నవతెలంగాణ-ఆర్మూర్ : భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజుగా పరిగణిస్తూ . పాత పార్లమెంటు భవనం నుండి కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశించగానే మహిళా సాధికారత కోసం “మహిళా శక్తి వంధన్ అభియాన్” పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ నాయకురాలు ఆలూరు శ్రీమతి అలూర్ విజయభారతి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ….భారతీయ ప్రజలందరికీ కూడా ప్రధానంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ. భారత ప్రధాని మోడీ పట్టణ అసెంబ్లీ తరఫున ప్రధానంగా మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ. నూతనంగా ప్రారంభించిన పార్లమెంట్లో మొట్టమొదటి బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఓ గొప్ప సాహసంతో కూడా నిర్ణయమని, కానీ దీన్ని కూడా కొందరు రాజకీయాలు చేస్తూ మాట్లాడడం సరైనది కాదని. ప్రధానంగా టిఆర్ఎస్ నాయకులకు మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత లేదని కల్వకుంట్ల కవిత ఈడి అరెస్టు చేస్తుందన్న భయంతో, బెంగతో ఢిల్లీలో ఒక రోజు దొంగ నాటకాలు ఆడుతూ దీక్ష చేపట్టిందని. అదే బీఆర్ఎస్ పార్టీ మొన్నటికి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పుడు మహిళలను అవమానపరిచే విధంగా మూడు శాతం కూడా మహిళల పేర్లను ప్రకటించాలేదని. ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ విషయంలో మహిళలు ఆలోచించవలసిన అవసరం ఉందని. ఈ నయా నిజం కెసిఆర్ కుటుంబం గడిన పాలన, దొరల పాలన, రజాకార్ల పాలన చేస్తూ తెలంగాణలో బాలికలతో పాటు మహిళలు కూడా అత్యాచారాలకు, అన్యాలకు గురవుతున్నారని. వీరి రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా రాజకీయాలు చేస్తూ మళ్ళీ ఎలా ఎన్నికల్లో గెలవాలి ఎంత డబ్బు, ఎంత సారా మందు పంపిణీ చేయాలి అనే ఆలోచన తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికి కూడా మహిళా రిజర్వేషన్ విషయంలో మాట్లాడే అర్హత లేదని. రాబోయే కాలంలో మహిళలు మోడీ గారి ఈ యొక్క దేశాభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాల పట్ల ఆలోచించి మళ్లీ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, , రోహిత్ రెడ్డి మోర్చాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.