వరకు జరగనుంది. ఆ తర్వాత ఐదు గంటల నుంచి 6:30 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంటు ఏజెన్సీలతో మాట్లాడనున్నారు. అలాగే నాలుగో తేదీన ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు రాష్ట్ర ఎన్నికల అధకారి వికాస్‌రాజ్‌, కేంద్ర ఎన్నికల సంఘానికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఎన్నికల కోసం ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు, ఇతర అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో చర్చ జరగనుంది. ఇకపోతే చివరిరోజైన ఐదో తేదీన ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటలకు టెక్‌మహీంద్రాలో స్వీప్‌ యాక్టివిటీకి సంబంధించి కార్యక్రమాన్ని పరిశీలిస్తారు. అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో భేటికానున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై వీరితో జరిగే సమీక్షలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సంజీవ్‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు కమిషనర్లు, డిప్యూటీ కమిషన్లు పాల్గొంటారు. చివరగా మధ్యాహ్నాం 1:20 గంటల నుంచి రెండు గంటల వరకు మీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు. ఈ మూడు రోజులు మొత్తం అన్ని కార్యక్రమాలు హోటల్‌ తాజ్‌కృష్ణలోనే నిర్వహిస్తారు. కేంద్ర ఎన్నిల సంఘం రాక నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బృందంతో సమీక్ష చేశారు. అన్ని వివరాలు నివేదికల రూపంలో పొందుపరుచుకోవాలనీ, కేంద్ర ఎన్నికల సంఘం అడిగే సందేహాలకు సమాధానం చెప్పడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Spread the love