
కేంద్రంలో భాజపా నాయకుల ప్రమాణ స్వీకారం వేళ ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి పురుషోత్తం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు, మండల ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి పురుషోత్తం మాట్లాడుతూ 2014లో మే 26వ తేదీన తొలిసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం మోడీ చేశారని, ఆ తర్వాత 2019లో మే 30న మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జూన్ 9న మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. ముందు నుంచి కుడుతామని చెబుతూ వచ్చిన మోడీ అనుకున్న లక్ష్యాన్ని సాధించారని తెలిపారు. పట్లు జవహర్లాల్ నెహ్రూ వరుసగా మూడుసార్లు ప్రధానిగా అయ్యారు. ఆ రికార్డును మోదీ చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.