అంగన్వాడీ డిమాండ్స్ డేను, జయప్రదం చేయండి: సీఐటీయూ 

నవతెలంగాణ – కంటేశ్వర్
ఈనెల 10న దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్స్ డే నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది అని సీఐటీయూ గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని. అంగన్వాడీ టీచర్లకు నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని ఆయాలకు 19000 చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గత పది సంవత్సరాలుగా బకాయి ఉన్న టిఏడిఏలను చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లకు, ఆయాలకు గ్రాట్యూటీ, రిటైర్డ్ అనంతరం వేతనంలో సగం నెలనెలా పెన్షన్స్ సౌకర్యాన్ని కల్పించాలని. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 18 లో పెంచిన వేతనాలను బకాయిల తో సహా చెల్లించాలని, పిల్లలకు , గర్భిణీలు బాలింతలకు అందించే పౌష్టిక ఆహారం మెనూ బిల్లు లను పెంచాలని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇన్చార్జ్ అలవెన్స్ లను చెల్లించాలని, చనిపోయిన కార్యకర్తలకు ఆయాలకు మట్టి ఖర్చుల కొరకు 50 వేల రూపాయలు చెల్లించాలని , అదనపు పనులను ఉపసంహరించాలని అంగన్వాడీ కార్యకర్తలకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అమల్దర్ పాలని, కార్మిక చట్టాల మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జరగబోయే నిరసన కార్యక్రమాన్ని జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే దేవగంగు, పి స్వర్ణ, కోశాధికారి చంద్రకళ, జిల్లా గౌరవాధ్యక్షులు ఏ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

Spread the love