ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

– ఆలయాల్లో కితకిటిలాడిన భక్తి జనం
– మహా అన్నదాన కార్యక్రమాలు
నవతెలంగాణ – తాడ్వాయి
మండల వ్యాప్తంగా శ్రీరాములు వేడుకలను బుధవారం భక్తులు ఎంతో వైభవ్వితంగా నిర్వహించారు. శ్రీరామనవ వేడుకలు పుష్కరించుకుని రామాలయాల్లో వేద మంతు చరణల మధ్య కనుల పండుగగా రాములు కళ్యాణం జరిపారు. ఒక్కరోజు ముందుగానే ఆలయాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా సీతా సమేత అయిన శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం సుమారు 12, 12:30, గంటల ప్రాంతంలో భాజభజన్త్రీయులు వేదమంత్రాలు ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కల్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కాటాపూర్, గంగారం, దామెరవాయి, తాడ్వాయి, మేడారం, నార్లాపూర్, బీరెల్లి, లింగాల గ్రామాలలో రాములూరి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపారు. కాటాపూర్, నార్లాపూర్, మేడారం కొన్ని గ్రామాల్లో రాములూరి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. నిర్వహించిన అన్నదాన లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను సేకరించారు. కాటాపూర్లో చక్రవర్తుల శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వారి తండ్రి గారి చక్రవర్తుల రాధాకృష్ణ జ్ఞాపకార్థం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కాటాపూర్ రామాలయం వ్యవస్థాపక అధ్యక్షులు పులి పెద్ద నరసయ్య గౌడ్, రామాలయం చైర్మన్ ఇందారపు లాలయ్య, పులి నర్సయ్య గౌడ్,దాత సమ్మిరెడ్డి,  మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామాల ప్రముఖులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love