సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభను జయపద్రం చేయండి

– సీపీఐ నాయకుడు ఓరుగంటి యాదయ్య
– ప్రజాగర్జన బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-యాచారం
జూన్‌ 4న కొత్తగూడెంలో నిర్వహించే సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు ఓరుగంటి యాదయ్య కోరారు. మంగళవారం యాచారం మండల కేంద్రంలో సీపీఐ ప్రజా గర్జన బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, గోరేటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాసులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ మండల కార్యదర్శి మస్కు సంజీవ, నాయకులు అల్లిముద్దీన్‌, పూల యాదయ్య, రాజు నాయక్‌, రాములు, సత్తయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Spread the love