ఘనంగా పొనుగోటి అర్జున్‌ రావు జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-ఆమనగల్‌
ఆమనగల్‌ పట్టణంలో సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు పొనుగోటి అర్జున్‌ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బస్టాండ్‌ సమీపంలో శ్రీశైలం హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో ఆమనగల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, ఆమనగల్‌ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు నేనావత్‌ పత్య నాయక్‌, వైస్‌ ఎంపీపీ జక్కు అనంత్‌రెడ్డి తదితరులతో కలిసి పొనుగోటి అర్జున్‌ రావు కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు అర్జున్‌ రావుకు గజమాలతో పాటు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా అర్జున్‌రావు బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక మార్కెట్‌ యార్డు ఆవరణలో మొక్కలు నాటి వాటికి కంచెలు ఏర్పాటు చేశారు. అంతకు ముందు కడ్తాల్‌ మండల కేంద్రంలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఆర్జున్‌ రావును పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ఉపేందర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేష్‌ గుప్తా, జడ్పీటీసీ విజితా రెడ్డి, రాంనుంతల సర్పంచ్‌ సోనా శ్రీను నాయక్‌, ఎంపీటీసీ సభ్యులు సరిత పంతు నాయక్‌, దోనాదుల కుమార్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ సేవ్యా నాయక్‌, ఉపసర్పంచ్‌ రామకృష్ణ, నాయకులు సయ్యద్‌ ఖలీల్‌, చుక్క నిరంజన్‌ గౌడ్‌, వడ్డే వెంకటేష్‌, రూపం వెంకట్‌ రెడ్డి, వస్పుల సాయిలు, రాజేందర్‌, రమేష్‌ నాయక్‌, విఠాయిపల్లి రమేష్‌, రైసల్‌, వెంకటయ్య, గణేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love