డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రంలోని,ఆయా గ్రామాలతో పాటు ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద శుక్రవారం నాగుల పంచమి పండుగను మహిళలు, ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇంట్లో పూజలు నిర్వహించుకొని ఆలయాలవద్ద, పుట్టల దగ్గరకు వెళ్లి పుట్టను శుభ్రంగా కడిగి ఆవు పాలు పోసి నాగుల పుట్ట దేగ్గర నైవేద్యం సమర్పించి మంగళ హారతి, పసుపు కుంకుమ సమర్పించుకొని ఆవు పాలు తీసుకుని వెళ్లి అన్నదమ్ములకు కండ్లు కడిగి సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు. ఆలయాల వద్ద గ్రామస్తులు,అలయా కమిటీ సభ్యులు అవసరాల మేరకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.