సెల్ ఫోన్ తెచ్చిన తంటా ఒకరి ప్రాణం తీసింది. క్రిమిసంహారక మందు సేవించి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మృతురాలి చెల్లె మడకం చిన్ని రాత పూర్వక పిర్యాదు మేరకు..స్థానిక ఎస్.హెచ్.ఓ ఎస్సై టీ.యయాతి రాజు కథనం ప్రకారం.. మండలంలోని బండారుగుంపుకు చెందిన ముచ్చిక లక్ష్మీ(22) మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించింది. కుటుంబీకులు గమనించే సరికే శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందింది. కాగా అదే గ్రామానికి చెందిన ముచ్చిక గంగరాజుకు ఇద్దరు భార్యలు, లక్ష్మీ రెండో భార్య. శుక్రవారం మధ్యాహ్నం గంగరాజు మొదటి భార్యకు కొత్త సెల్ఫోన్ కొని ఇచ్చాడు. తాను చాలా రోజుల నుంచి సెల్ఫోన్ పవర్ బ్యాంక్ అడిగితే పట్టించుకోలేదని మనస్థాపానికి గురై ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి చెల్లి మడకం చిన్న శనివారం చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదుతో మృతదేహానికి పోస్టుమార్టం జరిపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.