రెంజల్ టిఆర్ఎస్ నాయకుల సంబరాలు..

నవతెలంగాణ- రెంజల్ : బోధన్ నియోజకవర్గం నుంచి మహమ్మద్ షకీల్ అమీర్ కు టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కన్ఫామ్ అవడం, బి ఫమ్ తీసుకున్న సందర్భంగా రెంజల్ మండలంలోని బీ ఆర్ ఎస్ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మండలంలోని సాఠాపూర్ చౌరస్తాలో టపాసులు పేల్చరు. షకీల్ ఆమీర్ ను గెలిపించడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు వికార్ పాషా, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు హాజీ ఖాన్, సాఠాపూర్ టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు భూమేష్, కృష్ణారావు, అజ్మత్, షబ్బీర్, శ్రీకాంత్, కే సాయిలు, జాడి సాయిలు, టిఆర్ఎస్ పార్టీ  సీనియర్ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Spread the love